ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ, అతని కుటుంబం కష్టకాలంలో ఉన్నారు. ఆయన సోదరి 32 ఏళ్ల మరియా సోల్ ఒక భయంకరమైన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయ పడ్డారు. మరియా కారు మయామి రోడ్డుపై నియంత్రణ కోల్పోయి కాంక్రీట్ గోడను ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలైనాయి. దీంతో త్వరలోజరగాల్సిన పెళ్లి వాయిదా పడింది. దీంతో మెస్సీ అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు.
ఈ ప్రమాదంలో ఆమెకు రెండు వెన్నుపూసలు విరిగిపోయాయి, మడమ విరిగింది, చేయి విరిగింది, తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. అయితే ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది.
ఇంటర్ మయామి అండర్-19 జట్టు కోచ్ జూలియన్ 'తులి' అరెల్లానోతో తన వివాహానికి మరియా సిద్ధమవుతోంది. జనవరి 3, 2026న వీరి వివాహం జరగాల్సి ఉంది. అర్జెంటీనా టీవీ జర్నలిస్ట్, ప్రెజెంటర్ ఏంజెల్ డి బ్రిటో, తాను మరియా సోల్ తల్లితో మాట్లాడానని, తన కుమార్తె ప్రమాదం నుండి బయటపడిందని తెలిపారని వెల్లడించారు.
🚨🏥 María Sol (Lionel Messi’s sister) was involved in a car accident while driving in Miami and has been forced to postpone her wedding, which was scheduled for January 3, 2026.
According to confirmed reports, she lost control of the vehicle and crashed into a wall. As a result… pic.twitter.com/Sae2Uy4Q1Q— FC Barcelona Fans Nation (@fcbfn_live) December 23, 2025
లియోనెల్ మెస్సీ సోదరి మరియా ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న వ్యాపారవేత్త డిజైనర్. అంతర్జాతీయ రంగంలో విజయవంతమైన ఫ్యాషన్ బ్రాండ్ బికినిస్ రియో వ్యవస్థాపకురాలు. ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా పలువురి ఫ్యాషన్ ప్రియులను ఆకర్షించింది.


