సౌదీ ప్రీమియర్ లీగ్‌లో అల్ అఖ్‌దూద్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-0 తేడాతో అల్-నస్ర్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్, అల్-నస్ర్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రొనాల్డోరెండు మెరుపు గోల్స్‌తో అల్-నస్ర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ ఫుట్‌బాల్ స్టార్ మ్యాచ్ 31వ నిమిషంలో ఒక గోల్ చేయగా.. ఫస్ట్ హాఫ్ ఆఖరిలో మరో అద్భుతమైన గోల్ వేశాడు. అతడితో పాటు జోవో ఫెలిక్స్ కూడా ఓ గోల్ సాధించాడు. ఈ విజయంతో సౌదీ ప్రో లీగ్ చరిత్రలో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన మొదటి క్లబ్‌గా అల్-నస్ర్ రికార్డు సృష్టించింది.
అదేవిధంగా రొనాల్డో కూడా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 202 ఏడాదిలో రొనాల్డో 40 గోల్స్‌ను పూర్తి చేసుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఈయర్‌లో అత్యధిక సార్లు నాలభైకి పైగా గోల్స్ సాధించిన ప్లేయర్‌గా రోనాల్డో చరిత్ర సృష్టించాడు. అతడు తన కెరీర్‌లో 14 వేర్వేరు సంవత్సరాల్లో 40 పైగా గోల్స్ సాధించాడు.
2010 నుంచి దాదాపు ప్రతీ ఏటా రోనాల్డో నాలభైకి పైగా గోల్స్ సాధిస్తున్నాడు. ఒక్క 2019లోనే ఈ మార్క్‌ను అందుకోలేకపోయాడు. కాగా ఇంతకుముందు ఈ రికార్డు అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పేరిట ఉండేది. మెస్పీ తన కెరీర్‌లో ఇప్పటివరకు 13 సార్లు 40 పైగా గోల్స్ సాధించాడు. తాజా మ్యాచ్‌తో మెస్సీని రొనాల్డో అధిగమించాడు.
చదవండి: మహ్మద్ షమీకి బీసీసీఐ భారీ షాక్..!


