సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం అంటే కోల్ మాఫియాకి నాయకుడు అని భావించే పరిస్థితి తలెత్తిందని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. సింగరేణిలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ కొద్ది సేపటి క్రితం బీఆర్‌ఎస్ నేతలు లోక్ భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
సింగరేణిలో అవినీతి జరుగుతున్నదని ఆధారాలతో సహా మా శాసనసభాపక్ష ఉపనాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు బయట పెట్టారు. ఆధారాలతో సహా బయటపెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైంది. ఆధారాలతో సహా మరి ఈరోజు పూర్తిస్థాయిలో ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేశాం. దాన్ని నుంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల అటెన్షన్‌ని, దృష్టి మళ్లించడానికి, విచారణ పేరిట ఇవాళ ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తున్నారు.
సీఎం అంటే అంటే కోల్ మాఫియాకి నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి అప్పుడప్పుడు ఫుట్ బాల్ ఆడుతున్నాడు సింగరేణితో. సింగరేణి సంస్థకు సంబంధించిన కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారు. వాటిని ఫుట్ బాల్ ఆటకి వినియోగించారు. సీఎం రేవంత్ సింగరేణి సంస్థకు తీరని అన్యాయం చేశారని అన్నారు.


