కల్తీ అల్లం- వెల్లుల్లి పేస్టు తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు | Raid On Adulterated Ginger Garlic Paste Manufacturing Units In Hyderabad | Sakshi
Sakshi News home page

కల్తీ అల్లం- వెల్లుల్లి పేస్టు తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు

Mar 13 2026 9:23 PM | Updated on Mar 13 2026 9:25 PM

Raid On Adulterated Ginger Garlic Paste Manufacturing Units In Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: శాస్త్రిపురంలోని బాబా కాంటా, ఉడంగడ్డ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా.. అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్న కేంద్రాలపై రాజేంద్రనగర్ జోన్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. నిందితులు.. ఎవరికీ అనుమానం రాకుండా నాసిరకం అల్లం, వెల్లుల్లిని సేకరించి, వాటికి ఉప్పు, టైటానియం డై ఆక్సైడ్ వంటి రసాయనాలు, గమ్ పౌడర్‌ను కలిపి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పేస్టు చిక్కగా ఉండటానికి, రంగు కోసం ప్రమాదకరమైన కెమికల్స్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.

నిందితులు అబ్దుల్ అలీమ్, జసాని దిల్దార్ అలీలపై కేసు నమోదు చేసిన పోలీసలు దర్యాప్తు చేపట్టారు. 1800 కిలోల అల్లం వెల్లుల్లి పేస్టు, 2 కిలోల గమ్ పౌడర్ (Xanthan Gum), 2 కిలోల టైటానియం డై ఆక్సైడ్, సింథటిక్ ఫుడ్ కలర్ (లెమన్ ఎల్లో), 7 ప్యాకింగ్ మెషీన్లు, 3 గ్రైండింగ్ మెషీన్లు, 2 వెయింగ్ మెషీన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement