జామ గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..! | Health Tips: Guava seeds Have Surprising Nutritional Value | Sakshi
Sakshi News home page

Guava seeds: జామ గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..! నిపుణులు ఏమంటున్నారంటే

Jun 15 2026 12:50 PM | Updated on Jun 15 2026 1:08 PM

Health Tips: Guava seeds Have Surprising Nutritional Value

జామకాయలు అందరికీ సులభంగా దొరికే పండు. అలాగే ప్రతి ఇంటి పెరటిలో ఉండే మొక్క కూడా. అందుకే ఈ పండు అంటే మనకు చిన్న చూపు. జామకాయ అనగానే పైన వగరుగా ఉండే తొక్క, గింజలు పడేసి తింటుంటారు కొందరు. అంతేగాదు ఈ జామ గింజలు అరగవని, కడుపునొప్పి పట్టుకుంటుందని చెబుతుంటారు పెద్దలు. కానీ అదంతా అపోహేనని కొట్టిపారేస్తున్నారు ఐసిఎఆర్–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) ఆదర్శ గౌడ. అంతేగాదు అరుగుదల తక్కువగా ఉండి, సున్నితమైన జీర్ణ సంబంధిత వ్యాధులుంటే వైద్యులను సంప్రదించి ఈ  పండు తినడం మంచిదన్నారు. కానీ చాలామటుకు జామపండు ఆరోగ్యానికి మంచిదేనని, ముఖ్యంగా గింజలు ఎక్కువ ఉండే జామకాయలు మరింత ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. అసలు ఈ జామగింజలతో కలిగే లాభాలేంటో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!

జామగింజలు తినదగినవి, వాటిల్లోని పీచు పదార్థం, ఆరోగ్యకరమైన కొవ్వులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆదర్శగౌడ. పండుతో సహా వీటిని ఎప్పుడైతే తింటామో..మొతం పీచు పదార్థం శరీరానికి అందతుంది. ఫలితంగా జీవక్రియ క్రమబద్ధతకు, పేగు ఆరోగ్యానికి, కడుపు నిండిన భావన వంటి ఉపయోగాలు ఉంటాయని చెబుతున్నారు.

కలిగే లాభాలు..
జామ గింజల నూనెలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, తక్కువ మొత్తంలో ఒమేగా-3, ఒమేగా -6 కొవ్వుల తోపాటు విటమిన్‌ ఈ, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. గింజలను నలపడం లేదా నమలడం వల్ల వాటిలో దాగిఉన్న పోషకాలు నేరుగా విడుదల కావడానికి సహాయపడతాయట. తద్వారా జీర్ణక్రియ(అరుగుదల) సమయంలో అవి మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల తోపాటు పీచు పదార్థాన్ని అందిస్తాయి. ఇది మలానికి బలాన్ని చేకూర్చి జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారం కదలడానికి సహాయపడుతుందనట. 

అలాగే  ఈ పండులో విటమిన్‌ సీ, లైకోపీన్‌, పొటాషియం సమృద్ధిగా ఉంటాయట. అందువల్ల జామ అందుబాటులో ఉన్న అత్యంత పోషక-సాంద్రత కలిగిన ఉష్ణమండల పండ్లలో ఒకటిగా పేర్కొటారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. 

గింజలు గట్టిగా ఉన్నప్పటికీ, ఆరోగ్యంగా ఉన్నవాళ్లంతా పండులో ఉన్న ఈ భాగాన్ని నిరంభ్యంతరంగా తినవచ్చుని చెబుతున్నారు నిపుణులు. వీటిలో పోషక విలువలు తక్కువగానే ఉండవచ్చు, కానీ వాటిని పారేయడం వల్ల విలువైన పీచుపదార్థం, సహజంగా లభించే ఫైటోన్యూట్రియెంట్లను కోల్పోయినట్లేనని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

అందుకే గింజలను ఉమ్మివేయడానికి బదులుగా, పండిన జామకాయను తినేటప్పుడు వాటిని బాగా నమలండి లేదా అదనపు పీచుపదార్థం, ప్రయోజనకరమైన కొవ్వుల కోసం పండు మొత్తాన్ని స్మూతీస్‌లో కలుపుకోని తినమని సూచిస్తున్నారు నిపుణులు.

(చదవండి: 90 కిలోల నుండి 72 కిలోలకు..! అందుకోసం ఆ హీరో ఏం చేశాడంటే..)

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement