ఈ గ్యాడ్జెట్‌ ఉంటే సెలూన్‌ అవసరమే లేదు! | Electric Head Scalp Massager Benefits Hair Care | Sakshi
Sakshi News home page

ఈ గ్యాడ్జెట్‌ ఉంటే సెలూన్‌ అవసరమే లేదు!

Aug 2 2026 1:29 PM | Updated on Aug 2 2026 1:38 PM

Electric Head Scalp Massager Benefits Hair Care

బ్యూటీజర్‌

తలకు మర్దన చేయించుకోవడానికి ఇకపై సెలూన్‌కో, బ్యూటీపార్లర్‌కో వెళ్లనక్కర్లేదు. ‘ఎలక్ట్రిక్‌ హెడ్‌ అండ్‌ స్కాల్ప్‌ మసాజర్‌’ చెంతనుంటే చాలు. ఇంట్లోనే కూర్చుని మర్దన చేసుకోవచ్చు. దీనిని తలకు ఆనించి, తల చుట్టూ తిప్పుతూ ఉంటే ఇది జుట్టు కుదుళ్ల వరకు మసాజ్‌ చేస్తుంది.

ఇందులోని సిలికాన్‌ బ్రష్‌ ఫ్లెక్సిబుల్‌గా ఉండి, జుట్టుపై సున్నితంగా పనిచేస్తుంది. ఐదు రకాల వైబ్రేషన్‌ మోడ్స్‌లో ఇది పనిచేస్తుంది. ఈ మసాజర్‌ రక్తపోటును అదుపుచేసి, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మైగ్రేన్‌ సహా రకరకాల తలనొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తలపై చర్మంలో సహజమైన తేమ ఆరిపోకుండా చేసి, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అరచేతిలో ఇమిడిపోయేలా రూపొందించిన ఈ పరికరాన్ని ఎక్కడికైనా ఇట్టే తీసుకుపోవచ్చు. రీచార్జబుల్‌ బ్యాటరీతో పనిచేసే దీనిని తక్కువ సమయంలోనే చార్జ్‌ చేసుకోవచ్చు.

ఇలా చేస్తే కళ్లకు కొత్తందం!
అమ్మాయిల ముఖంలో మొదటి చూపులోనే ఆకట్టుకునేవి కళ్ళు. మరి ఆ కళ్లు ఆకర్షణీయంగా, అందంగా కనిపించాలంటే కేవలం ఆకారం మాత్రమే సరిపోదు, కాంతిమంతంగా అవి మెరుస్తూ ఉండాలి కూడా. ఇందుకోసం చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్ళ ద్వారా వ్యక్తమయ్యే చిరునవ్వు, ఆత్మీయత, ఆత్మవిశ్వాసం కళ్ళకు అసలైన అందం.

ఇందుకోసం ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. కీరాదోస రసంలో ముంచిన కాటన్‌ ప్యాడ్స్‌ను కళ్లపై ఉంచడం ద్వారా కళ్ల అలసట తగ్గి కళ్లు తాజాగా మారుతాయి. వాడిన గ్రీన్‌ టీ బ్యాగ్స్‌ని ఫ్రిజ్‌లో ఉంచి చల్లబడిన తరువాత వాటిని తరచుగా కళ్లపై పెట్టుకోవడం వల్ల కంటి వాపు, కళ్లకింద వచ్చే నల్లటి వలయాలు తగ్గుతాయి. విల్లులాంటి కనుబొమ్మలు, ఒత్తయిన కనురెప్పలు కళ్ల రూపాన్ని రెట్టింపు చేస్తాయి. 

నిద్రించే ముందు కనురెప్పలకు కొద్దిగా ఆముదం రాసుకోవడం వల్ల కనురెప్పల వెంట్రుకలు ఒత్తుగా, పొడవుగా పెరుగుతాయి. అలాగే తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడం, స్క్రీన్‌ టైమ్‌ తగ్గించడం ద్వారా కళ్లు అలసట లేకుండా ప్రకాశవంతంగా కనిపిస్తాయి. వీటన్నింటితో పాటు కంటి ఆరోగ్యానికి, అందానికి సరైన పోషకాహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement