పర్మినెంట్‌ రెసిడెంట్‌ : విద్యార్థుల కలలపై నిప్పులు పోసిన దేశం | Canadian province Manitoba ends student route to permanent residency Indians to be hit | Sakshi
Sakshi News home page

పర్మినెంట్‌ రెసిడెంట్‌ : విద్యార్థుల కలలపై నిప్పులు పోసిన దేశం

Jun 15 2026 6:15 PM | Updated on Jun 15 2026 7:25 PM

Canadian province Manitoba ends student route to permanent residency Indians to be hit

అమెరికా ఆంక్షలతో బెంబేలెత్తుతున్న విద్యార్థులకు మరో షాక్‌ తగిలింది. కెనడాలో ఉన్నత చదువులు చదువుకుని అక్కడే శాశ్వత నివాసం (పీఆర్ కార్డ్‌) పొందాలనుకునే వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు అక్కడి మానిటోబా ప్రావిన్స్‌ ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. కెనడాలోని మానిటోబా ప్రావిన్స్, అంతర్జాతీయ గ్రాడ్యుయేట్‌ల కోసం ఉన్న ఒక కీలకమైన వలస మార్గాన్ని మూసివేసింది. మానిటోబా ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ (ఎంపీఎన్‌పీ)ని,  అంతర్జాతీయ విద్యా విభాగం (ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్ట్రీమ్) కింద ఉన్న కెరీర్ ఎంప్లాయ్‌మెంట్ పాత్‌వే (సీఈపీ)ని  తక్షణమే రద్దు చేసింది.  

చదువు పూర్తైన విద్యార్థులు నేరుగా పర్మినెంట్‌ రెసిడెన్సీ పొందేందుకు ఇప్పటివరకు ఎంతో సులభంగా ఉపయోగపడుతున్న ఒక కీలకమైన ఇమ్మిగ్రేషన్‌ మార్గాన్ని ఆ ప్రావిన్స్ ప్రభుత్వం తక్షణమే రద్దు చేస్తున్నట్లు  జూన్ 11న సంచలన ప్రకటన చేసింది. ఇలా చేసిన మొట్టమొదటి కెనడియన్ ప్రావిన్స్ మానిటోబానే. దీంతో ఉత్తర అమెరికా దేశంలో శాశ్వత నివాసం కోసం స్టూడెంట్ వీసా మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్న భారతీయులపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విస్తీర్ణం పరంగా కెనడాలో అతిపెద్ద  ఆరో ప్రావిన్స్ మానిటోబా, భారతదేశంతో సహా అంతర్జాతీయ విద్యార్థులకు రోజురోజుకు మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుతోంది. దీని రాజధాని విన్నిపెగ్‌లో, టొరంటో, ఒట్టావా వంటి నగరాలతో పోలిస్తే జీవన వ్యయం తక్కువగా ఉంటుంది, అదే సమయంలో  చక్కటి ప్రభుత్వ యూనివర్శిటీలు యూనివర్శిటీ ఆఫ్ మానిటోబా, ఆర్‌ఆర్‌సి పాలిటెక్ వంటి సంస్థలు అందుబాటులో ఉంటాయి. దీనికి తోడు పీఆర్‌ చాలా త్వరంగా, సులువుగా వస్తుందనే కారణంతో వేలాది మంది తెలుగువారితో పాటు  80కి పైగా దేశాల నుండి దాదాపు 20వేల మంది విద్యార్థులు ఇటే మొగ్గు చూపుతున్నారు. ఇక్కడి అంతర్జాతీయ విద్యార్థుల జనాభాలో భారతీయ విద్యార్థుల వాటా గణనీయంగా ఉంది. 2021లో,  5,240 మంది భారతీయులు స్టడీ పర్మిట్ హోల్డర్లు న్నారు.

మానిటోబా ప్రావిన్షియల్‌ నామినీ ప్రోగ్రామ్‌ (MPNP)  ప్రకారం మానిటోబా ప్రావిన్స్‌లోని గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో కనీసం ఏడాది పాటు చదివి, చదువు పూర్తి కాగానే తమ రంగానికి సంబంధించిన ఒక అర్హత కలిగిన ఉద్యోగ ఆఫర్ సంపాదిస్తే చాలు ఎటువంటి నిరీక్షణ లేకుండా నేరుగా పీఆర్‌కు దరఖాస్తు చేసుకునే లీగల్ అవకాశం ఉండేది. ముఖ్యంగా భారతదేశం నుండి కెనడా వెళ్లి అక్కడ వన్-ఇయర్ పీజీ డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పీఆర్  సాధించి ప్రయోజనం పొందేవారు. ప్రస్తుతం ఈ విండోను పూర్తిగా మూసివేయడంతో  భారతీయ విద్యార్థులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టైంది.

ఇదీ చదవండి: స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీలో సుందర్‌ పిచాయ్‌కు చేదు అనుభవం

భారతదేశం నుండి 5,485 మంది కొత్త శాశ్వత నివాసితులు న్నారు.  ఇది మొత్తం ప్రవేశాలలో 33.1శాతం., CEP కార్యక్రమాన్ని రద్దు చేయడం వల్ల ఈ భారతీయ విద్యార్థులు ప్రభావితమవుతారు. వీరు శాశ్వత నివాసం కోసం విద్యా అర్హతల కంటే పని అనుభవానికి ప్రాధాన్యతనిచ్చే ప్రత్యామ్నాయ కార్యక్రమాలను ఎంచుకోవలసి ఉంటుంది. 

ఇదీ చదవండి: ట్విన్స్‌ పుట్టారని సంబరం : అంతలోనే ఊహించని షాక్‌!

రద్దయిన  సీఈపీ ప్రకారం, దరఖాస్తుదారులు  మూడేళ్లలో కనీసం ఒక సంవత్సరం పాటు మానిటోబాలో పూర్తికాల స్టడీ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసి ఉండాలి. కనీసం కెనడియన్ లాంగ్వేజ్ బెంచ్‌మార్క్ (CLB) 7 స్థాయి భాషా ప్రావీణ్యాన్ని కలిగి ఉండాలి. అలాగే  ప్రావిన్సులో తమ దీర్ఘకాలిక వృత్తి అవకాశాలను వివరిస్తూ ఒక కెరీర్ ఎంప్లాయ్‌మెంట్ ప్లాన్‌ను కూడా సమర్పించాల్సి ఉండేది , కొన్ని సందర్భాల్లో, తమ వద్ద తగినంత స్థిరపడే నిధులు ఉన్నాయని నిరూపించుకోవాల్సి ఉండేది.

ఇదీ చదవండి : విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్‌, ఎందుకో తెలుసా?

కానీ మారిన నియమాల ప్రకారం మానిటోబాలోని స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్, జాబ్‌ హిస్టరీకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అర్హత కలిగిన పూర్తికాల, దీర్ఘకాలిక ఉద్యోగ ఆఫర్‌ను స్వీకరించడానికి ముందు,  ‘స్కిల్డ్‌ వర్కర్‌ ఇన్‌ మానిటోబా’ (Skilled Worker in Manitoba) ప్రోగ్రామ్‌  ప్రకారం దరఖాస్తుదారులు తప్పనిసరిగా అదే మానిటోబా యజమాని వద్ద కనీసం ఆరు నెలల నిరంతర పూర్తికాల పనిని పూర్తి చేయాలి. ఆ అనుభవ పత్రాలను సమర్పిస్తేనే పీఆర్ నామినేషన్‌కు అర్హత సాధిస్తారు. అయితే దీనికి ప్రత్యేక విద్యా అర్హత అవసరం లేదు. బదులుగా, భాషా అవసరాలు వృత్తి డిమాండ్లకు, మానిటోబాలో ఆర్థికంగా స్థిరపడగల దరఖాస్తు దారుడి సామర్థ్యానికి ముడిపడి ఉంటాయి. అలాగే ఒక సెటిల్‌మెంట్ ప్లాన్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అంతకుముందు ఈ షరతులేదు. అంతేకాకుండా, స్వయం ఉపాధి ద్వారా లేదా పూర్తికాలం చదువుతున్నప్పుడు పొందిన వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ను పరిగణనలోకి తీసుకోరు. 

ఇదీ చదవండి: పోలీసులే నివ్వెరపోయేలా భర్త టార్చర్‌, ఇనుప గొలుసులతోనే స్టేషన్‌కి!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement