breaking news
Students
-
అదరగొట్టిన విల్లా మేరీ కాలేజ్ విద్యార్థినులు (ఫొటోలు)
-
ఢాకా యూనివర్సిటీ.. బంగబంధు పేరును తొలగించి..
ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ప్రముఖ విద్యాసంస్థ ఢాకా యూనివర్సిటీ బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ హాల్‌కు కొత్త పేరు పెట్టారు. యూనివర్సిటీ నిర్వహించిన సమావేశంలో ఈ హాల్‌ను షరీఫ్ ఉస్మాన్ హాది హాల్‌గా పిలవాలని నిర్ణయించినట్లు సమాచారం.బంగ బంధు అంటే బంగ్లాదేశ్ మిత్రుడు అని అర్థం. ఇది దేశ జాతిపిత, వ్యవస్థాపక అధ్యక్షుడిగా పేరొందిన షేక్ ముజిబుర్ రెహ్మాన్‌కు ఇచ్చిన గౌరవ బిరుదు. ఆయన బంగ్లాదేశ్ స్వాతంత్య్రానికి ప్రధాన కారకుడు. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. అందుకే ఈ బిరుదుతో ఆయనను గౌరవిస్తారు. తాజాగా యూనివర్సిటీ హాల్ పేరును షరీఫ్ ఉస్మాన్ హాది హాల్‌గా మార్చడం చర్చకు దారి తీసింది.వర్సిటీ అధికారులు ఈ మార్పు విద్యార్థుల డిమాండ్లు, చారిత్రక సందర్భాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చేశారని సమాచారం. షరీఫ్ ఉస్మాన్ హాది బంగ్లాదేశ్ విద్యా రంగంలో, ముఖ్యంగా విద్యార్థి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఈ నిర్ణయం ద్వారా ఆయన సేవలకు గౌరవం తెలిపినట్లు విశ్వవిద్యాలయం పేర్కొంది.కొంతమంది విద్యార్థులు ఈ మార్పును స్వాగతించారు. ‘హాది త్యాగాలు, కృషి గుర్తింపు పొందడం సంతోషకరం’ అని అభిప్రాయపడ్డారు. అయితే, బంగ బంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ దేశ స్వాతంత్ర్య పోరాటానికి ప్రతీక. ఆయన పేరును తొలగించడం సరైంది కాదని విమర్శించారు. విశ్వవిద్యాలయ అధ్యాపకులలో కూడా విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ‘చరిత్రను మార్చడం కంటే, కొత్త హాళ్లకు కొత్త పేర్లు పెట్టడం మంచిది’ అని సూచించారు.ఈ నిర్ణయం బంగ్లాదేశ్‌లో రాజకీయ చర్చలకు దారితీసింది. విద్యార్థి సంఘాలు, పౌర సమాజం, రాజకీయ పార్టీలు ఈ అంశంపై వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక హాళ్ల పేర్ల మార్పు భవిష్యత్తులో మరిన్ని వివాదాలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ఢాకా విశ్వవిద్యాలయం తీసుకున్న ఈ నిర్ణయం, చారిత్రక ప్రాధాన్యత కలిగిన బంగ బంధు పేరు తొలగించడం వల్ల పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు కొత్త నాయకుడి సేవలకు గౌరవం, మరోవైపు దేశ స్థాపకుడి వారసత్వాన్ని తగ్గించడం అనే రెండు కోణాల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటి క్యాంపస్ లో లైంగిక వేధింపులు
-
గుంటూరులో మళ్లీ డ్రగ్స్ కలకలం
పట్నం బజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరు తల్లీకుమార్తె మధ్య డ్రగ్స్ వివాదం కలకలం రేపింది. కుమార్తె డ్రగ్స్‌కు బానిసగా మారిందని తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సంచలనం రేకెత్తించిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాలిక బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు చిన్నబజారుకు చెందిన ఓ మహిళ హైదరాబాద్‌లోని ఒక టీవీ చానల్లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. తండ్రితో కలిసి గుంటూరులోనే ఉంటున్న పెద్ద కుమార్తె (17) ఇక్కడే ఇంటర్మీడియెట్ చదువుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఇద్దరు యువకులు తన కుమార్తెను డ్రగ్స్‌కు బానిసగా మార్చారని తల్లి ఆరోపిస్తున్నారు. డ్రగ్స్ అలవాటు మానుకోవాలని తల్లి చెప్పగా.. శుక్రవారం తల్లీకుమార్తె మధ్య ఘర్షణ తలెత్తగా కుమార్తె తల్లికి ఎదురుతిరిగింది. దీంతో మనస్తాపానికి గురైన తల్లి ఫిట్స్ తగ్గడానికి ఉపయోగించే టాబ్లెట్లను అధికంగా మింగడంతో స్పృహ కోల్పోయింది. ఆమెను చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బాధితురాల్ని కలిసిన పోలీసు అధికారులు మహిళ ఆత్మహత్యాయత్నం విషయం తెలుసుకున్న ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ఆమెతో మాట్లాడారు. ఈగల్ ఐజీ రవికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా మైనర్ విద్యారి్థనిని మాదక ద్రవ్యాల ఉచ్చులోకి లాగిన ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణిస్తామన్నారు. పూర్తిస్థాయిలో డ్రగ్స్‌కు బానిసైన బాలికకు ఆడిక్షన్ సెంటర్ ద్వారా చికిత్స అందించి సాధారణ స్థితికి వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, ప్రేమ పేరుతో యువతిని వంచించి మాదకద్రవ్యాల మత్తుకు అలవాటు చేసిన వారిని పట్టుకు తీరుతామన్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ.. కుమార్తె తన మాట వినడం లేదని, బాలికను వారించే క్రమంలో తల్లిపై తిరగబడిందని చెప్పారు. దీంతో తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. ఆ బాలికకు డ్రగ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారనే కోణంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేపడతామని చెప్పారు. ప్రత్యేక బృందాల ద్వారా విచారిస్తామన్నారు. కొన్ని కళాశాలల్లోని విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారన్న సమాచారం తమ వద్ద ఉందన్నారు. బాలికకు డ్రగ్స్ అలవాటు చేసిన ఇద్దరు యువకులను త్వరితగతిన అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. లాలాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. -
విద్యార్థులకు నాసిరకం స్కూల్ బ్యాగులు, బూట్లు... ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో తీవ్ర ఇక్కట్లు
-
పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా బంగ్లాలో నిరసన
1971 బంగ్లాదేశ్ స్వతంత్ర్య పోరాటంలో అమరులకు మద్ధతుగా బంగ్లాదేశ్ ఢాకా వర్సిటీలో విద్యార్థులు పెద్దఎత్తున ప్రదర్శనలు చేపట్టారు. పాకిస్థాన్‌తో పాటు ఆరోజు యుద్ధంలో బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా పోరాడిన రజాకార్ గ్రూపుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ స్వతంత్ర్య పోరాటంలో ప్రాణాలు వదిలిన వీరుల త్యాగాలకు గుర్తుగా ఈ ప్రదర్శనలు చేపడుతున్నట్లు విద్యార్థులు తెలిపారు.బంగ్లాదేశ్ స్వతంత్ర్య పోరాటంలో అమరులైన వీరుల త్యాగాలకు గుర్తుగా ఆదేశ విద్యార్థులు పెద్దఎత్తున సంఘీభావ కార్యక్రమం చేప్టటారు.ఆ రోజు జరిగిన పోరాటంలో ఎంతో మంది పాకిస్థాన్ కుట్రలకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 1971లో పాకిస్థాన్ ఆర్మీకి సహకరించడానికి రజాకార్ అనే మిలిషీయా గ్రూపును ఏర్పాటు చేశారని దాని ఆ మిలిటెంట్లు అంతర్గతంగా ఎంతో విధ్వంసం సృష్టించారని అన్నారు.రజాకార్లు ప్రజలను చిత్రహింసలు పెట్టడంతో పాటు పెద్దఎత్తున ఇళ్లలో లూటీ చేశారని, సామూహికంగా చాలామందిని హత్యచేశారని స్వాతంత్ర్య సమరయోధులుగా నటిస్తూ తీవ్రఆగడాలకు పాల్పడ్డారని తెలిపారు. వీళ్లకు పాకిస్థాన్ ఆర్మీతో పాటు ఇతర ఉగ్రవాదులతో సంబంధాలు ఉండేయన్నారు. రజాకార్ల కుట్రలకు చాలా మంది స్వతంత్ర్య పోరాట యోధులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.బంగ్లాదేశ్ విమోచన పోరాటం 1971 మార్చి-డిసెంబర్ మధ్య జరిగింది. ఈ పోరాటానికి షేక్ ముజిబూర్ రహ్మాన్ నాయకత్వం వహించారు.ఈ యుద్ధంలో ఇండియా బంగ్లాకు అన్ని విధాలుగా సహాయం అందించింది. అంతేకాకుండా డిసెంబర్ 3న అధికారంగా రణ క్షేత్రంలో దిగి 13రోజుల్లో పాకిస్థాన్ ఆర్మీని ఓడించింది. దీంతో డిసెంబర్ 16న బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించింది.బంగ్లాదేశ్ పితామహుడిగా పిలిచే షేక్ ముజిబుర్ రెహమాన్ అవామీ లీగ్ పార్టీ స్థాపకుడు, ఆదేశ మాజీ అధ్యక్షురాలు షేక్ హాసీనా ఆయన కుమార్తె. బంగ్లాదేశ్‌లో అల్లర్ల చెలరేగడంతో ప్రస్తుతం షేక్ హాసీనా భారత్‌లో భారత్‌లో తలదాచుకుంటుంది. -
కూటమి కర్కశ సర్కారుపై గళమెత్తిన విద్యార్థి దళం (ఫొటోలు)
-
రండి.. ప్రధానితో మాట్లాడండి
రాయవరం: ప్రధానితో నేరుగా మాట్లాడాలనుకుంటున్నారా.. ఇప్పుడు ఆ అవకాశం మీ చేతుల్లోనే ఉంది. మీరు చేయాల్సిందల్లా ప్రధానమంత్రి ‘పరీక్షా పే చర్చ’ యాప్‌లో ఆన్లైన్లో నమోదు కావాలి. ఏటా పరీక్షల ముందు ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీనిని కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా, ఇప్పుడు 9వ ఎడిషన్‌కు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో ప్రధాని మోదీ నేరుగా సంభాషించనున్నారు. పరీక్షలను సమర్ధవంతంగా, ఒత్తిడి లేకుండా ఎదుర్కోవడం, చిరునవ్వుతో పరీక్షలకు సమాధానాలు రాయడం ద్వారా విద్యార్థులకు పరీక్షలంటే భయాన్ని తొలగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పరీక్షల సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఆ పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలి.. విద్యార్థులు ఎదుర్కొనే సవాళ్లు ఏంటి? వాటిని ఎలా అధిగమించాలి? విద్యార్థుల ఆకాంక్ష ఏంటి? వాటిని చేరుకోవడానికి అనుసరించాల్సిన మార్గాలు.. పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఎలా ఉండాలి.. తదితర అంశాలపై ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు 6 నుంచి 12 తరగతుల విద్యార్థులు అర్హులు. దీనిద్వారా ప్రధానమంత్రి శక్తివంతమైన యువతతో కనెక్ట్ అవుతారు. యువతతో మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. యువత ఎదుర్కొనే సవాళ్లు, ఆకాంక్షలను మరింతగా అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం కూడా కలుగుతుంది. ‘పరీక్షా పే చర్చ’ మొదటి ఎడిషన్ 2018 ఫిబ్రవరి 16న ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో నిర్వహించారు. ఇప్పుడు కూడా విద్యార్థులు తమ ప్రశ్నను ప్రధానమంత్రిని నేరుగా అడగవచ్చు. ప్రశ్న గరిష్టంగా 500 అక్షరాల లోపు ఉండాలి. ఇందులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా పాల్గొనవచ్చు. వారి ఎంట్రీలను కూడా ఆన్లైన్లో పంపే అవకాశం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కల్పించింది. వీటిలో మంచి ప్రశ్నలను ఎంపిక చేసి అర్హులను నిర్ణయిస్తారు. విజేతలుగా నిలిస్తే.. పరీక్షా పే చర్చలో విజేతలు నేరుగా ప్రధానమంత్రిని కలుసుకునే అవకాశాన్ని పొందుతారు. ప్రతి విజేతకు ప్రత్యేక కిట్ అందజేస్తారు. విజేతలకు ప్రత్యేకంగా రూపొందించిన ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. విజేతలు ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి ఆటోగ్రాఫ్‌ను, ఫొటోతో కూడిన డిజిటల్ సావనీర్‌ను పొందే అవకాశముంది.లాగిన్ అవ్వాలిలా.. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హెచ్‌టీటీపీఎస్://ఇన్నోవేట్‌ఇండియా.మైజీవోవీ.ఇన్ అని క్లిక్ చేయాలి. ఎంటర్ కాగానే క్లిక్ ఏజ్ స్టూడెంట్, టీచర్, పేరెంట్స్ అనే లాగిన్స్ కనిపిస్తాయి. వాటిలోకి ఎంటర్ కాగానే మీ మొబైల్ నంబరు లేదా జీమెయిల్ ఖాతాను పూర్తి చేయాలి. ఓటీపీతో లాగిన్ అయి క్లిక్ చేయాలి. ఓటీపీ రాగానే మళ్లీ లాగిన్ చేయాలి. స్టూడెంట్స్‌కు నేరుగా ఫోన్ నంబరు, జీమెయిల్ లేని సందర్భంలో టీచర్స్ లాగిన్ ద్వారా ఎంటర్ అయ్యే అవకాశం కల్పించారు. విద్యార్థులు/ఉపాధ్యాయులు/తల్లిదండ్రులు ప్రాథమిక సమాచారం వివరాలను పూర్తి చేయాలి. కార్యాచరణ వివరాలను పూర్తి చేసిన తర్వాత థీమ్‌ను ఎంచుకుని 500 అక్షరాల లోపు వివరించాలి. అధిక సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరీక్షా పే చర్చలో పాల్గొనేలా ఉప, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి. పరీక్షా పే చర్చకు ఎంపికైన సుమారు 2,050 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా పీపీసీ కిట్లను బహుమతిగా అందజేయనున్నారు.క్షేత్ర స్థాయిలో ఆదేశాలు ఇచ్చాం పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనేలా క్షేత్ర స్థాయిలో ఆదేశాలు ఇచ్చాం. ముఖ్యంగా విద్యార్థులకు పరీక్షలంటే భయం పోగొట్టడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. మనం సంధించే ప్రశ్న ద్వారా నేరుగా ప్రధానిని కలుసుకునే అవకాశం చిక్కుతుంది. – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సద్వినియోగం చేసుకోండి ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. 6–12 తరగతులకు చెందిన విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఇది చక్కని అవకాశం. అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనేలా ఎవరి స్థాయిలో వారు కృషి చేయాలి. జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు తీసుకురావాలి. – డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈఓ, అమలాపురం -
టెన్షన్.. టెన్షన్.. విజయవాడలో ఉద్రిక్తత
-
పాక్, బంగ్లాదేశ్ విద్యార్థులకు యూకే యూనివర్సిటీల షాక్
-
పాఠశాల విద్యాశాఖ.. అత్యవసర శాఖనా?
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖ వెకేషన్ డిపార్ట్మెంట్గా ఉంటూ, మానసిక శాస్త్రం ప్రకారం నేర్చుకొనేవారికి, చదువు చెప్పే వారికి విశ్రాంతి అవసరమని, కానీ దానికి భిన్నంగా పాఠశాల విద్యాశాఖను అత్యవసర శాఖగా మార్చేశారని యూటీఎఫ్ ఆక్షేపించింది. ఉపాధ్యాయులను వేధిస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తోందని యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆదివారం విజయవాడలో జరిగిన యూటీఎఫ్ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యాశాఖను నాన్ వెకేషన్ శాఖగా మార్చమని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ కమిషనర్‌కు గతంలో విన్నవిస్తే సాధ్యం కాదని సమాధానం ఇచ్చారని, స్వేచ్ఛాయుత వాతావరణంలో బోధించాల్సిన ఉపాధ్యాయులను రోజుకో స్కీం పేరుతో ఒత్తిడి చేస్తూ శని, ఆదివారాలు, పండుగ సెలవులలో పని చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. 10వ తరగతి బోధించే ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వకుండా ఇబ్బందికి గురిచేస్తున్నారని విమర్శించారు. 100% ఉత్తీర్ణత పేరుతో ప్రతిరోజు సాయంత్రం పరీక్ష నిర్వహించి మార్కులు అప్లోడ్ చేయాలని ఒత్తిడి చేయడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయికి బానిసలు కాకుండా చర్యలు తీసుకోవాలి విద్యార్థులు గంజాయికి బానిసలుగా మారి జీవితాలను బలిచేసుకుంటున్న ఘటనలపై యూటీఎఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గంజాయిని విక్రయించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. -
విద్యార్థి ఇంటి ఎదుట ఉపాధ్యాయుల ధర్నా
దుమ్ముగూడెం: కొంతకాలంగా పాఠశాలకు గైర్హాజరవుతున్న విద్యార్థిని సక్రమంగా బడికి పంపించాలంటూ అతడి ఇంటి ఎదుట ఉపాధ్యాయులు, విద్యార్థులు ధర్నా చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న నక్కా మణువరన్ తరచూ పాఠశాలకు డుమ్మా కొడుతున్నాడు. విద్యార్థిని రెగ్యులర్‌గా పాఠశాలకు పంపించాలంటూ ఉపాధ్యాయులు అతడి తల్లిదండ్రులను పలుమార్లు కోరినా వారి నుంచి స్పందన లేదు. దీంతో ప్రధానోపాధ్యాయుడు బి.రవి, ఉపాధ్యాయురాలు రుక్మిణి ఇతర విద్యార్థులతో కలిసి మణువరన్ ఇంటి వద్ద శాంతియుతంగా ధర్నా చేశారు. ఈ సందర్భంగా టీచర్లు మాట్లాడుతూ.. పిల్లల విద్యాహక్కు రక్షణ తమ బాధ్యత అని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకుని అందరినీ చదివించాలని కోరారు. ఈ విషయంలో తల్లిదండ్రులు సహకరించాలని అన్నారు. దీంతో తమ కుమారుడిని సోమవారం నుంచి సక్రమంగా బడికి పంపుతామని తల్లిదండ్రులు చెప్పడంతో ధర్నా విరమించారు. -
అమెరికా అగ్ని ప్రమాదంలో తెలుగు విద్యార్థులు మృతి
-
టీడీపీ సభల్లా పేరెంట్–టీచర్స్ సమావేశాలు
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: పాఠశాలలు, విద్యార్థులు, విద్యా సమస్యల పరిష్కారం కోసం జరగాల్సిన మెగా పేరెంట్–టీచర్స్ సమావేశాలు టీడీపీ సభల్లా మారాయి. రాజకీయ ప్రసంగాలకు, ముఖ్యమంత్రి, ఆయన తనయుడు మంత్రి లోకేశ్‌పై పొగడ్తలకు పరిమితమయ్యాయి. విద్యార్థుల తల్లిదండ్రులకు తొలి ప్రాధాన్యంతో పాటు మాట్లాడే అవకాశమివ్వాల్సిన చోట రాజకీయ నాయకులే అంతా ముందుండి నడిపించారు. మెగా పీటీఎం పేరుతో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని భామిని ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో చేపట్టిన మనబడి నాడు–నేడు పనుల్లో భాగంగా అందించిన డబుల్ డెస్క్ బెంచీలకు ‘లీప్’ స్టిక్కర్లు అతికించారు. వాటిపైనే కూర్చుని సీఎం విద్యార్థులతో మాట్లాడారు. అన్ని చోట్లా కేవలం రాజకీయ ప్రసంగాలు, లోకేశ్‌ను మార్కెట్ చేయడమే ప్రధానంగా సమావేశాలే సాగాయి. గుంటూరు పట్టణంలో జరిగిన పీటీఎంలో వేదిక పైనా, కిందా టీడీపీ నాయకులే ఆక్రమించారు. విద్యార్థుల తల్లిదండ్రులు నిలబడాల్సి వచ్చింది. గుంటూరు ఏటీ అగ్రహారంలోని ఎస్‌కేబీఎం నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాల పీటీఎంలో పిల్లలు అల్లరి చేస్తున్నారని బూటుకాళ్లతో తన్నిన గణితశాస్త్ర ఉపాధ్యాయుడు ఎంపీ సుబ్బారావును డీఈవో సస్పెండ్ చేశారు. కడపలోని గాం«దీనగర్ మున్సిపల్ హైసూ్కల్లో తల్లిదండ్రుల కోసం వేసిన కురీ్చల్లో టీడీపీ నేతలు కూర్చున్నారు.పాఠశాలకు తాళం వేసిన తల్లిదండ్రులు వైఎస్సార్ కడప జిల్లా కాశినాయనమండలంలోని నాయునిపల్లి ఎంపీపీ పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ నాగమునెమ్మ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం తాళాలు వేసి నిరసన తెలిపారు. ఒకే ఉపాధ్యాయిని ఉండటంతో విద్య బోధన ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల తల్లిదండ్రులు రాకపోవడంతో టీడీపీ నేతలు బలవంతంగా పిలిపించారు. తిరుపతి జిల్లాలోని ప్రధాన పట్టణాల్లోని ప్రభుత్వ పాఠశాలలు టీడీపీ కార్యాలయాలుగా మారిపోయాయి. తల్లిదండ్రుల కంటే టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలే పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చాలా చోట్ల 30 శాతం మంది తల్లిదండ్రులు కూడా పాల్గొనలేదు. పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోనూ ఇదే రీతిలో సమావేశాలు కొనసాగాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం లగిసపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో టీడీపీ రాక ఆలస్యం కావడంతో హిందుపురం టీడీపీ ఎమెల్యే, సినీ నటుడు బాలకృష్ణ నటించిన అఖండ సినిమాను ప్రదర్శించారు. భోజనం బాగోలేదంటూ ఆగ్రహం కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి ప్రభుత్వ పాఠశాలలో, అనకాపల్లి జిల్లా మునగపాక మండలం వాడ్రాపల్లి జిల్లా పరిషత్ హైసూ్కల్లో మధ్యాహ్న భోజనం బాగోలేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం బాగుండటం లేదని, దీంతో పిల్లలు ఇళ్లకు వచ్చేస్తున్నారని చెప్పారు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం చింతలపూడి పంచాయతీ గింజర్తి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆదర్శ పాఠశాలగా మార్చక పోవడాన్ని నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు మెగా పేరెంట్–టీచర్స్ సమావేశాన్ని బహిష్కరించారు. పాఠశాల గేటు మూసివేసి బయటే ఉండిపోయారు. -
అమెరికాలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
అమెరికా బర్మింగ్‌హామ్‌లో విషాదం చోటు చేసుకుంది. తెలుగు విద్యార్థులు నివసిస్తున్న ఓ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరణించిన వారిలో మేడ్చల్ జిల్లా పోచారానికి చెందిన ఉడుముల సహజ రెడ్డి, కూకట్‌పల్లికి చెందిన మరొక విద్యార్థి ఉన్నారు. మృతులిద్దరూ హైదరాబాద్ వాసులు. కాగా అగ్నిప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో పదిమంది తెలుగు విద్యార్థులు నివసిస్తున్నారు. హఠాత్తుగా చెలరేగిన మంటలకు అందులో చిక్కుకున్న విద్యార్థులు ఉక్కిరి బిక్కిరయ్యారు. విద్యార్థులు శ్వాస తీసుకోలేక పెద్దగా కేకలు పెట్టారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించారు. తీవ్ర గాయాలైన విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లాగా అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వీరంతా అక్కడి అలబామా యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నారు. -
మత్తెక్కిన ముఠాలు..బానిసలైన విద్యార్థులు!
గంజాయి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే, ఇదివరకు పట్టణాల్లో అక్కడక్కడా మాత్రమే దొరికే ఈ మత్తు పదార్థం నేడు గ్రామాల్లోనూ విరివిగా లభిస్తోంది. దీంతో ఎంతోమంది యువత ఈ మత్తుకు బానిసై బంగారు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. అక్రమార్జనకు అలవాటు పడిన ముఠా విసురుతున్న వలలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. వివిధ రూపాల్లో గంజాయి యువత చెంతకు చేరుతూ వారిని పెడదారి పట్టిస్తోంది. ఇటీవల పోలీసు టాస్‌్కఫోర్స్ తనిఖీల్లో ఎక్కువగా విద్యార్థులు పట్టుబడుతుండడం విస్మయాన్ని కలిగిస్తోంది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నిర్మూలించామని బాబు ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాలో మత్తు ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఇప్పుడు ఏ మండలంలో చూసినా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా టాస్‌్కఫోర్స్ తనిఖీలు నామమాత్రంగా జరుగుతుండడంతో జిల్లా సరిహద్దులను, జిల్లాకు సమీపంలో ఉన్న మండలాలను కేంద్రంగా చేసుకొని గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నట్లు తేటతెల్లం అవుతోంది. టీనేజీ పిల్లలు, మైనర్లు గంజాయికి అలవాటు పడిపోయి తల్లిదండ్రులకు తలనొప్పిగా మారారు. దీంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు మాని కార్యాచరణలో పనితనం చూపాలని తలిదండ్రులు, సామాజికవేత్తలు కోరుతున్నారు. గంజాయి మత్తులో విద్యార్థులు... గత వారం నగరంలోని టాస్‌్కఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో గంజాయి బ్యాచ్ మీద దాడి చేసి పట్టుకున్నారు. అందులో అంజయ్య రోడ్డులోని ఒక ప్రైవేటు హైస్కూకలులో ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థులు కూడా ఉండడంతో విస్తుపోయారు. రెండు రోజుల క్రితం మరో బ్యాచ్ గురించి సమాచారం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన టాస్‌్కఫోర్స్ పోలీసులకు కోర్టు సెంటర్లోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పట్టుబడ్డారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ హర్షవర్థన్ రాజు గంజాయి వినియోగిస్తున్న బ్యాచ్ పై దాడులకు ఆదేశించారు. ఈ దాడుల్లో నగరంలోని ప్రముఖ డిగ్రీ కాలేజీ విద్యార్థులు రెండంకెల సంఖ్యలో పట్టుబడ్డారు. నగర శివారుల్లోని ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో దొరికారు. వీరిలో కొందరు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి తొలి తప్పుగా హెచ్చరించి పంపించేశారు. మరి కొందరిని మాత్రం జీజీహెచ్‌లోని ఎడిక్షన్ సెంటర్‌కు తరలించి చికిత్స చేయించి పంపించారు. కాలేజీ యాజమాన్యాల నిర్లక్ష్యం... ఇంటర్మీడియెట్, ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల విద్యార్థులే లక్ష్యంగా చేసుకొని గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్లు ఆయా కళాశాలల యాజమాన్యాలకు సమాచారం ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. కాలేజీ యాజమాన్యాల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. గంజాయి తాగుతున్న వారిని గుర్తించి, వారు మరొకరికి అలవాటు చేయకుండా కాలేజీ యాజమాన్యాలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే రానున్న రోజుల్లో కాలేజీలు గంజాయి అడ్డాగా మారిపోయినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి... జిల్లాలో ఎక్కడ చూసినా గంజాయి గుప్పుమంటోంది. దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు, దర్శి పరిసర ప్రాంతాలు, సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి టౌన్, మర్రిచెట్లపాలెం ప్రాంతాలు గంజాయికి అడ్డాగా మారినట్లు తెలుస్తుంది. జిల్లా సరిహద్దుల్లోని బాపట్ల జిల్లా అద్దంకి, నెల్లూరు జిల్లాలోని ఉలవపాడు పరిసర ప్రాంతాల్లో గంజాయిని నిల్వ చేసుకొని ఒంగోలు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇటీవల చీమకుర్తి, మద్దిపాడు, ఒంగోలు వన్‌టౌన్, టూ టౌన్, తాలూకా పోలీసు స్టేషన్ల పరిధిలో 10 కేసులు నమోదు చేయడం గమనార్హం. కేవలం గంజాయి విక్రేతలను మాత్రమే కాకుండా సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటీవల 5 మంది గంజాయి సేవించిన వారిపై కేసు నమోదు చేయడం గమనార్హం. విశాఖ నుంచి రైళ్లలో ... ఒడిశా నుంచి విశాఖ పట్టణం గుండా రైళ్ల ద్వారా గంజాయిని తరలించి ఒంగోలులో విక్రయిస్తున్నట్లు సమాచారం. పోలీసుల తనిఖీల్లో రైళ్లలో గంజాయి పట్టుబడడం ఇటీవల నిత్యకృత్యమై పోయింది. పోలీసులకు పట్టుబడిన గంజాయి కంటే వారి కళ్లు గప్పి రవాణా చేస్తున్న గంజాయే ఎక్కువగా ఉంటోందని పోలీసు వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. రైళ్లలో తనిఖీలు జరుగుతుండడంతో ఇతర మార్గాల ద్వారా గంజాయి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా ఆటోలు, ఆర్టీసీ బస్సుల ద్వారా గంజాయిని ఒంగోలు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.ఇంటినే గంజాయి డెన్‌గా మార్చిన విద్యార్థి..టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో నగరంలో ఒక విద్యార్థి ఇంటినే గంజాయి డెన్‌గా మార్చుకోవడం చూసి విచారణ అధికారులు నివ్వెరపోయారు. పెద్ద మొత్తంలో గంజాయిని సేకరించిన సదరు విద్యార్థి తన స్నేహితులకు కూడా గంజాయిని అలవాటు చేసినట్లు చెబుతున్నారు. గంజాయి సేవిస్తున్న విద్యార్థులు కొందరు రాత్రి పూట పార్టీలు చేసుకోవడం, బర్త్ డే పార్టీ పేరుతో గంజాయి తాగడం ఎక్కువై పోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. అర్ధరాత్రి వరకు బయట స్నేహితులతో తిరిగి ఏ అపరాత్రో ఇంటికి వచ్చి పగలంతా గుర్రు పెట్టి నిద్రపోతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గంజాయికి అలవాటు పడిన విద్యార్థుల నడవడిక తీవ్రంగా ఉంటోందని, హై స్పీడ్ మోటారు బైకులు కావాలని తల్లిదండ్రులను వేధిస్తున్నారని, చీటికీ మాటికీ తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకొని ఏడిపిస్తున్నారని సమాచారం. మరికొందరు విద్యార్థులు గంజాయి కొనుగోలు చేయడానికి చేతిలో డబ్బులు లేక చోరీలు చేయడం, నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసు నివేదికల ద్వారా తెలుస్తోంది. -
‘ప్రత్యేక’ విద్య అందించాలి!
వైకల్యం అనేది శరీరానికి సంబంధించిన ఒక పరిమితి మాత్రమే, మనసుకు కాదు. ఈ మహత్తరమైన సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ‘అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం’ ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటున్నాం. శారీ రక, మానసిక, దృశ్య, శ్రవణాల్లో ఏ వైకల్యం ఉన్నవారికైనా మిగతా వారితో పాటు సమాన హక్కులు, సమాన అవకాశాలు, గౌరవ ప్రదమైన జీవితం ఉండాలని గుర్తు చేసే రోజు ఇది. మిగతా రంగాల్లో ఎలా ఉన్నా... క్రీడా రంగంలో వికలాంగులు ప్రపంచ వ్యాప్తంగా అద్భుత నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. ప్యారా అథ్లెటిక్స్ వారి ధైర్యానికీ, పట్టుదలకూ, నిశ్చయానికీ ప్రతీక. మన దేశం ప్యారా అథ్లెట్ల వల్ల ప్రపంచ వేదికపై వెలుగొందు తోంది. భారతదేశానికి తొలి ప్యారాలింపిక్ స్వర్ణ పతకాన్ని అందించిన మురళీకాంత్ పేట్కర్ 1965 ఇండో–పాక్ యుద్ధంలో శత్రువుల దాడిలో తీవ్రంగా గాయపడి శాశ్వత వైకల్యం పాలయ్యారు. దీంతో వీల్ చైర్‌పై కొత్త జీవితం ప్రారంభించారు. 1972లో పశ్చిమ జర్మనీ లోని హీడెల్బర్గ్లో జరిగిన ప్యారాలింపిక్ క్రీడల్లో చరిత్ర సృష్టించారు. 50 మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్లో 37.33 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ప్రపంచ రికార్డుతో పాటు భారతదేశానికి మొట్ట మొదటి వ్యక్తిగత ప్యారాలింపిక్ స్వర్ణ పతకాన్ని అందించారు. క్రీడ లకు ఆయన చేసిన సేవకు గుర్తింపుగా, భారత ప్రభుత్వం 2018లో ‘పద్మశ్రీ’, 50 ఏళ్లకు పైగా నిరీక్షణ తర్వాత 2024 సంవ త్సరానికిగానూ ‘అర్జున’ అవార్డు ఇచ్చి సత్కరించింది. ఆయన అసాధారణ జీవిత కథ ఆధారంగా హిందీ చిత్రం ‘చందు ఛాంపి యన్’ 2024లో విడుదలైంది. భారతదేశం ఇప్పటివరకు ప్యారాలింపిక్స్‌లో 60 పతకాలను గెలుచుకుంది. దేవేంద్ర ఝాఝరియా తన బాల్యంలోనే ప్రమాదవ శాత్తు తన ఎడమ చేతిని కోల్పోయాడు. ప్యారా అథ్లెటిక్స్ విభాగంలో ఏథెన్స్ (2004), రియో డీజెనీరో (2016)లో జావలిన్‌త్రోలో స్వర్ణాలు గెలిచాడు. అవనీ లేఖరా 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తీవ్ర కారు ప్రమాదం కారణంగా రెండు కాళ్లు దాదాపు పనిచేయడం మానుకున్నాయి. ప్యారాప్లీజియా వ్యాధిని ఎదుర్కొంది. ఈ స్థితిలో షూటింగ్లో కెరీర్ ప్రారంభించి ప్రపంచ స్థాయికి ఎదిగింది. ప్యారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళ అయ్యింది. మారియప్పన్ తంగవేలు భారతీయ పారా హైజంపర్, వరుసగా మూడు ప్యారాలింపిక్స్‌లో పతకాలు గెలుచు కున్న మొదటి భారతీయుడు.పుట్టుకతోనే రెండు చేతులు లేకుండా జన్మించిన శీత్లా దేవి కాళ్లతో, నోటితో విల్లును, బాణాన్ని పట్టుకుని వదలడంలో శిక్షణ పొంది. 2024 ప్యారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. 2023లో రాష్ట్రపతి చేతుల మీదుగా ‘అర్జున’ అవార్డు అందుకుంది. ప్రపంచ దేశాల్లో అనేకం ఇటువంటి విజయగాథలు కనిపిస్తాయి. మనదేశంలో అందరికీ చదువుకునే హక్కు ఉంది కానీ అంగ వైకల్యం ఉన్నవారికి అది ఇంకా దూరంగానే ఉండిపోయింది. అంగ వైకల్య విద్యార్థుల కోసం ప్రత్యేక శారీరక విద్య అందించాలని చట్టం ఉన్నా అది సరిగా అమలుకు నోచుకోవడం లేదు. భారత దేశంలో సుమారు 78 లక్షల అంగవైకల్యం ఉన్న విద్యార్థులు ఉన్నారు. వారిలో 70% విద్యార్థులు ప్రత్యేక శారీరక విద్య పొందడం లేదు. పాఠశాలల్లో వీరికి బోధించగల అర్హతలు ఉన్న టీచర్లు 15 శాతమే. అంగవైకల్యం ఉన్న విద్యార్థులు ఆటల ద్వారా ఎదగాలి, గెలవాలి, ప్రపంచాన్ని మార్చాలి. ప్రత్యేక శారీరక విద్య అంటే ఒక కార్యక్రమం కాదు, వారి భవిష్యత్తుకు తలుపులు తెరచే బంగారు తాళం చెవి. – జక్కుల వెంకటేశ్ యాదవ్ ‘ విద్యార్థి నాయకుడు(రేపు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం) -
ఫీజు చెల్లిస్తేనే తరగతికి అనుమతి
అనంతపురం: టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి చెందిన శ్రీకృష్ణదేవరాయ హార్టీకల్చర్ కళాశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల దారుణంగా ప్రవర్తించింది. ఫీజులు చెల్లించేంత వరకూ తరగతులకు అనుమతించేది లేదని విద్యార్థులకు తేల్చిచెప్పింది. సోమవారం కళాశాల నిర్వాహకులు 50 మంది విద్యార్థులను నిర్ధాక్షిణ్యంగా గేటు బయటే నిలబెట్టారు. మొత్తం కోర్సు ఫీజు చెల్లిస్తేనే కళాశాలలోకి అనుమతిస్తామని, పరీక్ష ఫీజు చెల్లింపునకు అనుమతిస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులు ఆందోళన చెందారు. చాలాసేపు కార్యాలయం బయటే వేచి ఉండి.. ఇక చేసేదేమి లేక ఇంటికి వెళ్లిపోయారు. ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరుకాకే తమకీ దుస్థితి వచ్చిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. లోకేశ్ అనాలోచిత నిర్ణయాలతోనే ఈ దుస్థితి సీఎం చంద్రబాబు తనయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో విద్యావ్యవస్థ కుదేలైంది. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు అస్తవ్యస్తంగా మారింది. ప్రపంచస్థాయి విద్య, క్వాంటం సెంటర్లు అంటూ ప్రచారం మినహా కళాశాలలకు సకాలంలో ఫీజు మాత్రం రీయింబర్స్మెంట్ చేయడం లేదు. ఉన్నత విద్యపై సమీక్ష చేసినప్పుడల్లా అదిగో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తున్నాం.. ఇదిగో ఇచ్చేస్తున్నాం. అంటూ ‘ ఎక్స్’ ఖాతాలో ట్వీట్లు చేసుకోవడంతోనే లోకేశ్ కాలం గడిపేస్తున్నారు. ఈ తంతు గతేడాది జూన్ నుంచి జరుగుతోంది. ఈ ఏడాది నవంబర్ వచ్చినా బకాయిలు చెల్లించలేదు. ఫలితంగా అవి బకాయిలు కొండలా పేరుకుపోయాయి.ఈ ఏడాది జూలైలో కచ్చితంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని యాజమాన్యాలకు హామీ ఇచ్చిన లోకేశ్.. అక్టోబర్ చివరిలో కంటితుడుపుగా విదిల్చారు. ఆ తర్వాత ‘ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా చెల్లించేవరకు విద్యార్థులను తరగతులకు అనుమతించాలి. విద్యార్థులు ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేయకూడదు’ అని కలెక్టర్ల ద్వారా ఉత్తర్వులు జారీ చేయించారు. అయినప్పటికీ ఆ ఆదేశాలను టీడీపీకి చెందిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పాటించడం లేదు. విద్యార్థుల నుంచి నిర్బంధంగా ఫీజులు వసూలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పల్లె రఘునాథరెడ్డి కళాశాల తీరుపై తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. అవమాన భారంతో అప్పులు తెచ్చిమరీ ఫీజులు చెల్లిస్తున్నారు. పాత విద్యా సంవత్సరంలో రెండు త్రైమాసికాలు, ఈ విద్యా సంవత్సరంలో పూర్తయిన మూడు త్రైమాసికాలకు కలిపి అనంతపురం జిల్లాలో రూ.90 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నట్టు విద్యార్థులు చెబుతున్నారు. -
ఫీజు బకాయిల రికార్డ్.. రాష్ట్ర చరిత్ర లో ఇదే..!
-
హాస్టల్ లో బయట నుంచి బిర్యానీ తెచ్చుకుని తిన్నారని దారుణంగా కొట్టిన టీచర్లు
-
‘మస్క్’ను తలదన్నేలా.. కుర్రాళ్ల సరికొత్త ఏఐ మోడల్
మిచిగాన్: టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ అందించే మిలియన్ డాలర్ల ఆఫర్‌ను తిరస్కరిస్తూ, అమెరికాలోని మిచిగాన్కు చెందిన ఇద్దరు 22 ఏళ్ల కుర్రాళ్లు తమ విప్లవాత్మక ఏఐ ప్రాజెక్ట్ రూపకల్పనకు నడుంబిగించారు. సేపియంట్ ఇంటెలిజెన్స్ సహ వ్యవస్థాపకులైన గువాన్ వాంగ్, విలియం చెన్లు ఎలాన్ మస్క్‌ను ఢీకొడుతూ మానవ మేధస్సు కంటే తెలివైన ఏఐని సృష్టించే ఉమ్మడి ‘మెటాగోల్స్’తో అనుబంధం ఏర్పరచుకున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించే మొదటి వ్యక్తులం తామే కావాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఈ కుర్రాళ్లు తొలుత ఓపెన్చాట్తో విజయం సాధించారు. ఇది అధిక నాణ్యత సంభాషణల క్యూరేటెడ్ సెట్‌పై శిక్షణ పొందిన ఒక భాషా మోడల్ (ఎల్ఎల్ఏం). సంప్రదాయ ఎల్ఎల్ఎంల పరిమితులను అధిగమించేలా దీనిని తీర్చిదిద్దారు. వీరు రూపొందించిన ఓపెన్చాట్ త్వరగా విద్యా వర్గాలలో దూసుకుపోతోంది. ఈ మోడల్ ఎలాన్ మస్క్ దృష్టిని సైతం ఆకర్షించింది. దీంతో మస్క్ తన కంపెనీ ఎక్స్ ఏఐ ద్వారా ఆ కుర్రాళ్లను సంప్రదించి, మిలియన్ డాలర్ల ఆఫర్‌ను ఇచ్చారు. అయితే దీనిని చెన్, వాంగ్ తిరస్కరించారు.మస్క్ ఆఫర్‌ను తిరస్కరించిన తర్వాత వారు హైరార్కికల్ రీజనింగ్ మోడల్ (హెచ్ఆర్ఎం)ను సృష్టించేందుకు సేపియంట్ ఇంటెలిజెన్స్‌ను స్థాపించారు. ఈ హచ్ఆర్ఎం మోడల్ కేవలం 27 మిలియన్ పారామితులతో కూడిన ప్రోటోటైప్ అయినప్పటికీ, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్‌ను కొలిచే సంక్లిష్టమైన పనులైన సుడోకు పజిల్స్, ఏఆర్సీ-ఏజీఐ బెంచ్‌మార్క్‌తో సహా ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్, డీప్‌సీక్ లాంటి ప్రధాన ఏఐ వ్యవస్థలను అధిగమించింది.ఈ కుర్రాళ్లు రూపొందిస్తున్న హెచ్ఆర్ఎం.. గణాంకపరంగా తదుపరి పదాన్ని అంచనా వేసే సాంప్రదాయ ట్రాన్స్ఫార్మర్ల మాదిరిగా కాకుండా, మానవ ఆలోచనను అనుకరించే రెండు-భాగాల పునరావృత నిర్మాణాన్ని ఉపయోగిస్తుంది. ఇది ఉద్దేశపూర్వక తార్కికతను వేగవంతమైన రిఫ్లెక్సివ్ ప్రతిస్పందనలతో కలుపుతుంది. ఇది ఊహించడం కాదని, ఆలోచించడం అని, ఫలితంగా తమ మోడళ్లు సాంప్రదాయ ఎల్ఎల్ఎంల కంటే చాలా తక్కువగా భ్రాంతులు కలిగి ఉంటాయని ఆ కుర్రాళ్లు చెబుతున్నారు. వాతావరణ అంచనా, వ్యాపారం తదితర రంగాలలో ఇప్పటికే వీరి ప్రయోగాలు విజయవంతయ్యాయి.ఇది కూడా చదవండి: చాట్ జీపీటీకి మూడేళ్లు.. ఏం సాధించిందంటే.. -
పాఠాలు వినాలంటే నది దాటాల్సిందే..
వరదయ్యపాళెం: తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గం, పిచ్చాటూరు మండలంలోని మూడు గ్రామాల విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే అరుణానదిని దాటాల్సిన దయనీయ పరిస్థితి. ఈ సమస్యపై తాజాగా మండలంలోని రామగిరి, అడవికండ్రిగ, కాలంజేరి గ్రామాలకు చెందిన 70 మంది విద్యార్థులు నీళ్లలో నడుస్తూ ప్రభుత్వానికి వినూత్న నిరసన తెలిపారు. ‘రాజానగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే.. వానైనా, ఎండైనా–ఇసుకలోనూ, రాళ్ల మధ్య ఈ నదిని దాటక తప్పదు. మాకు వంతెన కట్టించి న్యాయం చేయండి’ అంటూ మంత్రి లోకేశ్‌కు విన్నవించారు. ఈ నిరసన స్థానిక సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అరుణానదిపైన వంతెన లేకపోవడంతో ఈ గ్రామాల ప్రజలు సైతం రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతుండడం గమనార్హం. -
గురుకులంలోకి ప్రవేశం ఇక కఠినం
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లోకి బయటి వ్యక్తుల ప్రవేశం, తరచూ తల్లిదండ్రుల సందర్శనలు..విద్యార్థుల బోధన, అభ్యసన కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తోంది. తల్లిదండ్రులు అసందర్భంగా, అకస్మాత్తుగా రావడం, తమ పిల్లలను ఇంటికి పంపించాలని పట్టుబడుతుండటం గురుకులాల సిబ్బందికి తలనొప్పిగా మారుతోంది. కొన్ని సందర్భాల్లో రాజకీయ జోక్యం కూడా చోటు చేసుకుంటోంది. ఒకట్రెండు చోట్ల ఘర్షణలు సైతం జరిగిన దాఖలాలున్నాయి. ఇలాంటి పరిస్థితులతో పాటు విద్యార్థుల సంరక్షణ, భద్రతపై కూడా ఎస్సీ గురుకుల సొసైటీ దృష్టి సారించింది. ఇకపై నిబంధనలకు అనుగుణంగానే.. ఇకపై ఈ నిబంధనలకు అనుగుణంగానే గురుకుల క్యాంపస్‌లోకి తల్లిదండ్రులను అనుమతించాలని, విద్యార్థిని ఇంటికి అనుమతించేందుకు నిర్దిష్ట విధానం ఉండాలని ఎస్సీ గురుకుల సొసైటీ స్పష్టం చేసింది. ఇందుకోసం విద్యార్థుల తల్లిదండ్రులు, గార్డియన్లకు సరైన ఆధారాలతో ఫొటో గుర్తింపు కార్డును జారీ చేయనుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 268 గురుకుల పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. లిఖితపూర్వక అనుమతి ఉండాలి⇒ ప్రిన్సిపాల్ నుంచి ముందస్తు లిఖితపూర్వక అనుమతి ఉన్న వ్యక్తిని మాత్రమే గురుకుల ప్రాంగణంలోకి అనుమతించాలి. ప్రతి గురుకుల విద్యాసంస్థ సంస్థ వద్ద ఈ ప్రాంగణంలోకి అనధికార వ్యక్తులకు ప్రవేశం లేదు..’అనే బోర్డు ఏర్పాటు చేయాలి. ⇒ గురుకుల ప్రాంగణం గేటు దగ్గర విద్యార్థి, అతనితో వచ్చిన తల్లి, తండ్రి/గార్డియన్ సంతకాలు నమోదు చేసే రిజిస్టర్ తప్పనిసరిగా నిర్వహించాలి. గుర్తింపు పరిశీలించిన తర్వాత మాత్రమే లోనికి అనుమతించాలి. ⇒ విద్యార్థిని కలవడానికి వచ్చిన తల్లిదండ్రులు క్యాంపస్‌లో ఉండటానికి అనుమతి లేదు. సంస్థకు సమరి్పంచిన గుర్తింపు కార్డు చూపిన తల్లిదండ్రులు మాత్రమే కలిసేందుకు అనుమతించాలి. అయితే అది కూడా తరచుగా కాకూడదు. అలాంటి విద్యార్థులపై నిఘా పెట్టాలి ⇒ గురుకుల పాఠశాల/కళాశాలకు అత్యంత సమీపంలో నివాసం ఉన్న విద్యార్థులను గుర్తించాలి. తరచూ కుటుంబ సభ్యులు వచ్చి కలిసే విద్యార్థులపై ప్రిన్సిపాల్/హౌస్ మాస్టర్/మి్రస్టెస్ ప్రత్యేకంగా నిఘా పెట్టాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే విద్యార్థిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలి. ⇒ పాఠశాల పని వేళల్లో లేదా వారాంతం/ఇతర సెలవు దినాల్లో ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా విద్యార్థిని బయటకు పంపితే, సంబంధిత హౌస్ మాస్టర్/మి్రస్టెస్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ⇒ సెలవుల తర్వాత పునఃప్రారంభం రోజు లేదా ప్రిన్సిపాల్ పేర్కొన్న ఇతర సందర్భాల్లో తప్పనిసరిగా విద్యార్థిని తల్లి/తండ్రి/గార్డియన్ వ్యక్తిగతంగా తీసుకురావాలి. బాలిక తల్లిదండ్రులు లేకుండా వస్తే క్యాంపస్‌లోకి అనుమతి ఇవ్వకూడదు. దీనికి సంబంధించిన స్పష్టమైన ఆదేశాలను వాచ్మెన్/క్లాస్ టీచర్లు/హౌస్ మాస్టర్లు/ మిస్ట్రెస్లకు ప్రిన్సిపాల్ ఇవ్వాలి. ⇒ పాఠశాల/కాలేజీ పని దినాల్లో లేదా ఆదివారాలు/ప్రభుత్వ సెలవులలో విద్యార్థిని ఇంటికి పంపించరాదు. అయితే అత్యంత సమీప బంధువు మరణం లేదా ఇంటిలో ముఖ్యమైన కార్యక్రమం ఉంటే తల్లిదండ్రుల అభ్యర్థనపై అనుమతించవచ్చు.సెలవులపై ముందుగానే సమాచారం ఇవ్వాలి ⇒ విద్యార్థిని ఎవరి చేత ఇంటికి పంపించారో, వారి పేరు నమోదు.. గుర్తింపు కార్డు సమరి్పంచిన తల్లి/తండ్రి/గార్డియన్ సంతకంతో హౌస్ మాస్టర్/మి్రస్టెస్ రిజిస్టర్ నిర్వహించాలి. ⇒ సెలవులు ప్రారంభం అయ్యే సమయంలో ముందుగానే అందరికీ సమాచారం ఇచ్చి, తల్లిదండ్రులు స్వయంగా తమ పిల్లలను తీసుకెళ్లాలని తెలియజేయాలి. వారు రాలేని పరిస్థితిలో, విద్యార్థి అన్న/అక్క/గార్డియన్‌తో పంపవచ్చు. అయితే ఆ వ్యక్తి ఫొటో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రిన్సిపాల్ వద్ద సమర్పించి ఉండాలి. ⇒ ఆదివారాలు, ప్రభుత్వ సెలవు రోజుల్లో ఇద్దరు బోధనా సిబ్బంది రొటేషన్ పద్ధతిలో విధులు నిర్వ హించాలి. ప్రాంగణం గేటు వద్ద భద్రతా వ్యవస్థను సదరు ప్రిన్సిపాల్ మరింత బలోపేతం చేయాలి. -
కరెంట్ లేదని పిల్లల్ని ఆకలితో మాడ్చేశారు
గొలుగొండ: అల్లూరి సీతారామరాజు జిల్లా గొలుగొండ కసూ్తర్బా బాలికల వసతిగృహంలో విద్యార్థులు ఆకలితో అలమటించారు. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు భోజనం పెట్టకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయం తెలిసిన విద్యార్థినుల తల్లిదండ్రులు శనివారం పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులను ప్రశ్నించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వసతి గృహంలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 240 మంది చదువుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ముందుగానే ప్రకటించారు.మధ్యాహ్నం భోజనం అనంతరం వసతి గృహం సిబ్బంది ఈ సమస్యను పట్టించుకోలేదు. శుక్రవారం రాత్రి 8 గంటలైనా కరెంట్ రాకపోయినా సిబ్బంది పట్టించుకోలేదు. కరెంట్ వస్తుందని రాత్రి 10 గంటల వరకూ వేచి చూశారు. విద్యార్థులు ఆకలి కేకలు వేయడంతో అప్పటికప్పుడు చేతి పంపుబోరుల నుంచి నీరు తెచ్చి అన్నం వండి వడ్డించారు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు శనివారం వసతిగృహానికి వచ్చి సిబ్బందిని నిలదీశారు.జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో జిల్లా బాలికల సంరక్షణ అధికారి జమీమా, ఎంఈవో సత్యనారాయణ కసూ్తర్బా బాలికల వసతిగృహాన్ని సందర్శించి, సమాచారాన్ని సేకరించారు. అనంతరం డీఈవో, సమగ్ర శిక్షణ అధికారులకు తెలియజేశారు. దీనిపై మంగళవారం పూర్తి విచారణ చేపడతామని విలేకరులకు ఎంఈవో చెప్పారు. -
నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. హాస్టల్లో జూనియర్ విద్యార్థులను గోడ కుర్చీ వేయాలంటూ సీనియర్లు ర్యాగింగ్ చేశారు. 15 రోజుల క్రితం ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. యాంటి ర్యాగింగ్ కమిటీకి జూనియర్లు ఫిర్యాదు చేశారు.నలుగురు విద్యార్థులు దీపక్ శర్మ, హేమంత్ చౌదరి, కిషన్ బెనీవల్, అలోక్ గనిలను రెండు నెలల పాటు కాలేజీ, హాస్టల్ నుంచి ఏడాదిపాటు ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు.గత ఏడాది సీనియర్లు ర్యాగింగ్ చేశారంటూ దీపక్ శర్మ అప్పట్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు జూనియర్లను ర్యాగింగ్ చేసిన అప్పటి బాధితుడు దీపక్ శర్మ కావడం ఈ ఘటనలో బిగ్ ట్విస్ట్. -
ఎన్నికల హామీలు మరిచిన కూటమిపై AISF ఆగ్రహం
-
మాట తప్పిన లోకేష్.. విద్యార్థి సంఘాల ఆగ్రహం
సాక్షి, విజయవాడ: ఎన్నికల హామీలు మరిచిన కూటమి సర్కార్‌పై ఏఐఎస్ఎఫ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇచ్చిన మాట తప్పిన విద్యాశాఖ మంత్రి లోకేష్‌పై విద్యార్థి సంఘ నేతలు మండిపడ్డారు. లోకేష్‌తో జరిగిన సమావేశం అసంపూర్తిగా ముగిసిందని.. ఏ అంశం మీదా స్పష్టమైన హామీ రాలేదని విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యారంగంలో సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంత్రి లోకేష్ ఇంటి ముట్టడికి బయలుదేరిన విద్యార్థి సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.విద్యా రంగ సమస్యల పరిష్కరం కోసం ఏఐఎస్ఎఫ్ ఛలో విజయవాడకి పిలుపు నిచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలు విడుదల చేయాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని, విద్యా సంస్థలోకి విద్యార్థి సంఘాలు నిషేధం ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యా రంగం నిర్లక్ష్యానికి గురవుతుందని విద్యార్థి సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పిల్లల అసెంబ్లీలోనూ రాజకీయాలే
సాక్షి, అమరావతి: రాజ్యాంగం విలువలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు బుధవారం నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీని సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న, మంత్రి లోకేశ్ రాజకీయ ప్రసంగాలతో విద్యార్థుల్లో విద్వేషాలు నింపేలా మాట్లాడారు. విద్యార్థులకు విజ్ఞాన యాత్రగా ఉండాల్సిన కార్యక్రమాన్ని సొంత అజెండా అమలు వేదికగా చేశారు.మొత్తం కార్యక్రమం నాలుగు గంటల పాటు జరిగితే.. అందులో మాక్ అసెంబ్లీ గంటన్నర పాటు జరిగింది. మిగిలిన రెండున్నర గంటలు పూర్తిగా రాజకీయ ప్రసంగాలకు కేంద్రమైంది. సీఎం చంద్రబాబు ప్రసంగం ఒక్కటే గంటా నలభై నిమిషాల పాటు సాగింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో లైవ్ టెలీకాస్ట్ చేసిన ఈ కార్యకమ్రంలో సీఎం, స్పీకర్ల రాజకీయ ప్రసంగాలే ప్రధానంగా సాగాయి. పోలీసులకు రాజ్యాంగం అంటే ఏమిటో తెలియదని.. తన పాదయాత్రలో ఇది గమనించానని లోకేశ్ వ్యాఖ్యానించారు.ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలి? : స్పీకర్ అయ్యన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. ప్రతిపక్షంపై విమర్శలు చేశారు. రాష్ట్రం ఏమైపోయినా, గ్రామాలు, కుటుంబాలు ఏమైనా పర్లేదన్నట్లుగా ప్రతిపక్షం ఉందంటూ విద్యార్థుల్లో విద్వేషాలు రగిలేలా మాట్లాడారు. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలి? ప్రజలు వారిని ఏం చేయాలి? ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు తీసుకోవాలి? ఇక పెద్దలు నిర్ణయించాలి’.. అంటూ చంద్రబాబు వైపు చేతులు చూపుతూ అయ్యన్న మాట్లాడారు.రాజకీయాలు, స్కోత్కర్షతో సీఎం ప్రసంగంఈ మాక్ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగం యావత్తూ రాజకీయాలు, వ్యక్తిగత గొప్పలే ప్రధానంగా సాగింది. ప్రతిపక్షంపై విద్యార్థుల్లో విషం నింపడమే లక్ష్యంగా మాట్లాడారు. ఎమ్మెల్యే కావాలంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలని చెప్పడంతో అంతా విస్మయం వ్యక్తంచేశారు. ఏపీలో దొరికిన కోహినూర్ వజ్రాన్ని నిజాంకి ఇస్తే నిజాం ఆ వజ్రాన్ని బ్రిటిష్ వారికి ఇచ్చేశాడని కొత్త భాష్యం చెప్పారు.ఇక తాను తన చిన్నతనంలో లాంతరు వెలుగులో చదువుకున్నానని, దాంతో 1999లో విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చానని.. ఇప్పుడు ఏకంగా ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకునే స్థాయికి వచ్చామని అన్నారు. ఇలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు తన కీర్తిని తానే కీర్తించుకున్నారు. ఎప్పటిలాగే.. సెల్‌ఫోన్ తానే తెచ్చానని, టెక్నాలజీకి తానే ఆద్యుడినని, ఇప్పుడు టీచర్ స్థానంలో ఏఐ పనిచేస్తోందంటే దానికి తానే కారణమని గప్పాలు కొట్టుకున్నారు. -
అమెరికాపై తగ్గని మోజు!
అమెరికాలో ఏటా రికార్డు స్థాయిలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఈ పెరుగుదలకు ప్రధానంగా భారతదేశం నుంచి వెళ్లే విద్యార్థులు అధికమవుతుండడం కారణంగా నిలిచింది. తాజాగా ఓపెన్ డోర్స్ 2025 నివేదికలోని వివరాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. యూఎస్‌లో దాదాపు ముగ్గురు అంతర్జాతీయ విద్యార్థుల్లో ఒకరు భారతీయులే ఉండడం గమనార్హం. 2024-25 విద్యా సంవత్సరంలో భారతీయ విద్యార్థుల నమోదు 3,63,019కు చేరుకుంది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 9.5 శాతం పెరుగుదలను సూచిస్తుంది.యూఎస్ వెళ్లే భారతీయ విద్యార్థులు ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాలకే పరిమితం కావడం లేదు. ప్రాడిజీ ఫైనాన్స్ డేటా ప్రకారం ఇండోర్, భువనేశ్వర్, పంజాబ్, సూరత్, కోయంబత్తూర్, మైసూరు, నాగ్‌పుర్.. వంటి టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి యూఎస్ వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.ఈ విద్యార్థులు తరచుగా ఉపాధ్యాయులు, చిన్న వ్యాపార యజమానులు, మిడ్ కెరియర్ నిపుణుల కుటుంబాల నుంచి ఎక్కువగా ఉన్నారు.STEM కోర్సులు2024-25లో యూఎస్ మొత్తంగా 11,77,766 అంతర్జాతీయ విద్యార్థులకు ఆతిథ్యం ఇచ్చింది. ఇది అంతకుముందు ఏడాది కంటే 4.5 శాతం ఎక్కువ. యూఎస్‌లోని ప్రతి 10 మంది భారతీయ విద్యార్థుల్లో దాదాపు 7 మంది సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) కోర్సుల్లో చేరుతున్నారు.43.4% మంది భారతీయ విద్యార్థులు గణితం, కంప్యూటర్ సైన్స్ లో చేరారు.22.8% మంది ఇంజినీరింగ్ కోర్సులను ఎంచుకున్నారు.ఓపీటీ..అమెరికా అందిస్తున్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT)కు ఆదరణ పెరుగుతోంది. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అంతర్జాతీయ గ్రాడ్యుయేట్లు దేశీయ శ్రామిక శక్తిలోకి ప్రవేశించడానికి ఓపీటీ ఎంతో తోడ్పడుతుంది. భారతీయ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ముఖ్యంగా STEMలో H-1B వీసాలు లేదా ఇతర వర్గాలకు మారడానికి ముందు వృత్తిపరమైన అనుభవాన్ని పొందడానికి ఓపీటీని ఉపయోగించుకుంటున్నారు.ఇదీ చదవండి: బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్.. వివరాలివే.. -
Sri Chaitanya College: అన్నంలో పురుగులు శ్రీచైతన్య విద్యార్థుల ఆగ్రహం
-
వినూత్నంగా ఆలోచించే విద్యార్థులకు ఎన్నో అవకాశాలు
హైదరాబాద్: వినూత్నంగా ఆలోచించే విద్యార్థులకు ప్రస్తుత సమాజంలో ఎన్నో అవకాశాలున్నాయని బోవర్స్ ఫౌండేషన్ ఫౌండర్ పవన్ అల్లెన అన్నారు. ఆదివారం మెరీడియన్ స్కూల్లో మైల్స్(మెరీడియన్ ఇన్నోవేషన్ లీడర్షిప్ ఎంట్రిప్రిన్యూర్‌షిప్ సమ్మిట్)2025 సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థుల్లో ఉండే సృజనాత్మకతను వెలికితీసేందుకు మైల్స్ సంస్థ ముందుకొచ్చిందని వారి వ్యాపారభివృద్దికి సంబంధించిని ఆలోచనలతో సంయుక్తంగా ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.. ఇందుకోసం టీ హబ్ తరహాలోనే ఆలోచనల విజ్ఞాన కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు.పాఠశాల సీఈవో తేజస్వి బుట్టా మాట్లాడుతూ రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో నగరంలోని 21 పాఠశాలలకు చెందిన 8వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారని వారి వినూత్న ఆలోచనలను, ఆవిష్కరల గురించి ఈ సదస్సులో చర్చించి ప్రదర్శించినట్లు వెల్లడించారు. విద్యార్థుల ఆలోచనలకు, ఆవిష్కరణల కోసం స్టేషన్ ఎం అనే వేదికను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో మెరీడియన్ విద్యాసంస్థల ప్రెసిడెంట్ లలితా నాయుడు, ప్రిన్సిపాల్ కరణం భవాని, కమల్ కృష్ణ, సంధ్య, ఆర్యవీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏం‘బ్యాగు’న్నాయని..
ఇచ్ఛాపురం రూరల్: కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులు విద్యా సంవత్సరం మధ్యలోనే చిరిగిపోతున్నాయి. బ్యాగుల్లో పుస్తకాలు పెట్టుకోవాలంటే ఎక్కడ జారి పడిపోతాయోనని భయపడాల్సి వస్తోందని విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ నెలలో పాఠశాలలు పునః ప్రారంభం కాగా, జూలైలో విద్యార్థులకు ఎనిమిది వస్తువులతో కూడిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లు పేరుతో బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు, బెల్టులు, బూట్లు, రెండు జతల సాక్షులు, యూనిఫాం క్లాత్, డిక్షనరీతో పాటు సంచులు ఇచ్చారు. ఇందులో బూట్లు అందరికీ సరిపడకపోవడంతో ఇచ్చిన బూట్లు ఇంటి వద్దనే విడిచి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన బూట్లు బడికి వేసుకువస్తున్నారు. జిల్లాలో ఉన్న 2,632 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న ఒక లక్షా 59వేల 648 మంది విద్యార్థులకు బ్యాగులు ఇచ్చారు. ఇచ్చి న బ్యాగులు పైన పటారం...లోన లొటారం మాదిరిగా ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇచ్చిన బ్యాగులు నాసిరకంగా ఉండటంతో జిప్‌లు ఊడిపోవడంతో పాటు పైనా, కిందా, తగిలించుకునే కుచ్చుల వద్ద చిరిగిపోతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు పుస్తకాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో వారి బ్యాగులు మూడునాళ్ల ముచ్చటగానే మిగి లిపోతున్నాయి. చిరిగిపోయిన బ్యాగుల్ని సూది దారంతో కుట్టుకుంటూ బడికి వస్తుంటే తోటి విద్యార్థులు హేళన చేస్తున్నారని కొంత మంది విద్యార్థులు వాపోతున్నారు. దీంతో కొత్త బ్యాగులు కొనక తప్పడం లేదు. నాసిరకం బ్యాగులు మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యార్థులకు ఇచ్చిన కిట్‌లో బ్యాగులు పూర్తిగా నాసిరకంగా ఉన్నాయి. విద్యా సంవత్సరం మధ్యలోనే బ్యాగులు చిరిగిపోతున్నాయి. కొంత మంది పేద విద్యార్థులు అవే బ్యాగుల్ని కుట్టుకుంటూ బడికి వెళ్తున్నారు. బ్యాగులు చూసి తోటి విద్యార్థుల హేళనకు గురవుతున్నారు. – బోర పుష్ప, ఎంపీపీ, ఇచ్ఛాపురం -
ఏంబ్యాగున్నాయని..
ఇచ్ఛాపురం రూరల్: చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులు విద్యా సంవత్సరం మధ్యలోనే చిరిగిపోతున్నాయి. బ్యాగుల్లో పుస్తకాలు పెట్టుకోవాలంటే ఎక్కడ జారి పడిపోతాయోనని భయపడాల్సి వస్తోందని విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ నెలలో పాఠశాలలు పునః ప్రారంభం కాగా, జూలైలో విద్యార్థులకు ఎనిమిది వస్తువులతో కూడిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లు పేరుతో బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు, బెల్టులు, బూట్లు, రెండు జతల సాక్షులు, యూనిఫాం క్లాత్, డిక్షనరీతో పాటు సంచులు ఇచ్చారు. ఇందులో బూట్లు అందరికీ సరిపడకపోవడంతో ఇచ్చిన బూట్లు ఇంటి వద్దనే విడిచి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన బూట్లు బడికి వేసుకువస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 2,632 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న ఒక లక్షా 59వేల 648 మంది విద్యార్థులకు బ్యాగులు ఇచ్చారు. ఇచ్చి న బ్యాగులు పైన పటారం...లోన లొటారం మాదిరిగా ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇచ్చిన బ్యాగులు నాసిరకంగా ఉండటంతో జిప్‌లు ఊడిపోవడంతో పాటు పైనా, కిందా, తగిలించుకునే కుచ్చుల వద్ద చిరిగిపోతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు పుస్తకాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో వారి బ్యాగులు మూడునాళ్ల ముచ్చటగానే మిగి లిపోతున్నాయి. చిరిగిపోయిన బ్యాగుల్ని సూది దారంతో కుట్టుకుంటూ బడికి వస్తుంటే తోటి విద్యార్థులు హేళన చేస్తున్నారని కొంత మంది విద్యార్థులు వాపోతున్నారు. దీంతో కొత్త బ్యాగులు కొనక తప్పడం లేదు. నాసిరకం బ్యాగులు మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యార్థులకు ఇచ్చిన కిట్‌లో బ్యాగులు పూర్తిగా నాసిరకంగా ఉన్నాయి. విద్యా సంవత్సరం మధ్యలోనే బ్యాగులు చిరిగిపోతున్నాయి. కొంత మంది పేద విద్యార్థులు అవే బ్యాగుల్ని కుట్టుకుంటూ బడికి వెళ్తున్నారు. బ్యాగులు చూసి తోటి విద్యార్థుల హేళనకు గురవుతున్నారు. – బోర పుష్ప, ఎంపీపీ, ఇచ్ఛాపురం -
సీడీఎస్ఎల్ ఐడియాథాన్‌కి రిజిస్ట్రేషన్లు ప్రారంభం
విద్యార్థుల కోసం తొలిసారిగా రీఇమేజిన్ ఐడియాథాన్ నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఇండియా (సీడీఎస్ఎల్) వెల్లడించింది. మార్కెట్లలో పెట్టుబడుల గురించి తెలుసుకోవడంలోను, ఇన్వెస్ట్ చేయడంపైన అవగాహన పెంచే సొల్యూషన్స్‌ను రూపొందించేలా ప్రోత్సహించేందుకు తమ 3వ వార్షిక రీఇమేజిన్ సింపోజియం కింద దీన్ని చేపట్టినట్లు వివరించింది.ఒక్కో సంస్థ నుంచి నలుగురు విద్యార్థులు, ఒక మెంటార్ కలిసి బృందంగా ఏర్పడి, ఇందులో పాల్గొనవచ్చు. మొత్తం రూ. 11.5 లక్షల ప్రైజ్ మనీ ఉంటుంది. విజేతగా నిల్చే ఐడియాకి రూ. 5 లక్షలు, రన్నర్స్ అప్‌కి రూ. 3 లక్షలు, రూ. 2 లక్షల చొప్పున బహుమతులు ఉంటాయి. గేమిఫికేషన్, డిజైన్, టెక్నాలజీ మొదలైన విభాగాల్లో విద్యార్థులు సొల్యూషన్స్‌ని రూపొందించవచ్చు.స్టాన్‌లో హైదరాబాద్ ఏంజెల్స్ పెట్టుబడులుసోషల్ గేమింగ్ ప్లాట్‌ఫాం స్టాన్‌లో సిరీస్ ఏ కింద 8.5 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్లు హైదరాబాద్ ఏంజెల్స్ ఫండ్ (హెచ్ఏఎఫ్) వెల్లడించింది. (Hyderabad Angels Fund invests in STAN) గేమింగ్, క్రియేటర్ ఎకానమీ విభాగంలో ఇది తమకు తొలి పెట్టుబడి అని వివరించింది. సిరీస్ ఏ కింద స్క్వేర్ ఎనిక్స్, రీజొన్ హోల్డింగ్స్, సోనీ గ్రూప్‌కి చెందిన సోనీ ఇన్నోవేషన్ ఫండ్ మొదలైనవి కూడా ఇన్వెస్ట్ చేసినట్లు పేర్కొంది.పార్థ్ చడ్ఢా, రాహుల్ సింగ్, నౌమాన్ ముల్లా ప్రారంభించిన స్టాన్.. దాదాపు 2.5 కోట్లకు పైగా డౌన్లోడ్స్ ఉన్నాయి. 2023లో హైదరాబాద్ ఏంజెల్స్ నెట్వర్క్ (హెచ్ఏఎన్) విభాగంగా ప్రారంభమైన హెచ్ఏఎఫ్ సుమారు రూ. 100 కోట్ల ఫండ్ ద్వారా ప్రారంభ దశలో, వృద్ధి దశలో ఉన్న అంకురాల్లో పెట్టుబడులు పెడుతోంది. ఒక్కో స్టార్టప్‌లో రూ. 2–4 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. ప్రధానంగా అధిక వృద్ధి అవకాశాలు గల 10–15 సంస్థల్లో పెట్టుబడులు పెట్టడంపై దృష్టి సారించింది. -
300 మందికి పైగా స్కూల్ విద్యార్థులు కిడ్నాప్..
-
కిడ్నాపైన విద్యార్థులు 300 పైమాటే..
అబుజా: నైజీరియాలోని క్రైస్తవ మిషనరీ స్కూలు నుంచి శుక్రవారం వేకువజామున సాయుధులు కిడ్నాప్ చేసిన విద్యార్థుల సంఖ్య 300 పైమాటేనని అధికారులు శనివారం తెలిపారు. నైగర్ రాష్ట్రం పపిరి ప్రాంతంలోని సెయింట్ మేరీ మిషనరీ స్కూలులో 303 మంది విద్యార్థులతోపాటు 12 మంది టీచర్లను కూడా సాయుధులు తీసుకెళ్లారన్నారు. మొదట 215 మంది విద్యార్థులను తీసుకెళ్లారని తాము భావించామని, అయితే, కిడ్నాప్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన మరో 88 మంది విద్యార్థులను కూడా సాయుధులు బలవంతంగా తీసుకెళ్లినట్లు గుర్తించామన్నారు. బాలురతోపాటు బాలికలు కూడా వీరిలో ఉన్నారు. అంతా 10 నుంచి 18 ఏళ్ల ఏళ్లలోపు వారని వివరించారు. పొరుగునే ఉన్న కెబ్బి రాష్ట్రం మాగా పట్టణంలోని ఓ పాఠశాల నుంచి వారం క్రితం 25 మంది పిల్లలను సాయుధులు ఎత్తుకెళ్లడం తెల్సిందే. ఈ కిడ్నాప్ ఘటనలకు బాధ్యులమంటూ ఎవరూ ప్రకటించుకోలేదని అధికారులు తెలిపారు. ప్రభుత్వ హెచ్చరికలను ఖాతరు చేయకుండా తాము స్కూలు ఓపెన్ చేశామంటూ వస్తున్న వార్తలను మిషనరీ అధికారి ఒకరు ఖండించారు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటీసు కూడా అందలేదని స్పష్టం చేశారు. విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయని ఓ అధికారి తెలిపారు. డబ్బు కోసమేనా? ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన నైజీరియాలో సాయుధ గ్రూపులు పేరుతోపాటు డబ్బు కోసం స్కూళ్లను టార్గెట్ చేసుకుంటున్నాయి. సాయుధ ముఠాలు, జిహాద్ గ్రూపులు క్రైస్తవులనే లక్ష్యంగా చేసుకుంటున్నందున ఆ దేశానికి నిధులను నిలిపి వేస్తామంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం గమనార్హం. అయితే, సాయుధులు ఎత్తుకెళ్తున్న పిల్లల్లో క్రైస్తవులతోపాటు ముస్లింలు కూడా ఉంటున్నారు. 2014లో జిహాదీ గ్రూపు బోకో హరామ్ ఓ స్కూలుపై దాడి చేసి 276 మంది బాలికలను అపహరించడం అంతర్జాతీయంగా సంచలనం రేపింది. నాలుగేళ్ల తర్వాత మరో స్కూలు నుంచి 110 మంది బాలికలను ఎత్తుకెళ్లింది. ఆ తర్వాత సంక్షోభం నెలకొన్న రాష్ట్రాల్లో డజను వరకు సాయుధగ్రూపులు పుట్టుకొచ్చాయి. ఇవి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్లను ఎంచుకుని, పిల్లల కిడ్నాప్‌లకు పాల్పడుతున్నాయి. చిబోక్ దాడి అనంతరం దాదాపు 1,500 మంది విద్యార్థులను కిడ్నాప్ చేసిన సాయుధ ముఠాలు, డబ్బు తీసుకుని వీరిలో చాలామందిని వదిలేశాయి. మత విశ్వాసాల కంటే డబ్బుకే ఈ గ్రూపులు ప్రాధాన్యమిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. -
చదవండి.. అర్థం చేసుకోండి..ఎదగండి
విద్యార్థులు ఎదగాలంటే చదవడం.. చదివింది అర్థం చేసుకోవడం అనేది కీలకం. ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానం కూడా ముఖ్యమే. ఈ రెండింటిలో విద్యార్థుల సామర్థ్యాలను పెంచేలా ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చింతకాని మండలంలో పైలెట్ ప్రాజెక్టు మొదలుపెట్టగా, సత్ఫలితాలు రావడంతో.. జిల్లాలోని 958 పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు గల 28,982 మంది విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచేలా గత నెల 27న ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెల రోజులపాటు (ఈ నెల 30వ తేదీవరకు) విద్యార్థులకు అక్షరాలు, పదాలు, వాక్యాలు ఎలా ఉచ్ఛరించాలో చెప్పడమే కాక ఫోనెటిక్ సౌండ్‌తో సహా నేర్పేలా కోర్సును డిజైన్ చేశారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మంప్రాథమిక విద్యార్థుల కోసం... ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ, లోకల్ బాడీ మేనేజ్మెంట్ పరిధిలో 958 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 28,982 మంది విద్యార్థులు ఉండగా, అందరినీ ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ఎవ్రీ చైల్డ్ రీడ్స్ యాప్‌లో నమోదు చేశారు. ప్రతీ విద్యారి్థకి మెటీరియల్ అందించి ఇంగ్లిష్ అక్షరాలు రాయడం, చదవడం నేర్పిస్తున్నారు. పర్యవేక్షణకు యాప్ ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమ పర్యవేక్షణకు యాప్‌ను రూపొందించారు. దీనిని యూడీఐఎస్తో అనుసంధానం చేశారు. దీనికి డేటా ఎంట్రీ అవసరం ఉండదు. విద్యార్థి అభ్యసన సామర్థ్యం ఎలా ఉందన్నది ప్రతీ బుధవారం ఈ యాప్‌లో అప్లోడ్ చేయా లి. ప్రతీ రోజు గంట సేపు చదివే సామర్థ్యంపై అభ్యసన చేయించేందుకు బుక్లెట్ ఇస్తారు. దీని ఆధారంగా ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఇంగ్లిష్ పరిజ్ఞానం పెంచేలా కృషి చేస్తున్నారు.నెలరోజుల్లో పేరాగ్రాఫ్ చదివేలా.. ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానం మెరుగుపరచి, పఠనా సామర్థ్యం పెంపొందిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయులు బోర్డుపై ఇంగ్లిష్ అక్షరాలు, పదాలు, పద్యాలు రాసి ఉచ్ఛారణ, అర్థం వివరిస్తూ విద్యార్థులు తిరిగి చెప్పగలుగుతున్నారా లేదా, అనేది పరిశీలిస్తున్నారు.ధ్వనులను అనుసరించి పదాలను గుర్తించడం నేర్పిస్తున్నారు. నెల తర్వాత ప్రతీ విద్యార్థి కనీసం ఒక పేరాగ్రాఫ్ చదివి అర్థం చేసుకునే స్థాయికి చేర్చేలా కృషి సాగుతోంది. ప్రతిరోజు పాఠశాల సమయాన ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుండడంతో 26,639 విద్యార్థుల్లో పఠనా సామర్థ్యాలు మెరుగయ్యాయి. -
సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు?.. ఉపాసనపై నెటిజన్ల ఫైర్!
మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్ సతీమణిగా..మెగా కోడలిగా మాత్రమే కాకుండా ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రాణిస్తున్నారు. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఇటీవల ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో చిట్‌చాట్ సందర్భంగా ఉపాసన ఓ ప్రశ్న అడిగారు.మీలో ఎంతమందికి పెళ్లి చేసుకోవాలని ఉంది? అని ఐఐటీ విద్యార్థులను ప్రశ్నించగా.. వచ్చిన సమాధానం తనను ఆశ్చర్యపరిచిందంటూ ట్వీట్ చేశారు. ఈ ప్రశ్నకు అమ్మాయిల కంటే యువకులే ఎక్కువమంది చేతులు ఎత్తారని ఉపాసన తెలిపింది. దీంతో మహిళలు కెరీర్‌పై ఎక్కువ దృష్టి సారించినట్లు అనిపించిందని ట్విటర్లో రాసుకొచ్చింది. ఈ పరిణామం చూస్తుంటే సరికొత్త ప్రగతిశీల భారతదేశం అంటూ కితాబిచ్చింది. మీ దార్శనికతను నిర్దేశించుకోండి.. మీ లక్ష్యాలను నిర్వచించుకోండి.. మీ పాత్రను సొంతం చేసుకోండి. మిమ్మల్న ఎవరూ ఆపలేని వ్యక్తిగా మారండి అంటూ యువతను ఉద్దేశించి మాట్లాడింది.అయితే ఉపాసన షేర్ చేసిన వీడియోలో మహిళల గురించి మాట్లాడింది. మీరు మీ కాళ్లపై ఆర్థికంగా నిలబడ్డాకే పిల్లలను ప్లాన్ చేసుకోవాలంటూ సూచించింది. అప్పటి వరకు ఒక్కరూ తమ అండాలను భద్రపరచుకోవాలంటూ ఉపాసన మాట్లాడారు. ఈ రోజు నేను నా సొంత కాళ్లపై నిలబడ్డానని.. నా సంపాదనతో ఆర్థికంగా ఎదిగానని తెలిపింది. ఈ ఆర్థిక భద్రతే నాలో మరింత ఆత్మవిశ్వాసం పెంచిందని..ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా తోడ్పడిందని పేర్కొంది. మీ జీవితంలో 30 ఏళ్లు వచ్చేసరికి కెరీర్లో నిలదొక్కుకోవాలని ఉపాసన వివరించింది. నీ కెరీర్లో విజన్, గోల్ సాధించడంలో సక్సెస్ అయితే మిమ్మల్ని ఇక ఎవరూ ఆపలేరంటూ మాట్లాడింది.అయితే ఉపాసన కామెంట్స్‌ను కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. మీ బిజినెస్ కోసం యువతకు ఇలాంటి సలహాలు ఇస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మీ మాటలతో యువత తప్పుదారి పట్టేలా ప్రోత్సహిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ అపోలో ఫెర్టిలిటీ సెంటర్ ప్రమోట్ కోసం ఇలా చెప్పడం సరికాదని హితవు పలుకుతుకున్నారు. 30 ఏళ్ల తర్వాత పిల్లలను కనాలనే ఆసక్తి అమ్మాయిలకు ఉండదని ఉపాసనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటితో సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.కాగా.. ఉపాసన, రామ్ చరణ్‌కు దాదాపు పెళ్లయిన 12 ఏళ్లకు క్లీంకార జన్మించిన సంగతి తెలిసిందే. ఇటీవలే రెండోసారి ప్రెగ్నెన్సీని ప్రకటించారు. మెగాస్టార్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్‌తో పాటు ఉపాసన సీమంతం వేడుకను కూడా నిర్వహించారు. ఈ జంటకు 2023 జూన్‌లో క్లిన్ కారా (Klinkaara) జన్మించగా.. రెండేళ్ల తర్వాత మరోసారి మరో బిడ్డకు జన్మనివనున్నారు. ఇంతకీ సమాజానికి ఏమని సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు??You are just promoting your apollo ferlity centre that's it..Sorry @upasanakonidelaGaaru, you are misleading the young generations with this message.After 30 women loose intrest to have kids...Kindly spare our younger… pic.twitter.com/1JbRQhudVX— 𝙏𝙧𝙞𝙫𝙚𝙣𝙞 𝙋𝙖𝙖𝙩𝙞𝙡 𝙎🚩త్రివేణి పాటిల్🇮 (@Mani_Karnika06) November 18, 2025 -
కర్ణాటక ప్రభుత్వ ఆవిష్కరణ!
డిజిటల్ యుగంలో కర్ణాటక ప్రభుత్వం భారీ ఆవిష్కరణ చేసింది. అత్యంత చౌకైన ఏఐ పర్సనల్ కంప్యూటర్ను అభివృద్ధి చేసింది. KEO (Knowledge-driven, Economical, Open-source) పేరుతో తయారైన ఈ కంప్యూటర్ డిజిటల్ అంతరాలను తగ్గించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని అంచనా. త్వరలో జరగబోయే టెక్ సదస్సులో ఈ అత్యంత చౌక ఏఐ పీసీని ఆవిష్కరించనున్నట్లు కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి...దేశం ఐటీ రంగంలో దూసుకెళుతున్నప్పటికీ సమాజంలోని అన్ని వర్గాల వారికీ అందుబాటులో లేదు. పర్సనల్ కంప్యూటర్లనే ఉదాహరణగా తీసుకుంటే దేశం మొత్తమ్మీద పీసీలున్న కుటుంబాలు పది-15 శాతానికి మించవని ఇటీవలి జాతీయ కుటుంబ సర్వే చెబుతోంది. పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రతి నాలుగు కుటుంబాల్లో ఒకరికి పీసీ ఉంటే.. పల్లెల్లో ఇది ఐదు నుంచి ఏడు శాతం మించడం లేదు. స్మార్ట్ఫోన్లపైనే ఆధారపడుతున్నారు. ఫలితంగా ఉద్యోగాలతోపాటు అన్ని రంగాల్లోనూ గ్రామీణులు నగర వాసులతో పోటీ పడలేని పరిస్థితి ఏర్పడుతుంది. నగరాల్లోని విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు, విషయ పరిజ్ఞానాన్ని పెంచే ఇతర డిజిటల్ టూల్స్ అందుబాటులో ఉంటున్నాయి. వీటన్నింటినీ అందించే పీసీలు కొనలేక గ్రామీణ విద్యార్థులు వెనుకబడి పోతున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం అభివృద్ధి చేసిన KEO ఏఐ పర్సనల్ కంప్యూటర్‌కు ప్రాధాన్యం ఏర్పడుతోంది. ఈ పీసీలో కృత్రిమ మేథ కోసం ప్రత్యేక కోర్ ఉండటం గమనార్హం. RISC-V ప్రాసెసర్, BUDDH అనే ఆన్-డివైస్ AI ఇంజిన్ ఆధారంగా పనిచేస్తుంది.అత్యంత చౌకైన పీసీగా రూపొందుతున్న దీంట్లో 4జీ కనెక్టివిటీతోపాటు ఈథర్నెట్ కూడా ఉంటుంది. యూఎస్బీ ఏ, యూఎస్బీ-సీ, హెచ్డీఎంఐ పోర్టులు, ఆడియో జాక్‌లు ఉంటాయి. అంతేకాకుండా.. కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌తోపాటు వర్డ్, ఎక్సెల్ వంటి ప్రొడెక్టివిటీ టూల్స్‌ను కూడా ముందుగానే ఏర్పాటు చేసి ఉంచారు. ఏఐ ఇంజిన్ బుధ్ను కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే రూపొందించిన ఆఫ్‌లైన్ సిలబస్‌తో అనుసంధానమై ఉంటుంది. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 15 శాతం లోపు ఇళ్లలో మాత్రమే కంప్యూటర్లు ఉన్నాయని, దాదాపు 60 శాతం విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు, ఇతరత్ర ప్రాజెక్టుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కర్ణాటక ప్రభుత్వ అధికారులు తెలిపారు. దాదాపు 45శాతం పాఠశాలలలో అసలు కంప్యూటర్లే లేవని దీంతో విద్యార్థులు డిజిటల్ సాంకేతికతను అందిపుచ్చుకోవడం లేదన్నాయి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని తక్కువ ఖర్చులో కంప్యూటర్ను అందించడానికి KEONICS సాయం తీసుకున్నట్లు వివరించారు.ఇది కేవలం విద్యార్థులకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకు ఉపయోగపడుతుందని తెలిపారు. -
టీచర్ల 'టెట్'త్తరపాటు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ ప్రభుత్వ టీచర్లలో గుబులు పుట్టిస్తోంది. విద్యార్థులకు పాఠాలు చెప్పి, పరీక్షలు నిర్వహించే టీచర్లు తాము పరీక్ష రాయాలంటే భయపడుతున్నారు. సర్వీస్‌లో ఉన్న టీచర్లు కూడా టెట్ రాయాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45 వేలకుపైగా ఉపాధ్యాయులకు టెట్ అర్హత లేదు. మరో ఐదేళ్లలో రిటైర్ అవుతున్న వారికి మాత్రం టెట్ నుంచి మినహాయింపు ఇచ్చారు. సాధారణంగా టెట్ పరీక్షలో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంటుంది. తాజాగా బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థుల్లోనే తక్కువగా పాసవుతున్నారు. అలాంటిది టీచర్లు దశాబ్దాల క్రితం సర్వీస్‌లో చేరారు. అప్పటి సిలబస్ వేరు. ఇప్పుడున్నది వేరు. విద్యా విధానంలోనే అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా విద్యార్థుల సైకాలజీ, నవీన విద్యావిధానం నుంచి టెట్‌లో ప్రశ్నలు ఇస్తారు. వీటిపై ఇన్ సర్వీస్‌లో ఉన్న టీచర్లకు అవగాహన తక్కువే. అదీగాక సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్న వ్యక్తి కేవలం తన సబ్జెక్టుపైనే దృష్టి పెడతాడు. గణితం కూడా టెట్ సిలబస్‌లో ఉంటుంది. దీంతో ఇతర సబ్జెక్టులు రాయడం ఇబ్బందిగా ఉంటుందని చెబుతున్నారు. మారిన సిలబస్, బోధన విధానాలకు అనుగుణంగానే కొన్నేళ్లుగా ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తున్నారు. కొత్తగా టెట్‌కు సన్నద్ధం అవుతున్న యువతకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. ప్రశ్నలను వెతుక్కుని తేలికగా ప్రిపేర్ అవుతారు. సర్వీస్ టీచర్లకు ఈ అవకాశం తక్కువ. ఇవన్నీ సర్వీస్ టీచర్లలో వణుకు పుట్టిస్తున్నాయి. టీచర్లకే ట్యూషన్లు: టెట్ కోసం అనేక మంది టీచర్లు సెలవులు పెట్టారు. తాము పాఠాలు చెప్పిన విద్యార్థుల వద్దే పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి. కొడుకు, కూతుర్ని బతిమిలాడి మరీ ఆన్లైన్లో సిలబస్ వెతుక్కోవాల్సి వస్తోంది. టెట్‌ను దృష్టిలో ఉంచుకుని కొన్ని కోచింగ్ కేంద్రాలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. వీటికి విధిగా హాజరవుతున్నారు. చాలామంది టీచర్లకు ఆంగ్లభాషపై పట్టులేదు. ఆన్లైన్ మెటీరియల్స్, తరగతులు ఆంగ్ల భాషలో ఉంటున్నాయి. వీటిని అర్థం చేసుకోవాలంటే కష్టంగా ఉందని చెబుతున్నారు. ⇒ వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎస్జీటీ పదేళ్ల క్రితం ప్రాథమిక విద్య బోధించిన విద్యార్థి చేత టెట్ క్లాసులు చెప్పించుకుంటున్నారు. గురువు మీద గౌరవంతో రోజూ ఇంటికి వచ్చి మరీ ఆన్లైన్ మెటీరియల్స్‌పై అవగాహన కల్పిస్తున్నాడు. ⇒ ఖమ్మంకు చెందిన ఓ టీచర్ టెట్ కోసం నెల రోజులు సెలవు పెట్టారు. హైదరాబాద్‌లో ఉన్న తన సన్నిహితుడి కొడుకు కోచింగ్ సెంటర్ నడుపుతుండటంతో అతని ద్వారా కోచింగ్ టీసుకుంటున్నారు. కోచింగ్ ఇచ్చే వ్యక్తి ఇంటికే ఈ టీచర్ వెళ్లాల్సి వస్తోంది. ⇒ సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్న వికారాబాద్‌కు చెందిన ఓ టీచర్ మేథ్స్‌పై కోచింగ్ తీసుకోవాల్సి వస్తోంది. ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటున్నా, అర్థం కావడం లేదని చెప్పారు. పీడీఎఫ్ మెటీరియల్ కోసం అనేక చోట్ల గాలించగా.. తీరా అన్ని రకాలు దొరకడంతో పరీక్షకు ఏవి ఉపయోగపడతాయో తెలియని గందరగోళంలో ఉన్నారు. నేతలపై పెరుగుతున్న ఒత్తిడి కొన్నేళ్ల క్రితమే కేంద్రం టెట్‌ను తప్పనిసరి చేసింది. అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వాలు టెట్ మినహాయింపు తేవడంలో విజయవంతమయ్యాయి. ఈ ఘనతను ఉపాధ్యాయ సంఘాలు తమ ఖాతాల్లో వేసుకున్నాయి. ఈసారి కూడా టెట్ నుంచి సర్వీస్ టీచర్లకు మినహాయింపు వచ్చేలా చేస్తామని, అవసరమైతే విద్యాహక్కు చట్టం మార్పుకైనా పోరాడతామని టీచర్స్ ఎమ్మెల్సీలు ప్రకటించారు. తీరా నోటిఫికేషన్ విడుదలవ్వడంతో టీచర్లకు పాలుపోని పరిస్థితి. దీంతో సంఘాల నేతలపై టీచర్లు ఒత్తిడి తెస్తున్నారు. అందరితో కాకుండా తమకు డిపార్ట్మెంట్ పరీక్షల మాదిరి నిర్వహించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఇది ఉపాధ్యాయ సంఘాలకూ సవాల్‌గా మారింది. టీచర్లను ఇబ్బంది పెడితే సహించం: పింగిలి శ్రీపాల్ రెడ్డి (టీచర్స్ ఎమ్మెల్సీ) టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వమే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది. ఇదే ప్రభుత్వం ఇప్పుడు టెట్ జీవోను సవరించి నోటిఫికేషన్ ఇచ్చింది. కోర్టు తీర్పు వెలువడకుండా ప్రభుత్వం తొందరపడటం, నోటిఫికేషన్ ఇవ్వడంలో అధికారుల వైఫల్యం, తొందరపాటు చర్య ఉంది. టెట్ పేరుతో టీచర్లను ఇబ్బంది పెడితే సహించం. ప్రభుత్వ నిర్ణయం మేరకే : డాక్టర్ నవీన్ నికోలస్ (పాఠశాల విద్య డైరెక్టర్) ఇన్‌సర్వీస్ టీచర్లు టెట్ రాయాలా? వద్దా? అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. మినహాయింపు ఇస్తామని చెబితే టీచర్లు రాయాల్సిన అవసరం ఉండదు. దీనిపై ప్రభుత్వ నిర్ణయం వెలువడలేదు కాబట్టే మేం టెట్ నోటిఫికేషన్ ఇచ్చాం. మినహాయింపు కోసం న్యాయస్థానంలోనూ వాదనలు వినిస్తున్నాం. ఇన్నాళ్లు అవసరం లేదని...: చావా రవి (టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు) గత 15 ఏళ్లుగా సర్వీస్ టీచర్లకు టెట్ అవసరం లేదని ప్రభుత్వాలే చెప్పాయి. సుప్రీంకోర్టు చెప్పిందని ఇప్పుడు టెట్ రాయాలననడం ఏం న్యాయం? కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 2011కు ముందున్న టీచర్లకు టెట్ అవసరం లేదనే నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాస్తవ పరిస్థితులను బలంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి సర్వీస్ టీచర్లకు న్యాయం చేయాలి. న్యాయ పోరాటం కొలిక్కి వచ్చేనా?సెకండరీ స్కూల్ టీచర్లు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా పనిచేస్తున్న టీచర్లు టెట్ పేపర్–1 రాయాలి. వీరికి ప్రాథమిక పాఠశాల స్థాయి బోధనాంశాలే సిలబస్‌లో ఇస్తారు. బీఈడీ పూర్తి చేసి ఎస్జీటీలుగా పనిచేసే వారికీ టెట్ రాసే అవకాశం ఉంది. స్కూల్ అసిస్టెంటు, జీహెచ్ఎంలుగా పనిచేస్తున్న వారు పేపర్–2 రాయాలి. సైన్స్ టీచర్లకు గణితం, గణితం ఉపాధ్యాయులకు సైన్స్ పాఠ్యాంశాలుగా ఉంటాయి. మిగతా వాళ్లంతా వారి సబ్జెక్టులకు అనుగుణంగానే పరీక్ష రాయాల్సి ఉంటుంది. అయితే, టెట్ మినహాయింపు కోసం ఉపాధ్యాయ సంఘాలు, ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తున్నా కొలిక్కివచ్చేట్టు లేదు. ఈలోగానే టెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ నెల 29 వరకూ టెట్‌కు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. జనవరి 3 నుంచి 31 వరకూ ఆన్లైన్ విధానంలో పరీక్ష జరుగుతుంది. -
స్టూడెంట్స్ చస్తున్నా.. నో యాక్షన్.. నో రియాక్షన్
-
29 మంది గిరిజన విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, పాడేరు : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గూడెంకొత్తవీధి మండలం మారుమూల జర్రెల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో బుధవారం దుంపల కూర, పెరుగు తిన్న 29 మంది గిరిజన విద్యార్థులు కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరికి గురువారం ఉదయాన్నే నిద్రలేచిన కొద్దిసేపటి తరువాత ఒక్కసారిగా కడుపునొప్పి మొదలైంది. దీంతో.. పాఠశాలకు ఎదురుగా ఉన్న జర్రెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సకాలంలో వైద్యసేవలు అందించడంతో ప్రమాదం తప్పింది. మధ్యాహ్ననికి 26 మంది కోలుకోవడంతో వారు పాఠశాలకు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ, అరుణ్‌కుమార్ (10వ తరగతి), శామ్యూల్ (5వ తరగతి), కె. రవి (3వ తరగతి)కి బీపీ అధికంగా ఉండడంతో పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన వైద్యం నిమిత్తం ఈ ముగ్గుర్నీ చింతపల్లి కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. ఈ పాఠశాలలో మొత్తం 240 మంది గిరిజన విద్యార్థులు ఉన్నారు. కలుషిత పెరుగే కారణమా!?..ఈ ఆశ్రమ పాఠశాలకు పెరుగు సరఫరా లేకపోవడంతో నిర్వాహకులు పాలను తోడుపెడుతున్నారు. కానీ, పాలు తోడుకోలేదని బుధవారం మధ్యాహ్నం ఎండలో పెట్టడంతో పెరుగు కలుషితమై ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న చింతపల్లి సహాయ గిరిజన సంక్షేమాధికారి జయనాగలక్ష్మి ఉదయాన్నే జర్రెల ఆశ్రమ పాఠశాల, ఆస్పత్రిని సందర్శించి బాధిత విద్యార్థులను పరామర్శించి ఘటనపై విచారణ జరిపారు. పెరుగు కలుషితంపై వివరాలు సేకరించారు. అలాగే, ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని సీఐటీయూ నేత చిలకల రవికుమార్, ఏబీవీపీ నేత తిరుపల్లి యోగిలు గురువారం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన ఆహారం ఇవ్వకపోవడంవల్లే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని వారు ఆరోపించారు.శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తతదళిత విద్యార్థి ఆత్మహత్యతో ఆందోళనకు దిగిన 3 వేల మంది విద్యార్థులు తమ కుమారుణ్ని అన్యాయంగా చంపేశారంటూ తల్లిదండ్రుల ఆవేదన8 మంది విద్యార్థులను సస్పెండ్ చేసిన డైరెక్టర్ శ్రీకాకుళం క్రైమ్: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురంలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో బుధవారం దళిత విద్యార్థి ప్రత్తిపాటి సృజన్ ఆత్మహత్య ఘటనతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గుంటూరుకు చెందిన సృజన్‌కు మద్దతుగా కళాశాలలోని 3 వేల మంది విద్యార్థులు గురువారం ఉదయం ధర్నాకు దిగారు. యాజమాన్యం తీరుపై నిరసన గళం వినిపించారు. సృజన్ ఆత్మహత్య చేసుకునేలా సీనియర్లు ప్రవర్తించారని, బుధవారం రాత్రి 11 గంటల నుంచి 3 గంటల వరకు చిత్రహింసలకు గురిచేశారని మండిపడ్డారు. బ్యాక్‌లాగ్స్ ఉంచేశాడని, సరిగా చదవడని ఒత్తిడితోనే చనిపోయాడంటూ యాజమాన్యం చెప్పడం దుర్మార్గమన్నారు. తమ బిడ్డను అన్యాయంగా నాలుగు గంటలపాటు కొట్టి చంపేశారని, అనంతరం ఫ్యాన్‌కు వేలాడదీశారని, సమాచారం కూడా ఆలస్యంగా ఇచ్చారని సృజన్ తల్లిదండ్రులు వాపోయారు. ఎస్ఎఫ్ఐ సభ్యులు సైతం కళాశాల డైరెక్టర్ కె.వి.జి.డి.బాలాజీ, రిజిస్ట్రార్ అమరేంద్రలతో వాగ్వాదానికి దిగారు. చివరికి శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 9 మంది విద్యార్థుల్లో 8 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనంతరం క్యాంపస్ డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు 8 మందిని సస్పెండ్ చేశారు.భోజనం సరిగా పెట్టడం లేదువారానికి ఆరు సార్లకు బదులుగా రెండు సార్లే గుడ్లు ఇస్తున్నారు ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యురాలికి విద్యార్థుల ఫిర్యాదు మార్కాపురం టౌన్: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని నాగులవరం రోడ్డులో ఉన్న ఎస్టీ హాస్టల్లో విద్యార్థులకు ఆహారాన్ని మెనూ ప్రకారం అందించడం లేదని ఏపీ ఫుడ్ కమిషన్ మెంబర్ గంజిమాల దేవి ఎదుట విద్యారి్థనులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆమె హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి హాస్టల్లో సౌకర్యాలు, మెనూ అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ వారానికి ఆరు సార్లు కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉండగా, రెండుసార్లు మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. సాయంత్రం పండ్లు ఇవ్వడం లేదని, 301 మంది విద్యార్థినులు ఉండగా, రెండు లీటర్ల పాలు మాత్రమే ఇస్తున్నారని, తాగునీరు సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15 మంది పిల్లలతో చపాతీలు తయారు చేయిస్తున్నారని, అన్నం కూడా సరిగ్గా పెట్టడం లేదని, మళ్లీ అన్నం కోసం వెళితే తిడుతున్నారని తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన ఫుడ్ కమిషన్ సభ్యురాలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్‌ను విధుల నుంచి తొలగించేలా ఉన్నతాధికారులకు నివేదిక పంపాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారిని ఆదేశించారు. అలాగే వంట సిబ్బందిని కూడా తొలగించాలన్నారు. విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించనని, కమిషన్ తరఫున కూడా సుమోటోగా తీసుకుంటామని తెలిపారు. -
ప్రీమియా అకాడమీకి స్టూడెంట్ లీడర్షిప్ ఎక్స్‌లెన్స్ అవార్డు
హైదరాబాద్, నవంబర్ 12 : హైదరాబాద్‌లోని ప్రముఖ అంతర్జాతీయ పాఠశాల ప్రీమియా అకాడమీ, ప్రతిష్టాత్మకమైన ఎడ్యుకేషన్ వరల్డ్ ఇండియా స్కూల్ ర్యాంకింగ్స్ 2025–26లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.విద్యార్థి నాయకత్వం & నైపుణ్య అభివృద్ధి” విభాగంలో భారతదేశంలో 4వ స్థానాన్ని, తెలంగాణ హైదరాబాద్ రెండింటిలోనూ 3వ స్థానాన్ని సాధించింది. దేశంలో అత్యంత సమగ్రమైన పాఠశాల మూల్యాంకనంగా పరిగణించే ఎడ్యుకేషన్ వరల్డ్ ర్యాంకింగ్‌లు, 14 పారామితులను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్‌లను అందిస్తుంది.ఈ అవార్డు గొప్ప మనస్సులను మాత్రమే కాకుండా, దయగల హృదయాలను, ప్రగతిశీల ఆలోచనాపరులను నిర్మించాలనే ప్రీమియా లక్ష్యానికి నిదర్శనమని వ్యవస్థాపకురాలు & మేనేజింగ్ డైరెక్టర్ సిందూరి రెడ్డి అన్నారు. ఈ ర్యాంకింగ్ తమకు గర్వకారణమన్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై.. కోటి గళాల గర్జన
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, కక్షపూరిత వైఖరి, ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న ర్యాలీల్లో కదం తొక్కేందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సిద్ధమయ్యారు. ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజాసంఘాలు, సామాజికవేత్తలు కోటి గొంతుకలతో సింహగర్జన చేయనున్నారు. ప్రభుత్వ రంగంలోనే కొత్త మెడికల్ కాలేజీలు నిర్వహించాలనే డిమాండ్‌తో చంద్రబాబు సర్కార్‌పై సమరభేరి మోగించనున్నారు. వైఎస్సార్సీపీ నేతలు గత నెల రోజులుగా ఊరూరా రచ్చబండ నిర్వహిస్తూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్య తరగతి రోగులు, విద్యార్థులకు కలిగే నష్టాలు, ప్రైవేటీకరణ ముసుగులో చంద్రబాబు సర్కారు అవినీతిని ప్రజలకు లోతుగా వివరించారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి రాగానే ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తూ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం.. నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో రోగులకు సేవలు నిలిచిపోవడం.. ఆరోగ్యశ్రీ, ఆసరా కింద ఏకంగా రూ.4 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టడం.. చరిత్రలో తొలిసారి ప్రైవేట్ డాక్టర్లు రోడ్డెక్కి ఆందోళనకు దిగడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ రంగంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పేదలకు చేరువలో నాణ్యమైన వైద్యంతోపాటు మన విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సగం మెడికల్ సీట్లు ఉచితంగా, మిగిలినవి కూడా ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే అతి తక్కువ ఫీజులతో అందుబాటులోకి వచ్చే అవకాశాన్ని చంద్రబాబు సర్కారు కాలదన్నుకోవడంపై మండిపడుతున్నారు. కొత్త మెడికల్ కాలేజీలపై చంద్రబాబు సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో సంతకాలు చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు పోటీపడుతున్నారు. కోటి సంతకాల సేకరణ మహోద్యమంగా రూపాంతరం చెందుతుండటం చంద్రబాబు సర్కార్‌కు వణుకు పుట్టిస్తోంది. నేడు వైఎస్సార్సీపీ నిర్వహించే ర్యాలీలలో అన్ని వర్గాల ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరభేరి మోగించనున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న ప్రభుత్వ పెద్దలు యధావిధిగా అధికార దుర్వినియోగానికి తెరతీశారు. నిరసన ర్యాలీల్లో పాల్గొనకూడదని.. కేసులు పెడతామంటూ వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. పోలీసుల నోటీసులు.. బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని.. నిరసన ర్యాలీల్లో విద్యార్థులు, తల్లితండ్రులు, మేధావులు, ప్రజాసంఘాలతో కలిసి కదంతొక్కి, గళం విప్పుతామని వైఎస్సార్సీపీ నేతలు తేల్చి చెబుతున్నారు. 14 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ కట్టని చంద్రబాబు.. రాష్ట్రంలో 1923 నుంచి 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. పద్మావతి అటానమస్ మెడికల్ కాలేజీతో కలిపితే 12 ఉన్నాయి. 2019 నాటికి చంద్రబాబు మూడుసార్లు అంటే 1995–99, 1999–2004, 2014–19 మధ్య 14 ఏళ్లు సీఎంగా పాలించారు. ఆయన హయాంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా కట్టలేదు. కనీసం కొత్తగా ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా చేయలేదు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలను పునర్విభజించి 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ప్రజలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడంతోపాటు మన విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో కాలేజీకి కనీసం 50 ఎకరాల స్థలం ఉండేలా భూమిని కేటాయించారు. ఒక్కో మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లకుపైగా కేటాయించి అన్ని రకాల సదుపాయాలు ఉండేలా క్యాంపస్‌ల అభివృద్ధి పనులు ప్రారంభించారు. కోవిడ్ రెండేళ్లపాటు రాష్ట్రాన్ని పీడించినా, ఎన్ని ఇబ్బందులున్నా ఎక్కడా వెనక్కి తగ్గకుండా మెడికల్ కాలేజీలను పూర్తి చేయాలనే ధృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేశారు. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను 2023–24లోనే ప్రారంభించి తరగతులు కూడా మొదలుపెట్టారు. ఎన్నికల నాటికి పాడేరు, పులివెందుల కాలేజీలు కూడా సిద్ధమయ్యాయి. ఎన్నికల తర్వాత పాడేరులో అడ్మిషన్లు ముగిసి తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. కక్షసాధింపు చర్యలకు పరాకాష్ట.. గత ఏడాది అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కొత్త మెడికల్ కాలేజీలను తన అనుయాయులకు కట్టబెట్టాలని నిర్ణయించారు. పులివెందుల మెడికల్ కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గతేడాది అనుమతులు ఇచ్చింది. కానీ.. ఆ సీట్లు మాకు వద్దంటూ ఎన్ఎంసీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. సీఎం చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి అవసరమైన నిధులను అప్పట్లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమీకరించింది. ఆ నిధులను సది్వనియోగం చేసుకుని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం చంద్రబాబు సర్కారు చర్యలు చేపట్టి ఉంటే.. 2024–25 విద్యా సంవత్సరంలో ఆదోని, మదనపల్లి, మార్కాపురం మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చేవి. ఈ విద్యా సంవత్సరం అంటే 2025–26లో అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు, పెనుకొండ కూడా ప్రారంభం అయ్యేవి.బుధవారం ర్యాలీ నిర్వహించకూడదంటూ నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్‌కు నోటీసు ఇస్తున్న పోలీసు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు 2,360 మాత్రమే ఉండేవి. కొత్త మెడికల్ కాలేజీల ద్వారా అదనంగా మరో 2,550 సీట్లు పెరిగి.. మొత్తమ్మీద 4,910 సీట్లు అందుబాటులోకి వచ్చేవి. ఎక్కడ వైఎస్ జగన్‌కు క్రెడిట్ వస్తుందోనని ఏకంగా ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను సీఎం చంద్రబాబు దెబ్బతీస్తున్నారని మేధావులు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. 17 నెలల్లో రూ.2.36 లక్షల కోట్ల అప్పు.. మెడికల్ కాలేజీలకు మాత్రం డబ్బుల్లేవట.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 17 నెలల్లోనే రూ.2.36 లక్షల కోట్లు అప్పులు చేసింది. మిగిలిన కొత్త మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు వ్యయం చేస్తే చాలు! ఆ రూ.5 వేల కోట్లను సైతం నాబార్డు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, వివిధ రూపాల్లో సమీకరించేందుకు అప్పట్లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ నిధులతో మిగిలిన ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను పూర్తి చేయవచ్చు. అయితే కొత్త మెడికల్ కాలేజీలను పప్పు బెల్లాలకు బినామీలు, అస్మదీయులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కారు పీపీపీ కుట్ర పన్నింది. ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన వైఎస్ జగన్రూ.లక్ష కోట్ల విలువైన సంపద లాంటి కొత్త మెడికల్ కాలేజీలను బినామీలకు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమవడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సమరభేరి మోగించారు. ఉద్యమ కార్యచరణ ప్రకటించారు. ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఊరూరా రచ్చబండ నిర్వహించి.. కోటి మంది ప్రజలతో సంతకాలు సేకరించాలని, వాటిని గవర్నర్‌కు అందజేద్దామని పిలుపునిచ్చారు. గత నెల 10న రచ్చబండ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ ప్రారంభించింది. ఊరూవాడా రచ్చబండ నిర్వహిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్వాకాలను వైఎస్సార్సీపీ నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. వాటిని ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో సంతకాలు చేసేందుకు అన్ని వర్గాల ప్రజలూ పెద్ద ఎత్తున వస్తున్నారు. కోటి సంతకాల సేకరణ మహోద్యమంగా మారింది. వైఎస్ జగన్ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా 175 నియోజకవర్గాల్లో బుధవారం వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలు నిర్వహిస్తోంది. కుప్పంలో ర్యాలీకి అనుమతి లేదుసాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం వైఎస్సార్సీపీ చేపట్టనున్న నిరసన ర్యాలీకి చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు తిరుపతి, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు. ఇందుకు అనుమతులు కోరుతూ ఆయా నియోజకవర్గ సమన్వయకర్తలు పోలీసులకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అదేవిధంగా మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరులో కేవలం 20 మందితో ర్యాలీ నిర్వహించుకోవాలని పోలీసులు హుకుం జారీ చేశారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి గళాల రణభేరి
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న కక్షపూరిత విధానాలు, ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ బుధవారం తలపెట్టిన నిరసన ర్యాలీలలో కదం తొక్కేందుకు పార్టీలకు అతీతంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, మేథావులు సామాజిక కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే నిరసన ర్యాలీల్లో పాల్గొనేందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా కదలి వస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా 2019లో వైఎస్ జగన్ అధికారం చేపట్టాక ఒకేసారి ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో 5 మెడికల్ కళాశాలలను 2023–24లో గత ప్రభుత్వంలోనే ప్రారంభించారు. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లను మాజీ సీఎం వైఎస్ జగన్ మన విద్యార్థులకు అదనంగా సమకూర్చారు. ప్రజలకు చేరువలో మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వాస్పత్రులను బోధనాస్పత్రులుగా బలోపేతం చేశారు. అనంతరం గతేడాది చంద్రబాబు గద్దెనెక్కడంతో వైద్య కళాశాలలకు గ్రహణం పట్టుకుంది. 50 సీట్లతో పాడేరులో మెడికల్ కాలేజీ ఎట్టకేలకు ప్రారంభమైనా వంద సీట్లకు కోత పడింది. ఇక పులివెందుల వైద్యకళాశాలకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చినప్పటికీ, తమకు వద్దంటూ చంద్రబాబు సర్కారు అడ్డుపడి లేఖ రాసింది. చంద్రబాబు కక్షపూరిత విధానాలతో రెండేళ్లలో రాష్ట్రం ఏకంగా 2,450 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయింది. రూ. లక్ష కోట్ల విలువైన సంపద లాంటి ప్రజల ఆస్తులను పచ్చ కార్పొరేట్ గద్దలకు దోచిపెట్టడం కోసం చంద్రబాబు పీపీపీ కుట్రలు పన్నారు. ఏకంగా 10 కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని నిర్ణయించారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఉద్యమ కార్యచరణ రూపొందించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంగా నానాటికి ఉధృతం అవుతోంది. నిజానికి కేవలం రూ.ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తే 10 కొత్త వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలోనే పూర్తై అందుబాటులోకి వస్తాయి. కేవలం 17 నెలల్లోనే చంద్రబాబు సర్కార్ రూ.2.50 లక్షల కోట్ల అప్పులు చేసింది. అందులో కేవలం రూ. ఐదు వేల కోట్లను ఈ మెడికల్ కాలేజీల కోసం ఖర్చు చేయడానికి చంద్రబాబుకు మనసు రాకపోవడంపై ప్రజల్లో ఆగ్రహాగ్ని పెల్లుబుకుతోంది. తెలంగాణలో భవనాల్లేకపోయినా.. 2025–26 విద్యా సంవత్సరంలో తెలంగాణలో కొడంగల్ వైద్య కళాశాలకు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) 50 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసింది. ఈ వైద్య కళాశాల, బోధనాస్పత్రికి శాశ్వత భవనాలను అక్కడి ప్రభుత్వం ఇప్పటి వరకూ నిర్మించకపోయినా కొడంగల్‌కు 15 కి.మీ దూరంలో ఉండే తాండూర్ ప్రభుత్వాస్పత్రిని బోధనాస్పత్రిగా, నర్సింగ్ కళాశాల భవనాలను తాత్కాలిక తరగతి గదులుగా చూపించి ఎన్ఎంసీ నుంచి అనుమతులు రాబట్టారు. అలాగే గతేడాది తెలంగాణలోని మహేశ్వరం వైద్య కళాశాలకు ఎన్ఎంసీ 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేసింది. కళాశాల, బోధనాస్పత్రి శాశ్వత నిర్మాణాలు అందుబాటులోకి వచ్చే వరకూ తాత్కాలిక భవనాల్లోనే అకడమిక్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. జగన్ చొరవతో సకల వసతులతో భవనాలు నిర్మించినా.. వైఎస్ జగన్ ప్రభుత్వం 2024–25 విద్యా సంవత్సరంలో ఐదు కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంది. పులివెందుల వైద్య కళాశాల, బోధనాస్పత్రిని నిర్మించి ప్రారంభించారు. మార్కాపురం, మదనపల్లె, ఆదోని కళాశాలల్లో తొలి ఏడాది తరగతులు ప్రారంభించడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల అనంతరం గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం ఈ కళాశాలలు ప్రారంభించకుండా అడ్డుపడింది. రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించాల్సి ఉండగా 2025–26 విద్యా సంవత్సరంలో ఒక్క కళాశాలకు కూడా అనుమతుల కోసం దరఖాస్తు చేయలేదు. మెరుగైన మార్కులు సాధించినా నిరాశే.. తెలంగాణలో తాత్కాలిక వసతులతోనే వైద్య కళాశాలలను ప్రారంభిస్తూ రెండేళ్లలో తొమ్మిది కొత్త మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తేగా.. ఏపీలో మాత్రం చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గ విధానాలతో రెండేళ్లలో 2,450 ఎంబీబీఎస్ సీట్లను మన విద్యార్థులు నష్టపోయారు. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడం కోసం విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు సర్కారు చెలగాటం ఆడింది. 2025–26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ ప్రభుత్వ కోటా మూడో రౌండ్ కౌన్సెలింగ్ ముగిశాక తెలంగాణలో నీట్ యూజీ–2025లో 403 స్కోర్‌తో రెండు లక్షలకు పైబడి ఆలిండియా ర్యాంక్ సాధించిన విద్యార్థికి ప్రభుత్వ కోటా సీటు దక్కింది. ఇదే కేటగిరీలో ఏపీలో ఎస్వీయూ రీజియన్‌లో 471, ఏయూలో 487 స్కోర్ వద్దే ప్రభుత్వ కోటా సీట్ల కేటాయింపు ఆగిపోయింది. ఈ లెక్కన ఓపెన్ కేటగిరీలో తెలంగాణాతో పోలిస్తే 84 మార్కులు అధికంగా సాధించినప్పటికీ ఏపీ విద్యార్థులకు ప్రభుత్వ కోటా సీటు దక్కలేదు. బీసీ కోటాలో 120కిపైగా ఎక్కువ మార్కులున్నా.. కొత్త కళాశాలల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ విధానాన్ని వంద రోజుల్లో రద్దు చేసి మెరిట్ విద్యార్థులకు సీట్లన్నీ కేటాయిస్తామనే వాగ్దానాలతో గద్దెనెక్కిన టీడీపీ కూటమి సర్కారు విద్యార్థులకు వెన్నుపోటు పొడిచింది. ఏకంగా 10 వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టాలని నిర్ణయించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం కళాశాలలను ప్రభుత్వ రంగంలో ప్రారంభించకుండా బీసీ, ఎస్సీ లాంటి రిజర్వేషన్ వర్గాలకూ తీరని ద్రోహం తలపెట్టింది. కొత్తగా సీట్లు రాష్ట్రంలో పెరగకపోవడంతో తెలంగాణ విద్యార్థుల కంటే 120 మార్కులకు పైగా ఎక్కువ స్కోర్ చేసినా మన విద్యార్థులకు ఏపీలో ప్రభుత్వ కోటా సీట్లు దక్కలేదు. తెలంగాణాలో బీసీ–ఏ విభాగంలో 338 స్కోర్ చేసిన వారికి ప్రభుత్వ కోటాలో మెడికల్ సీట్ రాగా, ఏపీలో ఏయూలో 461, ఎస్వీయూలో 443 స్కోర్ల వరకే సీట్లు వచ్చాయి. అంటే 105–123 మార్కులు అదనంగా కటాఫ్ ఉంది. మిగిలిన రిజర్వేషన్ విభాగాల్లోనూ తెలంగాణాలో కంటే ఏపీలో కటాఫ్‌లు 50 నుంచి వంద మార్కుల మేర అధికంగానే ఉన్నాయి. దీంతో పిల్లలను యాజమాన్య కోటా కింద రూ. లక్షలు ఖర్చు చేసి చదివించలేని నిరుపేద, మధ్యతరగతి తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. ధైర్యం చేసి లాంగ్ టర్మ్ కోచింగ్‌కు పంపినా వచ్చే ఏడాదైనా రాష్ట్రంలో సీట్లు పెరుగుతాయనే నమ్మకం లేదని నిస్పృహ వ్యక్తం చేస్తున్నారు. 2,450 మంది వైద్య విద్యకు దూరం వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టగా వాటిలో ఐదు కాలేజీలను 2023–24లోనే ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూర్చారు. గత ప్రభుత్వ కృషితో పులివెందులకు 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరైనా చంద్రబాబు అడ్డుకుని రద్దు చేయించారు. గత విద్యా సంవత్సరం 700 మెడికల్ సీట్లు రాష్ట్రానికి అదనంగా సమకూరకుండా అడ్డుకున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో మరో 7 కొత్త వైద్య కళాశాలలు కూడా ప్రారంభమై మొత్తం 1,750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రావాల్సి ఉండగా వాటిని రాబట్టకపోగా ప్రైవేట్‌పరం చేస్తున్నారు. రెండేళ్లలో 2,450 మంది విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసిన ప్రభుత్వం వారి కలలను ఛిద్రం చేసింది. చేరువలో వైద్య విద్య.. కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుతో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరుగుతుంది. దీనివల్ల ఎక్కువ మంది వైద్య విద్య చదువుకునేందుకు ఆస్కారం ఉంటుంది. సామాన్య, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు సైతం చేరువలో వైద్య విద్య అభ్యసించే అవకాశం కలుగుతుంది. – కె.లహిత, వైద్య విద్యార్థి, ప్రభుత్వ వైద్య కళాశాల, విజయనగరం ఉచితంగా మెరుగైన వైద్యం ప్రభుత్వ వైద్య కళాశాలలు ఎక్కువగా ఏర్పాటైతే ఆ ప్రాంత ప్రజలకు చేరువలో మెరుగైన వైద్య సేవలందుతాయి. న్యూరో మెడిసిన్, న్యూరో సర్జరీ, పల్మనాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ లాంటి సూపర్ స్పెషాలిటీ సేవలు ఉచితంగా లభిస్తాయి. వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. – బి.రతుల్రామ్, వైద్యవిద్యార్థి, ప్రభుత్వ వైద్య కళాశాల, విజయనగరం -
పదో తరగతి పరీక్ష ఫీజుల షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల (ఎస్ఎస్సీ–2026) ఫీజు చెల్లింపునకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. అన్ని పాఠశాలలు రెగ్యులర్, ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థుల పరీక్ష ఫీజును ఈనెల 13 నుంచి వచ్చేనెల 15వ తేదీ వరకు చెల్లించవచ్చని పరీక్షల డైరెక్టర్ కేవీ శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. రూ.50 ఆలస్య రుసుంతో డిసెంబర్ 3 వరకు, రూ.200 ఫైన్‌తో 10వ తేదీ, రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 15వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఈ తేదీలలో ఏవైనా ప్రభుత్వ సెలవు దినాలు ఉంటే తదుపరి పని దినాన్ని గడువు తేదీగా పరిగణిస్తారు. విద్యార్థుల ఫీజును https://bse. ap.gov.in లలో అందుబాటులో ఉన్న స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే చెల్లించాలని పేర్కొన్నారు. మాన్యువల్ నామినల్ రోల్స్ సమర్పించాల్సిన అవసరం లేదన్నారు.పరీక్ష ఫీజు రుసుం ఇలా.. ⇒ రెగ్యులర్ విద్యార్థులు (అన్ని సబ్జెక్టులకు) రూ.125⇒ మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125⇒ మూడు సబ్జెక్టుల వరకు రూ.110⇒ వృత్తి విద్యా కోర్సులకు అదనంగా రూ.60⇒ వయసు మినహాయింపు కోసం రూ.300మార్చిలో ‘పది’ పరీక్షలుపదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చిలో నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మార్చి నెల రెండు లేదా మూడో వారం నుంచి ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. మార్చి 16, 21 తేదీలతో టైంటేబుల్‌ను సిద్ధం చేసినట్టు తెలిసింది. -
సర్కారీ చిక్కీలో పురుగులు
చుండూరు (కొల్లూరు): బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు సోమవారం ఉపాధ్యాయులు పంపిణీ చేసిన చిక్కీలలో పురుగులు దర్శన మిచ్చాయి. వాటిని విద్యార్థులు ఇంటికి తీసుకువెళ్లారు. తల్లిదండ్రులు చిక్కీలపై ఉన్న కవర్‌ను తొలగించి విద్యార్థులకు ఇచ్చేందుకు ప్రయతి్నస్తున్న క్రమంలో పురుగులు కనిపించడంతో నిశ్చేషు్టలయ్యారు. ప్యాకెట్లోంచి తీసిన చిక్కీలోబతికున్న పురుగు బయటకు వస్తుండటం చూసిన తల్లిదండ్రులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.నాణ్యమైన భోజనం, చిక్కీలు అందించాల్చిన ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణిని అవలంభించడం, చిక్కీల నాణ్యతను విద్యాశాఖాధికారులు పరిశీలించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారులు పురుగులను గమనించకుండా ఆరగించి ఉంటే వారి పరిస్థితి ఏమిటన్న సందేహాలు తల్లిదండ్రులలో వ్యక్తమవుతున్నాయి. నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్న సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ మాటల కోటలు దాటుతుంటే.. విద్యార్థులకు ఇస్తున్న చిక్కీలలో పురుగులు బయటకొస్తున్నాయని పలువురు వ్యాఖ్యానించారు. -
తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో ర్యాగింగ్ కలకలం
సాక్షి,తిరుపతి: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీ యూనివర్సిటీ)లో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. సైకాలజీ విభాగంలో చోటుచేసుకున్న ఈ ఘటన విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.ఈ ఘటనపై నలుగురు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఫిర్యాదు చేసిన విద్యార్థులపై కక్ష్య సాధింపు చర్యలు ప్రారంభమయ్యాయి. వారిని ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడికి గురిచేశారు. అంతేకాక, వారిపై బెదిరింపులకు కూడా దిగినట్లు సమాచారం.ఈ ఒత్తిడిని భరించలేక, నలుగురు విద్యార్థులు తమ టీసీలు తీసుకుని యూనివర్సిటీని విడిచిపెట్టారు. ర్యాగింగ్ ఘటనలో ప్రమేయం ఉన్న ఆరుగురు సీనియర్ విద్యార్థులతో పాటు, సైకాలజీ విభాగ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ (హెచ్ఓడీ) ప్రొఫెసర్ విశ్వనాథ్ రెడ్డిని యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. విద్యార్థుల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసిన కారణంగా ఆయనపై చర్యలు తీసుకున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి.మరోవైపు యూనివర్సిటీ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు తీవ్రంగా స్పందించాయి. ర్యాగింగ్‌ను ప్రశ్నించిన విద్యార్థి నాయకులపై కూడా బెదిరింపులు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. -
అక్రమ బదిలీలకు బ్రేక్!
సాక్షి, అమరావతి: రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖలో లెక్చరర్లు, ఇతర అధికారుల డిప్యుటేషన్ పేరుతో అక్రమ బదిలీలకు బ్రేకులు పడ్డాయి. గత నెలలో 30 మందికి, నవంబర్‌లో 90 మందికి డిప్యుటేషన్లు వేసి బదిలీ చేసేందుకు ఆర్డర్లు సిద్ధంచేశారు. కానీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగంలో జరుగుతున్న బదిలీల బాగోతంపై ఇటీవల ‘సాక్షి’ పత్రిక ‘బదిలీ మంత్రం.. వర్క్ అడ్జెస్ట్మెంట్ తంత్రం’ పేరుతో అక్కడ జరుగుతున్న వ్యవహారాలను వెలుగులోకి తెచ్చింది. దీంతో.. అప్పటికే పూర్తిచేసిన బదిలీలను అధికారులు నిలిపివేసి తాము తప్పుచేయలేదని తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అలాగే, అక్టోబరులో కొందరు లెక్చరర్లను బదిలీ చేసినా వారి ఆర్డర్లను సైతం నిలిపివేశారు. ఈ క్రమంలో.. డబ్బులిచ్చిన అధికారులు, లెక్చరర్లు తమ సంగతి తేల్చాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. డెప్యుటేషన్ బదిలీ కోసం ఒక్కో లెక్చరర్ నుంచి రూ.2 లక్షలు వసూలుచేసినట్లు సమాచారం. ఇప్పుడీ అక్రమ బదిలీలు నిలిచిపోవడంతో తాము ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వాలని లేదా చెప్పిన ప్రకారం ‘సర్వీస్’ బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే, ఈ బాగోతం ఇప్పటికే మీడియాకెక్కడంతో కొన్నాళ్లు ఆగాలని అధికారులు వారిని బుజ్జగిస్తున్నట్లు తెలిసింది. సాంకేతిక విద్యాశాఖలో ఇష్టారాజ్యం.. నిజానికి.. 2014–19 మధ్య పాలిటెక్నిక్ విద్యను నాటి టీడీపీ ప్రభుత్వం అస్తవ్యస్థంగా మార్చేయడంతో విద్యార్థుల చేరికలు తగ్గిపోవడంతో పాటు ఉన్నవారికి సైతం సరైన ప్లేస్మెంట్లు లేవు. అయితే, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఈ విభాగానికి సమర్థులైన అధికారులను నియమించింది. పాలిటెక్నిక్ కోర్సులు చదివే విద్యార్థులకు ఉద్యోగాల కల్పనకు క్యాంపస్ రిక్రూట్మెంట్ విధానం అమలుచేసింది. ఈ కమ్రంలో దేశంలోనే ప్రముఖ సంస్థలను ఆయా కాలేజీలకు ఆహ్వానించింది. ఫలితంగా.. విద్యార్థులకు 98 శాతం ఉద్యోగావకాశాలు దక్కాయి. అయితే, 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యారంగాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. సాంకేతిక విద్యాశాఖలో అయితే కొందరు అధికారులు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతోంది. డెప్యుటేషన్లపై వచ్చి ఇక్కడే తిష్టవేసి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా.. కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీలు జోన్ పరిధిలోనే చేయాల్సి ఉండగా, ఏకంగా రీజియన్ పరిధి మార్చి వారిని 600 కి.మీ.కు పైగా దూరంలో పోస్టింగ్‌లు ఇచ్చి పంపించారు. వారు ఉద్యోగాన్ని వదులుకుంటే తమకు కావాల్సిన వారికి ఇచ్చుకునేందుకు కుట్రచేసినట్లు విమర్శలు వచ్చాయి. కాసులిస్తే బదిలీలు, డిప్యుటేషన్లు.. ఇక జూన్‌లో సాధారణ బదిలీలు చేపట్టి ఖాళీలను చూపలేదు. అనంతరం ఆగస్టు, సెపె్టంబరు, అక్టోబరు నెలల్లో డబ్బులిచ్చిన వారికోసం డెప్యుటేషన్లు, బదిలీలు చేపట్టారు. దీనికి వర్క్ అడ్జెస్ట్మెంట్ అని పేరు పెట్టారు. అయితే, వాస్తవాలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో ఆక్టోబరులో చేపట్టిన డెప్యుటేషన్లు నిలిపివేశారు. దీంతో.. డబ్బులిచ్చిన వారు ఒత్తిడి చేస్తుండడంతో బదిలీ ఆర్డర్ ఇవ్వలేక.. సమాధానం చెప్పలేక కీలక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. -
అమ్మా.. భయమేస్తోందే
సాక్షి, హైదరాబాద్: ఇంటర్, జేఈఈ పరీక్షల తేదీలు ప్రకటించడంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. చాలా మందిలో పరీక్షల భయం కనిపిస్తోంది. ‘మమ్మీ.. భయమేస్తోందే..’అంటూ ఇంటర్ హాస్టల్ విద్యార్థులు తల్లులకు ఫోన్లు చేసి వాపోతున్నారు. జిల్లా ఇంటర్ అధికారులు ఈ విషయాన్ని ఇటీవల బోర్డు ఉన్నతాధికారులకు తెలియజేశారు. కాలేజీల్లో ఒక్కసారిగా బోధన సమయం పెరగడం.. అంతర్గత పరీక్షలు ఎక్కువ నిర్వహించాలనే ఆలోచన విద్యార్థుల భయానికి కారణంగా పేర్కొంటున్నారు.దీనికితోడు ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ర్యాంకులే లక్ష్యంగా విద్యార్థులపై ఒత్తిడి పెంచాయి. బోధన సమయాన్ని ఎక్కువ చేశాయి. ఇంటర్ సిలబస్‌తోపాటు జేఈఈ, ఈఏపీసెట్, నీట్ వంటి పరీక్షల శిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. రోజువారీ, వారాంతపు, నెలవారీ అంతర్గత పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వాటిల్లో వచ్చే మార్కుల ఆధారంగా విద్యార్థులను సెక్షన్ల వారీగా విడగొడుతున్నాయి. ఇవన్నీ విద్యార్థుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అధికారులు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5.8 లక్షల మంది ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులున్నారు. వారిలో సుమారు 90 వేల మందే ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో చదువుతున్నారు. మిగతా వారంతా ప్రైవేటు కాలేజీల్లోనే చదువుతున్నారు. ఇక ఇంటికి పంపలేం పరీక్షలయ్యే వరకు విద్యార్థులను హాస్టళ్ల నుంచి ఇంటికి పంపలేమని ప్రైవేటు కాలేజీలు తల్లిదండ్రులకు తేల్చిచెబుతున్నాయి. ‘మీ వాడు మేథ్స్‌లో వీక్‌గా ఉన్నాడు. సెక్షన్ మారుస్తున్నాం’అని చెప్పే కాలేజీలూ ఉన్నాయి. దీంతో తల్లిదండ్రులు విద్యార్థులను ప్రశ్నిస్తున్నారు. ‘చదవడం లేదా?.. ఇలా అయితే ఎలా’అంటూ నిలదీస్తున్నారు. ఒక్కసారిగా కట్టడి చేయడం, కఠిన నిబంధనలు పెట్టడంతో విద్యార్థులు భయపడుతున్నారు.ప్రైవేటు హాస్టళ్లలో సమయ పాలన మార్చారు. ఉదయం 4 గంటలకే లేపడం, రాత్రి 11 గంటల వరకూ స్టడీ అవర్స్ పేరుతో కూర్చోబెట్టడం విద్యార్థులకు కొత్తగా ఉంది. ఇప్పటివరకు క్లాస్ రూంలో చెప్పిన పాఠాలకు భిన్నంగా షార్ట్‌కట్ పేరుతో బోధన చేయడం కూడా కొత్తగా ఉందని ఓ కార్పొరేట్ కాలేజీ విద్యార్థి శశాంక్ పేర్కొన్నాడు. చాలాచోట్ల భోజనం చేసేందుకు తగిన సమయం కూడా ఇవ్వడం లేదు. ఆటలు పూర్తిగా రద్దు చేశారు. పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్‌కే పరిమితం చేశారు. ఇంటికి ఫోన్ చేసేందుకూ అవకాశం ఇవ్వడం లేదు. కొన్ని కాలేజీలు ఆదివారం మాత్రమే తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నాయి. ఆ చాప్టర్లంటే వణికి పోతున్నారు కొన్ని చాప్టర్లు ఎంత చదివినా విద్యార్థులకు బోధపడటం లేదు. ఇంటర్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని అకడమిక్‌గానే ఇప్పటివరకు చదివినట్టు విద్యార్థులు చెబుతున్నారు. జాతీయ పోటీపరీక్షల కోసం భిన్నంగా చెబుతున్నారని వారు అంటున్నారు. గతంలో చదివింది ఇప్పుడు చదివే దానికి పొంతనే ఉండటం లేదంటున్నారు. మేథ్స్‌లో మ్యాట్రిక్స్ అండ్ డిటరి్మనేట్స్‌లో ఎడ్‌జాయింట్, ఇన్వర్స్, ప్రాపర్టీస్, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్‌లో కొత్త విధానం ఒకటికి రెండుసార్లు ప్రయత్నించాల్సి వస్తోందని ఇంటర్ విద్యార్థి సందీప్ చెప్పాడు. ప్రాబబులిటీ డిస్ట్రిబ్యూషన్స్‌లో నార్మల్ చాప్టర్స్‌ను ఇప్పుడు సుదీర్ఘంగా చేయాల్సి వస్తోందంటున్నారు.సర్కిల్స్, పారా»ొలా, ఎల్లిప్స్, హైపర్బోలా, వెక్టర్ ఆల్జీబ్రాలో స్కాలర్ ప్రొడక్ట్, వెక్టర్ ప్రొడక్ట్ వంటివి సాధారణ సెక్షన్లో ఉండే విద్యార్థులకు అంతుబట్టడం లేదు. ఒక్కసారిగా వాటిని భిన్నమైన రీతిలో బోధించడమే అందుకు కారణమని విద్యార్థులు చెబుతున్నారు. ఫిజిక్స్‌లో ఎలక్రి్టక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఆల్టర్నేటింగ్ కరెంట్ వంటి చాప్టర్లలో కొత్త అంశాలను జాతీయ పరీక్షల కోసం అధ్యాపకులు చెబుతున్నారు. వాటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయంటున్నారు. కెమెస్ట్రీలోనూ సెల్ పొటెన్షియల్స్, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, మెకానిజం బేస్డ్ రియాక్షన్స్‌ను పాఠ్యపుస్తకంలో లేని కొత్త అంశాలతో పరీక్షల కోణంలో చెప్పడంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఒత్తిడికి తాళలేక ఆత్మహత్యలు.. కొన్నేళ్లుగా ఇంటర్ విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా అనేక మంది బలవన్మరణాలకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. బోధన సమయంలో ఒత్తిడి, ఫలితాలు తారుమారు కావడం, జాతీయ స్థాయిలో ర్యాంకులు వారిని కుంగదీస్తున్నాయి. 2019లో 22 మంది, 2022లో 543 మంది, 2024లో ఏడుగురు, 2025లో ముగ్గురు విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కాగా, ఈ పరిస్థితిపై ప్రత్యేక దృష్టి పెడతామని.. ఒత్తిడి పెంచుతున్న కాలేజీల వివరాలు సేకరించాలని జిల్లా ఇంటర్ అధికారులను ఆదేశించినట్లు బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించేలా బోధించాలని కాలేజీల యాజమాన్యాలు మాకు తేల్చిచెబుతున్నాయి. దీంతో విద్యార్థులపై మేం ఒత్తిడి పెంచక తప్పడం లేదు. కానీ దీనివల్ల దుష్ఫలితాలు ఎదురుకావచ్చు. – రణదీప్ పల్లవ్, ఇంటర్ అధ్యాపకుడు ర్యాంకుల ఆందోళనలో విద్యార్థులు నెల రోజుల వ్యవధిలో 10 మంది ఇంటర్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చా. మాకు ర్యాంకులు వస్తాయా? మేం ఏం చదవాలనే ఆందోళన వారిలో కనిపించింది. – సరితా వినీత్, మానసిక వైద్యురాలు -
ప్రతి తొమ్మిది మందిలో ఒకరు భారతీయులు
చదువు అంటే నేర్చుకోవడం..అది కూడా ఆసక్తితో.. కానీ కొన్నేళ్లుగా చదువు అర్థం మారిపోయింది. పోటీపడాలి.. అత్యధిక మార్కులు సాధించాలి. అంతేకాదు ఉత్తమ కళాశాలలో సీటు సంపాదించాలి. ఈ ఒత్తిడి విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో చదువు అంటేనే చాలామంది భారంగా భావించే స్థాయికి వచ్చారు. ఫలితాలు వారి అంచనాలను అందుకోలేనప్పుడు ఎవరూ ఊహించని ‘కఠిన నిర్ణయాలు’ తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలోని ప్రతి తొమ్మిది మంది విద్యార్థుల ఆత్మహత్యల్లో ఒకటి భారత్‌లో జరుగుతోంది. 2024 ఐసీ3 స్టూడెంట్ సూసైడ్ రిపోర్ట్ ప్రకారం.. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రధానంగా చదువుల ఒత్తిడి తీవ్రంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలలో విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. 2013–2022 మధ్య మన దేశంలో లక్షకు పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కాలంతో పోలిస్తే అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకున్న విద్యార్థుల సంఖ్య గత దశాబ్దంలో 64 శాతం పెరిగింది. ‘పరీక్షలు, మార్కులకు మాత్రమే ఈ సంక్షోభాన్ని ముడిపెట్టకూడదు. విద్యార్థుల్లో భయం,నిశ్శబ్దం అలుముకుంది. వారికి భరోసా లేకపోవడం సమస్యను పెంచుతోంది’అని నివేదిక తెలిపింది. – సాక్షి, స్పెషల్ డెస్క్నమ్మకానికి బదులుగా నిశ్శబ్దం..చదువులు, తల్లిదండ్రుల నుంచి భారీ అంచనాలు, సామాజి కంగా ఇతరులతో పోలిక వంటి ఒత్తిడిని నేటి విద్యార్థులు ఎదు ర్కొంటున్నారు. ఈ ఒత్తిడి కారణంగా విద్యార్థులు పడుతున్న బాధ ను ఎవరూ ముందుగా గుర్తించడం లేదని నివేదిక వివరించింది. మార్గనిర్దేశనానికి బదులుగా చాలామంది తరగతి గదుల్లో భయంతో కూడిన ప్రేరణను అనుభవిస్తున్నారు. నమ్మకానికి బదులుగా నిశ్శబ్దాన్ని ఎదుర్కొంటున్నారు. విద్యలో ప్రధాన భాగంగా కాకుండా కౌన్సెలింగ్‌ను ఇప్పటికీ చివరి ప్రయత్నంగా చూస్తున్నారు’అని తెలిపింది. పరిష్కారం వారి చేతుల్లోనే..నేర్చుకోవడం, విద్యార్థుల శ్రేయస్సు విషయంలో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన సంస్కృతిని అత్యవసరంగా మార్చాల్సిన అవసరం ఉందని నివేదిక స్పష్టం చేసింది. ‘విద్యార్థులు చదువును ద్వేషించరు. పెద్దల నుంచి సరైన మార్గనిర్దేశనం లేనప్పుడు వ్యతిరేకిస్తారు. పరిష్కారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది. విద్యార్థులు ఆశ్రయించే మొదటి కౌన్సెలర్లు వారే. ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించి, మేమున్నాం అని ధైర్యం చెప్పేలా వినడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినప్పుడు విద్యార్థులు సురక్షితంగా ఉన్నట్టు భావిస్తారు’అని వివరించింది. స్వేచ్ఛా వాతావరణం..నివేదిక ప్రకారం 40 శాతం మంది భారతీయ విద్యార్థులు ఎప్పు డూ కౌన్సెలర్‌తో మాట్లాడలేదు. అయితే ఈ సంఖ్య గత సంవత్సరం 52 శాతం నమోదైంది. ‘మానసిక ఆరోగ్యం పాఠశాల జీవితంలో రోజువారీ చర్యల్లో భాగం కావాలి. కౌన్సెలింగ్ నిపుణులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. విద్యార్థులు స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణం కల్పించాలి’అని నివేదిక తెలిపింది. చాలా పాఠశాలల్లో ఇప్పటికీ సంక్షోభం ఏర్పడిన తర్వాత మాత్రమే ‘మానసిక ఆరోగ్యం’గుర్తొస్తుందని వివరించింది. సమస్య రాకముందే నివారణ అవసరం. నమ్మకమైన పెద్దలు తరచూ సమావేశం కావడం ద్వారా విద్యార్థులకు మనోధైర్యం లభిస్తుందని తెలిపింది.ఉపాధ్యాయులే కౌన్సిలర్లు.. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ భారీ నిధులు అవసరం లేదని, స్థిరమైన నిర్మాణం, సానుభూతి అవసరమని నివేదిక వివరించింది. ‘ప్రతి ఉపాధ్యాయుడు కౌన్సెలర్ పాత్ర పోషించడం ఒక ఆచరణాత్మక విధానం. ప్రాథమిక శిక్షణతో విద్యార్థుల బాధను ఉపాధ్యాయులు ముందుగానే గుర్తించగలరు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు.. పిల్లల బాధ యొక్క ప్రారంభ సంకేతాలను గుర్తించడంలో అవరి్టంగ్ స్టూడెంట్ సూసైడ్ టాస్‌్కఫోర్స్ అభివృద్ధి చేసిన గేట్ కీపర్ ట్రైనింగ్ వంటి తక్కువ ఖర్చుతో కూడిన కార్యక్రమాలు సహాయ పడతాయి. స్టూడెంట్ వెల్నెస్ క్లబ్స్, టీచర్–సూ్టడెంట్ అడ్వైజరీ సర్కిల్స్ పాఠశాలల్లో విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకునేందుకు చవకైన మార్గాలు’అని తెలిపింది. మానవ సంబంధాలు.. చాట్ జీపీటీ వంటి ఏఐ సాధనాలను 83 శాతం మంది విద్యార్థులు ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ సాంకేతికత మానవ సంబంధాన్ని భర్తీ చేయదని నివేదిక తెలిపింది. విద్యార్థులు త్వరిత సమాధానాల కోసం, లేదా పెద్దలను అడగడానికి సంకోచించినప్పుడు ఏఐ వైపు మొగ్గు చూపొచ్చు. కానీ మనోధైర్యం, జీవిత నిర్ణయాల విషయానికి వస్తే వారు ఇప్పటికీ నిజమైన మానవ సంబంధాన్ని కోరుకుంటారు. నమ్మకమైన పెద్దవారితో 15 నిమిషాల సంభాషణ పెద్ద ప్రభావాన్ని చూపుతుంది’అని వివరించింది. విద్యకు పునాదిగా.. విద్యార్థులకు నిజమైన మార్గదర్శకత్వం కావాలి. వారు చదువుతోనే కాదు.. భావోద్వేగాలు, మారుతున్న స్నేహాలు, గుర్తింపు, భవిష్యత్గురించి అనిశి్చతితో కూడా ఇబ్బంది పడుతున్నారు. వారు స్పష్టత, అనుబంధం, ఆత్మవిశ్వాసాన్ని కోరుకుంటున్నారు. పాఠశాల జీవితంలో మార్గదర్శకత్వం భాగం అయినప్పుడే ఇవి అందుకుంటారు. విద్యలో కౌన్సెలింగ్ పునాది కావాలి. ప్రతి ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు పిల్లల గోడు వినడానికి, మార్గనిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు.. మొత్తం అభ్యాస వాతావరణం మారుతుంది. సమస్యలను పరిష్కరించడంతోపాటు బలమైన, సంతోషకరమైన, మరింత నమ్మకమైన యువతను తీర్చిదిద్దుతుంది’అని వివరించింది. -
టీనేజర్లను.. కాస్త అర్థం చేసుకోండి!
యుక్త వయసు.. జీవితంలో చాలా కీలకమైన దశ. కానీ, ఈ తరుణంలో శరీరంలో వచ్చే మార్పులు యువతను చాలా ప్రభావితం చేస్తాయి. అదే సమయంలో తల్లిదండ్రులు, సమాజం వారి నుంచి ఆశించడమూ మొదలవుతుంది. ఇవన్నీ కలిసి వారిలో ఒత్తిడి, ఆందోళన పెంచుతాయి. ఏ సందర్భంలో విఫలమైనా నిరాశ పరిచి, కుంగదీస్తాయి. యువత ఎలాంటి సమస్యనైనా సింహాల్లా పరిష్కరించగలరు అన్నారు స్వామి వివేకానందుడు. వారు సింహాల్లా ఎదగాలంటే ఏం చేయాలి.. ఎవరి పాత్ర ఏమిటి?ఏషియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. 70 శాతం మంది విద్యార్థుల్లో నిత్యం మధ్యస్థం నుంచి తీవ్ర స్థాయి ఆందోళన కనిపించిందట. సగానికిపైగా విద్యార్థుల్లో నిరాశా నిస్పృహలు పట్టి పీడిస్తున్నాయి. మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే.. 65 శాతం మంది తమ భావోద్వేగాలను లేదా ప్రవర్తనను నియంత్రించుకోలేకపోతున్నారట. అనేక కారణాలు‘టీనేజర్ జీవితం చాలా కీలకమైనది. వారి శరీరంలో జరిగే మార్పుల ప్రభావం ఒక ఎత్తయితే.. సమాజంలో గుర్తింపుకోసం వారు పడే ఆరాటం మరొక ఎత్తు. ‘డిజిటల్ ప్రపంచం’ వారిని ఊపిరి సలపనివ్వకుండా చేస్తోంది’ అంటున్నారు మానసిక నిపుణులు. మీ పిల్లల్లో అలసట, ఒత్తిడి, ఆందోళన, బాధ, కోపం వంటి వాటికి ఈ కింది అంశాలు కారణాలు కావచ్చు.» చదువు ఒత్తిడి » సోషల్ మీడియా, స్నేహితుల ప్రభావం» వీడియో గేమ్స్ అతిగా ఆడటం» సంబంధాలను సరిగ్గా మేనేజ్ చేయలేకపోవడం» అతి సమాచారం (చదువు లేదా వినోదం) వల్ల మెదడుపై అధిక ఒత్తిడి » బంధువులు లేదా బయటివాళ్లు భయపెట్టడం లేదా తీవ్రమైన ఒత్తిడికి గురిచేయడం» ప్రమాదాలు లేదా దుర్ఘటనలు » ఆర్థికపరమైన అంశాలు» వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన సమస్యలువీటి ఫలితంగా టీనేజర్లు దేనిమీదా శ్రద్ధ పెట్టలేరు. ఆహారం సరిగ్గా తీసుకోరు. నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఇవి శారీరక, మానసిక అనారోగ్యాలకు దారితీస్తాయి.ఇలా చేసి చూడండి!టీనేజర్లు అంటే రేపటి పౌరులు. వారు అన్ని విధాలా ఆరోగ్యంగా ఎదగాలంటే తల్లిదండ్రులూ, వాళ్లు చదివే కాలేజీల యాజమాన్యాలూ శ్రద్ధ పెట్టాలి.» ‘చదువు, చదువు’ అని వారిని ఒత్తిడి చేయడం తగ్గించాలి.» శారీరక వ్యాయామం ముఖ్యమనే విషయం వారికి అర్థమయ్యేలా చెప్పాలి. » కాలేజీల్లో జీవన నైపుణ్యాలు నేర్పించాలి. కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలి. » చదువు ఒక్కటే కాకుండా, ఆటలు వంటి పాఠ్యేతర కార్యకలాపాలు కూడా నిర్వహిస్తుండాలి.» రోజులో కనీసం 8–9 గంటలు నిద్రపోయేలా చూడాలి. » రాత్రిపూట నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందే.. సెల్‌ఫోన్ లేదా టీవీ లేదా కంప్యూటర్లను దూరం పెట్టాలి. » తల్లిదండ్రులు తాము చెప్పేది శ్రద్ధగా వింటారు.. తమ సమస్యకు పరిష్కారం చూపగలుగుతారు అనే నమ్మకం పిల్లల్లో కలిగించాలి.» ముఖ్యంగా అమ్మాయిలు లైంగిక హింస లేదా దాడులకు గురైనప్పుడు వారిని ఓదార్చడం, ఆ క్షోభ నుంచి వారు బయటపడేలా చేయడంలో తల్లిదండ్రులే కీలకం.తల్లిదండ్రులూ.. గమనించండి!పిల్లలను తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ ఉండాలి. వారి వ్యవహార ధోరణి, ఆహారపు అలవాట్లు, ఫోన్ వాడకం.. వీటన్నింటినీ పరిశీలించాలి. ఇంటికి వచ్చి వెళ్లే స్నేహితులు, బంధువులమీద కూడా ఒక కన్ను వేయాలి. వారి వల్ల కూడా పిల్లలు ప్రభావితం కావచ్చు. మీ పిల్లల్లో ఈ కింది లక్షణాలు గుర్తిస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి. » ప్రతి పనికీ అలసిపోవడం లేదా ఎప్పుడు చూసినా అలసటగా కనిపించడం» ఏ పనిమీదా శ్రద్ధ పెట్టలేకపోవడం» భావోద్వేగాలు వెంటవెంటనే మారిపోతుండటం» ఆకలి లేకపోవడం» తరచూ ఒంటి నొప్పులు అనడం» ఏ విషయాన్నీ సరిగ్గా వ్యక్తీకరించలేకపోవడంఅమ్మాయిలపైనా ప్రభావంకేంద్ర నేర గణాంక విభాగం (ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం 2022లో 13,044 మంది విద్యార్థులు బలవంతంగా తమ ప్రాణాలు తీసుకున్నారు. 2023లో ఈ సంఖ్య 13,892కు పెరిగింది. సాధారణంగా అబ్బాయిలే ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతుంటారు అనుకుంటారు అందరూ. కానీ, 2021–23 మధ్య.. అమ్మాయిల సంఖ్య కూడా పెరగడం గమనార్హం. -
పక్కా స్కెచ్.. కొండారెడ్డిపై కూటమి కుట్ర
-
విద్యార్థినికి జనసేన నాయకుడు నారాయణరావు వేధింపులు
-
భావితరానికి యువతే దిక్సూచి... రాజకీయాల్లో విద్యార్థులు, యవత తులసి మొక్కల్లా ఉన్నతంగా ఎదగాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
-
బడుగులేరు ఎస్సీ కాలనీలో విష జ్వరాలు, కామెర్లు
కనిగిరి రూరల్: ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బడుగులేరు ఎస్సీ కాలనీకి చెందిన 9 మంది విద్యార్థులు వాంతులు, విష జ్వరాలు, కామెర్లతో కనిగిరి ప్రభుత్వాస్పత్రిలో చేరటంతో ఒక్కసారిగా ఆందోళన రేగింది. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. గ్రామంలోని జెడ్పీఉన్నత పాఠశాలలో సుమారు 220 మంది చదువుతున్నారు. వారందరికీ మోంథా తుపాను కారుణంగా సెలవులు ఇవ్వగా.. ఎస్సీ కాలనీలో నాలుగు కుటుంబాలకు చెందిన సుమారు 13 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు, జ్వరాలతో అనారోగ్యం పాలయ్యారు. స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్నారు. వీరిలో ముగ్గురు కోలుకోగా, మిగతా 9 మందికి వాంతులు తగ్గినా జ్వరం తగ్గలేదు. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) సూచన మేరకు విద్యార్థుల్ని కనిగిరి ప్రభుత్వాస్పత్రికి బుధవారం తరలించారు. వైద్య పరీక్షలు చేయగా, కామెర్లుగా నిర్ధారణ అయింది. ఒకే ఇంట్లోని బ్లెస్సీ, రేచర్ల (9, 8 తరగతులు), మరో ఇంట్లోని అజయ్ (10వ తరగతి), ఒకే ఇంట్లోని తరుణ్, జయకుమార్, రాణి (3, 8, 10 తరగతులు), ఇంకో ఇంట్లోని కొండ్రు జగన్ (4వ తరగతి) కనిగిరి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విక్కి (7వ తరగతి) ఒంగోలులో, షర్లీ (8వ తరగతి) చెన్నైలో చికిత్స పొందుతున్నట్టు వారి తల్లిదండ్రులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం పాఠశాలలోని 9, 10 తరగతుల విద్యార్థినులు ముగ్గురు కామెర్లకు గురైనట్టు సమాచారం. దీనిపై ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బయ్య మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. డీఈఓ, డీఎంహెచ్ఓ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు బడుగులేరు పాఠశాలను సందర్శించారు. గ్రామంలోని మూడు బోర్ల వద్ద, గ్రామంలో పారిశుధ్య చర్యలు చేపట్టారు. నాలుగు రోజుల క్రితం ఓ విద్యార్థి మృతి కాగా.. బడుగులేరు ఎస్సీ కాలనీకే చెందిన 2వ తరగతి విద్యార్థి బి.భరత్ ఈ నెల 2న మృతి చెందాడు. కడుపులోని పేగుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా చనిపోయినట్టు అతని తండ్రి బలసాని రాజశేఖర్ తెలిపారు. ఇప్పుడు మరికొందరు విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో విద్యాశాఖ అధికారులు వచ్చి మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించారు. రెండేళ్ల నుంచి విద్యార్థి భరత్‌కు కడుపులో నొప్పి వస్తోందని అతని తల్లిదండ్రులు చెప్పారని డీఈఓ కిరణ్‌కుమార్ వెల్లడించారు. దీనికి, తాజా ఘటనకు సంబంధం లేదన్నారు. -
YS Jagan: పిల్లలను చదివించడం భారం కాదు అందుకే ప్రతి తల్లిదండ్రులకు మాటిస్తున్న..
-
చంద్రబాబు మంచి చేయకపోగా.. చెడు చేస్తున్నారు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశాడని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు మంచి చేయకపోగా.. చెడు చేస్తున్నారని అన్నారు. అలాగే, సమాజంలో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని గుర్తు చేశారు. రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలని సూచించారు.వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలపై వైఎస్ జగన్ చర్చించారు. అనంతరం వారితో వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘కల్మషం లేని రాజకీయ వ్యవస్థ మీ దగ్గర నుంచే ప్రారంభం అవుతుంది. మంచి రాజకీయాలకు బీజం విద్యార్థి దశలోనే పడుతుంది. మీరంతా జెన్ -Z తరంలో ఉన్నారు. భావి తరానికి మీరంతా దిక్సూచీ. రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలి. పలానా వాడు మన రాజకీయ నాయకుడు అని కాలర్ ఎగరేసేకునేలా మనం ఉండాలి. మనలో ఆ గుణాలను, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి. ఈ రాష్ట్రం మనది కాబట్టి.. ఈ రాష్ట్రం బాగుండాలని మనమంతా కోరుకుంటున్నాం. ఉద్యోగాలు సంపాదించుకునే పరిస్థితిలోకి ప్రతి విద్యార్థీ వెళ్లాల్సిన అవసరం ఉంది.కాని, ఆ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా?.ప్రపంచంతో పోటీ పడాలి.. ఒక్క రాత్రిలోనే ఇవన్నీ జరగవు. ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాలి. ఒక నాయకుడు తన విజన్‌లో భాగంగా ఒక అడుగు వేస్తే, అవి ఫలితాలు ఇవ్వడానికి 10-15 సంవత్సరాలు పడుతుంది. అలాంటి ఆలోచనలు మనం చేయాలి. అది రియాల్టీలోకి వచ్చినప్పుడు భవిష్యత్తు తరాలు మారుతాయి. సమాజంలో విద్యార్థులుగా మీ పాత్ర అత్యంత కీలకం. మన ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థలో గొప్ప మార్పులు తీసుకు వచ్చాం.కేజీ నుంచి పీజీ వరకూ మంచి చదువులు ఉండాలని భావించాం. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించేలా మన ప్రభుత్వంలో ఆలోచనలు చేశాం.స్కూలుకు వెళ్లే పిల్లలకు ఓట్లు లేవని, ఏ రాజకీయ పార్టీ కూడా వారి గురించి పట్టించుకోదు. కాని, రేపు భవిష్యత్తును నిర్దేశించేది వాళ్లే. అందుకని స్కూళ్ల నుంచే మనం విప్లవాత్మక చర్యలు తీసుకు వచ్చాం. ప్రైవేటు స్కూల్స్‌తో పోటీపడేలా ప్రభుత్వ స్కూల్లను తీర్చిదిద్దాం. సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం ప్రారంభించాం. ఆ స్థాయి విద్యను మన పిల్లలకు మనం ఇవ్వాలి.6,200 కోట్లు బకాయిలు.. మనకు పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు, మన పోటీ ప్రపంచంతోనే. ఎడెక్స్‌తో ఉచితంగా ఆన్లైన్ కోర్సులు ఇప్పించాం. ప్రపంచంలో అత్యుత్తమ యూనివర్శిటీలకు చెందిన కోర్సులు అందుబాటులోకి ఇచ్చాం. ఆయా యూనివర్శిటీలు సర్టిఫికెట్లు ఇచ్చేలా చేశాం. డిగ్రీల్లో కొత్త కోర్సులు తీసుకు వచ్చాం. మనం రాక ముందు 257 కాలేజీలకు మాత్రమే నాక్ రిజిస్ట్రేషన్ ఉంటే 2024 నాటికి 432కి పెరిగాయి. పూర్తి ఫీజు రియింబర్స్‌మెంట్ తీసుకు వచ్చాంది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. కేవలం విద్యాదీవెన అనే ఒకే ఒక పథకం కింద రూ.12,609 కోట్లు ఇచ్చాం. వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.20వేలు ఇచ్చాం. చదువుల కోసం అప్పులు పాలు కాకుండా చూశాం. కాని, ఇవాళ అన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు. పిల్లలు చదవకూడదు అనే ఉద్దేశంతో చంద్రబాబు పనిచేస్తున్నారు. ఏడు త్రైమాసికాల నుంచి ఫీజు రియింబర్స్‌మెంట్ పెండింగ్‌లో పెట్టారు. ఫీజు రియిబంర్స్మెంట్లో రూ.4,200 కోట్లు పెండింగ్ ఉంది. వసతి దీవెన కింద రూ.2,200 కోట్లు పెండింగ్. మొత్తంగా రూ.6,200 కోట్లు బకాయి పెట్టారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాయకత్వం తీసుకోవాలి.1.2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం.. మన ప్రభుత్వ హయాంలో అక్షరాల ప్రభుత్వ రంగంలోనే 6.3 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. 52 వేల మందిని ఆర్టీసీలో రెగ్యులరైజ్ చేశాం. హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో కూడా భారీగా ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు ఉద్యోగాలను కోత కోస్తున్నారు. ఎంఎస్ఎంఈ సెక్టార్లో 4.7లక్షల యూనిట్ల ద్వారా 33లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తోడుగా ఉందనే భావన ఎంఎస్ఎంఈలకు ఉండేది. క్రమం తప్పకుండా వారికి ప్రోత్సాహకాలు అందేవి. అందుకనే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయి.చంద్రబాబు చేసిందేంటి?. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశాడు. అసలు చంద్రబాబు చేసింది ఏముంది?. సింగపూర్ నుంచి కేబుల్ తీసుకురావడానికి అంకురార్పణ చేసింది వైఎస్సార్సీపీ. అదానీ-గూగుల్‌కు 2022లో నోయిడా డేటా సెంటర్ అగ్రిమెంట్ ఉంది. మనం ఇక్కడ కూడా భూములు ఇచ్చాం, అన్ని ఏర్పాట్లూ జరిగాయి. ఆరోజు అడుగులు వేశాం కాబట్టి ఇప్పుడు గూగుల్ వస్తోంది. మూలపేట ప్రారంభించి మనం కట్టుకుంటూ వెళ్లాం కాబట్టి ఇప్పుడు మూలపేట పోర్టు జరుగుతోంది. భోగాపురం ఎయిర్‌పోర్టుకు అన్ని అనుమతులు తీసుకొచ్చి మనం శరవేగంగా నిర్మాణాలు చేశాం.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చంద్రబాబు చేస్తున్న అత్యంత దరిద్రపు పని. మంచి చేయకపోగా, చెడు చేస్తున్నాడు. 2019 వరకూ ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 12. అప్పటికి చంద్రబాబు ఒక్కటి కూడా తేలేదు. ఐదేళ్లలో కోవిడ్ రెండేళ్లు తీసేస్తే, మూడేళ్లలో 17 మెడికల్ కాలేజీలు తీసుకు వచ్చాం. ప్రతి జిల్లాకో గవర్నమెంటు మెడికల్ కాలేజీ తీసుకు వచ్చాం. 17 కొత్త మెడికల్ కాలేజీల వల్ల 2,550 సీట్లు అందుబాటులోకి వస్తాయి. సగం సీట్లు ఉచితం, మిగిలిన సీట్లు తక్కువ రేటుకే అందుబాటులోకి వస్తాయి. మన పిల్లలు ఇక్కడే డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది. మెడికల్ కాలేజీలు సీట్లు ప్రారంభం అయ్యాయి. పాడేరు కూడా ఎన్నికల తర్వాత ప్రారంభం అయ్యింది. 800 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.సీట్లు వద్దని లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబు.. పులివెందుల కాలేజీకి 50 సీట్లు కేంద్రం ఇస్తే.. వద్దంటూ చంద్రబాబు లెటర్ రాశాడు. మిగిలిన 10 కాలేజీలకు రూ.5వేల కోట్లు పెడితే చాలు. ఏడాదికి రూ.వేయి కోట్లు పెట్టినా చాలు. కాని, చంద్రబాబుకు మనసు రాదు. ఆయన పెట్టకపోయినా పర్వాలేదు, అలా వదిలేస్తే మేం వచ్చాక కట్టుకుంటాం. స్కాములు చేస్తూ అమ్మేస్తున్నాడు. ఇలాంటి వాటిపై ప్రశ్నలు వేసి, నిలదీసే బాధ్యత మీది. రాష్ట్రంలో కోటి సంతకాల కార్యక్రమం జరుగుతోంది. మీరంతా చురుగ్గా పాల్గొనాలి. గ్రామస్థాయిలో కూడా విద్యార్థి విభాగం, యూత్ విభాగం రావాలి. మీ చేతుల్లోనే భవిష్యత్తు ఉంది. మీరు ఎవర్ని డిసైడ్ చేస్తే.. ఆ ప్రభుత్వం వస్తుంది. విద్యార్థి, యువకులకు ఉన్న శక్తి అది. తటస్థులను, భావసారూప్యత ఉన్న వ్యక్తులను కూడా కలుపుకోవాలి. అసెంబ్లీ కేంద్రాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలు 11 నుంచి 12వ తేదీకి మార్పు జరిగింది. డిసెంబర్లో ఫీజు రియింబర్స్‌మెంట్‌పై ఆందోళనలు ఉంటాయి. అంతవరకూ చంద్రబాబుకు సమయం ఇద్దాం అని సూచించారు. -
బాబు ‘ప్రైవేట్’ జపం.. వైద్య విద్యార్థులకు శాపం
గుంటూరులో ఉంటున్న కోటేశ్వరరావు ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆయన కుమారుడు అశ్వర్థ్ నీట్ యూజీృ2025లో 484 మార్కులు సాధించాడు. ఈ ఏడాది పేపర్ సరళిని బట్టి మంచి స్కోర్ సాధించాడని, కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు వస్తుందని అశ్వర్థ్ తల్లిదండ్రులు భావించారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో ఓపెన్ కేటగిరీలో 491 స్కోర్ వరకు కన్వీనర్ సీటు వచ్చింది. ఏడు మార్కుల తేడాతో అశ్వర్థ్ కన్వీనర్ కోటా సీటు కోల్పోయాడు. గుంటూరుకే చెందిన అశ్వర్థ్ స్నేహితుడు ధీరజ్ నీట్లో 475 స్కోర్ చేయగా 16 మార్కుల తేడాతో కన్వీనర్ కోటా సీటు చేజారింది. ‘డాక్టర్ కావాలని మా అబ్బాయి చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కనేవాడు. అప్పులు చేసి రూ.5 లక్షలు ఖర్చు పెట్టి విజయవాడలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదివించా. అక్కడే నీట్ కోచింగ్ తీసుకుని రేయింబవళ్లు కష్టపడి చదివాడు. మంచి మార్కులొచ్చినా మావాడికి కన్వీనర్ కోటా సీటు రాలేదు. ఈ ప్రభుత్వం కనీసం ఒక్క వైద్య కళాశాలను ప్రారంభించినా మావాడికి కచ్చితంగా కన్వీనర్ సీటులో వచ్చేది. ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రారంభించకపోవడంతో అన్యాయం జరిగింది..’ అని అశ్వర్థ్ తండ్రి కోటేశ్వరరావు ఆవేదన చెందుతున్నారు. దేశ చరిత్రలో ప్రభుత్వ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న మెడికల్ కాలేజీలను తమకొద్దని చెప్పి చంద్రబాబు చరిత్రకెక్కారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, అమరావతివైద్య విద్య కలలు ఛిద్రం..ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం రాష్ట్రంలో అశ్వర్థ్, ధీరజ్ లాంటి వేల మంది విద్యార్థులకు టీడీపీ కూటమి సర్కారు ద్రోహం తలపెడుతోంది. మన విద్యార్థుల వైద్య విద్య కలలను ఛిద్రం చేస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో గతేడాది నాలుగు, ఈ దఫా ఏడు కొత్త వైద్య కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా చంద్రబాబు ప్రభుత్వం మోకాలడ్డటంతో ఈ ఒక్క విద్యాసంవత్సరమే ఏకంగా 1,750 ఎంబీబీఎస్ సీట్లను మన విద్యార్థులు నష్టపోయారు. బాగా చదివి నీట్లో మంచి స్కోర్ చేసినప్పటికీ కూటమి సర్కారు నిర్వాకాలతో ఏపీ విద్యార్థులకు కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు దక్కలేదు. అదే తెలంగాణలో.. గతేడాది ఎనిమిది, ఈదఫా ఒకటి చొప్పున కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రావడంతో మెడికల్ సీట్లు మరిన్ని పెరిగాయి. తద్వారా తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య చదివే అవకాశాలు మెరుగుపడ్డాయి. రెండో విడత కౌన్సెలింగ్ ముగిసే సమయానికి తెలంగాణలో ఓపెన్ కేటగిరిలో నీట్లో 406 మార్కులు స్కోర్ చేసిన విద్యార్థికి కూడా కన్వీనర్ కోటాలో సీటు లభించింది. కానీ ఏపీలో మాత్రం పోటీకి తగ్గట్టుగా మెడికల్ సీట్లు పెరగకపోవడంతో ఏయూ రీజియన్‌లో 491, ఎస్వీయూ పరిధిలో 479 మార్కుల వరకు మాత్రమే కన్వీనర్ సీటు దక్కింది. ఈ లెక్కన చూస్తే తెలంగాణలో కంటే 73–85 మార్కులు ఎక్కువగా వచ్చినప్పటికీ ఏపీ విద్యార్థులకు కన్వీనర్ కోటాలో మెడికల్ సీటు దక్కకపోవడం గమనార్హం.రిజర్వేషన్ విద్యార్థులకు తీవ్ర అన్యాయంరాష్ట్ర విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలు మరింతగా పెంచడంతోపాటు ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు చేరువలో అందించే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్ 17 కొత్త వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారు. వాటిలో 2023–24లోనే ఐదు కళాశాలలు ప్రారంభించడం ద్వారా 750 మెడికల్ సీట్లు రాష్ట్రానికి అదనంగా సమకూర్చారు. చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం గతేడాది నాలుగు మెడికల్ కాలేజీలు (పులివెందుల, మదనపల్లి, మార్కాపురం, ఆదోని) ప్రారంభం కాకుండా అడ్డుపడ్డారు. పులివెందుల వైద్యకళాశాలకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చినప్పటికీ.. తమకు వద్దంటూ కూటమి సర్కారు లేఖ రాసింది. ఎట్టకేలకు పాడేరులో మెడికల్ కాలేజీ ప్రారంభమైనా.. 150 సీట్లు రావాల్సింది 50 మాత్రమే వచ్చాయి. ఇలా గత విద్యాసంవత్సరం 700 సీట్లు రాష్ట్రానికి సమకూరకుండా చంద్రబాబు ప్రభుత్వం అడ్డుపడింది. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో మరో 7 వైద్య కళాశాలలు (పాలకొల్లు, నర్సీపట్నం, అమలాపురం, పిడుగురాళ్ల, పెనుగొండ, పార్వతీపురం, బాపట్ల) ప్రారంభమై 1,050 ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రానికి అదనంగా సమకూరాల్సి ఉండగా ఒక్క వైద్యకళాశాలను కూడా చంద్రబాబు సర్కారు ప్రారంభించలేదు. ఇలా టీడీపీ కూటమి సర్కారు కక్షపూరిత విధానాలతో రెండేళ్లలో 2,450 మంది ఏపీ విద్యార్థులు వైద్యవిద్యకు దూరమయ్యారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురయ్యారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో రిజర్వేషన్ విభాగాల్లో కటాఫ్ వ్యత్యాసం 100 మార్కులు, ఆపైన ఉండటమే దీనికి నిదర్శనం. రెండోదశ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్‌లో తెలంగాణలో బీసీ–ఏ విభాగంలో 341 మార్కులు సాధించిన విద్యార్థులకు కన్వీనర్ కోటా సీటు దక్కడం గమనార్హం. అదే ఏపీలోని ఎస్వీయూ పరిధిలో తెలంగాణలో కంటే వందకుపైగా అదనంగా మార్కులు స్కోర్ చేసినా ఏపీ విద్యార్థులకు కన్వీనర్ కోటా సీటు దక్కని దుస్థితి నెలకొంది. కొత్తవి తేకపోగా.. ఉన్నవాటికి ఎసరు..కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉన్నత వైద్యం, విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలు పెంపొందించాలని దేశంలో అన్ని రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సైతం కేంద్రంతో సంప్రదింపులు జరిపి కొత్త ప్రభుత్వ వైద్యకళాశాలలకు అనుమతులు తెచ్చుకుంటున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కూటమి పార్టీలు కీలక భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. ఇంత అనుకూలమైన పరిస్థితులున్నప్పటికీ సద్వినియోగం చేసుకోకుండా మన విద్యార్థుల వైద్య విద్య కలలను చిదిమేస్తూ చంద్రబాబు సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ గత ప్రభుత్వం పట్టుబట్టి సాధించిన వైద్య కళాశాలలను ప్రైవేట్ చేతుల్లో పెడుతుండటం పట్ల తల్లిదండ్రులు, విద్యార్థులు మండిపడుతున్నారు. వైద్యులై ప్రజలకు సేవలు అందించాలనుకున్న పేద, మధ్య తరగతి విద్యార్థుల ఆశలను చిదిమేశారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాబు ప్రభుత్వం కొత్త కాలేజీలు తేకపోగా గత సర్కారు తెచ్చిన వాటిని సైతం ప్రైవేట్‌పరం చేయడమేమిటని నిలదీస్తున్నారు. అదే ఈ ప్రభుత్వం అడ్డుపడకుంటే ఏపీకి అదనంగా 2,450 మెడికల్ సీట్లు సమకూరి తమ పిల్లలకు కచ్చితంగా ఎంబీబీఎస్ సీట్లు వచ్చి ఉండేవని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఒక్క కాలేజీ ఏర్పాటైనా మా పాపకు సీటొచ్చేది..మా అమ్మాయికి నీట్లో 480 మార్కులు వచ్చాయి. తాను ఏయూ రీజియన్‌లో లోకల్. అక్కడ 491 మార్కులకే కన్వీనర్ కోటా సీటు ఆగిపోయింది. 11 మార్కుల తేడాతో మా అమ్మాయికి కన్వీనర్ కోటా సీటు దూరమైంది. మేనేజ్మెంట్ కోటాలో చేర్చి ఎంబీబీఎస్ చదివించే స్థోమత లేదు. ఈ ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజీని ప్రారంభించినా మా అమ్మాయికి కచ్చితంగా సీటు వచ్చి ఉండేది. కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభించకపోవడంతో మాలాంటి వాళ్లకు అన్యాయం జరుగుతోంది. – రోషిరెడ్డి, వైద్యవిద్య ఆశావహ విద్యార్థిని తండ్రి, వైఎస్సార్ కడప జిల్లా ఇప్పటికైనా విరమించుకోవాలిరాష్ట్రం విడిపోయే నాటికి తెలంగాణలో మనకంటే తక్కువ మెడికల్ సీట్లున్నాయి. ఇప్పుడు ఆ రాష్ట్రంలో 10 వేలకు చేరువలో ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఏపీలో మాత్రం ఏడువేల సీట్లు కూడా లేవు. సీట్లు పెరగకపోవడంతో మన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన కళాశాలలను ఈ ప్రభుత్వం పీపీపీలో ప్రైవేట్‌కు ఇస్తోంది. ప్రైవేట్‌కు వైద్యకళాశాలలు అప్పగిస్తే ప్రజలు, విద్యార్థులకు నష్టమే గానీ లాభం లేదు. అన్నివర్గాల నుంచి ప్రైవేటీకరణపై వ్యతిరేకత ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం పీపీపీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించి విద్యార్థులకు మేలు చేయాలి. – డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు, ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ -
హాస్టల్ విద్యార్థులపై వాచ్మెన్ వికృత చేష్టలు
తిరుపతి: తిరుపతిలో దారుణం జరిగింది, చెన్నారెడ్డి కాలనీలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ వాచ్మెన్ హరిగోపాల్ విద్యార్థులపై పైశాచిక దాడి చేశాడు. హాస్టల్ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అర్ధరాత్రి విద్యార్థులను గదికి పిలిపించుకుని బ్లూఫిల్మ్స్ చూపించి వికృత చేష్టలు చేస్తూ అసాంఘిక శృంగారంకు పాల్పడ్డాడు.విద్యార్థులు భయంతో విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో సదరు సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక దాంతో వాచ్మెన్ చేసిన అసాంఘిక శృంగారంపై హాస్టల్ వార్డెన్ ముని శంకర్ దృష్టికి తీసుకువెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు.వెంటనే ఈ విషయంపై అలిపిరి పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
తగ్గండి.. తగ్గేదేలే
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌తో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు ఇచ్చిన పిలుపుతో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలన్నీ మూతపడ్డాయి. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ (ఫతి) ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించింది. ఇంజనీరింగ్, డిగ్రీ, డిప్లొమా, పాలిటెక్నిక్‌తో కలిపి మొత్తం 14 రకాలకు చెందిన 2,500 ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలున్నాయి. దోస్త్‌లేని డిగ్రీ కాలేజీలు, డీమ్డ్, ప్రైవేటు యూనివర్సిటీలు,కొన్ని కాలేజీలు కలిపి 400 వరకూ బంద్‌లో పాల్గొనలేదు. పలు జిల్లాల్లో కాలేజీల ఉద్యోగులు గేట్లకు తాళం వేసి, గేటు వద్ద నిరసన తెలిపారు. మరికొన్ని చోట్ల విద్యార్థులు కూడా నిరసనలో పాల్గొన్నారు. కాస్త తగ్గండి: బంద్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది. కాలేజీ యాజమాన్యాలకు ఫోన్లు చేసి, తనిఖీలకు వస్తామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. దీనికి కాలేజీ యాజమాన్యాలు నిరాకరించాయి. మరోవైపు ప్రభుత్వ స్థాయిలో బుజ్జగింపులు జరిగాయి. ఉన్నతాధికారులు యాజమాన్యాల ప్రతినిధులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా రూ.300 కోట్లు మంజూరు చేస్తామని బంద్‌ను విరమించాలని సీఎం కార్యాలయం యాజమాన్యాలకు ఫోన్లు చేసింది. ఇంకోవైపు బంద్ లేకుండా సంప్రదింపులు జరపాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డికి ముఖ్యమంత్రి కార్యాలయం సూచించింది. ఆయన చేసిన ప్రయత్నాలూ కూడా ఫలించలేదు. డబ్బులు ఇవ్వకుండా బంద్ విరమిస్తే ఫతిలో అభిప్రాయభేదాలొస్తాయని, అంతర్గతంగా వ్యతిరేకత పెరుగుతుందని ఫతి నేతలు మండలి చైర్మన్‌కు తెలిపారు. ఇదే విషయాన్ని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాత్రి వరకూ ఫోన్లు బంద్ విరమిస్తే బకాయిలపై చర్చిస్తామని సోమవారం రాత్రి వరకూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫతి నాయకులకు ఫోన్లు వచ్చాయి. రూ.10 వేల కోట్లు ఇవ్వాల్సిన చోట రూ.900 కోట్లు ఇస్తామని ఆరు నెలలుగా ప్రభుత్వం ఊరిస్తోందని, గతంలో ఈ మాటలు వినే ఆందోళనను విరమించుకున్నామని, ఈసారి అలా చేస్తే తమ దారి తాము చూసుకోవాల్సి వస్తుందని కొంతమంది ఫతి నేతలు హెచ్చరించారు. దారికి తెచ్చేందుకు ప్రభుత్వం, తాడోపేడో తేల్చుకోవాల్సిందేనని యాజమాన్యాలు ఉండటంతో కాలేజీల మూత వ్యవహారం ఎంత కాలం కొనసాగుతుందనే ఆందోళన అన్నివర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ఆందోళన మరింత తీవ్రతరం : ఫతి అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రమేశ్‌బాబు ప్రభుత్వం హామీతో సరిపెట్టి డబ్బులు మాత్రం ఇవ్వలేదని ఫతి అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రమేశ్ అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఫతి నేతలు మాట్లాడారు. బకాయిల మొత్తంలో 50 శాతమైనా తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8వ తేదీన 30 వేల మంది కాలేజీ సిబ్బందితో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. 11వ తేదీన 10 లక్షల మంది విద్యార్థులతో రాజధానిలో సభ పెట్టబోతున్నట్టు చెప్పారు. రూ. 300 కోట్లు ఇస్తామని, బంద్ విరమించమంటూ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఏ కాలేజీ యాజమాన్యం అంగీకరించడం లేదన్నారు. సీబీఐటీ, వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి, మాతృశ్రీ కాలేజీలు బంద్‌లో పాల్గొనలేదని, వారితో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. బ్లాక్ మెయిల్‌కు భయపడేదే లేదు : అల్జాపూర్ శ్రీనివాస్ (ఫతి వైస్ ప్రెసిడెంట్) దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రేవంత్‌రెడ్డి సర్కార్ నిరీ్వర్యం చేయాలని చూస్తోందని ఫతి ఉపాధ్యక్షుడు అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు. నిరుద్యోగ యువత స్థాపించిన కాలేజీలు నిధులు లేక అలమటిస్తున్నాయని మొత్తుకుంటుంటే, ప్రభుత్వం విజిలెన్స్ దాడుల పేరుతో బ్లాక్ మొయిల్ చేస్తోందని మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కె.సునీల్‌రుమార్, కోశాధికారి కృష్ణారావు, కోఆర్డినేటర్ రాంజాన్, పీజీ కాలేజీల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సూర్యనారాయణరెడ్డి , ఫతి నాయకుడు లీలా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వేధింపుల ప్రిన్సిపాల్ మాకొద్దు
షాద్‌నగర్: ‘అడుగడుగునా వేధిస్తోంది.. లంచాలు అడుగుతోంది.. కులం పేరుతో దూషిస్తోంది.. మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.. ఈ ప్రిన్సిపాల్ మా కొద్దు.. ఆమె నుంచి విముక్తి కల్పించండి’ అంటూ విద్యార్థినులు రోడ్డెక్కారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని కమ్మదనం గ్రామ శివారులో నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో నాగర్‌కర్నూల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల కొనసాగుతోంది. ఇక్కడ సుమారు 600 మంది విద్యార్థినులు విద్యాభ్యాసం సాగిస్తున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ శైలజ తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపిస్తూ ఆదివారం విద్యార్థినులు ప్లకార్డులు పట్టుకొని పెద్దసంఖ్యలో హాస్టల్ నుంచి బయటికి వచ్చారు. సుమారు రెండున్నర కిలోమీటర్లకు పైగా ర్యాలీగా వెళ్లి షాద్‌నగర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు.వీరి ఆందోళనకు ఎస్ఎఫ్ఐ నాయకులు మద్దతు తెలిపారు. ఓ దశలో విద్యార్థినులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు విద్యార్థినులు సొమ్మసిల్లి కింద పడిపోయారు. మఫ్టీలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ విద్యార్థినులను బలవంతంగా వాహనంలో ఎక్కించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఓ విద్యార్థినిని చెంపపై కొట్టడంతో అంతా ఆగ్రహంతో ఆమెను జుట్టుపట్టి కొద్దిదూరం ఈడ్చుకెళ్లి చితకబాదారు.పట్టణ సీఐ విజయ్‌కుమార్ విద్యార్థినులకు నచ్చజెప్పి పోలీస్‌స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. త్వరలో కమిటీ వేసి సమస్యను పరిష్కరిస్తామని జోనల్ ఆఫీసర్ నిర్మల చెప్పినా వారు వినలేదు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాల్సిందేనని, అప్పటివరకు హాస్టల్‌కు వెళ్లబోమని భీష్మించుకుని ఠాణా ఎదుటే కాసేపు బైఠాయించారు. తిరిగి చౌరస్తా వద్దకు వచ్చి ధర్నా చేపట్టారు. పోలీసులు మరోసారి వారికి సర్దిచెప్పి బస్సుల్లో హాస్టల్‌కు పంపించారు. -
బయోటెక్నాలజీ విద్యార్థులకు శుభవార్త
నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ (నిజామాబాద్) ఎం.ఎస్సీ బయోటెక్నాలజీ విద్యార్థులకు శుభవార్త. ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్స్ (ఫాబా)ఆధ్వర్యంలో నిర్వహించిన 10 రోజుల ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమానికి ఎస్సీఎస్ ఛారిటబుల్ ట్రస్ట్ లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది.ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు ప్రయోగాలను వారి చేతులతో స్వయంగా చేసే అవకాశం లభించింది. పరిశ్రమ స్థాయి నైపుణ్యాలను పెంచే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి, ఫాబా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, ప్రొఫెసర్ పల్లూ రెడ్డన్న, వారి బృందం చేసిన కృషి ప్రశంసనీయంగా నిలిచింది. విద్యార్థులు తమ అకడమిక్ పరిజ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి, భవిష్యత్తులో పరిశ్రమలకు సిద్ధం కావడానికి ఈ శిక్షణ ఎంతగానో దోహదపడింది. ఇలాంటి విలువైన కార్యక్రమానికి తోడ్పాటు అందించిన ఎస్సీఎస్ ఛారిటబుల్ ట్రస్ట్‌ను, ఫాబా బృందాన్ని, విద్యార్థులను ప్రోత్సహించిన ప్రొఫెసర్ ప్రవీణ్‌ను యూనివర్సిటీ వర్గాలు అభినందించాయి. -
మేనేజ్మెంట్ సీట్లలోనూ 85 శాతం స్థానికులకే..
సాక్షి, హైదరాబాద్ : పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యవిద్య మేనేజ్మెంట్ సీట్ల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేనేజ్మెంట్ సీట్లను అఖిల భారతస్థాయిలో భర్తీ చేసుకునే అవకాశం ఉండగా.. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు 85 శాతం సీట్లను రిజర్వ్ చేయాలని నిర్ణయించింది. అఖిలభారత స్థాయిలో కేవలం 15 శాతం సీట్లను మాత్రమే వైద్య కళాశాలల యాజమాన్యాలు భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు నేడో రేపో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. రాష్ట్రంలో మొత్తం 31 పీజీ వైద్య కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి 2,983 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 19 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 1,511 సీట్లలో కన్వీనర్ కోటా కింద 7,70 సీట్లు భర్తీ చేయగా.. మిగిలిన 741 సీట్లను యాజమాన్యాలు అఖిలభారత కోటా కింద భర్తీ చేస్తున్నాయి.మేనేజ్మెంట్ కోటా సీట్లను కూడా 85 శాతం తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా చేసిన విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శిని సీఎం ఆదేశించారు. తద్వారా పీజీ సీట్లలో తెలంగాణ విద్యార్థులకు 318 సీట్లతోపాటు 70 పీజీ డెంటల్ సీట్లు కూడా అదనంగా అందుబాటులోకి రానున్నాయి. 56 పీజీ వైద్య సీట్లు ఆలిండియా కోటా కింద రిజర్వ్ కానున్నాయి. రాష్ట్ర విద్యార్థులకు లబ్ధి చేకూర్చే నిర్ణయం తీసుకున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి దామోదర్ రాజనర్సింహ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరుగుతుందని, తద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. -
సార్.. మీరు వెళ్లొద్దు
నల్గొండ జిల్లా: మాడుగులపల్లి మండలంలోని కుక్కడం గ్రామంలో గల మండల పరిషత్ పాఠశాలలో ప్రధానోపాద్యాయుడిగా పనిచేస్తున్న నన్నూరి వెంకట్‌రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. మీరు వెళ్లొద్దు సార్.. మాతోనే ఉండాలి అంటూ రోదించారు. హెచ్ఎం వారిని ఓదార్చి వెళ్లిపోయారు. గ్రామస్తులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. కార్యక్రమంలో ఎంఈవో వెంకటమ్మ, నూతన హెచ్ఎం వీరయ్య, కేజీబీవీ ఎస్ఓ వసంతకుమారి, ఉపాధ్యాయులు నిరంజన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. 55 మంది విద్యార్థులకు అస్వస్థత
-
విద్యాసంస్థల్లో ఆత్మహత్యల నివారణ..
న్యూఢిల్లీ: విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై గతంలో తాము జారీ చేసిన మార్గదర్శకాల అమలుపై సవవివర నివేదికను 8 వారాల్లోగా సమరి్పంచాలని సుప్రీంకోర్టు కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. విద్యాసంస్థల్లో విద్యార్థుల బలవన్మరణాలను నివారించే లక్ష్యంగా జూలై 25వ తేదీన అత్యున్నత న్యాయస్థానం పలు మార్గదర్శకాలను వెలువరించింది. వాటి అమలుపై సోమవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. 90 రోజుల్లో అఫిడవిట్ సమరి్పంచాలని జూలైలో జరిపిన విచారణ సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయాన్ని కూడా ధర్మాసనం గుర్తు చేసింది. తదుపరి విచారణను 2026 జనవరిలో చేపడతామని పేర్కొంది. గత విచారణ సమయంలో దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థులను పట్టి పీడిస్తున్న మానసిక ఆరోగ్య సంక్షోభం తీవ్రతను గుర్తించి, పరిష్కరించాల్సిన అవసరముందని పేర్కొంది. విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు సంబంధించి దేశంలో ఏకీకృత, అమలు చేయదగిన చట్టపరమైన, నియంత్రణ విధానమేదీ లేకపోవడం శాసనపరమైన శూన్యతగా ధర్మాసనం అభివరి్ణంచింది. విశాఖపట్నంలో నేషనల్ ఎలిజిబిలిటీ–కమ్–ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు శిక్షణ పొందుతున్న 17 ఏళ్ల విద్యార్థి తనువు చాలించడంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు జూలై 25వ తేదీన 15 మార్గదర్శకాలను వెలువరించింది. ప్రభుత్వం తగు విధానాలను అమల్లోకి తెచ్చే వరకు ఇవి అమల్లో ఉంటాయని తెలిపింది. -
దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలలు 8,000..!
భారతదేశం విద్యారంగం చాలా మందికి ఉపాధి కల్పిస్తోంది. 2024-25లో మొత్తం పాఠశాల ఉపాధ్యాయుల సంఖ్య ఒక కోటి మార్కును దాటడం దీనికి నిదర్శనం. అయితే దేశంలోని విద్యారంగంలో కొన్ని కీలకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు కేవలం విద్యా నాణ్యతకే పరిమితం కాకుండా, దేశ సుస్థిర ఆర్థిక వృద్ధికి, మానవ వనరుల అభివృద్ధిపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.ప్రభుత్వ పాఠశాల వ్యవస్థలో ప్రధాన సమస్యలువిద్యార్థులు లేని పాఠశాలలు2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం అంతటా దాదాపు 8,000 పాఠశాలల్లో విద్యార్థులు లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. విద్యార్థులు లేని పాఠశాలలు ప్రభుత్వం ఖర్చు చేసిన వనరులపై ఎలాంటి ఫలితాలు అందించని పెట్టుబడిని సూచిస్తాయి. భవనాలు, మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల జీతాల కోసం ఖర్చు చేసిన ప్రజా ధనం వృథా అవుతుంది. చాలాచోట్ల పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల జీతాల రూపంలో ప్రజాధనం పంపిణీ అవుతున్నా ఉత్పత్తి శూన్యం (Zero Output). అంటే విద్యార్థులకు విద్య అందకపోవడం, ద్రవ్య వనరుల దుర్వినియోగానికి ఇది దారితీస్తుంది. ఇది ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.జీతాలు లేకుండా పనులు..కొన్ని చోట్ల కాంట్రాక్టు ఉపాధ్యాయులు సుమారు 20,000 మందికి పైగా జీతాలు లేకుండా పని చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది వ్యవస్థాపరమైన లోపాలను స్పష్టం చేస్తుంది. తమిళనాడు, కేరళతోపాటు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో ‘సమగ్ర శిక్ష’ వంటి పథకాల కింద పనిచేస్తున్న వేలాది మంది ఉపాధ్యాయులు తమ వేతనాల్లో ఆలస్యం జరుగుతున్నట్లు చెప్పారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల విడుదలలో జాప్యం జరుగుతుండడం కారణంగా ఉంది.జీతాల ఆలస్యం ఉపాధ్యాయుల్లో నిరాశ, పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వారు తమ వృత్తిపై దృష్టి పెట్టలేక ఆర్థిక భద్రత కోసం అదనపు వనరులను వెతుక్కోవాల్సి వస్తుంది. జీతాల ఆలస్యం కారణంగా ఉపాధ్యాయుల కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఇది వినియోగాన్ని తగ్గించి మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.ఇదీ చదవండి: రిటైర్డ్ బ్యాంకర్లకు గుడ్ న్యూస్ -
ఇంటర్న్‌షిప్ జాతర.. లక్షమందికి సదవకాశం
న్యూఢ్లిలీ: దేశవ్యాప్తంగా విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణ, అనుభవాన్ని అందించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ప్రత్యేక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్–2026ను ప్రకటించింది. జాతీయ ఇంటర్న్‌షిప్ పోర్టల్ ద్వారా ఒక కోటి ఇంటర్న్‌షిప్‌లను అందించే లక్ష్యంలో భాగంగా ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రస్తుతం లక్షమందికి ఉచిత ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని కల్పిస్తోంది.ఎవరు చేరవచ్చు?ఇంజినీరింగ్‌తోపాటు మేనేజ్మెంట్, ఆర్ట్స్, కామర్స్, డిప్లొమా విద్యార్థులకు బోధన కాలంలోనే ఆచరణాత్మక వృత్తి నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఏఐసీటీఈ ప్రవేశపెట్టింది. తద్వారా అభ్యాసం, పరిశ్రమలకు మధ్య అంతరాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ముఖ్యంగా విద్యార్థులను రెడీ టూ వర్క్‌కు సిద్ధం చేస్తోంది. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఆర్ట్స్, కామర్స్ మొదలైన విభాగాలలో డిప్లొమా, యూజీ, పీజీ చేస్తున్న విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.రూ.15వేల వరకు స్టయిఫండ్లక్ష మందికి పైగా ఉచితంగా అందించే ఇంటర్న్‌షిప్‌లను ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలోఏఐసీటీఈ అందిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ–ఎథికల్ హ్యాకింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, స్పేస్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్–డేవ్ ఆప్స్, ప్రభుత్వంలోని నీతి ఆయోగ్, భారత ప్రభుత్వ విధానాలు, ఎంఎస్ఎంఈ కార్యక్రమాలు, మహిళా సాధికారత, స్మార్ట్ విలేజ్, ఏఐసీటీఈ గ్రామీణ ఆవిష్కరణ మిషన్ల కార్యక్రమాలు వంటి ప్రభుత్వ, నూతన సాంకేతిక అంశాల్లో వృత్తిపరమైన నైపుణ్య శిక్షణ కల్పిస్తుంది. ఇంటర్న్‌షిప్ కాలవ్యవధి 4 నుంచి 12 వారాలు కాగా, కొన్ని సంస్థలు రూ.5వేల నుంచి రూ.15వేల వరకు స్టయిఫండ్ ఇస్తాయి. ఇంటర్న్‌షిప్ ముగిసిన తర్వాత ఏఐసీటీఈ పోర్టల్ ద్వారా డిజిటల్ సర్టిఫికెట్ అందిస్తారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ఎంపికలో తొలి ప్రాధాన్యత ఇస్తారు.భాగస్వామ్య సంస్థలుఈ ఇంటర్న్‌షిప్‌లను కింద పేర్కొన్న ప్రముఖ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు నిర్వహిస్తాయి.ఐబీఎంసిస్కోమైక్రోసాఫ్ట్ఇస్రోడీఆర్డీఓనాస్కామ్(NASSCOM)నీతి ఆయోగ్ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖనైపుణ్యం అందించే విభాగాలువిద్యార్థులు అత్యాధునిక డొమైన్లలో ఈ కింద పేర్కొన్న నైపుణ్యాలను పొందవచ్చుకృత్రిమ మేధస్సుసైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ఎలక్ట్రిక్ వాహనాలుస్పేస్ టెక్నాలజీక్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డెవ్ఆప్స్స్మార్ట్ విలేజ్ ఇన్నోవేషన్ప్రభుత్వ పాలసీ అండ్ మహిళా సాధికారతఎలా దరఖాస్తు చేయాలి?విద్యార్థులు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ఈ ఇంటర్న్‌షిప్ బాటలు వేస్తోంది. ఈ ఇంటర్న్‌షిప్‌లో డిప్లొమా, యూజీ, పీజీలలో ఏ విభాగానికి చెందిన విద్యార్థులైనా ఉచితంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్‌ను ఈ లింక్ ( https://internship.aicte-india.org/) ద్వారా చేసుకోవచ్చు. -
విద్యార్థి ఖాతాకే ‘ఫీజు’
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మరింత సంస్కరించాలని సంక్షేమ శాఖలు భావిస్తున్నాయి. ఫీజుల చెల్లింపుల్లో మరింత పారదర్శకత పాటించడంతోపాటు సులభతరంగా చెల్లింపులు చేసేందుకు మరిన్ని మార్పులు తేవడంపై కసరత్తు చేస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద చెల్లించే ఫీజులను కాలేజీ యాజమాన్య ఖాతాల్లో కాకుండా నేరుగా విద్యార్థి ఖాతాకు విడుదల చేసేలా నిబంధనల మార్పునకు శ్రీకారం చుడుతున్నాయి. ఎస్సీ అభివృద్ధి శాఖ గత విద్యాసంవత్సరం నుంచి విద్యార్థి ఖాతాకు ఫీజులు విడుదల చేస్తుండగా గిరిజన, వెనుకబడిన తరగతులు, మైనారిటీ సంక్షేమ శాఖలు కూడా నేరుగా విద్యార్థులకే ఫీజులు విడుదల చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాయి. తాజాగా ఈ ప్రతిపాదనలను సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సమర్పించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపాక ఈ మార్పులు అమల్లోకి రానున్నట్లు సమాచారం. కాలేజీల ఆధిపత్యానికి చెక్... సంక్షేమ శాఖలు అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో కాలేజీల యాజమాన్యాల ఆధిపత్యంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఫీజు నిధుల విడుదలలో జాప్యం వల్ల ఆ ప్రభావం విద్యార్థులపై పడుతోంది. ఫీజు అందే దాకా విద్యార్థుల ధ్రువపత్రాలు ఇచ్చేందుకు చాలా కాలేజీల యాజమాన్యాలు నిరాకరిస్తుండటం వల్ల కోర్సులు పూర్తి చేసినా ఉద్యోగ ఇంటర్వ్యూలు, చేరికల వేళ వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కాలేజీలు ఫీజు పథకం పరిధిలోని విద్యార్థుల నుంచి కూడా ముందస్తుగా ఫీజులు వసూలు చేస్తున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాలేజీల ఆదిపత్యానికి చెక్ పెట్టడంతోపాటు విద్యార్థికి నేరుగా ఫీజులు చెల్లించడం వల్ల పారదర్శకత ఉంటుందనే కోణంలో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నెలవారీగా నిధులు.. ఈ అంశంపై బీసీ సంక్షేమం, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సంక్షేమ శాఖల సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఇకపై సంక్షమ శాఖలకు నెలవారీగా బడ్జెట్ విడుదల చేస్తామని ఈ సమావేశంలో సీఎం స్పష్టం చేశారు. నెలకు రూ. 500 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తే అందులో గురుకుల విద్యాసంస్థల నిర్వహణ, హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల నిర్వహణతోపాటు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులకు వాటిని వినియోగించుకోవచ్చని సీఎం సూచించారు. ఈ క్రమంలో నెలవారీగా నిధులు విడుదల చేస్తే ఉపకార వేతనాలు, ఫీజుల కోసం నెలకు రూ. 200 కోట్ల మేర ఖర్చు చేసే అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు విశ్వసనీయ సమాచారం. -
ఉన్నత విద్యాభ్యాసానికి ఆర్థిక సాయం
కర్నూలు సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఐదుగురికి ఉన్నత విద్యాభ్యాసం కోసం రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. ఆ కాలేజీ పూర్వ విద్యార్థి, మకుట డెవలపర్స్ ఛైర్మన్ కొంపల్లి జనార్ధన్. ఇటీవలే ముగిసిన వార్షిక సమావేశంలో పూర్వవిద్యార్థులతో కిటకిటలాడింది. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఐఏఎస్ అధికారి ఎస్.సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సమావేశంలో కొంపల్లి జనార్ధన్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. మెరిటోరియస్ విద్యార్థులు ఐదుగురిని ఎంపిక చేసి ఒకొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని, ఇది వారి ఉన్నత విద్యాభ్యాసానికి, లేదా నైపుణ్యాభివృద్ధికి ఉపయోగించుకునేందుకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. కాలేజీ యాజమాన్యం, పూర్వవిద్యార్థులు పలువురు ఈ విరాళంపై హర్షం వ్యక్తం చేశారు. భావితరాలకు విద్యాభ్యాసానికి ఉపయుక్తమని కొనియాడారు. కొంపల్లి జనార్ధన్ 2-006లో స్థాపించిన మకుట డెవలపర్స్ దక్షిణ భారతదేశం మొత్తమ్మీద అనేక వాణిజ్య, నివాస రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది.(చదవండి: ఇలా అయితే కష్టం సుమీ!) -
అమెరికాలోని విదేశీ విద్యార్థులకు ఊరట.. H-1B వీసా ఫీజు రద్దు
అమెరికాలోని విదేశీ విద్యార్థులకు హెచ్ -1బీ (H-1B) వీసా ఫీజు కింద వసూలు చేసే 1,00,000 డాలర్లను మినహాయిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో టెక్ కంపెనీలకు ఉపశమనం కలిగినట్లయింది. ముఖ్యంగా సాంకేతిక రంగంలో ప్రతిభావంతులను నియమించుకునే సంస్థలకు ఇది మంచి పరిణామం. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం ప్రకారం F1 వీసాలపై అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులు (భారతీయ విద్యార్థులతో సహా) ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు వారిని నియమించుకునే కంపెనీలు 1,00,000 డాలర్ల ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.ఇది యూఎస్ కార్పొరేట్ కంపెనీలు, స్టార్టప్‌లకు అక్కడే చదువుతున్న విదేశీ విద్యార్థులను నియామకం చేసుకోవడానికి మార్గం సుగమం చేస్తుంది. అమెరికన్ కంపెనీలు తక్కువ ఖర్చుతో ఈ ప్రతిభను నియమించుకోవడానికి అవకాశం ఏర్పడటంతో ఇది వారికి పెద్ద విజయం అని కొందరు భావిస్తున్నారు.భారతీయ ఐటీ సంస్థలపై ప్రభావంభారతీయ ఐటీ సేవల సంస్థలకు ఈ నిర్ణయం పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అభిప్రాయలున్నాయి. సాంప్రదాయకంగా ఈ సంస్థలు భారతదేశం నుంచి ఉద్యోగులను H-1B వీసాలపై బదిలీ చేస్తుంటాయి. వీరి వీసా ఫీజు లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే భాతర ఐటీ కంపెనీలు తాము H-1B వీసాలపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించామని చెబుతున్నాయి. స్థానికులనే ఎక్కువగా నియమించుకుంటున్నట్లు తెలిజేస్తున్నాయి.విప్రో వంటి సంస్థల్లో యూఎస్ ఉద్యోగుల్లో దాదాపు 80% మంది స్థానిక ఉద్యోగులేనని సమాచారం. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ సైతం కొద్దిమంది ఉద్యోగులను మాత్రమే ఇమ్మిగ్రేషన్ సేవలకోసం ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. మిగిలినవారు ఇప్పటికే అమెరికాలో నివసిస్తున్నారని తెలిపారు. టీసీఎస్ కూడా ప్రతి సంవత్సరం వేలాది వీసాల కోసం దాఖలు చేసినా కేవలం 500 మంది మాత్రమే H-1B వీసాపై యుఎస్‌కు వెళ్తున్నట్లు గతంలో తెలిపింది.ఇదీ చదవండి: ఒక్కరోజులో రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు స్వీకరిస్తున్నారా? -
అమెరికాలోనే చదివిన వారికి లక్ష డాలర్ల ఫీజులేదు
న్యూయార్క్: హెచ్–1బీ వీసా దరఖాస్తుదారులందరిపై ఏకంగా ఒకేసారి లక్ష డాలర్ల ఫీజు గుదిబండ పడేసిన ట్రంప్ సర్కార్ హఠాత్తుగా ఒక వర్గం వారికి మాత్రం భారీ లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమెరికాలో ఉంటూ విద్యనభ్యసిస్తూ హెచ్–1బీ కోసం దరఖాస్తుచేసుకున్న విద్యార్థులు ఈ అధిక వీసా ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదని ట్రంప్ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు సోమవారం అమెరికా సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) విభాగం ఒక నోటిఫికేషన్ జారీచేసింది.ఇప్పటికే అమెరికాలోని పలు రంగాల సంస్థల్లో పనులు చేస్తున్న విదేశీయులు చేసే దరఖాస్తులకు సైతం లక్ష డాలర్ల మినహాయింపు వర్తిస్తుందని యూఎస్సీఐఎస్ ఆ ప్రకటనలో పేర్కొంది. దీంతో ఇప్పటికే అమెరికాలో చదువుకుంటున్న, అక్కడి సంస్థల్లో పనిచేస్తున్న భారతీయులకు భారీ లబ్ధిచేకూరనుంది. విదేశాల్లోని వ్యక్తులు చేసే హెచ్–1బీ వీసా దరఖాస్తులకు మాత్రం లక్ష డాలర్ల ఫీజు ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది.అమెరికాలో విద్యనభ్యసిస్తూ ఎఫ్–1వీసా ఉండి దానికి హెచ్–1బీ వీసాగా మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వాళ్లు ఈ లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. సెపె్టంబర్ 21వ తేదీ మొదలవగానే అర్ధరాత్రి 12.01 నిమిషాల తర్వాత వచ్చే ప్రతి విదేశీ హెచ్–1బీ వీసా దరఖాస్తుదారులు తప్పకుండా లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని గతంలోనే ట్రంప్ ప్రభుత్వం స్పష్టంచేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఏఏ వర్గాల వారికి ఈ అధిక ఫీజు మినహాయింపు ఉంటుందనే దానిపై సోమవారం యూఎస్సీఐఎస్ ఈ ప్రకటనలో స్పష్టతనిచ్చింది.. హాయిగా వెళ్లిరావొచ్చు ఇప్పటికే హెచ్–1బీ వీసా ఉన్న విదేశీయులు అత్యవసర పనుల నిమిత్తం స్వదేశం లేదా విదేశాలకు వెళితే మళ్లీ తిరిగొచ్చేటప్పుడు వీసా నిబంధనలు ప్రతిబంధకంగా మారుతాయన్న భయంతో చాలా మంది ఎక్కడికి వెళ్లకుండా అమెరికా గడ్డ మీదనే ఉండిపోతున్నారు. ఇలాంటి భయాలు అక్కర్లేదని హాయిగా అమెరికా నుంచి విదేశాలకు వెళ్లిరావొచ్చని ప్రభుత్వం స్పష్టంచేసింది. ‘‘హెచ్–1బీ వీసా పొడిగింపు, హెచ్–1బీ వీసాగా మార్పు, నివాస స్థితి పొడిగింపు వంటి దరఖాస్తులు ఇంకా పరిశీలనలో ఉన్నందున ఈలోపు అంతర్జాతీయ విమానప్రయాణం చేస్తే తమ వీసా స్టేటస్‌కు ముప్పు వస్తుందనే భయం ఎవరికీ అక్కర్లేదు’’అని గ్రీన్ అండ్ స్పైగల్ న్యాయసేవల సంస్థ ఉన్నతాధికారి డ్యాన్ బెర్జర్ చెప్పారు. చిన్న మెలిక పెట్టిన ప్రభుత్వంఅయితే, ఇప్పటికే అమెరికాలో ఉంటూ చదువుకుంటున్న లేదా ఏదైనా ఉద్యోగం చేస్తున్న విదేశీయులు చేసే ‘హెచ్–1బీ వీసాగా మార్పు’,‘నివాస స్థితి పొడిగింపు’,‘స్టేటస్ మార్పు’వంటి అభ్యర్థనలకు వాళ్లు అనర్హులు అని తేలితే వాళ్ల నుంచి కూడా లక్ష డాలర్ల ఫీజు వసూలుచేస్తామని యూఎస్సీఐఎస్ వ్యాఖ్యానించింది. ఈ లెక్కన ఏ దరఖాస్తునైనా ఉద్దేశపూర్వకంగా అనర్హమైనదిగా ప్రకటించి లక్ష డాలర్ల రుసుం కట్టాల్సిందేనని ఇమిగ్రేషన్ విభాగం ప్రకటిస్తే సమస్య మళ్లీ మొదటికొచ్చే ప్రమాదముందని కొందరు అభిప్రాయపడుతున్నారు.కొత్తగా విదేశాల నుంచి చేసే దరఖాస్తులకే లక్ష డాలర్ల ఫీజు ఉంటుంది. ఇప్పటికే హెచ్–1బీ వీసా ఉండి, దాని రెన్యూవల్ దరఖాస్తు ఆమోదం/పెండింగ్ స్థితిలో ఉండగా స్వదేశం వెళ్లిపోయిన విదేశీయులు మళ్లీ అమెరికాలోకి విమానంలో వచ్చినా వాళ్లకు సైతం ఫీజు మినహాయింపు ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం చూస్తే.. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులు మొదట అమెరికాలోనే చదువుకోవాలనేదే ట్రంప్ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టమవుతోంది.గత కొన్నాళ్లుగా హెచ్–1బీ వీసా దరఖాస్తుల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. భారతీయులు అమెరికా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని, వీరికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంలోనే లక్ష డాలర్ల ఫీజు ట్రంప్ తీసుకొచ్చారని తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వం ప్రతి ఏటా 65,000 హెచ్–1బీ వీసాలను జారీచేస్తోంది. ఇవిగాక అమెరికాలోనే మాస్టర్స్, అంతకుమించిన ఉన్నత విద్య చదివి ఉద్యోగాలు చేయాలనుకునే వారికి అర్హతల మేరకు మరో 20,000 హెచ్–1బీ వీసాలను అందజేస్తోంది. -
H1b Visa: విదేశీ విద్యార్థులకు భారీ ఊరట
అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. కొత్త H-1B వీసా దరఖాస్తులపై 100,000 డాలర్ల ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్(USCIS) పేర్కొంది. హెచ్1బీ ఫీజు పెంపుపై స్పష్టత ఇచ్చే క్రమంలో పలు వివరాలను వెల్లడించింది.హెచ్-1బీ ఫీజు పెంపు కేవలం అమెరికా బయట నుంచి దరఖాస్తు చేసుకొన్నవారికే వర్తిస్తుందని పేర్కొంటూ అమెరికాలో చదువుకొంటున్న విద్యార్థులకు అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ తీపి కబురు చెప్పింది. అలాగే.. ఫీజు పెంపు ప్రకటన వెలువడే సమయానికి అమెరికాలోనే ఉన్నవారికి మినహాయింపు వర్తిస్తుందని వెల్లడించింది.ఇదిలా ఉంటే.. 2025 సెప్టెంబర్ 19న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ప్రెసిడెన్షియల్ ప్రోక్లమేషన్’ విడుదల చేశారు. దీని ప్రకారం, కొత్త H-1B వీసా దరఖాస్తులపై $100,000 ఫీజు విధించబడుతుంది. ఈ ఫీజు 2025 సెప్టెంబర్ 21 నుంచి కొత్త H-1B వీసా పిటిషన్లకు వర్తించడం అమలైంది. అయితే.. USCIS అక్టోబర్ 20న ఫీజు అమలులో పారదర్శకత, మినహాయింపు విధానం, అర్హత ప్రమాణాలు గురించి వివరిస్తూ స్పష్టమైన మార్గదర్శకాలను తెలియజేసింది.మరోవైపు ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఈవెంట్లో పాల్గొన్న అమెరికా ఇమ్మిగ్రేషన్ న్యాయవాది నికోల్ గునారా మాట్లాడుతూ.. F-1 (విద్యార్థి వీసా), L-1 (ఇంటర్‌కంపెనీ ట్రాన్స్ఫర్ వీసా) లబ్ధిదారులు ఈ భారీ ఫీజు నుంచి విముక్తి పొందారని తెలిపారు. ఇది విదేశీ విద్యార్థుల భవిష్యత్తుకు ఉపశమనం కలిగించే నిర్ణయమని అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ మార్పులు అమెరికాలో ఉన్న ఉద్యోగదారులకు, అలాగే విద్యార్థులకు.. ఇమ్మిగ్రేషన్ ఖర్చులను తగ్గించేందుకు దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.భారత్ నుంచి వెళ్లే విద్యార్థులు ఎక్కువగా అమెరికాలో నుంచే H-1Bకి మారుతారు. కాబట్టి. ఈ భారీ ఫీజు వాళ్లు చెల్లించాల్సిన అవసరం ఉండదన్నమాట. -
సర్కారీ స్కూల్లో ఎందుకు చేర్చాలి?
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వ పాఠశాలల్లో మా పిల్లల్ని ఎందుకు చేర్చాలి?’ ఇదీ బడిబాట కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న ఉపాధ్యాయులకు తల్లిదండ్రుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. ఇదే విషయాన్ని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. విద్యార్థుల చేరికలు, అందులో ఎదురవుతున్న ఇబ్బందులు, క్షేత్రస్థాయిలో జరగాల్సిన కృషిని తెలియజేస్తూ సవివర నివేదిక సమర్పించింది. స్పందన ఏదీ? బడిబాటను ఈసారి పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం భావించినా క్షేత్రస్థాయిలో ఆశించిన ప్రయోజనాలు కనిపించలేదని విద్యాశాఖ వర్గాలు అంగీకరిస్తున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వద్దకు టీచర్లు వెళ్లినప్పుడు పెద్దగా స్పందన రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేకతలు ఏమిటనేవి ప్రజలకు చెప్పలేకపోతున్నామని టీచర్లు అంటున్నారు. అలాంటప్పుడు వారిని ఆకర్షించడం సాధ్యం కావడం లేదని పేర్కొంటున్నారు. ఏఐ జోరు పెంచితేనే.. ప్రైవేటు విద్యాసంస్థల్లో డిజిటల్ విద్యా బోధన చేస్తుండగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఈ తరహా ప్రాధాన్యత పెంచాలని విద్యాశాఖ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ) బోధన అందించేందుకు అనేక ప్రైవేటు కంపెనీలు ముందుకొస్తున్నాయి. వాటిని ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. అయితే ఏఐ యాప్‌లను వాడుకోవడానికి స్కూళ్లలో అనేక మార్పులు తేవాలని అధికారులు అంటున్నారు. ఇంటర్నెట్ స్పీడ్ పెంచడం, కంప్యూటర్లను అప్‌గ్రేడ్ చేయడం, డిజిటల్ లేబొరేటరీల ఏర్పాటు, అవసరమైన యాప్‌లను డౌన్లోడ్ చేసే, సాంకేతిక సహకారం అందించే నిపుణుల నియామకం బడుల్లో అవసరమని పాఠశాల విద్యాశాఖ అభిప్రాయపడింది. తగ్గుతున్న ప్రవేశాలు ప్రభుత్వ పాఠశాలల్లో గత పదేళ్లలో విద్యార్థుల ప్రవేశాలు 32 శాతం మేర తగ్గాయి. 2014–15లో 24.85 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరగా 2024–25లో ఈ సంఖ్య 16.68 లక్షలకు తగ్గింది. మరోవైపు ఇదే కాలానికి ప్రైవేటు స్కూళ్లలో ప్రవేశాలు పెరిగాయి. 2014–15లో 31.17 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో ఉంటే 2024–25లో ఆ సంఖ్య 36.73 లక్షలకు పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోవడం కూడా దీనికి కారణంగా భావిస్తున్నారు. విద్యార్హతలున్న టీచర్లు ప్రభుత్వ స్కూళ్లలోనే ఉన్నా, పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయులు యాంత్రికంగా పనిచేస్తున్నారన్న విమర్శలు ప్రైవేటు వైపు ఆకర్షణకు కారణమవుతున్నాయి. విశ్వాసం పెంచితే తప్ప విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ల బాట పట్టరని ప్రభుత్వం భావిస్తోంది. అయితే బడిబాటపై చాలామంది టీచర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదని.. తూమంత్రంగానే పాల్గొంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో కమిటీ ఏర్పాటు ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం కొన్ని కొత్త ప్రతిపాదనలను విద్యాశాఖ ముందుకు తెచ్చింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నమ్మకం, విశ్వాసం కల్పించేలా స్కూళ్లను తీర్చిదిద్దాలని ఆదేశించింది. ఆట స్థలాలు, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. అయితే నిధుల కొరత నేపథ్యంలో కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత కింద వాటిని సమకూర్చుకోవాలని సూచించింది. అయితే దీనికి క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధుల తోడ్పాటు ఉంటేనే సాధ్యమవుతుందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. దాతలు, పారిశ్రామికవేత్తల ద్వారా నిధుల సమీకరణపై ప్రభుత్వం ఏ తరహా అడుగులు వేయాలనే విషయమై విద్యాశాఖ అధికారులతో త్వరలో ఓ కమిటీ ఏర్పాటు చేసే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. -
జనవరి 21 నుంచి జేఈఈ మెయిన్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశపరీక్ష (జేఈఈ మెయిన్–2026)ను వచ్చే ఏడాది జనవరి 21 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ప్రవేశపరీక్ష తొలిదశకు ఈ నెలలోనే ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపింది. అలాగే ఏప్రిల్ ఒకటి నుంచి 10 వరకు రెండో దశను నిర్వహిస్తామని పేర్కొంది. రెండో దశ కోసం జనవరి చివరి వారంలో దరఖాస్తులు స్వీకరిస్తామని వివరించింది. ఈ మేరకు తాత్కాలిక షెడ్యూల్ ప్రకటించింది. ఈలోగా విద్యార్థులంతా వారి ఆధార్ కార్డుల్లో తప్పులు సరిచేసుకోవాలని సూచించింది. అయితే నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ తేదీలను ఎన్టీఏ ఇంకా ఖరారు చేయలేదు. త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు అధికార వర్గాల సమాచారం. కాగా, దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఏ.. ఈసారి జేఈఈ మెయిన్ పరీక్ష కేంద్రాలను పెంచాలని నిర్ణయించింది. -
శుభ్రమైన చేతులు.. ఆరోగ్యకరమైన జీవితం!
కరకగూడెం(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): పరిశుభ్రత అంటే కేవలం ఇల్లు, పరిసరాలే కాదు.. చేతులను శుభ్రంగా ఉంచుకోవడం కూడా అంతే కీలకం. కనిపించని సూక్ష్మక్రిములు ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా సబ్బుతో కడుక్కోవడం ప్రధానంగా నిలుస్తుంది. ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏటా అక్టోబర్ 15న ‘గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే’ నిర్వహిస్తున్నారు. పరిశుభ్రత, ఆరోగ్యం, అవగాహన జీవితాలను ఎంత మెరుగుపరుస్తాయో చెప్పడమే ఈ కార్యక్రమం ప్రధానోద్దేశం. ఈ మేరకు పాఠశాలలు, వైద్యసంస్థల్లో అధికారులు చేతులు కడుక్కోవడం ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. వాస్తవానికి ఈ దినోత్సవం బుధవారం ముగిసినా.. విద్యార్థులకు చేతుల శుభ్రతపై అవగాహన కల్పించడాన్ని యంత్రాంగం నిరంతరం కొనసాగించేలా ప్రణాళిక రూపొందించింది. అందుకోసం క్షేత్రస్థాయి నుంచి కార్యాచరణపై అధికారులు దృష్టిపెట్టారు. చేతుల పరిశుభ్రతే మొదటి టీకా.. ఆహారం తినే ముందు లేదా వండే ముందు, టాయిలెట్‌కు వెళ్లి వచ్చాక, దగ్గు లేదా తుమ్ము తర్వాత, పిల్లల సంరక్షణ ముందు, రోగులు, చెత్త, జంతువులను తాకాక చేతులను తప్పనిసరి కడుక్కోవాలి. పైపైన కాక సబ్బు, శుభ్రమైన నీటితో కడిగి తుడుచుకోవడం ప్రధానం. నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ వాడొచ్చు. తద్వారా మనం తాకే వస్తువుల్లో దాగి ఉండే లక్షలాది సూక్ష్మక్రిములు చేతుల ద్వారా ఆహారంలోకి, ఆపై శరీరానికి చేరి వ్యాధులకు కారణం కాకుండా అడ్డుకోవచ్చు. గ్రామీణులకు అవగాహన లోపం.. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతపై అవగాహన లోపం కనిపిస్తోంది. ముఖ్యంగా టాయిలెట్ వెళ్లి వచ్చాక లేదా పిల్లలకు ఆహారం ఇచ్చే ముందు సబ్బు వాడకపోవడం, మొక్కుబడిగా చేతులు కడుక్కోవడంతో అతిసార, వాంతులు వంటివి వ్యాపిస్తున్నాయి. గొత్తికోయ ప్రాంతాల్లో హ్యాండ్‌వాష్ కు బదులు ఇప్పగింజల పొడి, కానుగ పొడి వాడుతున్నా అవగాహన మరింత పెరగాల్సి ఉంది. చేతులు కడుక్కోకపోతే అనర్థాలు చేతులు కడుక్కోకపోవడం వల్ల కలిగే అనర్థాలు చాలా తీవ్రమైనవి. కంటికి కనిపించని క్రిములు, బ్యాక్టీరియా, వైరస్లు శరీరంలోకి ప్రవేశించి వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాయి. టాయిలెట్‌కు వెళ్లివచ్చాక చేతులు కడుక్కోకపోతే మలంలోని సూక్ష్మక్రిములు చేతులకు అంటుకోవడం, అపరిశుభ్రమైన చేతులతో ఆహారం తినడం ద్వారా అవి శరీరంలోకి ప్రవేశించి డయేరియాకు కారణమవుతాయి. ఇది చిన్న పిల్లలలో తీవ్రమైన డీహైడ్రేషన్‌కు దారితీసి మరణానికి కారణం కావచ్చు. అపరిశుభ్రమైన చేతులతో ఆహారాన్ని తాకినా, తయారుచేసినా వాంతులు, కడుపు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటికి తోడు టైఫాయిడ్, కలరా కూడా కలిగే ప్రమాదమూ ఉంది. అలాగే, ముఖం, కళ్లు, ముక్కును చేతులతో తాకినప్పుడు క్రిములు శ్వాసకోశంలోకి చేరి ఇన్ఫుయెంజా, జలుబు వ్యాపిస్తాయి. అలాగే, కళ్లను రుద్దుకున్నప్పుడు కండ్ల కలక వచ్చే ప్రమాదం ఉంది.చేతుల శుభ్రతతో ఆరోగ్యం సొంతంమన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని అంతా గుర్తించాలి. తరచుగా చేతులు కడుక్కోవడం ద్వారా అంటువ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. ఈ చిన్న అలవాటు కుటుంబ ఆరోగ్య రక్షణలో కీలకంగా నిలుస్తుంది. సబ్బు, నీరు అందుబాటులో లేకపోతే ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ ఉపయోగించొచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ‘హ్యాండ్ వాషింగ్ హీరో’గా మారితే వ్యాధి నియంత్రణ సాధ్యమవుతుంది. – డాక్టర్ జయలక్ష్మి, డీఎంహెచ్ఓ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా -
సంక్షేమ వసతి గృహాల్లోనూ ఎఫ్ఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లో ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్) అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సిబ్బందితోపాటు విద్యార్థుల హాజరు కూ డా ఇదే విధానంలో స్వీకరించాలన్నారు. ఈమేరకు హాస్టల్ సిబ్బంది, విద్యార్థుల సమాచారాన్ని ఆన్లైన్లో అప్డేట్ చేయాలని సూచించారు. సోమవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు, గురుకుల విద్యాసంస్థల కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. వసతిగృహాల్లో విద్యార్థులకు అందిస్తున్న ఆహారంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నాణ్యతను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించి, పర్యవేక్షణ కట్టుదిట్టం చేయాలన్నారు. విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని, ఈ ఆహారంతో విద్యార్థులకు లభించే కేలరీలను తెలుసుకోవాలని చెప్పారు. హాస్టళ్ల సమాచారం డాష్‌బోర్డులో... హాస్టల్ విద్యార్థులకు అందించే యూనిఫాంలు, పుస్తకాలు సకాలంలో సక్రమంగా అందేలా సీనియర్ అధికారులు చూసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు నిర్ధారించాలన్నారు. ‘హాస్టళ్లలో ఉన్న సౌకర్యాలు, ఇతర వసతులు, వాటి నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు డాష్‌బోర్డ్‌లో అప్లోడ్ చేయాలి. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులను సంక్షేమ హాస్టళ్లతో అనుసంధానించాలి.హాస్టళ్లలో వైద్య శిబిరాలు నిర్వహించాలి. అత్యవసర సమయాల్లో వైద్యులు విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. 24 గంటలూ ఆన్లైన్లో వైద్యులు అందుబాటులో ఉండేలా హాట్‌లైన్ ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తరచూ హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు అందుతున్న సేవలను పరిశీలించాలి’అని రేవంత్ పేర్కొన్నారు. విద్యార్థులకు స్కాలర్íÙప్లు, సిబ్బంది జీతాలు, డైట్ చార్జీలు, నిర్వహణకయ్యే నెలవారీ ఖర్చులు, బకాయిల చెల్లింపునకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సంక్షేమ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌ను సీఎం ఆదేశించారు. మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయండి హాస్టళ్ల కోసం కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి నిధులను సమీకరించాలని, వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్‌ను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నిధుల విడుదల కోసం ప్రతి నెలా గ్రీన్ చానల్ ద్వారా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు అందించే సేవలను సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలని, అవసరమైన యాప్‌లను రూపొందించాలని నిర్దేశించారు.ముఖ్యమంత్రి సహాయనిధి కింద సంక్షేమ విద్యాసంస్థలకు రూ.60 కోట్లు ప్రత్యేకంగా కేటాయించగా... ఇందుకు సంబంధించిన చెక్కులను ఆయా శాఖల సీనియర్ అధికారులకు అందించారు. ఈ నిధులను హాస్టళ్లలో మరమ్మతులు, తాత్కాలిక సిబ్బంది జీతాలు, డైట్ చార్జీలు, ఇతర అత్యవసర పనులకు వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు సీఎం చెప్పారు. సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి వి.శేషాద్రి, ఓఎస్డీ వేముల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
'మనసు మాటే' బతుకు బాట
గొలుసుకట్టు సరుకుల దుకాణాల సంస్థ ‘హోల్ ఫుడ్స్ మార్కెట్’ సహ వ్యవస్థాపకునిగా, దాని మాజీ సీఈఓగా జాన్ మెకే ప్రఖ్యాతి వహించారు. ఈ అమెరికన్ 44 ఏళ్ళ పాటు శ్రమించి దాన్నొక బహుళ జాతి సంస్థగా వృద్ధిలోకి తెచ్చారు. 2022లో అందులోంచి రిటైరయ్యాక ‘లవ్ లైఫ్’ పేరుతో ఆరోగ్య, స్వస్థతా వ్యాపారాన్ని ప్రారంభించారు. బెంట్లే కాలేజ్ పట్టభద్రులను ఉద్దేశించి మెకే చేసిన ప్రసంగ సంక్షిప్త పాఠం: తల్లితండ్రులను మనసారా గౌరవించి, ప్రశంసించాలని బెంట్లే విద్యార్థులకు నేనిచ్చే మొదటి సలహా. కన్నవారు ప్రేమించినంతగా మనల్ని మరెవరూ ప్రేమించరు. మనల్ని పెంచి పెద్దచేసే క్రమంలో వారు కూడా తప్పులు చేసి ఉండవచ్చు. కానీ వారికి తెలిసినంతలో, ఉన్నంతలో మనల్ని తీర్చిదిద్దే కృషి చేశారని గుర్తించాలి. వారు మన కోసం ఎన్నో త్యాగాలు కూడా చేసి ఉంటారు. వాటిలో కొన్ని మనకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. అంతరాత్మకు వ్యతిరేకంగా పోతే...జీవిత కాలం నిజంగానే చాలా చిన్నది. ఈ ప్రాథమిక సత్యాన్ని ఎన్నడూ మరచిపోకూడదు. మృత్యువు అనివార్యం కనుక మన జీవి తాలను ఎలా గడపాలి? ఈ ప్రశ్నకు జవాబు విషయంలో యువ కుడిగా ఉన్నప్పటి నుంచి నాకొక స్పష్టత ఉంది. అంతరాత్మ ప్రబోధం మేరకు నడచుకోవాలి. ఇష్టమైన వ్యాపకాన్నే చేపట్టాలి. జీవితంలో ఏం చేయాలని కోరుకుంటున్నామో, దేన్ని ఎక్కువ అభిమానిస్తామో ఆ రంగంలోకే దిగాలి. నేను 19 ఏళ్ళ వయసు నుంచి నా జీవితంలో అలాగే నడచుకునేందుకు ప్రయత్నించాను. కాలేజీ చదువుకు మధ్యలోనే స్వస్తి చెప్పి, హోల్ ఫుడ్స్ మార్కెట్ ప్రారంభించాలనే నిర్ణయం నా హృదయం నుంచే వచ్చింది. ఈ నిర్ణయం నా తల్లితండ్రులనూ, స్నేహితుల్లో చాలా మందినీ ఆశాభంగానికి గురిచేసింది. కానీ, నిస్సందేహంగా అది సరైన నిర్ణయమనే దృఢ నిశ్చయంతో ముందుకు సాగాను. హృదయం చెప్పినట్లు నడుచుకోవడంలో రెండు ముఖ్యమైన కోణాలున్నాయి. మొదట– మనల్ని మనం తెలుసుకునే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే మనం నిజంగా అంతరాత్మ చెప్పినట్లు నడచుకుంటు న్నామా లేక ఎక్కడన్నా దారి తప్పామా అన్నది తెలుస్తుంది. మనం గాఢంగా ఇష్టపడే వ్యాపకాలను చేపడితే మనం రెట్టింపు శక్తితో పని చేస్తాం. సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. అది సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా, చేసే పనికి ఒక ప్రయోజనాన్ని కూడా చేకూరుస్తుంది. అంతరాత్మ చెప్పినట్లు నడచుకోవడం మానేస్తే దానికి వ్యతిరేక ఫలితాలు సంభవిస్తాయి. శక్తి సన్నగిల్లుతుంది. సృజన కొరవడుతుంది. చేసే పనికి ఒక పరమార్థం అంటూ ఉండదు. ముఖ్యంగా సంతోషం కూడా లోపిస్తుంది. ఒక దిశ, దశ లోపించాయని అనిపించినపుడు మరో దాన్ని ఎంచుకోండి. కొన ఊపిరి ఉన్నంత వరకు ఏదీ చేజారిపోయినట్లు కాదు. దేనికీ కాలం మించిపోయినట్లు కాదు. హృదయం చెప్పిన మార్గంలో నడిచేందుకు మరొకటి అవసరం పడుతుంది. అది భయాన్ని జయించడం! జీవితానికి ఒక పూర్తి సార్థకత చేకూర్చుకోకుండా చాలా మందికి అడ్డుపడేది భయమే! చేపట్టే పనిలో విఫలమవుతామేమోననే భయం. ఆత్మీయులు మనం ఇష్టపడుతున్న రంగాన్ని తిరస్కరిస్తారేమోనని భయం. సక్రమంగా నిర్వహించగలమో, లేదోనని మనకే ఒక సందేహం. మనలో రేకెత్తే భయాన్ని బయటివారు ఎవరూ పోగొట్టలేరు. దాన్ని మనకు మనమే తొలగించుకోవాలి. భయం మన మనసు సృష్టించే ఒక బూచి. అది బయటిది కాదు. లోపలి నుంచి పుట్టుకొచ్చేది. పుడుతున్న చోటనే దాన్ని అంతం చేయాలి. ప్రేమే జీవిత మూలసూత్రంమన జీవితాల్లో ప్రేమను పెంచి పోషించుకోవడాన్ని ఒక మూలసూత్రంగా అనుసరించాలి. ఇక్కడ ప్రేమ అంటే స్త్రీ పురుషుల మధ్య లైంగికతకు సంబంధించినది కాదు. నేను చెప్పే ప్రేమ ఎదుటి వారి పట్ల దయతో వ్యవహరించడానికి చెందినది. ఎదుటివారు మంచిపని చేస్తే నిండు మనసుతో అభినందించగలగాలి. తోటి వారిని ప్రేమించడం వల్ల మన జీవితాలు సుసంపన్నమవుతాయి. ప్రేమతో మెలిగేందుకు మరో మూడు సుగుణాలు అవసరమని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. మొదటిది – కృతజ్ఞత చూపడం! బతికున్నంత కాలం మనం ధన్యవాదాలు తెలుపవలసిన సందర్భాలు అనేకం ఎదురవుతూంటాయి. ప్రతి రోజూ ఉదయం పూట కొద్ది నిమిషాలు మనకు మేలు చేసినవారిని, మనల్ని సంతోషపరచినవారిని గుర్తు చేసుకోవాలి. అవకాశం రాగానే వారికి కృతజ్ఞత తెలియచేయాలి. వృత్తి ఉద్యో గాలలోనూ సంతోషపెట్టే పనులు చేసిన తోటి సిబ్బందిని అభినందించాలి. అది సంస్థ పనితీరు మెరుగుపడేందుకూ, మరిన్ని సత్ఫలి తాలు సాధించేందుకూ నిస్సందేహంగా తోడ్పడుతుంది. రెండవది – క్షమాగుణం! అరకొర అవగాహనతో, అపోహలతో ఎదుటివారి పట్ల ఒక నిర్ణయానికి వచ్చేస్తూంటాం. వారిపట్ల మనసులో అక్కసు పెంచుకుంటాం. మన బాధలకు వారే కారణం అనుకుంటాం. మన జీవితాల్లో ప్రేమ పొంగి పొరలకుండా అడ్డుకునేది అలా పొరపాటు అభిప్రాయాలను ఏర్పరచుకోవడమే! దానివల్ల మనకు మనమే ఎంత హాని చేసుకుంటున్నామో పూర్తిగా గుర్తెరగం. అది తెలిస్తే అటువంటి అలవాటు మానుకుంటాం. మనం చేసిందే ఒప్పు అని, ఎదుటివారిది తప్పు అని మనసులో బలంగా ఉండటం వల్ల క్షమించలేం. ఎదుటివారు తప్పు చేయడం వల్లనే మనం క్షమించవలసి వచ్చిందనే అభిప్రాయం కూడా మనకు తరచు కలుగుతూ ఉంటుంది. కానీ, క్షమించడమంటే అసంతృప్తినీ, కోపాన్నీ మన మనసు నుంచి పారదోలడమే! అంతేకానీ, మన విలువలను, నైతిక సూత్రాలను వదులుకుంటు న్నట్లు కాదు. క్షమించడం వల్ల మనం గతం నుంచి విముక్తుల మవుతాం. వర్తమానంలో ప్రేమను ఆస్వాదించగలుగుతాం. మూడవది – ఉదారత! దీన్ని చాలా మంది డబ్బు ఇవ్వడమే అనుకుంటారు. ఎదుటివారికి మన సమయాన్ని వెచ్చించి, సేవలందించడం కూడా ఉదారత చూపడమే. అవి మనం వారికిచ్చే కానుకలు. మనం దేన్నో త్యాగం చేస్తున్నామనుకోవడం, మన ప్రయోజనాలను పక్కనపెట్టి వారికి సేవ చేస్తున్నామనుకోవడం నిజమైన ఉదారత అనిపించుకోదు. వారి లాభం మనకు నష్టం అనే భావన రాకూడదు. ఉదారత అంటే మన హృదయం నుంచి ప్రవహించే ప్రేమకు పొడిగింపు మాత్రమే! ఆశాభంగపు పాఠాలుజీవితంలో ఆశాభంగాలు, అన్యాయాలు చాలా ఎదురవు తాయి. మనకు ఎదురయ్యే కష్టాలు, సవాళ్ళలో చాలా వాటిని మనం వృద్ధి చెందడానికి తోడ్పడే అవకాశాలుగా చూడటం నేర్చుకోవాలి. గతంలో చూడని నెలవులను మించి కొత్తవాటిలోకి ప్రవేశించేందుకు సహాయపడగల పాఠాలనుకోవాలి. పరిస్థితుల ప్రాబల్యం లేదా ఇతరుల వల్ల నష్టపోయిన వ్యక్తిగా మనల్ని మనం చూసుకోవడం వల్ల ఉపయోగం ఉండదని గ్రహించాలి. మనల్ని చూసి ఎదుటివారు జాలి పడాలనుకోవడం కన్నా, మన మీద మనం జాలిపడటం కన్నా పెను విధ్వంసక భావావేశం మరొకటి లేదు. దాన్ని కనుక నిర్మూలించకపోతే – నిస్సహాయులం, నిర్వీర్యులం అయిపోతాం. హృదయం చెప్పినట్లు నడుచుకోలేం. జీవితం నేర్పాలనుకుంటున్న పాఠాలను అర్థం చేసుకునేందుకు నిపుణుల సలహాలు తీసుకోవడం, ధ్యానం వంటివాటిని ఆశ్రయించవచ్చు. -
NHRC: కురుపాం ఘటన.. ఏపీ ప్రభుత్వ అలసత్వంపై ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ: కురుపాం గిరిజన విద్యార్థుల అంశాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్ళే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అడుగు వేసింది. సోమవారం ఆ పార్టీ ప్రతినిధుల బృందం జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసింది. చికిత్స విషయంలో ఏపీ ప్రభుత్వ అలసత్వంపై ఫిర్యాదు చేసింది. ఏపీ కురుపాం గిరిజన హాస్టల్స్‌లో భారీ సంఖ్యలో విద్యార్థులు పచ్చకామెర్ల వ్యాధి బారిన పడడం తెలిసిందే. అయితే వాళ్లకు సకాలంలో చికిత్స అందకపోవడంపై వైఎస్సార్సీపీ ఆగ్రహంతో ఉంది. అపరిశుభ్రమైన వాతావరణం, కలుషిత నీరు, మంచి భోజనం అందించడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ ఎన్హెచ్ఆర్సీకి ఫిరయాదు చేసింది. పెద్ద సంఖ్యలో పిల్లలు పచ్చకామెర్ల వ్యాధి బారిన పడిన వైనాన్ని హక్కుల సంఘానికి వివరించింది.గిరిజన హాస్టల్స్ లో చంద్రబాబు సర్కార్ బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడడం, ఆరోగ్య భద్రతపై నిర్లక్ష్యం వహించడంపై ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో గిరిజన విద్యార్థుల హక్కులను కాపాడాలని జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కోరింది. ఫిర్యాదును స్వీకరించిన కమిషన్.. పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపింది. వైఎస్సార్సీపీ బృందంలో ఎంపీలు గురుమూర్తి, తనుజారాణి, మాజీ డిప్యూటీ సీఎంలు పుష్పశ్రీవాణి, రాజన్న దొర తదితరులు ఉన్నారు. -
బిల్లు రాదు.. భోజనం లేదు
మంచిర్యాల రూరల్ (హాజీపూర్): బిల్లులు రా లేదని కాంట్రాక్టర్ రేషన్ సరుకులు పంపించ డం మానేశాడు. వారం రోజుల పాటు ఎస్వో స్వప్న విద్యార్థినుల ఆకలి తీర్చినా ఆర్థిక ఇబ్బందులు తాళలేక వారిని ఇళ్లకు పంపించేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణ మామిడి కేజీబీవీలో.. ఆరు నుంచి ఇంటర్ వరకు 240 మంది విద్యార్థినులు చదువుతు న్నారు. సరుకులను కాంట్రాక్టర్ రాజేందర్ సర ఫరా చేస్తుంటాడు.నాలుగు నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో.. సరఫరా నిలిపి వేశాడు. శనివారం సరుకులు ఖాళీ కావడంతో విద్యార్థులకు భోజన వసతి కల్పించడం కష్టంగా మారింది. ఇప్పటికే వారం రోజులు విద్యార్థులకు అల్పా హారం, భోజనం ఎస్వో ఏర్పాటు చేశారు. ఆర్థికభారం కావడం, రెండో శనివారం, ఆదివారం సెలవులు రావడంతో స్వప్న ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు.. విద్యా ర్థినుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి తీసుకెళ్లే ఏర్పాటు చేశారు. ఇంటర్, 10వ తరగతి విద్యా ర్థులకు తరగతులు నిర్వహిస్తుండగా.. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులను ఇళ్లకు పంపించారు. -
హాస్టళ్లా... నరక కూపాలా?
‘‘ప్రతి బాల్యంలోనూ ఓ నందనోద్యానం ఉంటుంది. అది మెరిసిపోయే రంగులతో అల్లుకున్న మంత్రముగ్ధ నగరి. పిల్ల తెమ్మెరలక్కడ మృదువుగా హత్తుకుంటాయి. ప్రతి ఉదయమూ అక్కడ పరిమళ భరితమే’’ – బాల్యం గురించి ఓ రచయిత్రి అలా వర్ణించారు. బాల్యం ఇలాగే ఉండాలి. ఈ విధంగానే ఎదగాలని చాలామంది కోరుకుంటారు. అందుకే ప్రతి నాగరిక దేశం బాలల హక్కులకు ప్రత్యేక రక్షణను ఏర్పాటు చేసింది. భారత రాజ్యాంగం కూడా అటువంటి ఏర్పాట్లు చేసింది. స్వయంగా తల్లిదండ్రులే తమ పిల్లల్ని స్వల్పంగా దండించినా సహించకుండా జైల్లో పెడతారు స్కాండినేవియన్ దేశాల్లో! ఏ జాతికైనా అమూల్య సంపద బాలలే కనుక మానవత్వం సున్నితత్వమున్న వ్యవస్థలన్నీ బాలల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాయి. ‘మనం చూడలేని కాలానికి మనం పంపించే సజీవ సందేశాలు పిల్లలే’! కనుక వారికా ప్రత్యేక హక్కులుంటాయి.ఆచరణలో ప్రతి బాల్యం నందనోద్యానంలా ఉంటున్నదా? ఏలుతున్నవారు అలా ఉండటానికి అనుమతిస్తున్నారా? అందమైన బాల్యాన్ని అంగడి సరుకుగా మార్చడానికి దోహద పడుతున్న ప్రభుత్వాలనిప్పుడు చూస్తున్నాము. పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే పేద పిల్లలకు కూడా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరగాలని ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసినప్పుడు మోకాలడ్డే ప్రయత్నం చేసిందెవరు? ఆ ప్రయత్నం చేసిన చంద్రబాబు కూటమే ఇప్పుడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య కోసం జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఎత్తివేసింది. విద్య, వైద్యం ప్రభుత్వ బాధ్యతలు కావనేది ఆయన ఫిలాసఫీ. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పుకున్నారు. కనుకనే ఆయన మళ్లీ గద్దెనెక్కగానే కొనగలిగినవారికి నాణ్యమైన విద్య... లేనివారికి నాసిరకం విద్యావిధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానపు దుర్మార్గానికి పుట్టిన విషపు పుండే మొన్నటి కురుపాం ఘటన.పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గిరిజన బాలికల గురుకుల పాఠశాల విద్యార్థుల్లో కామెర్ల వ్యాధి ప్రబలిన నేపథ్యాన్ని గమనిస్తే ఒళ్లు జలదరిస్తుంది. లక్షలాదిమంది పేద తల్లిదండ్రులు వారి బిడ్డల భవిష్యత్తుపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏపీ సర్కార్ వమ్ము చేస్తున్న వైనం దిగ్భ్రాంతికరమైనది. కురుపాం ఆశ్రమ పాఠశాలలో ఉంటున్నది ఆరొందల పైచిలుకు బాలికలే కావచ్చు. అన్ని రకాల సంక్షేమ హాస్టళ్ళు, అన్ని రకాల ఆశ్రమ పాఠశాలలూ కలిపి ఏపీలో 3,800కు పైగా ఉన్నాయి. వీటిల్లో లక్షలాది మంది పేదవర్గాల పిల్లలు ప్రభుత్వం మీద భరోసాతో తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకుంటు న్నారు. ప్రస్తుత ప్రభుత్వపు విధానపరమైన వైఖరి ఫలితంగా కొద్దిపాటి తేడాలు తప్ప కురుపాం ఆశ్రమ పాఠశాలకు పూర్తి భిన్నమైన పరిస్థితులు ఎక్కడా లేవు. కురుపాం దారుణానికి సంబంధించిన ప్రకంపనలు తగ్గకముందే గుంటూరు జిల్లాలో బీసీ హాస్టల్ విద్యార్థులు సామూహికంగా అస్వస్థులు కావడం నివ్వెరపరిచింది. గత ఏడాది కాలంగా ఈ తరహా వార్తలు అడపాదడపా వెలుగు చూస్తున్నా ఎటువంటి చర్యలూ తీసుకోక పోవడంతో పరిస్థితులిప్పుడు దారుణంగా దిగజారాయి.అసలేం జరిగింది కురుపాంలో? మరొకసారి పునరా లోకనం చేసుకోవాలి. కురుపాం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆరొందల పైచిలుకు విద్యార్థినులుంటున్నారు. సగటున ఇరవై మందికో మరుగుదొడ్డి. వాటి నిర్వహణ కూడా అంతంత మాత్రమే. డ్రైనేజీ ఏర్పాట్లు సరిగా లేక మురుగు నీరంతా ఒక పక్కకు చేరి అక్కడినుంచి బోర్ నీళ్లలో కలిసిపోతున్నదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. దసరా సెలవులు ప్రకటించిన తర్వాత సొంత ఊరికి వెళ్లిన అంజలి అనే బాలిక కామెర్ల లక్షణాలతో సెప్టెంబర్ 25న చనిపోయింది. తోయక కల్పన అనే టెన్త్ క్లాస్ చదువుతున్న బాలిక పది రోజులపాటు స్థానిక జిల్లా ఆస్పత్రుల్లో చికిత్స తీసుకొని నయం కాకపోవడంతో వైజాగ్ కేజీహెచ్‌లో చేరింది. సెప్టెంబర్ 29న ఆ బాలిక కూడా కామెర్ల వ్యాధి (హెపటైటిస్ ఏ)తో ప్రాణాలు కోల్పోయింది. అంటే ఆశ్రమ పాఠశాలకు సెలవులు ఇవ్వకముందే కామెర్ల లక్షణాలు బయటపడినట్టు స్పష్టమవుతున్నది.కురుపాంలోనే మరో హాస్టల్లో చదువుతున్న ఇంకో ఇద్దరు బాలురు అక్టోబర్ 5, 6 తేదీల్లో ఇవే లక్షణాలతో చనిపోయారు. గిరిజన బాలికల గురుకులం నుంచి మొత్తం 170 మంది బాలికలకు కామెర్లు సోకి ఆస్పత్రుల పాలయ్యారు. వీరిలో యాభై మంది విశాఖ కేజీహెచ్ దాకా రావలసి వచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో బాలికలకు సురక్షిత మంచినీటి కోసం ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల క్రితం దానికి రిపేర్ రావడంతో పక్కన పడేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్న సమాచారం ప్రకారం డ్రైనేజీ వ్యవస్థ లేక మరుగుదొడ్ల మురుగు నీరు కలుస్తున్న బోర్ నీటినే బాలికల చేత తాగిస్తున్నారు. వంటకూ వాటినే వినియోగిస్తున్నారు. విద్యార్థుల మెడికల్ రిపోర్టులు కూడా దాన్నే నిర్ధారిస్తున్నాయి. మురుగుతో నీటి కాలుష్యం వల్లనే విద్యార్థులు ‘హెపటైటిస్–ఏ’ వ్యాధికి గురయ్యారని చెబుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే నిర్వాహకులు ఏం చేస్తున్నట్టు? పిల్లల చేత మురుగునీళ్లు తాగిస్తూ ఉపాధ్యాయులు మాత్రం మినరల్ వాటర్ తెచ్చుకుని తాగేవారని గిరిజన పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.పిల్లలు తరచూ అస్వస్థతకు గురవుతుంటే నిర్వాహకులు వారిని ఇళ్ళకు పంపించి చేతులు దులిపేసుకోవడమేమిటి? పై అధికారులకు వీళ్లు రిపోర్టు చేయలేదా? చేసినా వారు పట్టించు కోవడం లేదా అన్నది తేలాల్సి ఉన్నది. యథా రాజా తథా ప్రజా అంటారు కదా! పేద పిల్లల ఆరోగ్యం సంగతి ప్రభుత్వానికే పట్టనప్పుడు తమకెందుకని అధికారులు అలక్ష్యంతో ఉంటు న్నారేమో తెలియదు. విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, ఐటీడీఏ, జిల్లా యంత్రాంగాలు, వాటి అధికార శ్రేణులు ఉన్నప్పటికీ ఇన్ని దుర్ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి?సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యం కోసం అనుసరించ వలసిన ప్రోటోకాల్‌ను కూడా పాటించకపోవడం విస్మయం కలిగించే విషయం. ఆర్వో ప్లాంట్ చెడిపోతే వెంటనే ఎందుకు బాగు చేయించలేదు? నిర్ణీత కాలానికోసారి తాగునీటికి నాణ్యతా పరీక్షలు చేయడం లేదా? ఒకరిద్దరు పిల్లలు జబ్బుపడిన తర్వాత మిగిలిన పిల్లల విషయంలో వ్యాధి నిరోధక చర్యలు చేపట్టారా, లేదా? కనీసం తాగునీటిని క్లోరినేషన్ చేసినా ఇటువంటి ఘటనలు జరిగేవి కావు కదా!సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల విద్యార్థుల ఆరోగ్య, వసతి సమస్యలపై ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా వరసగా అనేక దుర్ఘటనలు ఈ ఏడాది కాలంలో రికార్డయ్యాయి. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన సంక్షేమ హాస్టళ్ల గురుకులాల్లోనే ఈ కాలంలో 11 మంది విద్యార్థులు అనారోగ్య కారణాలతో చనిపోయారు. తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేడ్కర్ సంక్షేమ గురుకులంలో పాచిపోయిన ఆహారం పెట్టడం వల్ల వందమంది విద్యార్థులు అస్వస్థులయ్యారు. ఇటువంటి ఘటనే అదే జిలాల్లోని జ్యోతిబా ఫూలే బీసీ హాస్టల్లో జరిగింది. కాకినాడ జిల్లా ఏలేశ్వరం, అనకాపల్లి జిల్లా రాజగోపాలపురం, నూజివీడు ట్రిపుల్ ఐటీల్లో కూడా కలుషిత ఆహారం వల్ల విద్యార్థులు జబ్బుపడిన ఘటనలు జరిగాయి. ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని బీసీ హాస్టల్లో కలుషితాహారం తిని 50 మంది విద్యార్థులు ఆస్పత్రుల పాలయ్యారు. శనివారం నాడు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగి తమ పిల్లల్ని హాస్టల్ నుంచి ఖాళీ చేయించారు. సంపన్నుల ఇళ్లలో జరిగే ఫంక్షన్లలో మిగిలిపోయిన ఆహారాన్ని మర్నాడు తీసుకొచ్చి హాస్టల్ విద్యార్థులకు పెట్టడం ఏపీలో ఇప్పుడో ట్రెండ్‌గా మారింది. పాచిపోయిన ఆహారం తిని పిల్లలు అస్వస్థతకు గురైన ఘటనలు పలుచోట్ల జరిగాయి.తాజాగా కురుపాంలో జరిగిన ఘటన మానవత్వానికే సవాల్ విసురుతున్నది. ఆరొందల మందికి పైగా బాలికలు రోజుల తరబడి మురుగునీళ్లు తాగవలసిన పరిస్థితి ఎవరి పాపం? పక్కనే ఉన్న విశాఖ నగరంలో అతి ఖరీదైన భూముల్ని కారుచౌకగా లుల్లూ భయ్యాలకూ, లల్లూ భయ్యాలకూ కట్టబెడు తున్న సర్కార్, ఏజెన్సీ గిరిజన బిడ్డలకు శుభ్రమైన మంచినీటిని కూడా ఎందుకు నిరాకరిస్తున్నట్టు? చంద్రబాబును పెత్తందారీ వర్గాల ప్రతినిధిగా పిలవడం ఇటువంటి కారణాల వల్లనే! పేదల సంక్షేమాన్ని ‘పీ–4’కు అప్పగించాలని ఆయన నిర్ణయించారు. సంపన్నుల ఫంక్షన్లలో మిగిలిపోయిన, పాచిపోయిన ఆహారాన్ని పేదలకు పంచడం లాంటిదే ‘పీ–4’ ఫిలాసఫీ. ఇదేనా మన రాజ్యాంగం చాటిచెప్పిన సమానత్వం? ఎటువంటి వివక్షా లేకుండా అన్ని వర్గాల పిల్లలందరూ ఉచితంగా విద్యను అభ్యసించడమే కాదు, వారి ఆరోగ్య సంరక్షణ కూడా ప్రాథమిక హక్కుల్లో భాగమే. కూటమి సర్కార్ హయాంలో సంక్షేమ హాస్టళ్లలో జరుగుతున్న ఉదంతాలు కచ్చి తంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలే. జీవించే హక్కును కూడా ఈ ప్రభుత్వం కాలరాస్తున్నట్టే!కామెర్ల వ్యాధి ప్రబలుతున్నదని తెలిసిన తర్వాత కూడా పాఠశాల నిర్వాహకులు, అధికారులు వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగానే ఉన్నది. వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం వల్లనే విద్యార్థులకు కామెర్ల వ్యాధి సోకిందని సాక్షాత్తూ ఆరోగ్య మంత్రి వ్యాఖ్యానించడం గిరిజన ప్రజానీకాన్ని అవమానించడమే! నలతగా ఉంటున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా వారిని ఇళ్లకు పంపించి పాఠశాల నిర్వాహకులు చేతులు దులుపుకొన్నారు. సరైన వైద్యం అందించకుండా కాలయాపన చేసి, రోజుల తరబడి స్థానిక ఆస్పత్రుల్లో తిప్పి చివరకు మాత్రమే కేజీహెచ్‌కు తరలించినందువల్లనే కల్పన అనే బాలిక చనిపోయింది. బాలిక మరణానికి కారణం సెరెబ్రల్ మలేరియా అని రాశారట! వైద్యులు చికిత్స చేసింది కూడా దానికేనా? అధికారుల ఒత్తిడికి లొంగి వైద్యులు అలా రాయ వచ్చునా? చనిపోయిన పిల్లలకు పోస్ట్‌మార్టమ్ ఎందుకు నిర్వహించలేదు? కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న పిల్లల్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారనే వార్తలు రాగానే వారిని బలవంతంగా డిశ్చార్జి చేయించడానికి అధికారులు ఎందుకు ప్రయాస పడినట్టు? దాచేస్తే సత్యం దాగుతుందా? విద్య, వైద్యం ఉచితంగా అందజేయడం ప్రభుత్వం విధానం కాదనేది కూటమికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు వైఖరి. అందువలన పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ఆయనకు ప్రాధాన్య రంగం కాదు. వారికి పోషకాహారం, వసతి సౌకర్యాలు వారి ఎజెండాలో ఉండవు. ఈ విధానానికి వ్యతిరేకంగా పోరాడటమా? లేక మౌనంగా అవమానాలు దిగమింగి అన్యాయాలను సహించ డమా? ఏ మార్గం అనుసరించాలో పేద–మధ్యతరగతి వర్గాల ప్రజలు, ప్రజాస్వామ్య – రాజ్యాంగవాదులు నిర్ణయించుకోవ లసి ఉంటుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
గ్రాండ్‌గా జరిగిన జెనిత్ ఫెస్ట్ 2025 (ఫోటోలు)
-
బీసీ హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత
ప్రత్తిపాడు: కూటమి ప్రభుత్వం వసతి గృహ విద్యార్థులకు శాపంలా మారింది. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక వసతిగృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతూనే ఉన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని చంద్రబాబు సర్కారు గాలికొదిలేయడంతో సరైన వసతులు, నాణ్యమైన ఆహారం లేక బాలబాలికలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. రాష్ట్రంలో ఎన్ని ఘటనలు చోటుచేసుకుంటున్నా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. తాజాగా, ఫుడ్ పాయిజన్ కారణంగా బీసీ బాలుర వసతి గృహం విద్యార్థులు వాంతులు, విరేచనాల బారిన పడి ఆస్పత్రి పాలైన ఘటన పెదనందిపాడు మండలంలో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రులోని బీసీ బాలుర వసతి గృహంలో మొత్తం 107 మంది విద్యార్థులు ఉన్నారు. గురువారం రాత్రి భోజనం తిన్న తర్వాత 54 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఒక్కొక్కరికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. ఆ సంఖ్య క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ఆ సమయంలో హాస్టల్లో వార్డెన్ లేకపోవడంతో, అందుబాటులో ఉన్న కుక్ సీహెచ్ కల్పన తొలుత 17 మంది విద్యార్థులను పెదనందిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. మిగిలిన విద్యార్థులు కూడా ఒకరి తరువాత ఒకరు అస్వస్థతకు గురి కావడంతో స్థానిక హైసూ్కల్ ఉపాధ్యాయులు ఆటోల్లో విద్యార్థులను పెదనందిపాడు పీహెచ్‌సీకి తరలించారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థులను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుతో కలిసి బీసీ హాస్టల్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాలతో స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి, బాధిత విద్యార్థులందరికీ చికిత్స అందించారు. అస్వస్థతకు గురైన వారిలో 16 మందిని మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. 21 మందిని డిశ్చార్జి చేయగా, 17 మంది విద్యార్థులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడానికి ఆహారం కలుషితం కావడమేనని ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు.‘ఏకలవ్య’కూ సోకిన పచ్చ కామెర్లు» పాఠశాలలో 380 మంది విద్యార్థులు.. వారిలో 30 మంది పచ్చ కామెర్లు »పలు ఆస్పత్రుల్లో వీరికి వైద్యం »ఇప్పటికే కురుపాం బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులకు పచ్చ కామెర్లు »రెండు పాఠశాలలూ పక్క పక్కనే.. ఒకే తాగు నీటి బోరు » ఆ బోరు పక్కనే మురుగు కురుపాం: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏకలవ్య పాఠశాలలో 30 మంది విద్యార్థులకు పచ్చకామెర్లు (హెపటైటిస్–ఏ) సోకినట్లు సమాచారం. 380 మంది విద్యార్థులు చదువుతుండగా.. వీరిలో 30 మంది విద్యార్థులు పచ్చకామెర్లు, వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు. పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో 17 మంది, కేజీహెచ్‌లో ఇద్దరు, కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో నలుగురు విద్యార్థులు ప్రస్తుతం చికిత్స పొందుతుండగా.. ఏడుగురు విద్యార్థులు డిశ్చార్జ్ అయినట్లు ఏకలవ్య సిబ్బంది చెబుతున్నారు. పాఠశాల సిబ్బందికి కూడా ఒకరికి పచ్చకామెర్లు సోకినట్టు తెలిసింది. ఆ బోరు నీరే కారణమా..కురుపాం బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు ఇప్పటికే పచ్చ కామెర్లతో బాధపడుతూ వివిధ ఆస్పత్రుల్లో చేరారు. పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు మృతిచెందారు. గురుకుల పాఠశాలకు పక్కనే ఏకలవ్య పాఠశాల ఉంది. రెండు పాఠశాలల విద్యార్థులు ఒకే బోరు నీటిని తాగుతుండడం, అదే బోరు సమీపంలో మురుగు నీరు ఉండటంతోనే విద్యార్థులు కామెర్ల బారిన పడినట్టు ప్రాథమికంగా వైద్యులు నిర్ధారించినట్టు సమాచారం. -
గుంటూరు జిల్లా అన్నపర్రు బీసీ సంక్షేమ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్
-
ఉన్నత విద్యలోనూ ఏఐ
సాక్షి, స్పెషల్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ విస్తరిస్తున్న కృత్రిమ మేధ∙(ఏఐ) తాజాగా విద్యార్థుల చదువుల్లోనూ భాగమైంది. దేశంలోని 60 శాతంపైగా ఉన్నత విద్యాసంస్థలు ఏఐ సాధనాలను ఉపయోగించడానికి విద్యా ర్థులకు అనుమతిస్తున్నట్లు ఈవై–పార్థనాన్–ఫిక్కీ తాజా నివేదిక వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం లెర్నింగ్ మెటీరి యల్స్‌ను (బోధనాంశాలు) అభివృద్ధి చేయడానికి జనరేటివ్ ఏఐని ఇప్పటికే 53 శాతం విద్యాసంస్థలు ఉపయోగించడం ప్రారంభించాయి.దేశవ్యాప్తంగా 30 ఉన్నత విద్యాసంస్థలపై చేపట్టిన సర్వే ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. ఇందులో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు బోధన, పరిపా లనలో ఏఐను ఎలా స్వీకరిస్తున్నాయో వివరించింది. 40 శాతం ఉన్నత విద్యాసంస్థలు ఏఐ–ఆధారిత ట్యూటరింగ్ సిస్టమ్స్, చాట్‌బాట్స్‌ను ఉపయోగిస్తుండగా 39 శాతం సంస్థలు అడాప్టివ్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్‌ను వినియోగిస్తున్నాయి. అలాగే 38 శాతం కాలేజీలు ఆటోమేటెడ్ గ్రేడింగ్ కోసం ఏఐని ఉపయోగిస్తున్నాయని అధ్యయనం తెలిపింది. అయితే ప్రభుత్వాల విధివిధానాల మార్గనిర్దేశంలో ఏఐ వినియోగం జరగాలని నివేదిక సూచించింది.అన్ని విభాగాలలో ఏఐ..ఉన్నత విద్యారంగంలోని అన్ని రకాల కోర్సుల్లో ఏఐ అక్షరాస్యతను పెంపొందించాలని నివేదిక ప్రతిపాదించింది. విద్యార్థులంతా ఏఐ భావనలు, నీతి, అప్లికేషన్స్‌పై ప్రాథ మిక అవగాహనను అలవర్చు కోవాలని సూచించింది. ఇందులో డిజిటల్ నైపుణ్యాలు, విమర్శనాత్మక ఆలోచన, డేటా వినియోగం తదితర అంశాలపై నైతిక అవగాహన కల్పించాలని నివేదిక వివరించింది.సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) ప్రోగ్రామ్స్‌లో మెషీన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, రోబోటిక్స్ వంటి అధునా తన కంటెంట్‌ను ప్రధాన పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టడం ముఖ్యమని నివేదిక అభిప్రాయపడింది. భారతీయ గ్రాడ్యుయేట్లను కేవలం ఏఐ వినియోగదారులుగానే కాకుండా ఏఐ సృష్టికర్తలు, ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నివేదిక సూచించింది. శిక్షణ, మౌలిక వసతులకు..విద్యార్థుల్లో ఏఐపట్ల ఉత్సాహం అధికంగా ఉన్న ప్పటికీ ఏఐ బోధకులు ఆ స్థాయిలో లేకపోవడం సవా ల్గా మారిందని నివేదిక పేర్కొంది. అధ్యాపకులను సన్నద్ధం చేయడం, డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం తక్షణ అవసరాలని పేర్కొంది. ఏఐ స్వీకరణను సమర్థంగా తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి విద్యాసంస్థలు అధ్యాపకులకు శిక్షణ, మౌలికవసతుల మెరుగుదల కోసం పెట్టుబడి పెట్టాలని సిఫార్సు చేసింది. ఈ అంశాలు కార్యరూపం దాలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత విజ్ఞానం, ఆవిష్కరణల్లో భారత్ ముందంజలో ఉంటుందని నివేదిక వివరించింది. ఉన్నత విద్యాసంస్థలు ఏఐ–ఆధారిత కార్యకలాపాల వైపు ముందుకు సాగుతున్నప్పటికీ ఆవిష్కరణలు, సమగ్రత మధ్య సమతూకం పాటించడం సవాలేనని అధ్యయన నివేదిక అభిప్రాయపడింది. -
‘విద్యార్థుల మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత’
సాక్షి,విశాఖ: విద్యార్థుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఏపీ మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి డిమాండ్ చేశారు. విశాఖ కేజీహెచ్‌లో పచ్చకామెర్లతో బాధపడుతున్న విద్యార్థులను పరామర్శించారు. అంనతరం,ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘విద్యార్థులకు స్క్రినింగ్ టెస్టులు చేయించారనేది అబద్ధం. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పచ్చకామెర్లతో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. గురుకుల పాఠశాలలో శాటినేషన్ లోపమే కారణం.ఇప్పటికీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో పరీక్షలు చేయించడం లేదు. అసలు ఎంతమందికి వైద్య పరీక్షలు నిర్వహించారో చెప్పాలి. ఇవాళ మరో ఆరుగురు విద్యార్థులు కేజీహెచ్ వచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పచ్చ కామెర్లతో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు’అని ’ధ్వజమెత్తారు. -
'ఇష్టం ఉంటే' కష్టం ఉండదు!
కొత్తగా పట్టభద్రులైన వారికి అభినందనలు. ప్రత్యక్షంగా మీ ముందు లేకుండా, ఇలా ఇంటి నుంచి వర్చ్యువల్ ప్రసంగం చేస్తా నని నేను ఊహించలేదు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఆశావహ దృక్ప థంతో మెలగడం కష్టమే! కానీ, మీరు మరింత శక్తిమంతులుగా, ఉన్నతు లుగా నిరూపించుకోగలరనడంలో సందేహం లేదు. ఎందు కంటే, మీకంటే ముందు చాలా మంది దాన్ని రుజువు చేశారు. వందేళ్ళ క్రితం, 1920లో స్పానిష్ ఫ్లూ సమయంలోనూ కొందరు పట్టభద్రులుగా బయటకు వచ్చారు. అప్పటికి యాభై ఏళ్ళ తర్వాత, 1970లో వియత్నాం యుద్ధ కాలంలోనూ గ్రాడ్యుయేట్లు అయినవారున్నారు. అంతెందుకు, సెప్టెంబర్ 11 ఘటనకు కొద్ది నెలల ముందు 2001లో చదువు పూర్తి చేసుకుని యూనివర్సిటీల నుంచి బయటకొచ్చినవారు లేరా? మహమ్మారులను, యుద్ధాలను, ఇతర సంక్షోభాలను దాటుకుని వచ్చినవారు ఎందరో ఉన్నారు. వారు కొత్త సవాళ్ళను అనేకం ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్ని సంద ర్భాలలోనూ వారు విజయులుగా నిలిచారు. ఆశావాదంతో బతకమని మన సుదీర్ఘ చరిత్ర చాటుతోంది. ఆశావహులై ఉండండి. వర్తమానంలోని ప్రతి తరం, తమ తర్వాత రాబోయే తరం గురించి తక్కువ అంచనా వేసే విచిత్ర ధోరణిని నేను గమనించాను. ఒక తరం సాధించిన ప్రగతి తదుపరి తరానికి పునాది అవుతుందని గ్రహించ లేకపోవడమే దానికి కారణం. కొత్త వ్యక్తుల సమూహం అన్నింటినీ సాధ్యం చేసి చూపిస్తుంది. మీ అనన్యమైన దృక్పథం ఇంతవరకు ఊహించని వాటిని కూడా మన ముందుకు తేవచ్చు. టెక్నాలజీలో పుట్టిన తరంటెక్నాలజీ అంతగా అందుబాటులో లేని కాలంలో పెరిగి పెద్దవాడినయ్యాను. నాకు పదేళ్ళు వచ్చేదాకా నేను టెలిఫోన్ ముఖమే చూడలేదు. చదువుకునేందుకు అమెరికా వచ్చిన తర్వాతనే కంప్యూటర్ను రోజూ వాడుకోవడం కుదిరింది. పాత రోజుల్లోకి వెళితే, ఎంతో కాలానికి ఇంటికొచ్చిన టెలివిజన్‌లో ఒకే ఛానల్ ఉండేది. మీకిపుడు రకరకాల ఆకృతుల్లో, పరిమాణాల్లో కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడైనా, దేని గురించైనా కంప్యూటర్ను అడగగలిగే సామర్థ్యం మీకిపుడు ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. కానీ, అటువంటి సామర్థ్యాన్ని నిర్మించడంపైనే నేను ఓ దశాబ్ద కాలం పనిచేశాను. మిమ్మల్ని చూసి నేను కుళ్ళుకోను. ఈ రకమైన ప్రగతి నన్ను మరింత ఆశావహుడిని చేస్తుంది. టెక్నాలజీకి సంబంధించిన కొన్ని అంశాలు మిమ్మల్ని బహుశా నిస్పృహకూ, అసహనానికీ లోనుచేస్తూ ఉండవచ్చు. ఆ అసహనాన్ని అలాగే ఉండనివ్వండి. ఎందుకంటే, అదే కొత్త టెక్నాలజీ విప్లవాన్ని సృష్టిస్తుంది. నా తరం కలలుకనే సాహసం చేయలేనివాటిని మీరు తయారు చేసి చూపించగలరు. వాతావరణ మార్పు లేదా విద్యా రంగ సమస్యల పట్ల మా వైఖరి కూడా మిమ్మల్ని నిస్పృహకు గురిచేసి ఉండవచ్చు. అసహనంతోనే మెలగండి. అది ప్రపంచానికి అవసర మైన ప్రగతిని సృష్టిస్తుంది. పరిస్థితులను మార్చాలి, ఏదో చేయాలి అనే తపన నవీకరణలకు దారితీసి, ప్రపంచానికి కొత్త రూపురేఖలను సంతరిస్తుంది. టెక్నాలజీ మన కుటుంబాలకు ఎంతగా అందుబాటు లోకి వస్తే, మన జీవితాలు అంతగా మెరుగవుతాయి. మెరుగైన సెమీకండక్టర్లను తయారు చేయడం ద్వారా ఆ పని చేయగలనని నేను గ్రాడ్యుయేట్‌ని అయినపుడు భావించాను.అప్పటికి అంతకన్నా ఉత్తేజకరమైన అంశం ఏముంది? నేను అమెరికా రావడం కోసం విమాన టికెట్‌కు మా నాన్న ఒక ఏడాది జీతాన్ని వెచ్చించవలసి వచ్చింది. ఇంటికి ఫోన్ చేసేందుకు నిమి షానికి 2 డాలర్లకు పైగా ఖర్చయ్యేవి. బ్యాక్ ప్యాక్ కొనేందుకు కూడా ఇండియాలో మా నాన్నకు వచ్చే ఒక నెల జీతం అంత ఖర్చు పెట్టాల్సి వచ్చేది. అందరి కోసం టెక్నాలజీనేను స్టాన్‌ఫోర్డ్‌లో చేరిన ఏడాదే ఇంటర్నెట్ రూపుదిద్దుకోవడం మొదలుపెట్టింది. అదే ఏడాది మొజాయిక్ బ్రౌజర్ విడుదలైంది. అది వరల్డ్ వైడ్ వెబ్, ఇంటర్నెట్లను ప్రాచుర్యంలోకి తెచ్చింది. టెక్నాలజీని మరింత మందికి అందుబాటులోకి తెచ్చేందుకు ఇంటర్ నెట్ ఏకైక ఉత్తమ మార్గం అవుతుందని నాకు అప్పటికింకా తెలియలేదు. ఆ సంగతి గ్రహించాక, గూగుల్‌లో నేను నా కలలను సాకారం చేసుకునే పనికి ఉద్యమించాను. నా నేతృత్వంలో సాగిన కృషితో 2009లో క్రోమ్ మొదలైంది. సరసమైన ధరలకు ల్యాప్ టాప్‌లను, ఫోన్లను అందించడంలో గూగుల్ చేసిన కృషికి సహాయపడ్డాను. గ్రాడ్యుయేషన్ తర్వాత పీహెచ్డీ చేసివుంటే అమ్మ, నాన్న గర్వపడేవారే. కానీ, టెక్నాలజీ ప్రయోజనాలను అనేకమందికి అందుబాటులోకి తెచ్చే అవకాశాన్ని కోల్పోయి ఉండేవాడిని. గూగుల్ సీఈఓగా ఈరోజు మీ ముందు నిల్చొని మాట్లాడగలిగి ఉండేవాడిని కాదు. మీదైన రీతిలో ప్రపంచాన్ని మెరుగైనదిగా మార్చండి. మీకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని, మీదైన విశిష్టమైన మార్గంలో సాను కూల ప్రభావాన్ని చూపేందుకు, దాన్ని వినియోగించుకోండి. క్యాలిఫోర్నియా రాష్ట్రంలో 27 ఏళ్ళ క్రితం మొదటిసారి అడుగిడి నపుడు ఇవేవీ నా ఊహల్లో లేవు. అదృష్టంతోపాటు టెక్నాలజీ పట్ల గాఢమైన వ్యామోహం, విశాల దృష్టితో వ్యవహరించడం నన్నిక్క డకు తీసుకొచ్చాయి. అసహనమూ మంచిదే!ప్రపంచంలో మిగిలిన వాటన్నింటి కన్నా మిమ్మల్ని ఏది ఎక్కువ ఉత్తేజపరుస్తోందో దాన్ని కనుగొనే ప్రయత్నం చేయండి. మీ తల్లితండ్రులు చెప్పారని లేదా మీ స్నేహితులు చేస్తున్నారని లేదా సమాజం మీ నుంచి ఆశిస్తోందనే కారణంతో మీకిష్టం లేని పనుల్లోకి దిగకండి. ఊహించని దారులు గణనీయమైన ప్రభావానికి దారితీస్తాయి. ఎంచుకున్న రంగం ఇష్టమైనదైతే మనసు పెట్టి పనిచేయగలుగుతారు. అదృష్టం, పరిస్థితుల కన్నా, మీ వ్యామోహమే మిమ్మల్ని ముందుకు నడిపించే చోదక శక్తిగా పనిచేస్తుంది. అది మీ గమనాన్ని తీర్చిదిద్ది, కలకాలం నిలవగల వారసత్వాన్ని మిగల్చగలుగుతుంది. దేనినైనా అక్కున చేర్చుకునేందుకు సిద్ధ్దంగా ఉండండి. ఉన్న వాటిని ఇంకా మెరుగుపరచాలనే అసహనంతోనే వ్యవహరించండి. ఆశావహ దృక్పథాన్ని వీడవద్దు. ఇదే నేనిచ్చే సలహా. మీరు ఆ పని చేయగలిగితే చరిత్ర మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. అన్నింటినీ మార్చగలిగిన అవకాశం మీకుంది. మీరు మారుస్తారనే నమ్మకం కూడా నాకుంది! -
విద్యార్థుల మరణాలతో మన్యం విలవిల
-
సర్కారు నిర్లక్ష్యం వల్లే గిరిజన బాలికలకు అస్వస్థత
మహారాణిపేట(విశాఖపట్నం): కురుపాం గిరిజన బాలికల పాఠశాల విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం, ఇద్దరు బాలికలు చనిపోవడానికి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, దీనికి సర్కారే బాధ్యత వహించాలని వైఎస్సార్సీపీ నేతలు, మాజీ ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్పశ్రీ వాణి, పి.రాజన్నదొర ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న కురుపాం గిరిజన బాలికలను పుష్పశ్రీవాణి, రాజన్నదొర, అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు తదితరులు పరామర్శించారు. అనంతరం కేజీహెచ్ వైద్యులతో మాట్లాడి విద్యార్థులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పుష్పశ్రీ వాణి మాట్లాడుతూ గిరిజన గురుకుల పాఠశాలల నిర్వహణను కూటమి సర్కారు గాలికొదిలేసిందని విమర్శించారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అసమర్థురాలని ధ్వజమెత్తారు. పాఠశాల హాస్టల్లో కలుషిత నీరు తాగి పచ్చకామెర్ల బారిన పడి అంజలి, కల్పన అనే ఇద్దరు విద్యార్థులు మృతిచెందారని, సుమారు 120 మంది ఆస్పత్రి పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అంజలి మృతికి నాటు వైద్యం కారణమని సర్కారు సాకులు వెతుకుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక్క గురుకుల పాఠశాలకు కూడా ఈ సర్కారు దోమతెరలు ఇవ్వలేదని మండిపడ్డారు. ఆదివారం తీరుబడిగా స్పందించిన మంత్రి సంధ్యారాణి పాఠశాలల్లో నీరు బాగానే ఉందని చెప్పడం దారుణమని పేర్కొన్నారు. ఇద్దరు చిన్నారులు కలుషిత నీరు వల్లే చనిపోయారని, కల్పన సికిల్ సెల్ అనేమియాతో చనిపోయిందని మంత్రి ప్రకటించడం పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. ఎంపీ డాక్టర్ తనూజా రాణి మాట్లాడుతూ కూటమి సర్కారు ఆశ్రమ పాఠశాలల్లో కనీస వసతులు కలి్పంచడం లేదని మండిపడ్డారు. కలుషిత నీరే ఇద్దరు చిన్నారులను బలిగొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతమంది పిల్లలు పచ్చకామెర్ల బారిన పడుతుంటే కూటమి సర్కారు చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. వైద్యానికి డబ్బులు లేవని ఐటీడీఏ పీఓ చెప్పడం దారుణం మాజీ ఉప ముఖ్యమంత్రి పి.రాజన్నదొర మాట్లాడుతూ గిరిజన పిల్లల వైద్యం కోసం డబ్బులు లేవని ఐటీడీఏ పీఓ చెప్పడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. పేద చిన్నారులకు వైద్యం చేయించలేని మంత్రి, సర్కారు పెద్దలు పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి సర్కారు నిర్లక్ష్యం వల్లే ఇంతమంది పిల్లలు ఆస్పత్రుల పాలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చకామెర్లు చిన్న వ్యాధి అని కూటమి ప్రతినిధులు వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారులను, వారి వెంట ఉన్న తల్లిదండ్రులను పట్టించుకునే నాథుడు లేడని, పర్యవేక్షణకు ఒక్క అధికారినీ నియమించలేదని విమర్శించారు. -
మన్యంలో మరణ మృదంగం
సాక్షి, పార్వతీపురం మన్యం/కురుపాం: విద్యార్థుల మరణ మృదంగంతో మన్యం విలవిల్లాడుతోంది. పచ్చకామెర్లు, విష జ్వరాలు పార్వతీపురం మన్యం జిల్లాను కలవరపెడుతున్నాయి. గిరిజన బాలలను కబళిస్తున్నాయి. వారం వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు మరణించడం కలకలం రేపుతోంది. వంద మందికిపైగా విద్యార్థులు కామెర్లు, జ్వరాలతో పార్వతీపురం జిల్లా ఆస్పత్రి, విశాఖ కేజీహెచ్ల్లో చికిత్స పొందుతున్నారు. వీరంతా కురుపాం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, ఏకలవ్య పాఠశాల విద్యార్థులే కావడం గమనార్హం. జిల్లాలోని సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాల్లో అపరిశుభ్రత, కలుషిత ఆహారం–నీరు, వైద్యసదుపాయాల లేమి, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జ్వరాలు, పచ్చకామెర్లు ప్రబలాయనే వాదన బలంగా వినిపిస్తోంది. గత జులై నుంచి ప్రస్తుత అక్టోబరు వరకు జిల్లాలోని గిరిజన సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాల్లో చదువుతున్న 11 మంది విద్యార్థులు వివిధ అనారోగ్య కారణాలతో మరణించడం గమనార్హం. తాగునీటి కలుషితం వల్లేనా? కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల, ఏకలవ్య పాఠశాలల్లో 934 మంది విద్యార్థులు ఉండగా, నాలుగైదు రోజుల్లోనే 120 మంది విద్యార్థులకు పచ్చకామెర్లు, ఇతర అనారోగ్య సమస్యలు వచ్చాయి. తాగునీటి కలుషితం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మందిలో పచ్చకామెర్లు లక్షణాలు బయటపడటంతో శనివారం పాఠశాలల్లో రక్త పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో 79 మంది ఉన్నారు. విశాఖ కేజీహెచ్‌లో ముగ్గురు ఐసీయూలోనూ, 34 మంది జనరల్ వార్డులోనూ చికిత్స పొందుతున్నారు.మిగిలిన నలుగురు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కామెర్ల బారిన పడిన విద్యార్థినుల్లో గుమ్మలక్ష్మీపురం మండలం కంబగూడకు చెందిన పువ్వల అంజలి గత నెల 26న, కురుపాం మండలం దండసూర గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని తోయక కల్పన ఈ నెల 1న మృతి చెందారు. వారంలోనే ఇద్దరు మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హడావిడిగా రక్త పరీక్షలు జరిపి, మిగిలిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. పచ్చకామెర్ల బాధితుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి నాలుగు రోజుల క్రితం పాఠశాలను సందర్శించి, ఆర్వో ప్లాంట్ సమస్యపై అధికారులను నిలదీశారు. దీంతో అధికారులు హడావిడిగా కొత్త ప్లాంట్‌ని ఏర్పాటు చేశారు. పట్టించుకోని కూటమి ప్రభుత్వంమన్యం జిల్లాలో గిరిజన పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నా.. ప్రభుత్వంలో చలనం రావడం లేదు. గత ఏడాది జులై నుంచి ఇప్పటి వరకు 11 మంది ఆశ్రమ, సంక్షేమ పాఠశాలల విద్యార్థులు వివిధ కారణాలతో మృతి చెందారు. వీరంతా అనారోగ్యానికి గురి కావడం.. సకాలంలో సరైన వైద్యం అందకపోవడం వంటి కారణాలతోనే ప్రాణాలు వదిలారు. తాము అధికారంలోకి వస్తే ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంల నియామకం చేపడతామని చెప్పిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హామీ ఇప్పటివరకు అమలుకునోచుకోలేదు. ఆమె సొంత జిల్లాలోనే గిరిజన విద్యార్థులు విషజ్వరాలు, పచ్చకామెర్ల బారిన పడినా ఇప్పటివరకు పట్టించుకోలేదు.తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం హడా వుడిగా మేల్కొన్న ఆమె విశాఖ కేజీహెచ్‌కు వెళ్లి, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి కూడా ఇప్పటి వరకు విద్యార్థుల పరిస్థితిపై స్పందించకపోవడం విచారకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని రెండు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లకు రెగ్యులర్ పీవోలు లేరు. పార్వతీపురం ఐటీడీఏ డీడీ కూడా ఇన్చార్జే కావడంతో ఆశ్రమ పాఠశాలలు అధ్వానంగా మారాయని విమర్శిస్తున్నారు. భయం వేస్తోంది.. గురుకుల పాఠశాలకు పిల్లలను పంపాలంటేనే భయం వేస్తోంది. నా ఇద్దరు కుమార్తెలు గురుకులంలో ఒకరు పదో తరగతి, ఇంకొకరు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. రక్త పరీక్షలు చేసేందుకు తీసుకొచ్చాను. ఇప్పటికే ఇక్కడ ఇద్దరు చనిపోవడంతో భయంగా ఉంది. – బిడ్డిక నాగరాజు, సంగెడ్డ గ్రామం, కురుపాం మండలం, విద్యార్థిని తండ్రి సౌకర్యాలు లేవు ఉన్నత చదువుల కోసం చేర్పిస్తే.. విగతజీవిగా ఇంటికి వస్తున్నారు. పాఠశాలలో వందల మంది పిల్లలకు వసతులు, మరుగుదొడ్లు సరిగా లేవు. కలుషిత నీరో, లేక కలుíÙత ఆహారమో తెలియదు. పచ్చకామెర్ల బారిన పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కరువైంది. – మండంగి కృష్ణ, లాబేసు గ్రామం, కొమరాడ మండలం, విద్యార్థిని తండ్రి విద్యార్థులందరికీ రక్త పరీక్షలు విద్యార్థులందరికీ రక్తపరీక్షలు నిర్వహించాం. నివేదికలు ఇంకా రాలేదు. జ్వరాలు, పచ్చకామెర్ల అనుమానిత లక్షణాలు ఉంటే మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తున్నాం. ముందు జాగ్రత్తగా కురుపాం మండలంలోని శివన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలకు ఈనెల 6వ తేదీ నుంచి వారం రోజుల పాటు సెలవులను ప్రకటించాం. – డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, కలెక్టర్, పార్వతీపురం మన్యం సమగ్ర విచారణ జరిపిస్తున్నాం.. బాధిత విద్యార్థులకు వైద్యసేవలు అందిస్తున్నాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వ్యాధుల విజృంభణపై విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించాం. వారు సమగ్ర విచారణ జరిపి, నివేదికలు సమరి్పస్తే తదుపరి చర్యలు తీసుకుంటాం. – ఎం.గౌతమి, గిరిజన సంక్షేమ గురుకుల కార్యదర్శి -
ఆన్లైన్ ఆచార్య!
సాక్షి, హైదరాబాద్: గత దశాబ్ద కాలంగా విద్యార్థుల పంథా మారుతోంది. విద్యాబుద్ధులు నేర్పే గురువు స్థానాన్ని ఆన్లైన్ యాప్‌లతో భర్తీ చేసుకుంటున్నారు. కాలేజీ స్థాయిలో పాఠాలు వినడమూ కష్టమవుతోంది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత పిల్లలు ఆన్లైన్ పాఠాలకు అలవాటు పడ్డారు. అకడమిక్ పాఠమైనా, మరో ఇతర అంశమైనా సెర్చ్ ఇంజిన్‌కే ప్రాధాన్యమిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే యాప్‌లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. విస్తృతమైన సమాచారం (కంటెంట్)తో ఇవి విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆన్లైన్ ప్లాట్‌ఫాంల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. విద్యార్థులు ఐఐటీ ముంబై, మద్రాస్ సంస్థలు ఇటీవల జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. కాలేజీలో మాస్టార్ పేరు తెలియని వాళ్ళు కూడా, ఆన్లైన్ యాప్‌ల పేర్లు ఇట్టే చెప్పేస్తున్నారనేది పరిశోధన సారాంశం. పాఠశాల విద్యలో నూటికి 68 మంది, ఉన్నత విద్యలో 83 మంది ఆన్లైన్ ద్వారా నేర్చుకోవడానికే మొగ్గుచూపుతున్నారు. మ్యాథ్స్‌లో మూ ల్యాంకనలకు, ఫిజిక్స్‌లో మ్యాగ్నటిక్ డైమెన్షన్స్, కెమిస్ట్రీలో కెమికల్ రియాక్షన్స్, బోటనీలో బయలాజికల్ క్లాసిఫికేషన్‌కు ఆన్లైన్ శోధనే బెస్ట్ అంటున్నారు. అధ్యాపకుడు చెప్పే దానికన్నా మెరుగైన సబ్జెక్ట్ నాలెడ్జ్ అందుతోందని చెబుతున్నారు. ఆన్‌లైన్‌తో దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి మెదడులో ముఖ్య భాగం న్యూరాన్ వ్యవస్థ. జ్ఞాపక శక్తికి ఇది కీలకం. ఈ వ్యవస్థ ఇప్పుడు ఆన్లైన్ చదువుకు అలవాటు పడుతోందని పరిశోధనల్లో తేలింది. ఆన్లైన్లో చదవడం వల్ల హిప్పో కాంపస్ (జ్ఞా పకశక్తిని నిల్వ చేయడం)కు సంబంధించి మెరుగైన ఫలితాలు ఇస్తోందని కెనడా యూనివర్సిటీ శాస్త్రవేత్త జాన్ విలియం ఇటీవల వెల్లడించారు. స్కూల్ లేదా కాలేజీలో చదివిన విషయం మెదడులో తాత్కాలిక జ్ఞాపక శక్తిగా ఉంటోందని, ఆన్లైన్ ద్వారా చదివేటప్పుడు మెదడులోని న్యూరాన్ వ్యవస్థ తేలికగా దీన్ని దీర్ఘకాలిక జ్ఞాపక శక్తిగా మారుస్తోందని ఆయన పరిశోధనలో తేలింది. క్లాస్ రూంలో పాఠం వినేప్పుడు సిగ్నల్ వ్యవస్థ అయిన మెదడు రసాయన చర్య కారణంగా కొంత ఒత్తిడి గురవుతోందని, అయితే ఆన్లైన్లో ఏకాగ్రత వల్ల సున్నితంగా మెదడు పొరల్లోకి విషయం చేరుతోందని గత ఏడాది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు క్లాస్ రూం బోధన కన్నా, ఆన్లైన్ చదువు తేలికగా ఉందని భావిస్తున్నారు. అయితే, సబ్జెక్టుకు సంబంధించి వచ్చే సందేహాలు ఆన్లైన్లో నివృత్తి చేసుకునే క్రమంలో కొంత గందరగోళానికి గురవుతున్నారు. చాట్ జీపీటీ, ఇతర బ్రౌజర్లు విభిన్న సమాచారాన్ని అందిస్తుండటమే ఇందుకు కారణం. ఈ–పాఠాలు.. ఎన్నో యాప్‌లు ఈ–పాఠశాల: ఎన్సీఈఆర్టీ, సీఐఈటీ ఆధ్వర్యంలో నడిచే ఈ–పాఠశాల పాఠ్యపుస్తకాలు, ఆడియో, వీడియో, ఇతర విద్యా వనరులను అందిస్తోంది. డౌట్‌నట్ : గణితం, అణుశా్రస్తానికి సంబంధించిన సందేహాలను ఇది దృశ్యరూపాల్లో ఆప్‌లోడ్ చేసి అందిస్తోంది. ఈ యాప్ ద్వారా వీడియోలతో కూడిన అర్థవంతమైన సమాధానాలు పొందే వీలుంది. అన్అకాడమీ: జేఈఈ, నీట్, యూపీఎస్సీ, ఎస్సెస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉద్దేశించి దీన్ని రూపొందించారు. ప్రశ్నలకు సమాధానాలు, ఆన్లైన్ పరీక్ష విధానం, నిష్ణాతులైన అధ్యాపకుల లెక్చర్స్ ఇందులో ఉంటున్నాయి. ఎక్కువ మంది విద్యార్థులు దీన్ని అనుసరిస్తున్నారు. నీట్, జేఈఈ కోసం అమెజాన్ అకాడమీ కూడా పనిచేస్తోంది. ఇక యూనివర్సల్ బోధన పద్ధతులతో ఖాన్ అకాడమీ ప్రాక్టికల్ విద్య బోధనతో ఆన్లైన్ రంగంలో విద్యార్థులను ఆకర్షిస్తోంది. స్థానిక భాషల్లో ప్రోగ్రామింగ్ చేసిన గువీ, టెక్ డేటా సైన్స్ నైపుణ్యాలతో ఎడ్యురేకా వంటి యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్ బోధనకే పరిమితం కాకూడదు కాలానుగుణంగా వస్తున్న మార్పులతో ఆన్లైన్ విద్యా విధానం అనివార్యమైంది. అదనపు స్కిల్స్, సమాచారం కోసం ఆన్‌లైన్‌కు వెళ్ళడం మంచిదే. కానీ ఆన్లైన్ బోధనకే పరిమితం కావడం సరైన విధానం కాదు. దీనివల్ల క్లాస్ రూం కనెక్టివిటీ పోతుంది. అందువల్ల అంతర్జాతీయ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంతో పాటు, సంప్రదాయ అకడమిక్ బోధన పద్ధతులపైనా దృష్టి పెట్టాలి. – ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి (చైర్మన్, ఉన్నత విద్యా మండలి) -
అక్షరాన్ని అందిస్తూ...
దేశంలో సంపన్నులకే పరిమితమైన విద్యను సామాన్యుల దరికి చేర్చిన ఘనత అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాలకే దక్కింది. దేశంలో తొలి సార్వత్రిక విశ్వవిద్యాలయంగా 1982లో ఏర్పాటైనప్పటి నుంచి విద్యకు దూరమైన వారిని అక్కున చేర్చుకుంది. మొత్తం విద్యార్థుల్లో సగటున 85 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారు ఉన్నారు. స్త్రీలు విద్యావంతులు కావడంలోనూ ఎంతో కృషి చేస్తోంది. మొత్తం మీద యూనివర్సిటీ విద్యార్థుల్లో సగటున ఏటా 48 శాతం మంది మహిళలుఉంటున్నారు.Dr B.R. Ambedkar Open University (BRAOU) యూనివర్సిటీ ఈ ఏడాది (2025–26) నుంచి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ‘చదువుతూ సంపాదించు’ విధానంపై దృష్టి సారించారు. విద్యార్థులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేలా ‘శ్రీ రామానందతీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్’తో ఒప్పందం కుదుర్చుకుంది. యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు ఉచిత భోజన, వసతితో వివిధ అంశాల్లో రెండు నుంచి మూడు నెలలు ఈసంస్థలో శిక్షణ ఇస్తారు. కంప్యూటర్, ఆటోమొబైల్, సోలార్ విద్యుత్తు నుంచి అనేక రంగాలకు సంబంధించి వివిధ పరిశ్రమల్లో పనిచేయడానికి లేదా స్వయం ఉపాధి పొందడానికి అవసరమైన మెలకువలు, నైపుణ్యం సాధించేలా శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. అదే తరహాలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (నాక్)తోనూ యూనివర్సిటీ సంప్రతింపులు జరిపింది. నిర్మాణరంగానికి సంబంధించిన వివిధ విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కార్యక్ర మానికి శ్రీకారం చుట్టనుందిచదవండి: Gorati Venkanna: పాటతల్లికి పెద్దకొడుకుయూనివర్సిటీ మహిళా విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడానికి వీలుగా ‘వీ హబ్’తో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని అంగన్వాడీల్లో పనిచేసే సిబ్బంది నైపుణ్యాల్ని పెంపొందించేందుకు సర్టిఫికెట్, డిప్లమో ప్రోగ్రామ్స్ రూపొందించింది. మహిళా, శిశు సంక్షేమశాఖతో ఒప్పందం కుదుర్చుకుని ఆ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు. ఈ విద్యా సంవత్సరం (2025– 26) నుంచి గిరిజన విద్యార్థులకు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్స్‌కు ఉచిత విద్య అందించనున్నది. సైనికులకూ, ఖైదీలకూ ఇప్పటికే విద్యను అందుబాటులోకి తెచ్చింది. యూనివర్సిటీ మంగళవారం తన 26వ స్నాతకోత్సవం జరుపుకొంటోంది. రెండు విద్యాసంవత్సరాలకు (2023–24, 2024–25) సంబంధించిన 60,288 మందికి డిగ్రీలు అందిస్తోంది. 55 మందికి డాక్టరేట్ పట్టాలుఅందించనున్నారు. ఇద్దరు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేయ నున్నారు. అందులో ఒకరు వాగ్గేయకారుడు గోరటి వెంకన్న కాగా మరొకరు ప్రఖ్యాత శాంతి విద్యా ప్రచారకులు ప్రేమ్ రావత్!– డా.ఎల్వీకే అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్, హైదరాబాద్(నేడు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవం) -
అమెరికా వెళ్లాలంటే.. అప్పు పుట్టట్లేదు!
సాక్షి, హైదరాబాద్: విదేశీ విద్య కోసం అమెరికా వెళ్లాలన్న ఆసక్తి విద్యార్థుల్లో క్రమంగా తగ్గుతోంది. తమ పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులూ వెనుకాడుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు అమెరికా అంటేనే నమ్మకం పోతోందని కన్సల్టెన్సీ సంస్థలూ అంటున్నాయి. ఇదిలాఉంటే, ఇప్పటికే అమెరికా వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఆందోళనతో ఉన్నారు. ప్రైవేటు అప్పులు వారిని వెంటాడుతున్నాయి. ఇంకోవైపు అమెరికా నుంచి విద్యార్థులు డబ్బులు పంపాలని కోరడం మరింత ఆందోళన రేపుతోంది. పిల్లలు అమెరికా వెళ్లే వరకూ ఆనందంగా ఉన్న మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నాయి. హెచ్1–బీ వీసీకు లక్ష డాలర్లు చెల్లించాలన్న ట్రంప్ నిర్ణయం అనేక కుటుంబాల్లో కునుకులేకుండా చేస్తోంది. పెరుగుతున్న అప్పు ఒత్తిడి భారత్ నుంచి ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది అమెరికా వెళ్లారు. తెలుగు రాష్ట్రాల నుంచి 50 వేల మంది వెళ్లినట్టు అంచనా. ఇందులో ఎక్కువ మంది చిన్నస్థాయి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలే ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో బ్యాంకు లోన్లలతోపాటు, తేలికగా ప్రైవేటు అప్పులు పుట్టాయి. అమెరికా వెళ్లే విద్యార్థి పార్ట్ టైం ఉద్యోగం చేసి సంపాదిస్తాడనే నమ్మకం ఉండేది. దీంతో ప్రైవేటు వ్యక్తులూ అప్పులివ్వడానికి వెనుకాడలేదు. కొంతమంది తల్లిదండ్రులు రూ.2 నుంచి 5 వడ్డీకి కూడా అప్పులు తెచ్చారు. వడ్డీ రెండేళ్లలో అసలును మించి పోయిందని ఇప్పుడు వాపోతున్నారు. వచ్చే జీతంలో ఎక్కువ భాగం నెలనెలా వడ్డీ కట్టేవాళ్లూ ఉన్నారు. అమెరికాలో పార్ట్‌టైం ఉద్యోగాలు చేయొద్దంటూ ఆంక్షలు పెట్టడంతో, జీవనం కోసం విద్యార్థులు తల్లిదండ్రులను ఆశ్రయించారు. డబ్బులు పంపకపోతే అమెరికాలో ఉండటం కష్టమని చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఏడాదిగా కొత్త అప్పులు తీసుకురాక తప్పని పరిస్థితి. దీనికితోడు రూపాయి మారక విలువ తగ్గడంతో అమెరికాలో యూనివర్సిటీ ఫీజుల భారం ఎక్కువైంది. ఇవన్నీ తల్లిదండ్రులను మరింత అప్పుల్లోకి నెట్టాయి. హెచ్1–బీ వీసాకు ఆంక్షలు పెట్టడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన 19 వేల మంది విద్యార్థులు ఎంఎస్ పూర్తి చేసుకుని, ఉద్యోగం లేని కారణంగా వెనక్కు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది గమనించిన అప్పుల వాళ్లు తామిచ్చిన మొత్తాన్ని ఇవ్వమని తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నారు. వడ్డీ ఇవ్వకున్నా అసలైనా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఏమీ చేయలేని అమోమయంలోకి వెళ్తున్నారు. అమ్మో... అప్పా? కొత్తగా అమెరికా వెళ్లే విద్యార్థులకు అప్పులు ఇచ్చేందుకు ప్రైవేటు వ్యక్తులు ముందుకు రావడం లేదు. స్థిరాస్తి కుదవపెడితే ఆలోచిస్తామని చెబుతున్నారు. బ్యాంకులు కూడా షూరిటీని అడుగుతున్నాయని తల్లిదండ్రులు అంటున్నారు. అమెరికా వెళ్లాలంటే ముందుగా జీవన వ్యయాన్ని బ్యాంకు నిల్వగా చూపించాలి. ఈ మొత్తాన్ని ఆరు నెలల ముందే బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వచ్చే జనవరి సెమిస్టర్ కోసం యూఎస్ వెళ్లే విద్యార్థులు ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేసుకోవాలి. ఒక్కో విద్యార్థి కనీసం రూ. 40 లక్షలు సమకూర్చుకుంటే తప్ప అమెరికా వెళ్లలేరు. కొంతమంది ఉద్యోగులు తమ పీఎఫ్ డ్రా చేస్తున్నారు. ఒత్తిడి పెరిగింది: మల్లెల హర్షవర్ధన్ (సిద్దిపేట) సాధారణ ఉద్యోగం చేసే నేను రూ.20 లక్షల ప్రైవేటు అప్పు చేసి ఎంఎస్ కోసం కొడుకును అమెరికా పంపాను. రెండేళ్లల్లో అప్పు రెట్టింపు అయింది. నెలనెలా అమెరికాలో అబ్బాయికి డబ్బులు పంపుతున్నాను. అప్పు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి. స్థిరాస్తులు కూడా ఏమీ లేవు. భయమేస్తోంది. అప్పంటే భయమేస్తోంది : మారపంపు నవీన్, వడ్డీ వ్యాపారి, వరంగల్ అమెరికా వెళ్లే వారికి కొన్నేళ్లుగా అప్పులు ఇస్తున్నాను. పెద్దగా ష్యూరిటీ ఆశించలేదు. కానీ రెండేళ్లుగా ఇస్తున్న అప్పులు తిరిగి రావడం కష్టంగా ఉంది. కొంతమంది వద్ద స్థిరాస్తులు కూడా లేవు. గట్టిగా అడిగే పరిస్థితి లేదు. అందుకే అమెరికా వెళ్లే వారికి అప్పులు ఇవ్వడం మానేశాను. -
సిద్ధార్థ కాలేజీ హాస్టల్లో ర్యాగింగ్ భూతం
-
హ్యాట్సాఫ్ మాష్టారు..! వైకల్యాన్ని బలంగా మార్చుకోవడం అంటే ఇదే..!
పుట్టుకతో రెండు చేతులు లేవు. అయినా వెనుకడుగు వేయలేదు. అజేయంగా ముందుకు సాగి ఉన్నత చదువులు చదవడమే కాకుండా, పాఠాలు చెప్పే ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకున్నాడు. అనుకున్నట్లుగానే టీచర్ అయ్యాడు. చేతులు లేకపోయినా..పిల్లలకు బోధించే విధానాన్ని చూస్తే.. ఎవ్వరి మనసైనా హత్తుకుంటుంది. ఓ గొప్ప స్ఫూర్తిని నింపుతుంది.జార్ఖండ్‌లోని దట్టమైన అడువుల మధ్యలో గుల్షన్ లోహార్ అనే ఉపాధ్యాయుడు ఆ యువ జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు. పుట్టుకతోనే చేతులు లేని ఆ ఉపాధ్యాయుడు పిల్లలకు బ్లాక్‌బోర్డుపై రాస్తూ బోధిస్తున్న తీరు ఇట్టే ఆకర్షిస్తుంది. పైగా ఆ విద్యార్థుల్లో స్ఫూర్తిని కూడా నింపుతోంది. ఆయన ఎప్పుడు తన వైకల్యాన్ని అడ్డంకి కూడా చూడలేదు. చాలామంది ఇలా రెండు చేతులు లేకపోవడాన్ని శాపంగా చూస్తే..అదే తన బలంగా మార్చుకున్నాడాయన. అతడి ఎడ్యుకేషన్ జర్నీ దృఢ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం. మధ్యతరగతి కుటుంబానికి చెందిన లోహార్ రోజు 74 కిలోమీటర్లు ప్రయాణించి కాలేజ్‌కి వెళ్లేవాడట. తల్లి, సోదరుడు, అడగడుగునా సాయం అందించేవారట. బీఈడీ డిగ్రీకి ముఖ్యమంత్రి ఆర్థిక సహాయంతో పూర్తి చేసినట్లు తెలిపారు. అలా టీచర్ ఉద్యోగం పొందాక..మారుమూల గ్రామాల్లో పనిచేసేందుకు అంతగా ఉపాధ్యాయులెవరు ఆసక్తి చూపరు కానీ లోహార్ అలాంటి పాఠశాలలనే ఎంచుకుంటారు. ఆయన పశ్చిమ సింగ్‌భూమ్‌లోని మారుమూల అడవులలో ఉన్న బరంగ గ్రామం పాఠశాల అనేక విద్యా సవాళ్లను ఎదుర్కొంటోంది. అలాంటి పాఠశాలకు టీచర్‌గా రావడమే కాకుండా పాఠాలు చెప్పే తీరు ఓ రేంజ్లో ఉంటుందిగణితాన్ని బోధించేందుకు తన కాలినే చేతిగా మార్చుకుని చెబుతున్న విధానం చూస్తే..చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది.ఎందుకంటే దాన్ని భోధించాలంటే నోటితో సాధ్యం కాదు తప్పనిసరిగా బ్లాక్‌బోర్డుపై రాయక తప్పదు. తన వైకల్యాన్నే సవాలు చేసేలా చిన్నారులకు చెబుతున్న తీరు చూస్తే..మాష్టారు మీరు గ్రేట్ అని ప్రశంసించకుండా ఉండలేరు. అందుకు అతడి భార్య అంజలి, కూతురు సాయం అందిస్తారుట. అంతేగాదు అతడి సేవలను జార్ఖండ్ విద్యా ప్రాజెక్ట్ కౌన్సిల్ గుర్తించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేందుకు అర్హుడని అభివర్ణించింది. అయితే లోహార్ మాత్రం వైకల్యం అనేది నేర్చుకోవడానికి, బోధనకు అడ్డంకి కాదు అని చెప్పాలనేదే తన ఆకాంక్ష అని చెబుతున్నాడు. (చదవండి: కళ్లు బైర్లు కమ్మేలా బంగారం ధరలు.. అక్కడ మాత్రం 10 కేజీలతో డ్రెస్సు..!) -
‘ఎవరిది రాజకీయం?..’ లోకేష్‌పై ఏయూ విద్యార్థుల ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: తమ ఆందోళనలపై విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. స్వార్థంతోనే విద్యార్థులు రాజకీయం చేస్తున్నారని, వారిని ఉపేక్షించేది లేదని తాజాగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ లోకేష్‌కు ఏయూ స్టూడెంట్స్ అల్టిమేటం జారీ చేశారు. ‘‘విద్యార్థులు రాజకీయం చేస్తున్నారా? ఎవరిది రాజకీయం?. మా ఇబ్బందులు చెప్పుకోవడం స్వార్థం అవుతుందా?. వీసీ రాజకీయ ఎజెండాతోనే వచ్చినట్లు మీ వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. ఏయూ వీసీ.. గీతం వర్సిటీ కోసం పని చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇలాగే మాట్లాడితే మీ ఇంటిని ముట్టడిస్తాం. తక్షణమే మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి’’ అని విద్యార్థులు హెచ్చరించారు.ఏయూ విద్యార్థుల ఆందోళనపై విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏయూ బంద్‌కు విద్యార్థులు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ నిరసనలు కాస్త ఆందోళనలుగా మారాయి. అయితే.. స్వార్థం కోసమే విద్యార్థులు ఆందోళనకు దిగారంటూ మంత్రి లోకేష్ వ్యాఖ్యానించడం గమనార్హం. కావాలనే విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆంధ్రా వర్సిటీలో రాజకీయం చేస్తున్నాయి. మణికంఠ అనే విద్యార్థి ఫిట్స్ వచ్చి మరణించాడు. ఆంబులెన్స్‌లో ఉన్నప్పటికీ అతని ప్రాణాలు రక్షించలేకపోయారు. అయితే దాని వెనకాల ఏదో ఉందంటూ స్టూడెంట్స్ ఆందోళనలు చేస్తున్నారు. ఇది సరికాదు. కేవలం వాళ్ల స్వార్థం కోసం వాళ్లు ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులు మారకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం.. .. వీసీ నియామకాల్లో రాజకీయం ఏం లేదు. విద్యార్థులు చెప్పేది వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తప్పులేమైనా ఉంటే సరిదిద్దుకుంటాం. ఏయూని టాప్ యూనివర్సిటీగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది’’ అని నారా లోకేష్ అన్నారు. మరోవైపు వీసీ రాజశేఖర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. విద్యార్థుల చర్చ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇది పూర్తిగా ఒక ఉద్దేశ పూర్వక నిరసనగానే అనిపిస్తోందని అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు శుక్రవారం రెండో రోజుకి చేరాయి. వీసీ రాజీనామాను డిమాండ్ చేస్తూ రిజిస్ట్రార్ ఆఫీస్‌ను శుక్రవారం ఉదయం విద్యార్థులు చుట్టుముట్టారు. ఈ క్రమంలో వాళ్లకు అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి రణరంగంగా మారింది. తమ జుట్టు పట్టుకుని లాగి పడేసి అనుచితంగా ప్రవర్తించారంటూ ఈ సందర్భంగా పలువురు విద్యార్థినిలు మీడియా ఎదుట వాపోయారు. విద్యార్థుల డిమాండ్లు..ప్రతి విద్యార్థికి హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలిడిస్పెన్సరీలో సౌకర్యాలను మెరుగుపరచాలిఆక్సిజన్ సిలిండర్స్ ను అందుబాటులో ఉంచాలిచనిపోయిన మణికంఠ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలివారం రోజుల్లో హామీలపై స్పష్టత ఇవ్వాలి.. లేదంటే విసీ రాజీనామా చేయాలివిద్యార్థుల డిమాండ్లతో పాటు విద్యార్థులు సమస్యలపై త్రీ మెన్ కమిటీ ఏర్పాటుకు వీసీ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే.. విద్యార్థులు తమ డిమాండ్లను నిర్ణీత కాలపరిమితిలో నెరవేరుస్తామని రాసివ్వాలని కోరగా.. అందుకు వీసీ రాజశేఖర్ అంగీకరించలేదు. అలాగే పదవికి రాజీనామా చేసేది లేదని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.గత ఏడాది కాలంగా ఏయూలో సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు పోరాటం చేస్తున్నారు. అయినా వర్సిటీ అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో బీఈడీ స్టూడెంట్ మణికంఠ మృతి చెందడం, ఈ మరణానికి అధికారులే కారణమంటూ విద్యార్థులు ఆరోపిస్తుండడంతో ఆ నిరసనలు ఆందోళనల రూపం దాల్చాయి. మరో వీసీ నియామకం వెనుక రాజకీయాలు నడిచాయన్న ఆరోపణలనూ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వస్తోంది. ఈ క్రమంలో వీసీ వైఖరి కారణంగానే రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ధనుంజయరావు రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. -
బీఈడీ విద్యార్థి మృతి.. ఏయూలో తీవ్ర ఉద్రిక్తత
విశాఖపట్నం: ఏపీలోని ప్రతిష్టాత్మక ఏయూ(ఆంధ్రా యూనివర్శిటీ)లో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. బీఈడీ విద్యార్థి మణికంఠ మృతికి నిరసనగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఉదయం అస్వస్థతకు గురైన మణికంఠ.. సరైన వైద్యం అందక చనిపోయాడని ఆరోపిస్తూ విద్యార్థులు నిరసన చేపట్టారు. ఏయూలో కనీసం వైద్య సదుపాయం అందకే విద్యార్థి చనిపోయాడని, అక్కడ ఆక్సిజన్ సదుపాయం కూడా లేకపోయిన కారణంగానే బీఈడీ విద్యార్థి మణికంఠ ప్రాణాలు కోల్పోయాడని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వైస్ చాన్సలర్(వీసీ)ను చుట్టుముట్టి విద్యార్థి మృతికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసుల్ని మోహరించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
శాసన మండలి సాక్షిగా బయటపడ్డ పచ్చి నిజం
సాక్షి, అమరావతి: ఏపీలో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోతుంది. మండలి సాక్షిగా పచ్చి నిజం వెల్లడైంది. 1 నుంచి ఇంటర్ వరకు 77,58,930 మాత్రమే విద్యార్థులు ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. 2023-24 UDISE డేటా ప్రకారం 87, 41, 885 మంది విద్యార్థులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 2023-24 విద్యా సంవత్సరం లో 84 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక UDISE డేటాతో పోలిస్తే 9,82,955 మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయినట్లు తేలింది.రాష్ట్ర ప్రభుత్వం డేటాతో పోలిస్తే సుమారు 6 లక్షలకు పైగా విద్యార్థులు తగ్గిపోయారు. గత రెండు విద్యా సంవత్సరాల్లో విద్యార్థుల సంఖ్య ఘోరంగా తగ్గిపోయింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు తగ్గిపోయారు. సీఎంగా చంద్రబాబు, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టాక విద్యార్థుల సంఖ్య తగ్గింది.ఫీజుల భారం, విద్యా ప్రమాణాలు తగ్గిపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గింది. గత ఏడాది అమ్మ ఒడి పథకాన్ని ఎగనామం పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. తల్లికి వందనం లబ్ధిదారుల సంఖ్యలోనూ భారీగా కోత విధించింది. మండలిలో మంత్రి లోకేష్ సమాధానంతో అసలు నిజం బట్టబయలైంది. ఏపీలో 77,58,930 మంది విద్యార్థుల్లో 66,57,508 మందికే వర్తింపు చేసిన ప్రభుత్వం.. 11,01,422 మంది విద్యార్థులు అనర్హులుగా ప్రకటించింది. ఈ ఏడాది 2 లక్షల 70 వేల మందికి తల్లికి వందనం నిధులు ఇప్పటికి జమకాలేదు. కేంద్రం ఇచ్చిన నిధులపై మండలిలో మంత్రి లోకేష్ సమాధానం చెప్పలేకపోయారు. -
ట్రంప్ తెచ్చిన తంటా!
ఎవరి అంచనాలకూ అందకుండా ప్రవర్తిస్తూ అయోమయానికి గురిచేయటంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సిద్ధహస్తుడు. ఆర్నెల్లక్రితం రెండోసారి అధికారంలో కొచ్చింది మొదలు తీసుకుంటున్న విపరీత నిర్ణయాల మాదిరే హెచ్1బీ వీసా ఫీజు దాదాపు లక్ష డాలర్లు చేసి ఐటీ, ఫార్మా, సాంకేతిక రంగాల నిపుణుల ఆశలను భగ్నం చేశారు. ఈ వీసా లబ్ధిదారుల్లో అత్యధికులు భారతీయులని తెలిసే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని వేరే చెప్పనవసరం లేదు. ప్రస్తుతం హెచ్1బీ వీసాదారులు 7,30,000 మందిలో దాదాపు 71 శాతం మంది భారతీయులు. ఇప్పటికే మన సరుకులపై సుంకాల మోత మోగించి భిన్నరంగాల కార్మికుల పొట్టగొట్టిన ట్రంప్, ఇప్పుడు ఐటీ, ఫార్మా,సాంకేతిక రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న అత్యంత నైపుణ్యంగల ఇంజనీర్ల ఆశలు అడియాసలు చేశారు. మొదట ఫీజు పెంపుపై చేసిన అస్పష్ట ప్రకటన అమెరికాలోని భారతీయుల్లో తీవ్ర ప్రకంపనలు రేపింది. పండగ కోసం స్వస్థలాలకు చేరుకుంటున్న వేలాదిమంది మార్గమధ్యంలో వెనుదిరిగే ప్రయత్నం చేయగా, అలాంటివారిని మరింత ఇబ్బంది పెట్టాలన్న ఏకైక లక్ష్యంతో ట్రంప్ కనుసన్నల్లో పనిచేసే ‘మాగా’ ఉద్యమకారులు విమానాల్లో భారీయెత్తున సీట్లు బ్లాక్ చేసి టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటేలా చేశారు. అసలు జరుగుతున్నదేమిటో అర్థంకాక అమెజాన్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలన్నీ ఆదివారం మధ్యాహ్నం గడువు ముగిసే వేళకు వచ్చితీరాలని సందేశాలు పంపటంతో స్వస్థలాలకొచ్చినవారంతా ఉన్నపాటున బయల్దేరారు. అంతా అయిన తర్వాత ఈ పెంపు కొత్త దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందంటూ, అది కూడా వార్షిక ఫీజు కాదు... ఒక్కసారి కట్టాల్సిన రుసుమేనంటూ వైట్‌హౌస్ అధికార ప్రతినిధి తీరిగ్గా ప్రకటించారు. పైగా రెండు మూడేళ్లలో వీసాను నవీకరించుకోవాల్సినవారికి కూడా ఇది వర్తించబోదని చెప్పారు. కానీ యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఛాంబర్ ఆఫ్ ప్రోగ్రెస్ సంస్థల ప్రతినిధుల ప్రకటనలు గమనిస్తే ఇప్పటికీ దిగ్గజ సంస్థల్లో ఏర్పడిన అయోమయం పోలేదని అర్థమవుతుంది. అసలు ఇప్పుడు చెప్పిన మాటకు ట్రంప్ కట్టుబడి ఉంటారన్న గ్యారెంటీ కూడా లేదు.తీరికూర్చుని నిందలేయటానికి తప్ప వలసదారుల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కొచ్చిన నష్టం లేశమాత్రమైనా లేదు. అర్హులైన అమెరికన్ల ఉద్యోగాలు కొల్లగొట్టిందీ లేదు. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందన్న ఉద్దేశంతోనే ఆ కట్టుకథను మాగా ప్రచారంలో పెట్టింది. ప్రారంభంలో వలసదారులు తక్కువ వేతనానికి చేరినా త్వరలోనే తమ నైపుణ్యంతో, చురుకుదనంతో అక్కడివారితో సమానంగా వేతనం అందుకుంటున్నారు. నిజానికి ఐటీ, ఫార్మా, సాంకేతిక రంగాల మాట అటుంచి చిప్ డిజైన్,క్లౌడ్ కంప్యూటింగ్, పెనువేగంతో విస్తరిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) తదితర ప్రాజెక్టుల్లో సమర్థంగా పనిచేసే చాలినంతమంది స్థానిక నిపుణులు దొరకటం అక్కడి సంస్థలకు అసాధ్యం. ఏఐలో అమెరికాను చైనా దాటిపోతోందన్న వార్త ఇప్పటికే అక్కడి పరిశ్రమల్ని కలవరపెడుతోంది. దాన్ని మరింత పెంచటం, చివరకు అమెరికా వెనకబాటుకు కారకుడు కావటం మినహా ట్రంప్ సాధించేదేమీవుండదు. వలసదారుల వల్ల అమెరికా పొందిన లబ్ధి అంతా ఇంతా కాదు. ప్రపంచంలో ఎక్కడా లేనంత సంపద పోగు పడటానికి వలసదారులే కారణం. 1990–2000 మధ్య నోబెల్ సాధించిన శాస్త్రవేత్తల్లో 26 శాతంమంది వలసదారులు. ఇప్పుడు ప్రముఖ కంపెనీలుగా ఉన్న సంస్థల వృద్ధి వెనక 25 శాతం వలసదారులే ఉన్నారు. తన విపరీత నిర్ణయాలు అనుద్దేశిత పర్యవసానాలకు దారి తీస్తాయన్న ఎరుక ట్రంప్‌కు లేకుండా పోయింది. తాజా పెంపు నిర్ణయాన్ని న్యాయస్థానాలు తప్పుబట్టి తాత్కాలికంగా నిలిపేయవచ్చంటున్నారు. ఆ సంగతెలావున్నా ట్రంప్ సృష్టించిన అనిశ్చితి పర్యవసానంగా స్థానిక కంపెనీలు తమ కార్యక్షేత్రాలను వేరే దేశాలకు తరలిస్తాయి.దాంతోపాటు వృత్తిరంగ నిపుణులు, విద్యార్థులు ఇతర దేశాల వైపు దృష్టి సారిస్తారు. ఇదంతా అమెరికాకే నష్టం. మన ప్రభుత్వం మెరుగైన విధానాలతో ముందు కొస్తే, ఆ ప్రతిభా సామర్థ్యాలకు ఆసరాగా నిలిస్తే ఆ చర్య దేశాభివృద్ధికి దోహదపడుతుంది. -
లక్ష డాలర్ల బాంబు
న్యూయార్క్/వాషింగ్టన్: అమెరికా నుంచి వలస దారులను బయటకు పంపించి, అమెరికన్ల మనసులు గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో పెద్ద బాంబు పేల్చారు. విదేశీ వృత్తి నిపుణులు అమెరికా గడ్డపై ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పిస్తున్న హెచ్–1బీ వీసా వార్షిక రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు (రూ. 88 లక్షలకుపైగా) పెంచేశారు. ఈ మేరకు ‘నాన్–ఇమిగ్రెంట్ ఉద్యోగుల ప్రవేశంపై ఆంక్షలు’ పేరిట సంబంధిత ఉత్తర్వుపై శుక్రవారం సంతకం చేశారు. అమెరికా కాలమానం ప్రకారం ఈ నెల 21వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని తేల్చిచెప్పారు. ప్రతిఏటా హెచ్–1బీ వీసాలు పొందుతున్నవారిలో 70% మంది భారతీయులే కావడంతో వారిపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా డాలర్ డ్రీమ్స్ వదులుకోవాల్సి రావొచ్చని అంటున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తూ విదేశీయులను నియమించుకొనే కంపెనీలు వారికి హెచ్–1బీ వీసాలు జారీ చేయడానికి ప్రతి సంవత్సరం రూ.88 లక్షలకుపైగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారాన్ని మోయలేని కంపెనీలు విదేశీ ఉద్యోగులను పక్కనపెట్టి, స్థానిక అమెరికన్లకే ప్రాధాన్యం ఇవ్వొచ్చు. సరిగ్గా ట్రంప్ ఆశిస్తున్నది కూడా ఇదే. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం వెంటనే ప్రభావం చూపింది. గడువు దాటితే రూ.88 లక్షలు చెల్లించక తప్పని పరిస్థితి ఉండడంతో ప్రస్తుతం విదేశాల్లో ఉన్న హెచ్–1బీ వీసాదారులు, వారి కుటుంబ సభ్యులు తక్షణమే అమెరికాకు చేరుకోవాలని కంపెనీలు ఆదేశించాయి. దాంతో విమానాశ్రయాల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. టిక్కెట్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఉత్తర్వు అమల్లోకి వచ్చే నిర్దేశిత గడువులోగా అమెరికాలో అడుగుపెట్టడానికి హెచ్–1బీ వీసాలు కలిగిన విదేశీ ఉద్యోగులు పరుగులు తీశారు. అమెరికా జాతీయ భద్రతకు ముప్పు: ట్రంప్ అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను మాత్రమే అమెరికాలోకి అనుమతించాలన్నదే తమ విధానమని డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. హెచ్–1బీ వీసా కార్యక్రమం అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా మారిందని ఆయన ఆక్షేపించారు. నైపుణ్యంతో కూడిన పనులు చేయడానికి విదేశాల నుంచి తాత్కాలిక ఉద్యోగులను తీసుకురావడానికి ఉద్దేశించిన ఈ వీసా దుర్వినియోగం అవుతోందని అన్నారు. అమెరికా ఉద్యోగుల స్థానంలో తక్కువ వేతనం, తక్కువ నైపుణ్యాలు కలిగిన విదేశీయులను నియమించుకోవడానికి హెచ్–1బీని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారని విమర్శించారు. అంతేకాకుండా ఈ వీసాలపై ఆధారపడిన ఔట్సోర్సింగ్ కంపెనీలు వీసా మోసాలు, మనీ లాండరింగ్, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్లు తమ దర్యాప్తు సంస్థలు గుర్తించాయని చెప్పారు. విదేశీయులను అడ్డదారుల్లో అమెరికాకు చేరవేస్తున్నట్లు కనిపెట్టాయని పేర్కొన్నారు. ఈ అక్రమాలను అరికట్టడానికి కంపెనీలపై వీసా దరఖాస్తు ఫీజులు పెంచక తప్పడం లేదని వివరించారు. విదేశీ నిపుణుల్లో అత్యంత ప్రతిభావంతమైన నిపుణులను తాత్కాలికంగా నియమించుకోవడానికి కంపెనీలకు అనుమతి ఇస్తున్నామని, అందుకు ఎలాంటి అడ్డంకులు లేవని ప్రకటించారు. తమ నిర్ణయం పట్ల టెక్ కంపెనీల సీఈఓలు కచ్చితంగా సంతోషిస్తారని ట్రంప్ వ్యాఖ్యానించారు. వీసాల ముసుగులో కొనసాగుతున్న విచ్చలవిడి వలసలకు కళ్లెం వేయక తప్పదని పరోక్షంగా తేల్చిచెప్పారు. కంప్యూటర్ సంబంధిత రంగాల్లో కంపెనీలు హెచ్–1బీ వీసాలతో విదేశీయులకు ఉద్యోగాలు ఇస్తూ అమెరికన్లకు అన్యాయం చేస్తున్నాయని తప్పుపట్టారు. 2003లో హెచ్–1బీలు పొందిన విదేశీయుల్లో ఐటీ ఉద్యోగులు 32 శాతం మంది ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 65 శాతానికి చేరడం గమనార్హం. ట్రంప్ తాజా నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు స్వాగతిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. నిపుణులైన విదేశీ మానవ వనరులను అమెరికాకు దూరంచేసే ప్రయత్నం మానుకోవాలని ట్రంప్ ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిభలేనివారు మనకెందుకు?: హోవార్డ్ లుట్నిక్ అమెరికాలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో హెచ్–1బీ నాన్–ఇమ్మిగ్రెంట్ వీసా కార్యక్రమం అత్యధికంగా ఉల్లంఘనకు గురవుతోందని వైట్‌హౌస్ స్టాఫ్ సెక్రెటరీ విల్ స్కార్ఫ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ వీసా అసలు ఉద్దేశం నెరవేరడం లేదన్నారు. అమెరికా కామర్స్ సెక్రెటరీ హోవార్డ్ లుట్నిక్ మాట్లాడుతూ.. అమెరికన్ల అవకాశాలు దోచుకొనేవారు తమకు అవసరం లేదన్నారు. అత్యధిక నైపుణ్యాలు కలిగినవారికే అమెరికాలో ఉద్యోగాలు దక్కాలని చెప్పారు. అలాంటి నిపుణులు అమెరికాలో వ్యాపారాలు చేసి, ప్రతిభతో అమెరికన్ల కోసం కొత్త ఉద్యోగాలు సృష్టించగలరని తెలిపారు. దీనివల్ల అమెరికా ఖజానాకు 100 బిలియన్ డాలర్ల మేర లబ్ధి కలుగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఒక విదేశీ ఉద్యోగి కచ్చితంగా అవసరమని భావిస్తే అతడి కోసం ఏటా లక్ష డాలర్లు ప్రభుత్వానికి చెల్లించాలని, లేకపోతే అమెరికా పౌరుడినే నియమించుకోవాలని కంపెనీలకు సూచించారు. ప్రతిభ లేని విదేశీయులు మనకెందుని ప్రశ్నించారు. స్థానికులకే శిక్షణ ఇచ్చి, ఉద్యోగాల్లో చేర్చుకోవాలని కంపెనీలకు స్పష్టంచేశారు. హెచ్–1బీ వీసాల రెన్యూవల్స్తోపాటు కొత్త దరఖాస్తులకు కూడా లక్షల డాలర్ల రుసుము వర్తిస్తుందని హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. మరోవైపు ఒక విదేశీ ఉద్యోగి గ్రీన్‌కార్డు పొందడం కోసం కంపెనీ ఇప్పటికే స్పాన్సర్ చేస్తే అతడి వీసాను రెన్యూవల్ చేయడానికి ఏటా లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అది భారంగా భావిస్తే రెన్యూవల్ చేయడం ఆపేయొచ్చు. ఫలితంగా గ్రీన్‌కార్డు ఆశలు సైతం వదులుకోవాల్సిందే. గ్రీన్‌కార్డుల కోసం ఇప్పటికే వేలాది మంది విదేశీయులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు.ఏమిటీ హెచ్–1బీ వీసా? విదేశీ నిపుణులను అమెరికాలోని కంపెనీలు ఉద్యోగాల్లో నియమించుకోవడానికి వీలుగా 1990వ దశకంలో అమెరికా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ చట్టం ద్వారా హెచ్–1బీ వీసాలను ప్రవేశపెట్టింది. ఈ వీసాలతో లక్షలాది మంది విదేశీయులు అమెరికాలో ఉద్యోగాలు సంపాదించారు. ఇక్కడే స్థిరపడ్డారు. క్రమంగా పౌరసత్వం కూడా పొందారు. హెచ్–1బీ వీసా దరఖాస్తు ఫీజు ప్రస్తుతం 2 వేల డాలర్ల నుంచి 5 వేల డాలర్ల (రూ.1.76 లక్షలు– రూ.4.40 లక్షలు) దాకా ఉంది. తొలుత మూడేళ్ల కాలానికి హెచ్–1బీ వీసా జారీ చేస్తారు. అవసరాన్ని బట్టి మరో మూడేళ్లు పొడిగిస్తారు. ఈ వీసాలతో అత్యధికంగా ప్రయోజనం పొందుతున్నది భారత నిపుణులే. ఆ తర్వాత చైనా నిపుణులు ఉంటున్నారు. భారత్‌లో ఇంజనీరింగ్ విద్య అభ్యసించిన విద్యార్థుల కల హెచ్–1బీ వీసా అంటే అతిశయోక్తి కాదు. దీని గురించి తెలియనివాళ్లు దాదాపు ఉండరు. సాధారణంగా హెచ్–1బీ వీసా దరఖాస్తు ఫీజుతోపాటు ఇతర రుసుములను కంపెనీలే భరిస్తాయి. ఇకపై దీనికోసం ఏటా ఒక్కో విదేశీ ఉద్యోగిపై రూ.88 లక్షలకుపైగా చెల్లించాల్సి రావడం అమెరికా సంస్థలకు పెనుభారమే. అది పరోక్షంగా విదేశీ ఉద్యోగులకు.. ముఖ్యంగా భారతీయులకు నష్టం చేకూర్చనుంది. కంపెనీల అవసరాలు తీర్చేలా అత్యధిక ప్రతిభాపాటవాలు ఉంటే తప్ప హెచ్–1బీ వీసాతో అమెరికాలో ఉద్యోగం పొందడం దుర్లభమేనని అంటున్నారు. -
స్టూడెంట్స్ మీకోసం 'ఏఐ టూల్స్'!
కృత్రిమ మేధ (ఏఐ).. ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే సాంకేతికత. ఇది ఉద్యోగులకే కాదు.. అన్ని తరగతుల విద్యార్థులకు కూడా గొప్ప ఆయుధంగా అవతరించింది. వివిధ అంశాలను నేర్చుకునే విషయంలో సౌలభ్యమేకాదు.. క్రమశిక్షణా అలవాట్లను ఏర్పరచుకోవడం, సమయ పాలనా నిర్వహణ, సృజనాత్మకతను పెంపొందించుకోవడం వంటి ఎన్నో అంశాల్లో ఏఐ సాధనాలు విద్యార్థులకు దోహదపడుతున్నాయి. చాట్‌జీపీటీ, జెమినైతోపాటు అత్యంత ఉపయోగకరమైన ఏఐ టూల్స్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్సమయ పాలనరీక్లెయిమ్.ఏఐ: క్యాలెండర్‌ను ఆటోమేటిక్‌గా నిర్వహించే షెడ్యూలింగ్ సాధనం. అసైన్‌మెంట్స్‌ను ఎప్పుడు సవరించాలి, రాయాలో మాన్యువల్‌గా ప్లాన్ చేయడానికి బదులుగా.. విద్యార్థి ప్రస్తుత తరగతులు, క్రీడలు, అభిరుచులు, వ్యక్తిగత కార్యక్రమాలను స్కాన్ చేసి, అందుబాటులో ఉన్న ఖాళీ సమయంలో అధ్యయన సెషన్్సను నిర్ణయిస్తుంది. నోషన్ ఏఐ: నోట్స్, టాస్క్‌లు, ప్రాజెక్ట్‌లు, విజ్ఞానాన్ని ఒకే చోటకు తీసుకొస్తుంది. డాక్యుమెంట్లలో ఉన్న సమాచారాన్ని క్యాప్చర్ చేయడానికి, వాటిని సారాంశాలుగా మార్చడానికి, అసైన్‌మెంట్స్‌ను ట్రాక్ చేయడానికి, సమాచారాన్ని శోధించడానికి , నవీకరణకు సులభంగా అర్థమయ్యేలా స్టడీ డాష్‌బోర్డ్‌ను ఉంచడంలో సహాయపడుతుంది. పరిశోధన, రచనలుపర్ప్లెక్సిటీ.ఏఐ: విశ్వసనీయమైన వేదికలు (సోర్సులు), సంక్షిప్త సూచనలతో.. మన ప్రశ్నలకు సమాధానమిచ్చే పరిశోధన ఇంజిన్. గూగుల్‌లో స్క్రోల్ చేయడానికి బదులుగా వ్యాసాలు, నివేదికలు, ప్రాజెక్ట్‌లలో ఉదహరించగల ప్రత్యక్ష, విశ్వసనీయ విషయాలను నేరుగా పొందవచ్చు. నోట్‌బుక్ ఎల్ఎమ్ (గూగుల్): క్లాస్ నోట్స్, పాఠ్యపుస్తకాలు, పీడీఎఫ్‌లను అప్లోడ్ చేసి ఈ మెటీరియల్‌కు సంబంధించిన ప్రశ్నలను అడగవచ్చు. విద్యార్థులు ఇచ్చే సిలబస్‌ను ఆధారం చేసుకుని శిక్షణ పొందిన ట్యూటర్ పాత్రనూ పోషిస్తుంది. అధ్యయనం– అభ్యాసంక్విజ్లెట్: నోట్స్‌ను సంక్షిప్త సమాచార ఫ్లాష్‌కార్డ్స్, ప్రాక్టీస్ పరీక్షలు, స్టడీ గేమ్స్‌గా మారుస్తుంది. విద్యార్థులు మెటీరియల్‌ను ఎంత బాగా గుర్తుంచుకుంటున్నారో దానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటుంది. తద్వారా పాఠాలు తిరిగి చదవడం ఒక పనిలాగా, ఆసక్తి లేని విషయంగా కాకుండా ఆసక్తికరంగా మారుతుంది.వూల్ఫ్రమ్ ఆల్ఫా: ఇది కేవలం కాలిక్యులేటర్ మాత్రమే కాదు.. సమాధానాలను గణిస్తుంది. ఫంక్షన్్సను గ్రాఫ్ చేస్తుంది. దశలవారీ గణిత, సైన్్స పరిష్కారాల ద్వారా ముందుకు నడిపిస్తుంది. చేసిన పనిని ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయడానికి, భావనలను మరింత లోతుగా అన్వేషించడానికి ఉపయోగపడుతుంది.ఆటర్.ఏఐ (ఓటీటీఈఆర్): ఆడియో, వీడియోల కంటెంట్‌ను టెక్ట్స్‌గా మార్చే ట్రాన్స్క్రిప్షన్ సాధనం. ఉపన్యాసాలు, సమావేశాలు, గ్రూప్ డిస్కషన్్సను రికార్డ్ చేసి వాటిని సర్చ్ చేయదగిన టెక్ట్స్‌గా మారుస్తుంది. నోట్స్ రాసే వ్యక్తిగత సహాయకుడిగా ఉంటుంది.కంటెంట్ సృష్టి – ప్రజెంటేషన్కాన్వా: డ్రాగ్–అండ్–డ్రాప్ టెంప్లేట్స్‌తో పోస్టర్లు, స్లైడ్లు, ఇన్ఫోగ్రాఫిక్స్, వీడియోలను సులభంగా రూపొందించవచ్చు. ఇతర ఏఐ సాధనాలు కేవలం టెక్ట్స్ వివరణ నుంచి ప్రారంభ స్థాయి డిజైన్్సను మాత్రమే రూపొందించగలవు. కానీ ఇది లే–అవుట్, స్టైలింగ్‌ను వేగవంతం చేస్తుంది. కిండర్‌గార్టెన్ నుంచి ఇంటర్ వరకు అందరి విద్యార్థులకూ ఉపయోగపడుతుంది.గామా.యాప్: ప్రాంప్ట్‌ల నుంచి పూర్తి స్లైడ్ డెక్‌లు, సులభంగా అర్థమయ్యేలా ఒక పేజీలో డాక్యుమెంట్, సాధారణ సైట్స్‌ను కూడా రూపొందిస్తుంది. వాటికి తుదిమెరుగులు దిద్ది పీపీటీ, గూగుల్ స్లైడ్స్, పీడీఎఫ్‌లోకి మార్చడానికి వీలు కల్పిస్తుంది. కస్టమైజబుల్ ఏఐ సాధనాలుజెమినై జెమ్స్: సొంత, తేలికైన ఏఐ సాధనాలను సృష్టించడానికి అనుమతిస్తుంది. కథనాలను సంక్షిప్తంగా రూపొందించడం, కేస్ స్టడీస్ విశ్లేషణ, అధ్యయన అంశాలను తయారు చేయడం వంటి నిర్దిష్ట పనులు చేసిపెడుతుంది.చాట్‌జీపీటీ స్టడీ మోడ్: చాట్‌జీపీటీ కేవలం ప్రశ్నోత్తరాలకే పరిమితమైన సాధనం కాదు. స్టడీ మోడ్ సాయంతో ప్రాజెక్ట్స్, వ్యక్తిగత, ప్రత్యేక జెనరేటివ్ ప్రీ–ట్రెయిన్్డ ట్రాన్్సఫార్మర్స్తో (జీపీటీ) విద్యార్థులకు నిర్మాణాత్మక అధ్యయన సహాయకుడిగా కూడా సాయపడుతుంది. -
సరదా ఈత.. కాకూడదు గుండె కోత
విశాఖపట్నం నాయుడుతోట సమీపంలోని మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో ఇటీవల ఇద్దరు యువకులు నీట మునిగి మృతి చెందారు. పెందుర్తికి చెందిన బల్లంకి శేఖర్(18), ఇతని సోదరుడు వాసు, చినముషిడివాడకు చెందిన యాడాడ లక్ష్మణ్‌కుమార్ (18) సరదాగా రిజర్వాయర్ ఒడ్డున కూర్చొని ఉండగా శేఖర్ చెప్పు నీటిలో పడిపోయింది. రిజర్వాయర్ అంచు పట్టుకుని దానిని బయటకు తీసే క్రమంలో నాచు కారణంగా నీటిలో పడిపోయాడు. పైకి, కిందికి మునకలేస్తుండగా ఒడ్డు నుంచి లక్ష్మణ్ కుమార్ చేయి అందించబోయాడు. అయితే శేఖర్ అమాంతం.. లక్ష్మణ్ చేయిని లాగేయడంతో ఇద్దరూ నీట మునిగి పోయారు. వీరిద్దరికీ ఈత రాదు. ఒడ్డునే ఉన్న వాసు (ఇతనికి ఈత వచ్చు) నీటిలోకి దూకి వారిని రక్షించబోగా.. ఇతన్ని గట్టిగా పట్టేసుకున్నారు. దీంతో ముగ్గురూ నీటిలో మునిగి పోతుండగా ఒడ్డున ఉన్న మరో వ్యక్తి గమనించి నీటిలోకి దూకి.. ఒక్క వాసును మాత్రమే కాపాడగలిగాడు. మొన్నామధ్య అన్నమయ్య జిల్లా రాజంపేటలో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు, మచిలీపట్నం సమీపంలో నలుగురు విద్యార్థులు ఇలానే మృత్యువాత పడ్డారు. ఇలాంటి సంఘటనలు ప్రతి రోజూ రాష్ట్రంలో ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది విద్యార్థులు ఈత రాక, మరికొందరు ఈత వచ్చినా కూడా ఇలాంటి ఘటనల్లో మృతి చెందుతున్నారు. చాలా మందికి ఈత వచ్చినా ‘రెస్క్యూ’ (కాపాడటం) ఎలా చేయాలో తెలియక పోవడం విచారకరం.» చాలా దేశాల్లో స్విమ్మింగ్, సైక్లింగ్, కుకింగ్.. అనేవి విద్యార్థి దశలోనే మాండటరీ. ప్రతి వ్యక్తికి ఏదో ఒక దశలో ఇవి చాలా ముఖ్యం. ఇవి వస్తేనే ఉన్నత విద్యలో ప్రవేశం ఉంటుంది. మన దేశంలో మాత్రం అంత ముఖ్యం కాదు. ఇవన్నీ ఐచ్ఛికం. కుకింగ్ (వంట చేయడం) ఎంత ఇంపార్టెంటో మొన్న కరోనాలో మనకు బాగా తెలిసొచ్చింది. ఈత అనేది ఎంత ఉపయోగకరమో పైన చెప్పుకున్న ఘటనల్లాంటివి మనకు తారస పడినప్పుడు తెలుస్తుంది. » చాలా మందికి.. ప్రత్యేకించి యువతకు నీటి గురించి అవగాహన ఉండదు. ఆ.. ఏమవుతుంది అనుకుని నీటిలో దిగేస్తుంటారు. ఫ్రెండ్స్‌తో కలిసి బీచ్‌లకు, నది ఒడ్డుకు పిక్నిక్లకు వెళ్లినప్పుడు లోతు గమనించకుండానే ముందుకెళుతూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటుంటారు. మరికొంత మంది స్విమ్మింగ్ పూల్‌లో పట్టుమని 10 మీటర్లు కూడా ఈదలేని విధంగా ఉదరాబదరా ఈత నేర్చుకుని ‘మాకూ ఈత బాగా వచ్చు’ అని భ్రమ పడుతుంటారు. » పై ఈత (ఫ్రీ స్టైల్), లో ఈత (అండర్ వాటర్), వెనకీత (బ్యాక్ స్ట్రోక్), పక్కీత (సైడ్ స్ట్రోక్), నిలువీత (స్టాండింగ్ పొజిషన్), ఏటీత (బటర్‌ఫ్లై స్ట్రోక్), కప్పీత (బ్రెస్ట్ స్ట్రోక్) అని ఈతలో చాలా రకాలున్నాయి. చాలా మంది ఇవన్నీ నేర్చుకున్నప్పటికీ ఎప్పుడు ఏ ఈత అవసరమో తెలుసుకోరు. నేర్పించే వారు కూడా చెప్పరు. భారీ పరిమాణంలో నీరు నిల్వ ఉన్న చోట వెనకీత (బ్యాక్ స్ట్రోక్), కొద్దిపాటి ప్రవాహాలకు ఎదురీదాల్సి వచ్చినప్పుడు, సుడిగుండాల్లో చిక్కుకున్నప్పుడు ఏటీత (బటర్‌ఫ్లై స్ట్రోక్), చిన్నపాటి కాలువలు దాటాల్సి వచ్చినప్పుడు పై ఈత (ఫ్రీ స్టైల్), నీటిపైన చెత్తా చెదారాలు, పరిశ్రమల వ్యర్థాలు తేలుతున్నప్పుడు అండర్ వాటర్ ఈత అవసరం. అన్నింటికంటే బ్యాక్ స్ట్రోక్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఎక్కువగా అలుపు రాదు. మధ్య మధ్యలో నీటిపై తేలియాడుతూ రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎంత దూరమైనా ఇలా నెమ్మదిగా వెనక్కు వెళ్లిపోవచ్చు. » చాలా మంది యువతకు కొద్దో గొప్పో ఈత వచ్చి కూడా చనిపోవడం చూస్తున్నాం. ఇలాంటి చాలా ఘటనల్లో బయటకు చెప్పలేని నిజం ఏమిటంటే వారు మద్యం మత్తులో ఉండటం. సరదాగా స్నేహితులతో కలిసి పిక్నిక్లకు వెళ్లినప్పుడు మందు (లిక్కర్) తాగుతుంటారు. అలా మద్యం మత్తులో నీటిలోకి దిగినప్పుడు ఎంత దూరం లోపలికి పోతున్నారో గమనించరు. తిరిగి వెనక్కు వచ్చే క్రమంలో ఆయాసం ఎక్కువై.. బాడీ బ్యాలెన్స్ చేసుకోలేక.. ఆలోచించే కెపాసిటీ కోల్పోయి నీట మునిగి చనిపోతున్నారు. అందువల్ల మద్యం తీసుకున్నప్పుడు పొరపాటున కూడా ఈతకు దిగరాదని యువతకు గట్టిగా చెప్పాలి. మన పిల్లలకు మనం నీరంటే భయమన్నా నేర్పాలి. లేదా ఈత అయినా నేర్పించాలి. – సాక్షి స్పెషల్ డెస్క్ రెస్క్యూ చాలా కీలకం ఇకపోతే చాలా మందికి ఈత బాగా వచ్చినప్పటికీ రెస్క్యూ చేయడం తెలియదు. ఆపదలో ఉన్న వారిని కాపాడబోయి వీరూ మృత్యువాత పడుతుంటారు. ఎందుకంటే నీట మునిగి పోతున్న వారి దగ్గరకు మనం వెళ్లగానే వారు మనల్ని గట్టిగా పట్టేసుకుని ముంచేస్తారు. అందువల్ల ఎవరినైనా కాపాడాలనుకుంటే నేరుగా వారి ముందుకు వెళ్లకూడదు. ఒకవేళ వారు పట్టుకోజూసినా గట్టిగా తోసేసి విదిలించుకోవాలి. వారి వెనక్కు వెళ్లి సంకల కింద ఒక చేయి వేసి పట్టుకోవాలి. అంటే వారి తలను మన భుజం వద్ద పెట్టుకోవాలి. అప్పుడు వారికి శ్వాస తీసుకోవడానికి వీలవ్వడంతో మనకు సహకరిస్తారు. మరో చేత్తో నెమ్మదిగా రివర్స్ స్ట్రోక్‌లో ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకోవాలి. అనంతరం ప్రథమ చికిత్స చేయాలి. ఈతలో మరింత ప్రొఫెషనల్‌గా తయారవ్వడం కోసం రాష్ట్రీయ లైఫ్ సేవింగ్ సొసైటీ శిక్షణ ఇస్తోంది. మరిన్ని వివరాలకు ‘లైఫ్ సేవింగ్ ఇండియా డాట్ ఆర్గ్’ వెబ్సైట్లో సంప్రదించవచ్చు. కొత్త ప్రాంతాల్లో జాగ్రత్తలు తప్పనిసరిచాలా మందికి అంతో ఇంతో ఈత వచ్చినా కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు ప్రమాదాలబారిన పడుతుంటారు. ప్రధానంగా పరిసరాలు, లోతు గమనించకుండా డైవ్ చేస్తుంటారు. ఇది సరికాదు. తొలుత నీటిలోకి దూకే ముందు ఎంత లోతులో ఉందో అంచనా వేయాలి. సుడిగుండాలున్నాయేమో గమనించాలి. కింద బురద మట్టి, పదునైన రాళ్లు ఏమైనా ఉన్నాయా అని కూడా పరిశీలించాలి. ఇవన్నీ తెలుసుకోకుండా అమాంతం దూకేయడం సరికాదు. స్విమ్మింగ్ పూల్‌లో ఈదినట్లు అన్నిచోట్లా సాధ్యం కాదు. ఇంకో విషయం.. ‘నాకు ఈత బాగా వచ్చు.. మీకు ఏమీ కాదు.. నేనున్నాగా.. మీరు దిగండి..’ అంటూ కొంత మంది పిక్నిక్లకు వెళ్లినప్పుడు స్నేహితులను బలవంతం చేస్తుంటారు. తీరా లోపలకు దిగి.. కొంత దూరం వెళ్లాక బురదలో కాళ్లు ఇరుక్కుపోతే.. లేక కింద గుంత లోతుగా ఉంటే రెస్క్యూ చేయడం చాలా కష్టం. అందుకే అన్నీ గమనించాలి. ఈత గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అందరికీ చాలా అవసరం. ప్రత్యేకించి ఎన్నో అనారోగ్యాలకు చక్కటి మందు. ఒత్తిడిని సహజంగా తగ్గిస్తుంది. భారీ వర్క్ అవుట్స్ చేయలేని, జాగింగ్, వాకింగ్‌కు వెళ్లలేని వారికి అత్యద్భుతమైన ఎక్సర్సైజ్ స్విమ్మింగ్. – కీర్తన సుందరమూర్తి, స్విమ్మింగ్ కోచ్, విజయవాడ -
SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2025, అర్హతలివే!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) SBI ఫౌండేషన్, SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2025ను ప్రకటించింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా వెనుకబడిన నేపథ్యాల నుండి 23,230 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు సాధికారత కల్పిస్తుంది. తద్వారా తరువాతి తరం నాయకులు, దేశ నిర్మాతలను తయారు చేయాలనేది లక్ష్యం. దేశంలోని యువతకు మద్దతు ఇచ్చే చర్యల్లో భాగంగా SBI FY26లో స్కాలర్షిప్ కోసం రూ.90 కోట్లను కేటాయించింది.2022లో స్థాపించబడిన SBI ఆశా స్కాలర్షిప్ కింద యువ భారతీయుల కలలు , ఆకాంక్షలను తీర్చనుంది. ఉన్నత విద్యను వెనుకబడిన వర్గాల విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా, వారి అభివృద్దితోపాటు, దీర్ఘకాలికంగా దేశ నిర్మాణంపై కూడా దృష్టినిఇది ప్రతిబింబిస్తుంది.ఈ స్కాలర్షిప్ 9వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల వరకు విద్యార్థులకు వర్తిస్తుంది, స్కాలర్ ఎంపిక చేయబడిన కోర్సు పూర్తయ్యే వరకు ఏటా రూ.15,000 నుండి రూ.20,00,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. పాఠశాల విద్యార్థులు (9–12 తరగతి)NIRF టాప్ 300 లేదా NAAC A రేటింగ్ పొందిన సంస్థలు / కళాశాలలలో అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులుIIT,IIM స్కాలర్స్వైద్య కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులువిదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులుటాప్ 200 QS ర్యాంకింగ్ విశ్వవిద్యాలయాలలో విదేశాలలో మాస్టర్స్ , ఉన్నత విద్యను అభ్యసిస్తున్న SC/ST విద్యార్థులుస్కాలర్షిప్కు అర్హతలు దరఖాస్తుదారులు భారతీయ పౌరులై ఉండాలి. గత విద్యా సంవత్సరంలో కనీసం 75% మార్కులు లేదా 7.0 CGPA పొంది ఉండాలిపాఠశాల విద్యార్థుల కుటుంబ ఆదాయం రూ.3 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి.కళాశాల విద్యార్థుల కుటుంబ ఆదాయం రూ.6 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలిదీనిపై ఎస్బీఐ, చైర్మన్ చల్లా శ్రీనివాసులు సెట్టి మాట్లాడుతూ, ఈ ఏడాది ప్లాటినం జూబ్లీ వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చొరవ ద్వారా ఉన్నత విద్యనభ్యసించాలనే విద్యార్థులకు మద్దుతోపాటు, 2047 నాటికి విక్షిత్ భారత్ దార్శనికతకు అర్థవంతంగా దోహదపడేలా వారిని శక్తివంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.దరఖాస్తు విండో సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 15, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. విద్యార్థులు అధికారిక పోర్టల్: www.sbiashascholarship.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత వివరాలు , కేటగిరీ వారీగా ప్రయోజనాలు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. -
పోలీసులా? టీడీపీ కార్యకర్తలా? విద్యార్థులను ఈడ్చుకెళ్ళిన పోలీసులు
-
బాబు గారి పీపీపీ.. బినామీలకే ప్రాపర్టీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం పీపీపీకి ఇస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 15 శాతం ఎన్ఆర్ఐ కోటా ఎంబీబీఎస్ సీట్లలో ఒక్కో సీటుకు ఏడాదికి ఏకంగా రూ.57.50 లక్షల చొప్పున ఫీజు వసూలు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇంత భారీగా ఫీజులు నిర్ణయించడం వెనుక రేపటి టెండర్లలో పోటీ పెంచి.. మీకింత–నాకింత పేరుతో భారీగా కమీషన్లు దండుకునే కుట్ర దాగి ఉందని వైద్య రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఈ సీట్లకు రూ.20 లక్షల చొప్పునే ఫీజు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన ఏకంగా ఒక్కో సీటుపై అదనంగా ఏటా రూ.37.50 లక్షలు పెంచడం అంటే దోపిడీ ఏ స్థాయిలో ఉండనుందో ఇట్టే స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే వైద్య కళాశాలల్లో మెరుగైన నిర్వహణ కోసం గత వైఎస్ జగన్ ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ సీట్లకు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కంటే తక్కువ ఫీజులను ఖరారు చేసింది. అప్పట్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రస్తుత కూటమి పార్టీలు తీవ్రంగా తప్పు పట్టాయి. ప్రస్తుత విద్యా శాఖ మంత్రి లోకేశ్ అయితే, తాము అధికారం చేపట్టిన వంద రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. తీరా గద్దెనెక్కాక ఆ విధానం రద్దు చేయకపోగా, ఏకంగా కళాశాలలనే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి.. విద్యార్థుల నుంచి ఇష్టారాజ్యంగా దోపిడీ చేసుకోండని వారికి లైసెన్స్‌లు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 10 కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేట్‌కు కట్టబెట్టడానికి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. రూ.కోట్ల విలువ చేసే ఈ కళాశాలల భూములను ఎకరం రూ.వందకే లీజుకు ఇవ్వడంతోపాటు, కళాశాలలు, బోధనాస్పత్రిపై 66 ఏళ్లు హక్కులు కల్పించడంతోపాటు వైద్య సేవలకు ఫీజులు వసూలు చేసేలా ప్రతిపాదనలు రూపొందించారు. ప్రైవేట్ కళాశాల కంటే ఫీజు ఎక్కువ⇒ ప్రైవేట్ కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటాకు రూ.39.60 లక్షల ఫీజు ఉంది. నీట్లో రాణించినప్పటికీ డిమాండ్‌కు తగ్గ ఎంబీబీఎస్ సీట్లు లేక ఏటా రాష్ట్రంలో వందల సంఖ్యలో విద్యార్థులు నష్టపోతున్నారు. దీంతో పిల్లలను ఎలాగైనా వైద్య విద్య చదివించాలనే లక్ష్యంతో తల్లిదండ్రులు రూ.లక్షల్లో ఖర్చు పెట్టి విదేశాలకు పంపుతున్నారు. ఇలా వెళ్లే విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసించే సమయంలో, అనంతరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు, మ«ద్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా ఎన్ఆర్ఐ కోటా ఫీజును కొత్త కళాశాలల్లో రూ.20 లక్షలుగా గత ప్రభుత్వం ఖరారు చేసింది. ⇒ దీంతో అప్పటి వరకు ప్రైవేట్‌లో సంపన్న కుటుంబాలకే పరిమితం అయిన ఎన్ఆర్ఐ కోటా సీట్లు మధ్య తరగతి పిల్లలకు కూడా అందుబాటులోకి వచ్చినట్లైంది. అయితే ఇప్పుడు ఆ ఫీజును ఏకంగా మరో రూ.37.50 లక్షల మేర పెంచి మొత్తంగా రూ.57.50 లక్షలు చేసి.. పెట్టుబడిదారులకు భారీ లాభం చేకూర్చాలని ప్రభుత్వం చూస్తోంది. ⇒ సర్కారు నిర్ణయం కారణంగా ప్రైవేట్ కళాశాలలతో పోల్చినా పీపీపీ కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా ఫీజు రూ.17.9 లక్షలు అధికంగా ఉండటం గమనార్హం. ఇలా ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేట్ వైద్య కళాశాలల కంటే అధికంగా ఫీజులు వసూలు చేసుకునే హక్కులు ప్రైవేట్ వ్యక్తులకు కల్పిస్తూ పైకి మాత్రం పీపీపీతో విద్యార్థులకు ఎటువంటి నష్టం వాటిల్లదంటూ చంద్రబాబు మోసానికి పాల్పడుతున్నారు. దండుకుందాం రండి.. మాకింత.. మీకింత!⇒ సంపద సృష్టి హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రజల సంపదను కొల్లగొట్టే పనిలో పడ్డారు. ప్రభుత్వాస్తులను కారుచౌకగా అస్మదీయులకు కట్టబెట్టడమే కాకుండా, తద్వారా వ్యాపారం చేసి వారిని మరింత సంపన్నులుగా తీర్చిదిద్దే కుట్రకు తెరలేపారు. ఇందుకు పీపీపీ విధానాన్ని ఆయుధంగా మలుచుకున్నారు. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా పీపీపీ పేరిట దోపిడీ కార్యక్రమాలకు తెరతీశారు. ఇందుకు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణే కళ్లెదుట కనిపిస్తున్న సాక్ష్యం. ⇒ చంద్రబాబు ఒత్తిడి మేరకు రూపొందించిన ప్రతిపాదనల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్ఆర్ఐ కోటా ఎంబీబీఎస్ సీటును ఏటా రూ.57.50 లక్షలకు పెంచడమే కాకుండా.. ఇక్కడ పెట్టుబడి పెడితే విద్యార్థుల నుంచి ఎంబీబీఎస్‌లో ఇతర కోటా సీట్లు, పీజీ, నర్సింగ్, ఇతర వైద్య విద్యా కోర్సుల ఫీజులతోపాటు, ఆస్పత్రుల్లో వైద్య సేవలు, డయాగ్నోస్టిక్స్, మందులకు చార్జీల రూపంలో మరింత ఆదాయం వస్తుందని వైద్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేయడం విస్తుగొలుపుతోంది.విద్యార్థులపై భారం లేదంటూనే మోసం⇒ మెడికల్ కళాశాలలు పీపీపీ విధానంలో నిర్వహణ వల్ల విద్యార్థులపై ఎటువంటి భారం ఉండదని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇవన్నీ బూటకపు ప్రకటనలేనని అధికారుల ప్రతిపాదనల ద్వారా తేటతెల్లం అవుతోంది. ⇒ సాధారణంగా ఏ ప్రభుత్వమైనా పీపీపీ ప్రాజెక్టుల్లో అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు ఎక్కువ మేలు తలపెట్టేలా చూస్తుంది. కానీ, స్వతహాగా నయా పెత్తందారు అయిన చంద్రబాబు మాత్రం అస్మదీయులకు భారీ లబ్ధి చేకూరేలా రెడ్ కార్పెట్ వేస్తున్నారు. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా కట్టబెట్టడమే కాక, వైద్య విద్య వ్యాపారం రూపంలో అస్మదీయులు భారీగా ఆర్జించడానికి మార్గం సుగమం చేస్తున్నారు.⇒ పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదని సన్నాయి నొక్కులు నొక్కుతూనే కళాశాలల్లో ఎంబీబీఎస్ ఫీజు ఏడాదికి ఏకంగా రూ.అరకోటికి పైగా వసూలు చేసుకోవడానికి పేటెంట్ ఇచ్చేస్తున్నారు. -
బంద్‌పై ప్రతిష్టంభన!
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చల్లో ఎలాంటి స్పష్టత రాలేదు. ప్రైవేటు విద్యాసంస్థలన్నింటినీ మూకుమ్మడిగా మూసివేయాలని నిర్ణయించుకొని యాజమాన్యాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో సర్కారు చర్చలకు ఉపక్రమించింది. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో ప్రజా భవన్లో సమావేశమయ్యారు. ఇరుపక్షాల మధ్య నాలుగు గంటలపాటు జరిగిన చర్చల్లో ఎలాంటి స్పష్టత రాలేదని తెలిసింది. ప్రభుత్వం నుంచి ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రాకపోవడంతో కళాశాలలు నడపటం కష్టంగా మారిందని, జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని యాజమాన్యాలు చెప్పాయి. తమకు రావాల్సిన బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేయాలని కోరాయి. అయితే ప్రభుత్వం నుంచి ఈ విషయంలో స్పష్టమైన హామీ రాలేదని యాజమాన్యాలు చెప్పాయి. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఫీజు బకాయిలు ఏకకాలంలో చెల్లింపు సాధ్యం కాదని, విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. కళాశాలలను మూసివేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరింది. విద్యాసంస్థల డిమాండ్లను ఇప్పటికిప్పుడు నెరవేర్చడం సాధ్యం కాదని, కళాశాలలు మూసివేయడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని, నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పింది. ఫీజుల చెల్లింపు విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన భరోసా రాకపోవడంతో కళాశాలల మూసివేత నిర్ణయంపై వెనక్కు తగ్గే విషయంలో యాజమాన్యాలు కూడా ప్రభుత్వానికి స్పష్టత ఇవ్వలేకపోయినట్టు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఇరుపక్షాల మధ్య మళ్లీ చర్చలు జరగనున్నాయి. సమస్యలను అర్థం చేసుకున్నాం మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నత విద్యామండలి చైర్మన్, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ప్రైవేట్ కళాశాలల యజమాన్యాలు ఆదివారం అయినప్పటికీ అందరం కలిసి సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు చర్చించాం. చర్చలు సానుకూలంగా సాగాయి. కళాశాలల సమస్యలను అర్థం చేసుకున్నాం. సోమవారం ప్రభుత్వపరంగా నిర్ణయం తీసుకుంటాం. అప్పటివరకు సమ్మెను విరమించమని కళాశాలల యజమానులను కోరాం. వారు సానుకూలంగా స్పందించారు. –సమావేశం అనంతరం భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం ఉదయం ఏం జరిగిందంటే.. అంతకుముందు ఉదయం ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు సమావేశమై కార్యాచణపై చర్చించాయి. సోమవారం నుంచి బంద్‌కు పాటించాలని నిర్ణయించాయి. ఫీజులు చెల్లించే వరకూ ఎట్టి పరిస్థితుల్లో కాలేజీలు తెరవొద్దని నిర్ణయించాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (ఫతి) ప్రతినిధులు మీడియాకు తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ఏడాది నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నాయి. గత ఏడాది పరీక్షలను బహిష్కరించాలని నిర్ణయించాయి కూడా. దీంతో ప్రభుత్వం స్పందించి వారితో చర్చలు జరిపింది. దశల వారీగా బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. దీంతో అప్పుడు ఆందోళన నిర్ణయాన్ని యాజమాన్యాలు విరమించుకున్నాయి. తాజాగా శుక్రవారం యాజమాన్య ప్రతినిధులు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డిని కలిసి నోటీసు ఇచ్చారు. సెప్టెంబర్ 30లోపు బకాయిలను విడుదల చేయకపోతే, ఆందోళనను ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం సర్కారు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో విద్యాసంస్థలను మూకుమ్మడిగా మూసివేయాలని నిర్ణయించారు. బంద్ జరిగితే రాష్ట్రంలోని 1,500 పైచిలుకు ప్రైవేట్ ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఫార్మసీ, నర్సింగ్ కాలేజీలకు తాళాలు పడనున్నాయి. దాదాపు 10 లక్షల విద్యార్థులకు బోధన దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఓపిక నశించిందన్న ప్రతినిధులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తుందని ప్రభుత్వంపై ఇన్నాళ్లు విశ్వాసం పెట్టుకున్నామని ‘ఫతి’ ప్రతినిధులు ఉదయం మీడియాకు చెప్పారు. ఇక ఓపిక నశించిందని, అందుకే ఆందోళన బాట పట్టామని తెలిపారు. టోకెన్లు జారీ చేసినప్పటికీ డబ్బులు ఇవ్వలేదన్నారు. దీంతో అన్ని కాలేజీల యాజమాన్యాలు ఉమ్మడి పోరుబాటకు సిద్ధమై ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ను ఏర్పాటు చేసుకున్నాయి. రూ.లక్ష కోట్ల డిపాజిట్లతో ప్రత్యేకంగా ట్రస్ట్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని ప్రైవేటు యాజామాన్యాలు సర్కారుకు ప్రతిపాదించాయి. ఈ లక్ష కోట్లలో సర్కారు వాటా పరిమితమేనని, సీఎస్సార్, కార్పస్ ఫండ్ వంటి ఇతర మార్గాల ద్వారానే ఈ నిధులను సేకరించవచ్చని సూచించాయి. లక్ష కోట్ల డిపాజిట్లపై వచ్చే ఏడు శాతం వడ్డీ (సుమారు రూ.3వేలకోట్లు)తో ఫీజు రీయింబర్స్ చేయొచ్చని ప్రతిపాతిదించాయి. దీనిని కూడా సర్కారు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో అన్ని రకాల వృత్తి విద్యా కాలేజీల యాజమాన్యాలు గురువారం రాత్రి సమావేశమయ్యాయి. సెపె్టంబర్ 15 నుంచి కాలేజీల నిరవధిక బంద్ పాటించాలని నిర్ణయించాయి. ‘ఫతి’ బాటలోనే తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్య సంఘం (టీపీడీపీఎంఏ) కూడా కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది. తాము ఈ నెల 16 నుంచి కాలేజీలను మూసివేస్తామని అసోసియేషన్ చెప్పింది. -
Rajasthan: వికటించిన మధ్యాహ్న భోజనం.. 90 మంది విద్యార్థులకు అస్వస్థత
దౌసా: రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో అనుకోని ఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్న భోజనం చేసిన 90 మంది విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులతో ఆస్పత్రి పాలయ్యారు. చుడియావాస్ గ్రామంలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.పాఠశాలలోని 156 మంది విద్యార్థులు రాష్ట్ర పోషకాహార పథకం కింద అందించిన చపాతీ, కూర తిన్నారు. తరువాత వారిలో 90 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వైద్య బృందం పాఠశాలకు తరలివచ్చింది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో వారిని నంగల్ రాజ్‌వతన్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. వారిలోని 49 మంది విద్యార్థులను దౌసా జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. వారికి వైద్యసేవలు అందించేందుకు అదనంగా వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని నియమించారు. సాయంత్రం నాటికి పిల్లలందరూ కోలుకున్నారని వైద్యశాఖ అధికారులు ధృవీకరించారు.అంతకుముందు ఆస్పత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ దేవేంద్ర కుమార్.. విద్యార్థులకు సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ పాఠశాలలో వడ్డించిన ఆహార నమూనాలను సేకరించారు. బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర మంత్రి కిరోరి లాల్ మీనా, బీజేపీ నేత జగ్మోహన్ మీనా జిల్లా ఆస్పత్రిని సందర్శించి, విద్యార్థులను పరామర్శించారు. ఈ ఘటన మరోసారి ప్రభుత్వ మధ్యాహ్న భోజనం నాణ్యతపై అనుమానాలను లేవనెత్తింది. -
స్లీప్..స్క్రీన్..స్టడీ..!
ఈతరం విద్యార్థులు ప్రతిరోజూ పరీక్షలు, అసైన్మెంట్లు, పరీక్షలతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి, బెస్ట్ రిజల్ట్స్‌కు ఉపయోగపడే అంశాలు నిద్ర, స్క్రీన్ టైమ్. స్టడీ హేబిట్స్. ఏమాత్రం వ్యాయామం చేయకుండా అర్ధరాత్రి వరకూ స్క్రీన్ చూసుకుంటూ గడిపేస్తే ఫోకస్ తగ్గిపోతుంది, ఒత్తిడి పెరుగుతుంది, అకడమిక్ పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది. స్లీప్, స్క్రీన్, స్టడీ మధ్య బ్యాలెన్స్ ఉన్నప్పుడే మీరు కోరుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. అందుకే ఈ రోజు వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుసుకుందాం. 1. నిద్రతోనే మేధస్సు పునరుజ్జీవంనిద్ర మన జీవితంలో విడదీయలేని భాగం. ఇది మన ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన అంశం. మానసిక శక్తి, రోజువారీ పనులు నిర్వహించడంలోనూ కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందుకే విద్యార్థుల విజయంలో హార్డ్ వర్క్‌తో పాటు వారి నిద్ర కూడా ముఖ్యమైన అంశం.మనం పగలు నేర్చుకున్న అంశాలు రాత్రి నిద్రలో మెదడులో నిక్షిప్తమవుతాయి. నిద్ర తగ్గితే మెమరీ కెపాసిటీ కూడా 40 శాతం తగ్గుతుందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనాల్లో వెల్లడైంది.నిద్ర అనేది మనం నిర్ణయాలు తీసుకోవడానికి, భావోద్వేగాలను నియంత్రించడానికి అవసరమయ్యే మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌ను ప్రభావితం చేస్తుంది. నిద్ర లేని పిల్లలు ఎక్కువగా కోపం, తీరని భావోద్వేగాలు అనుభవిస్తారు. ఇది వారి ఫోకస్‌ను, నమ్మకాన్ని కూడా దెబ్బతీయవచ్చు.2. నిద్ర, మార్కులు తగ్గించే స్క్రీన్ టైమ్ ఈ డిజిటల్ యుగంలో ప్రతి చోటాస్క్రీన్లు ఉన్నాయి. పిల్లలు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు లేదా వీడియో గేమ్స్ పైనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇది బిడ్డ పుట్టినప్పటి నుంచీ వారి అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. స్క్రీన్లు ఉత్పత్తి చేసే బ్లూ లైట్ మెలటోనిన్ హార్మోన్‌ను కదిలించి నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. నిద్రకు వెళ్లడానికి గంట ముందు వరకూ స్క్రీన్ చూస్తుంటే అది నిద్రపట్టడాన్ని 90 నిమిషాలు ఆలస్యం చేస్తుంది. రీల్స్, వీడియోలు చూడటం వల్ల సంతోషాన్నిచ్చే డోపమైన్ హార్మోన్ విడుదలవుతుంది. దీంతో మళ్లీ మళ్లీ చూడాలనే కోరిక పెరుగుతుంది. స్క్రీన్కు అడిక్ట్ అవుతారు. దీంతో చదువుకునే సమయం, కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోతుంది. పిల్లల స్క్రీన్ టైమ్ రోజుకు మూడు గంటలుంటే వారి అకడమిక్ స్కోర్లు తగ్గినట్లు అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ అధ్యయనంలో వెల్లడైంది. 3. ఫోకస్, రిటెన్షన్ మెరుగుపరచడంనిద్రను, స్క్రీన్ టైమ్‌ను సరిగా సెట్ చేస్తేనే విద్యార్థులు సరిగా చదవగలుగుతారని, మార్కులు పెరుగుతాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. 25 నిమిషాల చదువు తర్వాత ఐదునిమిషాల విరామం తీసుకోవడం, మానసిక అలసట నుండి రీచార్జ్ కావడం అకడమిక్ సక్సెస్‌లో చాలా కీలకమైన విషయం.ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కోసం మొక్కుబడిగా చదవడం కంటే ఇష్టంగా చదవడం, చదివిన దాన్ని ఇతరులతో చర్చించడం వల్ల సమాచారం నిలుపుకోగల శక్తి 50 శాతం పెరుగుతుంది. పోమోడోరో టెక్నిక్ ఉపయోగించండి. 25 నిమిషాలు ఫోకస్‌తో చదివి, 5 నిమిషాలు విరామం తీసుకోండి. ఇది మెదడుకు విశ్రాంతి ఇస్తుంది.ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోండి. కనీసం7–8 గంటలు నిద్రపోవాలి.నిద్రకు ఒక గంట ముందు మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ వాడకండి. బ్లూ లైట్ నిద్ర హార్మోన్ మెలటోనిన్‌ను తగ్గిస్తుంది.మల్టీ టాస్కింగ్ తగ్గించండి. ఒకేసారి ఒక్క పనిపై ఫోకస్ చేయండి. చదువుతో పాటు మొబైల్ చూడడం ఏకాగ్రతను తగ్గిస్తుంది. యాక్టివ్ లెర్నింగ్ చేయండి. సబ్జెక్ట్‌ను మళ్లీ మళ్లీ చదవకుండా, ప్రశ్నలు వేసుకుని సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి.రోజూ వ్యాయామం చేయండి. 20–30 నిమిషాల వాకింగ్, యోగా లేదా క్రీడలు ఆడడం ఏకాగ్రతను పెంచుతుంది.చదువుల మధ్యలో ఐదునిమిషాలు మైండ్‌ఫుల్ బ్రేక్‌లు తీసుకోండి. డీప్ బ్రీతింగ్ లేదా మెడిటేషన్ చేయండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.ఒకేసారి ఎక్కువగా చదవకండి. కొన్ని రోజులకు ఒకసారి రివిజన్ చేస్తే మెదడులో నిలుస్తుంది.జంక్ ఫుడ్ తగ్గించి, పళ్లు, గింజలు, కూరగాయల్లాంటి ఆరోగ్యకరమైన ఆహారం ఎక్కువగా తినండి. ఇవి మెదడుకు శక్తినిస్తాయి.రోజులో కనీసం రెండు గంటలు మొబైల్ లేకుండా గడపండి. ఆ టైమ్‌లో పుస్తకం చదవండి లేదా కుటుంబంతో మాట్లాడండి. (చదవండి: నూడుల్స్ తినడమే ఒక గేమ్!) -
మార్కులు కావాలా.. చెప్పినట్లు చేయాల్సిందే!
కొమరోలు: ప్రాక్టికల్స్, పరీక్షల్లో మార్కుల నెపంతో అధ్యాపకులు విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించడం, బాలురతో మద్యం సీసాలు తెప్పించుకోవడం, నగదు వసూలు చేస్తున్నారని విద్యార్థులు కలెక్టర్, సబ్ కలెక్టర్, విలేకరులకు లేఖల రూపంలో మొరపెట్టుకున్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కొంతమంది అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న బైపీసీ విద్యార్థినులకు జరుగుతున్న ప్రాక్టికల్స్‌లో మార్కులు వేయాలంటే తాము చెప్పినట్లు చేయాలని బెదిరింపులకు గురిచేస్తున్నట్టు లేఖలో ఆరోపించారు. బాలురు అయితే మద్యం బాటిళ్లు, నగదు ఇవ్వాల్సిందేనని తేల్చిచెబుతున్నట్లు వాపోయారు. పబ్లిక్ పరీక్షల సమయంలోనూ అధ్యాపకులకు చేయి తడపాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఈ పరిణామాలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
‘ఫీజు’కు ఎంత కోత పెట్టొచ్చు?
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను క్రమబద్ధికరించే ప్రక్రియ మొదలైంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వీసీలతో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా ముఖ ఆధారిత హాజరు విధానం అమలుపై దృష్టిపెట్టారు. ప్రభు త్వ, ప్రైవేటు కాలేజీల్లో సీట్లు పొందుతున్న విద్యా ర్థులు ఎంత మంది? వారిలో నిత్యం కాలేజీలకు హాజరయ్యే వారు ఎందరు? 75 శాతం లోబడి విద్యార్థుల హాజరున్న కాలేజీలు ఎన్ని? ఎందరు విద్యార్థులు ఈ విభాగం కిందకు వస్తారు? అనే అంశాలపై చర్చించినట్లు తెలిసింది. వర్సిటీల స్థాయి లో ఇప్పటికే ముఖ ఆధారిత హాజరు విధానం అమ లు చేస్తున్నారని.. వర్సిటీల అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల్లో మాత్రం ఇది అమలు కావట్లే దని వీసీలు తెలిపారు. దీన్ని కచి్చతంగా అమలు చేసేలా చూడాలని చైర్మన్ సూచించినట్లు తెలిసింది. కోతకు లెక్కలేంటి? కాలేజీకి సరిగా రాని విద్యార్థులకు, రెగ్యులర్‌గా కాలేజీకి వచ్చి చదివే వారికి ఫీజు రీయింబర్స్మెంట్ ఒకే విధంగా ఉండటం ఏమిటనే ప్రశ్న ప్రభుత్వం నుంచి వచ్చింది. ఇలాంటి విద్యార్థులు ఎందరు ఉంటారో చెప్పాలని విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఇటీవల అడిగింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఏ మేరకు కుదించే వీలుందో పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోందని.. అందుకు అనుగుణంగా సిద్ధం కావాలని వీసీలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏ మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ భారాన్ని తగ్గించే అవకాశం ఉంది? కాలేజీకి హాజరవ్వని విద్యార్థులు ఎందరు? ఈ దిశగా సమగ్ర సమాచారం సేకరించాలని వీసీలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి కోరినట్లు తెలిసింది. ఆ వివరాల ఆధారంగానే ఫీజు రీయింబర్స్మెంట్ లెక్కలను తయారు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. డిజీ లాకర్ విధానం పూర్తిగా డిజిటల్ విధానంలోకి యూనివర్సిటీలు వెళ్ళాలని బాలకిష్టారెడ్డి వీసీలకు సూచించారు. సర్టి్టఫికెట్లను ఆన్లైన్ విధానంలోనూ అందుబాటులోకి తేవాలని.. దీనివల్ల తప్పుడు ధ్రువీకరణ పత్రాలను నిరోధించవచ్చని పేర్కొన్నారు. డిజీ లాకర్ విధానంతోపాటు ప్రతి విద్యార్థికీ యూనిక్ ఐడీ నంబర్ ఇవ్వాలని ప్రతిపాదించారు. ప్రతి వర్సిటీ నాణ్యతా ప్రమాణాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని.. జాతీయ, అంతర్జాతీయ ర్యాంకులు పొందేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ దిశగా బోధన ప్రణాళికలో సమూల మార్పులు తేవాలని.. తద్వారా సమీకృత బోధన విధానం అమలుకు కృషి చేయొచ్చన్నారు. ఈ ఏడాది నుంచి పీజీ కోర్సుల్లో క్రీడాకారులకు 0.5 శాతం రిజర్వేషన్ కోటాను అమలు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్లు పురుషోత్తం, మహ్మద్, వర్సిటీల వీసీలు పాల్గొన్నారు. -
ఘోర పడవ ప్రమాదం.. 86మంది దుర్మరణం.. వారిలో ఎక్కువ మంది విద్యార్ధులే
బాసాంకుసు, కాంగో: ఉత్తర పశ్చిమ కాంగోలోని ఎక్వాటర్ ప్రావిన్స్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 86 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువ మంది విద్యార్థులేనని గుర్తించారు. ఈ విషాదకర ఘటన బుధవారం (సెప్టెంబర్ 10) బాసాంకుసు అనే ప్రాంతంలో చోటుచేసుకుంది.ప్రభుత్వ మీడియా ప్రకారం..ఈ విషాదానికి ప్రధాన కారణం ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటం,రాత్రి పడవ ప్రయాణానికి ప్రతీకూల వాతావరణం వల్లేనని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బోటులో ఎక్కువ మంది విద్యార్థులు, స్థానిక ప్రయాణికులు అని సమాచారం.బాసాంకుసు ప్రాంతం కాంగోలోని దట్టమైన అడవులతో కూడిన ప్రాంతం. ఇక్కడ రవాణా ప్రధానంగా నదుల ద్వారా జరుగుతుంది. అయితే, సరైన భద్రతా ప్రమాణాలు లేకపోవడం, అధిక లోడింగ్, అనుభవ రాహిత్యం వల్ల ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. సహాయక బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం కొనసాగుతున్నట్లు ప్రభుత్వ మీడియా కథనాలు తెలిపాయి. -
అన్నంలో పురుగులు.. విద్యార్థినుల ఆందోళన
నార్నూర్: అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం అల్పాహారంగా అందించిన పులిహోరలో పురుగులు రావడంతో విద్యార్థినులంతా తినకుండా ప్లేట్లను పక్కన పెట్టారు. పాఠశాల ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు. మధ్యాహ్నం 3:30 గంటల వరకు ఆందోళన కొనసాగించారు. విషయం తెలుసుకున్న ఎంఈవో పవార్ అనిత అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారు వినిపించుకోకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఐటీడీఏ పీవో, డీఈవో ఖుష్బుగుప్తా ఫోన్లో వారితో మాట్లాడారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని, నాణ్యమైన భోజనం అందేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. సమీపంలోని వేరే వసతి గృహం నుంచి సరుకులు తెచ్చి వెంటనే వండి విద్యార్థినులకు పెట్టాలని ఆమె ఎంఈవోను ఆదేశించారు. అయితే రెండోసారి ఉప్మా అందించగా.. అందులో కూడా పురుగులు రావడంతో విద్యార్థినులు మరోసారి ఆందోళనకు దిగారు. మెనూ ప్రకారం భోజనం పెట్డడం లేదని, రోజూ అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థినులు తెలిపారు. సమస్యను ఎస్వో హిమబిందు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పాఠశాలను సందర్శించిన సబ్‌కలెక్టర్ కలెక్టర్ రాజర్షిషా ఆదేశాల మేరకు ఉట్నూర్ సబ్‌కలెక్టర్ యువరాజ్ మార్మట్ కేజీబీవీని సందర్శించారు. వంట గది, సరుకులను పరిశీలించారు. నాసిరకం కూరగాయలతో పాటు పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంపై ఎస్వో హిమబిందుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో విద్యార్తినులు శాంతించారు. విద్యార్థినుల ఆందోళన విషయం తెలుసుకున్న ఆదివాసీ గిరిజన విద్యార్థి సంఘం, జైభారత్, రాజ్‌గోండ్ సేవా సమితి, తుడుందెబ్బ, బీజేపీ నాయకులు పాఠశాలను సందర్శించారు. విద్యార్థినుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న సమయంలో జీసీడీవో ఉదయశ్రీ జోక్యం చేసుకుని వారిని లోపలికి ఎందుకు వచ్చారని అనడంతో వారంతా ఆందోళనకు దిగారు. సబ్ కలెక్టర్ వారితో మాట్లాడి నచ్చజెప్పారు. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
కాలేజీకి వస్తేనే ఫీజు?
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తివేసే ప్రసక్తే లేదని చెబుతున్న ప్రభుత్వం.. చడీచప్పుడు లేకుండా ఆ పథకంలో కోతలు వేసే దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై గత నెల 21వ తేదీన ‘సాక్షి’కథనం ప్రచురించగా, ప్రభుత్వం స్పందించి ‘అబ్బే అలాంటిదేమీ లేదు.. నిరాధార వార్త’అంటూ కొట్టిపారేసింది. కానీ వచ్చే శుక్రవారం అన్ని విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్లతో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఫేషియల్ రికగ్నిషన్ గుర్తింపు హాజరును ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఎలా లింక్ చేయాలి, ఎలా తప్పనిసరి చేయాలి? అనే అంశాన్ని భేటీ ఎజెండాలో ప్రధానంగా చేర్చారు. కొత్తగా కాలేజీలకు డిజీ లాకర్‌ను తీసుకొస్తున్నారు. ఇందులో ఫ్యాకల్టీ, విద్యార్థుల హాజరు శాతం నమోదు అవుతుంది. విద్యార్థుల హాజరు కనీసం 75 శాతం లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకూడదని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇటీవల అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి సూచనలు చేసినట్టు తెలిసింది. దీనికి అనుగుణంగానే వీసీల సమావేశంలో ఫీజు రీయింబర్స్మెంట్ కోతపై వ్యూహ రచన చేయబోతున్నట్టు సమాచారం. ముందు హాజరు.. తర్వాత మార్కులు ప్రస్తుతానికి ముఖ గుర్తింపు హాజరు విధానం ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఫిల్టర్ చేయాలని భావిస్తున్నారు. ఈ దశలో విద్యార్థుల నుంచి అభ్యంతరాలు రాకపోతే తర్వాత దశలకు వెళ్లే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. ఇంజనీరింగ్, డిగ్రీ మొదలుకొని అన్ని సాంకేతిక, సాధారణ కోర్సుల్లో ఒక సంవత్సరంలో 50 శాతం సబ్జెక్టులు పాసవ్వడంతో పాటు, 75 శాతం హాజరు ఉండాలన్న కొత్త నిబంధన తీసుకురావాలన్నది ముఖ్యమంత్రి సూచనగా చెబుతున్నారు. సాంకేతిక విద్యలో కోర్సులోని ప్రధాన సబ్జెక్టులో విద్యార్థి కనీసం 60 శాతం మార్కులు తెచ్చుకుంటేనే రీయింబర్స్మెంట్ అమలు చేయాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్టు తెలిసింది. ఉదాహరణకు సీఎస్ఈ ఎమర్జింగ్ కోర్సు తీసుకున్న విద్యార్థి డేటాసైన్స్ సబ్జెక్టులో 60 శాతం మార్కులు తెచ్చుకుని తీరాలి. అదే విధంగా బీకాంలో కామర్స్ సబ్జెక్టులో మంచి మార్కులు రావాల్సి ఉంటుంది. అధికారుల అంతర్మథనం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా అనేక మంది పేదలు ఉన్నత చదువులకు వెళ్లారు. తర్వాత ప్రభుత్వాలు ఈ పథకంలో మార్పులు తెచ్చేందుకు సాహసించలేదు. ఈ నేపథ్యంలో పథకంలో కోతకు అడుగులు వేయాల్సి రావడంపై అధికారులు మథనపడుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రస్తుతం దాదాపు రూ.8 వేల కోట్ల వరకు పేరుకు పోయాయి. వీటిని రాబట్టుకునేందుకు కాలేజీలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. భారీగానే కోతరాష్ట్రంలో ఏటా 12.50 లక్షల మంది ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్నారు. ఇందులో 5 లక్షల మంది కొత్తవాళ్లు ఉంటారు. అన్ని కోర్సులకు కలిపి ఏటా రూ.2,350 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు ఎంత ర్యాంకు వచ్చినా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది. బీసీలకు మాత్రం 10 వేల లోపు ర్యాంకు వస్తేనే ఇంజనీరింగ్‌లో మొత్తం ఫీజు చెల్లిస్తారు. ఆపై ర్యాంకులకు రూ.35 వేలు మాత్రమే ఇస్తారు. మొదటి ఏడాదిలో 50 శాతం సబ్జెక్టులు ఉత్తీర్ణులు అవ్వని విద్యార్థులు దాదాపు 50 శాతం మంది ఉంటున్నారు. ఉన్నత విద్యలో కొత్తగా ప్రవేశించడం, భయం వల్ల వారికి తక్కువ మార్కులు వస్తున్నాయి. కాలేజీల్లో ఫ్యాకల్టీ లేకపోవడం, కాలేజీకి వచ్చినా తరగతులు జరగకపోవడంతో విద్యార్థులు ఆన్లైన్ బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో హాజరును కొలమానంగా తీసుకుంటే చాలామంది విద్యార్థులకు అసౌకర్యం తప్పదని అధికారులే చెబుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కోత వల్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అంటున్నారు. -
ఆగ్రహ జ్వాలలు
కాఠ్మండు/న్యూఢిల్లీ: సోషల్ మీడియా యాప్‌లపై నిషేధంతోపాటు విద్యార్థులు, యువత సోమవారం మొదలెట్టిన ఆందోళనలు మెరుపువేగంతో నేపాల్‌ను చుట్టేసి దేశాన్ని సంక్షోభ కుంపట్లోకి నెట్టేశాయి. సామాజిక మాధ్యమాల సేవలను పునరుద్ధరిస్తున్నామని కేపీ శర్మ ఓలీ సారథ్యంలోని ప్రభుత్వం కొద్ది గంటల్లోనే స్పష్టంచేసినా అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. రాజధాని కాఠ్మండు మొదలు దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు, యువత తమ నిరసనజ్వాలలను మరింతగా ఎగదోస్తూ ఏకంగా పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టారు. మంగళవారం ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు, సైన్యం రంగంలోకి దిగాయి. కాళీమతిలో పోలీస్సర్కిల్కు నిప్పుపెట్టి అధికారులపై దాడి చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు.దీంతో ఇద్దరు చనిపోయారు. దీంతో కాల్పులు, పరస్పర ఘర్షణ ఘటనల్లో మరణాల సంఖ్య మంగళవారానికి 22కు పెరిగింది. 300 మందికిపైగా గాయపడ్డారు. కట్టలు తెంచుకున్న యువాగ్రహాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మంగళవారం తన పదవికి రాజీనామాచేశారు. భద్రంగా ఇంటి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్ను బతిమాలుకున్నట్లు వార్తలొచ్చాయి.ఆందోళనకారుల నిరసన కార్యక్రమం అదుపుతప్పి మాజీ ప్రధానమంత్రి, తాజా మంత్రులపై భౌతికదాడులదాకా వెళ్లింది. ప్రధాని ఓలీకి చెందిన భక్తపూర్‌లోని బాల్కోట్ నివాసాన్ని ఆందోళనకారులు తగులబెట్టారు. మాజీ ప్రధానమంత్రి ఝలనాథ్ ఖనాల్ ఇంటికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ మంటల్లో చిక్కుకుని ఆయన భార్య రాజ్యలక్ష్మీ చిత్రకార్ తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆమెను సమీప కీర్తిపూర్ బర్న్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఎటు చూసినా ఆస్తుల విధ్వంసం, వినాశనంతో నేపాల్ నిలువెల్లా రక్తమోడింది. దుకాణాల లూటీలు, పౌరుల భయాందోళనల నడుమ ప్రధాని రాజీనామాతో ఎట్టకేలకు సైన్యం పూర్తస్థాయిలో రంగంలోకి దిగి శాంతభద్రతల పరిరక్షణ బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకుంది. పరిస్థితులను తమకు అనుకూలంగా మల్చుకుని ప్రజల ఆస్తులను ధ్వంసంచేస్తూ లూటీలకు తెగించిన వాళ్ల అంతుచూస్తామని ఆర్మీ చీఫ్ హెచ్చరించారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి, రాజకీయ వారసత్వం, సంపన్న, ఉన్నతస్థాయి వర్గాల ఆధిప్యంపై ఇప్పటికే విసిగిపోయిన యువత తాజాగా సామాజికమాధ్యమాలపై హఠాత్తుక నిషేధం విధించడంతో వాళ్లలో ఆగ్రహం పెల్లుబికి మహోద్యమంగా మారడంతో దేశ భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. పెల్లుబికిన ఆగ్రహం పరిస్థితిని మరింతగా కట్టుతప్పొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కర్ఫ్యూను విధించింది. అయినాసరే వేలాదిమంది విద్యార్థులు, యువత ‘జెన్ జెడ్’కూటమిగా ఏర్పడి రాజధాని కాఠ్మండు మొదలు పట్టణాలదాకా విధ్వంసానికి తెగించారు. మాజీ ప్రధానమంత్రులు మొదలు తాజా కేబినెట్ మంత్రులు, కీలక నేతల దాకా ముఖ్యమైన వ్యక్తుల ఇళ్లకు నిప్పంటించారు. ప్రధాన రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయాలనూ ధ్వంసంచేశారు. కనిపించిన ప్రతి ఒక్క రాజకీయ నేతను చితకబాదారు. దేశాధ్యక్షుడు రాంచంద్ర పౌదెల్, మాజీ ప్రధాని పుష్పకమల్ దహాల్(ప్రచండ), ప్రస్తుత కమ్యూనికేషన్స్ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్, మాజీ హోం మంత్రి రమేశ్ లఖ్హార్, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బాల ఇళ్లను నాశనంచేశారు. ఆందోళనలు కాఠ్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్నీ తాకాయి. దీంతో ముందుజాగ్రత్తగా అంతర్జాతీయ విమానసర్వీసులను రద్దుచేసి ఎయిర్‌పోర్ట్‌ను అధికారులు తాత్కాలికంగా మూసేశారు. ఎటుచూసినా విధ్వంసమే ఆందోళనలను ఏ దశలోనూ అడ్డుకోలేక పోలీసులు చేతులెత్తేయడంతో విద్యార్థులు, నిరసనకారుల విధ్వంసకాండ ఆకాశమే హద్దుగా సాగింది. పార్లమెంట్, దేశాధ్యక్షుని కార్యాలయం, ప్రధాని నివాసం, సుప్రీంకోర్టు భవనం, ప్రధాన రాజకీయ పార్టీల హెడ్‌ఆఫీస్‌లు, సీనియర్ నేతల ఇళ్లు, మీడియా కార్యాలయాలు ఇలా ప్రతి దేశంలోని కీలక భవంతులన్నీ ఆందోళనకారుల ఆగ్రహజ్వాలల బారినపడ్డాయి. డల్లూ ఏరియాలోని మాజీ ప్రదాని ఝలానాథ్ నివాసానికి నిప్పుపెట్టారు. కపన్ ప్రాంతంలోని నేపాలీ కాంగ్రెస్ నేత ఇంటిని తగులబెట్టారు.సింఘదర్బార్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం భవనానికీ నిప్పుపెట్టారు. మహరాజ్‌గంజ్‌లోని అధ్యక్షకార్యాలయం, బలూవతార్‌లో ప్రధాని అధికారి నివాసం సైతం నిప్పురవ్వల వర్షంలో కాలిపోయాయి. టిన్కునేలో కాంతిపూర్ టెలివిజన్ ఆఫీస్‌ను ధ్వంసంచేశారు. బుద్ధనీలకంఠ ప్రాంతంలోని మాజీ ప్రధాని షేర్‌బహదూర్ దేవ్బా ఇంట్లో చొరబడి దేవ్బా, భార్య అర్జూ రాణాలను రక్తంకారేలా కొట్టారు. దీంతో ప్రాణభయంతో ఆయన పచ్చికబయళ్లకు పరుగులుపెట్టారు. విషయం తెల్సుకుని సైన్యం రంగంలోకి దిగి ఆయనను నిరసనకారుల బారినుంచి కాపాడింది.దేవ్బా కుమారుడు జైబీర్‌కు చెందిన కాఠ్మండులో హిల్టన్ ఐదునక్షత్రాల హోటల్‌కు, అర్జూకు చెందిన ఖుమల్తార్లోని ఉలెన్స్ పాఠశాలకు, తోఖాలో మాజీ ప్రధాని బాబూరామ్ భట్టారాయ్ ఇంటికి నిప్పుపెట్టారు. ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌదెల్ను వీధిలో పరుగెత్తించిమరీ చితక్కొట్టారు. వెనక నుంచి ఆయన్ను ఒకతను వీపుమీద ఎగిరి తన్నుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గోశాల, లూభూ, కాళీమతి పోలీస్పోస్ట్లకూ నిరసనకారులు నిప్పుపెట్టారు. కలాంకీ, కాళీమతి, తహచల్, బనేశ్వర్, నైకాప్, ఛియాసల్, ఛపగావ్, థేచో ఇలా ప్రతి ప్రాంతంలో పెను విధ్వంసం సృష్టించారు.టైర్లు తగలబెట్టి రోడ్లపై రాకపోకలను నిలిపేశారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యాలయ భవనం ఎక్కి పార్టీ జెండాను చింపేశారు. పోఖ్రా పట్టణంలో ఆందోళనకారులు కారాగారం గోడలు బద్దలుకొట్టారు. దీంతో జైలులోని 900 మంది ఖైదీలు బయటకు పరుగులుతీశారు. కాఠ్మండూలోని నఖూ జైలుకూ ఇదే గతి పట్టింది. దీంతో ఇక్కడి ఖైదీలు విడుదలయ్యారు. వీరిలో మాజీ హోం మంత్రి రవి లమీచ్ఛానే సైతం ఉన్నారు. ఇదే అదనుగా కొన్ని అల్లరిమూకలు దుకాణాలను లూటీ చేశాయి. దిగిపోవాలని డిమాండ్ చేసి దింపేశారుమంగళవారం ఉదయం ప్రధాని కేపీ శర్మ ఓలీ కార్యాలయాన్ని చుట్టుముట్టిన వందలాది మంది ఆందోళనకారులు తర్వాత లోపలికి చొరబడి శర్మను వెంటనే గద్దె దిగాలని మొండిపట్టుపట్టారు. ‘‘కేపీ దొంగ, దేశాన్ని వీడిపో’’అంటూ పెద్దగా నినాదాలు చేశారు. తప్పని పరిస్థితుల్లో వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు దేశాధ్యక్షుడు రాంచంద్రకు లేఖ రాశారు. ‘‘నేపాల్ అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. పరిస్థితి కుదుటపడేందుకు రాజ్యాంగబద్ధంగా, రాజకీయంగా తగు పరిష్కారం కనుగొనేందుకు వీలుగా ప్రధాని పదవి నుంచి వైదొలుగుతున్నా’’అని 73 ఏళ్ల సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్(యునిఫైడ్ మార్కిస్ట్–లెనినిస్ట్) నేత శర్మ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.వెంటనే రాజీనామాను అధ్యక్షుడు ఆమోదించారు. అయితే నూతన మంత్రివర్గం ఏర్పడేదాకా ఆయనే ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారని దేశాధ్యక్షుడు చెప్పారు. నేపాల్ కాంగ్రెస్ పార్టీ అండతో గత ఏడాది జూలైలో శర్మ నాలుగోసారి ప్రధాని పదవిని చేపట్టడం తెల్సిందే. శర్మ దిగిపోవాలని నేపాల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్వి గగన్ థాపా సైతం అంతకుముందే డిమాండ్‌చేశారు. చైనాతో సత్సంబంధాలు కొనసాగించే శర్మీ తరచూ భారతవ్యతిరేక విధానాలను అవలంభించే నేతగా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. గత షెడ్యూల్ ప్రకారం ఈనెలలోనే భారత్‌లో పర్యటించాల్సి ఉండగా ఆలోపే పదవీసన్యాసం చేశారు. అయితే శర్మ దేశాన్ని వీడి దుబాయ్‌కు వెళ్లనున్నారని, ఆయన కోసం రన్‌వే మీద హిమాలయ ఎయిర్‌లైన్స్ విమానాన్ని సిద్ధంగా ఉంచారని వార్తలొచ్చాయి. అగ్నికి ఆహుతవుతున్న ప్రధాని ఇల్లు బాణసంచా కాల్చి.. పారిపోకుండా ఆపి.. నేపాల్ నుంచి పారిపోయేందుకు నేతలకు హెలికాప్టర్ సేవలను అందిస్తోందన్న పుకార్లతో సిమ్రిక్ ఎయిర్‌లైన్స్ భవంతిని ఆందోళనకారులు తగలబెట్టారు. భైసేపతి మంత్రుల క్వార్టర్స్ నుంచి మంత్రులు విదేశాలకు హెలికాప్టర్లలో పారిపోతున్నారన్న వార్తలతో విద్యార్థులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఎయిర్పోర్ట్ రన్‌వేల సమీపంలో బాణసంచా, రాకెట్లు కాల్చారు. దీంతో ఆకాశంలో పొగచూరింది. డ్రోన్లు ఎగరేసి, పౌర లేజర్‌లైట్లు రన్‌వే వైపు ప్రసరింపజేసి విమాన రాకపోకలను అడ్డుకోవాలని ప్రజలకు ఆందోళనకారులు సోషల్‌మీడియా వేదికగా పిలుపునిచ్చారు. అయితే అప్పటికే కొన్ని హెలికాప్టర్లు అక్కడి నుంచి వెళ్లిపోయాయని వార్తలొచ్చాయి. కొందరు మంత్రులు, వీవీఐపీలు ఆర్మీ బ్యారెక్‌లలో తలదాచుకున్నారు. పార్లమెంట్‌ను రద్దుచేయండి: బాలెన్ షా యువతలో విపరీతమైన ఆదరణ ఉన్న కాఠ్మండు నగర మేయర్, 35 ఏళ్ల బాలేంద్ర షా మాత్రం వెంటనే పార్లమెంట్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ‘‘నిరసనకారులు శాంతించాలి. విద్యార్థి బృందాలు తక్షణం ఆర్మీ చీఫ్‌తో చర్చలకు సంసిద్ధమవ్వాలి. అంతకుముందే పార్లమెంట్‌ను రద్దుచేయాలి’’అని అన్నారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, తాము ఎంపీలుగా రాజీనామా చేస్తామని రా్రïÙ్టయ స్వతంత్ర పార్టీకి చెందిన 21 మంది ఎంపీలు ప్రకటించారు. ఉద్యమానికి తమ పూర్తి మద్దతు తెలిపారు. తాను సైతం రాజీనామా చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ప్రదీప్ యాదవ్ చెప్పారు. చర్చించుకుందాం.. రండి ఆందోళనను విడనాటి చర్చలకు రావాలని జెన్ జెడ్ విద్యార్థి, యువలోకానికి దేశాధ్యక్షుడు రాంచంద్ర పౌదెల్ పిలుపునిచ్చారు. శాంతి, సుస్థిరతకు అందరం పాటుపడుతున్నామంటూ నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్‌రాజ్ సిగ్దెల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏక్ నారాయణ్ ఆర్యల్, హోం సెక్రటరీ గోకర్ణ దవాదీ, సాయుధ పోలీసు బలగాల చీఫ్ రాజు ఆర్యల్, ఐజీ చంద్ర కుబేర్, జాతీయ దర్యాప్తు విభాగ సారథి హుత్రాజ్ థాపా సంతకాలు చేసి ఒక సంయుక్త ప్రకటన విడుదలచేశారు.అయితే 26 సోషల్‌మీడియా సైట్ల పునరుద్దరణతోపాటు వాక్ స్వాతంత్య్రం, ప్రభుత్వ ఉద్యోగుల్లాగా రాజకీయనేతలకూ రిటైర్మెంట్ వయసును ప్రకటించాలని పలు డిమాండ్లను యువత ప్రభుత్వం ముందుంచింది. మంత్రులు, ఉన్నతవర్గాల కుటుంబాలే సకల సౌకర్యాలను పొందుతున్నాయని ఉద్యమకారులు సోషల్‌మీడియాలో ప్రచారాన్ని మొదలెట్టారు. పరిస్థితిని చక్కదిద్ది ప్రభుత్వం, ఆర్మీ దేశంలో మళ్లీ శాంతిని నెలకొల్పాలని నేపాల్‌లోని ఆ్రస్టేలియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జపాన్, ద.కొరియా, బ్రిటన్, అమెరికా రాయబార కార్యాలయాలు సంయుక్త ప్రకటనలో అభ్యర్థించాయి. ఉద్యమాలు శాంతియుతంగా సాగాలని హింసాత్మక పథం పనికిరాదని ఐక్యరాజ్య సమితి సైతం హితవు పలికింది. -
తిరగబడిన నేపాల్!
చిన్న నిప్పురవ్వ చాలు... పెనుమంటలు ఎగిసిపడటానికి! ఒక్క కారణమే చాలు... అసంతృప్తి పెల్లుబుకటానికీ, అధికార పీఠాల్ని కూలదోయటానికీ!! ఆ మధ్య శ్రీలంకలో, మొన్న బంగ్లాదేశ్‌లో, నెల క్రితం ఇండోనేసియాలో రోడ్లపైకి వెల్లువలా వచ్చిపడిన యువత శక్తేమిటో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి గ్రహించలేకపోయారు. నిరసనంటే తెలియని, ఉద్యమమంటే ఎరుగని ‘జెన్ జీ’ తరాన్ని తక్కువ అంచనా వేశారు. అందుకే అవినీతి వ్యతిరేక ఉద్యమం మొదలై 36 గంటలు కాకుండానే ఆయనకు పదవీ భ్రష్టత్వం తప్పలేదు. అధ్యక్షుడు రాంచంద్ర పౌడ్వాల్ సైతం రాజీనామా చేశారు. కానీ ఈలోగా హింస పెల్లుబికి పార్లమెంటుకు నిప్పంటుకుంది. అధ్యక్షుడు, ప్రధాని భవంతులు తగలడిపోయాయి. మంత్రుల నివాసాలూ, పార్లమెంటు ఉన్న సింఘా దర్బార్ ఆవరణ ఉద్యమకారుల లక్ష్యంగా మారింది. మంత్రుల్ని రక్షించటానికి ఆర్మీ హెలికాప్టర్లు రంగ ప్రవేశం చేయాల్సివచ్చింది. మాజీ ప్రధాని, పాలకపక్షంలో భాగస్వామిగా ఉన్న నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్బా, ఆయన భార్య విదేశాంగమంత్రి అర్జూరమా దేవ్బా, నేపాల్ మావోయిస్టు పార్టీ నేత, మాజీ ప్రధాని ప్రచండ తదితరుల ఇళ్లపై దాడులు చేయగా, దేవ్బా దంపతులపై దౌర్జన్యం చేసి, నెత్తురోడుతున్న దేవ్‌బాను ఈడ్చుకెళ్లారు. భద్రతా దళాల కాల్పుల్లో 19 మంది మరణించగా, దాదాపు 500 మంది గాయపడ్డారని చెబుతున్నారు.చెప్పుకోదగిన నాయకుడు లేకున్నా సోమవారం ఉదయం వందల మందితో మొదలైన ఉద్యమం మధ్యాహ్నానికే వేలసంఖ్యకూ, అటు తర్వాత లక్షల్లోకి మారింది. దేశ రాజధాని కఠ్మాండూను దాటి జిల్లాలకు వ్యాపించింది. లాఠీచార్జి, బాష్పవాయు గోళాలు, రబ్బరు బుల్లెట్లు, చివరకు కాల్పులు ఫలితాన్నివ్వలేదు సరిగదా... ఆగ్రహించిన గుంపులు అధికార సౌధాలపై పడ్డాయి. హింసకు దిగొద్దన్న వినతులు బేఖాతరు కావటంతో ఉద్యమాన్ని విరమిస్తున్నామని నిర్వాహకులు ప్రకటించాల్సి వచ్చింది. మొదట ఉద్యమం శాంతియుతంగా ప్రారంభమైంది. దానికి ప్రభుత్వమే ఆజ్యం పోసింది. సామాజిక మాధ్యమాల ద్వారా పిలుపందుకుని వస్తున్న విద్యార్థులు, యువతతో ఆ ప్రాంతం నిండుతుండగానే ప్రభుత్వం యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర 26 వెబ్ సైట్లను నిలిపివేసింది. ఆ మాధ్యమాలు పన్నులు చెల్లించకపోవటం వల్లే నిలిపేశామని సంజాయిషీ ఇచ్చినా నిజమేమిటో అందరికీ తెలుసు. కనబడే కారణం మాధ్యమాల నిషేధమే అయినా అక్కడ నెలకొన్న ఆర్థిక సంక్షోభం అసలు హేతువు. సగటున రోజుకు రెండు వేలమంది పొట్టనింపుకోవటానికి దూర తీరాలకు వలసపోయే దుఃస్థితి నెలకొంది. దీన్ని సరిచేయకపోగా ప్రాజెక్టులన్నీ అవినీతి మయంగా మారాయి. సంపన్నుల పిల్లలు విదేశాల సందర్శనకు పోయి విలాసాల్లో గడుపుతూ సామాజిక మాధ్యమాల్లో ఆ దృశ్యాలు షేర్ చేయటం సహజంగానే నిరుద్యోగంతో దుర్భర జీవనం సాగిస్తున్న యువతలో ఆగ్రహాన్ని కలిగించింది. ఇందుకు ప్రస్తుత పాలక పక్షంలోని సీపీఎన్(యూఎంఎల్), నేపాలీ కాంగ్రెస్‌లతోపాటు అరకొర సీట్లతో కింగ్‌మేకర్‌గా మిగిలిపోయిన మావోయిస్టు పార్టీ సైతం సిగ్గుపడాలి. శ్రీలంకలో మూడేళ్ల క్రితం, నిరుడు బంగ్లాదేశ్‌లో, నేడు నేపాల్‌లో ఒకే మాదిరి దృశ్యాలు కనిపించటం యాదృచ్ఛికం కాదు. ఈ మూడు ఉద్యమాలూ యువత, విద్యార్థుల నాయకత్వంలోనే జరిగాయి. మూడింటి మధ్యా కనబడే మరో పోలిక ఏమంటే... వీటికి చైనాయే అధిక వడ్డీలకు అప్పులిచ్చి ఆర్థికంగా కుంగదీసింది. ఉదాహరణకు నేపాల్ పౌర విమానయాన మౌలిక సదుపాయాల మెరుగు కోసమంటూ తలపెట్టిన పోఖరా అంతర్జాతీయ విమానాశ్రయానికి చైనా ప్రధాన రుణదాత. 2,200 కోట్ల డాలర్ల ఈ ప్రాజెక్టు రెండేళ్ల క్రితం సాకారమైంది. కానీ అది వృథా వ్యయమని కొన్నాళ్లకే తేలిపోయింది. అందులో 10.5 కోట్ల డాలర్లకు పైగా అవినీతి జరిగిందని నిర్ధారణ అయింది. ఆ రుణాన్ని రీషెడ్యూల్ చేయాలని నేపాల్ కోరుతున్నా చైనా ససేమిరా అంటోంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్(బీఆర్ఐ) ప్రాజెక్టు కూడా కష్టాల్లో పడింది. సరిగ్గా ఆగ్రహ జ్వాలల్లో నేపాల్ మండుతుండగా ఓలి శర్మ చైనా పర్యటన ముగించుకుని రావటం గమనించదగ్గది. -
ఫోన్ వద్దు.. చదువే ముద్దు!
స్మార్ట్‌ఫోన్ ఎంతగా మన దైనందిన జీవితంలో మమేకం అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. కర్ణుడి కవచ కుండలాల్లా.. అది నిరంతరం మనతో ఉండాల్సిందే. కాలేజీ విద్యార్థులకుతోడు బడి ఈడు పిల్లల్లోనూ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగింది. ఈ అలవాటే వారిని క్లాస్ రూముల్లోకి ఫోన్ తీసుకెళ్లేలా చేస్తోంది. తరగతి గదిలోకి ఫోన్ లేకుండా వెళ్లిన విద్యార్థులు విద్యాపరంగా మెరుగ్గా రాణించినట్టు తాజా అధ్యయనంలో తేలింది.భారీ అధ్యయనంపెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ ఆల్ఫ్ సుంగు తన సహచరులతో కలిసి ఇటీవల భారత్‌లో ఓ వినూత్న అధ్యయనం చేపట్టారు. 10 ఉన్నత విద్యా సంస్థలలో చదువుతున్న 16,955 మంది విద్యార్థులను స్మార్ట్ ఫోన్ ఎలా ప్రభావితం చేసిందన్నదే ఆ అధ్యయన సారాంశం. తరగతి గదిలోకి ఫోన్ తీసుకుపోని విద్యార్థులు చదువుల్లో బాగా రాణించినట్టు ఆ అధ్యయనంలో తేలింది.తక్కువ పనితీరు కనబరుస్తున్న, అలాగే సైన్స్, గణితం కాకుండా ఇతర సబ్జెక్టులను చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థులు కూడా ఫోన్ వాడకపోవడం వల్ల ఎక్కువ ప్రతిభ చూపినట్టు డాక్టర్ సుంగు తెలిపారు. ఫోన్ నిషేధించడం వల్ల తరగతి గది ఫలితాలు మెరుగుపడతాయనడానికి బలమైన ఆధారాలను నివేదిక అందిస్తుందని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలో కౌమార నిపుణులు అన్నే మాహెక్స్ చెప్పారు.20 నిమిషాల సమయం!యునెస్కో చేపట్టిన ‘2023 గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్’ నివేదిక ప్రకారం.. ‘కొన్ని సాంకేతిక పరిజ్ఞానాలు కొన్ని సందర్భాల్లో కొంతవరకు మాత్రమే అభ్యాసానికి తోడ్పడతాయి. తరగతి గదిలో స్మార్ట్‌ఫోన్ వల్ల చదువుకు అంతరాయం కలుగుతోంది. 14 దేశాల్లో ప్రీ–ప్రైమరీ నుండి ఉన్నత విద్య వరకు చదువుతున్న విద్యార్థులపై జరిపిన ఓ అధ్యయనంలో.. ఫోన్ చేతిలో ఉంటే విద్యార్థుల దృష్టి నేర్చుకోవడం నుండి మరలుతోందని తేలింది.మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్స్ వస్తుంటే విద్యార్థులు తమ ఏకాగ్రతను కోల్పోతున్నారట. ఆ తరువాత.. విద్యార్థులు వారు నేర్చుకుంటున్న దానిపై తిరిగి దృష్టి పెట్టడానికి 20 నిమిషాల వరకు సమయం పడుతోందని మరో అధ్యయనంలో తేలింది. బెల్జియం, స్పెయిన్, యూకేలోని బడుల్లో స్మార్ట్ఫోన్లపై నిషేధం కారణంగా అభ్యాస సామర్థ్యాలు, ఫలితాలు మెరుగుపడినట్టు వెల్లడైంది’.‘వాంఛనీయం కాదు’పాఠశాలల్లో స్మార్ట్ఫోన్లను పూర్తిగా నిషేధించడం ఆచరణాత్మకం, వాంఛనీయం కాదని స్పష్టం చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఈ ఏడాది మార్చిలో మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యా ప్రయోజనాలు, తలెత్తే నష్టాలను దృష్టిలో పెట్టుకుని నియంత్రణ అవసరాన్ని నొక్కి చెప్పింది. ఈ నేపథ్యంలో.. స్కూల్ సమయంలో విద్యార్థులు స్మార్ట్‌ఫోన్ వాడకంపై స్పష్టమైన విధానాలను రూపొందించాలని ఢిల్లీ విద్యా శాఖ తన పరిధిలోని అన్ని పాఠశాలలను ఏప్రిల్‌లో ఆదేశించింది. విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించాలన్న ఏకైక లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా కనీసం 40% జాతీయ విద్యా వ్యవస్థలలో తరగతి గదుల్లో సెల్ఫోన్లపై నిషేధాలు అమలవుతున్నాయి. మనదేశంలో మాత్రం స్మార్ట్‌ఫోన్ వినియోగానికి సంబంధించి ప్రస్తుతం స్పష్టమైన చట్టం/విధానం లేదు.నో ఫోన్స్.. ఓన్లీ బుక్స్అమెరికా ఫోన్లు నిషేధిస్తున్న రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2025 ఆగస్ట్ నాటికి 18 రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేస్తుండగా.. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మరో 17 రాష్ట్రాలు వచ్చి చేరాయి. చైనా: ప్రైమరీ, సెకండరీ స్కూల్స్‌లో 2025 మార్చి నుంచి నిషేధం విధించారు. బోధనా కారణాల వల్ల ఫోన్ అవసరమైతే తల్లిదండ్రులు రాతపూర్వకంగా విద్యా మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేయాలి. తజికిస్తాన్: 2009 నుంచి ప్రాథమిక, సెకండరీ, ఉన్నత విద్యా సంస్థలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మొబైల్ ఫోన్ వాడకూడదు. గీత దాటితే జరిమానా తప్పదు.బంగ్లాదేశ్: దేశవ్యాప్తంగా నిషేధాలు మొదట 2011లో అమలయ్యాయి. 2017లో బలోపేతం చేశారు.రువాండా2018 జూన్ నుంచే ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో మొబైల్ ఫోన్స్ వాడకానికి అడ్డుకట్ట వేసింది. ఫ్రాన్స్: 15 ఏళ్లలోపు విద్యార్థులు బడుల్లో ఫోన్ వాడకూడదు. 2018–2019 విద్యా సంవత్సరం నుండి నిబంధన అమలు.బ్రెజిల్: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు స్మార్ట్‌ఫోన్ వాడకూడదని 2025 జనవరిలో జాతీయ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఉపాధ్యాయుల అనుమతితో విద్యా ప్రయోజనాల కోసం లేదా అత్యవసర పరిస్థితులు ఉంటే ఉపయోగించవచ్చు.ఇటలీ: ప్రైమరీ స్కూల్ విద్యార్థుల మొబైల్ ఫోన్ వాడకంపై నిషేధం ఉంది. 2025 కొత్త విద్యా సంవత్సరం నుండి హైస్కూల్ విద్యార్థులకూ వర్తింపజేశారు.నెదర్లాండ్స్: ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్ పీసీలపై దేశవ్యాప్తంగా 2024 సెప్టెంబర్ నుండి నిషేధం. న్యూజిలాండ్: పాఠశాల సమయంలో సెల్‌ఫోన్ వాడకూడదన్న నిబంధన దేశవ్యాప్తంగా 2024 ఏప్రిల్ నుంచి అమలైంది. -
విద్యా రంగాన్ని సంస్కరిద్దాం
సాక్షి, హైదరాబాద్: విద్యారంగాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందని, దీని కోసం ప్రతి ఒక్కరూ కలిసి నడవాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రానికి సరికొత్త విద్యావిధానం రూపొందించేందుకే ప్రత్యేక అధ్యయన కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రైవేటు, కార్పొరేట్ రంగానికి మించిన నాణ్యతతో ప్రభుత్వ పాఠశాలలు విద్యను అందించాలని కోరారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో శుక్రవారం గురుపూజోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలకోపన్యాసం చేశారు.గత పదేళ్లలో విద్యాశాఖ నిర్వీర్యమైందని, చారిత్రక ప్రాధాన్యత గల ఉస్మానియా యూనివర్సిటీ మూతపడే దశకు చేరి ందన్నారు. విద్యా శాఖను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యా విధానంలో సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విద్యాశాఖను స్వయంగా పర్యవేక్షించాలన్న ఉద్దేశంతోనే దానిని తన వద్ద ఉంచుకున్నానని సీఎం తెలిపారు.దీనిపై కొంతమంది చేస్తున్న విమర్శలు అర్థం లేనివని కొట్టిపారేశారు. పదేళ్లుగా ఈ శాఖ అస్తవ్యస్తమైందని విమర్శించారు. ప్రొఫెసర్లను నియమించకుండా యూనివర్సిటీలను నీరుగార్చారని ఆరో పించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే టీచర్ల బదిలీలు, 55 రోజుల్లోనే 11 వేల మంది టీచర్ల నియామకాలు చేపట్టామని చెప్పారు. టీచర్లు బాగా పనిచేస్తే మేము మళ్లీ గెలుస్తాం తెలంగాణ ఉద్యమాన్ని పల్లెలకు తీసుకెళ్లిన ఘనత టీచర్లదేనని సీఎం అన్నారు. ‘ఢిల్లీలో కేజ్రీవాల్ రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి విద్యాభివృద్ధే కారణం. నాలోనూ ఆ స్వార్థం ఉంది. టీచర్లు బాగా పనిచేస్తేనే నేను రెండోసారి సీఎం అవుతాను. ఉపాధ్యాయ సంఘాలు ఎప్పుడొచ్చినా సమస్యలు విని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. ప్రైవేట్ కంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కువ విద్యావంతులు, సామాజిక బాధ్యత తెలిసినవారు. టీచర్లకు జీతాలిచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు. మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. పాఠశాలల నిర్వహణకు ఏటా రూ.130 కోట్లు మంజూరు చేస్తున్నాం’అని తెలిపారు.విద్యార్థులతో కలిసి భోజనం చేయండి పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కొన్నిసార్లు విషపూరితం కావటం దురదృష్టకరమని సీఎం అన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమయంలో పిల్లలతో కలసి ఉపాధ్యాయులు భోజనం చేయాలని కోరారు. అప్పుడే తప్పులు జరగకుండా ఉంటాయని అభిప్రాయపడ్డారు. అప్పుడప్పుడు తాను కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేస్తానని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల చేరికలు పెరిగాయని చెప్పారు. ప్రైవేటు, కార్పొరేట్ కన్నా మంచి విద్యను అందిస్తామని టీచర్లు ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. బలమైన పునాది అవసరం విద్యకు బలమైన పునాది అవసరమని సీఎం అన్నారు. ‘విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవడం కీలకం. దీని దృష్టిలో ఉంచుకునే వరల్డ్ బెస్ట్ మోడల్‌గా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్‌ను నిర్మిస్తున్నాం. నిరుద్యోగ యువతకు నైపుణ్యాన్ని అందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. 65 ఐటీఐలను టాటా కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్‌గా ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేశాం. దేశ ప్రతిష్టను పెంచేలా తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నాం’అని వివరించారు.డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్ ఫోర్స్ తెస్తున్నామని ప్రకటించారు. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా గురుపూజోత్సవ విశిష్టతను, గురువులకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగులేని శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ఎమ్మెల్సీలు పింగిళి శ్రీపాల్‌రెడ్డి, ఏవీఎన్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య, సాంకేతిక విద్య కార్యదర్శి దేవసేన తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అవార్డులు అందించారు. అంతకుముందు విద్యార్థులు ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. -
లండన్‌లో ఇద్దరు తెలంగాణ విద్యార్థుల మృతి
బడంగ్పేట్/ ఉప్పల్: లండన్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ యువకులు దుర్మరణంపాలయ్యారు. మృతులను నాదర్ గుల్కు చెందిన చైతన్యయాదవ్ (అభి), పీర్జాదిగూడకు చెందిన రిషితేజ (21)గా గుర్తించారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్కు చెందిన తర్రె ఐలయ్యయదవ్, మంగమ్మ దంపతులకు చిన్న కుమారుడు చైతన్యయాదవ్ (23) బీటెక్ పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం ఈ ఏడాది జనవరిలో లండన్ వెళ్లాడు. బోడుప్పల్ లోని పీర్జాదిగూడ మున్సిపాలిటీ అమృత కాలనీలో నివా ముండే రాపోలు రవీందర్రావు, కిరణ్మయి దంపతుల కుమారుడు రిషితేజ (21)హైదరాబాద్‌లో బీబీఏ పూర్తిచేసి ఉన్నత చదువుల కోసం గత మే నెలలో లండన్ వెళ్లాడు. వీరు మరికొందరు తెలుగు విద్యార్థులతో కలిసి అక్కడ నివా సం ఉంటున్నారు. వినాయక చతుర్థిని పురస్కరించుకుని స్నేహితులంతా గణనాథున్ని ప్రతిష్టించారు. ఆదివారం సా యంత్రం నిమజ్జనం కోసం 9 మంది రెండు కార్లలో బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో రోడ్డు మలుపు వద్ద వారి కారును వెనక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టింది. వెనుక వస్తున్న ట్రక్కు రెండు కార్లను ఢీకొట్టడంతో కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ఘటనలో చైతన్య యాదవ్, రిషితేజ మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు.రెండు కుటుంబాల్లో విషాదంఇద్దరు యువకుల మరణంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. చైతన్యయాదవ్ మరణవార్తతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. బీజేపీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రిషితేజ చివరగా తల్లి కిరణ్మయితో ఆదివారం మాట్లాడాడు. ‘నిద్ర వస్తోంది.. లేచాక మాట్లాడతాను అని చెప్పిన మాటలే చివరివి అయ్యాయి’అని అతడి తండ్రి రవీందర్రావు కన్నీరు మున్నీరయ్యాడు. -
అలా చదివితేనే.. తెలంగాణలో లోకల్: సుప్రీంకోర్టు సంచలన తీర్పు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ లోకల్ రిజర్వేషన్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. తెలంగాణలో వరుసగా 9,10,11,12 తరగతులు చదివితేనే లోకల్ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం తీర్పును ఇచ్చింది. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో, తెలంగాణ లోకల్ రిజర్వేషన్ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది.ఈ సందర్బంగా వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుందన్న తెలంగాణ ప్రభుత్వ జీవో నెంబర్-33ని సుప్రీంకోర్టు సమర్థించింది. స్థానిక రిజర్వేషన్ల అంశంపై ప్రతి రాష్ట్రానికి నిబంధనలను తయారు చేసుకునే అధికారం ఉందని కోర్టులో తెలంగాణ ప్రభుత్వం వాదించింది. వాదనలను ధర్మాసనం ఒప్పుకుంది. ఈ అంశాన్ని సవాల్ చేసిన విద్యార్థుల పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అయితే గత ఏడాది ఇచ్చిన మినహాయింపుతో ప్రయోజనం పొందిన విద్యార్థులను అలాగే కొనసాగించాలని ధర్మాసనం సూచించింది. కాగా, ఎంబీబీఎస్, బీడీఎస్, యూజీ కోర్సులకు లోకల్ కోటా రిజర్వేషన్ తీర్పు వర్తించనుంది. -
ఇక చాలు దయచేయండి.. విదేశీ విద్యార్థులపై ట్రంప్ మరో పిడుగు
వాషింగ్టన్: అమెరికాలో చదువుల కోసం ప్రయత్నిస్తున్న, అగ్రరాజ్యంలో ఉంటున్న విదేశీ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం భారీ షాకిచ్చింది. ఇప్పటికే వీసాల జారీకి ‘సోషల్ మీడియా వెట్టింగ్’ను కఠినంగా అమలుచేస్తోన్న అగ్రరాజ్యం.. తాజాగా విద్యార్థుల వీసా నిబంధనల్లో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఫలితంగా ఇకపై విదేశీ విద్యార్థులు నాలుగేళ్లకు మించి అమెరికాలో ఉండకుండా వీసా నిబంధనల్లో మార్పులు చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.1978 నుండి అందుబాటులో ఉన్న ఎఫ్-1 వీసా ఉన్న విద్యార్థులు “డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్” ఆధారంగా అమెరికాలో ఉండే అవకాశం ఉండేది. అంటే వారు పూర్తి కాలం చదువుతున్నంత కాలం ఉండొచ్చు. అంటే ఒక కోర్స్ పూర్తయిన మరో కోర్సులో చేరి అక్కడే ఉండొచ్చు. కానీ కొత్త ప్రతిపాదనల ప్రకారం.. విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసిన తర్వాత వారి సొంత దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం గరిష్టంగా నాలుగేళ్ల గడువు విధించింది. ఒకవేళ నాలుగేళ్ల తర్వాత కూడా అమెరికాలో ఉండాలనుకుంటే విద్యార్థులు డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ద్వారా పునఃపరిశీలన కోసం దరఖాస్తు చేయాలి.ఎఫ్-1 విద్యార్థులు చదువు పూర్తి చేసుకున్న తర్వాత మరో వీసా కోసం ప్రయత్నించాలనుకుంటే.. ఆ గ్రేస్ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 30 రోజులకు కుదించారు.ఈ మార్పులు అమల్లోకి వస్తే భారతీయ విద్యార్థులపై అధిక ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం 3.3 లక్షల మందికి పైగా భారతీయులు అమెరికా వర్సిటీల్లో చదువుకుంటున్నారు. -
పదోతరగతి చదివిన విద్యార్థుల అపూర్వ సమ్మేళనం.. 30 ఏళ్ల తర్వాత
సాక్షి,కోనసీమ: దాదాపు ముప్పైఏళ్ల తర్వాత కలుసుకున్నారు. తమ మనసులోని భావాలను పంచుకున్నారు. గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. చిన్నపాటి విందుతో ఆత్మీయ కలయికను కాస్తా ఒక వేడుకగా జరుపుకున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్నవారంతా ముప్పైఏళ్ల క్రితం పదోతరగతి బ్యాచ్.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం జడ్పీహెచ్ స్కూలులో 94-95 ఏడాది టెన్త్ పూర్తిచేసారు. అయితే ఇప్పుడు వీరంతా ఒక్కచోట లేరు. కొందరు స్వగ్రామాల్లో ఉండగా, మరికొందరు వృత్తి,వ్యాపారరీత్యా ఇతర రాష్ట్రాల్లోనూ, విదేశాల్లోనూ ఉంటున్నారు. అందువల్ల అందుబాటులో ఉన్న మిత్రులందరూ ఇలా కలిసి తమ స్నేహహస్తాన్ని చాటారు. భావితరాలకు ప్రేరణగా నిలిచారు. అయితే ఈ ముప్పైఏళ్ల సుదూర ఎడబాటును దగ్గరచేసేలా, మిత్రులందరినీ ఒక్కగూటికి చేర్చేలా చేసిన ఒకరిద్దరి చిన్నప్రయత్నం పెద్దఫలితాన్ని ఇచ్చింది. మిత్రుల నంబర్లు సేకరించి, వారందరినీ ఐక్యంచేసేలా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన వట్టం రామచంద్రశేఖర్, పొదలాడ శ్రీనివాసరావులకు తోటిమిత్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిలో కలిగిన సంతోషాన్ని చాటుకుంటున్నారు. -
నైజీరియా స్టూడెంట్స్ 'దేవ శ్రీ గణేశ'ప్రదర్శన..!
ఎటు చూసినా..వినాయక చవితి పండుగ కోలాహలంతో సందడిగా ఉంది. ప్రతి చోట గణపతి ప్రతిమల దర్శనంతో..జై గణేశ..అనే శ్మరణే కనిపిస్తోంది. బాద్రపదమాసం రాకే గణనాథుడి పండుగనే హైలెట్ చేస్తుంది. ఈ పండుగ అందరిని ఒకచోటకు చేర్చి..ఐక్యంతగా జరుపుకునేలా చేసే సంబరం. అలాంటి పండుగ వాతావరణం నైజీరియాలో కూడా కనిపించడమే విశేషం. అక్కడ ప్రజలు కూడా చవితి పండుగను జరుపుకుంటారా అని విస్తుపోకండి. అసలు కథేంటంటే..దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకల సన్నహాలు, ఉత్సవాలతో సందడిగా ఉంది. ఈ వేడుకలు అంబరాన్నంటేలా ఘనంగా సాగుతున్న ఈ తరుణంలో నెట్టింట ఓ వీడియో అందరిని అమితంగా ఆకర్షించడమే కాదు మా బొజ్జగణపయ్య అన్ని చోట్ల ఉన్నాడనడానికి ఇదే సంకేతం అని మురిసిపోతున్నారు నెటిజన్లు. ఆ వీడియోలో నైజీరియన్ విద్యార్థుల బృందం బాలీవుడ్ ఫేమస్ పాట "దేవ శ్రీ గణేశ" అనే భక్తి గీతానికి డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ వీడియోని నైజీరియాలోఏని డ్రామ్ క్యాచర్స్ అకాడమీ అనే ఎన్జీవో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. గణేష్ చతుర్థికి ముందు అకాడమీ పిల్లలు శ్రీ గణేశ దేవా అనే పాటకు ఎంత అద్భుత డ్యాన్స్ చేశారంటే కళ్లురెప్పవేయడమే మర్చిపోయేంత అందంగా చేశారు. ఆ పాట బీట్‌కి తగ్గట్లుగా వేస్తున్న స్టెప్పులు వావ్ వాట్ ఏ ఎనర్జీ అనే ఫీల్ కలుగుతోంది . అంతేకాదండోయ్ వాళ్లు ఆ వీడియోకి "హలో ఇండియా మీరు ఈ వీడియోని ఇష్టపడతారని మేము ఆశిస్తున్నాం" అంటూ ఇవ్వడం మరింత విశేషం. ఈ వీడియోకి మూడు లక్షలకు పైగా వ్యూస్, లైక్‌లు వచ్చాయి. View this post on Instagram A post shared by Dream Catchers Academy 🇳🇬 🌍 (@dreamcatchersda) (చదవండి: భాగ్యనగరంపై మనసు పారేసుకున్న రష్యన్ చిన్నది..!) -
సర్కార్‌పై ఆగ్రహం
సాక్షి, అమరావతి/సాక్షి, రాజమహేంద్రవరం/ఏలూరు (టూటౌన్)/శ్రీకాకుళం పాత బస్టాండ్ : సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, ఆంక్షలు లేకుండా తల్లికి వందనం అందించాలని, హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ వద్ద ధర్నాకు వచ్చిన విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. నిరసనకు అనుమతి లేదంటూ ఒక్కసారిగా విద్యార్థులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు.అక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగారు. దొరికినవారిని దొరికినట్లు రోడ్డు పక్కకు ఈడ్చిపారేశారు. లాఠీలతో కొట్టారు. కొందరిని గొంతు పట్టుకుని తోసేయడంతో ఓ విద్యార్థి రోడ్డు పక్కన పడిపోయాడు. పోలీసుల దౌర్జన్యంతో పలువురు విద్యార్థి సంఘం నేతలు, విద్యార్థులకు గాయాలయ్యాయి. సహనం నశించిన విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కలెక్టరేట్ ఎదుట సుమారు నాలుగు గంటలపాటు బైఠాయించారు.చివరకు డీఆర్వో సీతారామయ్య కలెక్టరేట్ బయట గేటు వద్దకు చేరుకుని వినతి పత్రం స్వీకరించడంతో ఆందోళన సద్దుమణిగింది. ఏలూరు కలెక్టరేట్ వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించి.. కలెక్టర్ వెట్రిసెల్వికి వినతి పత్రం ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ వద్ద విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర శాఖ సోమవారం విమర్శించింది. -
హాస్టల్లో హుక్కా
కేశంపేట: రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధి లోని కొత్తపేటలోని సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్ లో కొందరు విద్యార్థులు హుక్కాకు అలవాటు పడ్డారు. ఏకంగా యూట్యూబ్‌లో చూసి అవసరమైన సామగ్రి ఆన్లైన్లో, తెలిసినవారి నుంచి సమకూర్చుకొని స్వయంగా హుక్కా తయారు చేశారు. హాస్టల్లో ఉండే కొత్తపేటకు చెందిన ఇంటర్ విద్యార్థికి షాద్‌నగర్‌లోని ఓ హోటల్లో పనిచేసే మిత్రుడు ఉన్నాడు. ఇతని ద్వారా హుక్కా పీల్చడం అలవాటు చేసుకున్నాడు. మరో ఇద్దరు విద్యార్థులకు అలవాటు చేశాడు. అలా పదోతరగతి లోపు చదువుతున్న 20 మంది హుక్కాకు బానిసలుగా మారారు. ఇదంతా ఓ నాలుగో తరగతి విద్యార్థి గమనించగా, అతడిని కొట్టి బలవంతంగా హుక్కా తాగించారు. విషయం తెలుసుకున్న వార్డెన్ ఇద్దరు విద్యార్థులను హాస్టల్ నుంచి ఇంటికి పంపించారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి హుక్కా పీల్చేందుకు గుర్తు తెలియని వ్యక్తి హాస్టల్ గోడ దూకి, విద్యుత్ దీపాలు ఆర్పివేశాడు. దీంతో మిగిలిన విద్యార్థులు రాత్రంతా భయంభయంగా గడిపి శనివారం ఉదయమే హాస్టల్ సిబ్బందికి తెలిపారు. హాస్టల్లో తనిఖీ చేయగా హుక్కా మిషన్‌తోపాటు సామగ్రి లభించాయి. ఇంటర్ విద్యార్థిని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు విశ్వసనీయ సమాచారం -
Nizamabad: ముగ్గురు చిన్నారుల పట్ల కర్కశంగా వ్యవహరించిన ఉపాధ్యాయుడు శంకర్
-
గుంటూరు కలెక్టరేట్ వద్ద SFI ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన
-
బంగ్లాదేశ్ ఇప్పుడొక టైమ్ బాంబ్!
‘ఉక్కు మహిళ’ షేక్ హసీనా నిరంకుశ పాలనకు తెరపడినా, బంగ్లాదేశ్‌లో ప్రజా స్వామ్య ద్వారాలు తెరుచుకోలేదు. విద్యార్థుల తిరుగుబాటుకు వెనుక ఉండి మద్దతు ఇచ్చిన సైన్యం హసీనా నిష్క్రమణతో నేరుగా రంగంలోకి దిగింది. తమ ఆటలు సాగనివ్వని హసీనాపై సైనిక అధికారులు పగ తీర్చుకున్నారు. చివరకు ఆమె దేశం విడిచి పారిపోవలసి వచ్చింది. సైన్యంతో పాటు విద్యార్థుల తిరుగు బాటుకు అన్ని రకాలుగా తోడ్పాటు అందించిన ఇస్లామిస్ట్ శక్తులు ఇప్పుడు బలం పుంజుకున్నాయి. సెక్యులర్ పాలనలో కుక్కిన పేనుల్లా పడి ఉన్న ఈ శక్తులు ఇదే అదనుగా వీధుల్లోకి వచ్చాయి.యూనస్ దేనికి వారధి?తను స్థాపించిన గ్రామీణ్ బ్యాంక్ ద్వారా బీదాబిక్కీకి రుణ సాయం అందిస్తూ వారి పాలిట దేవుడిగా కీర్తించబడి 2006లో నోబెల్ శాంతి బహుమతి పొందిన మహమ్మద్ యూనస్‌ను గద్దె ఎక్కించడంతో బంగ్లాదేశీయుల ప్రజాస్వామ్య ఆశలు మరింత బలపడ్డాయి. అయితే అవి వమ్ము కావడానికి ఎంతో కాలం పట్టలేదు.నోబెల్ కమిటీ యూనస్‌ను ఎంపిక చేయడానికి గ్రామీణ్ బ్యాంకు ద్వారా ఆయన సేవలు అందించారనడం అనేది పైకి కనిపించే కారణం మాత్రమే! భౌగోళిక రాజకీయాలు ఇందులో కీలక పాత్ర పోషించాయి. ఇస్లాముకూ, పశ్చిమ దేశాల ప్రజలకూ నడుమ యూనస్ ఒక వారధి లాంటి వాడని కమిటీ అధ్యక్షుడు ఆయనకు అవార్డు ప్రకటిస్తూ అభివర్ణించారు. 2001 సెప్టెంబర్ 11న యూఎస్ మీద జరిగిన టెర్రరిస్టు దాడుల నేపథ్యంలో ‘ఇస్లామును ఒక భూతంగా చూసే విస్తృత ధోరణి’ని ఎదుర్కోవడానికి యూనస్ ఎంపిక తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. యూనస్ తరఫున అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ లాబీయింగ్ చేయడం వెనుక అసలు కారణం ఇదే!దేశంలో సమూల సంస్కరణలు ప్రవేశపెడతాననీ, ప్రజా స్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తాననీ బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ అధినేతగా సైన్యం వెన్నుదన్నుతో పగ్గాలు చేతబట్టిన యూనస్ దేశ ప్రజలకు వాగ్దానం చేశారు. అయితే ఎన్నికలు పదే పదే వాయిదా పడుతున్నాయి. ఇలా ఉండగా, రాజ్యాంగ బద్ధత లేనప్పటికీ, మధ్యంతర ప్రభుత్వం అనేక స్వతంత్ర సంస్థల్లో పెనుమార్పులు ప్రకటిస్తోంది. వీటిలో భాగంగా, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తినీ, సీనియారిటీ పరంగా ఆయన తర్వాతి స్థానాల్లో ఉండే అయిదుగురు న్యాయమూర్తులనూ పదవుల నుంచి తొలగించింది. హసీనా పార్టీ అవామీ లీగ్‌ను నిషేధించింది. దేశంలోనే అతి పెద్దదైన ఈ రాజకీయ పార్టీ నాయకత్వంలోనే బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.వీధుల్లో బీభత్స కాండమానవ హక్కులను కాపాడవలసిన ప్రభుత్వమే వాటిని ఉల్లంఘిస్తోంది. నిరసనలను అణచివేస్తోంది. న్యాయవాదులు, విద్యా వేత్తలు, పాత్రికేయులు, ప్రతిపక్ష నేతలను, హసీనా మద్దతుదారు లను మూకుమ్మడిగా జైళ్లకు పంపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అనేక వేల మందిని నిర్బంధంలోకి తీసుకుంది. హత్యలు వంటి అభియోగాలు మోపి జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెడు తోంది. వారిపై పెరిగిపోయిన దాడుల పట్ల అంతర్జాతీయ మీడియా పరిశీలక సంస్థలు ఆందోళన ప్రకటిస్తున్నాయి. దేశంలో కస్టడీ హత్యలు, చిత్రహింసలు మామూలు అయ్యాయి.ఇస్లామిస్టు ఉగ్రవాదులకు పునరావాసం కల్పించే కొత్త పరి ణామం మరింత ఆందోళన కలిగిస్తోంది. యూనస్ నాయకత్వంలోని మిలిటరీ–ముల్లా ప్రభుత్వం జిహాదీ గ్రూపుల మీద నిషేధాలు ఎత్తివేసింది. కరడు గట్టిన ఉగ్రవాద నాయకులకు స్వేచ్ఛ ప్రసాదించింది. అంతకంటే ఘోరంగా, అనేక మంది ఉగ్రవాదులు మంత్రి పదవులు, ఉన్నత ప్రభుత్వోద్యోగాలు పొందారు. వారి అనుచర గణాలు ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. బౌద్ధులు, క్రైస్తవులు, హిందువులు, గిరిజన తెగల మీద దాడులు చేస్తున్నారు. ‘ఇతర’ ఇస్లామిక తెగలనూ వారు విడిచి పెట్టడం లేదు. ఈ దాడులను నేరాలుగా పరిగణించక పోవడం విశేషం. స్త్రీలు ధరించే దుస్తులను సాకుగా చూపి, వారి మీదా దాడు లకు తెగబడుతున్నారు. తాలిబన్ శైలిలో ‘మోరల్ పోలీసింగ్’ సంస్కృతి వ్యాప్తి చెందుతోంది. పరిస్థితి ఎంత దుర్మార్గంగా తయా రైందంటే, ఆఖరుకు అవామీ లీగ్ పార్టీకి బద్ధ వ్యతిరేకమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సైతం ఈ మౌలిక హక్కుల హననాన్ని, ‘మతం పేరిట రేగిన ఉన్మాదం’గా, ‘వీధుల్లో బీభత్స కాండ’గా అభివర్ణిస్తోంది.పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ ఈ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తోంది. జీడీపీ వృద్ధి కుప్పకూలింది. విదేశీ రుణం పెరిగి పోయింది. ద్రవ్యోల్బణం 12 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. ఇన్వెస్టర్ల విశ్వాసం క్షీణించడంతో, స్టాక్ మార్కెట్ అయిదేళ్ల కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఉద్యోగాలు పోతున్నాయి. ఉపాధి దొరకడం లేదు. జీవన ప్రమాణాలు తిరోగమిస్తున్నాయి. ఇలాంటి ఆర్థిక వ్యవస్థ ఉగ్రవాద వ్యాప్తికీ, సామాజిక అశాంతికీ దారి తీస్తుంది.ఇండియాకూ గట్టి దెబ్బముస్లిం మెజారిటీ దేశంలో లౌకిక ప్రజాస్వామ్యానికి బంగ్లాదేశ్ ఒకప్పుడు చిరునామాగా ఉండేది. కోవిడ్–19 మహమ్మారి ముంచు కొచ్చే వరకు ఆర్థిక అభివృద్ధి, సామాజిక స్థిరత్వం దిశగా పురోగమించింది. ఏ దేశం నుంచి విడిపోయేందుకు విముక్తి ఉద్యమం చేసిందో ఆ దేశం బాటలోనే ప్రయాణించే దుఃస్థితి నేడు బంగ్లాదేశ్‌కు పట్టింది. బంగ్లాదేశ్ దుష్పరిణామాల ప్రభావం ఈ ప్రాంతం అంతటా పడుతుంది. బంగ్లాదేశ్‌కు మూడు వైపులా సరిహద్దుగా ఉన్న ఇండి యాలోకి అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులు ప్రవేశించారు. హసీనా హయాంలో ఉగ్రవాద నిరోధకత, ప్రాంతీయ సంధాయకత అంశాల్లో ఇండియాకు బంగ్లాదేశ్ అత్యంత సన్నిహిత భాగస్వామిగా ఉండేది. ఆమె ప్రభుత్వం కూలిపోవడం... వ్యూహాత్మక ప్రయోజ నాల పరంగా ఇండియాకు గట్టి దెబ్బ. ఇప్పుడు ఆ వైపున కూడా సరిహద్దు భద్రత పెంచడం అనివార్యం అయ్యింది. లేదంటే, బంగ్లా దేశ్ నుంచి కూడా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే ప్రమాదం పొంచివుంది.హసీనా పదవీచ్యుతి వల్ల ఎదురు కానున్న ప్రమాదాలను ఇండియా తక్షణం గుర్తించినప్పటికీ, అమెరికా అందుకు విరుద్ధంగా ఆ మార్పును స్వాగతించింది. అయితే, బంగ్లాదేశ్ ఇదే పంథాను కొనసాగిస్తే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ సుస్థిరత సౌభాగ్యాల కోసం యూఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న కృషి కొరగాకుండా పోతుంది. సుదూర దేశాలను సైతం ముగ్గులోకి దించే మరో అంత ర్జాతీయ స్థాయి ఉద్రిక్త కేంద్రంగా బంగ్లాదేశ్ అవతరిస్తుందని పరి శీలకులు హెచ్చరిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలు, మత స్వేచ్ఛ, ప్రాంతీయ సుస్థిరతలను పరిరక్షించాల్సిన తక్షణ అవసరాన్ని అంతర్జాతీయ సమాజం సీరియస్‌గా తీసుకోవాలి, బంగ్లాదేశ్ అధః పతనాన్ని ఇక ఎంత మాత్రం ఉపేక్షించకూడదు.బ్రహ్మ చేలానీ వ్యాసకర్త న్యూఢిల్లీలోని ‘సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్’ ఎమిరెటస్ ప్రొఫెసర్ (‘ప్రాజెక్ట్ సిండికేట్’ సౌజన్యంతో) -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. విద్యార్థుల ప్రాణం తీసిన ఈత సరదా
సాక్షి,అన్నమయ్య: ఈత సరదా విద్యార్థులు ప్రాణాలు తీసింది. అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ముగ్గురు ఎంబీఏ విద్యార్థులు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. రాయచోటి రహదారి బాలరాజుపల్లి సమీపంలో ఉన్న చెయ్యేరు ఇసుక క్వారీ గుంతలో ఈతకొట్టేందుకు విద్యార్థులు వెళ్లారు. అయితే ఈత కొట్టే సమయంలో ప్రమాదవశాత్తు విద్యార్థులు క్వారీ గుంతలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మృతి చెందిన వారిలో సోంబత్తిన దిలీప్(22) గాలివారిపల్లి రాజంపేట మండలం,కొత్తూరు చంద్రశేఖర్ రెడ్డి(22) మంటపంపల్లి ఒంటిమిట్ట మండలం. పెన్నరోతు కేశవ (22) పోరుమామిళ్లకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. విద్యార్థుల మరణంపై సమాచారం అందుకున్న రాజంపేట ఏ ఎస్పీ ,రెవిన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
కర్నూలు జిల్లాలో విషాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, తాడేపల్లి: కర్నూలు జిల్లాలో నీటికుంటలో పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందటం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి చెందారు. ఉజ్వల భవిష్యత్‌ను పొందాల్సిన విద్యార్థులు ఇలా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు.‘‘మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
కర్నూలు జిల్లాలో విషాదం.. ఆరుగురు విద్యార్థుల మృతి
సాక్షి, కర్నూలు జిల్లా: ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నీటి కుంటలో పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. మృతి చెందిన వారంతా ఐదవ తరగతి చెందిన విద్యార్థులే. ఈత కోసం వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు.చిగలి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు స్కూల్ ముగిసిన అనంతరం.. గ్రామ శివారులోని నీటి కుంటలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లారు. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుంటలో భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో కుంటలో ఈతకు దిగిన విద్యార్థుల్లో ఆరుగురు చెరువులో మృత్యువాత పడ్డారు. మరో విద్యార్థి గ్రామస్థులకు ప్రమాదం గురించి సమాచారం ఇచ్చాడు. ఆరుగురు చిన్నారులు మృతి చెందడంతో చిగలిలో విషాదం నెలకొంది. -
గ్రేడ్ పేరెంట్స్ కాదు.. గ్రేట్ పేరెంట్స్!
పిల్లలు చక్కగా చదువుకుని, మంచి మార్కులు తెచ్చుకుని, పెద్ద ఉద్యోగం సంపాదిస్తే తల్లిదండ్రులకు ఎంత సంతోషం! నిజమే కానీ, కొన్నిసార్లు రేయింబవళ్లు కష్టపడి చదివినా కూడా పిల్లలు మంచి మార్కులు సాధించలేరు. అప్పుడు చూడాలి తల్లిదండ్రుల బాధ! ఆ బాధలో పిల్లల్ని కోప్పడతారు, అరుస్తారు. మాట్లాడ్డం మానేస్తారు. ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడతారు. ఆ మాటకు పిల్లలు ఎంత బాధపడతారో ఆలోచించరు. కానీ ఇప్పుడీ పరిస్థితి క్రమంగా మారుతోంది! -సాక్షి, స్పెషల్ డెస్క్మార్కులు తగ్గినందుకో, పరీక్ష తప్పినందుకో తల్లిదండ్రులు కోపంతో ఊగిపోవటం అన్నది ప్రతి ఇంట్లోనూ ఉండేదే. అయితే ఇప్పుడిప్పుడు కొందరు పేరెంట్స్ పిల్లల తరఫున ఆలోచిస్తున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో పిల్లలు విస్తృతంగా షేర్ చేస్తున్న తమ అనుభవాలను బట్టి తెలుస్తోంది. కర్ణాటకలోని ఒక కుటుంబం.. బోర్డు పరీక్షల్లో ఆరు సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ అయిన తమ కుమారుడుని ప్రోత్సహించడానికి నలుగుర్నీ పిలిచి ‘కేక్ కటింగ్’ చేశారు. కొడుకుని అక్కున చేర్చుకున్నారు. ‘ఈసారి వస్తాయిలే..!’తక్కువ మార్కులు వచ్చినందుకు అమ్మానాన్న తమని కొట్టకుండా, తిట్టకుండా ఎంత ప్రేమగా చూసుకున్నారో వెల్లడిస్తూ పిల్లలు సోషల్ మీడియాలో షేర్ చేసే కథనాలు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి. ఎన్ని మార్కులు వచ్చాయో తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదు.. పిల్లల కష్టాన్ని అర్థం చేసుకుంటున్నారు. ‘ఈసారి మంచి మార్కులు వస్తాయిలే’ అని తల నిమురుతున్నారు. వారిలో ధైర్యం నింపుతున్నారు. పిల్లలు అప్పటికీ అదేపనిగా బాధపడుతుంటే వారి ధ్యాసను మళ్లించటానికి బయటికి తీసుకెళుతున్నారు. ఇది మంచి పరిణామంబోర్డు పరీక్ష ఫలితాల సమయంలో తమ తల్లిదండ్రులు తమకు ఎంతలా మద్దతు ఇచ్చారో చెబుతూ విద్యార్థులు సోషల్ మీడియాలో పంచుకుంటున్న అనుభవాలు బాగా వైరల్ అవుతున్నాయి. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు వహించవలసిన పాత్ర ఏమిటన్న దాని గురించి సంభాషణలు కూడా మొదలయ్యాయి. అవి మిగతా తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఆ సంభాషణల్లో సైకాలజిస్టులు కూడా ఉత్సాహంగా పాలు పంచుకుంటున్నారు. ‘ఇది చాలా మంచి పరిణామం’ అంటున్నారు మనో వైజ్ఞానిక నిపుణులు.‘కేక్, పిజ్జా తెప్పించారు’ఇటీవల, పరీక్షల్లో 83 శాతం మార్కులు స్కోర్ చేసిన సీబీఎస్సీ 10వ తరగతి విద్యార్థిని సోషల్ మీడియాలో తన పేరెంట్స్ గురించి ఇలా షేర్ చేసుకుంది. ‘‘ఇంకొంచెం ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే బాగుండేదని.. మా అమ్మ మొదట నిరాశపడింది. ఆ వెంటనే, బాగా స్కోర్ చేశావ్ అని సంతోషపడింది. నాన్న నన్ను దగ్గరకు తీసుకుని, ‘మార్కులకు, నిజ జీవితానికి సంబంధం ఉండదు. తక్కువ స్కోర్ చేసిన వారు కూడా గొప్ప జీవితాలను గడపొచ్చు’’ అని చెప్పారు. ఆ రోజు అమ్మానాన్న కేక్, నాకెంతో ఇష్టమైన పిజ్జా ఆర్డర్ చేశారు. నాకు తక్కువ మార్కులు వచ్చినప్పటికీ వారు నన్ను మనస్ఫూర్తిగా దగ్గరకు తీసుకున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను..’’ అని రాసింది. ‘ఇలాంటి చర్యలు పిల్లల్లో కాన్ఫిడెన్స్‌ను పెంచుతాయి’ అని ఆమె పోస్ట్ కింద ఒక సైకాలజిస్టు కామెంట్ పెట్టారు. ‘ముందే చెప్పేశా..’మరొక విద్యార్థిని, తక్కువ మార్కులు వచ్చినప్పుడు తన తల్లిదండ్రులు తనను ఎలా ఓదార్చారో గుర్తుచేసుకుంది. ‘‘కోప్పడితే పడనివ్వమని నా పేరెంట్స్‌కి మొదటే చెప్పేశాను. క్వొశ్చన్ పేపర్స్ అన్నీ కష్టంగా వచ్చాయి, సరిగా రాయలేదు, ఫెయిల్ అవుతాను అని చెప్పాను. ఆ క్షణం నుంచి, ఫలితాలు వచ్చే వరకు వాళ్లు అనుక్షణం నన్ను గమనిస్తూనే ఉన్నారు. ‘పోతే పోయిందిలే’ అని ధైర్యం చెబుతూ వచ్చారు. మొత్తానికి 62 శాతంతో పాసయ్యాను. అప్పుడు నాన్న నిరాశగా చూస్తూ అన్న మాట నాకు భలే నవ్వు తెప్పించింది. ‘అదేంట్రా ఫెయిల్ అవుతావని ఎన్నో ఆశలు పెట్టుకుంటే, ఇలా చేసేవేంటి!’ అన్నారు. అమ్మ కూడా నవ్వి నన్ను దగ్గరకు తీసుకుంది’ అని ఆ అమ్మాయి షేర్ చేసింది. ‘ఆంటీ, అంకుల్ సూపర్’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ మీద కామెంట్లు!వెల్డన్ పేరెంట్స్» తల్లిదండ్రులలోని ఈ సానుకూల వైఖరిని విద్యావేత్తలు, మానసిక ఆరోగ్య నిపుణులు స్వాగతిస్తున్నారు. వాళ్లు ఇంకా ఏమంటున్నారంటే..» పిల్లలు మంచి మార్కులు తెచ్చుకున్నా, తెచ్చుకోలేకపోయినా వారు తమ శక్తి మేరకు కష్టపడ్డారని తల్లి దండ్రులు గుర్తించటం, వారిలో నిరుత్సాహం తలెత్తకుండా దగ్గరకు తీసుకోవటం మంచి విషయం.» పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే.. పరీక్షలే జీవితం కాదు. ఒకసారి విఫలమైపోతే జీవితం అక్కడితో ఆగిపోదు. మార్చి పోతే సెప్టెంబర్ ఎప్పుడూ ఉంటుంది. మళ్లీ రాయొచ్చు.. ఉత్తీర్ణులు కావచ్చు. కానీ, జీవితం పోతే.. మళ్లీ రాదు.» పిల్లల్లో ఆత్మవిశ్వాసం పోతే మళ్లీ అంకురించడం అంత సులభం కాదు. తల్లిదండ్రులు పిల్లలను తిట్టేశాక.. గాయపడిన లేత మనసు కోలుకోవడం చిటికెలో జరిగిపోదు. అది ఈ తరం తల్లిదండ్రులు గ్రహిస్తున్నారు.» తల్లిదండ్రులు కూడా ఒకప్పుడు విద్యార్థులే. వాళ్లూ.. ఈ మార్కులు తక్కువ రావడాలు, ఫెయిలవడాలు.. అన్నీ చూసే ఉంటారు. కానీ, వాళ్లు చదివేటప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు పిల్లలకు తాము అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా, అంతంత డబ్బు వాళ్ల కోసం ఖర్చు చేస్తున్నా వారు రాణించకపోవడాన్ని చాలామంది తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది మారాలి.» కొంతమంది మాత్రం.. ఫెయిల్యూర్ జీవితాలను ఎలా మార్చిందో ప్రముఖుల జీవితాలను ఉదాహరణలుగా తమ పిల్లలకు చెబుతున్నారు. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోకుండా కాపాడుకుంటున్నారు.» తిట్టినంత మాత్రాన మార్కులు పెరగవు, ఫెయిలైనవారు పాసైపోరు అని తెలుసుకుంటున్నారు.» ఇతరులతో పోల్చినంత మాత్రాన.. ఉన్నపళంగా తమ బిడ్డలో మార్పు వచ్చేయదు. పిల్లలను మనమే నలుగురిలో చులకన చేస్తే వారు రేపు తలెత్తుకుని ఎలా తిరగగలరు అని ఆలోచిస్తున్నారు. -
యాజమాన్య కోటా.. సగానికిపైగా ఖాళీ
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్లు భారీగా మిగిలిపోయే అవకాశం కన్పిస్తోంది. టాప్ కాలేజీలకే విద్యార్థులు ప్రాధాన్యమిస్తున్నారు. జిల్లాలు, రాజధాని పరిసర ప్రాంతాల్లోని సాధారణ కాలేజీల్లో చేరేందుకు మొగ్గు చూపడం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు 180 ఉన్నాయి. వీటి పరిధిలో కన్వీనర్, మేనేజ్మెంట్ కోటా సీట్లు 1,16,877 ఉన్నాయి. ఇందులో కన్వీనర్ కోటా కింద 90,921 సీట్లు ఉన్నాయి. 156 ప్రైవేటు కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా కింద 25,956 సీట్లు ఉన్నాయి. టాప్ టెన్ కాలేజీల్లో దాదాపు 7 వేల సీట్లు ఉన్నాయి. కన్వీనర్ కోటా సీట్లే ఇంకా 11,638 మిగిలిపోయాయి. యాజమాన్య కోటా సీట్లు అన్ని కాలేజీల్లో కలిపి 8 వేలకు మించి భర్తీ అవ్వలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. టాప్ టెన్ కాలేజీల్లో కూడా యాజమాన్య కోటాలో కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సులకే ఎక్కువ డిమాండ్ కనిపించింది. ఈసీఈ, సివిల్, మెకానికల్, ఈఈఈ బ్రాంచీల్లో సీట్లు మిగిలిపోయాయి. 15 వేల సీట్ల భర్తీ కూడా కష్టమే యాజమాన్య కోటాలో ఉన్న 25,956 సీట్లలో స్పాట్ అడ్మిషన్లు పూర్తయ్యే వరకు 15 వేల సీట్లు భర్తీ అవ్వడం కూడా కష్టమేనని యాజమాన్యాలు అంటున్నాయి. టాప్ టెన్ కాలేజీల్లో సీఎస్ఈ, ఎమర్జింగ్ కోర్సుల్లో ఒక్కో సీటుకు రూ.12 నుంచి రూ.19 లక్షల వరకు వసూలు చేశారని సమాచారం. ఇతర బ్రాంచీల్లో రూ.5 లక్షలకు సీటు ఇస్తామన్నా కాస్త మంచి ర్యాంకు ఉన్న విద్యార్థులు ముందుకు రావడం లేదు. సివిల్, మెకానికల్ కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద ఉండే వార్షిక ఫీజుతోనే కొన్ని కాలేజీలు విద్యార్థులను చేర్చుకున్నాయి. సాధారణ కాలేజీల్లో సీఎస్ఈ సీటుకు రూ.3 లక్షలకు మించి డిమాండ్ రావడం లేదు. జిల్లాలు, గ్రామీణ ప్రాంత కాలేజీల్లో కన్వీనర్ కోటా ఫీజుకే సీఎస్ఈ సీటు ఇస్తామన్నా విద్యార్థులు ముందుకు రావడం లేదు. దీంతో విద్యార్థులను ఆకర్శించేందుకు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు పీఆర్ఓలు, కన్సల్టెన్సీలు, ఏజెన్సీలను రంగంలోకి దించాయి. వీటికి ఒక్కో విద్యార్థి ఫీజులో సాధారణ కాలేజీలు 30 శాతం కమీషన్ ఇస్తుంటే, మరికొన్ని 40 శాతం వరకూ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. -
పదిలో ముగ్గురే గ్రాడ్యుయేట్లు!
పదిలో ముగ్గురే.. అవును మీరు చదువుతున్నది నిజమే. దేశంలో పది మంది యువతలో ముగ్గురు మాత్రమే డిగ్రీ, ఆపై వరకు చదువుకున్నారు. మిగిలిన వారంతా ఇంటర్/డిప్లొమాకే పరిమితమవుతున్నారు. దేశంలో 15–29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత సుమారు 42 కోట్ల మంది ఉన్నారు. మొత్తం జనాభాలో వీరి వాటా దాదాపు 29%. వీరిలో సుమారు కోటికిపైగా నిరక్షరాస్యులు ఉన్నారు.ఒక వ్యక్తి ఆలోచనలను తీర్చిదిద్దడంలో సహాయపడే కీలక అంశాల్లో విద్య ఒకటి. ముఖ్యంగా యువత.. దేశంలో ఉత్పాదక శక్తులుగా, విలువైన మానవ వనరులుగా, వినూత్న పౌరులుగా మారడానికి వీలు కల్పించే ఆయుధం కూడా అదే. అలాంటి విద్య.. ప్రత్యేకించి ఉన్నత విద్య మనదేశంలో ఇప్పటికీ గ్రామీణులకు అందని ద్రాక్షలానే ఉంది.అక్షరాస్యత స్థాయులు స్థిరంగా పెరుగుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్న విద్య నాణ్యత ఇప్పటికీ ఆశించిన స్థాయిలో లేదని ‘పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కంజ్యూమర్ ఎకానమీ’ (పీఆర్‌ఐసీఈ) విడుదల చేసిన ‘నావిగేటింగ్ ది యూత్ ఫ్రాంటియర్’ అనే పరిశోధనా పత్రం వెల్లడించింది. ఈ విషయంలో పట్టణాలకు, పల్లెలకు మధ్య అసమానత స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది.ఉన్నత చదువులు పట్టణాలకే..దేశవ్యాప్తంగా 2024–25 నాటికి మొత్తం యువతలో 24% మంది.. అంటే సుమారు 9.9 కోట్ల మంది డిగ్రీ పూర్తి చేశారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల వారి వాటా 52 శాతం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా దాదాపు 3 కోట్ల మంది అందుకున్నారు. వీరిలో 66 శాతం పట్టణవాసులే కావడం గమనార్హం. ఇతర ఉన్నత చదువులు చదివిన 20 లక్షల మంది యువతలో పట్టణ ప్రాంతాలవారు ఏకంగా 85 శాతం ఉన్నారు.అంటే ఉన్నత చదువులు పట్టణాలకే పరిమితం అవుతున్నట్టు స్పష్టం అవుతోంది. మొత్తం యువతలో ప్రాథమిక విద్య అభ్యసించిన వారు 7.3 కోట్లు (17%), మెట్రిక్ 7.6 కోట్లు (18%), ఇంటర్ 9.3 కోట్లు (22%), టెక్నికల్/డిప్లొమా చేసినవారు 3.6 కోట్లు (9%) ఉన్నారు. యూత్‌లో 3% అంటే 1.3 కోట్ల మంది నిరక్షరాస్యులుగా మిగిలిపోయారు. ప్రాంతాలవారీగా చూస్తే డిగ్రీ, ఆపై చదువులు చదివిన వారు దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా ఉన్నారు. -
దోస్త్ రిపోర్టింగ్ గడువు 12 వరకు పెంపు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో సీట్లు పొందిన వారు కాలేజీల్లో రిపోర్ట్ చేసే గడువును పొడిగించినట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి శుక్రవారం తెలిపారు. ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు 6వ తేదీ వరకూ రిపోర్టు చేయాల్సి ఉంది.దీన్ని ఈ నెల 12 వరకూ పొడిగించారు. స్పాట్ అడ్మిషన్ల గడువును కూడా 14వ తేదీ వరకూ పెంచినట్టు తెలిపారు. వర్షాల కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి చెప్పారు. -
హైస్కూల్ రోజుల నుంచే స్టార్టప్ ఐడియాలు!
యూనివర్శిటీ, కాలేజీ విద్యార్థుల స్టార్టప్‌ల గురించి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు యూనివర్శిటీ, కాలేజీల నుంచి మాత్రమే కాదు ఉన్నత పాఠశాలలు కూడా స్టార్టప్ ఐడియాలకు కేంద్రం అవుతున్నాయి. ఇటీవల దిల్లీ–ఎన్సీఆర్ విద్యార్థి సదస్సులో పాల్గొన్న విద్యార్థులు డెమో యాప్‌ల గురించి వివరించడంతోపాటు తమ ఫ్యూచర్ స్టార్టప్‌లకు సంబంధించి ఆలోచనలు పంచుకున్నారు. వారి మాటల్లో ఉత్సాహం మాత్రమే కనిపించలేదు. నిర్మాణాత్మక ప్రణాళిక కనిపించింది.నో–కోడ్ టూల్స్, ఏఐ అసిస్టెంట్స్, గ్లోబల్ బ్యాంక్ రిసోర్స్ ఇన్స్టంట్ యాక్సెస్... మొదలైన కారణాల వల్ల గతంతో పోల్చితే స్టార్టప్ ఆలోచన పట్టాలు ఎక్కించడం సులభం అయింది. స్టార్టప్‌లను ఎలా నిర్మించాలి, అస్థిరపరిస్థితులను ఎలా అధిగమించాలి, ఇతరులతో ఎలా కలిసి పనిచేయాలి, ఒకవేళ ఫెయిల్యూర్ ఎదురైతే దానిని అధిగమించి తిరిగి ఎలా వెనక్కి రావాలి... మొదలైన విషయాల గురించిపాఠ్యపుస్తకాల నుంచి నేర్చుకోనప్పటికీ వాటిపై హైస్కూల్ స్థాయి విద్యార్థులకు తగినంత అవగాహన ఉండడం విశేషం. చదవండి: ‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లుతమ కలలను సాకారం చేసుకోవడానికి స్కూల్లో నిర్వహించే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్ విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయి. పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొనే మానసిక సమస్యలు, పర్యావరణహిత ఆలోచనల ఆధారంగా స్టార్టప్ ఆలోచన చేస్తోంది యువతరం.ఇదీ చదవండి: ఖరీదైన పెళ్లి : 11.5 కిలోల వెడ్డింగ్ గౌను, గోల్డ్‌బాక్స్ రిటన్ గిఫ్ట్స్ -
పైసలు కడితేనే ప్రవేశం
కే.నవీన్ కుమార్ అనే ఎస్సీ కేటగిరీ విద్యార్థి టీజీఈఏపీసెట్–2025లో ర్యాంకు సాధించి మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సాధించాడు. మూడు రోజుల క్రితం కాలేజీలో రిపోర్టు చేసేందుకు వెళ్లాడు. నూరుశాతం ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందన్న ధీమాతో వెళ్లిన అతడికి కాలేజీ యాజమాన్యం మాటలతో దిమ్మ తిరిగి పోయింది. ట్యూషన్ ఫీజు, ఇతర నిర్వహణ ఫీజులు కలిపి రూ.1.25 లక్షలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యం తేల్చిచెప్పింది. తనకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని చెప్పినప్పటికీ..ఆ డబ్బు విద్యార్థి వ్యక్తిగత ఖాతాలోనే జమ చేస్తారని, ఇప్పుడు ఫీజు చెల్లించాల్సిందేనని స్పష్టం చేయడంతో దిక్కు తోచని స్థితిలో పడిపోయాడు. సీటును కాపాడుకొనేందుకు అప్పుచేసి ఎలాగోలా ట్యూషన్ ఫీజు చెల్లించాడు.మాసాబ్‌ట్యాంక్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ – సైఫాబాద్‌లో బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతన్న ఎస్సీ విద్యారి్థకి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద అర్హత ఉన్నప్పటికీ.. మూడు సంవత్సరాలకు సంబంధించిన ట్యూషన్ ఫీజు రూ.75వేలు (ఏటా రూ.25 వేల చొప్పున) చెల్లించాలని కాలేజీలో ఆదేశించింది. ఫీజు చెల్లించకపోతే క్లాసులకు అనుమతించబోమని స్పష్టం చేసింది. త్వరలో జరిగే సెమిస్టర్ పరీక్షల హాల్ టిక్కెట్లు కూడా ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన సదరు విద్యారి్థ.. ఫీజు డబ్బుల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) విద్యార్థులకు పోస్టుమెట్రిక్ ఫీజుల చెల్లింపుల విధానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మార్పులు వారి నెత్తిన పిడుగుపాటుగా మారాయి. ఎస్సీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తించినప్పటికీ.. వారు పూర్తి ఫీజును ముందుగా చెల్లిస్తేనే కాలేజీలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. రెండు, మూడో సంవత్సరం ట్యూషన్ ఫీజులను సైతం విద్యా సంవత్సరం మొదట్లోనే వసూలు చేస్తున్నాయి. లేదంటే తరగతులకు అనుమతించటం లేదు. ప్రైవేటు కాలేజీలతోపాటు ప్రభుత్వ కాలేజీలు కూడా ఇదే కండిషన్లు పెడుతుండటంతో విద్యార్థులు వేలు.. లక్షల రూపాయలు అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్నారు. ఫీజుల కోసం అప్పులపాలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద ఏటా సగటున 12.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేస్తున్నారు. వీరిలో ఎస్సీ విద్యార్థులు 2 లక్షల మంది వరకు ఉంటారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సీ విద్యార్థులు 1,22,205 (రెన్యూవల్స్), 77,722 (ఫ్రెషర్స్) దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులు విద్యార్థులు 45 వేల మంది ఉన్నారు. జనరల్ కోర్సుల ఫీజులు రూ.వేలల్లో ఉండగా.. ఇంజనీరింగ్, వృత్తివిద్యా కోర్సుల ఫీజులు రూ.లక్షలకు చేరాయి. ఇంత పెద్దమొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని కాలేజీలు ఒత్తిడి చేయడంతో విద్యార్థులకు తీవ్ర భారంగా మారుతోంది. చదువును కొనసాగించాలంటే తప్పనిసరిగా అప్పులు చేయాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం ఇవ్వాలని వేడుకున్నా.. కాలేజీ యాజమాన్యాలు ఒప్పుకోటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నిబంధనల మార్పుతో మొదటికే మోసం.. పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ప్రభుత్వాలు మార్పులు తీసుకొచ్చాయి. ఎస్సీ విద్యార్థుల ఫీజులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో చెల్లిస్తున్నాయి. గతంలో కేంద్రం తన వాటా ఫీజు నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను కలిపి కాలేజీలకు నేరుగా చెల్లించేది. ఈ విధానాన్ని మార్చి ఫీజులో తన వాటాను నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాకే బదిలీ చేయాలని కేంద్రం నిర్ణయించింది.ఆ మేరకు విద్యార్థి వివరాలను ఈపాస్ ద్వారా లింక్ చేసుకుని నిధులు విడుదల చేస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా ఫీజును విద్యార్థి ఖాతాలోనే జమ చేస్తోంది. ఈ పథకం ప్రయోజనాలను లబి్ధదారులకు నేరుగా అందించేందుకే ఈ మార్పులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ఫీజు విద్యార్థి ఖాతాలో జమ కావటానికి కొంత సమయం పడుతుంది. ఫీజు బ్యాంకు ఖాతాలో జమ అయిన తర్వాత దానిని విద్యార్థి నుంచి కాలేజీలు తీసుకోవాలి. కానీ, అప్పటివరకు ఆగకుండా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఫీజు మొత్తం వసూలు చేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. -
దుక్కి దున్ని.. నాట్లు వేసి
నర్సాపూర్ రూరల్: ట్రాక్టర్‌తో దుక్కి దున్ని నాట్లు వేశారు మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థినులు. మండలంలోని అవంచలో బుధవారం రైతులతో కలిసి పొలం బాట పట్టారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి రైతుల దిగుబడిని పెంచే విధంగా తమ సేవలను అందించడానికే వ్యవసాయ విద్యను ఎంచుకున్నట్లు తెలిపారు. అనంతరం రైతులకు నూతన వ్యవసాయ సాగు పద్ధతులను వివరించారు.ఎప్పుడు దారి కొచ్చేనో..?మున్సిపాలిటీ పరిధిలోని హన్మంతాపూర్‌కు వెళ్లాలంటే అవస్థలు తప్పడం లేదు. అక్కడికి వెళ్లడానికి నర్సాపూర్ నుంచి రెండు మార్గాలున్నాయి. ఒకటి నర్సాపూర్–తూప్రాన్ రహదారి నుంచి ఉండగా, మరోటి నర్సాపూర్‌లోని జగన్నాథరావు కాలనీ నుంచి ఉంది. రెండు రోడ్లు గుంతలమయంగా మారగా, కనీస మరమ్మతులు కరువయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురిసినప్పుడు గుంతల్లో నీరు నిలుస్తుందన్నారు. వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
లోకలెవరు? కానిదెవరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో రాష్ట్ర కోటా కింద సీట్ల భర్తీలో నెలకొన్న ‘స్థానికత’వివాదంపై ఉత్కంఠ వీడటం లేదు. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం వాదనలు ముగిసినప్పటికీ, తీర్పును రిజర్వు చేసింది. దీంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో దేశంలో ఎక్కడా లేని స్థానికత వివాదం తెలంగాణలోనే ఎందుకు వచ్చిందనే చర్చ మొదలైంది. ఉమ్మడి ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 2017 తీసుకొచ్చిన జీఓ 114లో మార్పులు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 33తో వివాదం మొదలైంది. ఈ జీవో వల్ల తెలంగాణకు ఉన్న సానుకూలత ప్రతికూల తలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి. జీవో 33తో మొదలు..ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా ఏపీ విద్యార్థులకు పదేళ్లపాటు తెలంగాణలోని విద్యా సంస్థల్లో కల్పించిన 15 శాతం రిజర్వే షన్ 2023 విద్యా సంవత్సరంతో ముగిసింది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 85%, ప్రైవేటు కళాశాలల్లో 50%సీట్లను తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, మెడికల్ కాలేజీల్లో లోకల్, నాన్ లోకల్ కోటాను నిర్ణయించే నిబంధనలతో 2017లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం జీఓ 114ను జారీచేసింది. ఆ జీఓను సవరిస్తూ గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం జీఓ 33ను తీసుకొచ్చింది. జీఓ 114 ఏముంది? ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో స్థానికతను నిర్ధారిస్తూ 2017 జూలై 5న బీఆర్ఎస్ప్రభుత్వం ఈ జీఓను తీసుకొచ్చింది. దీనిలో స్థానికత నిర్ధారణకు రెండు క్లాజ్‌లను పొందుపరిచారు. మొదటి క్లాజ్ ప్రకారం 6వ తరగతి నుంచి 12 వరకు కనీసం 4 ఏళ్లపాటు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులుగా పరిగణిస్తారు. రెండో క్లాజ్ ప్రకారం 9వ తరగతి నుంచి 12వ తరగతి (ఇంటర్) వరకు ఒకే దగ్గర చదివిన విద్యార్థులను స్థానికులుగా గుర్తిస్తారు. ఈ రెంటిలో ఏది ఉన్నా స్థానికులే. జీఓ 33లో ఏముంది? రేవంత్‌రెడ్డి ప్రభుత్వం జీఓ 114ను సవరిస్తూ 2024 జూలై 19న ఈ జీఓను తీసుకొచ్చింది. 114 జీఓలోని మొదటి క్లాజ్ (6 నుంచి 12 తరగతి వరకు ఎక్కడ నాలుగేళ్లు చదివితే అక్కడే స్థానికులు అనే నిబంధన) జీఓ 33 ద్వారా తొలగించారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదివిన వారే స్థానికులు అని స్పష్టం చేశారు. జీఓ 114 దుర్వినియోగం జీఓ 33 ఆధారంగానే గత సంవత్సరం కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం మెడికల్ సీట్ల కౌన్సెలింగ్ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వారందరికీ తహసీల్దార్ ఇచ్చే నివాస ధ్రువీకరణ పత్రం ఆధారంగా సీట్లు కేటాయించాలని కోర్టు ఆదేశించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ వాదనలు జరుగుతుంగానే ఈ ఏడాది కూడా కాళోజీ వర్సిటీ జీఓ 33 ప్రకారమే ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానించడంతో గత నెల 24న సుప్రీంకోర్టు కేసును విచారించి, స్థానికత అంశం తేలే వరకు పాత నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని వర్సిటీని ఆదేశించింది. కాగా, 6 నుంచి 12వ తరగతి వరకు నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికత అనే నిబంధనతో మెడికల్ సీట్లలో భారీగా అక్రమాలు జరిగినట్లు కాళోజీ యూనివర్సిటీ 2023లో గుర్తించింది. ఏపీకి చెందిన పలువురు విద్యార్థులు 6 నుంచి 9 వరకు (నాలుగేళ్లు) తెలంగాణలో చదివినట్లు ప్రైవేటు స్కూళ్ల నుంచి నకిలీ స్టడీ, బోనఫైడ్ సర్టిఫికేట్లు తెచ్చి ఎంబీబీఎస్ సీట్లు పొందినట్లు తేల్చి ఏడుగురి సీట్లను రద్దు చేసింది. ఈ అక్రమాలను నివారించేందుకు బోర్డు పరీక్షలు ఉన్న 10వ తరగతిని తప్పనిసరి చూస్తూ 9 నుంచి 12 (ఇంటరీ్మడియట్) తరగతులు తెలంగాణలో చదివితేనే స్థానికులుగా పేర్కొంటూ ప్రభుత్వం జీఓ 33ను తెచ్చింది. జీఓ 33తో తెలంగాణవారూ నాన్ లోకల్ జీవో 33 వల్ల కొందరు తెలంగాణ విద్యార్థులు కూడా లోకల్ స్టేటస్ కోల్పోవటంతో వివాదం ముదిరింది. నల్లగొండ, ఖమ్మం, గద్వాల జిల్లాలకు చెందిన తెలంగాణ విద్యార్థులు 10వ తరగతి వరకు స్థానికంగా చదివి, ఇంటర్మీడియట్ ఏపీలో చదివారు. వారు జీఓ 33 ప్రకారం స్థానికులు కాదు. -
‘ఆర్టీఈ అడ్మిషన్ల’తో సర్కారు ఆటలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుతోంది. సకాలంలో ఒక్క నిర్ణయం తీసుకోకుండా పేద పిల్లలకు తీవ్ర అన్యాయం చేస్తోంది. ఇప్పటికే ఫీజుల ఖరారులో తీవ్ర జాప్యం చేసింది. ఆ సాకుతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆర్టీఈ కింద అడ్మిషన్లు నిరాకరించినా చోద్యం చూస్తోంది. ప్రభుత్వ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తడంతో మరోసారి ఆర్టీఈ కింద అడ్మిషన్ల పేరుతో కొత్త నాటానికి తెరతీసింది. ఐదు కిలో మీటర్ల పరిధిలో ఉన్న స్కూళ్లలో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సోమవారం నోటిఫికేషన్ ఇచి్చంది. జూన్‌లోనే పూర్తవ్వాల్సిన అడ్మిషన్ల ప్రక్రియను ఆగస్టులోనూ కొనసాగించడం గమనార్హం. నష్టం జరిగాక తీరిగ్గా ఫీజుల నిర్ణయం ఆర్టీఈ చట్టం–2009 కింద ప్రైవేటు స్కూళ్లల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలి. ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర విభాగం ప్రతి విద్యా సంవత్సరం మే నెలలో నోటిఫికేషన్ ద్వారా ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తుంది. అర్హత గల విద్యార్థులకు లాటరీ పద్ధతిలో సీట్లు కేటాయిస్తుంది. గత మూడు విద్యా సంవత్సరాలు సక్రమంగా జరిగిన ఈ ప్రక్రియ 2025–26లో మాత్రం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అస్తవ్యస్తంగా మారింది. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో రెండు విడతల్లో 31,701 మంది పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో ఒకటో తరగతిలో సీట్లు కేటాయించారు.అయితే, ప్రభుత్వం చెల్లించే ఫీజులను సకాలంలో ఖరారు చేయలేదు. దీంతో ఆయా స్కూళ్ల యాజమాన్యాలు ఆర్టీఈ కింద అడ్మిషన్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పాయి. పాఠశాలలు ప్రారంభమై నెల గడిచిపోవడంతో జూలైలో కొందరు పూర్తి ఫీజు చెల్లించి అడ్మిషన్లు తీసుకున్నారు. ఆ తర్వాత తీరిగ్గా ప్రభుత్వం జూలై 24వ తేదీన ఫీజులు ఖరారు చేసింది. అప్పటికే విద్యార్థులకు నష్టం జరిగిపోయింది. మొత్తంమ్మీద 31,701 మందిలో సగం మందే ఆర్టీఈ కింద సీట్లు పొందినట్లు సమాచారం. ఇప్పుడు అడ్మిషన్లు ఇస్తాం.. ఫీజు కట్టుకోండి.. ఇప్పటి వరకు ఆర్టీఈ కింద సీట్లు పొందేందుకు విద్యార్థుల ఇళ్లకు 3 కి.మీ. పరిధిలోని ప్రైవేటు స్కూళ్లకే అవకాశం ఉంది. ఆ పరిధిని 5 కి.మీ. వరకు పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఐదు కిలో మీటర్ల పరిధిలోని ప్రైవేటు స్కూళ్లల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఆసక్తి చూపేవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పుడు ఆర్టీఈ కింద సీట్లు పొందేవారు ఫీజును స్వయంగా చెల్లించుకుంటామని రాసివ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వాస్తవానికి పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు కావొస్తోంది. ఈ నెల 11వ తేదీ నుంచి ఎఫ్ఏ–1 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం ఇంకా ఆర్టీఈ ప్రవేశాలను పూర్తి చేయలేకపోవడం విడ్డూరంగా ఉందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. -
స్కూల్లో కూలి పనులు చేయిస్తున్నారు
నరసాపురం/మైలవరం: ‘మా పాఠశాలలో ఫీజు మొత్తం ఒకేసారి కట్టినవారిని ఒకలా చూస్తున్నారు. విడతలవారీగా కట్టేవారిని మరోలా చూస్తూ కూలి పనులు చేయిస్తున్నారు...’ అంటూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని పంజా సెంటర్లో ఉన్న నారాయణ స్కూల్ విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. పాఠశాల నిర్వాహకుల వేధింపులు అధికమయ్యాయంటూ విద్యార్థులు గేటుకు తాళం వేసి ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలిసి స్కూల్ వద్దకు పట్టణ ఎస్ఐ జయలక్ష్మి, పోలీసులు వచ్చారు.‘ఫీజులు కట్టకపోతే సిబ్బందికి జీతాలు ఎలా ఇస్తారు...’ అంటూ ఎస్ఐ స్కూల్ యాజమాన్యానికి అనుకూలంగా మాట్లాడటంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఫీజులు చెల్లించకపోతే తల్లిదండ్రులను అడగాలి. మాతో చెత్త ఎత్తించడం, గ్రౌండ్లో మొక్కలు కోయించడం, బెంచీలు మోయించడం వంటి పనులు ఎందుకు చేయిస్తున్నారు? మంత్రి పాఠశాల కాబట్టి ఎస్ఐ వచ్చి యాజమాన్యానికి మద్దతుగా మాట్లాడుతున్నారా?’ అని నిలదీశారు. అదే సమయంలో గేటుకు విద్యార్థులు వేసిన తాళాన్ని పాఠశాల సిబ్బంది రాడ్డుతో పగలగొట్టి కొందరు పిల్లలను లోపలికి పంపారు. వారిని ఆందోళన చేస్తున్న విద్యార్థులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.దాదాపు రెండు గంటలపాటు విద్యార్థుల ఆందోళన అనంతరం పాఠశాల యాజమాన్యం తరఫు ప్రతినిధులు వచ్చి ఇకముందు విద్యార్థులకు ఎటువంటి పనులు చెప్పకుండా చూస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ రాజన్ క్షమాపణలు చెప్పారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఎస్ఎఫ్ఐ నాయకుడు ముచ్చర్ల త్రిమూర్తులు తదితరులు విద్యార్థులకు మద్దతు తెలిపారు. మైలవరంలో తల్లిదండ్రుల ఆందోళనఎన్టీఆర్ జిల్లా మైలవరం నారాయణ పాఠశాల ప్రిన్సిపాల్, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా అర్హులైనా తమ పిల్లలకు తల్లికి వందనం డబ్బులు పడలేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం పాఠశాల గేటు వద్ద ఆందోళన నిర్వహించారు. పాఠశాలల నుంచి విద్యార్థుల డేటాను ఎంఈవో కార్యాలయానికి పంపడంలో యాజమాన్యం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బలిపీఠంపై విద్యార్థుల భవిత
సాక్షి, అమరావతి: విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. అనాలోచిత నిర్ణయాలు, చట్టబద్ధత లేని జీవోలతో వారి బంగారు భవిష్యత్తును బలిచేస్తోంది. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల వేళ ‘స్థానికత’ను సవరించి ఇచ్చిన జీవోలను న్యాయస్థానం తోసిపుచ్చడంతో ప్రభుత్వ పరిపాలనలో డొల్లతనం బయటపడింది. ఫలితంగా ఇంజినీరింగ్‌తో పాటు ఐసెట్, ఈసెట్ కౌన్సెలింగ్‌లలో సీట్లు పొందిన లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంలో పడింది. తెలంగాణలో ఇంటర్మీడియెట్ చదివి.. ఏపీ ఈఏపీసెట్‌లో అర్హత సాధించిన ఏపీ విద్యార్థులను స్థానికేతరులుగా (అన్రిజర్వ్డ్) మాత్రమే గుర్తిస్తూ తొలి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయించింది.ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ఏపీలో పుట్టి పెరిగి, ఇక్కడే కుటుంబం నివాసం ఉంటున్నప్పుడు ఆ విద్యార్థులను ‘స్థానికులు’గా పరిగణించాలని తాజాగా తీర్పునిచ్చింది. దీంతో కంగుతిన్న ప్రభుత్వం ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటోంది. ఈ క్రమంలోనే అర్ధంతరంగా ఈఏపీసెట్ రెండో దశ సీట్ల కేటాయింపుతో పాటు ఏపీ పీజీఈసెట్ (ఎంటెక్) సీట్ల కేటాయింపును నిలిపివేసింది.విద్యార్థులకు న్యాయం జరిగేనా? జీవోల ప్రకారం విద్యాసంస్థల్లో స్థానికత కోటాలో 85 శాతం, స్థానికేతర (అన్రిజర్వ్డ్) కోటాలో 15 శాతం సీట్లు భర్తీకి అవకాశం కల్పించింది. అయితే, 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు నాలుగేళ్లు ఏపీలో చదివి.. ఇక్కడి స్థానికత ఉన్న విద్యార్థులను మాత్రమే స్థానిక కోటాలో సీట్లు కేటాయించింది. ఒక్క ఏడాది బయట చదివిన విద్యార్థులను స్థానికేతర కోటాలోకి నెట్టేసింది. ఫలితంగా ఈఏపీసెట్‌లో ర్యాంకు సాధించినప్పటికీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కోల్పోయారు. పైగా స్థానికేతర కోటా కావడంతో మంచి కళాశాలలో సీటు దక్కలేదు.ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇప్పటికే ఈఏపీసెట్ తొలి దశలో 1.18 లక్షల మందికి కనీ్వనర్ కోటాలో సీట్లు కేటాయింపు పూర్తయింది. న్యాయస్థానం తీర్పును అనుసరించి విద్యార్థులకు న్యాయం చేయాలంటే తొలి దశ కౌన్సెలింగ్‌లో మార్పు చేయాల్సి వస్తుంది. ఇదే జరిగితే విద్యార్థుల సీట్లలో భారీ మార్పులు తప్పని పరిస్థితి. అలా కాకుండా రెండో దశలో మాత్రమే అవకాశం కల్పిస్తామంటే.. తొలిదశలో మెరుగైన కళాశాలలో సీటు వచ్చే అవకాశాన్ని కోల్పోయినట్టే అవుతుంది.ఉదాహరణకు.. ఒక విద్యార్థికి స్థానిక కోటా కిందకి వస్తే ఎక్స్ అనే కళాశాలలో సీటు వస్తుందనుకుంటే.. తొలిదశలో ఆ కళాశాలలో అన్ని సీట్లు భర్తీ అయిపోతే.. రెండో కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పిస్తామంటే అక్కడ సీటు వచ్చే వీలు ఉండదు. పోనీ, విద్యార్థి కోరుకున్న కళాశాలకు నేరుగా సీటును మార్పు చేయడం కూడా నిబంధనలకు విరుద్ధం. పైగా కేవలం కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకున్న విద్యార్థులకే స్థానిక కోటాను వర్తింపజేస్తే.. మిగిలిన విద్యార్థులకు అన్యాయం చేసినట్టే. ఇంత గందరగోళం మధ్య ఏం చేయాలో తెలియన ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇది ఒక్క ఈఏపీసెట్కే కాకుండా ఇప్పటికే సీట్లు కేటాయింపు పూర్తయి తరగతులు ప్రారంభమైన ఐసెట్, ఈసెట్ విద్యార్థులకూ వర్తిస్తుంది. ఇలా ఏపీకి చెందిన విద్యార్థులు స్థానికేతర కోటా సీట్లు పొందితే వారికి ప్రభుత్వం ఎలా న్యాయం చేస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. ముందే హెచ్చరించిన ‘సాక్షి’..కూటమి ప్రభుత్వం విద్యాసంస్థల్లో స్థానికత మార్పు రాజ్యాంగానికి విరుద్ధంగా చేసిందంటూ ‘రాజ్యాంగ రక్షణలేని స్థానికత’ శీర్షికన తో మే 21 హెచ్చరించింది. పునర్విభజన చట్టం ప్రకారం గతేడాది పదేళ్ల గడువు ముగిసింది. దీనిని ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. వాస్తవానికి స్థానికత మార్పు అనేది ప్రభుత్వ ప్రధాన అజెండాగా ఉండాలి. దీనిపై కేబినెట్లో నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు అనుసరించేలా కామన్ ఆర్డర్‌ను తీసుకురావాలి. కానీ, కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది.ప్రవేశాలకు సమయం దగ్గర పడిన సమయంలో హడావుడిగా ఉన్నత విద్యాశాఖ ద్వారా వివిధ సెట్స్ నిర్వహణ కోసం పాత జీవోలను సవరిస్తూ స్థానికతను ఖరారు చేసింది. రాజ్యాంగంలో ఆరి్టకల్ 371డీ రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా పొందుపరిచిన అంశాలను రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే మార్పు చేయాలని, అప్పటివరకు ఆ అంశాలు ఉనికిలోనే ఉంటాయని రాజ్యాంగ నిపుణుల హెచ్చరికలను కూడా పట్టించుకోలేదు. వీటిని అనుసరించే హెల్త్ యూనివర్సిటీ, వ్యవసాయ, ఉద్యాన వర్సిటీలతో పాటు స్పెషల్ యూనివర్సిటీలు కూడా ఉత్తర్వులు ఇచ్చాయి. ఈ వర్సిటీల్లో కౌన్సెలింగ్ పూర్తయి స్థానికేతర కోటాలో సీట్లు పొందిన విద్యార్థులకు ఏవిధంగా న్యాయం చేస్తారో వేచిచూడాలి. ఏం చేసినా లాభం లేదా? ఏపీ విద్యార్థులు తెలంగాణలో ఇంటర్మీడియెట్ చదివినప్పటికీ.. ఉన్నత విద్య ప్రవేశాలల్లో స్థానికులుగా గుర్తించాలని ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే, ఏపీ హెల్త్ యూనివర్సిటీ కేసులో స్థానికతపై హైకోర్టు డివిజినల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఆధారంగానే సింగిల్ బెంచ్ ధర్మాసనం తాజాగా ఈఏపీ సెట్లో విద్యార్థులకు స్థానికత కల్పించాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ప్రభుత్వం సవాల్ చేసినా నిలబడే అవకాశం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం ఉండదంటున్నారు.తెలంగాణ హైకోర్టు సైతం అక్కడ హెల్త్ యూనివర్సిటీ కేసులో ఆ రాష్ట్రానికి వెలుపల చదివిన విద్యార్థులను కూడా స్థానికులుగా గుర్తించాలని ఇచ్చిన తీర్పును.. అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కానీ, సుప్రీం ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు వెళ్లితే తెలంగాణకు వర్తించిన తీర్పే ఇక్కడా వర్తిస్తుందని చెబుతున్నారు. ఇలా అన్నిదారులు మూసుకుపోవడంతో కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా స్థానిక కోటాను కల్పించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. -
కుక్క ముట్టిన మధ్యాహ్న భోజనం.. 78 మంది పిల్లలకు రాబీస్ టీకా
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఇది రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ అంశంపై పలు రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వ నిర్షక్ష్యమే ఈ ఘటనకు కారణమనే వాదన వినిపిస్తోంది. ఇంతకీ ఈ ఘటన ఏమిటనుకుంటున్నారా? అదే.. ‘మధ్యాహ్న భోజనాన్ని కుక్క ముట్టడం’ వివరాల్లోకి వెళితే..ఛత్తీస్‌గఢ్‌లోని బలోడబజార్ జిల్లాలోని లాచాన్పూర్ గ్రామంలోని ప్రభుత్వ మిడిల్ స్కూల్లో విద్యార్థుల కోసం వండిన ఆహారాన్ని కుక్క ముట్టుకుంది. దీనిని గమనించిన విద్యార్థులు ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు చెప్పినప్పటికీ, వారు పట్టించుకోలేదు. దీనికితోడు ఆహారాన్ని వండిన స్వయం సహాయక బృందం(ఎస్‌హెచ్‌జీ) ఈ ఆహారమేమీ కలుషితం కాలేదంటూ విద్యార్తులకు వడ్డించింది. అయితే ఈ ఘటన వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన ఎస్చ్జీ ఆ రోజు మధ్యాహ్న భోజనం చేసిన 78 మంది విద్యార్థులకు యాంటీ రాబీస్ టీకాలు ఇప్పించింది. ఈ ఘటన తరువాత విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాల నిర్వహణ కమిటీని నిలదీశారు. ఎస్‌హెచ్‌జీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ కమిటీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ఉప-డివిజనల్ మేజిస్ట్రేట్ దీపక్ నికుంజ్, బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నరేష్ వర్మ, ఇతర అధికారులు ఘటన జరిగిన పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అయితే ఎస్‌హెచ్‌జీ సభ్యులు అధికారుల దర్యాప్తులో పాల్గొనలేదు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే సందీప్ సాహు ముఖ్యమంత్రి విష్ణు డియో సాయికి లేఖ రాశారు. ఈ ఉదంతంపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. -
రూ.10 వేలు కట్టండి.. ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్లు పొందిన విద్యార్థులకు అప్పుడే ఆర్థిక భారం మొదలైంది. ఈఏపీసెట్ తొలి దశ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు తరగతులు ప్రారంభమయ్యే రోజే(ఆగస్టు 4న) రూ.10 వేలు ఫీజు కట్టాలంటూ కాలేజీల యాజమాన్యాలు హుకుం జారీ చేశాయి. వాస్తవానికి కాలేజీల బోధన సామర్థ్యాలను పరిశీలించి ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఫీజులు నిర్ణయిస్తుంటుంది. ఆ ప్రకారమే ఫీజులపై ప్రభుత్వం జీవోలు విడుదల చేయాలి. కానీ, కొత్తగా చేరే విద్యార్థుల నుంచి వివిధ రకాల ఫీజుల పేర్లు చెప్పి కాలేజీలు అదనంగా రూ.10 వేలు వసూలు చేస్తున్నాయి.అలాగే విద్యార్థుల నుంచి బలవంతంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుంటున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం వల్ల కన్వీనర్ కోటాలో ఇంజినీరింగ్ సీట్లు పొందిన పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడం వల్ల తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. అందుకే విద్యార్థుల నుంచి ఏదో రకంగా వసూలు చేయకతప్పట్లేదని కాలేజీల యాజమాన్యాలు చెబుతుండడం గమనార్హం. సీఎస్ఏబీ, ఈఏపీసెట్ మధ్య నలిగిపోతున్న విద్యార్థులు! ఇదిలా ఉండగా, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్ఐటీల్లో మిగులు సీట్లకు ఎన్ఐటీ రూర్కెలా ఆధ్వర్యంలో సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు(సీఎస్ఏబీ) నిర్వహిస్తున్న ప్రత్యేక కౌన్సెలింగ్ కంటే ముందే.. ఈఏపీసెట్ రెండో దశ కౌన్సెలింగ్ ముగుస్తుండటం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నెల 4న ఈఏపీసెట్ రెండో దశ సీట్లు కేటాయింపు చేయనుంది. 8వ తేదీలోగా విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాలి. రాష్ట్రంలోని కాలేజీలు విద్యార్థుల సర్టిఫికెట్లు తీసుకుంటున్నాయి. కానీ, సీఎస్ఏబీ కౌన్సెలింగ్ ఆగస్టు 19 వరకు కొనసాగనుంది.ఈ నేపథ్యంలో ఈఏపీసెట్ రెండో కౌన్సెలింగ్‌లో సీటు పొంది కాలేజీల్లో చేరిన తర్వాత.. సీఎస్‌ఏబీలో సీటు వస్తే విద్యార్థుల వద్ద సర్టిఫికెట్లు ఉండవు. సీటు రద్దు చేసుకోవాలంటే కాలేజీలు అడిగినంత ఇవ్వాలి. లేదంటే జాతీయ విద్యా సంస్థల్లో సీటును వదులుకోవాలి. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని తమ సమస్యకు పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. -
సర్కారు బడికి ‘రాం’ రాం!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో (గవర్నమెంట్, లోకల్ బాడీ) చేరుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. సర్కారు బడుల్లో అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలు, డిజిటల్ పద్ధతిలో బోధన చేస్తున్నా కార్పొరేట్ స్కూళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. 2019–20 నుంచి 2021–22 వరకు సర్కారు బడుల్లో పెరిగిన ఎన్రోల్మెంట్.. ఆ తర్వాత 2022–23, 2023–24ల వరకు వచ్చే సరికి గణనీయంగా పడిపోయింది.2024–25లో కూడా సర్కారు బడుల్లో విద్యార్థుల చేరిక ఆశాజనకంగా లేదని యూనిఫైడ్ డిస్టిక్ట్ర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్‌ఇ) నివేదికలు చెబుతున్నాయి. 2019–20 నుంచి 2023–24ల వరకు ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా సర్కారు బడుల్లో నమోదైన విద్యార్థుల గణాంకాలను రెండు రోజుల కిందట కేంద్ర విద్యాశాఖ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. 2021–22 సంవత్సరంలో నమోదైన విద్యార్థుల సంఖ్య.. 2023–24లోని సంఖ్యతో పోలిస్తే రెండు సంవత్సరాల్లో 1,57,50,281 మంది తగ్గారు.దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి..ఏటేటా సర్కారు బడుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. 2019–20లో 13,09,31,634 మంది విద్యార్థులు దేశ వ్యాప్తంగా సర్కారు బడుల్లో ఉంటే.. 2020–21 నాటికి ఆ సంఖ్య 13,49,04,560లకు చేరింది. మరుసటి సంవత్సరం 2021–22లో 14,32,40,480 లకు పెరగ్గా ఆ తర్వాత నుంచి ఎన్రోల్మెంట్ తగ్గింది. 2022–23లో 13,62,04,917లు కాగా, 2023–24 నాటికి 12,74,90,199లకు పడిపోయినట్లు రికార్డులు చెప్తున్నా యి. ఈ లెక్కన అత్యధికంగా రెండేళ్లలో బిహార్‌లో 45,22,871, ఉత్తరప్రదేశ్‌లో 31,88,070, రాజస్థాన్‌లో 15,30,705, మధ్యప్రదేశ్‌లో 7,57,974, తెలంగాణలో 5,23,986 మంది సర్కారు బడులకు దూరం అయ్యారు. ఒడిశా, లక్షదీప్‌లు మినహా దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల జనాభాను బట్టి పలు రాష్ట్రాల్లో ఎన్రోల్మెంట్ గణనీయంగా తగ్గింది.ఉమ్మడి వరంగల్‌లో మూతబడులురాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలు మొత్తం 18,254 ఉండగా.. వాటిల్లో 6,90,816 మంది విద్యార్థులు ఉన్నారు. అంటే ఒక్కో బడిలో సగటు పిల్లల సంఖ్య 38 మాత్రమే. ఏకంగా 1,864 ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థి లేనట్లు అప్పట్లో అధికా రులు ప్రకటించడం గమనార్హం. కాగా ఉమ్మడి వరంగల్లోనూ 298 వరకు ప్రభుత్వ పాఠశాల లు మూత బడినట్లు అధికారులు పేర్కొన్నారు. సర్కారు బడుల్లో సంఖ్య తగ్గడానికి గురుకు లాలు, మోడల్ స్కూళ్లు కారణమవగా.. ఏమాత్రం ఆర్థిక స్తోమత లేని వారు, గురుకులాల్లో సీట్లు దక్కని వారు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్తు బడుల్లో చేరుతున్నారని ఉపాధ్యా యులు చెప్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువులో నాణ్యత తక్కువగా ఉంటుందని భావించి, ప్రైవే టు పాఠశాలలకు ప్రాధాన్యం ఇస్తు న్నారన్న ప్రచారం కూడా ఉంది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలు ఉండటం వల్ల కూడా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపడానికి ఇష్టపడటం కూడా సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణంగా చెప్తున్నారు.మూతబడులను పునఃప్రారంభించాలి సర్కారు బడులకు పిల్లలు రావడం లేదని చాలాచోట్ల స్కూల్స్ మూసేస్తున్నారు. ఇదే కారణంతో నేను చదువుకున్న కుమ్మరికుంట తండా బడిని కూడా బంద్ చేశారు. పాఠశాలలో అన్ని వసతులు కల్పించి తిరిగి ప్రారంభించాలి. ఆ బడిని అన్ని వసతులతో మళ్లీ తెరిపిస్తే చాలామంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని భావిస్తున్నాం. జిల్లా పాలనాధికారులు విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాలలను పునఃప్రారంభించాలి. – బానోత్ శ్రీను, కుమ్మరి కుంట తండా, మహబూబాబాద్ జిల్లా -
Anantapur: లోకేష్, పవన్ కు ఛాలెంజ్ విద్యార్థులతో పెట్టుకోవద్దు..
-
విద్యార్థులకు రవాణా చార్జీలు
సాక్షి, అమరావతి: విద్యా హక్కు చట్టం ప్రకారం ఇంటినుంచి దూరంగా ఉన్న బడులకు వెళ్లే విద్యార్థులకు రవాణా చార్జీలు చెల్లించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపినట్టు సమగ్ర శిక్ష ఎస్పీడీ తెలిపారు. పాఠశాలలు లేని ఆవాసాలు, కొండ ప్రాంతాలు, తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు 2025–26 సంవత్సరానికి ప్రాథమిక, ఉన్నత, మాధ్యమిక స్థాయి పిల్లలకు రవాణా భత్యం చెల్లింపునకు మార్గదర్శకాలను సర్వశిక్ష రాష్ట్ర విభాగం విడుదల చేసింది. ఈ మొత్తాన్ని నేరుగా విద్యార్థి తల్లి ఖాతాలో జమ చేయనున్నట్టు ప్రకటించారు. ఆర్టీఈ చట్టం ప్రకారం నివాస ప్రాంతానికి ఒక కి.మీ. పరిధిలో ప్రాథమిక పాఠశాల, 3 కి.మీ. పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల, 5 కి.మీ. పరిధిలో ఉన్నత పాఠశాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఆ పరిధి దాటి విద్యార్థులు బడికి వెళ్లాల్సి వస్తే రవాణా చార్జీలు చెల్లించాల్సి ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మోడల్ విద్యావిధానం పేరుతో పలు ప్రభుత్వ స్కూళ్లను, తరగతులను మరో పాఠశాలలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఇలా ప్రస్తుత విద్యా సంవత్సరంలో 79,860 మంది విద్యార్థులు ఆ పరిధి దాటి బడులకు వెళుతున్నట్టు సమగ్ర శిక్ష అధికారులు గుర్తించారు. ఇందులో 41,697 మంది ఎలిమెంటరీ, 38,163 సెకండరీ స్కూళ్ల విద్యార్థులు ఉన్నారు. ఒక్కో విద్యారి్థకి నెలకు రూ.600 చొప్పున 10 నెలలకు రూ.6 వేలు చెల్లించనున్నారు. ఇందుకోసం కేంద్ర విద్యాశాఖ రూ.47.91 కోట్ల బడ్జెట్ ఆమోదించింది. ఈ మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకే వర్తిస్తుందని సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ స్పష్టం చేశారు. క్లస్టర్ రిసోర్స్ మొబైల్ టీచర్ సంబంధిత విద్యార్థుల వివరాలను లీప్ యాప్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. -
సకాలంలో ఐసీజే హితవు
విజయం గ్యారెంటీగా దక్కుతుందంటేనే పోరాడాలన్న దృక్పథం ఉంటే ఈ ప్రపంచం ఇంతగా మారేది కాదు. ప్రగతి బాటన పయనించేది కాదు. యుద్ధాల్లో గెలిచేవీ ఉంటాయి, ఓటమికి తలవంచేవీ ఉంటాయి... పోరు మాత్రం ఆగొద్దని పసిఫిక్ మహాసముద్ర మారుమూల ప్రాంతంలో 300 ద్వీప సమూహాలతో కూడిన ఒక చిన్న దేశం ఫిజీలో సంకల్పం చెప్పుకున్న 27 మంది విశ్వ విద్యాలయ విద్యార్థులు రాజేసిన ఉద్యమం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) ఎన్నదగ్గ తీర్పు నివ్వటానికి దోహదపడింది. వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్ఫలితాల నివారణ బాధ్యత అన్ని దేశాలకూ ఉంటుందనీ, ఈ ధరిత్రిని పరిరక్షించటం సకల దేశాల చట్టబద్ధ కర్తవ్యమనీ ఐసీజే వెలు వరించిన ఈ తీర్పు అందరినీ ఆలోచింపజేస్తోంది. తమ తమ దేశాల న్యాయస్థానాలనే బేఖాతరు చేస్తున్న ఏలికలు తామర తంపరగా పెరిగిన వర్తమానంలో, ఒక అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఏ దేశమైనా పట్టించుకుంటుందని, అమలు చేస్తుందని భావించటం దురాశే కావొచ్చు. ఆ తీర్పు కేవలం సలహా పూర్వకమైనదే. కానీ బాధ్యతా రహితంగా వాతావరణానికి చేటు తెచ్చే నిర్ణయాలు తీసుకుంటూ భూగోళపు మనుగడకే ముప్పు తెస్తున్న దేశాలపై నైతిక ఒత్తిడికి అది దోహద పడుతుంది. వాతావరణ మార్పుల కారణంగా ప్రమాదపుటంచుల్లో జీవనం సాగి స్తున్న ద్వీపకల్ప దేశాల గోడు ప్రపంచమంతా వినటానికీ, పర్యావరణ ఉద్యమకారుల ఆందోళనల వెనకున్న వాస్తవ స్థితిగతుల్ని ప్రజానీకం అర్థం చేసుకోవటానికీ అది తోడ్పడుతుంది. ఈకృషిలో పాలుపంచుకున్న వన్నీ ద్వీపకల్ప దేశాలు. భూతాపోన్నతి హెచ్చితే సముద్ర మట్టాలు పెరిగి ముందుగా మునిగే పసిఫిక్ మహాసముద్ర ప్రాంతానివి. భూగోళాన్ని 2050 కల్లా ఉద్గారాల రహితంగా మార్చాలన్న సంకల్పంతో 2015లో కుదిరిన ప్యారిస్ ఒడంబడికను అమెరికా బేఖాతరు చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన తొలి ఏలుబడిలో ఒకసారి దీన్నుంచి బయటకొస్తున్నట్టు ప్రకటించగా, అటుతర్వాత వచ్చిన జో బైడెన్ ప్రభుత్వం మళ్లీ చేరింది. రెండోసారి వచ్చాక ట్రంప్ మళ్లీ ఒడంబడిక నుంచి నిష్క్రమించారు. బయటకు పోలేదన్న మాటేగానీ... ఒడంబడికపై సంతకాలు చేసిన ఇతర సంపన్న దేశాలు సైతం దాన్ని నీరుగార్చే విధంగానే ప్రవర్తిస్తున్నాయి. ఒడంబడిక నిర్దేశించిన లక్ష్యాలు ఉన్నతమైనవి. వాటిని చిత్తశుద్ధితో అమలుచేస్తే భూగోళం సురక్షితంగా ఉంటుంది. భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కే పరిమితం చేయాలని, 2050–100 మధ్య అన్ని దేశాలూ శిలాజ ఇంధనాల ప్రమేయం లేని ఆర్థిక వ్యవస్థల రూపకల్పనకు దోహదపడాలని ఒడంబడిక నిర్దేశిస్తోంది. ఉద్గారాల తగ్గింపు అంశంలో ఏ దేశం కార్యాచరణ ఏ విధంగా ఉన్నదో ప్రతి అయిదేళ్లకూ సమీక్షించాలని సూచించింది. ఆర్థిక స్తోమత అంతగా లేని దేశాలకు సంపన్న రాజ్యాలు చేయూతనివ్వాలని, హరిత ఇంధన సాంకేతికతలను చవగ్గా అందించాలని కూడా కోరింది. ఏం చేయాలో చెప్పిన ప్యారిస్ శిఖరాగ్ర సదస్సు ఎలా చేయాలో చెప్పలేదు. నిర్దిష్టమైన చర్యలకు కట్టుబడి ఉంటామని సంతకాలు చేసిన దేశాలు విఫలమైన పక్షంలో తీసుకోదగిన చర్యలేమిటో ప్రకటించలేదు. అందుకే ఆ ఒడంబడిక అమలు నత్తనడక నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీజే తీర్పు ప్రపంచ పౌరులందరిలో ఆలోచన రేకెత్తించి, తమ తమ దేశాల ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావటానికి తోడ్పడుతుంది. ఎవరికీ పట్టని, ఎవరూ పరిగణనలోకి తీసుకోని ఈ సమస్య తీవ్రతను చాటడానికి తొలుత ఫిజీలోని దక్షిణ పసిఫిక్ విశ్వవిద్యాలయ విద్యార్థులు నడుం బిగించారు. ఒక తరగతి గదిలో చర్చగా మొదలైన ఈ అంశం వాతావరణ మార్పులపై పోరాడే పసిఫిక్ ఐలాండ్ స్టూడెంట్స్ ఫైటింగ్ క్లైమేట్ ఛేంజ్ (పీఐఎస్ఎఫ్సీసీ) అనే సంస్థ ఆవిర్భావానికి 2019లో అంకురార్పణ చేసింది. ఈ సంస్థ పసి ఫిక్ ద్వీపకల్ప దేశాలను ఒప్పించటంతోపాటు అలాంటి ప్రమాదం పొంచివుండే మరికొన్ని దేశాలు కూడా కలిసివచ్చేలా చేసింది. ద్వీపకల్ప దేశం వనౌతు ఇందుకు చొరవచూపింది. చూస్తుండగానే యూరప్, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు సైతం ఇందులో భాగస్వామ్యం తీసు కున్నాయి. వివిధ దేశాలతో మూడు రౌండ్ల చర్చల తర్వాత ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టే తీర్మా నంపై 105 దేశాలు సంతకం చేశాయి. ఐసీజే అభిప్రాయాన్ని కోరుతూ 2023 మార్చిలో ప్రవేశ పెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందటం, అది ఐసీజేకు చేరటం జరిగిపోయింది. నిజానికి ఒడంబడిక కుదిరేనాటికి వాతావరణ మార్పుల వల్ల పొంచివున్న ముప్పు గురించిన ప్రత్యక్షానుభవం ఈ స్థాయిలో లేదు. ఈ పదేళ్లలో ధనిక, బీద దేశాల తారతమ్యం లేకుండా అన్నిచోట్లా ప్రకృతి విపత్తులు విరుచుకుపడ్డాయి. లక్షలమంది ప్రాణాలు తీస్తున్నాయి. రుతువులు పూర్తిగా గతి తప్పాయి. ఏదోమూల అతివృష్టి, అనావృష్టి రివాజుగా మారాయి. తీవ్ర వాతావరణ మార్పుల వల్ల అంటురోగాల వ్యాప్తితోపాటు మానసిక వ్యాధులు సైతం పుట్టుకొస్తున్నాయని శాస్త్రవేత్తలు ఇటీవలే నిర్ధారించారు. కానీ సంపన్న దేశాల నిర్లక్ష్యం ఎలావుందో చెప్పుకోవటానికి నిరుడు అజర్బైజాన్ రాజధాని బాకూ నగరంలో జరిగిన ‘కాప్–29’ సదస్సే నిదర్శనం. ప్యారిస్ ఒడంబడికతో పడే ఆర్థిక భారాన్ని ఎలా సర్దుబాటు చేయాలన్న అంశంపై జరిగిన ఆ సదస్సుకు దాదాపు సంపన్న దేశాలన్నీ ముఖం చాటేశాయి. ఈ నేపథ్యంలో ఐసీజే వెలువరించిన తాజా తీర్పు ఈ బాపతు దేశాల కళ్లు తెరిపించటానికీ, వాతావరణం మరింత అధ్వాన్నం కాకుండా ఉండటానికీ దోహదపడుతుందని ఆశించాలి. -
‘కార్పొరేట్’ విద్యపై కొరడా!
ప్రచండమైన పోటీ, పరిమిత అవకాశాలూ అందరినీ భయపెడుతున్నాయి. ముఖ్యంగా తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనన్న బెంగతో ఏం చేస్తున్నామో, ఎటు పోతున్నామో... చివరికది ఎటు దారితీస్తుందో తెలియనంతగా తల్లిదండ్రులు భయాందోళనల్లో మునిగిపోతున్నారు. వాటిని పిల్లలకూ అంటిస్తున్నారు. విద్యావ్యాపారంలో తలమునకలైన సంస్థలు దీన్ని ఎంచక్కా ఉపయోగించుకుంటున్నాయి. పర్యవసానంగా పిల్లలపై ఒత్తిళ్లు పెరిగి, బెంగ ఎక్కువై ఆత్మహత్యే శరణ్యమనుకుంటున్నారు. తరాలు మారుతున్నా వదలని ఈ జాడ్యంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టని నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఎన్నదగిన నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్ని పీకల దాకా పోటీలో ముంచి, వారిపై మానసిక ఒత్తిళ్లను పెంచి విద్యలోని ప్రాణధాతువునే వికృతీకరిస్తున్న తీరు ఇకపై కొనసాగనీయరాదంటూ శుక్రవారం కోచింగ్ కేంద్రాలతోసహా అన్ని విద్యాసంస్థలనూ హెచ్చరించింది. అవాంఛనీయమైన ఈ ధోరణిని అడ్డుకోవటానికి ప్రతి విద్యాసంస్థ తప్పనిసరిగా పాటించాల్సిన 15 అంశాలతో కూడిన మార్గదర్శకాలను జారీచేసింది. పిల్లల మార్కుల ఆధారంగా వర్గీక రించి బోధించే విధానాన్ని నిలిపివేయాలనటం మొదలుకొని కౌన్సెలర్లు, సైకాలజిస్టుల నియా మకం వరకూ అందులో విలువైనవెన్నో వున్నాయి.ఆత్మహత్యలనేవి అన్నివేళలా వ్యక్తుల నిర్ణయమే కావొచ్చు... కానీ వాటిని ప్రేరేపిస్తున్న వ్యవస్థ మాటేమిటని ప్రశ్నించాడు ఫ్రెంచ్ తత్వవేత్త, రచయిత ఆల్బర్ట్ కామూ. మూలాన్ని గుర్తించకుండా, దాన్ని దుంపనాశనం చేయకుండా ఏ సమస్యా దానంతటదే మాయం కాదు. కేంద్రంలో రాజీవ్ గాంధీ హయాంలో విడుదలైన నూతన జాతీయ విద్యావిధానం విద్య ప్రైవేటీకరణకు బీజం వేసింది మొదలు మన విద్యావ్యవస్థ వెర్రితలలు వేస్తోంది. చదువులో వెనకబడివున్నామనే ఆత్మ న్యూనతతో కొందరూ, తమకొచ్చిన మార్కుల్నీ/ర్యాంకునూ చూపించి తరగతి గదిలో టీచర్ ఎగతాళి చేశారనీ, దండించారనీ మరికొందరూ...పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలమో లేదో అనే ఆందోళనతో ఇంకొందరూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు కేసులు పెడతాయి. మళ్లీ మరొకటి జరగనంతవరకూ అంతా సవ్యంగా వున్నట్టే కనబడుతుంది. ఇది చర్వితచరణంగా కొనసాగుతూనేవుంది. యాదృచ్ఛికమే కావొచ్చుగానీ... సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాలకు దారి తీసిన ఉదంతం విశాఖలోనే జరిగింది. జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) కోసం విశాఖ విద్యా సంస్థలో చేరిన బెంగాల్ బాలిక భవనంపై నుంచి పడి మరణించిన ఉదంతంపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లో ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. ఆమె ప్రమాదవశాత్తూ మరణించిందని ఒకసారి, గుండెపోటుతో మరణించిందని మరోసారి, ఆత్మహత్య చేసుకుందని ఇంకోసారి ఆ విద్యాసంస్థ బుకాయించింది. ఈ రోగం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచీ ప్రతి కార్పొరేట్ విద్యా సంస్థకూ వుంది. కన్నవాళ్లకు కనీసం పిల్లల మరణకారణాన్ని నిజాయతీగా చెప్పాలని కూడా ఆ సంస్థలు అనుకోవు. ధర్మాసనం వెల్లడించిన గణాంకాలు విస్తుగొలుపుతాయి. 2022లో మన దేశంలో 1.7 లక్షలకుపైగా ఆత్మహత్యలు నమోదైతే అందులో ఏడు శాతంపైగా – అంటే 13,404 మరణాలు విద్యార్థులకు సంబంధించినవి. జీవితం రంగులమయ ప్రపంచంగా దర్శనమిచ్చి, ఆకాశమే హద్దుగా భావించి దూసుకుపోవాల్సిన వయసులో పిల్లలు ఇంత బేలగా, ఆత్మవిశ్వాసం పూర్తిగా కోల్పోయి తనువు చాలిస్తున్న వైనం సమాజానికంతకూ సవాల్. చదువంటే తెలియనిది తెలుసుకోవటం, అవసరమైనప్పుడల్లా ప్రశ్నించి సందేహనివృత్తి చేసు కోవటం. సృజనాత్మకంగా ఆలోచించటం. నేటి విద్యావ్యవస్థ వాటన్నిటినీ చంపేసింది. పోటీ తత్వాన్ని ప్రతిష్ఠించింది. బట్టీపట్టడం మినహా మరేమీ లేకుండా చేసింది. పర్యవసానంగా ఎంతో ఇష్టంతో చదవాల్సిన విద్య కాస్తా పెను భారంగా, ఎంతకూ అర్థంకాని ప్రణాళికగా అఘోరిస్తోంది. తమను అన్నివిధాలా రుద్దుతూ, పరుగులు పెట్టిస్తూ బలవంతంగా మెదళ్లలోకి ఎక్కించి ‘మంచి ఫలితాలు’ రాబట్టి మున్ముందు మరింత వ్యాపారం చేసుకోవాలని తాపత్రయపడే విద్యాసంస్థలొక వైపూ... తమ ఎదుగుదలపై కోటి ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులొక వైపూ విద్యార్థులకు ఊపిరి సలపనివ్వట్లేదు. ఆ ప్రస్థానంలో ఓటమి ఎదురయ్యేసరికి ఆ లేత హృదయాలు తట్టుకోలేకపోతు న్నాయి. అర్ధంతరంగా తనువు చాలించటం మినహా మరే మార్గమూ లేదని నిర్ణయానికొస్తున్నాయి. అంతక్రితం వరకూ ఇంటర్ స్థాయి నుంచి మొదలయ్యే పోటీతత్వం కార్పొరేట్ సంస్థల పుణ్యమా అని ప్రాథమిక విద్యకు కూడా పాకింది. ఈ దుఃస్థితి మారాలన్నదే సుప్రీంకోర్టు సంకల్పం. అయితే కనీసం స్వేచ్ఛగా కదలటానికైనా సావకాశంలేనంతగా ఇరుకైన స్థలాల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు నడవటానికి ఎడాపెడా అనుమతులిచ్చే చోట పిల్లలకు క్రీడల్లో, జీవన నైపుణ్యాల్లో, వ్యక్తిత్వవికసనంలో శిక్షణనివ్వాలన్న ధర్మాసనం మార్గదర్శకాలు సక్రమంగా అమలవుతాయా? లాభాపేక్షే ధ్యేయంగావున్నచోట అదనంగా కౌన్సెలర్లకూ, సైకాలజిస్టులకూ చోటిస్తారా? టీచర్లపై ఊపిరాడనీయనంత భారంవేస్తున్న సంస్థలు పిల్లలతో ఎలా మెలగాలో వారికి శిక్షణనిప్పిస్తాయా? పిల్లలు తమ బాధల్ని చెప్పుకోవటానికి అవసరమైన వ్యవస్థల్ని అందుబాటులోకి తెస్తాయా? డబ్బు ఎరవేసి ఎంతటి మహోన్నత ఆశయాలనైనా చాపచుట్టేయగలిగే కార్పొరేట్ సంస్థలు ఈ మార్గ దర్శకాలను ఉల్లంఘించిన పక్షంలో ఎలాంటి చర్యలుంటాయో చెబితే తప్ప ఇదంతా చక్కబడదు. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలివ్వాలి. -
ప్రభుత్వ కాలేజీల్లో చేరడానికి ఇష్టపడని విద్యార్థులు


