నాగర్ కర్నూల్‌ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం | Four Students Suspended For Ragging Nagarkurnool Medical College | Sakshi
Sakshi News home page

నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం

Nov 29 2025 2:53 PM | Updated on Nov 29 2025 4:41 PM

Four Students Suspended For Ragging Nagarkurnool Medical College

సాక్షి, నాగర్ కర్నూల్‌ జిల్లా: నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. హాస్టల్‌లో జూనియర్ విద్యార్థులను గోడ కుర్చీ వేయాలంటూ సీనియర్లు ర్యాగింగ్‌ చేశారు. 15 రోజుల క్రితం ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. యాంటి ర్యాగింగ్ కమిటీకి జూనియర్లు ఫిర్యాదు చేశారు.

నలుగురు విద్యార్థులు దీపక్ శర్మ, హేమంత్ చౌదరి, కిషన్ బెనీవల్, అలోక్ గనిలను రెండు నెలల పాటు కాలేజీ, హాస్టల్ నుంచి ఏడాదిపాటు ప్రిన్సిపల్‌ సస్పెండ్ చేశారు.గత ఏడాది సీనియర్లు ర్యాగింగ్ చేశారంటూ దీపక్ శర్మ అప్పట్లో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు జూనియర్లను ర్యాగింగ్ చేసిన అప్పటి బాధితుడు దీపక్ శర్మ కావడం ఈ ఘటనలో బిగ్‌ ట్విస్ట్‌.

Advertisement
 
Advertisement
Advertisement