రాష్ట్రంలో జెన్‌జీలు 24% | Gen Z constitutes 24 percent of the population in Telangana | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో జెన్‌జీలు 24%

Aug 2 2026 6:10 AM | Updated on Aug 2 2026 6:10 AM

Gen Z constitutes 24 percent of the population in Telangana

అంచనా వేసిన యూఎన్‌ఎఫ్‌పీఏ యూత్‌ రిపోర్ట్‌  

వచ్చే పదేళ్లలో వారి జనాభా తగ్గుతుందని అంచనా

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం దేశమంతా మార్మోగుతున్న పేరు జెన్‌జీ. 1997 నుంచి 2012 మధ్య పుట్టిన ఈ తరం (14 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్య వారు) జనాభా తెలంగాణలో సుమారు 24 శాతంగా ఉండొచ్చని 2011 సెన్సస్‌ను పరిగణనలోకి తీసుకొని యూఎన్‌ఎఫ్‌పీఏ యూత్‌ రిపోర్ట్‌ అంచనా వేసింది. ఇక దేశంలో జెన్‌జీల సగటు జనాభా 27.1 శాతంగా ఉన్నట్లు ఇండియా ఇన్‌ పిక్సెల్స్‌ రిపోర్ట్‌–2025 పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం బిహార్‌లో అత్యధికంగా జెన్‌జీలు 32.5 శాతం ఉన్నారు. 

ఆర్థిక వ్యవస్థకు ఊతంగా..  
గ్రేటర్‌ హైదరాబాద్‌లో జెన్‌జీ జనాభా ఇతర జిల్లాల కంటే అధికంగా ఉంది. ఐటీ కంపెనీలు, అంతర్జాతీయ యూనివర్సిటీలు, హైటెక్‌ సిటీ, కో–వర్కింగ్‌ స్పేస్‌లు, స్టార్టప్‌లు ఇక్కడ కేంద్రీకృతం కావడంతో యువత భాగ్యనగరానికి వలస వస్తోంది. ఈ తరం ఆలోచనలు గత తరం లాగా ఒకే కంపెనీలో ఉద్యోగం కోసం చూడటం లేదు. బదులుగా యూట్యూబ్, ఇన్‌స్టా రీల్స్, గ్రాఫిక్‌ డిజైన్, కోడింగ్, డిజిటల్‌ మార్కెటింగ్‌ లాంటి సైడ్‌ హస్టిల్‌లు చేస్తోంది.

ఐటీ ఉద్యోగంతోపాటు వీకెండ్‌లో సొంత స్టార్టప్‌లు నడపడం, గిగ్‌ ఎకానమీలో పనిచేయడం జెన్‌జీ ప్రత్యేకతలు. ఫలితంగా హైదరాబాద్‌లో కాఫీ షాపులు, కో–వర్కింగ్‌ స్పేస్‌లు, ఈ–కామర్స్, డెలివరీ జాబ్స్‌ విపరీతంగా పెరిగాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, పారిశ్రామిక, సేవా, ఐటీ రంగాలకు ప్రధాన శక్తిగా నిలుస్తోంది. డిజిటల్‌ స్కిల్స్, కొత్త టెక్నాలజీని త్వరగా అందిపుచ్చుకోవడంలో జెన్‌జీ ముందు వరుసలో ఉండటం వల్ల కంపెనీలు వారిని టార్గెట్‌ చేస్తున్నాయి. 

త్వరలో జనాభా తగ్గే అవకాశం 
పట్టణ ప్రాంతాల్లో జెన్‌జీ జనాభా పెరుగుతుండగా గ్రామీణ ప్రాంతాల్లో తగ్గుదల కనిపిస్తోంది. అయితే నిపుణుల అంచనాల ప్రకారం జననాల రేటు తగ్గడం, వృద్ధుల జనాభా పెరగడం వల్ల వచ్చే 5–10 ఏళ్లలో జెన్‌జీల జనాభా శాతం 21–22 శాతానికి తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న యువతలోనే నైపుణ్యాలు పెంచి వారిని ఉత్పాదకంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తంగా తెలంగాణ జెన్‌ –జీ ఉద్యోగం కోసం ఎదురుచూసే తరం కాదు. ఉద్యోగాలను సృష్టి్టంచే తరం. వీరికి సరైన శిక్షణ, ఫండింగ్‌ అందిస్తే తెలంగాణ డిజిటల్‌ ఎకానమీలో దేశానికే రోల్‌ మోడల్‌గా నిలుస్తుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement