19 నుంచి పోలీస్‌ దరఖాస్తులు | Online applications for 7437 Telangana police jobs to open on August 19 | Sakshi
Sakshi News home page

19 నుంచి పోలీస్‌ దరఖాస్తులు

Aug 2 2026 6:05 AM | Updated on Aug 2 2026 6:05 AM

Online applications for 7437 Telangana police jobs to open on August 19

ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు తేదీల వెల్లడి 

సెప్టెంబర్‌ 9 తుది గడువు  

పోస్టుల వారీగా దరఖాస్తుల ఫీజులు 

పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌ ఉద్యోగార్థులకు శుభవార్త. ఇటీవల నోటిఫికేషన్లు విడుదలైన పోలీస్, స్పెషల్‌ పోలీస్, అగ్నిమాపకశాఖ, జైళ్లశాఖల్లోని  7,437 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలను, ఫీజులను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) వెల్లడించింది. ఈ మేరకు టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటన జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు టీఎస్‌ఎల్పీఆర్బీ వెబ్‌సైట్‌లో  ఆగస్టు 19 ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్‌ 9 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇతర మార్గాల్లో పంపిన దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని స్పష్టం చేశారు.  

ప్రకటనలో ముఖ్యాంశాలు..: 
⇒  అభ్యర్థులు అన్ని దశల్లో పరీక్షలకు కలిపి ఒకేసారి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.  
⇒ కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు ప్రాథమిక రాత పరీక్ష ఉంటుంది. సాంకేతిక పోస్టులకు ప్రాథమిక రాత పరీక్ష ఉండదు.  
⇒ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు శారీరక కొలతల పరీక్ష (పీఎంటీ), శారీరక సామర్థ్య పరీక్ష (పీఈటీ) నిర్వహిస్తారు.   
⇒మెకానిక్‌/డ్రైవర్‌ పోస్టులకు శారీరక కొలతల పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించే ట్రేడ్‌ టెస్ట్‌/డ్రైవింగ్‌ టెస్ట్‌ ఉంటాయి.  

⇒ శారీరక కొలతల పరీక్ష (పీఎంటీ), శారీరక సామర్థ్య పరీక్ష (పీఈటీ)ల్లో అర్హత పొందిన అభ్యర్థులకు తుది రాత పరీక్ష ఉంటుంది. కానిస్టేబుల్‌ అభ్యర్థులకు మూడు గంటల పరీక్ష, ఎస్‌ఐ అభ్యర్థులకు రెండు డిస్క్రిప్టివ్‌ పేపర్లతో కలిపి మొత్తం నాలుగు పరీక్షలు ఉంటాయి.  
⇒ నియామక ప్రక్రియలో బయోమెట్రిక్‌ నమోదు తప్పనిసరి. 
⇒ పార్ట్‌–1 ఆన్‌లైన్‌ దరఖాస్తు నింపే ముందు ఆధార్‌ ఫేస్‌ అథెంటికేషన్‌ కోసం అభ్యర్థులు తమ మొబైల్‌ ఫోన్‌లో ఆధార్‌ యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 
⇒ ఆన్‌లైన్‌ దరఖాస్తు నింపే సమయంలో ఏవైనా సందేహాలు ఉంటే వెబ్‌సైట్‌లో ఉన్న హెల్ప్‌లైన్‌ నంబర్లను సంప్ర
దించాలి. 

⇒ దరఖాస్తును విజయవంతంగా సమర్పించిన అనంతరం, దాన్ని ప్రింట్‌అవుట్‌ తీసుకుని భవిష్యత్‌ అవసరాల కోసం భద్రపరచుకోవాలి. 
దరఖాస్తు ఫీజు ఇలా..: 
⇒ ఎస్సై(సివిల్‌), ఆర్‌ఎస్సై (ఏఆర్‌), ఆర్‌ ఎస్సై (టీజీఎస్పీ), ఆర్‌ఎస్పై (ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌), ఎస్పీఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్, స్టేష న్‌ ఫైర్‌ ఆఫీసర్, డిప్యూటీ జైలర్‌ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.750, ఇతరులు రూ.1,500 ఫీజు చెల్లించాలి.  
⇒ ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరోలో ఏఎస్సై పోస్టులకు ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులు రూ.750, మిగిలిన వారు రూ.1,500 ఫీజు చెల్లించాలి.   
⇒ కానిస్టేబుల్‌ (సివిల్, ఏఆర్, ఎస్‌ఏఆర్‌సీపీఎల్, ఎస్పీఎఫ్‌), ఫైర్‌ ఫైటర్, జైలు వార్డర్‌ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులు రూ. 600, ఇతరులు రూ.1,200 ఫీజు చెల్లించాలి.  

⇒ డ్రైవర్‌ పోస్టుకు పోటీపడే అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600, ఇతరులు రూ.1,200 ఫీజు చెల్లించాలి.  
⇒ పోలీస్‌శాఖలో మెకానిక్‌ పోస్టులకు పోటీపడే అభ్యర్థుల్లో ఎస్పీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులు రూ.600, ఇతరులు రూ.1,200 ఫీజు చెల్లించాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement