నైరుతి రెండో భాగంలోనూ లోటు! | Telangana August to September rainfall likely to be below average says Met department | Sakshi
Sakshi News home page

నైరుతి రెండో భాగంలోనూ లోటు!

Aug 2 2026 5:08 AM | Updated on Aug 2 2026 5:08 AM

Telangana August to September rainfall likely to be below average says Met department

ఆగస్టు,  సెప్టెంబర్ లో సాధారణం కంటే తక్కువ వర్షాలు

వాతావరణ శాఖ అంచనా 

ఈ నెలలో ఉత్తర, తూర్పు జిల్లాల్లో సాధారణ వర్షాలు

సాక్షి, హైదరాబాద్‌: తీవ్ర వర్షాభావ పరిస్థితులతోనే నైరుతి రుతుపవనాల సీజన్‌ అర్ధభాగం ముగిసింది. సెప్టెంబర్‌ ఆఖరుతో సీజన్‌ ముగియనుండగా... నైరుతి రెండో అర్ధభాగం కూడా లోటు వర్షాలే నమోదవుతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఆగస్టు,  సెప్టెంబర్ లో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం, సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం లోటులోనే ఉంటుందని వివరించింది. ఆగస్టుకు సంబంధించిన అంచనాలను పరిశీలిస్తే.. వానలు తక్కువగా నమోదై... ఎండలు ఎక్కువగా ఉంటాయని వివరించింది. 

వాతావరణ శాఖ అంచనాలు ఇలా... 
 రాష్ట్రంలో ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలను కలిపి చూస్తే వర్షపాతం సాధారణం నుంచి సాధారణం కంటే తక్కువగా కురుస్తాయని వివరించింది. 
రాష్ట్రంలోని ఉత్తర, ప శ్చిమ, దక్షిణ భాగాల్లో వర్షపాతం లోటుగా నమోదవుతుందని తెలిపింది. 
ఆగస్టులో తూర్పు, ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే కాస్త ఎక్కువగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.  
ప శ్చిమ, దక్షిణ భాగాల్లోని జిల్లాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. 
గరిష్ట ఉష్ణోగ్రతలు రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువగానే నమోదవుతాయని, ఈ నెలలో ఉక్కపోత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. 

5 శాతం లోటు వర్షపాతం... 
నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో సగటున లోటు వర్షపాతమే నమోదైంది. జూన్‌ 1 నుంచి జూలై 31 వర కు రాష్ట్రవ్యాప్తంగా 36.36 సెం.మీ. సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 34.39 సెం.మీ. కురిసింది. సగటు కంటే 5శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. రానున్న రెండు నెలల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించడంతో సీజన్‌ అంతా లోటులోనే ఉంటుందని తెలుస్తోంది. 
రాష్ట్రవ్యాప్తంగా మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో ఎక్కువ వర్షాలు కురిశాయి. 
రాష్ట్రంలోని 17 జిల్లాల్లో సాధారణ వర్షాలు నమోదు కాగా... 12 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. 

ఎక్కడ? ఎంత? 
సాధారణ వర్షపాతం: ఆదిలాబాద్, కుమ్రుంబీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, ములుగు. 
లోటు వర్షపాతం: భద్రాద్రి కొత్తగుడెం, మహబుబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి, మేడ్చల్‌–మల్కాజిగిరి, జోగులాంబ గద్వాల, వనపర్తి, సూర్యాపేట, ఖమ్మం, నారాయణపేట. 

జూన్‌లో 13.03 సెం.మీ. సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 11.53 సెం.మీ. వర్షం కురిసింది. సాధారణం కంటే 12శాతం తక్కువ వర్షాలు కురిశాయి. 
జూలైలో 22.74 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను 22.40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. (1 శాతం లోటు నమోదైంది(  
గతేడాది నైరుతి సీజన్‌ వర్షాలతో పోలిస్తే ఇప్పటివరకు 10శాతం తక్కువ వర్షాలే నమోదయ్యాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement