ఆగ్రహంతో పోలీసుస్టేషన్‌పై దాడి.. ఫర్నిచర్ ధ్వంసం | Tension at Sangareddy's Vatpalli Police Station | Sakshi
Sakshi News home page

ఆగ్రహంతో పోలీసుస్టేషన్‌పై దాడి.. ఫర్నిచర్ ధ్వంసం

Aug 1 2026 7:14 PM | Updated on Aug 1 2026 7:53 PM

Tension at Sangareddy's Vatpalli Police Station

సంగారెడ్డి, సాక్షి: సంగారెడ్డి వట్‌పల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ రోజు (శనివారం) తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంధువులు రాకుండానే మృతదేహాన్ని తరలించారనే కోపంతో మృతుడు బంధువులు ఏకంగా పోలీస్‌ స్టేషన్‌పైనే దాడి చేశారు. స్టేషన్‌లోని ఫర్నిచర్‌ అంతా ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వివరాల్లోకి వెళితే.. నిన్న శుక్రవారం బీరప్ప అనే యువకుడు ఇతరాత్రా కారణాలతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.అయితే ఈ వివరాలు తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కుటుంబసభ్యులకు రాకముందే అతని మృతదేహాన్ని కిందకి దించి ఆసుపత్రికి తరలించారు.దీంతో ఆగ్రహం చెందిన బంధువులు పోలీస్‌ స్టేషన్‌పైనే దాడి చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement