ఆగస్టులో సెలవుల సందడి | August School & Bank Holidays 2026: Complete List of Festivals and Weekends | Sakshi
Sakshi News home page

ఆగస్టులో సెలవుల సందడి

Aug 1 2026 1:03 PM | Updated on Aug 1 2026 1:10 PM

August School Holidays 2026

 ఆగస్టు వచ్చేసింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, బ్యాంక్‌ ఖాతాదారులకు సెలవుల సందడి మొదలైంది. ఈ నెలలో ఆదివారాలు, పండుగలు, స్వాతంత్య్ర దినోత్సవం, రెండో శనివారం మొత్తం కలిపి విద్యాసంస్థలకు 10 రోజుల వరకు, బ్యాంక్‌లకు తొమ్మిదిరోజుల వరకు సెలవులు రానున్నాయి. బ్యాంక్‌ వినియోగదారులు తమ లావాదేవీలను ముందుగానే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

సెలవులు ఇలా..
ఆగస్టులో మొత్తం 31 రోజులుండగా, ఐదు ఆదివా రాలు (2, 9, 16, 23, 30) ఉన్నాయి. వీటితో పా టు 8న రెండో శనివారం, 15న స్వాతంత్య్ర ది నోత్సవం, 21న వరలక్ష్మీవ్రతం, 26న మిలాద్‌–ఉన్‌–నబీ సందర్భంగా సాధారణ సెలవులున్నాయి. అ లాగే, 17న నాగపంచమి, 28న రక్షాబంధన్‌ రోజు ల్లో ఐచ్చిక సెలవులు (ఆప్షనల్‌ హాలిడేస్‌) పొందే అవకాశముంది. ఈ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు 10 రోజుల వరకు సెలవులు లభించనున్నాయి. వరుస సెలవులతో విద్యార్థులు కుటుంబ స భ్యులతో కలిసి పండుగలు జరుపుకోవడంతోపాటు బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు, చిన్నపాటి విహారయాత్రలు చేసేందుకు అవకాశం దక్కనుంది.

ఖాతాదారులకు ప్రణాళిక తప్పనిసరి
బ్యాంక్‌ ఖాతాదారులకు ముందస్తు ప్రణాళిక తప్పనిసరి. బ్యాంక్‌లకు ఐదు ఆదివారాలు, 8న రెండో శనివారం, 22న నాలుగో శనివారం, 15న స్వాతంత్య్ర దినోత్సవం, 26న మిలాద్‌–ఉన్‌–నబీ సందర్భంగా మొత్తం తొమ్మిది రోజులు సెలవులు ఉండనున్నాయి. దీంతో నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్, డీడీలు, ఇతర అత్యవసర బ్యాంకింగ్‌ సేవలకు అంతరాయం కలగకుండా అవసరమైన పనులు ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement