మూసీ బ్రిడ్జిపై తప్పిన విషాదం! | Chaitanyapuri Police Save Woman And Three Children From Moosi Incident, Check More Details Inside | Sakshi
Sakshi News home page

మూసీ బ్రిడ్జిపై తప్పిన విషాదం!

Aug 1 2026 10:07 AM | Updated on Aug 1 2026 10:34 AM

Chaitanyapuri Police Save Woman And Three Children From Moosi Incident

చైతన్యపురి పోలీస్‌ సిబ్బందిని అభినందిస్తున్న మల్కాజిగిరి కమిషనర్‌ సుమతి

అడ్డుకుని తల్లి, ముగ్గురు పిల్లల్ని కాపాడిన పోలీసులు

హైదారాబాద్‌: భర్తపై కోపంతో ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి మూసీలో దూకి ఆత్మహత్యకు యత్నించగా సకాలంలో స్పందించిన చైతన్యపురి పోలీసు సిబ్బంది కాపాడారు.

వివరాలలోకి వెళ్లితే.....గురువారం సాయంత్రం ఉప్పల్‌ మూసీ బ్రిడ్జి సమీపంలో ఓ మహిళ, పిల్లలు ఆవేదనగా..అనుమానాస్పదంగా కని్పంచడంతో స్థానికులు వెంటనే డయల్‌ 100కు కాల్‌ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న చైతన్యపురి మహిళా కానిస్టేబుల్‌ చంద్రకళ, హోంగార్డు బాలరాజు, హైడ్రా బృందం నాలుగు నిమిషాల్లో అక్కడకు చేరుకుని మహిళతో పాటు ఆమె ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని కాపాడారు. భర్తపై కోపంతో మహిళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుసుకున్నారు.

అనంతరం కౌన్సలింగ్‌ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా డయల్‌ 100కు కాల్‌ వచి్చన కేవలం నాలుగు నిమిషాల్లో స్పందించిన పోలీసు సిబ్బందిని మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ బి.సుమతి అభినందించారు. శుక్రవారం ఈ మేరకు వారికి నగదు బహుమతి, రివార్డు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement