విశ్రాంత ఐపీఎస్‌ అధికారి కూతురికి వరకట్న వేధింపులు | Retired IPS officer Daughter Dowry Incident | Sakshi
Sakshi News home page

విశ్రాంత ఐపీఎస్‌ అధికారి కూతురికి వరకట్న వేధింపులు

Aug 1 2026 7:40 AM | Updated on Aug 1 2026 7:40 AM

 Retired IPS officer Daughter Dowry Incident

హైదరాబాద్‌: ఆ్రస్టేలియాలో ఎంఎస్‌ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నట్లు తప్పుడు వివరాలు చెప్పి విశ్రాంత ఐపీఎస్‌ అధికారి కుమార్తెను వివాహం చేసుకుని, అనంతరం కట్నం కోసం వేధింపులకు పాల్పడిన భర్తతో పాటు అత్తింటి కుటుంబసభ్యులపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహ మధ్యవర్తి ద్వారా కార్తీక్‌ అనే యువకుడితో రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఎస్‌జే జనార్దన్‌ కుమార్తె ఎస్‌.మోక్షకు 2024, అక్టోబర్‌ 26న పెళ్లి చేశారు. 

వివాహ సమయంలో రూ.30 లక్షల కట్నం కోరుతూ పలు షరతులు విధించారు. వివాహం అనంతరం భర్తతో పాటు అత్తింటి వారు శారీరిక, మానసిక, భావోద్వేగ, లైంగిక వేధింపులకు గురిచేశారు. బంగారు నగలను తీసుకుని తనఖా పెట్టేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయాలని, లేదంటే జీతాన్ని వారికే అప్పగించాలని మోక్షపై ఒత్తిడి తేవడంతోపాటు పలు విధాలుగా బెదిరించారు.

కార్తీక్‌ విద్యార్హతలు, ఉద్యోగానికి సంబంధించిన పత్రాలు పలుమార్లు తాము అడిగినా చూపలేదని, పెద్దల సమక్షంలో జరిగిన పంచాయతీలో తాను ఎంఎస్‌ పూర్తి చేయలేదని, తమ కుటుంబాన్ని మోసం చేశానని కార్తీక్‌ ఒప్పుకున్నట్లు మోక్ష తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మోసం, కట్న వేధింపులు, క్రూరత్వం, బెదిరింపులు తదితర ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనార్దన్‌ ఇచి్చన ఫిర్యాదు మేరకు కార్తీక్‌తో పాటు తండ్రి రాజేందర్, తల్లి జ్యోతి, చైతన్య, శరణ్యలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement