software engineer
-
సాఫ్ట్వేర్ కెరియర్.. ఓపెన్ఏఐ సీఈవో వార్నింగ్!
టెక్ రంగంలో భవిష్యత్తు కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ కీలక సలహాలు ఇచ్చారు. స్ట్రాటెక్రీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక కంపెనీలలో కోడింగ్ పనులను కృత్రిమ మేధ (AI) ఎలా తీసేసుకుంటోందో తెలియజేశారు. ఇప్పుడు అనేక సంస్థలలో 50 శాతానికి పైగా కోడింగ్ పనిని ఏఐ చేస్తోందనే అంచనా ఉందని, అభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్ లో పోటీపడాలంటే కృత్రిమ మేధతో పనిచేయడం నేర్చుకోవడం కీలకమని ఆయన నొక్కి చెప్పారు.అప్పుడది.. ఇప్పుడిది..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ పై పట్టు సాధించడంపై నేటి దృష్టిని ఆల్ట్ మన్ చిన్నతనంలో కోడింగ్ నైపుణ్యాలను నేర్చుకోవడంపై ఉన్న దృష్టితో పోల్చారు. తాను హైస్కూల్ చదువుతున్నప్పుడు కోడింగ్ లో నైపుణ్యాన్ని సాధించడం వ్యూహాత్మక విషయంగా ఉండేదని, కానీ ఇప్పుడు కృత్రిమ మేధ సాధనాలను ఉపయోగించడంలో మెరుగ్గా ఉండటమే సరైన వ్యూహాత్మక విషయమని ఆల్ట్‌మన్ అన్నారు. పరిశ్రమ ఆటోమేషన్ వైపు వెళుతున్న క్రమంలో కృత్రిమ మేధలో మంచి ప్రావీణ్యం కలిగి ఉండటం దీర్ఘకాలిక ప్రయోజనాన్ని అందిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.హ్యూమన్ కోడర్ల స్థానంలో కృత్రిమ మేధ (ఏఐ) అనే ఆలోచన మరింత ప్రాచుర్యం పొందుతోంది. అనేక మంది పరిశ్రమ పెద్దలు దీనిని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆరు నెలల్లో 90 శాతం కోడ్ ను ఉత్పత్తి చేయగలదని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ ఇటీవల అంచనా వేశారు. ఈ ఏడాది చివరి నాటికి ఏఐ కోడింగ్ లో మనుషులను మించిపోతుందని ఓపెన్ ఏఐ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ కెవిన్ వీల్ సూచించారు.ఈ అంచనాలను ఆల్ట్‌మన్ కూడా బలపరిచారు. కోడింగ్ లో ఏఐ పాత్ర ఇప్పటికే గణనీయంగా ఉందన్నారు. కృత్రిమ మేధ మరింత కోడింగ్ బాధ్యతలను చేపట్టగల ఆటోమేషన్ అధునాతన రూపమైన "ఏజెంట్ కోడింగ్" భావనను కూడా ఆయన స్పృశించారు. ఈ భావన ఇంకా అభివృద్ధిలో ఉన్నప్పటికీ, ఆల్ట్‌మన్ దాని సామర్థ్యం గురించి ఆశాజనకంగా ఉన్నారు. అయితే ప్రస్తుత నమూనాలు ఆ దశకు చేరుకోవడానికి ఇంకా మెరుగుదల అవసరమని అంగీకరించారు.సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు తగ్గనున్న డిమాండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత సామర్థ్యం పెరిగేకొద్దీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు డిమాండ్ తగ్గవచ్చని ఆల్ట్ మన్ సూచించారు. ప్రస్తుతం ఇంజనీర్లకు డిమాండ్ ఉందని అంగీకరించినప్పటికీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరిన్ని పనులు చేపట్టడంతో అవసరమైన ఇంజనీర్ల సంఖ్య తగ్గుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాల మార్పు అకస్మాత్తుగా జరగదని, క్రమంగా వేగవంతం అవుతుందని ఆల్ట్ మన్ వివరించారు. -
అందొచ్చిన కొడుకు అమ్మ మందులకోసం వెళ్లి.. ఆగం!
వలేటివారిపాలెం: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతిచెందిన ఘటన మండలంలోని పోకూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ వద్ద వే బ్రిడ్జి సమీపంలో 167–బీ జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని శింగమనేనిపల్లి గ్రామానికి చెందిన బాశం వెంకటేశ్వర్లు – మాధవి దంపతుల కుమారుడు బాశం దినేష్ (25) వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. అంతేకాకుండా తల్లిదండ్రుల వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉన్నాడు. బడేవారిపాళెం నుంచి పొలం అరక దున్నే కూలీని తీసుకురావాలని తండ్రి వెంకటేశ్వర్లు కుమారుడికి చెప్పాడు. దీంతో తన బుల్లెట్‌పై బయలుదేరిన దినేష్‌కు ఊరు దాటగానే తండ్రి ఫోన్ చేసి అమ్మకి ఆరోగ్యం బాగోలేదు.. ముందు పోకూరు వెళ్లి మందులు తీసుకొని అక్కడి నుంచి బడేవారిపాళెం వెళ్లమని చెప్పాడు. దినేష్ మందులు తీసుకుని బడేవారిపాళెం వెళ్తున్నాడు. హైవేపై ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా కందుకూరు వైపు వస్తు న్న ఆటోను ఢీకొట్టాడు. రోడ్డుపై పడిపోయిన దినేష్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై మరిడి నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూ రు ఏరియా వైద్యశాలకు తరలించారు. అప్పటి వరకు గ్రామంలో ఉత్సాహంగా తిరిగిన దినేష్ మృతితో శింగమనేనిపల్లిలో విషాదం నెలకొంది. వెంకటేశ్వర్లుకు ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం. మరో ఆరునెలల్లో దినేష్ అక్కకు వివాహం చేయాల్సి ఉంది. అన్ని తానై చూసుకుంటున్న యువకుడి మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
భార్యకు సాఫ్ట్వేర్ ఉద్యోగం .. భర్త అనుమానాస్పద మృతి!
వెదురుకుప్పం : ‘ఐటీ ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లాడు.. వివాహమై 14 నెలలు అవుతోంది. సంతోషంగా ఉన్నాడనుకున్నాం. అక్కడ ఏం జరిగిందో ఏమో శవమై తిరిగి వచ్చాడంటూ..’ మండలంలోని కొమరగుంట గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికుల కథనం మేరకు.. కొమరగుంట గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి కుమారుడు జి.మహేష్ (30)కి దామరకుప్పం గ్రామానికి చెందిన గుణవర్ధన్‌రెడ్డి కుమార్తె అనితకు 14 నెలల క్రితం ప్రేమించుకుని పెద్దల ఆమోదంతో వివాహం చేసుకున్నారు.మహేష్ భార్య అనిత సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తోంది. వీరు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. సోమవారం సాయంత్రం కొమరగుంటలో ఉన్న మహేష్ తండ్రి చంద్రశేఖర్‌రెడ్డికి ఫోన్ ద్వారా దిగ్బ్రాంతికర సమాచారం అందింది. ఉరి వేసుకుని చనిపోయినట్లు మహేష్ భార్య అనిత కుటుంబ సభ్యులకు తెలిపింది. ఆ సమాచారం అందింన వెంటనే కుప్పకూలిపోయారు. మహే ష్ మృతి చెందడంతో భార్య అనిత అక్కడే పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి ఘటనను పరిశీలించి ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదు చేసి శవపరీక్ష కూడా నిర్వహించారు.ఆనవాళ్లు లేకుండా చంపేశారు..బంధువుల ఆందోళనఘటనకు సంబంధించి కొమరగుంట గ్రామస్తులు మంగళవారం ఉదయం పచ్చికాపల్లం–పెనుమూరు ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున భైఠాయించారు. మహేష్‌ను పథకం ప్రకారం ఎలాంటి ఆనవాళ్లు కనిపించకుండా చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు ధర్నా చేపట్టారు. భార్య అనిత కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందంటూ.. అది ఆత్మహత్య కాదు.. హత్యగావించినట్లు బంధువులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, ఎస్ఐలు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మోహరించారు. ఈసందర్భంగా తమకు న్యాయం జరిగే వరకూ మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని రోడ్డుపైనే భీష్మించుకూర్చున్నారు. పోలీసులు ఎంత సర్ది చెప్పినా వినిపించుకోలేదు. ఓ దశలో పోలీసులకు ఆందోళన కారులకు వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. పోలీసుల వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. సుమారు 3 గంటలకు పైగా ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైంది. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం ఆందోళన చేస్తున్న సమ యంలో శవం రావడంతో స్థానికులు మరింత కోపోద్రిక్తులై ఆందోళనను తీవ్ర తరం చేశారు. మృతదేహం వెంట భార్య అనిత రాకపోవడంతో అనుమానం మరింత బలమైంది. మృతదేహాన్ని పక్కన పెట్టి నిరసన తెలిపారు. ఇది ముమ్మాటికీ హత్యే అంటూ కుటుంబ సభ్యులు నినాదాలు చేశారు. ఎట్టకేలకు రెవెన్యూ, పోలీసు శాఖ సమ న్వయంతో మధ్యాహ్నం కొమరగుంట గ్రామస్తులతో చర్చించి అనిత తరపున రావాల్సిన నగదు, బంగారాన్ని ఇచ్చేలా రాజీ కుదర్చడంతో ధర్నాను విరమింప చేశారు. ఈ ఆందోళనలో కానిస్టేబుల్‌కు గాయాలైనట్లు చెబుతున్నారు. మంగళవారం సాయంత్రం కొమరగుంట సమీపంలో మహేష్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాద్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదైనట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు. -
అన్నం తినిపించే విషయమై గొడవ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నంద్యాల పట్టణానికి చెందిన సంగిరెడ్డి నర్సింహారెడ్డి (28) విష్ణుప్రియ దంపతులు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదిత్య నగర్ కృష్ణకాలనీలో నివాసముంటున్నారు. నర్సింహారెడ్డి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం కుమారుడికి అన్నం తినిపించే విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన నర్సింహారెడ్డి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అతను ఎంత సేపటికీ బయటికి రాకపోవడంతో విష్ణు ప్రియ స్థానికుల సహాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా నరసింహారెడ్డి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. అతడిని కిందకు దింపి చూడగా అప్పటికే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య విష్ణుప్రియ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో సాఫ్్టవేర్ ఉద్యోగి దుర్మరణం మియాపూర్: టిప్పర్ లారీని ఓవర్ టెక్ చేయబోయి స్కూటీని ఢీకొని అదుపుతప్పి బుల్లెట్ పై వెళ్తున్న సాఫ్్టవేర్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప జిల్లాకు చెందిన రోషన్(27) మూడేళ్లుగా చందానగర్‌లో స్నేహితులతో కలిసి ఉంటూ సాఫ్్టవేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి అతను బైక్‌పై చందానగర్ నుంచి మియాపూర్ వైపు వెళ్తుండగా మదీనాగూడ దీప్తీశ్రీనగర్ కాలనీ కమాన్ సమీపంలో ముందు వెళ్తున్న టిప్పర్‌ను ఓవర్ టెక్ చేసే క్రమంలో స్కూటీని ఢీనడంతో అతడి బైక్ అదుపుతప్పింది. హెల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి, అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తల్లి జహరాబాను ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గర్భస్రావం కాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
నా వయసు 35 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని, నైట్ షిఫ్ట్స్‌లో చేస్తాను. ఈ వయసులో గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ అని విన్నాను. అలా కాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? – శైలజ, చిత్తూరు. వయసు పెరిగేకొద్దీ జెనెటిక్ కారణాలు, హార్మోన్లలో మార్పుల వలన గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని నిరోధించడం కష్టం. అందువల్ల, ముందుగానే ప్లాన్ చేసుకోవటం, సరైన సమయానికి పరీక్షలు చేయించుకోవటం చెయ్యాలి. ప్రీకాన్సెప్షన్ కౌన్సెలింగ్ అంటే ప్లానింగ్‌కు ముందు ఒకసారి భార్యభర్తలిద్దరూ గైనకాలజిన్ట్ దగ్గర తీసుకోవాలి. డాక్టర్ ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా ప్రివెంట్ చేసే సమస్యలను గుర్తించి, వివరిస్తారు. రొటీన్ థైరాయిడ్, సుగర్, బీపీలను పరీక్షిస్తారు. కొన్ని వ్యాధులకు ప్రివెంటివ్ వాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. అవి ముందుగా వేయించుకుంటే ప్రెగ్నెన్సీలో గర్భస్రావం కాకుండా ఉంటుంది. రుబెల్లా, చికెన్ పాక్స్ లాంటివి.. ఇమ్యూనిటీ లేకపోతే వాక్సిన్స్ ఇస్తాం. ఒకనెల తరువాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. మీకేదైనా మెడికల్ రిస్క్స్ ఉండి, ఇతర మందులు వాడుతుంటే వాటిని మార్చి, సురక్షితమైన మందులను రాసి ఇస్తాం. ఉబ్బసం, అధిక బరువు ఉంటే కూడా గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. అప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా సూచిస్తాం. నైట్ షిఫ్ట్స్ వలన ప్రెగ్నెన్సీలో సాధారణంగా ఏ సమస్య ఉండదు. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. మీరు చెకప్స్‌కు వచ్చినప్పుడు బీఎమ్ఐ కాలిక్యులేట్ చేసి, తగిన డైట్ సూచిస్తాం. కొంతమందికి గర్భసంచిలో పొర లేదా గడ్డలు ఉంటాయి. వాటిని స్కాన్స్‌లో కనిపెడతాం. ఏదైనా సమస్య ఉండి, ప్రెగ్నెన్సీలో ఇబ్బంది కలిగేటట్లయితే, పూర్తి శరీర ఆరోగ్య పరీక్షల తర్వాత చిన్న సర్జరీ ద్వారా ముందే కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ముందు నుంచి తీసుకుంటే బేబీ మెదడు, వెన్నెముక సమస్యలు తగ్గుతాయి. రక్తం పలుచబడే వ్యాధులు ఉన్నట్లు కనిపెడితే, ముందుగా కొన్ని మందులతో చికిత్స చేసి మొదటి వారాల్లోనే గర్భస్రావం కాకుండా చేయచ్చు. అందుకే, ముందుగానే చెకప్స్‌కు వెళ్తే, థైరాయిడ్ లాంటివి గుర్తించి, తగిన మందులు ఇస్తారు. అప్పుడు ప్లాన్ చేసినప్పుడు గర్భస్రావం రిస్క్ తగ్గుతుంది. కొన్నిసార్లు ఏ కారణం లేకుండా శిశువు ఎదుగుదల సమస్యతో ఆకస్మికంగా గర్భస్రావం కావచ్చు. అది మళ్లీ రిపీట్ కాకపోవచ్చు. పూర్తి హిస్టరీ, కౌన్సెలింగ్, ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా గర్భస్రావాన్ని నివారించవచ్చు.రావడం లేదునాకు కాన్పు అయి మూడు రోజులు అవుతుంది. చాలా కష్టంగా కాన్పు జరిగింది. బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఎక్కువ రావటం లేదు. బయట పాలు పట్టడం నాకు ఇష్టం లేదు. ఏం చెయ్యాలి?– రమాదేవి, ఉరవకొండ. కొన్నిసార్లు కాన్పు సమయంలో తీసుకునే ఒత్తిడి కారణంగా శిశువులకు లాచింగ్ అంటే బ్రెస్ట్, ఐరోలాను నోటిలో పెట్టుకొని సక్ చెయ్యటంలో కొంచెం బలహీనపడతారు. మూడు నుంచి పదిహేను రోజుల్లో వాళ్లకి అలవాటు అవుతుంది. కాని, ఈ సమయంలో బేబీ బరువు తగ్గటం, సుగర్, ఉష్ణోగ్రతలను సరైన స్థాయిలో ఉంచటం చాలా అవసరం. పీడియాట్రీషియన్ సలహా పాటించడం మంచిది. సాధారణంగా సహజ ప్రసవం లేదా సిజేరియన్ కాన్పు జరిగిన అరగంటలోపు బేబీకి, తల్లితో బ్రెస్ట్ సకింగ్ కచ్చితంగా చేయించాలి. దీనితో తల్లికి, బిడ్డకు బంధం ఏర్పడుతుంది. బ్రెస్ట్‌లోని ప్రోలాక్టిన్ రిసెప్టర్స్ సిమ్యులేట్ అవుతాయి. భవిష్యత్తులో బ్రెస్ట్ ఫీడింగ్ బాగా వృద్ధి చెందుతుంది. కాని, ముందు కేవలం నీళ్లలాంటి కొలోస్ట్రమ్ మాత్రమే వస్తుంది. అప్పుడే పుట్టిన బేబీకి ఈ కొలోస్ట్రమ్ సరిపోతుంది. సరైన పాలు మూడు నుంచి ఆరు రోజులకు గాని రావు. ఒకవేళ బేబీ లాచింగ్ చెయ్యకపోతే చేతితో లేదా బ్రెస్ట్ పంప్‌తో ఈ కొలోస్ట్రమ్ బేబీకి ఇవ్వటానికి ప్రయత్నించాలి. సరైన రొమ్ముపాలు ఇవ్వడం అనేది చాలాసార్లు నెమ్మదిగానే జరుగుతుంది. తల్లి చాలా పాజిటివ్‌గా ఉండాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. బేబీ పుట్టిన మొదటి 24 గంటల్లో మూడు నుంచి నాలుగుసార్లు మాత్రమే ఫీడ్ తీసుకుంటారు. తర్వాతి రోజు నుంచి రోజులో ఎనిమిది సార్లు దాకా ఫీడ్ తీసుకుంటారు. ప్రతి బ్రెస్ట్ ఫీడింగ్ పది నుంచి నలభై నిమిషాలు సక్ చేయించాలి. దీని వలన బ్రెస్ట్ స్టిమ్యులేట్ అయి, పాల ఉత్పత్తి మొదలవుతుంది. ఒకవేళ బేబీ సక్ చెయ్యకపోతే ఇదే రిథమ్‌తో బ్రెస్ట్ పంప్‌తో చెయ్యండి. స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ బేబీకి చాలా అవసరం. ఎప్పుడూ తల్లి పక్కనే బిడ్డను పడుకోబెట్టుకోవాలి. ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి నిద్రలో ఉన్నా లేపి, సకింగ్ చేయించాలి. మూడు గంటల కన్నా ఎక్కువ సేపు ఫీడ్ లేకుండా ఉండకూడదు. ఎక్స్ప్రెస్డ్ మిల్క్ అయినా ఇదే పద్ధతి ఫాలో కావాలి. బేబీ ఎన్నిసార్లు యూరిన్, మోషన్ చేస్తుంది అనేది గమనించాలి. తక్కువ యూరిన్ పాస్ చేస్తున్నా, డల్‌గా ఉన్నా, వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎక్స్ప్రెస్డ్ ఫీడ్స్ లేదా బ్రెస్ట్ పంప్ వాడటం వలన బ్రెస్ట్ మిల్క్ తగ్గదు. ఎలక్ట్రానిక్ పంప్ వాడవచ్చు. ఒకసారి బేబీకి లాచింగ్ అలవాటు అయిన తరువాత ఎక్స్ప్రెస్డ్ ఫీడ్ ఇవ్వటం ఆపేయాలి. తల్లి పాజిటివ్‌గా ఉండి, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ తరచు ఇస్తూ, ప్రతి రెండు నుంచి మూడు గంటలకు బ్రెస్ట్ సకింగ్ చేయిస్తే ఫీడ్ సరిపోవట్లేదనే సమస్య ఉండదు. లాక్టేషన్ కౌన్సెలర్ సహాయంతో వివిధ బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్స్ కూడా నేర్చుకోవచ్చు. -
మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కాదు.. అమ్మాయిల బ్రోకర్
నెల్లూరు: ఒకతను తాను సాఫ్ట్వేర్ ఇంజినీర్‌నని నమ్మించి రూ.లక్షల్లో కట్న కానుకులు తీసుకుని ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజులు ఆమెకు ఎలాంటి అనుమానం రాకుండా నటించాడు. అనంతరం భార్యను చిత్రహింసలకు గురి చేయసాగాడు. ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కాని భార్య.. భర్త ప్రవర్తనను నిశితంగా పరిశీలించగా అసలు విషయం తెలిసి నిర్ఘాంతపోయింది. భర్త సాఫ్ట్వేర్ ఇంజినీర్ కాదని యువతుల బ్రోకర్ అని తేలడంతో కన్నీటి పర్యంతమైంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు మెక్లెన్స్ రోడ్డుకు చెందిన ఓ యువతికి ఆమె పెద్దలు మ్యాట్రిమోని ద్వారా వివాహ సంబంధాలు చూస్తుండగా.. విజయవాడ ప్రాంతానికి చెందిన అమీర్‌ఖాన్ పరిచయమాయ్యాడు. తాను సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాని, నెలకు రూ.80 వేలు జీతమని నమ్మించాడు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఆ యువతికి 2023 సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన అమీర్‌ఖాన్‌తో వివాహం జరిగింది. ఆ సమయంలో యువతి కుటుంబ సభ్యులు రూ.15 లక్షల నగదు, 13 సవర్ల బంగారు కట్నకానుకుల కింద ఇచ్చారు. రెండునెలలపాటు వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగింది.చదవండి: కుటుంబ పరువు కోసం కన్న కూతురినే కడతేర్చిన తండ్రిప్రవర్తనలో మార్పుక్రమంగా అమీర్‌ఖాన్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్యను చిత్రహింసలకు గురి చేయసాగాడు. గంటల తరబడి ఒంటరిగా గదిలో ఉంటూ ఆమెను పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. దీంతో అతడి ప్రవర్తనపై భార్యకు అనుమానం వచ్చింది. ఓ రోజు అతను బాత్రూమ్కు వెళ్లిన సమయంలో ఆమె రూమ్ శుభ్రం చేస్తుండగా మంచం పక్కనే పెద్ద సంఖ్యలో సెల్ఫోన్లు ఉండటాన్ని గమనించింది. ఒకటి తీసుకుని అందులోని నంబర్లకు కాల్ చేసింది. అవతలి వాళ్లు చెప్పిన మాటలకు ఆమె నిర్ఘాంతపోయింది. అమీర్‌ఖాన్ అమ్మాయిల బ్రోకర్ అనే విషయం బయటపడింది. దీంతో భర్తను ప్రశ్నించగా కోపోద్రిక్తుడైన అతను ఆమైపె దాడి చేశాడు. అత్తమామలు, ఆడబిడ్డ సైతం దుర్భాషలాడారు. అదనపు కట్నం కోసం ఆమెను చిత్రహింసలు పెట్టారు. ఇటీవల ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో బాధిత మహిళ నెల్లూరులోని తల్లిదండ్రుల వద్దకు చేరుకుని బోరున విలపించింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌నని తమను నమ్మించి మోసగించిన భర్త, అత్తింటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె బుధవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని చిన్నబజార్ ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు తెలిపారు. -
నాకు ధైర్యం చెప్పే మేనకోడలు.. ఈరోజు విగతజీవిలా మారిపోయింది..!
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దేవిక ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. ఆరు నెలల క్రితమే సాఫ్ట్ వేర్ ఉద్యోగినే ప్రేమ వివాహం చేసుకున్న దేవిక.. ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమెకు వేధింపులు ఎక్కువ కావడంతోనే ఈ దారుణానినికి పాల్పడి ఉంటుందని ఆరోపిస్తున్నారు.అతనొక ఉన్మాది..దేవికను ప్రేమించి పెళ్లిచేసుకున్న శరత్ చంద్ర అనే వ్యక్తి ఒక ఉన్మాది అని, అతనికి ఉరిశిక్షే సరైనదని దేవిక మేనమామ అంటున్నారు. ‘సాక్షి’తో మాట్లాడిన దేవిక మేనమామ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. ఎప్పుడూ అందరికీ ధైర్యం చెప్పే తన మేనకోడలు.. ఈరోజు ఇలా విగత జీవిలా పడి ఉండటం తమను ఎంతగానో బాధిస్తుందన్నారు. తానొక రైతునని, తనకు ఎప్పుడు కష్టం వచ్చినా ధైర్యం చెప్పే మేనకోడలు ఈరోజు లేదన్నారు. నేటి సమాజంలో ఏ అమ్మాయికి ఇటువంటి పరిస్థితి రాకూడదన్నారు. తన మేనకోడలు ఎంతో గట్టి మనస్తత్వం ఉన్న అమ్మాయి అని, కానీ భర్త వల్ల ఎంతగా కృంగిపోతే ఆత్మహత్య చేసుకుందో తమకు అర్థమైందన్నారు. అతన్ని కచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిందేనన్నారు మేనమామ.మండే వస్తా మమ్మీ అంది.. శవమై వచ్చింది నా బిడ్డ..!తన కూతురు ఆత్మహత్యపై తల్లి పడే రోదన అంతా ఇంతా కాదు. ఇంటికి వస్తానన్న బిడ్డ, శవమై వచ్చిందంటూ ఆమె తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన బిడ్డ తనకు ప్రతీ రోజూ ఫోన్ చేసేదని, తిన్నావా మమ్మీ, ఎలా ఉన్నావ్ మమ్మీ అనే అడిగేదని కన్నీటి పర్యంతమయ్యారు తల్లి. ‘మొన్న పోయిన సండే ఇంటికి రా బిడ్డా అని అడిగితే, లేదు మమ్మీ మండే వస్తానంది.. వచ్చి నన్ను ఆస్పత్రిలో చూపిస్తానంది. మండే నాడు శవమై వచ్చింది నా కూతురు’ అంటూ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. ఆరు నెలల క్రితమే ప్రేమ పెళ్లి..కాగా, వికారాబాద్ జిల్లా, తోర్మామిడికి చెందిన కమలాపురం దేవిక(25) మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తోంది. మంచిర్యాల మార్కెట్ రోడ్డుకు చెందిన సద్గుర్తి శరత్ చంద్రతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీయడంతో పెద్దల అంగీకారంతో వారిద్దరూ గతేడాది ఆగస్టు 23న గోవాలో పెళ్లి చేసుకున్నారు. రాయదుర్గంలోని ప్రశాంత్ హిల్స్‌లో నివాసం ఉంటున్నారు.అయితే, కొద్ది రోజులుగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా వారి మధ్య గొడవ జరగడంతో దేవిక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. బయటికి వెళ్లి తిరిగి వచ్చిన శరత్చంద్ర తలుపు తట్టినా దేవిక స్పందించకపోవడంతో నిద్రపోయి ఉంటుందని భావించాడు. సోమవారం ఉదయం 10 గంటలైనా దేవిక బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన శరత్ చంద్ర తలుపు విరగ్గొట్టి చూడగా ఆమె ఉరి వేసుకుని కనిపించింది.ఈ క్రమంలో ఇరుగు పొరుగు సహాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది. వరకట్నం కోసం శరత్చంద్ర తన కుమార్తెను వేధిస్తున్నాడని, ఈ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని మృతురాలి తల్లి రామలక్ష్మి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇక సర్దుకోవాల్సిందే..!
ఆటోమేషన్... ఈ పదం జాబ్ మార్కెట్‌ను వణికిస్తోంది. ముఖ్యంగా టెక్ పరిశ్రమలో ఉద్యోగులకు గుబులు పుట్టిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణతో చాలా కంపెనీలు ఆటోమేషన్ (automation) బాట పట్టాయి. దీంతో ఉద్యోగుల మనుగడకు ముప్పు ఏర్పడింది. తాజాగా ఇన్మోబి (InMobi) సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నవీన్ తివారీ పిడుగులాంటి వార్త చెప్పారు.వారికి ఉద్యోగాలు ఉండవుఈ ఏడాది చివరి నాటికి సాఫ్ట్ వేర్ కోడింగ్ లో తమ సంస్థ 80 శాతం ఆటోమేషన్ ను సాధిస్తుందని, ఫలితంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు (software engineers) ఉద్యోగాలు పోతాయని నవీన్ తివారీ వెల్లడించారు. 'మా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు వెళ్లిపోతారని అనుకుంటున్నాను. రెండేళ్లలో వారికి ఉద్యోగాలు ఉండవు' అని ప్రారంభ దశ ఇన్వెస్ట్ మెంట్ ప్లాట్ ఫామ్ లెట్స్ వెంచర్ నిర్వహించిన కార్యక్రమంలో తివారీ అన్నారు. ‘ఈ ఏడాది చివరి నాటికి సాఫ్ట్ వేర్ కోడింగ్ లో 80 శాతం ఆటోమేషన్ ను నా సీటీవో (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ) అందిస్తారు. ఇప్పటికే 50 శాతం సాధించాం. యంత్రం సృష్టించిన కోడ్లు వేగంగా, మెరుగ్గా ఉంటాయి. అలాగే అవి తమను తాము సరిచేసుకోగలవు" అని ఆయన లెట్స్ వెంచర్ సీఈవో శాంతి మోహన్‌తో అన్నారు.ఇన్మోబి సీఈవో నవీన్ తివారీమిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోండి..అత్యంత ప్రత్యేకమైన ఉద్యోగాలకు మొదట కృత్రిమ మేధ (ఏఐ) వస్తుందని, ఉద్యోగులు తమను తాము అప్ గ్రేడ్ చేసుకోవాలని తివారీ పిలుపునిచ్చారు. "మిమ్మల్ని మీరు అప్ గ్రేడ్ చేసుకోండి, మిమ్మల్ని అప్ గ్రేడ్ చేయమని నన్ను అడగకండి. ఎందుకంటే ఇది మనుగడ. మీ కింద ప్రపంచం మారుతోంది' అని ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.ఇది చదివారా? ఐటీ కంపెనీ కొత్త రూల్.. పరీక్ష పాసైతేనే జీతం పెంపుఇన్మోబిలో రెండు కంపెనీలు ఉన్నాయి. ఒకటి ఇన్మోబి యాడ్స్. ఇది అడ్వర్టైజింగ్ టెక్నాలజీపై పనిచేసే బిజినెస్-టు-బిజినెస్ కంపెనీ. మరొకటి గ్లాన్స్. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ ల కోసం రూపొందించిన స్మార్ట్ లాక్ స్క్రీన్ టెక్నాలజీ ప్లాట్ ఫామ్ ను అందించే కన్స్యూమర్ టెక్నాలజీ బిజినెస్-టు-కన్స్యూమర్ కంపెనీ. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గ్లాన్స్ ఎనేబుల్డ్ స్మార్ట్ఫోన్ల కోసం జెన్ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి గూగుల్ క్లౌడ్‌తో తాజాగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. -
రూ.40 లక్షల జాబ్.. రెజ్యూమ్ కూడా అవసరం లేదు!
ఈరోజుల్లో జాబ్ తెచ్చుకోవడం ఎంత కష్టమో చూస్తూనే ఉన్నాం. మంచి అకడమిక్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలి. అంటే మంచి పేరున్న కాలేజీలో చదివుండాలి. ఎన్ని నైపుణ్యాలు ఉన్నా వాటిని రెజ్యూమ్‌లో ఆకట్టుకునేలా పేర్కొనకపోతే ఉద్యోగం కష్టమే. అయితే ఇవేవీ లేకుండా హై పేయింగ్ జాబ్ ఇస్తానంటున్నారు బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ ఫౌండర్.బెంగళూరులో జాబ్.. ఏడాదికి రూ. 40 లక్షల వేతనం.. వారానికి ఐదు రోజులు ఆఫీసు నుంచి పని.. మంచి కాలేజీ నుంచి రావాల్సిన అవసరం లేదు.. అనుభవం అక్కర్లేదు.. కనీసం రెజ్యూమ్‌తో కూడా పని లేదు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదంటూ కంపెనీ ఫౌండర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పెట్టిన పోస్ట్ ఆసక్తిని రేకెత్తించింది.బెంగళూరులోని ఇందిరానగర్‌లో తమ కార్యాలయానికి సున్నా నుంచి రెండేళ్ల వరకూ అనుభవం ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను నియమించుకోవాలని చూస్తున్నట్లు ‘స్మాలెస్ట్ ఏఐ’ కంపెనీ అధినేత సుదర్శన్ కామత్ తెలిపారు. "‘స్మాలెస్ట్ ఏఐ’ కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో క్రాక్డ్ ఫుల్ స్టాక్ ఇంజనీర్ ను నియమించాలని చూస్తున్నాం. మిమ్మల్ని పరిచయం చేసుకుంటూ ఒక చిన్న 100 పదాల టెక్స్ట్ పంపండి చాలు" అంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. "మీది ఏ కాలేజీ అనేది ముఖ్యం కాదు".. "రెజ్యూమ్ అవసరం లేదు" అంటూ పేర్కొన్నారు.ఇక్కడ "క్రాక్డ్ ఇంజనీర్స్" అనేది నూతన మార్పులకు, కొత్త ఆలోచనలకు భయపడని అత్యంత సమర్థనీయులైన, ప్రతిభావంతులైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లని వర్ణించడానికి ఉపయోగించే పదం. ఈ పోస్ట్ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ గా మారింది. ఆకట్టుకునే రెజ్యూమె కంటే నైపుణ్యాలకు కామత్ ప్రాధాన్యత ఇచ్చారని పలువురు ఎక్స్ యూజర్లు ప్రశంసించారు. అయితే క్రాక్డ్ ఇంజనీర్ కు ఈ జీతం చాలా తక్కువ అని మరికొందరు వ్యాఖ్యానించారు.We are looking to hire a cracked full-stack engineer at @smallest_AI Salary CTC - 40 LPASalary Base - 15-25 LPASalary ESOPs - 10-15 LPAJoining - ImmediateLocation - Bangalore (Indiranagar)Experience - 0-2 yearsWork from Office - 5 days a weekCollege - Does not matter…— Sudarshan Kamath (@kamath_sutra) February 24, 2025 -
ఏఐ ఏజెంట్.. సాఫ్ట్వేర్ ఇంజినీర్లపై ప్రభావం!
ఓపెన్ఏఐ (OpenAI) తన 'ఏఐ ఏజెంట్'ను అనేక కొత్త దేశాలకు విస్తరించింది. గతంలో యునైటెడ్ స్టేట్స్‌లోని చాట్‌జీపీటీ ప్రో వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండే 'ఏఐ ఏజెంట్' ఇప్పుడు.. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, భారతదేశం, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాల్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది.స్విట్జర్లాండ్, నార్వే, లీచ్టెన్స్టెయిన్, ఐస్‌లాండ్‌తో సహా కొన్ని యూరోపియన్ దేశాలలో దీనిని యాక్సెస్ చేయడానికి ఇంకా కొంతకాలం వేచి ఉండాల్సి ఉంది. ఈ విషయాన్ని సంస్థ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.Operator is now rolling out to Pro users in Australia, Brazil, Canada, India, Japan, Singapore, South Korea, the UK, and most places ChatGPT is available.Still working on making Operator available in the EU, Switzerland, Norway, Liechtenstein & Iceland—we’ll keep you updated!— OpenAI (@OpenAI) February 21, 2025యూజర్లు ఇచ్చే ఆదేశాలను అనుసరించి ఏఐ ఏజెంట్ పనిచేస్తుంది. కఠినమైన ఆన్లైన్ టాస్క్‌లను సైతం అవలీలగా నిర్వహించగలిగిన ఈ ఏఐ ఏజెంట్.. ఆపరేటర్ కంప్యూటర్ యూజింగ్ ఏజెంట్ ఆధారంగా పనులు పూర్తి చేస్తుంది. ఇది టెక్స్ట్, ఇమేజ్ వంటి ఇన్పుట్లను స్వీకరించి.. లోపాలను పరిష్కరిస్తుంది. కాబట్టి యూజర్ వేరొక పనిలో ఉన్నప్పుడు, ఈ ఏఐ ఏజెంట్ స్వతంత్రంగా పనిచేస్తుంది. తద్వారా ఉత్పాదకత పెరుగుతుంది.ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేసే పనులను ఏఐ ఏజెంట్ పూర్తి చేస్తుందని.. ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్‌మన్' గతంలోనే వెల్లడించారు. కానీ ఏఐ ఏజెంట్స్.. వాటికి అప్పగించిన పనులు మాత్రమే చేస్తాయి. సొంతంగా ఆలోచించగలిగే జ్ఞానం వాటికి లేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ ఏఐ ఏజెంట్ ఉపయోగపడుతుందని అన్నారు.ఇదీ చదవండి: 'భారత్‌లో టెస్లా కార్ల ధరలు ఇలాగే ఉంటాయి!': సీఎల్ఎస్ఏ రిపోర్ట్సాఫ్ట్వేర్ ఇంజినీర్లను ఏఐ ఏజెంట్ పూర్తిగా భర్తీ చేయలేకపోవచ్చు, కానీ ఆ రంగంపై.. ప్రభావం చూపుతుంది. కొంతమందిపై అయిన ప్రభావం చూపుతుంది. దీంతో కొందరు ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది. -
రూ.20 లక్షలు ఇస్తా.. నన్ను మరిచిపో..
బంజారాహిల్స్(హైదరాబాద్) : ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. సదరు యువతితో చనువుగా మెదిలాడు. పెళ్లి మాట ఎత్తేసరికి మాత్రం.. మరిచిపో అంటూ తాపీగా చెప్పేశాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధిత యువతి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని గాయత్రీహిల్స్‌లో నివసిస్తున్న సాయిప్రణీత్ (26) సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పని చేస్తున్నాడు. ఆయన బెంగళూరులో ఉన్న సమయంలో 2023లో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ఒకే హాస్టల్ గదిలో పేయింగ్ గెస్ట్‌గా ఉండేవారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నమ్మిన యువతి సాయిప్రణీత్‌తో సాన్నిహిత్యం పెంచుకుంది. అనంతరం నగరంలోని గాయత్రీ హిల్స్‌కు మకాం మార్చిన సాయిప్రణీత్.. కొద్ది రోజులు యువతితో కలిసి సహజీవనం కూడా చేశాడు. తన చెల్లెలి పెళ్లి తర్వాత మన పెళ్లి జరుగుతుందంటూ ఆమెను నమ్మించి గత ఏడాది నవంబర్‌లో వెళ్లిపోయాడు.మీ చెల్లెలి పెళ్లి ఫొటోలు పంపించాలని యువతి చెప్పగా.. కొన్నింటిని పంపించాడు. ఆ ఫొటోలను చూసి అనుమానం వచ్చినది బాధితురాలు ఇటీవల మరింతగా ఒత్తిడి చేయడం ప్రారంభించింది. దీంతో రెండు రోజుల క్రితం సాయిప్రణీత్ గదికి వెళ్లిన ఆమెను కొట్టి.. మెడ పట్టి గెంటివేశాడు. ఇన్ని రోజులు నాతో తిరిగినందుకు ఖరీదుగా రూ.20 లక్షలు ఇస్తాను.. మన బంధం మరిచిపో అంటూ చెప్పేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు జూబ్లీహిల్స్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
ఆన్లైన్ బెట్టింగ్‌లో రూ.కోటి రూపాయలు పోగొట్టుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి!
కామారెడ్డి క్రైం: ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసైన ఓ యువకుడు.. అప్పుల ఊబిలో కూరుకుపోయి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి మున్సిపా లిటీ పరిధిలోని దేవునిపల్లికి చెందిన దేవుల సంజయ్ (28)సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొద్ది రోజులుగా ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. ఆన్లైన్ బెట్టింగ్ కోసం అప్పులు చేశాడు. ఆరు నెలల కిందట అప్పుల విషయంలో భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపో యింది. అప్పులు సుమారు రూ. కోటి వరకు చేరుకోవడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక, జీవితంపై విరక్తి చెంది సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య శ్రీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని దేవుని పల్లి ఎస్సై రాజు తెలిపారు. -
Software Engineer: ప్రవళిక ఎందుకమ్మా ఇలా చేశావు..!
కీసర(హైదరాబాదు): ఉరివేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం కీసర పోలీస్‌స్టేషన్(Keesara Police Station) పరిధిలోని కీసర దాయరలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి కీసర దాయరకు చెందిన ప్రవళిక(23) నగరంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా(Software Engineer) పని చేస్తోంది. ఆదివారం మధ్యాహ్నం ఆమె తల్లిదండ్రులతో పాటు, సోదరుడు బయటికి వెళ్లారు.సాయంత్రం ఇంటికి వచ్చే సరికి ప్రవళిక(Pravallika) ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు. -
సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బలితీసుకున్న వివాహేతర సంబంధం
విజయనగరం క్రైమ్: తెర్లాం మండలం నెమలాం గ్రామానికి చెందిన ఇంజినీరు కోనారి ప్రసాద్ (28) హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ నెల 10న హత్యకు పాల్పడిన అన్నదమ్ములైన ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేశామన్నారు. హత్య వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి, బొబ్బిలి సీఐ నారాయణరావు, తెర్లాం ఎస్ఐ సాగర్‌బాబుతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మృతుడు కోనారి ప్రసాద్‌కు నెమలాం గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఇద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్‌లను భర్త అచ్యుతరావు గమనించాడు. విషయాన్ని తమ్ముడు శివకృష్ణకు చెప్పాడు. ఇద్దరూ కలిసి ప్రసాద్‌ను అంతమొందించాలని నిర్ణయించారు. బెంగళూరులో పనిచేస్తున్న ప్రసాద్ గ్రామానికి రావడంతో హత్యపథకం అమలుచేయాలని నిశ్చయానికి వచ్చారు. ఆయనతో ముందురోజు మాట్లాడారు. విజయరాంపురంలోని అమ్మమ్మవారి ఇంటికి వెళ్తున్న విషయం, తిరిగి ఏ సమయానికి వస్తాడన్న విషయం తెలుసుకున్నారు. మాట్లాడదామని నెమలాం సమీపంలోని వారి పొలాల వద్దకు పిలిచారు. ప్రసాద్‌తో శివకృష్ణ మాట్లాడుతుండగా వెనుకనుంచి తలపై కర్రతో అచ్యుతరావు బలంగా మోదాడు. తర్వాత ఇద్దరూ కలిసి కర్రలతో దాడిచేశారు. పారిపోయే ప్రయత్నంలో ప్రసాద్ కాలుజారి పిల్లకాలువలోని రాయిపై పడిపోవడంతో అక్కడకు వెళ్లి మరోసారి దాడిచేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృత దేహాన్ని రోడ్డుపై తెచ్చి పడేశారు. అనంతరం బైక్‌ను కూడా కర్రలతో ధ్వంసం చేసి రోడ్డుపై పడేసి ఇంటికి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు తొలుత ప్రమాదంగా అనుమానించారు. ఘటనా స్థలాన్ని చూసి హత్యగా అనుమానించి దర్యాప్తు చేశారు. సీఐ నారాయణరావు ఆధ్వర్యంలో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి నిందితులను పట్టుకున్నారు. కేసును వేగవంతంగా ఛేదించిన బొబ్బిలి డీఎస్పీ, సీఐ, తెర్లాం ఎస్ఐలను ఎస్పీ అభినందించారు. -
సర్పంచ్‌గా పోటీ చేయాలని అమెరికా నుంచి వచ్చేశాడు..
చిన్నశంకరంపేట(మెదక్): అమెరికాలో ఉద్యోగం చేస్తున్న యువకుడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు స్వగ్రామానికి తరలివచ్చాడు. మెదక్ జిల్లా (Medak District) చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన కంజర్ల చంద్రశేఖర్ అమెరికాలో పదేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా (Software Engineer) పనిచేస్తున్నారు. గతంలో 25 ఏళ్లు చిన్నశంకరంపేట సర్పంచ్‌గా పనిచేసిన తన తాత శంకరప్ప స్ఫూర్తితో.. త్వరలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని సంకల్పించారు. దీంతో చంద్రశేఖర్ దంపతులు అమెరికా నుంచి బుధవారం చిన్నశంకరంపేట (Chinna Shankarampeta) చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక యువకులు అనంత పద్మనాభస్వామి గుట్ట నుంచి సోమేశ్వరాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి వారికి స్వాగతం పలికారు. అనంతరం చంద్రశేఖర్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన తాత స్ఫూర్తితో గ్రామానికి సేవ చేసేందుకు స్వగ్రామానికి వచ్చానని చంద్రశేఖర్ తెలిపారు.చదవండి: లోన్ కట్టలేదని ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం
గచ్చిబౌలి (హైదరాబాద్): రాంగ్ రూట్లో వచ్చిన ట్రాలీ ఆటో ఢీ కొట్టడంతో బైక్‌పై వెళుతున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం పాలైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మహేష్ గౌడ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మసీద్‌బండలో పీజీ హాస్టల్లో ఉంటున్న ప్రతిభా చంద్(25) గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున అతను బైక్‌పై గచ్చిబౌలి నుంచి మసీద్‌బండకు వెళుతున్నాడు. గచ్చిబౌలి స్టేడియం ఎదుట పాలప్యాకెట్ల లోడ్‌తో రాంగ్ రూట్లో వచ్చిన టాటా ఏసీ ట్రాలీ ఆటో అతడిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రతిభా చంద్‌ను కేర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి హెల్మెట్ ధరించనందునే తలకు తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘రూ.కోటి జీతమిచ్చినా సాఫ్ట్వేర్ ఉద్యోగులంతే’
భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగులపై తీవ్ర విమర్శలు చేశారు అమెరికాకు చెందిన ఓ కంపెనీ సీఈవో. భారత్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రూ. 1 కోటి వరకు అధిక జీతాలు ఇస్తున్నా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా లేరని విమర్శించారు. ఐఐటీ పూర్వ విద్యార్థి అయిన వరుణ్ ఉమ్మడి తన కంపెనీ భారతీయ కార్యాలయానికి నియామకం ఇబ్బందిగా మారిందని, చాలా మంది ఇంజనీర్లు కూడా వారానికి ఆరు రోజులు పని చేయడానికి కూడా ఇష్టపడటం లేదంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు."మా భారతీయ కార్యాలయానికి ఇంజనీర్లను నియమించుకోవడంలో ఒక విచిత్ర పరిస్థితిని గమనించాను. రూ. 1 కోటి మూల వేతనం ఉన్నప్పటికీ, చాలా మంది కష్టపడి పనిచేయడానికి ఇష్టపడటం లేదు. 3 నుంచి 8 సంవత్సరాల అనుభవం ఉన్న ఇంజనీర్లు చాలా మంది వారానికి ఆరు రోజులు పని చేయడానికి ముందుకు రాలేదు" అంటూ వరుణ్ రాసుకొచ్చారు.వరుణ్ ‘ఎక్స్’ పోస్ట్‌కు లక్షలలో వ్యూస్ వచ్చాయి. భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగులపై ఆయన చేసిన వ్యాఖ్యలపై యూజర్ల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన వచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాత్రమే కాదు.. ప్రస్తుతం అన్ని వృత్తులలోనివారూ మెరుగైన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోరుకుంటున్నారని చాలా మంది వినియోగదారులు కామెంట్స్ చేశారు.ఉద్యోగులను ఆదివారాలు కూడా పని చేయాలంటూ ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలతో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ వివాదం మళ్లీ రాజుకుంది. ఈ నేపథ్యంలో వరుణ్ ఉమ్మడి చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి. ఉద్యోగులతో వారానికి ఆరు రోజులు ఎందుకు పని చేయిస్తున్నారంటూ కొంతమంది ఎక్స్ యూజర్లు వరుణ్‌ను ప్రశ్నించారు. -
HYD:చైనా మాంజా తగిలి టెకీకి గాయాలు
సాక్షి,హైదరాబాద్:నగరంలో నిషేధిత చైనా మాంజా తగిలి మరొకరికి గాయాలయ్యాయి. ఉప్పల్ డీఎస్ఎల్ కంపెనీ భవనంలోని బైక్‌పై వెళ్తుండగా ఘటన జరిగింది. మాంజా దారం తగిలి సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయివర్థన్‌రెడ్డి కింద పడిపోయారు. దీంతో అతడి మెడకు గాయమైంది. గాయాలపాలైన ఆయనను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. సాయివర్ధన్‌రెడ్డి కుషాయిగూడకు చెందినవారు. చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించినప్పటికీ గాలిపటాలు ఎగురవేసేందుకు ఇప్పటికీ దానిని వాడుతున్నారు. పులువురు వ్యాపారులు పండగ వేళ సొమ్ము చేసుకునేందుకు అక్రమంగా చైనా మాంజా విక్రయాలు సాగిస్తున్నారు. గాలిపటాలు ఎగురవేయడంలో పక్కవారి మీద పైచేయి సాధించేందుకు చైనా మాంజాను వాడుతున్నారు. చైనా మాంజా వాడిన గాలిపటాలు దారంతో సహా తెగి పడి రోడ్లపై వేలాడుతున్న చోట వాహనదారులు చూసుకోకుండా వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో వారు తీవ్ర గాయాలపాలవుతున్నారు. హైదరాబాద్‌లో పోలీసులు మంగళవారం జరిపిన దాడుల్లో చైనా మాంజా భారీగా పట్టుబడడం గమనార్హం. ఇదీ చదవండి: మీకు తెలియకుండా మీ ఫొటోలు ఇన్‌స్టాలో -
‘దారి’తప్పిన పోలీసులు.. మూడ్ బాగోలేదంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై దాడి
సాక్షి, అనంతపురం: జిల్లాలో పోలీసులు దారి తప్పారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై దాష్టీకం చూపారు. సమాచారం అడిగితే విచక్షణారహితంగా దాడి చేసిన పోలీసుల వైనం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. అనంతపురం నగరానికి చెందిన యువకుడు ఇంతియాజ్ అహ్మద్ బెంగళూర్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అనంతపురం ఆర్టీవో కార్యాలయం వద్ద నివసించే ఇంతియాజ్ ఇంట్లో చోరీ జరిగింది. ఇదే సమయంలో తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారు.తల్లికి ఇడ్లీ తెచ్చేందుకు సూర్యా నగర్ రోడ్డులోని ఓ హోటల్‌కు వెళ్లారు. ఇదే సమయంలో కానిస్టేబుల్ నారాయణస్వామి, హోం గార్డు దాదాపీర్ కనిపించడంతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఇంతియాజ్ వారితో మాట్లాడారు. తన ఇంట్లో చోరీ జరిగిందని.. తాను ఉన్న ఇళ్లు ఏ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందని కానిస్టేబుల్ నారాయణస్వామిని అడిగారు. తన మూడ్ బాలేదని... తాను ఎలాంటి సమాచారం ఇవ్వలేనని కానిస్టేబుల్ నారాయణస్వామి.. ఇంతియాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగక అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు కానిస్టేబుల్. విచారించాల్సిన హోంగార్డు కూడా కానిస్టేబుల్ నారాయణస్వామికి మద్దతు ఇవ్వటంతో ఇద్దరూ కలిసి ఇంతియాజ్ పై దాడి చేసి కొట్టారు. అనంతపురం పోలీసుల దాష్టీకం సీసీ కెమెరాలలో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.పోలీసుల చేతిలో గాయపడిన ఇంతియాజ్ అహ్మద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అండగా నిలిచారు. అకారణంగా దాడి చేసిన పోలీసులపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని అనంతపురం మేయర్ మహమ్మద్ వాసీం, ఇతర పార్టీ నేతలు డీఎస్పీ కి ఫిర్యాదు చేశారు.అనంతపురం జిల్లాలో పోలీసుల వైఖరి రోజు రోజుకూ వివాదాస్పదం అవుతోంది. అనంతపురం టవర్ క్లాక్ వద్ద ఇటీవల ఓ వ్యక్తి పై ట్రాఫిక్ కానిస్టేబుళ్లు దాడి చేశారు. అనంతపురం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓ లాయర్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటనలు మరువకముందే ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఇంతియాజ్ పై దాడి చేయడం పోలీసుల పనితీరును ప్రశ్నిస్తోంది.ఇదీ చదవండి: తిరుమల: బంగారు బిస్కెట్ చోరీ ఘటన కీలక మలుపు -
వివాహమైన 3 వారాలకే సాఫ్ట్వేర్ ఉద్యోగి బలవన్మరణం
రాజేంద్రనగర్: పెళ్లయిన 3 వారాలకే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన అరుణ్ (28) ఇదే ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని (21)తో 21 రోజుల క్రితం వివాహం జరిగింది. అనంతరం వీరు హైదర్‌గూడలో అద్దె ఇంట్లోకి వచ్చారు. అరుణ్‌కు నైట్ షిఫ్ట్ కాగా.. ఆయన భార్య ఉదయం షిఫ్ట్ ముగించుకుని మంగళవారం రాత్రి ఇంటికి వచ్చి చూడగా.. గది తలుపులు మూసి ఉన్నాయి. ఎంత పిలిచినా లోపలి నుంచి సమాధానం రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఘటన స్థలానికి చేరుకొని డోర్ తెరిచి చూడగా అరుణ్ ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సిటీ చూసొద్దామని బయలుదేరి.. మృత్యుఒడికి..
మాదాపూర్: సరదాగా రాత్రి వేళ నగరాన్ని చూసొద్దామని బయలుదేరిన ఇద్దరు ఐటీ ఉద్యోగులు ‘అతివేగం’ కారణంగా మృత్యు ఒడికి చేరారు. అదుపు తప్పిన వేగంతో బైకు నడిపి అనంతలోకాలకు చేరారు. ఈ సంఘటన మాదాపూర్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. మాదాపూర్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం..కరీంనగర్‌కు చెందిన ఆకాం„Š (24), నెల్లూరుకు చెందిన రఘుబాబు స్నేహితులు. వీరిద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. గురువారం అర్థరాత్రి దాటాక దాదాపు 12.30 గంటల సమయంలో ఇద్దరు మోటార్ సైకిల్ (టీఎస్ 02 ఎఫ్ఈ 8983)పై బోరబండ నుంచి మాదాపూర్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో పర్వత్‌నగర్ సిగ్నల్ దాటిన తరువాత ఆకాంక్షా నడుపుతున్న బైక్ అదుపుతప్పి రోడ్ డివైడర్‌ను వేగంగా ఢీకొని.. ఇద్దరు రోడ్డుపై పడిపోయారు. బైకు కొద్దిదూరం రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వీరిని చికిత్స నిమిత్తం మెడికవర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బైక్ నడుపుతున్న వ్యక్తి… pic.twitter.com/ebLjSuNVrM— Telugu Scribe (@TeluguScribe) December 27, 2024 -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
గచి్చబౌలి: అర్థరాత్రి అతి వేగంగా మృత్యు శకటంలా దూసుకొచి్చన ఓ టిప్పర్ బైక్‌ను ఢీ కొనడంతో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గచి్చ»ౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భాను ప్రసాద్ తెలిపిన మేరకు.. ఖమ్మం జిల్లా బయ్యారం, ఉప్పలపాడు లక్ష్మీ నర్సింహపురానికి చెందిన చల్లా లోహిత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేసే తన అన్న చల్లా నవనీత్, స్నేహితులతో కలిసి గౌలిదొడ్డిలోని జగన్‌రెడ్డి మెన్స్ పీజీలో నివాసం ఉంటున్నారు. గౌలిదొడ్డిలో నివాసం ఉండే స్నేహితుడు తెనాలికి చెందిన రావిపూడి సాయి మహేష్ బాబు(24)తో కలిసి లోహిత్ డొమినార్ బైక్‌పై శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత హాస్టల్ నుంచి బయటకు వెళ్లాడు. అన్వయ కన్వెన్షన్ సమీపంలో వీరి బైక్‌ను వేగంగా వచి్చన టిప్పర్ ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న లోహిత్, మహే‹Ùబాబు ఇద్దరూ కిందపడ్డారు. లోహిత్ తలపై నుంచి టిప్పర్ వెళ్లడంతో చిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదంలో గాయపడిన సాయి మహేష్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. టిప్పర్ డ్రైవర్ అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. టిప్పర్ డ్రైవర్ అశోక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మరొకరికి తీవ్ర గాయాలు -
మాదాపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య
-
HYD: మైండ్ స్పేస్ భవనం వద్ద టెకీ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హైటెక్ సిటీలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మైండ్ స్పేస్ టవర్‌పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. హైటెక్ సిటీలో వద్ద ఉన్న మైండ్ స్పేస్ టవర్‌లో 13వ ఫ్లోర్ నుంచి దూకి టెకీ వంగ నవీన్ రెడ్డి(24) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నవీన్ రెడ్డి ఎన్సీఆర్ యోయిస్ కంపెనీలో పని చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
డివైడర్‌ను ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
గచ్చిబౌలి: అతివేగం ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల ప్రాణాలను బలిగొంది. మితిమీరిన వేగం ఎంతటి ప్రమాదమో ఈ విషాదకర ఘటన తెలియజెప్పింది. గచ్చిబౌలి పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకన్న స్వామి (30), దేవ్ కుమార్ స్వామి (25) అనే యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు దుర్మరణం చెందారు. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ హబీబుల్లా ఖాన్ తెలిపిన వివరాలప్రకారం.. ఏపీలోని కాకినాడకు చెందిన కేవీ కృష్ణారావు కుమారుడు కేసాని వెంకన్న స్వామి అమెజాన్ కంపెనీలో, వైజాగ్‌లోని హరిజన బస్తీకి చెందిన చెందిన పిల్లి కుమార స్వామి కుమారుడు దేవ్‌కుమార్ స్వామి మైక్రోసాఫ్ట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. నానక్‌రాంగూడలో ఓ పీజీ హాస్టల్లో ఉంటున్నారు. గురువారం రాత్రి వీరిద్దరూ కలిసి సెకండ్ షో సినిమాకు వెళ్లారు. సినిమా చూసి శుక్రవారం తెల్లవారు జామున 2.15 గంటల సమయంలో బైక్‌పై వస్తుండగా ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద ఎడమ వైపు ఉన్న డివైడర్‌ను ఢీకొట్టారు. బైక్ ఎగిరి పల్టీ కొట్టింది. ఇద్దరూ కిందపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కొండాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అతివేగం కారణంగానే బైక్ అదుపుతప్పి ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. గచి్చ»ౌలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదం మిగిల్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం కేసు
సాక్షి, కృష్ణా జిల్లా: సాఫ్ట్వేర్ ఉద్యోగి సుమంత్ అదృశ్యం కేసు చివరికి విషాదాన్ని మిగిల్చింది. అవనిగడ్డ మండలం తుగలవానిపాలెంలో ఉద్యోగి మృతదేహం లభ్యమైంది. స్నేహితుని వద్దకు వెళ్లి వస్తానని చెప్పి చల్లపల్లికి చెందిన బొడ్డు సుమంత్ ఇంటి నుంచి బయటికి వెళ్లారు.అయితే, రెండు రోజుల క్రితం పులిగడ్డ-పెనుమూడి వారధి పై సుమంత్ బైక్, ఫోన్, పర్సు లభ్యమయ్యాయి. కృష్ణానదిలో దూకి ఉంటాడనే అనుమానంతో రెండు రోజులుగా పోలీసులు, కుటుంబసభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. సుమంత్ మృతదేహం లభ్యం కావడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్లను కలవరపెడుతున్న గూగుల్!
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చేసిన ప్రకటన సాఫ్ట్వేర్ ఇంజినీర్లను కలవరపెడుతోంది. కంపెనీ ఇటీవలి మూడో త్రైమాసిక 2024 అర్నింగ్ కాల్ సందర్భంగా ఆయన గూగుల్ కొత్త కోడ్‌లో 25 శాతం ఇప్పుడు కృత్రిమ మేధస్సు (AI) ద్వారానే రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.దీని వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కోడర్లు కలవరపడాల్సిన పనేంటి అంటే ఇది కోడింగ్ ల్యాండ్‌స్కేప్‌లో ప్రాథమిక మార్పును సూచిస్తోంది. ఇక్కడ పనిభారాన్ని ఏఐ ఎక్కువగా పంచుకుంటోంది. దీనివల్ల కోడర్లు పూర్తి తమ ఉద్యోగాలను కోల్పోతారని చెప్పడం లేదు. కానీ ఇంజనీర్లు ఉన్నత-స్థాయి సమస్య-పరిష్కారం, ఆవిష్కరణలపై మరింత దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను ఏఐ గుర్తు చేస్తోంది.నైపుణ్యాలు పెంచుకోవాల్సిందే..ఆటోమేషన్ సామర్థ్యం పెరుగుతున్నకొద్దీ ఎంట్రీ-లెవల్, రొటీన్ కోడింగ్ ఉద్యోగాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏఐ వినియోగం పెరుగుతున్న క్రమంలో పోటీని తట్టుకుని నిలబడాలంటే ఇంజనీర్లు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అనివార్యత ఏర్పడుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి గూగుల్ ఎంత ప్రాధాన్యత ఇస్తోందనే దానికి ఇది ఉదాహరణగా నిలుస్తోంది."గూగుల్ కొత్త కోడ్లలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ ఏఐ ద్వారా రూపొందింది" అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అర్నింగ్ కాల్‌పై బ్లాగ్ పోస్ట్‌లో రాశారు. కోడింగ్ ప్రక్రియలను వేగవంతం చేయడానికి ఏఐని వినియోగిండం ద్వారా ఆవిష్కరణ అభివృద్ధిలో సమయం ఆదా చేయడంలో ఇంజినీర్లకు తోడ్పాటు అందించడం కంపెనీ లక్ష్యమని సుందర్ పిచాయ్ చెప్పారు. -
హైదరాబాద్ లో విషాదం.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్...
-
హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: కోకాపేట్లో విషాదం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏడు అంతస్తుల భవనంపై నుంచి దూకి బలవన్మరణం చెందారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగ ప్రభాకర్ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. కోకాపేట్లో హాస్టల్ గదికి వచ్చి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. నాగ ప్రభాకర్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పని ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.మూడో అంతస్తు నుంచి పడి వ్యక్తి మృతి మూడవ అంతస్తు నుంచి పడి ఓ మృతి చెందిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్, గోరఖాపూర్ ప్రాంతానికి చెందిన గణేష్(19) సొంత గ్రామానికి అఖిలేష్, అజిద్, మజ్ను కలిసి నగరానికి వచ్చి ఎల్బీనగర్ చింతల్‌కుంట ఎల్పీటీ మార్కెట్ వెనుక వైపు సిల్క్ టవర్ బిల్డింగ్ పని చేస్తూ అదే భవనంలోని మూడవ అంతస్తులో ఉంటున్నారు.ఈ నెల 22 రాత్రి అందరూ కలిసి మద్యం తాగారు. కూరగాయలు తీసుకు రావాలని గణేష్‌కు డబ్బులిచ్చి పంపారు. కానీ.. గణేష్ మళ్లీ మద్యం తాగి వచ్చాడు. అందరూ భోజనం చేసి పడుకున్నారు. మద్యం మత్తులో ఉన్న గణేషఅర్ధరాత్రి మూడవ అంతస్తు నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్నేహితులు నాగోలులోని ఓ హాస్పిటల్‌కు తరలించగా పరీక్షించిప వైద్యులు అప్పటికే గణేష్ మృతి చెందినట్లు నిర్ధారించారు. -
ఉద్యోగానికి సరిగ్గా సరిపోతారు.. అందుకే రిజెక్ట్!
కొత్త ఉద్యోగానికి సరిపడా అర్హతలు లేక చాలా మంది తిరస్కరణను ఎదుర్కొంటారు. తనకు అన్ని అర్హతలు ఉండి, సదరు కొత్త జాబ్‌ను చేయగల సమర్థత ఉన్నాసరే ఉద్యోగాన్ని పొందలేకపోవడంతో ఒక అమ్మాయి ఆశ్చర్యపోయింది. ఉద్యోగం ఇవ్వలేకపోవడానికి గల కారణాన్ని చూసి అవాక్కయింది. తర్వాత ఆ తిరస్కరణ తాలూకు వివరాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా అందరితో పంచుకుంది. గూగుల్‌లో ఉద్యోగం చేస్తూ.. అనూ శర్మ అనే ఈ అమ్మాయి ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థలో ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. మెరుగైన ఉపాధి అవకాశాలు, జీతం, కొత్త సవాళ్లను ఎదుర్కోవాలనే ఉద్దేశంతో వేరే సంస్థలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్లో రెజ్యూమ్, వివరాలు పంపారు. ఉద్యోగం తప్పకుండా వస్తుందనుకుంటే ‘తిరస్కరిస్తున్నాం’అన్న సందేశం వచి్చంది. ఉద్యోగంలోకి తీసుకోకపోవడానికి గల కారణాలను సంస్థ వివరించింది. ‘‘మీ రెజ్యూమ్‌ను క్షుణ్ణంగా పరిశీలించాం. ఇక్కడ తేలిందేమంటే సదరు ఉద్యోగానికి కావాల్సిన అర్హతలన్నీ మీలో ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే ఇంకాస్త ఎక్కువే ఉన్నాయి. ఇంతటి ప్రతిభావంతురాలు మాకు వద్దు. ఎందుకంటే ఎక్కువ ప్రతిభ ఉండి తక్కువ స్థాయి ఉద్యోగం చేసే వాళ్లలో సాధారణంగా ఒక రకమైన అసంతృప్తి ఉంటుంది. మరింత మెరుగైన ఉద్యోగాన్ని వీలైనంత త్వరగా వెతుక్కుని పాత ఉద్యోగాన్ని వదిలేస్తారు’’అని వివరణ ఇచి్చంది. ఇలాంటి కారణాలకు కూడా తిరస్కరిస్తారా? అని ఆమె ఆలోచనలో పడింది. ‘‘అర్హతలున్నా ఉద్యోగం ఎందుకు రాదో మీకు తెలుసా?’అంటూ అనూ శర్మ సంబంధిత సంస్థ రిప్లై స్క్రీన్‌షాట్‌ను ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు.స్పందనల వెల్లువఅనూ శర్మ పెట్టిన పోస్ట్‌కు స్పందనల వరద మొదలైంది. ‘‘అతి అర్హతలతో బాధపడుతున్నారా?’అని ఒక నెటిజన్ సరదాగా వ్యాఖ్యానించారు. ‘‘ఇదొక మంచి పరిణామానికి సంకేతం. ఒకరి దగ్గర పనిచేయడం మానేసి మీరే సొంతంగా కంపెనీ పెట్టి ఉద్యోగాలివ్వండి’అని మరొకరు ఉచిత సలహా ఇచ్చారు. ‘‘ఉద్యోగం చేసే స్థాయి మీకున్నా, ఇచ్చేస్థాయి మాకు లేదు అని కంపెనీయే ఒప్పుకుంది’’అని మరొకరు ట్వీట్‌చేశారు. సంస్థనూ మెచ్చుకున్న వాళ్లు కోకొల్లలు ఉన్నారు. ‘‘కంపెనీ మంచిపనే చేసింది. అర్హత కాస్తంత తక్కువ ఉంటే ఉద్యోగం ఇచ్చి, పని బాగా చేయించి రాటుదేలాలా చేస్తారు. ఈమెలాగే అప్పటికే మంచి ప్రతిభ ఉంటే మధ్యలోనే మానేస్తారు. అప్పుడు మళ్లీ నోటిఫికేషన్, రిక్రూట్మెంట్, శిక్షణ అంటూ సంస్థ ఉద్యోగ వేట మళ్లీ మొదలవుతుంది’’అని ఇంకో నెటిజన్ అభిప్రాయపడ్డారు. ‘‘కనీసం రెజ్యూమ్ చదవకుండా, ఏవేవో పిచ్చి కారణాలు చెప్పకుండా నిజాయతీగా రిప్లై ఇచ్చిన సంస్థను మెచ్చుకోవాల్సిందే’అని ఇంకొకరు ట్వీట్‌చేశారు. దీంతో సరిగ్గా సరిపోయే అర్హతలున్న వారికి ఉద్యోగం ఇవ్వాలా? లేదంటే కాస్తంత తక్కువ అర్హత ఉన్న వారికి ఉద్యోగం ఇచ్చి తమకు తగ్గట్లు తీర్చిదిద్దుకోవాలా? అన్న చర్చ మొదలైంది. – న్యూఢిల్లీ -
గంజాయి అమ్ముతూ నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగుల అరెస్ట్
సాక్షి, కూకట్పల్లి: ఏపీ నుంచి సిటీకి గంజాయి తెచ్చి అమ్ముతున్న నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులను బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ పార్కులో గంజాయి విక్రయిస్తున్న వీరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 1300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్ డీమార్ట్ సమీపంలోని పార్కులో నలుగురు యువకులు గంజాయి విక్రయిస్తున్నారంటూ పోలీసులకు సమాచారం వచ్చింది.పోలీసులు వెంటనే పార్కు వద్దకు చేరుకుని అనుమానాస్పద స్థితిలో కనిపించిన యువకులను అదుపులోకి తీసుకొని విచారించారు. కవర్ ప్యాకెట్లలో గంజాయి లభించింది. గంజాయి విక్రయిస్తున్న వారిలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాజేశ్ (24), రమేశ్ కృష్ణ (27), నక్కా నాగవంశీ (23), పల్నాడు జిల్లాకు చెందిన జంపనీ సాయిగోపీ విహారి (26) ఉన్నారు. ఈ నలుగురు యువకులు సాఫ్ట్వేర్ ఉద్యోగులని, కేపీహెచ్‌బీ హాస్టల్లో ఉంటూ జల్సాలకు అలవాటు పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరంతా రాజమండ్రి నుంచి గంజాయిని నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. వీరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
‘సాఫ్ట్‌వేర్‌లో పదేళ్ల అనుభవం.. ఆ ప్రశ్నతో చిరాకేసింది’
సాఫ్ట్వేర్ కంపెనీ ఇంటర్వ్యూకు వెళ్లిన పదేళ్ల అనుభవం కలిగిన బెంగళూరు మహిళా అభ్యర్థినికి చేదు అనుభవం ఎదురైంది. తన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఇంటర్వ్యూలో ప్రశ్నలు వస్తాయని భావించిన తనను బేసిక్, థెయరీ ప్రశ్నలు అడగడంతో అసహనానికి గురయ్యారు. దానికి సంబంధించిన వివరాలు ఆమె తన ‘రెడిట్’ ఖాతాలో షేర్ చేసుకున్నారు. ఆ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.‘నేను గత పదేళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నాను. కంపెనీ మారాలని నిర్ణయించుకుని ఓ సంస్థ ఇంటర్వ్యూకు వెళ్లాను. ఆంగ్యులర్, జావాస్క్రిప్ట్, టైప్స్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ మొదలైన ఫ్రంటెండ్ టెక్నాలజీల్లో నాకు అనుభవం ఉంది. సాధారణంగా ఈ అనుభవ స్థాయిలో ఇంటర్వ్యూ చేసేవారు లాజికల్ థింకింగ్, పని అనుభవానికి సంబంధించి అడ్వాన్స్ కాన్సెప్ట్‌లు, రియల్‌లైఫ్ ఎక్స్పీరియన్స్, కోడింగ్ నైపుణ్యాలకు చెందిన ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. కానీ నేను ఇంటర్వ్యూకు వెళ్లిన కంపెనీ విచిత్రంగా థియరిటికల్ ప్రశ్నలపై దృష్టిపెట్టింది. సీఎస్ఎస్ ద్వారా భారత జాతీయ జెండాను డ్రా చేయమని అడిగారు. వెంటనే ఇండియన్ ఫ్లాగ్ డ్రా చేశాను. అందులో అశోక చక్రాన్ని గీయమని అడిగారు. నేను దాన్ని కూడా డ్రా చేశాను. ఆపై అశోక చక్రం లోపల స్పైక్‌లు(ఆకులు) గీయమన్నారు. నేను వాటిని డ్రా చేయలేకపోయాను. వెంటనే ఇంటర్వ్యూ చేసే వ్యక్తితో ఎందుకు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారని అడిగాను. దీనికి ఆమె నా స్కిల్స్ పరీక్షించాలనుకుంటున్నట్లు సమాధానమిచ్చారు’ అని తెలిపారు.ఇదీ చదవండి: మూడు ఈఎంఐలతో రూ.13 లక్షలు ఆదా!‘ఫ్రంటెండ్ డెవలపర్‌గా పని చేయాలనుకునే వారికి ఇలాంటి ప్రశ్నలు అనవసరం. వాస్తవానికి కాలేజీ చదువుతున్నపుడు ప్రాక్టికల్ పరీక్షల సమయంలో మాకు ఇలాంటి ప్రశ్నలు వచ్చేవి. నాకు చాలా చిరాకేస్తుంది. నేను ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోతున్నాను’ అని ఆమె పోస్ట్‌లో తెలిపింది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. పదేళ్లు అనుభవం ఉన్న వ్యక్తికి ఎలాంటి ప్రశ్నలు అవసరంలేదని కొందరు అభిప్రాయపడ్డారు. అంత అనుభవం ఉన్నా బేసిక్ ప్రశ్నలకు ఎలా ఓపిగ్గా సమాధానం ఇస్తారో తెలుసుకోవడమే కంపెనీ ఉద్దేశమని ఇంకొందరు తెలిపారు. ఉద్యోగార్థుల స్వభావాన్ని తెలుసుకునేందుకే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని మరికొందరు చెబుతున్నారు. -
కన్నవారి రుణం తీర్చుకున్నావమ్మా..
పాలకొల్లు సెంట్రల్: జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకుంది ఓ కూతురు. పాలకొల్లు పట్టణంలోని 22వ వార్డు కొత్తపేట ప్రాంతానికి చెందిన యర్రంశెట్టి చైతన్య సాప్ట్వేర్ ఇంజనీర్. వృత్తిరీత్యా ఆమె హైదరాబాద్‌లో ఉంటున్నారు. గతేడాది డిసెంబర్ 31న తల్లి పుణ్యవతిదేవి మృతి చెందగా బంధువులు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో చైతన్య తలకొరివి పెట్టింది. ఆమె తండ్రి బాపయ్యనాయుడు (70) గత కొన్నేళ్లుగా మంచానికే పరిమితమై ఉన్నారు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్న ఆమె తండ్రిని చూసుకోవడానికి ఒక మనిషిని ఏర్పాటుచేసి నిత్యం తండ్రి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. గత ఆదివారం తండ్రి ఆరోగ్యం మరీ క్షీణించడంతో స్థానికుల సహకారంతో పట్టణంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. సోమవారం పాలకొల్లు వచ్చిన ఆమె ఆసుపత్రిలో ఉన్న తండ్రిని చూసుకుంటుంది. వారం రోజులుగా చికిత్స పొందుతున్న బాపయ్యనాయుడు మంగళవారం మృతి చెందాడు. తలకొరివి పెట్టడానికి బంధువులు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో తల్లికి చేసినట్లుగానే తండ్రికి కూడా చైతన్య అంత్యక్రియలు నిర్వహించి కన్నవారి రుణం తీర్చుకుంది. -
ట్రెండ్: 12 రోజుల్లో పెళ్లి.. పది నిమిషాల్లోనే ముగించేశారు!
తిరుపతికి చెందిన శ్రీనివాస్ కుమారుడు యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన తన కొడుకు వివాహానికి ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల్లోని బంధుమిత్రులకు ఆహా్వనం పంపేందుకు సన్నాహాలు చేపట్టారు. సమయం కేవలం 12 రోజుల మాత్రమే ఉండడంతో అందరికీ పత్రికలు పంచేందుకు వీలుకాని పరిస్థితి. కుమారుడి సలహా మేరకు బెంగళూరుకు వెళ్లి క్యూర్ స్కానర్‌తో వీడియో వెడ్డింగ్ కార్డులు, ఏటీఎం తరహాలో డిజిటల్ కార్డులు డిజైన్ చేయించారు. కేవలం 10 నిమిషాల్లోనే వాట్సాప్ ద్వారా బంధుమిత్రులకు ఆహ్వానం పలికేశారు. సరికొత్త ట్రెండ్‌తో అందించిన పెళ్లిపిలుపుపై ప్రతి ఒక్కరూ అభినందనలు తెలిపారు.తిరుపతి సిటీ : మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వివాహ, శుభకార్యాలకు ఆహ్వానించే విధానం వినూత్నంగా మారింది. గతంలో వివాహాది శుభకార్యాలకు బంధుమిత్రులకు పిలవాలంటే కనీసం నెలరోజుల ముందుగా వెడ్డింగ్ కార్డులు ముద్రించి వ్యయ ప్రయాసలకోర్చి గడపగడపకు వెళ్లి పంచాల్సి వచ్చేది. మారుతున్న కాలంతో పాటు అది కాస్తా ఫోన్ కాల్స్, మెసేజ్‌ల రూపంలోకి వచ్చేసింది. డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆధునిక యుగంలో ఆహా్వన పత్రికలు వీడియో వెడ్డింగ్ కార్డుల రూపంలో హల్చల్ చేస్తున్నాయి. మరింత ముందుకు వెళ్లిన అడ్వాన్డ్స్ టెక్నాలజీతో ఏటీఎం కార్డు తరహాలో క్యూఆర్ కోడ్‌తో డిజిటల్ వెడ్డింగ్ కార్డులు వచ్చేశాయి. ఏటీఎం తరహాలో కార్డులు పెళ్లికి బంధుమిత్రులను పిలించేందుకు క్యూఆర్ కోడ్‌తో ప్రింట్ చేసిన ఏటీఎం తరహా కార్డులు ప్రస్తుతం మార్కెట్లో విస్తృతంగా వాడుకలో ఉన్నాయి. వీడియో వెడ్డింగ్ ఇని్వటేషన్స్తో పాటు ఉన్నతస్థాయి బంధుమిత్రుల కోసం విజిటింగ్ కార్డ్స్ రూపంలో ఉండే డిజిటల్ వెడ్డింగ్ కార్డులు పంపుతున్నారు. ఏపీలో తొలిసారి పశి్చమగోదావరి జిల్లాలో ఓ కాంట్రాక్టర్ తన కుమారుడి వివాహం కోసం ఈ తరహా కార్డులను తయారు చేయించారు. ఇందులో కార్డుపై భాగంలో వధూవరుల ఫొటో, పేర్లు, ఆహా్వనించు తల్లిదండ్రుల పేర్లు మాత్రమే ఉంటాయి. వెనుక భాగంలో క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే వివాహనికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయి. పెళ్లిమండపం అడ్రస్, లొకేషన్ మ్యాప్, పెళ్లి పత్రిక, విందు టైమింగ్స్, ముహూర్త సమయంతో పాటు సంప్రదించాల్సిన వధువు, వరుడి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు పొందుపరిచి ఉంటాయి.ఇప్పుడు ఇదే ట్రెండ్ డిజిటల్ యుగంలో యువత బర్త్ డే, ఎంగేజ్మెంట్, గ్రాడ్యుయేషన్, బేబీ షవర్, ఆఫ్ శారీ ఫంక్షన్స్, గృహప్రవేశాలు వంటి అన్ని శుభకార్యాలకు వీడియో కార్డుల ద్వారా ఆహా్వనాలను వాట్సాప్‌లో పంపుతున్నారు. ఇంటర్నెట్, కంప్యూటర్‌పై అవగాహన ఉన్న ప్రతి వ్యక్తీ ఉచిత టెంప్లెట్స్ను డౌన్లోడ్ చేసుకుని తమకు నచ్చిన డిజైన్లలో ఆహ్వాన పత్రికలను తయారు చేసేస్తున్నారు. కరోనా తర్వాత ఆహా్వనాలను డిజిటల్ పద్ధతిలో పంపేందుకే ప్రజలు ఇష్టపడుతున్నారు. ప్రింటింగ్ కార్డులపై తగ్గిన మోజు వివాహ మహోత్సవంలో ప్రధాన భూమిక పోషించే వెడ్డింగ్ కార్డులు కాలానుగుణంగా రూపు మార్చుకుంటున్నాయి. బ్లాక్ అండ్ వైట్ కార్డులతో మొదలైన పెళ్లి పత్రికలు తర్వాత కలర్, యూవీ, లేజర్, ఫొటో ప్రింట్, సౌండ్ సిస్టమ్ కార్డులుగా మారాయి. ఈ ట్రెండ్ కొంతకాలం కొనసాగింది. రూ.2 నుంచి సుమారు రూ.20 వరకు ఒక్కోకార్డు «ప్రింటింగ్ ధర ఉండేది. ప్రస్తుతం నయా ట్రెండ్ మొదలైంది. డిజిటల్ యుగంలో వీడియో వెడ్డింగ్ కార్డులు మార్కెట్‌ను శాసించాయి. ప్రస్తుతం క్యూఆర్ కోడ్ స్కానర్‌తో రూపొందించిన డిజిటల్ కార్డుల వైపు యువత మొగ్గు చూపుతోంది. దీంతో ప్రింటింగ్ ప్రెస్ దుకాణాలు వెలవెలబోతున్నాయి.విశేషంగా స్పందన మా కాబోయే అల్లుడు లండన్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్. మాది కొత్త బంధుత్వం. ఆగస్టు 14న బెంగళూరులోని కల్యాణ మండపంలో సెపె్టంబర్ 2న వివాహం జరిపేందుకు పండితులు ముహూర్తం పెట్టారు. వధువరూలు ఆగస్టు 20న ఇండియాకు వచ్చారు. పదిరోజులు మాత్రమే సమయం ఉంది. బంధుమిత్రులకు ఎలా ఆహా్వనం పంపాలనే ఆలోచనలో పడ్డాం. మా అల్లుడి సలహాతో ఏటీఎం కార్డు సైజులో క్యూఆర్ కోడ్‌తో ఉన్న డిజిటల్ కార్డులను తయారు చేసి అందరికీ వాట్సాప్ ద్వారా పంపించాం. బంధుమిత్రులు ఇబ్బంది లేకుండా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకుని కల్యాణ మండపానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. చాలా సంతోషంగా అనిపించింది. – కోటేశ్వరరావు, తిరుపతిప్రింటింగ్ కార్డులు తగ్గాయి గతంలో ప్రతి ఏడాది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్‌లో సుమూహూర్తాలు ఉన్నందున పెళ్లికార్డుల ప్రింటింగ్‌కు ప్రజలు ఎగబడేవారు. బిజినెస్ అంతా ఆ మూడు మాసాల్లోనే జరిగేది. నగరంలోని ప్రతి ప్రింటింగ్ ప్రెస్ నిర్విరామంగా పనిచేసేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంత వాసులు మాత్రం అడపాదడపా తక్కువ క్వాంటిటీతో పెళ్లి పత్రికల కోసం వస్తున్నారు. సుమారు 50 శాతానికి పైగా బిజినెస్ తగ్గింది. కంప్యూటర్ కాలం, డిజిటల్ ఫోన్లు రాకతో పత్రికలకు డిమాండ్ భారీగా పడిపోయింది. – వెంకటేశ్వర్లు, ప్రింటింగ్ ప్రెస్ యజమాని, తిరుపతి -
మణికొండలో విషాదం.. గుండెపోటుతో టెక్కీ మృతి
సాక్షి, హైదరాబాద: మణికొండ అల్కాపూరి కాలనీలో విషాదం చోటుచేసుకుంది. అల్కాపూరి టౌన్ షిప్ గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్.. అనంతరం ఆకస్మికంగా మృతిచెందాడు. ఆదివారం రాత్రి టౌన్షిప్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగిన లడ్డు వేలం పాటలో శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నాడు. 15 లక్షల వరకు లడ్డు వేలంలో పాల్గొన్నాడు. అనంతరం స్నేహితుడు లడ్డూ కైవసం చేసుకోవడంతో గణనాథుడి వద్ద ఉత్సాహంగా డాన్స్‌లు చేశాడు. స్నేహితులతో కలిసి తీన్మార్ స్టెప్పులేశాడు. అయితే ఇంటికి వెళ్లిన తర్వాత గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. దీంతో కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు విషాదంలో మునిగిపోయారు.చదవండి: Ganesh Immersion: ఆ అనుభవాల నుంచి పాఠాలు! -
ఒత్తిడి తగ్గించుకునేందుకు ఆధ్యాత్మికత వైపు..
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడూ చెప్పుకొనేదే.. నగరంలో ఉరుకులు పరుగుల జీవితం.. మానసిక సమస్యలు, చిరాకులు, కుటుంబ సమస్యలకు దారి తీస్తున్నాయనే విషయం తెలిసిందే. ఒత్తిళ్లు తట్టుకోలేక ఆందోళనలకు గురవుతూ.. మత్తుపానీయాలకు బానిసలు అవుతున్నారు. కంపెనీల్లో ఒత్తిడి ఎంతలా ఉందంటే ఒత్తిడి నుంచి బయటపడేందుకు పలు కంపెనీల్లో ప్రత్యేకంగా స్మోకింగ్ జోన్స్ ఏర్పాటు చేశాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.చాలామంది ఉద్యోగులు వారాంతాల్లో కుటుంబంతో, స్నేహితులతో కలిసి జాలీగా గడిపేందుకు ప్లాన్స్ చేసుకుంటారు. సమీపంలోని ప్రశాంతంగా ఉండే రిసార్టులకు కొందరు వెళ్తుంటారు. మరికొందరు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ కుటుంబసభ్యులతో గడుపుతుంటారు. అయితే కొందరు ఉద్యోగులు.. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాత్రం భక్తి చింతన, ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్న వయసులోనే యువత కొత్త దారి వెతుక్కుంటూ.. నగరంలోని, శివారు ప్రాంతాల్లోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాల వైపు పరుగులు పెడుతున్నారు.ఎందుకిలా..? సాధారణంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ప్రాజెక్టులు, టార్గెట్లు, రిపోర్టులు, సబి్మషన్లు ఇలా ఒక్కటేమిటి ఎన్నో ఒత్తిళ్లతో రోజును భారంగా గడుపుతుంటారు. నెలాఖరు రాగానే లోన్లు, ఈఎంఐలు కట్టేందుకు నానా తిప్పలు మరింత కామన్. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆల్కహాల్, సిగరెట్ వంటి అలవాటు చేసుకుని, అధికంగా సేవిస్తుంటారు. దీనికి తోడు ఎలాంటి శారీరక వ్యాయామాలు లేకపోవడంతో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. దీంతో కలల ప్రపంచం ఒక్కసారిగా నేలకు దిగిపోతుంటుంది. అప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొత్త దారి వెతుక్కుంటారు. సాధారణంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ అనగానే వీకెండ్స్ పార్టీలకు వెళ్తుంటారు అని భావిస్తుంటారు. కానీ అక్కడికి వెళ్లినా కూడా తమ ఉద్యోగ జీవితాల ద్వారా వచ్చే ఒత్తిడిని తట్టుకునేంత ప్రశాంతత దొరకట్లేదని ఆధ్యాతి్మక చింతన మార్గాన్ని ఎంచుకుంటున్నారు.చిన్న వయసులోనే..వారాంతాల్లో నగరంలోని పలు దేవాలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు యువతీ, యువకులతో కిటకిటలాడుతున్నాయి. నగరంలోని పలు ప్రముఖ ఆలయాలు, ఆధ్మాత్మిక క్షేత్రాలతో పాటు శివారు ప్రాంతాల్లోని నగరాలకు కూడా ఉద్యోగులు క్యూ కడుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాత్రమే కాకుండా విద్యార్థులు కూడా ఇక్కడికి చేరుకుని చిన్న వయసులోనే వారిలో ఏర్పడిన ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ప్రయతి్నస్తున్నారు. ముఖ్యంగా ఏకాంతంగా కూర్చుని దేవుడి ముందు ధ్యానం చేసుకుంటూ కనిపిస్తున్నారు. నగరంలోని ఇస్కాన్ టెంపుల్స్, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ వంటి క్షేత్రాల్లో నృత్యాలు చేస్తూ తన్మయత్వం చెందుతున్నారు. కృష్ణుడి సంకీర్తనలు, భజనలు చేసుకుంటూ వారిలోని ఆధ్యాత్మిక భావాన్ని చాటుకుంటున్నారు. జీవితానికి కొత్త ఒరవడిని చూపుకొంటున్నారు. జీవిత సత్యాన్ని తెలుసుకునేందుకు అన్వేషిగా బయల్దేరుతున్నారు.ఆ రోజులే బాగున్నాయి.. చాలీచాలని డబ్బులతో ఉద్యోగం కోసం వెతుక్కుంటూ హైదరాబాద్‌లో తిరిగిన రోజులే బాగున్నాయి. అప్పుడు ఉద్యో గం వస్తే చాలు అనుకునే వాడిని. ఇప్పుడు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం.. లక్షల్లో జీతం.. అయినా ఏదో పోగొట్టుకున్న వెలితి ఉంది. సవాలక్ష సమస్యలు చుట్టు ముడుతున్నట్లు ఉంది. ప్రశాంతత అనే మాటే కరువైంది. నెలాఖరు రాగానే లోన్లు.. ఈఎంఐల వెంట పరిగెత్తాల్సి వస్తోంది. డబ్బులు అన్నీ ఇవ్వదనే విషయం అవగతమవుతోంది. అందుకే భక్తి మార్గం ప్రశాంతతను ఇస్తుందనే ఉద్దేశంతో ప్రతి వారం ఏదైనా గుడికి వెళ్లి ఒంటరిగా కాసేపు గడుపుతాను. – నల్లం నవీన్, సాఫ్ట్వేర్ ఇంజినీర్మనసుకు ప్రశాంతత నాకు ఆధ్యాతి్మక భావన ఎక్కువ. చిన్నప్పటి నుంచి దేవాలయాలకు వెళ్లడం, పూజా కార్యక్రమాలు చేపట్టడం అలవాటు. పెళ్లయిన తర్వాత ఉద్యోగం, విధి నిర్వహణలో నిత్యం ఒత్తిడి ఎదుర్కొంటున్నాం. వారంలో శని, ఆదివారాలు రెండు రోజులు సెలవులు వస్తున్నాయి. పిల్లలు, ఇల్లు కుటుంబాన్ని చూసుకోవడానికే సరిపోతుంది. శని, ఆదివారాల్లో కుటుంబ సభ్యులంతా కలిసి ఆలయాలకు వెళ్తుంటాం. తిరుపతి, శ్రీశైలం, అరుణాచలం, వేములవాడ, యాదగిరిగుట్ట, ఈ మధ్య స్వర్ణగిరి వెళ్లాం. – నిహారికారెడ్డి, మియాపూర్ -
అమెరికాలో ప్రకాశం జిల్లా సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
ముండ్లమూరు: అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రకాశం జిల్లా ముండ్లమూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ దొద్దాల బుచ్చిబాబు (40) సముద్రంలో మునిగి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ముండ్లమూరుకు చెందిన దొద్దాల కోటేశ్వరరావు, కోటేశ్వరమ్మలకు కుమారుడు బుచ్చిబాబు, ఒక కుమార్తె ఉన్నారు. తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేసుకుంటూ ఇద్దరినీ చదివించారు. కుమారుడు బుచ్చిబాబు ఎనిమిదేళ్లు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు.కంపెనీ ఆదేశాల మేరకు 18 నెలల కిందట భార్య కిరణ్మయితో కలిసి కాలిఫోర్నియా వెళ్లి అక్కడే నివాసం ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. వీకెండ్ సెలవులు కావడంతో ఆదివారం కుటుంబ సభ్యులతో సరదాగా సముద్ర స్నానానికి వెళ్లారు. అక్కడ ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు కొట్టుకుపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. కుమారుడి మరణవార్త విని తల్లి కోటేశ్వరమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి చేర్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని వేడుకొంటున్నారు. -
సోషల్ మీడియాలో సాఫ్ట్వేర్ దంపతుల ట్రెండ్
ఒకరేమో సాప్ట్వేర్ ఉద్యోగం వదిలి మీమర్‌గా, మరొకరు సింగర్.. ఇద్దరూ నేడు సోషల్‌మీడియా వేదికగా నవ్వులు పూయిస్తూ, సరికొత్త కంటెంట్‌తో ఆకట్టుకుంటున్నారు. ప్రవృత్తినే వృత్తిగా మలిచిన సాహిని శ్రీహర్ష, ప్రతిమ కొరడ దంపతులు నేడు ట్రెండింగ్‌లో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో వీరికి లక్షల్లో ఫాలోవర్స్‌ని సంపాదించి ట్రెండింగ్‌లో ఉన్న మాటలు, విజువల్ ఫొటోలు, విడియోలతో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఏ రంగమైనా సోషల్ మీడియాలో మీమ్స్, వీడియో క్రియేటివిటీతోనే మార్కెట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఒకరు డ్యాన్సర్, మరొకరు మీమర్ సోషల్ మీడియాలో సాఫ్ట్వేర్ దంపతుల ట్రెండ్ మీమ్స్ మార్కెట్లో ఆలోచనలే పెట్టుబడిగా ప్రవృత్తినే వృత్తిగా మలచుకున్న శ్రీహర్ష, ప్రతిమసృజనాత్మకత, కొంగొత్త ఆలోచనలే పెట్టుబడి. మీమ్స్, వీడియోస్‌తో మీమ్ మార్కెటింగ్ చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వీరి ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు.డ్యాన్స్, మీమ్స్‌లో ప్రావీణ్యం.. నాకు డ్యాన్స్‌లో మంచి ప్రావీణ్యం ఉంది. బీటెక్ అయ్యాక డ్యాన్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా బెంగుళూరులో పనిచేశా. కానీ ఇంట్లో నో చెప్పడంతో 2017–18లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా మారాను. అయితే డ్యాన్స్ వీడియోలు చేయడం అలవాటుగా మారింది. అలా హైదరాబాద్ వచ్చి నచి్చన కంటెంట్‌తో విడియోలు స్టార్ట్ చేశాను. లాక్డౌన్ సమయంలో హైదరాబాద్‌లోనే ఉంటూ మరింత ట్రెండింగ్ కంటెంట్‌తో వీడియోలు చేశాను. లైట్ బా అనే మీమ్ పేజ్‌ను స్టార్ట్ చేశాను. మీమ్స్, వీడియోస్‌కి మంచి స్పందన వచ్చింది. కానీ మీమర్‌గా కూడా సంపాదించవచ్చని తెలియదు. కొంత మంది సలహాలతోనే.. కొంతమంది సోషల్‌మీడియా వ్యక్తులను కలిసినపుడు వారి నుండి కొన్ని సలహాలు తీసుకున్నాను. లైట్ బా పేజీకి 5లక్షల మంది, హర్ష ఈజ్ అవైలబుల్ యూట్యూబ్ ఛానెల్‌కి 3లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌కి 2.6లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు. చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి. దీంతో మీమ్ మార్కెటింగ్‌ను మూవీస్, ఒరిజినల్ స్ట్రీమింగ్ సరీ్వస్‌లకు కంటెంట్, ప్రమోషన్ వీడియోస్ చేస్తూ జీవనోపాధి పొందుతున్నాను. యాక్టర్‌గా చేయాలని ఉంది. మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను.సింగర్ టూ మీమర్... నేను సింగర్‌ని.. సరిగమపలో 2020లో కంటెస్టెంట్‌గా చేశాను. కొన్ని పాటలు కూడా పాడాను. నాకు హర్షకి సోషల్‌మీడియా వేదికగా పరిచయం ఉందికానీ మాట్లాడుకోలేదు. మ్యూచువల్గా ఇద్దరికీ మ్యారేజ్ ప్రపోజల్ వచి్చంది. ఇద్దరి మనసులూ కలిశాయి. పెళ్ళి చేసుకున్నాం. నాకు యాక్టింగ్ తెలీదు. కానీ మీమ్ విడియోస్లో చేశారు. హర్ష నా నటన చూసి మెచ్చుకున్నాడు. ఇద్దరం కలిసి యూట్యూబ్, ఇన్‌స్టాలో మీమ్ వీడియోస్ చేస్తుంటాము. నాకు ఇన్‌స్టాలో 85వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇద్దరి వృత్తులు వేరైనా మీమ్ మార్కెంటింగే ఉద్యోగంగా మలుచుకున్నాం. మా కంటెంట్‌తో నెటిజన్లు నవ్వుకుంటే మేము గెలిచినట్టే. -
డార్క్ వెబ్‌లో హెరాయిన్ ఆర్డర్.. స్పీడ్ పోస్ట్‌లో డెలివరీ!
ఖమ్మం క్రైం: సాధారణంగా మానవ కొరియర్ల ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతుంటుందన్న విషయం తెలిసిందే. కానీ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణా, సరఫరాపై ప్రభుత్వం, పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో డ్రగ్స్ బానిసలు కొత్తదారులను ఆశ్రయిస్తున్నారు. తాజా గా ఓ యువకుడు డార్క్ వెబ్‌లో ఆర్డర్ పెట్టి స్పీడ్ పోస్ట్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్న ఉదంతం ఖమ్మంలో వెలుగుచూసింది.అస్సాం నుంచి: ఖమ్మం టూటౌన్ ప్రాంతానికి చెందిన ఓ సాప్ట్వేర్ ఇంజనీర్ మత్తుపదార్థాలకు అలవాటు పడ్డాడు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న అతను అక్కడ పోలీసు నిఘా ఎక్కువగా ఉండటంతో ఖమ్మంకు తెప్పించుకుంటే ఎవరికీ అనుమానం రాదని భావించాడు. ఇందుకోసం హ్యాకర్లు, మాఫియా, విమెన్ ట్రాఫికింగ్, ఆయుధాల స్మగ్లింగ్ చేసేవారు ఉపయోగించే డార్క్ వెబ్ (తమ గుర్తింపు, జాడను ఇతరులకు తెలియనివ్వకుండా ఇంటర్నెట్లోని హిడెన్ వెబ్సైట్లను ఉపయోగించేందుకు అవకాశం కల్పిస్తుంది) ఎంచుకున్నట్లు సమాచారం. ఆపై తన క్రెడిట్ కార్డు, ఇతర యాప్‌లు వాడకుండా క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేసి హెరాయిన్‌ను అస్సాంలోని సిల్పుకురి నుంచి బుక్ చేసుకున్నాడు.యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిఘాతో..: డ్రగ్స్ ఆన్లైన్లో విక్రయిస్తుండగా కొందరు తెప్పించుకుంటున్నారనే అను మానంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు చెందిన సాంకేతిక బృందం కొన్నాళ్లుగా నిఘా వేసింది. ఇందులో భాగంగా గ త నెల 31న ఖమ్మం యువకుడు డ్రగ్స్ బు క్ చేసుకున్నట్లు పసి గట్టింది. స్పీడ్ పోస్ట్ పార్సిల్ నంబర్‌ను హెరాయిన్ సరఫరా దారు ఖమ్మం యువ కుడికి పంపడంతో అస్సాంలో పార్సిల్ మొదలైనప్పటి నుంచి నిఘా వేసింది. ఈ నెల 8న ఖమ్మం చేరుకున్న పార్సిల్‌ను 9న ఆ యువకుడికి డెలివరీ చేస్తుండగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులతోపాటు ఖమ్మం టూటౌన్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఆ పార్సిల్లో మ్యాగజైన్ మాత్రమే ఉండటంతో తొలుత యువకుడు బుకాయించాడు. అనంతరం అధికారులు మ్యాగజైన్‌లోని ఒక్కో పేజీని పరిశీలిస్తుండగా మధ్యలో ఓ కాగితానికి టేప్ వేసి ప్లాస్టిక్ కవర్లో ఉంచిన 2 గ్రా ముల హెరాయిన్ బయటపడింది. దీంతో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. దాన్ని సరఫరా చేసిందెవరు? రాష్ట్రంలో ఇంకా ఎవరెవరు తెప్పించుకున్నారనే కోణంలో ప్రశ్నించారు. యువకుడి కెరీర్ దృష్ట్యా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తుపదార్థాల విక్రయం జరి గినట్లు తెలిస్తే 87126 71111 లేదా 1908 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. -
Hyderabad: మరణంలోనూ వీడని స్నేహ బంధం
రాయదుర్గం: స్నేహితుల దినోత్సవం రోజు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు దుర్మరణం పాలయ్యారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామానికి చెందిన నాగేశ్వరరావు కుమారుడు వి.బాల ప్రసన్న (24) ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చాడు. ఇదే జిల్లా మర్రిచెట్టుపాలేనికి చెందిన తన స్నేహితుడు కె.రోహిత్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో కలిసి బాలప్రసన్న మియాపూర్‌లోని హఫీజ్‌పేట్‌లో నివాసముంటున్నాడు. ఆదివారం వేకువజామున బైక్‌పై వెళ్తున్నారు. రోహిత్ వాహనం నడిపిస్తుండగా ప్రసన్న వెనక సీటులో కూర్చున్నాడు. మసీదుబండ నుంచి హఫీజ్‌పేట్ మార్గంమధ్యలో కొత్తగూడ జంక్షన్ ఫ్లైఓవర్ మూల మలుపు వద్ద వీరి బైక్ అదుపు తప్పి ఫ్లై ఓవర్ గోడను ఢీకొనడంతో రోడ్డుపై పడిపోయారు. ఇద్దరి తలలకు, ఇతర భాగాలకు బలమైన గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ప్రసన్నను కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి, రోహిత్‌ను మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో రోహిత్ మృతిచెందాడు. బాల ప్రసన్న 5.18 గంటలకు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. 48 నిమిషాల వ్యవధిలో ఇద్దరు స్నేహితులూ మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి పోలీసులు పేర్కొన్నారు. -
గచ్చిబౌలిలో దారుణం..
-
Software Employees: ప్రాణాలు తీసిన ఓవర్ టేక్
శామీర్‌పేట్: మితిమీరిన వేగం.. నిర్లక్ష్యం.. ఇద్దరు యువ సాఫ్ట్వేర్ ఉద్యోగులను బలిగొంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో మొదట రోడ్డు డివైడర్‌ను ఢీకొని ఆ తర్వాత ఫార్మా కంపెనీ బస్సును ఢీకొట్టిన ప్రమాదంలో కారులోని ఇద్దరూ దుర్మరణం చెందారు. ఈ ఘటన శుక్రవారం నగర శివారులోని శామీర్‌పేట మండలం జినోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూంకుంట మున్సిపాలిటీ హకీంపేటకు చెందిన మోహన్ (25), మౌలాలీకి చెందిన దీపిక(23) స్నేహితులు. మాదాపూర్ మైండ్‌స్పేస్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో వీరు పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇన్నోవా కారులో కరీంనగర్– హైదరాబాద్ రాజీవ్ రహదారి తుర్కపల్లిలో అల్పాహారం తిని తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో లాల్‌గడి మలక్‌పేట విమల ఫీడ్స్ వద్ద.. ముందు వెళ్తున్న వాహనాన్ని వీరి కారు ఓవర్ టేక్ చేయబోయి డివైడర్‌ను ఢీకొట్టి.. శామీర్‌పేట నుంచి తుర్కపల్లి వైపు వస్తున్న బయోలాజికల్ ఫార్మా కంపెనీకి చెందిన బస్సుతో పాటు స్కూటీని ఢీకొని పల్టీలు కొట్టి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న మోహన్, దీపిక అక్కడికక్కడే మృతి చెందారు. బయోలాజికల్ కంపెనీకి చెందిన బస్సులో ప్రయాణిస్తున్న 10 మందితో పాటు, స్కూటీపై వెళ్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మోహన్, దీపిక మృతదేహాలను గాంధీ మార్చురీకి పంపించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డీసీపీ.. ప్రమాద స్థలాన్ని మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు, అల్వాల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకట్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ హన్మంత్‌రెడ్డి పరిశీలించారు. ఇన్నోవా కారు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తెలుస్తోందని పోలీసులు అంచనా వేస్తున్నారు. చాకచక్యంగా వ్యవహరించిన బస్సు డ్రైవర్.. ఇన్నోవా కారు అతివేగంతో వచ్చి ఢీకొన్న ఘటనలో ఫార్మా కంపెనీ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో 44 మంది ఉన్నారు. కారు ఢీ కొనడంతో బస్సును డ్రైవర్ ఎడమవైపు చెట్ల పొదల్లోకి తీసుకెళ్లాడు. బస్సులో ఉన్నవారిలో 10 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. -
ఐటీ ఉద్యోగుల్లో ఒంటరి తనం.. కారణం ఇదే
ఇటీవల మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్న ఓ ఐటీ ఉద్యోగి ఆటో డ్రైవర్‌గా మారాడు. అందుకు కారణం ఒంటరితనాన్ని భరించలేక, నలుగురితో మాట్లాడే అవకాశం కోసం ఇలా ఆటో నడుపుతున్నట్లు చెప్పుకొచ్చాడు. దీంతో సదరు టెక్కీ ఆటో నడుపుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే బెంగళూరు నగరంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఉండడంపై బిట్స్ ఫిలానీ పూర్వ విద్యార్ధి హర్ష్ బెంగళూరులోని టెక్కీల పరిస్థితుల గురించి పోస్ట్ చేశారు. Most techies in Bangalore are pretty lonely. Away from family, no real friends, stuck in traffic, high rents, children not getting good values, peers into status games, cringe tech meet-ups, shoves body with coffee & alcohol, hair-loss, tummies popping out & pays highest taxes.— harsh (@harshwsingh) July 23, 2024 ఒంటరితనం, పర్సనల్ లైఫ్-ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం, శారీరక, మానసిక అంశాలు ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ‘బెంగుళూరులో చాలా మంది టెక్కీలు చాలా ఒంటరిగా ఉన్నారు. కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. వారికి నిజమైన స్నేహితులు ఉండరు. ట్రాఫిక్ కష్టాలు,భారీగా ఇంటి రెంట్లు,పిల్లలు వారికి గౌరవం ఇవ్వకపోవడం, టెక్ మీట్ అప్లు, కాఫీ - ఆల్కహాల్ అధికంగా సేవించడం, ఎయిర్ లాస్ అవ్వడం, పొట్టలు విపరీతంగా పెరిగిపోవడం, అధిక మొత్తంలో పన్నులు చెల్లించడం వంటి కారణాలు ముడిపడి ఉన్నాయని, అందుకే బెంగళూరులో పనిచేస్తున్న టెక్కీల్ని ఒంటరితనం ఆవహించేస్తోంది అని ట్వీట్ చేశారు. దీని నుంచి బయటపడాలంటే ఆరోగ్యం పట్ల శ్రద్ద, కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. అంతే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌ని 6.94 లక్షల మంది వీక్షించారు. 12వేల మంది లైక్ చేశారు. -
Hyderabad: సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
రామచంద్రాపురం(పటాన్చెరు): కుటుంబసమస్య వల్లే తాను చనిపోవడానికి కారణమని సూసైడ్ నోట్ రాసి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. విద్యుత్‌నగర్‌లో నివాసం ఉండే సాయికిరణ్(28) విప్రో సంస్థలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అతని చిన్నప్పుడే తల్లి మృతి చెందింది. తండ్రి రెండో వివాహం చేసుకున్నాడు. చిన్ననాటి నుంచి ఇస్నాపూర్‌లోని అమ్మమ్మ వద్ద ఉండి చదువుకున్నాడు. విప్రోలో ఉద్యోగం రావడంతో రెండు నెలలగా విద్యుత్‌నగర్‌లో నివాసముంటున్న తండ్రి నర్సింగ్‌రావు వద్దే ఉంటున్నాడు. బోనాల పండుగ సందర్భంగా తండ్రి, సవతి తల్లి మహాలక్ష్మి శనివారం జోగిపేటకు వెళ్లారు. ఆదివారం సాయికిరణ్ మహాలక్షి్మకి ఫోన్ చేసి మాట్లాడాడు. మంగళవారం మధ్యాహ్నం వారిద్దరూ తిరిగొచ్చారు. ఇంటి తలుపులు వేసి ఉండటంతో ఎంత పిలిచినా తలుపులు తీయడం లేదు. దీంతో కిటికీలో నుంచి చూస్తే సాయికిరణ్ తన గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతిచెందడాన్ని గమనించి ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తే మృతుడి వద్ద సూసైడ్ నోట్ లభించినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకుని రెండు రోజులై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. -
Hyderabad: అపార్ట్మెంట్లోకి దూసుకొచ్చిన తూటా
మణికొండ: బైరాగిగూడలో ఓ అపార్ట్మెంట్ బెడ్రూం కిటికీ అద్దాల్లోంచి దూసుకువచ్చి గోడకు తగిలిన ఘటన శనివారం చోటుచేసుకుంది. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బైరాగిగూడలోని ఓ అపార్ట్మెంట్ అయిదో అంతస్తులో సాఫ్ట్వేర్ ఉద్యోగి సిద్ధార్థ్ ఉంటున్నారు. శనివారం ఆయన ఉదయం తన భార్యతో కలిసి కిందకు వెళ్లి వాకింగ్ చేస్తున్నారు. ఇంతలోనే ఓ తూటా వీరి ఇంట్లోని బెడ్రూం కిటికీ అద్దాలను చీల్చుకుంటూ వచ్చి గోడకు తగిలింది. ఆ శబ్దానికి ఇంట్లోని పెంపుడు కుక్క పెద్దగా అరవటంతో వాకింగ్ చేస్తున్న సిద్ధార్థ్ ఇంట్లోకి వచ్చారు. కిటికీకి రంధ్రం ఉండటం, బెడ్రూంలో తుపాకీ తూటా కింద పడి ఉండటాన్ని గమనించి ఎవరో తన ఇంటిపై కాల్పులు జరిపారని భయాందోళనకు గురయ్యారు. నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి సీఐ హరికృష్ణారెడ్డి పరిశీలించారు. పక్కనే ఉన్న తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి వచ్చి ఉంటుందని, వారు శుక్రవారం నుంచి ఫైరింగ్ శిక్షణ ఇస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. పక్కనే ఉన్న ఇబ్రహీంబాగ్ మిలిటరీ ఫైరింగ్ రేంజ్ నుంచి బుల్లెట్ వచ్చి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఫైరింగ్ రేంజ్‌లకు సమీపంలో అపార్ట్మెంట్లకు అనుమతులు ఇవ్వటం, ఇలాంటి సంఘటనలు జరిగితే ప్రాణనష్టం జరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనూ ఇదే తరహాలో ఇబ్రహీంబాగ్ రెజిమెంట్ నుంచి మణికొండ క్వార్టర్స్‌లోకి బుల్లెట్లు వచ్చి పడ్డాయని స్థానికులు గుర్తు చేశారు. -
ఈ దొంగ యమా రిచ్!.. ఆడి కారు.. ఖరీదైన ఫ్లాటు..
సాక్షి, హైదరాబాద్: రోహిత్ కనూభాయ్ సోలంకి..ముంబై శివార్లలో రూ.కోటి ఖరీదైన ఫ్లాట్‌లో నివసిస్తుంటాడు. ఆడి హైఎండ్ కారులో సంచరిస్తుంటాడు. ఓ నగరాన్ని టార్గెట్ చేసుకుంటే అక్కడకు వెళ్లి స్టార్ హోటల్లో బస చేస్తాడు. సంపన్నుల ప్రాంతాలను గూగుల్ ద్వారా గుర్తిస్తాడు. అక్కడ పగలు రెక్కీ చేసి తాళం వేసున్న ఇళ్లల్లో రాత్రిళ్లు పంజా విసరుతాడు. ఈ ఖరీదైన దొంగను గత వారం గుజరాత్‌తోని వల్సాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. విచారణ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోనూ రెండు నేరాలు చేసినట్లు అంగీకరించాడు. దీంతో ఇక్కడి పోలీసులకు త్వరలో సమాచారం ఇవ్వనున్నట్లు వల్సాద్ ఎస్పీ కరణ్ రాజ్ వాఘేలా ‘సాక్షి’కి తెలిపారు. మహారాష్ట్రకు చెందిన సోలంకి ప్రస్తుతం ముంబ్రాలోని ఖరీదైన సొంత ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. తన పేరును అర్హాన్గా మార్చుకున్న ఇతగాడు ఓ మైనార్టీ యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమెతో తాను సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని చెప్తూ... కొన్నేళ్లుగా చోరీలు చేస్తున్నాడు. క్యాంపుల పేరుతో తరచు ఇల్లు వదిలి వెళ్లే ఇతగాడు కేవలం ప్రధాన నగరాలనే టార్గెట్‌గా చేసుకుంటాడు. విమానంలో అక్కడకు చేరుకుని స్టార్ హోటల్లో బస చేస్తాడు. గూగుల్ ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న సంపన్న వర్గాలు నివసించే ప్రాంతాలను గుర్తిస్తాడు. హోటల్‌కు చెందిన క్యాబ్‌ను బుక్ చేసుకునే ఇతగాడు పగటి పూటి అందులోనే తిరుగుతూ తాను ఎంచుకున్న ప్రాంతాల్లో రెక్కీ చేస్తాడు. తాళం వేసున్న ఇళ్లను గుర్తించి ఆ ప్రాంతాలకు సంబంధించిన లోకేషన్స్‌ను తన వాట్సాప్‌లోకి షేర్ చేసుకుంటాడు. రాత్రి వేళ కాలినడకన బయలుదేరి..సమీపంలోని ఏదో ఒక దుకాణం నుంచి చిన్న రాడ్డు, స్క్రూడ్రైవర్ వంటివి ఖరీదు చేస్తాడు. వీటిలో టార్గెట్ చేసుకున్న ఇంటి తాళాలు పగులకొట్టి నగదు, సొత్తు స్వాహా చేస్తాడు. చోరీ సొత్తును తీసుకుని మాత్రం రైలులోనే ముంబైకి చేరుకుంటాడు. ఇంటికి చేరుకునేలోపే దాన్ని అమ్మి, క్యాష్ చేసుకుని, బ్యాంక్ ఖాతాలో వేసుకుంటాడు. ఇలా గడిచిన కొన్నాళ్లల్లో గుజరాత్‌లోని వల్సాద్, వాపి, సూరత్, పోర్బందర్, సెల్వాల్లతో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్‌ల్లో 19 నేరాలు చేశాడు. వీటిలో రెండు హైదరాబాద్‌లో చేసినవే. వల్సాలో జరిగిన వాపిలో జరిగిన రూ.లక్ష నగదు చోరీ కేసును వల్సాద్ జిల్లా పోలీసులు దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలతో పాటు సోలంకి బస చేసిన హోటల్, ప్రయాణించిన విమానం టిక్కెట్ తదితర వివరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ముంబ్రాలోని అతడి ఫ్లాట్ వద్ద కాపుకాసిన పోలీసులు గత వారం అరెస్టు చేశారు. విచారణ నేపథ్యంలో జల్సాలకు అలవాటుపడిన ఇతగాడు ముంబైలోని నైట్ క్లబ్స్‌లో భారీ మొత్తం ఖర్చు చేస్తాడని తేలింది. మాదకద్రవ్యాలకు సైతం అలవాటుపడి బానిసగా మారిన సోలంకి ఏకంగా నెలకు రూ.1.5 లక్షలు వాటికే వెచి్చస్తాడని పోలీసులు గుర్తించారు. వల్సాద్ ఎస్పీ కరణ్ రాజ్ వాఘేలా ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ...‘రోహిత్ సోలంకిని విచారించిన నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని హైదరాబాద్‌ల్లో రెండేసి చోరీలు చేసినట్లు వెలుగులోకి వచి్చంది. అయితే ఏ ప్రాంతంలో చేశాడనేది అతడు స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడు ఆయా నగరాల్లో సంచరించిన తేదీలతో పాటు ఇతర వివరాలను సాంకేతికంగా గుర్తిస్తున్నాం. ఆపై ఆ అంశాలకు అక్కడ పోలీసులకు తెలుపుతాం. డ్రగ్స్‌కు బానిసైన సోలంకిని రీహాబ్కు పంపాలని యోచిస్తున్నాం’ అని పేర్కొన్నారు. -
ఆహా నా డ్రెస్ అంటా.... ఏఐ డ్రెస్ అంటా...
గూగుల్ సాప్ట్వేర్ ఇంజనీర్ క్రిస్టినా ఎర్నెస్ట్ సృష్టించిన ‘వరల్డ్స్ ఫస్ట్ ఏఐ డ్రెస్’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ రోబోటిక్ మిదాస్ డ్రెస్ వీడియో 3.6 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ఈ బ్లాక్ డ్రెస్‌లో ఎన్నో రోబోటిక్ పాములు ఉన్నాయి. చాలామంది ఈ డ్రెస్‌కు ‘ఎక్స్ట్రార్డినరీ’ అని కితాబు ఇవ్వగా కొద్దిమంది మాత్రం ‘బోరింగ్’ అని పెదవి విరిచారు. -
బైక్‌పై లడఖ్.. జర్నీ
జగద్గిరిగుట్ట: సాఫ్ట్వేర్ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి లడఖ్‌కు బుల్లెట్ బైకులపై వెళ్లారు. కుత్బుల్లాపూర్, చింతల్‌కు చెందిన ఆరుగురు స్నేహితులు ఈ నెల 1న ప్రయాణం మొదలుపెట్టి 17 రోజుల అనంతరం తొమ్మిది రాష్ట్రాలను దాటుతూ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. చింతల్ ఫుట్‌బాల్ క్లబ్‌కు చెందిన అవినాష్, చరణ్‌జీత్ సింగ్, వినయ్, ఇస్తియాక్, ప్రదీప్, మనోజ్‌లు సుమారు 6400 కిలోమీటర్లు ఈ జర్నీ చేశారు. సంవత్సరం ముందు నుండి 1000–2000 కిలోమీటర్లు బైకులపై తిరుగుతూ జరీ్నకి కావాల్సిన వస్తువులు తెలుసుకున్నారు. 17,582 అడుగుల ఎత్తులో ఉన్న లడఖ్, ఖర్దుంగ్లకు చేరుకున్నారు. ట్రిప్ పూర్తి చేసుకొని వచ్చిన వీరికి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ముప్పు తప్పదా.. బిల్ గేట్స్ ఏంచెప్పారు?
చాట్‌జీపీటీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో మానవ ఉద్యోగాలకు ముప్పు తప్పదన్న భయాలు మొదలయ్యాయి. కోడ్ రాయడం దగ్గర నుంచి కవిత్వం రాయడం వరకు అన్నీ పనులూ కృత్రిమ మేధ చేసేస్తుండటంతో మానవ ఉద్యోగాలను ఇది భర్తీ చేస్తుందన్న ఆందోళనలు సర్వత్రా పెరుగుతున్నాయి.ఇప్పుడు ఏఐ నిమిషాల్లో కోడ్ రాయగలదు కాబట్టి తమ ఉద్యోగాలు పోతాయేమోనని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానం గురించి, ప్రపంచంపై దాని ప్రభావం గురించి తరచుగా ఉత్సాహాన్ని వ్యక్తం చేసే మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆందోళన చెందుతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఊరట కలిగించే విషయాన్ని చెప్పారు. కామత్ పాడ్‌కాస్ట్ సిరీస్ "పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్" ప్రారంభ ఎపిసోడ్ కోసం గేట్స్ జెరోధా ఫౌండర్ నిఖిల్ కామత్‌తో కలిసి పాల్గొన్నారు. 30 నిమిషాల పాటు జరిగిన సంభాషణలో గేట్స్, కామత్ మైక్రోసాఫ్ట్ లో తొలినాళ్లను, వివిధ పరిశ్రమలపై, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరివర్తన ప్రభావాన్ని వివరించారు.సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ముప్పు లేదుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరుగుతున్నప్పటికీ సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాల భవిష్యత్తుపై గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్పాదకతను పెంపొందించడానికి, విద్యా ట్యూటర్లుగా సేవలందించడానికి కృత్రిమ మేధ సామర్థవంతంగా పనిచేస్తుందన్నారు. దీనికి సంబంధించి భారత్‌తోపాటు యూఎస్‌లో విజయవంతమైన ప్రాజెక్టులను ఆయన ఉటంకించారు. ఇక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల స్థానాన్ని కృత్రిమ మేధ భర్తీ చేస్తుందన్న ఆందోళనలను ప్రస్తావిస్తూ అలాంటి భయాలను "అలారలిస్ట్" అని తోసిపుచ్చారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు డిమాండ్ బలంగానే ఉంటుందని, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల అవసరం ఇంకా ఉందని, అది ఆగదని స్పష్టం చేశారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ ఏదో ఒక రోజు అనేక ఉద్యోగాలను భర్తీ చేయగల స్థాయికి చేరుకుంటుందని గేట్స్ అంగీకరించినప్పటికీ, వచ్చే ఇరవై సంవత్సరాలలో ఇది సంభవించే అవకాశాలను ఆయన తోసిపుచ్చారు. శ్రామిక శక్తిపై కృత్రిమ మేధ దీర్ఘకాలిక ప్రభావాన్ని అంచనా వేయడంలో కొంత అనిశ్చితి ఉందన్న ఆయన.. ఇది సంక్లిష్టమైన సమస్య అని, దీనిని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. -
గిరిజన నేతకు ‘రిచా’ బ్రాండ్
సాఫ్ట్వేర్ ఉద్యోగిని అయిన రిచా మహేశ్వరి కెరీర్లో సంతృప్తిని కలిగించే మూలాలను వెతికింది అయితే వాటి ఆచూకి ఆ ఉద్యోగంలో లభించలేదు. ఫలితంగా లాంగ్ లీవ్ పెట్టి దేశవ్యాప్తంగా ఉన్నప్రాంచీన గిరిజన తెగల వద్దకు వెళ్లింది. ఒడిశాలో గిరిజన తెగల కళాత్మక నేత పనితో మమేకమైఆ అరుదైన కళను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఉద్యోగి నుంచి వ్యాపారవేత్తగా మారిన తన ప్రయాణం గురించి వివరించే విశేషాలు మనదైన ప్రపంచాన్ని వెతుక్కునేందుకు తప్పక ఉపయోగపడతాయి.‘‘నేను పుట్టి పెరిగింది ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో. మా నాన్నగారిది ఒడిశా. నాన్న బ్యాంకు ఉద్యోగి కావడం, తరచూ బదిలీలు ఉండటం వల్ల కుటుంబంతో పాటు దేశవ్యాప్తంగా తిరిగాను. ఇంజినీరింగ్ డిగ్రీ తర్వాత శాప్ కెరీర్‌ను ఎంచుకున్నాను. కొన్నాళ్ల తర్వాత ఆ ఉద్యోగం నాకు డబ్బు మాత్రమే ఇస్తుంది కానీ, ఉద్యోగం చేసిన సంతృప్తి నివ్వదనిపించింది. దాంతో 2021లో ఏడాది పాటు ఉద్యోగానికి లీవ్ పెట్టేసి దేశంలోని చాలా గ్రామాలు తిరిగాను. ఒడిశాలోని గ్రామాల్లోకి వెళ్లినప్పుడు నాదైన ప్రపంచంలోకి వచ్చిన భావన నాలో కలిగింది. అక్కడి గిరిజన సంఘాలను కలిశాను. వారి కళాత్మక వస్త్ర శ్రేణులను చూశాను. నాకు అవి అత్యద్భుతంగా కనిపించాయి.నేత పని... కొండపత్తితో అక్కడి తెగల కళాత్మక నేత పనితనాన్ని ఆధునిక ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాను. ‘బోయిటో’ పేరుతో నాదైన డిజైనర్ స్టూడియో ఏర్పాటు చేశాను. అశోకుని కాలంలో ఈ కళింగ రాజ్యానికి గొప్ప చరిత్ర ఉంది. ఓడరేవు ద్వారా విదేశీ వాణిజ్యాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఇక్కడి పత్తిని ఇండోనేషియా, చైనా వంటి దేశాలకు తీసుకెళ్లి అక్కడి పట్టును తెచ్చేవారు. బోట్‌ను బోయిటో అని కూడా పిలుస్తారు. ఆ పేరునే మా బ్రాండ్‌కు పెట్టాను. టెక్స్టైల్స్ ద్వారా ఒడిశాను అన్వేషిస్తూ పూరీ సమీపంలోని పిప్లిలో నా మొదటి సంస్థనుప్రారంభించాను. పిప్లి ఆప్లిక్ వర్క్‌కు ప్రసిద్ధి. నుపట్నాలోని ఖండువా, సంబల్పూర్, పశ్చిమ బెల్ట్‌లోని సోనేపూర్, బర్గర్, బార్పల్లి వంటి ఇతర నేత యూనిట్లు కలుసుకున్నాను. కోరాపూట్‌లో కోట్΄ాడ్ శాలువాలకు ప్రసిద్ధి. దీంతో కోట్పాట్ నేత సంఘాన్ని కలుసుకున్నాను. ఆ తర్వాత చుట్టుపక్కల పర్వతాలను డిజైన్ చేసినట్టుగా ఉండే కప్పగండ శాలువాలను తయారు చేసే డోంగ్రియా సంఘం వారితో చర్చించాను. మల్కన్‌గిరిలో నివసించే ్ర΄ాచీన తెగలలో ఒకటైన బోండాల గురించి తెలుసుకున్నాను. వారి అద్భుతమైన, అందమైన నెక్‌పీస్, తల΄ాగా డిజైన్లను చూశాను. వారంతా వారి సొంత సంస్కృతిని ఇప్పటికీ కాపాడుకుంటున్నాను. శరీరాన్ని పూసలతో కప్పుతారు. దిగువ శరీరాన్ని కప్పి ఉంచే రింగా అనే చిన్న వస్త్రాన్ని ఉపయోగిస్తారు. సంప్రదాయకంగా కెరాంగా అనే చెట్టు ఫైబర్‌ను ఉపయోగించి ఆ వస్త్రాన్ని తయారు చేస్తారు. ఇప్పుడు దానిస్థానంలో పత్తి నుంచి తీసిన నూలు దారాన్ని వాడుతున్నారు.డాక్యుమెంట్ వైపుగా.. ఇక్కడి తెగల వారితో మాట్లాడుతూ, వారితో కలిసి ఉంటున్నప్పుడు స్వచ్ఛమైన మనుషుల మధ్య నేను ఒదిగి΄ోతున్నాను అనిపించింది. వీరంతా చెప్పే కథలను డాక్యుమెంట్ చేస్తున్నాను. ఈ అద్భుతమైన పనితనం, ప్రత్యేకమైన కళారూ΄ాలు ప్రపంచానికి తెలియాలి అనే ఆలోచనతో డిజైనర్లతో కలిసి పనిచేయాలనుకున్నాను. అలా ప్రయాణాలు చేస్తూ, ఆలోచిస్తూ, పనులను ఆచరణలో పెట్టడానికి ఆరునెలల సమయం పట్టింది.సంఘాలతో కలిసి..గిరిజన తెగల నేత పనితనాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ముందు అక్కడి సంఘాలను కలిసి మాట్లాడాను. ఇది ఒక రోజులో జరగలేదు. మొదట్లో చాలా కష్టమైంది. తూర్పు బెల్ట్‌లోని నేత కార్మికులను కలిసినప్పుడు నా కోసం ప్రత్యేక రంగులలో చీరలను తయారుచేయగలవా అని అడిగాను. కానీ, వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో నాకూ పట్టుదల పెరిగింది. వారితో కలిసి కూర్చోవడం, మాట్లాడటం చేస్తూ వచ్చాను. నా మార్గంలోకి వారు రావాలంటే వారి సంస్కృతిని నేను పూర్తిగా అర్థం చేసుకోవాలి అని గుర్తించాను. ఒక ‘రింగా’ నేయడానికి బోండా కమ్యూనిటీకి చెందిన నలుగురు ఒడియా మహిళలు ఒప్పుకున్నారు.ప్రత్యేకంగా..కోరాపుట్‌లోని గడబా కమ్యూనిటీచే నేసిన కేరాంగ్ వస్త్రాల కోసం అన్వేషిస్తున్నాను. డిజైనర్లు, నేత కార్మికులు చర్చలు జరుపుతున్నారు. ఫాస్ట్ ఫ్యాషన్‌కు విరుద్ధంగా మేం అందించేవి తరతరాలుగా ధరించడానికి వీలైన క్లాసిక్ కళాఖండాలు. గిరిజన సంఘాలు మేం సూచించిన స్వల్ప రంగు మార్పులకు, సవాళ్లకు సిద్ధంగా ఉన్నాయి. బోయిటో నుంచి ట్రెంచ్ కోట్లు, అన్ని రకాల జాకెట్లు తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఇదొక లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్‌గా పేరొందింది. మేం వీటిని అంతర్జాతీయంగా కూడా తీసుకెళుతున్నాం. మా కేటలాగ్‌లో ట్రెంచ్ కోట్లు, కిమోనో జాకెట్లు, ప్యాటు, బేసిక్ షర్టులు, డ్రెస్సులు ఉన్నాయి. పూసలతో కూడిన బోండా జాకెట్, డోంగ్రియా డిజైన్, కోట్΄ాడ్ మోటిఫ్‌లు.. మా డిజైన్స్‌లో తీసుకువస్తున్నాం. కొన్ని నెలలుగా బోయిటోతో కలిసి పని చేయడం వల్ల నా ఆర్థిక స్థిరత్వం గణనీయంగా మెరుగుపడింది. ఇప్పుడు నాలుగైదు వారాలకు ఒకసారి నా పని కోసం సంఘాలను చేరుకుంటాను. వారికి కావల్సిన మొత్తాన్ని చెల్లిస్తూ, నాకు కావల్సిన డిజైన్లను పోందుతాను. కమ్యూనిటీలకుప్రాతినిధ్యం వహించే హెరిటేజ్ షోలను కూడా చేయాలని చూస్తున్నాం. ప్రతి వస్త్ర డిజైన్ వెనుక అది నేసిన విధానం గురించి కథగా కూడా అందిస్తున్నాం’’ అంటూ చేస్తున్న పని, దాని వెనుక దాగున్న కృషిని వివరిస్తుంది ఈ నిరంతర అన్వేషి. -
వెరై‘టీ’.. చాయ్ జీపీ‘టీ’..
వారిరువురూ అన్నదమ్మలు.. ఒకరు చదువు కోసం..మరొకరు ఉపాధి కోసం నగరానికి వచ్చారు.. అందరిలా కాకుండా తమ కాళ్లపై తాము నిలబడాలనుకున్నారు.. అనుకున్నదే తడవుగా తమ వద్ద ఉన్న కొద్ది మొత్తంతో ఓ టీ దుకాణాన్ని పెట్టారు.. అదే చాయ్ జీపీటీ..అంతటితో ఆగకుండా.. తమ స్టాల్లో లభ్యమయ్యే ఫ్లేవర్‌తో టీ పౌడర్‌ను మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటున్నారు.. అసలీ ఆలోచన ఎలా వచ్చింది? దీని వెనుక కథేంటి? తులుసుకుందాం..!శ్రీనగర్‌కాలనీ: సరికొత్త ఆలోచనతో ఓ ఇద్దరు అన్నదమ్ములు నగరంలోని యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.. జిహ్వకో రుచి.. పుర్రెకో ఆలోచన అన్నట్లు.. వెరైటీగా ఆలోచించారు. అందరిలా ఉద్యోగాలు కాకుండా.. వ్యాపారంలో రాణించాలని భావించారు.. తమ వ్యాపారాన్ని విస్తరించడానికి మార్కెట్లో ఓ కొత్త టీ ప్రొడక్ట్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే తెలుగు టీ రుచులను వినియోగదారులకు పరిచయం చేస్తామని ధీమాగా చెబుతున్నారు. టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న చాట్ జీపీటీ నేడు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ప్రస్తుతం జనాల బుర్రల్లో తిరుగుతున్న పేరునే తమ కంపెనీ పేరుగా మలుచుకున్నారు.. ఓ టెక్నాలజీ పేరైన చాట్ జీపీటీని తలపిస్తూ చాయ్ జీపీటీతో ఓ చాయ్ దుకాణాన్ని నగరంలోని మధురానగర్‌లో గత సంవత్సరం ప్రారంభించారు ఈ ఇద్దరు అన్నదమ్ములు రోహిత్, కిరణ్ దుమ్ము. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ ఇద్దరూ చదువు నిమిత్తం నగరానికి వచ్చారు. రోహిత్ విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కిరణ్ డిగ్రీ చదువుతున్నాడు. ఉద్యోగాలు కాకుండా తమ సొంత కాళ్ళపై నిలబడాలన్న తపనలో చాయ్ జీపీటీ పేరిట చాయ్ స్టోర్‌ని ప్రారంభించారు. చాయ్‌లో ఏఐని తీసుకొని ఏఐ(అడ్రక్–ఇలాచి), జీపీటీని( జెన్యూన్లీ ప్యూర్ టీ)గా మలిచారీ అన్నదమ్ములు. ఆయుర్వేద మూలికలతో.. తెలుగు టీలలో ఎక్కువగా ఇలాచి, అడ్రక్లను ఆయుర్వేద మూలికగా ఆరోగ్యానికి ఉపయోగిస్తారు. మనం రోజువారీ విధానంతో పాటు చలికాలంలో ఎక్కువగా అల్లం, యాలుకల టీని తీసుకుంటాం. నిజానికి వీటిలో చాలా ఔషధగుణాలున్నాయి. వీటిని టీలో తీసుకుంటే ఆరోగ్యంతో పాటు ఉల్లాసంగా, ఉత్సాహంగా అనిపిస్తుంది. అందుకే టీలలో వీటికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ మన తెలుగుదనాన్ని ఉట్టిపడేలా టీని తయారుచేస్తున్నాం. మార్కెట్లో ఉండే వాటికంటే భిన్నంగా మా టీ ఉత్పత్తి ఉండేలా సన్నాహాలు చేస్తున్నాం. మన రుచిని మిస్ అవ్వకుండా టీ పౌడర్‌లో కలపి చాయ్ జీపీటీ ప్రాడెక్ట్ చిన్న ప్యాకెట్లతో పాటు పెద్ద ప్యాకెట్లలో మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. త్వరలో అన్ని పర్మిషన్స్ తీసుకొని వినియోగదారుల ముందుకొస్తామని, అయితే తమకు ఇన్వెస్టర్స్ తోడైతే మరింత తోడ్పాటు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చదువు, ఉద్యోగం కోసం ఓ మారుమూల ప్రాంతం నుంచి నగరానికి వచి్చ.. సరికొత్త ఆలోచనతో చాయ్ జీపీటీ ప్రాడక్ట్‌ను మార్కెట్లో తీసుకురావాలన్న ఆలోచన చేసిన ఈ ఇద్దరి అన్నదమ్ముల కృషి యువతకు ఆదర్శనంగా నిలుస్తుంది. తెలుగురుచికి తగ్గట్టుగా.. నేను డిగ్రీ చదువుతున్నాను. అన్నయ్య రోహిత్ బాటలో నడవాలన్నది నా ఆకాంక్ష. ఇప్పుడిప్పుడే స్టోర్ బాగా నడుస్తోంది. అల్లం, యాలుకలు మన ఆయుర్వేద ఔషధ మూలికలకు మన దైనందిన జీవితంలో ప్రత్యేకస్థానం ఉంది. వీటిని చాయ్ జీపీటీలో కలిపి మన తెలుగురుచికి తగ్గట్టుగా అసలు సిసలైన టీని అందించాలన్నది మా లక్ష్యం. అన్నయ్యతో కలిసి సాధిస్తాం. – కిరణ్, డిగ్రీ విద్యార్థి, చాయ్ జీపీటీ నిర్వాహకుడు మరింత మందికి ఉపాధి..ఉపాధిలో మనకున్న ప్రతిభతో అక్కడ రాణిస్తాం. కానీ వ్యాపారంలో మన ఆలోచనలు, సృజనాత్మకతను జోడించి మరికొంతమందికి ఉపాధిని అందిస్తాం. అందుకే ఉద్యోగం కన్నా వ్యాపారమే చేయాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. మా దగ్గర ఉన్న పెట్టుబడితో టీ స్టోర్‌ని ఏర్పాటుచేశాం. కానీ మా లక్ష్యం మన తెలుగుదనం ఉట్టిపడేలా చాయ్ జీపీటీ టీ పౌడర్ బ్రాండ్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చి మన సత్తాచాటడమే. దానికి అనుగుణంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. – రోహిత్, సాఫ్ట్వేర్ ఉద్యోగి. చాయ్ జీపీటీ నిర్వాహకుడు -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలవన్మరణం
వైరారూరల్: అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని తాగునీటి బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. వైరా మండలంలోని నారపునేనిపల్లిలో మంగళవారం చోటు చేసుకున్న ఈఘటన వివరాలు... గ్రామానికి చెందిన దావూలూరి కిరణ్‌కుమార్ – ప్రసన్న దంపతుల మొదటి కుమార్తె వర్షిత అలియాస్ వందన(23)కు అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ఎరుకోపాడు బండి గోపితో వివాహాం జరిగింది. పెళ్లయిన నాలుగు రోజులకే గోపి అమెరికా వెళ్లిపోగా, వర్షిత హైదరాబాద్‌లోని టెక్ మహేంద్ర కంపెనీలో ఉద్యోగిగా చేరింది. కొంత కాలంగా తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెకు నాలుగు రోజుల క్రితం తల్లిదండ్రులు హైదరాబాద్‌లో చికిత్స చేయించి నారపునేనిపలి్లకి తీసుకొచ్చారు. అయితే, సోమవారం రాత్రి వర్షితకు కడుపు నొప్పితీవ్రం కావడంతో ఇంటి ఆవరణలోని తాగునీటి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం వర్షిత కోసం తల్లిదండ్రులు వెతుకుతుండగా బావిపై చెక్క పక్కకు జరిపి ఉండడంతో పరిశీలించగా ఆమె మృతదేహం కనపడింది. ఘటనపై ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో తహసీల్దార్ కే.వీ.శ్రీనివాసరావు, ఎస్సై వంశీకృష్ణ చేరుకుని పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, వర్షిత అమెరికా ప్రయాణానికి వీసా ఏర్పాట్లలో ఉండగా బలవన్మరణానికి పాల్పడడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా: '3 ఇడియట్స్' సీన్‌తో..
ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) యుగంలో భారతీయ ఇంజనీర్లకు సలహాలు ఇచ్చారు. టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్ (FAANG) వంటి సంస్థల్లో ఇంటర్వ్యూల్లో ఎలా విజయం సాధించాలో వివరిస్తూ.. రోట్ లెర్నింగ్ గురించి వివరించారు. ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా.. బట్టీ పడితే ఉపయోగం లేదని అన్నారు. కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ తప్పకుండా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని అన్నారు.దీనికి ఉదాహరణగా 3 ఇడియట్స్ సినిమా గురించి వివరించారు. ఈ సినిమాలో మోటార్ ఎలా పనిచేస్తుంది అనే ప్రశ్నకు ఓ విద్యార్ధి బట్టీ పట్టిన సమాధానం చెబుతాడు. ఆ పద్దతి సరైనది కాదని వివరించారు. ఒక వ్యక్తి ఎంత స్మార్ట్ అయినప్పటికీ.. ఫండమెంటల్స్‌పై దృష్టి పెట్టడంలో విఫలమవుతున్నారని ఆయన అన్నారు. -
Kalaiyarasi: తను ఒక ‘రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్’..
బాధ పడి ఆ బాధను కాలగమనంలో మరచిపోయేవారు కొందరు. బాధ పడి ఆ బాధలో నుంచి కొత్త అడుగు వేసేవారు కొందరు. కలైయారసి రెండో కోవకు చెందిన మహిళ. నేతకార్మికుల బంగారు కాలాన్ని కళ్లతో చూసిన కలైయారసి అవే కళ్లతో వారి కష్టాలను చూసింది. ఆ బాధలో నుంచి ‘రాటై’ స్టార్టప్‌కు స్వీకారం చుట్టింది. సంప్రదాయ నేతకళకు డిఐవై(డూ ఇట్ యువర్ సెల్ఫ్) కిట్స్ ద్వారా కొత్త వెలుగు తెస్తోంది తమిళనాడుకు చెందిన కలైయారసి రామచంద్రన్. పిల్లలు, పెద్దలు ఉపయోగించేలా ఈ కిట్‌ను డిజైన్ చేశారు. సంప్రదాయ కళకు విస్తృతప్రాచుర్యం కల్పిస్తున్న కలైయారసి గురించి...కొన్ని సంవత్సరాల క్రితం..‘చదువుకోవాలని ఉంది’ అని తన మనసులోని మాటను భర్తకు చెప్పింది కలైయారసి. పెళ్లికి ముందు పై చదువులు చదువుకోడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డుగోడలుగా నిలిచాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల పై చదువులకు తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. కలైయారసి మనసులో మాట విన్న భర్త ‘తప్పకుండా’ అని ప్రోత్సహించాడు. అలా కలైయారసి ఎంసీఎ పూర్తి చేసింది. ఆ తరువాత ఒక ఐటీ కంపెనీలో డెవలపర్‌గా పని చేసింది.ఈరోడ్(తమిళనాడు) జిల్లాలోని సాలంగపాలయం గ్రామానికి చెందిన కలైయారసి నేతకార్మికుల కుటుంబం నుంచి వచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసినా నేతకళపై ఆమెకు ఉన్న ప్రత్యేకాభిమానం మాత్రం దూరం కాలేదు. సెలవుల్లో సొంత ఊరుకు వచ్చిన కలైయారసి అక్కడ నేతకార్మికుల కష్టాలను ప్రత్యక్షంగా చూసింది. ఊళ్లో చేనేత మగ్గాల సంఖ్య 7,500 నుంచి 2,500కు పడిపోయింది.కష్టాలలో ఉన్న నేతకార్మికులకు ఆసరాగా నిలవడానికి తన వంతుగా ఏదైనా చేయాలనుకుంది కలైయారసి. నేతకళ గురించి మరిన్ని వివరాలు తెలుసుకొని ‘రాటై హ్యాండ్లూమ్’ పేరుతో స్వగ్రామంలో ఎకో–ఫ్రెండ్లీ హ్యాండ్లూమ్ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది. పర్యావరణహిత కోణంలో ఆలోచించి ఆర్గానిక్ క్లాత్ వీవింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టింది.‘నేతపని ద్వారా ఉపాధి పొంది సంతోషంగా ఉన్న కార్మికుల ఆర్థికపరిస్థితి ఆ తరువాత దిగజారిపోయింది. చాలామంది ఉపాధి వెదుక్కుంటూ పట్టణాల బాట పడ్టారు. డబుల్ షిఫ్ట్‌లలో పనిచేసేవాళ్లు. కొందరు వాచ్‌మెన్‌గా పని చేశారు. తల్లిదండ్రులు ఊళ్లో లేకపోవడంతో పిల్లల చదువు గాడి తప్పింది. తమిళనాడులో ఎన్నో గ్రామాలకు వెళ్లి నేతకార్మికులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నాను. ఈ పరిస్థితి నాకు బాధాకరంగా అనిపించింది’ అంటున్న కలైయారసి తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి నేతకళను స్వయంగా నేర్చుకుంది. సహజరంగులతో పాటు అరటి పీచు, జనపనార, ఇతర పదార్థాలతో తయారుచేసిన సేంద్రియ నూలును ‘రాటై’ ఉపయోగిస్తోంది. ప్రస్తుతం 28 కుటుంబాల వరకు ‘రాటై హ్యాండ్లూమ్’ కోసం పనిచేస్తున్నాయి.సంప్రదాయ చేనేత వస్త్రాలకు ఊతం ఇచ్చేందుకు పోర్టబుల్ డిఐౖవై హ్యాండ్లూమ్ కిట్ల ఆలోచనకు శ్రీకారం చుట్టింది కలైయారసి. ఎక్కడికంటే అక్కడికి చేతితో తీసుకెళ్లగలిగే ఈ మగ్గాలకు యూజర్ మాన్యువల్, క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. దీని ద్వారా యూట్యూబ్ వీడియోల సహాయంతో పరికరాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవచ్చు. తమిళనాడులోని ఎన్నో స్కూల్స్‌లో పిల్లల దగ్గర పోర్టబుల్ లూమ్స్ కనిపిస్తున్నాయి. స్కూల్స్‌లో వీవింగ్ క్లబ్స్ ఏర్పాటు కావడం మరో విశేషం. మూడు ఆప్షన్లలో, మూడు స్థాయుల్లో అందుబాటులో ఉన్న వీటిని పెద్దలు, పిల్లలు ఉపయోగించవచ్చు.‘రాటై’ స్టార్టప్ ‘రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ గెలుచుకుంది. టాన్సీడ్ (తమిళనాడు స్టార్టప్ అండ్ ఇనోవేషన్ మిషన్) ద్వారా పది లక్షల గ్రాంట్ వచ్చింది.‘నేతకార్మికులకు ఉపాధి కల్పించడమే కాదు ఈ తరానికి ఆ కళపై ఆసక్తి కలిగేలా, నేర్చుకునేలా చేయాలనేది నా లక్ష్యం’ అంటుంది కలైయారసి.పిల్లల కోసం వర్క్‌షాప్..‘రాటై’ ద్వారా నేత కార్మికులకు అండగా నిలిస్తూనే మరో వైపు నేతకళపై పిల్లలకు అవగాహన, ఆసక్తి కలిగించడానికి వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది కలైయారసి. పెద్దలకు ‘నేతపని’ని స్ట్రెస్–బస్టింగ్ ఎక్సర్సైజ్గా పరిచయం చేస్తోంది. ‘వీలైనన్ని ఎక్కువ స్కూల్స్‌కు వెళ్లి పిల్లలకు నేతకళ గురించి చె΄్పాలనుకుంటున్నాను. ఒక ఆర్ట్‌గా మన విద్యావిధానంలో నేతకళ భాగం కావాలని ఆశిస్తున్నాను’ అంటుంది కలైయారసి.ఇవి చదవండి: Naima Khatoon: వందేళ్లకు ఆమె వచ్చింది.. -
సంపులో పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
హైదరాబాద్: ప్రమదవశాత్తు సంపులో పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వైరా మండలం గార్లకు చెందిన ఖలీల్ పాషా కుమారుడు షేక్ అక్మల్ సుఫుయాన్ (25) సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని షుణ్ముక్ మెన్స్ పీజీ హాస్టల్లో నివాసముంటున్నాడు. సోమవారం ఉదయం 10.30 గంటలకు జిమ్‌కు వెళ్లి తిరిగి హాస్టల్‌కు వస్తుండగా దారిలో తెరిచి ఉంచిన నీళ్ల సంపులో ప్రమాదవశాత్తు అక్మల్ పడిపోయాడు. తీవ్రగాయాలు కావడం, నీటిలో పడడంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హాస్టల్ మేనేజర్ కె. మధుసూదన్‌రెడ్డి నిర్లక్ష్యంతో వ్యవహరించినందునే ఘటన చోటుచేసుకుందని, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Continuation of video… pic.twitter.com/w6CNRNIQMx — Sudhakar Udumula (@sudhakarudumula) April 22, 2024 -
ఒకటి కాదు, రెండు కాదు.. రూ.2.25 కోట్లు మోసపోయిన టెక్కీ
సాక్షి, బెంగళూరు: ఓవైపు రోజురోజుకీ టెకాల్నజీ కొత్త పుంతలు తొక్కుతుంటే..మరోవైపు ఆన్లైన్ మోసాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సెల్‌ఫోన్‌కు వచ్చిన లింకును ఓపెన్ చేయడం, తక్కువ పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మి సైబర్ వలలో చిక్కుకొని లక్షలు పోగొట్టుకున్నారు. ఈజీ మనీ కోసం అలవాటుపడుతున్న జనం తమ ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు ఎంత అవగాహన కల్పించినా పలువురు అమాయకులు మాత్రం నేరగాళ్ల చేతుల్లో ఇట్టే మోసపోతున్నారు. తాజాగా ఓ యువకుడు సైబర్ మోసగాడి మాటలు నమ్మి రూ. 2 కోట్లు కోల్పోయాడు. డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్నారని టెక్కీని భయపెట్టి రూ.2.25 కోట్లు దోచుకున్నారు సైబర్ వంచకులు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. అమృతహళ్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు వారం రోజుల క్రితం కస్టమ్స్ డిపార్ట్మెంట్ అధికారి పేరుతో ఓ వ్యక్తి కాల్ చేశాడు. మీ పేరుతో కొరియర్ వచ్చిందని, అందులో ఏడీఎంఏ మత్తు పదార్థాలు ఉన్నాయని, పార్శిల్ ఢిల్లీలో ఉందని, త్వరలో మిమ్మల్ని అరెస్టు చేస్తామని బెదిరించాడు. ఈ పార్శిల్ మీది కాకుంటే యాంటి నార్కొటిక్ బ్యూరోకి ఫిర్యాదు చేయవచ్చని అందుకు స్కైప్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాడు. యాప్‌లో చాట్ చేసిన అపరిచిత వ్యక్తి మీపై అక్రమ డబ్బు రవాణా కేసు కూడా ఉందని, కేసులు కొట్టివేయాలంటే డబ్బు ఇవ్వాలని, ఆ నగదును తిరిగి మీ ఖాతాకు బదిలీ చేస్తామని నమ్మబలికాడు. దీంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ 8 దఫాలుగా రూ.2.25కోట్లు బదిలీ చేశాడు. వారం తరువాత తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. అన్నదమ్ములు మృతి
అనంతపురం : వారు పేరుకు అన్నదమ్ములైనా స్నేహితుల్లా ఉండేవారు. ఎక్కడికెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. అందులో ఒకరికి ఇటీవలే సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. పిల్లలు కలసిమెలసి ఉండడం చూసి తల్లిదండ్రులు నిత్యం ఎంతో ఆనందపడేవారు. అయితే, రోడ్డు ప్రమాద రూపంలో దూసుకొచ్చిన మృత్యువు పిల్లలిద్దరినీ మింగి తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలి్చంది. మండలంలోని ఎంగిలి బండ గ్రామ శివారులో జాతీయ రహదారిపై బుధవారం ద్విచక్రవాహనాన్ని ఎదురుగా కారు ఢీకొనడంతో అన్నదమ్ములు మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు.. తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన రాచమల్లు రామసుబ్బారెడ్డి, ఉమామహేశ్వరమ్మ దంపతులకు రాచమల్లు ద్రశేఖర్‌రెడ్డి(26),శివానందరెడ్డి(24) సంతానం. చంద్రశేఖర్‌రెడ్డి తల్లిదండ్రులతో కలసి వ్యవసాయం చేస్తుండగా శివానందరెడ్డి గుత్తి గేట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు. ఇటీవల సాఫ్ట్వేర్ ఉద్యోగం రాగా, త్వరలో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే బుధవారం గుత్తి మండలం బాచుపల్లి గ్రామంలో బాట సుంకులమ్మ జాతరకు శివానందరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి వచ్చారు. జాతరలో భోజనం చేసుకొని ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి తిరిగి బయలుదేరారు. మార్గమధ్యంలో ఎంగిలిబండ శివారులో లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఓ కారు అదుపుతప్పి నేరుగా వచ్చి వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో కారులో ఉన్న రంగనాథ, చంద్రశేఖర్, రేణుక, శాంతి స్వల్పగాయాలతో బయటపడ్డారు. బొలెరో వాహనంలో చంద్రశేఖర్‌రెడ్డి, శివానందరెడ్డిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఇద్దరూ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనాస్థలిని సీఐ వెంకట్రామిరెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఎంత పనిచేశావు దేవుడా.. ప్రమాద విషయం తెలుసుకున్న రామసుబ్బారెడ్డి హుటాహుటిన ఆస్పత్రికి వచ్చారు. మృతదేహాల వద్ద గుండెలవిసేలా రోదించారు. దేవుడా ఎంత పని చేశావయ్యా అంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఇద్దరు పిల్లలు కలసిమెలసి తిరుగుతుంటే ఎంతో సంతోషం చేవాడిని, అంతలోనే ఇంత పెద్ద శిక్ష వేశావు కదా దేవుడా అంటూ రోదించారు. తల్లి ఉమామహేశ్వరమ్మకు కుమారులు మృతి చెందిన విషయం చెప్పలేదని వారి బంధువులు తెలిపారు. -
ఇలా అయితే టెకీలకు పెళ్లిళ్లు కష్టమే! షాకవుతున్న నెటిజన్లు..
కాలం మారుతోంది.. ఖర్చులు పెరుగుతున్నాయి. ఉద్యోగం ఉన్నవారి పరిస్థితులు కూడా తారుమారు అవుతున్నాయి. ముఖ్యంగా కరోనా తరువాత టెకీల పరిస్థితులు వర్ణాతీతం అయిపోయింది. ఇన్నో రోజులూ జాబ్ ఎప్పుడు పోతుందో అనే భయంలో బిక్కుబిక్కుమంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మరో కొత్త సమస్య ఎదురైంది. లక్షల జీతం ఉన్నా పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు నిరాకరిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవారిలో భారీ ప్యాకేజ్ ఉంటేనే కొంతమంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటన వెలుగుయూలోకి వచ్చింది. ఇందులో ఒక వ్యక్తి తన ఫ్రెండ్ పెళ్లి చూపులకు వెళ్లాడని, అక్కడ అమ్మాయి తన శాలరీ గురించి అడిగిందని వెల్లడించాడు. అమ్మాయి శాలరీ గురించి అడిగినప్పుడు, అబ్బాయి వార్షిక వేతనం సంవత్సరానికి రూ. 8 లక్షలని చెప్పాడు. దీంతో ఆ అమ్మాయి ఆ సంబంధం రిజెక్ట్ చేసింది. కారణం ఏంటనే అడిగితే.. తనకి ఉద్యోగం లేదని.. ఆ అబ్బాయికి కనీసం ఏడాది రూ. 25 లక్షల ప్యాకేజి ఉండాలని, లేకుండా భవిష్యత్తులో కష్టాలు పడాల్సి వస్తుందని చెప్పింది. వధువు సమాధానం విని వరుని తరపు బంధువులు షాకయ్యారు. ఏడాది రూ.8 లక్షలు వచ్చినా అమ్మాయి రిజెక్ట్ చేయడం గురించి ఆతని స్నేహితుని చెప్పుకున్నాడు. దీంతో ఆ స్నేహితుడు ఈ సమాచారం మొత్తం తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. అమ్మాయి ఆ మాత్రం అంచనాలు పెట్టుకోవడంలో తప్పులేదని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఏడాదికి రూ. 25 లక్షలు పెంచుకునే పనిలో ఉండు అంటూ కామెంట్ చేశారు. మరికొందరు నీ ప్యాకేజీకి తగిన అమ్మాయిని పెళ్లి చేసుకో అంటూ కామెంట్ చేసాడు. ఇలా తమదైన రీతిలో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. One of my engineer friend who is earning 8LPA and it's been only two years of his job and belongs to a well to do baniya family got rejected for arranged marriage by a girl who left her job last year because she felt exhausted and not she's not doing anything now...reason for — IMG🩺 (@peacehipeace) April 3, 2024 -
డెవిన్‌కు పోటీగా భారత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్.. ఎవరీ దేవిక?
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే అమెరికాకు చెందిన కాగ్నిషన్ కంపెనీ ‘ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్’ను సృష్టించి.. దానికి ‘డెవిన్’ అని పేరు పెట్టింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్. దీనికి పోటీగా భారత్‌లో 'దేవిక' వచ్చేసింది. ఇంతకీ దేవిక ఎవరు? ఇది ఎలాంటి పనులు చేయగలదు.. అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. భారతదేశానికి చెందిన ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్, లిమినల్ అండ్ స్టిటైన్.ఏఐ 'ముఫీద్ వీహెచ్' డెవిన్‌కు ప్రత్యర్థిగా దేవికను రూపొందించారు. దేవిక, డెవిన్ మాదిరిగానే.. మనిషి ఇచ్చే సూచనలను అర్థం చేసుకోవడానికి కావలసిన మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి వాటిని పొందుతుంది. తద్వారా సూచనలను తీసుకుని, వాటిని కార్యాచరణలో పెడుతుంది. దేవిక అనేది కూడా ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇది మనం ఇచ్చే సూచనల మేరకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి సొంతంగా కోడ్ రాస్తుంది. ఇది అమెరికా రూపొందించిన డెవిన్‌కు ఏ మాత్రం తీసిపోకుండా.. గట్టి ప్రత్యర్థిగా నిలుస్తుంది. ఏఐ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలను ప్రవేశపెట్టి.. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రంగంలో కొత్త శకానికి నాంది పలకడమే ఉద్దేశ్యంగా ఈ ఏఐ దేవికను రూపొందించారు. అయితే ఇది టెక్ జాబ్ మార్కెట్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి వేచి చూడాలి. అయితే ఖచ్చితంగా కోడింగ్ భవిష్యత్తు గణనీయమైన పరివర్తన చెందుతుందని మాత్రం చెప్పవచ్చు. ప్రాజెక్ట్ దేవికకు సంబంధించి టెస్టర్లు, కంట్రిబ్యూటర్ల నుంచి ఆహ్వానం వచ్చినట్లు ముఫీద్ వీహెచ్ ఎక్స్ (ట్విటర్) ద్వారా పేర్కొన్నారు. ముఫీద్ దేవిక ఫీచర్స్ వివరించారు. మరిన్నిటెస్టులు నిర్వహించిన తర్వాత, బగ్ పరిష్కారాలు పూర్తయిన తరువాత అధికారికంగా ప్రారంభమవుతుందని డెవలపర్ పేర్కొన్నారు. ఏఐ దేవిక ఫీచర్స్ ఒక ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి.. వినియోగదారు ప్రశ్నను అర్థం చేసుకోవడానికి, బ్రౌజ్ చేయడానికి, పరిశోధన చేయడానికి, కోడ్, డాక్యుమెంట్ వంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఫీడ్‌బ్యాక్ లూప్‌లో ఒకదానితో ఒకటి పరస్పర చర్య చేయగల 12 ఏజెంట్ మోడల్‌లు ఉన్నాయి. ఒల్లామా ద్వారా క్లాడ్ 3, GPT-4, GPT-3.5, లోకల్ LLMలకు మద్దతు ఇస్తుంది. దేవికా తను వ్రాసిన కోడ్‌ని రన్ చేయగలదు, వినియోగదారు ప్రమేయం లేకుండా ఏదైనా లోపాలను ఎదుర్కొంటే కోడ్‌ను స్వయంగా సరిదిద్దుతుంది. Inviting early testers and contributors to Project Devika - The open-source alternative to Devin. 👩💻 As of now, Devika is far from the capabilities of Devin... but we'll eventually get there. So I am calling the open-source community to join forces! ❤️ Features: - 12 Agentic… pic.twitter.com/if8qfuiKm8 — mufeed vh (@mufeedvh) March 21, 2024 -
అమెరికాలో గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
జనగామ జిల్లా: బచ్చన్నపేట మండలం వంగ సుదర్శన్‌రెడ్డినగర్ గ్రామానికి చెందిన చిట్టోజు మహేష్(34) అమెరికాలో గుండె పోటుతో బుధవారం ఉదయం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. చిట్టోజు ప్రమీల, మదనాచారి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మహేష్ హైదరాబాద్‌లోని నాగారంలో స్థిరపడ్డాడు. మూడేళ్ల క్రితం ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన అతను జార్జియాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం మహేష్ డ్యూటీలో ఉండగా గుండె పోటు రావడంతో తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. మహేష్‌కు భార్య రాధ, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. కాగా, మృతదేహం అమెరికా నుంచి ఇండియాకు రావడానికి ఐదు రోజుల సమయం పడుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
డెవిన్‌కు చెప్తే.. అంతా రెడీ!.. ఏఐకి చెప్తే.. వెబ్సైట్ రెడీ!
కృత్రిమ మేధ (ఏఐ) ప్రోగ్రామ్‌లకు చిన్న సూచన చేస్తే.. మనకు కావాల్సినట్టుగా ఫొటోలను తయారు చేసి పెడుతున్నాయి.. కావాల్సినట్టుగా వీడియోలనూ రూపొందిస్తున్నాయి.. అడిగిన డేటాను నెట్లో సెర్చ్ చేసిపెడుతున్నాయి.. అనుమానాలు ఉంటే తీరుస్తున్నాయి.. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇప్పుడే ఏకంగా వెబ్సైట్లను, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌లను కూడా పూర్తిస్థాయిలో తయారు చేసిపెట్టగల ‘ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్’ వచ్చేసింది. ‘డెవిన్’ పేరుతో.. టెక్నాలజీ ప్రపంచంలో ఇటీవల వచ్చిన చాట్ జీపీటీ ఏఐ ప్రోగ్రామ్ ఎంతో కలకలం రేపింది. అది విద్యార్థులకు కావాల్సిన ఆర్టికల్స్ రాసిపెట్టడం నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు అవసరమైన కోడ్లనూ సిద్ధం చేసి ఇవ్వడం సంచలనం సృష్టించింది. కానీ ఇప్పుడు అమెరికాకు చెందిన కాగ్నిషన్ అనే స్టార్టప్ కంపెనీ ‘ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్’ను సృష్టించింది. దానికి ‘డెవిన్’’అని పేరు పెట్టింది. వెబ్సైట్లను, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌లను కూడా పూర్తిస్థాయిలో తయారు చేసి ఇవ్వగలదని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల ఇంటర్వ్యూలను, వివిధ బెంచ్‌మార్క్ టెస్టులను ఇది విజయవంతంగా పాస్ అయిందని తెలిపింది. ఇలాంటి పూర్తిస్థాయి ఏఐ ప్రోగ్రామ్ ప్రపంచంలోనే ఇదే మొదటిది కావడం గమనార్హం. కోడ్ నుంచి డిప్లాయ్ దాకా.. సాధారణంగా ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్, వెబ్‌సైట్‌ను రూపొందించడంలో చాలా ప్రక్రియలు ఉంటాయి. కోడ్ రాయడం దగ్గరి నుంచి టెస్టింగ్, డీబగ్గింగ్ చేయడం, చివరికి దాన్ని డిప్లాయ్ చేయడం దాకా ఎన్నో క్లిష్టమైన పనులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న చాట్ జీపీటీ వంటి ఏఐ ప్రోగ్రామ్‌లు.. కొంతవరకు సాఫ్ట్వేర్ కోడ్లను రాసిపెట్టగలుగుతున్నాయి కూడా. అయితే తాము అభివృద్ధి చేసిన ‘డెవిన్’.. సాఫ్ట్వేర్ కోడ్ రాయడంతోపాటు.. టెస్టింగ్, డీబగ్గింగ్, డిప్లాయ్ కూడా చేయగలదని ‘కాగ్నిషన్’ కంపెనీ ప్రకటించింది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయగల స్థాయిలో పూర్తిస్థాయిలో పనిచేసే వెబ్‌సైట్‌ను రెడీ చేసి పెడుతుందని వివరించింది. అది కూడా జస్ట్ ఒక చిన్న కమాండ్ ఇస్తే సరిపోతుందని తెలిపింది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను నేర్చుకోగలదని వివరించింది. -
ఏఐ ప్రభావం.. ఉద్యోగాలు పోతాయ్..? ఇప్పుడేం చేయాలంటే..
పారిశ్రామిక విప్లవంతో ప్రపంచ స్వరూపం సమూలంగా మారిపోయింది. అప్పటిదాకా మానవ శ్రమపై ఆధారపడి సాగిన ఉత్పత్తి, రవాణా, ఇతర సేవా కార్యకలాపాలను యంత్రాలు నిర్వహించడం మొదలైంది. ఉత్పత్తి ఎన్నో రెట్లు పెరిగింది. పాత ఉద్యోగాలు పోయాయి. యంత్రాలపై పనిచేసే నైపుణ్యం అవసరమైన కొలువులు పెరిగాయి. అలాంటి అనూహ్యమైన పరిణామం మరొకటి ఇప్పుడు రాబోతోంది. అదే కృత్రిమ మేధ! అది తెచ్చే మార్పులకు మనమంతా సన్నద్ధం కావాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ పవనాలు వేగంగా వీస్తున్నాయి. ఇకపై మనిషి చేసే ప్రతి పనినీ చక్కబెట్టేందుకు కంప్యూటర్లు సిద్ధమవుతున్నాయి. ఫలితంగా ఉద్యోగాల తీరుతెన్నులు, సమాజ గమనం, ప్రజల జీవన విధానాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోక తప్పదు. ఇప్పటిదాకా మనం చూస్తున్న, చేస్తున్న ఉద్యోగాల్లో చాలా వరకు వచ్చే కొన్నేళ్లలో కనుమరుగవుతాయి. ప్రధానంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సవాలు విసిరేలా ఆవిష్కరణలు జరుగుతున్నాయి. వారికి లక్షల్లో జీతాలు చెల్లించాలంటే కంపెనీలకు భారంగా మారుతుంది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం కారణంగా కొన్ని రకాల ఉద్యోగాలను కోల్పోవలసి రావచ్చని సర్వేలు చెబుతున్నాయి. మెకిన్సే సంస్థ నివేదిక ప్రకారం నూతన సాంకేతిక మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి 40-80 కోట్ల ఉద్యోగాలకు ముప్పు కనిపిస్తోంది. దాదాపు 35 కోట్ల మంది కొత్త ఉద్యోగాల్లోకి మారాల్సి వస్తుంది. సంప్రదాయ ఉద్యోగాల్లోనే కొనసాగుదామనుకొన్నా సాధ్యం కాదు. అటువంటి పనులన్నీ కంప్యూటర్లు, వాటికి అనుసంధానమయ్యే యంత్రాలు పూర్తిచేస్తాయి. అయితే, యంత్రాలను నియంత్రించడం, వాటికి పనుల్ని నిర్దేశించడం, స్టాఫ్ట్వేర్లు అయితే ఏఐకి సూచనలు ఇవ్వడం వంటివి మనుషులే చేయాలి. ఇలాంటి కొత్త తరహా విధులకు సంబంధించి సరికొత్త ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో లభిస్తాయి. కోల్పోయిన ఉద్యోగాలకంటే పెద్దసంఖ్యలో లభ్యమవుతాయి. ఇదీ చదవండి: ఎన్నికల ఎఫెక్ట్.. హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్.. కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు పోతాయని 1990 దశకంలో అందరూ భయపడిపోయారు. తదనంతర కాలంలో కోల్పోయిన ఉద్యోగాలకంటే అధికంగా కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. కాకపోతే, నూతన సాంకేతిక మార్పులకు అనుగుణంగా శక్తిసామర్థ్యాలను, నైపుణ్యాలను నేర్చుకోవాల్సి వచ్చింది. -
ఏఐకి చెప్తే..వెబ్సైట్ రెడీ!
కృత్రిమ మేధ (ఏఐ) ప్రోగ్రామ్‌లకు చిన్న సూచన చేస్తే.. మనకు కావాల్సినట్టుగా ఫొటోలను తయారు చేసిపెడుతున్నాయి.. కావాల్సినట్టుగా వీడియోలనూ రూపొందిస్తున్నాయి.. అడిగిన డేటాను నెట్లో సెర్చ్ చేసిపెడుతున్నాయి.. అనుమానాలు ఉంటే తీరుస్తున్నాయి.. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇప్పుడు ఏకంగా వెబ్సైట్లను, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌లను కూడా పూర్తిస్థాయిలో తయారు చేసిపెట్టగల ‘ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్’ వచ్చేసింది. ‘డెవిన్’ పేరుతో.. టెక్నాలజీ ప్రపంచంలో ఇటీవల వచ్చిన చాట్ జీపీటీ ఏఐ ప్రోగ్రామ్ ఎంతో కలకలం రేపింది. అది విద్యార్థులకు కావాల్సిన ఆర్టికల్స్ రాసిపెట్టడం నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు అవసరమైన కోడ్లనూ సిద్ధం చేసి ఇవ్వడం సంచలనం సృష్టించింది. కానీ ఇప్పుడు అమెరికాకు చెందిన కాగ్నిషన్ అనే స్టార్టప్ కంపెనీ ‘ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్’ను సృష్టించింది. దానికి ‘డెవిన్’ అని పేరు పెట్టింది. వెబ్సైట్లను, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌లను కూడా పూర్తిస్థాయిలో తయారు చేసి ఇవ్వగలదని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల ఇంటర్వ్యూలను, వివిధ బెంచ్‌మార్క్ టెస్టులను ఇది విజయవంతంగా పాస్ అయిందని తెలిపింది. ఇలాంటి పూర్తిస్థాయి ఏఐ ప్రోగ్రామ్ ప్రపంచంలోనే ఇదే మొదటిది కావడం గమనార్హం. కోడ్ నుంచి డిప్లాయ్ దాకా.. సాధారణంగా ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్, వెబ్‌సైట్‌ను రూపొందించడంలో చాలా ప్రక్రియలు ఉంటాయి. కోడ్ రాయడం దగ్గరి నుంచి టెస్టింగ్, డీబగ్గింగ్ చేయడం, చివరికి దాన్ని డిప్లాయ్ చేయడం దాకా ఎన్నో క్లిష్టమైన పనులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న చాట్ జీపీటీ వంటి ఏఐ ప్రోగ్రామ్‌లు.. కొంతవరకు సాఫ్ట్వేర్ కోడ్లను రాసిపెట్టగలుగుతున్నాయి కూడా. అయితే తాము అభివృద్ధి చేసిన ‘డెవిన్’.. సాఫ్ట్వేర్ కోడ్ రాయడంతోపాటు.. టెస్టింగ్, డీబగ్గింగ్, డిప్లాయ్ కూడా చేయగలదని ‘కాగ్నిషన్’ కంపెనీ ప్రకటించింది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయగల స్థాయిలో పూర్తిస్థాయిలో పనిచేసే వెబ్‌సైట్‌ను రెడీ చేసి పెడుతుందని వివరించింది. అది కూడా జస్ట్ ఒక చిన్న కమాండ్ ఇస్తే సరిపోతుందని తెలిపింది. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను నేర్చుకోగలదని వివరించింది. కేవలం కంప్యూటర్లో సృష్టించడం కాకుండా.. వాస్తవంగా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయనేది తేల్చే ‘ఎస్‌డబ్ల్యూఈ–బెంచ్‌మార్క్’లో డెవిన్ మంచి పనితీరు చూపడం గమనార్హం. ఈ బెంచ్‌మార్క్‌లో.. చాట్ జీపీటీ–3.5 ప్రోగ్రామ్ 0.52%, చాట్ జీపీటీ–4 ప్రోగ్రామ్ 1.74%, క్లాడ్ 4.8% సాఫ్ట్వేర్ సమస్యలను పరిష్కరించగలిగితే.. డెవిన్ ఏకంగా 13.86% పరిష్కరించగలిగింది. తప్పులను గుర్తించి సరిదిద్దుకునేలా.. ‘డెవిన్’ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా పనిచేస్తుందన్న దానిపై కాగ్నిషన్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్కాట్ వూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఈ ఏఐ ప్రోగ్రామ్‌కు కొన్నేళ్లుగా శిక్షణ ఇస్తున్నామని.. తాను చేసిన తప్పులను గుర్తించి సరిదిద్దుకునే సామర్థ్యం కూడా ఉందని ఆయన వెల్లడించారు. ‘ఏఐ’ ప్రోగ్రామ్‌ల రాకతో భారీగా ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనలపైనా ఆయన స్పందించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఉపయుక్తంగా ఉండేందుకు ‘డెవిన్’ను రూపొందించామని.. దీనినే పూర్తిస్థాయిలో ‘ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్’గా వినియోగించాలన్నది తమ ఉద్దేశం కాదని పేర్కొన్నారు. వెబ్సైట్లతోపాటు మనకు కావాల్సిన విధంగా వీడియో దృశ్యాలనూ ‘డెవిన్’ రూపొందించగలదని వెల్లడించారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
Google software engineer : ఏ డే ఇన్ మై లైఫ్...
గూగుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సలోని రక్హోలియా ‘ఏ డే ఇన్ మై లైఫ్ ఎట్ గూగుల్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన వీడియో 2.4 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ఉదయం ఇంటి నుంచి బయలుదేరడం నుంచి గూగుల్ ఆఫీసులోకి అడుగు పెట్టడం, చెక్ అప్డేట్స్, బ్రేక్ ఫాస్ట్, ప్లాన్ ఫర్ ది డే అండ్ వర్క్, గెట్ సమ్ వాటర్ అండ్ స్నాక్స్, కోడ్ అండ్ అటెండింగ్ మీటింగ్స్, కొద్ది సమయం పుస్తకం చదవడం, టేబుల్ టెన్నిస్ ఆడడం, వర్క్ చేస్తూ స్నాక్స్, కాఫీ ఆస్వాదించడం. వర్క్కోడ్, డిజైన్, డిస్కస్, మ్యూజిక్ రూమ్‌లో కొద్దిసేపు గడపడం, జిమ్‌లో కొద్దిసేపు ఎక్సర్సైజ్, కోడింగ్ సెషన్లు, సాయంత్రం ఆఫీసు నుంచి తిరిగి ఇంటికి వెళ్లడం...ఇలాంటి దృశ్యాలెన్నో ఈ వీడియోలో కనిపిస్తాయి. ఆఫీస్ జిమ్‌లో క్విక్ వర్కవుట్ సెషన్లాంటి వెల్–టైమ్డ్ బ్రేక్స్‌ను ఈ వీడియో హైలెట్ చేస్తుంది. -
Hyderabad: మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
గచ్చిబౌలి: మరి కొద్ది గంటల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ జరగాల్సి ఉంది. కాబోయే భర్త మాట్లాడి వెళ్లి కొద్ది సేపటికే ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భాను ప్రసాద్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా, గొసుకులపల్లికి చెందిన ముద్దం విద్యశ్రీ(23) కొత్తగూడలోని పీజీ హస్టల్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. సోమవారం సాయంత్రం హస్టల్లోని బాత్ రూమ్‌కు వెళ్లిన ఆమె బయటికు రాకపోవడంతో రూమ్మేట్స్ తలుపులు తెరిచి చూడగా. టవల్‌తో షవర్ రాడ్‌కు ఉరి వేసుకుని కనిపించింది. దీంతో వారు ఆమె సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. కాగా ఇటీవల ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి కార్డులు పంపిణీ చేసి షాపింగ్ పూర్తి చేసింది. బుధవారం ప్రీ వెడ్డింగ్ షూట్ జరగాల్సి ఉంది. ఆమెకు కాబోయే భర్త హస్టల్ వద్దకు మాట్లాడి వెళ్లిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
NRI: పల్లె నుంచి ప్రపంచస్థాయికి.. కరీంనగర్ వాసి!
కరీంనగర్: తిమ్మాపూర్ మండలం మక్తపల్లికి చెందిన ఎన్ఆర్ఐ తన టాలెంట్‌తో విశ్వవేదికపై మరోమారు మెరిశాడు. ఫోర్బ్స్ జాబితాలో అఫీషియల్ ఎగ్జిక్యూటీవ్‌గా స్థానం పొందాడు. ప్రపంచ వ్యాప్తంగా 160కిపైగా విద్యా విషయక జర్నల్స్ రాసినందుకు ఈ గుర్తింపు లభించింది. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం పిల్లర్ ఆఫ్ ది నేషన్ అవార్డు ప్రకటించింది. చిన్న గ్రామం నుంచి అగ్రరాజ్యానికి.. మక్తపల్లికి చెందిన చింతం రాములు–కనకలక్ష్మి దంపతుల కుమారుడు చింతం నరేందర్. ప్రాథమిక విద్యాభ్యాసం గ్రామంలో పూర్తిచేశాడు. ఉన్నత విద్య ఎల్ఎండీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్, డిగ్రీ కరీంనగర్లో చదివాడు. 2007లో హైదరాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేశాడు. సాఫ్ట్‌వేర్‌గా కెరీర్.. చదువు పూర్తయిన తర్వాత నరేందర్ బెంగళూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. తర్వాత వత్తిరీత్యా అమెరికా, ఇటలీ, జర్మనీ, లండన్, స్కాట్లాండ్, డెన్మార్క్, ఫ్రాన్స్ తదితర దేశాల్లో పర్యటించారు. తక్కువ సమయంలో ఎక్కువ దేశాల్లో పనిచేసి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్‌గా గుర్తింపు పొందాడు. 2015 నుంచి అమెరికాలో స్థిరపడ్డాడు. రీసెర్చ్ పేటెంట్లు.. అమెరికా వెళ్లిన తర్వాత నరేందర్ 55 కీలక అంశాలపై రీసెర్చ్ చేసి ఇన్నోవేటివ్ పేటెంట్లు పబ్లిష్ చేశాడు. తర్వాత ప్రపంచస్థాయి కాన్ఫరెన్సులకు కీనోట్ స్పీకర్‌గా వ్యవహరించాడు. 11 ప్రపంచస్థాయి జర్నల్ సంస్థలకు చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తూ సుమారు 160 ప్రపంచస్థాయి జర్నల్ ప్రచురించాడు. అనేక విద్యాసంస్థల టెక్నికల్ కమిటీ మెంబర్‌గా కూడా పనిచేస్తున్నాడు. నరేందర్‌ను ప్రశంసిస్తూ వచ్చిన లేఖ పత్రం, నరేందర్‌కు వచ్చిన నేషన్ అవార్డు కేంబ్రిడ్జి నుంచి డాక్టరేట్.. నరేందర్ రీసెర్చ్ జర్నల్స్‌ను గుర్తించిన ప్రపంచంలోని అత్యున్నతమైన కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఇటీవల చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పట్టా అందజేసింది. అతి తక్కువ సమయంలోనే కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదిగి ప్రముఖ ఎలక్ట్రానిక్ ఇన్నోవేషన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీలో సీనియర్ ఎంటర్‌ఫ్రైస్ ఆర్కిటెక్ట్ స్థానం సంపాదించాడు. అనేక ఇన్నోవేటివ్ జర్నల్స్ మార్కెట్లో విడుదల చేసి, అత్యంత ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ జర్నల్‌లో అఫీషియల్ ఎక్జిక్యూటీవ్‌గా స్థానం సంపాదించాడు. పిల్లర్ ఆఫ్ ది నేషన్ పురస్కారం! ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం నరేందర్‌కు పిల్లర్ ఆఫ్ ది నేషన్ అవార్డు ప్రదానం చేసింది. ఈమేరకు స్పీకర్ శ్రీరాం నివాస్‌గోయల్ ఇటీవల అవార్డును ఢిల్లీలో ప్రదానం చేశారు. ఈమేరకు నరేందర్‌ను ప్రశంసిస్తూ లేఖ కూడా పంపించారు. గ్రామంలో సంబరాలు.. తమ ఊరి యువకుడికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై మక్తపల్లిలో నరేందర్ స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు సంబురాలు చేసుకున్నారు. నరేందర్ తల్లిదండ్రులు అందరికీ మిఠాయిలు పంచారు. -
అమెరికా అబ్బాయి.. చిత్తూరు అమ్మాయి
పలమనేరు(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో అమెరికా అబ్బాయి, పలమనేరు అమ్మాయి హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకుని పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. స్థానిక సాయినగర్‌కు చెందిన భాస్కర్, సుమలతరెడ్డి కుమార్తె రేవూరి మీనా నాలుగేళ్లుగా అమెరికాలోని మిచిగాన్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. అదే కంపెనీలో పనిచేస్తున్న అదే రాష్ట్రం వాటర్‌పోర్ట్ టౌన్‌కు చెందిన బ్రాడ్లీ టెర్రీతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ విషయాన్ని ఇరువురు తల్లిదండ్రులకు తెలుపడంతో వీరి పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో శుక్రవారం ఇక్కడి కళ్యాణ మండపంలో వీరి వివాహం హిందూ సాంప్రదాయం మేరకు ఘనంగా జరిగింది. బంధువులు హాజరై నూతన జంటను ఆశీర్వాదించారు. -
Gachibowli: ఆర్టీసీ బస్సు కిందపడి టెక్కీ దుర్మరణం
హైదరాబాద్: బైక్ అదుపు తప్పి ఆర్టీసీ బస్సు వెనక చక్రాల కింద పడి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శోభన్ బాబు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ, ఆటోనగర్‌కు చెందిన ఆకుల సాయికృష్ణ(26) గచ్చిబౌలి జనార్దన్హిల్స్లోని సునీతా రెడ్డి లగ్జరీ మెన్స్ హాస్టల్లో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం అతను బైక్‌పై డీఎల్ఎఫ్ వైపు వెళుతుండగా, రాయదుర్గం నుంచి డీఎల్ఎఫ్ వైపు వస్తున్న హెచ్‌సీయూ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో బైక్ అదుపు తప్పి కిందçపడ్డాడు. బస్సు వెనుక చక్రాలు అతడి తలమీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
Korutla: మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి
కోరుట్ల: నాలుగేళ్లలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది కోరుట్లకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు బెజ్జారపు వేణు–మాధవిల కూతురు మౌనిక. ఆమె 2013లో ఎం.ఫార్మసీలో గోల్డ్‌మెడల్ సాధించింది. మౌనిక వివాహం సాఫ్ట్వేర్ ఇంజినీర్ శేఖర్‌తో జరిగింది. అనంతరం మళ్లీ చదువుపై దృష్టిపె ట్టి, 2019లో వీఆర్వో ఉద్యోగం సాధించింది. ఆ జాబ్ చేసూ్తనే అదే ఏడాది ఫార్మసిస్ట్ పోస్టుకు ఎంపికైంది. ప్రస్తుతం హై దరాబాద్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌గా పని చేస్తోంది. 2022 డిసెంబర్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా దరఖాస్తు చేసుకుంది. 6 నెలల కష్టపడి చదివి, పరీక్ష రాయగా శుక్రవారం రాత్రి ఫలితాలు వెలువడ్డాయి. ఆమె రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. తన భర్త శేఖర్ ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ ఉద్యోగాలు సాధించానని తెలిపింది. -
‘వేర్’వేర్లు..! విభిన్న సాఫ్ట్వేర్లు..
నిత్యం కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైళ్లను వినియోగిస్తుంటారు. ఇందులో ప్రధానంగా సాఫ్ట్వేర్, హార్డ్వేర్లుంటాయి. అసలు వేర్ అంటే ఏమిటో తెలుసా.. సాధనమని అర్థం. కంప్యూటర్లో మానిటర్, సీపీయూ, కీబోర్డు, మౌజ్ వంటి భాగాలన్నీ హార్డ్వేర్లు. ఈ హార్డ్వేర్లను పనిచేయించేవి సాఫ్ట్వేర్లు. ఈ సాఫ్ట్‌వేర్‌ల్లో చాలారకాలు ఉంటాయి. వీటిల్లో మంచి చేసేవే కాదు, హాని చేసేవీ ఉంటాయి. ఆ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. రాన్సమ్వేర్ ఇది హానికర సాఫ్ట్వేర్. పీసీలో ఇన్స్టాల్ అయ్యి, లోపలి భాగాలను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. పరికరాన్ని, డేటాను తిరిగి వినియోగించుకోనీయకుండా చేస్తుంది. రాన్సమ్ అంటే డబ్బులు తీసుకొని, విడుదల చేయటం. పేరుకు తగ్గట్టుగానే ఇది డబ్బులు చెల్లించాలంటూ సందేశాన్ని తెర మీద కనిపించేలా చేస్తుంది. డబ్బులు చెల్లిస్తే గానీ డేటాను వాడుకోనీయదు. మనకు సంబంధించిన ఏ వివరాలు కనిపించవు. రాన్సమ్వేర్లలో చాలా రకాలున్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవటం, నాణ్యమైన యాంటీవైరస్/ యాంటీ మాల్వేర్ను ఇన్స్టాల్ చేసుకోవటం ద్వారా దీని బారినపడకుండా చూసుకోవచ్చు. స్పైవేర్ ఇదొక మాల్వేర్. ఒకసారి కంప్యూటర్లో ఇన్స్టాల్ అయితే చాలు. మన అనుమతి లేకుండానే, మనకు తెలియకుండానే ఆన్లైన్ వ్యవహారాలన్నింటినీ పసిగడుతుంది. ప్రకటనకర్తలు, మార్కెటింగ్ డేటా సంస్థలు సైతం ఇంటర్నెట్ వాడేవారి తీరుతెన్నులను తెలుసుకోవటానికి దీన్ని ఉపయోగిస్తుంటాయి. మార్కెటింగ్, ప్రకటనల కోసం తోడ్పడే స్పైవేర్లను ‘యాడ్వేర్’ అంటారు. ఇవి డౌన్లోడ్ లేదా ట్రోజన్ల ద్వారా పీసీలో ఇన్స్టాల్ అవుతాయి. ఈమెయిల్ ఐడీలు, వెబ్సైట్లు, సర్వర్ల వంటి వివరాలను పీసీ నుంచి సేకరించి, ఇంటర్నెట్ ద్వారా థర్డ్ పార్టీలకు చేరవేస్తాయి. కొన్ని స్పైవేర్లు లాగిన్, పాస్‌వర్డ్‌ల వంటి వాటినీ దొంగిలిస్తాయి. ఈ సాఫ్ట్వేర్లను ‘కీలాగర్స్’ అని పిలుచుకుంటారు. సీపీయూ మెమరీని, డిస్క్ స్టోరేజినీ, నెట్వర్క్ ట్రాఫిక్‌నూ వాడుకుంటాయి. నాగ్వేర్ ఒకరకంగా దీన్ని వేధించే సాఫ్ట్వేర్ అనుకోవచ్చు. ఆన్లైన్లో ఏదైనా పని చేస్తున్నప్పుడో, ఫీచర్‌ను ప్రయత్నిస్తున్నప్పుడో పాపప్, నోటిఫికేషన్ మెసేజ్‌లతో లేదా కొత్త విండో ఓపెన్ చేస్తుండడం దీని ప్రత్యేకత. ఉదాహరణకు- వెబ్‌పేజీ లేదా ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నామనుకోండి. ఏదో యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలని న్యూవిండోలో అడగొచ్చు. ప్రోగ్రామ్‌ను లోడ్ చేస్తున్నప్పుడు లైసెన్స్ కొనమనీ చెబుతుండొచ్చు. దీని ద్వారా వచ్చే మెసేజ్‌లు చాలా చిరాకు పుట్టిస్తుంటాయి. ఆగకుండా అలా వస్తూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సాఫ్ట్‌వేర్‌ను అన్ఇన్స్టాల్ చేయటం ఉత్తమం. ఇదీ చదవండి: పేటీఎంపై నిషేధం.. ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు క్రాప్వేర్ ఇది కొత్త పీసీతో వచ్చే సాఫ్ట్వేర్. కంప్యూటర్లో ముందే ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. ఇవి ప్రయోగ పరీక్షల కోసం ఉద్దేశించినవి. కాబట్టి వీటితో మనకు నేరుగా ఉపయోగమేమీ ఉండదు. గడువు తీరిన తర్వాత పోతాయి. కొన్నిసార్లు అప్లికేషన్లను పరీక్షించటానికి తయారీదారులు క్రాప్వేర్ను ఇన్స్టాల్ చేయిస్తుంటారు. ఇందుకోసం థర్డ్ పార్టీలు డబ్బు కూడా చెల్లిస్తుంటాయి. దీంతో పీసీల ధరా తగ్గుతుంది. డిస్క్ స్పేస్‌ను వాడుకున్నా క్రాప్వేర్ హాని చేయదు. -
పార్ట్‌టైమ్ జాబ్ నిలువునా ముంచేసింది.. ఇది ఓ టెకీ కథ.. తస్మాత్ జాగ్రత్త!
ఆన్లైన్, సైబర్ మోసాలు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. సామాన్యులే కాకుండా బాగా చదువుకున్నవారు, టెక్నాలజీపై అవగాహన ఉండి ఐటీ రంగంలో పనిచేస్తున్న వారు కూడా ఈ ఆన్లైన్ ఫ్రాడ్లకు బలవుతున్నారు. ఆన్లైన్లో పార్ట్‌టైమ్ జాబ్‌తో నిలువునా మోసపోయిన ఓ టెకీ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి 11 నుంచి వివిధ ఆన్లైన్ టాస్క్‌లపేరుతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సహా ఎనిమిది మందిని ఏకంగా రూ. 1.04 కోట్లకు మోసగించిన ఉదంతానికి సంబంధించి పుణే, పింప్రీ చించ్వాడ్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు గురువారం ఎనిమిది ఎఫ్ఐఆర్లను నమోదు చేశాయి. రూ. 30.20 లక్షలు నష్టపోయిన టెకీ ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మహారాష్ట్రలోని వాకాడ్ ప్రాంతానికి చెందిన 39 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ గత జనవరి 24 నుంచి 27 తేదీల మధ్య రూ.30.20 లక్షలు నష్టపోయారు. ఇటీవల జాబ్ పోవడంతో నిరుద్యోగిగా మారారు. దీంతో ఆన్లైన్ టాస్క్‌లు పూర్తి చేసే పార్ట్‌టైమ్‌లో చేరారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్ గురించి జనవరి 24న తన మొబైల్ ఫోన్‌కు సందేశం వచ్చింది. దీనికి స్పందించిన ఆయనకు ఫోన్లో మెసెంజర్ యాప్‌ను డౌన్లోడ్ చేయాలని చెప్పారు. ఆపై ఆయన్ను ఓ గ్రూప్‌లో చేర్చారు. ఆ తర్వాత వివిధ రకాల వస్తువులు, కంపెనీలకు రేటింగ్ ఇచ్చే టాస్క్‌లు అప్పగించారు. ఈ టాస్క్‌లు పూర్తి చేశాక రూ.40 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ముందుగా కొద్దికొద్దిగా టెకీ నుంచి డబ్బు తీసుకున్నారు. ఇలా జనవరి 24 నుంచి 12 విడతల్లో రూ.30.20 లక్షలు మోసగాళ్లు చెప్పిన బ్యాంక్ అకౌంట్లకు బాధితుడు ట్రాన్స్ఫర్ చేశాడు. కంపెనీకి లాస్ వచ్చిందని మళ్లీ కొంత డబ్బు పంపించాలని చెప్పడంతో అనుమానం వచ్చిన అతను తాను అప్పటిదాకా ట్రాన్స్ఫర్ డబ్బును తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశాడు. దీంతో మోసగాళ్లు అతని స్పందించడం మానేశారు. మేనేజర్ రూ.72.05 లక్షలు ఇదే విధంగా థెర్‌గావ్‌కు చెందిన 24 ఏళ్ల గ్రాడ్యుయేట్ యువతి కూడా రూ.2.39 లక్షలు నష్టపోయింది. ఈమే కాకుండా మరో ఆరుగురు కూడా ఆన్లైన్ టాస్క్‌లతో మోసపోయారు. వీరిలో ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్న మహిళ కూడా ఉన్నారు. ఆమె ఏకంగా రూ.72.05 లక్షలు నష్టపోవడం గమనార్హం. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఖమ్మం యువకుడి మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదలో ఖమ్మం జిల్లా వాసి మృత్యువాతపడ్డాడు.పెనుబల్లి మండలం వీఎం జంబర్‌కు చెందిన ముక్కర సాయి రాజీవ్‌రెడ్డి(33) అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజీవ్ రెడ్డి మరణించాడు. కాగా రాజీవ్ రెడ్డికి గతేడాదే పెళ్లి అయ్యింది. ఆయన తండ్రి ముక్కర భూపాల్‌రెడ్డి.. కల్లూర్ షుగర్ ఫ్యాక్టరీకి సీడీసీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కథ..స్క్రీన్ ప్లే..డైరెక్షన్..అంత చెల్లె
-
సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్.. నలుగురు అరెస్ట్
-
‘నందిని మంచితనమే ఆమె పాలిట శాపంగా మారింది’
తమిళనాడులో సాఫ్ట్వేర్ ఉద్యోగిని నందిని హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చిన్ననాటి నుంచి స్నేహితురాలైన ఓ యువతి.. నందిని పెళ్లి చేసుకునేందుకు ఏకంగా లింగ మార్పిడి(ట్రాన్స్ మెన్) ఆపరేషన్ కూడా చేసుకుంది. పాండి మహేశ్వరి కాస్తా వెట్రిమారన్‌గా పేరు మార్చుకుంది. చివరికి ఆమెనే నందినిని అత్యంత దారుణంగా హత్య చేయడం విస్మయానికి గురిచేస్తుంది. యువతి చేతులు, కాళ్లకు తాళ్లతో కట్టేసి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. చెన్నై శివారులోని పొన్మార్ అనే ఓ నిర్మానుష్య ప్రాంతంలో వెలుగు చూసిన ఈ ఘటన అందరిని ఉలిక్కిపడేలా చేసఙఃధఙ మృతురాలిని మధురై జిల్లాకు చెందిన రవీంద్రన్ కుమార్తె నందిని(24)గా గుర్తించారు. అదే జిల్లాకు చెంది పాండి మహేశ్వరి(26)కి నందినితో 10వ తరగతి నుంచి మంచి స్నేహం ఉంది. పాండి మహేశ్వరి కొన్నేళ్ల క్రితం హిందూ మతంలోకి మారింది. ట్రాన్స్ జెండర్‌గా మారి తన పేరును వెట్రిమారన్‌గా మార్చుకుంది. నందిని, వెట్రిమారన్ ఇద్దరు గత 8 నెలలుగా చెన్నైలోని దురైపాక్కంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజీర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంతో వెట్రిమారన్, తన ప్రేమను నందినికి తెలియజేశాడు. నందిని అతని ప్రేమను నిరాకరించినప్పటికీ అతనితో సన్నిహతంగానే ఉంటుంది. ఈ క్రమంలో ఆమె మరో వ్యక్తితో వ్యక్తితో డేటింగ్ చేస్తుందనే అనుమానంతో వెట్రిమారన్ పగ పెంచుకున్నాడు. నందిని పుట్టిన రోజు సందర్భంగా వీరిద్దరు కలిసి పలు ప్రాంతాల్లో తిరిగారు. గుడికి, అనాథాశ్రమానికి వెళ్లడంతో పాటు మధ్యాహ్నం ఓ హోటల్లో భోజనం చేశారు. చివరకు పోన్ మార్ ప్రాంతానికి రాగానే నందినిపై దాడి చేశాడు. ముందుగా సర్ప్రైజ్ చేస్తానని చెప్పి, కళ్లకు గంతలు కట్టి, ఆ తర్వాత చేతులు, కాళ్లు కట్టేసి బ్లేడుతో చేతులు, కాళ్లు, మణికట్టు, మెడపై కోశారు. పెట్రోల్ పోసి సజీవదహనం చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వెట్రిమారన్ పక్కా ప్రణాళికతో నందిని పుట్టిన రోజు సర్ప్రైజ్ చేస్తానని బయటకు తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. వారం రోజుల ముందే హత్యకు పథకం రచించాడని పేర్కొన్నారు. తాజాగా నందినికి సంబంధించి పలు విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిందితుడు వెట్రిమారన్ ట్రాన్స్ మెన్‌గా మారిన తర్వాత అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు సంబంధాలు తెంచుకున్నా.. నందిని మాత్రం అతనితో స్నిహితురాలుగానే ఉంది. అయితే ఆమె మంచితనమే నేను ఆమె ప్రాణాలు తీసిందని బాధితురాలి సోదరి అముద వాపోయింది. తన సోదరి హత్యకు గురైందన్న నిజాన్ని తాము ఇంకా నమ్మలేకపోతున్నానమని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు నందిని, వెట్రమారన్కు గల బంధాన్ని గుర్తు చేసుకుంది. మహేశ్వరి ట్రాన్స్ మెన్‌గా మారిన తర్వాత మిగతావారు అతనితో సంబంధాలు తెంచుకున్నట్లు చెప్పింది. కానీ స్నేహితుడిని బాధపెట్టడం ఇష్టం లేక అతనితో సన్నిహితంగా ఉండటానికే ఇష్టపడిందని తెలిపింది. వెట్రిమారన్ ఎప్పుడు మధురై వచ్చినా వాళ్ల ఇంటికి వచ్చేవాడని తానే స్వయంగా తన చేతులతో తినిపించేదాన్నని పేర్కొంది. తన కుమార్తె వెట్రిమారన్‌తో మానవతా హృదయంతో తన స్నేహాన్ని కొనసాగించిందని బాధితురాలి తండ్రి అన్నారు. ఈ విషయంలో తమకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. వెట్రిమారన్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు లేవని కానీ తన కూతురు చూసి తట్టుకోలేకపోతున్నట్లు వాపోయారు. మెట్రిమారన్ ఇంత క్రూరానికి పాల్పడతాడని ఊహించలేదని అన్నారు. ‘నా కూతుర్ని కాలిపోయిన శరీరంతో. చేతులు, కాళ్ళు గొలుసులతో కట్టివేయడం చూశాము. ఇక వ్యక్తి ఇంత దారుణంగా చంపుతారా? ఆమె జీవితం ఇంత క్రూరమైన రీతిలో ముగిసిందనే విషయం మమ్మల్ని ఎంతగానో బాధిస్తుంది’ అని కన్నీటి పర్యంతమయ్యారు. -
టెక్కీ దారుణ హత్య.. హద్దుల్లేని ప్రేమ పరిణామాలు ఇలాగే ఉంటాయా?
చెన్నై శివారులోని తాలంబూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగి నందినిని స్నేహితురాలు మహేశ్వరి అలియాస్ వెట్రిమారన్ దారుణంగా హత్య చేయడం సంచలనం సృష్టించింది. నందినిని ప్రేమించిన మహేశ్వరి ఆరునెలల కిందటే అబ్బాయిగా మారి వెట్రిమారన్‌గా పేరు మార్చుకుంది. తన కోసమే లింగమార్పిడి చేసుకున్న తనను నందిని దూరంగా పెడుతుందన్న కోపంతో హత్య చేసి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. స్నేహితుడు లేదా స్నేహితురాలి కోసం లింగమార్పిడి చేసుకున్న తర్వాత తనను పట్టించుకోకపోవడం, వేరొకరితో సన్నిహతంగా ఉండటంతో దాడులు చేసిన ఘటనలు గతంలోనూ వార్తల్లో కనిపించాయి. ఈ నేపథ్యంలో లింగమార్పిడి చుట్టూ ఉన్న సామాజిక సంక్లిష్టతల గురించి, ట్రాన్స్ జెండర్స్ పట్ల సమాజం చూపించే తిరస్కరణ గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు కొందరు వ్యక్తులు జెండర్ ఐడెంటిటీలో ఎందుకు గందరగోళ పడతారనేది సంక్లిష్టమైన ప్రశ్న. దీనికి ఖచ్చితమైన సమాధానం లేదు. జెండర్ ఐడెంటిటీకి జీన్స్ కు మధ్య సంబంధాలను అనేక అధ్యయనాలు గుర్తించాయి. అయితే నిర్దిష్టంగా ఏ జీన్స్ కారణమనే దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. మరోవైపు చిన్ననాటి అనుభవాలు, సామాజిక, సాంస్కృతిక ప్రభావాలు ఒక వ్యక్తి జెండర్ ఐడెంటిటీకి దోహదపడతాయి. అంటే ఒక వ్యక్తి ట్రాన్స్ జెండర్‌గా మారడమనేది వారి ఎంచుకున్నది కాదనేది గుర్తించాలి. ప్రతి ఒక్కరూ ‘మగ’ లేదా ‘ఆడ’ వర్గాల్లోనే కాకుండా మధ్యలో కూడా ఉండవచ్చు. వారి జెండర్ ఐడెంటిటీని గుర్తించడం, వారు గౌరవంగా జీవించడానికి సహకరించడం అవసరం. అలా జరగనప్పుడు, ఆ గుర్తింపు గౌరవం దొరకనప్పుడు తీవ్రంగా గందరగోళ పడతారు. మానసిక సమస్యలకు లోనవుతారు. తమ సమస్యలకు కారణమైన వారిపై దాడికి కూడా పాల్పడవచ్చు. ఒక వ్యక్తికి ఐడెంటిటీ అనేది ఎంత ముఖ్యమో తెలుసుకుంటే జెండర్ ఐడెంటిటీ ప్రాధాన్యం తెలుస్తుంది. ఉదాహరణకు నా పేరు విశేష్. నేను Psy.Vishesh అని రాస్తా. అంటే సైకాలజిస్ట్ గా నా ప్రొఫెషన్ తో ఐడెంటిఫై చేసుకుంటున్నా. నన్ను అలా పిలిస్తేనే నాకు ఇష్టం, మరోలా పిలిస్తే కష్టంగా ఉంటుంది. పేరు విషయంలోనూ ఇంత ఖచ్చితంగా ఉన్నప్పుడు.. బాలికగా పుట్టిన వ్యక్తిలో పురుష భావనలు ఉంటే మనసులో ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అలాంటి భావనలను సమాజమే కాదు కుటుంబం కూడా ఒప్పుకోదు. అలాంటి పరిస్థితుల్లో తనను పురుషుడిగా అంగీకరించిన స్నేహితురాలు దొరికితే అంతకంటే ఆనందం ఉండదు. ఆ స్నేహితురాలిని, ఆ స్నేహాన్ని శాశ్వతంగా తనది చేసుకోవాలనుకుంటారు. పురుషుడిగా మారితే నందిని తనను అంగీకరిస్తుందనే, పెళ్లిచేసుకుంటుందనే ఆశతో లేదా అపోహతో మహేశ్వరి లింగమార్పిడి చేయించుకుని వెట్రిమారన్‌గా మారింది. కానీ నందిని దూరంగా ఉంచడం మారన్ మనసులో కల్లోలం రేపి ఉండవచ్చు. తనకోసం, తన ప్రేమ కోసం, తనతో జీవితం గడపడంకోసం లింగమార్పిడి సైతం చేయించుకున్నా దూరంగా పెట్టడంతో నందినిపై కోపం ఏర్పడి ఉండవచ్చు. ఆ కోసం హద్దులు దాటి నందిని హత్యకు దారితీసి ఉండవచ్చు. కోరుకున్నది దక్కనప్పుడు అందరూ ఒకేరీతిలో స్పందించరు. కొందరు తీవ్ర డిప్రెషన్‌కు లోనైతే, మరికొందరు ఫ్రస్ట్రషన్, అగ్రెషన్ కు లోనవుతారు. కారణమైన వ్యక్తిపై ద్వేషం పెంచుకుంటారు. అప్పటికే జెండర్ ఐడెంటిటీ సమస్యలో ఉన్నవారిలో ఇలాంటి పరిస్థితులు మరింత తీవ్ర భావోద్వేగాలకు కారణమవుతాయి. అప్పటికే సమాజం నుంచి తిరస్కరణ ఎదుర్కొంటున్న వ్యక్తి మనసులో ప్రేమించిన వ్యక్తి తిరస్కరణ మరింత బలమైన గాయాలు చేస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇలాంటి హింసాత్మక ప్రవర్తనలు కనిపిస్తుంటాయి. నందిని హత్య నిస్సందేహంగా బాధాకరం. అయితే ఆ నేపథ్యంలో ట్రాన్స్ జెండర్స్ పట్ల సమాజం పోకడను మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. జెండర్ ఐడెంటిటీ అనేది ఏ ఒక్కరి ఎంపిక కాదని, కొందరిలో అది భిన్నంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఆడ, మగలతో పాటు ట్రాన్స్ జెండర్స్‌కు కూడా గౌరవంగా జీవించే హక్కు ఉందని గుర్తించాలి. వారి సమస్యలను సహానుభూతితో అర్థం చేసుకోవాలి. అవసరమైన సందర్భాల్లో కౌన్సెలింగ్ లేదా సైకోథెరపీ ద్వారా వారి సమస్యల పరిష్కారానికి వీలైన సహాయ సహకారాలు అందించాలి. అప్పుడే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు తగ్గుతాయని అందరం అర్థం చేసుకోవాలి. సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com 8019 000066 -
చేతులు, కాళ్లు కట్టేసి మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్య
తిరువొత్తియూరు: తాళంబూర్ సమీపంలో చేతులు, కాళ్లను కట్టి వేసి మహిళా ఇంజినీరును దహనం చేసి హత్య చేసిన సంఘటన సంచలనం కలిగించింది. చెంగల్పట్టు జిల్లా తాళంబూరు సమీపం ఫోన్‌మార్ మాంబాక్కం వెళ్లే రోడ్డులో ప్రైవేటు నీళ్ల కంపెనీ ఉంది. కంపెనీ ఎదురుగా ఖాళీ స్థలం నుంచి శనివారం రాత్రి 8 గంటల సమయంలో సుమారు 50 మీటర్ల దూరంలో మహిళ ఆర్తనాదాలు వినిపించాయి. ఆ మార్గంలో వెళ్లిన వాహనదారులు శబ్దం విని అక్కడికి వెళ్లి చూడగా యువతి ఒకరు చేతులు, కాళ్లు గొలుసులతో కట్టివేయబడి మండుతున్న దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెందారు. ప్రజలు నీళ్లను ఆమైపె పోసి మంటలు ఆర్పారు. ఈ లోపు ఆ మహిళ మృతి చెందింది. ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు తాళంబూరు పోలీస్ ఇన్స్పెక్టర్ చార్లెస్ నేతృత్వంలో పోలీసులు యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవ పరీక్ష కోసం క్రోమ్‌పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత ఆ ప్రాంతంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో ఒక సెల్ ఫోన్ లభ్యమైనది. ఆ ఫోన్లో ఆ నంబర్లను ఆధారంగా విచారణ జరిపారు. మృతి చెందిన మహిళ బెంగళూరులో ఉన్న ప్రైవేటు సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్న ఇంజినీర్ నందిని(25) అని తెలిసింది. ఈ సంఘటన గురించి తాళంబూర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చేతులు కాళ్లు కట్టి వేసిన మహిళా ఇంజినీర్ హత్య చేయబడిన సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం కలిగించింది. -
తమిళనాడులో దారుణం.. ఐటీ ఉద్యోగిని హత్యలో డబుల్ ట్విస్ట్
చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని నందిని దారుణ హత్యకు గురైంది. ప్రియుడే ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. దీంతో ఈ ఘటన తమిళనాడులో తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. చెన్నై శివారులోని తాలంబూర్‌లో దారుణం జరిగింది. శనివారం రాత్రి సాఫ్ట్వేర్ ఉద్యోగిని నందిని(25)ని ప్రియుడు వెట్రిమారన్(26) కిరాతకంగా హత్య చేశాడు. వెట్రిమారన్ మొదట నందినిని బ్లేడ్‌తో తీవ్రంగా గాయపరిచి, అనంతరం ఆమెను గొలుసులతో బంధించి, చివరగా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. సగం కన్నా ఎక్కువ కాలిపోయి ఉన్న డెడ్‌బాడీని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే.. నందిని, వెట్రిమారన్ మధురైలోని ఒకే ఉన్నత పాఠశాలలో కలిసి చదువుకున్నారని పోలీసులు తెలిపారు. ఎనిమిది నెలల క్రితమే వీరిద్దరూ ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నారని, ప్రేమించుకుంటున్నారని వెల్లడించారు. కాగా, నందినిపై అనుమానంతోనే వెట్రిమారన్ ఆమెను హత్య చేసినట్టు నిర్ధారించారు. ఈ కేసులో వెట్రిమారన్‌ను అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్టు తెలిపారు. అయితే, ఈ హత్యలో ఓ ట్రాన్స్‌జెండర్ పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ, మరో ట్విస్ట్ ఏంటంటే.. వెట్రిమారన్ అలియాస్ పాండి మహేశ్వరి గత ఆరు నెలల క్రితమే అబ్బాయిగా మారడం గమనార్హం. మహేశ్వరి.. వెట్రిమారన్‌గా అబ్బాయిగా పేరు మార్చుకున్నాడు. దీంతో, కొద్దిరోజులుగా వెట్రిమారన్‌ను నందిని దూరం పెడుతుండటంతోనే ఆమెను హత్య చేసినట్టు సమాచారం. Deceased woman Nandhini and accused Pandi Maheshwari alias Vetrimaran. pic.twitter.com/fSaJBPoRWV — A Selvaraj (@Crime_Selvaraj) December 24, 2023 -
ఐటీ జాబ్ వదిలేసి హాయిగా లెహంగాలు అమ్ముకోండి !
ప్రస్తుతం ప్రపంచంలో పెళ్లి అనేది కాస్ట్లీ వ్యవహారం. పెళ్లి పందిరి మొదలు, విందు భోజనాలు, పెళ్లి దుస్తులు దాకా అన్నీ ఖరీదైనవీ. ఇక ఫోటోలు,వీడియోలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు వీటిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. కలకాలం గుర్తుండిపోయేలా ఫోటోలు, వీడియోలు తీసుకోవడం ఒక ఎత్తయితే, ఫోటోలు ఇంతకు మున్నెడులేని విధంగా ఎవరికీ తీసిపోని విధంగా దుస్తులు ధరించడం ఒక ఎత్తు. ఇందులో పెళ్లి కుమార్తెలు ఫ్యాషన్ లెహంగాలు, డిజైనరీ గౌన్లు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తాజాగా దీనికి సంబంధించి ఒక వాదన సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం కంటే లెహంగాలు అమ్ముకోవడం మేలు అంటూ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో అమిత్ జగ్లాన్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు, ఢిల్లీలోని పాపులర్ షాపింగ్ సెంటర్ చాందినీ చౌక్‌లో రెండే రెండు గంటలు ఉన్నాను. ఏం మాట్లాడాలో అర్థం కావడంలేదు లక్ష రూపాయల విలువ చేసే లెహంగాలు కూడా అలా హాట్ కేకుల్లా అమ్ముడు బోతున్నాయి. ఇలా ఎగరేసుకుపోతున్నారంతే.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అందుకే సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి, లెహంగాలు అమ్మడంపైనే దృష్టి పెట్టండి అంటూ ఒక సలహా ఇచ్చిపడేశాడు. దీంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇది పెళ్లిళ్ల సీజన్ సార్ కొంతమంది అంటే.. ఈ పోలిక అస్సలు బాగాలేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే లెహంగాస్ అమ్మడం చాలా కష్టం అని ఒకరు,. ఉద్యోగాలు వల్ల రెగ్యులర్‌గా జీతం వస్తుంది.. కానీ వ్యాపారంలో ఆదాయం సీజనల్‌గా వస్తుంది, 100 రెట్లు మూలధనం కావాలి అంటూ స్పందించారు. అయితే లెహంగాలు విక్రయించడం అంటే అంత తేలిగ్గా తీసిపారేయకండి. ఏదైనా పరిశ్రమలో వృద్ధి చెందాలంటే, వృత్తి ఏదైనా హార్డ్ వర్క్ చాలా ముఖ్యం. లెహంగా సేల్స్ అయినా. సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ అయినా అంటూ ఒకరు స్పందించారు. అసలు"లెహంగా అమ్మే ప్రయత్నం చేశారా అమిత్?" ఇందుకోసం ఎలాంటి లక్షణాలు కావాలో కూడా మీకు తెలుసా? అసలు కామెంట్లు పాస్ చాలా ఈజీ. కానీ కష్టపడితే తెలుస్తుంది అని ఒకరు రిప్లై ఇచ్చారు. మొత్తంగా ఈ ట్వీట్ పది లక్షల వ్యూస్‌ను, సుమారు 7వేల కామెంట్లను సాధించింది. Been in Chandni chowk only 2 hours. One advice: Leave your software job and just sell lehngas. I am at a loss of words. Lehngas north of 1 lakh rupees flying off the counters. — Amit Jaglan (@iamjaglan) December 2, 2023 -
హేమలత ఆత్మహత్యకు వేధింపులే కారణం
అనంతపురం క్రైం: సాప్ట్వేర్ ఇంజినీర్ సాయి హేమలత (28) ఆత్మహత్యకు అత్తింటి వేధింపులే కారణమని అనంతపురం నాల్గో పట్టణ సీఐ ప్రతాపరెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసులో అత్తతో పాటు భర్త, అతని తమ్ముడు, ఆడపడుచుని అరెస్ట్ చేసినట్లు వివరించారు. వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన సాయి హేమలతకు అనంతపురం నగర శివారులోని పీవీకేకే కళాశాల సమీపంలో నివాసముంటున్న కళ్యాణ చక్రవర్తితో 9 నెలల క్రితం వివాహమైంది. అత్తారింట్లో కాలు పెట్టినప్పటి నుంచి అదనపు కట్నం కోసం ఆమెను భర్త, ఆయన కుటుంబసభ్యులు వేధించేవారు. విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో పలుమార్లు పెద్దలు పంచాయితీ నిర్వహించి సర్ది చెప్పారు. అయినా వారిలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే సాయి హేమలతకు ప్రతి నెలా వచ్చే వేతనాన్ని ఎప్పటికప్పుడు కళ్యాణ్ తన ఖాతాలోకి మళ్లించుకునేవాడు. కనీస ఖర్చులకు సైతం డబ్బు ఇచ్చేవాడు కాదు. గత వారం భర్త, కుటుంబసభ్యులు ఉత్తర కర్ణాటక సందర్శనకు సిద్ధమయ్యారు. ఇదే విషయాన్ని సాయి హేమలతకు తెలపడంతో ఆమె రుతుక్రమ ఇబ్బందుల కారణంగా యాత్రను వాయిదా వేయాలని కోరింది. దీంతో ఆమె మనోభావాలను కించపరిచేలా మాట్లాడి కుటుంబసభ్యులతో కలసి యాత్రకు భర్త తరలివెళ్లాడు. టూర్లో ఉన్న భర్తకు ఆమె పలుమార్లు ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన సాయిహేమలత గత ఆదివారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై సాయి హేమలత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు నిర్ధారణ కావడంతో కళ్యాణ్‌చక్రవర్తి, లక్ష్మీనరసమ్మ, కుమార్ ప్రేమ్‌సాయి, వరలక్ష్మిపై వేధింపుల కేసు నమోదు చేసి, మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితులను న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. -
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం..
వారంలో 70 గంటలు పనిచేయాలంటూ చేసిన వ్యాఖ్యలు మరువక ముందే ఇన్ఫోసిస్ 'నారాయణ మూర్తి' (Narayana Murthy) సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా ఫైనాన్షియల్ అనలిస్ట్ కావడం సులభమే అంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత కొంతకాలంలో సోషల్ మీడియాలో 70 గంటల పని గురించి చర్చలు వెల్లువెత్తాయి. అవన్నీ ఇప్పుడు కొంత సద్దుమణిగాయి అనేలోపే.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ లేదా ఫైనాన్సియల్ అనలిస్ట్ కావడం చాలా తేలిక, కంపెనీ నడపడం.. వ్యాపారవేత్తగా మారడం చాలా కష్టం అంటూ వ్యాఖ్యానించారు. బిజినెస్ చేయడానికి.. వ్యాపారవేత్తలుగా మారటానికి రిస్క్ తీసుకునే యువకులకు బాసటగా నిలిచేలా సమాజంలో మార్పులు రావాలని ఆయన వెల్లడించారు. 1981లో ఇన్ఫోసిస్‌లో కేవలం ఆరుమంది ఇంజినీర్లు మాత్రమే ఉన్నారని, ఆ తరువాత ఊహకందని రీతిలో వినూత్న ఆలోచనలతో పారిశ్రామికవేత్తలు పెరిగారని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఖాతాల్లోకి రూ.820 కోట్లు పడగానే ఆనందపడిన జనం - అంతలోనే.. దశాబ్దం క్రితం కంటే నేటి యువత గొప్ప ఆత్మవిశ్వాసంతో ఉన్నారని సంక్లిష్ట సమస్యలను సైతం పరిష్కరించే ఉత్సాహం వారిలో ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యాపార రంగంలో అడుగుపెట్టే యువకులకు అందరూ అండగా ఉండాలని చెబుతూ.. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఫైనాన్షియల్ అనాలిసిస్ వంటి వాటి కంటే వ్యాపార రంగం భిన్నంగా ఉంటుందని, ఇందులో సక్సెస్ వస్తుందా? రాదా అనే గ్యారెంటీ ఉండదని.. మొత్తం రిస్క్‌తో కూడుకున్నపని అని నారాయణ మూర్తి పేర్కొన్నారు. -
ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుపై సైబర్ అటాక్
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీరంగం దూసుకుపోతోంది. దానికితోడు మోసాలూ అదే మాదిరి పెరుగుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి దిగ్గజ సంస్థల వరకు అందరూ వీటి బారిన పడుతున్నారు. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్‌పై రాన్సమ్వేర్ దాడి జరిగినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన చైనాకు చెందిన ఇండస్ట్రీయల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా(ఐసీబీసీ)పై సైబర్‌దాడి జరిగినట్లు సమాచారం. ఆ బ్యాంకుకు అనుబంధంగా ఉన్న అమెరికాలోని ఐసీబీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌పై రాన్సమ్వేర్ దాడి జరిగినట్లు మీడియా కథనాలు వచ్చాయి. అయితే సైబర్ దాడిని వెంటనే గుర్తించినట్లు ఐసీబీసీ తెలిపింది. ఈ దాడి ఎవరు చేశారనే విషయాలను వెల్లడించలేదు. దీనిపై పూర్తి విచారణ జరగాల్సి ఉందని బ్యాంకు అధికారులు చెప్పారు. ఐసీబీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సైట్లను పునరుద్ధరించేందుకు తమ భద్రతా నిపుణుల బృందం పనిచేస్తుందని బ్యాంకు వర్గాలు తెలిపాయి. బుధవారం జరిగిన యూఎస్ ట్రెజరీ ట్రేడ్లు, గురువారం నాటి స్వల్పకాల రుణాలైన రెపో ఫైనాన్సింగ్ ట్రేడ్లను విజయవంతంగా క్లియర్ చేసినట్లు ఐసీబీసీ చెప్పింది. అయితే ఈసైబర్‌దాడికి సంబంధించి ఫెడరల్ రెగ్యులేటర్లతో పాటు ఆర్థిక రంగ నిపుణులతో నిత్యం పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు యూఎస్ ట్రెజరీ విభాగం వివరించింది. చైనాతో సంబంధం లేకుండా యూఎస్ కార్యకలాపాలు స్వతంత్రంగా జరుగుతాయని ఐసీబీసీ వెల్లడించింది. మార్కెట్‌పై ఈ ఘటన పరిమిత ప్రభావాన్ని చూపినట్లు బ్రోకర్ డీలర్ కర్వేచర్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ స్క్రిమ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మాట్లాడుతూ సైబర్‌దాడి తర్వాత ఐసీబీసీ వెంటనే స్పందించి చర్యలు తీసుకుందని తెలిపారు. కొన్ని మీడియా సంస్థల కథనం ప్రకారం సైబర్‌దాడికి ఉపయోగించిన సాఫ్ట్వేర్ వివరాలు లభించినట్లు సమాచారం. స్వీడిష్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ట్రూసెక్ వ్యవస్థాపకుడు మార్కస్ ముర్రే మాట్లాడుతూ ఈ దాడికి లాక్‌బిట్ 3.0 అనే రాన్సమ్వేర్ను ఉపయోగించారని చెప్పారు. ఈ రకమైన రాన్సమ్వేర్ అనేక మార్గాల్లో సంస్థలోని సాఫ్ట్‌వేర్‌లో ప్రవేశించే అవకాశం ఉందని ముర్రే అన్నారు. ఉదాహరణకు ఎవరైనా ఈమెయిల్‌లోని స్పామ్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా కూడా ఇది సాఫ్ట్‌వేర్‌లోకి ప్రవేశిస్తుందని చెప్పారు. కంపెనీకి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించడం దీని లక్ష్యమన్నారు. ఇదీ చదవండి: కొత్త ఉద్యోగాలు సృష్టించాలంటే ఇది తప్పనిసరి లాక్‌బిట్ 3.0 ప్రతిదశలో మాల్వేర్కు ప్రత్యేకమైన పాస్వర్డ్ అవసరం ఉంటుంది. అది చేధించడం చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు. యూఎస్ ప్రభుత్వానికి చెందిన సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ లాక్‌బిట్ 3.0ని ‘రూపాలు మారుస్తూ తప్పించుకునేది’గా భావిస్తారు. జులై 2022 నుంచి జూన్ 2023 వరకు జరిగిన అన్ని రాన్సమ్వేర్ దాడుల్లో 28శాతం లాక్‌బిట్ ద్వారా జరిగినవేనని సైబర్ సెక్యూరిటీ సంస్థ ఫ్లాష్‌పాయింట్ నివేదిక చెబుతుంది. -
సాఫ్ట్వేర్ జాబ్.. రూ.3 కోట్లు వేతనం - అయినా వదిలేశాడు! కారణం తెలిస్తే..
ఆధునిక కాలంలో చాలామంది గూగుల్, మెటా వంటి బడా కంపెనీలలో ఉద్యోగం చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే ఒక ఉద్యోగి మాత్రం కొన్ని కారణాల వల్ల కోట్లు వేతనం వచ్చే మెటా సంస్థలో ఉద్యోగాన్ని వదిలేసినట్లు సమాచారం. దీనికి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాలో ఏడాదికి రూ. 3 కోట్లు వేతనాన్ని పొందే 28 సంవత్సరాల సాఫ్ట్వేర్ ఉద్యోగి 'ఎరిక్ యు' (Eric You) వర్క్ తరువాత కూడా అదే ఆలోచనలతో ఉండటం వల్ల పానిక్ అటాక్స్ ఎదుర్కోవాల్సి వచ్చిందని, దీంతో జాబ్ వదిలేయాల్సి వచ్చినట్లు తెలిపాడు. నిజానికి వర్క్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. కానీ ఆ పని ఒత్తిడి అలాగే ఉండేది. వీకెండ్ సమయంలో పని చేసినా కూడా బాస్ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కారణాల వల్ల ఆఫీసులోనే మొదటి సారి పానిక్ అటాక్ వచ్చినట్లు తెలిపాడు. ఇదీ చదవండి: మామకు తగ్గ మేనల్లుడు.. అర్జున్ కొఠారి ఆస్తులు ఇన్ని కోట్లా? 2019 నవంబర్ సమయంలో వర్క్ ఫ్రమ్ చేస్తున్నప్పుడు కూడా పానిక్ అటాక్ వచ్చిందని, ఆ తరువాత పలుమార్లు ఈ అటాక్ వెంటాడుతూనే ఉండటం వల్ల జాబ్ వదిలి, రియల్ ఎస్టేట్‌లో పనిచేస్తున్నట్లు వెల్లడించాడు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : అవమానభారంతో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన చోటుచేసుకుంది. మదనపల్లె జన్మభూమికాలనీకి చెందిన వెంకటరమణ కుమార్తె గాయత్రి(26) సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పని చేస్తోంది. ఇటీవల వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆమె బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ బంధువుల ఇంట్లో బంగారు గొలుసు చోరీకి గురైంది. అయితే ఈ విషయంలో గాయత్రిపై వారు అనుమానం వ్యక్తం చేయడంతో.. తీవ్ర మనస్తాపంతో గురువారం రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సమస్యలతో ఇద్దరు.. వేర్వేరు ప్రాంతాల్లో కుటుంబ సమస్యలతో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మదనపల్లెలోని రామారావు కాలనీకి చెందిన శ్రీనివాసులు భార్య ఎం.అంజలి(32)కుటుంబ సమస్యలతో ఎలుకల నివారణ మందు తిని గురువారం రాత్రి ఆత్మహత్యకు ప్రయత్నించింది. బి.కొత్తకోట బీసీ కాలనీకి చెందిన వెంకటస్వామి కుమారుడు వెంకటరమణ(35) కుటుంబ సమస్యలతో శుక్రవారం పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయా ఘటనల్లో బాధితులను కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
కరీంనగర్ సిటీలో పెరుగుతున్న విడాకులు
‘కరీంనగర్ సిటీకి చెందిన ఓ జంటకు ఇటీవల వివాహం జరిగింది. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. బెంగళూర్‌లో జాబ్ చేస్తున్నారు. మూడు నెలలపాటు వీరి కాపురం సాఫీగా సాగింది. కొద్దిరోజులకు ఒక చిన్న విషయంలో గొడవ జరిగింది. మాటామాటా పెరిగింది. భర్త ‘వెళ్లిపో’ అనడంతో బ్యాగు సర్దుకుని కరీంనగర్ వచ్చేసింది. తనకు భర్త వద్దని పుట్టింటివాళ్లతో కలిసి ఠాణామెట్లు ఎక్కింది. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా వినకపోగా.. విడాకులకు పట్టుపట్టింది.’ ‘సిటీకి చెందిన ఓ జంటకు పెళ్లయిన రెండునెలలకే ఆర్థికపరంగా గొడవలు ప్రారంభం అయ్యాయి. ఇందుకు ఆధిపత్య పోరు తోడైంది. మనస్పర్థలు పెంచుకుని పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. తాము కలిసి ఉండమని పోలీసులకు చెప్పేశారు. కౌన్సెలింగ్ చేసినా వినకపోవడంతో చట్టప్రకారం కోర్టును ఆశ్రయించాలని సూచించారు.’ కరీంనగర్‌క్రైం: నిండు నూరేళ్లు అన్యోన్యంగా కలిసి జీవించాల్సిన కొన్నిజంటలు చిన్నచిన్న కారణాలతో మూడుముళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారు. కలిసి బతికేందుకు ససేమిరా అంటున్నారు. టెక్నాలజీ అత్యంత వేగంగా పెరుగుతుండటంతో ఉద్యోగాల పేరిట దూరదూర ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య అహం.. అపార్థం, అనుమానాలు.. ఒకరిపై ఒకరికి అపనమ్మకాలతో విభేదాలు వస్తున్నాయి. నాలుగు గోడల మధ్య సర్దుకుపోవాల్సిన బంధాలు చాలావరకు రోడ్డున పడుతున్నాయి. చిన్న సమస్య కూడా చివరికి పెద్ద గాలివానలా మారుతోంది. దంపతుల మధ్య అగాధం పెరిగి చివరికి విడిపోయేందుకు సిద్ధమై పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే కాదు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి పరిస్థితి కూడా మూన్నాళ్ల్ల ముచ్చటగా తయారవుతోంది. దంపతుల మధ్య విభేదాలు వారి పిల్లలపై కూడా ప్రభావం చూపుతోంది. భార్యాభర్తల మధ్య విబేధాలు వచ్చినప్పుడు వారివారి తల్లిదండ్రులు రెండు వైపులా నచ్చచెప్పి సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంది. అలా కాకుండా ఎక్కువ శాతం తల్లిదండ్రులు తమ పిల్ల లనే రెచ్చగొడుతుండడంతో అనేక మంది తమ సంసారాన్ని చేజేతులా నాశనం చేసుకుని విడిపోతున్నారు. కేవలం కరీంనగర్ సిటీ పరిధిలోనే ఈ ఏడాదిలో పోలీసులకు 779 ఫిర్యాదులు, సఖీ సెంటర్లో 323 కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రేమ వివాహాల పరిస్థితీ అంతే ఏళ్ల తరబడి ప్రేమించుకోవడం, తరువాత పెద్దలు ఒప్పుకోలేదంటూ కొందరు పారిపోయి పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి తర్వాత తగినంత సంపాదన లేకపోవడం, రాజీపడి జీవించలేకపోవడంతో దంపతుల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. మైనర్లు సైతం కొంతమంది తల్లిదండ్రుల మధ్య తలెత్తుతున్న మనస్పర్థాలతో పిల్లల విషయంలో పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతో మైనర్లు సైతం ప్రేమ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. తెలిసీ తెలియని వయసులో చేస్తున్న తప్పుల కారణంగా కొంతమంది తల్లిదండ్రులు విడిపోతుంటే.. మరికొందరు పిల్లలను వదులుకోలేక వారిని ఒక్కటి చేసేందుకు సరైన వయసు లేక ఆ కుటుంబం మానసిక వేదనకు గురవుతూ ‘నీకారణంగానే చెడిపోయారు’ అంటూ తల్లీతండ్రీ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ కుటుంబ బంధాలు బీటలు వారేలా చేసుకుంటున్నారు. తొందరపాటు నిర్ణయాలు వద్దు దంపతుల మధ్య గొడవలు వచ్చినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తల్లిదండ్రులు సర్దిచెప్పాలి. పోలీసుల వద్దకు వచ్చినా కౌన్సెలింగ్ ఇచ్చి కలుపుతాము. ఆవేశపడి చక్కటి దాంపత్య జీవితాలు నాశనం చేసుకోకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. – జి.నరేందర్, కరీంనగర్ టౌన్ ఏసీపీ కౌన్సెలింగ్ ఇస్తున్నాం దంపతుల మధ్య గొడవతో చాలా కేసులు వస్తున్నాయి. కౌన్సెలింగ్ ఇచ్చి కలిసి ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని సందర్భాల్లో దంపతుల బంధాన్ని చిన్నచిన్న కారణాలతో తెంచుకోవడం బాధాకరం. వారికి దాంపత్య విలువను తెలియజేస్తున్నాం. – దామోర లక్ష్మి, సఖి కో ఆరి్డనేటర్ కల్చర్ మారుతోంది మేం పరిశీలించిన కొన్నికేసుల్లో దాంపత్యబంధానికి కనీస విలువలేకుండా పోతోంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే ప్రయత్నంలో కాపురాలు కూల్చేసుకుంటున్నారు. దాంపత్య బంధం నిలవాలంటే సర్దుకుపోవాలి. – బి.రఘునందన్‌రావు, కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు -
భార్యతో గొడవ.. క్షణికావేశంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్: కుటుంబ సమస్యలతో క్షణికావేశంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనగర్ కాలనీ ప్రాంతానికి చెందిన దండు సాయికిరణ్ రెడ్డి (23), మంచిర్యాల ప్రాంతానికి శ్రియారెడ్డిలు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. వీరు సంవత్సరంన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం కొద్దిరోజులకు ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. గొడవ జరిగినప్పుడల్లా భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు సూసైడ్ చేసుకుంటామంటూ బెదిరించుకునే వారు. కాగా శనివారం ఇద్దరికి సెలవు కావడంతో ఇంట్లోనే ఉన్నారు. షాపింగ్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన సాయికిరణ్ భార్య సమక్షంలోనే గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకున్నాడు. బెదిరించడానికే అనుకున్న భార్య చాలా సేపు వరకు అతన్ని పలకరించలేదు. చివరకు అనుమానం వచ్చి తలుపు తట్టింది. ఎంత సేపటికి తలుపు తెరవక పోవడంతో మామ జంగారెడ్డి, స్థానికుల సహాయంతో తలుపులు బలవంతగా తెరిచి చూడగా..ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉన్నాడు. వెంటనే కిందకు దించి పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టు మార్ట్రం నిమిత్తం గాంధీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
హైదరాబాద్‌లో నెలకు రూ. 40వేలు సేవ్ చేస్తున్నా.. టెకీ ట్వీట్ వైరల్
భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో బెంగళూరు, హైదరాబాద్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బెంగళూరు టెక్ హబ్‌గా అవతరించింది, అయితే భాగ్యనగరం (హైదరాబాద్) ఇప్పుడిప్పుడే వేగంగా ఈ దిశవైపు పరుగులు పెడుతోంది. కాగా బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో ఖర్చులు తక్కువగా ఉంటాయని ఇటీవల ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన తరువాత నెలకు రూ. 40,000 ఆదా చేస్తున్నట్లు, దీంతో చాలా హ్యాప్పీగా గడుపుతున్నట్లు పోస్ట్ చేసాడు. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొందరు నిజమే అని అతని మాటలతో ఏకీభవించగా.. మరి కొందరు ఇదెలా సాధ్యం, ఇది నిజమేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Moved from Bangalore to #Hyderabad Saved 40k per month expenses. One family can live peacefully with that money. 💰 Not seeing any a point of living alone when my values match with my family’s. — Prudhvi Reddy (@prudhvir3ddy) September 5, 2023 కొంతమంది బెంగళూరులో ఏ ప్రాంతంలో ఉన్నారు, ఇప్పుడు హైదరాబాద్‌లో ఎక్కడున్నారు, ప్రస్తుతం హైదరాబాద్‌లో కూడా రెంట్లు భారీగానే ఉన్నాయని చెబుతున్నారు. మొత్తానికి రూ. 40వేలు ఎలా ఆదా చేస్తున్నావని ఒక నెటిజన్ అడగగా దానికి రిప్లై ఇస్తూ రెంట్, మెయింటెనెన్స్, వాటర్, కరెంట్ బిల్ అని వెల్లడించాడు. ఇదీ చదవండి: దేశం గర్వించేలా ఎదిగిన ఇస్రో.. 60 సంవత్సరాల అపురూప ఘట్టాలు! బెంగళూరులో అయినా.. హైదరాబాద్‌లో అయినా ఉన్న ప్రాంతన్ని బట్టి ఇంటి అద్దె ఉంటుంది. ఇక నిత్యావసరాలు, ప్రయాణ చార్జీలు ఇలా తీసుకుంటే ఎక్కడైనా దాదాపు ఒకేలా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తానికి సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేసిన ఈ పోస్ట్ మీద నెటిజన్లు మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. Rent + maintenance + water, electric bills + food — Prudhvi Reddy (@prudhvir3ddy) September 5, 2023 -
ప్రియుడితో కలసి అక్కను చంపి..
కోరుట్ల/జగిత్యాల క్రైం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బంక దీప్తి (24) హత్య కేసు మిస్టరీ వీడింది. చెల్లెలు చందన ప్రేమ పెళ్లిని దీప్తి వ్యతిరేకించడంతోనే హత్య జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీప్తి హత్య కేసులో సూత్రధా రి చందన (22), ఆమె ప్రియుడు ఉమర్ షేక్ సుల్తాన్ (25), అతడి తల్లి సయ్యద్ ఆలియా (47), చెల్లెలు ఫాతిమా (22), ఉమర్ మిత్రుడు హఫీజ్ (25)ను శనివారం అరెస్టు చేసినట్లు ఎస్పీ భాస్కర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇద్దరూ బీటెక్ చదివారు.. కోరుట్లకు చెందిన బంక శ్రీనివాస్‌రెడ్డి–మాధవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు దీప్తి, చందన, కుమారుడు సాయి ఉన్నారు. పాతికేళ్ల క్రితం శ్రీనివాస్‌రెడ్డి ఉపా«ధి కోసం నెల్లూరు నుంచి కోరుట్లకు వలస వచ్చారు. ఇటుక బట్టీ వ్యాపారం చేస్తున్నారు. దీప్తిని బీటెక్ చదివించగా ఆమె పుణేకు చెందిన ఓ కంపెనీలో వర్క్‌ఫ్రం హోమ్ పద్ధతిన పనిచేస్తోంది. చందన 2019లో హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో చేరి ఇటీవల బీటెక్ పూర్తి చేసింది. తన సీనియర్, హైదరాబాద్‌కు చెందిన ఉమర్ షేక్ సుల్తాన్ ఒక ఏడాది డిటెయిన్ కావడంతో చందనకు క్లాస్మేట్ అయ్యాడు. ఈ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. నాలుగేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. చందన ఇంట్లో ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఇద్దరు కూతుళ్ల వివాహం చేసేందుకు తండ్రి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 29న మధ్యాహ్నం దీప్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం... నగదు, బంగారంతో చందన పరారు కావడం కలకలం రేపింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పెళ్లికి అభ్యంతరం చెప్పినందుకే.. చందన ప్రేమ వ్యవహారం తెలిసి కుటుంబ సభ్యులు మతాంతర వివాహానికి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ విషయాన్ని చందన తన ప్రియుడు ఉమర్ షేక్ దృష్టికి తీసుకెళ్లి ఎలాగైనా పెళ్లి చేసుకుందామని చెప్పింది. కానీ తనకు జాబ్ లేదని, డబ్బు లేదని, బతుకడం ఎలా అని ఉమర్ షేక్ బదులిచ్చాడు. దీంతో తన ఇంట్లో ఉన్న డబ్బు, నగలు తెస్తానని, ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పిన చందన.. తన అమ్మానాన్న ఇంట్లో లేనిసమయంలో కోరుట్లకు రావాలని ప్రియుడికి సూచించింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్‌లో బంధువుల గృహప్రవేశానికి వెళ్లగా చందన తన ప్లాన్ అమలు చేసింది. సూత్రధారి చందన.. తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో సోమవారం ఉదయం 11 గంటలకు ఉమర్ షేక్ కారులో కోరుట్లకు చేరుకున్నాడు. సాయంత్రం మద్యం తాగుదామని చందన తన అక్కతో చెప్పింది. ప్రియుడితో వొడ్కా, బ్రీజర్ తెప్పించింది. మద్యం ఇచ్చి వెళ్లిన ఉమర్ షేక్ స్థానికంగానే ఉండిపోయాడు. రాత్రి చందన తన అక్క దీప్తికి వొడ్కా తాగించి, తాను బ్రీజర్ తాగింది. మత్తులో అక్క నిద్రపోయిందని నిర్ధారించుకున్న చందన.. రాత్రి 2 గంటల సమయంలో షేక్ ఉమర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చింది. ఉమర్ షేక్ వచ్చాక నగదు, బంగారం బ్యాగుల్లో సర్దుతున్న క్రమంలో దీప్తికి మెలకువ వచ్చి.. ‘ఏం చేస్తున్నారని’ చందనను నిలదీసింది. దీంతో చందన, ఆమె ప్రియుడు కలిసి దీప్తిని చున్నీతో కట్టేసి నోరు, ముక్కుకు ప్లాస్టర్ వేసి చంపి సోఫాలో పడేశారు. అనుమానం రాకుండా ఆ తర్వాత తొలగించారు. దీప్తి అతిగా మద్యం తాగి నిద్రలో చనిపోయినట్లు నమ్మించడం కోసం సినీఫక్కీలో సీన్ క్రియేట్ చేశారు. తర్వాత ఇద్దరూ కారులో హైదరాబాద్ పరారయ్యారు. వాయిస్ మెసేజ్‌తో దారిమళ్లింపు.. అక్కను చంపాక పరారైన చందన.. మర్నాడు హైదరాబా ద్‌లోని తన ప్రియుడు ఉమర్ షేక్ కలసి అతని తల్లి అలి యా, చెల్లి ఫాతిమా వద్దకు వెళ్లింది. వారంతా కలసి నగదు, డబ్బుతో నాగ్‌పూర్ వెళ్లాలనుకున్నారు. ఇంతలో చందన బుధవారం తన తమ్ముడు సాయికి ఫోన్లో వాయిస్ మెసేజ్ పంపించింది. అక్కను తాను చంపలేదని.. బాయ్‌ఫ్రెండ్‌తో రాత్రివేళ ఇంటికి రావాలని అక్క చెప్పిందని, తాను వద్దన్నా నని హత్య కేసును దారిమళ్లించే ప్రయత్నం చేసింది. నాగ్‌పూర్ వెళ్తుండగా.. చందన, ఉమర్‌షేక్ సెల్ఫోన్ల డేటా ఆధారంగా వారు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు మూడు ప్రత్యేక బృందాలతో అక్కడకు వెళ్లారు. అయితే కారులో బురఖా వేసుకొని తప్పించుకొని తిరుగుతున్న చందనతోపాటు ప్రియుడు ఉమర్ షేక్, అతడి తల్లి అలియా, చెల్లి ఫాతిమా, బంధువు హఫీజ్‌ను నాగ్‌పూర్ వైపు పరారవుతుండగా శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్–బాల్కొండ మార్గంలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 1.20 లక్షల నగదు, సుమారు రూ.80 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన మెట్పల్లి డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు కిరణ్, చిరంజీవిని ఎస్పీ అభినందించారు. -
కోరుట్ల దీప్తి కేసు.. వెలుగులోకి అసలు నిజాలు?
కోరుట్ల: సంచలనం రేపిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ బంక దీప్తి(24) అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటనలో నిందితులుగా భావిస్తున్న బంక చందన(21), ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో పాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పరిసరాల్లో తలదాచుకున్న వీరిద్దరినీ పోలీసులు పట్టుకుని కోరుట్లకు తరలిస్తున్నట్లు తెలిసింది. మూడు రోజులుగా గాలింపు..! ► పట్టణానికి చెందిన బంక దీప్తి మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విదితమే. ► అప్పటినుంచి ఆమె చెల్లెలు చందన పరారీలో ఉండటం కలకలం రేపిన క్రమంలో పోలీసులు ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్నారు. ► అక్క దీప్తి చనిపోవడంలో తన ప్రమేయం లేదని చందన తన తమ్ముడు సాయికి వాయిస్ మేసేజ్ పంపిన క్రమంలో ఆమె సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ► బుధ, గురువారాల్లో మెట్పల్లి డీఎస్పీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రెండు పోలీసు బృందాలు చందన ఆచూకీ కోసం హైదరాబాద్‌లో గాలించాయి. ► అక్కడ నుంచి చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్ మకాం మార్చినట్లు గుర్తించినట్లు తెలిసింది. చందనతోపాటు ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు పాస్‌పోర్ట్‌లు ఉండటం వారు రూ.2 లక్షల నగదు, సుమారు రూ.90 లక్షల విలువైన బంగారం ఇంటి నుంచి తీసుకెళ్లారని తండ్రి శ్రీనివాస్‌రెడ్డి చేసిన ఫిర్యాదుతో ఆ డబ్బుతో వారిద్దరూ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు లుక్ అవుట్ నోటిసులు జారీచేశారు. హైదరాబాద్– బెంగళూర్ మార్గంలో.. ఆంధ్రాలో బంక చందన బంధువులు ఒంగోలు జిల్లాకు చెందిన వారు కావడంతో ఆంధ్రప్రదేశ్‌కు ఆమె వెళ్లి ఉంటుందని భావించిన పోలీసులు ఆ దిశలో గాలింపు చేపట్టారు. హైదరాబాద్ నుంచి బెంగళూర్ మార్గంలో అనంతపురం, ప్రకాశం జిల్లా పరిసరాల్లో చందన ఆమె బాయ్‌ఫ్రెండ్ ఉన్నట్లు గురువారం రాత్రి పోలీ సులు గుర్తించారు. శుక్రవారం తెల్లవారుజామున చందన ఆంధ్రాలోని ప్రకాశం జిల్లా పరిసరాల్లో ఉన్నట్లుగా గుర్తించి పకడ్బందీ ప్రణాళికతో అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. శుక్రవారం రాత్రి వారిద్దరినీ కోరుట్లకు తీసుకువచ్చినట్లుగా తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న చందన, ఆమె బాయ్ఫ్రెండ్లు వాస్తవాలు వెల్లడిస్తే దీప్తి అనుమానాస్పద మృతి వెనుక అసలు నిజాలు వెలుగులోకి వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం విచారణ చేయనున్నట్లు సమాచారం. -
సాఫ్ట్వేర్ అమ్మాయే కావాలన్నాడు.. ఆమె చేసిన పనికి పెళ్లే రద్దయింది!
కర్నూలు: స్థిరపడటం అంటే.. బాగా డబ్బు సంపాదించడం, కారు, బంగ్లాలు ఉండటం ఒక్కటే కాదు.. పెళ్లి చేసుకున్నప్పుడే ఆ జీవితం సంపూర్ణమవుతుంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండటం, బంధుత్వాలకు విలువ ఇస్తుండటంతో పెళ్లి చేయాలనే ఆలోచన వస్తే చాలు.. ఎక్కడెక్కడ పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు ఉన్నారో, అబ్బాయిల వివరాలు ఇట్టే తెలిసిపోయేవి. క్షణాల్లో మాట కలపడం.. ఆ తర్వాత ముహూర్తాలు పెట్టేసుకోవడం, రెండు మనసులను ముడివేయడం చకచకా జరిగిపోయేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పెళ్లంటే.. తల్లిదండ్రులు ఒకస్థాయి యుద్ధం చేయాల్సిందే. కులం, గోత్రం.. జాతకం.. ఆస్తులు.. అంతస్తులు.. గుణగణాలు.. ఇవన్నీ తలుచుకుంటే గుండె పగిలినంత పనవుతుంది. సంబంధం చూడటం మొదలు.. పెళ్లి పూర్తయ్యే వరకు సవాలక్ష సవాళ్లు. కర్నూలు నగరానికి చెందిన ఓ యువకునికి రెండేళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. వయస్సు 27 ఏళ్లు. తల్లిదండ్రులు పెళ్లి చేద్దామని నిర్ణయించుకొని అమ్మాయి కోసం వెతకటం మొదలుపెట్టారు. అయితే వెళ్లిన ప్రతిచోటా సొంత ఇల్లు ఉందా? భూమి ఎంతుంది? ఇలాంటి ప్రశ్నలే కానీ అబ్బాయి గుణగణాలు, కుటుంబ నేపథ్యం ప్రస్తావనే రాకపోవడం గమనార్హం. ఆళ్లగడ్డకు చెందిన ఓ యువకుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా బెంగళూరులో పని చేస్తున్నాడు. అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ అయ్యుండాలనే నిబంధన పెట్టడంతో తల్లిదండ్రులు అష్టకష్టాలు పడి ఓ అమ్మాయితో ఆరు నెలల క్రితం ఎంగేజ్మెంట్ చేశారు. ఆ తర్వాత తాను ఎప్పుడు ఫోన్ చేసిన అమ్మాయి ఫోన్ ఎంగేజ్ వస్తుందనే కారణంతో ఈ బంధం అక్కడితో ముగిసిపోయింది. అరచేతిలో అన్వేషణ పెళ్లిళ్ల పేరయ్యలు ఇప్పుడు బాగా తక్కువైపోయారు. ఒకప్పుడు చేతిలో ఒక బ్యాగు వేసుకొని, దాన్నిండా పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు, అబ్బాయిల ఫొటోలతో తెలిసిన వారి ఇళ్ల ముందు వాలిపోయేవాళ్లు. వీళ్లకు రూ.500, లేదా రూ.1000 ముందుగానే ఇచ్చుకుంటే సంబంధాలు వెతికిపెట్టేవాళ్లు. పెళ్లి సమయంలో కూడా వీళ్లకు అంతోఇంతో ముట్టజెబుతారు. ఇప్పుడు మ్యాట్రిమోనీ సైట్లు పుట్టగొడుగుల్లా తెరపైకి రావడంతో అరచేతిలో అన్వేషణ మొదలైంది. ఎవరికి వారు తమ ఫొటో, ప్రొఫైల్ అందులో పెట్టేస్తుండటంతో ఎంతవరకు సరైన వివరాలు ఇచ్చారనే విషయం అంతుచిక్కని పరిస్థితి. పిల్లలు పెద్దవాళ్లు అవుతుంటే సంతోషంగా ఉంటుంది. ఉద్యోగాలు సంపాదిస్తే ఇక భయం లేదనిపిస్తుంది. ఆ తర్వాత వయస్సు గుర్తుకు వస్తే మాత్రం తల్లిదండ్రులకు కంటి మీద కునుకు దూరమవుతుంది. ఆధునిక ప్రపంచంలో అమ్మాయి, అబ్బాయిల్లో మొదట జీవితంలో స్థిరపడాలనే భావన అధికంగా కనిపిస్తుంది. ఆ తర్వాత పెళ్లి అనడం పరిపాటిగా మారింది. ఈ కోవలో చదువు పూర్తయ్యే సరికి సుమారు 25 ఏళ్లు వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత ఉద్యోగంలో కుదురుకోవాలంటే మరో ఐదేళ్లు ఆవిరి కావాల్సిందే. కొందరు త్వరగానే దారిలో పడుతున్నా.. చాలా వరకు అమ్మాయిలు, అబ్బాయిలు చదువు, ఉద్యోగం వెంట పరుగులు తీస్తూ తమ వయస్సు కరిగిపోతుందనే విషయాన్నే మర్చిపోతున్నారు. తీరా ఉద్యోగం వస్తే.. అప్పుడు పెళ్లి ఆలోచన మొదలైనా తల్లిదండ్రులు వేట మొదలు పెడితే అప్పటికి కానీ అర్థం కావట్లేదు ముదిరిపోయామని. వయస్సు ఎంత? ఈ ప్రశ్న అవతలి వైపు నుంచి వస్తే చాలు ఇక పెళ్లి కావడం కష్టమనిపిస్తుంది. ఇక ఆ తర్వాత కూడా గొంతెమ్మ కోర్కెలతో కాలం గిర్రున తిరుగుతుంది. ఒక్కో సంవత్సరం గడిచేకొద్దీ పెళ్లి అయితే చాలన్నట్లుగా తయారవుతుంది వ్యవహారం. పిల్లలు చెప్పినట్లు వినాల్సిందే.. గతంలో తల్లిదండ్రులు ఓ సంబంధం చూసి పెళ్లి చేసుకోమంటే మారు మాట్లాడకుండా పీటలు ఎక్కేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. పెద్దల మాట కంటే.. పిల్లల అభిరుచికే ప్రాధాన్యం ఉంటోంది. ఒకరికొకరు నచ్చాలి. మాటామాట కలవాలి. డిన్నర్లు, డేటింగ్లు.. తలుచుకుంటే బుర్ర గిర్రున తిరుగుతుంది. ఇక కులగోత్రాలు, జాతకాలు సరేసరి. చదువు, ఉద్యోగ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండటం.. అన్నీ సరిపోయాయి అనుకున్నా చివరి నిముషంలో ఏదో ఒక వెలితి బయటకు రావడంతో ఆ సంబంధం అక్కడితో ముగిసిపోతుంది. ఇలా వాళ్ల కోర్కెలకు అనుగుణంగా సంబంధాలు వెతికేందుకు తల్లిదండ్రులు చుక్కలు చూడాల్సి వస్తోంది. అతి కష్టం మీద సబంధం తీసుకొచ్చినా సాకులు చెప్పడంతో వ్యవహారం మళ్లీ మొదటికొస్తుంది. ఈ కారణంగా పెళ్లిళ్లు ఆలస్యమవుతుండటంతో ఇంట్లో సంతోషం ఆవిరవుతుంది. ఏజెంట్ వ్యవస్థ ఉన్న ప్రాంతాల్లో కోరుకున్న సంబంధాలు కుదరక ఇతర ప్రాంతాలకూ వెళ్తున్నారు. చివరకు కులాల ప్రస్తావన మర్చిపోయి సంబంధం దొరికితే చాలు అనుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకోసం శ్రీకాకుళం, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా తదితర ప్రాంతాల్లోనూ కాళ్లకు బలపాలు కట్టుకుని తిరుగుతున్నారు. పెళ్లి కొడుకు తరపున అమ్మాయికి భరణం చెల్లించి మరీ సంబంధం కుదుర్చుకుంటున్నారు. శ్రీకాళుళం పరిసర ప్రాంతాల నుంచి సంబంధం కుదిర్చేందుకు ఏకంగా ఏజెంట్ వ్యవస్థ ఏర్పాటైంది. రూ.2లక్షల నుంచి రూ.3లక్షల మేర వీళ్లకు ముట్టజెబితే కానీ సంబంధం దొరకని పరిస్థితి. అబ్బాయిల తల్లిదండ్రుల్లోనే ఆందోళన అసలే అమ్మాయిల కొరత. అబ్బాలు చదువు, ఉద్యోగం అని కాలం గడిచే కొద్దీ వయస్సు పెరిగి, అందుకు తగిన అమ్మాయి దొరక్క తల్లిదండ్రులు చుక్కలు చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమకు అబ్బాయి పుట్టాలని కోరుకోవడం కూడా ఇందుకు కారణమవుతోంది. ఇదే సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పెళ్లి సంబంధం రాగానే.. అబ్బాయికి ఉద్యోగంతో పాటు భూములు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండిటికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. డబ్బుకు ప్రాధాన్యం ఒకప్పుడు పెళ్లంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలనేవాళ్లు. అంతేకాదు.. గుణగణాలను తెలుసుకునేందుకు ఎవరెవరినో విచారించే పరిస్థితి. ఇప్పుడు ఆ ఊసే కరువవుతోంది. అమ్మాయి దొరకడమే కష్టమవుతుండటంతో అటువైపు నుంచి కూడా ధోరణి మారిపోయింది. అబ్బాయి మంచివాడా, కాదా అనే విషయాలను పక్కనపెట్టి ఆస్తులు, అంతస్తులపైనే దృష్టి సారిస్తున్నారు. పైగా ఒక్కడే కొడుకు ఉంటే మంచిదనే భావన అమ్మాయి తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. ఉద్యోగంతో పాటు పొలం ఉన్న ఇంటికి తమ అమ్మాయిని పంపేందుకే ఇటీవల కాలంలో ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆ రెండు కులాల్లో అమ్మాయిలు 10 శాతమే.. మ్యారేజ్ బ్యూరోలకు వచ్చే తల్లిదండ్రులు అబ్బాయికి లక్ష జీతం, 10 ఎకరాల పొలం ఉండాలని చెప్పడం పరిపాటిగా మారినట్లు తెలుస్తోంది. మరికొందరు ఉద్యోగం దొరికే వరకు వేచి చూస్తుండటం కూడా పెళ్లిళ్లు ఆలస్యం అవడానికి కారణమవుతోంది. ప్ర స్తుతం రెండు కులాల్లో అమ్మాయిల కొరత ఎక్కువగా కనిపిస్తోంది. ఎంతలా అంటే.. వంద మంది అబ్బాయిలకు 10 మంది అమ్మాయిలు మాత్రమే ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఈ కారణంగా ఓ కులం అబ్బాయిలు ఇతర కులాల అమ్మాయిలు అయినా పర్వాలేదనే నిర్ణయానికి వచ్చేశారు. 30 ఏళ్ల తర్వాతే.. పెళ్లి వయస్సు బాగా పెరిగిపోతుంది. అబ్బాయి, అమ్మాయి జీవితంలో స్థిరపడటానికే అధిక ప్రా ధాన్యత ఇస్తున్నారు. ఈ కారణంగా 30 ఏళ్ల తర్వాత కానీ పెళ్లిళ్లు జరగడం లేదు. పెద్దల మాటకంటే, తమకు నచ్చితేనే పెళ్లి చేసుకుంటామని చెప్పడం కూడా ఆలస్యానికి కారణమవుతోంది. – చిన్న వెంకటేశ్వర్లు, ఓపిక మ్యారేజ్ బ్యూరో, కర్నూలు పెళ్లికాని ప్రసాదులే.. సాధారణంగా అమ్మాయిలు వయస్సుకు రాగానే తల్లిదండ్రుల్లో పెళ్లి ఆలోచన మొదలవుతుంది. చదువు పూర్తి అవుతుందనగానే ఆ లోపు తగిన వరుడిని వెతికే పనిలో ఉంటారు. అయితే అబ్బాయిలు మాత్రం చదువుతో పాటు ఉద్యోగంలో స్థిరపడాలనే భావనతో వయస్సునే మర్చిపోతున్నారు. ఈలోపు ఆ వయస్సు అమ్మాయిలకు పెళ్లిళ్లు అయిపోతుండటంతో అబ్బాయిల పరిస్థితి గందరగోళంగా మారుతోంది. వయస్సుకు తగిన అమ్మాయిలు దొరక్క, ఉన్నా వాళ్ల తల్లిదండ్రుల ముందుజాగ్రత్త ప్రశ్నలతో పెళ్లికాని ప్రసాదులుగానే మిగిలిపోతున్నారు. కొన్ని కులాల్లో అమ్మాయిల కొరత అధికంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎదురు కట్నం ఇచ్చి కూడా పెళ్లి చేసుకుంటున్నారు. వయస్సులో జరుగుతున్న పెళ్లిళ్లు అంతంతే.. పెళ్లి వయస్సు అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు. ఈ వయస్సులో జరుగుతున్న పెళ్లిళ్లు ఇప్పుడు దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. పట్టణాల్లో ఈ వయస్సు పెళ్లిళ్లు చాలా అరుదు. చదువు, ఉద్యోగం అనుకోవడంతోనే వయస్సు చేజారిపోతుంది. ఈ కారణంగా పెళ్లిళ్లు ఆలస్యమవుతూ ఒకరినొకరు అర్థం చేసుకోలేక గొడవలకు దారితీస్తుంది. ఇరువురి వయస్సులో వ్యత్యాసం కూడా సగం పెళ్లిళ్లను విడాకుల వరకు తీసుకెళ్తోంది. -
అక్క అనుమానాస్పద మృతి.. చెల్లెలి అదృశ్యం.. ఏం జరిగింది?
కోరుట్ల/రాయికల్: ‘సోమవారం రాత్రి ఆ ఇంట్లో అక్కాచెల్లెళ్లు మాత్రమే ఉన్నారు. తెల్లారేసరికి అక్క చనిపోయి సోఫాలో పడి ఉంది. ఇంటి బయట తలుపునకు గొల్లెం పెట్టి చెల్లి ప్రియుడితో కలిసి పరారైంది’. ఇంట్లోని కిచెన్‌లో ఓడ్కా, బ్రీజర్ బాటిళ్లు ఉన్నాయి. అసలు ఆ రాత్రి ఇంట్లో ఏం జరిగి ఉంటుంది..? అక్క చనిపోవడానికి చెల్లెలే కారణమా..? ప్రియుడితో కలిసి చెల్లె వెళ్లిపోతుంటే అక్క అడ్డుకున్న క్రమంలో గొడవ జరిగిందా.. ఈ గొడవలోనే అక్క ప్రాణాలు పోయాయా..? లేదా ఓడ్కాలో అక్కకు మత్తు ఇచ్చి చెల్లెలు గుర్తుతెలియని యువకుడితో కలిసి పరారైందా..? వోడ్కాలో కలిపిన మత్తు మందు డోసు ఎక్కువై అక్క చనిపోయిందా..?! అనేక అనుమానాలు కోరుట్లకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ బంక దీప్తి మృతి వెనక లెక్కలేని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రకు చెందిన బంక శ్రీనివాస్‌రెడ్డి–మాధవి దంపతులు సుమారు పాతికేళ్లుగా కోరుట్లలోని భీమునిదుబ్బలో స్థిరపడ్డారు. ఇటుకబట్టీ వ్యాపారం చేసుకునే శ్రీనివాస్‌రెడ్డికి కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమారుడు బెంగళూర్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్. పెద్ద కూతురు దీప్తి(24) పుణేలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా వర్క్‌ఫ్రం హోం పద్ధతిన ఇంట్లో నుంచి పనిచేస్తోంది. చిన్నకూతురు చందన ఇటీవల బీటెక్ పూర్తి చేసింది. సోమవారం ఉదయం శ్రీనివాస్‌రెడ్డి– మాధవి హైదరాబాద్‌లోని బంధువుల గృహాప్రవేశం కార్యక్రమానికి వెళ్లగా దీప్తి, చందన మాత్రమే ఇంట్లో ఉన్నారు. రాత్రి 10 గంటల వరకు తండ్రితో అక్కాచెల్లెళ్లు ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. తెల్లారేసరికి.. మంగళవారం ఉదయం శ్రీనివాస్‌రెడ్డి తన కూతుళ్లతో మాట్లాడటానికి ప్రయత్నించగా పెద్ద కూతురు దీప్తి ఫోన్ లిఫ్ట్ కాలేదు. చిన్నకూతురు చందన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. రెండుమూడు సార్లు ఫోన్లో కూతుళ్లతో మాట్లాడేందుకు ప్రయత్నించిన శ్రీనివాస్‌రెడ్డి చివరికి పక్క ఇంట్లో ఉన్నవారికి ఫోన్ చేశాడు. తమ కూతుళ్లు ఫోన్ ఎత్తడం లేదని చెప్పి, ఓ సారి ఇంటిదాకా వెళ్లి చూడమని కోరాడు. పక్క ఇంట్లో ఉండే ఓ మహిళ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లి చూడగా తలుపు బయట నుంచి గొళ్లెం పెట్టి ఉంది. పిలిస్తే ఎవరూ పలకలేదు. దీంతో తలుపు గొళ్లెం తీసి లోపలికి వెళ్లి చూడగా పెద్ద కూతురు దీప్తి సోఫాలో పడిపోయి ఉంది. చుట్టుపక్కల వారికి విషయం చెప్పగా వారు దీప్తిని పరిశీలించి అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. బంధువులు, పోలీసులకు సమాచారం ఇవ్వగా మెట్పల్లి డీఎస్పీ వంగ రవీందర్‌రెడ్డి, సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సైలు కిరణ్, చిరంజీవి ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆ రాత్రి ఏం జరిగినట్లు..? సోమవారం ఉదయం తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని బంధువు ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లగా రాత్రి అక్కాచెల్లెల్లు ఇద్దరే ఇంట్లో ఉన్నారు. కిచెన్‌లో వోడ్కా, బ్రీజర్ బాటిళ్లు, వెనిగర్, నిమ్మకాయలు ఉండటంతో రాత్రి వేళ దీప్తి, చందన కలిసి మద్యం సేవించారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరికి మద్యం బాటిళ్లు ఎవరు తెచ్చి ఇచ్చారు, ప్రియుడితో కలిసి పరారయ్యేందుకు ముందుగానే పథకం వేసుకున్న చందన అతడితోనే మద్యం తెప్పించి ముగ్గురు కలిసి మద్యం తీసుకున్నారా..? అన్న విషయంలో స్పష్టత లేదు. దీప్తికి మద్యంలో మత్తు కలిపి తాము పరారయ్యేందుకు పథకం వేశారా..? మత్తు డోసు ఎక్కువ కావడంతో దీప్తి మృతి చెంది ఉంటుందా..? అన్న అనుమానాలున్నాయి. చందన ప్రియుడితో కలిసి వెళ్లిపోయే ప్రయత్నాన్ని దీప్తి అడ్డుకునే క్రమంలో గొడవ జరిగి ఆ గొడవలో తగలరాని చోట దెబ్బతగిలి దీప్తి చనిపోయిందా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీప్తి శరీరంపై పెద్దగా గాయాలు కనిపించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. బస్టాండ్ సీసీ ఫుటేజీలో చందన.. కోరుట్ల బస్టాండ్‌లోని సీసీ కెమెరాల్లో మంగళవారం వేకువజామున 5 గంటలకు చందన ఓ యువకుడితో కలిసి ఉన్న వీడియోలను పోలీసులు గుర్తించారు. చందన, మరో యువకుడు లగేజీ తీసుకుని నిజామాబాద్ వైపు వెళ్లే బస్సు ఎక్కినట్లు సీసీ పుటేజీల్లో రికార్డు అయింది. చందన ఫోన్‌కాల్ డేటా ఆధారంగా ఆమె ఓ యువకుడితో గంటల తరబడి ఫోన్ మాట్లాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం రాత్రి చందన ఫోన్ లొకేషన్ హైదరాబాద్‌లో వస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారని సమాచారం. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోరుట్ల సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
కారు ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని...
హైదరాబాద్: కారు ఢీ కొని రోడ్డు దాటుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందిన సంఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. వాహనం ధాటికి సదరు మహిళ ఎగిరి దూరంగా పడడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందింది. బేగంపేట ఎస్ఐ గంగాధర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చంచుపల్లి గ్రామానికి చెందిన చందా నాగ ప్రియాంక (31) నిజాంపేటలో ఉంటూ బేగంపేటలోని రిలయన్స్ ట్రెండ్స్ భవనంలోని ఓ కార్యాలయంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. సోమవారం షాపర్ స్టాప్ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన మహేంద్ర మొరాజో వాహనం ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె ఎగిరి పడడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోజుకి గంట మాత్రమే పని.. రూ. 1.2 కోట్లు వేతనం
లక్షల ప్యాకేజి రావాలంటే ఎంత కష్టపడాల్సి ఉంటుందనేది అందరికి తెలుసు. అయితే హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేస్తూ ఒక 'సాఫ్ట్వేర్' ఇంజినీర్ రోజుకి కేవలం ఒక గంట మాత్రమే పనిచేస్తూ ఏకంగా రూ. 1.2 కోట్లు వేతనం తీసుకుంటున్నాడు. ఇంతకీ అతడెవరు? ఎక్కడ పనిచేస్తున్నాడనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. మనం చెప్పుకుంటున్న యువ సాఫ్ట్వేర్ (డెవాన్) గూగుల్ (Google) కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతడు రోజుకి 1 గంట మాత్రమే ఆ కంపెనీకి సంబంధించిన పనిచేస్తాడు. మిగిలిన సమయం స్టార్టప్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం. కంపెనీలో తాను ఇంటర్న్‌షిప్‌లో చేరినప్పుడు పని చాలా త్వరగా నేర్చుకున్నట్లు, కోడ్లను కూడా త్వరగా పూర్తి చేసినట్లు తెలిసింది. ఇదీ చదవండి: ఎవరీ మాయా టాటా? లక్షల కోట్ల 'టాటా' సామ్రాజ్యానికి వారసురాలు ఈమేనా? నిజానికి తనకు వారానికి సరిపడా వర్క్ ఇస్తే దాన్ని మొదటి రోజే దాదాపు పూర్తి చేస్తాడు, ఆ తరువాత మిగిలిన నాలుగు రోజులు కేవలం గంట మాత్రమే పనిచేసి చాలా రిలాక్స్‌గా ఉంటాడు. మొత్తానికి అతనికి ఇచ్చిన వర్క్ మాత్రం టైమ్‌కి పూర్తి చేస్తాడు. ఇచ్చిన టైమ్‌కి పని బాగా చేస్తుండటం వల్ల కంపెనీ ఇతనికి బోనస్ అందించడంతో పాటి రివార్డులు కూడా అందిస్తోంది. ప్రస్తుతం గూగుల్ కంపెనీలో ఎక్కువ జీతం తీసుకుంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లలో ఇతడు కూడా ఒకడు కావడం గమనార్హం. అంతే కాకుండా గూగుల్ సంస్థలో జాబ్ చేయడం చాలా సులభమని చెప్పుకొచ్చాడు. డెవాన్ 1,50,000 డాలర్లను వార్షిక జీతంగా పొందుతున్నాడు. అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 1.2 కోట్లు. -
12 ముక్కల్లో మన ఇంజినీర్ల అమెరికా జీవితం ఇదే..
మనదేశానికి చెందిన చాలామంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అమెరికా వెళ్లి, అక్కడ ఉద్యోగం చేయాలని తాపత్రయ పడుతుంటారు. ఇందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. పలువురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అమెరికా చేరుకున్న తరువాత వారు ప్రధానంగా అనుసరించే 12 దశలు ఇవే.. మొదటి దశ విద్యార్థిగా ఉన్నప్పుడే మూడు లక్ష్యాలను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అవి.. (ఎ) విద్యార్థి రుణాన్ని చెల్లించడం. (బీ) యూఎస్ఏలో ఎక్కడైనా ఉద్యోగం పొందటం. (సీ) హెచ్1-బీ ఆమోదానికి యత్నం. (ఇది చాలా ముఖ్యమైన లక్ష్యం) దీనితోపాటు 5 సంవత్సరాలలోపు భారతదేశానికి తిరిగి రావడానికి విస్తృతమైన ప్రణాళికలకు రూపకల్పన. రెండవ దశ హెచ్1-బీ ఆమోదం. గ్రీన్ కరెన్సీతో ఎంజాయ్ చేయడం. టయోటా క్యామ్రీ లేదా హోండా సివిక్ లేదా నిస్సాన్ ఆల్టిమాను కొనుగోలు చేయడం. భారతదేశంలో ఎక్కడైనా ఆస్తిని కొనుగోలు చేయడం. మూడవ దశ విజిటర్ వీసాలపై భారతదేశం నుండి తల్లిదండ్రులను తీసుకురావడం. ఈ కిందివాటిని విజిట్ చేయడం. చార్ ధామ్ యాత్ర. నయాగరా జలపాతం సందర్శన. స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూడటం. వాల్ స్ట్రీట్‌లో బుల్ ఛార్జింగ్. వైట్ హౌస్ సందర్శన. నాల్గవ దశ భారతదేశానికి వెళ్లడం. పెళ్లి సంబంధం కోసం ఒక అమ్మాయిని ఖరారు చేయడం. మూడు వారాల్లోపు వివాహం చేసుకోవడం. వాస్తవానికి ఇది టైట్ షెడ్యూల్ మధ్య చేసుకున్న వివాహం. జీవిత భాగస్వామితో పాటు యూఎస్ఏకి తిరిగి రావడం. ఐదవ దశ ఇతర భారతీయ స్నేహితులతో వారాంతాల్లో, భోజన సమయంలో ఈ 3 అంశాలపై తరచూ చర్చిస్తారు. అవి.. (ఏ) మీరు మీ గ్రీన్ కార్డ్‌ని ఎప్పుడు పొందబోతున్నారు? ప్రస్తుతం మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? (బి) మోదీ భారతదేశాన్ని ఎలా మారుస్తున్నారు? (సీ) క్రికెట్‌పై చర్చించడంతో పాటు భారతదేశంలో మరొక ఆస్తిని కొనుగోలు చేయడం. ఆరవ దశ అమెరికాలో ఇల్లు కొనుగోలు చేయడం. ఇద్దరు పిల్లలను కలిగి ఉండటం. తదుపరి 15 సంవత్సరాలు వారిని చదవులో నిమగ్నమయ్యేలా చేయడం. వారి పుట్టినరోజు పార్టీలకు హాజరు కావడం. వివిధ హోమ్ ప్రాజెక్ట్‌ల కోసం హోమ్ డిపోను సందర్శించడం ఏడవ దశ గ్రీన్ కార్డ్ కోసం నిరీక్షణ ముగియడం ఎనిమిదవ దశ ఈ సమయానికి 40 ఏళ్లకు చేరుకుంటారు. అప్పుడు తగినంత నిధులను పొదుపు చేసి ఉంటారు. అయితే భారతదేశానికి తిరిగి రావడానికి ప్రణాళిక అప్పుడు వర్కౌట్ కాదు. దీంతో ఆ డబ్బు ఖర్చు చేయడానికి కొత్త మార్గాలను అన్వేషించడం. టెస్లా లేదా బిఎమ్‌డబ్ల్యూ లేదా మెర్సిడెస్ని కొనుగోలు చేయడం. ఇండియాలో ప్రాపర్టీలు లాభదాయకంగా ఉండవని భావించడం. ఎందుకంటే అమెరికా డాలర్లతో పోలిస్తే భారతదేశ రూపాయి మరింత క్షీణించింది. దీంతో భారతదేశంలోని ఆస్తులను విక్రయించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేయడం. భారతదేశంలో భారీ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించడం. ఇక్కడి నిధులను తిరిగి యునైటెడ్ స్టేట్స్కు పంపడం. తొమ్మిదవ దశ ఇప్పుడు మిడ్ లైఫ్ సంక్షోభం ఎదురవుతుంది. కొత్త కారు, పెద్ద ఇల్లు, గ్రీన్ కార్డ్, అధిక ఆదాయంతో కూడిన ఉద్యోగం ఇకపై జీవితంలో కానరావు. అప్పుడు ఉనికిని నిలబెట్టుకునేందుకు ఏదో ఒకటి చేయడం. ఒక మారథాన్ రేస్‌లో పాల్గొనడం. అడపాదడపా ఉపవాసం చేయడం లాంటివి. లేదా కొత్త స్టార్టప్‌ని తెరవడం. పదవ దశ 50- 60 ఏళ్ల వయసుకు చేరుకున్నాక.. పిల్లలు స్టాన్ఫోర్డ్ లేదా ఎంఐటీ లేదా ప్రిన్స్టన్ నుండి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత, మీరు యూఎస్ఏకి వచ్చిన 5 సంవత్సరాల తర్వాత భారతదేశానికి తిరిగి వెళ్లి ఉంటే, జీవితం ఎంత భిన్నంగా ఉంటుందో చర్చిస్తుంటారు. 11వ దశ పిల్లలు దూరంగా వెళ్లడం, చేతిలో తగినంత సమయం ఉండటంతో, ప్రతి సంవత్సరం యూరప్ పర్యటనలు చేయడం, ఈజిప్ట్‌లోని పిరమిడ్లను సందర్శించడం, టర్కిష్ డిలైట్స్ని ఆస్వాదించడం, ఇటలీని సందర్శించడం మొదలైనవి చేస్తారు. భారతదేశం గురించి తిరిగి ఆలోచించడం. ఇటీవలి దశాబ్దాలలో భారతదేశం ఎలా అభివృద్ధి చెందిందనేది యూఎస్ఏలోని స్నేహితులతో పంచుకోవడం. 12వ దశ ఫంక్షనల్ మొబిలిటీ తగ్గినప్పుడు జీవితానికి సంబంధించిన పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. భారతదేశానికి తిరిగి వెళ్లడం లేదా యూఎస్ఏలో వృద్ధాశ్రమంలో ఉండటం. ఇది కూడా చదవండి: అమేథీతో గాంధీ- నెహ్రూ కుటుంబానికున్న సంబంధం ఏమిటి? -
అవమానించిన అత్తింటి బంధువులు.. సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మామ, భర్త తరపు బంధువులు తరచూ తనను అవమానిస్తున్నారని గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... సరూర్‌నగర్ కృష్ణానగర్ కాలనీ నివాసి విష్ణువర్ధన్‌రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం మియాపూర్, ఆల్వీన్ కాలనీకి చెందిన శశికళ(33)తో వివాహమైంది. వీరికి కుమార్తె శ్రేయారెడ్డి(6)ఉంది. శశికళను మామ దేవేందర్‌రెడ్డి, భర్త తరఫు బంధువులు ఉషారాణి, వందన, రాజశేఖర్ తరచూ అవమానిస్తున్నారని శశికళ తన తల్లి యానాం గౌరికుమారికి పలుమార్లు చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా ఉండగా, విష్ణువర్దన్‌రెడ్డి గురువారం ఉదయం శశికళ తల్లి గౌరీకుమారికి ఫోన్ చేసి తక్షణమే తమ ఇంటికి రమ్మన్నాడు. దీంతో ఆమెకు అనుమానం వచ్చి కుమార్తె ఇంటి పక్కన ఉండేవారికి ఫోన్ చేయగా, శశికళ చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. వెంటనే బంధువులతో కలిసి ఆమె కృష్ణానగర్‌కు చేరుకొని కన్నీరు మున్నీరైంది. మామ, బంధువులు అవమానకరంగా ప్రవర్తించడంతోనే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని, నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గౌరీకుమారి ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. చదవండి: Hyderabad: తాగుడుకు బానిసైన భర్త.. ఉద్యోగం మానేసి అబద్ధాలు చెప్తుండటంతో -
పిల్లలను హతమార్చి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి దంపతుల ఆత్మహత్య
మచిలీపట్నంటౌన్: బందరుకోటలో విషాదఛాయలు అలముకున్నాయి. నగరంలోని 21వ డివిజన్ బందరుకోటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గుండు వీరార్జున వినయ్ (కన్నా) తో పాటు కుటుంబ సభ్యుల మృతదేహాలు శనివారం స్వస్థలానికి చేరుకున్నాయి. కన్నా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్. అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడు నెలల నుంచి భార్య, ఇద్దరి కుమార్తెలతో బెంగళూరులో ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం కన్నా భార్య హైమావతి తల్లిదండ్రులు.. ఆమెకు ఫోన్ చేస్తున్నా తీయలేదు. అనుమానం వచ్చిన వారు బెంగళూరులో కుమార్తె ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా లోపలి నుంచి దుర్వాసన వస్తుండటంతో సమీపంలోని కడిగోడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్యభర్తలతో పాటు పిల్లలిద్దరూ విగతజీవులుగా కనిపించారు. పిల్లలను హతమార్చి తరువాత భార్యభర్తలు ఉరివేసుకుని చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. భార్యభర్తల మధ్య మనస్పర్థల కారణంగానే ఘటనకు పాల్పడ్డారనే చర్చ జరుగుతోంది. వీరికి రెండేళ్ల వయసున్న హనీ, ఎనిమిది నెలల వయసున్న కుమార్తెలు ఉన్నారు. నాలుగు రోజుల క్రితం ఘటన జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. బెంగళూరులోని కడిగోడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి మృతదేహాలకు పోస్టుమార్టం చేసి అనంతరం బంధువులకు అప్పగించారు. ఘటనపై కడిగోడి పోలీసులు విచారణ చేస్తున్నారు. -
Hyderabad: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
ఘట్కేసర్: బైక్ అదుపుతప్పడంతో జరిగిన ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. ఈ ఘటన శనివారం రాత్రి మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శివారెడ్డిగూడలోని మారుతీనగర్‌కు చెందిన సూరజ్ (28) తన స్నేహితుడి కారును రెండు రోజుల క్రితం తీసుకున్నాడు. దానిని ఇచ్చేందుకు శనివారం రాత్రి బాలాజీనగర్‌కు వెళ్లాడు. అనంతరం స్నేహితుడి ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో ఘట్కేసర్ సమీపంలోని మాధవరెడ్డి వంతెన వద్ద బైక్ అదుపుతప్పడంతో సూరజ్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడి మొబైల్ ద్వారా అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడు హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. -
విషాదం.. నాలుగు రోజుల్లో కుమారుడి జన్మదినం..
నల్గొండ: తమ కుమారుడి మొదటి జన్మదిన వేడుకలకు సంబంధించిన సామగ్రి కొనుగోలు కోసం తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఓ షాపింగ్‌మాల్‌కు వెళ్లారు. అక్కడే సామగ్రి ఖరీదు చేస్తుండగా తల్లి అకస్మాత్తుగా గుండెపోటుకు గురైంది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. వివరాలిలా ఉన్నాయి. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని మార్కండేయనగర్ కాలనీకి చెందిన గోశిక ప్రవీణ్‌కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. నల్లగొండకు చెందిన స్వాతి(30)తో వివాహం జరిగింది. వీరికి కుమార్తె స్వీటి(05), కుమారుడు విబ్బు ఉన్నారు. వీరు ప్రస్తుతం ఉద్యోగరీత్యా మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఈనెల 25న కుమారుడి మొదటి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందుకుగాను ఇటీవల స్వగ్రామానికి వచ్చారు. ప్రస్తుతం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈమేరకు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో షాపింగ్ చేస్తుండగా స్వాతి అకస్మాత్తుగా కిందపడిపోయింది. అక్కడే ఉన్న భర్త ప్రవీణ్, కుటుంబ సభ్యులు కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందింది. దీంతో చిన్నారులు తల్లిలేని వారయ్యారు. కుమారుడి జన్మదిన వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తూ గుండెపోటుకు గురై తల్లి మృతిచెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నిలిపింది. ఇదిలా ఉండగా శనివారం దైవ దర్శనం నిమిత్తం శ్రీశైలం దేవస్థానానికి వెళ్లే ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఇంతలోనే ఇలా జరిగింది. -
Madanapalle: పిల్లల భవిష్యత్తు కోసం ఆ సమాధి బద్ధలు!
అన్నమయ్య: Madanapalle Postmortem Incident: ప్రమాదంలో చనిపోయిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతదేహానికి 3 నెలల 10 రోజుల తర్వాత పోస్టుమార్టం నిర్వహించిన అరుదైన సంఘటన కురబలకోట మండలంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. పిచ్చలవాండ్లపల్లె పంచాయతీ పందివానిపెంటకు చెందిన రేపన చౌడప్ప (33) బెంగళూరులోని విఫ్రో కంపెనీలో సాప్ట్వేర్ ఇంజినీరుగా పనిచేసేవాడు. ఇతడికి భార్య శిల్ప, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న చౌడప్ప బెంగళూరు నుంచి మోటార్ సైకిల్‌పై ఇంటికి వస్తూ మదనపల్లె రూరల్ మండలంలోని చీకలబైలు వద్ద జరిగిన ప్రమాదంలో చనిపోయాడు. తీవ్ర విషాదంలో కూరుకుపోయిన కుటుంబీకులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లకుండా పోస్టుమార్టం చేయకుండానే స్వగ్రామం పందివానిపెంటలో మరుసటి రోజు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే చౌడప్ప సాప్ట్వేర్ ఇంజినీరు కావడంతో అతడి మృతి తర్వాత అందించే బెనిఫిట్స్ కోసం కంపెనీ పోస్టుమార్టం సర్టిఫికెట్ కావాలని కోరింది. చౌడప్ప భార్య శిల్ప స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గంగాధరరావును కలసి తన భర్త చౌడప్ప మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి సర్టిఫికెట్ ఇప్పించాలని కోరింది. ఆయన ఆదేశాలతో శుక్రవారం మదనపల్లె డీఎస్పీ కేశప్ప ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణ, తహసీల్దారు ఎం. భీమేశ్వరరావు పర్యవేక్షణలో సమాధిని తొలగించి మృతదేహాన్ని బయటకు తీయించారు. అక్కడే వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. దానిని వీడియోలో చిత్రీకరించారు. మూడు నెలల తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారని తెలిసి పరిసర ప్రాంతాల ప్రజలు అక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగికి కుచ్చుటోపి.. ఏకంగా 46 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
సాక్షి, సంగారెడ్డి: కమీషన్ పేరిట ఆశ చూపి సాఫ్ట్వేర్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. దీంతో భారీ నగదు పోగొట్టుకొన్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... అమీపూర్ పరిధిలోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీకి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి జూన్ 28న పార్ట్ టైం జాబ్ అంటూ వచ్చిన వాట్సాప్ మెసేజ్‌కు స్పందించాడు. అందులో తన వివరాలు నమోదు చేసుకున్నాడు. దీంతో సైట్ నిర్వాహకుడు అతడికి ఒక వాలెట్ ఐడీ ఇచ్చారు. అందులో ఉద్యోగి ముందుగా రూ.2 వేలు చెల్లించి ఇచ్చిన టాస్క్‌లు చేస్తున్నాడు. కాగా తాను పెట్టిన నగదును సైబర్ నేరగాళ్లు తనకిచ్చిన వాలెటఖలె చూపిస్తున్నారు. ఈ క్రమంలో బాధితుడు తన భార్య నగలు అమ్మి, స్నేహితుల వద్ద అప్పు చేసి, జాబ్లోను ద్వారా మొత్తంగా 35 దఫాలుగా రూ.46 లక్షలు చెల్లించాడు. సైబర్ నేరగాళ్లు ఉద్యోగితో నగదు పెట్టిస్తూ తనకు ఇచ్చిన వాలెట్లో నగదుతోపాటు కమీషన్ నగదు చూపించారు. దీంతో ఉద్యోగి చివరిగా తాను పెట్టిన నగదుతోపాటు కమిషన్ ఇవ్వాలని అడగగా స్పందించలేదు. దీంతో బాధితుడు తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు శనివారం ఫిర్యాదు అందింది. చదవండి: ఉద్యోగాల పేరుతో మోసం.. దుబాయ్ తీసుకెళ్లి షేక్‌లకు అమ్మేసిన బ్రోకర్ -
బంధం నిలబడాలంటే అదొక్కటే సరిపోదు!
సునీత, సురేష్ అందమైన జంట.. వాళ్లకొక పాప. ఇద్దరూ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వారాంతంలో పార్టీలు, నెలకోసారి విహారయాత్రలు, ఏడాదికోసారి విదేశీ యాత్రలు.. అంతా బాగానే ఉంది. కానీ నెలకో, రెణ్నెల్లకో గొడవ గ్యారంటీ. కారణాలు చాలా చిన్నవి..గొడవలు మాత్రం పెద్దవి. చివరకు విడిపోదామని నిర్ణయించుకున్నారు. లాయర్‌నూ సంప్రదించారు. చివర్లో మిత్రుడి సలహా మేరకు మ్యారిటల్ కౌన్సెలింగ్‌కు వచ్చారు. సునీత, సురేష్‌లతో రెండు గంటలపాటు మాట్లాడాక.. వారి మధ్య శారీరక సాన్నిహిత్యం తప్ప మరెలాంటి బంధమూ లేదని అర్థమైంది. సునీత శాలరీ ఎంతో కూడా సురేష్‌కు తెలియదు. అడిగినా చెప్పదు. అది నీకు సంబంధంలేని విషయం అంటుంది. ఏ మాటంటే సురేష్‌కు కోపం వస్తుందో సునీతకు తెలియదు. ఏం చేస్తే సునీత సంతోషపడుతుందో సురేష్‌కు తెలియదు. పగలు ఎన్ని గొడవలున్నా.. రాత్రికి ఒకటైతే.. అన్ని గొడవలూ సర్దుకుంటాయని వారు బలంగా భావిస్తున్నారు. కానీ బంధం బలపడటానికి, నిలబడటానికి ఇతర సాన్నిహిత్యాలు కూడా అవసరమని వారికి తెలియదు. అందువల్ల వారెలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. ఫలితమే చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు.. తిట్టుకోవడాలు.. కొట్టుకోవడాలు.. విడాకుల ప్రయత్నాలు. జీవితంలో మనకు స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు.. ఇలా అనేక మందితో సాన్నిహిత్యం లేదా ఆత్మీయత ఉంటుంది. వైవాహిక బంధంలో ఇది మరింత అవసరం. అయితే సాన్నిహిత్యం అనగానే చాలామంది సునీత, సురేష్లలా శారీరక సాన్నిహిత్యం గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ బంధాలు బలపడాలంటే ఇతర సాన్నిహిత్యాలు కూడా అవసరం. అవేంటో ఈరోజు తెలుసుకుందాం. శారీరక సాన్నిహిత్యం: చేయి పట్టుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, తాకడం.. శారీరక సాన్నిహిత్యానికి ఉదాహరణలు. అయితే దీన్ని బహిరంగంగా ప్రదర్శించడం కొందరికి ఇబ్బందిగా అనిపిస్తుంది. సురేష్‌కు కూడా. భావోద్వేగ సాన్నిహిత్యం: భవిష్యత్తులో దంపతులిద్దరూ ఏం కోరుకుంటున్నారు, మీరు ఆందోళన చెందుతున్న విషయాలు, పని ఒత్తిడితో కూడిన సంఘటనల గురించి మాట్లాడుకోవడం ఎమోషనల్ ఇంటిమసీకి ఉదాహరణలు. సునీత, సురేష్‌ల మధ్య ఇది శూన్యం. మేధా సాన్నిహిత్యం: చదివిన పుస్తకం గురించి మాట్లాడటం, ఆలోచనలు, అనుభవాలు, ప్రశ్నలు పంచుకోవడం లాంటివి ఇంటలెక్చువల్ ఇంటిమసీకి ఉదాహరణలు. సురేష్‌కు నాన్ ఫిక్షన్ ఇష్టమైతే, సునీతకు ఫిక్షన్ అంటే ప్రాణం. అనుభవ సాన్నిహిత్యం: ఆరోగ్యకరమైన సంబంధాల్లో కలసి పంచుకునే అనుభవాలు ముఖ్యం. కలసి సమయాన్ని గడపడం, పనులు చేసుకోవడం వంటివి ఎక్స్‌పీరియెన్షియల్ ఇంటిమసీకి ఉదాహరణలు. సురేష్, సునీతల మధ్య ఇది ఫర్వాలేదు. ఆధ్యాత్మిక సాన్నిహిత్యం: విలువలు, విశ్వాసాలు, మతపరమైన ఆచారాలలో పాల్గొనడం, ఆధ్యాత్మిక విషయాలను జీవిత భాగస్వామితో చర్చించడం స్పిరిచ్యువల్ ఇంటిమసీ. సునీత భక్తురాలు. సురేష్ నాస్తికుడు. నిరంతరం ప్రయత్నించాలి.. ఎంతకాలం కలసి ఉన్నా, సాన్నిహిత్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవడం అవసరం. సునీత, సురేష్‌లకు వారి మధ్య విభేదాలను వివరించడంతో పాటు, వారి సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి కౌన్సెలింగ్ చేశాను. అలాగే మీ జీవితంలో సాన్నిహిత్యాలను బలోపేతం చేయడానికి కొన్ని సులువైన మార్గాలున్నాయి. శారీరక సాన్నిహిత్యమంటే కేవలం సెక్స్ మాత్రమే కాదు. ఇద్దరూ ఇష్టాయిష్టాలను పంచుకోవడం, చేతులు పట్టుకోవడం, కౌగిలించుకోవడం శారీరక సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తాయి· భాగస్వామి చెప్పే మాటలు వినడానికి, భావాలను పంచుకోవడానికి ప్రతిరోజూ కొంత సమాయాన్ని కేటాయించడం భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పెంచుతుంది· భోజనం చేస్తున్నప్పుడు లేదా జీవిత భాగస్వామితో కలసి ప్రదర్శనను చూస్తున్నప్పుడు మొబైల్ ఫోన్, గాడ్జెట్స్‌ను దూరంగా పెట్టండి · ఇద్దరూ కలసి కొత్త విషయాలను ఆస్వాదించడం సరదాగా ఉంటుంది. అందుకే ఇద్దరూ వెళ్లని ప్రదేశానికి ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి· కొత్త విషయాల గురించి మాట్లాడుకోవడం, ఆర్టికల్స్ పంచుకోవడం మేధో సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తుంది· భాగస్వామి నమ్మకాల మేరకు ఆధ్యాత్మిక సందర్శనలు ప్లాన్ చేసుకోవాలి. ఆత్మీయతకు ఆటంకాలు ప్రతి బంధంలోనూ విభేదాలు, హెచ్చు తగ్గులు ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని ఆనందించాలి. కానీ కొన్ని అడ్డంకులు ఇంటిమసీని దెబ్బతీస్తాయి. వాటిని గుర్తించి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటో తెలుసుకుందాం. కోపం, చిరాకు, అపనమ్మకంతో భాగస్వామితో నిత్యం వాదిస్తూ ఉంటే అది ఇద్దరిమధ్య ఆత్మీయతను దెబ్బతీస్తుంది పని, అనారోగ్యం, ఆర్థిక, పిల్లలు, ఇతర సమస్యల వల్ల కలిసి ఒత్తిడి కూడా దంపతుల సాన్నిహిత్యాన్ని దూరం చేస్తుంది · భాగస్వామితో మాట్లాడటం, వారు చెప్పేది వినడం ఆత్మీయత పెంపొం దించడానికి అవసరం. మీరు మీ భావాలను, అవసరాలను సరిగా వ్యక్తీకరించలేకపోతే అది సాన్నిహిత్యంపై ప్రభావం చూపుతుంది· కొన్నిసార్లు, కొంతమంది గత అనుభవాలు, గాయాల వల్ల భాగస్వామితో సన్నిహితంగా ఉండటానికి భయపడతారు. దీన్నే ఫియర్ ఆఫ్ ఇంటిమసీ అంటారు. సునీతలో ఇది కనిపించింది. (చదవండి: ఈ సరస్సు ఎంత ప్రమాదకరమంటే.. ఒడ్డున నిలుచున్న ప్రమాదమే..!) -
పద్నాలుగేళ్లకే ఎలన్ మస్క్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా..
నాలుగైదేళ్లొచ్చినా ఇంకా ముద్దు ముద్దుగా మాట్లాడే పిల్లలే మనకు తెలుసు. అలాంటిది రెండేళ్లకే గలగల మాట్లాడుతూ అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడా బుడతడు. అంతేనా? తొమ్మిదో ఏటనే ‘‘నాది స్కూలు సిలబస్ చదివి, హోం వర్క్ చేసే వయసు కాదు’’ అని చెప్పి ఏకంగా కాలేజీ పుస్తకాలు చేతబట్టాడు. నాలుగేళ్లలో చకచకా డిగ్రీ పూర్తి చేసేశాడు. ప్రస్తుతం పద్నాలుగేళ్ల వయసులో ఎలాన్ మస్క్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు కైరాన్ క్వాజీ. నేటి టెక్నాలజీ టీనేజర్స్ కొందరు అది ఇది అనిచెబుతూ ఎంజాయ్ చేస్తూ సమయాన్ని వృథా చేస్తుంటే.. కైరాన్లాంటి కుర్రాళ్లు మాత్రం వయసుకు మించిన ప్రతిభతో అద్భుతాలు సృష్టిస్తూ ఔరా అనిపిస్తున్నారు. అత్యంత వేగం, కచ్చితత్వంతో కూడిన ప్రతిభా పాటవాలతో ప్రఖ్యాత స్పేస్ ఎక్స్ కంపెనీ రిక్రూట్మెంట్ టెస్ట్ పాసైన కైరాన్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఎంపికవడమేగాక, కంపెనీలోనే తొలి అతిపిన్న ఇంజినీర్‌గా నిలిచాడు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన జూలియా, ముస్తాహిద్ క్వాజీ దంపతులకు 2009 జనవరి 27 కైరాన్ పుట్టాడు. చిన్నప్పటి నుంచి ఎంతో చురుకుగా ఉత్సాహంగా ఉండే కైరాన్ను గమనించిన తల్లిదండ్రులు.. చక్కగా ప్రోత్సహించేవారు. తెలివిగా చదువుతూ ..ఏడో ఏట యంగ్వాంక్స్ కోడింగ్ అకాడమిలో చేరి పైథాన్ ప్రోగ్రామింగ్‌ను నేర్చుకున్నాడు. దీంతోపాటు మెషిన్ లెర్నింగ్‌ను కూడా వంటబట్టించుకున్నాడు. తొమ్మిదేళ్లకే కాలేజీ.. నాది స్కూల్ హోం వర్క్ చేసే వయసు కాదని తన ప్రతిభతో తొమ్మిదో ఏటనే లాస్పొసిటాస్ కాలేజీలో చేరి ఈ కాలేజీ చరిత్రలో తొలి పిన్న వయసు విద్యార్థిగా చరిత్ర సృష్టించాడు. ఆ తరువాత పదకొండేళ్లకే మ్యాథమేటిక్స్‌లో డిగ్రీ చదువుతూనే శాంత క్లారా యూనివర్శిటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ çకూడా చదివాడు. ఇదే యూనివర్శిటీలో ఈ ఏడాది మాస్టర్స్‌ని పూర్తిచేశాడు. ఇటీవల సాంకేతిక ఫన్ ఇంటర్వ్యూ ప్రాసెస్‌ను అవలీలగా అధిగమించి స్పేస్‌ఎక్స్‌లోని స్టార్‌లింక్ విభాగంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఎంపికయ్యాడు. దేన్నైనా ఇట్టే పట్టేసే గుణగణాలే కైరాన్ని స్పేస్ ఎక్స్ ఉద్యోగిగా మార్చాయి. అందుకే చిన్న వయసులో డిగ్రీలేగాదు, ఉద్యోగాన్ని కూడా కొట్టేశాడు. ప్రతిభ, పట్టుదల, కృషి ఎక్కువ ‘‘కైరాన్ చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండేవాడు. అ చురుకుదదాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించేవాళ్లం. దాంతో వాడు తన ప్రతిభాపాటవాలకు మరింత పదును పెట్టుకుని టీనేజ్లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగిగా మారాడు. లాస్పొసిటాస్ కాలేజీలో చదివేటప్పుడు అకడమిక్ సిలబస్‌ను నేర్చుకోవడమేగాక, స్టాఫ్ అసిస్టెంట్‌గా, స్టెమ్ ట్యూటర్‌గాను పనిచేసేవాడు. ఇతర ట్యూటర్లకు సాయం చేస్తూ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. వేసవి సెలవుల్లో సైబర్ ఇంటెలిజెన్స్ ఇంటర్న్‌షిప్ చేశాడు. దీనితోపాటు బ్లాక్‌బర్డ్ ఏఐలో కూడా ఏఐ ఇంటర్న్‌గా చేశాడు. శాంతక్లారా యూనివర్సిటి, ఇంటెల్ మెంటర్స్ కూడా కైరాన్కు మంచి గైడెన్స్‌ను అందించారు. చేతిరాత, స్పెల్లింగ్, నోట్ టేకింగ్, ఇతర భాషలు నేర్చుకోవడం కాస్త కష్టమైనా.. పట్టుదల, కృషితో నేర్చుకున్నాడు. ప్రస్తుతం బెంగాలీ, మాండరిన్ నేర్చుకుంటున్నాడు. ఎప్పుడు కొత్తదాన్ని నేర్చుకోవడానికి కైరాన్ ఆసక్తి కనబరుస్తాడు. ఆ ఆసక్తే వాడి భవిష్యత్తుని ఉజ్వలంగా తీర్చిదిద్దుతోంది’’ అని కైరా తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. ఇక ‘‘ నా నెక్ట్స్ స్టాప్ ‘స్పేస్ఎక్స్’. ఈ గ్రహంలోనే అత్యంత చక్కని కంపెనీలో స్టార్‌లింక్ ఇంజినీరింగ్ టీమ్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేరబోతున్నాను. వయసును బట్టి ఉద్యోగాలలో నియమించే కంపెనీలకు భిన్నంగా, నా ప్రతిభ, పరిపక్వతలను దృష్టిలో పెట్టుకుని స్పేస్ఎక్స్ నాకు ఈ ఉద్యోగం ఇచ్చింది’’ అని తన లింక్డ్ ఇన్ అకౌంట్ ద్వారా కైరాన్ తన కలల జాబ్ గురించి సంతోషంతో చెప్పుకున్నాడు. (చదవండి: రూ. రెండు కోట్ల ఖర్చుతో 20 కోట్ల లబ్ది.. ‘ఏక్ దిన్ కా సుల్తాన్’.. అంతా గాల్లోనే) -
Ranga Reddy: సాఫ్ట్వేర్ ఉద్యోగినికి న్యూడ్ కాల్స్ చేస్తూ వేధింపులు
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఉద్యోగిని వేధిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆదిబట్ల ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. కడ్తాల్ గ్రామానికి చెందిన మనోజ్‌కుమార్ ఆదిబట్ల సమీపంలోని సాయితేజ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా ఉద్యోగం చేస్తుండేవాడు. అపార్ట్మెంట్లో టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే వారికి పార్సిల్స్ తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఆ క్రమంలో కొంతమంది ఫోన్‌నంబర్లు మనోజ్‌కుమార్ వద్ద ఉన్నాయి. ఈ క్రమంలో టీసీఎస్‌లో పనిచేసే ఓ సాఫ్ట్వేర్ యువతిని న్యూడ్ ఫోన్‌కాల్స్ చేస్తూ కొద్దిరోజులుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. వేధింపులు భరించలేని సదరు ఉద్యోగిని గురువారం ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మనోజ్‌కుమార్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. -
ఎంటెక్ చదివి.. టిక్‌టాక్‌తో మొదలెట్టి..
అతను ఎంటెక్ చదివాడు. ప్రయత్నిస్తే సాఫ్ట్వేర్ రంగంలో మంచి ఉద్యోగమే వచ్చేది. కానీ అందరూ నడిచే దారిలో వెళ్లాలనుకోలేదు. తనకంటూ ప్రత్యేక ‘మార్గం’ ఉండాలని భావించాడు. ఆ మార్గంలో వెళ్లే క్రమంలో మొదట అందరూ హేళన చేశారు. అయినా నిరుత్సాహపడలేదు. ఎంచుకున్న రంగం ఏదైనా పట్టుదల, చిత్తశుద్ధితో కృషి చేస్తే విజయం సాధించవచ్చునని నిరూపించాడు. ఇంటిల్లిపాదీ ఆనందించే వీడియోలను సొంతంగా రూపొందిస్తూ..అందులో తానే నటిస్తూ సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగాడు. అతనే ప్రశాంత్ అలియాస్ ప్రసూబేబీ. సాక్షి, అనంతపురం డెస్క్ : సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. తమకున్న నైపుణ్యాలు ప్రదర్శిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో ప్రశాంత్ ఒకరు. ఎలాంటి సినీ నేపథ్యమూ లేకపోయినా నటనలో సత్తా చాటుతూ.. అనతికాలంలోనే సోషల్ మీడియా సూపర్ స్టార్‌గా ఎదిగాడు. పొడవాటి జుట్టు, గడ్డంతో స్టైలిలుగా కని్పంచే ప్రశాంత్ చక్కటి నటన, వైవిధ్యమైన డైలాగ్ డెలివరీతో అందరినీ అలరిస్తున్నాడు. ప్రశాంత్ అంటే ఎవరూ గుర్తు పట్టరు కానీ.. ‘ప్రసూబేబీ’ అంటే మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారు ఇట్టే గుర్తు పట్టేస్తారు. ప్రసూబేబీ ( (prashu_baby)) పేరిట ప్రశాంత్ ప్రారంభించిన యూట్యూబ్ చానల్‌కు ఏకంగా 8.24 మిలియన్ల సబ్‌స్రై్కబర్లు ఉన్నారు. సంస్థలను మినహాయిస్తే వ్యక్తిగత విభాగానికి సంబంధించి రాష్ట్రంలో హర్షసాయి తర్వాత అత్యధిక సబ్‌స్రై్కబర్లు ఉన్నది ఈ చానల్‌కే. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటు వీడియోలను రెగ్యులర్‌గా రూపొందించి ఇందులో అప్లోడ్ చేస్తున్నా . వీడియో పెట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ప్రశాంత్ ఇన్స్టాగ్రామ్ అకౌంటుకు కూడా 1.4 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల వారు, కువైట్, అమెరికా,సౌదీ తదితర దేశాల ప్రజలు సైతం ప్రశాంత్ వీడియోలను వీక్షిస్తున్నారు. ధరణి, శిశిర, ప్రసూ కాంబినేషన్లో వచ్చిన వీడియోలు సూపర్ హిట్ అయ్యాయి. ఎంటెక్ చదివేందుకు అనంతపురం వచ్చిన ప్రశాంత్ ఇక్కడి నుంచే సీరియస్ ‘యాక్టింగ్’ మొదలుపెట్టాడు. నటనపై ఆసక్తి ఉన్న తనలాంటి వారితో కలిసి వీడియోలు రూపొందిస్తున్నాడు. యాక్టింగ్ మొదలుకుని స్క్రిప్టు వరకు అన్నీ తానే చూసుకుంటాడు. ఇలా ఇప్పటివరకు 30 మందికి పైగా తనతో కలసి నటించారు. వారిలో చాలామందికి సొంత యూట్యూబ్ చానళ్లు, ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లు ఏర్పాటు చేయించి..వారూ తగిన ఆదాయం పొందేలా చూస్తున్నాడు. సోషల్ మీడియాలో ప్రశాంత్ పాపులారిటీని గుర్తించిన పెద్ద పెద్ద సంస్థలు సైతం అతనితో వ్యాపార ప్రకటనలు చేయిస్తున్నాయి. సినిమా ప్రమోషన్లు కూడా చేయిస్తున్నారు. ఇటీవలే దసరా, విరూపాక్ష సినిమాలకు ప్రమోషన్ చేశాడు. ఓటీటీ, సినిమా ఆఫర్లు సైతం వస్తున్నాయి. పెద్దసంస్థలతో కలసి ఇతర భాషల్లో సోషల్ మీడియా వేదికగా వినోదాత్మక వీడియోలు రూపొందించే ఆలోచనలో ఉన్నాడు. ఎంటెక్ చదివి.. టిక్‌టాక్‌తో మొదలెట్టి.. ప్రశాంత్ సొంతూరు అన్నమయ్య జిల్లా మదనపల్లెకు సమీపంలోని గారబురుజు గ్రామం. తల్లిదండ్రులు సావిత్రి, నారాయణ. వీరిది వ్యవసాయ కుటుంబం. ఇద్దరు కుమారులు కాగా..ప్రశాంత్ చిన్నోడు. మదనపల్లెలోని ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదివాడు. జేఎన్టీయూ (అనంతపురం)లో ఎంటెక్ చేశాడు. ఇంజినీరింగ్ చదువుతుండగానే నటనపై ఆసక్తితో చిన్నచిన్న వీడియోలు సొంతంగా రూపొందించి ‘టిక్‌టాక్’లో పెట్టేవాడు. ప్రేమ, మానవత్వం, కుటుంబం ఇతివృత్తంగా వీడియోలు రూపొందించేవాడు. అవి బాగా ట్రెండింగ్కావడంతో లక్షల్లో సబ్‌స్రై్కబర్లు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌పై నిషేధం విధించడంతో తన దృష్టిని యూట్యూబ్‌పై మళ్లించాడు. ఇష్టపడి పనిచేయడం వల్లే ఈ స్థాయికి.. ఏ పనైనా ఇష్టపడి చేయాలని నేను భావిస్తా. నేను ఇలా వీడియోలు చేయడాన్ని మొదట్లో స్నేహితులే కాకుండా కుటుంబ సభ్యులు కూడా తప్పుబట్టారు. కానీ సక్సెస్ సాధించి వారితోనే అభినందనలు అందుకున్నా. నిత్య జీవితంలో జరిగే సంఘటనలు, కుటుంబంలో ఉండే సంతోషాలు, సరదాలు, సమస్యలే ఇతివృత్తంగా ఎక్కువ వీడియోలు రూపొందించా. ఇవి భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరికీ కనెక్ట్ అయ్యాయి. ఇదే ఉత్సాహంతో మరింత మంచి కంటెంట్ అందివ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లపై దృష్టి పెడుతున్నా. – ప్రశాంత్ -
కృష్ణానదిలో పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
యాదాద్రి: కృష్ణానదిలో పడి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతిచెందాడు. ఈ ఘటన మట్టపల్లిలో శనివారం జరిగింది. మఠంపల్లి ఎస్ఐ సీహెచ్ బాలకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు (పల్నాడు) జిల్లా పిడుగురాళ్లకు చెందిన మాశెట్టి సుబ్బారావు, రాజేశ్వరి దంపతుల పెద్దకుమారుడైన మాశెట్టి సుబ్రహ్మణ్యం (31)మలేషియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈతడి తండ్రి సుబ్బారావు గుంటూరు జిల్లాలోనే కృష్ణానదీతీరంలో గల దైదా పుణ్యక్షేత్రానికి వెళ్లి ప్రమాదవశాత్తు నది లోపడి మృతిచెందాడు. అప్పటినుంచి సుబ్రహ్మణ్యం మానసికవ్యాధికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు విజయవాడలోని కృష్ణాన్యూరో సెంటర్‌నందు మానసిక వైద్యుని పర్యవేక్షణలో చికిత్స నిర్వహిస్తూ పిడుగురాళ్లలోని ఇంటివద్దే ఉంచుతున్నారు.అయితే సుబ్రహ్మణ్యం మాత్రం మానసిక స్థితి మెరుగుపడక ఎప్పుడూ ఒంటరిగా ఉంటూ ఆలోచిస్తూండేవాడు.అదే మానసిక స్థితితో ఇంటినుంచి ఈనెల16న ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి మట్టపల్లి వద్ద కృష్ణానదిలో శవమైతేలాడు. కాగా సమాచారం తెలుసుకున్న పోలీసులు నదిలోనుంచి మృతదేహాన్ని బయటకుతీశారు. మృతదేహం ఫోటోలు సోషల్ మీడియాలో చూసిన కుటుంబసభ్యులు,బంధువులు మట్టపల్లికి చేరుకుని సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. మృతుడు మానసిక స్థితి సరిగాలేకనే నదిలోపడి చనిపోయాడని అతని తమ్ముడు మాశెట్టి వెంకటశ్రీనివాసరావుమఠంపల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. మృతుడు అవివాహితుడు తల్లి,తమ్ముడు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
స్పేస్ ఎక్స్‌లో పద్నాలుగేళ్ల ఇంజనీర్
కాలిఫోర్నియా: ఎలన్ మస్క్‌కు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్‌కి ఇకపై ఒక బుల్లి ఇంజనీర్ సేవలందించనున్నాడు. 14 ఏళ్ల వయసున్న కైరాన్ క్వాజి అనే ఇంజనీర్‌కి ఉద్యోగమిచ్చింది. స్పేస్ ఎక్స్ నిర్వహించిన సాంకేతిక పరీక్ష, ఇంటర్వ్యూల్లో క్వాజీ ఉత్తీర్ణుడు కావడంతో ఇంజనీర్‌గా నియమించినట్టు సంస్థ వెల్లడించింది. పదకొండేళ్లకే క్వాజీ ఇంజనీరింగ్‌లో చేరాడు. కంప్యూటర్ సైన్స్‌లో పట్టా తీసుకున్న క్వాజీకి వెంటనే స్పేస్ ఎక్స్‌లో ఉద్యోగం లభించింది. అంగారక గ్రహంపైకి మనుషుల్ని తీసుకువెళ్లే ప్రాజెక్టులో క్వాజీ ఉన్నాడు. చదవండి: ఎవరెస్ట్ యమ డేంజర్.. పది వేల అడుగులు దాటితే.. -
భవనంపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
హైదరాబాద్: మానసిక ఒత్తిడికి గురైన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆరంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సౌందర్య (28) భర్త అభినవ్ కుటుంబ సభ్యులతో కలిసి కొండాపూర్‌లో నివాసముంటోంది. గురువారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లాల్సిన సమయంలో భర్త తండ్రి (మామ)కు ఫోన్ చేసి తాను హైదరాబాద్‌ను విడిచి దూరంగా వెళుతున్నానని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్లీ ఫోన్ చేసి శంషాబాద్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఓ ఆరంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆర్జీఐఏ పోలీసులకు సమాచారం అందించి అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు, పోలీసులు ఆస్పత్రికి తరలించగా. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
వైఎస్సార్ : మండలంలోని పల్లవోలు గ్రామంలో బద్రిపల్లె సురేఖ(24) అనే యువతి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ మైనుద్దీన్ తెలిపారు. పల్లవోలుకు చెందిన సుబ్బరాయుడు, సావిత్రి దంపతుల కుమార్తె సురేఖ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్‌లో చేస్తోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కడపు నొప్పితో బాధపడుతుండేది. మంగళవారం సాయంత్రం ఆసుపత్రికి వెళ్లాలని తన తల్లి సావిత్రితో తెలిపింది. డ్వాక్రా పని మీద చాపాడుకు వెళ్లిన సావిత్రి ఇంటికి తిరిగి రాగా తలుపులు మూసి ఉన్నాయి. చుట్టు పక్కల వారి సాయంతో పగులగొట్టి చూడగా సురేఖ సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతురాలి తల్లి సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ట్యాంక్‌బండ్‌పై రోడ్డు ప్రమాదం
చిక్కడపల్లి: ట్యాంక్‌బండ్‌పై శనివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం చెందాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. శామీర్‌పేట అలియాబాద్‌కు చెందిన లక్ష్మీనారాయణ పెద్ద కుమారుడు మనోజ్ కుమార్ (34) హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. శనివారం తెల్లవారుజామున విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. సికింద్రాబాద్ నుంచి అఫ్జల్‌గంజ్‌కు వెళ్తున్న వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అతివేగంతో వచ్చి మనోజ్ కుమార్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని దోమలగూడ పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మనోజ్‌కుమార్ మృతి చెందాడు. బస్సు డ్రైవర్ సయ్యద్ వసీం షాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన ట్యాంక్‌బండ్‌పై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. కేసు దర్యాప్తు దోమలగూడ ఇన్స్పెక్టర్ దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్.ఐ.శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
కర్నూలు: మండలంలోని బొమ్మనపల్లి గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ పురిమెట్ల సాయిప్రసాద్ (25) ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. వెంకటేశులు, సీతమ్మ కుమారుడైన సాయిప్రసాద్ బెంగళూరులోని సాఫ్ట్వేర్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా పనిఒత్తిడి భరించలేకపోతున్నానని, కంపెనీ మారాలనుకుంటున్నానని తల్లిదండ్రులకు చెప్పేవాడు. రెండు రోజుల క్రితం బెంగళూరుకు వెళ్లి.. తిరిగి వెంటనే స్వగ్రామానికి వచ్చాడు. ఆదివారం తెల్లవారుజామున అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం
ధర్మవరం రూరల్: మండల పరిధిలోని గరుడంపల్లి సమీపంలోని వంక మలుపు వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందాడు. పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు... ధర్మవరం పట్టణంలోని యాధవ వీధికి చెందిన సుబ్బమ్మ, వెంకటశివ దంపతుల కుమారుడు ఆదిశేషు (28) బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటూ వర్క్ ఫ్రం హోం చేసుకుంటున్నాడు. ఆదివారం తన స్నేహితులు రవితేజ, మంజులతో కలిసి శ్రీశైలానికి కారులో బయలుదేరాడు. కారు గరుడంపల్లి వంక మలుపు వద్దకు చేరుకోగానే అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆదిశేషు అక్కడికక్కడే మృతి చెందగా రవితేజ, మంజులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అనంతపురం సవేరా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఆదిశేషు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చేతికొచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ జాబ్ వదిలి సొంతూరికి.. ‘మన రైతు’ పేరిట..
సాక్షి, అమరావతి: ఆస్ట్రేలియాలో రూ.లక్షల జీతంతో సాఫ్ట్వేర్ కొలువు. విదేశీ పౌరసత్వం. విలాసవంతమైన జీవితం. ఇంతకంటే ఎవరైనా ఏం కోరుకుంటారు. హాయిగా అక్కడే సెటిలవ్వాలని చూస్తారు. కానీ.. అతడు అలా ఆలోచించలేదు. సేంద్రియ వ్యవసాయంపై మక్కువతో 15 ఏళ్లపాటు చేసిన ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతూరు వచ్చేశాడు. కుటుంబ సభ్యులతో కలిసి మూడెకరాల్లో సేంద్రియ వరి సాగుకు శ్రీకారం చుట్టాడు. తనలాగే సేంద్రియ పంటలు పండిస్తూ మార్కెటింగ్ చేసుకోలేని రైతులతో చేయి కలిపాడు. 50 మందిని రైతులను కూడగట్టి ‘మన రైతు’ పేరిట సేంద్రియ ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేస్తూ వారికి తోడుగా నిలుస్తున్నాడు కృష్ణా జిల్లా పోరంకికి చెందిన బొల్లికొండ ప్రకాశ్. సొంతూరికి వచ్చేసి.. ప్రకాశ్ ఉన్నత విద్య పూర్తి చేయగానే సాఫ్ట్వేర్ కొలువును అందిపుచ్చుకున్నాడు. వివిధ దేశాలను చుట్టి చివరకు కుటుంబంతో సహా ఆస్ట్రేలియాలో సెటిలయ్యాడు. ఆరంకెల జీతం. హాయిగా గడిచిపోతున్న అతడి జీవితంలో ఏదో వెలితి. తన పిల్లలకు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు తెలియకుండా పోతున్నాయన్న బాధ, సొంతూరికి దూరమైపోయానన్న ఆవేదన ఆయన్ని కలచివేసింది. చివరకు సొంతూరికి వచ్చేసి తన సోదరి వీరంకి ప్రమీల సాయంతో 3 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సేంద్రియ సాగుకు శ్రీకారం చుట్టాడు. చిట్టి ముత్యాలు, సిద్ధసన్నాలు, నారాయణ కామినీ, నవారా వంటి వరి రకాలను సాగు చేయడం మొదలు పెట్టాడు. వాటికి మంచి డిమాండ్ ఏర్పడటంతో సేంద్రియ పద్ధతుల్లో రాజముడి, కాలబట్టి, మైసూర్ మల్లిగ దేశీ, రత్నచోడి, కుజిపటాలియా, బ్రౌన్, సెమీ బ్రౌన్ రైస్ పండిస్తున్న రైతుల నుంచి సేకరించి మార్కెటింగ్ చేయడం ప్రారంభించాడు. చిరు, తృణధాన్యాలు సాగు చేసే రైతులతో కలిసి వారు పండించే గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి మార్కెటింగ్‌కు శ్రీకారం చుట్టారు. ‘మన రైతు’ పేరిట మార్కెటింగ్ చేస్తున్నారు. సొంతంగా వెబ్సైట్, యూట్యూబ్ చానల్ ప్రారంభించి విస్తృత ప్రచారం చేస్తున్నారు. తాజాగా గేటెడ్ కమ్యూనిటీస్, అపార్టుమెంట్స్‌లో స్టాల్స్ ఏర్పాటు చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం సేంద్రియ వ్యవసాయంపై మక్కువతోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి వచ్చాను. ఈ రంగంలో ఉన్న రైతులు పండించే ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ చేస్తున్నాను. మార్కెట్ ధర కంటే కనీసం 30 శాతం తక్కువ ధరలకే వీటిని అందిస్తున్నాం. మంచి స్పందన వస్తోంది. – బొల్లికొండ ప్రకాశ్, పోరంకి, కృష్ణా జిల్లా చిన్నప్పటి నుంచీ మక్కువ చిరు ధాన్యాలంటే చిన్నప్పటి నుంచి మక్కువ. మా ఇంటిల్లపాదీ వాటినే తింటాం. ఇప్పుడు సొంతంగా పండిస్తున్నాం. ఆస్ట్రేలియాలో సెటిలైన మా సోదరుడు ప్రకాశ్ ప్రోద్బలంతో మరింత ముందుకు తీసుకెళ్లాలని సంకల్పించా. – వీరంకి ప్రమీల, సేంద్రియ రైతు, పోరంకి, కృష్ణా జిల్లా -
లేఆఫ్స్ దారుణం.. ఒకటీ రెండు కాదు.. నాలుగు సార్లు పీకేశారు!
టెక్ కంపెనీల్లో లేఆఫ్‌ల పరంపరకు అడ్డుకట్ట పడటం లేదు. కొన్నేళ్ల క్రితమే మొదలైన తొలగింపులు ఇటీవల ఎక్కువయ్యాయి. కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. అయితే ఒకసారి లేఆఫ్‌కు గురై ఉద్యోగం కోల్పోతేనే జీవనం దుర్భరంగా మారుతుంది. మరి చేరిన ప్రతి కంపెనీ ఉద్యోగం పీకేస్తే.. ఒకటీ, రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు..(ప్రాపర్టీ కొంటున్నారా? ఈ జాగ్రత్తలు లేకుంటే రిస్కే!)బిజినెస్ ఇన్సైడర్ కథనంప్రకారం... కాలిఫోర్నియాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్, 33 ఏళ్ల జానెట్ అన్నే పనెన్ తన టెక్ కెరీర్లో వరుసగా నాలుగుసార్లు లేఆఫ్స్‌కు గురై ఉద్యోగాలు కోల్పోయారు. ఆమె మొదటి ఉద్యోగం రెడ్డిట్‌లో రెండు నెలల పాటు సోషల్ మీడియా అసిస్టెంట్‌గా చేశారు. ఆ కంపెనీ ఆమెతో పాటు మొత్తం బృందాన్ని తొలగించింది. ఆ తర్వాత ఆమె ఉబర్ హెచ్ఆర్ విభాగంలో ఉద్యోగం సంపాదించగలిగింది. అయితే అక్కడ రెండేళ్లు పని చేసిన తర్వాత కంపెనీ ఆమెకు పింక్ స్లిప్ అందజేసింది. ఆ తర్వాత ఆమె డ్రాప్‌బాక్స్ కంపెనీలో సపోర్ట్ ఇంజనీర్‌గా చేరారు. రెండేళ్ల తర్వాత ఆ కంపెనీ ఆమెను తొలగించింది. గత వారమే స్నాప్డాక్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేరింది. ఇంతలోనే నాలుగో ఉద్యోగం కూడా పోయింది.(త్వరలోనే యాపిల్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. భారత్ రానున్న టిమ్‌కుక్!)తన లేఆఫ్స్ గురించి పనెన్ భావోద్వేగంతో పేర్కొన్నారు. మొదటిసారి తనను తొలగించినప్పుడు చాలా బాధపడ్డానని చెప్పిన ఆమె మూడో సారి అయితే తనతో పనిచేసిన బృందాన్ని వీడుతున్నందుకు మనసుకు చాలా కష్టంగా ఉండిందని వివరించారు. ఇక తాజాగా నాలుగో సారి లే ఆఫ్‌తో తన ఆర్థిక పరిస్థితి దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.టెక్ దిగ్గజాలు అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సంవత్సరం ఒక్క మెటా, అమెజాన్, గూగుల్ కంపెనీలు మాత్రమే 60,000 మంది ఉద్యోగులను తొలగించాయి. 2022లో 11,000 ఉద్యోగాల తొలగింపును ప్రకటించిన మెటా ఇటీవల మరో 10,000 మందిని తొలగించింది. అమెజాన్ కూడా రెండు రౌండ్లలో 27,000 మందికి ఉద్వాసన పలికింది. ఇక గూగుల్ 12,000 మందిని తప్పుకోవాలని ఆదేశించింది.(జీతం నుంచి టీడీఎస్ మినహాయింపు.. ఐటీ శాఖ కీలక ఆదేశాలు) -
టీడీపీ సర్పంచ్ చేతిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సజీవ దహనం
చంద్రగిరి (తిరుపతి జిల్లా): టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ నేతలు మరోసారి బరితెగించారు. ఇటీవల కుప్పం, పుంగనూరు తదితర ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతలు, పోలీసులపై టీడీపీ మూకల దాడులను మరిచిపోకముందే మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. అన్నెంపున్నెం ఎరుగని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై పెట్రోల్ పోసి అతడి కారుతో సహా సజీవ దహనం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు చాణక్య ప్రతాప్, రుపంజయ తిరుపతి టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సొంత అల్లుడు సంజీవ్‌కు స్వయానా బాబాయి కుమారులే కావడం గమనార్హం. అంతేకాకుండా టీడీపీ సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పరిటాల శ్రీరామ్‌లతోనూ నిందితులకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్ చౌదరితోనూ పరిచయాలు ఉన్నాయి. రాజీ పేరుతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పిలిపించి అతడిని టీడీపీ అధినేత చంద్రబాబు అనుచరుడు చాణక్య ప్రతాప్ సజీవ దహనం చేసిన ఘటన శనివారం అర్ధరాత్రి కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన జయరామయ్య, చెంచెమ్మ దంపతులకు నాగరాజు, పురుషోత్తం కుమారులు. వీరిద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు.ఈ క్రమంలో బ్రాహ్మణపల్లి టీడీపీ సర్పంచ్ చాణక్య ప్రతాప్ తమ్ముడు రుపంజయ భార్యతో పురుషోత్తం వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రుపంజయ ఎలాగైనా పురుషోత్తంను మట్టుపెట్టాలని నిర్ణయించాడు. ఈ విషయం తెలుసుకున్న నాగరాజు తన తమ్ముడు పురుషోత్తంను బెంగళూరుకు పంపించేశాడు. హతమార్చడానికి పలుమార్లు ప్రయత్నం టీడీపీ సర్పంచ్ చాణక్య ప్రతాప్, అతడి తమ్ముడు రుపంజయ.. నాగరాజు కుటుంబంపై కక్ష సాధింపులకు పాల్పడ్డారు. నాగరాజు తన పొలం వద్ద ఏర్పాటు చేసిన పైపులను పగలకొట్టడం, చెట్లు నరికివేయడం, మోటార్లను కాల్చివేయడం వంటివి చేసి టీడీపీ నేతలు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. నాగరాజు తమ్ముడు పురుషోత్తంను హతమార్చాలని పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ క్రమంలో వివాదాన్ని పరిష్కరించుకుందామని తిరుపతి అవిలాలలో నివాసం ఉంటూ వర్క్‌ఫ్రమ్ హోం చేసుకుంటున్న నాగరాజును గోపి అనే వ్యక్తితో పిలిపించారు. దీంతో శనివారం సాయంత్రం నాగరాజు తన కారులో స్వగ్రామం బ్రాహ్మణపల్లి వెళ్లాడు. అక్కడ టీడీపీ సర్పంచ్ చాణక్య ప్రతాప్, రుపంజయ, వారి అనుచరులు గోపి, సుబ్బయ్యతోపాటు మరికొంతమంది నాగరాజుతో మాట్లాడారు. ఆ తర్వాత శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో గంగుడుపల్లి సమీపంలోని కురవకణం మలుపు వద్దకు తీసుకెళ్లి నాగరాజు కారులోనే అతడిని పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు. ఈ ఉదంతం తెలుసుకున్న ఏఎస్పీ వెంకటరావు, వెస్ట్ డీఎస్పీ నరసప్ప, సీఐ ఓబులేసు ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య మధుమతి ఫిర్యాదు మేరకు చాణక్య ప్రతాప్, రుపంజయ, గోపి, సుబ్రహ్మణ్యంతో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. అయితే ప్రధాన నిందితుడు రుపంజయను పోలీసులు అదుపులోకి తీసుకుని, రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు టీడీపీ నేతల హస్తం! కాగా నాగరాజు హత్యలో రామచంద్రాపురం మండలానికి చెందిన ఇద్దరు టీడీపీ నేతల హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అందులో ఒకరు మాజీ మంత్రి, టీడీపీ నేత గల్లా అరుణకుమారికి అత్యంత సన్నిహితుడిగా చెబుతున్నారు. హత్యకు పాల్పడిన చాణక్య ప్రతాప్ టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో ఆ ఇద్దరు నేతలు హత్యకు సంపూర్ణ సహకారం అందించినట్లు సమాచారం. -
Shailesh Modak: సాఫ్ట్వేర్ జాబ్ వదిలి లక్షల్లో సంపాదిస్తున్నాడు.. ఇలా!
జీవితంలో ఎదగాలంటే ఏదో ఒక పని చేయాలి, చేస్తూనే ఉండాలి. అయితే కొంతమంది కొన్ని సందర్భాల్లో తాము చేస్తున్న ఉద్యోగాలు వదిలి స్వయం ఉపాధి (వ్యవసాయ రంగంలో) ప్రారంభిస్తున్నారు. అలా ప్రారంభించి విజయం పొందినవారి జాబితాలో 'శైలేష్ మోదక్' ఒకరు. ఇంతకీ ఇతడు ఏ ఉద్యోగం చేసాడు, ఎందుకు వదిలేసాడనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం. పూణేకి చెందిన శైలేష్ మోదక్ ఒక కార్పొరేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తూ బాగానే సంపాదించేవాడు. అయితే ఉద్యోగం వదిలి ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో వ్యవసాయ రంగంలోకి అడుగు పెట్టాడు. హైడ్రోపోనిక్స్, ప్రకృతి పట్ల ఉన్న ప్రేమతో కొత్త ప్రయోగాలను చేయడం మొదలుపెట్టాడు. ప్రారంభంలో ఉద్యోగం చేస్తూనే తన కొత్త వ్యాపారం ప్రారంభించారు. ఇందులో భాగంగానే పరాగసంపర్కం కోసం తేనెటీగలు అద్దెకు ఇవ్వడం మొదలు పెట్టినప్పటికీ తన ఆలోచన ఫలించలేదు. తరువాత వ్యవసాయం గురించి బాగా తెలుసుకుని 2016లో ఉద్యోగం వదిలి పూర్తి సమయం వ్యాపారానికే కేటాయించాడు. (ఇదీ చదవండి: Bug in Uber: ఉబర్‌లో ఫ్రీ రైడింగ్ సర్వీస్.. ఇండియన్ హ్యాకర్‌కి రూ.4.6 లక్షల రివార్డ్!) తరువాత అతి కాలంలోనే ఖరీదైన 'కుంకుమ పువ్వు' సాగుచేయాలని దానికి కావలసిన సన్నాహాలు సిద్ధం చేసుకున్నాడు. క్రమంగా ఈ రోజు షిప్పింగ్ కంటైనర్లలో కుంకుమ పువ్వు పండించి లక్షలు సంపాదించగలిగాడు. కంటైనర్‌లో పంటలకు అనుకూలమైన వాతావరణాన్ని తయారు చేయడానికి అతను వివిధ హైటెక్ పరికరాలను ఉపయోగించడమే కాకుండా, కాశ్మీర్‌లోని పాంపోర్ నుంచి సేకరించిన ప్రీమియం క్రోకస్ కార్మ్స్/బల్బుల సహాయంతో కుంకుమపువ్వు పండిస్తూ మరి కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. -
హైదరాబాద్‌లో విషాదం.. సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబం శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. కుషాయిగూడలోని కందిగూడలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబం విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటనలో దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు మృతిచెందారు. ఆత్మహత్యకు పాల్పడిన వారిని సతీష్, వేద, నిషికేత్, నిహాల్‌లుగా గుర్తించారు. పిల్లల అనారోగ్య కారణాలతో ఆ సాష్ట్‌వేర్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. -
Hyderabad: సాఫ్ట్వేర్ యువకుడికి కుచ్చుటోపి.. ఇన్వెస్ట్మెంట్ పేరుతో 30 లక్షలు..
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి సైబర్ నేరగాళ్లు భారీ మొత్తంలో డబ్బు కాజేశారు. సైబర్ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సార్ నగర్‌కు చెందిన శివ అనే యువకుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో ఆన్లైన్ బెట్టింగ్ వైపు మళ్లాడు. ఆన్లైన్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి చెప్పిన విధంగా వెగాస్–11 బెట్టింగ్ అనే యాప్‌లో ఏడాదిన్నరగా బెట్టింగ్ చేస్తున్నాడు. బెట్టింగ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ వైపు మళ్లించి అతడి నుంచి రూ.30 లక్షలు కాజేశారు. మరో ఘటనలో.. మలక్‌పేటకు చెందిన యువతి స్టడీ టేబుల్ అమ్మేందుకు ఓఎల్ఎక్స్లో యాడ్ పోస్ట్ చేసింది. దానిని చూసిన నేరగాడు స్టడీ టేబుల్ కొంటానని నమ్మించి క్యూఆర్ కోడ్లు పంపి పలు దఫాలుగా రూ.14 లక్షలు స్వాహా చేశాడు. ఇలా ఇద్దరి నుంచి సైబర్ నేరగాళ్లు మొత్తం రూ.44 లక్షలు కాజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. -
Shelma Sahayam: రెండు ప్రపంచాల మధ్య...
రెండు ప్రపంచాల మధ్య సంచరించే షెల్మకు... మొదటి ప్రపంచంలో కనిపించే సాంకేతిక అద్భుతాలు అంటే ఎంత ఇష్టమో రెండో ప్రపంచంలో కనిపించే కాల్పనిక కథలు అంతే ఇష్టం. సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ షెల్మ సహాయం రాసిన పుస్తకం ‘ది ల్యాండ్ ఆఫ్ అటరాక్సియా: జెనిసిస్’ గత నెల గోల్డెన్ బుక్ అవార్డ్(ఉరుగ్వే) గెలుచుకుంది. తాజాగా గ్లోబల్ పబ్లిషింగ్ హౌజ్, ఎక్స్సెల్లర్ ఎక్స్‌లెన్స్ ఇంటర్నేషనల్ అవార్డ్ (ఇండియా)కు ఎంపికైంది... చెన్నైలో... చిన్న వయసులోనే కలం పట్టింది షెల్మ. ప్రైమరీ స్కూల్లో గాంధీజీపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. షెల్మ ఈ పోటీలో పాల్గొంది. అయితే తనకు ఆ మహాత్ముడి గురించి పెద్దగా తెలియదు ‘రకరకాల ఆయుధాలు ఉపయోగించి, బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడారు’ అని రాసింది. ఇది గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటికీ ఇబ్బందిగా ఉండడం మాట ఎలా ఉన్నా... ఆ వ్యాసరచనే తన తొలి రచన! అయితే ఆ తరువాత కాలంలో ఎన్నో పుస్తకాలు చదవడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవడంతోపాటు రచనలు చేయడంపై ఆసక్తి పెరిగింది. ‘నేను భవిష్యత్‌లో రచయిత్రిని కావాలనుకుంటున్నాను’ అని షెల్మ అన్నప్పుడు చాలాముంది ముఖం మీదే నవ్వారు. ‘ఇంజినీర్ కావాలనేది నా కల’ అన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే. ఇలాంటి సమయాల్లో బాబీ ఆంటీ తనకు ఎంతో శక్తి ఇచ్చేది. షెల్మ దృష్టిలో తాను పవర్ఫుల్ ఉమెన్. ‘వారు నీ గురించి ఏం అనుకుంటున్నారనేది ముఖ్యం కాదు. నీకు నీ మీద ఎంత నమ్మకం ఉందనేది ముఖ్యం’ అని చెప్పేది. ఆంటీ ఇచ్చిన ఆత్మవిశ్వాస బలంతో చిన్న చిన్న రచనలు చేసి ఇంట్లో వినిపించేది. తండ్రి మెర్సిలిన్బాబు, తల్లి మేరీ శాంతి, చెల్లెళ్లు స్నేహ, రీతూలు ప్రోత్సాహకంగా మాట్లాడేవారు. ‘నాకు డిప్రెషన్‌గా అనిపించినప్పుడు పేపర్, పెన్ను అందుకొని ఏదో ఒకటి రాస్తుంటాను. అప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది’ అంటున్న షెల్మ ‘ఎస్ఎస్ మెర్సె’ కలం పేరుతో ‘ది ల్యాండ్ ఆఫ్ ఆటరాక్సియా: జెనిసిస్’ అనే తొలి ఫాంటసీ థ్రిల్లింగ్ నవల రాసింది. దీనికి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. వీడియోగేమ్స్ ఇష్టపడే యువతరాన్ని కూడా ఈ నవల ఆకట్టుకుంది. తాను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు ఈ నవలకు బీజం పడింది. అయితే అక్షరాల్లో కాకుండా తన మనసులోనే రాసుకుంటూ వస్తోంది. ఎడిట్ చేసుకుంటూ వస్తుంది. తాను చిన్నప్పుడు విన్న ఎన్నో జానపదకథలు, చదివిన పుస్తకాలు ఈ పుస్తకం రాయడానికి స్ఫూర్తిని ఇచ్చాయి. తప్పిపోయిన తమ ఫ్రెండ్ సినన్ను వెదుక్కుంటూ కెప్టెన్ మెగెలాన్ అతని బృందం చేసిన ప్రయాణమే ఈ నవల. కెప్టెన్ బృందం చివరికి ఒక మాంత్రిక ప్రపంచంలోకి వెళుతుంది. అక్కడ వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది నవల సారాంశం. ‘ద ల్యాండ్ ఆఫ్ అటరాక్సియా’ ఇచ్చిన ఉత్సాహంతో షెల్మ సహాయం మరిన్ని రచనలు చేయాలనుకుంటోంది. -
Hyderabad: ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదని..
సాక్షి, మియాపూర్: ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదని, తన నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిందని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ నాగేశ్వర్రావు వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండలం ఆరూర్ గ్రామానికి చెందిన చెల్మెడ అఖిల్(28) పటాన్‌చెరులోని శ్రీనగర్‌కాలనీలో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ నెల 16న చందానగర్‌లోని ఓయో హోటల్లో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉన్నాడు. మరుసటి రోజు ఎంతకూ అఖిల్ బయటకు రాకపోవడంతో యాజమాన్యం కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గదిలో పరిశీలించగా అతడి మెయిల్లో ఓ సూసైడ్ నోట్‌ను గుర్తించారు. అందులో ‘ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని.. గత కొన్ని రోజులుగా తనతో మాట్లాడకుండా తన ఫోన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిందని.. అందుకే సూసైడ్ చేసుకుంటున్నానని.. రాసి ఉంది. మృతుడి సోదరుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లి కోరిక.. లక్ష రూపాయల జీతం వదిలి స్కూటర్‌పై
సాక్షి,నిజామాబాద్: అమ్మకోసం లక్ష రూపాయల జీతం వదిలిపెట్టి తండ్రి స్కూటర్‌పై తల్లితో తీర్థయాత్రలకు బయలుదేరాడు ఓ కొడుకు. యాత్రలో భాగంగా సోమవారం తల్లీకొడుకులు నిజామాబాద్‌కు చేరుకున్నారు. కర్ణాటక రాష్ట్రం మైసూర్‌కు చెందిన దక్షిణామూర్తి కృష్ణకుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు. తల్లికి చిన్నప్పటి నుంచి దేశంలోని పుణ్య క్షేత్రాలన్నీ చూడాలని కోరిక. దీంతో ఆమె కుమారుడు ఉద్యోగం వదులుకుని తండ్రి జ్ఞాపకార్థంగా ఉంచుకున్న స్కూటర్‌పై 2018 జనవరి 16న తీర్థయాత్ర మొదలుపెట్టాడు. ఇప్పటివరకు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గడ్, జార్ఖండ్, పశి్చమ బంగ్లా, సిక్కిం, గోవా, కేరళ, మేఘలయా, త్రిపుర, మణిపూర్, మిజోరాం, నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాలలో పుణ్యక్షేత్రాలను తల్లికి చూపించాడు. తల్లి కోరికను నెరవేరుస్తున్న కొడుకు ప్రేమను.. చూసిన వారు మెచ్చుకుంటున్నారు. చదవండి: Love Marriage: మాచారెడ్డి అబ్బాయి వెడ్స్ అమెరికా అమ్మాయి -
మంచి జీతం, సాఫ్ట్వేర్ ఉద్యోగం.. జల్సాలకు అలవాటు పడి కక్కుర్తితో
సాక్షి ,బంజారాహిల్స్: మంచి జీతం , సాఫ్ట్వేర్ ఉద్యోగం అయినా జల్సాలకు అలవాటు పడి, జీతం సరిపోకపోవడంతో ఓ వ్యక్తి గంజాయి విక్రేతగా మారాడు. వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్‌లోని ఛత్రపతి శివాజీనగర్‌కు చెందిన రాంతీర్థ్ దేవానంద్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన అతను గంజాయికి బానిసయ్యాడు. జీతం సరిపోకపోవడంతో తానే గంజాయి విక్రయాలు చేపట్టాడు. ఈ నెల 7న అతను ఫిలింనగర్లో గంజాయి సరఫరాదారు రాజుసింగ్ నుంచి రెండు కేజీల గంజాయి ప్యాకెట్‌ను తీసుకుంటూ పట్టుబడ్డాడు. తరచూ ఇదే ప్రాంతంలో దేవానంద్‌కు అతను గంజాయి తెచ్చిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో నిఘా వేసిన పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి 4.3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరిపై ఎన్డీపీఎస్ యాక్ట్ నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: పుట్టుమచ్చలు చూపాలంటూ వేధింపులు -
నవ వధువుది ఆత్మహత్యే..
ఖలీల్‌వాడి: ఈ నెల 2న నిజామాబాద్ సుభాష్‌నగర్‌లోని సుధా హైట్స్ అపార్ట్మెంట్ పైనుంచి పడి చనిపోయిన పూర్ణిమ (26)ది ఆత్మహత్యే నని టౌన్ సీఐ వెంకట నారాయణ తెలిపారు. భర్త వేధింపులు తాళలేక ఆమె బలవన్మరణానికి పాల్పడిందని, భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. వివరాలివి.. రెండు నెలల క్రితం హమాల్వాడికి చెందిన పూర్ణిమకు, విశాల్‌తో వివాహం జరిగింది. పూర్ణిమ ఐటీసీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూ.. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోంలో భాగంగా ఇంట్లోనే ఉంటోంది. భర్త విశాల్ బిల్డింగ్ కాంట్రాక్ట్ వ్యాపారం చేస్తున్నాడు. పెళ్లయిన రెండు నెలల్లోపే.. పూర్ణిమ నివసిస్తున్న అపార్ట్మెంట్ ఐదో అంతస్తు పైనుంచి పడి చనిపోవడంపై.. ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు మూడో టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొదట ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం జరిపిన విచారణలో పూర్ణిమను భర్త విశాల్ వేధించేవాడని వెల్లడైంది. అపార్ట్మెంట్లోని సీసీ ఫుటేజ్, చుట్టుపక్కల వారిని విచారించాక ఆమెది ఆత్మహత్యగా నిర్ధారించి.. భర్తపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
మేనమామ వేధింపులే కారణం..!
నిజామాబాద్ : మేనమామ వేధింపుల కారణంగానే కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని అభిజ్ఞగౌడ్(23) ఆత్మహత్య చేసుకుంది. తనకు వరుసకు మేనమామ అయిన నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం డొంకేశ్వర్‌కు చెందిన సందీప్‌గౌడ్ మానసికంగా వేధించడంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మృతురాలు సూసైడ్ నోట్లో పేర్కొంది. తాటిపాముల కిరణ్ కుమార్‌గౌడ్, స్వప్నల కుమార్తె అభిజ్ఞగౌడ్ సాఫ్ట్వేర్ కంపెనీలో హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. ప్రస్తు తం ఆమె కామారెడ్డిలో స్థిరపడిన తల్లిదండ్రుల వద్ద ఉంటూ వర్క్‌ఫ్రం హోమ్‌గా విధులు నిర్వహించేది. అభిజ్ఞ కామారెడ్డి లోని ఇంట్లో గురువారం ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకుంది. మేనమామ మానసిక వేధింపులు ఎవ్వరికీ చెప్పుకోలేక పోయానని సూసైడ్ నోట్లో పేర్కొంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కామారెడ్డి నుంచి భిక్కనూరుకు శుక్రవారం తీసుకొచ్చారు. మధ్యాహ్నం గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. -
క్యాబ్ బుకింగ్ ఫెయిలైందా? ఫార్మింగ్ ఎటాక్‌తో మనీ గోవిందా!ఈ స్టోరీ చూడండి!
సాక్షి, ముంబై: సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అంతులేకుపోతోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎక్కడో ఒక చోట మోసానికి పాల్పడి దోచుకున్నారు. తాజాగా ఆన్లైన్లో క్యాబ్ బుక్ చేస్తూ ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ కేటుగాళ్లకు వలలో చిక్కారు. టట్రావెల్ ఏజెంట్ చేతిలో మోసపోయి రూ2లక్షలు పోగొట్టుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. వివరాల్లో వెళితే మహారాష్ట్రకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ నాసిక్‌కు వెళ్లేందుకు ట్రావెల్ ఏజెన్సీ వెబ్సైట్లో క్యాబ్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ టెక్నికల్ లోపం కారణంగా బుకింగ్ ఫెయిల్ అయింది.అయితే అతను ట్రావెల్ ఏజెన్సీ వెబ్సైట్లో ఉన్న ఈ-మెయిల్‌ను సంప్రదించాడు. అదే అతను చేసిన పొరపాటు. కొద్దిసేపటి తర్వాత ట్రావెల్ కంపెనీ ఏజెంట్ రజత్ అని అంటూ ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. బుకింగ్ కోసం మరోసారి వెబ్సైట్లో రూ.100 చెల్లించాలని,ప్రయాణానికి సంబంధించి మిగతా మొత్తాన్ని తర్వాత చెల్లించ వచ్చని నమ్మబలికాడు. ఈ క్రమంలో బాధితుడు మరోసారి డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నించాడు. వెబ్సైట్లో సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు ఈ సారి ఇగ్నోర్ చేశాడు. కానీ భయపడినంతా జరిగిపోయింది. గంటల వ్యవధిలో అతని క్రెడిట్‌కార్డు నుంచి రూ.2లక్షలకు పైగా డెబిట్ అయిపోయాయి. క్రెడిట్‌కార్డు నుంచి రూ.81,400, రూ.71,085, రూ.1.42లక్షలు డెబిట్ అయినట్లుగా మొబైల్‌కు మెస్సేజ్‌లు వచ్చాయి. వెంటనే కస్టమర్ కేర్‌ను సంప్రదించడంతో బాధితుడు తన రూ. 71,085ని పోకుండా అడ్డుకోగలిగాడు. కానీ మిగిలిన రూ. 2.2 లక్షలను పోగొట్టుకున్నాడు. వెంటనే తేరుకొని బ్యాంకు కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి క్రెడిట్‌కార్డులను బ్లాక్ చేయించాడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన పోలీసులుఫార్మింగ్ సైబర్ దాడి అని పేర్కొన్నారు. వెబ్సైట్, కంప్యూటర్ డీఎన్ఎస్ సర్వర్‌ని నేరుగా వినియోగదారులను ఫేక్ వెబ్‌సైట్‌కు మళ్లించి, ఫిషింగ్ లింక్‌పై క్లిక్ చేయకపోయినా, నకిలీ వైబ్సైట్ల ద్వారా పాస్వర్డ్లు, క్రెడిట్‌కార్డుల నంబర్లు తదితర రహస్య డేటాను హ్యాకర్లు సేకరిస్తారని.. ఆ తర్వాత చెల్లింపు చేసే సమయంలో సాంకేతిక సమస్య ఉన్నట్లుగా చూపించి మోసానికి తెగబడతారిని సాఫ్ట్వేర్ ఇంజినీర్ కేసులోనూ ఇదే జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. విచారణ కొనసాగుతోందన్నారు. ఫార్మింగ్ సైబర్ ఎటాక్ అంటే? ఫార్మింగ్ సైబర్‌దాడులు ఫిషింగ్ ఎటాక్స్ కంటే ప్రమాదకరమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే ఎవరైనా ఫిషింగ్ లింక్‌పై క్లిక్ చేయకపోయినా, రియల్ వెబ్సైట్ ద్వారా సెర్చ్ చేసినా, యూజర్లకు తెలియకుండానే హ్యాక్ చేస్తారు. అంటే వెబ్సైట్ లేదా కంప్యూటర్ DNS (డొమైన్ నేమ్ సిస్టమ్) సర్వర్‌ని నేరుగా వినియోగదారులను ఫేక్ లేదా హానికరమైన వెబ్‌సైట్‌కి మళ్లిస్తారని, దీంతో గుర్తించడం కష్టమని పేర్కొన్నారు. ఫార్మింగ్ సైబర్ దాడిలో బాధితులు చేసేది ఏమీ ఉండదని తెలిపారు. సైబర్ దాడులను తప్పించుకునేందుకు అనుమానాస్పద వెబ్సైట్లలో లింక్‌లను క్లిక్ చేయడం, డౌన్లోడ్ చేయడం లాంటివి మానుకోవాలని, అలాగే ఎప్పటికప్పుడు కంప్యూటర్లలో సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకుంటూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. -
గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. 20వ అంతస్తు నుంచి దూకిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
నోయిడా: గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవపడి అపార్ట్మెంట్ 20వ అంతస్తు నుంచి దూకేశాడు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నోయిడాలోని సెక్టార్ 168 హై రైస్ సొసైటీలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. హరియాణా సోనిపత్‌కు చందిన ఈ టేకీ వయసు 26 ఏళ్లు. బెంగళూరులోని ఓ ఐటీ సంస్థలో ఊద్యోగం చేస్తున్నాడు. చండీగఢ్‌కు చెందిన యువతిని(25) కలిసేందుకు నోయిడా వెళ్లాడు. ఆన్లైన్ యాప్ ద్వారా ఈ రూం బుక్ చేసుకున్నారు. అయితే ఏదో విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో సెక్యూరిటీ గార్డుతో మాట్లాడేందుకు యువతి కిందకు వెళ్లింది. ఈ సమయంలోనే 20వ అంతస్తు నుంచి టేకీ కిందకు దూకేశాడు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కెఫే టేబుల్స్‌పై పడ్డాడు. దీంతో ఆ టేబుల్స్ విరిగిపోయాయి. అక్కడ భోజనం చేస్తున్న ఓ మహిళకు గాయాలు కూడా అయ్యాయి. అక్కడున్నవారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఇద్దరూ గురువారం రోజే ఆపార్ట్మెంట్కి వచ్చారని పోలీసులు చెప్పారు. కలిసి మద్యం కూడా తాగారని పేర్కొన్నారు. ఆయితే శుక్రవారం రోజు గర్ల్‌ఫ్రెండ్ తన స్నేహితురాలిని కూడా అపార్ట్‌మెంట్‌కు పిలిచింది. సాయంత్రం 5 గంటల తర్వాత ఆమె తిరిగి వెళ్లిపోయింది. దీంతో మరో యువతిని అపార్ట్‌మెంట్‌కు ఎందుకు పిలిచావని సాఫ్ట్వేర్ ఉద్యోగి తన గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవపడ్డాడు. ఈ విషయంపైనే ఇద్దరి మద్య వాగ్వాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆమె అతడికి బాల్య స్నేహితురాలని పేర్కొన్నారు. అతను త్వరలో విదేశాలకు వెళ్లాలనుకుంటున్నాడని, అందుకే ఓసారి స్నేహితురాలిని కలవాలనుకున్నాడని వివరించారు. చదవండి: భార్యకు భారం కాకూడదని భర్త అఘాయిత్యం.. పెద్దకూతురు ప్రాణాలు కాపాడిన హోంవర్క్ -
‘సాఫ్ట్’గా వ్యవసాయం..కష్టమన్నదే తెలియని సాగు
శరీర కష్టం స్ఫురింపజేసే వ్యవసాయాన్ని తన మేథోశక్తితో చాలా నాజుకుగా మార్చేశాడు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఆడుతూ.. పాడుతూ.. శరీర కష్టమనేది తెలియకుండా పంటల సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచాడు. అంతేకాక పంట దిగుబడులను నేరుగా ఆన్లైన్ ద్వారా విక్రయాలు చేపట్టి దళారీ వ్యవస్థకు మంగళం పాడాడు. సరికొత్త ఆలోచనతో వ్యవసాయాన్ని సుసంపన్నం చేసిన భువనేశ్వర చక్రవర్తి విజయ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, బెళుగుప్ప: మండలంలోని తగ్గుపర్తి గ్రామానికి చెందిన దబ్బర నారాయణస్వామి, నిర్మల దంపతుల కుమారుడు భువనేశ్వర చక్రవర్తి.. బెంగళూరులోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ ప్రతి నెలా ఐదంకెల జీతం అందుకుంటున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వర్క్‌ఫ్రమ్ విధానం ద్వారా ఇంటి వద్ద నుంచి పనిచేసే అవకాశం దక్కింది. ఈ క్రమంలో తగ్గుపర్తికి చేరుకున్న భువనేశ్వర చక్రవర్తి... పంటల సాగులో తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసి, చలించిపోయాడు. ఏదైనా చేసి శరీర కష్టం తెలియని వ్యవసాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావించాడు. నల్లరేగడిలో పసిడి పంట తమకున్న 16 ఎకరాల నల్లరేగడిలో సంప్రదాయ పంటలనే సాగు చేస్తూ నష్టాలను చవిచూస్తున్న తరుణంలో భువనేశ్వర ప్రసాద్ పంటల సాగుపై దృష్టి సారించాడు. అదే సమయంలో తండ్రి ఆకస్మిక మరణం ఆ కుటుంబాన్ని కుంగదీసింది. తీవ్ర వేదనలో ఉన్న తల్లి నిర్మలకు భువనేశ్వర్ అండగా ఉంటూ తనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నల్లరేగడిలో బంగారు పంటలు పండించే మార్గాలను అన్వేషించాడు. ఆన్లైన్ అన్వేషణ ఫలించింది. మహారాష్ట్ర నుంచి భగువ రకం దానిమ్మ మొక్కలను తెప్పించి 2020లో ఆరు ఎకరాల్లో నాటాడు. విడతల వారీగా ఏడాది పొడవునా పంట దిగుబడి వచ్చేలా ప్రణాళిక రచించి మొత్తం 16 ఎకరాల్లో దానిమ్మ మొక్కలు నాటాడు. 2021లో 11 నెలలకే కాపు కాసిన దానిమ్మ పంట తొలి కాపులోనే ఆరు ఎకరాల్లో 26 టన్నుల దిగుబడి సాధించాడు. టన్ను రూ.60 వేలు నుంచి రూ.70 వేల వరకూ విక్రయించగా రూ.18 లక్షల ఆదాయం సమకూరింది. పెట్టుబడులకు రూ.4 లక్షలు పోను రూ.14 లక్షల నికర లాభం ఆర్జించాడు. అనంతరం ఆన్లైన్ యాప్‌ను రూపొందించి 2022లో మరో ఆరు ఎకరాల్లో కాపు కాసిన దానిమ్మను సొంతంగా బెంగళూరులోని పలు అపార్ట్మెంట్లలో నివాసముంటున్న వారికి సొంతంగా విక్రయించాడు. కిలో రూ.100 చొప్పున ఒక్కో అపార్ట్‌మెంట్‌కు వంద నుంచి 200 కిలోల వరకు బుక్ చేసుకుని ఐదు నుంచి పది కిలోల చొప్పున బాక్స్‌లను తోటలోనే ప్యాక్ చేయించి ఆర్టీసీ కార్గో సేవల ద్వారా బెంగళూరుకు తరలించేవాడు. రెండో విడత కాపులో 16 టన్నుల దిగుబడి సాధించి టన్ను రూ.90 వేల నుంచి రూ.1.10 లక్షల వరకూ విక్రయించాడు. ఈ లెక్కన రూ.16 లక్షల ఆదాయాన్ని గడించాడు. ఓ వైపు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే మరో వైపు తల్లికి చేదోడుగా నిలిచి పది మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్నాడు. సూర్యరశ్మిని ఒడిసిపట్టి పంటల సాగుకు అవసరమైన నీటిని అందించేందుకు సంప్రదాయ విద్యుత్తును కాకుండా సౌరశక్తిపై భువనేశ్వర చక్రవర్తి ఆధారపడ్డాడు. సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకుని సూర్యరశ్మిని ఒడిసిపట్టడం ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తుతో 16 ఎకరాల్లోని దానిమ్మ తోటకు బిందు సేద్యం ద్వారా నీటి తడులు అందిస్తూ వస్తున్నాడు. వన్యప్రాణుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు రాత్రిళ్లు వివిధ రకాల శబ్దాలు వచ్చేలా తోటలో స్పీకర్లు అమర్చాడు. పంటను ఆశించే పండు ఈగలకు సోలార్లైట్తో ఎరలను ఏర్పాటు చేసాడు. దానిమ్మ పూలు మొత్తం ఫలదీకరణం చెందడానికి తోటలోనే తేనెటీగల పెంపకం చేపట్టాడు. దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన ఫసల్(ఎఫ్ఏఎస్ఏఎల్) యంత్రాన్ని రూ.50,000 ఖర్చుతో తోటలో అమర్చాడు. ఈ యంత్రానికి 13 రకాల సెన్సార్లు ఏర్పాటు చేసి శాటిలైట్ కనెక్టివిటితో వర్షసూచన, నేలలో తేమశాతం, పంటను ఆశించిన తెగుళ్లు, ఇతర సమాచారాన్ని తెలుసుకుంటున్నాడు. ఏడాది మొత్తం దిగుబడే వ్యవసాయ కూలీలతో పంటలో సస్యరక్షణ చర్యలు చేపడుతుంటాను. నా కుమారుడి ఆలోచన వల్ల ఏడాది పొడవునా దానిమ్మ పంట చేతికందుతోంది. గతంలో పంటసాగుకు చాలా కష్టపడేవాళ్లం. ఇప్పుడా శ్రమ లేకుండా పోయింది. – నిర్మల, మహిళా రైతు, తగ్గుపర్తి దళారీ వ్యవస్థ ఉండరాదు పెద్ద కంపెనీలు సైతం దళారులతోనే పంట దిగుబడులను కొనుగోలు చేస్తున్నాయి. దీంతో పంట పండించిన రైతుకు కష్టం తప్ప ఆదాయం ఉండడం లేదు. దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం రైతు సంఘాలను ఏర్పాటు చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. రైతులతో కంపెనీ ప్రతినిధులు నేరుగా సంప్రదించి పంట కొనుగోలు చేస్తే అన్నదాత కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. – భువనేశ్వర చక్రవర్తి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, తగ్గుపర్తి గ్రామంలోనే ఉపాధి భువనేశ్వర చక్రవర్తి సాగు చేసిన దానిమ్మ తోటలో నాతో పాటు మరో ఎనిమిది మంది కూలి పనులకు వెళుతుంటాం. ఏడాది పొడువునా మాకు పని ఉంటుంది. మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతోంది. – ప్రసాద్, వ్యవసాయ కూలీ, తగ్గుపర్తి గ్రామం (చదవండి: వధువు కావాలా.. నాయనా?) -
వర్క్ ఫ్రం హోం.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
బొమ్మనహాళ్(అనంతపురం జిల్లా): పని ఒత్తిడి భరించలేక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ రమణ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రమైన బొమ్మనహాళ్‌కు చెందిన కాడ్రా కృష్ణమూర్తికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కాడ్రా అశోక్ (26) బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల స్వగ్రామానికి చేరుకుని వర్క్ ఫ్రం హోమ్ ద్వారా పనిచేస్తున్నాడు. అయితే పని ఒత్తిడి పెరగడంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలోని హెచ్చెల్సీ వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి బళ్లారి విమ్స్‌కు తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోవడంతో బుధవారం మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. చదవండి: నర్సుతో డాక్టర్ ప్రేమాయణం.. పెళ్లి.. బిడ్డ పుట్టిన తర్వాత! -
ఘనంగా శర్వానంద్ ఎంగేజ్మెంట్.. హాజరైన రామ్‌చరణ్ దంపతులు
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరవైన శర్వానంద్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారు.యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న రక్షితా రెడ్డి అనే అమ్మాయితో త్వరలోనే మూడు ముళ్లు వేయనున్నారు. తాజాగా వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. అతికొద్ది మంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తుంది. శర్వానంద్ బెస్ట్ఫ్రెండ్స్లో ఒకరైన రామ్‌చరణ్ భార్య ఉపాసనతో కలిసి హాజరయ్యారు. ఇక శర్వానంద్ ఎంగేజ్మెంట్ ఫోటో బయటకు రావడంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో శర్వా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరా అని ఆరాతీయగా..రక్షితా రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తెగా తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలిగా సమాచారం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Hyderabad: భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
సాక్షి, హైదరాబాద్: భార్యతో కలిసి విహార యాత్రకు వెళ్లి సముద్రంలో మునిగి నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగోలు డివిజన్ బండ్లగూడ అజయ్నగర్లో నివాసం ఉండే రాముని రవీందర్ చిన్న కుమారుడు వంశీకృష్ణ (27) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మరో పక్క గ్రూప్–1 ఫలితాల్లో మెయిన్స్ అర్హత సాధించాడు. గతేడాది జూన్ 23న కర్మన్‌ఘాట్‌కు చెందిన యువతితో వివాహమైంది. ఈ నెల 13న భార్య, ఇతర బంధువులతో కలిసి మలేసియా, ఇండోనేషియాలకు విహారయాత్రకు వెళ్లారు. మొదట మలేసియా యాత్ర పూర్తయిన తరువాత ఇండోనేషియాలోని బాలికి వెళ్లారు. ఈ నెల 22న ఆదివారం వంశీకృష్ణ బాలిలో సముద్ర గర్భంలోని అక్వేరియం సందర్శించేందుకు ఒంటరిగా వెళ్లాడు. అతను సముద్రంలోకి వెళ్లే సమయంలో అక్కడి నిర్వాహకులు సూచించిన ప్రకారం కాళ్లకు చెప్పులు, ఆక్సిజన్ సిలిండర్ ధరించి వెళ్లాడు. కానీ వంశీకృష్ణ సముద్రంలోకి దిగి గల్లంతయ్యాడు. భార్య అతని రాకకోసం చాలాసేపు ఎదురు చూసినా పైకి రాలేదు. దీంతో సముద్రంలో గల్లంతైనట్లు భావించి అక్కడి నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి పోలీసులు సముద్రంలో గాలించి వంశీకృష్ణ మృతదేహాన్ని బయటకు తీశారు. అతను అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. నగరంలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారు మంగళవారం ఉదయం బాలికి బయలుదేరి వెళ్లారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శుక్రవారం నగరానికి తీసుకొచ్చే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. సముద్రంలో గల్లంతైన వంశీకృష్ణ నీటిలోకి వెళ్లాక భయపడడంతో గుండెపోటుతో మృతి చెందాడని అక్కడ పోలీసులు ప్రాథమిక సమాచారం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వంశీకృష్ణ (ఫైల్) -
త్వరలోనే శర్వానంద్ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?
టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో ఒకరైన హీరో శర్వానంద్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కానున్నారు. యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న అమ్మాయి మెడలో త్వరలోనే మూడు ముళ్లు వేయనున్నారు. అయితే శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి ఎవరనే విషయం ఇప్పటివరకు బయటకు రాలేదు. తాజాగా ఆ అమ్మాయి ఎవరనే ఉత్కంఠకు తెర పడింది. ఈనెల 26న సాఫ్ట్వేర్ ఇంజినీర్ రక్షితా రెడ్డితో ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. శర్వానంద్ పెళ్లిచేసుకోబోయే అమ్మాయి రక్షితా రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తెగా తెలుస్తోంది. త్వరలోనే రక్షితా రెడ్డి మెడలో మూడు మూళ్లు వేయనున్నారు. ఆమె ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలిగా సమాచారం. అయితే ఇటీవల అన్‌స్టాపబుల్ షో పాల్గొన్న శర్వానంద్ పెళ్లి వార్తలపై స్పందించారు. -
టెక్కీ అని నమ్మించి 6 నెలల క్రితం ప్రేమ పెళ్లి.. భార్యను హత్య, ఢిల్లీకి పరార్!
సాక్షి, బెంగళూరు: భార్యను హత్య చేసి ఢిల్లీకి పరారైన భర్తను బెంగుళూరు పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. వివరాలు.. బెంగళూరుకు చెందిన నాజ్(22) సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తుంది. పశ్చిమబెంగాల్‌కు చెందిన నాసిర్ హుసేన్ కూడా టెక్కీ అని ఆమెను నమ్మించి ఆరు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకొని తావరెకెరె సభాష్‌నగరలో బాడుగ ఇంటిలో కాపురం పెట్టారు. నాజ్ ఐదు నెలల గర్భవతి. గర్భం ధరించిన్నప్పుటీ నుంచి ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. దీంతో కడుపులో ఉన్న శిశువుకు తనకు ఏ సంబంధం లేదంటూ నాజ్‌ను వేధించేవాడు. అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు. దీనికి నాజ్ ఒప్పకోలేదు. ఈ గొడవలతో ఇటీవల ఆమెను గొంతు పిసికి హత్య చేశాడు. ముందుగానే ప్లాన్ వేసుకున్న నాసీర్‌హుసేన్ నాజ్‌ను హత్య చేసి రాత్రికి రాత్రే బెంగళూరు విమానాశ్రయం నుంచి విమానంలో డిల్లీ బయలుదేరి వెళ్లిపోయాడు. విమానం దిగుతున్న సమయంలో నాజ్ సోదరుడికీ ఫోన్ సందేశం పెట్టాడు. నీ చెల్లెలు వివాహేతర సంబంధం కారణంగా హత్య చేశానని.. మృతదేహాన్ని తీసుకెళ్లాలని సూచించాడు. అనంతరం ఫోన్ అఫ్ చేశాడు. మృతురాలి బంధువుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు గాలించి అతన్ని ఢిల్లీలో పట్టుకుని బెంగళూరుకు తరలించారు. ముక్కూ మొహం తెలియని వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నందుకు ప్రాణాలే పోయాయని ఆమె బంధువులు ఆవేదన చెందారు. చదవండి: చిరుత దాడి.. ఇంటికి వస్తున్న చిన్నారిని ఎత్తుకుని పోయి చంపేసిన వైనం -
అమెరికాలో మంచిర్యాల యువకుడు మృతి
అమెరికాలో గత ఏడాది డిసెంబర్ 31న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల రెడ్డికాలనీకి చెందిన పెండ్యాల సుబ్రహ్మణ్యం, జ్యోతి దంపతుల కుమారుడు వంశీకృష్ణ(36) మృతి చెందాడు. పదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిన అతను ఆరిజోనా స్టేట్‌లోని ఫోనిక్స్‌సిటీలో ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. 31న రాత్రి స్నేహితులతో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొని రూమ్‌కి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలోనే ఉంటున్న మృతుడి సోదరి పద్మ దంపతులు ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వంశీకృష్ణ మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా.. మంచు అధికంగా ఉండడం వల్ల విమానాలు తగిన సంఖ్యలో నడవడం లేదని తెలిసింది. మృతదేహం మంచిర్యాల చేరేందుకు వారం రోజులు పట్టే అవకాశం ఉందని అంటున్నారు. అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి మృతదేహాన్ని త్వరగా పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
రెట్టింపు లాభం అంటూ రూ.కోట్లు కొట్టేశారు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మా కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టండి..మీ డబ్బు రెట్టింపు అవుతుందంటూ సైబర్ నేరగాళ్లు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వద్ద ఏకంగా రూ.1.90 కోట్లు కొట్టేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో నివాసముంటున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు కొంతమంది వ్యక్తులు పరిచయమై తమ కంపెనీ షేర్లు కొనుగోలు చేయాల్సిందిగా కోరారు. అలాచేస్తే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తుందని ఆశ చూపారు. దీంతో సదరు ఇంజనీరు అత్యాశకు పోయి కొన్ని షేర్లు కొనుగోలు చేశాడు. అయితే సైబర్‌నేరగాళ్లు చెప్పినసమయానికి అనుకున్నట్లు గానే రెట్టింపు మొత్తాన్ని ఇంజనీరు ఖాతాలో జమ చేశారు. ఇలా పలుమార్లు షేర్లు కొనుగోలు చేయగా..మంచి లాభాలు వచ్చాయి. దీంతో ఏకంగా రూ.1.90 కోట్లను పెట్టుబడిగా పెట్టారు. అయితే తిరిగి డబ్బులు రావాల్సిన గడువు ముగుస్తున్నప్పటికీ రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంగారెడ్డి జిల్లా పోలీసులను ఆశ్రయించగా...కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారులో నైట్రోజన్ వాయువు పీల్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
సాక్షి, బెంగళూరు: కారులో నైట్రోజన్ వాయువును పీల్చి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యమే ఆయన ఆత్మహత్యకు దారి తీసింది. ఈ ఘటన బెంగళరురు మహాలక్ష్మి లేఅవుట్ కురుబరహళ్లి జంక్షన్ వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది. టెక్కీ విజయ్‌కుమార్ (51) మహాలక్ష్మి లేఅవుట్లో ఉంటూ నగరంలోని ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆయనను దీర్ఘకాలంగా గుండెజబ్బు పీడిస్తోంది. దీంతో జీవితం మీద విరక్తి చెంది ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం నైట్రోజన్ సిలిండర్ కొనుగోలు చేసి తెల్లవారుజామునే సొంత కారులో బయటకు వచ్చాడు. కారు లోపల జరిగేది బయటకు కనిపించరాదని కారు పైన రగ్గును కప్పాడు. వాయువు లీక్ కాకూడదని కారు డోర్లకు ప్లాస్టిక్ కవర్ కప్పి ఉంచాడు. తరువాత డోర్లు వేసుకుని వెనుక సీట్లో కూర్చొని ఆ సిలిండర్ నుంచి వాయువును లీక్ చేసి పీల్చాడు. ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరవుతూ పెనుగులాడడంతో కారు కదలసాగింది. అది గమనించి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కారు తెరిచి చూడగా విజయ్‌కుమార్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ కారు డోర్లను పోలీసులు మాత్రమే తెరవాలి, ఇందులో విషపూరితమైన వాయువు ఉంది అని రాసి ఉన్న ఒక నోట్, మరో డెత్ నోట్ లభ్యమయ్యాయి. తనకున్న అనారోగ్యంపై ఇంటర్నెట్లో శోధించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ జబ్బు వల్ల ఏమవుతుందోనని తరచూ ఆందోళన చెందుతూ ఇంట్లో వాళ్లతో కూడా చర్చించేవాడని తెలిసింది. ఆత్మహత్య మార్గాలనూ ఇంటర్నెట్లో గాలించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (షాకింగ్ వివరాలు.. దేశంలో క్యాన్సర్ విజృంభణ.. 2022లో 8 లక్షల మంది మృతి) -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇంట్లో షాకింగ్ ఘటన.. తలుపు తట్టి.. నెట్టుకు వచ్చి..
అమలాపురం టౌన్(కోనసీమ జిల్లా): సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై ఓ ఆగంతకుడు చాకులతో దాడి చేసిన ఘటన అమలాపురం పట్టణంలో కలకలం రేపింది. పోతీసులు, బాధితుల కథనం ప్రకారం.. పట్టణంలోని ప్రకాశం వీధిలో నివసిస్తున్న నందెపు రామాంజనేయులు కుమార్తె సూర్యప్రియాంక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఆమె భర్త విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్నారు. నాలుగు నెలల బాలింతరాలు కావడంతో ఆమె చంటిబిడ్డతో అమలాపురంలోని పుట్టింట్లోనే ఉండి ఉద్యోగ విధులు నిర్వహిస్తోంది. బిడ్డకు అస్వస్థతగా ఉండటంతో ప్రియాంక ఆదివారం రాత్రి ఆసుపత్రికి వెళ్లి తిరిగి వచ్చింది. రాత్రి 9 గంటల సమయంలో తలుపు తట్టిన శబ్దం వినిపించడంతో ప్రియాంక తలుపు తెరిచింది. అంతలోనే ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజులు వేసుకుని, రెండు చేతుల్లో రెండు చాకులు పట్టుకుని ఉన్న దుండగుడు ఒక్కసారిగా తలుపు నెట్టి.. ఇంట్లోకి చొరబడి, ఆమెపై దాడికి ఒడిగట్టాడు. రక్షణ కోసం అడ్డం పెట్టుకున్న చేతులపై చాకులతో పొడిచి బలంగా గాయపరిచాడు. ఈ హఠాత్పరిణామంతో హడలిపోయిన ప్రియాంక భయంతో పెద్ద పెట్టున కేకలు వేస్తూ తండ్రి ఉన్న గదిలోకి వెళ్లింది. అంతలోనే ఆ ఆగంతకుడు తన చేతిలోని రెండు చాకులను అక్కడే వదిలేసి, ఇంటి గోడ దూకి పరారయ్యాడు. చేతులకు తీవ్ర గాయాలైన ప్రియాంకను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో అమ్మ, తాను మాత్రమే ఉన్నామనుకుని ఆ ఆగంతకుడు చోరీకి వచ్చాడని ప్రియాంక పోలీసులకు చెప్పింది. తన తండ్రి ఇంట్లో ఉండబట్టే తాను, తన తల్లి బతికామని, లేకపోతే తమను చంపేసి నగలు దోచుకునేవాడని ఆమె కన్నీటిపర్యంతమైంది. చదవండి: ప్రియుడి మర్మాంగాన్ని కోసిన ప్రియురాలు.. ఆ ఇంట్లో అసలేం జరిగింది? ఆ దుండగుడు చోరీకి విఫలయత్నం చేసి, ఈ దాడికి పాల్పడడ్డాడని రామాంజనేయులు కూడా చెబుతున్నారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆగంతకుడు వదిలేసిన చాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆగంతకుడు చోరీకి వచ్చాడా.. తెలిసున్న వ్యక్తే ఈ దాడికి ఒడిగట్టాడా.. మతిస్థిమితం లేక ఇలా ప్రవర్తించాడా అనే కోణాల్లో బాధిత కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. పట్టణ ఎస్సై ప్రభాకర్, హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజు ఆ ఇంటిని సోమవారం బాధిత కుటుంబ సభ్యులను విచారించారు. ఆ వీధిలో ఉన్న సీసీ ఫుటేజీలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ దాడి ఏ కారణంతో జరిగిందో దర్యాప్తు అనంతరం స్పష్టత వస్తుందని ఎస్సై ప్రభాకర్ చెప్పారు. -
ఆఫీస్‌కు వచ్చి పని చేయాల్సిందే.. చివరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ షాకింగ్ నిర్ణయం
గుడ్లూరు(కందుకూరు)నెల్లూరు జిల్లా: ఉద్యోగం నుంచి తొలగించారనే మనస్థాపంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలోని చేవూరు గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నక్కల శ్రీనివాసులు కుమార్తె నక్కల శ్రావణి (24) చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే రెండు సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన సంజీవ్ అనే యువకుడితో వివాహమైంది. సంజీవ్ బీఫార్మసీ చేసి ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం శ్రావణి 7 నెలల గర్భిణి. దీంతో ఇంటి దగ్గరే ఉండి వర్క్ ఫ్రం హోం విధానంలో ఉద్యోగం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల శ్రావణి పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం ఫోన్ చేసి చెన్నైలోని ఆఫీసుకు వచ్చి విధులు నిర్వర్తించాల్సింగా ఆదేశించింది. అయితే ప్రస్తుతం తాను గర్భిణిని, అని ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నందున ప్రస్తుతం ఆఫీసుకు రాలేనని, మరికొంత కాలం వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని శ్రావణి విజ్ఞప్తి చేసింది. అయితే అందుకు కంపెనీ యాజమాన్యం నిరాకరించి కచ్చితంగా ఆఫీసుకు రావాలని సూచించారు. దీనికి శ్రావణి ఒప్పుకోకపోవడంతో 15 రోజుల క్రితం శ్రావణిని ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఉద్యోగం పోయిందని బాధపడుతూ ఉంది. ఈ క్రమంలో సోమవారం నుంచి ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. గ్రామంతో పాటు బంధువులు, ఇతర ప్రదేశాల్లో వెతికిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగానే మంగళవారం గ్రామంలోని చెరువులో యువతి మృతదేహం ఉన్నట్లు గురించి శ్రావణి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో నుంచి వెళ్లిన శ్రావణి మనస్థాపంతో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు గుడ్లూరు ఎస్సై ప్రసాద్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఢిల్లీలో దారుణం.. 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి -
భద్రాద్రి: నా బిడ్డకు న్యాయమేది?.. అశోక్ భార్య కన్నీటి ఆక్రోశం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని టేకుపల్లి మండలంలో జరిగిన దారుణ ఘటన.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అశోక్(24) దారుణ హత్య కలకలం రేపింది. ఇచ్చిన అప్పు తిరిగి అడుగుతున్నాడనే కారణంతో అతన్ని గొంతు కోసి, నరికి చంపారు దుండగులు. దీంతో ముత్యాలంపాడు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ముత్యాలంపాడు క్రాస్ రోడ్‌కు చెందిన ప్రేమ్ కుమార్‌కు రూ. 80 వేలు అప్పు ఇచ్చాడు ధారావత్ అశోక్. ఈ వ్యవహారంలో మరో మధ్వవర్తి కూడా ఉన్నాడు. అయితే తిరిగి ఆ డబ్బు ఇవ్వమని అడగడంతో.. కక్ష పెంచుకుని హత్యకు ప్లాన్ వేశారు. శనివారం రాత్రి అప్పు తీరుస్తాం రమ్మంటూ పిలిచి.. ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అశోక్ తండ్రి బీజేపీ మండల అధ్యక్షుడు బాలాజీ. అయితే తన కొడుకు హత్య వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయని తాను అనుకోవడం లేదని ఆయన తెలిపారు. నిందితులను పట్టుకుని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అశోక్‌కు ఏడాది కిందటే వివాహం అయ్యింది. నెలల పాప ఉంది. దీంతో ఒళ్లో పసికందుతో అశోక్ భార్య కన్నీరు మున్నీరుగా రోదిస్తోంది. అశోక్‌ను చంపిన వాళ్లను శిక్షించి.. తన బిడ్డకు న్యాయం చేయాలని కోరుతోందామె. తన భర్తను దూరం చేసి.. చిన్న వయసులో తన జీవితాన్ని ఇలా మార్చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, పోలీసుల వల్ల కాకపోతే తమ ఎదుటకు తీసుకొస్తే తామే శిక్షిస్తామని ఆక్రోశంతో నిండిన ఆవేదనను వెల్లగక్కింది ఆమె. ఇదిలా ఉంటే.. హత్యపై తమకు పలు అనుమానాలు ఉన్నాయని అంటోందామె. ఒక్కడి వల్లే ఈ హత్య సాధ్యం కాదని, ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తోంది. గ్రామస్థులు కూడా అశోక్ శారీరకంగా ధృడమైన మనిషిని అని, ప్రతిఘటించే అవకాశం కావడంతో.. ఈ హత్యలో తమకూ అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. ఈ హత్యకు గ్రామంలో ఉండే గంజాయి బ్యాచ్‌కు సంబంధం ఉందన్న భావిస్తున్నారు వాళ్లు. మరోవైపు ఇది రూ. 80 వేల వ్యవహారమేనా? హత్యకు ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
సాఫ్ట్వేర్ భర్త నిర్వాకం.. స్నేహితులతో గడపాలని భార్యను బలవంతం
బెంగళూరు: కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన భర్తే.. భార్యను వ్యభిచార రొంపిలోకి దింపాడు. ఇతరులతో పడక పంచుకోవాలని ఆమెను బలవంతం చేశాడు. రహస్యంగా వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగుచూసింది. సంపిగేహళ్లికి చెందిన వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి 2011లో వివాహం జరిగింది. ఈ జంటకు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే కొంతకాలంగా డ్రగ్స్‌కు అలవాటు పడిన భర్త.. భార్యపై వేధింపులకు పాల్పడుతున్నాడు. స్నేహితులతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్నాడు. ఇందుకు భార్య ఒప్పుకోకపోవడంతో చిత్ర హింహలకు గురిచేశాడు. మద్యం మత్తులో ఆమెను కొట్టేవాడు. భార్య మరొకరితో బెడ్రూంలో గడిపిన దృశ్యాలను వీడియో రికార్డ్ చేసి రాక్షసానందం పొందాడు. భర్తతో విసిగిపోయిన భార్య.. అతని నుంచి విడాకులు కోరగా.. తన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. దీంతో దిక్కుతోచని వివాహిత చివరికి పోలీసులను ఆశ్రయించింది. భర్త తన ఇద్దరు స్నేహితులతో శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం తన ఫోన్లో వీడియో రికార్డ్ చేసిన వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేశాడని తెలిపింది. భర్త డ్రగ్స్ అలవాటు పడి, ఇంట్లోని పూల కుండీలో గంజాయి మొక్కలు పెంచుతున్నాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: అమ్మా, నాన్న ఇక సెలవు.. అనాధలైన సీఐ దంపతుల సంతానం -
‘పని’కొచ్చే విద్య కావాలి! ఒక సబ్జెక్ట్‌లో బీటెక్.. సాఫ్ట్వేర్ జాబ్‌లో చేరిపోవడం!
-కంచర్ల యాదగిరిరెడ్డి ♦ ప్రస్తుతం చదివే చదువుకు, చేసే పనికి ఏమైనా సంబంధం ఉంటోందా? ఏదో ఒక సబ్జెక్ట్‌లో బీటెక్ చదవడం.. ఏ మాత్రం సంబంధం లేని సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిపోవడం! ఉద్యోగంలో చేరాక తగిన నైపుణ్యం లేక తడబడుతూ భవిష్యత్‌ను అంధకారం చేసుకోవడం!! ..ఒక్క మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో జరుగుతున్నది ఇదే. ఇక్కడ తప్పు ఎవరిది..? చదివిన చదువుదా, ఉద్యోగాలిస్తున్న కంపెనీలదా అని తరచి చూస్తే.. సమస్య అంతా దశాబ్దాల పాటు నామమాత్రపు మార్పులతో నెట్టుకొస్తున్న విద్యా వ్యవస్థలదే. మరి ఏం చేస్తే బాగుంటుందంటే.. తరగతులను తిరగేయాలని, సిలబస్‌లో సమూలంగా మార్పులు రావాలని అంటున్నారు ప్రొఫెసర్ సంజయ్‌శర్మ. ప్రపంచ ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ అయిన సంజయ్‌శర్మ ‘న్యూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్’ పేరుతో ఈ ఏడాది సెపె్టంబర్లో ఓ విధాన పత్రాన్ని విడుదల చేశారు. అంతేకాదు ఉద్యోగార్హతలు, విద్యా (సిలబస్) విధానాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ఆయన ఓ పోరాటమే ప్రారంభించారు. ఉన్నత విద్యకు– ఉద్యోగ నైపుణ్యానికి మధ్య అంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యకు, ఉద్యోగ నైపుణ్యాలకు మధ్య అంతరం పెరిగిపోతూనే ఉంది. డిగ్రీ లేదా పీజీ పట్టా చేత పట్టుకుని ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోవడం, అక్కడ చేయాల్సిన పనులను సీనియర్లు చెబితే నేర్చుకోవడం, తప్పులు చేస్తూ దిద్దుకుంటూ ముందుకు వెళ్లడంతోనే సరిపోతోంది. ‘‘ప్రపంచంలో 80శాతం మంది ఉద్యోగులది ఇదే పరిస్థితి. అందువల్ల అన్నిరంగాల్లో పరిశోధనలు కుంటుపడుతున్నాయి. అందుబాటులో ఉన్న ఉద్యోగాలతో కాలం వెళ్లదీస్తున్నంత కాలం పరిశోధనల్లో ముందడుగు ఉండదు’’ అని యాపిల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన, మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్ గతంలో పలు సందర్భాలలో ఎత్తిచూపారు. మధ్యతరగతికి భారమవుతున్న ఉన్నత విద్య ఇప్పుడు ఉన్నత విద్య మునుపటిలా చౌక కాదు. బ్యాంకులిచ్చే రుణాలతో చదువుకున్నవారు అప్పులు తీర్చడంతో జీవితాన్ని మొదలుపెడతారు. అమెరికాలో ఉన్నతవిద్యకు అయ్యే ఖర్చు వార్షిక ద్రవ్యోల్బణం కంటే వేగంగా పెరిగిపోతోందని అధ్యక్షుడు బైడెన్ స్వయంగా చెప్పారు. ఈ మధ్యే ఆయన కొన్ని షరతులతో కొందరు విద్యార్థులకు ఫీజు బకాయిలు రద్దు చేశారు. అయినా సరే అమెరికాలో ఇప్పుడు విద్యార్థులపై ఉన్న భారం లక్షా డెబై ఐదు వేల కోట్ల డాలర్లు. రూపాయల్లో చెప్పాలంటే సుమారు కోటిన్నర కోట్లు. చాలా దేశాల్లో ఉన్నత విద్యకు సబ్సిడీలు ఇస్తున్నారు. స్థూల జాతీయోత్పత్తిలో సగటున 2.5 శాతం వరకూ విద్యకు ఖర్చు పెడుతున్నారు. ఇంతఖర్చు చేస్తున్నా ఉద్యోగాలకు తగ్గట్టుగా విద్యను రూపొందించడంపై దృష్టి పెట్టడం లేదు. దీనితో డిగ్రీ/ పీజీ పట్టా పుచ్చుకుని ఉద్యోగాల్లో చేరేవారికి నైపుణ్యాలు ఉండటం లేదని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పలు సందర్భాల్లో ఉటంకించారు. ఈ క్రమంలోనే కంపెనీలు కాలేజీల డిగ్రీలను పక్కనపెట్టేసి ఉద్యోగులకు తమ అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ ఇస్తున్నాయి. ఇదే సమయంలో కొన్ని కంపెనీలు ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలను తగ్గిస్తున్నాయి. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అర్హత అవసరమైన ఉద్యోగాల సంఖ్య 45 శాతం వరకూ తగ్గిపోయినట్టు ఇటీవలి నివేదికలు చెబుతున్నాయి. విద్యా సంస్థలు మాత్రం ఈ సమస్యను గుర్తించడం లేదు. ఎంఐటీ ప్రొఫెసర్ సంజయ్ శర్మ ‘న్యూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్’ పేరిట చేసిన ప్రతిపాదనపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుత సానుకూలతలను కొనసాగిస్తూనే.. ‘న్యూఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్’ ప్రతిపాదిస్తున్న కొత్త పద్ధతి ప్రస్తుత ఉన్నత విద్య విధానంలోని మేలైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. సామాజిక, భావోద్వేగ అభివృద్ధితోపాటు బతికేందుకు అనువైన సంపూర్ణమైన చదువు ప్రస్తుత విద్యావిధానంలోని సావకాశం. ఎట్టి పరిస్థితుల్లో వీటిని కాపాడుకోవాల్సిందే అంటారు సంజయ్ శర్మ. తాము వీటికి మరిన్ని అంశాలను జోడించి కంప్యూటర్ సైన్స్, బిజినెస్ రంగాలకు ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని ప్రతిపాదిస్తున్నామని ఆయన ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ కోసం రాసిన ఒక వ్యాసంలో తెలిపారు. ఈ కొత్త విధానంలో బోధన పద్ధతులతోపాటు నిర్మాణాత్మక బోధన అంశాల్లోనూ మార్పులు చేస్తున్నామన్నారు. మొత్తమ్మీద చూస్తే ఈ కొత్త విధానంలో ‘ఫ్లిప్డ్ క్లాస్రూమ్’ అనేది ఒక అంశం. ప్రస్తుతం తరగతి గదిలో కేవలం ప్రొఫెసర్లు చెప్పే పాఠాలు (సిలబస్‌కు లోబడి) మాత్రమే ఉంటున్నాయి. మొత్తం కోర్సు అవధిలో 95 శాతం ఈ పాఠాలే. మిగతా ఐదు శాతం కంపెనీల్లో ఇంటర్న్íÙప్లు లేదా ప్రాక్టికల్స్ ఉంటాయి. ‘ఫ్లిప్డ్ క్లాస్రూమ్’లో ఏముంటుంది? ఫ్లిప్డ్ క్లాస్రూమ్ ప్రస్తుత విధానానికి భిన్నంగా ఉంటుంది. పాఠాలన్నీ డిజిటల్ రూపంలో ఉంటాయి. విద్యార్థి తనకు కావాల్సిన టైమ్‌లో వాటిని చూసుకోవచ్చు. వాస్తవంగా తరగతి గదిలో ఉద్యోగ సంబంధిత అంశాలపై చర్చలు జరుగుతాయి. నైపుణ్యాల శిక్షణ ఇస్తారు. న్యూఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కోర్సు కూడా నాలుగేళ్లు ఉంటుంది. ఇందులో సెమిస్టర్లకు బదులు 11 ట్రైమిస్టర్లు (త్రైమాసికాలు) ఉంటాయి. ఇందులో నాలుగింటిలో పరిశ్రమకు సంబంధించిన అంశాలను విద్యార్థికి అందజేస్తారు. వీటిని కో–ఆప్స్ అని పిలుస్తున్నారు. పరిశోధనశాలలు, మ్యూజియంలు, ఇతర విశ్వవిద్యాలయాలు, ఐఎంఎఫ్, యునైటెడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ కో–ఆప్స్‌లో భాగంగా ఉంటాయి. కంపెనీల ఉద్యోగులు కొందరు తమ ఉద్యోగాలకు తాత్కాలిక విరామమిచ్చి విద్యార్థులతో తమ అనుభవాలను పంచుకుంటారు. ఈ భాగస్వామ్యం వల్ల విద్యార్థికి చాలా లాభాలు ఉంటాయి. పైగా కోర్సు సమయంలోనే విద్యార్థి కొంత ఆదాయం పొందే అవకాశమూ ఏర్పడుతుంది. కో–ఆప్స్ సమయంలో కంపెనీలు విద్యార్థులకు రెమ్యూనరేషన్ చెల్లిస్తాయి. కంపెనీలకు తమకు కావాల్సిన నైపుణ్యాలతో ఉద్యోగార్థులు లభిస్తారు. న్యూఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రతిపాదిస్తున్న కొత్త డిగ్రీలో ఐదారు అంశాలపై క్రెడిట్స్ ఉంటాయి. ఒక్కో అంశానికీ ప్రత్యేకంగా విలువ ఉంటుంది. ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులో లీనియర్ ఆల్జీబ్రా, కంప్యూటేషన్, మెషీన్ లెర్నింగ్‌లతోపాటు నైతిక విలువలు, సామాజిక శా్రస్తాలు కలగలిపి బోధిస్తారు. విద్యార్థులు కోర్సు పూర్తి చేయకపోయినా.. వారు సాధించిన క్రెడిట్లకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కోర్సుకాలం పూర్తయిపోయినా మిగిలిన క్రెడిట్లను ఎప్పుడైనా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. చదువుతూనే.. అప్రెంటిస్‌షిప్.. నిజానికి న్యూఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ప్రతిపాదిస్తున్న కొత్త విద్యావిధానం ఇతర రూపాల్లో కొన్నిచోట్ల అమల్లో ఉంది. ఉదాహరణకు జర్మనీలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సు చదివేవారు కాలేజీలో సగం సమయం మాత్రమే ఉంటారు. తర్వాత సంబంధిత పరిశ్రమలో వారికి ఒకేషనల్ అప్రెంటిస్íÙప్ పేరుతో శిక్షణ అందిస్తారు. అది పూర్తయిన తరువాతే డిగ్రీ లభిస్తుంది. భారత్ విషయానికి వస్తే ఆతిథ్య రంగంలో ఈ రకమైన విధానం అమల్లో ఉంది. ఐహెచ్ఎస్ వంటి సంస్థల్లో కోర్సులు చేసేటప్పుడు కోర్సులో గణనీయమైన సమయం హోటల్స్, రెస్టారెంట్లలో ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది. అమెరికాలోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, మరికొన్ని సంస్థల్లోనూ కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో ఈ రకమైన పద్ధతి అమల్లో ఉంది. ఇప్పుడు శర్మ ప్రతిపాదన అమల్లోకి వస్తే చదవడంతో పాటు నేర్చుకోవాలన్న తపన ఉన్న వారికి ఉద్యోగావకాశాలకు కొదవ ఉండదు. దేశంలో పది మందిలో ఒకరికే నైపుణ్యాలు భారతదేశంలో చదువులకు, ఉద్యోగ నైపుణ్యాలకు మధ్య సంబంధమే లేదని చెప్పాలి. ప్రతి పది మంది పట్టభద్రుల్లో ఒకరికి, ప్రతి ఐదుగురు ఇంజనీర్లలో ఒకరికి, నలుగురు మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లలో ఒకరికి మాత్రమే ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చి చెప్పింది. దేశంలో ఏటా సుమారు కోటీ 30లక్షల మంది ఉద్యోగ మార్కెట్లోకి అడుగుపెడుతుంటే.. వీరిలో అత్యధికులకు నైపుణ్యాలు ఉండటం లేదు. ఎప్పుడో కాలం చెల్లిననాటి ఉద్యోగాలకు తగ్గట్టు విద్యాబోధన ఉండటమే ఈ సమస్యకు ప్రధాన కారణమని ఐఐటీ ఖరగ్‌పూర్ డీన్ జయంత ముఖోపాధ్యాయ స్పష్టం చేశారు. నైపుణ్యాల ఆవశ్యకత గురించి ఐక్యరాజ్యసమితి దాదాపు దశాబ్దకాలంగా చెప్తున్నా భారత్‌లో ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు నామమాత్రమే. 2020 నాటి వరల్డ్ ఎకనమిక్ ఫోరం నివేదిక కూడా డేటాసైన్స్, బిగ్ డేటా, మెషీన్ లెరి్నంగ్, ఏఐ, వెబ్ డెవలప్మెంట్, ప్రోగ్రామింగ్ వంటి రేపటి తరం నైపుణ్యాలను ఉద్యోగార్థులకు అందించాలని సూచించడం గమనార్హం. రెండేళ్ల క్రితం విడుదలైన జాతీయ విద్యా విధానం కూడా పిల్లలకు ఆరో తరగతి నుంచే వృత్తి నైపుణ్యాలను అందించాలని.. ఇంటర్న్షిప్స్ ద్వారా విద్యార్థులకు ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలను ముందుగానే అందించాలని సిఫార్సు చేసింది. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను నమ్మించి.. ఫోన్లో ట్విస్ట్ ఇచ్చిన బంధువు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వ్యాపారంలో పెట్టుబడి పెట్టమని నమ్మించి సాఫ్ట్వేర్ ఉద్యోగిని మోసం చేసిన వ్యక్తిపై గవర్నర్‌పేట పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు... న్యూ గిరిపురానికి చెందిన గుడిసె వెంకటేశ్వరరావు హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి వరుసకు అన్నయ్య అయిన మిద్దె వెంకటేష్ గవర్నర్ పేటలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లో షాపు నిర్వహిస్తున్నాడు. తాను కంప్యూటర్ స్పేర్‌పార్ట్స్ హోల్‌సేల్ వ్యాపారం చేస్తున్నానని, ఆ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కొంత పెట్టుబడి కావాలని వెంకటేశ్వరరావును అడిగాడు. అందుకు అంగీకరించిన వెంకటేశ్వరరావు 2021 నుంచి పలు దఫాలుగా రూ.35లక్షలు వెంకటేష్‌కు ఇచ్చాడు. వెంకటేష్ స్కై సీ కంప్యూటర్స్ పేరుతో సంస్థను రిజిస్ట్రేషన్ చేశాడు. అనంతరం వెంకటేశ్వరరావు ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. కొద్ది రోజుల తర్వాత ఫోన్ చేసి వ్యాపారం ఎలా ఉంది? అని మిద్దె వెంకటేష్‌ను అడగగా ఇంకా వ్యాపారం ప్రారంభించలేదని సమాధానం ఇచ్చాడు. అతను గట్గిగా నిలదీయగా కొత్త కంప్యూటర్ సంస్థకు బిజినెస్ క్రెడిట్ ఇవ్వరని, అందుకే తాను బిజినెస్ స్టార్ట్ చేయలేదని సమాధానం ఇచ్చాడు. తర్వాత వెంకటేష్ ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న షాపులో వాటా ఇస్తానని మాయమాటలు చెప్పాడు. గత నెల 27న నగరానికి వచ్చిన వెంకటేశ్వరరావు షాపునకు వెళ్లి చూడగా, అందులో రూ.35 లక్షల స్టాకు లేదని గమనించాడు. వెంకటేష్ చెప్పిన మాటల్లో వాస్తవం లేదని, తాను మోసపోయానని గ్రహించిన వెంకటేష్‌ను గట్టిగా నిలదీయగా, వెంకటేష్ అతనిని అసభ్య పదజాలంతో దూషించాడు. చంపేస్తానని బెదిరించడమే కాకుండా వెంకటేశ్వరరావుపై దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: అసలు విషయం తెలిస్తే షాకే.. సినిమాను తలపించిన లవ్‌స్టోరీ.. యువతి అదృశ్యం కథ -
అప్పులే దారుణానికి ఒడిగట్టేలా చేశాయి.. వీడిన టెక్కీ రాహుల్ అదృశ్యం మిస్టరీ
సాక్షి, కోలారు: బెంగళూరు రూరల్‌లోని బాగలూరులో నివాసం ఉండే టెక్కీ రాహుల్(27) తన మూడేళ్ల వయసున్న కుమార్తెతో కలిసి ఈనె 16న కోలారులోని కెందెట్టి చెరువులో దూకాడన్న మిస్టరీ వీడింది. కుమార్తెను నీటిలోకి తోసి హత్య చేసి అనంతరం ఆచూకీ లేకుండా పోయిన టెక్కీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గుజరాత్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ రాహుల్.. భవ్య అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి జియా అనే కూతురు ఉంది. ఏడాదిన్నర క్రితం ఉద్యోగం కోల్పోయిన రాహుల్ బిట్ కాయిన్లో డబ్బు పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. ఖర్చుల కోసం విపరీతంగా అప్పులు చేయడంతో అప్పులబాధ ఎక్కువైంది. గతంలో ఇంట్లో బంగారం చోరీ అయిందని తప్పుడు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు విచారణకు హాజరు కావాలని తెలపడంతో రాహుల్ భయపడ్డాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం కూతురిని స్కూల్‌కు వదలి రావడానికి కారులో బయలుదేరిన సమయంలోనే అప్పుల వారు ఇంటి వద్దకు వచ్చి వేధించడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాను చనిపోతే భార్య కూతురును సరిగా చూడదని భావించి కూతురుతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నవంబర్ 15వ తేదీన కూతురిని స్కూల్‌కు వదిలి వస్తానని కారులో బయలుదేరి నేరుగా కోలారు జాతీయ రహదారి పక్కనే ఉన్న కెందట్టి చెరువు వద్దకు వచ్చాడు. చదవండి: (మహా నగరంలో మాయగాడు.. సివిల్ సప్లయీస్ డెప్యూటీ కలెక్టర్‌నంటూ..) కూతురిని కారులోనే ఊపిరాడకుండా చేసి చంపి మృతదేహాన్ని చెరువులో పారవేశాడు. అనంతరం తాను కూడా చెరువులోకి దూకాడు. అయితే లోతు తక్కువగా ఉండడం వల్ల బతికి పోయాడు. ఎలాగైనా చనిపోవాలని భావించిన రాహుల్ రైలు కిందపడేందుకు బంగారుపేట రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. రైలు కింద దూకడానికి భయపడి పలు ప్రాంతాల్లో రైలులోనే తిరిగి చివరికి చెన్నై చేరుకున్నాడు. చెన్నైలో తన సంబందీకులకు ఫోన్ చేసి తనను ఎవరో కిడ్నాప్ చేశారని నాటకం ఆడాడు. మొబైల్ నెట్వర్క్ ఆధారంగా రాహుల్ ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరుకు రైలులో వస్తున్నాడని తెలుసుకుని గురువారం రాత్రి పోలీసులు అతనిని అరెస్టు చేశారు. పోలీసు విచారణలో రాహుల్ అన్ని విషయాలు బయటపెట్టాడు. -
కల్లలైన కలలు.. భర్త వివాహేతరసంబంధం.. మహిళా టెక్కీ ఆత్మహత్య
సాక్షి, బెంగళూరు: ఇద్దరూ పెద్ద కంపెనీల్లో టెక్కీలు, కావలసినంత జీతం వస్తుంది, విలాసవంతమైన జీవితం ముందుంది. కానీ భర్త వివాహేతర సంబంధంతో తీవ్ర ఆవేదనకు లోనైన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగళూరు రామ్మూర్తి నగర రిచర్డ్ గార్డెన్లో ఈ నెల 10వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 11 నెలల కిందటే పెళ్లి భర్త అభిషేక్ వివాహేతర సంబంధం తట్టుకోలేక భార్య శ్వేత (27) ప్రాణాలు తీసుకుంది. 11 నెలల క్రితమే వీరిద్దరికి వివాహం జరిగింది. శ్వేత ఐబీఎం కంపెనీలో టెక్కీగా పని చేస్తోంది. అభిషేక్ టీసీఎస్ కంపెనీలో ఐటీ ఇంజనీరు. పెళ్లికి ముందు అభిషేక్‌కు ఓ యువతితో సంబంధం ఉంది. పెళ్లి తర్వాత కూడా అనైతిక బంధాన్ని కొనసాగించాడు. ఈ విషయంపై పలు సందర్భాల్లో దంపతుల మధ్య గొడవలు జరిగాయి. రాజీ పంచాయతీల తరువాత దంపతులు కలిసే ఉంటున్నారు. అయితే అభిషేక్‌లో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో మోసపోయానని విరక్తి చెందిన శ్వేత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అదే రోజు పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు పూర్తిచేశారు. తరువాత అల్లుని అక్రమ సంబంధం గురించి తెలిసిన అత్తమామలు అతనితో పాటు కుటుంబ సభ్యుల మీద బుధవారం రామ్మూర్తి నగర పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చదవండి: (కీచక కరస్పాండెంట్.. ప్లస్‌టూ విద్యార్థినులతో..) -
మూన్‌లైటింగ్: 81 శాతం ఉద్యోగులు ఏమంటున్నారంటే..
ముంబై: మూన్‌లైటింగ్ (రెండో చోట్ల ఉద్యోగాలు చేయడం)పై వివాదం నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు ఇది అనైతిక వ్యవహారంగానే భావిస్తున్నారు. వాల్యువోక్స్ నిర్వహించిన సర్వే ఆధారంగా ఇన్‌డీడ్ రూపొందించిన నివేదికలో దాదాపు 81 శాతం మంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నివేదిక ప్రకారం మూన్‌లైటింగ్‌కు ఎక్కువగా ఎవరూ ఇష్టపడటం లేదు. సర్వేలో పాల్గొన్న ప్రతి అయిదుగురు ఉద్యోగుల్లో ఒకరు మాత్రమే (19 శాతం) మూన్‌లైటింగ్ వైపు మొగ్గు చూపగా మిగతా వారు ఒక ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం చేయడం అనైతికమేనని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ మధ్య కాలంలో నిర్వహించిన ఈ సర్వేలో 1,281 సంస్థలు, 1,533 మంది ఉద్యోగార్థులు .. ఉద్యోగులు పాల్గొన్నారు. సర్వే ప్రకారం మూన్‌లైటింగ్ చేస్తున్న వారిలో ఎక్కువ మంది (37 శాతం) .. అకస్మాత్తుగా ప్రధాన ఉద్యోగం పోయినా ఆదాయం దెబ్బతినకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో ఉంటున్నారు. మరికొందరు (27 శాతం) కొంత అదనపు ఆదాయం కోసం రెండో ఉద్యోగం చేస్తున్నారు. అయితే, కంపెనీల అభిప్రాయం మాత్రం మరో రకంగా ఉంది. చేతిలో తగినంత పని లేకపోవడం వల్ల ఉద్యోగులు మూన్‌లైటింగ్‌కు మళ్లుతున్నారని 31 శాతం సంస్థలు భావిస్తుండగా, రెండో ఉద్యోగం చేసుకునేంతగా వారి చేతిలో సమయం ఉంటోందని 23 శాతం కంపెనీలు అభిప్రాయపడినట్లుగా నివేదిక పేర్కొంది. క్వైట్ క్విటింగ్ సమస్య.. ఉద్యోగుల్లో పని ఒత్తిడి, అలసట పెరిగిపోతుండటం వల్ల క్వైట్ క్విటింగ్ (క్రమంగా నిష్క్రమించడం) సమస్య పెరుగుతోందని నివేదిక పేర్కొంది. ఇలాంటి ఉద్యోగులు తాము ఉద్యోగాన్ని అట్టే పెట్టుకునేందుకు అవసరమైన కనీస విధులను మాత్రమే నిర్వర్తిస్తూ క్రమంగా పని నుండి తప్పుకుంటున్నారని తెలిపింది. ఉద్యోగంపై సంతృప్తి తక్కువగా ఉండటం, సవాళ్లు లేక బోరింగ్‌గా ఉండటం వంటి కారణాలు ఎక్కువగా ఉంటున్నట్లు 33 శాతం కంపెనీలు తెలిపాయి. 21 శాతం కంపెనీలు.. ఉద్యోగం పట్ల నిబద్ధత లేకపోవడమే ఈ తరహా నిష్క్రమణలకు కారణమని అభిప్రాయపడ్డాయి. ఉద్యోగుల కోణంలో చూస్తే 29 శాతం మంది.. తీవ్రమైన పని భారం, అలసటే క్వైట్ క్విటింగ్కు కారణమని తెలిపారు. మేనేజర్లు, బాస్‌ల నుండి సహకారం లేకపోవడం వల్లే ఈ ధోరణి పెరుగుతోందని 23 శాతం మంది ఉద్యోగులు పేర్కొన్నారు. చదవండి: ఊహించని షాక్.. ఒకప్పుడు ఈ కారుకి ఫుల్ డిమాండ్, ఇప్పుడేమో ఒక్కరూ కొనట్లేదు! -
Hyderabad: మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ కొంపముంచిన ‘చిత్రాలు’
హిమాయత్‌నగర్(హైదరాబాద్): నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఆమె పెయింటింగ్ చిత్రాలను కొనుగోలు చేస్తామంటూ లక్షల రూపాయిలు కాజేశారు. దీంతో బాధితురాలు శనివారం సిటీ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించింది. సోమాజిగూడలో నివాసం ఉండే ఆర్టిస్ట్ నగరంలోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేస్తోంది. ఖాళీ టైంలో పెయింటింగ్ వేసి ఆ చిత్రాలను తన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తుంటుంది. వీటిని చూసిన కేటుగాడు ఆమెతో మాట కలిపాడు. వాట్సప్ నంబర్ తీసుకుని చాట్ చేసి ఎన్ఎఫ్టీ ఇన్వెస్ట్మెంట్ వెబ్సైట్ వైపు రప్పించాడు. ఈ వెబ్సైట్లో పెయింటింగ్స్ కొనేవారు చాలా మంది ఉన్నారని నమ్మించాడు. తొలుత ఇన్వెస్ట్ చేస్తే లక్షలు వస్తాయన్నాడు. తన పెయింటింగ్స్ అమ్ముడవ్వాలనే ఆశతో ఆర్టిస్ట్ అతగాడు చెప్పిన విధంగా కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత దాని లాభాల కోసం ట్యాక్స్‌లు, కమీషన్ అంటూ పలు దఫాలుగా ఆమె నుంచి రూ.8లక్షలు కాజేశాడు. ఇంకా ఇంకా అడుగుతూ ఇబ్బంది పెడుతున్న క్రమంలో తాను మోసపోయానని గుర్తించి సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. చదవండి: నాటుకోడికి ఫుల్ గిరాకీ.. ఆ టేస్టే వేరు.. రోజుకు వెయ్యి లాభం! -
‘బాబ్బాబూ ఒక్కసారి రావూ’..ఉద్యోగుల్ని బ్రతిమిలాడుతున్న ఎలాన్ మస్క్!
లక్షల కోట్లతో కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ నాటి నుంచి ట్విటర్‌ను సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తున్నారు. ఉద్యోగుల తొలగింపు, బ్లూటిక్, కార్యాలయాల మూసివేత తాజాగా ఉద్యోగులకు జారీ చేసిన అల్టిమేట్టం వరకు ఆ సంస్థ భవిష్యత్‌ను మరింత గందర గోళంలోకి నెట్టేస్తుంది. అయినా మస్క్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తాను ఏం చేయాలని అనుకుంటున్నారో అదే చేస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా హాట్ టాపిగ్గా మారుతున్నారు. ‘వర్క్ ఫ్రమ్ హోమ్ రద్దు చేస్తున్నాం. సంస్థ కోసం ఎక్కువ పనిగంటలు పనిచేయాలంటూ’ మస్క్ ఉద్యోగులకు అల్టిమేట్టం జారీ చేశారు.అంతే మస్క్ ఆదేశంతో చిర్రెత్తిపోయిన ఉద్యోగులు ‘నువ్వు వద్దు నీ ఉద్యోగం వద్దు’ అంటూ సుమారు 1200 మంది ఉద్యోగులు ట్విటర్‌కు రిజైన్ చేశారు. ఆ రిజైన్ చేసిన మరోసటి రోజే మస్క్ ప్రస్తుతం ట్విటర్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఓ మెయిల్ పెట్టారు. అందులో.. ‘మీలో కోడింగ్ రాసే నైపుణ్యం ఉంటే వెంటనే ఈరోజు మధ్యాహ్నం 2గంటల లోపు శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ఆఫీస్‌కు స్వయంగా వచ్చి రిపోర్ట్ చేయాలని కోరారు. కుటుంబ అత్యవసర పరిస్థితులు ఉన్నవారిని మినహాయించినట్లు ఆ మెయిల్స్‌లో మస్క్ చెప్పారని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. గత ఆరు నెలల్లో కోడింగ్‌లో ఫలితాలు రాబట్టిన ఇంజనీర్లు బుల్లెట్ పాయింట్ సారాంశాన్ని, అలాగే అత్యంత ముఖ్యమైన 10 కోడ్ లైన్ల స్క్రీన్షాట్లను పంపమని కోరారు. ఎందుకంటే ట్విటర్‌ను బిల్డ్ చేసేందుకు సహాయపడిన టెక్ స్టాక్ (టెక్నాలజీ) ను అర్థం చేసుకోవడంలో తనకు సహాయపడుతుందనే ఉద్దేశంతో ఈ మెయిల్ పెట్టినట్లు మస్క్ చెప్పారు. చదవండి👉 వాళ్లు పోతే పోనివ్వండి.. ఆయన పునరాగమనం కావాలా? వద్దా?: ఆసక్తికర పోల్ -
ఆన్లైన్లో రూ.10 లక్షలు పెట్టుబడి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
సాక్షి, మెదక్: ఆన్లైన్లో పెట్టుబడి పెట్టి నష్టపోవడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపం చెంది ఓ సాఫ్ట్వేర్ అదృశ్యమైన సంఘటన అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ కిష్టారెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అమీన్పూర్ పరిధి కేఎస్ఆర్ కాలనీకి చెందిన సాయిపవన్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కాగా ఇటీవల ఆన్లైన్లో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో 14వ తేదీన ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిసిన వారిని, బంధువులను విచారించినా అతడి ఆచూకీ లభించలేదు. తమ్ముడి అదృశ్యంపై అన్న మహేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చెత్తను శుభ్రం చేస్తుండగా కదలికలు.. తీరా చూస్తే! -
‘మూన్‌లైటింగ్’ దుమారం : ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్
ఒకే సారి రెండేసి ఉద్యోగాలు చేస్తున్న సిబ్బందిపై ఆయా టెక్ దిగ్గజాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులకు పనిచేస్తున్నారంటూ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్‌లు ఉద్యోగుల్ని ఫైర్ చేశాయి. కానీ టెక్ మహీంద్రా మాత్రం అందుకు విభిన్నంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఉద్యోగులకు మూన్‌లైటింగ్ పాల్పడటాన్ని ప్రోత్సహిస్తోంది. తాజాగా మూన్‌లైటింగ్‌పై మరో కీలక ప్రకటన చేసింది. నవంబర్ నెలలో ఉద్యోగుల కోసం తన మూన్‌లైటింగ్ పాలసీని అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని కంపెనీ గ్లోబల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ హర్షవేంద్ర సోయిన్ తెలిపారు. పలు నివేదికల ప్రకారం.. వర్క్‌కు ఆటంకం కలగనంత వరకు గిగ్ వర్క్స్‌కు అనుమతించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారాంతంలో లేదా వారంలో రెండు గంటలు వంటి స్వల్ప కాలానికి మాత్రమే పనిచేసేందుకు అంగీకరించనున్నట్లు సమాచారం. చదవండి👉 ‘విప్రో ఉద్యోగులకు బంపరాఫర్’ టెక్ మహీంద్రా మూన్ లైటింగ్ పాలసీలో ఆఫీస్‌కు వర్క్‌తో ఎలాంటి పోటీ ఉండకూడదు. మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్ లేదా కస్టమర్ కాంట్రాక్ట్ కు కట్టుబడి ఉండాలి. కంపెనీ నుంచి రాతపూర్వక అనుమతి అవసరం’ వంటి సంస్థ నిర్ధిష్ట సూత్రాలను కలిగి ఉంటుందని ఈ సందర్భంగా సోయిన్ పేర్కొన్నారు. అట్రిషన్ రేటు తగ్గుతుంది ఈ ఏడాది ఆగస్టులో స్విగ్గీ తన ఉద్యోగులను పని గంటల తర్వాత గిగ్ వర్క్స్ చేసుకోవచ్చంటూ మూన్‌లైటింగ్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఇన్ఫోసిస్ సైతం అంతకు ముందు మూన్‌లైటింగ్ చేసే ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది. కానీ అది కాస్త వివాదం కావడంతో గిగ్ ఉద్యోగాలు చేసేందుకు అనుమతించింది. అయితే టెక్ సంస్థలు తీసుకునే ఈ నిర్ణయం వల్ల అట్రిషన్ రేటు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మూన్‌లైటింగ్‌కు పాల్పడితే శాలరీల కోసం వేరే సంస్థలోకి వెళ్లే ఆలోచనల్ని విరమిస్తారని భావిస్తున్నారు. చదవండి👉 కంపెనీలను మోసం చేస్తున్న ఐటీ ఉద్యోగులు, ఏరివేసే పనిలో సంస్థలు! -
Hyderabad: మాజీ ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడ్డ సాఫ్ట్వేర్ ఇంజినీర్
సాక్షి, హైదరాబాద్: అర్ధరాత్రి సాఫ్ట్వేర్ ఇంజినీర్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలి ఇంట్లోకి చొరబడ్డాడు. తమను హత్య చేసేందుకు వచ్చాడని ఆరోపిస్తూ ఆమె కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బల్కంపేట రోడ్డులో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి ఓ వ్యక్తి ప్రహరీ దూకి మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ఉంటున్న పై పోర్షన్ గది తలుపులు తెరిచేందుకు యత్నించాడు. కింది ఫ్లోర్లో డ్రైవర్ అప్రమత్తమై ప్రసూనకు ఫోన్ చేసి ఎవరో తన గదికి బయటి నుండి గడియ వేశారని తెలిపాడు. దీంతో అప్రమత్తమైన ఆమె కుటుంబ సభ్యులు లైట్లు వేయడంతో సదరు వ్యక్తి తిరిగి గోడ దూకి పారిపోయాడు. సీసీ కెమెరాల ఫుటేజీలను ఆధారంగా ప్రసూన, ఆమె కుమార్తె కరణం అంభిక కృష్ణ చౌదరి తమ అనుచరులతో కలిసి అతడి కోసం గాలించారు. సమీపంలోని బార్లో కూర్చుని ఉన్న నిందితుడిని పట్టుకున్నారు. అతడిని ప్రశ్నించగా ప్రకాశం జిల్లా, కనిగిరికి చెందిన చంద్రశేఖర్ అని చెప్పినట్లు కరణం అంభిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కరణం వెంకటేష్ అనే వ్యక్తితో తనకు విభేదాలున్నాయని, తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆమె ఆరోపించింది. వెంకటేష్ అనుచరుడు త్రివేది అనే వ్యక్తిపై ఇదివరకే చీరాల డీఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపింది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని చంద్రశేఖర్‌రెడ్డిగా గుర్తించినట్లు ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న అతను బల్కంపేటలోని ఓ హాస్టల్లో ఉంటున్నట్లు తెలిపారు. మద్యం మత్తులో ఇంట్లోకి ప్రవేశించానని చెబుతున్నాడని, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. చదవండి: కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య -
Hyderabad: ఊహల్లో కోటీశ్వరుడిని చేసి ఉన్నదంతా ఊడ్చేశారు!
సాక్షి, హైదరాబాద్: సార్, మీరు చాలా అదృష్టవంతులు మీ ఫోన్ నంబర్ రూ. 25 లక్షల లాటరీ మనీ గెలుచుకుంది. వెంటనే మేం అడిగిన డాక్యుమెంట్స్‌ను అందించండి.. మీ రూ. 25 లక్షల చెక్కును సొంతం చేసుకోండి.. అంటూ నాలుగేళ్ల క్రితం ఓ అనామకుడి నుంచి వచ్చిన ఫోన్ కాల్‌కు స్పందించాడు చంద్రాయణగుట్టకు చెందిన యువకుడు. డాక్యుమెంట్స్ ఇచ్చి కొంత డబ్బు పంపగా.. రూ. 25 లక్షలు.. ఇపుడు కోట్లకు చేరుకుందని ఆశపెట్టి ఇప్పుడు అప్పులబారిన పడేలా చేశారు సైబర్ కేటుగాళ్లు. చంద్రాయణగుట్టకు చెందిన యువకుడు వృత్తి రీత్యా ఐటీ కంపెనీలో చేస్తున్నాడు. అతిపిన్న వయస్సులో రూ. 25 లక్షల లాటరీ గెలిచాననే ఆనందంలో ఇదంతా ఫేక్ అనేది గ్రహించలేకపోయాడు. రూ. 25 లక్షలు ఫ్రీగా వస్తున్నప్పుడు కొంత సొంత డబ్బు ఖర్చు చేస్తే పోయేదేముందనుకుని సైబర్ కేటుగాళ్లు అడిగినప్పుడల్లా వేలకు వేలు పంపాడు. ఇతను పంపుతున్న కొద్దీ అక్కడ లాటరీ మనీ పెరుగుతుందని నమ్మించారు. రూ. 25 లక్షల నుంచి రూ. 14 కోట్లు గెలుచుకున్నావంటూ ఊహల్లో కోటీశ్వరుడిని చేసేశారు. ఆ రూ.14 కోట్ల కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 2 కోట్లు వారికి చెప్పిన అకౌంట్లకు పంపాడు. ఈ నాలుగేళల్లో తన సొంత డబ్బు, కుటుంబీకుల దగ్గర తీసుకున్నవి, స్నేహితుల దగ్గర అప్పుల చేసి మరీ వెచ్చించాడు. వారు లాటరీ డబ్బు పెంచుతూ ఇతని వద్ద డబ్బు కాజేస్తున్నారే తప్ప.. ఇతనికి వచ్చిన లాటరీ డబ్బు మాత్రం ఇవ్వట్లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన యువకుడు ఇదంతా ఫేక్ అని గ్రహించి సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎ ప్రసాద్ తెలిపారు. లాభాలంటూ రూ. 16 లక్షలు లూటీ అంబర్‌పేటకు చెందిన ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటూ ఒత్తిడి చేశారు. కోటీశ్వరుడివి అవుతావంటూ ఆశ పెట్టడంతో క్యాట్ డీడీ డాట్‌కామ్, క్యాట్ జీఎస్టీ డాట్‌కామ్‌లలో ఇప్పటి వరకు రూ. 16.50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. దీనికి ఒక్క రూపాయి కూడా లాభం ఇవ్వకపోవడంతో బాధితుడు సిటీ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.