చిత్తూరు జిల్లా: నాలుగేళ్లుగా ప్రేమించిన ప్రియుడు పెళ్లి పేరు ఎత్తగానే నిరాకరించాడని మనస్తాపం చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉరివేసుకుని తనువు చాలించింది. ఈ ఘటన సోమవారం చౌడేపల్లె మండలం, దిగువపల్లె పంచాయతీ, మిట్టపల్లెలో విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం మేరకు.. మిట్టపల్లెకు చెందిన గంగరాజు కుమార్తె గౌతమి(23) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. గత మూడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. సోమల మండలానికి చెందిన కార్తీక్ అనే యువకుడితో ప్రేమలో పడింది. పెళ్లి పేరు ఎత్తగా గౌతమిని దూరం పెట్టడంతో పాటు ఘర్షణ పడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరివేçసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ నాగేశ్వరరావు కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్


