వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల బెడదను ఎదుర్కోనేందుకు అన్ని కుక్కల పట్ల ఒకే విధానాన్ని అనుసరించ డాన్ని వ్యతిరేకిస్తూ నటి షర్మిలా ఠాగూర్ చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆమె వాదనలు వాస్తవానికి పూర్తిగా దూరంగా ఉన్నాయని అభివర్ణించింది.
ప్రజా ప్రదేశాలలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించడానికి ఇటీవల తీసుకున్న చర్యలు ఉత్తమమైన విధానం కాకపోవచ్చని షర్మిలా వాదించారు. తన వాదనలకు మద్దతుగా ఠాగూర్ కొన్ని ఉదాహరణలను కూడా ఇచ్చారు.
వాస్తవదూరంగా ఆలోచిస్తున్నారు : సుప్రీం
కొన్నేళ్లుగా ఎయిమ్స్‌లో స్నేహపూర్వకంగా ఉంటున్న కుక్క 'గోల్డీ' గురించి ఉదాహరించారు. కొన్ని కుక్కలను నిర్మూలించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది, అయితే దూకుడుగా ప్రవర్తించే వాటిని ముందుగా ఒక కమిటీ గుర్తించాల్సి ఉంటుందని, కుక్కల ప్రవర్తనను పరిశీలించేందుకు కమిటీ ఉండాలని, దూకుడుగా ఉండే కుక్కలకు, సాధారణ కుక్కలకు మధ్య తేడాను చూడాలంటూ షర్మిల తరపు న్యాయవాది వాదించారు. అలాగే వీధి కుక్కల సమస్యను పరిష్కరించడానికి సైన్స్ మనస్తత్వశాస్త్రం సహాయం అవసరమని ఠాగూర్ తన పిటిషన్‌లో అన్నారు. ABC నియమాలు ఫూల్‌ప్రూఫ్ కాకపోవచ్చు, కాబట్టి దీనిని పరిశీలించాల్సిన అవసరం ఉందని వాదించారు. వీటన్నింటినీ సుప్రీంకోర్టు ఒక్కొక్కటిగా ఖండించింది.
ఆసుపత్రులలో కుక్కల్ని కీర్తించడానికి ప్రయత్నించవద్దు అంటూ సుప్రీం గట్టిగానే వాదించింది. ఆ కుక్కను ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్‌లోకి కూడా తీసుకు వెళ్తున్నామా? వీధుల్లో తిరిగే ఏ కుక్కకైనా పేలు ఉంటాయి. అలాంటి వాటిని థియేటర్లలోకి అనుమతిస్తే ఇన్‌ఫెక్షన్లు, వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుంది. మీకు అర్థమవుతోందా? మీవాదనల వెనుకున్న వాస్తవికత ఏమిటో మే మీకు తెలియజేస్తాంఅంటూ మండిపడింది.
ఇదీ దచవండి: అమ్మానాన్నల్ని ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిస్తే.. ఆ కిక్కే వేరప్పా!
చెవులకు రంగులు
మరోవైపు ప్రజలను కరిచిన కుక్కలను గుర్తించడానికి కాలర్ల (చెవులకు)కు రంగులు వేయాలని ఠాగూర్ తరపు న్యాయవాది సూచించారు. జార్జియా అర్మేనియా వంటి దేశాలలో ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని చెప్పారు. ఈ సూచనపైనా కూడా సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశాల జనాభా ఎంత? సుప్రీంకోర్టు ఆ వాదనను కూడా కొట్టిపారేసింది.
సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కల్పించుకుని కమిటీలో నిపుణులు లేకుండా వచ్చిన ఆరావళి విషయంలో వచ్చిన తీర్పు ఉదహరించారు.. "న్యాయ జోక్యం అనేది ఖాళీలు ఉన్న అంతరాలలో మాత్రమే తప్ప, శాసనసభ ఉద్దేశపూర్వకంగా చట్టం చేయకూడద’’ని అనుకున్న విషయాల్లో కాదన్నారు.
ఇదీ చదవండి: 498 ఏ, పొరిగింటి మహిళకు షాక్ : ఇలా కూడా కేసు పెట్టొచ్చా?
దాడిచేసే వారి మీద కేసు పెట్టుకోండి
కుక్కలకు ఆహారాన్నదిస్తున్న మహిళలపై దాడులు, దుర్భాషలాడుతున్న వారి గురించి సీనియర్ న్యాయవాది మహాలక్ష్మి లేవనెత్తినప్పుడు, కూడా సుప్రీం ఇదే వ్యాఖ్యాచేసింది. ప్రజలు ఎవర్నైనా, ఎలా అయినా అవమానించవచ్చు. మమ్మల్ని కూడా అంటున్నారు. అలాంటి వాళ్లమీద చర్య తీసుకోండని సూచించింది. ఫీడర్ వ్యతిరేక విజిలెంట్స్" మహిళలపై దాడి చేస్తున్నారని, అధికారులు దాని గురించి మౌనంగా ఉన్నారని పావని ఆరోపించారు. ఇలాదేశవ్యాప్తంగా జరుగుతోందన్నారు. హర్యానాలో, సొసైటీలు బౌన్సర్లను నియమించుకుని మరీ దాడిచేస్తున్నాయన్నారు. దీనికి వీధి కుక్కల సమస్యలతో సంబంధం లేదని సుప్రీం స్పష్టం చేసింది. స్ట్రీట్ డాగ్స్ అంశంపై, సూచనలు ఉంటే, ఇవ్వవచ్చు అని చెబుతూ మహిళలపై దాడి చేస్తున్నవారిపై FIR దాఖలు చేయండి. హైకోర్టుకు వెళ్లండి అని సుప్రీంకోర్టు పేర్కొంది.
వీధుల నుండి ప్రతి కుక్కను తొలగించాలని ఆదేశించలేదని, జంతువుల జనన నియంత్రణ (ABC) నిబంధనల ప్రకారం వీధి కుక్కలకు చికిత్స చేయాలని ఆదేశించిందని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. పబ్లిక్ ప్లేసెస్‌నుంచి కుక్కల్ని తొలగించడం వల్ల ప్రభుత్వానికి రూ.26,800 కోట్ల వరకు ఖర్చవుతుందని సుప్రీంకిచ్చిన నివేదికలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి


