గృహహింస, వరకట్న వేధింపులకు గురవుతున్న మహిళలకు చట్టం కల్పించిన రక్షణ సెక్షన్ 498A. వివాహిత స్త్రీ పట్ల భర్త లేదా అతని బంధువుల హింస, వేధింపులను ఈ చట్టం ద్వారా ఎదుర్కోవచ్చు. వివాహంబంధంలో అత్తింటి వారినుంచి తనకెదురైన ఇబ్బందులు, బాధలనుంచి విముక్తి పొందేందుకు చట్టాన్ని ఆశ్రయించవచ్చు. అయితే ఈ కేసులో పొరుగింటివారి మీద కూడా కేసు నమోదు చేయవచ్చా? వారిని కూడా నిందితులుగా పేర్కొనవచ్చా? చట్టం ఏ చెబుతోంది? దీనిపై కర్ణాటక హైకోర్టు ఏం చెప్పింది?
సెక్షన్ భారత శిక్షాస్మృతి (IPC) లోని సెక్షన్ 498A ప్రత్యేకంగా భర్త లేదా అతని బంధువులపై కేసు నమోదు చేయవచ్చు. ఎవరైనా, ఒక స్త్రీ భర్త లేదా భర్త బంధువు అయి ఉండి, ఆ వివాహితను క్రూరంగా హించినట్టు రుజువైతే వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానాకు కూడా విధించే అవకాశం ఉంది.
అయితే ఒక కేసులో తన పొరిగింటి మహిళను విచారించాలని ఒక ఫిర్యాదు దారు కోరింది. ఈ కేసులో ఫిర్యాదు దారైన మహిళకు 2006లో జరిగిన వివాహం అయింది. వైవాహిక కలహాలు తలెత్తడంతో భర్తపై కేసు నమోదు చేసింది. హింసకు పాల్పడుతున్నాడంటూ భర్తపై ఫిర్యాదు చేసిన బాధితురాలు, పొరుగింటి మహళ తన భర్తను రెచ్చగొట్టిందని ఆరోపించింది. దీంతో పోలీసులు భర్తపైనే కాకుండా, పొరుగువారిపై కూడా ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన చార్జ్‌షీట్‌లో ఐపీసీలోని సెక్షన్లు 498A, 504, 506 మరియు 323 కింద కేసులు నమోదు చేయడంతో, ఆమె హైకోర్టును ఆశ్రయించింది.
పిటిషనర్ తరపున హాజరైన న్యాయవాది చందన్ కె వాదిస్తూ, ఆమెకు ఇతర నిందితుల కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని, అనవసరంగా ఈ వివాదంలోకి లాగారన్నారు. భర్తను రెచ్చగొట్టిందనేది మాత్రమే ఆమెపై మోపిన ఏకైక ఆరోపణ అని, వ్యక్తిగత కక్షతో, ఆమెను నిందితురాలిగా చేర్చారని, ఈ కేసునుంచి ఆమెను తొలగించాలని వాదించారు.
ప్రాసిక్యూషన్ ఈ పిటిషన్‌ను వ్యతిరేకించింది. న్యాయవాది కె నాగేశ్వరప్ప వాదిస్తూ, పొరుగున ఉన్న మహిళ భర్త ప్రవర్తనను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషించిందని , "భర్త అన్ని ప్రవర్తనలకు ఆమెనే కారణం" అని పేర్కొన్నారు. కాబట్టి ఆమె విచారణను ఎదుర్కొని, చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని ఆయన వాదించారు.
ఇదీ చదవండి: వీధి కుక్కల బెడద: నటి షర్మిలకు సుప్రీం స్ట్రాంగ్ కౌంటర్
అయితే రికార్డులో ఉన్న సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత, సెక్షన్ 498A కింద ఆమెను నిందితురాలిగా చేర్చడానికి తగిన కారణాలేవీ లేవని కోర్టు గుర్తించింది. దీనిపై జస్టిస్ నాగప్రసన్న తీర్పునిస్తూ పిటిషనర్ పేరు కేవలం ప్రేరేపణ ఆరోపణల సందర్భంలో మాత్రమే వెలుగులోకి వచ్చిందని, కానీ ఆమె చట్టంలోని నిబంధన ప్రకారం కుటుంబం అనే నిర్వచనంలోకి రారని పేర్కొన్నారు. ఈ కేవలం ఆరోపణ తప్ప, చట్టం ప్రకారం క్రూరత్వానికి పాల్పడిన చర్యలలో ఆమె ప్రమేయం రాదని చెప్పారు. భర్త ,భార్య లేదా కుటుంబ సభ్యుల మధ్య ఐపిసి సెక్షన్ 498A కింద నేరాలకు సంబంధించిన విచారణలో ఒక అపరిచితురాలిని చేర్చలేరని ఆ ఉత్తర్వు నొక్కి చెప్పింది. అంతేకాదు ఈ కేసులో పొరుగింటి మహిళపై కేసును అనుమతించడం, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని కోర్టు తీర్పు ఇచ్చింది. భర్త కుటుంబంలో భాగం కాని వ్యక్తి ఈ నిబంధన పరిధిలోకి రాదని, అందువల్ల, ఆమె విచారణను ఎదుర్కోవలసిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.
ఇదీ దచవండి: అమ్మానాన్నల్ని ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిస్తే.. ఆ కిక్కే వేరప్పా!
అలాగే రమేష్ కన్నోజియా మరియు మరొకరు వర్సెస్ ఉత్తరాఖండ్ రాష్ట్రం ,మరొకరి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఈ సందర్భంగా హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ఇదీ చదవండి: టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి


