మైసూరు(కర్ణాటక): ఫోన్ నంబర్ ఇవ్వకపోతే చంపేస్తాను అని గృహిణిని వేధించిన రోమియోపై విజయ నగర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వివరాలు.. విజయ నగర్‌లోని యోగ నరసింహ ఆలయం సమీపంలో ఓ గృహిణి నివసిస్తోంది. ఆమె ఇంటి పక్కలో నివసిస్తున్న హింకల్ నివాసి దేవరాజు.. తరచుగా గృహిణితో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు.
ఇటీవల రోడ్డుపై వెళ్తున్న గృహిణిని అడ్డగించిన దేవరాజు.. మొబైల్ ఇవ్వాలని బెదిరించాడు. నంబర్ ఇవ్వకపోతే నీ భర్తను చంపేస్తాను అని వేధించాడు. దీంతో విసిగిపోయిన ఆమె విజయ నగర పోలీస్ స్టేషన్‌లో దేవరాజుపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: నవ దంపతులకు అవమానం.. వీడియో వైరల్


