దూసుకెళ్లిన బస్సు.. ముగ్గురికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

దూసుకెళ్లిన బస్సు.. ముగ్గురికి తీవ్ర గాయాలు

Feb 25 2026 9:45 AM | Updated on Feb 25 2026 9:45 AM

దూసుక

దూసుకెళ్లిన బస్సు.. ముగ్గురికి తీవ్ర గాయాలు

హుబ్లీ: ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో ఓ మహిళ కాలు తెగి పడగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ల అతివేగం, అదుపు తప్పిన డ్రైవింగ్‌కు అమాయకుల ప్రాణాలు బలి అవుతూనే ఉన్నాయి. తాజాగా గదగ్‌లో కొత్త బస్టాండ్‌లో బస్సు దూసుకెళ్లడంతో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. రాయచూరు డివిజన్‌ మస్కి డిపోకు చెందిన బస్సు డ్రైవర్‌ బస్టాండ్‌ లోపలే అతివేగంగా బస్సు నడిపారు. దీంతో చునగ గ్రామ నివాసి శాంతవ్వ సిద్దప్ప కొరటి ప్రమాదంలో తీవ్రంగా గాయపడటమే కాకుండా బస్సు చక్రం మీదుగా వెళ్లడంతో కాలు తెగి పడింది. వెన్ను భాగానికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స తర్వాత ఆమెను ధార్వాడ ఎస్‌డీఎం ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనపై గదగ్‌ ట్రాఫిక్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్‌పై దర్యాప్తు ప్రారంభించారు. బస్టాండ్‌ ప్రాంగణంలో అతివేగంగా బస్సు నడపడానికి కారణం ఏమిటో దర్యాప్తులో తేలనుంది.

కన్నడ వర్సిటీ గర్వకారణం

స్నాతకోత్సవంలో గవర్నర్‌ గెహ్లాట్‌

ఇద్దరికి నాడోజ బిరుదుల ప్రదానం

హొసపేటె: హంపీ కన్నడ విశ్వవిద్యాలయం 34వ స్నాతకోత్సవాన్ని మంగళవారం సాయంత్రం విశ్వవిద్యాలయంలోని నవరంగ బయలు మందిరంలో నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఛాన్సలర్‌, గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ పాల్గొని మాట్లాడారు. విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా వెలుగొందిన హంపీ గడ్డపై కన్నడ విశ్వవిద్యాలయం ఉండటం ఎంతో గర్వకారణమని అన్నారు. కన్నడ విశ్వవిద్యాలయం నుంచి మరింతగా పరిశోధనలు చేపట్టాలని అన్నారు. పుస్తకాల ప్రచురణలు కూడా మరింత పెంచాలని తెలిపారు. అనంతరం నాడోజ గౌరవ బిరుదులను మహదేవప్ప, సత్యన్‌లకు ప్రదానం చేశారు. డాక్టర్‌ రామకృష్ణ గైర్హాజరయ్యారు.

మైదానంలో బ్లాక్‌కు

సునీల్‌ జోషి పేరు

భావోద్వేగానికి గురైన మాజీ క్రికెటర్‌ జోషి

హుబ్లీ: స్థానిక రాజానగర్‌ కేఎస్‌సీఏ మైదానం పెవిలియన్‌లోని ఓ బ్లాక్‌కు సీనియర్‌ క్రికెటర్‌ సునీల్‌ జోషి పేరు పెట్టారు. ఈ మేరకు బీసీసీ అధ్యక్షుడు మిథున్‌ మనహత్‌ ఈ నూతన పెవిలియన్‌ బ్లాక్‌ను ప్రారంభించారు. దీంతో తన పేరును పెట్టడంతో అక్కడే ఉన్న సునీల్‌ జోషి ఎంతో ఉద్వేగానికి గురయ్యారు. అంతేగాక ఆయన కొద్దిసేపు కన్నీటి బాష్పాలు రాల్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ధ్రతతో గొంతులో నుంచి మాటలు రావడం లేదన్నారు. మాకు ఇంత పెద్ద కీర్తి దక్కుతుందని అనుకోలేదన్నారు. జాతీయ కవి కువెంపు చెప్పినట్లుగా మన సాధన ఎవరికై నా ప్రేరణ కావాలన్నారు. అలాంటి రోజు నా జీవితంలో దొరికిందని హర్షం వ్యక్తం చేశారు. తాను 14 ఏళ్ల వయస్సులో గదగ్‌ నుంచి హుబ్లీకి వచ్చి శిక్షణ తీసుకున్నానన్నారు. ఈ స్థాయిలో తనకు కీర్తి దక్కుతుందని తాను ఎన్నడూ భావించలేదన్నారు. తనకు ఇంత గౌరవ ప్రతిష్టలు ఇచ్చిన హుబ్లీ ధార్వాడ జిల్లా ప్రజలే కాకుండా క్రికెట్‌ ప్రముఖులందరినీ తాను తన జీవితంలో ఎన్నటికీ మరువలేనన్నారు. కేఎస్‌సీఏ అధ్యక్షుడు వెంకటేష్‌ ప్రసాద్‌, కార్యదర్శి సంతోష్‌ మినన్‌, జేడీ బీకే రవి, మధుకర్‌, సుజితా సోమసుందర్‌, వీరన్న సౌది, డాక్టర్‌ రవనీత్‌ జోషి తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి మండలికి నిధులివ్వండి

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం 2026–27వ సంవత్సర బడ్జెట్‌లో భోవి అభివృద్ధి మండలికి రూ.300 కోట్ల నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు భోవి అభివృద్ధి మండలి అధ్యక్షుడు రామప్ప డిమాండ్‌ చేశారు. మంగళవారం రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రూ.98 కోట్లలో ఇప్పటికే రూ.68 కోట్లు ఖర్చు చేశామన్నారు. స్వయం ఉపాధి కింద 168 మంది లబ్ధిదారులకు రూ.135 లక్షలు, గంగా కళ్యాణ పథకంలో 41 బోరుబావులు వేిసి రూ.59 కోట్లు, ఉద్యమ శీలతలో 68 మందికి రూ.8.65 లక్షలు, మైక్రో ఫైనాన్స్‌లో 120 మందికి రూ.30 లక్షలు పంపిణీ చేశామన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఆలస్యం కావడానికి ప్రధాన కారణం శాసన సభ్యులు ఎంపిక ప్రక్రియలో చొరవ చూపడం లేదన్నారు. త్వరగా ఎంపికను పూర్తి చేయాలని లేఖ రాశామన్నారు. యల్లప్ప, శశికళ, అధికారులు రాజేంద్ర, జగన్నాథ్‌లున్నారు.

దూసుకెళ్లిన బస్సు..   ముగ్గురికి తీవ్ర గాయాలు 1
1/2

దూసుకెళ్లిన బస్సు.. ముగ్గురికి తీవ్ర గాయాలు

దూసుకెళ్లిన బస్సు..   ముగ్గురికి తీవ్ర గాయాలు 2
2/2

దూసుకెళ్లిన బస్సు.. ముగ్గురికి తీవ్ర గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement