వైభవంగా బసవేశ్వర రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా బసవేశ్వర రథోత్సవం

Feb 25 2026 9:45 AM | Updated on Feb 25 2026 9:45 AM

వైభవం

వైభవంగా బసవేశ్వర రథోత్సవం

హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని అమలాపుర గ్రామంలో బసవేశ్వర రథోత్సవం సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. రథోత్సవానికి ముందు బసవేశ్వర స్వామిని అన్ని వాయిద్యాలతో పల్లకీలో తీసుకెళ్లి రథం వద్దకు తీసుకువచ్చారు. రథాన్ని ఐదు సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత, ఉత్సవ విగ్రహాన్ని ఆచారాలతో రథంలో ప్రతిష్టించారు. తరువాత స్వామి ఐదు పూల దండలను వేలం వేశారు. తరువాత భక్తులు ధవనం, అరటిపండ్లను రథంపైకి విసిరి తమ భక్తిని చాటుకున్నారు. రంగురంగుల పూలతో అలంకరించిన రథాన్ని భక్తితో లాగారు. జిల్లాతో పాటు తాలూకాలోని ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు.

రిజర్వేషన్లు అమలు చేయండి

హొసపేటె: రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ విజయనగర జిల్లా షెడ్యూల్డ్‌ కులాలవారు జిల్లాధికారి కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. అంతర్గత రిజర్వేషన్ల అమలు కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ కరియప్ప గుడిమని మాట్లాడుతూ రాష్ట్రంలో పూర్తి అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయాలి. ప్రభుత్వం అంతర్గత రిజర్వేషన్లను అమలు చేసి 6 నెలలు అయింది. కానీ ఇది ఇంకా పూర్తిగా అమలు కాలేదు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మహదేవప్ప తమ కులానికి అంతర్గత రిజర్వేషన్లను పరిమితం చేయడానికి ప్రయత్నించారన్నారు. అనంతరం జిల్లాధికారిణి కవిత ఎస్‌.మన్నికేరికి వినతిపత్రాన్ని అందజేశారు. నగరసభ మాజీ సభ్యుడు గోవిందరాజ్‌, నాయకులు వీరుస్వామి, బసవరాజ్‌, మారేష్‌, శేషు, ఈ.ధనంజయ్‌, ఓబలేష్‌, రాంలీ, జగన్నాథ్‌, జైరాం సుమలత, బాలు పాల్గొన్నారు.

సోమనాథేశ్వరకు ప్రత్యేక పూజలు

రాయచూరు రూరల్‌: నగరంలో సోమనాథేశ్వర స్వామికి ప్రత్యేక పూజలను జరిపారు. మంగళవారం గంజ్‌ కళ్యాణ మంటపంలో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆధ్వర్యంలో సోమనాథ జ్యోతిర్లింగ ఉత్సవాలు, రుద్రాభిషేకాలు, ఇతర పూజలు నెరవేర్చారు. రెండు రోజుల పాటు భక్తులకు దర్శనార్థం ఉంచారు. ఉదయం అభిషేకాలు, సాయంత్రం సత్సంగ సేవ జరిపారు.

క్రీడలతో ఆరోగ్య భాగ్య

రాయచూరు రూరల్‌: మనిషి క్రీడలతో ఆరోగ్య భాగ్యం పొందవచ్చని జెడ్పీ సీఈఓ ఈశ్వర్‌ కుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం వ్యవసాయ వర్సిటీ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు–2026 ను ప్రారంభించి ఆయన మాట్లాడారు. క్రీడలతో శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. ఉద్యోగుల్లో క్రీడా మనోభావాలు పెరగాలన్నారు. డీహెచ్‌ఓ డాక్టర్‌ సురేంద్రబాబు, యువజన సేవా క్రీడా శాఖాధికారి వీరేష్‌ నాయక్‌, రోణ, శంకర్‌గౌడ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ, చంద్రశేఖర్‌ పవార్‌, చంద్రశేఖర్‌రెడ్డిలున్నారు.

రిజర్వేషన్‌ ప్రకటించే వరకు నియామకాలు వద్దు

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణలు, రిజర్వేషన్‌ ప్రకటించే వరకు ప్రభుత్వ కొలువుల్లో నియామకాలకు అవకాశం కల్పించడం తగదని మాదిగ దండోరా సంచాలకుడు దూళయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం రాయచూరు ఆదికవి మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయం వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. నివేదిక ఆధారంగా రోస్టర్‌ పద్ధతిలో రిజర్వేషన్ల కేటాయింపులు జరిగే వరకు విశ్వవిద్యాలయం ఎలాంటి ఉద్యోగాల్లో నియామకాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌కు వినతిపత్రం సమర్పించారు.

వైభవంగా బసవేశ్వర రథోత్సవం1
1/4

వైభవంగా బసవేశ్వర రథోత్సవం

వైభవంగా బసవేశ్వర రథోత్సవం2
2/4

వైభవంగా బసవేశ్వర రథోత్సవం

వైభవంగా బసవేశ్వర రథోత్సవం3
3/4

వైభవంగా బసవేశ్వర రథోత్సవం

వైభవంగా బసవేశ్వర రథోత్సవం4
4/4

వైభవంగా బసవేశ్వర రథోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement