పాఠశాల గదిలో చెలరేగిన మంటలు | - | Sakshi
Sakshi News home page

పాఠశాల గదిలో చెలరేగిన మంటలు

Feb 25 2026 9:45 AM | Updated on Feb 25 2026 9:45 AM

పాఠశాల గదిలో చెలరేగిన మంటలు

పాఠశాల గదిలో చెలరేగిన మంటలు

హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో రూ.1.50 లక్షల విలువైన పరికరాలు కాలిపోయాయి. పీఎంశ్రీ స్కూల్‌గా విద్యా సేవలను అందిస్తున్న పాత హగరిబొమ్మనహళ్లి ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ఉదయం గదిలో మంటలు చెలరేగాయి. లోపల ఉన్న కంప్యూటర్‌ మానిటర్లు, ప్రొజెక్టర్‌, పాఠ్యపుస్తకాలు కాలి పోయాయి. గదిలో ఉన్న దాదాపు 6 కంప్యూటర్‌ మానిటర్లు, ప్రొజెక్టర్లు, పాఠ్యపుస్తకాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. చాలా రోజులుగా పాఠశాల ఆవరణలో పోకిరీల బెడద పెరిగింది. పాఠశాల ఆవరణలోకి అవాంఛిత వ్యక్తులు ప్రవేశించకుండా నిరోధించడానికి హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు చేసి పాఠశాల ఆవరణను మూసివేశారు. అయినా పాఠశాల ఆవరణ చిన్నది కావడంతో దుండగులు లోపలికి ప్రవేశించారు. గదిలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయా లేక గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారా? అనే విషయంపై హగరిబొమ్మనహళ్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పాఠ్యపుస్తకాలు, కంప్యూటర్‌ మానిటర్లు దగ్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement