గోవాలోని అందమైన ప్రదేశాలను చూసి తరించాలని ఆశపడిన టూరిస్టు కుటుంబంలో ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. గోవాలోని అస్సాగావ్ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి
భోపాల్‌కు చెందిన 65 ఏళ్ల పర్యాటకుడు భగత్‌రామ్ శర్మ (65) కుటుంబంతో కలిసి హ్యుందాయ్ i20 కారులో గోవాకు బయలుదేరారు.ఉత్తర గోవాలోని 'హ్యాపీ బార్' జంక్షన్ వద్ద అతివేగంతో వచ్చిన ఒక అద్దె మహీంద్రా థార్ (Thar) కారు, పర్యాటకులు వీరు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ తీవ్రతకు భగత్‌రామ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్వల్పంగా గాయపడిన మరో ఇద్దర్ని ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్న ఐదు నెలల చిన్నారి ఎటువంటి గాయాలు లేకుండా బయటపడింది.
సోషల్ మీడియాలో వస్తున్న వీడియోల ప్రకారం, థార్‌లోని ఒక యువకుడు ఫోన్‌లో మాట్లాడుతూ "నాన్న, నేను ఇంటర్సెక్షన్ దగ్గర ఉన్నాను..." అని చెప్పడం వినిపించింది. కారు వెనుక సీట్లో ముగ్గురు యువతులు ఉన్నట్లు కూడా వీడియోలో కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే థార్ కారులోని వ్యక్తులు సీట్లు మారడానికి ప్రయత్నించారని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. అసలు డ్రైవర్‌ను (నిందితురాలిని) కాపాడేందుకు వారు ప్రయత్నించినట్లు స్థానికులు చెబుతున్నారు. 19 ఏళ్ల టీనేజరే ఈ విషాదానికి కారణమని అనుమానిస్తున్నారు.

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అద్దె వాహనాన్ని సీజ్ చేశారు. ర్యాష్ డ్రైవింగ్ , నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణమైనట్లు కేసు నమోదు చేశారు. అలాగే నిజంగా డ్రైవర్‌ను మార్చారా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జంక్షన్ వద్ద ఉన్న CCTV ఫుటేజీని, ఫోరెన్సిక్ సాక్ష్యాలను ,ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్లను సేకరిస్తున్నారు.
Not all Thar, but Always a Thar!
Thar Accident in Goa!pic.twitter.com/bmebwnUEBt— My Vadodara (@MyVadodara) February 24, 2026
t>


