స్కూటర్‌ పల్టీ.. యువతి మృతి | Hassan Road Accident Priya Death | Sakshi
Sakshi News home page

స్కూటర్‌ పల్టీ.. యువతి మృతి

Feb 24 2026 11:50 AM | Updated on Feb 24 2026 12:27 PM

Hassan Road Accident Priya Death

బెంగళూరు : స్కూటర్‌ నడుపుతున్న యువతి కింద పడి మృతి చెందిన ఘటన హాసన్‌ సమీపంలోని పారిశ్రామికవాడ వద్ద జరిగింది. సత్యమంగల లేఔట్‌కు చెందిన ప్రియా (23),  స్నేహితురాలు స్వాతితో కలిసి స్కూటర్‌పై వెళ్తోంది, ఆ సమయంలో ఇద్దరూ హెల్మెట్‌ ధరించలేదు. రోడ్డుపై వేసిన హంప్స్‌ మీద నుంచి వేగంగా వెళ్లడంతో కింద పడ్డారు.  

గాయాలై ప్రియా అక్కడే చనిపోగా, స్వాతి గాయపడి ఆస్పత్రిలో చేరింది. మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. హాసన్‌ గ్రామాంతర పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. రోడ్డు హంప్‌లు, మలుపుల వద్ద రంగులు, హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపించారు. 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement