న్యాయవ్యవస్థలో అవినీతి, పెండింగ్‌ కేసులు : NCERT కొత్త బుక్‌ వివాదం | 8th Class book lists corruption in judiciary massive backlog as challenges by NCERT | Sakshi
Sakshi News home page

న్యాయవ్యవస్థలో అవినీతి, పెండింగ్‌ కేసులు : NCERT కొత్త బుక్‌ వివాదం

Feb 24 2026 11:28 AM | Updated on Feb 24 2026 11:49 AM

8th Class book lists corruption in judiciary massive backlog as challenges by NCERT

న్యూఢిల్లీ:  నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) సోమవారం విడుదల చేసిన కొత్త 8వ తరగతి సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో, “మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర” అనే అధ్యాయంలో భాగంగా “న్యాయవ్యవస్థలో అవినీతి” అనే విభాగాన్ని చేర్చింది.విద్యార్థులకు పాఠ్యాంశాలు నిర్ణయించే NCERT న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లలో భాగంగా "న్యాయవ్యవస్థలోని వివిధ స్థాయిలలో ఉన్న అవినీతి"  అన్న విషయాన్ని చేర్చడం తీవ్ర చర్చకు దారితీసింది.

పాత పుస్తకంలో ఏమంది?
ఇప్పటివరకు ఉన్న పాత పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థ పాత్ర, స్వతంత్ర న్యాయవ్యవస్థ అంటే ఏమిటి, కోర్టుల నిర్మాణం ,వాటిని సంప్రదించే విధానం గురించి మాత్రమే ఉండగా, కొత్తగా తీసుకొచ్చిన పుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి గురించి ప్రస్తావించడం గమనార్హం. అలాగే పాత పాఠ్యపుస్తకంలో అవినీతి గురించి ప్రస్తావించకుండా న్యాయవ్యవస్థ పాత్ర, స్వతంత్ర న్యాయవ్యవస్థ అంటే ఏమిటి, కోర్టుల నిర్మాణం వాటికి ప్రాప్యత గురించి మాత్రమే వివరించింది. అయితే, సామాన్యులకు న్యాయం లభించడాన్ని ప్రభావితం చేసే సమస్య కోర్టులు కేసును విచారించడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటాయో చెబుతూ  ఒక పేరా ఉంది. దీంతో  "న్యాయం ఆలస్యం కావడం అంటే న్యాయం నిరాకరించబడడమే" అని కూడా  పేర్కొంది.

తాజా పుస్తకంలో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న "సవాళ్ళలో" "తగిన సంఖ్యలో న్యాయమూర్తులు లేకపోవడం, సంక్లిష్టమైన చట్టపరమైన విధానాలు,పేలవమైన మౌలిక సదుపాయాలు వంటి బహుళ కారణాల వల్ల న్యాయవ్యవస్థలోని వివిధ స్థాయిలలో అవినీతి పెరిగిందనీ,  పెద్ద ఎత్తున కేసుల పెండింగ్‌లో ఉన్నాయని  ఈ అధ్యాయంలో పేర్కొంది.  అంతేకాదు  కొత్త పుస్తకంలో వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న సుమారు కేసుల సంఖ్యను  కూడా పొందుపర్చింది. దీని ప్రకారం సుప్రీం కోర్టులో 81వేల కేసులు,  హైకోర్టులలో 62,40,000 కేసులు, జిల్లా మరియు దిగువ కోర్టుల్లో: 4,70,00,000 కేసులు పెండింగ్‌లో  ఉన్నాయి.


జవాబుదారీతనం  మరియు  ఫిర్యాదులు:
న్యాయమూర్తులు కోర్టులోనే కాకుండా, బయట కూడా పాటించాల్సిన ప్రవర్తనా నియమావళి (Code of Conduct) గురించి కొత్త పుస్తకం వివరించింది. న్యాయవ్యవస్థలో జవాబుదారీతనం కోసం అంతర్గత వ్యవస్థ ఉందని, CPGRAMS ద్వారా ఫిర్యాదులు స్వీకరించే విధానం ఉందని పేర్కొంది. 2017 -2021 మధ్య కాలంలో ఇటువంటి 1,600 ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించింది.

అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఉంటే, పార్లమెంటు విచారణ జరిపి 'అభిశంసన తీర్మానం' (Impeachment) ద్వారా న్యాయ మూర్తిని తొలగించవచ్చే అంశాన్ని ఈ  పుస్తకంలో వివరించారు. 

ఇదీ చదవండి: ఒక్క చిట్కాతో సిజేరియన్‌ తరువాత 15 కిలోలు తగ్గిన డాక్టర్‌

మాజీ ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు
"దురదృష్టవశాత్తు, న్యాయవ్యవస్థలో కూడా అవినీతి, దుష్ప్రవర్తన వంటి సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇవి వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. అయితే, ఈ సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించడం ద్వారానే తిరిగి ఆ నమ్మకాన్ని నిర్మించగలం. పారదర్శకత, జవాబుదారీతనం అనేవి ప్రజాస్వామ్య విలువలు." అంటూ జూలై 2025లో మాజీ ప్రధాన న్యాయమూర్తి (CJI) బి.ఆర్. గవాయ్ చేసిన వ్యాఖ్యలను కూడా ఈ పుస్తకం ఉటంకించింది

విద్యా సంవత్సరం ముగిసే సమయానికి ఈ పుస్తకాన్ని విడుదల చేయడంపై వస్తున్న విమర్శల గురించి ఎన్‌సీఇఆర్‌టీ డైరెక్టర్ డీపీ సక్లానీ ఇంకా స్పందించలేదు.
ఇదీ చదవండి: పెంపుడు కుక్క నాకింది, 24 గంటల్లోనే కోమాలోకి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement