పెంపుడు కుక్క నాకింది, 24 గంటల్లోనే కోమాలోకి | UK Woman Loses All 4 Limbs After A Dog Lick Causes Sepsis, Doctors Warn It Can Happen To Anyone, Shocking Details Inside | Sakshi
Sakshi News home page

పెంపుడు కుక్క నాకింది, 24 గంటల్లోనే కోమాలోకి

Feb 23 2026 10:55 AM | Updated on Feb 23 2026 11:51 AM

Woman Loses 4 Limbs After A Dog Lick Causes Sepsis  check shocking details

కుక్క కరిస్తే  ప్రమాదం. సరియైన సమయంలో చికిత్స తీసుకోకపోతే  ప్రాణాంతకం కానీ, కుక్క నాకినా కూడా ప్రమాదకరమే. కుక్క నాకడం వల్ల సెప్సిస్ సోకి నాలుగు అవయవాలను కోల్పోయిందో  మహిళ.   దిగ్భ్రాంతికరమైన ఈ షాకింగ్‌ మరియు ప్రాణాంతక పరిస్థితి గురించి  తెలుసుకోవలసిన విషయాలు.

పెంపుడు కుక్కను ఎంతగానో ప్రేమించే ఒక మహిళ కేవలం 24 గంటల్లోనే మృత్యువు అంచులదాకా వెళ్లిపోయింది. చివరికి  కాళ్లు చేతులను  పోగొట్టుకుంది. 2025 జూలైలో, యూకేకు చెందిన 52 ఏళ్ల మంజిత్ సంఘా పెంపుడు కుక్కను ముద్దు చేస్తూ శనివారం  కాసేపు ఆడుకుంది. ఈ సయయంలోఆమె చేతికున్న గాయాన్ని నాకింది. ఆదివారం మధ్యాహ్నం పని నుండి ఇంటికి వచ్చినప్పుడు ఆమెకు ఒంట్లో నలతగా అనిపించింది. మరుసటి రోజు ఉదయానికి ఆమె స్పృహ కోల్పోయింది. ఆమె చేతులు , కాళ్లు మంచులా చల్లగా మారిపోయాయి, పెదవులు నీలం రంగులోకి మారాయి. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడింది. దీంతో ఆమెను వోల్వర్‌హాంప్టన్‌లోని న్యూ క్రాస్ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చేర్చారు.

32 వారాల పాటు మంజిత్ సంఘా  ఆసుపత్రిలో ఉండిపోవాల్సి వచ్చింది. ఆరుసార్లు  గుండెపోటు వచ్చింది. పలు  శస్త్రచికిత్సల తర్వాత ప్రాణాలతో బయటపడి చివరికి ఇంటికి చేరింది.  కానీ ఒక చిన్న గీత లేదా గాయంపై నాకడం వల్ల సెప్సిస్ బారిన పడి,  రెండు చేతులు, రెండు కాళ్లను తొలగించాల్సి వచ్చింది (Quadruple Amputation).  వీటితో పాటు ఆమె ప్లీహాన్ని (Spleen) కూడా తొలగించాల్సి వచ్చింది. 24 గంటల్లోపే ఇంత దారుణం జరుగుతుందని అస్సలు అనుకోలేదని వాపోయారు.  ఆదివారం పనికి వెళ్లింది, సోమవారం రాత్రికి కోమాలోకి వెళ్లిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆమెకున్న చిన్న గాయాన్ని నాకడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ ప్రారంభమై ఉండవచ్చని వైద్యులు తెలిపారు. కాప్నోసైటోఫాగా కానిమోర్సస్ (Capnocytophaga canimorsus) అనే బ్యాక్టీరియా కుక్కలలో ఉంటుంది. ఇది వాటికి హాని చేయదు. కానీ, మనుషుల్లో ఇది సెప్సిస్ వంటి తీవ్రమైన అనారోగ్యానికి లేదా మరణానికి దారితీస్తుంది. ఇది లాలాజలం ద్వారా రక్తప్రవాహంలోకి చేరింది.  


సెప్సిస్ అంటే ఏమిటి?
సెప్సిస్ అనేది ఒక ఇన్ఫెక్షన్‌కు శరీరం ప్రతిస్పందించే ప్రాణాంతక స్థితి. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ పొరపాటున ఆరోగ్యకరమైన కణజాలాలను,అవయవాలను నాశనం చేస్తుంది. దీని ఫలితంగా శరీరం అంతటా వాపు (Inflammation) వస్తుంది.

తీవ్రమైన సందర్భాల్లో, సెప్సిస్ సెప్టిక్ షాక్‌గా మారుతుంది, ఇది రక్తపోటును ఒక్కసారిగా పడిపోతుంది. తద్వారా కణజాల నష్టం, బహుళ అవయవాల వైఫల్యం , మరణానికి దారితీస్తుంది. దీన్ని ముందుగానే గుర్తించి చికిత్స చేయడం చాలా ముఖ్యం.

సెప్సిస్ -ఆరోగ్య సమస్యలు (Complications)
రక్తపోటు గణనీయంగా పడిపోయి, సెప్టిక్ షాక్ కారణంగా అవయవాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. ఆక్సిజన్ అందక కణజాలం దెబ్బతింటుంది.

ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోయి, ఆక్సిజన్ తీసుకోవడం కష్టమవుతుంది.అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS)కు దారితీస్తుంది. రోగులకు వెంటిలేటర్ అవసరం పడుతుంది.

డిసమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోగ్యులేషన్ (DIC) అంటే శరీరం అంతటా అసాధారణంగా రక్తం గడ్డకట్టడం జరుగుతుంది. దీనివల్ల రక్త ప్రసరణ ఆగి అవయవాలు దెబ్బతినడమే కాకుండా, రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. మూత్రపిండాలు ఫెయిల్‌ అవుతాయి. దీనివల్ల డయాలసిస్ అవసరం కావచ్చు. సెప్సిస్ నుండి కోలుకున్న తర్వాత కూడా చాలా మంది అలసట, జ్ఞాపకశక్తి తగ్గడం, కండరాల బలహీనత మరియు మానసిక మార్పులతో బాధపడతారు.

ఇదీ చదవండి: బంగారాలూ..మీరే నా సర్వస్వం : నటుడి భావోద్వేగ సందేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement