Nepal: నదిలో పడిన బస్సు.. 18 మంది మృతి | Nepal passenger bus fell into a river killing 18 people | Sakshi
Sakshi News home page

Nepal: నదిలో పడిన బస్సు.. 18 మంది మృతి

Feb 23 2026 7:58 AM | Updated on Feb 23 2026 8:41 AM

Nepal passenger bus fell into a river killing 18 people

ఖాట్మండు: నేపాల్‌లోని ధాడింగ్ జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు అదుపుతప్పి సమీపంలోని నదిలో పడటంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అతివేగం లేదా సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.

 


ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నది ప్రవాహం బలంగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించామని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక పోలీస్ యంత్రాంగం తెలిపింది. ఈ ఘటనతో ధాడింగ్ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

 

 


 

Advertisement
 
Advertisement
Advertisement