వైద్యం వికటించి చిన్నారి మృతి.. వైద్యులపై దాడి | Child dies due to medical negligence in Bandlaguda | Sakshi
Sakshi News home page

వైద్యం వికటించి చిన్నారి మృతి.. వైద్యులపై దాడి

Feb 21 2026 5:48 PM | Updated on Feb 21 2026 8:59 PM

Child dies due to medical negligence in Bandlaguda

సాక్షి హైదరాబాద్: బండ్లగూడలో  విషాదం జరిగింది.  వైద్యం వికటించి ఓ పసికందు మృతిచెందింది. దీంతో పాప తరపు బంధువులు ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశారు. దీంతో  ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిన్నారికి తీవ్ర జ్వరం రావడంతో ఆమె తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో డాక్టర్ ఇంజెక్షన్ వేశారు. అయితే అది వికటించి ఆ పాప మృతి చెందింది.

దీంతో డాక్టర్ల నిర్లక్షంతోనే పాప మృతి చెందిందని తీవ్ర ఆగ్రహానికి గురైన పాప తరపు బంధువులు అక్కడి వైద్యులపై దాడి చేశారు. దాడి నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

 

Advertisement
 
Advertisement
Advertisement