మైక్రో ఫైనాన్స్ వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్య | Man commits suicide due to microfinance harassment | Sakshi
Sakshi News home page

మైక్రో ఫైనాన్స్ వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్య

Feb 21 2026 5:02 PM | Updated on Feb 21 2026 5:16 PM

Man commits suicide due to microfinance harassment

సాక్షి జగిత్యాల:  ఇబ్రహీంపట్నంలో విషాదం చోటుచేసుకుంది. తీసుకున్న బాకీ ఎట్టిపరిస్థితుల్లో చెల్లించాలంటూ మైక్రోఫైనాస్స్ సంస్థ ప్రతినిధులు వేధించడంతో సదరు వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇబ్రహీంపట్నంకు చెందిన లక్కం రాజశేఖర్ అనే వ్యక్తి ఒక మైక్రో ఫైనాన్స్ సంస్థలో రూ. 40 వేలు అప్పుగా తీసుకున్నారు. అయితే పలు కారణాలతో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేక పోయాడు. 

దీంతో ఎలాగైనా అప్పు చెల్లించాలని ఆ మైక్రోఫైనాన్స్ సంస్థ వేధింపులకు గురి చేయడంతో అప్పు తీర్చలేక తన ఇంటిలోనే ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపడుతున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement