ప్రియురాలి మృతి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య | Software employee commits suicide in Bheemili | Sakshi
Sakshi News home page

ప్రియురాలి మృతి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

Feb 21 2026 3:53 PM | Updated on Feb 21 2026 4:05 PM

Software employee commits suicide in Bheemili

సాక్షి విశాఖపట్నం: భీమిలీలో విషాదం చోటుచేసుకుంది.  స్థానికంగా గల ఒక హోటల్ లో శ్యాం కూమార్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఉద్యోగి మృతికి ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొద్దిరోజుల క్రితం తన ప్రియురాలితో  శ్యాంకుమార్ గొడవపడ్డారు. 

ఈ నేపథ్యంలో కలత చెందిన తన ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయమై ఆ అమ్మాయి బంధువులు శ్యాంకుమార్ పై హైదరాబాల్ లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  దీంతో భయపడిన శ్యాంకుమార్ హోటల్ లో ఆత్మహత్యకు పాల్పడ్డట్లు భావిస్తున్నారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.  అమ్మాయి స్వస్థలం అనకాపల్లి కాగా ప్రియుడు శ్యాంకూమార్ హైదరాబాద్ కు చెందిన వాడిగా పోలీసులు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement