మైనర్‌ బాలుడితో కోడలు వివాహేతర బంధం..! | Chittoor Extramarital Affair Incident | Sakshi
Sakshi News home page

మైనర్‌ బాలుడితో కోడలు వివాహేతర బంధం..!

Feb 21 2026 2:00 PM | Updated on Feb 21 2026 2:00 PM

Chittoor Extramarital Affair Incident

చిత్తూరు అర్బన్‌: వివాహేతర సంబంధం మోజులో భర్త, అత్తను చంపడానికి ప్లాన్‌ చేసిన కవిత అలియాస్‌ వేలాంగని (37) అనే మహిళను చిత్తూరు వన్‌టౌన్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. గిరింపేటకు చెందిన ఈ మహిళ, ఓ మైనర్‌ బాలుడితో వివాహేతర బంధం ఏర్పరచుకుని.. అడ్డుగా ఉన్న తన భర్త, అత్తను చంపాలని ప్లాన్‌ చేసిన విషయం తెలిసిందే.

 దీంతో ఈనెల 3వ తేదీ రాత్రి ఇంట్లో అత్త ఒక్కటే ఉండడంతో ఆమె కళ్లల్లో కారం కొట్టింది ఆపై ఆమె అత్త గొంతు కోసిన మైనర్‌ బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ మరుసటి రోజున బాలుడిను అరెస్టు చేసి.. తిరుపతి జువెనైల్‌ హోమ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మహిళను ఎస్‌ఐ నాగప్ప నాయక్‌ అరెస్టు చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో చిత్తూరు నగరంలోని జిల్లా జైలుకు తరలించారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement