పగలు సెలూన్‌ యజమాని.. రాత్రి లేడీ డాన్‌ | Delhi Lady Don Dual Life: Salon Owner By Day Madam Zeher By Night | Sakshi
Sakshi News home page

పగలు సెలూన్‌ యజమాని.. రాత్రి లేడీ డాన్‌

Feb 20 2026 8:55 AM | Updated on Feb 20 2026 9:18 AM

Delhi Lady Don Dual Life: Salon Owner By Day Madam Zeher By Night

ఢిల్లీ: గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తరపున డ్రగ్స్ సిండికేట్‌ను నడుపుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అలియాస్‌ నేహాను ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈమె బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన కీలక షూటర్, ఆయుధ సరఫరాదారుడు బాబీ కబూతర్‌కు చిరకాల భాగస్వామి. వీరితో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నేహా ఉత్తర-తూర్పు ఢిల్లీలో బ్యూటీ పార్లర్‌ను నిర్వహిస్తూ సాధారణ మహిళగా చలామణి అయ్యేది. అయితే, బ్యూటీ పార్లర్ ముసుగులో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, పోలీసుల విచారణలో నేహ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. మహిపాల్‌పూర్ ఫ్లైఓవర్ సమీపంలో వీరిని అరెస్ట్ చేసినప్పుడు భారీ మొత్తంలో డ్రగ్స్ లభించాయి. నేహా, బాబీ గత ఏడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.

బాబీ కబూతర్.. లారెన్స్ బిష్ణోయ్, హషీమ్ బాబా ముఠాలకు ప్రధాన లాజిస్టిక్స్ లింక్‌గా వ్యవహరిస్తున్నట్లు విచారణలో తేలింది. దాదాపు ఏడేళ్ల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న బాబీ కబూతర్‌ చివరికి పోలీసులకు చిక్కాడు. నేపాల్-భారత సరిహద్దు సమీపంలో ఇటీవల అరెస్ట్ అయిన దేశంలోనే అతిపెద్ద అక్రమ ఆయుధ వ్యాపారిగా పేరున్న సలీం పిస్టల్ నుంచి ఆయుధాలను సేకరించి ముఠా సభ్యులకు అందించేవాడు.  సలీం పిస్టల్ వద్ద నుంచి బాబీ కబూతర్ ఆయుధాలను సేకరించాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. సలీం పిస్టల్‌ను పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు అధికారులు వెల్లడించారు.

బాబీ కబూతర్.. మొదట నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని నాసిర్ గ్యాంగ్‌లో ఉండేవాడు. ఆ తర్వాత హషీమ్ బాబాతో కలిసి లారెన్స్ బిష్ణోయ్ సిండికేట్‌లో చేరాడు. పలు సంచలన కేసులలో నిందితుడిగా ఉన్నాడు. బరేలీలోని నటి దిశా పటాని ఇంటి బయట జరిగిన కాల్పుల ఘటనలో షూటర్లకు ఆయుధాలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది ఢిల్లీలోని జాఫ్రాబాద్‌లో ఇద్దరు సోదరులపై జరిగిన కాల్పుల్లో బాబీ కబూతర్ స్వయంగా పాల్గొన్నట్లు సమాచారం. ఆ ఘటనలో సుమారు 48 రౌండ్ల కాల్పులు జరిగాయి. 2024లో గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో జరిగిన ఈ హత్యలో షూటర్లకు లాజిస్టిక్ సాయం అందించాడని పోలీసుల విచారణలో తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement