అమెరికా కోడలు.. మూడు రోజుల పెళ్లి! | traditional Telugu wedding in Chittoor with an American bride | Sakshi
Sakshi News home page

అమెరికా కోడలు.. మూడు రోజుల పెళ్లి!

Feb 21 2026 1:44 PM | Updated on Feb 21 2026 1:44 PM

 traditional Telugu wedding in Chittoor with an American bride

 తెలుగు సంప్రదాయాన్ని మరువని పూజారి కుటుంబం 

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): పిల్లల చదువుల కోసం ప్రభుత్వ ఉద్యోగాలను సైతం వదులుకుని అమెరికా వెళ్లిన ఓ పూజారి కుటుంబం అక్కడే స్థిరపడినాం తమ మూలాలను మాత్రం మరువలేదు. ఎంఎస్‌ పూర్తి చేసిన తన కుమారుడికి అమెరికా దేశానికి చెందిన యువతిని కోడలుగా చేసుకున్న ఆ కుటుంబం, పెళ్లి వేడుకను మాత్రం అచ్చం తెలుగు సంప్రదాయంలో ఘనంగా నిర్వహించింది. చిత్తూరులోని మామిడి రిసార్ట్‌లో మూడు రోజుల పాటు మంగళ వాయిద్యాల నడుమ పెళ్లి వేడుక జరిగింది.

సంగీత్, హల్దీ, మెహందీ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగగాం.. ఇరు కుటుంబాల పెద్దలు సంప్రదాయ నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశ విదేశాల నుంచి బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. అమెరికా కోడలు తెలుగు ఆచారాలను ఆచరించడం అక్కడికి వచ్చిన వారిని ఆశ్చర్యపరిచింది.  విదేశాల్లో పెరిగిన యువతీ, యువకులు సైతం తెలుగు సంస్కృతిని గౌరవిస్తూ మూడు రోజుల పెళ్లి జరపడం అందరికీ ఆదర్శంగా నిలిచింది.  

Advertisement
 
Advertisement
Advertisement