ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ వ్యవహార శైలి.. వైఎస్ జగన్ ట్వీట్‌ | Ys Jagan Fires On Youth Congress Behavior In Ai Summit | Sakshi
Sakshi News home page

ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ వ్యవహార శైలి.. వైఎస్ జగన్ ట్వీట్‌

Feb 21 2026 1:24 PM | Updated on Feb 21 2026 1:36 PM

Ys Jagan Fires On Youth Congress Behavior In Ai Summit

సాక్షి, తాడేపల్లి: ఏఐ సమ్మిట్‌లో నిన్న(శుక్రవారం, ఫిబ్రవరి 20) యూత్ కాంగ్రెస్ వ్యవహార శైలిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తల తీరు మనందరినీ సిగ్గుపడేలా చేసిందంటూ ట్వీట్ చేశారు. ‘‘అసలు మన రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి?. ఎవరూ మన దేశాన్ని ఎప్పుడూ కించపరచకూడదు. మన మధ్య రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా.. ప్రపంచం ముందు అందరం ఐక్యంగా ఉండాలి’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

కాగా, ఇండియా కృత్రిమ మేధ(ఏఐ) ఇంపాక్ట్‌ సదస్సులో ఎగ్జిబిషన్‌ హాల్‌ నంబర్‌–5 వద్ద యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన తెలపడం కలకలం సృష్టించింది. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పదుల సంఖ్యలో కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. హఠాత్తుగా టీ–షర్టులు విప్పేసి తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. భారత్‌–అమెరికా వాణిజ్య ఒప్పందానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఆయా టీ–షర్టులపై ముద్రించి ఉన్నాయి.

అంతేకాకుండా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫొటోలు కూడా ఉన్నాయి. ‘ఎప్‌స్టీన్స్‌ ఫైల్స్‌’, ‘మోదీ రాజీపడ్డారు’అనే వాక్యాలు కూడా ముద్రించారు. నిరసన తెలియజేస్తున్న యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలను సదస్సుకు హాజరైన కొందరు ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలను అడ్డుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement