ఆకతాయిల చేష్టలు.. భయాందోళనలో ప్రజలు | ai generated tiger photo at bharat petrol pump in sircilla | Sakshi
Sakshi News home page

ఆకతాయిల చేష్టలు.. భయాందోళనలో ప్రజలు

Feb 21 2026 1:06 PM | Updated on Feb 21 2026 1:09 PM

ai generated tiger photo at bharat petrol pump in sircilla

పెట్రోల్‌బంకులో పెద్దపులి ఉన్నట్లు ప్రచారం

ఏఐతో సృష్టించి.. సోషల్‌ మీడియాలో పోస్టు చేసి 

తంగళ్లపల్లి(సిరిసిల్ల): గుర్తుతెలియని ఆకతాయి చేష్టలకు జిల్లా ప్రజలు శుక్రవారం భయాందోళనకు గురయ్యారు. టెక్నాలజీని వినియోగించుకొని పెట్రోల్‌బంక్‌లోకి పులి వచ్చినట్లు ఏఐ ఫొటో క్రియేట్‌ చేసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. శుక్రవారం జిల్లాలో ఇద్దరు కలిస్తే చాలు ఈ విషయాన్ని చర్చించుకోవడం కనిపించింది. 

ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌(ఏఐ) ద్వారా రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మనగర్‌లోని భారత్‌ పెట్రోల్‌ బంకులోకి పులి వచ్చినట్లు ఫొటో క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీన్ని చూసిన జనం భయాందోళనకు గురయ్యారు. దీనిపై ఎస్సై ఉపేంద్రచారి మాట్లాడుతూ పద్మనగర్‌కు చెందిన కొందరు యువకులు ఈ తుంటరి పనిచేసినట్లు గుర్తించామన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement