వైఎస్సార్‌సీపీ నేతలపై కొనసాగుతున్న ప్రభుత్వ కక్ష సాధింపు | YSRCP Leaders Face Government Targeted Action, Ambati Rambabu Receives Section 30 Notice | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేతలపై కొనసాగుతున్న ప్రభుత్వ కక్ష సాధింపు

Feb 21 2026 3:14 PM | Updated on Feb 21 2026 4:01 PM

AP Government Vendetta Against YSRCP Leaders

రాజమండ్రి:  వైఎస్సార్‌సీపీ నేతలపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి ఈనెల 19వ తేదీన రాజమండ్రి నుండి గుంటూరుకు అంబటి రాంబాబు బయల్దేరిన సమయంలో సెక్షన్‌ 30 నోటీసులు అందజేశారు పోలీసులు. 

అంబటి కాన్వాయ్‌కు అడగడుగునా అడ్డు తగిలిన పోలీసులు..  సెక్షన్‌ 30 కింది అంబటి రాంబాబుకి, జక్కంపూడి రాజాకు నోటీసులు ఇచ్చారు. దాంతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలపై కూడా కేసులు నమోదు చేశారు ప్రకాశ్‌ నగర్‌ పోలీసులు.

కాగా, మంగళవారం(ఫిబ్రవరి 19వ తేదీ) రాజమండ్రి నుంచి గుంటూరుకు బయల్దేరిన అంబటి రాంబాబుకు అడగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. అంబటి కాన్వాయ్‌ను పదే పదే అడ్డుకున్నారు.  ప్రతి వంద మీటర్లకు ఒకసారి కాన్వాయ్ లో అంబటి వాహనం వెనకాల ఉన్న  వాహనాలను నిలిపి వేశారు పోలీసులు. 

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి.. అనుమతిస్తే కారులో వెళతానని, అలాకాకుండా తన వెనకాల నుంచి వచ్చే వాహనాలను నిలిపి వేస్తే మాత్రం.. పాదయాత్రగా వెళ్తానని అంబటి స్పష్టం చేశారు.  

తన కాన్వాయ్‌ అడ్డుపడటమే కాకుండా, సెక్షన్‌ 30 కింద నోటీసులు ఇవ్వడాన్ని అప్పుడే అంబటి తీవ్రంగా ఖండించారు. తన ఇంటిపై దాడి చేసినప్పుడు రాని సెక్షన్‌ 30, ఇప్పుడు తాను కాన్వాయ్‌లో బయల్దేరితే వచ్చేసిందా అంటూ మండిపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement