ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి | Seven Passengers Dies After Collision Between Truck And Car In Gujarat Valasad, Watch Shocking Video Inside | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

Feb 20 2026 5:35 PM | Updated on Feb 20 2026 5:48 PM

Seven dies After Collision Between Truck And Car In Gujarat Valasad

గాంధీనగర్‌: గుజరాత్‌లో వలసాడ్ జిల్లాలో శుక్రవారం రహదారులు రక్తసిక్తమయ్యాయి. లారీ - కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.  

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వలసాడ్ జిల్లా కప్రాడా ప్రాంతంలోని కుంభఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారు,లారీ  ఢీకొనడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఢీకొన్న వెంటనే కారులో ఉన్న పలువురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే క్షతగాత్రులు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. 

 ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement