ఢిల్లీ: ఓ అక్కా, ఆమె తమ్ముడు కలిసి ఓ యువకుడి ప్రాణం తీశారు. డ్రైవింగ్ సీట్లో తమ్ముడు కారు నడుపుతుండగా, అక్క అతడితో రీల్స్ చేస్తోంది. రీల్స్ చేస్తుండగా కారు అదుపు తప్పింది. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ కేసులో అరెస్టైన నిందితుడు కొన్ని గంటల్లోనే మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యాడు. కారణం నిందితుడు పదోతరగతి పబ్లిక్ పరీక్షలు రాయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విషాద ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఢిల్లీకి చెందిన సాహిల్ ధనేశ్రా (23). గుండె నిండా ఆశలు, కళ్ల నిండా కోరికలు, ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకుడు. ఫిబ్రవరి 3న సాహిల్ తన ఇంటి నుంచి బైక్‌పై బయల్దేరాడు. ఉదయం 11:57 గంటలకు ద్వారకాలోని లాల్ బహదూర్ శాస్త్రి కళాశాల సమీపంలో ఉండగా సాహిల్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాద సమయంలో అక్క రీల్స్ చేస్తుండగా డ్రైవింగ్ సీట్లు ఉన్న ఆమె తమ్ముడు ఎదురుగా బైక్‌పై వస్తున్న సాహిల్‌ను బలంగా డీకొట్టాడు. అతడి బైక్ నుజ్జునుజ్జైంది. మూడు భాగాలుగా విడిపోయింది.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా, స్కార్పియో, స్విఫ్ట్ డిజైర్ టాక్సీ, అలాగే సాహిల్ బైక్ చెల్లాచెదురుగా పడినట్లు గుర్తించారు. రోడ్డు పక్కనే రక్తమోడుతూ సాహిల్ పడి ఉన్నాడు. అప్పటికే అతడు మరణించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
In a devastating Delhi road acc!dent on February 3, 2026, 23-year-old Sahil Dhanera (also referred to as Sahil Dhaneshra or Kabir), a property dealer and only child, was k!Iled when his bike was allegedly struck by a Mahindra Scorpio in Dwarka. The SUV, driven by a 17 year-old… pic.twitter.com/A7eahZJhMt
— Weapon. (@sk465g) February 17, 2026
కేసు నమోదు చేసుకున్న ద్వారకా సౌత్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో, రాంగ్ రూట్‌లో వచ్చిన స్కార్పియో ఎదురుగా వస్తున్న సాహిల్ బైక్‌ను ఢీకొట్టి, ఆ తర్వాత అక్కడే నిలిపి ఉంచిన టాక్సీని ఢీకొట్టినట్లు తేలింది. టాక్సీ డ్రైవర్ అజిత్ సింగ్ కూడా గాయపడి ఐజీఐ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అతని వాంగ్మూలం పోలీసులు నమోదు చేశారు.
నిందితుడికి తాత్కాలిక బెయిల్
స్కార్పియో నడిపిన వ్యక్తి మైనర్. అతనికి సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ప్రమాదం అనంతరం అదుపులోకి తీసుకుని, జువెనైల్ జస్టిస్ బోర్డు (JJB) ముందు హాజరుపరిచారు. కోర్టు మొదట అబ్జర్వేషన్ హోంకి పంపారు. కానీ ఫిబ్రవరి 10న జేజేబీ ఆ బాలుడికి తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. కారణం అతడు 10వ తరగతి బోర్డు పరీక్షలు రాయాల్సి ఉండటమేనని తెలిపింది.
అటాప్సీ రిపోర్టులో ఏముందంటే?
తాజాగా విడుదలైన ఆటాప్సీ రిపోర్టులో కూడా ప్రమాద తీవ్రత కారణంగానే సాహిల్ మరణించినట్లు తేలింది. అక్కా–తమ్ముడు రీల్స్ పిచ్చి కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో సాహిల్ తల ఎడమ వైపు కపాలం పగిలింది. తలలో రక్తం గడ్డకట్టింది. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. మెదడు వాసింది. ఊపిరితిత్తుల్లోకి రక్తం చేరింది. గుండెకు రక్షణగా ఉండే ఎముకలు విరిగాయి. గుండె లోపల తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ గాయాల కారణంగానే సాహిల్ మరణించినట్లు ఆటాప్సీ రిపోర్టులో తేటతెల్లమైంది.
స్టంట్స్ చేస్తూ రీల్స్
సాహిల్ మరణంపై అతని తల్లి ఇన్నా మకాన్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మీ ఆనందం కోసం నా కొడుకు బలితీసుకున్నారని గుండెలవిసేలా ఏడుస్తున్నారు. సాహిల్ మరణంపై ఇన్నా మకాన్ మాట్లాడుతూ... ప్రమాదం జరిగే సమయంలో స్కార్పియోలో ఉన్న నిందితుడు అతని సోదరి రీల్స్ చేస్తున్నారని ఆరోపించారు. అందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలే కారణమని అన్నారు. ‘నా కొడుకు ఫిబ్రవరి 3న ఆఫీసుకు వెళ్తున్నాడు. ఆ సమయంలో మైనర్ నిందితుడు తన సోదరితో కలిసి సరదా రీల్స్ చేయడానికి స్కార్పియోలో బయటకు వచ్చాడు. స్కార్పియోను నడుపుతున్న నిందితుడు వేగంగా డ్రైవింగ్ చేస్తున్నాడు. బస్సు వస్తుంటే.. ఎదురుగా వెళ్లి కట్ కొట్టాడు. మీ ఆనందం కోసం నా కొడుకును బలితీసుకుంటారా? అని ప్రశ్నించారు. సాహిల్ మరణంలో తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
A chilling video has emerged showing the moments before a speeding Mahindra Scorpio, allegedly driven by a 17-year-old without a valid licence, collided head-on with a motorcycle, killing 23-year-old Sahil Dhaneshra on February 3 near Lal Bahadur Shastri College. The victim’s… pic.twitter.com/uMnargen22
— Orissa POST Live (@OrissaPOSTLive) February 17, 2026


