న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఏఐ సదస్సు రెండో రోజు(మంగళవారం) అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనేది కేవలం సాంకేతికత మాత్రమే కాదని, అది సామాన్యుడి సంక్షేమానికి ఉపయోగపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
అందుబాటులోకి ఏఐ కళ్లద్దాలు
ఈ సందర్భంగా భారత్ సొంతంగా అభివృద్ధి చేసిన ‘సర్వం కాజే’ (Sarvam Kaze) అనే ఏఐ వేరబుల్ పరికరాన్ని ధరించి ఆయన స్వయంగా పరీక్షించారు. ఇది చూడడానికి సాధారణ కళ్లద్దాల మాదిరిగా ఉన్నప్పటికీ, అత్యాధునిక ఏఐ సాంకేతికతను కలిగి ఉంది. రాబోయే మే నెల నుంచి ఈ స్వదేశీ పరికరాలు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయని సదస్సులో ప్రతినిధులు వెల్లడించారు.
#WATCH | Delhi | Union Minister Rajiv Ranjan, Bihar Deputy CM Samrat Choudhary, JD(U) MP Sanjay Kumar Jha and Bihar Minister Dilip Jaiswal visit the Bihar pavilion at #IndiaAIImpactSummit2026 pic.twitter.com/XX8lBiQmyO
— ANI (@ANI) February 17, 2026
విద్యా రంగంలో సరికొత్త విప్లవం
భారతదేశాన్ని గ్లోబల్ ఏఐ హబ్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. రాబోయే కాలంలో డేటా సెంటర్ల రంగంలో సుమారు 200 బిలియన్ డాలర్ల(రూ.18.15 లక్షల కోట్లు) పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ కార్యక్రమంలో వెల్లడించారు. మరోవైపు, విద్యా రంగంలో ఏఐ పాత్రపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగిస్తూ, రాబోయే తరానికి ఏఐ ఆధారిత విద్యను అందించడం తమ ప్రధాన ప్రాధాన్యత అని పేర్కొన్నారు.
#WATCH | Delhi: India AI Impact Summit 2026 | Dr Ramanand, Founder-Director, Centre of Policy Research and Governance (CPRG) says, "The AI Summit is being held in India. The first Summit was held in France. After Europe, it is being held in India, and India is being looked at… pic.twitter.com/2IGiJgtryp
— ANI (@ANI) February 17, 2026
చాట్ జీపీటీతో భారత్‌కు అత్యధిక ప్రయోజనం
జోహో (ZOHO) వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబూ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఏఐ ఒక అద్భుతమైన ‘లెర్నింగ్ బూస్టర్’లా పనిచేస్తుందని, ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఇది గొప్ప సాధనంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఏఐ అభివృద్ధిలో సమానత్వం ఉండాలని, లేకపోతే ప్రపంచ సమాజంలో తీవ్ర అసమానతలు తలెత్తే ప్రమాదం ఉందని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ హెచ్చరించారు. చాట్ జీపీటీ (ChatGPT) వంటి సంస్థలకు అమెరికా కంటే భారత్ 33 శాతం ఎక్కువ డేటాను అందిస్తోందని ఆయన గుర్తు చేశారు.
ఏఐతో మరిన్ని ఉపాధి అవకాశాలు
గ్లోబల్ సౌత్ దేశాలు కేవలం డేటాను అందించే వనరులుగా మాత్రమే మిగిలిపోకూడదని, ఈ సాంకేతికత వల్ల కలిగే లాభాల్లో వీరికి సమాన వాటా దక్కాలని ప్యానెల్ చర్చల్లో అభిప్రాయపడ్డారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనలను ఆయన తోసిపుచ్చుతూ, ఈ సాంకేతికత కొత్త తరహాలో మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని అమితాబ్ కాంత్ అన్నారు.
India AI Impact Expo 2026 was a powerful convergence of ideas, innovation and intent.
It showcased the extraordinary potential of Indian talent in shaping the future of Artificial Intelligence for global good.
Above all, it reaffirmed our commitment to harnessing AI… pic.twitter.com/jfVWCP4BHh— Narendra Modi (@narendramodi) February 17, 2026
చిన్నారుల భద్రతపై కీలక చర్చలు
ఈ మెగా సమిట్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. బిల్ గేట్స్ ఈ సదస్సులో పాల్గొంటారని గేట్స్ ఫౌండేషన్ స్పష్టం చేయగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా హాజరుకానున్నారు. సుమారు 20 దేశాల అధినేతలు, 60 మందికి పైగా మంత్రులు ఈ చర్చల్లో భాగస్వాములవుతున్నారు. సదస్సులో భాగంగా చిన్నారుల భద్రతపై కీలక చర్చలు జరిగాయి. వారి భద్రత కోసం ప్రత్యేక చట్టాలు అవసరమని నిపుణులు సూచించారు. ఆరోగ్య రంగంలో ఏఐ విప్లవాత్మక మార్పులు తెస్తుందని, అయితే డిజిటల్ వ్యసనంపై అప్రమత్తంగా ఉండాలని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: అందరికీ ఏఐ ఫలాలు: ప్రధాని మోదీ


