న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ నేటికి(మంగళవారం) రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ‘కృత్రిమ మేధ (ఏఐ)ప్రయోజనాలు ప్రతి పౌరుడికీ అందాలన్నదే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని అన్నారు. తెలివితేటలు, హేతుబద్ధత, నిర్ణయాత్మక సామర్థ్యం మొదలైనవాటిని ఏఐ సామాన్యులకు చేరువయ్యేలా చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘గ్లోబల్ సౌత్’లో జరుగుతున్న మొట్టమొదటి అంతర్జాతీయ స్థాయి ఏఐ సదస్సుగా ఇది చరిత్ర సృష్టిస్తోందని ప్రధాని పేర్కొన్నారు.
ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనేందుకు 20కి పైగా దేశాల అధినేతలు, 60 మంది మంత్రులు, 500 మందికి పైగా ఏఐ నిపుణులు ఢిల్లీకి చేరుకున్నారు. ఎస్టోనియా అధ్యక్షుడు అలార్ కారిస్ ఇప్పటికే ఢిల్లీ చేరుకోగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దంపతులు కూడా ఈ సదస్సులో భాగస్వామ్యం కానున్నారు. అమెరికా-భారత్ వాణిజ్య మండలి (యూఎస్‌ఐబీసీ) ఒక ప్రకటనలో ఈ సదస్సు ఇరు దేశాల ఆర్థిక బంధాలను బలోపేతం చేసే కీలక వేదికగా అభివర్ణించింది.
बुद्धिमत्ता, तर्कशीलता और निर्णय-क्षमता विज्ञान और टेक्नोलॉजी को जन-जन के लिए उपयोगी बनाती हैं। India AI Impact Summit का उद्देश्य भी यही है कि कैसे एआई का इस्तेमाल सर्वजन के हित में हो।
शुश्रूषा श्रवणं चैव ग्रहणं धारणां तथा।
ऊहापोहोऽर्थविज्ञानं तत्त्वज्ञानं च धीगुणाः॥ pic.twitter.com/qytLZxv1uh— Narendra Modi (@narendramodi) February 17, 2026
సదస్సు రెండో రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో చోటు చేసుకునే కలిగే సామాజిక మార్పులపై చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలపై ఏఐ ప్రభావం, ప్రజారోగ్యం, పిల్లల భద్రత తదితర అంశాలపై ఐక్యరాజ్యసమితి ప్రతినిధి అమన్‌దీప్ సింగ్ గిల్, నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ వంటి ప్రముఖులు ప్రసంగించనున్నారు. అలాగే, విద్యా రంగంలో ఏఐ వినియోగంపై కేంద్ర విద్యాశాఖ ప్రత్యేక రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది. సదస్సుతో పాటు నిర్వహిస్తున్న భారీ ప్రదర్శనలో 600కు పైగా స్టార్టప్‌లు తమ సాంకేతికతను ప్రదర్శిస్తున్నాయి. ఈ ప్రదర్శనను సందర్శించేందుకు సుమారు 2.5 లక్షల మంది సందర్శకులు వస్తారనే అంచనాలున్నాయి.
ఇది కూడా చదవండి: ‘తప్పులేదు.. దాచలేదు..’ అదే పాటలో ట్రంప్


