Parvathipuram Manyam
-
మద్దతు గోరంత..!
పెట్టుబడి కొండంత..పార్వతీపురం రూరల్: కూటమి ప్రభుత్వంలో సాగుబడి నానాటికీ కుదేలవుతోంది. రాబోయే ఖరీఫ్ సీజన్ (2026–27)కు సంబంధించి ప్రకటించిన కనీస మద్దతు ధరలు అన్నదాతల కష్టాలను తీర్చేలా లేకపోగా, వారిని మరింత కుంగదీసేలా ఉన్నాయి. ఎరువులు, పురుగు మందుల ధరలు రెట్టింపు అవుతుండడం, కూలీల ఖర్చులు విపరీతంగా పెరగడంతో పెట్టుబడులు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అరకొర మద్దతు ధరలు కంటితుడుపు చర్యగానే మిగిలాయి. దీనికి తోడు స్థానికంగా మార్కెట్లను క్రమబద్ధీకరించడంలో, రైతులకు అండగా నిలవడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతోందన్న ఆవేదన రైతులనుంచి క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతోంది. నామమాత్రంగా ధరల పెంపు.. ఈ ఖరీఫ్‌లో ప్రధాన పంట అయిన సాధారణ రకం వరి క్వింటాకు కేవలం రూ.72 మాత్రమే పెంచడంతో ప్రస్తుత ధర రూ.2,441కి చేరింది. గ్రేడ్–ఎ రకం వరి ధరను రూ.2,461గా నిర్ణయించారు. దీని ప్రకారం మార్కెట్లో 80 కేజీల ధాన్యం బస్తా ధర రూ.1,952 మాత్రమే పలకనుంది. ఇక అత్యధికంగా సాగయ్యే మొక్కజొన్నపై కేవలం రూ.10 (ప్రస్తుత ధర రూ.2,410), పెసరపై రూ.12 (ప్రస్తుత ధర రూ.8,780) మాత్రమే పెంచడం గమనార్హం. పత్తికి రూ.8,667, కందులుకు రూ.8,450, మినుములకు రూ.8,200 మద్దతు ధర నిర్ణయించినప్పటికీ..ఆయా పంటల పెట్టుబడి వ్యయంతో పోలిస్తే ఇవి ఏమాత్రం సరిపోవని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. . భారమవుతున్న సాగు జిల్లాలో సుమారు 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో ఇన్పుట్ సబ్సిడీలు, ఎరువుల లభ్యతపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో రైతులకు పెట్టుబడి భారం రెట్టింపైంది. ఏటా ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల ఉధృతితో పంట దిగుబడులు పడిపోతుంటే, మరోవైపు పెరిగిన కూలి రేట్లు సాగును మరింత కష్టతరం చేస్తున్నాయి. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో, చివరకు దళారులు అడిగిన కాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి అదనపు బోనస్ లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమను ఆదుకోవాలని అన్నదాతలు నిట్టూరుస్తున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి వ్యవసాయ రంగంపై, క్షేత్రస్థాయి సమస్యలపై కనీస అవగాహన గానీ, చిత్తశుద్ధి గానీ లేదు. పెట్టుబడులు కొండంత పెరిగితే, మద్దతు ధరలు గోరంత పెంచడం పాలకుల దారుణమైన వైఫల్యానికి నిదర్శనం. ఓ వైపు మార్కెట్లో నకిలీ విత్తనాలు, ఎరువుల సిండికేట్లను అణచివేయడంలో ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. సాగు ఖర్చులు పెరిగిపోవడంతో రైతు పెట్టుబడి పెట్టలేక కుదేలవుతున్నాడు. రైతు ఇబ్బందుల్లో ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు పనులు దొరకక వలసలు పోవాల్సిన దుస్థితి దాపురిస్తోంది. కేవలం కేంద్రం ప్రకటించిన ధరలతో సరిపెట్టకుండా, రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా ప్రత్యేక బోనస్ ప్రకటించి ధాన్యం కొనుగోలు చేయాలి. దళారీల దోపిడీని అరికట్టడంలో విఫలమైతే రైతులు, కూలీలను ఏకం చేసి పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం. – బీవీ రమణ, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు అరకొరగా మద్దతు ధర పెంపు వరి క్వింటాకు పెరిగిన ధర రూ.72 మొక్కజొన్నకు పది రూపాయలు పెరిగిపోతున్న పెట్టుబడులు పట్టించుకోని పాలకులు -
ఆడబిడ్డ నిధికి దిక్కేదీ?
అరచేతిలో వైకుంఠం చూపించడం అన్న సామెత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుకు సరిగ్గా సరిపోతుందని అంతా వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల ముందు ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కొత్తగా ముగ్గురు పిల్లలను కంటే రూ.30 వేలు, నలుగురు పిల్లలను కంటే రూ.40 వేలు మహిళలకు ఇస్తామంటూ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన చూసి అంతా ఈ విధంగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో ఒకరు లేదా ఇద్దరు పిల్లలను పెంచడానికే ఆ తల్లిదండ్రులు నానా యాతన పడుతున్నారు. గతంలో ఇచ్చిన హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని, అయితే గత ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలను ప్రజలెవరూ మరవలేదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని పలువురు గుర్తు చేస్తున్నారు. వీరఘట్టం/పాలకొండ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 18 నుంచి 59 ఏళ్ల లోపు వయస్సు మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసి ప్రతి మహిళకు నెలకు రూ.1500 నేరుగా ఖాతాలో జమ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రతి బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ఆ మాటలు నమ్మి చాలా మంది అక్కచెల్లెమ్మలు ఓటేశారు. అయితే ఏం లాభం? కూటమి ప్రభుత్వం ఏర్పడి 23 నెలలు కావొస్తున్నా..ఆడబిడ్డ నిధి పథకం అమలుపై నోరుమెదపడం లేదు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో గాని, మంత్రి వర్గ భేటీలో గాని ఇంతవరకు ఒక్కసారి కూడా ఆ పథకం గురించి చర్చకు రాలేదు. అంటే ఈ పథకం కూడా గాలిలో కలిపేసినట్లేనా? అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయకుండా కొత్తగా ముగ్గురు పిల్లల్ని కనండి, నలుగురు పిల్లల్ని కనండని సీఎం చంద్రబాబు ఇస్తున్న ఉచిత సలహాపై మహిళాలోకం సర్వత్రా భగ్గుమంటోంది. అమలుకాని హామీలు.. సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేశాం..ఇంకెవరైనా అమలు చేయలేదంటే వారి నాలుక మందమే అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ సభలో పలికిన మాటలివి. తీరా చూస్తే మసి పూసి మారేడు కాయ చేసి ఇచ్చాం అన్నట్లు ఉంది కూటమి ప్రభుత్వం తీరు. కుట్రలో భాగంగా పీ–4 పథకంలో ఆడబిడ్డ నిధిని తోసేసి ఇచ్చేశాం అన్నట్లు కవర్‌చేసి చంద్రబాబు మహిళలకు శఠగోపం పెట్టారు.ఆడబిడ్డ నిధి పథకాన్ని మైమరిపించేందుకు ఇప్పుడు కొత్తగా పిల్లల్ని కనండంటూ చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారని మహిళలు విమర్శిస్తున్నారు. జిల్లాలో రూ.776 కోట్ల బకాయి.. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 3,09,425 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.60 ఏళ్లు పైబడిన వారిని మినహాయిస్తే 2024 అక్టోబర్ నాటి లెక్క ప్రకారం 59 ఏళ్ల లోపు వారు 2.25 లక్షల మంది ఉన్నారు.వా రికి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.1500 చొప్పున చెల్లిస్తే నెలకు రూ.33.75 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలలకు రూ.776 కోట్లు చెల్లించాల్సి ఉంది.ఈ నగదు ఎప్పుడు చెల్లిస్తారని మహిళలు ప్రశ్నిస్తున్నారు.ఈ మెత్తాన్ని ఒకే విడతలో చెల్లించడంతో పాటు రాబోయే రోజుల్లో ప్రతినెలా రూ.1500 చెల్లించాలని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో మహిళల జీవనోపాధికి అండగా .. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళల జీవనోపాధికి పెద్దపీట వేసింది. అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, సున్నావడ్డీ, వైఎస్సార్ చేయూత లాంటి అనేక ముఖ్యమైన పథకాలన్నింటినీ నేరుగా మహిళల వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేసి వారి ఆర్థికాభివృద్ధికి అండగా నిలిచింది. మహిళల చేతికి చేరిన నగదు వృథా కాకుండా ఇంటి అవసరాలకే ఉపయోగపడుతుందని భావించి అనేక పథకాల డబ్బును మహిళల ఖాతాకే జమ చేసింది. అమలుకు నోచుకోని పథకం ఇప్పటికే ఒక్కో మహిళకు రూ.33 వేలు బకాయి 23 నెలల్లో జిల్లా మహిళలకు చెల్లించాల్సింది రూ:776 కోట్లు ఇప్పుడేమో ముగ్గుర్ని కంటే రూ.30 వేలు.. నలుగుర్ని కంటే రూ.40 వేలు.. హాస్యాస్పదమవుతున్న సీఎం చంద్రబాబు కొత్త పథకం ఎన్నికల హామీలు ఎగ్గొట్టేందుకు ఎత్తుగడ అని విమర్శలు -
భూములిచ్చిన రైతులపైకి బుల్డోజర్లా..?
పూసపాటిరేగ : భోగాపురం గ్రీన్‌ఫీల్డు అంతర్జాతీయ విమానాశ్రయానికి భూములు ఇచ్చిన రైతులను బుల్డోజర్తో నెట్టి వేయడం దుర్మార్గం అని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నా రు. భోగాపురం మండలం బైరెడ్డిపాలెంలో బాధిత కుటుంబాలను ఆదివారం ఆయన కలిశారు. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలను బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకున్నారు. న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబాలకు అండగా వుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ భోగాపురం గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అనేక మంది రైతులు భూములు ఇచ్చారన్నారు. అయితే బైరెడ్డిపాలెంలో అప్రోచ్ రోడ్ కోసం భూములు ఇచ్చిన 20 కుటుంబాలకు రెండేళ్లు గడుస్తున్నా ఇంత వరకు ఒక్క పైసా కూడా పరిహారం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం కాకుండా తక్కువ రేటుతో బ్యాంకులో పరిహారం జమ చేస్తామని రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఆ భూమి తప్పా ఎటువంటి ఆధారం లేని కుటుంబాల పట్ల ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదన్నారు. నిరసన తెలుపుతున్న బాధిత కుటుంబాలపై అధికారులు వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు. బాధితులపైకి జేసీబీ, బుల్డోజర్లు ఎక్కించడానికి ప్రయత్నించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న ఆస్తిని అబివృద్ధి కోసం త్యాగం చేస్తే పోలీసులతో బెదిరించడం అన్యాయం అన్నారు. ఎయిర్‌పోర్టులో బడాబాబులకు అనుకూలంగానే భూసేకరణ జరగడంతో లాభపడి నిరుపేదలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలలో ఓట్లు వేయించుకొని ఇప్పుడు బాధితులను నడిరోడ్డుపై వదిలేసిన స్థానిక నాయకుల తీరును ఆక్షేపించారు. కోర్టులు పేరుతో సాగదీయకుండా పెద్దల సమక్షంలో ఒప్పుకున్న ప్రకారం ఎకరాకు రూ.80 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే బాధితుల తరఫున పోరాడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు టీవీ రమణ, పార్టీ మండల బాధ్యులు బచ్చల సూర్యనారాయణ, బైరెడ్డిపాలెం బాధిత రైతులు పాల్గొన్నారు. -
బైక్‌పై వచ్చి బంగారం అపహరణ
గుర్ల: మండలంలో చైన్‌స్నాచింగ్ జరగడంతో ప్రజలు అందోళన చెందుతున్నారు. గరివిడి మండలంలోని కె. పాలవలసకు చెందిన గొర్లె సుజాత గుర్ల మండలంలోని కెల్ల గ్రామంలో ఉంటున్న తల్లి అనారోగ్యంతో బాధపడుతూ విజయనగరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో తల్లి బాగోగులు చూడడానికి సుజాత ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రి నుంచి కె.పాలవలసలోని తమ స్వగృహనికి శనివారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సుజాత మెడలో ఉన్న బంగారు అభరణాలను చూసి విజయనగరం నుంచే ద్విచక్ర వాహనంపై వెంబడిస్తున్న ఇద్దరు వ్యక్తులు గుర్ల సమీపంలోని శివాలయం వద్ద చేరుకోగానే మెడలో నుంచి సుమారు రెండుంపావు తులాల బంగారం చైన్‌ను తెంపి వెళ్లిపోయారు. దుండగులు తెల్లని ఎన్ఎస్4 ద్విచక్రం వాహనంపై వచ్చి మాస్కులు ధరించి ఉన్నట్లు బాధితరాలు చెబుతోంది. బంగారు అభరణాలు అపహరించడంతో గుర్ల పోలీసులకు బాఽధితురాలు ఆదివారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై పి.నారాయణరావు తెలిపారు. బంగారు అభరణాలను అపహరించిన వ్యక్తులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. నిందితుల వివరాలు ఎవరికై నా తెలిస్తే గుర్ల పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు. -
చిత్తశుద్ధి నిరూపించుకోవాలి
ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయలేని సీఎం చంద్రబాబు ఇప్పుడేమో ముగ్గురు పిల్లలను కంటే రూ.30 వేలు,నలుగుర్ని కంటే రూ.40 వేలు ఇస్తామనడం హస్యాస్పదంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో మహిళలను మాయ మాటలతో మభ్యపెట్టి ఇప్పుడు వంచనకు గురి చేసింది. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయకపోవడం మహిళలను మోసం చేయడమే. కూటమి నేతలు మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నారే గానీ పథకాల గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసి మహిళల పట్ల చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. విశ్వాసరాయి కళావతి,మాజీ ఎమ్మెల్యే,పాలకొండ ● -
వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోండి బాబూ..!
అధికారం చేపట్టిన రెండేళ్ల నుంచి సంక్షేమ పథకాల అమలు మానేసి ముగ్గురు లేదా నలుగురు పిల్లలను కనండంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ప్రజలు నవ్వుకుంటున్నారనే ఆలోచన కూడా లేకుండా నోటికి ఏదివస్తే అది మాట్లాడుతున్నారు.ఆడ బిడ్డలు ఎంత మంది ఉంటే అన్ని రూ.1500 వందలు చొప్పున ప్రతి నెలా ఇస్తామని చెప్పి మోసగించిన విషయాన్ని ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? ముగ్గురు, నలుగురు బిడ్డలను కంటే రూ.30 వేలు,రూ.40 వేలు అంటూ వింత పోకడకు తెరతీశారు. ఈ ప్రభుత్వం హయాంలో ఒకరు లేదా ఇద్దరు పిల్లలను పెంచడమే తల్లిదండ్రులకు కష్టంగా మారింది. ఇప్పటికై నా చంద్రబాబు వాస్తవాలను మాట్లాడడం నేర్చుకోవాలి. పాలవలస గౌరీపార్వతి, జెడ్పీటీసీ, పాలకొండ ● -
మీకోసం వెబ్సైట్లో అర్జీల నమోదు
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కారవేదికలో (పీజీఆర్ఎస్) అందజేసే అర్జీల వివరాలు మీకోసం వెబ్సైట్లో నమోదు చేయవచ్చునని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల కోరిక మేరకు ప్రతిసోమవారం ఉదయం 9 గంటలనుంచి12 గంటలవరకు అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్‌ను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అర్జీలను మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చునని, వాటి స్థితిని 1100 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చునని స్పష్టం చేశారు. కుందర తిరువాడలో ఏనుగుల సంచారంజియ్యమ్మవలస రూరల్: జియ్యమ్మవలస మండలంలోని చినకుదమ, కుందరతిరువాడ గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తుండడంతో రైతులు, ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు ఇటీవల పెదబుడ్డిడి, చినబుడ్డిడి ప్రాంతాల్లో పంట ధ్వంసం చేసిన ఏనుగులు ఆదివారం ఇటువైపు రావడంతో పొలం పనులకు వెళ్లే రైతులు, ప్రయాణికులు భీతిల్లుతున్నారు. శాంతిభద్రతలపై డీజీపీ ఆరాపాచిపెంట: జిల్లాలో శాంతిభద్రతలపై ఎస్పీ మాధవవరెడ్డిని రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా ఆరా తీశారు. పాచిపెంట మండలంలో పి.కోనవలస మీదుగా ఒడిశా వెళ్తున్న ఆయన పి.కోనవలస ఐటీ డీఏ గెస్ట్‌హౌస్ వద్ద ఆదివారం ఉదయం కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఈనేపథ్యంలో డీజీపీని ఎస్పీ మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుషగుచ్ఛం అందించారు. అనంతరం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణపై డీజీపీ చర్చించి పలు సూచనలు సలహాలను ఇచ్చారు.డీజీపీని కలిసిన వారిలో రూరల్ సీఐ రామకృష్ణ, పట్టణ సీఐ అప్పలనాయుడు తదితరులు ఉన్నారు. -
ఏజెన్సీలో ఆగని.. గిరిజన విద్యార్థుల మరణాలు
కొమరాడ మండలం ● 2024 సెప్టెంబర్ 17న కొమరాడ కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదివిన కె.శారద అనారోగ్యంతో మృతి చెందింది.కురుపాం మండలం ● 2024 నవంబర్ 6వ తేదీన కురుపాం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల (బాలురు)లో నాల్గో తరగతి చదువుతున్న నిమ్మక నితిన్(9) అనారోగ్యం బాధపడుతూ విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ● 2025 సెప్టెంబర్ 26వ తేదీన కురుపాం గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పువ్వల అంజలి పచ్చకామెర్లతో బాధపడుతూ మృతిచెందింది. ● 2025 సెప్టెంబర్ 30న కురుపాం గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని తోయక కల్పన పచ్చకామెర్లతో బాధపడుతూ విశాఖ కేజీహెచ్‌లో మృతిచెందింది.జియ్యమ్మవలస మండలం ● 2024 నవంబర్ 6న రావాడ రామభద్రపురం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలో 7వ తరగతి చదివిన నిమ్మక జీవన్ కుమార్(12) అనారోగ్యంతో మృతిచెందాడు. ● నెల రోజుల వ్యవధిలో ఇదే ఆశ్రమ పాఠశాలకు చెందిన టెన్త్ విద్యార్థి బి.ఈశ్వరరావు కూడా అనారోగ్యంతో మతిచెందాడు.గుమ్మలక్ష్మీపురం: ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల్లో పలువురు అనారోగ్యం కారణంగా మృతి చెందుతుండడం దురదృష్టకరం. కొంతమంది విద్యార్థులు పాఠశాలలు నడుస్తున్న వేళల్లో అనారోగ్యం బారిన పడి మృతిచెందగా.. మరికొంత మంది విద్యార్థులు వేసవి సెలవులకు ఇంటికి వెళ్లినప్పటికీ అనారోగ్యం బారిన పడి మృతిచెందుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ చర్యలు కానరావడం లేదు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులవుతారని ఆశించిన తల్లిదండ్రుల కలలు కలగానే మిగిలిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం హయాంలో కురుపాం నియోజకవర్గంలోని విద్యాలయాల్లో చదువుతూ మృతి చెందిన విద్యార్థుల వివరాలు వేసవి సెలవుల్లోనూ.. నలుగురు విద్యార్థుల మృతి ఈ ఏడాది వేసవి సెలవులు ఇచ్చిన 23 రోజుల్లోనే గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాలకు చెందిన నలుగురు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు చెందిన గిరిజన విద్యార్థులు మృతిచెందారు. ఈమేరకు కురుపాం మండలం నీలకంఠాపురం ఆశ్రమ పాఠశాలకు చెందిన బిడ్డిక రాహుల్, దుడ్డుఖల్లు ఆశ్రమ పాఠశాలకు చెందిన జి.అఖిల్, దొరజమ్ము ఆశ్రమ పాఠశాలకు చెందిన నిమ్మక అసిరయ్యలతో పాటు గుమ్మలక్ష్మీపురం కేజీబీవీకి చెందిన పత్తిక సుస్మిత ఆయా అనారోగ్య కారణాలతో మృతిచెందారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి గిరిజన విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నప్పటికీ ప్రభుత్వం చర్యలు కానరాకపోవడం పట్ల గిరిజన సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికై నా నిర్లక్ష్యం వీడి విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని, విద్యా సంవత్సరం ప్రారంభం నుంచైనా ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణ నిమిత్తం ఆరోగ్య కార్యకర్తలను నియమించాలని, మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ప్రకటించి తక్షణమే విడుదల చేసి ఆదుకోవాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 23 రోజుల్లోనే నలుగురి మృతిగుమ్మలక్ష్మీపురం మండలం 2024 జూలై 21వ తేదీన వామాసీ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి మండంగి గౌతమ్ (9) మలేరియాతో బాధపడుతూ మృతిచెందాడు. 2024 అక్టోబర్ 2వ తేదీన పి.ఆమిటి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నిమ్మల అవంతి(13) రక్తహీనత, తీవ్ర జ్వరంతో బాధపడుతూ పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. 2024 డిసెంబర్ 17వ తేదీన దొరజమ్ము ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పత్తిక దినేష్(14) పచ్చకామెర్లు, రక్తహీనత, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ మృతిచెందాడు. 2025 డిసెంబర్ 14న దొరజమ్ము ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో టెన్త్ చదువుతున్న టి.అవిష్ అనారోగ్యంతో మృతిచెందాడు. 2026 జనవరి 7వ తేదీన రేగిడి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నిమ్మక రూప బ్రీతింగ్ ప్లోబ్లంతో పాటు బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతిచెందింది. -
క్రీడల్లో సత్తాచాటిన రేగిడి విద్యార్థులు
రేగిడి: మండల పరిధిలోని పనసలవలస గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరిచి గోల్డ్, బ్రాంజ్ మెడల్స్ సాధించారని పాఠశాల పీడీ కోటిచక్రధరరావు ఆదివారం విలేకరులకు తెలిపారు. విజయవాడలో జరిగిన అండర్–17 కేటగిరీలో గుండాల సాగర్, అండర్ –19 విభాగంలో కడగల కార్తీక్ ట్రైఅథ్లాన్ విభాగంలో షూటింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ కాంబినేషన్లో పాల్గొన్నారని తెలిపారు. కార్తీక్ ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్‌మెడల్ సాధించగా సాగర్ మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించాడని తెలిపారు. వారు మోడ్రన్ పెంటాథ్లాన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా మెడల్స్ అందుకున్నారని పీడీ వెల్లడించారు. విద్యార్థుల ప్రతిభపట్ల ఎంఈఓలు ఎంవీ ప్రసాదరావు, బి.ఎరకయ్య, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు. -
ఎయిడ్స్ నివారణకు సమష్టిగా పోరాడాలి
పార్వతీపురం రూరల్: అంతర్జాతీయ ఎయిడ్స్ స్మారక దినాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆదివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక కార్యాలయం నుంచి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వరకు సాగిన ఈ ర్యాలీలో ఆరోగ్య శాఖ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పాల్గొని ఎయిడ్స్ మహమ్మారి పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ జగన్ మోహన్ రావు, నేత్ర వైద్య అధికారి డాక్టర్ నగేష్ రెడ్డి, ఏపీ సాక్స్ ప్రతినిధులు లక్ష్మణ రావు, కోటేశ్వరరావు, జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
రెండు బైక్‌లు ఢీకొని యువకుడి మృతి
గరుగుబిల్లి: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గరుగుబిల్లి మండలంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పెద్దూరు గ్రామానికి చెందిన రాజాన భాస్కరరావు(24), భోగి తేజ వ్యక్తిగత పనుల నిమిత్తం పార్వతీపురం వచ్చి, తిరుగు ప్రయాణంలో పార్వతీపురం నుంచి పెద్దూరు గ్రామానికి వెళ్తున్నారు. అదే సమయంలో ఎదురుగా పార్వతీపురం వైపు నుంచి మరో ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు వస్తుండగా రహదారి పరిధిలోని ఉల్లిభద్ర కూడలి వద్ద ప్రమాదవశాత్తు ఒకదాని కొకటి రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాలపై ఉన్న నలుగురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పెద్దూరు గ్రామానికి చెందిన రాజాన భాస్కరరావు మృతి చెందాడు. రావుపల్లి తేజాతో పాటు మరో బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడు భాస్కరరావుకు తల్లి ఆదిలక్ష్మి, చెల్లి ఉన్నారు. కుమారుడి మృతితో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భాస్కరరావు, తేజాలు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఒకే దగ్గర ఉంటున్నారు. భోగి తేజ, తల్లి వర్ధంతి కార్యక్రమానికి రెండు రోజుల క్రితం గ్రామానికి ఇద్దరూ వచ్చారు. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. డెంకాడ: మండలంలోని పెదతాడివాడ కూడలి వద్ద ఆర్అండ్బీ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం రెండు ఆటోలు ఢీకొన్న సంఘటనలో వలిరెడ్డి పద్మ (49) ప్రమాద స్థలంలోనే మృతి చెందింది. ఈ ప్రమాద సంఘటనకు సంబంధించి ఎస్సై సన్యాసినాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పూసపాటిరేగ మండలం, పూసపాటిపాలెం గ్రామానికి చెందిన ఐదుగురు మహిళలు, ఆటోపై జామి మండలం భీమసింగి గ్రామానికి శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా పెదతాడివాడ కూడలి వద్దకు వచ్చేసరికి వారి ఆటోను వెనక నుంచి మరొక ఆటో బలంగా ఢీకొనడంతో అదుపుతప్పి ఆటో తిరగబడడంతో వలిరెడ్డి పద్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం అదే ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలు మృతురాలి కుటుంబసభ్యులకు తెలియపరచగా వెంటనే కుటుంబ సభ్యులు ప్రమాద స్థలానికి చేరుకుని భోరుమన్నారు. మృతురాలి కుమారుడు వలిరెడ్డి రాంబాబు డెంకాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీతంపేట: మండలంలోని సోమగండి గ్రామానికి చెందిన బాలింత నిమ్మక మాధురి (32) శ్రీకాకుళంలోని జెమ్స్ ఆస్పత్రిలో ఆదివారం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపారు. రెండో కాన్పులో ఆమె గర్భం దాల్చిన నాటి నుంచి పాలకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఈ క్రమంలో శుక్రవారం ఆస్పత్రిలో ప్రసవం కోసం కుటుంబసభ్యులు చేర్చగా వైద్యసిబ్బంది సిజేరియన్ చేశారు. మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం పచ్చకామెర్ల లక్షణాలు, యూరిన్ నిలిచిపోవడం,ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళంలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రికి వైద్యులు రిఫర్ చేశారు. దీంతో అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. బిడ్డ క్షేమంగా ఉన్నాడు. మృతురాలికి భర్త శివకుమార్, మూడున్నరేళ్ల ఆరాధ్య అనే కుమార్తె ఉన్నారు. మాధురి పాలకొండ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. మాధురి మృతితో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గజపతినగరం రూరల్: మండలంలోని దావాలపేట గ్రామ సమీపాన గల రైల్వే గేట్ వద్ద మూడు రోజుల క్రితం రైలు నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ బండారు ఈశ్వరరావు ఆదివారం సాయంత్రం అందించిన వివరాల ప్రకారం, దావాలపేట గేట్‌మన్ ఆదివారం ఉదయం 8.30 గంటల సమయంలో గుర్తు తెలియని మృతదేహం రైల్వే ట్రాక్ సమీపంలో ఉండడాన్ని చూసి రైల్వే పోలీసులకు సమాచారం అందజేశాడు. దీంతో జీఆర్పీ సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని అక్కడ ఉన్న ఆనవాళ్లు, ఆధారాలు సేకరించారు. ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా ముఖానందపూర్ గ్రామానికి చెందిన మమత ట్యాండ్ అలియాస్ బేగ్ద (37) మృతదేహంగా గుర్తించారు. వెంటనే ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. ఈనెల 14వ తేదీన జునాగఢ్ నుంచి భువనేశ్వర్‌కు జునాగర్ ఎక్స్‌ప్రెస్‌లో మమతా బేగ్ ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ మేరకు విజయనగరం రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ వి.బాలాజీ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంధన ధరల పెంపుపై నిరసన
ఇంధన ధరల పెంపును వ్యతిరేకిస్తూ విజయనగరం మండలం, వీటీ అగ్రహారం గ్రామ సచివాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ఆదివారం నిరసన చేపట్టారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలప్పుడు ఇంధన ధరలు పెంచబోమని చెప్పి, ఇప్పుడు ఆ ఎన్నికలు ముగియగానే అమాంతం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గమని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జగన్మోహనరావు మండిపడ్డారు. ఇంధన ధరల పెంపు వల్ల నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతాయని ఇది అటు వాహనదారులకు ఇటు సామాన్య ప్రజలకు ఇబ్బందేనన్నారు. తక్షణమే పెంచిన ఇంధన ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే 12వ పీఆర్సీ ప్రకటించి, మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. – విజయనగరం గంటస్తంభం -
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తాం..
విజయనగరం ఫోర్ట్: పీఏసీఎస్ (ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు)ల్లో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోవడం బాధాకరమని పీఏసీఎస్ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు పి.కామేశ్వరావు అన్నారు. స్థానిక సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2025 డిసెంబర్ 6 నుంచి 80 రోజుల పాటు నిర్వహించిన ఆందోళన సందర్భంగా పీఆర్సీలు, గ్రాట్యూటీ, ఇన్సురెన్స్ వంటి అంశాలపై హామీలు ఇచ్చినా.. తర్వాత జారీ చేసిన జీఓలు 112, 322 ద్వారా ప్రభు త్వం ఉద్యోగులను మోసం చేసిందన్నారు. మోసపూరిత జీఓలు ద్వారా ఉద్యోగులు అన్యాయానికి గురవుతున్నారన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రానున్న కాలంలో సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమవుతున్నామన్నారు. సమావే శంలో ఏఐటీయూసీ నాయకులు రంగరాజు, రెడ్డి సత్యారావు, బెల్లాన రామునాయుడు, డి. నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్యవైశ్య మహాసభ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ప్రసన్న
విజయనగరం టౌన్: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ విజయనగరం జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా సముద్రాల గిరిజా ప్రసన్న ఎంపికయ్యారు. గతంలో వాసవీ క్లబ్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా, విజయనగరం కంటోన్మెంట్ ఆర్యవైశ్య సేవా సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఆమె సేవలందించారు. 23 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ గతేడాది రాజమండ్రిలో జరిగిన కార్యక్రమంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇనిస్పిరేషన్ అవార్డ్ తీసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఉత్తమ మహిళా పురస్కారాన్ని స్వీకరించారు. గతంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిసెస్ విజయనగరం పోటీల్లో విజేతగా ఆమె నిలిచారు.బేత లల్లూపై పీడీ యాక్ట్విజయనగరం క్రైమ్: చట్టాన్ని తరచూ ఉల్లంఘిస్తూ, ప్రజాశాంతికి భంగం కలిగిస్తూ, భౌతిక దాడులకు పాల్పడుతూ, పలు కేసుల్లో నిందితుడిగా అరెస్టయిన విజయనగరంలోని శివాలయం వీధికి చెందిన బేత లల్లూ (23)పై పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్ట్ చేసి విశాఖ కేంద్ర కారాగారానికి తరలించామని ఎస్పీ ఏఆర్.దామోదర్ ఆదివారం తెలిపారు. నగరంలోని శివాలయంవీధికి చెందిన బేత లల్లూ 2023 నుంచి నేరాలకు పాల్పడుతున్నాడని 2 గంజాయి అక్రమ రవాణా కేసులు, 3 దొంగతనాల కేసులు, ఒక చైన్ స్నాచింగ్‌కు పాల్పడి నిందితుడిగా అరెస్టు అయ్యాడన్నారు. లల్లూపై పీడీ యాక్ట్ అమలు చేయాలని కోరుతూ విజయనగరం వన్ టౌన్ పోలీసులు డీపీఓకు ప్రతిపాదనలు పంపగా, వాటిని సిఫార్సు చేస్తూ కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపామన్నారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అదేశాలతో నిందితుడు బేత లల్లూను అరెస్ట్ చేసి జైలుకు తరలించామని ఎస్పీ వివరించారు. 8మంది జూదరుల అరెస్టుబలిజిపేట: మండలంలోని గౌరీపురం దాటిన తరువాత మామిడి తోటలో జూదం ఆడుతున్న 8మందిని పట్టుకున్నట్లు ఎస్సై సింహాచలం తెలిపారు. ఈ మేరకు ఆయన తెలిపిన వివరాల ప్రకారం గౌరీపురం గ్రామం దాటిన తరువాత ఉన్న మామిడి తోటలో జూదం ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడిచేశారు. ఈ సందర్భంగా వారి దగ్గర నుంచి రూ.22,500లు స్వాధీనం చేసుకున్నారు. జూదరులు వీరఘట్టం, వంగర తదితర ప్రాంతాలకు చెందిన వారని, వారిపై కేసు నమోదుచేసినట్లు ఎస్సై తెలిపారు. నాయీ బ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలువిజయనగరం టౌన్: జిల్లాలోని నిరుపేద నాయీబ్రాహ్మణ కుటుంబాలకు చెందిన 500 మార్కులు పైబడి పదోతరగతిలో మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. నాయీబ్రాహ్మణ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు సత్కారంతో పాటు నగదు బహుమతులు అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ చదువుతోనే విజ్ఞానం, అభివృద్ధి జరుగుతుందన్నారు. విద్యార్థులు తమ జీవితాలను మార్చుకోవాలంటే ఉన్నత విద్యనభ్యసించి ఉన్నతశిఖరాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పెదపెంకి శివ ప్రసాద్, వెంకట పద్మనాభం, పడాల రమణ, అప్పారావు, టీవీ దుర్గారావు, దిమిలి పైడిరాజు, షణ్ముఖరావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. దిమ్మిడిజోల సమీపంలోకి ఏనుగులుభామిని: తినడానికి తిండి, తాగడానికి నీరు లేక అలమటిస్తున్న ఏనుగుల గుంపు విచ్చల విడిగా తిరుగాడుతున్నాయి. ఆదివారం భామిని మండలం దిమ్మిడిజోల సమీపంలోకి నాలుగు ఏనుగుల గుంపు వచ్చి కళ్లాల్లోని చేల కుప్పలు పాడుచేశాయి. అనూహ్యంగా దిమ్మిడిజోల గ్రామ సమీపంలోకి ఏనుగుల గుంపు రావడంతో గ్రామస్తులు చూడడానికి పరుగులు పెట్టారు. వేసవి తీవ్రతకు అల్లాడుతున్న ఏనుగుల గుంపు ప్రజలను చూసినా ఏమీ అనకుండా చేను మేయడంలో తలమునకలయ్యాయి. -
పైనాపిల్ సీజన్ ఆరంభం
సీతంపేట: గిరిజన రైతులకు ప్రధాన జీవనాధారమైన పైనాపిల్ సీజన్ ఆరంభమైంది. సీతంపేట మన్యంలో అత్యధికంగా ఈనెల నుంచి ఆగస్టు వరకు దిగుబడి అవుతుంది. 7,300 ఎకరాల్లో పంట విస్తరించి ఉంది. దాదాపు 41 వేల టన్నుల పైనాపిల్ దిగుబడి వస్తుంది. ప్రస్తుతం రూ.15 నుంచి 18మధ్య ఒక్కో పండు ధర పలుకుతోంది. వారపు సంతలకు గిరిజనులు పైనాపిల్ పంటను తీసుకువస్తున్నారు. గతేడాది సీజన్ ఆరంభంలో రూ.20 ధర పలికి సీజన్ ముగిసే నాటికి రూ.5కు పడిపోయింది. దీంతో గిరిజనులు అవస్థలు పడ్డారు. ఏజెన్సీలో కొండపోడు వ్యవసాయంలో బాగంగా మిశ్రమ పండ్ల తోటల్లో ఈ పంట అంతరపంటగా సాగు చేస్తున్నారు. కోడిశ, కుశిమి, ముత్యాలు, శంభాం, అక్కన్నగూడ, రాజన్నగూడ, జోగైనాయుడుగూడ, కోడిశ. తొత్తడి, రామానగరం, అంటికొండ,పొల్ల, దోనుబాయి, మానాపురం తదితర గిరిజన గ్రామాల్లో విస్తారంగా పైనాపిల్ తోటలను వేశారు. ఈ తోటల పెంపకానికి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు అవసరం లేకపోవడంతో గిరిజనుల్లో ఈ పంటపై నానాటికీ ఆసక్తి పెరుగుతోంది. సీజన్లో గిరిజనులకు మంచి ఆదాయం వస్తుంది. మైదాన ప్రాంతాలకు చెందిన వ్యాపారులకు గిరిజనులు విక్రయిస్తారు. దళారీ వ్యాపారులు సంతలకు వచ్చి పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తారు. ఇక్కడ కొనుగోలు చేసిన పైనాపిల్‌కు ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కోనసీమ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, విశాఖపట్నం, గుంటూరు, పల్నాడు, ఏలూరు, శ్రీకాకుళం జిల్లాల్లో మంచి డిమాండ్ ఉండడంతో ఇక్కడ కొనుగోలు చేసి లారీలు, వ్యాన్లలో తరలించుకుపోయి వ్యాపారులు అధిక లాభాలు ఆర్జిస్తారు. ఒక్కో పండుపై కనీసం రూ.10 నుంచి 15 వరకు లాభాలు వస్తాయని వ్యాపారులు తెలిపారు. కొన్ని సందర్భాల్లో వ్యాపారులు సిండికేట్ మారి ధరలు తగ్గించడంతో నష్టాలు చవిచూడాల్సి వస్తోందని గిరిజనులు వాపోతున్నారు. వారపు సంతలకు తెచ్చిన పైనాపిల్ ఏమాత్రం నాణ్యత లోపించినా కొనుగోలు చేయరని గిరిజనులు తెలిపారు. సీతంపేటలో సోమవారం, మర్రిపాడులో బుధవారం, గురువారం దోనుబాయి, శనివారం పొల్ల, కుశిమిలలో వారపు సంతలు జరుగుతాయి. ఇక్కడకు వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో సీజన్ ఆరంభంలో గిరిజనులకు ముందు అడ్వాన్సులు ఇచ్చి పంటలను స్వాధీనం చేసుకోవడంతో ఇతరులెవరీకీ విక్రయించడానికి అవకాశముండదని గిరిజనులు తెలిపారు. గతంలో ఇలా... ఐటీడీఏ చొరవతో రెండేళ్ల కిందట ఇతర జిల్లాల్లో 41రైతు బజార్లలో వీటిని రైతు సంఘాల గ్రూపుల ద్వారా విక్రయించేందుకు చర్యలు తీసుకున్నారు. మధ్య దళారీ వ్యవస్థను రూపుమాపి గిరిజనులకు ఆదాయం వచ్చే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఎఫ్‌పీవోల ద్వారా రైతులను నుంచి గ్రేడ్ ను బట్టి రూ.15కు తక్కువ లేకుండా కొనుగోలు చేశారు. ఐటీడీఏ, ఉద్యానవనశాఖ, వెలుగు వంటి శాఖలు పైనాపిల్‌కు గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు తీసుకున్నారు. 7,300 ఎకరాల్లో సీతంపేట ఏజెన్సీలో విస్తరించి ఉన్న పంట 41వేల టన్నుల దిగుబడి నాణ్యతను బట్టి రూ.15–18మధ్య పలుకుతున్న ఒక్కో పండు పట్టణ ప్రాంతాల్లో రూ.40 వరకు విక్రయం ఏటా సీజన్ ఆఖరులో రూ.5కు పడిపోతున్న పండు ధర ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు తరలుతున్న పంట గిరిజన రైతుల ప్రధాన ఆదాయవనరు మార్కెటింగ్‌కు చర్యలు: పైనాపిల్‌కు సంబంధించి గిరిజనులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఈ మేరకు గిరిజన రైతులతో గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలిస్తున్నాం. మారిషస్ అనే పైనాపిల్ వైరెటీని గతేడాది 70 ఎకరాల్లో వేయించాం. ఈ సంవత్సరం 500 ఎకరాల్లో విస్తరింప చేయడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ఎస్.వి.గణేష్, పీహెచ్‌వో, సీతంపేట ఐటీడీఏ పంట దిగుబడి బాగుంది ఈ సంవత్సరం కూడా పైనాపిల్ పంట మంచి దిగుబడి వచ్చింది. ధరలే వారం, వారం తగ్గుముఖం పడుతున్నాయి. ధరల్లో నిలకడ ఉండడం లేదు. కష్టానికి తగ్గ ఫలితం లేదు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు గ్రామాలకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఎస్.రమేష్, ముత్యాలు పైనాపిల్ రైతులను ఆదుకోవాలిపైనాపిల్ రైతులను మద్దతు ధర కల్పించి ఆదుకోవాలి. సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఇక్కడే ఎక్కువ పంట దిగుబడి వస్తుంది. ఈ పంటే జీవనాధారమై బతుకుతున్న గిరిజనులు ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయంలో నేరుగా ఐటీడీఏ ద్వారా పైనాపిల్ కొనుగోలు చేయించి మార్కెటింగ్ చేయించాం. దీంతో గిరిజనుల ఆదాయ వనరులు మెరుగయ్యాయి. విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే, పాలకొండ -
వ్యవసాయ శాఖలో వింత పోకడ..!
విజయనగరం ఫోర్ట్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నోరెత్తితే చాలు నీతి, నిజాయితీ గురించి వల్లె వేస్తారు. సత్యహరిశ్చంద్రునికి అన్నదమ్ముడి మాదిరి వ్యవసాయ శాఖను పారదర్శకంగా నడిపిస్తున్నట్టు కలరింగ్ ఇస్తారు. గురవింద గింజ తన కింద మచ్చను చూడని విధంగా వ్యవసాయ శాఖలో అనేక అక్రమాలు జరుగుతు న్నా పట్టించుకోకుండా వాటిని కప్పిపుచ్చే విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జిల్లా వ్యవసాయ శాఖలో జరుగుతు న్న తంతు వ్యవసాయ శాఖ సిబ్బందితో పాటు రైతులను విస్తుగొల్పుతుంది. గజపతినగరం ఏడీఏగా పని చేసిన నిర్మలాజ్యోతి, ఆమె భర్తతో కలిసి నకిలీ ఎరువులు, పురుగు మందులు విక్రయాన్ని ప్రోత్సహించారని వ్యవసాయ శాఖ సిబ్బందే వ్యవసాయ శాఖ కమిషనర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నకిలీ పురుగు మందులు, ఎరువులు విక్రయించాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని వ్యవసాయ సిబ్బంది ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఆ శాఖ కమిషనర్ విచార ణకు ఆదేశించారు. కమిషనర్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఏడీఏ సెలవు పెట్టేశారు. విచార ణ నుంచి తప్పించుకునేందుకు సెలవు పెట్టేశార నే ఆరోపణలు ఉన్నాయి. ఆమె సెలవు పెట్టడంతో విజయనగరం భూసార పరీక్ష కేంద్రం ఏడీఏ గా పనిచేస్తున్న గాలి శ్రీనివాస్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే మూడు రోజులు క్రితం భూసార పరీక్షా కేంద్రం ఏడీఏగా నిర్మలా జ్యోతి బాధ్యతలు స్వీకరించారు. దీంతో వ్యవసా య శాఖలో పనిచేసే సిబ్బంది, సహచర అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. నకిలీ పురుగు మందులు, ఎరువులు విక్రయానికి సహకరించారనే సంచలన ఆరోపణలు వచ్చిన ఏడీఏకు జిల్లా కేంద్రంలో అది కూడా విచారణ పూర్తి కాకుండానే పోస్టింగ్ ఇవ్వడం పట్ల సర్వత్రా విమర్శలు చెలరే గుతున్నాయి. సాధారణంగా అంత పెద్ద ఆరోపణలు వచ్చినప్పుడు దూర ప్రాంతాలకు బదిలీ చేయడమో.. లేదా సరెండర్ చేయడమో చేస్తారు. కానీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శాఖలో అక్రమార్కులకు అందలం ఎక్కించే విధంగా వ్యవహరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గజపతినగరం ఏడీఏ నిర్మలాజ్యోతికి విజయనగరం భూసార పరీక్ష కేంద్రం ఏడీఏగా వ్యవసాయ శాఖ కమిషనర్ నియమించారు. ఆమె బాధ్యతలు కూడా స్వీకరించారు. – వి.టి.రామారావు, జిల్లా వ్యవసాయ అధికారి -
ఔట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలి
● ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ మోహనరావువిజయనగరం గంటస్తంభం: మున్సిపాలిటీల్లో చెత్త తరలింపు వాహనాలకు సంబంధించి ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి డ్రైవర్లు, కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. జగన్ మోహనరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం స్థానిక రింగ్‌రోడ్ డంపింగ్‌యార్డు వద్ద కార్మికులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం డ్రైవర్ల వేతనాలు పెంచడంతో పాటు పలు సమస్యల పరిష్కారానికి హామీలు ఇచ్చిందని, అయితే ప్రస్తుత ప్రభుత్వం వాటిపై జీఓలు జారీ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం మున్సిపల్ వాహనాలను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీంతో కార్మికులను అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కార్మికులను పర్మినెంట్ చేయాలని, 12వ పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు మున్సిపల్ డ్రైవర్లు, కార్మికులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణే ధ్యేయం
పార్వతీపురం రూరల్: పట్టణాల సుందరీకరణ, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా జిల్లా యంత్రాంగం ముందడుగు వేస్తోంది. ’సాసా’, ’స్వచ్ఛ భారత్ – స్వర్ణ భారత్’ కార్యక్రమాల్లో భాగంగా పార్వతీపురం మన్యం కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి పట్టణంలో శనివారం విస్తృతంగా పర్యటించారు. జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్‌కుమార్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు, పర్యావరణ అవగాహన ర్యాలీల్లో పాల్గొన్నారు. ముందుగా స్థానిక మున్సిపల్ పార్కును సందర్శించిన కలెక్టర్.. వ్యర్థాల నిర్వహణలో భాగంగా పాత, పనికిరాని టైర్లతో సృజనాత్మకంగా రూపొందించిన ఆట పరికరాలను పరిశీలించారు. వ్యర్థాలను పర్యావరణహితంగా, చిన్నారులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దడంపై అధికారులను అభినందించారు. పార్కును నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని, పిల్లల భద్రతకు ఎక్కడా లోటు లేకుండా ఆట స్థలాలను పర్యవేక్షించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అనంతరం దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలు, డీజిల్ కొరతను దృష్టిలో ఉంచుకుని నిర్వహించిన ప్రత్యేక సైకిల్ ప్రదర్శనలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. కొద్ది దూరానికి కూడా వాహనాలు వినియోగించవద్దని సూచించారు. ఒకే ప్రాంతానికి వెళ్లేవారు ’కార్ పూలింగ్’ విధానాన్ని అవలంభించడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయవచ్చన్నారు. భవిష్యత్‌లో విద్యుత్ వాహనాల (ఈవీ) వైపు మొగ్గు చూపాలని, ఇందుకు అనుగుణంగా పట్టణంలో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏసీలు, ఇతర విద్యుత్ పరికరాల అనవసర వినియోగాన్ని తగ్గించి పొదుపు అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం ప్లాస్టిక్ రహిత నగరమే ధ్యేయంగా శివాలయం వీధి చెరువు పరిసరాల్లో నిర్వహించిన ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ సైకిల్ ర్యాలీలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యర్థాల నిర్వహణలో (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) విధానాన్ని అమలు చేయడమే స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రధాన ఉద్దేశమన్నారు. పట్టణ సుందరీకరణలో ప్రజల సహకారం అవసరమని జాయింట్ కలెక్టర్ తెలిపారు. కార్యక్రమాల్లో ఐటీడీఏ పీఓ ఆర్. వైశాలి, మున్సిపల్ కమిషనర్ పావని, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ ప్రభాకరరెడ్డి -
మహిళలంటే ఎందుకంత చులకన..!
విజయనగరం: ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళలను చులకనగా చూడడం తగదని విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి మండిపడ్డారు. నాడు ఓట్ల కోసం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామంటూ మాట ఇచ్చిన నాయకులు, నేడు ఆ మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ఉచిత ప్రయాణంలో మహిళలు పడుతున్న ఇబ్బందులను తొలగించే చర్యలు తీసుకోవాలని డిమాండ చేశారు. ప్రయాణికుల రద్దీకి తగిన బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ విజయనగరం నియోజకవర్గ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆర్టీసీ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హయాంలో మహిళల ఆత్మగౌరవం పెరిగేలా పాలన సాగిస్తే, నేటి చంద్రబాబు ప్రభుత్వం మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. పేరుకు ఉచిత బస్సు ప్రయాణం అని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. అవసరమైన బస్సులు లేక నిత్యం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకోవడంతో దురదృష్టవశాత్తూ ప్రమాదం సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, నగర విభాగం అధ్యక్షురాలు పిన్నింటి కళావతి, నగర మాజీ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు, మహిళా విభాగం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలకు తప్పని పాట్లు వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన -
నిబంధనలు గాలికి.. ప్రమాదాలు ప్రజలకి..
రాజాం: రాజాం పట్టణంతో పాటు చుట్టుపక్కల స్క్రాబ్ వ్యాపారాలు అధికమయ్యాయి. పుట్టగొడుగుల్లా ఈ వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. నిబంధనలు అతిక్రమించి వ్యాపారాలు చేయడంతో చుట్టు పక్కల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. దగ్గర్లోని సచివాలయాలు, అధికారులకు ఫిర్యాదుచేసినా ఫలితం లేకపోవడంతో ఈ వ్యాపారాలు మరింత భయానక వాతావరణంలో జరుగుతున్నాయి. నిషేధిత వ్యర్థాలతో కూడిన వస్తువులు కొనుగోలు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేయడంతో పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. తరచుగా ప్రమాదాలు ఇటీవల రాజాంలో స్క్రాబ్ వ్యాపారాల వద్ద తరుచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మూడు నెలల కిందట మండలంలోని వీఆర్ అగ్రహారంలో ఓ స్క్రాబ్ దుకాణం వద్ద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదకర కెమికల్స్ ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మంటలను అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి తలకుమించిన భారంగా మారింది. అంతకుముందు రాజాం పట్టణంలో ఓ షాపు వద్ద కూడా ఇలానే అగ్నిప్రమాదం జరిగింది. దగ్గర్లో నీటి సదుపాయం ఉండడంతో మంటలను అదుపుచేశారు. విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు పడ్డారు. నిబంధనలు బేఖాతరు ఇటీవల ఫైర్ శాఖాధికారులు రాజాంలో స్క్రాబ్ షాపులను తనిఖీ చేశారు. రాజాం పట్టణంతో పాటు రేగిడి, వంగర, సంతకవిటి మండలాల్లో 30కి పైగా షాపులు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో చాలా షాపుల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఈ వ్యాపారాలకు జీఎస్టీ గుర్తింపు, కార్మికశాఖ, మున్సిపల్, సచివాలయాల అనుమతులు ఉండాలి. కాని అవేమీ లేవు.అలాగే ఇనుము, ప్లాస్టిక్ వస్తువుల కొనుగోలుకే వేర్వేరుగా అనుమతులిస్తారు. కెమికల్స్ వస్తువులు అస్సలు కొనుగోలు చేయరదు. జనావాసాలకు దూరంగా స్క్రాబ్ వస్తువులు నిల్వ చేయాలి. కాని ఏ ఒక్కరూ ఈ నిబంధనలు పాటించడం లేదు. ఫిర్యాదులున్నా పట్టించుకోరే.. రాజాం మండలం పెనుబాక గ్రామ పరిధి కొత్తవలస రోడ్డులో ఓ స్క్రాబ్ దుకాణం వద్ద ప్రమాదకర రీతిలో ప్లాస్టిక్ నిల్వలున్నాయి. వీటిని అడ్డుకోవాలని, ఇక్కడ రాత్రి సమయాల్లో భారీగా అక్రమ సరుకు రవాణా అవుతోందని అటు మున్సిపల్, ఇటు పంచాయతీ అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా ఇంతవరకూ స్పందించలేదు. జీఎస్టీ లేకుండా వేరే ఫార్మా కంపెనీల పేర్లతో ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారని ఫిర్యాదులు అందినా రెవెన్యూ అధికారులు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. వీఆర్ అగ్రహారం స్క్రాబ్ షాపులో ప్రమాదం అనంతరం పొగిరి ప్రధాన రహదారి పక్కనే ఉన్న షాపుపై గ్రామ సచివాలయంలో ప్రజలు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకుంటాం.. రాజాంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో స్క్రాబ్ షాపుల్లో తనిఖీలు చేశాం. నిబంధనలు పాటించని వారికి అవగాహన కల్పించాం. కొన్నిచోట్ల ప్రమాదకర ప్లాస్టిక్ వస్తువులు, కెమికల్ సామాగ్రి నిల్వలు అధికంగా ఉన్నాయి. వీటి వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు. పి.అశోక్, ఫైర్ అండ్ సేప్టీ అధికారి, రాజాం. -
ఆపద ప్రపంధన్ పురస్కార్‌కు నామినేషన్ల ఆహ్వానం
పార్వతీపురం: విపత్తు నిర్వహణ రంగంలో విశిష్ట సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రపంధన్ పురస్కార్ కోసం నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి శనివారం తెలిపారు. ముందస్తు హెచ్చరికలు, రక్షణ చర్యలు, పునరావాసం, సాంకేతిక ఆవిష్కరణలు, సామాజిక అవగాహన వంటి రంగాలో సేవలందించిన వారికి ఈ అవార్డు ప్రధానం చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, వాలంటీర్ బృందాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కౌశలం అభ్యర్థులకు విశాఖలో ప్రత్యేక ఉద్యోగ మేళా జిల్లాలో కౌశలం ప్రోగ్రాంలో అసెస్మెంట్లు పూర్తి చేసిన 167మంది అభ్యర్థుల కోసం ఈ నెల 18 నుంచి 21 వరకు విశాఖపట్నంలోని ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్, గవరపాలెం, కంచరపాలెం ప్రాంతాల్లో ప్రత్యేక ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి శనివారం తెలిపారు. ఈవీ–2 వీలర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, మొబైల్ అసెంబ్లీ ఆపరేటర్, టెక్నికల్ సపోర్ట్, ఇన్ఫోసిస్ వాయిస్/నాన్‌వాయిస్ విభాగాల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని, అభ్యర్థులు ఆధార్, రెజ్యూమ్, విద్యార్హతల ధ్రువపత్రాలు, ఫొటోలు వెంట తీసుకువెళ్లాలని సూచించారు. జూన్ 15 నుంచి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పార్వతీపురం: జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నట్టు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి శనివారం తెలిపారు. జూన్ 15 నుంచి జూలై 14వరకు బీఎల్ఓలు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారని, జూలై 21న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తామని తెలిపారు. ఆగస్టు 20వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరించి, సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని వెల్లడించారు. ఈ ఏడాది జూలై ఒకటి నాటికి 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి : సీపీఎం పార్వతీపురం రూరల్: అమెరికా, ఇజ్రాయెల్ దేశాల వైఖరి వల్లే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు ఏర్పడుతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు పేర్కొన్నారు. స్థానిక సుందరయ్య భవనంలో శనివారం నిర్వహించిన సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం పెరగడం వల్ల ఇరాన్, వెనిజులా వంటి దేశాల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని చెప్పారు. అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగి రష్యా, ఇరాన్‌ల నుంచి చౌకగా లభించే చమురు, గ్యాస్ వనరులను వదులుకోవడం వల్లే దేశంలో ఇంధన సంక్షోభం, ధరల పెరుగుదల తలెత్తాయని అభిప్రాయపడ్డారు. అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాల వల్ల విదేశీ వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి అవుతూ, దేశీయంగా రైతులు పండించిన మొక్కజొన్న, పత్తి, రొయ్యలు వంటి వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఎరువుల ఉత్పత్తిని నిర్లక్ష్యం చేసి విదేశాలపై ఆధారపడటం వల్లే వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందన్నా రు. దీనికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణ మని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని, కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లను అమలు చేస్తున్నాయని పేర్కొంటూ, వీటికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్య దర్శి వర్గ సభ్యులు వి.ఇందిర, ఎన్.వై.నాయు డు, జిల్లా కమిటీ సభ్యులు గొర్లి వెంకటరమణ, కె.సాంబమూర్తి, బి.వి.రమణ, ఈశ్వరరావు పాల్గొన్నారు. -
మీ సెల్ఫీ చాలెంజ్‌లు.. అంతా బూటకం
వీరఘట్టం/పాలకొండ: ‘తోటపల్లి ఆయకట్టు భూములను సస్యశ్యామలం చేస్తాం.. అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఆయకట్టు కాలువల ఆధునికీకరణ పనులు శరవేగంగా పూర్తి చేస్తాం.. రైతన్నకు సాగునీటి కష్టం లేకుండా సకాలంలో తోటపల్లి నీరు అందేలా చర్యలు తీసుకుంటాం..’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వీరు రైతులకు ఇచ్చిన మాట ఇది. అంతేకాకుండా సెల్ఫీ చాలెంజ్‌లు కూడా చేశారు. ఇలా మాయమాటలతో తోటపల్లి ఆయకట్టు రైతాంగాన్ని మోసగించి ఓట్లు దండుకున్నారు. తీరా గెలిచాక ఏరుదాటక తెప్ప తగలెట్టిన మాదిరిగా వీరి వైఖరి మారడంతో తోటపల్లి రైతులు భగ్గుమంటున్నారు. కాసులు దండుకునే కుట్ర 2018లో ప్రారంభమైన తోటపల్లి పాత ఆయకట్టు కాల్వల ఆధునికీకరణ పనులకు రూ.195 కోట్లు సరిపోతాయని జల వనరుల శాఖ అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఈ పనులను రద్దు చేయడంతో జల వనరుల శాఖ అధికారులు రీ–ఎస్టిమేషన్ వేశారు. పెరిగిన జీఎస్టీ, సీనరీ చార్జీలు ఇలా అన్నింటిని కలుపుకుని గత ఎస్టిమేషన్కు 50 శాతం పెంచుతూ సుమారు రూ.97.5 కోట్లు పెంచుతూ రూ.292.5 కోట్లతో నూతన ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. కేవలం ఎస్టిమేషన్ చార్జీలు పెంచి నిధులు కాజేసేందుకే తోటపల్లి కాలువల పనులను ప్రభుత్వం రద్దు చేసిందని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. అగమ్యగోచరంగా శివారు ప్రాంతం పరిస్థితి ప్రతీ ఏటా పాలకొండ శివారు ప్రాంత పొలాలకు సకాలంలో నీరందించలేకపోవడంతో శివారు ప్రాంత భూముల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంటోంది. శివారు కాలువల్లో తుప్పలు, డొంకలు పేరుకుపోయి పరిస్థితి దయనీయంగా మారింది. రైతుల ఇబ్బందులు గుర్తించి కాలువలను ఆధునికీకరించేందుకు నిధులు మంజూరు చేయాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. తోటపల్లిపై చేసిన సెల్ఫీ చాలెంజ్‌లు ఉత్తివేనా.. ప్రభుత్వాన్ని నిలదీస్తున్న రైతులు మరోసారి రైతుల నోట వినిపిస్తున్న ‘నిన్ను నమ్మం బాబు’ ట్యాగ్‌లైన్ ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకువెళ్లలేకపోతున్న జిల్లా ఎమ్మెల్యేలు తోటపల్లి జలాశయం పరిధిలో ఉన్న పాత కుడి, ఎడమ కాలువలు పరిధిలో 64 వేల ఎకరాలు ఆయకట్టు ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 17.616 కి.మీ పొడవున్న కుడి కాలువలో 9.3 కి.మీ వరకు కాంక్రీట్ పనులను చేపట్టారు. అలాగే 37.536 కి.మీ పొడవున్న ఎడమ కాలువలో 17.5 కి.మీ వరకు కాంక్రీట్, లైనింగ్ పనులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి చేశారు. 4 చోట్ల ఆక్విడేట్లు, బ్రిడ్జిలు నిర్మించారు. సుమారు రూ.35 కోట్లుతో చేపట్టిన ఈ పనులకుగాను కాంట్రాక్టర్‌కు రూ.34 కోట్లు వరకు బిల్లుల చెల్లింపులు కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించింది. అయితే ఈ పనులు 23.5 శాతం మాత్రమే జరిగాయనే సాకు చూపించి కుడి, ఎడమ కాలువల్లో జరుగుతున్న ఆధునీకీకరణ పనులను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసి నమ్మి ఓట్లు వేసిన ఆయకట్లు రైతాంగాన్ని మోసగించారని రైతులు మండిపడుతున్నారు. అయ్యా.. సీఎం గారు... జీవనది నాగావళి జలాలు తోటపల్లి కాలువల ద్వారా పంట పొలాలకు అందజేసి రైతులకు నీటి కష్టం తెలీకుండా సాగులో సాయం చేస్తున్నామన్నారు. తోటపల్లి జలాశయం పరిధిలో 64 వేల ఎకరాల పాత ఆయకట్టుకు నీరందిస్తున్న మా కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ పనులు శరవేగంగా చేపడతామని చెప్పి ఈ ప్రాంత రైతుల ఓట్లు దండుకున్నావు. తీరా మీరు సీఎం అయిన తర్వాత ఆ హామీని మట్టిలో కలిపేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు 25 శాతం కూడా జరగలేదనే సాకు చూపించి సక్రమంగా జరుగుతున్న ఆధునికీకరణ పనులను రద్దు చేశారు. మిమ్మల్ని నమ్మిన రైతులను మోసగించారు, ఇదేనా... మీ 40 ఏళ్లు రాజకీయ అనుభవం అంటూ తోటపల్లి రైతులు ప్రభుత్వం తీరును దుయ్యబడుతున్నారు. తోటపల్లి జలాశయం పరిధిలో ఉన్న పాత ఆయకట్టు జిల్లాకే తలమానికం. అటువంటి ఆయకట్టుకు నీరందించే కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ పనులను రద్దు చేయడం చాలా అన్యాయం. రద్దు చేసిన పనులు వెంటనే చేపట్టాలి. వచ్చే ఖరీఫ్‌లో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కాలువల ఆధునికీకరణ పనులు వెంటనే చేపట్టాలి. – కె.వెంకటరమణమూర్తి, రైతు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, తూడి గ్రామం, వీరఘట్టం గత ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు తోటపల్లి ఆయకట్టును సస్యశ్యామలం చేస్తామని చెప్పి ఓట్లు దండుకున్నారు. తీరా గెలిచాక తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులను రద్దు చేసి రైతులను మోసగించారు. తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టకపోతే కూటమి ప్రభుత్వానికి రైతులు బుద్ధి చెప్పేందుకు సిద్ధమౌతున్నారు. – కర్రి లీలాప్రసాదరావు, వైఎస్సార్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీ, వీరఘట్టం -
లక్ష్యానికి మించి పోస్టల్ బీమా పాలసీలు
● పోస్టల్ సూపరింటెండెంట్ బాబూరావు బొబ్బిలి: గతేడాది పోస్టల్ బీమా పాలసీలను లక్ష్యానికి మించి సేకరించామని పోస్టల్ సూపరింటెండెంట్ రెడ్డి బాబూరావు అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఈ ఏడాది లక్ష్యాలపై సమాయత్త సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గతేడాది రూ.60 కోట్ల లక్ష్యం కాగా రూ.60 కోట్ల పాలసీలు సేకరించినట్టు చెప్పారు. ఈ ఏడాది రూ.110 కోట్ల లక్ష్యం విధించినట్టు చెప్పారు. రామభద్రపురం, సీతానగరం, బలిజిపేట మండలాల్లో సబ్ పోస్టాఫీసులను ఏర్పాటు చేసే ప్రతిపాదనలున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు పోస్టల్ సేవలను మరింత అధికంగా అందజేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగమిదన్నారు. గతేడాది లక్ష్యాలను అధిగమించిన సిబ్బంది, అధికారులకు సూపరింటెండెంట్ చేతుల మీదుగా ప్రోత్సాహకాలు, ధ్రువపత్రాలను అందజేసి అభినందించారు. -
బీచ్ కబడ్డీలో సత్య కాలేజ్ విద్యార్థినుల సత్తా
విజయనగరం గంటస్తంభం: నెల్లూరు జిల్లా దువ్వురు – సంగం మండలాల ఆధ్వర్యంలో 13వ అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక పోటీల్లో సత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థినులుప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా జరిగిన మెన్ అండ్ ఉమెన్ బీచ్ కబడ్డీ పోటీల్లో కళాశాలకు చెందిన బి.నీలిమ ( ఫైనల్ బీఏ) అత్యుత్తమ ఆటతీరుతో చాంపియన్‌గా నిలిచింది. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో శనివారం జరిగిన అభినందన సభలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు మాట్లాడుతూ.. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. అనంతరం క్రీడల్లో రాణించిన విద్యార్థినులను అభినందించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి గోపాలరావు, వైస్ ప్రిన్సిపాల్ ఎం.సత్యవేణి, తదితరులు పాల్గొన్నారు. నమ్మించి మోసం చేశారు.. శృంగవరపుకోట: అమాయకులమైన తమను నమ్మించి, బెదిరించి, భూములు అమ్మించి పరిహారం తినేశారని మూలబొడ్డవర పంచాయతీ పరిధిలోని అమ్మపాలెం గ్రామానికి చెందిన గిరిజనులు వాపోయారు. ఈమేరకు ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుకు నిరసనగా ఉరి తాళ్లు బిగించికుంటూ శనివారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జిందాల్ భూసేకరణలో భూములు కోల్పోయిన బాధితులు తామరపల్లి రాము, గౌరమ్మ, సోమేష్, సిరగం బుదరయ్య, సన్యాసిదేముడు, ముత్యాలు, జె.గౌరీష్ మాట్లాడుతూ.. గిరిజనులకు చెందిన 27 ఎకరాల భూమిని అమ్మేసి, గుట్టు చప్పుడు కాకుండా పరిహారాన్ని తమ బ్యాంక్ ఖాతాలకు మళ్లించుకున్నారన్నారు. సొమ్ములు స్వాహా చేసిన బినామీలు ముదునూరు సత్యనారాయణవర్మ, ముదునూరు వరలక్ష్మి, వెంపటాపు అప్పలనాయడు, చల్లా రాములపై చర్యలు తీసుకుని, తమకు రావాల్సిన పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులు చర్యలు తీసుకోకుంటే గిరిజన సంఘాల మద్దతుతో పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మొద్దు డెంకాడ: సైబర్ నేరగాళ్లు చెప్పే మాయమాటలు నమ్మి, మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసుకోవద్దని భోగాపురం సీఐ జి.రామకృష్ణ, ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు తెలిపారు. మండలంలోని పినతాడివాడలో ఉపాధి హామీ పథకం పనులు జరిగిన చోటుకు శనివారం వెళ్లి, సైబర్ నేరాలు–వాటి బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. నిరక్షరాస్యులు, అక్షరాస్యులనే తేడా లేకుండా ప్రతిఒక్కరికీ సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేసి బ్యాంకు అకౌంట్, ఓటీపీ వివరాలు అడిగే అవకాశం ఉందని, పొరపాటున కూడా ఆ వివరాలు ఇవ్వొద్దన్నారు. తెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు చెప్పొద్దన్నారు. అలాగే మహిళల భద్రతకు అనేక చట్టాలు ఉన్నాయని, వాటిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతిఒక్కరూ డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, బాల్యవివాహాలు చేయవద్దని, మైనర్ డ్రైవింగ్‌ను ప్రోత్సహించవద్దని కోరారు. నందిగుడ్డి కాలనీవాసులతో...విజయనగరం క్రైమ్: స్థానిక రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నందిగుడ్డి కాలనీవాసులతో సీఐ శ్రీనివాస్ శనివారం సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ కాలనీ నుంచే పలు నేరాలకు సంబంధించిన నిందితులు వచ్చినట్లు తమ విచారణలో తేలిందని, పౌరులంతా మంచి అలవాట్లు అలవర్చుకుని ఉత్తమ పౌరులుగా జీవించాలని ఆకాంక్షించారు. -
ఓటర్ల జాబితాపై దృష్టి సారించాలి
చీపురుపల్లిరూరల్(గరివిడి): పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాపై వైఎస్సార్సీపీ బూత్ ఏజెంట్లు, నాయకులు దృష్టిసారించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు దిశానిర్ధేశం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు బొత్స అనూష, బొత్స సందీప్‌తో కలిసి గరివిడిలోని పార్టీ కార్యాలయంలో మెరకముడిదాం మండలానికి చెందిన వైఎస్సార్సీపీ క్లస్టర్,డివిజన్ ఇన్‌చార్జ్‌లు,బూత్ ఏజెంట్లతో శనివారం సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని చెప్పారు. కొత్త ఓటర్ల నమోదు,పేర్ల మార్పులు, తొలగింపులు వంటి అంశాలపై బూత్‌స్థాయి నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతీ ఓటరుతో ప్రత్యక్ష సంబంధాలు పెంచుకుని పార్టీకి మరింత బలం చేకూరేలా పని చేయాలని అన్నారు.గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని, నాయకులంతా సమన్వయంతో పని చేసి పార్టీని బలోపేతం చేయాలని దిశా నిర్దేశం చేశారు.డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎస్.వి.రమణరాజు,మాజీ జెడ్పీటీసీ కోట్ల వెంకటరావు, నాయకులు తాడ్డి వేణు,బూర్లె నరేష్కుమార్,హరిబాబు, రాము, ఎంపీటీసీలు,మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
గిరిజన విద్యార్థిని మృతి
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని మూలిగూడ గ్రామానికి చెందిన పత్తిక సుస్మిత (13) శ్రీకాకుళంలోని రాగోలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. గుమ్మలక్ష్మీపురం కేజీబీవీలో 6వ తరగతి చదివిన సుస్మిత వేసవి సెలవులకు ఇంటికి వెళ్లింది. సుస్మితకు నాలుగు రోజుల క్రితం ఆయాసం రావడం, ముఖం వాచడంతో నాటువైద్యం చేయించారు. అయినప్పటికీ తగ్గకపోవడంతో తల్లిదండ్రులు సిధ్ధ, ఈశ్వరరావు శుక్రవారం పార్వతీపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వైద్యం నిమిత్తం తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళంలోని రాగోలు ఆస్పత్రికి రిఫర్ చేయగా తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సుస్మిత మృతి చెందింది. సుస్మిత గుండెలో రక్తం గడ్డ కట్టడంతో మృతి చెందిందని రాగోలు ఆస్పత్రి వైద్యులు చెప్పారని తల్లిదండ్రులు తెలిపారు. విచారణకు కలెక్టర్, వైద్యాధికారి ఆదేశం పార్వతీపురం రూరల్ : నాటు మందు వికటించి పత్తిక సుస్మిత (13) అనే బాలిక మృతి చెందిన ఘటనపై పార్వతీపురం మన్యం జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ ఎస్.భాస్కరరావు శనివారం రాత్రి సమగ్ర విచారణకు ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యురాలైన సంబంధిత ఏఎన్ఎంపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. సదరు బాలికకు కొందరు వ్యక్తులు ఇచ్చిన నాటు మందు వల్ల శ్వాస ఇబ్బంది, ముఖం, కాళ్ల వాపులు తలెత్తాయి. కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు విచారణ చేపట్టారు. ఒడిశాలోని మెట్టవాడ, ఆంధ్రప్రదేశ్‌లోని బొడ్లగూడ ప్రాంతాల్లో ఆ బాలికకు నాటు మందు అందించిన వ్యక్తులను తక్షణమే గుర్తించాలని రేగిడి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలను ఆదేశించారు. గుమ్మలక్ష్మీపురం పోలీస్‌స్టేషన్‌లో రాతపూర్వక ఫిర్యాదు సమర్పించి బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లు, మందుల వివరాలు సేకరించాలని డీఎంహెచ్ఓ స్పష్టం చేశారు. ఇటువంటి గుర్తింపు లేని నాటు మందులను నమ్మి ప్రజలెవరూ మోసపోవద్దని కలెక్టర్ హెచ్చరించారు. -
దోమా.. దోమా.. ఎక్కడ నక్కావ్!
సాక్షి, పార్వతీపురం మన్యం: రాష్ట్రంలో మలేరియా కేసులు అత్యధికంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోనే నమోదవుతున్నాయి. 2024లో రాష్ట్ర వ్యాప్తంగా 7,891 కేసులు నమోదైతే.. ఈ రెండు జిల్లాల్లోనే 6,347(80.43శాతం)వెలుగు చూశాయి. 2025లో 7,119 మలేరియా కేసులు నమోదు కాగా.. అల్లూరి జిల్లాలో 3,153, మన్యం జిల్లాలో 1,820 చొప్పున నమోదవడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్త కేసుల్లో ఈ రెండు జిల్లాల్లోనే 69 శాతం వరకు ఉన్నట్లు వైద్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మలేరియా కేసుల్లో మన్యం జిల్లా రికార్డు సృష్టిస్తుండటం ఆందోళన కలిగించే విషయమే. గిరిజన ప్రాంతాల్లోనే అత్యధికంగా మలేరియా, డెంగీ బారిన పడుతున్నారు. అటవీ, కొండ ప్రాంతాల్లో గిరిజనుల నివాసం.. వాతావరణ మార్పులు మలేరియా తీవ్రతకు కారణంగా ఉంది. జ్వరం వచ్చి రక్త పరీక్షలు చేయిస్తే చాలు.. మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటివేనని తేలుతున్నాయి. ‘లార్వా వేట’తో దోమలకు చెక్ సీజనల్ వ్యాధులు, ముఖ్యంగా మలేరియా నివారణకు జిల్లా వ్యాప్తంగా ‘లార్వా వేట’, ‘వాగు వెంబడి’ వంటి వినూత్న కార్యక్రమాలు ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. మంచినీటిలో పెరిగే దోమల లార్వాలను గుర్తించి నిర్మూలించడం దీని ప్రధాన ఉద్దేశం. కొద్ది నెలలుగా ‘మా ఊరికి మలేరియా వద్దు’, ‘ఫ్రైడే–డ్రై డే’ వంటి కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం చేపడుతోంది. జిల్లాలో 243 మలేరియా ప్రభావిత గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మరోవైపు దోమ తెరల పంపిణీ ఆశించిన స్థాయిలో కావడం లేదు. ఏటా లక్షల్లో దోమ తెరలు అవసరం కాగా.. పంపిణీ వేలల్లోనే ఉంటోంది. కేసులు తగ్గించేందుకు చర్యలు గతంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మలేరియా కేసులు అధికంగా నమోదయ్యేవి. కొద్ది నెలలుగా చేపడుతున్న చర్యల వల్ల కేసులు తగ్గుముఖం పట్టాయని అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు మలేరియా శాశ్వత నివారణకు వంధ్యత్వ మగ దోమలను విడుదల చేసి దోమల ఉత్పత్తిని నివారించాలని భావిస్తున్నారు. వంధ్యత్వ మగ దోమ ఉత్పత్తికి సంబంధించి ప్రత్యేక లేబొరేటరీని జిల్లాలో ఏర్పాటు చేయాల్సి ఉంది. -
చంద్రబాబు పాలనలో బాదుడే బాదుడు..!
సాలూరు: రాష్ట్రంలోని చంద్రబాబు పాలనలో ప్రజలపై మోయలేని భారాలు వేస్తున్నారని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర దుయ్యబట్టారు. పట్టణంలోని తన స్వగృహంలో స్థానిక విలేకరులతో ఆయన శనివారం మాట్లాడారు. యుద్ధ కారణాలను సాకుగా చూపుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ఇంధన ధరల పెరుగుదల వల్ల అన్ని రంగాలపై ఆ ప్రభావం పడి ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిపారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు చెప్పిన మాటలు నేడు మరిచారన్నారు. గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో యూరియా కోసం రైతులు రోడ్లపై పడిన బాధలు ఎవరూ మరచిపోలేరన్నారు. కూటమి నేతలు గతంలో వైఎస్సార్సీపీ పాలనలో బాదుడే బాదుడు అంటూ విమర్శలు చేశారని, ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్‌లు కాన్వాయ్‌లు తగ్గించామని ప్రచారం చేసుకుంటూ ఒకొక్కరు ఒక్కో ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుంటా.. ప్రజలపై భారాలు మోపడం సరికాదన్నారు. జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు అధికం ప్రజలపై భారాలు మోపడమే చంద్రబాబు పని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర -
దళారీలను నమ్మవద్దు..
● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ జామి: దళారీలను నమ్మి మోసపోవద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎస్.కోట బార్ కౌన్సిల్ అధ్యక్షుడు అల్లు సత్యాజీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజలకు అర్హత ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందకపోయినా, రెవెన్యూ సమస్యలు పరిష్కారం కాకపోయినా నేరుగా న్యాయసేవా కేంద్రంలో ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. ఈ కేంద్రం ద్వారా ఉచితంగా సేవలందిస్తామని చెప్పారు. ఎస్.కోట జూనియర్ సివిల్ జడ్జి బి.కనకలక్ష్మి మాట్లాడుతూ.. పేదలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ న్యాయసేవా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చిన్న చిన్న విషయాలకు కోర్టులను ఆశ్రయించవద్దని.. వీలైనంతవరకు గ్రామపెద్దల సమక్షంలో రాజీ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు ఎం.దొరబాబు, బి.వెంకటరావు, జి.చిట్టిబాబు, శివ,ప్రసాద్, తహసీల్దార్ వి.కృష్ణంరాజు, ఎంపీడీఓ ఎన్.అప్పలనాయుడు, ఎస్సై వీరజనార్దన్, తదితరులు పాల్గొన్నారు. -
తాగునీరు లేక అల్లాడిపోతున్నాం..
● ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన ఎల్.కోట మేజర్ పంచాయతీ ప్రజలు లక్కవరపుకోట: లక్కవరపుకోట మేజర్ పంచాయతీ ప్రజలు ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇంటిని శనివారం తెల్లవారుజామున ముట్టడించారు. కొద్ది రోజులుగా తాగునీరు లేక అల్లాడిపోతున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అధికారులకు చెప్పినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ.. గ్రామంలో పర్యటించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో మహిళలు వెనుదిరిగారు. కొద్దిసేపటి తర్వాత జామివీధి, సంఘం వీధిలో ఎమ్మెల్యే పర్యటించి మహిళలతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. వెంటనే అర్డబ్ల్యూఎస్ డీఈ పైడిరాజు, ఎంపీడీఓ అల్లు భాస్కరరావుతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
టీడీపీ కార్యకర్తలకే జనసేన తీర్థం
పూసపాటిరేగ: మండలంలోని కుమిలి గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు జనసేనలోకి వలస వెళ్లినట్లు ఎమ్మెల్యే లోకం నాగమాధవి ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని కుమిలి గ్రామ వైఎస్సార్సీపీ నాయికుడు గుజ్జు సురేష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు శుక్రవారం కుమిలి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముంజేరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కుమిలి గ్రామానికి చెందిన 40 వైఎస్సార్సీపీ కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో జనసేనలో చేరినట్లు పేపరుకు తప్పుడు ప్రకటన ఇచ్చారన్నారు. గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు దాసరి అప్పలరెడ్డి, దాసరి సోమయ్యరెడ్డి, దాసరి రామకృష్ణ, దాసరి అప్పలరెడ్డి, పడాల సూర్యనారాయణ, పడాల అప్పలస్వామి, నాయిని సింహాద్రి, నీలాపు సురేష్, నీలాపు శ్యామల, గోవిందల సూర్యారావు, దాసరి సూర్యనారాయణ, దారపు జోగిరెడ్డి, అక్రమాని అప్పన్న, గండ్రేటి అప్పలరెడ్డిలు టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్తే వైఎస్సార్సీపీ నుంచి వలస వెళ్లినట్లు తప్పుడు ప్రకటనలు ఇచ్చారన్నారు. కుమిలిలో వైఎస్సార్సీపీ బలంగా ఉందని, ఏ ఒక్క వైఎస్సార్సీపీ కార్యకర్త వలస వెళ్లలేదన్నారు. బహిరంగ చర్చకు సిద్ధమా అని జనసేన నాయకులకు సవాల్ విసిరారు. వాస్తవాలు పక్కనపెట్టి తప్పుడు ప్రకటనలు ఇచ్చుకోవడం మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు గాబు సూరప్పన్నరెడ్డి, కర్రి అప్పారావు, డొంక దుర్గరాజు, దున్న నర్సింగరావు, కనకం సురేష్ తదితరులు పాల్గొన్నారు. కుమిలి వైఎస్సార్సీపీ నాయకులు -
ఎరువుల డీలర్‌పై కేసు నమోదు
భామిని: మండలకేంద్రంలోని శ్రీ షిరిడీసాయి ట్రేడర్స్ ఎరువుల దుకాణం డీలర్‌పై కేసు నమోదు చేసి జిల్లా ఉన్నతాధికారులకు నివేదించినట్లు భామిని వ్యవసాయాధికారి కొల్లి తిలక్ ఒక ప్రకటనలో తెలిపారు. బత్తిలిలోని ఎరువుల డిపోపై పాలకొండ ఇన్చార్జ్ ఏడీఏ ఎన్ని వాహిని ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీలు చేసినట్లు వివరించా రు.బత్తిలి డీలర్‌కు ఈ నెల–12న 50 టన్నుల ఎరువులు వచ్చాయని వాటి పంపిణీలో ఎటువంటి రికార్డులు లేకుండా అమ్మకాలు చేసినట్లు వచ్చిన ఆరోపణలతో దర్యాప్తు చేసినట్లు తెలియజేశారు. ఏభై టన్నుల 20–20–0–13 అనే కాంప్లెక్స్ ఎరువులను ఆన్లైన్లో సేల్ చేయకుండా, రైతుకు బిల్లులు ఇవ్వకుండా అమ్మకాలు చేసినట్లు చెబుతున్న కారణంతో కేసు నమోదు చేసినట్లు వివరించారు, ఎరువుల దుకాణంతో పాటు, గొదాంలు కూడా తనిఖీ నిర్వహించామన్నారు. ఈ తనిఖీలలో రెవెన్యూ అధికారి నిమ్మల మహేష్, వ్యవసాయ సహాయకుడు ఆరిక నిఖిల్, స్థానిక రైతులు ఉన్నారని తెలిపారు. -
ఏయు ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్‌లో జయరామ్‌కు ఫస్ట్ ర్యాంక్
తెర్లాం: ఆంధ్రా యూనివర్జిటీ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్(ఏయూఈఈటీ)–2026 ఫలితాల్లో తెర్లాం పంచాయతీ పరిధిలోని చిన్నయ్యపేట గ్రామానికి చెందిన గొల్లు జయరాం ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఇంటర్మీడియట్ తరువాత బీటెక్‌లో జాయిన్ అయ్యేందుకు ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షలో జయరాం 84 మార్కులు సాధించి ఏయూ పరిధిలో ఫస్ట్ ర్యాంక్‌ను కై వసం చేసుకున్నాడు. తెర్లాం మండలంలోని చిన్నయ్యపేట గ్రామానికి చెందిన గొల్లు జయరాం 1–5 తరగతులు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోను, 6–10 తరగతులు బొబ్బిలి అభ్యుదయ స్కూల్లోను, ఇంటర్మీడియట్ విశాఖపట్నం కేఎంఆర్ జూనియర్ కాలేజ్‌లో చదువుకున్నాడు. చిన్నయ్యపేట గ్రామానికి చెందిన గొల్లు సత్యనారాయణ, నరసనీలిమల చిన్న కుమారుడు జయరాం. తండ్రి వ్యవసాయదారు కాగా తల్లి గృహణి. కుమారుడికి ఫస్ట్ ర్యాంక్ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
అంతర్జాతీయ స్విమ్మింగ్‌కు కుసుమూరు ఉపాధ్యాయుడు
● జూలై నెలలో జిబ్రాల్టర్ జలసంధిలో ఈదడానికి సన్నహాలు ● దివ్యాంగుడినైనా సప్తసముద్రాలు ఈదుతానంటున్న గణేష్ సీతంపేట: దివ్యాంగుడైనా ఆయన పట్టువదలని విక్రమార్కుడు. ఈతలో మంచి పట్టు సాధించి సప్త సముద్రాలను ఈది తానేంటో నిరూపిస్తానని అంటున్నారు మండలంలోని కుసుమూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బలగ గణేష్. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ మండలం డొంకలపర్తి గ్రామం. జూలైనెల 20 నుంచి 29 మధ్య స్పెయిన్ నుంచి మొరాకా మధ్య ఉన్న జిబ్రాల్టర్ జలసంధిని ఈదనున్నట్లు తెలిపారు. 4 గంటల్లో 16 కిలోమీటర్ల దూరం ఆగకుండా ఈదనున్నట్లు చెప్పారు. ఈ సాహసోపేతమైన స్విమ్మింగ్‌కు అనుమతి కూడా లభించిందన్నారు. 2020 నుంచి స్విమ్మింగ్ పోటీల్లో తాను పాల్గొంటున్నానని 2020లో అవకాశాలు వచ్చినప్పటికీ కరోనా కారణంగా ఆగిపోయినట్లు తెలిపారు. 2025లో శ్రీలంక–ధనుష్కోట మధ్య ఉన్న సముద్రాన్ని 28 కిలోమీటర్లు 10 గంటల 40 నిమిషాల పాటు ఈదినట్లు చెప్పారు. అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పారా స్విమ్మర్‌గా రికార్డు సాధించానన్నారు. 2025 జూన్ 16న లండన్ నుంచి ఫ్రాన్స్ వరకు 34 కిలోమీటర్లు 13 గంటలపాటు ఇంగ్లీష్ చానల్ ఈదినట్లు తెలిపారు. ఏడు సమూద్రాలను ఈదడానికి నిర్ణయించానని ఇప్పటికి రెండు ఈదానని, మిగతా ఐదు సముద్రాల్లో కూడా స్విమ్మింగ్ చేసి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకోవడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. మరో విశేషమేమిటంటే తన కుమారుడు స్వామినాయుడు రాష్ట్రంలోనే అత్యంత వేగవంతమైన స్విమ్మర్‌గా ప్రశంస పొందాడన్నారు. తాను ఇచ్చిన కోచింగ్ తన కుమారుడికి ఎంతో ఉపయోగపడిందన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ కార్యాలయంలో డిప్యూ టీ ఈఓ పి.నారాయుడు, ఎంఈవో సూర్య చంద్రరావు తదితరులు ఆయనను అబినందించారు. -
అడవిలో దాహం తీర్చే ఊటలు
విజయనగరం గంటస్తంభం: ఒకప్పుడు వేసవి మొదలైందంటే చాలు..విజయనగరం జిల్లాలోని అభయారణ్య ప్రాంతాల్లో వన్యప్రాణుల పరిస్థితి దయనీయంగా మారేది. అడవుల్లో ఉన్న సహజ నీటి వనరులు ఒక్కొక్కటిగా ఎండిపోవడంతో జంతువులు దాహంతో అల్లాడేవి. నీటి కోసం అడవిని విడిచి గ్రామాల దారిపట్టేవి. ఆ సమయంలో వేటగాళ్ల ఉచ్చులు, విద్యుత్ కంచెలు, రహదారి ప్రమాదాలకు బలై ఎన్నో మూగజీవాలు ప్రాణాలు కోల్పోయేవి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అటవీశాఖ తీసుకున్న ప్రత్యేక చర్యలతో విజయనగరం అభయారణ్యం ఇప్పుడు వన్యప్రాణులకు జీవనాధారంగా మారింది. అడవి మధ్యలోనే నీటికుంటలు, చెక్‌డ్యామ్‌లు, చెలమలు, రాతికట్టడాలు, సాసర్పిట్లు నిర్మించి వేసవిలో కూడా జంతువులకు నీటి కొరత లేకుండా చేస్తున్నారు. దీంతో అడవులు మరింత పచ్చగా మారడమే కాకుండా వన్యప్రాణుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. అడవి గుండెలో నీటి జలధారలు విజయనగరం జిల్లా పరిధిలో సుమారు 17,300 హెక్టార్లలో విస్తరించి ఉన్న అభయారణ్యం దాదాపు 173 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంది. కొండలు, లోయలు, గిరిజన గ్రామాలు, లోతట్టు అటవీ ప్రాంతాలతో ఈ ప్రాంతం ప్రకృతి సంపదకు నిలయంగా నిలుస్తోంది. గతంలో వేసవి రాగానే అడవిలోని చిన్నచిన్న వాగులు, చెలమలు పూర్తిగా ఎండిపోయేవి. దీంతో జంతువులు నీటి కోసం నదులు, గ్రామాలవైపు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అడవి లోపలే నిర్మించిన నీటి వసతుల వల్ల జంతువులు బయటకు రావాల్సిన అవసరం లేకుండా పోయింది. పచ్చదనంతో అభయారణ్యం: అటవీశాఖ చేపట్టిన చర్యలతో అడవులు మళ్లీ పునర్జీవం పొందుతున్నాయి. గత తొమ్మిదేళ్లుగా సాగుతున్న వన సంరక్షణ చర్యల ఫలితంగా అభయారణ్యంలో పచ్చదనం పెరిగింది. అడవులు మరింత దట్టంగా మారాయి. ఇప్పుడు అడవిలో అడవి పందులు, ఎనుబోతులు, ఎలుగుబంట్లు, జింకలు, దున్నలు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. కోతులు, కొంగలు, నెమళ్లు, అరుదైన పక్షులు కూడా పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. పర్యావరణ సమతౌల్యం క్రమంగా మెరుగుపడుతోందని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు: అటవీ గ్రామాల ప్రజలకు వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం–1972 గురించి గ్రామస్తులకు వివరిస్తున్నారు. జంతువులకు హాని చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని తెలియజేస్తున్నారు. అడవిలో జంతువులు కనిపించినప్పుడు వాటిని రెచ్చగొట్టకుండా ఉండాలని, వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. అభయారణ్యంలో పుష్కలంగా నీటివసతులు జంతువుల కోసం నీటికుంటలు, చెక్ డ్యామ్‌లు తాగునీటి కోసం గ్రామాలకు రాకుండా అడవిలోనే ఏర్పాట్లువేటగాళ్లపై అటవీశాఖ ఉక్కుపాదం: వన్యప్రాణులను రక్షించేందుకు అటవీశాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. అటవీ ప్రాంతాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనిస్తున్నారు. విద్యుత్ కంచెలు, ఉచ్చులు, అక్రమ వేటకు సంబంఽఽధించిన సమాచారం వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అడవుల్లో సీసీ కెమెరాలు, మొబైల్ పర్యవేక్షణ, స్ధానిక గిరిజనుల సహకారంతో వేటగాళ్ల కదలికలను గుర్తిస్తున్నారు.జంతువుల దాహం తీరేలా ప్రత్యేక ప్రణాళిక వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అటవీశాఖ ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోంది. నీటి కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ కృత్రిమ నీటి వనరులు ఏర్పాటు చేస్తున్నారు. చెక్‌డ్యామ్‌లు, సాసర్ పిట్లు, మినీ వాటర్ పాయింట్లు, రాతి కట్టడాలు నిర్మించి వర్షపు నీటిని నిల్వ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతూ అడవిలోని నీటికుంటలను ఎప్పటికప్పుడు నిండుగా ఉంచుతున్నారు. అధికారులు, అటవీ సిబ్బంది ప్రతిరోజూ పర్యవేక్షణ చేస్తూ నీటి పరిస్ధితిని పరిశీలిస్తున్నారు.వన్యప్రాణులను కాపాడడం అందరి బాధ్యత వేసవిలో వన్యప్రాణులు ఇబ్బంది పడకుండా అడవిలోనే నీటి వసతులు కల్పిస్తున్నాం. చెక్‌డ్యామ్‌లు, నీటికుంటలు, చెలమల ద్వారా జంతువులకు తాగునీరు అందిస్తున్నాం. వేటగాళ్లపై కఠిన నిఘా కొనసాగుతోంది. ప్రజలు కూడా వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వాములు కావాలి. అడవిలోని జీవ వైవిధ్యాన్ని కాపాడడం అందరి బాధ్యత. – బిర్లంగి రామ్‌నరేష్, అటవీ రేంజ్ అధికారి, విజయనగరం -
అవయవ దానం
పాలకొండ రూరల్: భౌతికంగా ఇంటి పెద్ద మరణించినా వేరొకరిలో అతడు జీవించేలా ఆ కుటుంబం ముందుకు వచ్చింది. ఆరోగ్య సమస్యలతో తమ తండ్రి వారి మధ్య లేకున్నా ఆయన ఆవయవాలను దానం చేయటం ద్వారా మరో వందేళ్లు సదరు అవయవాలు పొందిన వారిలో జీవించే ఉంటారని పిల్లలు తలచారు. బ్రైన్ డెడ్‌తో తుదిశ్వాస విడిచిన ఇంటి పెద్ద అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. పాలకొండ పట్టణం వడమలో నివాసం ఉంటున్న వైశ్యరాజు దుర్గారావు(62) కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఆయనను విశాఖ అపోలో ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందించారు. ఈ క్రమంలో గురువారం రాత్రి బ్రైన్ డెడ్ కావటంతో వైద్యులు ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. కట్టుకున్న భర్తను కోల్పోనున్నట్టు తెలిసినా దుర్గారావు భార్య క్రిష్ణవేణి, కన్న తండ్రి ఇకపై తమ మధ్య ఉండరని తెలిసి పిల్లలు ఆదిత్యరాజు, స్వాతి తట్టుకోలేకపోయారు. తీరని ఆవేదన, గుండె భారాన్ని పంటి దిగువ బిగబట్టారు. భౌతికంగా ఆయన మరణించినా అవయవ దానం ద్వారా వేరొకరిలో తమ తండ్రిని బతికించవచ్చని భావించారు. తమ తల్లి, కుటుంబ సభ్యుల అంగీకారంతో కళ్లు, కాలేయం దానమిచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘వెల్ఫేర్ డే’పార్వతీపురం రూరల్: అహర్నిశలు ప్రజాసేవలో అంకితమయ్యే పోలీస్ సిబ్బంది వ్యక్తిగత, వృత్తిపరమైన ఇబ్బందులను తొలగించడమే తమ మొదటి ప్రాధాన్యమని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘పోలీస్ వెల్ఫేర్ డే’ (గ్రీవెన్స్ డే) వేదికగా ఆయన సిబ్బందితో ముఖాముఖి భేటీ అయ్యారు. విధుల్లో ఎదురయ్యే సవాళ్లతో పాటు, సిబ్బంది ఆరోగ్యం, కుటుంబ సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో అలసట ఎరుగక శ్రమించే సిబ్బందికి అండగా నిలవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పోలీసుల నుంచి ఆయన వినతులను స్వీకరించారు. ప్రధానంగా అనారోగ్య సమస్యలు, బదిలీలకు సంబంధించిన విన్నపాలు ఎస్పీ దృష్టికి వచ్చాయి. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, సమస్యల పూర్వాపరాలను ఆరా తీసి, వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయం సీసీ సంతోష్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మోపెడ్ అదుపుతప్పి యువకుడికి గాయాలుబలిజిపేట: మండలంలోని బలిజిపేట–పెదపెంకి రోడ్డులో ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో వెంగాపురం గ్రామానికి చెందిన బండి వెంకటేష్ గాయాల పాలయ్యాడు. బలిజిపేట–పెదపెంకి మార్గంలో రోడ్డుపక్కన పడిఉన్న వెంకటేష్‌ను అటువైపుగా వెళ్తున్న వారు చూసి బలిజిపేట పీహెచ్‌సీకి తరలించారు. మోపెడ్‌పై వెళ్తున్న వెంకటేష్ దానిని అదుపుచేయలేకపోవడంతో గాయాల పాలై పడిపోయి ఉంటాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. వెంకటేష్‌కు పీహెచ్సీలో వైద్యసేవలు అందించి మెరుగైన వైద్యం నిమిత్తం పార్వతీపురం పీహెచ్‌సీకి తరలించారు. గాయపడిన వ్యక్తి మృతితెర్లాం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. దీనికి సంబంధించి తెర్లాం ఎస్సై సాగర్‌బాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాడంగి మండలం వాడాడకు చెందిన గొట్టాపు శ్రీనివాసరావు(47)ద్విచక్ర వాహనాన్ని మండలంలోని కూనాయవలస జంక్షన్ వద్ద ఈనెల 11న లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను చికిత్స కోసం విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. హెచ్‌సీ నాగేశ్వరరావు మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
కన్న పేగే యమపాశమై..!
రాజాం సిటీ: నవమాసాలు కని పెంచిన కన్న కొడుకే తల్లి పాలిట కాలయముడయ్యాడు. ప్రయోజకుడిని చేయాలనుకున్న కన్నపేగే మృత్యుపాశమైంది. సెల్ఫోన్లో వచ్చే కిల్లర్ యానిమేషన్, డాన్ ఫిల్మ్‌లకు ఆకర్షితుడైన ఆ యువకుడు అతిగా ఊహించుకున్నాడు. వాటికి తోడు తల్లి పెట్టిన ఆంక్షలు తట్టుకోలేకపోయాడు. మరో స్నేహితుడి సాయం తీసుకుని తల్లినే హతమార్చాడు. ఇవీ రాజాం పట్టణం డోలపేటలో ఈనెల 4న జరిగిన స్పందన హత్యకేసు ఘటన వివరాలు. పదిరోజుల అనంతరం పోలీసులు కేసు ఛేదించి తల్లి హత్యకు కారణమైన కుమారుడిని, స్నేహితుడిని పట్టుకుని రాజాం పట్టణ సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 4న డోలపేటలో స్పందన అనుమానాస్పద హత్యకు గురైంది. హతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమె కుమారుడిపై అనుమానం రావడంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టి పట్టుకున్నారు. పదో తరగతి పరీక్షల్లో 525 మార్కులు సాధించిన స్పందన కుమారుడు సెల్ఫోన్లో యానిమేషన్ ఫిల్మ్‌కు ఆకర్షితుడయ్యాడు. బాగా చదవాలని, సెల్‌ఫోన్ వినియోగించరాదని తల్లి బుద్ధులు చెప్పడంతో పాటు బయటకు వెళ్లి ఇంటికి వచ్చేటప్పుడు కాళ్లు కడుక్కుని రావాలని, పెద్దలతో మర్యాదగా ప్రవర్తించి మంచి పేరు తెచ్చుకోవాలని రూల్స్ పెట్టింది. వాటికి తోడు కుమారుడి వద్ద ఉన్న లెటర్స్, పుస్తకాలు తరచూ తనిఖీ చేస్తుండేది. ఈ కట్టుబాట్లకు ఆ యువకుడు తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు. అంతే కాకుండా ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని ఒక లెటర్ రాసుకున్నాడు. ఆ విషయం తల్లికి తెలిసిపోయి మందలించింది. దీంతో మరింత మనస్తాపానికి గురై స్నేహితుల వద్ద మా అమ్మ నన్ను టార్చర్ చేస్తోందని, ఇల్లు వదిలి బయటకు వెళ్లి డాన్‌గా మారాలని చెప్పేవాడు. అదే సమయంలో డోలపేట సమీపంలోని గ్రామానికి చెందిన మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ యువకుడు కూడా ఇలానే ఆలోచించడం, ఇంటర్‌పరీక్షలు ఇటీవల రాయకుండా వదిలేయడం, ఇంటి వద్ద తండ్రి మందలించడంతో బయట తిరగడం చేసేవాడు. వ్యవస్థపై విసుగుచెంది కోపం పెంచుకోవడంతో పాటు ముంబై వంటి ప్రాంతాల్లో మాఫియాలో చేరాలని ఆ యువకుడు కూడా అనుకునేవాడు. దీంతో వారిద్దరి ఆలోచనలు ఒకటి కావడంతో ఒకరి కష్టాలు ఒకరు పంచుకున్నారు. ఏం చేయాలి, ఎలా చేయాలని పథకం వేసుకున్నారు. ఈ క్రమంలో స్పందన కుమారుడు మా అమ్మని ఎలాగైనా చంపేయాలని అనుకున్నాడు. తాను కూడా మాఫియాలో చేరాలని అనుకున్నాడు. దీనికి పథకం వేసుకున్నారు. అక్కడి నుంచి అనుకున్న పథకం ప్రకారం ఈనెల 4న స్పందన ఇంటికి వెళ్లారు. అప్పటికి ఆమె ఇంట్లో లేదు. మా అమ్మ ఇంటికి వచ్చిన వెంటనే బాత్రూమ్కి వచ్చి కాళ్లు కడుక్కుంటుందని అని చెప్పడంతో అతని స్నేహితుడు బాత్రూమ్లో దాక్కున్నాడు. వారు అనుకున్నట్లే ఆమె ఇంటికి వచ్చి బాత్రూమ్లో కాళ్లు కడుక్కునేందుకు వెళ్లింది. అప్పటికే అక్కడే ఉన్న స్నేహితుడు ఆమె మెడపట్టుకుని కిందపడిపోయాడు. అరుస్తున్న ఆమె నోటిని రెండో చేతితో గట్టిగా మూశాడు. ఆమె ఆ యువకుడి చేతిని కొరికినా విడిచిపెట్టకుండా అలాగే పట్టుకున్నాడు. చనిపోయిందని అనుకుని వదిలేశారు. అయినా ఆమెలో కదలికలు రావడంతో ఇద్దరూ ఇంట్లో ఉన్న కత్తులతో దాడిచేశారు. బాత్రూమ్లో రక్తాన్ని కడిగేసిన తరువాత చీరలో అమెను చుట్టి ఇంటి దగ్గరలో ఉన్న చెరువు దగ్గరపడేశారు. వారు ధరించిన బట్టలు, కత్తులు సైతం ఎవరికీ కనిపించకుండా విసిరేశారు. అనంతరం వారిద్దరూ ఇంట్లో ఉన్న తొమ్మిదిన్నర తులాల బంగారం, రూ.5వేలు నగదు తీసుకుని వెళ్లిపోయారు. అక్కడి నుంచి పలాస, విశాఖపట్నం, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లారు. వారి వద్ద ఉన్న ఫోన్లలో సిమ్‌లు పడేసి అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌కు ఇన్‌స్ట్రాగామ్ ద్వారా మెసేజ్‌లు చేసేవారు. అలా ఇన్‌స్టా గ్రామ్ మెసేజ్ ద్వారా వారిద్దరూ తిరుపతిలో ఉన్నట్లు రాజాం పోలీసులు కనిపెట్టి తిరుపతి పోలీసుల సహాయంతో నిందితులిద్దరినీ పట్టుకుని వారి వద్ద ఉన్న బంగారం కడియం, కత్తులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ జువైనల్ హోమ్‌కు తరలించనున్నామని డీఎస్పీ పేర్కొన్నారు. మాఫియాకు ఆధారాలు చూపించాలనే.. సంవత్సరం క్రితం పరిచయమైన వారిద్దరూ మాఫియాలో చేరాలని నిర్ణయించుకుని, జపాన్ యానిమేషన్లు తరచూ చూస్తూ వాటిని అనుకరించారు. దీంతో వాటికి ఆకర్షితులై వారిలా మాఫియా డాన్లు కావాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా తన తల్లిని చంపిన తరువాత వారిని పోలీసులు వెతికిన ఆధారాలు చూపిస్తే మాఫియాలో జాయిన్ చేసుకుంటారనేది రెండో బాలుడు చెప్పిన అంశమని డీఎస్పీ తెలిపారు. పిల్లల ప్రవర్తనపై దృష్టిసారించాలి.. ఇంట్లో చిన్నారుల కదలికలతోపాటు వారి ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టిసారించాలని డీఎస్పీ రాఘవులు అన్నారు. ఎక్కువగా సెల్ఫోన్లకు అలవాటుపడిన పిల్లలు ఏం చేస్తున్నారు? వారి ఫ్రెండ్స్ ఎవరు? సోషల్ మీడియాలో వారి పాత్ర ఏమిటి వంటి వాటిని గ్రహించాలని హితవు పలికారు. ఇలా వారిపై దృష్టిసారిస్తే తీవ్రమైన నేరాలు జరగకుండా అరికట్టవచ్చన్నారు. సమావేశంలో టౌన్, రూరల్ సీఐలు కె.అశోక్‌కుమార్, హెచ్.ఉపేంద్ర, ఎస్సై సల్మాన్ బేగ్‌లు పాల్గొన్నారు. అతిగా ఆంక్షలు పెడుతోందని తల్లిపై కక్ష స్నేహితుడి సహాయంతో హత్య ముంబై మాఫియాలో చేరి, డాన్‌గా మారాలని ఆశ స్పందన హత్యకేసును చేధించిన పోలీసులు -
మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి
సాలూరు: విద్యుత్‌శాఖ నిర్లక్ష్యం వల్లనే గిరిజన యువకుడు మృతి చెందాడని సీపీఎం జిల్లా కార్యదర్శి కె.గంగునాయుడు ఆరోపించారు. మక్కువ మండలం ఎర్రసామంతవలసలో విద్యుత్లైన్లు తగిలి విద్యుత్‌శాఖలో అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్న పీడిక ప్రకాష్ అలియాస్ నవీన్(23) మృతిచెందాడని తెలిసి పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి వచ్చి బాధిత కుటుంబాన్ని సీపీఎం బృందం పరామర్శించింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, సదరు యువకుడి మృతికి విద్యుత్ శాఖ అధికారులు అధికారులు బాధ్యులని కావున విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చట్టపరమైన చ ర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడైన ప్రకాష్‌పై ఆధారపడి ఆయన తండ్రి చిన్నప్ప, తల్లి సంబరమ్మ, అక్క, తమ్ముడు చిన్నారి,గణేష్‌లు జీవిస్తున్నారని అన్నారు. విద్యుత్ పనుల నిమిత్తం వెళ్లిన ప్రకాష్ విగతజీవిగా మారాడని, కావున ఆ కుటుంబాన్ని అధికారులు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎన్వైనాయుడు, ఎం.శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో పర్యాటక రంగానికి ఊపు
● అంతర్జాతీయ అనుసంధానతకు గేట్వేగా విశాఖ ● ఆంధ్రా టూర్స్ – ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్‌మోహన్ పూసపాటిరేగ: రాబోయే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర పర్యాటక, ఆతిథ్య రంగాల భవిష్యత్తును పూర్తిగా మార్చేయనుందని ఆంధ్రా టూర్స్ – ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్‌మోహన్ అన్నారు. శుక్రవారం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల రాకను పెంచుతూ, తూర్పు తీరంలో పర్యాటకం, వాణిజ్యానికి ఈ విమానాశ్రయం ఒక కీలక గేట్వేగా మారబోతోందన్నారు. కొత్త విమానాశ్రయం కేవలం రవాణా వ్యవస్థ మాత్రమే కాదని, ఇది ప్రాంతీయ అభివృద్ధిని, ఉపాధిని నడిపించే వ్యూహాత్మక వృద్ధి ఇంజిన్ అన్నారు. ప్రముఖ అంతర్జాతీయ హోటల్ బ్రాండ్లు ఇక్కడికి వస్తుండటంతో విశాఖపట్నం వేగంగా ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా మారుతోందన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ దీనికి గేమ్–ఛేంజర్ కానుందని ఆయన పేర్కొన్నారు. ఆధ్యాత్మిక, అంతర్జాతీయ పర్యాటక ఆకర్షణ రాష్ట్రంలో బౌద్ధ, గిరిజన పర్యాటక సర్క్యూట్ల అభివృద్ధి ద్వారా ఆసియాన్, తూర్పు ఆసియా దేశాల నుంచి ఆధ్యాత్మిక పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించే అవకాశం ఉందని విజయ్‌మోహన్ వివరించారు. మౌలిక సదుపాయాలను కేవలం రవాణా కోణంలోనే కాకుండా ఆర్థిక ప్రగతికి సాధనంగా చూస్తున్న తరుణంలో, భోగాపురం విమానాశ్రయం తూర్పు తీర ప్రాంత పర్యాటక ఆధారిత ఆర్థిక వృద్ధిలో అత్యంత కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది మరింత దోహదపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. -
క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం
విజయనగరం: అధికారంలో ఉన్నా.. లేకున్నా నిరంతర ప్రజా సంక్షేమం, శ్రేయస్సు కోసం పని చేసే వైఎస్సార్సీపీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేయటమే లక్ష్యంగా పని చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు సూచించారు. శుక్రవారం రింగ్‌రోడ్డులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులతో నిర్వహించిన సమావేశంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రజా సమస్యలపై పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీని మరింత పటిష్టంగా నిర్మించేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో నియోజకవర్గ సమన్వయకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రధానంగా పార్టీ పరంగా కమిటీల నియామకాలను శతశాతం పూర్తి చేయాలని, బీఎల్ఏలను నియమించాలని దిశా నిర్దేశం చేశారు. పార్టీలో అసమ్మతులతో చర్చించి ఎప్పటికప్పుడు పరిస్థితులను చక్కదిద్దటంతో పాటు కూటమిలో వ్యతిరేకులను ఆకర్షించి పార్టీలో చేరేలా కృషి చేయాలని తెలిపారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనపై విస్తృత ప్రచారం చేయాలి రెండేళ్ల క్రితం అధికారం కోసం అమలుకు సాధ్యం కాని హమీలు గుప్పించి నేడు వాటిని అమలు చేయకుండా అబద్దపు ప్రచారాలు చేస్తున్న చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన ఒక్కరికి కొత్త పింఛను ఇవ్వలేదన్నారు. సూపర్ సిక్స్ హమీలు గాల్లో కలిపేసి అన్ని అమలు చేసామంటూ ప్రచారం చేసుకోవటాన్ని ప్రజలకు వివరించాలన్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న భృతిపై ప్రభుత్వంలో చలనం లేదని ఇటువంటి ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలతోనే తరిమికొట్టించాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, గొర్లె రవికుమార్, చీపురుపల్లి నియోజకవర్గ పరిశీలకులు శోభా స్వాతీరాణి, ఎస్.కోట నియోజకవర్గ పరిశీలకులు కె.భాగ్యలక్ష్మి, గజపతినగరం నియోజకవర్గ పరిశీలకులు సిరిపురపు జగన్మోహన్రావు, రాజాం నియోజకవర్గ పరిశీలకులు కెవి.సూర్యనారాయణరాజు, నెల్లిమర్ల నియోజకవర్గ పరిశీలకులు నెక్కల నాయుడుబాబు, బొబ్బిలి నియోజకవర్గ పరిశీలకులు రొంగలి జగన్నాధరావు తదితరులు పాల్గొన్నారు. మరి కొద్ది నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయన్న సంకేతాల నేపథ్యంలో పార్టీ క్యాడర్‌ను అందుకు సిద్ధం చేయాలని మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గ్రామాల్లో, వార్డుల్లో పార్టీ నాయకులతో తరచూ సమావేశాలు నిర్వహించాలన్నారు. తద్వారా పార్టీ నేతల్లో ఉత్సాహాన్ని నింపి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్‌ను సిద్ధం చేయాలి కూటమి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు 7 నియోజకవర్గాల పరిశీలకులతో సమావేశం -
ఆ ఉద్యోగులు యథాస్థానానికి!
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం ఐటీడీఏలో వివాదాల నేపథ్యంలో ఏడుగురు ఉద్యోగులకు కొద్ది రోజుల క్రితం విభాగాలను మా ర్చిన విషయం విదితమే. జూనియర్, సీనియర్ సహాయకులను ఐటీడీఏ నుంచి గిరిజన సంక్షే మ శాఖకు.. ఇటు వైపు వారిని అటు మార్చా రు. దీనిపై కొద్ది రోజులు సందిగ్ధత ఏర్పడింది. పీఓగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వైశాలి తక్షణమే వారికి అప్పగించిన నూతన విధుల్లో చేరాలని స్పష్టం చేశారు. గిరిజన సంక్షేమ శాఖ విధుల పట్ల అవగాహన లేని వారిని నియమించడంపై పాలనాపరంగా ఇబ్బందులు ఎదురవుతాయని డీడీ విజయశాంతి పీఓ వైశాలి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సానుకూలంగా స్పందించిన పీఓ.. వారి డిప్యుటేన్లను రద్దు చేశారు. పూర్వ స్థానంలో యథావిధిగా పని చేసుకోవా లని ఉత్తర్వులు జారీ చేశారు. పార్వతీపురం రూరల్ : ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్.వైశాలి ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలోని తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో ఆమె ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ.. పాడి–పంటపై ఆధారపడిన వారికి అండగా నిలవాలని, తక్షణమే అర్హులైన లబ్ధిదారులను గుర్తించి పాడి ఆవులను పంపిణీ చేయాలని సూచించారు. పశుగ్రాసం కోతకు ఉపయోగపడే ‘చాఫ్ కట్టర్ల’ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు డ్రాగ్ నెట్లు, చేపల ఉత్పత్తి పెంపునకు పోర్టబుల్ హేచరీల ఏర్పాటుకు అనువైన స్థలాలు, ఆసక్తి గల లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన గడువులోగా నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డా. ఎస్.మన్మధరావు, మత్స్య శాఖాధికారి టి.సంతోష్‌కుమార్, ఎం.హెచ్.ఓ, డీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. పార్వతీపురం రూరల్: మండలంలోని అడారు ప్రాథమిక పాఠశాల ఆవరణలో అనధికారికంగా టేకు చెట్లను నరికి తరలించిన ఘటనపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాలూరు రేంజర్ పవిత్నాయుడు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన సిబ్బంది. నిడగల్లులోని ఒక టింబర్ మిల్లులో దాచిన టేకు దుంగలను స్వాధీనం చేసుకుని సాలూరు రేంజ్ కార్యాలయానికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి డీకే పట్నం గ్రామానికి చెందిన ఇద్దరు రాజకీయ నాయకులు, తెలుగుదేశం పార్టీకి చెందిన మరో నేత సహా ముగ్గురికి శుక్రవారం అటవీశాఖ నోటీసులు అందజేసింది. మక్కువ ఫారెస్టర్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రక్రియలో నిందితులు నోటీసులు తీసుకోకపోతే ఇళ్ల గోడలకు అతికించనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం నాటికి విచారణకు హాజరుకావాలని, వారి స్టేట్మెంట్ల ఆధారంగా నివేదికను జిల్లా అటవీ అధికారికి పంపి అపరాధ రుసుము విధిస్తామని స్పష్టం చేశారు. కాగా, ఈ వ్యవహారంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు (హెచ్ఎం) ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసుల దర్యాప్తు ఇంకా ముందుకు సాగలేదు. ఏం జరుగుతుందో వేచి చూడాలి. -
మన్యంలో భానుడి భగభగలు
● రానున్న ఐదు రోజులు మండే ఎండలు ● ప్రజలకు కలెక్టర్ హెచ్చరిక పార్వతీపురం: మన్యం జిల్లాలో రాబోయే ఐదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండనున్నట్టు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి శు క్రవారం తెలిపారు. రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) విభాగం విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం జిల్లాలోని 15 మండలాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. జిల్లాలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు, పార్వతీపురం, గరుగు బిల్లి, పాలకొండ, బలిజిపేట, వీరఘట్టం, కొమరా డ, జియ్యమ్మవలస. పాచిపెంట, భామిని, సీతంపేట, సీతానగరం, సాలూరు తదితర మండలాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మండలాల్లో ఉష్ణోగ్రత లు 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 54 డిగ్రీల వరకు నమోదయ్యే అవ కాశం వుందని పేర్కొ న్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. డీ హైడ్రేషన్‌కు గురికాకుండా తరు చూ తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ నివారణకు గొడుగు లేదా టోపీ వినియోగించాలని సూచించారు. -
బడి బస్సులకు భద్రతా పరీక్ష
● మన్యంలో తనిఖీలు ముమ్మరం! ● 63 వాహనాల పరిశీలన పూర్తి.. ● మరమ్మతుల్లో మరో 32 : డీటీఓ పార్వతీపురం రూరల్ : విద్యార్థుల సురక్షిత ప్రయా ణమే సంకల్పంగా పార్వతీపురం మన్యం జిల్లాలో బడి బస్సుల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నా యి. పారదర్శక సేవలే లక్ష్యంగా జిల్లా రవాణా అధి కారి (డీటీఓ) దుర్గాప్రసాద్ రెడ్డి శుక్రవారం క్షేత్రస్థాయిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 95 పాఠశాల బస్సులకుగాను, ఇప్పటివరకు 63 వాహనాల పరిశీలన పూర్తయింది. ఈ తనిఖీల్లో బస్సుల సాంకేతిక స్థితిగతులు, భద్ర తా ప్రమాణాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాహనాల ఫిట్నెస్ నిర్ధారించడమే ఈ డ్రైవ్ ముఖ్య ఉద్దేశమని డీటీఓ స్పష్టం చేశారు. ప్రస్తుతం వివిధ మరమ్మతు ల్లో ఉన్న మిగిలిన 32 బస్సులను కూడా బాగు చేయించిన అనంతరం.. నిర్ణీత గడువులోగా తనిఖీ ప్రక్రియ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని అధికారులను డీటీఓ ఆదేశించారు. ప్రభుత్వ వ్యవస్థలో జవాబుదారీతనం పెంచేందుకు, ప్రజలకు కచ్చితమైన సమాచారం చేరవేయడంలో మీడియా అందిస్తున్న సహకారం అభినందనీయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. -
జిందాల్ అవకతవకలకు నేతలే కారణం
శృంగవరపుకోట: జిందాల్లో అవకతవకలకు నేతలే కారణమని, జిందాల్ పేరు చెప్పి పేదల భూములు లాక్కుని మోసం చేశారని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన స్థానిక సీపీఎం నేతలతో కలిసి జిందాల్ అవకతవకలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా భూములు లాక్కుని మాకు ఇచ్చిన పరిహారాన్ని ఎమ్మెల్సీ అనుచరులు తినేశారంటూ పీజీఆర్ఎస్లో బాధితులు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటన్నారు. నాడు జిందాల్‌కు భూములిచ్చింది మొదలు నేటివరకూ అవకతవకలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నోళ్లు, గతంలో అధికారం వెలగబెట్టిన వారంతా అవకతవకలకు పాల్పడ్డారన్నారు., కంపెనీకి భూములివ్వొద్దని నాడే సీపీఎం చెప్పిందని, 18యేళ్లయినా కంపెనీ పెట్టలేదని, ఆరేళ్లలోగా కంపెనీ పెట్టకుంటే భూములు వెనక్కి ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఉందని, చట్టప్రకారం నాడు పశ్ఛిమబెంగాల్లో అధికారంలో ఉన్న సీపీఎం నందిగ్రామ్ భూములు వెనక్కి ఇచ్చిందని గుర్తు చేశారు. ఇక్కడ 250రోజులుగా భూముల్ని బాధితులకు ఇవ్వాలని ఉద్యమం సాగుతుండగా, 27ఎకరాల భూములు తీసుకుని, పరిహారం చెల్లింపుల్లో నాయకులు, అధికారులు అవకతవకలకు పాల్పడి, అడిగితే బెదిరింపులకు దిగుతున్నారన్నారు. కల్టెక్టర్ కొత్త అయినా అధికారులు అంతా పాతవారేనన్నారు. గతంలో బినామీలు జిందాల్ సొమ్ములు స్వాహా చేశారని ఫిర్యాదు చేసిన ఒక పార్టీనేత ముడుపులు ముట్టడంతో తర్వాత మాట్లాడలేదన్నారు. బినామీ పేర్లతో గిరిజనుల సొమ్ము కాజేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, లేకుంటే జిందాల్ నిర్వాసితులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యకన్రమంలో సీపీఎం మండల కార్యదర్శి మద్దిల రమణ, చెలికాని ముత్యాలు పాల్గొన్నారు. -
కళ్లెదుటే కన్నకొడుకు మృతి
రేగిడి: చేతికి అందొచ్చిన కొడుకు కుటుంబాన్ని ఆదుకుంటాడని ఎంతో ఆశపడ్డ ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. కళ్లెదుటే కన్నకుమారుడు బస్సు ప్రమాదంలో మృతిచెందడం చూసి కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో పనసలవలస గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. రేగిడి మండల పరిధిలోని పనసలవలస గ్రామానికి చెందిన నారు అప్పలనాయుడు, నారు సత్యవతి, వారి పెద్దకుమారుడు సాయి అనిల్‌కుమార్(24), చిన్నకుమారుడు నారు గోపాల్‌తో కలిసి విజయవాడలో బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహానికి బుధవారం సాయంత్రం ప్రైవేట్ బస్సులో బయలుదేరారు. తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి మండలం యర్నగూడెం వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారు జామున 3.30 గంటలకు రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న టిప్పర్ బస్సును ఢీకొంది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ముందు భాగంలో పనసలవలస గ్రామానికి చెందిన సాయి అనిల్‌కుమార్ కూర్చోవడంతో బస్సును టిప్పర్ ఢీకొనడంతో సాయిఅనిల్‌కుమార్ ఘటనా స్థలంలోనే మృతిచెందగా గోపాల్‌తో పాటు తల్లిదండ్రులకు కూడా గాయాలయ్యాయి. తమ కళ్లెదుటే కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కుటుంబానికి అండగా ఉంటానన్నాడు.. కాయకష్టంచేసి ఇద్దరు అన్నదమ్ములను డిగ్రీ వరకు చదివించామని, పీజీచేసి ఉద్యోగాలు సంపాదించి కుటుంబానికి అండగా ఉంటానని సాయిఅనిల్‌కుమార్ అన్నమాటలను కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు గుర్తు చేసుకుని విలపిస్తున్నారు. అందరిలో మంచివ్యక్తిగా పేరు సంపాదించిన సాయిఅనిల్‌కుమార్ కష్టపడి చదివే మనస్తత్వం ఉన్న యువకుడు చనిపోవడం దారుణమని, ఇటువంటి కష్టం పగవాడికి కూడా రాకూడదని గ్రామస్తులు వాపోతున్నారు. కుటుంబాన్ని ఆదుకుంటాడనుకుంటే అనంతలోకాలకు పయనం పెళ్లికి వెళ్లుండగా బస్సు ప్రమాదం కంటికీమింటికీ ఏకధారగా రోదిస్తున్న కుటుంబసభ్యులు పనసలవలస గ్రామంలో విషాదఛాయలు -
ప్రైవేటు వెంబడి పంతుళ్లు
–8లోకౌలు రైతులకు ఎరువు కరువే..! గతంలో మాదిరిగా ఎరువులు ఎక్కడ కావాలంటే అక్కడ..ఎప్పుడు కావాలంటే అప్పడు లభించే పరిస్థితి ఉండదు. శుక్రవారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2026సాక్షి, పార్వతీపురం మన్యం: రపభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక కోసం ఉపాధ్యాయులకు కూడా ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. పాఠశాలల బలోపేతానికి విద్యార్థుల చేరిక ముఖ్యమే. దీన్ని కాదనలేం. ఇందుకోసం.. తక్కువ సౌకర్యాలున్న చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్లపై గురి పెట్టాలని చెప్పడమే ఆయా యాజమాన్యాలకు ఆందోళన కలిగిస్తోంది. విద్యాశాఖ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు కార్పొరేట్ విద్యాసంస్థలకు పరోక్షంగా దన్నునిచ్చేలా కనిపిస్తున్నాయి. ఇటీవల అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులతో వెబ్ సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో అడ్మిషన్లకు సంబంధించిన చర్చలో చిన్న ప్రైవేట్ పాఠశాలలపైనే దృష్టి పెట్టాలని, కార్పొరేట్ విద్యాసంస్థల జోలికి వెళ్లవద్దని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు భోగట్టా. దీనిపై ఉపాధ్యాయ వర్గాలతో పాటు, చిన్న పాఠశాలల యాజమాన్యాలు మండిపడుతున్నాయి. చేరిక ముఖ్యమే.. ఇలానా? జిల్లాలో మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 1,507 ఉన్నాయి. ఇందులో సుమారు 1.30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 14 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. మన్యం జిల్లా నాలుగు సంవత్సరాలుగా పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలుస్తోంది. జూనియర్ కళాశాలలు సైతం ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. ఇదే సమయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాడు–నేడు కింద సర్కారు పాఠశాలల్లో విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చింది. దీనివల్ల ప్రభుత్వ బడులు బలోపేతం అయ్యాయి. దీంతో సర్కారు పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ప్రస్తుత ప్రభుత్వంలో ‘బడి పిలుస్తోంది’ పేరిట ఉపాధ్యాయులను గ్రామాల్లోకి పంపిస్తోంది. పిల్లలను తమ బడుల్లో చేర్పించాలని ఉపాధ్యాయులకు లక్ష్యం విధించింది. ప్రైవేటు స్కూళ్లు వదిలి, ఇక్కడికి ఎందుకు వస్తారని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయగా.. సి – కేటగిరీ స్కూళ్లనే లక్ష్యంగా చేసుకోవాలని, కార్పొరేట్ జోలికి వెళ్లవద్దని రాష్ట్ర విద్యా శాఖ అధికారులు సూచించడం గమనార్హం. ఈ ప్రభావం గ్రామాలు, కాలనీల్లో నడుస్తున్న సింగిల్ మేనేజ్మెంట్, అతి తక్కువ విద్యార్థులతో నడుస్తున్న చిన్న పాఠశాలలపై ఎక్కువ ప్రభావం పడుతుందని ఆయా యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమ వద్దకు వస్తున్న వారే పేద, మధ్య తరగతి పిల్లలు అని.. ఫీజులు సకాలంలో ఇవ్వకపోయినా, తగ్గించినా తాము ఏమీ అనలేమని అంటున్నారు. టీచర్ల జీతాలు, నిర్వహణ ఖర్చు అన్నీ పోనూ మిగిలేది ఏదీ ఉండదని చెబుతున్నారు. ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పాఠశాలలను నడుపుతున్నామని చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల విద్యార్థుల సంఖ్య తగ్గితే.. వేలాది మంది ఉపాధ్యాయులు, సిబ్బంది జీవనోపాధిపై దెబ్బ పడుతుందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, ప్రభుత్వ బడుల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులకు ప్రైవేటుపాఠశాలలు టీసీలు ఇవ్వకుంటే ఎంఈఓలకు తెలియజేయాలని, వారే యూడైస్‌లో పేర్లను తొలగించి టీసీలు మంజూరు చేస్తారని చెప్పడంపైనా ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి విధానాలకు పాల్పడితే ఆందోళన బాట పట్టక తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో చేరికల కోసం ఉపాధ్యాయులపై ఒత్తిళ్లు కార్పొరేట్‌కు కొమ్ము కాసేద్దాం.. చిన్న పాఠశాలలకు చెక్ పెట్టేద్దాం! సి – కేటగిరీ ప్రైవేటు స్కూళ్లనే లక్ష్యంగా చేసుకోవాలని పిలుపు అక్కడి నుంచే పిల్లలను తేవాలని ఆదేశాలు కార్పొరేట్ స్కూళ్ల వైపు చూడొద్దని సూచన ప్రభుత్వ తీరు పెద్ద సంస్థలకు దన్ను ఇచ్చేలా ఉందంటున్న చిన్న పాఠశాలల యాజమాన్యాలు మరోవైపు కార్పొరేట్, పెద్ద ప్రైవేట్ స్కూళ్లవైపు చూడొద్దని పరోక్షంగా చెప్పడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది. ఇప్పుటికే కార్పొరేట్ స్కూళ్లు ఫీజులు, పుస్తకాలు, యూనిఫారాలు పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రక్తం పిండేస్తున్నాయి. వీటిపై విద్యా శాఖాధికారుల పరిశీలన, చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు. కార్పొరేట్ స్కూళ్లకు ప్రభుత్వం కొమ్ము కాస్తోందని విద్యార్థి సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నా స్పందించిన దాఖలాలు లేవు. కార్పొరేట్ పాఠశాలల పట్ల ఉదాసీనత ఎందుకు ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదని విద్యార్థి సంఘాలు దుయ్యపడుతున్నాయి. -
కౌలు రైతులకు ఎరువు కరువే..!
రాజాం/గుర్ల: గతంలో మాదిరిగా ఎరువులు ఎక్కడ కావాలంటే అక్కడ..ఎప్పుడు కావాలంటే అప్పడు లభించే పరిస్థితి మారబోతోంది. ఆయా రైతు సేవా కేంద్రాలకు వచ్చే ఎరువులను రైతులు, భూములు లెక్క కట్టి ఇవ్వనున్నారు. ఈ విధానంలో పెద్ద రైతులకు, కౌలు రైతులకు గడ్డు పరిస్థితే. భూమిని సాగుచేసే రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదుకాకుంటే ప్రభుత్వ కేంద్రాలే కాకుండా ప్రైవేట్ స్టోర్లలో సైతం ఎరువు లభించదు. ఇప్పటికే చాలా మంది రైతుల భూముల వివరాలు సక్రమంగా లేవు. రైతుకు సక్రమంగా ఎరువులు అందించేందుకు అమలుచేస్తున్న రైతు కార్డు ఆ రైతులకు పూర్తిస్థాయిలో ఎరువును సకాలంలో అందించగలదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లాలో 2.70 లక్షల మంది రైతులు జిల్లా వ్యాప్తంగా 52 లక్షల హెక్టార్లలో ప్రతి ఏడాదీ ఖరీఫ్ సాగు జరుగుతోంది. ఇందులో ఎక్కువ సాగు వరి పంటదే. వరి పంటకు సకాలంలో అందాల్సిన ఎరువును కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా అందించలేకపోయింది. కొంతమంది రైతులు ఇతర రాష్ట్రాల నుంచి ఎరువులు తెప్పించుకున్నారు. ఒక్కో యూరియా బస్తాపై అదనంగా రూ.300 వరకూ చెల్లించారు. భారీగా ఎరువులకు పెట్టుబడులయ్యాయి. జిల్లాలో 2.70 లక్షల మంది రైతులు సాగుదారులుగా ఉన్నారు. వారికి రైతు కార్డులు అందించే ప్రక్రియను కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. రైతు కార్డు ఉండాలంటే భూమి వివరాలు సక్రమంగా ఉండాలి. ఈ వివరాలు సక్రమంగా లేని రైతులకు కార్డులు అందవు. జిల్లాలో సగానికిపైగా రైతులకు సంబంధించిన భూముల వివరాలు సక్రమంగా లేవు. దీంతో ఆయా రైతులకు సరిపడ వివరాలతో కూడిన కార్డులు అందే అవకాశం తక్కువగా ఉంది. ఈనెల 15 నుంచే అన్ని రైతు సేవా కేంద్రాల్లో రైతుల వివరాలు నమోదు చేసి, కార్డులు అందించనున్నారు. ఈ కార్డులు ఉన్న రైతులకు మాత్రమే ఎరువులు ఇస్తారు. కౌలు రైతులకు ఈ కార్డులు ప్రస్తుతం ఇవ్వడం లేదు. అంటే కౌలు రైతుకు రానున్న ఖరీఫ్‌లో ఒక్క బస్తా ఎరువు కూడా లభించని దుస్థితి కనిపిస్తోంది. పరిమితంగానే.. రసాయన ఎరువుల కొరతను అధిగమించేందుకు వ్యవసాయశాఖ ఈ విధానం అవలంబిస్తున్నప్పటికీ రైతులకు సకాలంలో ఎరువులు అందడం ప్రశ్నార్థకంగా మారుతోంది. కొంతమంది రైతుల వివరాలు కార్డుల్లో నమోదు కాకపోయినా, ఆయా రైతు సేవా కేంద్రాలకు ఎరువు సక్రమంగా రాకపోయినా, వచ్చిన ఎరువు తక్కువైనా రైతులకు ఇబ్బందులు తప్పవు. వచ్చిన ఎరువునే మొత్తం రైతులు సర్దుకోవాలి. ఈ నిబంధనలతో కొంతమంది రైతులకు ఎటూ చాలని ఎరువుతో వ్యవసాయం కష్టతరంగా మారనుంది. ఎక్కడెక్కడ ఇస్తారు రైతు కార్డు ఆధారంగా ఎరువును రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్ కేంద్రాలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫెర్టిలైజర్స్ దుకాణాల్లో అందిస్తారు. ఎక్కడ రైతు ఎరువు పొందాలన్నా కార్డులు ఉండాలి. ఆ భూమికి సరిపడ ఎరువులో తొలుత 30 శాతం, తరువాత 30 శాతం, తరువాత 40 శాతం ఇలా ఇస్తారు. కేవలం పరిమితితో ఇచ్చే ఈ ఎరువు సకాలంలో అందకపోయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. కౌలు రైతుకు కష్టమే కౌలు రైతులకు ప్రస్తుతం రైతు కార్డులు ఇవ్వడం లేదు. కౌలుకు పంటపొలాలు తీసుకున్న రైతులకు ఎరువు కష్టంగా మారనుంది. అసలైన భూ యజమాని పేరున రైతు కార్డులు వస్తాయి. ఆ యజమానికి మాత్రమే ఎరువులు ఇస్తారు. ఈ రైతు కార్డు వచ్చిన తరువాత కౌలు రైతులకు పంట రుణాలు సైతం మాయం కానున్నాయి. అసలైన రైతులకు ఎరువు కార్డుల పంపిణీ ఈ కార్డు ఆధారంగానే ఎరువుల సరఫరా గతంలో మాదిరిగా అదనపు ఎరువులు కట్ నేటి నుంచే కార్డుల జారీ భూమి వివరాలు సక్రమంగా లేకుంటే ఇబ్బందేరైతు కార్డులో ఏముంటాయంటే.. రైతు పేరు రైతు ఐడీ, భూమి వివరాలు పంట వివరాలు అవసరమైన ఎరువులు -
సామాజిక రుగ్మతలపై పోలీస్ ‘నజర్’
● బాల్య వివాహాలు, అక్రమ రవాణా నిర్మూలనకు సమష్టి కృషి ● పోలీసులకు అవగాహన సదస్సులో ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డిపార్వతీపురం రూరల్: సమాజ పురోగతికి ఆటంకంగా మారిన బాల్య వివాహాలు, టీనేజ్ ప్రెగ్నెన్సీ, బాండెడ్ లేబర్ వంటి సామాజిక రుగ్మతలను సమూలంగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. అ మేరకు ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఆదేశాలతో గురువారం స్థానిక పోలీస్ మల్టీ ఫంక్షన్ హాల్లో పోలీసు అధికారులకు ప్రత్యేక అవగాహన వర్క్‌షాప్ నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ తోట కనకదుర్గ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక అరిష్టాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో బాల్య వివాహాలు, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి సమస్యలపై ప్రజల్లో చైతన్యం వెల్లివిరిసేలా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చైతన్యమే ఆయుధంగా, చట్టమే కవచంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కనకదుర్గ, డీసీపీఓ సత్యనారాయణ మాట్లాడుతూ..18 ఏళ్ల లోపు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల బాలికల విద్య, ఆరోగ్యం ఛిన్నాభిన్నమవుతాయని పేర్కొన్నారు. టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలు, వెట్టిచాకిరీ, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై పోలీసులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పోక్సో చట్టం–2012, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్–2006 పై అవగాహన కల్పిస్తూ, ఎక్కడైనా బాల్య వివాహాలు లేదా బాల కార్మిక వ్యవస్థ వంటి ఘటనలు గమనిస్తే తక్షణమే చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ ’1098’ కు సమాచారం అందించేలా ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. పోలీస్, మహిళా శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే బాలల హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఏఎస్పీ మనీషా రెడ్డి, పాలకొండ డీఎస్పీ రాంబాబు, జిల్లా బాలల సంరక్షణ విభాగం ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
దోమల నివారణ చర్యలకు కలెక్టర్ ఆదేశం
పార్వతీపురం: జిల్లాలో దోమల లార్వా నిర్మూలనను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించి, 15 రోజుల్లో దోమల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. మనమిత్ర, ఫార్మర్స్ యాప్‌ల వినియోగం, ఈఎఫ్ సర్వే, సచివాలయ సిబ్బంది హాజరు, లార్వా వేట తదితర అంశాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో గురువారం సమీక్షించారు. ఫాగింగ్ కంటే దోమల ఉత్పత్తి కేంద్రాల నిర్మూలనకే ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి నీటి నిల్వలు పరిశీలించి తొలగించాలని, పాత టైర్లు, కొబ్బరి బొండాల్లో నీరు నిల్వ కాకుండా చూడాలని సూచించారు. వరి పొలాల్లో కూడా దోమల పెరుగుదల నివారణకు రైతులకు అవగాహన కల్పించాలని, బంతిపూల మొక్కలు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫార్మర్స్ యాప్, మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. హెచ్‌సీ వైద్యఖర్చులకు సిబ్బంది చేయూత విజయనగరం క్రైమ్: ప్రార్థించే పెదవులు కన్నా... సాయం చేసే చేతులు మిన్న అన్న పెద్దల మాటను జిల్లా పోలీశాఖ సిబ్బంది గురువారం అక్షరాలా పాటించారు. గంట్యాడ పోలీస్ స్టేషన్లో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఆదిమడపల శ్రీనివాసరావు గతనెల 28న బొబ్బిలిలో జరిగే పండగ బందోబస్తుకు వెళ్తుండగా గజపతినగరం వద్ద కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం విశాఖపట్నం మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హెచ్సీని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఆరోగ్య భద్రత అధికారులతో ఎస్పీ మాట్లాడి రూ.3 లక్షలు మంజూరు చేయించారు. మెరుగైన చికిత్సకు అదనంగా డబ్బులు అవసరంకావడంతో ‘చేయూత‘ పథకం కింద సిబ్బంది అంతా కలిసి ఇచ్చిన రూ.6.75 లక్షలను శ్రీనివాసరావు భార్య వెంకటలక్ష్మి, కుమార్తె గౌతమిలకు ఎస్పీ దామోదర్ గురువారం తన కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో విజయనగరం ఇన్చార్జి డీఎస్పీ ఎస్.రాఘవులు, ఎస్బీ సీఐలు ఎ.వి.లీలారావు, విద్యాసాగర్, వన్‌టౌన్ సీఐ ఆర్వీఆర్కే చౌదరి, రూరల్ సీఐ బి.లక్ష్మణరావు, డీసీఆర్బీ సీఐ కె.కుమారస్వామి, రిజర్వు ఇన్స్పెక్టర్ ఎన్.గోపాలనాయుడు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. ఐటీఐ ఉత్తీర్ణులకు జర్మన్ భాషపై ఉచిత శిక్షణ విజయనగరం రూరల్: స్థానిక జేఎన్టీయూ జీవీలో ఇండో–యూరో సింక్రోనైజేషన్ ఆధ్వర్యంలో జర్మన్ భాష ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ ఉత్తీర్ణులు సద్వినియోగం చేసుకోవాలని వర్సిటీ వీసీ వి.వి.సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణకు సంబంధించిన బ్రోచర్‌ను గురువారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉచిత జర్మన్ భాషా శిక్షణలో ఏ–2 లెవెల్ ఉత్తీర్ణత పొందిన వారికి జర్మనీ దేశంలో ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఇండో–జర్మన్ సింక్రమైజేషన్ సంస్థ అవసరమైన సదుపాయాలు కల్పిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రప్రథమంగా ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులుకు శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థుల వయో పరిమితి 19 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. సుమారు 3 నెలలపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్లో గాని, బ్రోచర్లోని క్యూఆర్‌కోడ్ స్కాన్‌చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూ జీవీ ఇన్చార్జి రిజిస్ట్రార్ డి.రాజ్యలక్ష్మి, శిక్షణాధికారిణి వి.ఎస్.వకుళ, తదితరులు పాల్గొన్నారు. తైక్వాండో పోటీల రిఫరీగా బొబ్బిలి క్రీడాకారుడు బొబ్బిలి: తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు జాతీయస్థాయి తైక్వాండో పోటీలు జరగనున్నవి. దీనికి బొబ్బిలికి చెందిన క్రీడాకారుడు బంగారి కిశోర్‌కుమార్ రిఫరీగా ఎంపికై నట్టు కోచ్ బి.ప్రసాద్ గురువారం తెలిపారు. -
గురువుల భవితకు పరీక్ష!
రామభద్రపురం: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఉత్తీర్ణత అయ్యవార్లందరికీ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు ఆందోళన కలిగిస్తోంది. టీచర్లు ప్రస్తుత సర్వీసు కొనసాగించాలన్నా.. ఉద్యోగోన్నతి పొందాలన్నా టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. 20, 25 ఏళ్ల కిందట ఉపాధ్యాయులుగా ఎంపికై న వారంతా ఈ వయస్సులో టెట్ రాసి ఉత్తీర్ణత ఎలా సాధిస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాము పిల్లలకు చదువు చెప్పాలా? పరీక్షకు సిద్ధంకావాలా అనే సందిగ్దంలో పడ్డారు. గురువుల భవితకు సుప్రీం తీర్పు ‘పరీక్ష’గా మారింది. దీనికి తోడు ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్ల లోపు టెట్ రాసి ఉత్తీర్ణులవ్వాలని సూచించింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా, కోర్టులో అప్పీలు చేయకుండా మిన్నకుండడంపై ఉపాధ్యాయులు, సంఘ నాయుకులు మండిపడుతున్నారు. టెట్ నుంచి ఉపశమనం కల్పిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విస్మరించడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులను మినహాయించాలి.. టెట్ నోటిఫికేషన్లో ఇన్ సర్వీసు ఉపాధ్యాయులను మినహాయించేలా చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని ప్రభుత్వం తొందర పడడం సరికాదు. ఉపాధ్యాయులందరిలోనూ టెట్ పరీక్ష అలజడిరేపుతోంది. ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్–2009 ప్రకారం 2011కు ముందు టెట్ అమలులో లేదు. టెట్ అమలులోకి రాకముందు నియాకమైన ఉపాధ్యాయులకు ఆ పరీక్ష నుంచి మినహాయింపు వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి. – బొప్పే రవికుమార్, ఏపీటీఎఫ్(1938) రామభద్రపురం మండలశాఖ అధ్యక్షుడు ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి.. ఉపాధ్యాయులు తప్పనిపరిగా టెట్ పరీక్ష రాసి ఉత్తర్ణత సాధించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి. 20, 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన టీచర్లను ఇప్పుడు టెట్ పరీక్ష రాసి ఉత్తర్ణత సాధించాలనడం ఒత్తిడికి గురిచేస్తోంది. ఉద్యోగోన్నతులు కూడా టెట్ రాయాలనే నిబంధన సరికాదు. బీఈడీ, డీఈడీ పూర్తిచేసి, డీఎస్సీతో ఎంపికై న వారికి టెట్ ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన సవరించాలి. – ప్రసన్నకుమార్, యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు, రామభద్రపురం ఉపాధ్యాయ కోణంలో పరిశీలించాలి.. డీఎస్సీ అమలు నాటి నుంచి కాకుండా మధ్యలో టెట్ నిబంధన తెరపైకి తీసుకురావడం సరైనది కాదు. ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతారు. టెట్ ఉత్తీర్ణత తప్పనిపరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉపాధ్యాయ కోణంలో పరిశీలించాలి. టెట్ ప్రిపేరయ్యేందుకు సమయం ఉండదు. రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధన పెట్టడం సరికాదు. – జేసీ రాజు, ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడమిక్ కన్వీనర్, బొబ్బిలి 5,400 మందికి తప్పనిసరి..ఉమ్మడి విజయనగరం జిల్లాలో టీచర్లు సుమారు 9,000 మంది ఉండగా ఇందులో సుమారు 5,400 మంది వరకు టెట్ రాయాల్సి ఉంటుందని ఉపాధ్యాయ సంఘాల అంచనా. వీరిలో 2010 కంటే ముందు ఉపాధ్యాయ పోస్టులు సాధించిన వారిలో ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు మినహా ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్లలోపు టెట్ రాసి ఉత్తీర్ణులు కావాలి. అయితే, 2010 ఆగస్టు నాటికి సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ తప్పనిసరి విషయం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిబంధనల్లో ఎక్కడా లేదని ఉపాధ్యాయ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ సైతం వృత్తిలో ఉన్న టీచర్లు టెట్ అర్హత కలిగి ఉండాలనే ఉత్తర్వులు ఎక్కడా ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నారు. టెట్ పరీక్షకు సంబంధించి ఉపాధ్యాయులు వినతులివ్వగా టెట్‌పై ఉపశమనం కల్పిస్తామని హామీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి లోకేశ్ పట్టించుకోవడంలేదని ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగన్నతికి టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ టీచర్లకు టెట్ తప్పనిసరి అయోమయంలో అయ్యవార్లు..! టెట్ నుంచి ఉపశమనం కల్పిస్తామన్న హామీని విస్మరించిన విద్యాశాఖా మంత్రి లోకేశ్ తలలు పట్టుకుంటున్న ఉపాధ్యాయులు -
కల్తీ ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే చర్యలు
● జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి.టి.రామారావు గజపతినగరం: రైతులకు కల్తీ ఎరువులు, నాసిరకం విత్తనాలు విక్రయించినట్లు తమ దృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వి.టి.రామారావు డీలర్లను హెచ్చరించారు. గజపతినగరం రైతు సేవా కేంద్రంలో పురుగు మందులు, విత్తనాలు విక్రయించే డీలర్స్‌తో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విత్తనాలు రాగానే ముందుగా మొలకశాతం నిర్ధారించి రిజిస్ట్రర్‌లో నమోదుచేయాలని సూచించారు. 80 శాతం కంటే తక్కువ మొలకశాతం ఉన్న విత్తనాలను వెనుకకు పంపించాలన్నారు. యూరియా కార్డ్స్‌ను అర్హులైన ప్రతీ రైతుకు అందజేస్తామన్నారు. 2026 సీజన్లో ప్రభుత్వం యూరియా కార్డ్స్ ఉన్న వారికి మాత్రమే యూరియా, డీఏపీ అమ్మకాలు చేపట్టాలని ఆదేశించిందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు గాలి శ్రీనివాస్, గజపతినగరం డివిజన్ నాలుగు మండలాల వ్యవసాయ అధికారులు కిరణ్ కుమార్, గోకుల్ కృష్ణ, గోవిందమ్మ, చంద్రకళ, నాలుగు మండలాల వ్యవసాయ సహాయకులు, ఏఈఓలు పాల్గొన్నారు. -
సీతంలో రెగ్యులర్ డిప్లమో కోర్సులు
● అధునిక టెక్నాలజీ కోర్సులతో విద్యార్ధులకు కొత్త అవకాశాలు విజయనగరం గంటస్తంభం: సీతం కాలేజీలో ఐదు రెగ్యులర్ డిప్లమో కోర్సులను ప్రారంభిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ డా.మజ్జి శశిభూషణ రావు తెలపారు. డిప్లమో ఇన్ కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు తక్కువ వయసులోనే నైపుణ్యాలు సంపాదించి మంచి ఉద్యోగాలు పొందేందుకు పాలిటెక్నిక్ విద్య ప్రయోగశాలలు, గ్రంఽథాలయం వంటి మౌలిక సదుపాయాలతో కళాశాల సిద్ధంగా ఉందన్నారు. డాక్టర్ జి.టి.నాయుడు ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే కళాశాలలో ఏర్పాటు చేసిన క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా క్వాంటం కంప్యూటింగ్, ఏఐ, మిషిన్లెర్నింగ్ రంగాల్లో పరిశోధనలు కొనసాగుతున్నాయని డీన్ఆర్డీ డా.వీజీ.ప్రసన్న తెలిపారు. ఇప్పటివరకు 17 పరిశోధన ప్రాజెక్టులకు దరఖాస్తు చేయగా, వాటిలో ఎక్కువ క్వాంటం టెక్నాలజీకి సంబంధించినవని చెప్పారు. స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్, వాతావరణ సూచనలపై ఆధునిక పరిశోధనలు కొనసాగుతున్నాయని వెల్ల డించారు. -
ప్రమాదరహితంగా భోగాపురం విమానాశ్రయం
● చుట్టుపక్కల గ్రామాల్లో అవగాహన కల్పించాలి ● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డిపూసపాటిరేగ: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తి ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పక్షులు, వన్యప్రాణుల ద్వారా ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా అన్నిరకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ అధ్యక్షతన రెండవ ఏరోడ్రోమ్ ఎన్విరానన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అంతర్జాతీయ విమానయాన భద్రతా ప్రమాణాల ప్రకారం విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఎటువంటి విఘాతం కలగకుండా ఉండడమే ఈ కమిటీ ప్రాథమిక లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రకృతికి అనుకూలమైన, సురక్షితమైన, సుస్థిరమైన విమానాశ్రయ వాతావరణాన్ని కల్పించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. విమానాశ్రయం చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో పక్షులు, కుక్కలు లేదా ఇతర వన్యప్రాణులు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. పక్షులు విమానం ఇంజినన్లోకి వెళ్లడం వల్ల జరిగే భారీ ప్రమాదాలను నివారించేందుకు ఈ ప్రాంతాన్ని ‘బర్డ్ స్ట్రైక్ ఫ్రీ జోన్’గా మార్చాలని ఆదేశించారు. విమానాశ్రయ పరిసరాల్లో మాంసం దుకాణాలు, బహిరంగ వ్యర్థాలు ఉండడం వల్ల పక్షులు ఆహారం కోసం వస్తుంటాయని, అందుకే చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ పేర్కొన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, సమగ్ర చెత్త నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితి సంతప్తికరంగా ఉందని, భవిష్యత్తులో పక్షులు, వన్యప్రాణుల వల్ల ముప్పు పెరగకుండా చూడాలని కోరారు. దీనికోసం విమానాశ్రయ నిర్వహణ సంస్థ, స్థానిక పరిపాలన యంత్రాంగం మధ్య నిరంతర సమన్వయం ఉండాలని, ఈ మేరకు విమానాశ్రయ సమీపంలోని ఈఓపీఆర్డీలు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. విస్తృతంగా అవగాహన కార్యక్రమాలుఅన్ని రకాల భద్రతా చర్యలు పాటించాలంటే ప్రజల సంపూర్ణ సహకారం అవసరమని కలెక్టర్ స్పష్టం చేశారు. అందువల్ల విమానాశ్రయ సమీపంలోని సుమారు 21 గ్రామాల్లో నివసించే ప్రజలకు పారిశుధ్యం, నిబంధనలు, విమాన ప్రయాణ భద్రత పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. వెంటనే అవగాహనా కార్యక్రమాలను మొదలుపెట్టాలని ఆదేశించారు. అనంతరం విమానాశ్రయ నిర్మాణ ప్రగతిని పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో భోగాపురం విమానాశ్రయం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ లక్కీ వర్మ భాస్కర్, సీఈవో కన్వర్ బీర్ సింగ్ కలరా, ప్రాజెక్ట్ హెడ్ బీహెచ్ఏ రామరాజు, వన్యప్రాణి రక్షణ నిపుణులు బిభూ దత్తా పాడి, ఎయిర్ సైడ్ ఆపరేషన్స్ హెడ్ విజయ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ ఎస్.జీవన రాణి, ఆర్డీవో సుధాసాగర్, పీసీబీ ఈఈ బీబీ సరిత, డీపీవో మల్లికార్జునరావు, మత్స్యశాఖ డీడీ విజయ్‌కృష్ణ, డీఎఫ్ఓ ఎం.సోమసుందర్, ఎఫ్ఆర్ఓ బి.రాంనరేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అందరికీ ఇస్తాం
రైతులు అందరికీ రైతు కార్డులు ఇస్తాం. జిల్లా వ్యాప్తంగా ఈనెల 15న ఈ కార్యక్రమం ప్రారంభం అవుతోంది. రైతులు ఆర్ఎస్కేలకు వెళ్లి వి వరాలు నమోదుచేయాలి. రైతు కార్డు ఉంటేనే ఎరువులు అందుతాయి. అవి కూడా అందులో నమోదు చేసే పంటల ఆధారంగా ఇస్తాం. కె.చంద్రరావు, వ్యవసాయశాఖ ఏడీఏ, రాజాం రైతులందరికీ ఎరువులు అందిస్తాం రానున్న ఖరీఫ్ సీజన్లో పంటలు వేసిన రైతులందరికీ ఎరువులు అందిస్తాం. ఎరువులు అనధికారుల చేతిలోకి వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎరువులు కార్డులు ఉన్న వారిందరికీ అవసరం అయిన ఎరువులు అందిస్తాం. ఎ.తిరుపతిరావు, ఏఓ, గుర్ల -
వైఎస్ జగన్‌ను కలిసిన జెడ్పీచైర్మన్
విజయనగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. లండన్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని ఆయన నివాసంలో మజ్జి శ్రీనివాసరావు కలిసి సాదర స్వాగతం పలికారు. ఈ భేటీలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. -
వడదెబ్బతో ఉపాధి వేతనదారు మృతి
పాలకొండ రూరల్: పొట్టకూటి కోసం ఉపాధిహామీ పనులకు వెళ్తున్న వేతనదారు వడదెబ్బకారణంగా మృత్యువాత పడ్డాడు. పాలకొండ మండలంలోని భాసూరు గ్రామానికి చెందిన వేతనదారు కోమటి పుష్పనాథం(62)గురువారం గ్రామ సమీపంలో రావాడ గెడ్డ వద్ద పనులు చేస్తున్నాడు. ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. సహచర వేతనదారులు సపర్యలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బ తగిలి పుష్పనాథంమరణించాడని వేతనదారులు వాపోయారు. మండల వ్యాప్తంగా ప్రస్తుతం ఉపాధిపనుల వద్ద వేతనదారులు విశ్రాంతి తీసుకునేందుకు ఎటువంటి టెంట్లు లేకపోవడం ఈ పరిస్థితికి కారణమని సహ వేతనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతునికి భార్య కళావతితోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు కలెక్టర్, శాఖాపరమైన ఉన్నతాధికారులకు పరిస్థితిని వివరించి మృతుని కుటుంబాన్ని ఆదుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. అయ్యకోనేరులో మృతదేహం గుర్తింపు.. విజయనగరం క్రైమ్: విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి అయ్యకోనేరులో గురువారం ఒక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గురాల గురవాజీ(40) అనే వ్యక్తి తన భార్య పోలమ్మతో పూల్‌బాగ్ కాలనీలో నివాసముంటున్నాడు. కుటుంబ పోషణ కోసంచేపల వేట వృత్తి చేస్తున్న గురవాజీ తన స్నేహితులు సత్తయ్య, వాసుపల్లి పెద్దయ్య, ఎర్రపల్లి శివలతో కలిసి అయ్యకోనేరుకు వెళ్లాడు. ఆ క్రమంలో ఫిట్స్ వచ్చి పడిపోయినట్లు గురవాజీ భార్య పోలమ్మకు ఎర్రపల్లిశివ ఫోన్ చేసి చెప్పడంతో ఆమె ఘటనా స్థలికి వెళ్లి చూసేసరికి అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు. -
కనకమహాలక్ష్మి హుండీల ఆదాయం లెక్కింపు
చీపురుపల్లి: స్థానిక శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో గురువారం హుండీల ఆదాయం లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. దేవదాయ ధర్మాదాయశాఖ అధికారి జి.శ్యామ్‌ప్రసాద్, ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎస్.నానాజీబాబు సమక్షంలో ఉదయం 10 గంటలకు ఆలయ హుండీలను తెరిచి లెక్కించారు. ఫిబ్రవరి 25, 2026 నుంచి మే 14, 2026 వరకు హుండీల ద్వారా మొత్తం రూ.3,70,000 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గవిడి నాగరాజు, ప్రతినిధులు పొట్నూరు త్రినాథరావు, లెంక చిన్నారావు, అడ్డూరి భారతి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
సచివాలయాన్ని సందర్శించిన కలెక్టర్
● రెవెన్యూ, పరిపాలనాంశాలపై ఆరా డెంకాడ: మండలంలోని డెంకాడ స్వర్ణ గ్రామాన్ని (సచివాలయం) కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి గురువారం సందర్శించారు. ముందుగా రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, పరిపాలన అంశాలపై ఆరా తీశారు. ప్రధానంగా ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలైన జనగణన ప్రక్రియ, భూముల రీ–సర్వే పురోగతి, మ్యుటేషన్ (భూ మార్పిడి) దరఖాస్తుల పరిష్కారం వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణలో ఎటువంటి జాప్యం ఉండకూడదని, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామ సచివాలయం, పరిసర ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్.. కార్యాలయ ప్రాంగణాన్ని, గ్రామ వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. కలెక్టర్ వెంట పలువురు రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
సెల్‌ఫోన్ ఇవ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య
తెర్లాం: సెల్‌ఫోన్ ఇవ్వలేదని మనస్థాపానికి గురైన ఇంటర్ విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెర్లాం మండలం గోపాలవలస పంచాయతీ పరిధిలోని జగన్నాథవలస గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. మృతురాలి తల్లి, తెర్లాం ఎస్ఐ సాగర్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. జగన్నాథవలస గ్రామానికి చెందిన గొందాల అనుష్క(16) ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఉత్తీర్ణత సాధించింది. తక్కువ మార్కులు రావడంతో బెటర్‌మెంట్‌కు ప్రిపరేషన్ అవుతోంది. ఉదయం చదువుకోడానికి సెల్‌ఫోన్ ఇవ్వాలని తల్లిదండ్రులు రాంకుమార్, హేమను అనుష్క అడిగింది. పొలం పనికి వెళ్తున్నామని, సెల్‌ఫోన్ తమవెంట తీసుకెళ్తున్నామని, పుస్తకాలు తీసి చదవమని చెప్పి వెళ్లిపోయారు. తన ప్రిపరేషన్ కోసం తల్లిదండ్రులను సెల్‌ఫోన్ అడిగినా ఇవ్వలేదన్న కారణంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పొలం పని నుంచి ఇంటికి వచ్చిన తల్లి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉన్న అనుష్కను చూసి కేకలు వేసింది. ఇరుగుపొరుగు వారు వచ్చి ఆమెను కిందకు దించి వెంటనే రాజాం సీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే అనుష్క మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తెర్లాం ఎస్ఐ సాగర్‌బాబు కేసు నమోదు చేశారు. -
జీవిత నైపుణ్యాలతో విద్యార్థులను తీర్చిదిద్దాలి
పార్వతీపురం: విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు జీవితానికి ఉపయోగపడే నైపుణ్యాలను కూడా నేర్పించాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి మండల విద్యాశాఖాధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో ఆయన గురువారం సమీక్షించారు. పాఠశాలలను స్నేహపూర్వక వాతావరణంగా తీర్చిదిద్దుతూ, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈత, సైకిల్ తొక్కడం, వంట చేయడం వంటి ప్రాథమిక జీవన నైపుణ్యాలతోపాటు స్కిిప్పింగ్, సూర్య నమస్కారాలు వంటి శారీరక వ్యాయామాలను ప్రోత్సహించాలని తెలిపారు. ముస్తాబు కార్యక్రమంలో పరిశుభ్రత, క్రమ శిక్షణ, ఆరోగ్య అలవాట్లపై విద్యార్థుల్లో అవగాహన పెంచాలని సూచించారు. పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణపై చిన్న వయస్సులోనే శాసీ్త్రయ అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రానున్న విద్యాసంవత్సరం నుంచి పైలెట్ ప్రాజెక్టు రూపంలో కార్యక్రమాలను అమలు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డీఈఓ పి.బ్రహ్మాజీరావు, ఎంఈఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో అమలవుతున్న ముస్తాబు కార్యక్రమానికి కలెక్టర్ మెంటార్‌గా ఎంపిక కావడంపై విద్యాశాఖ అధికారులు కలెక్టర్‌ను దుశ్శాలువతో సత్కరించారు. -
రూ.100 దాటిన అల్లం..వెల్లుల్లి
పాలకొండ రూరల్: వంటల్లో కీలకమైన అల్లం, వెల్లుల్లి ధరలు వినియోగదారునికి చుక్కలు చూపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో కాయగూరల ధరలకు రెక్కలు వస్తున్నాయి. వారం క్రితం రూ.60 పలికిన కిలో అల్లం, వెల్లుల్లి ధర ప్రస్తుతం రెట్టింపు ధర పలుకుతున్నాయి. అల్లం కిలో రూ.120పైబడి ఉండగా వెల్లుల్లి కిలో రూ.125కి చేరడంతో పాటు బీన్స్ కూడా రూ.వందకు చేరాయి. ప్రస్తుతం శుభకార్యాల సీజన్ కావడంతో పాటు దిగుబడి, రవాణా లోపంతో డిమాండ్‌కు తగినట్లు సరుకులు ఉండడం లేదని వర్తకులు చెబుతున్నారు. దీంతో వారం వ్యవధిలో ధర పెరిగినట్లు తెలుస్తోంది. గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీ ప్రాంతంలో ఈ సీజన్లో లభ్యమయ్యే ఫలసాయాల్లో పనస పళ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. మంచి రుచితో పాటు పోషక విలువలున్న ఈ పళ్లను తినేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. మండల పరిధిలోని ఏ గ్రామంలో చూసినా పనస చెట్లు కనిసిస్తాయి. ప్రస్తుతం ఏ చెట్టు చూసినా పనస కాయల దిగుబడి బాగా కనిపిస్తోంది. మరి కొద్ది రోజుల్లో పనస కాయలు ముదిరి పళ్ల దశకు చేరుకోనుండగా వాటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. -
ప్లేటు భలే తిప్పారు..!
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఆ పార్టీ తరఫున ఎన్నికై న పాలకవర్గాలు అధికారంలో ఉన్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను ఎగరేసుకు పోవడంలో పెట్టిన శ్రద్ధ మున్సిపాలిటీల్లో అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించలేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. ఎమ్మెల్యేల ఒత్తిళ్లకు మున్సిపల్ అధికారులూ తలొగ్గాల్సి వస్తోంది. ఫలితంగా రాజకీయ కక్షసాధింపులతో వైఎస్సార్సీపీ పాలక వర్గాలున్నచోట..అభివృద్ధి పనులకు బ్రేకులు పడ్డాయి. ప్రొటోకాల్ పక్కకు వెళ్లిపోయింది. పురపాలక సంఘ చైర్పర్సన్లు డమ్మీలుగా మిగిలిపోయారు. గతంలో పార్వతీపురం, పాలకొండ వంటి చోట్ల పాత పాలకవర్గాల తొలగింపునకు పెద్ద డ్రామానే నడిచింది. సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం పురపాలక సంఘం ప్రత్యేకాధికారి, కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే విజయ్‌చంద్రతో కలిసి మంగళవారం మున్సిపాలిటీలో ‘ముఖాముఖి’ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించడం దీని ప్రధాన ఉద్దేశం. అధిక భాగం సమస్యలను అప్పట్లో వైఎస్సార్సీపీలో ఉండి..ప్లేటు తిప్పేసిన ‘ఫిరాయింపు’ కౌన్సిలర్లే తీసుకురావడం గమనార్హం. పారిశుద్ధ్యం, తాగునీటి సమస్య, రహదారులు, కాలువల నిర్మాణం వంటి అంశాలను ‘దగ్గరుండి’ నిలదీయించారు. దీని వెనుక మరో ‘బలమైన’ కారణం’ ఉందన్న అనుమానాలను కలిగించారు. గత ప్రభుత్వం హయాంలో ఏమీ చేయలేదని చూపించడం ఒకటైతే.. ప్రత్యేకాధికారిగా కలెక్టర్ వచ్చిన రెండు నెలల్లో ఏమీ సాధించలేకపోయారని విమర్శించడం మరో ఎత్తుగడలా కనిపించింది. ఈ సమస్యలపై ఏ రోజూ వీరు ప్రత్యేకాధికారిని కలిసి విన్నవించిన దాఖలాలు లేవు. కమిషనర్ దృష్టిలోనూ పెట్టిన పరిస్థితి లేదు. ‘ముఖాముఖి’ సమయానికి అప్పటికప్పుడు ప్రణాళిక సిద్ధం చేసుకుని వచ్చారన్న భావన కలిగించారు. ‘కలెక్టర్ చెబితే గానీ ఏ పనీ మున్సిపల్ అధికారులు చేయరంట?’ అని బంతిని కలెక్టర్ ప్రభాకరరెడ్డి కోర్టులోకి నెట్టేశారు. తెర వెనుక నడిపిస్తున్న నాయకుడి ‘అంతిమ లక్ష్యం’ ఇదే కాబోలు! అందుకే కలెక్టర్ ప్రభాకరరెడ్డి కూడా ఒకింత అసహనానికి లోనయ్యారు. తమాషాలు చేస్తున్నారా? అంటూ కొంతమంది సిబ్బందిని ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో పార్వతీపురం మున్సిపల్ పాలకవర్గ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్ర మోకాలడ్డారన్నది అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఏడాది కాలంలో పార్వతీపురం పురపాలక సంఘం పాలక వర్గ సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఎన్నిసార్లు సమావేశాలు పెట్టాలని అప్పటి కమిషనర్‌ను నాటి చైర్పర్సన్ బోను గౌరీశ్వరి అడిగినా.. ఆయన ‘విధేయత’ తప్పలేదు. సమావేశాలు నిర్వహించలేదు. నలువైపుల నుంచీ విమర్శలు ఎక్కువైన నేపథ్యంలో ఎజెండాను మార్చి, రాత్రి 11 గంటల సమయంలో చిరుద్యోగులతో చైర్పర్సన్ సంతకం కోసం పంపించారు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో.. మరుసటి రోజు సమావేశాన్ని పెట్టి, రాద్ధాంతం చేసి అర్ధాంతరంగా ముగించేశారు. తర్వాత జరిగిన సమావేశాల్లోనూ ముందస్తుగా భారీ పోలీసు బందోబస్తును ప్రణాళిక ప్రకారం తీసుకొచ్చి, రచ్చ చేయించారు. ఇలా అభివృద్ధి కోసం చర్చించాల్సిన సమావేశాలను వివాదాలతో రణరంగంగా మార్చారు. చైర్‌పర్సన్‌కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్‌ను సైతం తుంగలో తొక్కేశారు. ఇందుకు మున్సిపల్ అధికారులు సైతం సహకరించడం గమనార్హం. గత ప్రభుత్వ హయాంలో ఏమీ చేయలేదన్న ప్రచారాన్ని తెరపైకి తెచ్చేందుకు అప్పటికే మంజూరైన పనులను సైతం మధ్యలోనే నిలిపివేయించారు. 7,8,9 వార్డుల్లో కాలువలు, సీసీ రహదారుల పనులకు చైర్‌పర్సన్‌తో సంబంధం లేకుండా కొబ్బరికాయ కొట్టేశారు. ఇప్పటికీ వాటిని పూర్తి చేయలేకపోయారు. ఎనిమిదో వార్డులో టెండర్ పూర్తయిన రెండు పనులను రద్దు చేసేశారు. తాగునీటి సమస్య పరిష్కారానికి గత పాలక వర్గ హయాంలో రూ.63 కోట్ల వ్యయంతో పనులు మంజూరు చేయించారు. పనులు ప్రారంభించి, తోటపల్లి వద్ద పైప్లైన్లు కూడా వేసి, మధ్యలోనే కాంట్రాక్టర్ వదిలేశారు. ఆ పనులకు సంబంధించిన శిలాఫలకం కూడా మున్సిపల్ కార్యాలయం వద్ద ఇటీవల తొలగించడం గమనార్హం. ఫలితంగానే తీవ్ర నీటి ఎద్దడిని పుర ప్రజలు ఎదుర్కొంటున్నారు. సాధారణ నిధులతో కొన్ని పనులు చేయాల్సి ఉన్నా.. కాంట్రాక్టర్లను రానీయకుండా చేశారు. డ్రైన్లు, రోడ్ల కోసం రూ.3 కోట్ల వరకూ మంజూరు చేయించినా..ఫలితం లేకపోయింది. వీధి దీపాల నిర్వహణ, స్తంభాలు వంటి పనుల కోసం ఏడాది కాలానికి రూ.20 లక్షల ముందస్తు నిధులకు గత పాలకవర్గం అనుమతిచ్చినా..వాటితో అరొకర పనులే చేయిస్తున్నారు. కాలువల్లో పూడికలు తీయడానికి పురపాలక సంఘం ఏటా రూ.30 లక్షలు ఖర్చు చేస్తోంది. అరకొర పనులు చేసి, చేతులు దులుపుకున్నారు. ఇలా అడుగడుగునా అభివృద్ధికి అవరోధంగా మారి.. తప్పును గత పాలకవర్గం, నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నెట్టేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకాధికారిగా ఉన్న కలెక్టర్ మీద ఉన్న ‘వ్యక్తిగత’ కక్షను ఇటువైపు మళ్లిస్తున్నారు. వాస్తవానికి ప్రత్యేకాధికారిగా తన మార్కు ను చూపించాలని పురపాలక సంఘంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. పారిశుద్ధ్యం మెరుగుకు కృషి చేస్తున్నారు. స్వచ్ఛ పార్వతీపురం దిశగా అడుగులు వేయిస్తున్నారు. అందుకూ అధికార పార్టీకి చెందిన వారే అడ్డుపడుతుండడం బహుశా పార్వతీపురం నియోజకవర్గానికే చెల్లుతుంది. స్వచ్ఛ పార్వతీపురం కోసం సూచనలు చేస్తున్న ప్రత్యేకాధికారి, కలెక్టర్ ప్రభాకరరెడ్డి(ఫైల్) -
ఆర్టీసీ బస్సు కిందపడి వ్యక్తి దుర్మరణం
పీఎం పాలెం (విశాఖ): అజాగ్రత్తగా ఆర్టీసీ బస్సు దిగిన వ్యకి ఆదే బస్సు చక్రాల కిందపడి మరణించాడు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో మధురవాడ బస్టాప్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం చౌదంతివలస గ్రామానికి చెందిన చీమల సింహాచలం(51) నగరానికి వలస వచ్చి కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య గంగమ్మతో స్థానికంగా ఓ భవనంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ నెల 11న పండుగ నిమిత్తం భార్యాభర్తలు స్వగ్రామం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మంగళవారం రాత్రి విజయనగరంలో మెట్రో బస్సు ఎక్కారు. మధురవాడ బస్టాప్‌లో సింహాచలం అజాగ్రత్తగా బస్సు దిగుతూ కింద పడిపోయాడు. అది గమనించని ఆర్టీసీ బస్సు డ్రైవర్ ముందుకు వెళ్లడంతో వెనుక చక్రాల కిందపడి సింహాచలం అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంనిమిత్తం కేజీహెచ్‌కు తరలించి మృతుడి భార్య గంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్్ుట్ల సీఐ బాలకృష్ణ తెలిపారు. పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యనెల్లిమర్ల రూరల్: మండలంలోని ఒమ్మి గ్రామంలో పురుగు మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఎస్సై గణేష్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అంబళ్ల మణికంఠ(36) ఈ నెల 11న అర్ధరాత్రి పురుగు మందు తాగేశాడు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గణేష్ తెలిపారు. -
‘మద్దతు’ సరే.. రైతుకు చేరే దారేది?
● వరికి క్వింటాకు రూ.72 పెంపు ● మద్దతు ధరలను ప్రకటించిన కేంద్రం సాక్షి, పార్వతీపురం మన్యం: ప్రధాన పంట వరిని పండించే రైతులకు కేంద్రం ఊరట కలిగించింది. 2026–27 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరకు బుధవారం ఆమోదం తెలిపింది. మొత్తంగా 14 పంటలకు ప్రకటించగా.. అత్యధికంగా పండించే సాధారణ రకం వరి మద్దతు ధరను క్వింటాకు రూ.72 పెంచి, రూ. 2,441 కు చేర్చారు. గ్రేడ్–ఏ రకం వరి ధరను రూ.2,461గా నిర్ణయించారు. క్వింటాలు జొన్నలు(హైబ్రిడ్) కనీస మద్దతు ధర రూ. 4,023గా చేశారు. పేరుకే మద్దతు.. జిల్లాలో వరి ప్రధాన పంటగా ఉంది. దాదాపు రెండు లక్షల మందికిపైగా రైతులు సాగే జీవనాధారంగా బతుకుతున్నారు. వరి తర్వాత స్థానంలో మొక్కజొన్న, పత్తి వంటి పంటలను సాగు చేస్తున్నారు. ఖరీఫ్ పంటపైనే రైతులు ఆధారపడతారు. జిల్లాలో ఖరీఫ్ 2025–26 సీజన్ కు సంబంధించి 281 రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం 2.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. మొత్తం రూ.617 కోట్లను 42 వేల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఏటా కేంద్రం మద్దతు ధర ప్రకటిస్తున్నా.. పెరుగుతున్న సాగు ఖర్చులకు ఆ మొత్తం ఎటూ చాలడం లేదని రైతు సంఘం నాయకులు చెబుతున్నారు. ఇస్తున్న ‘మద్దతు’ కూడా దళారులకే దక్కుతోంది. ధాన్యం చేతికి అంది వచ్చినా.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరవని పరిస్థితి ఉంది. విధి లేక, పంటను దాచుకునే వెసులుబాటు దొరక్క.. మధ్యవర్తులు, వ్యాపారులనే రైతులు ఆశ్రయిస్తున్నారు. బస్తా రూ.1,400 నుంచి రూ.1,500 మధ్యలోనే వారు కొనుగోలు చేస్తున్నా రు. ఈలోగా ప్రకృతి అనుకూలించకపోతే అన్నదాత లు మరింతగా నష్టపోతున్నారు. ఇక మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఎక్కడా తెరవడం లేదు. పత్తికి కూడా మద్దతు లభించడం లేదు. -
పైపులతో పెద్దగెడ్డ సాగునీరు
● పైలట్ ప్రాజెక్టు కింద పెద్ద గెడ్డ జలాశయంను ఎం–కార్డ్ పథకంలో గుర్తింపు ● 7,500 ఎకరాలకు అండర్ గ్రౌండ్ పైపులతో సాగునీరు రామభద్రపురం: పెద్దగెడ్డ జలాశయాన్ని కేంద్ర ప్రభుత్వం మోడరైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ (ఎం–కాడ్) పథకంలో పైలెట్ ప్రాజెక్టుగా గుర్తించింది. ఈ జలాశయం నుంచి హైప్రెజర్ డ్రిప్ విధానంలో అండర్ గ్రౌండ్ పైపులైన్లతో ఆయకట్టుకు సాగునీరు అందజేయనున్నారు. ఈ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం చొప్పున రూ.73 కోట్లు కేటాయించాయి. పెద్దగెడ్డ జలాశయం ప్రధాన కుడి కాలువ పరిధిలోని పాచిపెంట, రామభద్రపురం, సాలూరు మండలాలకు చెందిన సుమారు 7,500 ఎకరాలకు పైపులతో సాగునీరందించే పనులు జరగాల్సి ఉంది. పనులు ఇలా... పెద్దగెడ్డ జలాశయంలో బారీవెల్ తీస్తారు. అందులో పెద్దవి 4 హైప్రెజర్ మోటార్లు ఏర్పాటు చేస్తారు. వీటిలో మూడు నిర్వహణలో ఉంచుతూ ఒకటి రిజర్వ్‌లో ఉంచుతారు. ప్రధాన పైపు నుంచి బూసాయవలస దండాసివాని చెరువు, ఎరకన్నదొర చెరువు వరకు సాగునీరు మళ్లిస్తారు. అక్కడి నుంచి బ్రాంచిల ద్వారా ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేస్తారు. జలాశయం వద్ద కంట్రోల్ రూం ఉంటుంది. అక్కడ పంపుచేసే హెడ్ ఉంటుంది. ఆ హెడ్ ద్వారా ఏ ఏరియాకు ఎప్పుడు నీరు విడుదల చేయాలో ఆన్లైన్లో నమోదు చేస్తారు. రైతులు నచ్చినట్లు వాడుకుని సాగునీటి వృథా చేయకుండా నీరు సరఫరా చేసే వీలుంటుంది. ఇప్పటి వరకు ఒక ఖరీఫ్ సీజన్లో మాత్రమే కొద్దోగొప్పో నీరు విడుదల చేసేవారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యాక ఖరీఫ్, రబీ సీజన్లలో సాగునీరు అందించనున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు దగ్గర సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి విద్యుత్ అందించనున్నారు. పెద్దగెడ్డ జలాశయం కుడి కాలువ పరిధిలోని చెరువులను పైపులతోనే సాగునీరు నింపుతారు. పైలెట్ ప్రాజెక్టు పనులు పూర్తయితే రైతులకు మేలు జరుగుతుందని ఎం–కాడ్ డీఈఈ డి.సురేష్ తెలిపారు. అయితే, ఇంకా పనుల ప్రక్రియ టెండర్ల దశలోనే ఉందని, టెండర్లు పిలిచినా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదన్నారు. పనులపై ఈ నెల 18వ తేదీన రైతులతో సమావేవమై అవగాహన కల్పిస్తామని చెప్పారు. -
బొడ్డమానుగూడ... సమస్యల జాడ
● రోడ్డు లేదు.. తాగునీటికి కటకట ● గిరిజనుల దుర్భర జీవనం ● అత్యవసర వేళ తప్పని డోలీమోతలు పార్వతీపురం: కురుపాం మండలంలోని తిత్తిరి పంచాయతీ పరిధిలోని బొడ్డమాను గూడ గ్రామంలో కనీస వసతులు కరువయ్యాయి. రోడ్డు, తాగునీరు సదుపాయం లేక గిరిజనులు దుర్భర జీవనాన్ని సాగిస్తున్నారు. గ్రామంలో సుమారు 60 మంది గిరిజనులు నివసిస్తున్నారు. నీలకంఠాపురం నుంచి జరడ గ్రామం మీదుగా సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి వెళ్లాలంటే కాలినడకే ఆధారం. మట్టి దారులు, కొండ చరియలు దాటి గ్రామానికి చేరుకోవాలి. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణం. అత్యవసర సమయాల్లో ఆస్పత్రులకు డోలీలోనే రోగులను తరలించాల్సిన పరిస్థితి. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామస్తులు సమీపంలో కొండపక్కన ఏర్పాటు చేసుకున్న గుమ్మి(గుంట) నుంచి వచ్చే నీటిని తాగునీటిగా, వాడుక నీటిగా వినియోగిస్తున్నా రు. ఆ నీరు కలుషితమైనది కావడంతో తరచూ రోగాలబారిన పడుతున్నారు. జిల్లా అధికారులు స్పందించి బొడ్డమానుగూడ గ్రామానికి రోడ్డు నిర్మించి తాగునీటి సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. -
అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న స్టార్టప్
విజయనగరం అర్బన్: చిన్న ఆలోచనతో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు అంతరిక్ష సాంకేతిక రంగంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దిశగా దూసుకెళ్తోంది. విజయనగరం పట్టణానికి చెందిన యువ ఇంజినీర్, స్టార్టప్ వ్యవస్థాపకుడు దేవగుప్తపు ప్రకాశ్ నవదీప్ తన కలను సాకారం చేస్తూ స్థాపించిన రౌద్రనెక్స్ స్పేస్ టెక్నాలజీస్ ప్రస్తుతం స్పేస్ ప్రొపల్షన్ టెక్నాలజీలో కీలక ముందడుగు వేస్తోంది. సమీప అంతరిక్ష కార్యకలాపాల నుంచి దీప్ స్పేస్ మిషన్స్ వరకు ఉపయోగపడే అధునాతన ప్రొపల్షన్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ స్టార్టప్ ప్రయాణం ప్రారంభమైంది. పరిమిత వనరులు, సాంకేతిక సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ యువ బృందం వెనుకడుగు వేయలేదు. ప్రస్తుతం సంస్థ విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ (ఏపీఐఎస్)లో ఇన్క్యుబేట్ అవుతోంది. రాష్ట్రం నుంచి అంతరిక్ష సాంకేతికతను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఈ సంస్థ పూర్తి స్వదేశీ టెక్నాలజీపై దృష్టి పెట్టడం విశేషం. ఇటీవల రెడ్ బెలూన్ ఏరోస్పేస్తో కలిసి నిర్వహించిన టెథర్డ్ లాంచ్ పరీక్షలో రౌద్రనెక్స్ అభివృద్ధి చేసిన ప్రొపల్షన్ పేలోడ్ విజయవంతంగా ఫ్లైట్ రెడీనెస్‌ను పూర్తి చేసింది. పేలోడ్‌లోని అన్ని సబ్‌సిస్టమ్స్ సమర్థవంతంగా పనిచేయడం సంస్థకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఈ నెలలో జరగనున్న భారత దేశపు తొలి సూపర్ ప్రెజర్ బెలూప్ లాంచ్‌లో భాగంగా రౌద్రనెక్స్ తన పేలోడ్‌ను స్ట్రోటోస్పియర్లోకి పంపించనుంది. ఇందులో ప్రపంచంలోనే తొలి ‘ఎయిర్ బ్రీతింగ్ కోల్డ్ స్లాస్మా ప్రొపల్షన్ సిస్టమ్’ ప్రయోగాత్మకంగా పరీక్షించనుండడం విశేషం. సంస్థ సహ వవ్యవస్థాపకుడు, సీఈఓ ప్రకాష్ నవదీప్ మాట్లాడుతూ ‘భారత దేశం నుంచి ప్రపంచ స్థాయి స్పేస్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలన్నదే మాలక్ష్యమన్నారు. ఈ మిషన్ ద్వారా వచ్చే డేటా భవిష్యత్ ఉపగ్రహ వ్యవస్థలు, ఆల్ట్రాలో ఎర్త్ ఆర్పిట్, దీప్ స్పేస్ మిషన్స్‌కు ఉపయోగపడే తదుపరి తరం ప్రొపల్షన్ టెక్నాలజీలకు దోహదపడుతుందని చెప్పారు. ఏరో స్పేస్ ఇంజినీరింగ్ చదివిన నవదీప్ తండ్రి డీవీ రవిశంకర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో సీఎస్‌డీటీగా పనిచేస్తున్నారు. తల్లి శారదా స్రవంతి గృహిణి. సాధారణ యుకుడిగా ప్రారంభమైన ప్రయాణం..ఇప్పడు అంతరిక్ష రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిభను ప్రపంచానికి చాటే స్థాయికి చేరుకోవడం యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ‘రౌద్ర నెక్స్’తో స్పేస్ టెక్నాలజీలో కొత్త అధ్యాయం ప్రొపల్షన్ పేలోడ్ ఫ్లైట్ రెడీనెస్ పరీక్షలు విజయవంతం నెరవేరిన పట్టణ విజయనగరం యువకుడి కల -
బైక్, కారు ఢీ: ఒకరి మృతి
సీతానగరం: మండలంలోని గుచ్చిమి పెట్రోల్‌బంక్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మండలంలోని జమదాల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆయిల్ కొనుగోలు నిమిత్తం మోటార్‌సైకిల్‌పై గుచ్చిమి పెట్రోల్ బంక్‌కు వచ్చారు. మోటార్ సైకిల్‌పై వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో రోడ్డు ఎక్కుతుండగా అదేసమయంలో బొబ్బిలి నుంచి పార్వతీపురం వెళ్తున్న కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. దీంతో ప్రమాదంలో అల్లు రోహిత్(17) మృతి చెందగా జన్ని చందుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతుడిని చికిత్స నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలాన్ని ఏఎస్సై లక్ష్మణరావు పరిశీలించి క్షతగాత్రుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆనందపురం(విశాఖ): స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొయ్యపేట గ్రామానికి చెందిన రైతు కాగితాల రాంబాబు (49) మృతిచెందాడు. గ్రామంలో పూలు సాగు చేసే ఆయన, రోజూ పూలను ఆనందపురం మార్కెట్లో విక్రయిస్తుంటాడు. ఇందులో భాగంగానే తెల్లవారుజామున 3 గంటలకు ఆయన ఓ ప్రైవేట్ వ్యాన్‌లో ఆనందపురం మార్కెట్‌కు బయలుదేరాడు. డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తగా నడుపుతూ ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వ్యాన్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో డ్రైవర్ పక్క సీట్లో ఉన్న రాంబాబు తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు మృతుడి భార్య కాగితాల పాపాయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆనందపురం సీఐ సీహెచ్.వాసు నాయుడు కేసు నమోదు చేయగా ఎస్సై దర్యాప్తు చేపట్టారు. శవ పంచనామా నిర్వహించి అనంతరం పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. విజయనగరం క్రైమ్: విజయనగరం జీఆర్పీ సిబ్బంది గుర్తు తెలియని మృతదేహాన్ని బుధవారం కనుగొన్నారు. సుమారు 35–40 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైలులో జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తూ, స్కృహ కోల్పోయినట్లు గుర్తించామని జీఆర్పీ హెచ్‌సీ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. తోటి ప్రయాణికులు ఆ వ్యక్తిని విజయనగరం రైల్వే స్టేషన్లో ఫ్లాట్‌ఫాం నంబర్ నాలుగుపై దింపగా, ఆన్ డ్యూటీ రైల్వే డాక్టర్ పరీక్ష చేసి ఆ వ్యక్తి మృతి చెందాడని నిర్ధారించారన్నారు. మృతుడు సుమారు 5 అడుగుల పొడవు కలిగి, చామన ఛాయ రంగులో ఉన్నాడని మృతుని కుడివైపు ఛాతీమీద, పొట్ట మీద పుట్టుమచ్చలు ఉన్నాయన్నారు. మృతుడు నలుపు రంగు షార్ట్ ధరించి ఉన్నాడని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు ఫోన్ 9247585742, 9440170317 నంబర్లకు సమాచారం ఇవ్వాలని జీఆర్పీ హెచ్‌సీ శ్రీనివాస్ ప్రసాద్ కోరారు. -
గురువారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2026
పార్వతీపురం రూరల్: పచ్చని సంసారాల్లో మద్యం మత్తు చిచ్చు రేపుతోంది. రహదారులు రక్తదారులవుతున్నాయి. కన్నవారి కలలు ఒక్క ’చుక్క’ మత్తులో చిత్తవుతున్నాయి. జిల్లాలో రోడ్డు ప్రమాదాల తీరును గమనిస్తే, సగానికి పైగా మత్తువల్లే జరుగుతున్నాయని పోలీసుల విచారణలో తేలడం గమనార్హం. గుమ్మలక్ష్మీపురంలో లారీని ఢీకొన్న యువకుడి ఉదంతమైనా, సీతానగరం వద్ద సైకిలిస్ట్‌ను బైక్‌తో ఢీకొట్టిన ఘటనైనా.. వెనుక ఉన్నది మద్యం మహమ్మారేనని స్పష్టమవుతోంది. మత్తులో తూలుతూ డ్రైవింగ్ చేయడం అంటే మృత్యువుకు ఆహ్వానం పలకడమేనని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. పెరుగుతున్న కేసులు..తరుగుతున్న ప్రాణాలు జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఏటా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2023లో 3,165 కేసులు నమోదు కాగా, 2025 నాటికి ఆ సంఖ్య 3,456కు చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కేవలం మద్యం తాగి వాహనం నడపడమే కాకుండా, బహిరంగ మద్యపానం (ఓపెన్ డ్రింకింగ్) కేసులు సైతం వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. 2025లో జరిగిన 256 ప్రమాదాల్లో ఏకంగా 107 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. మృతుల సంఖ్య 2024తో (71 మంది) పోలిస్తే 2025లో భారీగా పెరగడం గమనార్హం. శిక్షలు ఖరారు.. జైలు గ్యారంటీ మందుబాబుల ఆట కట్టించేందుకు ప్రభుత్వం చట్టాలను మరింత కఠినతరం చేసింది. మద్యం తాగి వాహనం నడిపి మొదటిసారి దొరికితే రూ.10 వేలు జరిమానా విధిస్తారు. రెండోసారి దొరికితే జైలు శిక్ష తప్పదు. ఒకవేళ ప్రమాదానికి కారణమై ఎవరైనా మరణిస్తే..ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు లైసెనన్స్ రద్దు వంటి కఠిన చర్యలు ఉంటాయి. కేవలం మద్యం మాత్రమే కాదు. హెల్మెట్ పెట్టకున్నా, సీటు బెల్టు ధరించకపోయినా రూ.1,000 జరిమానా, లైసెన్స్ లేకపోతే రూ.5,000 వరకు వడ్డింపు తప్పదు. అవసరమైతే వాహనాలను సీజ్ చేసేందుకు కూడా వెనుకాడబోమని చట్టం చెబుతోంది.ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ మేరకు తనిఖీలు ముమ్మరం చేశాం. ప్రతి ప్రాణం విలువైనదే.. మద్యం తాగి వాహనం నడపడం ద్వారా మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టవద్దు. కేవలం జరిమానాలు విధించడమే లక్ష్యం కాదు, ప్రజల్లో మార్పు రావడమే ప్రధాన ఉద్దేశం చట్టం తన పని తాను చేస్తున్నా, వాహనదారుల్లో బాధ్యత పెరగాలి. మత్తు వదిలి..బాధ్యతగా వాహనం నడపడమే కుటుంబానికి రక్ష. –ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి -
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్
● స్థానిక ఎన్నికల నేపథ్యంలో అలెర్ట్‌గా ఉండాలి ● ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆదేశాలు ● డీపీఓలో నేర సమీక్షా సమావేశంవిజయనగరం క్రైమ్: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా పెట్టాలని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఈ మేరకు జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న పోలీసు అధికారులతో డీపీఓలో బుధవారం ఎస్పీ దామోదర్ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎన్డీపీసీ, పోక్సో, అట్రాసిటీ, మిస్సింగ్, చోరీ, రోడ్డు ప్రమాదాలు, సోషల్ మీడియా కేసులను సమీక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు. సమీక్షలో ఎస్పీ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో గ్రామ, వార్డు సందర్శనలు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలను ప్రాథమిక స్థాయిలో గుర్తించి, వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. మంచి ప్రవర్తన కోసం బైండోవర్ చేయాలి గ్రామాలు, వార్డుల్లో అల్లర్లు సష్టించేందుకు అవకాశం ఉన్న వ్యక్తులను ముందుగా గుర్తించి, మంచి ప్రవర్తన కోసం వారిని బైండోవర్ చేయాలని స్పష్టం చేశారు. హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులపై నిఘా పెట్టాలని, వారి కదలికలను గమనించాలని, అవసరమైతే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రతిపోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాల్లో నేరాలు జరగకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. అపార్ట్మెంట్లు, వ్యాణిజ్య సముదాయలు, వ్యాపారులు, కాలనీ వాసులకు సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరించి, ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలీస్‌సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని అధికారులకు ఎస్పీ సూచించారు. ఎంఎస్పీల సహకారం తీసుకోవాలి టెక్నాలజీని వినియోగించుకుని కేసుల మిస్టరీని ఛేదించాలని తెలిపారు. ప్రజలకు నిత్యం పోలీసులు అందుబాటులో ఉంటూ సేవలను విస్తృతం చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో సమాచార సేకరణకు, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో ఆయా గ్రామాల దత్తత కానిస్టేబుళ్లు, మహిళా సంరక్షణ పోలీసుల (ఎంఎస్పీ) సేవలను వినియోగించుకోవాలని అధికారులకు ఎస్పీ సూచించారు. దర్యాప్తు చేపట్టే అన్ని కేసుల్లోను ఈ–సాక్ష్య యాప్‌ను వినియోగించాలని, ఫొటోలను, వీడియోలను ఈ–సాక్ష్యలో నిక్షిప్తం చేయాలన్నారు. కొత్త క్రిమినల్ చట్టాలకు అనుగుణంగా గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో అభియోగ పత్రాలను నిర్దిష్ట సమయంలోగా ఆయా న్యాయస్థానాల్లో దాఖలు చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీఎస్పీలు ఆర్.గోవిందరావు, ఎస్.రాఘవులు, ఎం.వీరకుమార్, న్యాయ సలహాదారులు వై.పరశురాం, సీఐలు చౌదరి, శ్రీనివాస్, లక్ష్మణరావులతో పాటు 32 స్టేషన్ల ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
లైంగికంగా వేధిస్తే కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష
విజయనగరం లీగల్: లైంగికంగా బాలబాలికలను వేధించినా, అవమాన పరిచినా నేరం చేసిన వ్యక్తికి కనీసంగా 20 సంవత్సరాలు, గరిష్టంగా జీవిత ఖైదు శిక్షకు గురి కానున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి డాక్టర్ ఎ.కృష్ణప్రసాద్ అన్నారు. ఈ మేరకు బుధవారం విజయనగరం మండలంలోని పాఠశాలలో నిర్వహించిన న్యాయ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బాలికలకు దగ్గరి వారి నుంచి ముప్పు పొంచి ఉందని, తెలిసిన వారే నేరానికి పాల్పడుతున్నారని వారినుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రక్షిత బాల్యం–సురక్షిత భవిష్యత్తు అనే నినాదంతో పోక్సో–2012 చట్టంపై, అవగాహన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయమని వచ్చిన ఆదేశాల మేరకు విజయనగరంలో కూడా నిర్వహించినట్లు తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లలపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్ గురించి బాలికలకు తెలియజేశారు. ప్రస్తుత పిల్లలు తెలిసీతెలియని టీనేజ్ వయస్సులో లేనిపోని ఆకర్షణలకు గురవుతున్నారని, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ ప్రభావాలకు లోనుకాకుండా విద్యపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఏ విషయాన్నైనా నిర్భయంగా తల్లిదండ్రులకు లేదా పాఠశాల ఉపాధ్యాయులకు చెప్పాలని, అపరిచిత వ్యక్తుల దగ్గర జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1098కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు. అలాగే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ టోల్ ఫ్రీ నంబర్ 15100కు ఫోన్ చేసి సహాయాన్ని కోరవచ్చని తెలియజేశారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు ఆనందరావు, పి.సత్యవతి, డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ బీహెచ్ లక్ష్మి, ప్యానల్ న్యాయవాది డాక్టర్ పైల కుమార్ నేచర్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ జి.దుర్గ, పాఠశాల ప్రధాన అధ్యాపకురాలు రమణమ్మ పాల్గొన్నారు. -
జయ, విజయ విగ్రహాల ప్రతిష్ట
పాలకొండ: పట్టణంలో వెలసిన అతి పురాతన జగన్నాథస్వామి ఆలయంలో జయ,విజయ విగ్రహాలను బుధవారం ప్రతిష్టించారు. పట్టాణానికి చెందిన దుర్గాప్రసాద్ సాహు జ్ఞాపకార్థం ఆయన కుమారులు ఈ విగ్రహాలను ఆలయానికి అందించి ప్రతిష్ట చేయించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు విశ్వనాథందాస్, చక్రీదాస్, భక్తులు పాల్గొన్నారు. పాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మ ఆలయంలోని హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఆలయంలో ఉన్న ఎనిమిది హుండీల్లో ఈ ఏడాది మార్చి 25 నుంచి మే 13 వరకు ఏభై రోజులకు గాను రూ.6,73,482లు ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ బీఎన్ఎస్ సూర్యనారాయణ తెలిపారు.అలాగే 15 గ్రాముల మిక్స్డ్ బంగా రం, 550 గ్రాముల మిక్స్డ్ వెండి కానుకలుగా లభించాయని చెప్పారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఎస్.రామారావు పర్యవేక్షణలో హుండీ ల ఆదాయం లెక్కింపు జరిగింది. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, పోలీసులు, ఏపీజీవీబీ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. మాతృ, శిశు మరణాలు నివారించేది ఎప్పుడు? ● వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసిన కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి విజయనగరం ఫోర్ట్: జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభవించడంపై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సీరియస్ అయ్యారు. మాతృమరణాలపై కలెక్టరేట్లో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభవిస్తుంటే జిల్లా యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాల రక్షణ కోసం ప్రభుత్వ యంత్రాంగం ఉందని, విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే సహించేంది లేదని హెచ్చరించారు. మార్చి నెలలో సంభవించిన రెండు మాతృ మరణాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోందని, బాధ్యులపై సమగ్ర నివేదిక సమర్పించాలని డీఎంహెచ్ఓ జీవనరాణిని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఆశ కార్యకర్తలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, గర్భిణులు, బాలంతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ పద్మశ్రీ రాణి, గైనికాలజీ హెచ్ఓడీ అరుణ శుభశ్రీ, డీఐఓ అచ్చుతకుమారి, తదితరులు పాల్గొన్నారు. 21 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు విజయనగరం అర్బన్: జిల్లాలో ఈ నెల 21 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధంచేసినట్లు జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందింరంలో జిల్లా పరీక్షల కమిటీ కన్వీనర్ ఎస్.తవిటినాయుడుతో కలిసి పోలీస్, వైద్య, విద్యుత్, ఆరోగ్య, రవాణా తదితర శాఖల అధికారులతో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణపై కీలక సూచనలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 49 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఉదయం సెషన్ 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2.30 నుంచి 5.30 గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా, విద్యార్థులకు రవాణా సౌకర్యాలు, వైద్య సహాయం, బందోబస్తు సదుపాయం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జామి: విజయనగరం జిల్లా జామి మండలంలోని కిర్ల గ్రామానికి చెందిన ఆకాష్‌రెడ్డి అనే విద్యార్థి ఏపీ రెసిడెన్షియల్ ఆరోతరగతి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించాడు. 100కు 97 మార్కులు సాధించి ముందంజలో నిలిచాడు. కిర్ల ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదివిన అకాష్రెడ్డి అంబేడ్కర్ గురుకుల ప్రవేశ పరీక్షలోనూ రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించాడు. ఏపీ మోడల్ స్కూల్ పరీక్షల్లోనూ కొత్తవలస మండల స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. -
ఆకతాయిలకు ఎస్పీ వార్నింగ్
విజయనగరం క్రైమ్ : విజయనగరంలో నివాసముంటూ ఈవ్ టీజింగ్, పోకిరి వేషాలు వేసే ఆకతాయిలను ఎస్పీ దామోదర్ బుధవారం హెచ్చరించారు. నగరంలో సక్రమంగా ఉంటే ఉండాలని, లేకుంటే నగరం విడిచి వెళ్లిపోవాలన్నారు. నగరంలో 32 చోట్ల ఏక కాలంలో దాదాపు 200 మంది సిబ్బందితో నాకా బందీ నిర్వహించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో ఇన్సురెన్స్, సీ బుక్, ఆర్సీ, హెల్మెట్ తదితరమైనవి లేని దాదాపు 1200 వాహనాలకు జరిమానా విధించారు. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఏడున్నర వరకు విస్తృతంగా తనిఖీలతో పాటు నాకా బందీ నిర్వహించారు. నగరంలోని కంటోన్మెంట్ రెల్లి వీధి రామమందిరం వద్ద గజపతినగరం సీఐ సన్యాసిరావుతో పాటు విజయనగరం వన్ టౌన్ ఎస్ఐ లీలావతి, ఏఎస్ఐ లక్ష్మణరావులు తమ సిబ్బందితో తనికీలు నిర్వహించారు. తనిఖీలను ఎస్పీ దామోదర్ పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జొన్నగుడ్డిలో పావాడ హరనాధ్ హత్యతో నగరంలో అల్లరి మూకలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. సున్నితమైన ప్రాంతాలైన జొన్నగుడ్డి, లంకాపట్నం, శాంతినగర్, రెల్లివీధి, గంజిపేట వంటి ప్రదేశాల్లో నిఘా పెట్టామని తెలిపారు. ఇకపై ప్రతీ రోజు ఆయా ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఆకతాయిలు వెకిలి చేష్టలకు ఫుల్స్టాప్ పెడతామన్నారు. లంకాపట్నంపై కూడా టు టౌన్ పోలీసులు దృష్టి పెట్టారన్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు ఎవరూ పాల్పడినా ఉక్కుపాదం మోపుతామన్నారు. రహదారి భద్రత, గంజాయి విక్రయాలు, వినియోగం, అక్రమ రవాణ నియంత్రణకు విజయనగరం వన్ టౌన్, టు టౌన్, రూరల్ పోలీసుస్టేషన్ల పరిధిలో సమస్యలు సృష్టించే ఏడు ముఖ్య ప్రాంతాల్లో 32 పాయింట్లలో ఏక కాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టామని వెల్లడించారు. ఈ తనికీల్లో 13 మంది సీఐలు, 43 మంది ఎస్ఐలు 600 మంది కానిస్టేబుళ్లు, హొంగార్డు పాల్గొనగా డీఎస్పీలు ఆకస్మిక తనిఖీలను పర్యవేక్షించినట్టు పేర్కొన్నారు. తనిఖీల్లో డీఎస్పీలు ఎస్.రాఘవులు, ఆర్.గోవిందరావు, ఎం.వీరకుమార్, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, సీఐలు ఆర్వీకే చౌదరి, శ్రీనివాస్, ఎస్ఐలు గణేష్, దుర్గాప్రసాద్, సాగర్, లక్ష్మీ ప్రసన్నకుమార్, లీలావతి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎన్నాళ్లో వేచిన కల..!
● సువర్ణముఖిపై వంతెనకు రూ.9 కోట్లు విడుదల ● పీఆర్ (ప్రాజెక్ట్స్) ఏఈ శంకరరావు సీతానగరం: మండలంలోని బూర్జ వద్ద సువర్ణముఖినదిపై వంతెన నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు పీఆర్ (ప్రాజెక్ట్స్) ఏఈ శంకరరావు తెలిపారు. దీంతో దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న కల అప్పటి ఎమ్మెల్యే అలజంగి జోగారావు కృషితో నేటికి సార్థకమైంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2023 అక్టోబరు నెలలో సువర్ణముఖినదిపై బూర్జ–చినంకలాం, గాదెలవలస గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి జీఓ విడుదలచేస్తూ రూ.9 కోట్లు నిధులు మంజూరు చేసింది. అప్పట్లో ఉత్తర్వులు వెలువడడం వల్ల బూర్జ చుట్టుపక్కల 50గ్రామాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. దీంతో దీర్ఘకాలంగా పలుగ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్న వంతెన కల నాటి ఎమ్మెల్యే అలజంగి జోగారావు కృషి ఫలితంగా నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో నెరవేరింది. బూర్జ పంచాయతీలో సువర్ణముఖి నదికి అవతల ఆవాలవలస, బూర్జగ్రామానికి చెందిన రైతులకు ఆవాలవలసను ఆనుకుని వ్యవసాయ భూములున్న రైతులు, ఆవాలవలస గ్రామస్తులకు నిత్యావసర సరుకులు కావాలన్నా, పంచాయతీ పనులకోసం వచ్చేందుకు వేసవిలో అయితే 30 నిమిషాల్లో ఇంటికి చేరే రైతులు, ప్రజలు వర్షాకాలంలో నదిలో దిగడానికి వీలుకాని పరిస్థితిలో 16 కిలోమీటర్ల దూరం తిరిగి రావాల్సి ఉంటుంది. అప్పట్లో పనులు ప్రారంభించడానికి 2024 సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడం వల్ల నదిలో స్తంభాల నిర్మాణానికి బోర్లు తీయడంతోనే పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో త్వరలో భూమి పూజ చేసి పనులను ప్రారంభించడానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ప్రస్తుత పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సూచించడంతో అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నెల 18న అవే పనులకు భూమి పూజ చేయడానికి సమాయత్తం అవుతున్నట్లు స్థానిక పెద్దల ద్వారా తెలియవచ్చింది. -
సాంకేతికతతో సమర్థంగా సేవలందించాలి
● పీటీసీలో ట్రైనీ ఎస్సైలకు ఎస్పీ సూచనవిజయనగరం క్రైమ్: సాంకేతికతను అందిపుచ్చుకుని సమర్థవంతమైన సేవలందించాలని ఎస్పీ దామోదర్ మంగళవారం అన్నారు. ఈ మేరకు స్థానిక పీటీసీలో ప్రీ ప్రమోషనల్ ఎస్సై ట్రైనింగ్ పొందుతున్న 49 మంది ఏఎస్సైల నుద్దేశించి ఎస్పీ మాట్లాడారు. పోలీసు శాఖలో ఎస్సైలుగా ఉద్యోగోన్నతి పొందేందుకు ఆరు వారాల శిక్షణ నిమిత్తం విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి పోలీసు శిక్షణ కళాశాలకు విచ్చేసిన 49 మంది ఎస్సై శిక్షణార్థులతో ఎస్పీ ఏఆర్.దామోదర్ మమేకమై, భవిష్యత్తులో ఎస్సైలుగా నిర్వహించాల్సిన విధులపట్ల దిశానిర్దేశం చేశారు. పీటీసీ వైస్ ప్రిన్సిపాల్ పి.వి.అప్పారావు ఎస్పీకి పూల మొక్కను అందజేసి, స్వాగతం పలకగా, పోలీసుల నుంచి ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీసుశాఖలో సుమారు 35 సం.లు పైబడి సర్వీసు పూర్తి చేసుకుని, నేడు ఎస్సైలుగా ఉద్యోగోన్నతి పొందేందుకు శిక్షణకు వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, పీటీసీ వైస్ ప్రిన్సిపాల్ పి.వి.అప్పారావు, డీఎస్సీ వాసుదేవ్, పలువురు సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సై, ట్రైనీ ఏఎస్సైలు పాల్గొన్నారు. -
అన్నదాతతో ఆటలు..!
విజయనగరం ఫోర్ట్: అందరికీ అన్నం పెట్టే అన్నదాతలతో టీడీపీ సర్కార్ ఆటలాడుతోంది. అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమానికి పాటు పడతామని గొప్పలు చెప్పిన టీడీపీ సర్కార్ ఆ తర్వాత రైతులను గాలికి వదిలేసింది. గడిచిన రెండేళ్లుగా ఎటువంటి యంత్ర పరికరాలు టీడీపీ ప్రభుత్వం అందించలేదు. తాజాగా మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ పథకం ద్వారా రైతులకు రాయితీపై ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు వంటి యంత్ర పరికరాలు అందిస్తామని టీడీపీ సర్కార్ ప్రకటించింది. అయితే గతంలో మాదిరి కాకుండా లాటరీ ద్వారా యంత్ర పరికరాలు కేటాయిస్తామని మెలిక పెట్టింది. లాటరీ పద్ధతిపై యంత్ర పరికరాలు కేటాయించడం అంటే రైతులను ఇబ్బంది పెట్టడమేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లాటరీ వరించినా కష్టమే లాటరీలో యంత్ర పరికరం వచ్చినప్పటికీ అది అన్నదాతకు అందుతుందనే గ్యారంటీ లేదు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న సామెత చందాన లాటరీలో వరించినప్పటికీ జిల్లా ఇన్చార్జి మంత్రి అమోదంతోనే యంత్ర పరికరాలను రైతులకు అందజేస్తారు. లాటరీ వరించిన రైతు అధికార పార్టీకి చెందిన వారు కాకపోతో పక్కన పెట్టేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ యంత్ర పరికరాల కోసం లాటరీ టీడీపీ సర్కార్ వింత ధోరణి రైతులు ఈనెల 19 లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటన లాటరీ వరించినా ఇన్చార్జి మంత్రి అమోదం తప్పనిసరి జిల్లాకు యంత్ర పరికరాల కోసం రూ.4.22 కోట్లు కేటాయింపు -
నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ సమరభేరి
● నేరగాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ విజయనగరం గంటస్తంభం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంపై విద్యార్థి లోకం భగ్గుమంది. భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో మంగళవారం విజయనగరం పట్టణంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్య అమ్మకానికి కాదు–మా హక్కు, నీట్ మాఫియాను అంతం చేయాలంటూ విద్యార్థులు నినదించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహనరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యా వ్యవస్థను కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్నారని విమర్మించారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివే పేద, మధ్యతరగతి విద్యార్థుల కలలను ఈ విద్యా మాఫియా చిదిమేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఏ వైఫల్యం.. 2015 నుంచి నేటి వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన పరీక్షల్లో నాలుగు సార్లు నీట్ పేపర్ లీక్ అవ్వడం, యూజీసీ నెట్ రద్దు కావడం చూస్తుంటే వ్యవస్థ ఎంతలా దిగజారిందో అర్ధమవుతోందని రామ్మోహనరావు అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు నీట్ వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోందని, అందుకే తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయని గుర్తుచేశారు. రాష్ట్ర నాయకులు కేంద్రానికి వత్తాసు పలకడం మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్మి డి.రాము, గర్ల్స్ కన్వీనర్ శిరీష్, జిల్లా నాయకులు సోమేష్, జగదీష్,నాని, డీవైఎఫ్ఐ నాయకులు హరీష్, రవి, పెద్ద సంఖ్యలో విద్యార్ధులు పాల్గొన్నారు. విద్యావ్యవస్థలో అవనితీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న విద్యార్థులు -
పార్వతీపురం ఎమ్మెల్యే వ్యాఖ్యలపై నిరసన
పార్వతీపురం రూరల్: రెవెన్యూ అధికారులపై పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర చేసిన అనుచిత వ్యాఖ్యలను జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఖండించింది. ఈ నెల 9న పార్వతీపురం మండలం అడ్డపుశీల గ్రామ పరిధిలోని సర్వే నెం.70/2లో గల గెడ్డ పోరంబోకు భూమి ఆక్రమణల విషయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రెవెన్యూ సిబ్బందిపై పరుష పదజాలం వాడటంపై సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం బాధాకరమని సంఘ అధ్యక్ష, కోశాధికారులు జి.శ్రీరామమూర్తి, పి.సత్యలక్ష్మీ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవస్థలో ఎవరైనా తప్పుచేస్తే వారిపై చర్యలు తీసుకోవడానికి అభ్యంతరం లేదని, విధుల్లో ఉన్న ఉద్యోగులందరినీ కలిపి నిందించడం తగదన్నారు. ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దళితుల హక్కులను కాపాడండి ● రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం విజయనగరం: దళిత వర్గాల హక్కులను కాపాడి, వారి ఆర్థికాభివృద్ధికి సహకారం అందివ్వాలని అధికార వర్గాలకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం సూచించారు. విజయనగరంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న దళిత ఉద్యోగుల వినతులను స్వీకరించారు. ఆ తర్వాత దళిత సంఘాల నేతలు, దళితుల నుంచి వచ్చిన వినతి పత్రాలను అందుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపి పరిష్కరించారు. మధ్యాహ్నం పలువురి నుంచి వచ్చిన వినతులపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. అనంతరం సీతారాం మాట్లాడుతూ దళితుల హక్కులను పూర్తిగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించాలన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు విస్తృత పర్యటనలు చేపడుతున్నామన్నారు. ప్రతి దళిత కుటుంబంలోని ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వం ధ్యేయమని పునరుద్ఘాటించారు. వివిధ శాఖలలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ఎస్సీ సొసైటీకి 22 శాతం రిజర్వేషన్ ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలన్నారు. దళితులు, దళిత సంఘాలు, దళిత ఉద్యోగుల నుంచి వచ్చిన వినతులను 15 రోజుల్లోగా పరిష్కరించి తనకు నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. సమావేశంలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాలస్వామి, సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు, డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, డీసీహెచ్ఎస్ పద్మశ్రీ రాణి, విద్యుత్ శాఖ ఎస్ఈ యం.లక్ష్మణరావు, ప్రభుత్వ వైద్య కళాశాల ఏడీ, తదితరులు పాల్గొన్నారు. ఖరీఫ్‌లో 48 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు ● వ్యవసాయ శాఖ జేడీ తారకరామారావు కొత్తవలస: రానున్న ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని రైతులకు రాయితీపై అందజేసేందుకు 48వేల క్వింటాళ్లు వరి విత్తనాలను సిద్ధం చేశామని, అందులో 35 వేల క్వింటాళ్లు 1121 రకం విత్తనాలేనని వ్యవసాయ శాఖ జేడీ వి.తారకరామారావు తెలిపారు. కొత్తవలస ఏడీఏ కార్యాలయాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వరి సాధారణ విస్తీర్ణం లక్షా15వేల ఎకరాలుగా పేర్కొన్నారు. 38 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచుతామన్నారు. ఎకరానికి 75 కేజీల యూరియా మాత్రమే అందజేస్తామన్నారు. వ్యవసాయ పరికరాలు కావాల్సిన రైతులు రైతు సేవాకేంద్రాల్లో ఈనెల 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆయన వెంట ఏడీఏ భానులత ఉన్నారు. -
హనుమాన్ శోభాయాత్ర
భక్తిశ్రద్ధలతో..విజయనగరంలో కనులపండువగా సాగుతున్న హనుమాన్ శోభాయాత్ర హనుమజ్జయంతిని పురస్కరించుకుని హిందూ ధర్మ రక్షాసమితి జిల్లాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. భాజాభజంత్రీలు, కోలాట ప్రదర్శనలు, డప్పువాయిద్యాల నడుమ జై హనుమాన్ నామస్మరణతో విజయనగరం కోట కూడలి నుంచి గంటస్తంభం మీదుగా హనుమాన్ కూడలి వరకు శోభాయాత్ర సాగింది. పాత మహారాజా ఆస్పత్రి ప్రాంగణంలో నిర్వహించిన ఆధ్యాత్మిక సభలో ఆంధ్రప్రదేశ్ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి చేసిన ఆధ్యాత్మిక ప్రసంగం భక్తులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో హిందూ ధర్మరక్షా సమితి రాష్ట్ర కార్యదర్శి నందివాడ వేణుగోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్ష్యుడు ఆబోతుల శ్యామ్ సుందర్, జిల్లా ఇన్చార్జి రామ్ తరుణ్, సహాయ కార్యదర్శి రామ్‌రాజేష్, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం టౌన్ -
మున్సిపల్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
● పద్ధతి మార్చుకోకుంటే వేటు తప్పదని హెచ్చరిక ● సొంత ప్రభుత్వంపైనే ‘టీడీపీ’ నేతల నిలదీతపార్వతీపురం రూరల్: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలోకి వచ్చిన కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డికి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, పాలకుల వైఫల్యాలు ముఖాముఖి దర్శనమిచ్చాయి. ఈ మేరకు మంగళవారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన ‘ముఖాముఖి’ కార్యక్రమంలో అధికారులపై కలెక్టర్ నిప్పులు చెరిగారు. ఒకవైపు అధికారులు బాధ్యతలను గాలికొదిలేయడం, మరోవైపు గత రెండేళ్లుగా అధికారంలో ఉండి ఏమీ చేయని కూటమి నేతలు.. ఇప్పుడు తమ ప్రభుత్వంపైనే నిరసన తెలపడం పట్టణంలో విడ్డూరంగా మారింది. నిర్లక్ష్యం నీడన నగరపాలన కార్యక్రమంలో భాగంగా వివిధ వార్డుల నుంచి వచ్చిన ప్రజలు తమ గోడును కలెక్టర్ ముందు వెళ్లబోసుకున్నారు. జగన్నాథపురంలో చెరువు ఆక్రమణలు, నాయుడు వీధిలో మంచినీటి ఎద్దడి, నిర్మల కాలనీలో ప్రభుత్వ స్థలాల కబ్జాపై వినతులు వెల్లువెత్తాయి. మున్సిపల్ పరిధిలో గ్రామాచావిడి, బందెలదొడ్డి వంటి స్థలాలు అక్రమార్కుల పరమవుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించడంపై కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కనీసం మురుగు కాలువలు శుభ్రం చేయలేని స్థితిలో యంత్రాంగం ఉందంటే పాలన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శలు వినిపించాయి. సొంత సర్కారుపైనే టీడీపీ నేతల నిరసన ఈ కార్యక్రమంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. గత రెండేళ్లుగా పదవుల్లో ఉండి పట్టణ సమస్యలను పట్టించుకోని కూటమి వార్డు కౌన్సిలర్లు, ఇప్పుడు ముందస్తు పథకం ప్రకారం కలెక్టర్ వద్దకు వచ్చి తమ ప్రభుత్వంపైనే ఫిర్యాదులు చేయడం. అధికారంలో ఉన్నప్పుడే సమస్యలు పరిష్కరించని వారు, ఇప్పుడు ప్రత్యేక అధికారి పాలనలో పనులు జరగడం లేదంటూ ప్రజల ముందు హడావుడి చేయడం విస్మయానికి గురిచేసింది. కూటమి ప్రభుత్వ శ్రేణులే తమ హయాంలో పనులు కావడం లేదని నిలదీయడం చూస్తుంటే, ప్రభుత్వ యంత్రాంగంపై పట్టు కోల్పోయినట్లు స్పష్టమవుతోంది. తమాషాలు చేస్తున్నారా? కలెక్టర్ వార్నింగ్ అధికారుల అసమర్థతను గమనించిన కలెక్టర్ ప్రభాకర రెడ్డి మున్సిపల్ సిబ్బందిపై కన్నెర్ర చేశారు. మీ పని మీరు చేయడానికి కలెక్టర్ ఎందుకు? కమిషనర్ ఎందుకు? కనీసం చిన్న ప్రతిపాదనలు చేయడం కూడా చేతకాదా?‘ అంటూ సూటిగా ప్రశ్నించారు. కలెక్టర్ పేరు వాడుకుని ‘ఎక్స్‌ట్రాలు’ చేస్తే సహించేది లేదని, అధికారుల వెనుక ఉండి ఎవరు నడిపిస్తున్నారో తనకు అన్నీ తెలుసని గుట్టు విప్పారు. చట్టం ముందు ఎవరూ సమానులు కాదని, వినయ విధేయతలు లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు. ముఖ్యంగా వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో పారిశుధ్యం విషయంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని, తక్షణమే పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ కఠినంగా వ్యవహరిస్తున్నా, స్థానిక రాజకీయ వర్గాల అండతో అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం పట్టణ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, కమిషనర్ పావని తదితరులు పాల్గొన్నారు. -
బిల్లులు చెల్లించినా..!
బొబ్బిలి: సాగునీరు సకాలంతో అందితేనే పంటలు పండుతాయి. రైతులు లాభపడతారు. అదే ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి కృషిచేసింది. జపాన్ అంతర్జాతీయ సహకార ఏజెన్సీ (జైకా) నిధులతో పనులు చేపట్టింది. ఇంతలో ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. బిల్లులు చెల్లించినా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి. పూడుకుపోయిన కాలువలు, పాడైన మదుములు, అభివృద్ధికి నోచుకోని ప్రాజెక్టులను చూసి రైతులు కన్నీరుపెడుతున్నారు. వేసవి కాలంలో పనులు జరగకపోవడంతో ఈ ఏడాది కూడా సాగునీటి తిప్పలు తప్పవంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ● ఇదీ పరిస్థితి... ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఒట్టిగెడ్డ, పెదంకలాం, వెంగళరాయసాగర్, పెద్దగెడ్డ ప్రాజెక్టుల పరిధిలో 71,063 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కాలువలు లైనింగ్ సరిగా లేక, మదుములు మరమ్మతులు, ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులు జరగక దాదాపు 40 శాతం భూములకు సాగునీరు అందడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.165 కోట్ల జైకా నిధులతో పనులకు పరిపాలనామోదం వచ్చింది. పనులు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టులకు లైనింగ్‌తో పాటు ప్రధాన ప్రాజెక్టు, స్పిల్‌వే వద్ద ఆధునీకరణ పనులు చేపట్టారు. దశలవారీగా బిల్లులు కూడా అందాయి. ముందుగా గట్ల పటిష్టతను చేశారు. అలాగే, బుష్ క్లియరెన్స్ చేసి ప్రాజెక్టుల గట్లను పటిష్టం చేశారు. ఇలా వరుసగా ఒక్కో ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తున్న సమయంలో ప్రభుత్వం మారింది. అంతే, పనులపై శ్రద్ధచూపేవారే కరువయ్యారు. వైఎస్సార్సీపీ హయాంలో బొబ్బిలి–మక్కువ మండలాల మధ్య వీఆర్ఎస్ కాలువ ఇలా (ఫైల్)24,500 ఎకరాల ఆయకట్టు ఉన్న వీఆర్ఎస్ ప్రాజెక్టుకు లైనింగ్ చేపట్టారు. రూ.8.2 కోట్ల బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించినా మిగులు పనులు పూర్తిచేయలేదు. పెదంకలాం ప్రాజెక్టు పనులకు రూ.36 లక్షల బిల్లులు చెల్లించినా కాంట్రాక్టరు పనులు చేసేందుకు ఆసక్తి చూపడంలేదు. పెద్దగెడ్డ, ఒట్టిగెడ్డకు లక్ష్యం ప్రకారం పనులు చేయలేదని బిల్లులు కూడా చెల్లించలేదు. ఎంతో ముఖ్యమైన ప్రాజెక్టుల ఆధునికీకరణ పనులు వేసవిలో ప్రారంభిస్తేనే జూన్‌లో ఖరీఫ్ నాటికి చివరి ఆయకట్టుకు సాగునీరందించేందుకు వీలుంటుంది. అధికారులు మాత్రం ప్రతిసారీ పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్లకు చెప్పడం, వారు తలూపడం వదిలేయడం మామూలైపోయింది. ఇప్పటికి రెండు సార్లు నోటీసులు ఇచ్చిన ఇరిగేషన్ అధికారులు మరోమారు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. -
ప్రభుత్వం మారింది... ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు గ్రహణం పట్టింది. కాలువల లైనింగ్ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. వచ్చే ఖరీఫ్‌లోనూ రైతులకు సాగునీటి కష్టాలు తప్పేలా లేవు. వేసవిలో పనులు చేసేందుకు అవకాశం ఉన్నా కాంట్రాక్టర్లు ముందుక
వెంకట్రాయుడిపేట వద్ద ప్రస్తుతం వీఆర్ఎస్ కాలువ దుస్థితి నోటీసులిస్తాం... జైకా నిధులతో పనులు చేయాలని కాంట్రాక్టర్లకు నోటీసులిచ్చినా ముందుకు రావడం లేదు. మరోమారు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాం. – ఆర్.అప్పారావు, సూపరింటెండెంట్ ఇంజినీరు, ఇరిగేషన్ సర్కిల్, బొబ్బిలి సాగునీటి ప్రాజెక్టులకు ‘చంద్ర’గ్రహణం వేసవిలో పూర్తికాని కాలువల లైనింగ్ పనులు ఈ ఏడాది ఖరీఫ్‌లోనూ సాగునీటికి కటకటే.. ఆవేదనలో రైతాంగం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన జైకా పనులు ప్రభుత్వం మారడంతో పనులపై నిర్లక్ష్యం -
గంజాయి కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
● ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డిపార్వతీపురం రూరల్: జిల్లాలో నమోదైన గంజాయి (ఎన్డీపీఎస్) కేసుల దర్యాప్తు పురోగతిపై ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి దర్యాప్తు అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన..పెండింగ్‌లో ఉన్న కేసులపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారి ఆచూకీ కనిపెట్టాలని ఎస్పీ సూచించారు. గంజాయి అక్రమ రవాణా ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించి జప్తు చేయాలని, పదేపదే నేరాలకు పాల్పడే వారిపై ’పిట్ ఎన్డీపీఎస్’ చట్టం కింద చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సీజ్ చేసిన గంజాయి, వాహనాలకు సంబంధించి న్యాయస్థానాల సమక్షంలో త్వరితగతిన ఇన్వెంటరీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికలు త్వరగా తెప్పించుకుని, నిర్ణీత గడువులోగా కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ’సంకల్పం 2.0, చైతన్యం 2.0, అభ్యుదయం 2.0’ పేరిట రూపొందించిన 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. గంజాయి వినియోగదారులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా సరఫరా మూలాలను ఛేదించాలని సూచించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ మనీషా రెడ్డి, పాలకొండ డీఎస్పీ రాంబాబు, సీఐలు పాల్గొన్నారు. -
రక్తదానం చేసిన మహిళ
విజయనగరం ఫోర్ట్: ఆపదలో ఉన్న ఓ మహిళకు మరో మహిళ రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచింది. జామి మండలం జాగారం గ్రామానికి చెందిన అల్లు వెంకటలక్ష్మి శస్త్రచికిత్స నిమత్తం ఘోషాఆస్పత్రిలో చేరింది. ఆమెకు శస్త్రచికిత్స నిమిత్తం ‘ఒ పాజిటివ్’ రక్తం ఎక్కించాలని వైద్యులు సూచించడంతో వారి బంధువులు ఆశ్రయ బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షుడు బి. రామకృష్ణారావును ఆశ్రయించారు. ఆయన సూచన మేరకు క్లబ్ సభ్యురాలు సాయి ఝాన్సీ మంగళవారం ప్రభుత్వ రక్తనిధి కేంద్రానికి వచ్చి రక్తదానం చేశారు. సకాలంలో స్పందించి రక్తదానం చేసినందుకు గాను ఝాన్సీని రామకృష్ణారావు, రోగి బంధువు చిన్ననాయుడు సత్కరించారు. సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్, క్యారెక్టరైజేషన్‌పై శిక్షణసీతంపేట: గిరిజన విద్యార్థులు సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్, క్యారెక్టరైజేషన్‌పై శిక్షణలో చేరేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ పవార్ స్వప్నిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుందన్నారు. నాల్గవ సంవత్సరం చదువుతున్న బీఎస్సీ విద్యార్థులు, ఎంఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న వారు అర్హులన్నారు. వివరాలకు వెబ్సైట్ చూడాలని సూచించారు. ప్రెజర్ కుక్కర్ పేలి మహిళకు తీవ్రగాయాలుగజపతినగరం: మండల కేంద్రంలోని కుమ్మర వీధిలో వంట చేస్తుండగా లక్ష్మి అనే మహిళ తీవ్రగాయాల పాలైంది. మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. లక్ష్మి అనే మహిళ తన ఇంటి వద్ద గ్యాస్ పై ప్రెజర్ కుక్కర్లో వంట చేస్తుండగా ఒక్క సారిగా ప్రెజర్ కుక్కర్ పేలడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. తక్షణమే ఆమెను బంధువులు గజపతినగరం ప్రాంతీయ ఆస్పత్రికి ఆటోలో తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. మాజీ సైనికుడికి 10రోజులు జైలుశిక్ష● రూ.10,000 జరిమానా విజయనగరం క్రైమ్/లక్కవరపుకోట: ఒక మాజీ సైనికుడు మందు తాగి డ్రంకెన్ డ్రైవ్‌లో చిక్కినందుకుగాను కొత్తవలస జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ విజయచందర్ పది రోజులు జైలు శిక్ష, రూ.పదివేలు జరీమానా విధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. ఎల్.కోట ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది మే 11న ఎల్.కోట పోలీస్ స్టేసన్ పరిధిలో గోల్డ్ స్టార్ జంక్షన్ వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా జమ్మాదేవి పేట గ్రామానికి చెందిన మాజీ సైనికుడు కూరిమిని శ్రీనివాసరావు మద్యం తాగి మోటారు సైకిల్ నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో మాజీ సైనికుడిపై పోలీసులు కేసు నమోదు చేసి మే 12న కొత్తవలస జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరచగా జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యంవిజయనగరం క్రైమ్: విజయనగరం వన్ టౌన్ పోలీసులు మంగళవారం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. ఆర్టీఓ ఆఫీస్‌కు వెళ్లే దారిలో సీతం కాలేజీవద్ద 55 ఏళ్ల వయస్సు కలిగిన మహిళ మృతదేహాన్ని కనుగొన్నట్లు ఏఎస్సై జగన్మోహన్ రావు తెలిపారు. మృతురాలిని గుర్తించగలిగిన వారు వన్ టౌన్ స్టేషన్ లేదా కంట్రోల్ రూమ్ కు సమాచారం తెలపాలని కోరారు. -
620 మార్కులు వస్తాయని ఆశపడ్డాం
నీట్ పరీక్షలో బాగా రాశా. కీలో చూస్తే 620 మార్కులు వచ్చాయి. ఈ మార్కులు తగ్గవనుకున్నా. మా తల్లిదండ్రులు, బంధువులు ఎంతో సంతోషించారు. ఇంతలో పరీక్షను రద్దుచేశారు. హతాశయులయ్యాం. మళ్లీ ఇంత ప్రిపరేషన్ సాధ్యమా? విద్యార్థుల భవిష్యత్తుపై పిడుగు వేశారు. – బొట్ట హేమంత్, ఇందిరమ్మ కాలనీ, బొబ్బిలి ఇది సరికాదు మా కుమార్తె మాధురి తొలిసారి నీట్ పరీక్ష రాసింది. బాగానే రాయడం వల్ల కీలో కూడా మంచి మార్కులు వచ్చాయి. పరీక్ష రద్దుచేశారని తెలియగానే కుమార్తెతో పాటు తామంతా నైరాశ్యంలోకి వెళ్లిపోయాం. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని చర్యలు తీసుకోవాలి. ప్రభావం ఉన్నచోట మాత్రమే పరీక్ష రద్దు చేయాలి. – లచ్చుపతుల శ్రీనివాసరావు, విద్యార్థిని తండ్రి -
విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు
విజయనగరం అర్బన్: పదోతరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల కీర్తిని దశదిశలా చాటిన విద్యార్థులను కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అభినందించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిపాలన, విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల సమర్ధమైన మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల కఠిన శ్రమఫలితంగానే ఈ అద్భుత విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఆసక్తులకు అనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ఏకాగ్రతతో ఉన్నత చదువుల్లో రాణించి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని హితవు పలికారు. అనంతరం ఉత్తమమార్కులు సాధించిన 13 మంది విద్యార్థులు, ఆయా పాఠశాలల హెచ్ఎంలను దుశ్శాలువలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులతో కలిసి ఆత్మీయ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఈఓ యు.మాణిక్యంనాయుడు, డిప్యూటీ ఈఓ కె.వి.రమణ, సహాయ సంచాలకులు అరుణజ్యోతి, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ సన్యాసిరాజు, డీఈఓ కార్యాలయ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
రామతీర్థంలో వైభవంగా హనుమాన్ జయంతి
● కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండనెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం వైభవంగా జరిగాయి. వేకువజామున ప్రాతః కాలార్చన, బాలభోగం అనంతరం ఆంజనేయస్వామి సన్నిధిలో అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. స్వామికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల ఫల రసాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామిని తమలపాకులు, సిందూరం, పుష్పాలతో సుందరంగా అలంకరించి అర్చనలు జరిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆంజనేయస్వామి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, కిరణ్‌కుమార్, పవన్, రామగోపాల్, తదితరులు పాల్గొన్నారు. వాడవాడలా భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. కొత్తపేట, ఒమ్మి, సతివాడ, గొర్లిపేట, తదితర గ్రామాల్లో ఆంజనేయస్వామి ఆలయాల్లో భక్తులు పూజలు జరిపారు. విగ్రహాలకు భారీ పూలదండలు వేసి భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. -
జరిగేవరకూ ఉద్యమిస్తాం
దళిత క్రైస్తవులకు న్యాయం● కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలంవిజయనగరం టౌన్: దళిత క్రైస్తవులకు న్యాయం చేకూరేవరకూ ఉద్యమిస్తామని కేంద్ర మాజీమంత్రి జేడీ శీలం పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక సిమ్స్ బాప్టిస్ట్ చర్చి ఆవరణలో రాజ్యాంగం, మతస్వేచ్ఛ, దళిత క్రైస్తవుల తక్షణ కర్తవ్యం అనే అంశంపై మంగళవారం జరిగిన దళిత క్రైస్తవ మహాసభలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము అండగా ఉన్నామని భరోసా కల్పించారు. క్రిస్టియన్, మైనారిటీ వర్గాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ వర్తింపజేయాలన్న రాష్ట్రాల తీర్మానాన్ని ఆమోదించి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా రిజర్వేషన్ హక్కులు కల్పించాలని కోరారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి.విజయకుమార్ (ఐఏఎస్) మాట్లాడుతూ ప్రస్తుతం వివక్ష కొనసాగుతోందన్నారు. మానవ మనుగడకు ఆటంకం ఏర్పడిందని సమానత్వం హక్కు ఎస్సీ క్రిస్టియన్స్‌కు, ముస్లింలకు మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా మతప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తామనడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. అంబేడ్కర్ ఇండియా మిషన్ అధ్యక్షుడు పీవీ.సునీల్ కుమార్ (ఐపీఎస్) మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయసాధనలో దళితులకు సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కోరారు. ప్రభుత్వం సరైన రీతిలో స్పందించి రిజర్వేషన్ల విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అధ్యక్షుడు రంజిత్ ఒఫిర్, వైఎంసీఏ అధ్యక్షుడు రోలెండ్ విలియమ్స్‌లు ప్రసంగించారు. సంఘమిత్ర ఆర్ఎస్.జాన్ అధ్యక్ష్యతన నిర్వహించిన దళిత మహాసభలో సిమ్స్ చర్చి అధ్యక్షుడు తాలాడ ఆనంద్, పాస్టర్ వై.ప్రభాకర్ ఆంద్రప్రదేశ్ దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆదాడ మోహనరావు, జమాతే ఇస్లాం కమిటీ ప్రతినిధి హబీబ్, రిటైర్ట్ పీటీసీ ప్రిన్సిపల్ డాక్టర్ కె.రాజశిఖామణి, ఉత్తరాంధ్ర జిల్లాల సంఘ ప్రతినిధులు, అధిక సంఖ్యలో దళిత సంఘాల నాయకులు, పాల్గొన్నారు. -
బాలభవన్‌ను సందర్శించిన జీతెలుగు డైరెక్టర్
రాజాం: పట్టణంలోని మెంతిపేటలో గల ప్రభుత్వ జవహర్ బాలభవన్ వేసవి శిక్షణ తరగతులను జీ తెలుగు టీవీ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్స్ డైరెక్టర్ శేఖర్ మంగళవారం సందర్శించారు. జీ తెలుగులో పలు కార్యక్రమాలకు దర్శకత్వం వహిస్తున్న ఆయన బాలభవన్‌లో వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా నేర్పిస్తున్న పలు కార్యక్రమాలపై ఆరాతీయడంతో పాటు వాటిని పరిశీలించి, చిన్నారులతో ముచ్చటించారు. విద్యార్థులు చదువుతో పాటు పలు రంగాల్లో రాణించాలని, ఇవి ఉపాధినే కాకుండా మానసిక, శారీరక వికాసానికి తోడ్పడతాయని వెల్లడించారు. సంగీతం, నృత్యం వంటి కళల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనభరిచి రాష్ట్రస్థాయిలో రాణించాలని కోరారు. కళాకారులుగా గుర్తింపు పొంది, జిల్లాకు, రాష్ట్రానికి పేరుతేవాలన్నారు. ఈ సమయంలో నేర్చుకున్న కళలు జీవితంలో ఏదోఒక సమయంలో ఉపయోగపడ్తాయని గుర్తుచేశారు. మంచి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వేసవి చిన్నారులకు మంచి మానసిక ఆటవిడుపుగా ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో బాలభవన్ డైరెక్టర్ డాక్టర్ సుంకరి రమేష్, డ్యాన్స్ మాస్టర్ తారకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
నమ్మించి మోసం చేశాడు
● ‘పచ్చ’ పత్రిక విలేకరి చేతిలో మోసపోయానని మహిళానేత ఆవేదన ● పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం ● సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సూసైడ్ నోట్ ● కేజీహెచ్‌లో బాధితురాలి పరిస్థితి విషమం మెంటాడ: ‘శివ అంకుల్ నా చావుకు కారణం.. నన్ను ఒక ఏటీఎంలా వాడుకున్నాడు.. తీయని మాటలతో నమ్మించి, హోటళ్లకు తీసుకెళ్లి సర్వస్వం దోచుకున్నాడు.. 2019 నుంచి తన బాధ్యత, పిల్లల బాధ్యత చూస్తానని నమ్మించి భర్తలా కాపురం చేశాడు... ఆయన స్వార్థానికి నన్ను బలిచేశాడు.. ఆర్థికంగానూ దోచుకున్నాడు. నేను ఏ తప్పూచేయలేదు. నన్ను నీవు నమ్మితే చాలు అంటూ తన కుమారుడికి మెంటాడ మండలానికి చెందిన ఓ మహిళా నాయకు రాలు రాసిన సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన చివరి కోరికగా తన భర్తగా చలామణి అయిన శివకేశవనాయుడే తనకు తల కొరివి పెట్టాలని ఆ నోట్లో పేర్కొంది. విశాఖప ట్నంలో మంగళవారం వేకువజామున పురుగులు మందు సేవించిన బాధితురాలు ప్రస్తుతం విశాఖపట్నం కేజీహెచ్‌లో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. మెంటాడకు చెందిన ‘పచ్చ’ పత్రిక విలేకరి శివకేశవనా యుడు తనను దోచుకున్న తీరు, మోసం చేసిన తీరును బాధితురాలు తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. అయితే, దీనిపై ఇప్పటివరకు స్థానికంగా ఎలాంటి కేసు నమోదుకాకపోవడం గమనార్హం. ఆ విలేకరి ఓ మంత్రికి అత్యంత ఆప్తుడు కావడమే దీనికి కారణమని స్థానికంగా చర్చ నడుస్తోంది. కేసు నమో దు విషయాన్ని మెంటాడ ఎస్ఐ కె.సీతారాము వద్ద ప్రస్తావించగా ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. విశాఖలో జరిగిన ఘటనగా పేర్కొన్నారు. -
ఢిల్లీకి బత్తిలి ఒడియా విద్యార్థిని
భామిని: మండలంలోని బత్తిలి జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న గౌడో అనూష సోమవారం ఢిల్లీ పయనమైంది. రాష్ట్ర విద్యాశాఖాధికారుల పర్యవేక్షణలో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలు దేరారు. ఈ నెల 14న ఢిల్లీలో కేంద్ర మానవ వనరులశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే భారతీయ భాష శిబిరంలో ఒడియా భాష ప్రాముఖ్యతను వివరించనున్నట్టు హెచ్ఎం సన్యాసిరావు తెలిపారు. మన రాష్ట్రం నుంచి వివిధ భాషలకు చెందిన ఆరుగురు విద్యార్థుల్లో గౌడో అనూష ఒకరని పేర్కొన్నారు. ఆదివాసీ భాషలకు గుర్తింపు ఇచ్చే క్రమంలో కేంద్రం కోయ, కువి, కొండ, ఆదివాసీ ఒడియా, సవర, సుగాలి భాషల గుర్తింపు కోసం నిర్వహిస్తున్న భారతీయ భాషా క్యాంపులో బాలిక మాట్లాతుందన్నారు. సీతంపేట: సీతంపేట ఏజెన్సీలో మలేరియా, టైఫా యిడ్, వైరల్ జ్వరాలు చాపకిందనీరులా వ్యాప్తి చెందుతున్నాయి. సోమవారం మొత్తం ఓపీ 360 రాగా వారిలో 11 మలేరియా ఆర్డీ టీ కిట్‌లో పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. ఈ నెలలో చూస్తే ఇప్పటి వరకు 60 మలేరియా పాజిటివ్ కేసులు ఒక్క సీతంపేట ఏరియా ఆస్పత్రిలోనే నమోదు కావడం గమనార్హం. చిన్నారుల్లో కూడా మలేరియా పాజిటివ్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఒక్క ఏరి యా ఆస్పత్రిలోనే ఇన్ని కేసులు నమోదైతే కుశి మి, దోనుబాయి, మర్రిపాడు పీహెచ్‌సీలతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లలో ఇంతకంటే రెండింతలు ఎక్కువగా మలేరియా పాజి టివ్ కేసులు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు. లంబగూడకు చెందిన తల్లీకొడుకులు సవర సులోమి, జాను, జొనగకు చెందిన హారి ణి, హారిక, వంబరెల్లికి చెందిన సుచిత్రలతో పాటు పలువురు మలేరియా జ్వరాలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఇటీవల అక్కడక్కడ చిరుజల్లులు కురవడం, దోమల సంతతి పెరగడం వంటి కారణాలతో మలేరి యా వ్యాపిస్తోంది. అలాగే మండే ఎండలకు వైరల్, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ విషయమై స్థానిక ఏరియా ఆస్పత్రి ఆర్ఎంవో డీవీ శ్రీనివాస్ వద్ద ప్రస్తావించగా జ్వరాలు వచ్చిన వారికి రక్త పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ అనంతరం వైద్యసేవలు అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుని పర్యటన రేపు విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం ఈ నెల 12న విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో పర్యటించనున్నారు. ఆ మేరకు వారి పర్యటన వివరాలను జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఇన్చార్జి డీడీ శ్రీనివాసాచారి వెల్లడించారు. -
16 కేజీల గంజాయి పట్టివేత
● జీఆర్పీ అదుపులో ఇద్దరు నిందితులువిజయనగరం క్రైమ్: విజయనగరం రైల్వే స్టేషన్‌లోని నాలుగో నంబర్ ఫ్లాట్‌ఫామ్‌పై 16 కేజీల గంజాయిని జీఆర్పీ సిబ్బంది సోమవారం పట్టుకున్నారు. ఈ మేరకు కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాకు చెందిన సంజయ్ కించప్ప, చంద్రప్పలను అరెస్ట్ చేశామని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపారు. ఆర్పీఎఫ్ ఎస్సై శ్రీధర్ ఆధ్వర్యంలో సిబ్బంది రైల్వేస్టేషన్లో ఆకస్మికంగా తనిఖీ చేస్తుండగా ఈ ఇద్దరూ కనిపించడంతో ప్రశ్నించగా తడబడుతూ సమాధానం చెప్పారని దీంతో వారి వద్ద ఉన్న బ్యాగ్ లను తనిఖీ చేస్తే గుట్టు రట్టయిందన్నారు. ఒడిశాలోని టికిరి నుంచి శివమొగ్గకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి విశాఖ రైల్వే కోర్టుకు తరలించామన్నారు. -
జనగణనలో అగ్రస్థానం
పార్వతీపురం: జనగణనలో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి తెలిపారు. సోమవారం జనాభా గణన అవగాహన ప్రచార రథాన్ని కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ 15శాతం పూర్తయి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందన్నా రు. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రజలు నాటు వైద్యానికి దూరంగా ఉండి ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, వివిధ శాఖల అధికా రులు పాల్గొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ పురోగతి గర్వకారణం శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ సాధించిన విజ యాలు ఎంతో గర్వకారణమని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్లో అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1998 మే 11న జరిగిన పో ఖ్రాన్–2 అణుపరీక్షల విజయాన్ని స్మరించుకుంటూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంచుకుని నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్ఓ కె.హేమలత, ఎస్డీసీ దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఇక్కడే.. డబుల్ గేమ్ మొదలు
అప్పటికే ఆ స్థలంపై కన్నేసిన నియోజకవర్గ ముఖ్య నేత డబుల్ గేమ్ మొదలు పెట్టారు. కార్యాలయ నిర్మాణం కోసమని ఓ వైపు హడావుడి చేస్తూనే.. తెర వెనుక వెన్నుపోటు సిద్ధం చేశారు. కొంతమందిని రెచ్చగొట్టి, కథ నడిపించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు తేజోవతిని కార్నర్ చేశారు. ఇందుకోసం ఆమె అంటే పొసగని మరో ముఖ్య నేత సహకారం తీసుకున్నట్టు ఆ పార్టీ వర్గాల్లోనే చర్చసాగుతోంది. ఈ నెల ఏడో తేదీన స్థానికులు న్యాయస్థానం నుంచి స్టేటస్ కో ఉత్తర్వులు తెప్పించుకున్నారు. 1.61 సెంట్లు భూమిని దాదాపు 70 సంవత్సరాలుగా తాము సాగు చేసుకుంటున్నామని తాడ్డి మహాలక్ష్మి, రెడ్డి సీత చెబుతున్నారు. ఆ స్థలంలో హెచ్చరిక బోర్డు పాతారు. దీని అంతటి వెనుక ఆ ముఖ్యనేత ఉన్నారని తేజోవతి వర్గం బహి రంగంగానే చెబుతుండడం గమనార్హం. ఇదే విషయా న్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీని ఇరకాటంలోకి లాగడం ఎంతవరకు సమంజసమని వాదిస్తున్నారు. డబుల్ గేమ్ ఆడుతున్న ముఖ్యనే త.. తప్పంతా అధికారుల మీద నెట్టే ప్రయత్నం చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. -
ఇచ్ఛాపురం టు హిందూపురం రథయాత్ర
● కోటి సంతకాల సేకరణ ● అక్రమ గోరవాణా అరికట్టాలి ● కలెక్టరేట్లో వినతిపత్రం అందజేతపార్వతీపురం రూరల్: జాతీయ ప్రాణిగా గోవును ప్రకటించాలని కోరుతూ కోటి సంతకాల సేకరణ లక్ష్యంతో ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు ఆరు నెలల పాటు ’గోరక్షా రథయాత్ర’ నిర్వహిస్తున్నట్లు ధర్మో రక్షతి రక్షితః ఫౌండేషన్, దళిత సేన ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు తెలిపారు. అలాగే జిల్లాలో అక్రమ గోరవాణా, గోవధను అరికట్టేందుకు జంతు హింస నివారణ సంఘం (ఎస్పీసీఏ) ద్వారా పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్పీసీఏ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించి అధికారులను అప్రమత్తం చేయాలని విన్నవించారు. కమిటీలోని సభ్యుల వివరాలను నోటీసు బోర్డులో ప్రదర్శించడంతో పాటు, అక్రమ గో వధశాలలపై ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను నియమించాలని కోరారు. పశువుల సంతల వద్ద గోవధ నిరోధక చట్టాలపై అవగాహన బోర్డులు ఏర్పాటు చేయాలని విన్నవించారు. రసాయన ఉత్పత్తుల వాడకంతో ప్రజారోగ్యం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బూసిం వై.వి.సత్యనారాయణ, మట్టికొయ్య పోతురాజు తదితరులు పాల్గొన్నారు. -
శ్రమ ఒకరిది..సొమ్ము మరొకరిదా?
పార్వతీపురం రూరల్: రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదల కష్టాన్ని కొందరు అక్రమార్కులు అధికారుల అండతో కాజేశారని, విచారణలో వాస్తవాలు తేలినా తమకు న్యాయం జరగలేదని బలిజిపేట మండలం పెదపెంకి గ్రామ దళిత లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ ఫిర్యాదు చేసిన అనంతరం బాధితులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మథరావు, గ్రామపెద్దలు శ్రీనివాసరావు, నగిరి పాపారావు మాట్లాడుతూ.. 2022–23 ఆర్థిక సంవత్సరంలో జగనన్న ఇళ్లు నిర్మించుకున్న సుమారు 40 మంది దళిత కుటుంబాలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన రూ. 24.80 లక్షల ఎర్త్ వర్క్ నిధులు ఇప్పటికీ చెల్లించలేదన్నారు. అధికా రులను ప్రలోభపెట్టిన కొందరు వ్యక్తులు, లబ్ధిదారుల ప్రమేయం లేకుండానే ఆ నిధులను తమ సొంత ఖాతాలకు మళ్లించి డ్రా చేసుకున్నారని ఆరోపించారు. గతంలోనే దీనిపై ఫిర్యాదు చేయగా, విచారణ జరిపిన ఉన్నతాధికారులు బాధ్యులైన టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. అక్రమం జరిగిందని తేలి, అధికారులపై చర్యలు తీసుకున్నప్పటికీ, బాధితుల కు అందాల్సిన సొమ్ముపై మాత్రం స్పష్టత ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. తక్షణమే నిధులు విడుదల చేసి లబ్ధిదారులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బాధిత కుటుంబసభ్యులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
ఉత్సాహంగా అండర్–15 చదరంగం పోటీలు
చీపురుపల్లి: జిల్లాస్థాయి అండర్ 15 చదరంగం పోటీలు ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగాయి. చీపురుపల్లి పట్టణంలోని శ్రీనివాస జూనియర్ కళాశాలలో సోమవారం అండర్ 15 జిల్లాస్థాయి చదరంగం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి బాలబాలికలు హాజరై పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో బాలుర విభాగం నుంచి నలుగురు, బాలికల విభాగం నుంచి నలుగురు చొప్పున రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు నిర్వాహకులు ఏపీవీఎన్ఎస్. మూర్తి తెలిపారు. ఈ పోటీలకు చీఫ్ ఆర్బిటర్‌గా ఏడీఎన్‌ఎస్వీ ప్రసాద్ వ్యవహరించారు. పోటీల్లో పాల్గొన్న బాలబాలికలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ంది వీరే జిల్లా స్థాయిలో జరిగిన అండర్ 15 చదరంగం పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర పోటీలకు ఎనిమిది మంది ఎంపికయ్యారు. బాలుర విభాగంలో.. ఎస్వీజీ.కృష్ణ మనోహర్ (విజయనగరం) ఆర్.ప్రేమ్ కుమార్ (నెల్లిమర్ల) ఎం. ఓంకార్ (సారిక) అనురాగ్ విశ్వాస్(విజయనగరం) బాలికల విభాగంలో.. కె. నితీష (విజయనగరం) ఆర్.వెంకట మాధవి మోక్షిత (విజయనగరం) ఎ. శ్రీనిధి (చింతపల్లి పేట) కె. కోమల దీప్తి (చీపురుపల్లి) ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికై న వారికి సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.శంకరరావు, ఎస్సై దామోదర్ చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. -
ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు భర్తీచేయాలి
విజయనగరం టౌన్: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీచేయాలని, పరిశ్రమలు స్థాపించాలని, భోగాపురం ఎయిర్ పోర్ట్‌లో 90శాతం ఉద్యోగాలు స్థానిక యువతకు కేటాయించాలని కలెక్టర్‌ను కోరుతూ సోమవారం గ్రీవెన్స్‌సెల్‌లో జిల్లా బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల ఐక్యవేదిక నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు చోడి ఆదినారాయణ, ఇప్పిలి రామారావు, బూర ఐశ్వర్యలు మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామికీకరణ చేయడానికి ఎమ్ఎస్ఎమ్ఈ పథకాన్ని తీసుకువచ్చి భూసమీకరణ చేశారని, ఆ భూములను అభివృద్ధి చేసి పారిశ్రామికీకరణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయాధారిత పరిశ్రమలైన జీడి, మామిడి, కొబ్బరి, మత్స్య, కల్లు పరిశ్రమలను అభివృద్ధి చేయాలని కోరారు. గుర్ల మండలంలోని కెల్ల గ్రామంలో 1085 ఎకరాలలో రూ.8570 కోట్లతో భారీ స్టీల్ ఫ్యాక్టరీని పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, వెంటనే స్టీల్ ప్యాక్టరీ నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు దిమిలి పైడిరాజు, లాయర్ షాజహాన్ తదితరులు పాల్గొన్నారు. -
గడువులోగా అర్జీలు పరిష్కరించండి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశాలువిజయనగరం ఫోర్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు అందజేసిన వినతులకు గడువు లోగా పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లోని సమావేశ భవనంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్‌తో కలిసి కలెక్టర్ వినతులు స్వీకరించారు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిర్యాదులు రీఓపెన్ కావడానికి వీల్లేదని, ఒకవేళ అలా జరిగితే సంబంధిత అధికారి తప్పకుండా క్షేత స్థాయి పర్యటన చేసి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్కు 172 వినతులు రాగా వాటిలో రెవెన్యూశాఖకు 85, మున్సిపాల్టీ 9, జిల్లా పంచాయతీకి 17, డీఆర్డీఏ 15, విద్యుత్‌శాఖకు 2, గ్రామ/వార్డు సచివాలయాలకు 5, విద్యాశాఖ 6, వైద్యశాఖ 2, గృహనిర్మాణశాఖ 1, ఇతర శాఖలకు 30 వచ్చాయి. ఎస్పీ పీజీఆర్ఎస్కు 33 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యకామాన్ని ఎస్పీ తన చాంబర్లో సోమవారం నిర్వహించి మొత్తం 33 ఫిర్యాదులు స్వీకరించారు. అందులో భూతగాదాలకు సంబంధించి 7, కుటుంబ కలహాలకు సంబంధించి 6, చీటింగ్‌కు సంబంధించి 1, ఇతర అంశాలకు సంబంధించి 19 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ దామోదర్ తెలిపారు. సంబంధిత అధికారులు ఫిర్యాదు అంశాలను పరిశీలించి వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాల్లో వాస్తవాలను గుర్తించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీసీఆర్బీ సీఐ కె.కుమారస్వామి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఎస్సైలు రాజేష్, ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం పార్వతీపురం: ప్రజల నుంచి వచ్చిన సమస్యలను నిర్ణేత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ కె. హేమలత, ఎస్డీసీ దిలీప్ చక్రవర్తితో కలిసి కలెక్టర్ 74 వినతులు స్వీకరించారు. అర్జీల్లో రెవెన్యూకు సంబంధించి 14, 60 సాధారణ వినతులు ఉన్నాయన్నారు. ప్రతి అర్జీని సానుభూతితో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. -
తాటిచెట్టు మీద నుంచి పడి వ్యక్తికి తీవ్ర గాయాలు
రామభద్రపురం: మండలంలోని బూసాయవలసలో సోమవారం తాటిచెట్టు మీద నుంచి పడిపోయిన ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై క్షతగాత్రుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన జాగరణ వెంకటేష్ పూసపాటిరేగలోని దివిస్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు.సెలవులకు గ్రామానికి వచ్చి స్నేహితులతో కలిసి తాటికాయలు కొట్టడానికి వెళ్లి తాటిచెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు అక్కడి నుంచి జారిపడ్డాడు. దీంతో వెంకటేష్‌కు కాలు, చేయి విరిగిపోవడంతో తీవ్రగాయాల పాలయ్యాడు. వెంటనే కుటుంబసభ్యులు ప్రథమ చికిత్స నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి తీసుకువెళ్లి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీ ఢీకొని తీవ్రగాయాలు తెర్లాం: మోటార్ సైకిల్‌ను లారీ ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తెర్లాం మండలంలోని కూనాయవలస వద్ద సోమవారం రామభద్రపురం నుంచి రాజాం వైపు వస్తున్న లారీ ఓ మోటార్ సైకిల్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ నడుపుతున్న బాడంగి మండలం వాడాడ గ్రామానికి చెందిన గొట్టాపు శ్రీనివాసరావుకు తలపై, కాలిపైన తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు తెర్లాం 108కు సమాచారం ఇవ్వడంతో వెంటనే వాహనం వచ్చి గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స చేసి బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స చేసి మెరుగైన వైద్య సేవల కోసం విజయనగరం సర్వజన ఆస్పత్రికి రిఫర్ చేశారు. గాయపడిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్సై సాగర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అధికారులపై ఎమ్మెల్యే చిందులు
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే విజయ్ చంద్ర మరోసారి అధికారులపై అక్కసు వెళ్లగక్కారు. తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. రెండు రోజుల కిందట ‘గాడిదలు కాస్తున్నారా?’ అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించిన ఆయన.. సోమవారం కామన్ సెన్స్ లేదా? అంటూ వ్యాఖ్యలు చేయడం మరింత వివాదం అయ్యింది. అధికారులతో జిల్లాలో ఎవరికీ లేని సమస్య ఆయనకే ఎందుకు వస్తుంది? కలెక్టర్, రెవెన్యూ యంత్రాంగం మీద వరుసగా మాటల దాడి వెనుక మర్మమేమిటి? ఇప్పుడు ఇవే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. వాస్తవాలను దాచేసి.. వాస్తవానికి జిల్లా టీడీపీ కార్యాలయం స్థల వివా దం మొత్తం ఎమ్మెల్యేకు తెలుసు. అన్నీ తెలిసి కూడా కేబినెట్ భేటీలో అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేయలేదన్నది ప్రశ్న. 2002 నాటి వివాదాన్ని ఇప్పుడు తెర మీదకు తేవడం వెనుక బలమైన కారణం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొద్ది రోజులుగా ఈ అంశం నలుగుతున్నా బాధితుల తరఫున ఎవరూ సబ్ కలెక్టర్ వద్ద అప్పీలు చేయలేదు. ఈ స్థలం విషయంలో అధికారిక ఉత్తర్వులు కూడా ఎక్కడా ఇవ్వలేదు. ముందుగా ఆపే ప్రయత్నం చేయకుండా.. చివరి నిమిషంలో అధికారుల మీద నెపం నెట్టడం వెనుక మరో కారణం ఉండొచ్చని అధికారులు అంటున్నారు. తమ అక్రమాలకు అధికారులు సాయపడటం లేదన్న అక్కసుతో ఇలా నిప్పులు చెరుగుతున్నారన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొన్ని భూములకు సంబంధించి అధికారుల మీద ఆయన ఒత్తిడి చేసినట్టు సమాచారం. మున్సిపాలిటీలో రూ.80 లక్షల బిల్లుకు సంబంధించి ప్రత్యేకాధికారిగా కలెక్టర్ సంతకం కోసం డిమాండ్ చేసినట్లు ప్రచారం ఉంది. చిరుద్యోగుల తొలగింపు, మహిళా తహసీ ల్దార్‌పై వేధింపులకు పాల్పడడం, వాటిని కప్పిపు చ్చుకునేందుకు తిరిగి పార్టీ కార్యకర్తలతో ధర్నా చే యించడం, అక్రమాలకు సహకరించని అధికారుల పై పనిచేయడంలేదన్న ముద్రవేసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బొనేల విజయ చంద్ర అధికారుల పట్ల అనుసరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు విమర్శించారు. పార్వతీపురం పట్టణంలోని సుందరయ్య భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు నిబంధనలకు లోబడి పనిచేస్తుంటే, వారిపై ఒత్తిడి తెచ్చి వ్యక్తిగత విమర్శలకు దిగడం అధికారులను బ్లాక్మెయిల్ చేయడమేనని ఆరోపించారు. పార్టీ కార్యాలయానికి భూమి కేటాయించలేదనే సాకుతో వివాదాస్పద స్థలాల వద్దకు వెళ్లి బౌండరీ రాళ్లు తొలగించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం ప్రజాప్రతినిధికి తగదని హితవు పలికారు. గతంలో ప్రభుత్వ భూములను పార్టీ కార్యాలయాలకు వాడుకోవడాన్ని విమర్శించిన వారు, ఇప్పుడు అదే బాటలో నడవడం సరికాదన్నారు. పార్టీ కార్యాలయం కోసం ప్రైవేటు స్థలాలు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కా ర్యవర్గ సభ్యులు కె.రామస్వామి పాల్గొన్నారు. -
నిర్లక్ష్యపు నీడలో గ్రంథాలయాలు
● సమ్మర్ క్యాంప్‌ల చెల్లింపుల్లేవు ● 5నెలలుగా అందని వేతనాలు, ● చెల్లించని బిల్లులు శృంగవరపుకోట: సమాజానికి విజ్ఞానాన్ని పంచి, జ్ఞానాన్ని, సంస్కారాన్ని అందించే భాండాగారాలు గ్రంథాలయాలు. అటువంటి గ్రంథాలయాలు నేడు వేతనాలు రాక, పేపర్ బిల్లులు అందక, కరెంటు బిల్స్ కట్టలేక, అద్దెలు చెల్లించక, స్వీపర్లకు చెల్లింపులు చేయక, వాటర్బిల్లులు ఇచ్చే నాథులు లేక అవస్థలతో అల్లాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న లైబ్రరీలు, బుక్డిపోలు నిర్లక్ష్యపు నీడన కొట్టుమిట్టాడుతున్నాయి. వేతనాల్లేక లైబ్రేరియన్లు అవస్థలు పడుతున్న తరుణంలో కంటింజెన్స్ బిల్లులు రాక నిర్వహణ కోసం నీళ్లు నములుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఒక గ్రేడ్–1 లైబ్రరీ, 4 గ్రేడ్–2 లైబ్రరీలు, 38గ్రేడ్–3 లైబ్రరీలు, 3గ్రామ గ్రంథాలయాలు ఉన్నాయి. వాటితో పాటు 80 బీడీసీ (బుక్‌డిపో సెంటర్లు)లు సేవలందిస్తున్నాయి. ప్రస్తుతం ఐదు నెలలుగా ప్రభుత్వం నుంచి బిల్లులు అందక గ్రంథాలయాలు నిర్లక్ష్యపు నీడన కొట్టుమిట్టాడుతున్నాయి. ఐదు నెలలుగా అవస్థలు ప్రభుత్వం గత ఐదు నెలలుగా గ్రంథాలయాల ఊసెత్తలేదు. గత ఏడాది నిర్వహించిన సమ్మర్‌క్యాంప్‌కు చెల్లించాల్సిన రూ.15వేలు ఇంత వరకూ చెల్లించలేదు. ఈ ఏడాది సమ్మర్క్యాంప్లకు ఇంకా ఒక్క పైసా విదల్చకుండానే నిర్వహణ భారాన్ని లైబ్రేరియన్ల నెత్తిన మోపారు. ఐదు నెలలుగా ల్రైబేరియన్లకు వేతనాలు లేవు. పేపర్ బిల్లులు, విద్యుత్ బిల్లులు, అద్దెలు, స్వీపర్ల వేతనాలు, వాటర్ బిల్లులు ఏమీ చెల్లించలేదు. దీంతో వేతనాలు లేక, బిల్లులు రాక లైబ్రరీల నిర్వహణ కోసం లైబ్రేరియన్లు అవస్థలు పడుతున్నారు. అధ్వాన స్థితిలో బీడీసీలు జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో సుమారు 80 బుక్ డిపో సెంటర్లు నడుస్తున్నాయి. బీడీసీల నిర్వాహకులకు నెలకు రూ.3000 చొప్పున గౌరవవేతనం, పత్రికల కోసం రూ.500లు ప్రభుత్వం చెల్లిస్తుండగా, గత ఐదు నెలలుగా బీడీసీల ఊసెత్తలేదు. దీంతో గ్రామాల్లో బీడీసీల నిర్వాహకులు దిక్కుతోచని ిస్థితిలో ఉన్నారు.ప్రయత్నం చేస్తున్నాం గత ఐదు నెలలుగా వేతనాలు, బిల్లులు చెల్లించాల్సి ఉంది. బీడీసీలకు చెల్లింపులు చేయాలి. పంచాయతీలు వసూలు చేస్తున్న లైబ్రరీ సెస్సు అందక ఇబ్బందులు ఉన్నాయి. పంచాయతీల నుంచి సెస్సు వసూలు కోసం మున్సిపాలిటీ, పంచాయతీ కార్యాలయాలకు వెళ్తున్నాం. కలెక్టర్ దృష్టికి సమస్య తీసుకెళ్లాం. వీలైనంత త్వరగా చెల్లింపులు చేసే ప్రయత్నం చేస్తున్నాం. – బి.లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి -
‘పచ్చ’దళంలో.. కార్యాలయం రచ్చ!
సాక్షి, పార్వతీపురం మన్యం: తెలుగుదేశం పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా కార్యాలయం స్థలం చుట్టూ వివాదం రేగుతోంది. పార్టీలో అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలు మరో స్థాయికి చేరాయి. ఈ వివాదాలతోనే భవన నిర్మా ణం కోసం సోమవారం జరగాల్సిన భూమిపూజ కూడా నిలిచిపోవడం గమనార్హం. జిల్లా యంత్రాంగాన్ని ఇందులో ఇరికించే ప్రయత్నం చేయడం కొసమెరుపు. పార్వతీపురం పరిధి సుందర నారాయణపురం రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 619–1లో సుమారు 2.23 ఎకరాల విస్తీర్ణం స్థలం ఉంది. దీనిపై అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ ముఖ్యనేత కన్ను పడింది. రూ.కోట్ల విలువచేసే ఈ స్థలాన్ని తన అనుచరుల పేరిట పట్టాలు చేయించి, స్వాధీనం చేసుకోవాలని తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారు. వాస్తవానికి ఈ స్థలం వివాదంలో ఉంది. చాలా కాలంగా తాము సాగు చేసుకుంటున్నామని కొంత మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రెవెన్యూ రికార్డుల్లో అది ప్రభుత్వ భూమిగానే ఉంది. వివాదంలో ఉన్నప్పటికీ.. సదరు నేత అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో రెవెన్యూ యంత్రాంగం నుంచి సహకారం కరువైంది. దీంతో గత పార్వతీపురం తహసీల్దార్‌ను ఇక్కడ నుంచి బదిలీ చేసేయాలని జిల్లా యంత్రాంగం మెడపై సదరు ముఖ్యనేత కత్తి పెట్టారు. అందులో భాగంగానే అప్పటి తహసీల్దార్ సురేష్‌ను సాలూరు బదిలీ చేశారు. ఇప్పటికీ ఆ స్థలం కోసం ఆయన పట్టు వీడలేదు. ప్రయత్నం ఆపలేదు. ఈ వివాదం నడుస్తుండగానే.. మరో టీడీపీ నేత కూడా అదే స్థలంపై కన్నేశారు. ఆ స్థలంలో ఉన్నవారికి కొంత మొత్తం ఇచ్చి, స్వాధీనానికి ప్రయత్నం చేశారు. అప్పటికే నియోజకవర్గ కీలక నేత స్కెచ్ ఉండడంతో సఫలీకృతం కాలేదని సమాచారం. ఇదే సమయంలో టీడీపీ అరకు పార్లమెంటు అధ్యక్షురా లు తేజోవతి.. పార్టీ జిల్లా కార్యాలయం కోసం స్థ లం ఇప్పించాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు మూడు, నాలుగు చోట్ల అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను చూపించారు. అందులో సర్వే నంబర్ 619–1 స్థలం కూడా ఒకటి. ఇదే స్థలాన్ని తేజోవతి కోరుకున్నారు. వివాదాలు ఉంటే పరిష్కారం అవుతాయని ఆశించారు. కేబినె ట్ భేటీలో కూడా అంగీకారం తీసుకున్నారు. దీనిపై అధికారికంగా ఎటువంటి జీవో కూడా రాలేదు. అయినప్పటికీ, కార్యాలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేసేసుకున్నారు. సోమవారం శంకుస్థాపన పెట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వివాదంలో ఉండటమే కారణమని ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. -
రూ.10 పెంపుతో మందుబాబులపై నెలకు పడే భారం రూ.50 లక్షలు
గజపతినగరం సర్కిల్ పరిధిలోని నెలకు జరిగే మద్యం వ్యాపారం సుమారు రూ.9 కోట్ల నుంచి రూ.10కోట్లు సాక్షిప్రతినిధి, విజయనగరం: జిల్లాలోని గజపతినగ రం నియోజకవర్గంలో లిక్కర్ దందా సాగుతోంది. అక్రమ వ్యాపారానికి ప్రత్యేక కౌంటర్ తెరిచారు. ఇన్నాళ్లూ నకిలీ మద్యం మాత్రమే ఉందని మందుబాబులు భావించేవారు. ఇప్పుడు గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) ఉల్లంఘనకు తెరతీయడంతో ఆందోళ న చెందుతున్నారు. లిక్కర్ షాపులను ప్రధాన వనరుగా మార్చుకున్న ‘పెద్దలు’ ఒక్కో క్వార్టర్ మీద రూ.10, బీరుపై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రీమియం క్వాలిటీ బ్రాండెడ్ మద్యం ఫుల్‌బాటిల్ మీద రూ.50 వరకు అదనపు భారం వేస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే ఎండకాలం చల్లగా బీర్లు ఉండాలంటే రూ.10 ఇవ్వాలి బ్రదర్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ మందుబాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. మంత్రి ఇలాకాలో అంతేమరి... గజపతినగరం నియోజకవర్గంలోని దత్తిరాజేరు, బొండపల్లి, గంట్యాడ, గజపతినగరం మండలాల్లో మొత్తం 17 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇవి లాటరీలో ఎవరికీ దక్కినప్పటికీ వాటిని సిండికేట్ రూపంలోకి మార్చి ఆ సిండికేటును టీడీపీ నాయకు లే నడిపిస్తున్నారు. ఎమ్మార్పీ ధరలకు అమ్ముతుంటే తమకు అనుకున్న లాభాలు రావడం లేదని... ఇలాగైతే మద్యం షాపు దక్కించుకుని ప్రయోజనం ఏముందని భావించిన వాళ్లంతా మంత్రి వద్ద తమగోడు వెళ్లబోసుకోగా... ఎమ్మార్పీ ధరలకు మించి అమ్ముకునేందుకు మంత్రితోపాటు, మాజీ ఎంపీపీ కొండబాబు కూడామద్దతు ఇచ్చినట్టు సమాచారం. దీంతో ప్రతిసీసా మీద ఎమ్మార్పీ కంటే రూ.10 అదనంగా వేసి అమ్మకాలు సాగిస్తున్నారు. దీనిపై కొందరు మందుబాబులు వాగ్వాదం చేస్తున్నా... అదనపు వడ్డన మానడం లేదు. అంతా ఓ మాజీ జెడ్పీటీసీ కనుసన్నల్లోనే... ఈ మద్యం సిండికేటు ఏర్పాటు... వారి మధ్య ఏర్పడే చిక్కులు... వాటాల పంపకం.. తదితర బాధ్యతలన్నీ ఓ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చూస్తున్నారు. పోనీ ఇంత పెద్దరికం చేస్తున్నందుకు మీ గురువుకు ఏమైనా కాణి పరకా మిగులుతుందా అంటే అబ్బే అదేం లేదు. మావాడిది అంతా పైసారాని దండాసి చాకిరీ అని ఆయన అనుచరులు సైటెర్లు వేసుకుంటున్నారు. ధరల పెంపు ద్వారా సమకూరుతున్న అదనపు ఆదాయంలో సగం నాయకుడికి... మిగతా సగం వ్యాపారులు... ఎకై ్సజ్ వాళ్లకు సర్దుబాటు చేస్తున్నట్లు చెబుతున్నారు. మామ్మూళ్ల ‘మత్తు’... వాస్తవానికి అక్రమాలు ఎక్కడ జరిగితే అక్కడే అధికారులకు పని ఉంటుంది. అక్కడే వాళ్ల పవర్ చూపుతారు. ఇప్పుడు లిక్కర్ షాపుల వాళ్లు రేట్లు పెంచి అమ్ముతుండడంతో ఎకై ్సజ్ అధికారులు కొందరు మా సంగతి ఏమిటి? రైడ్స్ చేయాలా ఏంది అంటూ కన్నుగీటుతున్నారు. వచ్చిన పది రూపాయల్లో మంత్రి ఖాతాలోకి కొంత... సిండికేట్‌కు కొంత.. పోలీసులు.. ఎకై ్సజ్ వాళ్లకు కొంత ఇచ్చుకుంటూ వస్తున్నామని మద్యం వ్యాపారులే బహిరంగంగా చెబుతున్నారు. ప్రతినెలా గజపతినగరం నియోజకవర్గంలో సుమారు రూ.9 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ధరలు పెంచడంతో నెలకు రూ.50లక్షల వరకు మందు బాబులపై పడుతోంది. అ‘ధన’పు వసూళ్లు అన్నీ వాటాలుగా పంచుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ మద్యం అమ్మకాలను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా అధి క ధరలకు మద్యం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. – బి.శ్రీనాథుడు, అబ్కారీ శాఖ సూపరింటెండెంట్ క్వార్టర్, బీర్‌పై రూ.10 పెంపు గజపతినగరంలో ఎమ్మార్పీ ధరకు పాతర జిల్లాలో ఎక్కడాలేని విధంగా అదనపు వసూళ్లు పేషీకి నెలకు రూ.లక్షల్లో మామూళ్లు మందుబాబుల గగ్గోలు -
జీడికి దక్కని మద్దతు ధర..!
గుమ్మలక్ష్మీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన రైతులు పెద్ద సంఖ్యలో జీడిమామిడి తోటలు సాగు చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 64,935 ఎకరాల్లో జీడిమామిడి సాగవుతుంది. ఒక్క కురుపాం నియోజకవర్గంలోనే 42,500 ఎకరాల్లో జీడిమామిడి సాగవుతోంది. వీటి దిగుబడులైన జీడిపిక్కలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం, సమీపంలో మార్కెట్ సదుపాయం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులను రైతులు ఆశ్రయిస్తూ మోసపోతున్నారు. మోసపోతున్నామని తెలిసినా విక్రయించక తప్పని పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు వాతావరణ పరిస్థితులు కూడా కలసిరాకపోవడంతో అనుకున్న స్థాయిలో దిగుబడులు రాకపోవడం, వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో గిరిజన రైతులు ప్రతి ఏటా తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో వీటి ధరను ప్రైవేటు వ్యాపారులే సిండికేట్ అయి నిర్ణయిస్తున్నారు. గిరిజన రైతులను మోసపుచ్చుతున్నారు. గడిచిన మార్చి, ఏప్రిల్ నెలలో కిలో జీడిపిక్కలు రూ.160లుగా నిర్ణయించి, ప్రస్తుతం ధర పడిపోయిందంటూ కిలో రూ.140లుగా నిర్ణయించి దోచుకుంటున్నారు. గిరిజన రైతులను దళారులు, ప్రైవేటు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి నిలువునా దోచుకుంటున్నా... పాలకులుగాని, అధికారులుగాని పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరుగా జీడిమామిడి ఉంది. వాణిజ్య పంట అయిన జీడిమామిడికి గిట్టుబాటు ధర చెల్లించకపోవడం, గిరిజనుల పేరిట పుట్టుకొచ్చిన ఐటీడీఏ, జీసీసీలు దృష్టి పెట్టకపోవడంపై వారు ఆవేదన చెందుతున్నారు. మన్యంలో గిరిజన శాసనసభ్యులున్నా తమకు ప్రయోజనం లేకపోతుందని రైతులు వాపోతున్నారు. రూ.200 చెల్లించాలి పార్వతీపురం మన్యం జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సీతంపేట తదితర మండలాల్లో గిరిజన రైతులు విస్తారంగా జీడిమామిడి తోటలు సాగు చేస్తున్నారు. జీడిపిక్కలకు మద్దతు ధర ప్రకటించకపోవడం, ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో నష్టపోతున్నామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మన్యంలోని గిరిజన శాసనసభ్యులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లాలని కోరుతున్నారు. జీడిమామిడి పిక్కలకు కిలో కనీస మద్దతు ధర రూ.200లు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జీడి రైతులు కోరుతున్నారు. మన్యం జిల్లాలో గిరిజన రైతులు వేలకొద్ది ఎకరాల్లో ప్రధాన ఆదాయ వనరుగా జీడిమామిడి పండిస్తున్నారు. వాణిజ్య పంట అయినప్పటికీ మద్దతు ధర కల్పించడంలో.. కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఇది సాగు రైతులను తీవ్రంగా నష్టం చేస్తుంది. ప్రైవేటు వ్యాపారులకు జీడిపిక్కలను విక్రయించాల్సిన పరిస్థితులను ప్రభుత్వమే పరోక్షంగా కల్పిస్తోంది. ఇది ఎంతమాత్రం సరికాదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జీడి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలి. – అడ్డాకుల చిన్నారావు, కురుపాం జీడి పిక్కలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారులకు విక్రయించాల్సి వస్తోంది. వ్యాపారులు రోజు రోజుకు ధరను తగ్గిస్తూ కొనుగోలు చేస్తున్నారు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నాం. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో వారికే అమ్ముకుంటున్నాం. – మూటక మిన్నారావు, రైతు,మూలజమ్ము గ్రామం -
హనుమాన్ జయంత్యుత్సవం రేపు
విజయనగరం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం రామనారాయణంలో ఈ నెల 12న హనుమాన్ జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు ఎన్సీఎస్ ట్రస్టీ నారాయణం శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా రామనారాయణ ప్రాంగణంలో హనుమాన్ జయంత్యుత్సవాల ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంగళవారం ఉదయం 6 గంటలకు పంచామృత అభిషేకం, స్నపనం నిర్వహించనున్నట్టు తెలిపారు. 8 గంటలకు లక్ష తమలపాకులు, సింధూరంతో సహస్ర నామార్చనలు, హనుమాన్ చాలీసా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటలకు 60 అడుగుల అభయాంజనేయ స్వామికి మహా హారతి, లేజర్ షో కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
సాగర తీరాన..సందడి..!
● ఆలివ్ రిడ్లేలకు అభయంగా విజయనగరం తీరం ● తీరం చేరిన అరుదైన తాబేళ్లు ● వందల కిలోమీటర్లు దాటి వచ్చి గూళ్లు కడుతున్న పర్యావరణ మిత్రులు ● 10 హేచరీస్‌ల ద్వారా 52 వేల గుడ్ల సంరక్షణ ● సముద్రంలోకి 41 వేల తాబేళ్ల పిల్లల విడుదల ● మత్స్యకారుల తోడ్పాటు.. అటవీ శాఖ అప్రమత్తత ● సంరక్షణకు అటవీ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు ● మత్స్యకారుల్లో అటవీ శాఖ అవగాహన కార్యక్రమాలు విజయనగరం గంటస్తంభం: అవి పర్యావరణ రాయబారులు.. సముద్రపు ఆరోగ్యాన్ని చాటిచెప్పే సంకేతాలు. ప్రకృతి సమతుల్యానికి ప్రతీకలైన ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణలో విజయనగరం జిల్లా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. సముద్ర తీరాన్ని ఆశ్రయించి సంతానోత్పత్తి కోసం వచ్చే ఈ అరుదైన తాబేళ్లను రక్షించేందుకు అటవీ శాఖ విస్తృత చర్యలు చేపట్టింది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో తీర ప్రాంతాల్లో హేచరీలు ఏర్పాటు చేసి గుడ్లను భద్రపరుస్తూ, పిల్లలుగా పొదిగిన అనంతరం తిరిగి సముద్రంలోకి విడిచిపెడుతోంది. 2025–26 సీజన్లో ఇప్పటివరకు జిల్లాలో 52 వేల తాబేళ్ల గుడ్లను సేకరించగా, వాటిలో 41 వేల పిల్లలను విజయవంతంగా సముద్రంలోకి విడుదల చేశారు. మిగిలిన గుడ్లును కూడా ప్రత్యేక సంరక్షణలో ఉంచి పిల్లలుగా మారిన వెంటనే సముద్రంలో విడిచిపెట్టేందుకు అధికారులుచర్యలు చేపడుతున్నారు. పర్యావరణ హితులైన ఆలివ్ రిడ్లేలు ఆలివ్ రిడ్లే తాబేళ్లు సముద్ర జీవ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి కనిపించే ప్రాంతాలు కాలుష్యం తక్కువగా ఉండే పర్యావరణ హిత ప్రాంతాలుగా గుర్తింపు పొందుతాయి. గుజరాత్ నుంచి ఒడిశా వరకు భారత తీర ప్రాంతాల్లో ఇవి సంచరిస్తూ సంతతి వృద్ధి కోసం ప్రశాంతమైన తీరాలను ఎంపిక చేసుకుంటాయి. అలల తీవ్రత తక్కువగా ఉండే, మానవ కదలికలు తగ్గిన ప్రాంతాల్లో గూళ్లు కట్టి ఒక్కో తల్లి తాబేలు 100 నుంచి 130 వరకు గుడ్లు పెడుతుంది. పది హేచరీస్లతో సంరక్షణ కవచం జిల్లాలోని బొడ్డుగుయ్యపేట, తిప్పలవలసల్లో రెండేసి చొప్పున, చేపలకంచేరు, ముక్కాం, చోడిపల్లిపేట, పులిగెడ్డపాలెం, బర్రిపేట, చింతపల్లి ప్రాంతాల్లో ఒక్కో హేచరీస్ ఏర్పాటు చేశారు. మొత్తం పది హేచరీల్లో ప్రస్తుతం 246 గూళ్లను భద్రపరిచి సంరక్షిస్తున్నారు. హేచరీస్‌ల వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించి గుడ్ల సంరక్షణతో పాటు పిల్లలు బయటకు వచ్చిన వెంటనే సముద్రంలోకి విడిచిపెట్టే ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం 25 మంది సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు. మత్స్యకారుల్లో అవగాహన ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణలో మత్స్యకారుల పాత్ర కీలకమని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రమాదకరమైన వేట వలలు, గ్రిల్నెట్స్, టేకు వలలు వల్ల తాబేళ్లు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో తీర గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాబేళ్లు చిక్కుకున్నప్పుడు వెంటనే సముద్రంలో వదిలేయాలని సూచిస్తున్నారు. వలల మృత్యుపాశం.. టెడ్ వాడకం అనివార్యం సముద్రంలో చేపల వేట కోసం వాడే యాంత్రిక బోట్ల వలల్లో చిక్కుకుని ఏటా వందలాది తాబేళ్లు ప్రాణాలు కోల్పోతున్నాయి. శ్వాస తీసుకోవడానికి ఇవి పైకి రావాల్సి ఉంటుంది. కానీ వలల్లో చిక్కుకుపోవడం వల్ల ఊపిరాడక మృత్యువాత పడుతున్నాయి. దీనిని అరికట్టేందుకు టెడ్ పరికరాలను వలలకు అమర్చుకోవాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. -
మీ కోసం వెబ్సైట్లో అర్జీల నమోదు
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో(పీజీఆర్ఎస్) అర్జీల వివరాలు మీకోసం వెబ్సైట్లో నమోదు చేయవచ్చునని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతీ రోజు వినతులను స్వీకరించేందుకు ప్రత్యేక సెల్లార్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అర్జీదారులు మీకోసం ఏపి.జిఓవి.ఇన్ వెబ్సైట్లో అర్జీలను నమోదు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. అర్జీల స్థితిని 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో నీటిమట్టం గణనీ యంగా తగ్గింది. వేసవి కారణంగా వర్షపాతం తక్కువగా ఉండడంతో వేగావతి, సువర్ణముఖి నదుల్లో ఇన్‌ఫ్లోస్ భారీగా పడిపోయాయి. దీంతో ఆదివారం ప్రాజెక్టు వద్ద 62.47 మీటర్లు లెవెల్ నమోదైంది. వాస్తవంగా ప్రాజెక్టు అసలు నీటిమట్టం 65 మీటర్లు లెవెల్ ఉండగా దాదా పు 2.47 మీటర్లు మేర నీటి నిల్వ తగ్గింది. దీంతో ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో 3.37 టీఎంసీల కెసాసిటీ కలిగిన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 1.33 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే నమోదైంది. ప్రాజెక్టు అధికారులు ప్రణాళిక ప్రకారం జూన్ మొదటి వారంలో ఖరీఫ్ పంటల సాగుకు నీరు విడుదల చేయాల్సి ఉంది. అలా జరగాలంటే వరుణుడు కరుణించాల్సిందేనని రైతులు చెబుతున్నారు. నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న రామారావుకు పదోన్నతి లభించింది. ఆయనను గ్రేడ్–2 ఈఓగా నియమిస్తూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మాన్సాస్ సంస్థతో పాటు విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయంలో సుదీర్ఘ కాలం విధులు నిర్వర్తించారు. రామతీర్థం దేవాలయంలో మూడేళ్ల నుంచి సీనియర్ అసిస్టెంట్ హోదాలో సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఈఓగా పదోన్నతి లభించడంతో దేవస్థాన ఈఓ వై.శ్రీనివాసరావు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. విజయనగరం ఫోర్ట్ : అంగన్వాడీ హెల్పర్లకు తీవ్రంగా నష్టం చేసే జీఓ నంబరు 5ను వెంటనే రద్దు చేయాలని వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ఆదివారం ధర్నా చేశారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబరు 5 హెల్పర్ల పదోన్నతికి నష్టం చేసే విధంగా ఉందన్నారు. జీఓ నంబరు 2 ప్రకారం జిల్లాలో అంగన్వాడీ హెల్పర్లకు వెంటనే పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా కోశాధికారి జగన్మోహనరావు, జిల్లా కార్యదర్శి వెంకటేష్, యూనియన్ నాయకులు భారతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న బోడికొండపై అభయాంజనేయస్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాష్ట్ర సాధు పరిషత్ ఆధ్వర్యంలో కొండకు దిగువ భాగంలో ఏర్పాటు చేసిన పిల్లర్‌పై క్రేన్ సహకారంతో ఆదివారం విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సుమారు పదమూడున్నర అడుగుల ఎత్తు, రెండు టన్నుల బరువుతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. వచ్చే నెలలో విగ్రహానికి ప్రాణ ప్ర తిష్ఠ కార్యక్రమాలు జరిపిస్తామని నిర్వాహకు లు తెలిపారు. -
పైళ్లెంది.. విషాదం మిగిలింది..
వారిద్దరూ ఇంజినీరింగ్ విద్యనభ్యసిస్తున్నారు. ఒకరు శనివారం విజయనగరంలో జరిగిన స్నేహితుడి పెళ్లికి వెళ్లాడు. పెళ్లి అనంతరం మళ్లీ తమ రూమ్‌కు వచ్చేందుకు అట్నుంచి మరో స్నేహితుడితో కలిసి బైక్‌పై ఇద్దరూ వస్తున్నారు. ఇంతలోనే దారి కాచిన మృత్యువు వారిని అయినాడ జంక్షన్ వద్ద కాటేసింది. స్నేహితులతో సందడిగా.. సంతోషంగా అప్పటి వరకు గడిపిన వారిద్దరూ ఇంతలోనే మృత్యువు పాలవడంతో ఇటు కుటుంబాల్లోనూ... అటు స్నేహితుల్లోనూ తీవ్ర విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళ్తే... డెంకాడ/మక్కువ/సీతానగరం: డెంకాడ మండలంలోని అయినాడ జంక్షన్ వద్ద శనివారం అర్ధరాత్రి 12.15 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మణం చెందారు. ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ వైపు నుంచి వస్తున్న డీసీఎం వ్యాన్ అయినాడ జంక్షన్ వద్ద చింతలవలస గ్రామం వైపు వచ్చేందుకు కుడివైపు తిరుగుతున్న క్రమంలో డీసీఎం వాహనాన్ని విజయనగరం నుంచి వస్తున్న మోటారుసైకిల్ ఢీకొంది. దీంతో మోటారు సైకిల్‌పై వెళ్తున్న తన్నా హర్షచైతన్య(19), రెడ్డి ఉదయ్‌కుమార్(20) తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయారు. రోడ్డుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న రెడ్డి ఉదయ్‌కుమార్‌ను విజయనగరం వైపు నుంచి విశాఖ వైపు అతివేగంతో వచ్చిన కారు ముందు భాగంతో కొంత దూరం ఈడ్చుకుపోయింది. దీంతో ఉదయ్‌కుమార్ అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన హర్షచైతన్యను చికిత్స నిమిత్తం విజయనగరం తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా.. తన్నా హర్షచైతన్య చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బి.టెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. దీంతో చింతలవలసలోనే ఒక రూమ్ తీసుకుని ఉంటున్నాడు. శనివారం విజయనగరంలో ఓ పెళ్లికి వెళ్లిన హర్షచైతన్య తిరుగు ప్రయాణంలో స్నేహితుడు రెడ్డి ఉదయ్‌కుమార్‌తో మోటారు సైకిల్‌పై విజయనగరం నుంచి విశాఖ వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో అయినాడ జంక్షన్ వద్ద చింతలవలసకు వెళ్లేందుకు తిరగాలి. ఈ సమయంలో నిర్లక్ష్యంగా వస్తున్న డీసీఎం వాహనాన్ని మోటారుసైకిల్ ఢీకొంది. రెండు నిమిషాల్లో రూమ్‌కు చేరుకోవాల్సిన వీరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. మరణించిన హర్ణచైతన్యది మక్కువ మండలంలోని ఎ.వెంకంపేట గ్రామం. ఇదే ప్రమాదంలో మరణించిన రెడ్డి ఉదయ్‌కిరణ్ పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరం మండలంలోని కొత్తవలస గ్రామం. సీఆర్ రెడ్డి కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కిల్లో స్వప్న పేరు వచ్చింది
నా కుమార్తె కార్తిక ప్రస్తుతం 7వ తరగతి చదువుతుంది. నా బిడ్డ తల్లి పేరు కిల్లో స్వప్న అని ఆన్లైన్లో నమోదు కావడంతో గత ఏడాది లబ్ధి కోల్పోయాం. మధ్యతరగతి కుటుంబం మాది. ఈ పథకం వర్తిస్తే పిల్ల చదువులకు ఉపయోగపడతాయి. గతంలో వచ్చిన సాంకేతిక సమస్య పరిష్కారం కోరి సచివాలయంలో అర్జీచేశాం. అటుపై ఎలిజిబుల్ లిస్టులో పేరు వచ్చిందన్నారు. త్వరలో నగదు జమ అవుతుందని చెప్పారు. ఫలితం లేకపోయింది. ఈ ఏడాదైనా పథకం వర్తింపజేయాలి. అల్లెన భావన, లబ్ధికోల్పోయిన విద్యార్థిని తల్లి, పాలకొండ -
పాదర్శకత ఉండాలి
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వానికి పాదర్శకత అవసరం. జిల్లాలో అనేక మంది తల్లికి వందనం పథకం లబ్ధి కోల్పోయారు. గత వైఎస్.జగన్ హయాంలో లబ్ధి పొందినవారు గత ఏడాది అర్హత పొందలేకపోయారు. యూడైస్‌లో తప్పుడు సమాచారం ఆన్లైన్ ద్వారా నమోదైనట్లు చెప్పిన యంత్రాగం వాటిని సరిచేసుకున్నా నగదు జమ చేయలేదు. గతంలో ముఖ్యంగా పాలకొండ పట్టణంతోపాటు నియోజకవర్గంలో అనేకులు అర్హత కోల్పోయారు. పాదర్శకంగా వివరాలు నమోదు చేయడంతో పాటు గతంలో ఎలిజిబుల్ లిస్టులో పేర్లు ఉన్నవారికి ఈ ఏడాది రూ.30వేలు జమ చేయాలి. విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే, పాలకొండ -
శ్మశాన వాటిక పరిశీలన
● పరిష్కారం కాని దళితుల శ్మశాన, అసైన్డ్ భూవివాదం ● రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్న రెవెన్యూ అధికారులు ● సివిల్, క్రిమినల్ కేసులు పెడతామంటున్న రిటైర్డ్ జడ్జిజియ్యమ్మవలస రూరల్: కొన్నేళ్లుగా మండలంలోని చింతలబెలగాం గ్రామ దళితులకు సంబంధించిన శ్మశాన వాటిక, అసైనన్డ్ భూములపై వివాదం కొనసాగుతోంది. దళితుల అసైన్డ్ భూముల రెవెన్యూ ట్యాంపరింగ్, ఆన్లైన్ మార్పులు, ఆక్రమణలు శ్మశాన వాటిక ఆక్రమణ ఇలాంటి ఎన్నో విషయాలపై సామాజిక కార్యకర్త బెలగాం ప్రవీణ్ కుమార్ అనేకమార్లు ఆర్డీవో, సబ్ కలెక్టర్, కలెక్టర్లకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలూ చేపట్టని పరిస్థితుల్లో ప్రకాశం జిల్లా విశ్రాంత న్యాయమూర్తి, ప్రస్తుత హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ ఎస్ శ్యాం సుందర్ జయరాజు గ్రామాన్ని ఆదివారం సందర్శించారు. దళితులకు జరిగిన అన్యాయంపై ఆయన విచారణ చేసి ఇదే గ్రామంలో దళిత మహిళ మృతదేహాన్ని శ్మశాన వాటికలో ఖననం చేస్తే స్థానికులు ఆ భూమిని ఆక్రమించి పాతిపెట్టిన మృతదేహాన్ని తిరిగి బయిటకు తీయించి వేరే చోటకు మార్పించిన ఘటన పోలీసులు, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో జరగడం దుర్మార్గమని పేర్కొన్నారు. ప్రభుత్వం దళితులకు కేటాయించిన అసైన్డ్ భూమిని స్థానిక రిటైర్డ్ వీఆర్ఓ తన కుమార్తె పేరున పాస్‌బుక్ ఎలా చేయించుకున్నారో చెప్పాలని ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అందుకు సహకరించిన రెవెన్యూ అధికారులను సైతం వదిలిపెట్టేది లేదని తక్షణమే అసైన్డ్ భూమిని దళితులకు విడిచిపెట్టకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ హైకోర్టులో కేసు వేస్తామని హెచ్చరించారు. మానవ హక్కుల ఉల్లంఘన కింద కేసు దళితులకు శ్మశాన వాటికకు అవసరమైన స్థలాన్ని కలెక్టర్, సబ్ కలెక్టర్ పరిశీలించి అప్పగించాలని కోరారు. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూముల్లో నిజానిజాలు పరిశీలించి వారికి తగు న్యాయం చేయాలని కోరారు. కాదని స్థానిక నాయకులు అడ్డుకుంటే మానవ హక్కుల ఉల్లంఘన కింద కేసు వేస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై దళితులకు న్యాయం జరిగేందుకు పోరాడుతున్న ప్రవీణ్‌ను బెదిరింపు చర్యలకు పాల్పడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముందుగా చింతల బెలగాంలో దళితుల శ్మశాన వాటికను పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా దళితులు అణిచివేతకు గురవుతున్నారని, ప్రశ్నించే వారి గొంతునొక్కేస్తున్నారని ఇలాంటి పరిస్థితుల్లో వారంతా ఐక్యమత్యంతో పోరాటాలు చేస్తే కానీ న్యాయం జరిగిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తాను దళితుల వైపు బడుగు బలహీన వర్గాల వైపు పని చేస్తూ వారికి అన్నివేళలా తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని తెలిపారు. -
రైతుసంక్షేమంలో ప్రభుత్వం విఫలం
రేగిడి: రైతులకు సంక్షేమపథకాలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన రేగిడి మండలంలోని బూరాడ గ్రామం వచ్చిన సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందకపోవడంతో రైతులు తీవ్రనష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. ఆరుగాలం కష్టించి పండించుకున్న మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయకపోవడంతో దళారులకు విక్రయించి రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. క్వింటా ధర రూ. 2500లు మొక్కజొన్నకు గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించేదని, ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు క్వింటా మొక్కజొన్నను రూ.1700లుకు విక్రయించడంతో ఎకరాకు వేలాది రూపాయలు నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న సాగునీటి వనరులను సైతం ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. మడ్డువలస ప్రధాన కుడికాలువకు అనుసంధానంగా ఉన్న పిల్లకాలువలు పూర్తిగా పాడవడంతోపా టు షట్టర్లు, తలుపులు లేకపోవడంతో పంటపొలాలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొందన్నారు. ఇటు రైతు, అటు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి కూట మి ప్రభుత్వం హాయిహాయి గారడీగా ప్రభుత్వాన్ని నడుపుతోందని ధ్వజమెత్తారు. ఈ ఏడాది ఖరీఫ్‌కు అవసరమైన వరి విత్తనాలు, ఎరువులు రైతు సేవా కేంద్రాలకు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరీఫ్‌కు ముందుగానే రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచేవారని గుర్తు చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ -
ఆలయ నిర్మాణాలపై వీహెచ్‌పీ ఆరా
గరుగుబిల్లి: తోటపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణాలపై విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఆరా తీశారు. ఈ మేరకు ఆదివారం మండలంలోని తోటపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న నిర్మాణాలను, విగ్రహల ఏర్పాటును వీహెచ్‌పీ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఫల్గుణరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, వీహెచ్‌పీ ఇతర సభ్యులు అనంత్, జిల్లా అధ్యక్షుడు చింతా భాస్కరరావు, సీతానగరం మండల అధ్యక్షుడు జి.బాలకృష్ణ తదితరులు పరిశీలించారు. తోటపల్లి ఆలయంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలకు స్పందించి బీజేపీ, వీహెచ్‌పీ చేసిన ఆందోళనల నేపథ్యంలో వారు స్పందించి ఆలయ నిర్మాణాలను పరిశీలించారు. ఏదైతే తోటపల్లిలో స్వయం భుగా వెలసిన విగ్రహం 52 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న స్వామి వారి విగ్రహాన్ని ఆర్అండ్బీ రోడ్ స్థలంలో రేకుల షెడ్లో బంధించి ఉన్న విధానం చూసి ఆశ్చర్యపోయారు. ఆలయంలో విగ్రహాలు, నూతనంగా చేపడుతున్న నిర్మాణాలు, ఇతర వివరాలపై సిబ్బంది, అర్చకులతో మాట్లాడి ఆరా తీశారు. పుట్టు దేవుని విగ్రహాలను బయట ఉంచడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఉచిత దర్శనం లేకపోవడంతో విస్మయం వ్యక్తం చేశారు. తోటపల్లిలో జరుగుతున్న ప్రతి అంశాన్ని పరిశీలించి నోట్ చేసుకుని తగు చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు నివేదించి, ఆగమ శాస్త్రం ప్రకారం ఎండోమెంట్ వారితో స్వామివారి విగ్రహాన్ని పునఃప్రతిష్ట చేసేలా తమ వంతు కృషిచేస్తామని పేర్కొన్నారు. విగ్రహ పునఃప్రతిష్టకు చర్యలు -
ఆ గ్రామానికి సర్టిఫికెట్ల సమస్య
రాజాం సిటీ: మున్సిపాల్టీ పరిధి పొనుగుటివలస గ్రామాన్ని సర్టిఫికెట్ల సమస్య వేధిస్తోంది. విద్యాసంవత్సరం ముగిసింది. తమ పిల్లలు మరో మెట్టుపైకి వస్తున్నారని తల్లిదండ్రులు మురిసిపోతూ సచివాలయానికి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకోసం వెళ్లుంటే అక్కడ చేదు అనుభవం ఎదురవుతోంది. సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న తరువాత సంతకవిటి వెళ్లాలని అక్కడ తహసీల్దార్ సంతకం చేసుకుని రాజాం తహసీల్దార్ వద్దకు వెళ్తే సర్టిఫికెట్ వస్తుందని చెబుతుండడంతో అవాక్కవుతున్నారు. గతంలో ఈ సమస్య ఎప్పుడూ రాలేదని వారితే చెప్పినా తమకు ఫలితంలేకుండా పోతోందని గ్రామస్తులు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో సచివాలయంలోనే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సేవలు ప్రజల ముంగిటకే అందేవి. విద్యార్థులకు కావాల్సిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు గ్రామ/వార్డు సచివాలయాల్లోనే వెంటవెంటనే అందడం వంటి సేవలను ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం సర్టిఫికెట్లు కావాలన్నా ఇబ్బందులు పడక తప్పడంలేదని ప్రజలు, విద్యార్థులు వాపోతున్నారు. కూతవేటు దూరంలో ఉన్న రాజాంలో కాకుండా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంతకవిటి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోందని, అక్కడినుంచి మళ్లీ సర్టిఫికెట్లు పొందేందుకు రాజాం తహసీల్దార్ కార్యాలయానికి రాక తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సచివాలయంలోనే అందించాలని కోరుతున్నారు. ఇదీ అసలు సమస్య.. 2005 వరకు సంతకవిటి మండలంలో కొనసాగిన పొనుగుటివలస గ్రామం ప్రస్తుతం రాజాం మున్సిపాల్టీలో కొనసాగుతోంది. 2005లో రాజాం మండలంలోని రాజాం, సారథి మేజర్ పంచాయతీలతోపాటు కొత్తవలస, కొండంపేట, సంతకవిటి మండలం పొనుగుటివలస గ్రామాలను కలుపుతూ నగరపంచాయతీగా ఏర్పాటుచేశారు. అప్పటికే ఈ పంచాయతీలకు సర్పంచ్‌లుగా ఉన్నవారి పదవీకాలం ముగియకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో నగరపంచాయతీ (2020లో థర్డ్‌గ్రేడ్ మున్సిపాల్టీగా రాజాం అప్‌గ్రేడ్) ఏర్పడినప్పటికీ మిగతా పనులు ఎక్కడివక్కడే మిగిలిపోయాయి. దీంతో సంతకవిటి మండలంలో భాగమైన పొనుగుటివలస రెవెన్యూ, పంచాయతీ రికార్డులు నగరపంచాయతీకి అప్పగించకుండా సంతకవిటి మండలంలోనే ఉండిపోయాయి. అప్పటి నుంచి ప్రతి పనికి మున్సిపాల్టీకి వెలితే సంతకవిటి మండలానికి వెళ్లాలని, సంతకవిటి వెళ్తే నగరపంచాయతీకే వెళ్లాలని అధికారులు చెబుతుండడంతో చేసేదిలేక అటూ ఇటూ తిరుగుతూ ఏదో విధంగా గ్రామస్తులు తమ పనులను మమ అనిపిస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు శాఖల విషయంలో ప్రజలకు ఎక్కువ సమస్యలు తలెత్తుతున్నాయి. రెండు మండలాల నడుమ నలుగుతున్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నామంటున్న గ్రామస్తులు వైఎస్సార్సీపీ హయాంలో సచివాలయంలోనే సర్టిఫికెట్ల అందజేత సమస్య పరిష్కరించాలని గ్రామస్తుల వేడుకోలు -
పెళ్లింట విషాదం
● లారీ, ఆటో ఢీకొని ఇద్దరి మృతి ● ముగ్గురికి తీవ్ర గాయాలు ● ఒకరి పరిస్ధితి విషమంజామి: పెళ్లింట బంధువులు, మిత్రులు అంతా సరదాగా గడిపారు. పెళ్లి కూడా సందడిగా జరిగిపోయింది. బంధువులు ఎవరింటికి వారు తిరిగి ప్రయాణమయ్యారు. ఇంతలోనే విషాదవార్త వినవలసి వచ్చింది. మరో పదినిమిషాల్లో స్వగ్రామం చేరుకుంటారనగా లారీ రూపంలో వారిని మృత్యువు కాటేసింది. దీంతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పాచిపెంట మండలంలోని తోటవలస గ్రామంలో ఆడపిల్ల ఇంటివద్ద వివాహం జరిగింది. వివాహమైన తరువాత ఆదివారం పెండ్లి కుమారుడి తండ్రి మట్టా సన్యాసిరావు, తల్లి కనకమ్మ, వరుసకు పెళ్లి కుమార్తె చిన్నాన్న విజయనగరం మండలం చాకలిసేటకు లావేటి పైడిరాజు, పిన్ని గౌరమ్మ, బంధువులు ఆటోలో తిరిగి పెండ్లికుమారుడి స్వగ్రామం జామి మండలంలోని అన్నంరాజు పేట గ్రామానికి ఆటోలో తిరిగి పయనమయ్యారు. ఈ క్రమంలో జామి మండలంలోని జన్నివలస వద్ద విశాఖ గ్రీన్‌ఫీల్డ్ హైవేపై పాచిపెంటనుంచి వస్తున్న ఆటోను జామి నుంచి విజయనగరం వెళ్తున్న లారీకి టైర్ పంక్చరై అదుపు తప్పి ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న పెళ్లికొడుకు తండ్రి మట్టా సన్యాసిరావు(62), అక్కడికక్కడే మృతిచెందాడు. పెళ్లికుమార్తెకు వరుసకు చిన్నాన్న లావేటి పైడిరాజు(52), పెండ్లి కుమారుడి తల్లి కనకమ్మ, బంధువులు ఒకే కుటుంబానికి చెందిన మడ్డు రాఘువ, వట్టి సాయి కుమార్ తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని 108 వాహనంలో విజయనగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ లావేటి పైడిరాజు మృతిచెందాడు. కనకమ్మ పరిస్థితి విషమంగా ఉంది. గాయాలపాలైన మిగిలిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జామి ఎస్సై వీర జనార్దన్ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి జరిగిన ఘటనపై తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
తల్లికి వందనం ఎందరికో?
పాలకొండ రూరల్: ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ‘తల్లికి వందనం’ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తామని ఎన్నికల ముందు కూటమి నాయకులు ఊదరగొట్టారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక తొలి ఏడాది తల్లికి వందనం పథకం అమలు ఎగ్గొట్టారు. గతేడాది జిల్లాలో వేల మంది విద్యార్థులకు ఈ పథకానికి సంబంధించి అర్హత ఉన్నా నేటికి పలురువురు తల్లుల ఖాతాల్లో లబ్ధి జమ చేయకుండా ఎగనామం పెట్టారు. ఈ నేపథ్యంలో తల్లికి వందనం డబ్బులు ఈ ఏడాది తల్లుల ఖాతాల్లో జమ కావడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్పష్టత లేదు.. కూటమి సర్కారు తల్లికి వందనం పథకం ప్రకటించిన తొలి ఏడాది 2024లో అమలుకు నోచుకోలేదు. అర్హత ఉన్నప్పటికీ గతేడాది అనేక కారణాలు చూపుతూ జిల్లాలో వందల మందికి కోత పెట్టింది. దీంతో అప్పట్లో తల్లులంతా స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అధిక విద్యుత్ బిల్లులు, నాలుగు చక్రాల వాహనాలు, లెక్కకు మించి భూములు ఉన్నాయని కారణాలు చూపించారు. అర్హత ఉన్నా లబ్ధి కోల్పోయిన వారిలో పిల్లల తల్లి స్థానంలో ‘కిల్లో స్వప్న’ అనే మహిళ పేరు అనేక మంది పిల్లలకు నమోదైంది. ఆమె పేరిట ఉన్న ఆస్తులను చూపించి పలువురికి తల్లికి వందనం నిలిపివేశారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని, నమస్యలు పరిష్కరించుకోవాలని, అర్హత ఉండి లబ్ధి కోల్పోయినట్లు ఏ ఒక్కరు చూపించినా లబ్ధి చేకూరుస్తామని సంబంధిత మంత్రి చెప్పినా అంతా బూటకంగానే సాగింది. తొలివిడత జాబితాలో సొమ్ములు జమకాని విద్యార్థులకు సంబంధించి పలు సమస్యలు చెప్పారు. ఆయా సమస్యలపై సంబంధిత శాఖల నుంచి పరిష్కార పత్రాలు తీసుకుని గ్రామ, వార్డు సచివాలయ అధికారులకు తల్లులంతా అందించారు. ఈ క్రమంలో వారికి ఎలిజిబల్ లిస్టుల్లో పేర్లు వచ్చాయి అన్నారు. అయినా ఫలితం లేకపోవడంతో ఈ ఏడాది ఇంకెన్ని కొర్రీలు పెడతారోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. సరైన వ్యవస్థ లేదు.. ప్రస్తుత సర్కారు జిల్లాలో1,584 పాఠశాలల్లో ద్వారా బోధన పొందుతున్న ప్రతి విద్యార్ధికి రూ.15వేలు అందిస్తామని నమ్మబలికింది. ఈ క్రమంలో 2025 జూన్‌లో 69,600 మంది తల్లులకు సంబంఽధించి లక్షా 8,951 మంది పిల్లలను అర్హులుగా ప్రకటించారు. వారిలో ఒకరికి మించి బిడ్డలున్న తల్లులు 39వేలుగా పేర్కొన్నారు. అయితే పూర్తి స్థాయిలో వారికి లబ్ధి చేకూర్చలేకపోయారు. పథకం వర్తింపులో వస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు సరైన వ్యవస్థ లేకుండా పోయింది. పాఠశాలల యాజమాన్యాలు, సచివాలయ సిబ్బంది ఆన్లైన్లో పిల్లల వివరాలు నమోదు చేయటం వరకే తమ పని అని, సమస్య పరిష్కారం కావడం తమ చేతుల్లో లేదంటూ చేతులెత్తేస్తున్నారు. వైఎస్ జగన్మోహనరెడ్డి హయాంలో ఇంట్లో ఒకరికి ఈ పథకం వర్తింప చేసినప్పుడు జిల్లాలో దాదాపు 85 వేల మందికి లబ్ధి అందించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అప్పట్లో పథకం అందలేదన్న సమస్య తలెత్తకపోవడం పారదర్శకతకు నిదర్శనం. తాజా ఏడాది 2026కి సంబంధించి 15 మండలాల పరిధిలో లక్షా 18వేల పై చిలుకు విద్యార్థులు బోధన పొందుతున్నట్లు విద్యా శాఖ పేర్కొంటోంది. వారి పూర్తి వివరాలను ఈ నెల 15 నాటికి యూడైస్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం సూచించడంతో పాఠశాలల యాజమాన్యాలు ఆ పనిలో నిమగ్నమయ్యాయి. లెక్క ప్రకారం ఈ ఏడాది జూన్‌లో అందించనున్న లబ్ధితో పాటు గతంలో అర్హత కోల్పోయి, శాంక్షన్ లిస్టులో తమ పేర్లు ఉన్నందున బకాయి మొత్తం కలిపి నగదు జమ చేయాలంటూ పలువురు తల్లులు కోరుతున్నారు. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ‘తల్లికి వందనం’ అందుతుందా..? లేక గతంలో మాదిరి కొర్రీలు పెడతారా అన్న అనుమానాలు నెలకొన్నాయి. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందో అనే చర్చ జరుగుతోంది. గతంలో ఏర్పడ్డ లోపాలు, సాంకేతిక సమస్యలు అధిగమించి అర్హత ఉన్న ప్రతి విద్యార్థికీ లబ్ధి అందించాలని పిల్లల తల్లులు కోరుతున్నారు. గత ఏడాది వేలమందికి ఎగనామం నేటికీ కొంతమంది తల్లులకు జమకాని లబ్ధి నాడు పలుమార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం శూన్యం వచ్చే నెలలో మలివిడత తల్లికి వందన కార్యక్రమం శతశాతం అర్హులకు నిధుల జమపై తొలగని సందేహాలు ఈనెల 15 నాటికి పిల్లల వివరాల నమోదుకు ఆదేశాలు -
50 పాఠశాలల బస్సుల తనిఖీ పూర్తి
పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలోని 95 పాఠశాలల బస్సుల్లో ఫిట్నెస్, బస్సుల రికార్డులను ఇప్పటివరకు 50 బస్సులకు జిల్లా రవాణాధికారి దుర్గాప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఆదివారం తనిఖీ చేశారు. బస్సుల పనితీరు, సాంకేతిక పరిస్థితులు పరిశీలించి, మిగిలిన 45 బస్సులను కూడా త్వరలో తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు బస్సులు సురక్షితంగా నడవడం లక్ష్యమని డీటీఓ తెలిపారు. బస్సులను తనిఖీ చేయించుకోకపోతే శాఖాపరమైన చర్యలు చేపట్టనున్నట్లు పాఠశాలల యాజమాన్యాలను హెచ్చరించారు. -
ఎడారిలా నాగావళి
రేగిడి: మండలంలోని సంకిలి వద్ద ఉన్న నాగావళి నది నీరులేక ఎడారిని తలపిస్తోంది. వేసవి ఎండల ప్రభావంతో నదిలో గతంలో వచ్చిన కొద్దిపాటి నీరు కూడా పూర్తిగారాని పరిస్థితి ఏర్పడింది. దీంతో నదీపరీవాహక గ్రామాలైన సంకిలి, బొడ్డవలస, పుర్లి, కొమెర, వెంకటాపురం, ఖండ్యాం తదితర గ్రామాల్లో భూగర్బజలాలు అడుగంటాయి. దీంతో ఆయా గ్రామాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు తప్పవేమోనని ఆందోళన చెందుతున్నారు. బాలేరులో ఏనుగుల విధ్వంసంభామిని: మండలంలోని బాలేరులో నాలుగు ఏనుగుల గుంపు ఆదివారం విధ్వంసం సృష్టించింది. కోత దశలో ఉన్న వరిచేను పొలాల్లో తిరుగాడుతూ పంటను నాశనం వేశాయి. రైతుల పొలాల్లోని బోర్‌వెల్స్ పైపులను విరగ్గొట్టి వాటిలోని నీటిని తాగాయి. బాలేరుకు చెందిన ఎర్నాగుల అప్పారావు 5 హెచ్‌పీ బోరును పాడు చేశాయి. పొలాల్లో తిరుగాడుతూ వరి పంటను ధ్వంసం చేశాయి. ఏనుగుల ప్రయాణం మారడంతో స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టాలను లెక్కించాలని కోరుతున్నారు. న్యాయమూర్తుల గృహ సముదాయనికి భూమి పూజవిజయనగరం లీగల్: జిల్లా కేంద్ర న్యాయమూర్తుల గృహ సముదాయనికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ తర్లాడ రాజశేఖర్ రావు ఆదివారం భూమి పూజ నిర్వహించారు. స్థానిక వీటీ అగ్రహారంలో ఉన్న పాత జిల్లా కోర్టు ప్రాంగణంలో శిథిలావస్థలో వున్న భవన సముదాయాన్ని తొలగించి వాటి స్థానంలో కొత్త సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్‌లతో పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత, స్థానిక న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నళితం రమేష్ కుమార్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు బెల్లాన రవి ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. కార్డన్ సెర్చ్‌లో 80 వాహనాలు సీజ్ విజయనగరం క్రైమ్: స్థానిక డబుల్ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆపరేషన్ వజ్ర ప్రహార్‌లో భాగంగా డ్రగ్స్ నిర్మూలన, నేరాల నియంత్రణ లక్ష్యంగా చేపట్టిన ఈ తనిఖీల్లో 100 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి కాలనీలోని 120 ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. అపరిచిత, అనుమానాస్పద వ్యక్తులు, సారా, అక్రమ మద్యం నిల్వలు, మాదకద్రవ్యాలు, నాటు తుపాకులు, అక్రమ వాహనాలు ఉన్నవీ లేనివీ క్షుణ్నంగా తనిఖీ చేశారు. కొత్త వ్యక్తుల వివరాలు సేకరించి, వారి వేలిముద్రలను ఎంఎస్‌సీడీ పరికరంతో తనిఖీ చేశారు. ఈ సోదాల్లో వాహన ధ్రువపత్రాలు సక్రమంగా లేని 80 వాహనాలను సీజ్ చేసి, స్టేషన్‌కు తరలించినట్లు విజయనగరం రెండో పట్టణ సీఐ టి.శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ రామారావు, కృష్ణమూర్తి, కనకరాజు, కానిస్టేబుళ్లు నాగమణి, సంధ్య, రజియా తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక విజయనగరం టౌన్: స్థానిక కేఎల్ పురం గురుద్వార వద్ద జై జులేలాల్ సింద్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం జరిగింది. అధ్యక్షుడిగా లక్ష్మీచంద్ లాల్వానీ, ఉపాధ్యక్షుడిగా శశి కుక్రేజా, కార్యదర్శిగా హరేష్ లాల్వానీ, సహాయ కార్యదర్శిగా రామ్‌లాల్ లాల్వానీ, కోశాధికారిగా కె.రాజేంద్ర ఎన్నికయ్యారు. -
నాటుబాంబు కలకలం
కొత్తవలస: మండలంలోఓని కంటకాపల్లి పంచాయతీ పరిధి భామసాగర్ చెరువు వద్ద శనివారం నాటుబాంబు కలకలం రేపింది. ఈ ప్రాంతంలో అడవి పందులను వేటాడేందుకు వేటగాళ్లు నాటుబాంబులను ఉపయోగిస్తుంటారు. రాత్రి సమయల్లో అడవి పందులు తిరిగే దారుల్లో వేటగాళ్లు నాటుబాంబులను అమర్చి తెల్లవారుజామున తీసేసి భద్రపరుచుకుంటారు. ఈ క్రమంలో వేటగాళ్లు నిర్లక్ష్యంగా వదిలేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే చెరువులో గత నెల ఏప్రిల్ 20వ తేదీన ఉపాధి పనులు నిర్వహిస్తుండగా నాటుబాంబు పేలి గ్రామానికి చెందిన కక్కల అప్పారావు తీవ్రంగా గాయపడగా.. మరో ఇద్దరు కూలీలు స్వల్పంగా గాయపడిన విషయం విదితమే. ఇంతలోనే మళ్లీ నాటుబాంబు కలకలం రేగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు వన్యప్రాణులను వేటాడే వేటగాళ్లపై నిఘా ఏర్పాటు చేసి జరగబోయే ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు. -
డీఎఫ్ఓగా సోమసుందరం
విజయనగరం గంటస్తంభం: విజయనగరం జిల్లా అటవీశాఖ అధికారిగా (డీఎఫ్ఓ) ఎం.సోమసుందరం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు డీఎఫ్ఓగా పనిచేసిన రెడ్డి కొండలరావుకు ఐఎఫ్ఎస్ అధికారిగా ఉద్యోగోన్నతి లభించడంతో రాజమండ్రికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సోమసుందరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అటవీ సంరక్షణలో సమర్ధవంతంగా సేవలందిస్తానని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి చీపురుపల్లిరూరల్(గరివిడి): రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని వైఎస్సార్సీపీ నాయకులకు శాసనమండలి విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ సూచించారు. గరివిడిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో శనివారం మాట్లాడారు. గ్రామస్థాయి కమిటీల ఏర్పాటుపై ఆరా తీశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు విఫలమయ్యారని, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేద్దామన్నారు. కార్యక్రమంలో ఆయన కుమార్తె బొత్స అనూష, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, పార్టీ గరివిడి మండలాధ్యక్షుడు మీసాల విశ్వేశ్వరరావు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు ఎలకల అప్పలనాయుడు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ● ఎండి‘నది’ వేగావతి నదిలో చుక్కనీరు లేదు. వేసవి ఎండలకు నది పూర్తిగా ఎండిపోయింది. అక్కడక్కడ చిన్నచిన్న నీటిపాయలు, ఊటలే కనిపిస్తున్నాయి. వేసవి తీవ్రత అధికంగా ఉన్నందున నదిలో నీరు ప్రవహించే పరిస్థితి లేదు..పశుపక్ష్యాదులు సైతం దాహార్తి తీర్చుకునేందుకు అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఇదే నది బొబ్బిలి, బాడంగి, తెర్లాం మండలాల మీదుగా ప్రవహిస్తుండగా ఇప్పుడు నదిలో నీరు లేకపోవడంతో సాగునీటి కొరత కూడా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలి మండలంలోని కునుకువానివలస వద్ద పూర్తిగా ఎండిపోయిన నదిని చిత్రంలో చూడొచ్చు. – బొబ్బిలి -
స్కూల్ మైదానం ఆక్రమణపై నిరసన
రాజాం: మున్సిపాల్టీ పరిధి వస్త్రపురి కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్థలాన్ని రాజాం మండలం నర్సింహపురం గ్రామానికి చెందిన పి.వెంటరమణ అనే వ్యక్తి ఆక్రమిస్తున్నాడంటూ స్థానికులు శనివారం పాఠశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. అనంతరం ప్రధాన రహదారిపై ర్యాలీ చేపట్టారు. సర్వే నంబరు 59లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 196 అడుగుల వెడల్పు, 216అడుగుల పొడవుల విస్తీర్ణంపై మైదానం ఉందని తెలిపారు. ఈ మైదానాన్ని ఎటువంటి హక్కులు లేకుండా వెంకటరమణ ఆక్రమణ చేస్తూ, ప్రహరీ నిర్మించాడని గ్రామస్తులు ఆరోపించారు. కమలనాయుడు ఆధ్వర్యంలో వంద మందికి పైగా కాలనీ వాసులు ఆక్రమణలపై మండిపడ్డారు. తహసీల్దార్, ఎంఈఓకు ఫిర్యాదు చేశామని, సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేయనున్నామని వెల్లడించారు. ఆక్రమణలు తొలగించడంతో పాటు ఆక్రమణదారుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంఈఓ దర్యాప్తు వస్త్రపురి కాలనీలో ప్రభుత్వ పాఠశాల ఆక్రమణలపై ఎంఈఓ యాగాటి దుర్గారావు దర్యాప్తు ప్రారంభించారు. ఉన్నతాధికారులు నుంచి వచ్చిన ఆదేశాలతో పాఠశాల మైదానాన్ని పరిశీలించారు. 5 నుంచి ఆరు అడుగుల వెడల్పు మేర పాఠశాల మైదానంలోకి ఆక్రమణదారుడు వచ్చినట్టుగా గుర్తించారు. పాఠశాల హెచ్ఎం రాజుతో పాటు తహసీల్దార్‌కు ఆక్రమణలు తొలగించాలని ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు ఎంఈఓ తెలిపారు. -
రెండు చోట్లా ఒక్కరే...
సాక్షి ప్రతినిధి విజయనగరం: రెవెన్యూ శాఖలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. విజయనగరం నియోజకవర్గ జనాభా పెరగడంతో రెవెన్యూ సేవలు సకాలంలో అందడంలేదన్న ఉద్దేశంతో విజయనగరం రెవెన్యూ కార్యాలయాన్ని అర్బన్, మండల తహసీల్దార్ కార్యాలయాలుగా ఇటీవల విభజించారు. దీంతో ప్రజలు కూడా సంతోషించారు. ఇద్దరు అధికారులు ఉంటారని, చకచకా పనులు జరుగుతాయని, నాణ్యమైన రెవెన్యూ సేవలు అందుతాయని ఆశపడ్డారు. తీరా రెండు కార్యాలయాలకు ఒకే తహసీల్దార్‌ను నియమించడంతో ఉసూరుమంటున్నారు. విభజించడం వల్ల ప్రయోజనం ఏముందని నిట్టూర్చుతున్నారు. చెప్పుకునేందుకే రూరల్, అర్బన్ అంటూ రెండు తహసీల్దార్ కార్యాలయాలని, ఇద్దరు తహసీల్దార్లను నియమించాల్సిన చోట ఒక్కరినే నియమించడంపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ మీద గతంలో ఆరోపణలు.. ఫిర్యాదులు వెల్లువెత్తగా కొన్నాళ్లు సెలవుపై పంపేశారని, అంతా సద్దుమణిగాక మళ్లీ ఆయనను రెండు కార్యాలయాల బాధ్యతలు అప్పగించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనివెనుక అవినీతి కథ నడుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుడిచేత్తో అర్బన్ ఫైళ్ళు, ఎడమచేత్తో రూరల్ ఫైళ్ళు క్లియర్ చేస్తూ రెండు చేతులా ప్రజలకు సేవలు అందిస్తారంటూ కొందరు ఎద్దేవా చేస్తున్నారు. -
ఐఏఎస్‌లపై ఆగ్రహం
సాక్షి, పార్వతీపురం మన్యం: రెవెన్యూ యంత్రాంగం తీరుపై అధికార పార్టీ నేతలు మరోసారి విరుచుకుపడ్డారు. ఆక్రమణలు అడ్డుకోవడం లేదని చెబుతూనే.. ఆక్రమణదారులకు సహకరిస్తున్నారా? అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కలెక్టర్, జేసీ, సబ్ కలెక్టర్ వంటి ఐఏఎస్ అధికారులనే లక్ష్యంగా చేసుకొని మాటల దాడికి దిగడం, ఆరోపణలు గుప్పించడం ఉద్యోగ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇదే సందర్భంలో మొత్తం రెవెన్యూ వ్యవస్థనే తూలనాడటం పట్ల ఆ శాఖ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే కలెక్టర్ ప్రభాకరరెడ్డికి వ్యతిరేకంగా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఏకమైన విషయం విదితమే. ఆయనను జిల్లా నుంచి పంపించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారన్న ప్రచారం సాగింది. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే బాహాటంగానే కలెక్టర్, జేసీ వంటి అధికారుల పట్ల విమర్శలు చేయడం.. ఈ అనుమానాలకు మరింత బలమిచ్చినట్లు అయ్యింది. కళ్లు మూసుకున్నారా.. అంటూ ఆగ్రహం! పార్వతీపురం మండలం అడ్డాపుశీల రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 70/2 లో గల సుమారు మూడున్నర ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని బంటువానివలస గ్రామానికి చెందిన బంటు దాసు అనే వ్యక్తి ఆక్రమించి, ప్రైవేటు వ్యక్తులకు ఇటుకల తయారీకి లీజుకు ఇచ్చారని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తెలిపారు. దీనిపై రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అడ్డాపుశీల గ్రామ సమీపంలో బంటు దాసు ఆక్రమించిన స్థలంగా చెబుతున్న ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పరిశీలించారు. ఇటుకల తయారు చేసే ప్రదేశంతోపాటు.. సమీపంలో వెల్డింగ్ షాప్, ఇతర దుకాణాల వద్దకు వెళ్లి, అక్కడున్న నిర్వాహకులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 5 సంవత్సరాల నుంచి బంటు దాసు అనే వ్యక్తి ఈ స్థలాన్ని ఇటుకల తయారీకి లీజుకు ఇచ్చారని చెప్పారు. ప్రతినెలా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు లీజు సొమ్మును వసూలు చేస్తున్నారన్నారు. ఒక ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తి ఆక్రమించి ఎలా లీజుకు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై సాక్షాత్తు ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్లకు తన లెటర్‌పై లిఖితపూర్వక ఫిర్యాదు చేశానని చెప్పారు. ఇటీవల తాను, కలెక్టర్ ఇటువైపు వచ్చిన సమయంలో ఇక్కడ ఆగి ఈ స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. దీనికి ఏమైనా అనుమతులు ఇచ్చారా? అని కలెక్టర్‌ను ప్రశ్నించినట్లు చెప్పారు. ఈ విషయం కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలు అవుతుందని.. రెవెన్యూ ప్రిన్సిపల్ కార్యదర్శి జయలక్ష్మికి కూడా ఫిర్యాదు చేశానన్నారు. అసెంబ్లీ సాక్షిగా తాను చెరువుల కబ్జాపైన, ప్రభుత్వ స్థలాల ఆక్రమణపైన ప్రస్తావించానన్నారు. ప్రభుత్వ స్థలాల్లో లే అవుట్లు కూడా వేశారని.. దీనిపై ఎటువంటి చర్యలూ లేవన్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ జరగని రెవెన్యూ స్థలాల ఆక్రమణలు, కబ్జాలు ఇక్కడే ఉన్నాయని, ఇది దురదృష్టకరమని అన్నారు. బంటు దాసు ఆక్రమించిన ప్రభుత్వ స్థలం విషయంపై అనేకసార్లు రెవెన్యూ అధికారులకు తెలియజేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి రెవెన్యూ యంత్రాంగం వరకు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా ప్రతిరోజూ ఒక రెవెన్యూ సమస్యపై రెవెన్యూ యంత్రాంగానికి తెలియజేస్తూనే ఉన్నానని, ఆక్రమణ గురైన స్థలం రెవెన్యూ రికార్డులో ఉందని చెప్పినా పట్టించుకోకపోవడం సరికాదన్నారు. బంటు దాసు అనే వ్యక్తి సీపీఎం ముసుగులో ఉన్నారని విమర్శించారు. కలెక్టర్, జేసీ, సబ్ కలెక్టర్లు దాసును చూసి భయపడ్డారా? లేక గత వైఎస్సార్సీపీని చూసి భయపడుతున్నారా? అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల సమయం.. అల్టిమేటం రెండు రోజులు సమయం ఇస్తున్నామని.. జిల్లా అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ అధికారులు దీన్ని ప్రభుత్వ స్థలంగా పరిగణనలోకి తీసుకోవాలని, లేకుంటే తానే స్వయంగా బోర్డు వేయించాల్సి వస్తుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రతినెలా ప్రభుత్వ స్థలంపై ఒక ప్రైవేటు వ్యక్తి రూ.వేలకు వేలు లీజు వసూలు చేస్తుంటే రెవెన్యూ యంత్రాంగం కళ్లు మూసుకొని వ్యవహరించడం సరైన పద్ధతి కాదని, దీనిపై రెవెన్యూ జిల్లా యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూస్తానని అన్నారు. ఇదే బంటు దాసుకు చెందిన స్థలంలో రెవెన్యూ, పోలీసు అధికారులను తీసుకుని వెళ్లి, ఆక్రమణ స్థలం అంటూ ఎమ్మెల్యే స్వయంగా అక్కడున్న ప్రహరీని కూల్చివేయడం గమనార్హం. జిల్లా కలెక్టర్ ప్రభాకరరెడ్డి పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెచ్చుకుంటున్నారు. ముస్తాబు, రెవెన్యూ క్లినిక్ వంటి వాటిని ప్రశంసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశించారు. ముస్తాబు కార్యక్రమానికి మెంటార్‌గా జిల్లా కలెక్టర్‌ను నియమించారు. స్వయంగా కలెక్టర్ల సదస్సులోనే ప్రభాకరరెడ్డి పనితీరు పట్ల సీఎం ప్రశంసిస్తుంటే... జిల్లాలో అందుకు విరుద్ధంగా నిందలు వేయడంపై ఉద్యోగ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
రజిత పతకం సాధించిన రష్మిత
గరుగుబిల్లి: మండలంలోని సంతోషపురం గ్రామానికి చెందిన తిమిటి రష్మిత జాతీయ స్థాయిలో ప్రతిభ చాటింది. ఈమె ముంబయిలోని మార్వే బీచ్‌లో ఈ నెల 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగిన వైఏఐ యూత్ అండ్ జూనియర్ నేషనల్ చాంపియన్‌షిప్ – 2026లో అండర్ – 17 విండ్ సర్ఫింగ్ విభాగంలో రజిత పతకం కై వసం చేసుకొంది. పోటీలలో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటు అద్భుతమైన నౌక నైపుణ్యం, పట్టుదల, సమర్ధవంతమైన రేసింగ్ వ్యూహలను ప్రదర్శించి రష్మిత విజయం సాధించింది. రష్మిత తండ్రి శ్రీకాంత్ చతుర్వేది వృత్తి రీత్యా ఆర్మీలో ఉద్యోగం చేయడంతో ముంబయిలోనే స్థిరపడ్డారు. రష్మిత ప్రస్తుతం 9వ తరగతి చదువుతుంది. ఈమె ప్రతిభపై తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. రష్మిత సాధించిన పతకం జిల్లాకే గర్వకారణమని పలువురు క్రీడాభిమానులు పేర్కొన్నారు. -
కుక్కల దాడిలో గొర్రె, మేక పిల్లల మృతి
సంతకవిటి: మండలంలోని కృష్ణంవలస గ్రామంలో వంకల పాపయ్యకు చెందిన నాలుగు గొర్రె పిల్లలు, రెండు మేక పిల్లలు కుక్కల దాడిలో శనివారం మృతి చెందాయి. పాపయ్య మధ్యాహ్న సమయంలో గొర్రె, మేక పిల్లలను పాకలో పెట్టి, ఇంటికి భోజనానికి రాగా ఇంతలో కుక్కలు చొరబడి వాటిపై దాడి చేసి చంపేశాయి. దీనితో పాపయ్య బోరున విలపించారు. వీటి విలువ దాదాపు రూ.30 వేలు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, కుక్కలను గ్రామం నుంచి బయటకు పంపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కుక్కల బెడదతో చిన్నారులను ఇంటి నుంచి బయటకు పంపించాలంటే భయంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. సహస్ర నామార్చనలు బొబ్బిలి: స్థానిక పట్టణంలోని కంచర వీధిలో కొలువైన కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సహస్రనామార్చనలు శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది...
● విడుదలైన నోటిఫికేషన్ ● ఈ నెల 30 వరకు గడువుపాలకొండ రూరల్: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించేందుకు ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రవేశ ప్రకటన కొద్ది రోజుల కిందట వెలువడింది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ట్రిపుల్ ఐటీలో టెన్త్ మార్కులు ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. ఇక్కడ సీటు లభిస్తే ఇంటర్ రెండేళ్లతో పాటు సమీకృత కోర్సుగా ఇంజినీరింగ్ విద్య కూడా అందుతుంది. ఇది మరో నాలుగేళ్లు అభ్యసించాల్సి ఉంటుంది. అంటే మొత్తంగా ఆరేళ్లు ఇక్కడే చదువుకోవచ్చు. దీంతో పలువురు ఉపాధ్యాయులు క్షేత్ర స్థాయిలో విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు. కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పలువురు ఈ ఏడాది టెన్త్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించారు. రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లా ఫలితాల్లోనే కాకుండా మార్కుల సాధనలో కూడా ముందంజలో ఉంది. ఈ క్రమంలో తమ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ట్రిపుల్ ఐటీ ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు సదరు కళాశాలలు అండగా ఉంటాయని సూచిస్తున్నారు. దరఖాస్తు చేసుకునే విధానంపై అవగాహన కల్పిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. ఈ బ్రాంచ్‌ల్లో అవకాశం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం నేతృత్వంలో మన రాష్ట్రంలో నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలులో ట్రిపుల్ ఐటీ కళాశాలలు ఉన్నాయి. అర్హత మేరకు విద్యార్థులు ఈ కళాశాలల్లో సీటు పొందవచ్చు. ఏటా ఒక్కో కళాశాలలో వెయ్యి మంది వంతున 4 వేల మంది విద్యార్థులకు ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ట్రిపుల్ ఐటీలో చేరిన విద్యార్థులకు తొలి రెండేళ్లు ఇంటర్‌తో పాటు ఇంజినీరింగ్ తరగతులు ఉచితంగా కొనసాగిస్తారు. సివిల్, సీఎస్ఈ, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ కోర్సుల్లో తర్ఫీదు అందిస్తారు. ఇడుపులపాయ, న్యూజివీడు క్యాంపస్‌ల్లో మెటీరియల్ కోర్సులతో పాటు మెటలర్జికల్, కెమికల్ ఇంజినీరింగ్ సబ్జెక్టులు అదనంగా నిర్వహిస్తారు. చదువుల కాలంలో విద్యార్థులకు ఉచితంగా వసతి, భోజన సౌకర్యం లభిస్తుంది. అప్లోడ్ చేద్దామిలా... అర్హులైన విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్జీయుకెటి.ఇన్ (www.rjukt.in) వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉటుంది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు విద్యార్థి ఆధార్, ఫోన్ నంబర్, పదవ తరగతి మార్కుల ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 4 శాతం మార్కులు అదనంగా కలిపి అర్హుల జాబితాల్లో చేరుస్తారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250, ఓబీసీ విద్యార్థులు రూ.400 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. జూన్ నెల 12న ఎంపికై న విద్యార్థుల జాబితా విడుదల చేయనున్నారు. అవకాశం లభించిన విద్యార్థులు జూలై 1న నిర్దేశిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. విద్యార్థులకు అవగాహన ఈ ఏడాది అధిక శాతం మంది ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించే అవకాశం జిల్లా నుంచి లభించనుంది. 15 మండలాల్లో అనేక ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు రాబెట్టారు. ఈ క్రమంలో వారు ట్రిపుల్ ఐటీలో చేరే అవకాశాలను అందిపుచ్చుకోవాలి. మా పరిధిలో ఉపాధ్యాయులు పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని గ్రామాల్లో ప్రచారం చేయటంతో పాటు అర్హత గల విద్యార్థులకు ట్రిపుల్ ఐటీకి దరఖాస్తులు చేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. – పర్రి కృష్ణమూర్తి, డిప్యూటీ ఈఓ, పాలకొండ -
బఫర్ జోన్‌లోని అక్రమ కట్టడాలు కూల్చివేయండి
బొబ్బిలి: స్థానిక పట్టణంలోని బఫర్ జోన్(కోటి చెరువు, భైరిసాగరం తదితర సాగునీటి వనరుల ప్రాంతం)లో ఉన్న అకమ్ర కట్టడాలను తక్షణమే కూల్చివేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కోట అప్పన్న, పట్టణ అధ్యక్షుడు మునకాల శ్రీనివాసరావులు డిమాండ్ చేశారు. ఇదే విషయమై వారు మండల కేంద్రంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. బొబ్బిలి పట్టణ నలుమూలల ఉన్న ఖాళీస్థలాలు, చెరువు గర్భాలను పలువురు అక్రమార్కులు ఆక్రమించుకుంటుంటే రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కొంతమంది మున్సిపల్, రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే ప్రభుత్వ స్థలాల కబ్జా, తప్పుడు ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు వంటివి జరుగుతున్నాయని ఆరోపించారు. ఒకప్పుడు మల్లంపేట, గొల్లపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు–55లో 80 ఎకరాలు, భైరిసాగరం మరో 80 ఎకరాలు ఉండేవన్నారు. ఇప్పుడు వాటిలో సగానికి పైగా స్థలం కబ్జాదారుల చేతిలోకి వెళ్లిపోయిందన్నారు. కబ్జారాయుళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ప్రభుత్వ స్థలాల కబ్జాను ఆపాలని కోరారు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో సైక్లిస్ట్..జామి: మండల కేంద్రమైన జామిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక సైక్లిస్ట్ దుర్మరణం పాలైన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. జామి గ్రామానికి చెందిన బీల అచ్చన్న(54) పొలం పని చేసుకుని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో స్థానిక వినాయక గుడి వద్ద ఎస్.కోట నుంచి విజయనగరం వైపు వస్తున్న లారీ సైక్లిస్ట్‌ను ఢీకొనడంతో లారీ వెనుక భాగాన టైర్లు కింద పడి దుర్మరణం పాలయ్యాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ వీర జనార్ధన్ ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య కనకమ్మ, ఒక కుమార్తె ఉన్నారు. పాలకొండ రూరల్: సీతంపేట రహదారిలో పట్టణ శివారున ప్రధాన రహదారికి పక్కన ఓ వ్యక్తి మృతదేహాన్ని అక్కడి స్థానికులు గుర్తించారు. ఒంటిపై పూర్తి స్థాయి బట్టలు లేకుండా ఉండటంతో తొలిత పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇంతలో అతను పట్టణంలో గల ఎన్ఎస్ఎన్ కాలనీకి చెందిన బుడ్డి(55)గా గుర్తించారు. ఈయన గత కొద్ది రోజులుగా మానసికంగా ఇబ్బందులు పడుతూ, మద్యానికి బానిసై తిరుగుతున్నట్టు తేలింది. ఈ కోవలో మరణించి ఉంటారని భావించి స్థానికులు వారి బంధువులకు సమాచారం అందించారు. వారి బంధువులు వచ్చి మృతదేహాన్ని తరలించారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. భామిని: మండలంలోని బత్తిలికి చెందిన యువకుడు కోట చంటి (29) శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. బత్తిలికి చెందిన మీసాల సమీర్‌తో కలిసి బుల్లెట్ బైక్‌పై కోట చంటి కొత్తూరు వైపు వెళ్తుండగా ఘనసర వద్ద ఏబీ రోడ్డుపై ప్రమాదానికి గురై మృతి చెందాడని బత్తిలి ఎస్ఐ కె.రవీంద్ర తెలిపారు. బైక్ డ్రైవ్ చేస్తున్న సమీర్ ఈ ప్రమాదంలో చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. బైక్‌పై వెళ్తున్న వీరికి ఘనసర వద్ద ఎదురుగా వ్యాన్ వచ్చింది. వ్యాన్‌కు దారిచ్చేందుకు బైక్‌ను సడన్ బ్రేక్ వేయగా చంటి తుళ్లి కిందకు పడిపోయాడు. ఈ ప్రమాదంలో చంటి తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో ప్రమాద స్థలంలోనే చంటి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. బత్తిలి ఎస్ఐ రవీంద్ర కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీతానగరం: మండలంలోని కృష్ణారాయపురం గ్రామానికి చెందిన గుణుపూరు అచ్చుతరావు(26) సత్తెనపల్లి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే... అచ్చుతరావు డిప్లమా ఇంజినీరింగ్ చదివి ఉద్యోగం నిమిత్తం ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ వెళ్లి ఓ ప్రైవేటు కంపెనీలో ఉపాధి చూసుకున్నాడు. హైదరాబాద్‌లోని బొల్లారంలో నివాసం ఉంటూ శుక్రవారం హైదరాబాద్ నుంచి మోటారుసైకిల్‌పై కాకినాడ వస్తుండగా సత్తెనపల్లి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన అచ్చుతరావును సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వద్ద ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు శనివారం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చేతికందొచ్చిన కొడుకు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు గంగమ్మ, భాస్కరరావు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హెల్మెట్ ధరించకుంటే రూ.5 వేలు జరిమానా
విజయనగరం క్రైమ్: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి, ప్రాణాలు కాపాడుకోవాలని విజయనగరం ట్రాఫిక్ సీఐ సూరినాయుడు సూచించారు. నగరంలోని న్యూపూర్ణ జంక్షన్ వద్ద హెల్మెట్ వాడకంపై శనివారం అవగాహన కల్పించారు. బైక్‌లతో రోడ్లపైకి వచ్చేటప్పుడు హెల్మెట్, లైసెన్స్‌లతో పాటు వాహన ధ్రువపత్రాలు కూడా వెంట తెచ్చుకోవాలని తెలిపారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు పాటించి, రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. చాలామంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్ ధరిస్తే మన ప్రాణానికే రక్ష అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. హెల్మెట్ లేకుండా తొలిసారి పట్టుబడితే వదిలేస్తామని, మరోసారి పట్టుబడితే రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఐ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
అనారోగ్యంతో గిరిజన విద్యార్థి మృతి
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని దొరజమ్ము ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎన్.ఆశ్రయ్య (14) విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పాములగీసాడ గ్రామానికి చెందిన ఆశ్రయ్యకు గురువారం కడుపునొప్పి వచ్చింది. తల్లిదండ్రులు వెంటనే రేగిడి పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ తగ్గక పోవడంతో కురుపాం సీహెచ్‌సీకి, అక్కడి నుంచి పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి, మరింత మెరుగైన వైద్యంకోసం విశాఖపట్నం కేజీహెచ్ కు తరలించినా ఫలితం లేకపోయింది. విద్యార్థి ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కావడంతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారని ఏటీడబ్ల్యూఓ ఎల్.రజని తెలిపారు. అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుపెడుతున్నారు. జియ్యమ్మవలస రూరల్: ఇప్పటికే గాలివానల కు సుమారు 165 ఎకరాలకు పైబడి అరటి పంట నష్టం వాటిల్లిన కుదమ రైతులకు ఏనుగులు గుంపురాకతో బెంగపట్టుకుంది. ఉన్నకాస్త అర టి పంటను నష్ట పరుస్తాయని ఆందోళన చెందుతున్నారు. గజరాజులను శాశ్వతంగా తరలింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ సేవాగుణాన్ని అలవర్చుకోవాలి ● రెడ్‌క్రాస్ చైర్మన్ ప్రసాదరావు విజయనగరం ఫోర్ట్: ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ ప్రసాదరావు కోరారు. రెడ్‌క్రాస్ సొసైటీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సీతం ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్తదాతలను అభినందించారు. కార్యక్రమంలో సీతం కళాశాల డైరెక్టర్ మజ్జి శశిభూషణరావు, ఎన్సీపీ కెప్టెన్ సత్యవేణి, ఎన్సీసీ లెఫ్ట్‌నెంట్ ఉదయ్‌కిరణ్, డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. విజయనగరం: విజయనగరం జిల్లా స్థాయి అండర్–13 చెస్ పోటీల్లో చిన్నారులు తమ మేధస్సుకు పదునుపెట్టారు. ఎత్తుకు పై ఎత్తులు వేసి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. విజయనగరం చెస్ అకాడమీలో శుక్రవారం జరిగిన ఎంపిక పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఓపెన్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన శ్రీమన్, నారాయణ సాహూ, అమండు, జిగ్నేష్, బాలికల విభాగంలో ఎజ్జురోతు పరిణిత, భావన రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఎంపిక ప్రక్రియకు కె.వి.జ్వాలాముఖి, ఎ.హేమబిందు, ఆసిఫ్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. -
సూత్రధారులకు లైన్ క్లియర్?
నిడగల్లు సా మిల్లు వద్ద అడారు ఎంపీపీ పాఠశాలలో నరికిన టేకుచెట్లు (ఫైల్) సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం మండలం అడారు ఎంపీపీ పాఠశాలలో రూ.లక్షల విలువైన టేకు చెట్లను ‘తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు’ అక్రమంగా తరలించుకుపోయిన విషయం విదితమే. అధికార పార్టీ కీలక నేతల ప్రమేయం ఉండడంతో వాస్తవానికి ఈ కేసును నీరుగార్చే ప్రయత్నమే జరిగింది. దీనిపై పత్రికల్లో కథనాలు రావడం.. అటవీ శాఖ, విద్యాశాఖ తప్పిదాలు ఉండడంతో ఉప ముఖ్యమంత్రి పేషీ నుంచి ఆరా తీసినట్లు తెలిసింది. ఆ క్రమంలోనే జిల్లా అటవీ శాఖ అధికారులు ఆలస్యంగా స్పందించారు. సీతానగరం మండలం నిడగల్లు వద్ద సా మిల్లులో ఉన్న టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నా రు. మిల్లు సీజ్‌తో సరిపెట్టుకున్నారు. మరోవైపు కలప అక్రమ తరలింపులో అసలు నిందితులను ఇప్పటి వరకూ గుర్తించలేదు. పాఠశాల హెచ్ఎం స్వ యంగా ఫిర్యాదు చేసి నా పోలీసుల నుంచి కూడా స్పందన లే దు. కేసును నీరుగార్చే క్రమంలో ఆ దుంగ లు.. పాఠశాలలో తొలగించిన చెట్లు ఒక్కటి కాదనే విషయాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నార ని తెలుస్తోంది. ఇదే సమయంలో ‘అన్న’కు తెలియకుండానే ‘తమ్ముళ్లు’ అత్యుత్సాహంతో తెలియక తప్పు చేశారన్న కొత్త వాదనను వినిపిస్తున్నారు. ఏళ్ల కిందటనాటి చెట్లు కావడంతో నామమాత్రపు రుసుంతో ఎంఈవోకు దరఖాస్తు చేసుకుంటే.. అక్కడ పరిస్థితిని బట్టి అట వీ శాఖ అనుమతితో వారే తొలగింపునకు అనుమ తి ఇచ్చేవారని ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు. తమను ఎవరు ఆపేదన్న అతితో ‘తమ్ముళ్లు’ దర్జాగా చెట్లను నరికి తీసుకుపోయారు. చివరికి అది వివాదం కావడంతో బురద అంటకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని కడుగుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సూత్రధారులను పక్కన పెట్టి.. సంబంధం లేని పాత్రధారులను బలి పశువులు చేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. -
బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి
విజయనగరం క్రైమ్: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో శుక్రవారం బస్సు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందింది. వన్‌టౌన్ ఎస్ఐ రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం మండలం రాకోడుకు చెందిన బోదంకి నారాయణమ్మ(76) బస్సు కోసం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చింది. ఆ సమయంలో బస్టాండ్‌లో డ్రైవర్ లక్ష్మునాయుడు బస్సు తీసే క్రమంలో వెనుకాలే ఉన్న నారాయణమ్మను ఢీకొట్టింది. దీంతో ఆమె పడిపోయింది. ఆమె పైనుంచి బస్సు వెళ్లిపోయింది. దీంతో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. సమీపంలో ట్రాఫిక్ అవుట్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హెచ్.పాల్ ప్రమాద సమాచారాన్ని మ్యాన్ ప్యాక్ ద్వారా వన్‌టౌన్ పోలీసులకు ఇచ్చాడు. వన్ టౌన్ ఎస్ఐ రవి ప్రమాద స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి మనవడు సురేష్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
ఇదే మంచి తరుణం
ధ్రువపత్రాలు పొందేందుకు..రామభద్రపురం: ఇటీవల పదో తరగతి, ఇంటర్ తదితర తరగతుల పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, ట్రిపుల్ ఐటీ, ఇంజినీరింగ్, వైద్య తదితర కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకు విద్యార్హత పత్రాలతో పాటు ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. జూన్ నెలలో విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో ధ్రువపత్రాలు పొందేందుకు ఇదే మంచి తరుణం. వేల సంఖ్యల్లో ఉన్న విద్యార్థులకు ఒకేసారి ధ్రువపత్రాలు జారీ చేయడం అధికారులకు కష్టతరమవుతోంది. ముందుగా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులు పరిశీలించి జారీ చేయడానికి అవకాశం ఉంటుంది. నమోదు చేసుకోవడం ఇలా.. కులం, ఆదాయ, నివాస ద్రువీకరణ పత్రాల కోసం స్వర్ణ, గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థితో పాటు తల్లిదండ్రుల ఆధార్, కుటుంబ సభ్యులున్న రేషన్ కార్డు ఇతర పత్రాలతో దరఖాస్తు జత చేయాలి. స్వర్ణ, గ్రామ సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు ఇంటర్నెట్లో నమోదు చేసి సంబంధిత వీఆర్ఓలు పరిశీలించి దరఖాస్తుకు సంబంధించి రిపోర్ట్ రాసి ఆర్‌ఐకు పంపుతారు. ఆర్ఐ పరిశీలించి తహసీల్దార్‌కు పంపగా అన్ని పత్రాలు పరిశీలించి సక్రమంగా ఉంటే డిజిటల్ సంతకం మండల తహసీల్దార్ చేస్తారు. సంబంధిత విద్యార్థి సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. అప్పుడు దరఖాస్తు చేసుకున్న కేంద్రాలకు వెళ్లి ఆయా ధ్రువపత్రాలు తీసుకోవచ్చు. సర్వేల్లో సచివాలయ సిబ్బంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలలోని సిబ్బందిపై పనిభారం పెరిగింది. వలంటీర్లు లేకపోవడంతో పింఛన్ల పంపిణీతో పాటు రకరకాల సర్వేలు వారితో చేయిస్తోంది. జాబ్ చార్ట్‌కు విరుద్ధంగా వారికి సంబంధించిన శాఖ పనులే కాకుండా ఇతర శాఖలకు చెందిన పనులు కూడా అప్పగించడంతో క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పనులు చేయడం వల్ల వారు బిజీ అయ్యారు. ప్రస్తుతం గ్రామాలలో జనగణన సర్వే ఇంటింటికీ వెళ్లి చేస్తున్నారు. పనుల కోసం సచివాలయాలకు వెళ్లిన వారికి అందుబాటులో లేక సకాలంలో సేవలు అందించలేని పరిస్థితి ఉంది. గ్రామ స్థాయిలో ప్రజలకు రోజు రోజుకు సేవలు సన్నగిల్లుతున్నాయి. జనగణన సర్వేలో డిజిటల్ అసిస్టెంట్లు కూడా ఉండడంతో ధ్రువపత్రాల కోసం చేసిన దరఖాస్తులు అప్లోడ్ చేసేందుకు ఆలస్యం అవుతోంది. సర్వే చేసిన తర్వాతగాని సచివాలయాలకు చేరకపోవడంతో ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లిన విద్యార్థులకు సకాలంలో సేవలు అందిచలేని పరిస్థితి ఉంది. దాంతో వారు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యం కాకుండా జారీ చేస్తాం.. ధ్రువపత్రాల కోసం ముందుగా దరఖాస్తు చేసుకుంటే త్వరితగతిన పత్రాలు జారీ అవుతాయి. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించి వివరాలు సక్రమంగా ఉంటే మంజూరు చేస్తాం. ఎక్కడా ఆలస్యం కాకుండా త్వరితగతిన జారీ చేయాలని ఇప్పటికే మండల స్థాయి అధికారులతో చర్చించాం. ఎవరూ ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకున్నాం. – జేవీఎస్ఎస్ రామమోహనరావు, ఆర్డీఓ, బొబ్బిలి దరఖాస్తు చేసుకొండి.. ధ్రువపత్రం పొందండి విద్యార్థులకు రెవెన్యూ అధికారుల సూచన -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
గజపతినగరం రూరల్: మండలంలోని గుడివాడ గ్రామ సమీపంలో రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఈశ్వరరావు శుక్రవారం అందించిన వివరాలు... పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని రావుపల్లి గ్రామానికి చెందిన పల్ల అప్పలనాయుడు(25) ఈ నెల ఆరో తేదీ రాత్రి 8.40 గంటల సమయంలో రైల్వే టికెట్ తీసుకొని భవానిపట్నం పాసింజర్లో సింహాచలం నుంచి పార్వతీపురం ప్రయాణం చేస్తుండగా గజపతినగరం – కోమటిపల్లి రైల్వేస్టేషన్ల మధ్య మండలంలోని గుడివాడ గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. దీంతో అప్పలనాయుడు తీవ్రంగా గాయపడి అక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బొబ్బిలి జీఆర్పీ హెచ్‌సీ బండారు ఈశ్వరరావు తెలిపారు. -
పిల్లలపై ఓ కన్నేయండి..!
పిల్లలతో స్నేహితుల్లా ఉండాలి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు...? ఎవరితో తిరుగుతున్నారు..? ఏమి చూసున్నారు..? అన్నది తల్లిదండ్రులు గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. భయపెట్టకుండా ప్రేమగా మాట్లాడితే పిల్లలు తమ విషయాలు చెప్పుకుంటారని చెబుతున్నారు. సెలవుల సమయంలో పిల్లల కోసం తల్లిదండ్రులు సమయం కేటాయించాలి. స్నేహితుల్లా మాట్లాడితేనే వారు సరైన మార్గంలో నడుస్తారు. పిల్లలను ఒంటరిగా వదిలేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. – వై.సతీష్‌కుమార్, కెమిస్ట్రీ లెక్చరర్, మానసిక వికాస నిపుణులు, విజయనగరం విజయనగరం గంటస్తంభం: వేసవి సెలవులొచ్చాయంటే పిల్లలకి పండగే. పుస్తకాల భారముండదు.. ఉదయం లేచిందే మొదలు ఆటలు.. మధ్యాహ్నం మొబైల్.. సాయంత్రం స్నేహితుల వెంట ఊరు చుట్టేయడం. కానీ అదే ఆనందం కొన్ని కుటుంబాల్లో కన్నీళ్లు మిగులుస్తోందని పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సెలవులు మొదలైనప్పటి నుంచి పిల్లలపై ప్రత్యేక నిఘా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ మోజు... మెల్లగా మింగేస్తోంది డిజిటల్ కాలంలో చిన్నారులు మొబైల్ ఫోన్లకే పరిమితమవుతున్నారు. ఉదయం లేవగానే ఫోన్.. రాత్రి పడుకునే వరకు గేమ్స్, రీల్స్, సోషల్ మీడియాతో గడుపుతున్నారు. బయట ఆటలు తగ్గిపోవడంతో పాటు చదువుపై ఆసక్తి కూడా తగ్గుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొంత మంది పిల్లలు అనవసర యాప్‌లు, చెడు స్నేహాల ప్రభావానికి లోనవుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. చెడు సావాసాలు జీవితాలను నాశనం చేసేస్తున్నాయి.. సెలవుల సమయంలో పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు మైనర్లు గంజాయి, సిగరెట్, ఇతర మత్తు పదార్ధాల వైపు ఆకర్షితులవుతున్నారని సమాచారం. సరదాగా మొదలైన అలవాటు తర్వాత కుటుంబాలకు తీరని బాధను మిగులుస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులూ.. బిడ్డలూ పదిలం.. సుమీ! మృత్యువుతో చెలగాటమొద్దు ఆటల మాటున ఆపదలు ఆన్లైన్లో మునిగితే భవిష్యత్తుకే ముప్పు చెరువులు, రోడ్లు, మొబైళ్లతో పెరుగుతున్న ప్రమాదాలు సరదా.. వ్యవనం కాకముందే మేల్కొనండి మత్తు పదార్ధాలు, డిజటల్ బానిసత్వంపై నిఘా ఉంచండి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక -
శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం ఐటీడీఏలో గిరిజన సంక్షేమ శాఖ డీడీగా పనిచేస్తున్న విజయశాంతి ఇక్కడ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. సెలవుపై వెళ్తు న్న ఆమె.. తిరిగి వచ్చేందుకు ఇష్టం చూపడం లేదని తెలుస్తోంది. తన డిప్యుటేషన్‌ను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు కోరనున్నట్లు సమాచారం. ఐటీడీఏలో కొన్నాళ్లుగా సాగుతున్న అంతర్యుద్ధం నేపథ్యంలో ఇక్కడ ఇమడలేక, ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఐటీడీఏలో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులుగా విజయశాంతి కొన్నాళ్ల కిందట డిప్యుటేషన్‌పై పూర్తి అదనపు బాధ్యతలతో ఇక్కడకు వచ్చిన విషయం విదితమే. కొద్దిరోజుల పాటు అంతా సజావుగా సాగినా.. ఆమెను ఇక్కడ కొనసాగించడం ఇష్టం లేక, కొంతమంది తెర వెనుక పావులు కదుపుతూ వస్తున్నారు. తమకున్న రాజకీయ పలుకుబడితో ఆ స్థానంలోకి వచ్చేందుకు కొందరు ఏటీడబ్ల్యూవోలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పాలనాపరంగా డీడీకి సహకారం కూడా అందించడం లేదని కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. శాఖలో ఓ వార్డెన్‌తో డీడీకి వ్యతిరేకంగా అప్పటి ఇన్చార్జి పీఓ యశ్వంత్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేయించారు. పీఓ పేరు చెప్పి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ అప్పట్లో యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో ఆయనను కూడా ఐటీడీఏలోని కొంతమంది తప్పుదోవ పట్టించారని గిరిజన సంఘాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో వార్డెన్ ఏ అంశం మీద ఫిర్యాదు ఇచ్చారన్నది ఏ ఒక్కరూ బయట పెట్టలేదు. ఈ నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగులతో సమావేశమైన అప్పటి పీఓ.. శాఖలో ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో ఐటీడీఏ, గిరిజన సంక్షేమ శాఖ విభాగాల్లో పలువురు ఉద్యోగుల స్థానాలను మార్పు చేశారు. కొత్తగా విభాగానికి సంబంధం లేని ఉద్యోగులను తమకు అప్పగించడం వల్ల పరిపాలనాపరంగా ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన డీడీ.. ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు విముఖత చూపారు. దీంతో ఆమెకు అప్పటి పీఓ షోకాజ్ నోటీసు జారీ చేశారు. అనంతరం పీఓగా ఆర్.వైశాలి బాధ్యతలు స్వీకరించడంతో ఉద్యోగుల స్థానచలనం వివాదం సద్దుమణిగిందనే అంతా భావించారు. అనూహ్యంగా ఈ విషయాన్ని పీఓ వైశాలి మళ్లీ తెరపైకి తెచ్చారు. -
దూసుకొచ్చిన మృత్యువు
● కొమరాడలో కనురెప్పపాటులో ఘోర రోడ్డు ప్రమాదం ● అదుపు తప్పి కూరగాయల దుకాణంలోని దూసుకెళ్లిన బొలేరో ● ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు కొమరాడ: రోడ్డు పక్కన ఉన్న టీ దుకాణంలో టీ తాగుతూ ముచ్చట్లు చెబుతున్న ఓ వృద్ధుడిపై మృత్యువు దూసుకొచ్చింది. బొలేరో వాహనం రూపంలో కనురెప్పవేసిన పాటులో ప్రాణాలను హరించింది. వ్యవసాయ పనులపై వెళ్తూ ఆగిన మరో ఇద్దరు.. కూరగాయలు విక్రయిస్తున్న మరో మహిళను క్షతగాత్రులుగా మార్చింది. దుకాణాలపైకి దూసుకొచ్చిన బొలేరోవాహనాన్ని చూసిన స్థానికులు భీతిల్లిపోయారు. భయంతో పరుగులు తీశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పార్వతీపురం నుంచి రాయగడ వైపు అతివేగంగా వెళ్తున్న బొలేరో వాహనం శుక్రవారం మధ్యాహ్నం అదుపుతప్పి కొమరాడ మండల కేంద్రంలోని రోడ్డుపక్కన ఉన్న దుకాణాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో టీ తాగేందుకు వచ్చిన కొమరాడ గ్రామానికి చెందిన మరడాన చిన్నంనాయుడు(75) దుర్మరణం చెందారు. పొరుగు జిల్లా నుంచి వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగిస్తున్న ముద్దురు గోపాల్‌కృష్ణ, కూనేరు రామభభద్రపురం గ్రామానికి చెందిన మోయి జాషువ, అక్కడే కూరగాయల దుకాణం నిర్వహిస్తున్న బొత్స మహలక్ష్మి గాయపడ్డారు. వీరిని వైద్యం కోసం కొమరాడ పీహెచ్‌సీకి తరలించారు. వృద్ధుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. కొమరాడ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
గిరిజన సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత
పార్వతీపురం: గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఐటీడీఏ పీఓ ఆర్.వైశాలి అన్నారు. శుక్రవారం ఐటీడీఏలోని గిరిమిత్ర హాల్లో నిర్వహించిన గిరిజన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 19 వినతులను స్వీకరించి, సంబంధిత శాఖాధికారులతో వెంటనే పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతీ వినతిని బాధ్యతాయుతంగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సేవలు సమయానికి అందేలా చర్యలు కొనసాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీఓ పి.మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా సహస్ర దీపాలంకరణ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం రాత్రి కనులపండువగా జరిపించారు. వెండి మంటపంలో ఉన్న సీతారామస్వామి ఉత్సవ విగ్రహాలను మంగళవాయిధ్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి, దీపారాధన మంటపంలో ఉన్న ప్రత్యేక ఊయలలో ఉంచారు. అనంతరం దీపాలను వెలిగించి, స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు, దేవస్థాన సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నీలో.. సత్తా చాటిన విజయనగరం విజయనగరం గంటస్తంభం: అనంతపురంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్ధాయి శాప్ కప్ అండర్–25 పుట్‌బాల్ టోర్నమెంట్లో విజయనగరం జిల్లా జట్టు ఘన విజయం సాధించింది. ఫైనల్లో విశాఖపట్నం జిల్లా జట్టుపై 4–1 గోల్స్ తేడాతో అద్భుత ప్రదర్శన కనబరిచి ప్రథమ స్థానం కై వసం చేసుకుంది. ఈ సందర్భంగా జిల్లా ఫుట్‌బాల్ జట్టును మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.రజనీకుమార్, కార్యదర్మి వి.మహాలక్ష్మిరావు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాల తీరు దారుణం
బొబ్బిలి: విశాఖపట్నం రైల్వేజోన్ ప్రకటించి ఏళ్లు గడుస్తుండగా.. ఇప్పుడు కొత్తగా కిరండోల్ రైల్వేలైన్ తప్పించి విశాఖ రైల్వే జోన్ ప్రకటించడం దారుణమని ఉత్తరాంధ్ర సాధన సమితి వ్యవస్థాపక కన్వీనర్ వేమిరెడ్డి లక్ష్మునాయుడు అన్నారు. బొబ్బిలిలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఉన్న వాల్తేరు డివిజన్నే విశాఖ డివిజన్ అనిపేరు పెట్టారు తప్ప అధికాదాయం ఉన్నప్రాంతాలను మాత్రం ఎక్కడో దూరాన ఉన్న రాయగడ డివిజన్లో కలపడం అన్యాయమన్నారు. కొత్తవలస–కిరండోల్ రైల్వేలైన్ వల్ల ఏటా రూ.3వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. రాష్ట్ర విభజన తరువాత అటువంటి ఆదాయ వనరును ఏపీకి అన్వయించాలే తప్ప వేరే రాష్ట్రానికి బదలాయించి ఏపీకి తీరని నష్టాన్ని మిగిల్చారన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం దీనిపై నోరు విప్పకవడం విచారకరమన్నారు. ఇది రాష్ట్రప్రజలను మోసం చేయడమేనన్నారు. విశాఖ రైల్వే జోన్ మంజూరు జరిగిన నాటి నుంచి రైల్వే ఉద్యోగులు, ప్రజానీకం కేకే లైన్‌ను విశాఖ జోన్లోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కేకే లైన్ ను తప్పించి విశాఖనుజోన్గా ప్రకటించడం ఏపీపై కేంద్రానికి ఉన్న ఆలోచన ఎలాంటిదో తెలుస్తోందన్నారు. కార్యక్రమంలో వజ్జి రవికుమార్, తమ్మిరెడ్డి కృష్ణ, చుక్క కూర్మినాయుడు పాల్గొన్నారు. -
మూగబోయిన జానపద స్వరం
విజయనగరం గంటస్తంభం: విజయనగరం జిల్లా కణపాకలో ఓ చిన్న ఇల్లు..ఆ ఇంటి నుంచి ఒకప్పుడు వినిపించిన గాత్రం ఉత్తరాంధ్ర పల్లెల్ని ఉర్రూతలూగించింది. ఆ గాత్రం దంపుడు లక్ష్మిది. బుర్రకథ అంటే ఏమిటో..జానపద కళలో భావోద్వేగం ఎలా ఉంటుందో? ఒక మహిళ వేదికపై నిలబడి వేల మందిని ఎలా కట్టిపడేస్తుందో తన జీవితంతో చూపించిన కళాకారిణి ఆమె. కానీ జనాలను నవ్వించిన ఆ కళాకారిణి జీవితం మాత్రం నిశ్శబ్దంగా కన్నీళ్ల మధ్య ముగిసింది. ˘õ³§ýl-ÇMýS… Ð]l$«§ýlÅ ç³#sìæt¯]l MýSâê{ç³-Ý릯]l… చిన్నప్పటి నుంచే లక్ష్మికి కళలంటే ప్రాణం. అప్పట్లో గ్రామాల్లో విద్యుత్ లేదు..టీవీలు లేవు..వినోదానికి జాతరలు, బుర్రకథలే ప్రధాన ఆధారం. గ్రామంలో ఎక్కడ బుర్రకథ వినిపించినా చిన్నారి లక్ష్మి అక్కడికెళ్లి గంటల తరబడి చూసేది. కథ చెబుతున్న వాళ్ల హావభావాలు, పాటలు, సంభాషణలు ఆమెను ఆకట్టుకునేవి. ఆ ఆసక్తే తర్వాత ఆమె జీవితాన్ని బుర్రకథ వైపు నడిపించింది. ఆ రోజుల్లో మహిళలు వేదికపైకి రావడం చాలా అరుదు. అయినా భయపడకుండా బుర్రకథ రంగంలోకి అడుగుపెట్టిన లక్ష్మి, తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ˘§ýl…ç³#yýl$ ÌS„ìSà Ð]lçÜ$¢…-§ýl…sôæ FÆý‡…™é ^ólÆó‡¨ ఒకప్పుడు ఉత్తరాంధ్ర గ్రామాల్లో జాతరలో బుర్రకథ తప్పనిసరి. సాయంత్రం కాగానే గ్రామం మధ్యలో చిన్న వేదిక ఏర్పాటు చేసేవారు. నేలమీదే పిల్లలు, పెద్దలు కూర్చుని కథ మొదలయ్యే వరకు ఎదురు చూసేవారు. అప్పుడు దంపుడు లక్ష్మి బుర్రకథ మొదలైతే చాలు..జనాలు మైమరచిపోయేవారు. బాలనాగమ్మ, సీతారామ కల్యాణం, నలదమయంతి, మహాభారతం, రామాయణం..ఏ కథ చెప్పినా తన గాత్రంతో ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పించగలిగేది. హాస్యం చెప్పి నవ్వించేది.. విషాదం చెప్పి ఏడిపించేది. అంతటి మంత్రముగ్థత ఆమె కళలో ఉండేది. ˘MýSâýæ™ø ´ër$ {ç³fÌZÏ O^ðl™èl-¯]lÅ….. దంపుడు లక్ష్మి కేవలం వినోదం కోసం మాత్రమే కథలు చెప్పలేదు. బాల్య విహహాలు, అక్షరాస్యత, మహిళా హక్కులు, ఎయిడ్స్ నియంత్రణ, పొదుపు సంఘాలు, పనికి ఆహార పథకం వంటి ప్రభుత్వ కార్యక్రమాలపై కూడా ఊరూరా తిరిగి బుర్రకథల రూపంలో ప్రజల్లో అవగాహన కల్పించింది. ఆ రోజుల్లో ప్రభుత్వ అధికారులు కూడా దంపుడు లక్ష్మి బృందం వస్తే ప్రజలకు విషయం త్వరగా చేరుతుందని ప్రత్యేకంగా ప్రోగ్రాములు పెట్టేవారు. విజయనగరం మాత్రమే కాదు..ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా ఆమె ప్రదర్శనలు ఇచ్చింది. ˘f¯éÌS ^èlç³µsôæÏ M>± yýlº$¾ Æ>Ìôæ§ýl$ వేదికలపై చప్పట్లు కొట్టిన జనాలు వేలమంది. కానీ ఆ చప్పట్లు ఆమె జీవితాన్ని నిలబెట్టలేకపోయాయి. కళను నమ్ముకుని కుటుంబాన్ని నెట్టుకొచ్చిన లక్ష్మి ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, ఒంటరి పోరాటం..అన్నింటినీ భరించింది. ఒక కుమారుడిని కష్టపడి పెంచి పెద్ద చేసింది. అయితే కళాకారిణిగా ఆమెకు పేరు వచ్చినా..జీవితంలో మాత్రం స్థిరత్వం రాలేదు. ˘yìlhrÌŒæ Ķæ¬VýS….. MýS¯]l$-Ð]l$-Æý‡$-OVðS¯]l º${Æý‡MýS£ýl కాలం మారింది. టెలివిజన్ వచ్చింది. తర్వాత సినిమాలు, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వచ్చాయి. గ్రామాల్లో జాతరల వేదికలపై బుర్రకథల స్ధానంలో రికార్డింగ్ డ్యాన్సులు వచ్చాయి. ఒకప్పుడు రాత్రంతా కూర్చుని బుర్రకథలు విన్న ప్రజలు.. ఇప్పుడు మొబైల్ స్క్రీన్స్‌పై వినోదం వెతుక్కుంటున్నారు. కొత్త తరం జానపద కళల వైపు చూడకపోవడం, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం వల్ల బుర్రకథలు క్రమంగా కనుమరుగయ్యాయి. ఆ కళను నమ్ముకున్న కళాకారులు బతుకు కోసం ఇతర పనులు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ˘_Ð]l-ÇMìS MýS*Æý‡V>-Ķæ$ÌS §ýl$M>-׿Ðól$ B«§éÆý‡… ఒకప్పుడు వేదికలపై వేలాది మందిని అలరించిన దంపుడు లక్ష్మి... చివరికి కలెక్టర్ కార్యాలయం పక్కన చిన్న కూరగాయల దుకాణం పెట్టుకుని జీవనం సాగించింది. అది ఆమె జీవితంలో అత్యంత బాధాకరమైన మలుపు. కళతో గౌరవం వచ్చింది. కానీ బతుకు రాలేదు. అనారోగ్యం వెంటాడినా.. మందులకు డబ్బు లేకపోయినా..అప్పుడప్పుడు చిన్న ప్రోగ్రాములు చేస్తూనే ఉండేది. కళను వదిలేస్తే నేను బతకలేను అని చెప్పేదామె. ˘MóS¯]lÞ-ÆŠ‡™ø ´ùÆ>-yìl¯]l MýSâê-iÑ™èl… కేన్సర్ బారిన పడిన తర్వాత ఆమె పరిస్థితి మరింత దయనీయమైంది. వైద్యానికి డబ్బులు సరిపోలేదు. ప్రభుత్వ సహాయం అందలేదు. కళాకారుల పెన్షన్ కూడా ఆమెకు దక్కలేదు. జీవితాంతం ప్రజలకు సందేశాలు చెప్పిన కళాకారిణి.. చివరికి తన బాధను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో మిగిలిపోయింది. ఈ నెల 5 మంగళవారం ఆకస్మాత్తుగా ఆయాసానికి గురై ఆమె తుదిశ్వాస విడిచింది. బుర్రకథ కళాకారిణి దంపుడు లక్ష్మి మృతి ప్రభుత్వ పథకాల ప్రచారంలో ముందున్న కళాకారిణి బాల్య వివాహాలపై బుర్రకథలతో పోరాడిన మహిళ కళను నమ్ముకున్న జీవితం..ఆదుకోని సమాజం డిజిటల్ యుగం దెబ్బకు కనుమరుగైన జీవితం -
శుక్రవారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2026
సీతానగరం: ఒడిశా సరిహద్దులోని పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలను ఏనుగుల భయం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట పంటలకు, రైతుల ఆస్తులకు ఏనుగులు నష్టం కలిగిస్తున్నాయి. పంట పొలాలు, రోడ్లపై సంచరిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఎదురుగా వచ్చేవారి ప్రాణాలు తీస్తున్నాయి. ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదాన్ని తలపెడుతాయోనన్న భయంతో పల్లె ప్రజలు బతుకుతున్నారు. కుంకీ ఏనుగులను తీసుకొచ్చి ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామంటూ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రకటనలు ఆచరణ శూన్యంగానే కనిపిస్తున్నాయి. అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు. ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ ఈ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏనుగుల సమస్యపై ప్రతివారం కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్లో వినతులు అందజేస్తున్నారు. ఆరుగా లం శ్రమించి సాగుచేసిన పంటలను ఏనుగులు నష్టపరుస్తున్నాయని, పెట్టుబడి కూడా రావడం లేదని, ఆదుకోవాలంటూ విన్నవిస్తున్నారు. దీనిపై స్పందించిన జిల్లా యంత్రాంగం గుచ్చిమి బీట్‌లోని కంపార్ట్మెంట్ నంబర్ 195, 196 పరిధిలో సుమా రు 50 హెక్టార్ల విస్తీర్ణంలో తాత్కాలిక ఏనుగుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. అటవీశాఖ అధికారుల పర్యవేక్షణలో సుమారు రూ.3 కోట్ల ఖర్చుతో పనులు జరుగుతున్నాయి. అయితే, ప్రభుత్వం స్పందించి చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో ఉన్న కుంకీ ఏనుగులను రప్పిస్తే తప్ప ఈ ప్రాంతంలోని ఏనుగులను సంరక్షణ కేంద్రానికి తరలించడం సాధ్యం కాదన్న వాదన అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది. వివిధ ప్రమాదాల్లో ఓ వైపు 9 ఏనుగులు మరణించాయి. మరోవైపు 14 మందిని ఏనుగులు పొట్టనపెట్టుకున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలి యని భయం. అటవీశాఖ సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేస్తున్నా అమాయకులైన గిరిజనులు ఏనుగులకు తారసపడి బలవుతున్నారు. ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రజలను ఓదార్చుతున్న ప్రభుత్వాలు తర్వాత మిన్నకుంటున్నాయి. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలేదన్న విమర్శ లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నిక ల సమయంలో హామీ ఇచ్చినా, డిప్యూటీ సీఎం స్వయంగా సమస్యపై పలు సార్లు ప్రస్తావించినా చర్యలు మాత్రం శూన్యంగా కనిపించడం గిరిజనులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. గుచ్చిమి వద్ద చేపట్టిన తాత్కాలిక ఏనుగుల సంరక్షణ కేంద్రంలో ఏనుగులను బంధించేందుకు వీలు గా అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నా యి. కందకాలు, సోలార్ హ్యాంగింగ్ ఫెన్సింగ్, పట్టుబడిన ఏనుగులకోసం ప్రత్యేకంగా ఎలిఫెంట్ షెడ్లు, వాటర్టబ్లు, స్నానపుకొలనులు నిర్మిస్తున్నారు. కుంకీ ఏనుగులకు శిక్షణ ఇచ్చే మావటీల కోసం ప్రత్యేక క్వార్టర్లు, కిచెన్ షెడ్, ఏనుగుల ఆరోగ్య సంరక్షణ కోసం అత్యాధునిక వెటర్నరీ కేర్ సెంటర్(వైద్య కేంద్రం), నీటి తొట్టెలు, అటవీ ప్రాంతం లోపలికి సులభంగా చేరుకోవడానికి రోడ్లు నిర్మిస్తున్నారు. ఈ కేంద్రం ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడు సమస్యకు పరిష్కారం లభిస్తుందని గిరిజనులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఖరీఫ్ నాటికైనా ఏనుగుల తరలింపు ప్రక్రియను పూర్తిచేయాలని కోరుతున్నారు. -
పర్యాటకాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యాటక, వ్యవసాయ రంగాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. అమరావతి నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు గురువారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో జిల్లా లో తీసుకుంటున్న చర్యలను వివరించామన్నారు. జిల్లాలో వ్యవసాయ రంగంలో 7.42 శాతం వృద్ధిరే టు సాధించామని, ఏడు కొత్త జలపాతాలను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలియజేశామన్నారు. పది సూత్రాల అజెండాను అమలు చేయాలని, పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తిచేయాలని సీఎం సూచించారన్నారు. రాయితీపై వ్యవసాయ పరికరాలు జిల్లాకు 2025–26 సంవత్సరానికి వ్యవసాయ యాంత్రీకరణ పథకం (ఎస్ఎంఏమ్) కింద రూ. 2.58 కోట్ల నిధులు కేటాయించినట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. ట్రాక్టర్లు, పవర్టిల్ల ర్లు, రోటా వీటర్లు, స్ప్రేయర్లు, రీపర్లు, వీడర్లు, పంటకోత అనంతర ప్రొసెసింగ్ యంత్రాలు, విత్తనా లు చల్లే, నాటే యంత్రాలు తదితర పరికరాలు 40 శాతం నుండి 50 శాతం వరకు సబ్సిడీపై మంజూ రు చేస్తామన్నారు. భూమి కలిగిన రైతులు, ఆర్ఓఎఫ్ఆర్ రైతులు, గత మూడేళ్లలో కనీసం మూడు పంట సీజన్లలో ఈ–పంటలో నమోదు చేసుకున్న సీసీఆర్సీ రైతులు అర్హులన్నారు. 2024–25లో సబ్సిడీ పొందిన వారు ఈ సారి అర్హులు కారని తెలిపారు. దరఖాస్తులు ఈ నెల 19వ తేదీ వరకు స్వీకరిస్తామన్నారు. ఎంపికై న రైతులు 15 రోజుల్లో తమ వాటాను యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ విధానంలో చెల్లించాలన్నారు. -
బాల్యవివాహాలు నిర్మూలిద్దాం
పాలకొండ: బాల్యవివాహాలు జరకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ సూచించా రు. సబ్‌కలెక్టర్ కార్యాలయంలో బాల్యవివాహ ల నిరోధక చట్టం–2026 కమిటీతో గురువా రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యవివాహలు పూర్తిగా నిర్మూలించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బాల్యవివాహలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ చట్టం అమలుకు శిశుసంక్షేమ, రెవెన్యూ, పోలీస్ శాఖ లు సమష్టి బాధ్యతీసుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్పీ ఎం.రాంబాబు, డివిజన్ పరిధి లోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సీడీపీఓలు, ఎస్ఐలు పాల్గొన్నారు. పార్వతీపురం: ప్రజల భూసమస్యలను త్వరితగతిన పరిష్కరించి, రెవెన్యూ సేవల్లో పారదర్శకత పంచడమే లక్ష్యమని జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్‌రెడ్డి తెలిపారు. మండలంలో ని గోపాలపురంలో ఒక నెల–ఒక గ్రామం–నాలుగు సందర్శనలు కార్యక్రమంపై గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. వెబ్‌ల్యాండ్ తప్పుల సవరణ, సర్వేనంబర్ సమస్యలు, మ్యుటేషన్, సాదా బైనామాక్లైమ్ లు, భూ వివాదాల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును నిర్ణీత గడువులో పరిష్కరించి ప్రజలకు పారదర్శక సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం క్రైమ్: రాష్ట్ర వ్యాప్తంగా 265 మంది ఎస్ఐలకు ప్రీ ప్రమోషనల్ ట్రైనింగ్‌కు గురువారం రాష్ట్ర పోలీస్‌శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న నాలుగు పోలీస్ శిక్షణ కళాశాలలైన విజయనగరానికి 51 మంది, ఒంగోలుకు–38, తిరుపతికి 50, అనంతపురానికి 126 మందిని శిక్షణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శిక్షణ ఈ నెల పది నుంచి జూన్ 20వరకు కొనసాగనుంది. విజయనగరం పోలీస్ శిక్షణ కళాశాలకు 51 మంది మెన్ ఎస్ఐలు శిక్షణకు రానున్నారు. ఒంగోలు కు 38మహిళ ఎస్ఐలు శిక్షణకు వెళ్లాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వంగర: ధాన్యం లోడుతో వీరఘట్టం నుంచి వంగర వైపు గురువారం వస్తున్న లారీ వంగర మండలం రుషింగి–కొప్పరవలస గ్రామాల మధ్య పంటపొలాల్లో బోల్తా కొట్టింది. ఇరుకు గా ఉన్న రోడ్డును దాటుతుండగా దిగబడి పంట పొలాల్లోకి బోల్తాపడింది. గంటల తరబడి వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. గతంలో స్థానిక ఎమ్మెల్యే కోండ్రు ముర ళీమోహన్ ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ప్రారంభించలేదు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా రోడ్డు నిర్మాణాన్ని పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆపత్కాలంలో అండగా.. విజయనగరం: రాజకీయాల్లో నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండే ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మానవత్వాన్ని చాటుకున్నారు. విధులు ముగించుకుని బుధవారం రాత్రి బొబ్బిలి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన విజయనగరం తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న శంబంగి శంకరరావుకు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో దగ్గరుండి చికిత్స చేయించారు. -
భోజనానికి టెండర్..!
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు భోజనం సరఫరా చేసేందు కు రెండు నెలలు కిందట నోటిఫికేషన్ ఇచ్చినా కొన్ని ఆస్పత్రులకు ఇప్పటివరకు టెండర్లు ఖరారు కాని పరిస్థితి. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదని, టీడీపీ సర్కారు హయాంలో టెండర్ల ఖారా రులో జాప్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినవారికి కట్టబెట్టి, భోజనంలో ‘టెండర్’పెట్టేందుకే జాప్యం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకంగా నిర్వహించాల్సిన టెండర్ల పక్రియ గందరగోళానికి దారితీయడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదీ పరిస్థితి... ఈ ఏడాది మార్చి నెలలో జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, వైద్యవిధాన్ పరిషత్‌లోని ఎస్.కోట, గజపతినగరం, రాజాం ఏరియా ఆస్పత్రులు, నెల్లిమర్ల సీహెచ్‌సీ, బొబ్బిలి, బాడంగి, భోగాపురం, చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రుల్లో డైట్ (భోజనం) అందించేందుకు టెండర్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చా రు. పలువురు కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. గత నెల 13వ తేదీన జేసీ సమక్షంలో టెండర్లు తెరిచా రు. బాడంగి, బొబ్బిలి, నెల్లిమర్ల, చీపురుపల్లి ఆస్పత్రులకు టెండర్లు ఖరారయ్యాయి. నెల్లిమర్ల సీహెచ్‌సీకి ఒక్కరు కూడా టెండర్ వేయలేదు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులై న ఎస్.కోట, గజపతినగరం, రాజాం ఏరియా ఆస్ప త్రుల్లో రోగులకు భోజనం సరఫరా చేసేందుకు తక్కువ ధరకు కోడ్ చేసిన వ్యక్తులకు అధికారులు డైట్ కాంట్రాక్ట్‌ను కేటాయించారు. దీనిపై టెండర్ లో పాల్గొన్న కొంతమంది వ్యక్తులు అభ్యంతరం తెలిపారు. రోగులకు డైట్ సరఫరాలో అనుభవం ఉన్నట్టు టెండర్ ఖరారు అయిన వ్యక్తులు సమర్పించినవి తప్పుడు ధ్రువపత్రాలని ఆరోపించారు. వాస్తవికతను నిర్ధారించాలని కోరారు. దీంతో టెండ ర్ ఖరారైన వారు సమర్పించిన ధ్రువపత్రాల వాస్త వికత నిర్ధారణ కోసం ఏ ఆస్పత్రిలో అయితే వారు డైట్ సరఫరా చేసినట్టు తెలిపారో ఆ ఆస్పత్రికి సమాచారం ఇచ్చారు. ఇప్పటికీ ఇది కొలిక్కిరాకపోవడంతో టెంటర్ ప్రక్రియ అసంపూర్తిగా మారింది. ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందే రోగులకు భోజనం వడ్డింపుకోసం నిర్వహించిన టెండర్ ప్రక్రియ గందరగోళంగా మారింది. గడువు ముగిసి నెలలు గడుస్తున్నా టెండర్లు ఖరారు కాలేదు. తప్పుడు ధ్రువపత్రాలతో భోజనానికి ‘టెండర్’పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న ఫిర్యాదుపై నిజనిర్ధారణ ప్రక్రియ ఇంకా కొలిక్కిరాకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. వాస్తవికత నిర్ధారణలో జాప్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజనిర్ధారణ జరుగుతోంది.. సర్వజన ఆస్పత్రి, గజపతినగరం, ఎస్.కోట, రాజాం ఏరియా ఆస్పత్రులకు సంబంధించి డైట్ టెండర్లు తక్కువ ధరకు టెండర్ వేసిన వ్యక్తులపై ఫిర్యాదులు వచ్చాయి. తప్పుడు ధ్రువపత్రాలతో వారు టెండర్ వేశారని ఫిర్యా దులు అందాయి. నిజనిర్ధారణ కోసం సంబంధిత ఆస్పత్రులకు పంపించాం. అక్కడ నుంచి క్లారిటీ వచ్చిన వెంటనే టెండర్లు ఖరారు చేస్తాం. అప్పటివరకు పాతకాంట్రాక్టరే భోజనం సరఫరా చేస్తారు. – డాక్టర్ పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి – డాక్టర్ పద్మశ్రీ రాణి, డీసీహెచ్ఎస్ పెద్దాస్పత్రులే టార్గెట్... టెండర్లు ఖరారు కాని నాలుగు ఆస్పత్రులు కూడ పెద్దాస్పత్రులే. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సగటున రోజుకి 400 నుంచి 500 మంది వరకు రోగులు చికిత్స పొందుతారు. ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో 100 మంది, గజపతినగరం ఏరియా ఆస్పత్రిలో 90 నుంచి 100 మంది, రాజాం ఏరి యా ఆస్పత్రిలో 100 మంది వరకు రోగులు ఇన్‌పేషేంట్లుగా చికిత్స పొందుతారు. డైట్ కాంట్రాక్ట్ దక్కించుకున్న వ్యక్తి ప్రతిరోజు మూడు పూటలా రోగులకు భోజనం అందించాలి. పెద్దాస్పత్రుల్లో భోజనం సరఫరా టెండర్ ప్రక్రియ గందరగోళంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. భోజనం సరఫరా చేయాలంటే... ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగులకు భోజనం సరఫరా చేసేందుకు టెండర్ వేసేవారు ఇదివరకే ఏదైనా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రికి డైట్ సరఫరా చేసి ఉండాలి. ఆదాయపన్ను వివరాలు సమర్పించాలి. ఏ ఆస్పత్రిలో అయితే వారు డైట్ సమర్పించారో సంబంధిత ఆస్పత్రి వారి నుంచి అనుభవ ధ్రువపత్రం సమర్పించాలి. టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి రెండు నెలలైనా ఖరారుకాని టెండర్లు టెండర్లు దక్కించుకున్న వారు తప్పుడు ధ్రువపత్రాలు పెట్టారని ఫిర్యాదు పూర్తికాని నిజనిర్ధారణ పాతకాంట్రాక్టర్తోనే భోజనం వడ్డింపు -
చిరస్మరణీయుడు ‘అల్లూరి’
పార్వతీపురం: విప్లవ జ్యోతి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయుడని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి కొనియాడారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం అల్లూరి సీతారామరాజు వర్ధంతిని గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో అల్లూరి పోరాటపటిమ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. భరతమాతను బ్రిటిష్ దాస్యశృంఖలాల నుంచి విముక్తి చేసేందుకు ఉద్యమబాట పట్టి, బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించిన ధైర్యం అల్లూరి సొంతమన్నారు. గిరిజనుల అణచివేతను వ్యతిరేకించిన అల్లూరి, విప్లవ జ్వాలను రగిలించిన మహా పోరాటయోధుడని కొనియాడారు. అల్లూరి చేసిన త్యాగం వెలకట్టలేనిదని, ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు ఎ.విజయశాంతి, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, పశుసంవర్థక శాఖాధికారి డా.ఎస్.మన్మథరావు పాల్గొన్నారు. -
● కొత్త భవనం.. ప్రారంభానికి దూరం..
చిత్రంలో కనిపిస్తున్నది రేగిడి తహసీల్దార్ కార్యాలయ నూతన భవనం. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.90లక్షల ఆర్ అండ్ బీ నిధులతో నిర్మాణం చేపట్టింది. అన్ని హంగులతో భవనం సిద్ధంగా ఉన్నా ప్రస్తుత ప్రభుత్వం ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడం లేదు. శిథిల భవనాల్లో విధుల నిర్వహణకు అధికారులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా రెవెన్యూ అధికారులు స్పందించి నూతన భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని రెవెన్యూ సిబ్బందితో పాటు ప్రజలు కోరుతున్నారు. – రేగిడి -
15న మహా పాదయాత్ర
● ప్రకాశం బ్యారేజీ నుంచి విద్యాశాఖా మంత్రి నారాలోకేశ్ ఇంటివరకు పాదయాత్ర విజయనగరం గంటస్తంభం: సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 15న మహా పాదయాత్రను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన సమాచార పత్రాన్ని ఏపీ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (జేఏసీ) నాయకులు డీఈఓ యు.మాణిక్యంనాయుడుకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల ముందు సమగ్రశిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల రెగ్యులరైజేషన్, హెచ్ఆర్ పాలసీ అమలు, సమాన పనికి సమాన వేతనం, మినిమం టైమ్‌స్కేల్, ఈపీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, మెడికల్ లీవులు, మహిళలకు చైల్డ్‌కేర్ లీవులు, తదితర సమస్యలను తక్షణమే పరిష్కరిచాలని కోరారు. ఈ నెల 15న ప్రకాశం బ్యారేజ్ నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నివాసం వరకు కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు, నాని, జిల్లా చైర్మన్ ఆర్.శ్రీనివాసరావు, ఎంఐఎస్ కోఆర్డినేటర్ కృష్ణంనాయుడు, మండల అకౌంటెంట్ రామకృష్ణ, సీఆర్ఎంటీ నాయకులు ఎం.అప్పలనాయుడు, అప్పలనాయు డు, పైడిరాజు, వేణుగోపాల్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
విజయ ధరహాసం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన తైక్వాండో పోటీల్లో అతిథ్య విజయనగరం జట్టు ఓవరాల్ చాంపియన్ షిప్ దక్కించుకుంది. గడిచిన మూడు రోజులుగా జరిగిన పోటీల్లో 394 పాయింట్లు దక్కించుకున్న విజయనగరం క్రీడాకారులు ఈ ఘనత సాధించారు. 350 పాయింట్లు సాధించిన విశాఖ జట్టు రెండవ స్థానంలో నిలవగా..మూడవ స్థానాన్ని 259 పాయింట్లతో తూర్పుగోదావరి జట్టు దక్కించుకుంది. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు తైక్వాండో అసోసియేషన్ ప్రతినిధులు బహుమతులు ప్రదానం చేశారు. దీంతో జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ నేతృత్వంలో జరిగిన 5వ ఏపీ కప్ స్టేట్ తైక్వాండో చాంపియన్‌షిప్–2026 పోటీలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది క్రీడాకారులు పోటీ పడ్డారు. ముగింపు కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాలరావు మాట్లాడుతూ యువ క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చిం నాయుడు, కోశాధికారి నాయబ్ రసూల్, వివిధ జిల్లాల కార్యదర్శులు, కోచ్‌లు, క్రీడాకారుల తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు రాష్ట్రస్థాయిలో జరిగిన సీనియర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈనెల 5, 6 తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు ఉత్తమ క్రీడా ప్రతిభతో విద్యల నగరం విజయనగరం జిల్లా కీర్తి ప్రతిష్టలను చాటిచెప్పారు. పోటీల్లో 9 మంది క్రీడాకారులు పాల్గొనగా.. 7గురు క్రీడాకారులు పతకాలు కై వసం చేసుకోవడం విశేషం. షాట్‌పుట్‌లో జి.వెంకటనాయుడు, 400 మీటర్ల పరుగు పోటీలో పి.ప్రవీణ్‌కుమార్ బంగారు పతకాలు కై వసం చేసుకున్నారు. అంతేకాకుండా లాంగ్‌జంప్‌లో జి.లక్ష్మి స్విలర్, డెకాతలీన్లో కె.సాయితేజ సిల్వర్, పోల్‌వాల్ట్ విభాగంలో కె.సాయితేజ సిల్వర్ మెడల్స్ చేజిక్కించుకున్నారు. అలాగే జావెలిన్‌త్రోలో డి.ఉదయ్, 100 మీటర్ల పరుగు పోటీలో ఎ.దివ్యవాణిలు బ్రాంజ్ మెడల్స్ దక్కించుకున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.లీలాకృష్ణ, ఎ.శ్రీకాంత్, ట్రెజరర్ వి.ఆనంద్ కిషోర్‌లు అభినందించారు. తైక్వాండో ఓవరాల్ చాంపియన్ విజయనగరం రెండవ స్థానంలో నిలిచిన విశాఖ క్రీడాకారులు మూడవ స్థానాన్ని దక్కించుకున్న తూ.గో జట్టు ముగిసిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు


