నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం రాత్రి కనులపండువగా జరిపించారు. వెండి మంటపంలో ఉన్న సీతారామస్వామి ఉత్సవ విగ్రహాలను మంగళవాయిధ్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి, దీపారాధన మంటపంలో ఉన్న ప్రత్యేక ఊయలలో ఉంచారు. అనంతరం దీపాలను వెలిగించి, స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు, దేవస్థాన సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నీలో..
సత్తా చాటిన విజయనగరం
విజయనగరం గంటస్తంభం: అనంతపురంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్ధాయి శాప్ కప్ అండర్–25 పుట్‌బాల్ టోర్నమెంట్‌లో విజయనగరం జిల్లా జట్టు ఘన విజయం సాధించింది. ఫైనల్లో విశాఖపట్నం జిల్లా జట్టుపై 4–1 గోల్స్ తేడాతో అద్భుత ప్రదర్శన కనబరిచి ప్రథమ స్థానం కై వసం చేసుకుంది. ఈ సందర్భంగా జిల్లా ఫుట్‌బాల్ జట్టును మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.రజనీకుమార్, కార్యదర్మి వి.మహాలక్ష్మిరావు, తదితరులు పాల్గొన్నారు.


