breaking news
Parvathipuram manyam District Latest News
-
జగనన్న సీఎం కావాలని...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ శబరిమలలో అయ్యప్పకు రేగిడి మండలం లచ్చన్నవలస గ్రామానికి చెందిన అయ్యప్పదీక్ష ధారులు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. గ్రామానికి చెందిన 20 మంది భక్తులు 41 రోజుల కిందట అయ్యప్పదీక్ష ప్రారంభించారు. దీక్ష ముగియడంతో శబరిమల యాత్రకు వెళ్లిన వీరంతా అక్కడ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ ఆలయానికి చేరుకున్నారు. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అయ్యప్పను ప్రార్థించారు. –రేగిడి -
దొంగతనం
●రెండు రోజులకోసారి రాత్రిళ్లు స్కూల్ నుంచి బియ్యం మాత్రమే కాదు పప్పులు కూడా తరలిస్తున్నా రు. రెండు మూడు రోజులకోసారి ఈ తరలింపు జరుగుతోంది. పిల్లలకు పెట్టాల్సిన తిండిని వ్యాపారులకు తెగనమ్ముకుంటున్నారు. – కోలక పెంటయ్య, గిరిజనుడు, రావికోన మా గిరిజన విద్యార్థులను కూలీలుగా వాడుకుంటూ బస్తాలను తరలిస్తున్నారు. మా పిల్లల కడుపు మాడ్చి సరుకులు అమ్ముకుంటున్నారు. అధికారుల భయం లేకపోవడంతో హెచ్ఎం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. – కోలక చామంతి, గిరిజన మహిళ, రావికోన -
పాఠశాల భోజన సరుకులు.. పక్కాదారి!
పార్వతీపురం రూరల్: గిరిజన విద్యార్థుల ఆకలి తీర్చాల్సిన ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. విద్యార్థుల కడుపుకొట్టి సరుకులను వారితోనే గుట్టుచప్పుడుగా తరలించేస్తున్నారు. మార్కెట్లో విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. బియ్యం మాత్రమే కాదు.. పప్పులు, నూనె ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులను సైతం పాఠశాల నుంచి అక్రమంగా దారిమళ్లిస్తున్న వ్యవహారం పార్వతీపురం మండలం రావికోన గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 150 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొద్దిరోజుల కిందట వార్డెన్ మృతి చెందడంతో ఆ బాధ్యతలను హెచ్ఎం నిర్వర్తిస్తున్నారు. అప్పటి నుంచి పాఠశాల వంట సామగ్రి గోదాంపై ఆయన ‘గుత్తాధిపత్యాన్ని’ ప్రదర్శిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. చదువుల క్షేత్రంలో అక్షరాలు నేర్పించాల్సిన హెచ్ఎం... వంట సిబ్బందితో కలిసి సరుకులు అక్రమంగా తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
రేపటి నుంచి చెరకు క్రషింగ్
రేగిడి: మండలంలోని సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారంలో ఈ నెల 5 నుంచి చెరకు క్రషింగ్ ప్రారంభించనున్నట్టు యాజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2025– 26 సీజన్లో మెట్రిక్ టన్ను చెరకు రూ. 3,360 లు మద్దతు ధరగా ప్రకటించామని వెల్లడించింది. గత సంవత్సరం కంటే ఈ ఏడాది టన్నుకు రూ.209లు మద్దతు ధర పెంచినట్టు పేర్కొంది.రైతులకు కటింగ్ ఆర్డర్లు ఇస్తున్నామని తెలిపి ంది. చెరకు నరికేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొచ్చామని వెల్లడించింది. జియ్యమ్మవలస: మండలంలోని గవరమ్మపేట పంచాయతీ వెంకటరాజపురానికి చెందిన రైతు లు మర్రాపు ధనుంజయరావు, లక్ష్మునాయుడుకు చెందిన ధాన్యం రాశులను ఏనుగులు బుధవారం చిందరవందర చేశాయి. టార్పాలిన్లను కాళ్లతో కుమ్మి ధ్వంసం చేశాయి. అటవీ శాఖ అధికారులు స్పందించి ఆదుకోవాలని, ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాల ని రైతులు విజ్ఞప్తిచేశారు. ప్రస్తుతం చింతలబెలగాం, గవరమ్మపేట గ్రామాల నడుమ ఏనుగు లు సంచరిస్తున్నాయి. సాలూరు: రాష్ట్ర సీ్త్ర శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖమంత్రి గుమ్మిడి సంధ్యారాణి కారు డ్రైవర్ రౌతు హరికుమార్ సామాజిక మాధ్యమం వేదికగా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారంటూ సాలూరులో నివసిస్తున్న పాచిపెంట మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన అధికార్ల నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సాలూరు మున్సిపల్ వైస్‌చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, వైఎస్సార్సీపీ కౌన్సిల ర్లు, నాయకులతో కలిసి హరిపై సాలూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సీఐ అప్పలనాయుడుకు బుధవారం ఫిర్యాదు చేశారు. 35 ఏళ్లు అయినా పెళ్లి కాలేదని, మగాడు కాదు.. మగతనం పనిచేయదు.. వీడు కొజ్జావాడు.. మీరు చెక్ చెసుకోవచ్చు.. ఇది వంద శాతం నిజం.. అంటూ హరికుమార్ తనపై ఎన్పీఎన్ న్యూస్ మన్యం, విజయనగరం, సన్నీ అందరివాడు మనందరివాడు, జై తెలుగుదేశం, సాలూరు, టీడీపీ ఉత్తరాంధ్ర విభాగం, సాలూరు–విజయనగరం యువకెరటాలు అనే గ్రూపుల్లో మెసేజ్‌లు పెడు తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి డ్రైవర్‌తో పాటు నాలుగు ఫోన్ నంబర్లతో తనను అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. నాగరాజు వెంట కౌన్సిలర్లు గిరిరఘు, సింగారపు ఈశ్వరరావు, గొర్లె వెంకటరమణ, నాయకు లు పిరిడి రామకృష్ణ,మజ్జి అప్పారావు పాల్గొన్నారు. -
తీరనుందా అలక!
సాక్షి, పార్వతీపురం మన్యం: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ఆకస్మికంగా పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు ఒక్కరోజు ముందుగానే ఆయన ఇక్కడికి వస్తుండటం.. ప్రధానంగా పార్టీ శ్రేణులతో సమావేశం కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాలకొండ నియోజకవర్గంలో ఢీ అంటే ఢీ అనేలా కూటమి నాయకులు, కార్యకర్తల మధ్య ‘సఖ్యత’ ఉన్న విషయం విదితమే. ముఖ్యంగా టీడీపీలోనే వర్గవిభేదాలున్నాయి. సమయం దొరికినప్పుడల్లా అరుపులు, కేకలు, కొట్లాటలు.. పోటాపోటీ కార్యక్రమాల నిర్వహణతో వీధికెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో పాలకొండ నియోజకవర్గం భామినిలో ఈ నెల 5వ తేదీన జరిగే మెగా పేరెంట్–టీచర్ మీట్లో పాల్గొనేందుకు చంద్రబాబు రావడం.. ఆయన ముందు ఎక్కడ రభస జరుగుతుందోనన్న భయంతోనే ఒక్క రోజు ముందుగా లోకేశ్ వస్తున్నారన్న చర్చ జిల్లాలో సాగుతోంది. పార్టీలోనూ, కూటమిలో అంతర్గత విభేదాలు పరిష్కారం కోసమే ఆయన ఆకస్మిక పర్యటనగా తెలుస్తోంది. పాలకొండ నియోజకవర్గం టీడీపీలో ఆది నుంచి రెండు వర్గాలున్న విషయం విదితమే. సీనియర్ నాయకులు కింజరాపు అచ్చెన్నాయుడు, కిమిడి కళావెంకటరావు వర్గాలుగా ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ(ఎన్నికలకు ముందు టికెట్ కోసమని జనసేనలోకి మారారు), టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పడాల భూదేవి ముద్రపడ్డారు. గత ఎన్నికలకు ముందు టికెట్ కోసం పార్టీ మార్పులతో పెద్ద హైడ్రామానే నడిచింది. పొత్తులో భాగంగా ఇక్కడి సీటు జనసేనకు వెళ్లడం.. ఆ పార్టీకి సరైన అభ్యర్థి లేకపోవడం.. టీడీపీలో ఉన్న నిమ్మక జయకృష్ణ పవన్ కల్యాణ్ చెంతన చేరడం చకచకా జరిగిపోయాయి. పార్టీలు మారినంత సులువుగా ఇరు వర్గాల మధ్య సఖ్యత కుదరలేదు. ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మరింత ముదిరాయి. దీంతో అప్పటి నుంచి నియోజకవర్గంలో బద్ధశత్రువులుగానే వీరు మిగిలిపోయారు. నియోజకవర్గ టీడీపీ కూడా రెండు వర్గాలుగా చీలిపోయింది. పార్టీ సమావేశాల్లోనూ, పెద్దలు వచ్చిన పలు సందర్భాల్లోనూ బాహాబాహీకి దిగిన పరిస్థితులున్నాయి. స్థానిక ఎమ్మెల్యేగా నిమ్మక జయకృష్ణ నుంచి ప్రభుత్వం తరఫున చేపట్టిన ఏ కార్యక్రమానికీ పడాల భూదేవి వర్గానికి పిలుపు ఉండదు. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జయకృష్ణ నిర్వహించలేదు. భూదేవి తన వర్గంతో కొన్ని ప్రాంతాల్లో చేపట్టారు. ఇలా ఆధిపత్యం కోసం కొన్నాళ్లుగా ఇక్కడ అంతర్యుద్ధం సాగుతోంది. పలుమార్లు అధినేతల దృష్టికీ తీసుకెళ్లారు. మార్పులేదు. ప్రస్తుతం చంద్రబాబునాయుడు పర్యటించనున్న భామిని నియోజకవర్గంలోనూ విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. గ్రూపుల కారణంగానే కోఆపరేటివ్ సొసైటీలో నియామకాలు కాలేదు. ఇటీవల సొలికిరిలో టీడీపీలోని రెండు వర్గాలు బహిరంగంగా కొట్టుకున్నాయి. జయకృష్ణ, భూదేవి వర్గాలకు చెందిన ఆనందరావు, కొత్తకోట గోవిందరావులు తగాదాకు దిగారు. జయకృష్ణ బంధువర్గం భామినిలో ఉంది. ఆ నేపథ్యంలో ఇక్కడ కాస్త ఆయనకు పట్టుంది. ఈ క్రమంలోనే రెండు వర్గాల మధ్య విభేదాలు ఎక్కువగా ఉంటున్నాయి. చంద్రబాబు పర్యటన ఇక్కడే ఉండటం.. ఆయన ఎదురుగా ఏదైనా రచ్చ జరిగితే పరువు పోతుందన్న భయంతోనే లోకేశ్ ముందుగా వస్తున్నట్లు టీడీపీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ఇందుకోసం లివిరి వద్ద ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు. 4వ తేదీన రాత్రి ఇక్కడే పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యులతో చినబాబు సమావేశం అవుతారని తెలిసింది. ఇది పూర్తి అంతర్గత సమావేశామని కూటమి నాయకులు అంటున్నారు. పార్టీ సమావేశం తర్వాతనే ఈ నెల 5న భామిని మోడల్ స్కూల్లో మెగా పేరెంట్ డేలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి లోకేశ్ పాల్గొంటారని తెలుస్తోంది. దీంతో పాటు.. సాలూరులో ఇటీవల మంత్రి అనధికార పీఏ, కుమారుడి వివాదం.. పార్వతీపురం నియోజకవర్గంలో గ్రూపుల గోల, కురుపాం నియోజకవర్గంలోనూ విభేదాలపై చినబాబు ‘క్లాస్’ తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. -
చంద్రన్నా.. ఐటీడీఏల వైపు చూడన్నా..!
సీతంపేట ఐటీడీఏ సీతంపేట: పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు రెండు ఐటీడీఏలకు రెగ్యులర్ ప్రాజెక్టు అధికారులను నియమించిన దాఖలా లేవు. శాఖలకు సరైన దిశానిర్దేశం లేదు. ఇన్‌చార్జిలతోనే ఐటీడీఏల పాలన కొనసాగుతోంది. సీతంపేటకు పాలకొండ సబ్‌కలెక్టర్, పార్వతీపురం ఐటీడీఏకు జేసీ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. రెండు ఐటీడీఏల పరిధిలో 31 గిరిజన మండలాలు ఉన్నాయి. దాదాపు 1500లకు పైగా గిరిజన గ్రామాలు ఉన్నాయి. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 16 గిరిజన సబ్‌ప్లాన్ మండలాలు శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాయి. వివిధ శాఖలు నిర్వహిస్తున్నప్పటకీ పూర్తిస్థాయిలో అధికారులు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని గిరిజనులు వాపోతున్నారు. సీతంపేట ఏటీడబ్ల్యూఓ పోస్టు ఖాళీగా ఉంది. ప్రాజెక్టు వ్యవసాయాధికారి పోస్టు బాధ్యతలను పీహెచ్ఓ నిర్వర్తిస్తున్నారు. గిరిజన సహకార సంస్థకు రెగ్యులర్ డివిజనల్ మేనేజర్ లేరు. జీసీసీ జనరల్ మేనేజర్ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఇంజినీరింగ్ శాఖలో డీఈ, ఏఈ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఆశ్రమపాఠశాలల్లో హెల్త్వలంటీర్లు ఏరీ?... గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలలు 103 ఉన్నాయి. సుమారు 17 వేల మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. వీరికి వైద్యసేవలు అందించడానికి వీలుగా ఏఎన్ఎంలను నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. హెల్త్వలంటీర్లు లేక అత్యవసర వైద్యసేవలు అందడంలేదు. ఆశ్రమపాఠశాలల్లో ఆరోగ్యవలంటీర్లను నియమిస్తామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. గిరిజన ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు ఉద్యోగభద్రత కరువైనా పట్టించుకునేవారే లేరు. ఆ శాఖల పరిస్థితి ఏంటి?.. సీతంపేట ఐటీడీఏలో ఏ శాఖ ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొందని గిరిజన సంఘాల నాయకులు వాపోతున్నారు. ఇక్కడి ట్రైబల్వెల్ఫేర్ కార్యాలయం శ్రీకాకుళం తరలించేందుకు రంగం సిద్ధమైంది. మరో రెండు, మూడు నెలల్లో శ్రీకాకుళం కలెక్టరేట్లోని కొత్త ఆఫీస్‌కు తరలిపోనున్నట్టు తెలిసింది. వెలుగు కార్యాలయం ఇప్పటికే ఎత్తేశారు. నాలుగు నెలల కిందటే ట్రైబల్ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ (టీపీఎంయూ)ను ఎత్తేశారు. అంతకముందు చిన్ననీటి వనరుల విభాగాన్ని తరలించేశారు. ఇలా.. ఒక్కో శాఖ కార్యాలయాన్ని ఎత్తేయడంతో సీతంపేట ఐటీడీఏ ఉంటుందా, ఊడుతుందా తెలియని పరిస్థితి నెలకొంది. మౌలిక వసతులు నిల్... గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు మృగ్యమయ్యాయి. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో డోలీల మోత తప్పడం లేదు. ఉసిరికపాడు, దరబ, ఎగువద్వారబందం, కొండాడ తదితర ప్రాంతాలకు వెళ్లే గిరిజనుల అవస్థలు వర్ణణాతీతం. అత్యవసర సమయాల్లో రోగులను ఆస్పత్రులకు తరలించాలన్నా, గిరిజన ఉత్పత్తులను మార్కెట్‌కు, సంతకు చేర్చాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. ఎండీయూ వాహనాల రద్దుతో బియ్యం కోసం కిలోమీటర్ల దూరంలోని డిపోలకు రావాల్సిన పరిస్థితి. చివరకు పాఠశాలలకు సైతం ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వని దుస్థితి దాపురించింది. జిల్లాకు వస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ స్పందించి గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు. -
9 న కాలంచెల్లిన వస్తువుల బహిరంగ వేలం
విజయనగరం క్రైమ్: ఈ నెల 9 వ తేదీన జిల్లా పోలీస్ కార్యాలయంలో కాలం చెల్లిన వస్తువులను వేలం వేయనున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ మంగళవారం తెలిపారు. జిల్లా పోలీసు శాఖ వినియోగించిన, కాలం చెల్లిన జనరేటర్లు, బ్యాటరీలు, ఎలక్ట్రికల్ వస్తువులు (ఫ్యాన్స్, టేబుల్స్ వగైరా), ఎలక్ట్రానిక్ వస్తువులు (రిఫ్రిజిరేటర్లు, వాటర్ డిస్పెన్సర్లు, డీప్ ఫ్రీజర్లు, ఏసీలు), ఫర్నిచర్ వస్తువులు, ఐరన్ స్క్రాప్, మిగతా వస్తువులు 8 స్లాట్లుగా విభజించామన్నారు. ఈ వస్తువులకు బహిరంగ వేలం నిర్వహించనున్నామని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. వేలం వేయనున్న వస్తువులను డీపీఓ ప్రాంగణంలో భద్రపర్చామని ఆసక్తి కలిగిన వేలందారులు డిసెంబరు 3 నుంచి 8 వరకు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరిశీలించుకోవచ్చునన్నారు. వివరాల కోసం విజయనగరం ఏఆర్ అడ్మిన్ ఆర్ఐ ఎన్.గోపాల నాయుడు ఫోన్ నంబర్ 9121109485 ను సంప్రదించవచ్చునని ఎస్పీ తెలిపారు. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన బిడ్డర్లు డిసెంబరు 9న ఉదయం 10గంటలకు జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణం వద్ద నిర్వహించే వేలంలో పాల్గొనాలన్నారు. ఆసక్తి కలిగిన బిడ్డర్లు అదే రోజున బిడ్ అమౌంట్‌ను జీఎస్టీతో సహా ఆన్లైన్లో చెల్లించి, వస్తువులను 24గంటలలో తీసుకుని వెళ్లాలని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ వివరించారు. -
టమాటా పంటను ధ్వంసం చేసిన ఏనుగులు
కొమరాడ: మండలంలోని కళ్లికోట గ్రామానికి చెందిన బొద్దిన నారాయణ, జాగన రామకృష్ణ సాగుచేసిన టమాటా పంటను ఏనుగులు మంగళవారం ధ్వంసం చేశాయి. పంట పొలంలో సంచరించడంతో మొత్తం పాడైందని, అటవీశాఖ అధికారులు స్పందించి పరిహారం అందజేయాలని రైతులు విజ్ఞప్తిచేశారు. ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు. ● జేసీ యశ్వంత్‌కుమార్ రెడ్డి గరుగుబిల్లి: రైస్‌మిల్లు యజమానులు రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి అన్నారు. మండలంలోని సంతోషపురం రైతు సేవాకేంద్రాన్ని ఆయన మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. మిల్లులో నిర్వహిస్తున్న ధాన్యం సేకరణ, ధాన్యం తరలింపు, నాణ్యతా ప్రమాణాలు తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యం సేకరణలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా అందుకు బాధ్యులుపై చర్యలుంటాయన్నారు. రైతుల నుంచి మిల్లు యజమానులు, సిబ్బందిపై ఫిర్యాదులొస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. రైతులు తమ ధాన్యంను నిర్దేశించిన కొనుగోలు కేంద్రంలోనే విక్రయాలు జరిగేలా చూడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యంను దళారులకు విక్రయాలు చేయవద్దని సూచించారు. ప్రస్తుతం తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతులకు ఎలాంటి అసౌకర్యంలేకుండా చూడాలన్నారు. ఆయన వెంట ఏఓ జ్యోత్స్న ఉన్నారు. మా భూములు సేకరించొద్దు బాడంగి: ఆ భూములే మాకు జీవనాధారం.. ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ పైపులైన్ నిర్మాణానికి భూములు ఇచ్చేదేలేదని భీమవరం, పాల్తేరు, ముగడ, పిండ్రంగివలస, వీరసాగరం, బాడంగి గ్రామాలకు చెందిన రైతులు తేల్చిచెప్పారు. భూ సేకరణ కోసం ఆయా గ్రామాల రైతులకు 3(1)నోటీసులను అధికారులు అందజేశారు. వారందరితో బాడంగి మండలపరిషత్ సమావేశ భవనంలో ప్రజావిచారణ పేరుతో మంగళవారం సమావేశమయ్యారు. రైతుల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ మా గ్రామాలు మీదుగా 18 కిలోమీటర్ల పొడవున 12 మీటర్ల వెడల్పున భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని చెప్పారు. పైపులైన్ కోసం భూములు ఇస్తే ధరలు పడిపోతాయని, అవసరానికి అమ్ముకోలేమని అభిప్రాయం తెలిపారు. దీనిపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.సుధాసాగర్ మాట్లాడుతూ పైపులైన్ వల్ల నష్టంకలగదని, 12 మీటర్ల వెడల్పులో 1.5 మీటర్ల లోతులో కంతకాలు తవ్వుతారని, 14 అంగుళాల అధునాతనమైన పైపులనే వాడుతారని చెప్పారు. ఒక లైన్ కోసం అవకాశమిస్తే రెండోలైన్ వేయరని గ్రారంటీ ఏమిటని రైతులు ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం ఇస్తే ఇది భారత ప్రభుత్వం విశాఖ నుంచి రాయపూర్ వరకు పైప్‌లైన్ వేసేందుకు నిర్ణయించిందన్నారు. ప్రత్యేక అవసరంగా భూములు ఇవ్వకపోయినా తీసుకునే అవకాశంలేక పోలేదని ఎస్డీసీ చెప్పగా.. వీలైనంతవరకు మా జిరాయితీ భూములను తప్పించి వేరే ప్రదేశంనుంచి లైన్వేసుకునేలా చూడాలని అధికారులను కోరారు. సమావేశంలో హెచ్‌పీసీఎల్ చీఫ్ఇంజినీరు జి.కిశోర్, తహసీల్దార్ ఎన్.వరప్రసాద్, విశ్రాంత తహసీల్దార్ గిరడ అప్పలనాయుడు, వీరసాగరం, పిన్నవలస రైతులు పాల్గొన్నారు. -
‘అమృతం’లో ఆయువు తీసే నిర్లక్ష్యం!
● అంగన్వాడీలకు కాలం చెల్లిన బాలామృతం పంపిణీ ● ఎప్పటి నుంచో ఇదే తంతు ● పట్టించుకోని ఐసీడీఎస్ అధికారులు సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించే ఉద్దేశంతో ఐసీడీఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాల నుంచి బాలామృతం ఉచితంగా అందజేస్తారు. దీనిని బాలలకు అమృతతుల్యంగా భావిస్తారు. బిడ్డకు పుష్టినిచ్చే ఈ బాలామృతం.. ఐసీడీఎస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విషతుల్యమవుతోంది. మందులకై నా, తినే వస్తువులకై నా కాలపరిమితి ఉంటుంది. గడువు దాటిన తర్వాత వాటిని వినియోగించరాదని స్పష్టంగా చెబుతా రు. అటువంటిది చిన్నారులకు అందించే పౌష్టికాహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఐసీడీఎస్ అధికారుల తీరు ఇందుకు భిన్నం. పార్వతీపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో చోటుచేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. పసిబిడ్డల ఆరోగ్యాన్ని పెంచాల్సిన పౌష్టికాహారం.. కాంట్రాక్టర్ల అలక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా దారి తప్పింది. గడువు తీరిన బాలామృతం ప్యాకెట్లను ప్రాజెక్టు పరిధిలో పంపిణీ చేయడం.. చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఆరోగ్యానికా.. అనారోగ్యానికా? అంగన్వాడీ కేంద్రాల్లో ఏడు నెలల పసికందు నుంచి మూడేళ్ల చిన్నారులకు బాలామృతం ఇస్తారు. రెండున్నర కిలోల ప్యాకెట్‌ను ఒక లబ్ధిదారుకు 25 రోజులకోసారి అందిస్తారు. తెలంగాణ నుంచి కాంట్రాక్టర్ ద్వారా వీటిని సరఫరా చేస్తారు. జిల్లాలో 10 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 1,475 ప్రధాన, 600 మినీ అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. 7 నెలల నుంచి 36 నెలల మధ్య వయస్సున్న చిన్నారులు దాదాపు 27 వేల మంది ఉన్నారు. జిల్లాలో ఏటా 10 వేల వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. మన్యంలో ఎనిమీయాతో పాటు, రక్తహీనత సమస్య తీవ్రంగా వేధిస్తోంది. పౌష్టికాహారలోపం వల్ల ఎత్తుకు తగ్గ బరువు, వయస్సుకు తగ్గ ఎత్తు ఉండడం లేదు. ప్రధానంగా గిరిజన, గ్రామీణ ప్రాంత చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారమే దిక్కవుతోంది. ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణ లోపం, అవినీతి కారణంగా చాలా వరకు పిల్లలకు అందించే పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. కాంట్రాక్టర్లతో కాసుల కక్కుర్తి కారణంగా చిన్నగుడ్లు సరఫరా చేయడం, కాలపరిమితి దాటిన సరకు లు అందజేయడం వంటి ఘటనలు తరచూ జిల్లా లో చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.తెలంగాణ నుంచి బాలామృతం ప్యాకెట్లు వస్తాయి. వీటిని గోదాముల్లో భద్రపరిచేటప్పుడు, కేంద్రాలకు తరలించేటప్పుడు కనీస తనిఖీలు చేపట్టాలి. ఇక్కడ ఆ విధమైన పరిస్థితి లేదు. కాంట్రాక్టర్లతో లాలూచీ కారణంగా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. పార్వతీపురం ప్రాజెక్టు పరిధిలో గత నవంబరులో వచ్చిన సుమారు 2,786 ప్యాకెట్లలో అధిక భాగం కాలం చెల్లినవే కావడం గమనార్హం. ప్యాకెట్లపై స్పష్టంగా 22/11 అని గడువు తేదీ ఉన్నప్పటికీ.. నేటికీ వాటిని కేంద్రాలకు సరఫరా చేసి వినియోగిస్తుండడం ఆ శాఖాధికారుల నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోంది. పార్వతీపురం మండలంలో ఇప్పటికే బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు గత నెల 22 వరకు గడువు ఉన్న బాలామృతాన్ని తమ చిన్నారులకు అందించామని చెబుతున్నారు. పౌష్టికాహారం పేరుతో ప్రభుత్వం ఇస్తున్న ప్యాకెట్లను నమ్మి పిల్లలకు తినిపిస్తే.. రేపు ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కాలం చెల్లిన ఆహారాన్ని ఎలా పెడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన సీడీపీవో, సూపర్వైజర్ల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు. బస్తాల్లో ఉండటం వల్ల గడువు తేదీని గమనించలేకపోయామని గోదాము సిబ్బంది చెప్పుకురావడం గమనార్హం. దీనిపై సీడీపీవో రేఖావాణి వద్ద ప్రస్తావించగా.. పొరపాటు జరిగిందని, ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు. గత నెల ఇచ్చిన ప్యాకెట్లను ఇంకా ఉంటే ఉపయోగించవద్దని, అలాగే, ఈనెల ఇచ్చే నిల్వలను ఫిబ్రవరి లేదా జూలై వరకు గడువు తేదీ ఉన్న స్టాక్‌ను సరఫరా చేస్తామని చెప్పారు. ఈ మేరకు ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాలకు తెలియజేశామన్నారు. -
సమస్యలు వినరు..
బుధవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్ శ్రీ 2025● పీజీఆర్ఎస్పై సడలుతున్న నమ్మకం ● విజ్ఞప్తులు బుట్టదాఖలు ● పదేపదే తిరుగుతున్నా ఫలితం ఉండకపోవడమే కారణం సాక్షి, పార్వతీపురం మన్యం: కలెక్టరేట్లో ఒకటో తేదీ సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన వినతుల సంఖ్య 69... అంతకు ముందు వారం 92... ఆ క్రితం వారం 99... రోజురోజుకూ వివిధ సమస్యలపై కలెక్టర్ కార్యాలయానికి వచ్చి, అర్జీలు ఇచ్చే వారి సంఖ్య తగ్గిపోతుంది అంటే... సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినట్లు కాదు... తాము చెప్పుకున్నా, వినతులకు ఇక్కడ మోక్షం దొరకడం లేదన్న అభిప్రాయంతో పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వస్తున్న వారు క్రమేపీ తగ్గిపోతున్నారు. చిన్న చిన్న సమస్యలకు కూడా ఇక్కడ పరిష్కారం లభించడం లేదన్న అభిప్రాయం బలంగా ప్రజల్లో వినిపిస్తోంది. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసమని ప్రత్యేకంగా వినతుల స్వీకరణ నిర్వహిస్తున్నారు. వచ్చిన విజ్ఞప్తుల్లోనూ సగం వరకూ రెవెన్యూ సమస్యలపైనే ఉంటున్నాయి. ఈ సోమవారం మొత్తం 69 వినతులు రాగా.. అందులో రెవెన్యూపరమైనవి 31, సాధారణ అర్జీలు 38 ఉండటం గమనార్హం. కొద్ది రోజుల కిందటి వరకు ప్రతి వారం 150కి పైగా అర్జీలు అందేవి. క్షేత్రస్థాయిలో పరిష్కారం కాకనే... క్షేత్ర స్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల అలసత్వం కారణంగా గ్రామాల్లో సమస్యలు కోకొల్లలుగా ఉండిపోతున్నాయి. అర్హులై ఉన్నప్పటికీ పథకాలు అందకపోవడం, ఆక్రమణలు, సామాజిక, వ్యక్తిగత ఇబ్బందులు, రాజకీయ వేధింపులు, ఆన్లైన్లో తప్పిదాలు, భూములకు సంబంధించినవి, రహదారులు కావాలని.. ఇలా అనేక విధాలా సమస్యలపై క్షేత్ర స్థాయిలో అడిగి అడిగి అలసిపోయి, జిల్లా కేంద్రానికి వస్తుంటారు. ప్రతివారం సుమారు 200 మంది వరకూ వ్యయ ప్రయాసలకు ఓర్చి ఉన్నతాధికారులపై నమ్మకంతో పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందిస్తున్నారు. మళ్లీ వాటిని క్షేత్రస్థాయికి పంపించడం, ఆన్లైన్లో పెండింగ్‌లో చూపకుండా క్లియర్ చేసేయడం వంటి చర్యల వల్ల ఆ సమస్యలు అలానే ఉండిపోతున్నాయి. అందువల్లే ప్రతివారం వస్తున్న వినతుల్లో రీఓపెన్ అయినవే అధికంగా ఉంటున్నాయి. ముందే స్క్రూటినీ..? ఇటీవల కాలంలో కలెక్టరేట్ పీజీఆర్ఎస్ వద్ద వివిధ దశలను ఏర్పాటు చేశారు. ముందుగానే కొన్ని విభాగాలకు వచ్చిన వినతులను ఆయా కౌంటర్ల వద్ద పరిశీలిస్తున్నారు. చాలా వినతులను లోపలికి వెళ్లనీయకుండా అక్కడే ఏదో కారణం చెప్పి, వెనక్కి -
అరకొర నిధులు.. ఆందోళనలో ఉపాధ్యాయులు
1796 వీరఘట్టం: మన ఇంటిలో జరిగే ఓ శుభకార్యానికి షామియానా వేసి... మైక్‌సెట్ పెట్టి.. ఓ 30 మంది బంధుమిత్రులను పిలిచి వారికి అన్ని మర్యాదలు చేయాలంటే మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం సుమారు రూ.10 వేలు వరకు ఖర్చు అవుతుంది. అదే బంధువుల సంఖ్య పెరిగితే ఖర్చు రూ.వేల నుంచి రూ.లక్షలకు చేరుంది. ఈ విషయం అందరికీ తెలిసినదే. మరి అలాంటప్పుడు ప్రతి పాఠశాలలో ఈ నెల 5న నిర్వహించనున్న మెగా పేరెంట్–టీచర్ (పీటీఎం)3.0 మీటింగ్‌ను ఘనంగా నిర్వహించాలని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం అరకొర నిధుల కేటాయింపుపై అయ్యవార్లు పెదవివిరుస్తున్నారు. 30 మంది విద్యార్థులున్న పాఠశాలకు రూ.900 నిధులు కేటాయిస్తే ఎక్కడ సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టికాకుండా మార్కెట్లో పెరిగిన ధరలకు అనుగుణంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. నిధుల కోసం దాతల వద్ద చేయిచాచమని పరోక్షంగా అయ్యవార్లకు చంద్రబాబు సర్కారు సూచిస్తోందంటూ మండిపడుతున్నారు. డబ్బులు లేకుండా పండగ ఎలా? రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 5న పీటీఎంను పండగలా నిర్వహించాలని ప్రభుత్వం విద్యాశాఖ అధికారులకు దిశానిర్దేశం చేసింది. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాకమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఆహ్వానించి స్కూల్ ప్రగతిని చాటి చెప్పాలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రొగ్రెస్‌ను వారి తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా చేసుకుని ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. దీనిని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుత ధరల ప్రకారం పీటీఎం నిర్వహణకు నిధులు చాలవని చెబుతున్నారు. ఇదీ పరిస్థితి.... ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో 3,386 సర్కారు బడులు ఉన్నాయి. ఇందులో విజయనగరం జిల్లాలో 1796, పార్వతీపురం మన్యం జిల్లాలో 1590 సర్కారు బడులు ఉన్నాయి. వీటిలో పీటీఎంల నిర్వహణకు విజయనగరం జిల్లాకు రూ.38,20,500లు, పార్వతీపురం మన్యం జిల్లాకు రూ.25,12,800లు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. అయితే, ప్రభుత్వం చెప్పిన ప్రకారం కార్యక్రమం చేయాలంటే ఈ నిధులు చాలవని హెచ్ఎంలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పెదవి విరుస్తున్నారు. నిధుల కేటాయింపును పెంచాలని కోరుతున్నారు. నిధుల కేటాయింపు ఇలా... పాఠశాలల్లో 0–30 మంది విద్యార్థులుంటే రూ.900, 31–100 మంది మధ్య విద్యార్థులున్న పాఠశాలకు రూ.2,250, 101–250 మధ్యన రూ.4,500, 251–1000 మంది విద్యార్థులుంటే రూ.6,750, వెయ్యి మంది విద్యార్థులు కంటే ఎక్కువ ఉండే పాఠశాలకు రూ.9 వేలు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేశారు. ఈనెల 5న పీటీఎంను గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఉపాధ్యాయులు చేపట్టాల్సిన విధి, విధానాలను ఇప్పటికే తెలియజేశాం. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా చేసుకుని ప్రభుత్వం నిధులు విడుదల చేయనున్నట్టు ఉత్తర్వులు కూడా వచ్చాయి. ఆ నిధులతో అందరి భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలి. – బి.రాజ్‌కుమార్, డీఈఓ, పార్వతీపురం మన్యం జిల్లా రూ.25,12,800 పైసలు విదల్చకుండా పండగ ఎలా..? మెగా పేరెంట్ –టీచర్ డేకు నిధులు చాలవంటున్న ఉపాధ్యాయులు పెరిగిన ధరలకు అనుగుణంగా నిధులు విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ -
పోలియోపై పోరుకు సిద్ధం
● డిసెంబర్ 21న పోలియో చుక్కలు ● డీఎంహెచ్ఓ భాస్కర రావు పార్వతీపురం రూరల్: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ సన్నద్ధమైంది. ఈ నెల 21న జరగనున్న పోలియో డ్రైవ్‌పై వైద్యాధికారులకు, పర్యవేక్షకులకు స్థానిక ఎన్జీఓ హోంలో మంగళవారం రీ–ఓరియంటేషన్ శిక్షణ జరిగింది. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు మాట్లాడుతూ, చిన్నారుల భవిష్యత్తు ఆరోగ్యం దృష్ట్యా వ్యాక్సిన్ ఆవశ్యకతపై ఇప్పటి నుంచే ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఐదేళ్లలోపు పిల్లల జాబితాతో పక్కా మైక్రో ప్లాన్ రూపొందించాలని, హైరిస్క్ ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కోల్డ్ చైన్ నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసి, వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే లక్ష్యంగా సిబ్బంది కృషి చేయాలని కోరారు. డాక్టర్ జాన్ పవర్ శిక్షణ ఇవ్వగా, కార్యక్రమంలో డీఐఓ డా.విజయ మోహన్ సహ జిల్లా ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు. -
ఆత్మవిశ్వాసమే ఆలంబనగా..
● నర్సిపురంలో పారా ఒలింపిక్స్ క్రీడలు ● విజేతలకు బహుమతులుపార్వతీపురం రూరల్: శారీరక వైకల్యాన్ని జయిస్తూ మానసిక స్థైర్యంతో దివ్యాంగ విద్యార్థులు క్రీడా మైదానంలో కదం తొక్కారు. మంగళవారం పార్వతీపురం మండలంలోని నర్సిపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా పారా ఒలింపిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీలు ఆద్యంతం ఉల్లాసంగా సాగాయి. 15 మండలాల నుంచి వచ్చిన 85మంది విద్యార్థులు పతాకాల వేటలో పోటాపోటీగా తలపడ్డారు. డీఈఓ బి.రాజ్‌కుమార్, సమగ్ర శిక్ష ఏపీసీ తేజేశ్వరరావు డీఎల్ఈసీ భానుమూర్తి ఈ పోటీలను పర్యవేక్షించారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న ఆణిముత్యాలు పోటీల్లో సత్తాచాటి రాష్ట్రస్థాయికి అర్హత సాధించిన వారిలో 400మీటర్ల పరుగుకు సంబంధించి కె.ప్రమీల, జూనియర్ విభాగంలో సీహెచ్ జాను, ప్రధమ స్థానాల్లో నిలవగా జి. మణి, రాంనరేష్ ద్వితీయ స్థానాలు దక్కించుకున్నారు. లాంగ్ జంప్ విభాగంలో ఎస్.శివ, పి.రామచంద్ర (అండర్ జూనియర్స్) వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో నిలిచారు. జావెలెన్ త్రోకు సంబంధించి జూనియర్ విభాగంలో వెంకటసాయి, మనీషా స్వర్ణాలు సాధించారు. ఈ మేరకు విజేతలతో పాటు పాల్గొన్న క్రీడాకారులకు అతిథుల చేతుల మీదుగా పతాకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. -
పారా జిల్లా స్థాయి పోటీలు ప్రారంభం
విజయనగరం: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ సహకారంతో మంగళవారం స్థానిక విజ్జి స్టేడియంలో దివ్యాంగ క్రీడాకారుల జిల్లా స్థాయి పోటీలు ఉత్సాహ భరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త ఎ.రామారావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వర రావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ లతో కలిసి జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శారీరక ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని, వైకల్యాన్ని జయించే శక్తి క్రీడలకు ఉందన్నారు. ప్రభుత్వాలు కూడా పారా క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని ప్రతి ఒక్కరూ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకునేలా క్రీడల్లో రాణించాలని సూచించారు. రన్నింగ్, షాట్‌పుట్, డిస్క్‌త్రో, జావెలిన్‌త్రో, లాంగ్‌జంప్, హై జంప్ అంశాల్లో జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 150 మంది వరకు దివ్యాంగ క్రీడాకారులు పోటీలకు హజరుకాగా..జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమలో సమగ్ర శిక్ష జిల్లా కో ఆర్డినేటర్ ఎస్.సూర్యారావు, సహాయ కో–ఆర్డినేటర్ ఎం.భారతి, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జాతీయ జంబోరీలో జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందానికి అవార్డులు
విజయనగరం అర్బన్: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నవంబర్ 23 నుంచి 29వ తేదీ వరకు జరిగిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 19వ జాతీయ జంబోరీలో జిల్లా బృందం అద్భుతంగా రాణించింది. దేశవ్యాప్తంగా 35 వేల మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ పాల్గొంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 455 మంది, వారిలో విజయనగరం జిల్లా నుంచి 30 మంది పాల్గొన్నారు. అందులో కొత్తవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచే 27 మంది విద్యార్థులు పాల్గొనడం విశేషం. రాష్ట్రబృందం మొత్తం 9 అవార్డులు సాధించగా జిల్లా కంటిన్జెంట్ టీమ్ ఈ విజయంలో కీలకపాత్ర పోషించింది. గెలుచుకున్న అవార్డులలో బ్యాండ్–ఎ గ్రేడ్, మార్చ్‌పాస్ట్–ఎ గ్రేడ్, క్యాంప్క్రాఫ్ట్ ఎ గ్రేడ్, క్యాంప్ ఫైర్ –ఎ గ్రేడ్, స్టేట్ గేట్ –బి గ్రేడ్, పయనీరింగ్–బి గ్రేడ్, రంగోలి–సి గ్రేడ్ విభాగాలు ఉన్నాయి. జంబోరి ముగింపు కార్యమానికి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్ధులను ఆశీర్వదించారు. జిల్లాకు చేరుకున్న విజేతల బృందానికి జిల్లా విద్యాశాఖ అధికారి యూ.మాణిక్యంనాయుడు మంగళవారం ఘనంగా స్వాగతం పలికారు. గెలుచుకున్న షీల్డ్‌లు, సర్టిఫికెట్లను విజేతలకు, గైడ్ టీచర్లకు అందజేశారు. బృంద ప్రతినిధులు ఏఎస్ఓసీ కె.దుర్గానాగేశ్వరరావు, డీటీసీ ఎ.కనకలక్ష్మి, కె.సూరిబాబులను డీఈఓ అభినందించారు. కార్యక్రమంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్ జిల్లా కార్యదర్శి వాక చిన్నంనాయుడు, కమిషనర్ ఈ.విజయకుమార్, సీఈఓ సన్యాసిరాజు, డైట్ వైస్ ప్రిన్సిపాల్ దత్తి అప్పలనాయుడు, నాగరాజు, శర్మ తదితరులు పాల్గొన్నారు. -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రదాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. చదురుగుడి వద్దనున్న బాలాలయంలో మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలతో అర్చనలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు. న్యాయమూర్తి మానవతా దృక్పథంవిజయనగరం టౌన్: పాక్షికదృష్టి లోపంతో నడిరోడ్డుపై అగమ్యగోచరంగా ఓ వృద్ధుడు తిరుగుతున్నట్లు తెలుసుకున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత మానవతా దృక్పథంతో స్పందించారు. ఈ మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి కృష్ణప్రసాద్‌ను పంపించి ఆ వృద్ధుడిని ప్రేమసమాజంలో మంగళవారం చేర్పించారు. ఈ సందర్భగా వృద్ధుడి పేరు అప్పన్నగా కృష్ణప్రసాద్ తెలుసుకుని ఆశ్రమ నిర్వాహకులతో మాట్లాడి, బాగోగులను చూసుకోవాలని, ఎటువంటి సహాయ, సహకారాలు కావాల్సిన జిల్లా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. చట్టప్రకారమే చర్యలు● ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పార్వతీపురం రూరల్: సాలూరులో మంత్రి అనధికార పీఏ, ఓ ఒంటరి మహిళ పరస్పరం చేసుకున్న ఫిర్యాదులపై చట్టప్రకారమే నడుచుకుంటున్నామని, ఇందులో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీమాధవ్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగం పేరుతో మోసం చేశారని మహిళ, తమపై అసత్య ప్రచారాలు చేస్తూ కుట్ర పన్నుతున్నారని పీఏ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సాలూరులో రెండు కేసులు నమోదు చేశామన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నది అవాస్తవమని ఎస్పీ కొట్టిపారేశారు. ‘కేసులో వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు సాంకేతిక ఆధారాలను, వాట్సాప్ చాటింగ్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని, ఆ నివేదిక ఆధారంగా, సమగ్ర విచారణ జరిపి తప్పు ఎవరిదైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తేల్చిచెప్పారు. సామాజిక రుగ్మతలపై.. గురజాడ ‘అక్షర’ కొరడా● చరిత్రను సాహిత్యంగా మలిచిన వైతాళికుడు● ప్రముఖ సాహితీవేత్త పొదిలాపు శ్రీనివాస్పార్వతీపురం రూరల్: గురజాడ లేని సాహిత్య జాడ శూన్యమని, తరాలు మారినా ఆయన అక్షరం తరగని గని అని ప్రముఖ సాహితీవేత్త పొదిలాపు శ్రీనివాస్ అభివర్ణించారు. పార్వతీపురం మన్యం పుస్తక మహోత్సవం మంగళవారంతో ఎనిమిదో రోజుకు చేరుకుంది. వంగపండు–భూషణం– గణేష్ పాత్రో సాహిత్య వేదికపై జరిగిన సభకు పిల్ల తిరుపతిరావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా హాజరైన పొదిలాపు ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. పురాతన అహంకారం మొదలు..నేటి కార్పొరేట్ అధికారం వరకు సాగుతున్న దోపిడీని తన సాహిత్యంతో ఎండగట్టిన ధీశాలి గురజాడ అని కొనియాడారు. ‘కన్యాశుల్కం’ ద్వారా మహిళా లోకానికి వెలుగులద్ది, అణగారిన వర్గాల హక్కుల కోసం అక్షరాయుధాన్ని ప్రయోగించిన సంఘ సంస్కర్త అని ప్రస్తుతించారు. పేదల బతుకులను ఛిద్రం చేసే కుట్రలను తన రచనల ద్వారా ప్రతిఘటించిన తీరు అమోఘమన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి సిరికి స్వామినాయుడు రచించిన ‘శతర’ పుస్తకాన్ని సాహితీవేత్త అల్తి మోహన్‌న్ సమీక్షించారు. గురజాడ ఆశయ సాధనే లక్ష్యంగా సాగిన ఈ వేడుకలో కామాక్షి నృత్య ప్రదర్శన ఆహూతులను విశేషంగా అలరించింది. -
20 లాడ్జిల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
విజయనగరం క్రైమ్: విజయనగరం రైల్వేస్టేషన్ పరిఽధిలో గల పలు లాడ్జిల్లో వన్‌టౌన్ పోలీసులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరంలోని సీఎంఆర్ జంక్షన్ నుంచి స్వీట్ ఇండియా వరకు 20 లాడ్జిల్లో సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విస్తృత తనిఖీలు చేశారు. వన్‌టౌన్ సీఐ ఆర్వీఆర్కే చౌదరితో పాటు క్రైమ్ ఎస్సైలు సురేంద్రనాయుడు, రవిలు మూకుమ్మడిగా ఏకకాలంలో మొత్తం 20 లాడ్జిలలో సోదాలతో పాటు తనిఖీ చేశారు. రెండు రోజుల క్రితమే నగరం మొత్తం దాదాపు 120 ప్రాంతాల్లో వెయ్యి మంది సిబ్బందితో నాకాబందీ చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తనిఖీల్లో దాదాపు 70 మంది వాహనాలను సీజ్ చేశారు. ఈ క్రమంలోనే వన్‌టౌన్ పోలీసులకు వచ్చిన సమాచారంతో క్రైమ్ ఎస్సై సురేంద్రనాయుడు రైల్వే స్టేషన్ వద్ద యామిని, ఎస్ఆర్, సామ్రాట్ లాడ్జిలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ లాడ్జిలలోనే నెలరోజుల క్రితం కొరాపుట్ నుంచి రెండు సూట్ కేసుల్లో గంజాయితో అనుమానితులు వచ్చిన దరిమిలా పోలీసులు విస్తృతంగా ఈ తనిఖీలు నిర్వహించారు. -
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఉణుకూరు యువకుడి ప్రతిభ
రేగిడి: మండల పరిధిలోని ఉణుకూరు గ్రామానికి చెందిన ఎందువ రాహుల్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటాడు. గత నెల 28 నుంచి 30 వరకు హంగేరీలో జరిగిన కెటిల్‌బెల్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొని 48 కేజీల విభాగంలో ద్వితీయ స్థానం సాధించి భారత జాతీయ పతాకాన్ని ఆ దేశంలో రెపరెపలాడించాడు. రాహుల్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. ఆయన తండ్రి ఎందువ రామకృష్ణ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా శిర్లాం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. మండలానికి చెందిన యువకుడు ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లాతోపాటు రేగిడి మండలాన్ని నిలబెట్టడంతో గ్రామస్తులు, ఉపాధ్యాయులు, యువకులు అభినందించారు. మంగళవారం ఈ విషయాన్ని రాహుల్ తండ్రి ఎందువ రామకృష్ణ విలేకరులకు తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో ఆర్టీసీ డ్రైవర్ మృతి
పాలకొండ రూరల్: మండలంలోని బుక్కూరు ఎస్సీవీధిలో నివాసముంటున్న పాలకొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న జామి విఠల్‌రావు (49) అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్లు ఎస్సై కె.ప్రయోగమూర్తి తెలిపారు. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం రాత్రి తన ఇంట్లో నిద్రించిన విఠల్‌రావు మంగళవారం ఉదయం విగత జీవిగా ఉండడాన్ని గుర్తించిన ఆయన తండ్రి రామప్పడు షాక్‌కు గురుయ్యారు. కరుణ అనే మహిళతో ఇటీవల విఠల్‌రావుకు వివాహమైంది. భార్య శ్రీకాకుళంలో ఉండడంతో భర్త మరణించినట్లు సమాచారం ఆమెకు అందించారు. ఆమె బుక్కూరు చేరుకుని భర్త మృతదేహంపై గాయాలున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆమె అందించిన ఫిర్యాదుతో పోలీసులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐ ఆమిటి ప్రసాద్ వివిధ కోణాల్లో తమదైన శైలిలో దృష్టి పెట్టామని చెప్పారు. తమ ఉద్యోగి జేవీ రావు మృతిపట్ల ఈయూ జోనల్ సెక్రటరీ బీకే.మూర్తి, సహ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. లారీ వ్యాన్ ఢీ● వ్యాన్ డ్రైవర్ మృతి దత్తిరాజేరు: మండలంలోని ఎస్ బూర్జవలస పోలీస్‌స్టేషన్ పరిధి మర్రివలస వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన వ్యాన్ డ్రైవర్ మృతి చెందినట్లు ఎస్సై జి.రాజేష్ తెలిపారు. ఈ ప్రమాదంపై ఎస్సై, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామభద్రపురం నుంచి వస్తున్న లారీ మరడాం నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న వ్యాన్‌ను ఢీకొనడంతో వ్యాన్ డ్రైవర్ తీవ్ర గాయాల పాలు కాగా 108లో విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుటుంబ వివరాలు, చిరునామా తెలియాల్సి ఉందని కుటుంబసభ్యులు బుధవారం వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయనున్నామని ఎస్సై తెలిపారు. -
ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి
పార్వతీపురం: విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందస్తు జాగ్రత్తలు అవసరమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నా రు. కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏపీ విపత్తుల స్పందన, అగ్నిమాపక సేవల శాఖ జిల్లా కు సరఫరా చేసిన రక్షణ పరికరాలను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విపత్తులశాఖ సామర్థ్యా న్ని మరింత పెంపొందించుకోవాలన్నారు. రక్ష ణ పరికరాలతో జిల్లాలోని ప్రజలకు సమయానుకూలంగా, త్వరితగతిన, నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో విపత్తుల నిర్వాహణాధికారి పి.సింహాచలం, సిబ్బంది పాల్గొన్నారు. మెట్టపల్లిలో వైద్య శిబిరం ● వైద్య శిబిరాన్ని సందర్శించిన డీఎంహెచ్ఓ చీపురుపల్లి: స్క్రబ్ టైఫస్ వైరస్ కలకలం నేపథ్యంలో చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామంలో సోమవారం వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. స్క్రబ్ టైఫస్ వైరస్ లక్షణాలతో భార్య మృతి చెందినట్టు భర్త తెలిపిన వివరాల మేరకు గతనెల 30న ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు వైద్య సిబ్బంది స్పందించారు. కర్లాం పీహెచ్సీ వైద్యాధికారి శ్రీలక్ష్మి, సిబ్బంది వైద్యశిబిరం నిర్వహించారు. గ్రామంలో జ్వరాలతో బాధపడుతున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు. డీఎంహెచ్ఓ జీవనరాణి వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్యాధికారితో మాట్లాడి వివరా లు తెలుసుకున్నారు. మృతురాలు చికిత్స పొందిన ఆస్పత్రి వివరాలపై ఆరా తీశారు. ప్రస్తు తం మెట్టపల్లిలో ఎలాంటి స్క్రబ్ టైఫస్ వైరస్ వ్యాప్తి చెందలేదని పీహెచ్సీ వైద్యాధికారి శ్రీలక్ష్మి తెలిపారు. డీఎంహెచ్ఓ వెంట జిల్లా ఇమ్యూనిటీ అధికారి సత్తిరాజు, జిల్లా సర్వేలైన్స్ అధికారి సత్యనారాయణ ఉన్నారు. చీపురుపల్లి: ‘ఇది అనధికార లే అవుట్.. ఈ లే అవుట్‌కు ఎలాంటి అనుమతులు లేవు.. క్రయ విక్రయాలకు గ్రామ పంచాయతీ ఎలాంటి బాధ్యత వహించదు.. ఇక్కడ ప్లాట్లు కొన్న వారికి ఇంటి ప్లాన్లు ఆమోదించబడవు.. తాగునీటి సదుపాయం అనుమతించబడదు’.. ఇదీ రావివలస రెవెన్యూ పరిధిలో వెలసిన అనధికార రియల్ ఎస్టేట్ వెంచర్లో అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు. రావివలస రెవెన్యూ పరిధిలో ఏర్పాటైన అనధికార లే అవుట్‌పై ‘దర్జాగా రియల్ దందా’ అనే శీర్షికన గతనెల 30న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. అదేరోజు ఎంపీడీఓ సురేష్ ఆధ్వర్యంలో సిబ్బంది రియల్ ఎస్టేట్ వెంచర్‌ను పరిశీలించి నోటీసులు జారీచేశారు. పంచాయతీ కార్యదర్శి కె.సతీష్, వీఆర్వో ఏ.జగన్నాథం నేతృత్వంలో అనధికార లే అవుట్లో సోమవారం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. సర్వే నంబర్ 164/11,12,13,14,15, 165/1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11, 12, 13, 14, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 166/1, 2, 3పి, 4పి నంబర్లల్లో ఏర్పాటు చేసిన లే అవుట్‌కు ఎలాంటి అనుమతులు లేవని హెచ్చరిక బోర్డులో పేర్కొన్నారు. అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసి విక్రయాలు జరిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ● హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన అధికారులు ● ఇంటి ప్లాన్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం మంజూరు చేయం -
చర్యలేవీ?
మంత్రి కుమారుడు, పీఏపైపార్వతీపురం రూరల్: మహిళను లైంగికంగా, మానసికంగా వేధించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు, పీఏ లపై నేటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఐద్వా నాయకులు ప్రశ్నించారు. సాలూరుకు చెందిన ఒక మహిళా ఉద్యోగిని.. తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేసినట్లు ఆధారాలతో సహా పార్వతీపురం ఏఎస్పీకి ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు. నిందితులు ఇరువురిపై కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాల్సిన యంత్రాంగం ఆ దిశగా చేయలేదని... పైగా ఫిర్యాదు చేసిన మహిళకు వైద్య పరీక్షల నిమిత్తం వివిధ ఆస్పత్రులకు తిప్పుతూ, తన వ్యక్తిగత సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అధికారులు ఈ రకమైన కక్షపూరిత వైఖరి ప్రద ర్శించడం పట్ల అఖిల భారత ప్రజాతంత్ర మహి ళా సంఘం (ఐద్వా) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. పార్వతీపురంలోని సుందరయ్య భవనంలో ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.శ్రీదేవి, బి.లక్ష్మి మీడియాతో సోమవా రం మాట్లాడారు. రాష్ట్ర సీ్త్రశిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వ్యక్తిగత సిబ్బంది, కుమారునిపై ఇంతటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పటికీ.. కనీసం వారిపై చర్యలు చేపట్టక పోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. నిందితులు దర్జాగా తిరుగుతున్నారని, ఫిర్యాదు చేసిన మహిళను మాత్రం తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి ఇటీవల చేసిన పత్రిక ప్రకటనలో నిందితులను శిక్షిస్తామని గానీ, జరిగిన తప్పు సరిదిద్దుతామని గానీ మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పైగా ఫిర్యాదు చేసిన మహిళను బెదిరించే విధంగా ప్రకటించడంపై ఐద్వా తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని మహిళలను వేధింపుల కు గురిచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఐద్వా ఆధ్వర్యంలో బాధిత మహిళకు మద్దతుగా ఆందోళన చేపడతా మని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా ఉపాధ్యక్షులు ఎం.గౌరమ్మ పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 2 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సాక్షి, పార్వతీపురం మన్యం: వరి పంట కోతకొచ్చిన సమయంలో మోంథా తుపాను కలవరపెట్టింది. చేలను నేలవాల్చి అన్నదాత ఆశలను నేలపాలచేసింది. ఇప్పుడు కోతలు, నూర్పిడిలు చేస్తూ.. పంట విక్రయానికి సిద్ధంగా ఉన్న వేళ.. మరోసారి దిత్వా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలు రైతన్నను వణికిస్తున్నాయి. చాలా చోట్ల వరి పంట కోతలు పూర్తయి ఓవులు(పనల) రూపంలో ఉంది. మరికొన్ని చోట్ల నూర్పిడి చేసి కళ్లాల్లోనే రాశులుగా పోసి ఉంచారు. బస్తాలకు నింపి విక్రయానికి సిద్ధం చేశారు. ఈలోగా తుఫాన్ ప్రభావం వల్ల ఆకాశం మేఘావృతమైంది. సోమ వారం మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తుండడంతో.. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఆపసోపాలు పడుతున్నారు. టార్పాలిన్ల కోసం పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వం నుంచి కొనుగోలు లేకపోవడం.. కనీసం ముందస్తు జాగ్రత్త చర్యగా టార్పాలి న్లు కూడా ఇవ్వకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు వర్షాన్ని బూచిగా చూపి దళారులు, వ్యాపారులు కల్లాల వద్దకు వాలిపోతున్నారు. మద్దతు ధర కంటే బస్తా (80కిలోలు)ను రూ.200 నుంచి రూ.300 తక్కువకు అడుగుతున్నా రు. రైతులు కూడా పంటను కాపాడుకునే పరిస్థితి లేక, వచ్చిన మొత్తానికే విక్రయించుకుంటున్నారు. 5 కేజీలు అదనంగా దోపిడీ.. జిల్లాలో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించా రు. ఇప్పటివరకు కేవలం 20 వేల టన్నులు మాత్ర మే కొనుగోలు చేశారు. జిల్లాలో 104 రైస్ మిల్లులు ఉండగా.. బీజీలు ఇవ్వడంలో మిల్లర్లు ఇంకా తాత్సారం చేస్తున్నారు. ఫలితంగా కొనుగోలు మందకొడిగా సాగుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఖరీఫ్ సాగు చేస్తున్న వరి ధాన్యం పంట నూర్పులు చేస్తూ, అమ్మకానికి రైతన్న సిద్ధమవుతున్నారు. ఒకవైపు వర్షాలు.. వాతావరణ పరిస్థితులు బాగోలేక చేతికి అందిన పంటను అమ్ముకోవాలని చూస్తున్నారు. రైతుల ఆందోళనను ఆసరాగా చేసుకుని జిల్లాలో ఉన్న మిల్లర్లు, దళారులు అంతా ఒకే మాటపై క్వింటా ధాన్యానికి అదనంగా 5 కేజీలు ధాన్యం ఇవ్వాల ని డిమాండ్ చేస్తున్నారు. దింపుడు కూలి రూ.10 ఇస్తే గానీ మిల్లుకు వచ్చిన ధాన్యం దించబోమని రైతులపై అదనపు భారాన్ని రుద్దుతున్నారు. ధ్యానం సేకరణ వేగవంతం చేయాలి.. ఓ వైపు వాతావారణం అనుకూలంగా లేదు.. మరో వైపు రైతులను మిల్లర్లు, వ్యాపారులు మోసం చేస్తున్నారు. తక్షణమే రైతుల నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనా యుడు, అధ్యక్షుడు వెలమల సత్యనారాయణ, సంఘం నాయకులు పోలురోతు చంద్రశేఖర్ కోరారు. సబ్ కలెక్టర్ వైశాలిని కలిసి రైతు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. 5 కేజీల దోపిడీపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుకు అవసరం అయిన అంకెలు సచివాలయంలో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. పాలకొండ రూరల్: బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షం నుంచి వరి పంటను కాపాడుకునేందుకు రైతులు పొలాలకు పరుగులు తీశారు. ఇంటిళ్ల పాదీ సోమవారం ఉదయం నుంచి పొద్దుపోయేవరకు వరి సంరక్షణ పనుల్లోనే నిమగ్నమయ్యారు. కోసిన చేనును చిన్నచిన్న కుప్పలుగా పెట్టారు. కొన్ని చోట్ల రాశులుగా ఉన్న ధాన్యంను బస్తాల్లోకి ఎత్తి టార్పాలిన్లు కప్పారు. పాలకొండ మండలంలోని లుంబూరు, గరుగుబిల్లి, కోటిపల్లి, భాసూరు, యరకారాయపురం, ఓని తదితర ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో నూర్పిడి చేయలేకపోయామని, తుఫాన్ వర్షాలకు తడిసి ముద్దయిందంటూ రైతులు వాపోయారు. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటను తుఫాన్ వర్షాలు తడిసిముద్ద చేస్తున్నాయి. కోతకొచ్చే సమయంలో మోంథా తుఫాన్ ముంచేసింది. ఇప్పు డు దిత్వా తుఫాన్‌తో కురుస్తున్న చిరుజల్లులు వరి ఓవులు (పనలను) తడిపేస్తున్నాయి. ఉన్న పంట కాపాడుకుందామన్నా ఒడుపు కుదరడం లేదు. కోతలు పూర్తిచేసి కుప్పలు వేసిన చేను నూర్పిడి చేద్దామంటే ధాన్యం కొనుగోలు జోరుగా సాగడం లేదు. ధాన్యం ఇంటి వద్ద ఉంచే అవకాశం లేదు. మా ప్రాంతంలో దాదాపు 5 వందల ఎకరాల్లో వరిచేను కుప్పల రూపంలోనే ఉంది. మరోవైపు తోటపల్లి కాలువకు నీరు తగ్గించలేదు. తుఫాన్ వర్షాలు, తోటపల్లి కాలువ నీరు పొలాల్లో చేరుతోంది. ఏం చేయాలో పాలు పోవడం లేదు. –ముల్లు గోపాలరావు, రైతు, పాలకొండ మండలం -
హెచ్చరిక బోర్డు ఉన్నా..
ఈ చిత్రాలు చూశారా.. ఓ వైపు హెచ్చరిక బోర్డు ఉన్నా.. అదే స్థానంలో కొత్తగా నిర్మాణాలకు మట్టివేశారు. ఇది కురుపాం మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఆంధ్రా–ఒడిశా ప్రధాన రోడ్డు పక్కన సర్వే నంబర్ 27–2లో ఉన్న 60 సెంట్లు భూమి. ఇది డీ పట్టా భూమి. ఓ గిరిజన రైతుకు దశాబ్దాల కిందట సాగుపట్టా ఇచ్చారు. ముందుచూపుతో కొన్నేళ్ల కిందట ఓ నాయకుడు ఈ భూమిని కేవలం రూ.6వేలకు కొనుగోలుచేశాడు. ఇక్కడి ధర అమాంతం పెరగడంతో ఏడాది కిందట రూ.45 లక్షలకు వేరేవారికి విక్రయించాడు. దీంతో వారు వ్యాపార సముదాయాల నిర్మాణాలకు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు డీ పట్టా భూమిలో నిర్మాణాలు చేపట్టరాదంటూ అడ్డుకున్నారు. నిర్మాణాలు కూల్చివేసి హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటుచేశారు. ఇప్పుడు మళ్లీ అదే స్థలంలో నిర్మాణాలకు పూనుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీనివెనుక అధికార పార్టీకి చెందిన నాయకుడు కీలకంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. రెవెన్యూ అధికారులతో మంతనాలు జరుపుతూ నాడు అక్రమమని తేల్చిన భూమిని నేడు సక్రమంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సాగు హక్కు పట్టా కలిగిన గిరిజనుడి పేరుతోనే నిర్మాణాలకు పూనుకున్నట్టు సమాచారం. సాగు కోసం అందజేసిన భూమిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసిన రెవెన్యూ అధికారులు ఇప్పుడు ఎలా అంగీకారం తెలిపారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణాలు అడ్డుకుంటారా? అనుమతులు ఇస్తారా అన్న చర్చ కురుపాం జోరుగా సాగుతోంది. – కురుపాం -
మా ఊరికి రోడ్డు ఎప్పుడు వేస్తారు ‘బాబూ’
గుమ్మలక్ష్మీపురం: మా గ్రామానికి రెండేళ్ల కిందట రోడ్డు మంజూరైంది... రోడ్డు నిర్మాణ పనులను మధ్యలో నిలిపివేశారు.. ఇప్పటివరకు తిరిగి చేపట్టలేదు.. రోడ్డు ఎప్పుడు వేస్తారో చెప్పండి ‘బాబూ’ అంటూ గుమ్మలక్ష్మీపురం మండలం లుంబేసు పంచాయతీ దేరుగండ గిరిజనులు సోమవారం ఆందో ళన చేశారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను డోలీ లో తరలించాల్సి వస్తోందని వాపోయారు. అటవీ ఫలసాయాలను సంతకు తరలించాలన్నా, కొనుగో లు చేసిన నిత్యావసర సరుకులు ఇళ్లకు తీసుకెళ్లాల న్నా ఇబ్బందులు పడుతున్నామన్నారు. రోడ్డు నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరికి విజ్ఞప్తి చేస్తే.. ‘నాకు ఓటు వేయలేదు.. రోడ్డు వేయలేనంటూ’ సూటిగా చెప్పడం భావ్యం కాదన్నారు. ఎమ్మెల్యేగా ప్రజాధనాన్ని వేతనం రూపంలో తీసుకుని, ప్రజల సమస్యలు పట్టించుకోకుంటే ఎలా అని ప్రశ్నించారు. రోడ్డు వేయకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల సహాయ కార్యదర్శి మండంగి సన్యాసిరావు, యువజన సంఘం నాయకులు బిడ్డిక రమేష్, గిరిజనులు పాల్గొన్నారు. -
13న జాతీయ లోక్ అదాలత్‌ను జయప్రదం చేయండి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబితవిజయనగరం లీగల్: ఈనెల 13న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కోర్టు పరిధిలో ఉన్న న్యాయమూర్తులందరితో ఆమె సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ ప్రమాద కేసులు, బ్యాంకుకేసులు, చెక్‌బౌన్స్, మనీ కేసులు, ప్రాంసరీ నోట్ కేసులు, పర్మినెంట్ ఇంజక్షన్ దావాలు, ఎకై ్సజ్, ల్యాండ్ కేసులు, మున్సిపాలిటీ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులకు ఇరు పార్టీల అనుమతితో రాజీమార్గంలో శాశ్వత పరిష్కారం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు మొదటి న్యాయమూర్తి ఎం.మీనా దేవి, మూడవ అదనపు న్యాయమూర్తి కె.విజయకల్యాణి, నాల్గవ అదనపు న్యాయమూర్తి బి.అప్పలస్వామి, ఐదవ అదనపు న్యాయమూర్తి ఎం.పద్మావతి, పోక్సోకోర్టు జడ్జి కె.నాగమణి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి. దుర్గయ్య,సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సమర్థంగా విధుల నిర్వహణకు ఆరోగ్యం ముఖ్యం
● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డిపార్వతీపురం: జిల్లా పరిపాలనా యంత్రాంగం సమర్థవంతంగా విధులను నిర్వహించాలంటే ఆరోగ్యం ముఖ్యమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులు, సిబ్బంది కో సం ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జిల్లా అబివృద్ధిలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్క అధి కారి, సిబ్బంది ఆరోగ్యం చాలా ముఖ్యమన్నారు. సిబ్బంది ఆరోగ్యం, శ్రేయస్సు దృష్ట్యా ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ శిబిరంలో కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, అంకాలజీ, జాయింట్ రీప్లేస్మెంట్, ఎకో, ఈసీజీ తదితర పరీక్షలను నిర్వహించి అనుభవజ్ఞులైన వైద్యులతో చికిత్సలు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా.పి.భాస్కరరావు, డీసీహెచ్ఎస్ డా.జి.నాగభూషణరావు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణాధికారి డా.ఎం.వినోద్, ప్రోగ్రాం మేనేజర్ డా.టిజగన్మోహన్రావు పాల్గొన్నారు. -
విద్యార్థుల వివరాల నమోదులో జాగ్రత్త
విద్యార్థుల వివరాల నమోదులో ఆందోళన వద్దు పదో తరగతి విద్యార్థుల వివరాలు నామినల్ రోల్స్‌లో ఎంట్రీ చేసేందుకు ఆందోళన చెందొద్దు. గడువు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే విద్యార్థులకు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలి. నమోదు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ప్రతి అక్షరం చెక్ చేయాలి.గడువు ఇచ్చే అవకాశం ఉంది కదా అని నిర్లక్ష్యంగా చేయకూడదు. – బి.మోహనరావు, డీఈఓ, విజయనగరంఈ ఏడాది గందరగోళం ఈ ఏడాది యూడైస్ ప్రామాణికంగా నామినల్ రోల్స్‌లో విద్యార్థుల వివరాలు నమోదుకు గందగోళంగా ఉంది.గతంలో ఇలా ఎప్పుడూ లేదు. అన్లైన్లో విద్యార్థుల వివరాలు నమోదు చేసేటప్పుడు పొరపాటున తప్పు దొర్లితే సరిదిద్దేందుకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు.దాంతో ఇబ్బందిగా ఉంది.యూడైస్ ప్లస్‌లో ఎడిట్,సేవ్ సబ్మిట్ ఆప్షన్,బీఎస్ఈ సైట్లో కూడా ఎడిట్,సేవ్ సబ్మిట్ ఆప్షన్స్ లేకుండా కేవలం యూడైస్ ప్లస్‌లో మాత్రమే సబ్మిట్ ఆప్షన్ పెట్టడం వల్ల 24 గంటల తర్వాత బీఎస్ఈ సైట్లో డేటా రిఫ్లెక్ట్ కావడం ఇబ్బందిగా ఉంది.విద్యాశాఖ ఉన్నతాధికారులు మాత్రం వివరాల నమోదు తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇస్తామంటున్నారు. – వి.గోపాలనాయుడు, హెచ్ఎం, ఉన్నత పాఠశాల రామభద్రపురంరామభద్రపురం/మెరకముడిదాం: విద్యార్థులకు పదవ తరగతి సర్టిఫికెట్ ఎంతో కీలకం.మార్కులొక్కటే కాదు.. అందులో నమోదయ్యే వివరాలు కూడా ముఖ్యమే. భవిష్యత్‌లో ఉన్నత చదువులకే కాకుండా ఉపాధి అవకాశాలకు పదో తరగతి సర్టిఫికెట్‌లోని వివరాలే ప్రధానం.ఇంతటి ప్రాధాన్యం కలిగిన మార్కుల జాబితాల్లో విద్యార్థుల వివరాల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాల్సిన అవసరం ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థుల తల్లిదండ్రులపై ఉంది. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్ధులు 16,287 మంది. ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 6,878 మంది మొత్తం 23,165 మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. తాజాగా ఆన్లైన్లో వారి నామినల్ రోల్స్ ఎంట్రీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పకడ్బందీగా విద్యార్థుల వివరాలు నమోదు చేయాలని, తప్పొప్పులు నమోదు కాకుండా చూడాలని, విద్యార్థుల వివరాల నమోదులో నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్‌లో విద్యార్థులకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉందని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. నామినల్ రోల్స్ చేయించుకునేటప్పుడు ఆపార్లో అన్ని వివరాలు అప్డేట్ ఉండాలి. దీంతో పదో తరగతి నామినల్ రోల్స్ ఎంట్రీ కోసం ఈ నెల 6 వ తేదీ గడువు కావడంతో వివరాల నమోదులో ఆయా పాఠశాలల హెచ్ఎంలు నిమగ్నమై ఉన్నారు.అలాగే ఆన్లైన్లో నామినల్ రోల్స్‌కు సంబంధించి వివిరాలు నమోదు చేసే సమయంలో పొరపాటున తప్పులు దొర్లితే సరిదిద్దేందుకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో ఇబ్బందిగా ఉందని హెచ్ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్‌లో ఇబ్బంది పదో తరగతి నామినల్ రోల్స్ ఎంట్రీలో జాగ్రత్తలు అవసరం ఈ నెల 6వ తేదీ వరకు గడువు ఆన్లైన్లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో హెచ్ఎంల ఇబ్బందులు -
ఎయిడ్స్‌పై ‘అవగాహనే’ ఆస్త్రం
● కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డిపార్వతీపురం రూరల్: అవగాహన అనే అస్త్రంతోనే ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేయగలమని, అప్రమత్తతే ఆరోగ్యానికి శ్రీరామరక్ష అని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఉద్ఘాటించారు. ప్రపంచ ఎయిడ్స్ నియంత్రణ దినం సందర్భంగా ఆదివారం ప్రభుత్వ భవనాల సముదాయం నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్ఐవీ బాధితుల పట్ల సమాజంలో ఉన్న వివక్షను రూపుమాపడమే వ్యాధి నియంత్రణకు తొలిమెట్టు అని పిలుపునిచ్చారు. వ్యాధిగ్రస్తులను చిన్నచూపు చూడకుండా వారిని గుండెలకు హత్తుకునే మానవత్వం పరిమళించాలని హితవు పలికారు. ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటూ ఏఆర్టీ మందులు, పెన్షన్లు అందిస్తోందని, ఎవరూ అధైర్యపడవ్దని భరోసా ఇచ్చారు. క్షణిక ఆనందం కోసం జీవితాలను పణంగా పెట్టవద్దని, సురక్షిత జీవన విధానమే యువతకు రక్షాకవచమని కలెక్టర్ హితవు పలికారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా.భాస్కరరావు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డా.వినోద్ కుమార్, ఇతర అధికారులు, పెద్దఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. -
సకాలంలో వినతుల పరిష్కారం
● కలెక్టర్ డాక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డివిజయనగరం అర్బన్: జిల్లాలో ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు పీజీఆర్ఎస్ (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెవెన్స్ సిస్టమ్)ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అందుకు సంబంధించిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ప్రజలు విశేషంగా స్పందించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ప్రజల నుంచి 201 వినతులను స్వీకరించారు. ప్రతి అర్జీదారుతో మాట్లాడి, వారి సమస్యలను శ్రద్ధగా విని వెంటనే సంబంధిత అధికారులకు పరిష్కార సూచనలు జారీ చేశారు. విభాగాల వారీగా స్వీకరించిన వినతులలో అత్యధికంగా రెవెన్యూశాఖకు 73, మిగిలిన వాటిలో డీఆర్డీఏ 32, గ్రామ సచివాలయం 12, మున్సిపాలిటీ 6, పంచాయతీరాజ్ 10, విద్యుత్ శాఖ 3, వైద్య ఆరోగ్యశాఖ 2, హౌసింగ్ 7, ఇతర శాఖలు మరో 50 అర్జీలు ఉన్నాయి. ఫిర్యాదులపై చర్యల విషయంలో అర్జీదారులతో మాట్లాడిన తేదీ, సమయాన్ని తప్పకుండా పోర్టల్‌లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మురళి, డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీల గాంధీ, బి.శాంతి, కళావతి, సర్వే శాఖ ఎ.డి ఆర్.విజయకుమార్, కలెక్టరేట్ పరిపాలనాధికారి దేవీప్రసాద్, సీపీఓ బాలాజీ, డీఈఓ మాణిక్యంనాయుడు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. అర్జీలు పునరావృతం కారాదు: కలెక్టర్ ప్రభాకరరెడ్డి పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీలు ఎట్టిపరిస్థితుల్లో కూడా పునరావృతం కారాదని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు 69 వినతులు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును శ్రద్ధతో పరిశీలించి ప్రజలకు సంతృప్తి కలిగే విధంగా నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. పరిష్కారంలో జాప్యం వహించరాదని స్పష్టం చేశారు. అధికారులు చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కరించి ప్రజల మన్ననలను పొందాలని సూచించారు. ఒకవేళ అర్జీలు పరిష్కారం కాకపోతే అందుకు గల కారణాలను అర్జీదారులకు వివరించాలని కెప్పారు. అర్జీలను స్వీకరించినవారిలో డీఆర్ఓ కె.హేమలత, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఎస్పీ పీజీఆర్ఎస్కు 24 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: ప్రతి వారం మాదిరిగానే జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక సోమవారం జరగ్గా రెండు చోట్ల ఫిర్యాదు దారుల నుంచి ఎస్పీ, ఏఎస్పీలు ఫిర్యాదులు స్వీకరించారు. సరిగ్గా పదిగంటలకు డీపీఓలోని కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ ఆదేశాలతో ఏఎస్పీ సౌమ్యలత ఫిర్యాదులు స్వీకరించారు. పన్నెండున్నర గంటలకు ఎస్పీ దామోదర్ తన చాంబర్లో ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తంగా 24 ఫిర్యాదులను స్వీకరించి ఏడు రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎస్పీ, ఏఎస్పీలు ఆదేశించారు. కార్యక్రమంలో డీజీఆర్బీ సీఐ కె.కుమార స్వామి, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, అంబేడ్కర్, ఎస్సై రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 27 వినతులు సీతంపేట: స్థానిక ఐటీడీఏలో పరిపాలనాధికారి వి.సునీల్ నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో 27 వినతులు స్వీకరించారు. మోంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని కోడిశ పంచాయితీ బిల్లగూడకు చెందిన అప్పన్న కోరాడు. కొంజరగూడ గ్రామస్తురాలు లలిత అంగన్వాడీ సెంటర్ మంజూరు చేయాలని, పొలంగూడ గ్రామస్తుడు రాజయ్య మేకల కొనుగోలుకు రుణం ఇప్పించాలని కోరారు. మండ పాఠశాల ఎండీఎం నిర్వాహకులు బియ్యం పాఠశాలకు సరఫరా చేయలని వినతి అందజేశారు. డిప్యూటీ ఈఓ రామ్మోహన్రావు, డీఈ నాగభూషణరావు, వ్యవసాయాధికారి వాహిని పాల్గొన్నారు. -
అక్రమ కబేళాలు మూసివేయాలి
● ఏపీ గో సంరక్షణ సమాఖ్య డిమాండ్విజయనగరం: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల కంటోన్మెంట్లో అక్రమంగా నడుస్తున్న గో మాంసం కబేళాలు, దుకాణాలపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు లోగిశ రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. స్థానిక కంటోన్మెంట్ మసీదు ఎదురుగా ఉన్న బిర్యానీ సెంటర్ వెనుక బ్లూ గేట్‌తో పాటు దాని చుట్టు పక్కల యథేచ్ఛగా ప్రతిరోజూ ఆవులు, దూడలను చంపి రాష్ట్రంలో కంపెనీలకు పంపిస్తున్నారని గతంలో మున్సిపల్ కమిషనర్, హెల్త్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయగా వారి లైసెన్సులు రద్దు చేసినప్పటికీ కబేళాలు, షాపులను నిర్వహిస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. తక్షణమే అక్రమ కబేళాలు, గో వధ శాలల మూసివేతకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని ఈ మేరకు కమిషనర్ నల్లనయ్యను మున్సిపల్ కార్యాలయంలో కలిసి నోటీసు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కేవీఆర్ సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి భీమపల్లి సంధ్యారాణి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పాడ పైడితల్లి, సారిక రేణుక తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ తవ్వకాలు వాస్తవమే
కొత్తవలస: మండలంలో సర్వే నంబర్ 168లో గల ఫిరంగి కొండ వద్ద అక్రమ తవ్వకాలు జరుగుతుండడం వాస్తవమేనని తహసీల్దార్ పి.సునీత స్పంష్టం చేశారు. సాక్షి దిన పత్రికలో సోమవారం ప్రచురితమైన ‘కొండ’ పై అక్రమార్కుల ‘ఫిరంగి’ అనే కథనానికి రెవెన్యూ అదికారులు ఆగమేఘాలపై స్పందించారు.అక్రమ తవ్వకాల ప్రాంతంలో రెవన్యూ ఇన్స్పెక్టర్ షణ్ముఖరావు, వీఆర్ఓ ఆర్.రాధాకృష్ణతో పాటు మరికొంతమంది రెవెన్యూ సిబ్బంది సోమవారం విచారణ చేశారు. ఈ ప్రాంతంలో రాత్రి సమయాల్లో ముఖ్యంగా సెలవుదినాల్లో తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయని స్థానికులు చెప్పారని తహసీల్దార్ సునీత తెలిపారు.ఈ తవ్వకాల వల్ల రెండు జీడిచెట్లు, ఒక తుమ్మచెట్టు నేలకొరిగినట్లు గుర్తించామన్నారు. తవ్వకాలను నిరోధించేందుకు ఆప్రాంతంలో వాహనాలు వెళ్లకుండా ఉండే విధంగా పెద్ద కందకం జేసీబీతో తవ్వించినట్లు తెలిపారు. అలాగే ఇప్పటి వరకు ఎంత మేర తవ్వకాలు జరిగాయో గుర్తించాలని మైనింగ్ శాఖ అధికారులకు లేఖ పంపించినట్లు చెప్పారు. రాత్రి వేళ అక్రమంగా తవ్వకాలు జరిపిన వ్యక్తులను తక్షణమే గుర్తించాలని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఫిరంగి కొండ, గ్రేహౌండ్స్‌కు కేటాయించిన ప్రాంతంలో ప్రత్యేకించి ఇద్దరు వీఆర్ఏలను కాపలా నియమించినట్లు ఆమె తెలిపారు. తహసీల్దార్ పి.సునీత సాక్షి కథనంపై స్పందించిన రెవెన్యూ అదికారులు ఆక్రమార్కులను గుర్తించాలని పోలీసులకు ఫిర్యాదు -
పవర్ లిఫ్టింగ్‌లో గోల్డ్‌మెడల్స్
● వన్ టౌన్ ఏఎస్సై త్రినాథ రావు ప్రతిభ ● అభినందించిన ఎస్పీ దామోదర్విజయనగరం క్రైమ్: రాష్ట్ర స్థాయి డెడ్ లిఫ్ట్, బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్ పోటీల్లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన విజయనగరం వన్ టౌన్ ఏఎస్సై త్రినాథ్‌ను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సోమవారం అభినందించారు. వన్ టౌన్లో ఏఎస్సై పని చేస్తున్న ఆల్తి త్రినాథరావు ఇటీవల విశాఖలోని వెలమపేట శ్రీ విజయేంద్ర వ్యాయామ మండలిలో ‘పవర్ లిఫ్టింగ్ ఆఫ్ ఇండియా‘ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించారు. బంగారు పతకాలు సాధించిన ఏఎస్జై ఆల్తి త్రినాథరావు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్‌ను ఆయన చాంబర్ లో సోమవారం మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంగా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించి, జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించాలని అభిలషించారు. గత నెల 30న జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ సెలక్షన్స్ కమ్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మాస్టర్స్ విభాగం 60+, 93 కేటగిరిలో ఏఎస్సై త్రినాథరావు బెంచ్ ప్రెస్‌లో 95 కిలోలు, డెడ్ లిఫ్ట్‌లో 142.5 కిలోల బరువును ఎత్తి, రెండు విభాగాల్లోను బంగారు పతకాలు సాధించి, స్టేట్ సెలక్షన్స్‌కు కూడా ఎంపికయ్యారు. కార్యక్రమంలో విజయనగరం వన్ టౌన్ సీఐ ఆర్వీఆర్కే చౌదరి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సర్వకాలీనం, సార్వజనీనం భగవద్గీత
విజయనగరం: కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీకృష్ణపరమాత్ముడు కర్తవ్య నిర్వహణ గురించి అర్జునుడికి చేసిన హితబోధే భగవద్గీత అని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, శ్రీ సాయి సత్సంగ సేవా సంఘం వ్యవస్థాపకుడు ఉపద్రష్ట వరప్రసాద్ పేర్కొన్నారు. గీతా జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు భాష పరిరక్షణ సమితి అధ్యక్షుడు సముద్రాల గురు ప్రసాద్ ఆధ్వర్యంలో కేఎల్‌పురంలో గల గీతాంజలి స్కూల్లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరప్రసాద్ మాట్లాడారు. భగవద్గీతలోని ప్రతి అక్షరం ఒక శక్తిమంతమైన బాణం అని, ప్రతి భావం అమూల్య సందేశం అని భగవద్గీత సర్వకాలికం, సార్వజనీనం అని అన్నారు. రచయిత, ప్రముఖ వైద్యుడు డాక్టర్ జీవీఎన్ భూపతి మాట్లాడుతూ భగవద్గీత ధర్మయుద్ధానికి సంబంధించిన సందేశం మాత్రమే కాదు. మానవ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారాలను అందించే జీవన శాస్త్రం అన్నారు. అందుకే భగవద్గీత ఒక ఆధ్యాత్మిక గ్రంథమేకాదు, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి సంపూర్ణ మార్గదర్శిని అని పేర్కొన్నారు కార్యక్రమంలో భాగంగా పూసపాటి రేగకు చెందిన టేకుమళ్ల అమిత్ సాయి శశాంక్ భగవద్గీత లోని భక్తి యోగాన్ని అర్థవంతంగా భక్తిశ్రద్ధలతో చదివి వినిపించారు .ఈ సందర్భంగా ఉపద్రష్ట వరప్రసాద్, డాక్టర్ జీవీఎన్ భూపతి లను పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసరావు, డైరెక్టర్ రాజేష్, ప్రిన్సిపాల్ మల్లికలతో కలిసి గురుప్రసాద్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సమితి కార్యదర్శి డాక్టర్ జక్కు రామకృష్ణ, సలహాదారు సుభద్రాదేవి, డిమ్స్ రాజు, గిరి తదితరులు పాల్గొన్నారు. -
నేడు జిల్లా స్థాయి పోటీలు
పాలకొండ రూరల్: పారా ఒలింపిక్స్ అసోసియేషన్ సౌజన్యంతో మంగళవారం జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడాపోటీలు చేపట్టనున్నామని సహిత విద్య జిల్లా కోఆర్డినేటర్ పి.భానుమూర్తి తెలిపారు. 13–20 ఏళ్లలోపు 40 శాతం దివ్వాంగులైన ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల్లో చదువుతున్న బాల బాలికలు ఈ పోటీలకు అర్హులన్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో గల నర్సిపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ పోటీలు చేపడతామని పేర్కొన్నారు. సోమవారం పాలకొండ వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ డీఈఓ బి.రాజ్‌కుమార్, సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త తేజేశ్వరరావుల పర్యవేక్షణలో ఈ పోటీలు జరుగుతాయని చెప్పారు. ప్రధాన రహదారి నుంచి క్రీడా వేదిక వద్దకు నడవ లేని వారి కోసం ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశామని, ఔత్సాహిక క్రీడాకారులకు భోజన వసతితో పాటు అవసరమైన క్రీడా పరికరాలు తామే సమకూరుస్తామని తెలిపారు. జాతీయ తైక్వాండో పోటీల్లో నేషనల్ స్కూల్ విద్యార్థికి కాంస్యంవిజయనగరం అర్బన్: ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి అండర్–17 తైక్వాండో పోటీల్లో పట్టణానికి చెందిన ది నేషనల్ స్కూల్ విద్యార్థి వై.ముఖేష్ విశ్వనాఽథ్కు కాంస్య పతకం లభించింది. ఈ మేరకు సోమవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విజేతను పాఠశాల కరస్పాండెంట్ బొడ్డు రామారావు, స్కూల్ ఇన్చార్జ్ దీపక్, ఉపాధ్యాయులు అభినందించారు. -
మన్యంలో కందికి ప్రోత్సాహమేదీ!
● విస్తరిస్తే జిల్లాకు తీరనున్న కంది కొరత ● మార్కెటింగ్ సదుపాయాల్లేక తగ్గుతున్న సాగు ● వెలుగు మార్కెటింగ్ నిల్ సీతంపేట: మన్యంలో కంది పప్పుకు మార్కెట్ విస్తృతంగా ఉంది. ఇంటి అవసరాలకు కందిపప్పు తప్పనిసరి. అయితే కొద్ది నెలల కిందట కంది పప్పు కిలో ధర రూ.200లకు పైగా విక్రయించబడింది. గత ఆరు నెలలుగా రేషన్ డిపోల్లో కందిపప్పు లబ్ధిదారులకు ఇవ్వడం నిలిపివేశారు. అవసరమైన కందిపప్పు లేదు. కందిపప్పు కొనుగోలు చేయాలంటేనే వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. మార్కెట్లో ప్రస్తుతం రూ.140పైనే కిలో కందిపప్పు విక్రయిస్తున్నారు. ఏజెన్సీలో పండే కందిని ప్రోత్సాహిస్తే జిల్లాకు సరిపడే నాణ్యమైన కందిపప్పును అందించవచ్చని రైతులు చెబుతున్నారు. గతంలో ఐటీడీఏ పరిధిలో వివిధ మండలాల్లో కంది పంట విస్తారంగా పండేది. సీతంపేట ఏజెన్సీలో రైతులు ఎక్కువగా ఈ పంట పండించే వారు. తగిన ప్రోత్సాహం లేకపోవడంతో మరీ వెనుకబడిపోతుంది. ఐటీడీఏ పరిధిలో సీతంపేట, భామిని, మెళియాపుట్టి, మందస, కొత్తూరు, పాతపట్నం, హిరమండలం మండలాలు టీపీఎంయూ (ట్రైబుల్ ప్రాజెక్టు మానటెరింగ్ యూనిట్) మండలాలుగా ఉన్నాయి. ఈ పరిధిలో దాదాపు 200ల ఎకరాల వరకు కంది పండుతుంది. అయితే సీతంపేట ఏజెన్సీలో 50 ఎకరాల వరకు పండుతుంది. హెక్టార్‌కు 50 నుంచి 60 క్వింటాళ్ల వరకు కంది దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. 180 రోజులకు ఈ పంట ఖరీఫ్ సీజన్లో పండుతుంది. వరితో పాటు మెట్ట భూముల్లో, జీడిలో అంతర్ పంటగా వేసినా జిల్లాకు సరిపడా కందిని ఏజెన్సీలోనే పండించుకోవచ్చని నిపుణుల అభిప్రాయం. కొనుగోలు చేసి నిలిపేశారు.. గతంలో ఏజెన్సీలో పండే కందిని వెలుగు ద్వారా కొనుగోలు చేసి కందిపప్పుగా తయారు చేసి ఇతర జిల్లాలకు సైతం విక్రయించేవారు. అంతలోనే మళ్లీ ఆ ప్రోసెస్‌కు అధికారులు మంగళం పాడేశారు. అటు తరువాత ఈ పంటపై మొగ్గు చూపని పరిస్థితి ఉంది. సీతంపేట ఏజెన్సీలోని నారాయణగూడ, మెట్టుగూడ, కుడ్డపల్లి, కడగండి, కుశిమి, పొల్ల, దోనుబాయి, మర్రిపాడు, గొయిది తదితర పంచాయతీల పరిధిలో కంది పండుతుంది. కొండపోడు పంటల్లో భాగంగా రైతులు ఎక్కువగా ఈ పంటను పండిస్తారు. -
మీకోసం వెబ్ సైట్లో పీజీఆర్ఎస్ అర్జీల నమోదు
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల వివరాలు మీకోసం వెబ్సైట్లో నమోదు చేయవచ్చునని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించనున్నట్టు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతీ రోజు వినతులను స్వీకరించేందుకు ప్రత్యేక సెల్లార్‌ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. అర్జీదారులు మీకోసం.ఏపీ.జిఓవి.ఇన్ వెబ్‌పైట్‌లో అర్జీలను నమోదు చేసుకోవచ్చునన్నారు. అర్జీల స్థితిని 1100 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునన్నారు. జంఝావతి సాధన సమితి సమరభేరి పార్వతీపురం రూరల్: జంఝావతి ప్రాజెక్టు పూర్తి స్థాయి నిర్మాణమే లక్ష్యంగా జంఝావతి సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఆయకట్టు గ్రామాల్లో సమితి నాయకులు ఉద్యమానికి పిలుపునిచ్చారు. సమితి అధ్యక్షుడు చుక్క భాస్కరరావు నేతృత్వంలో పార్వతీపురం మండలంలోని పెదబొండపల్లి, నిడగల్లు, పులిగుమ్మి, లచ్చిరాజుపేట తదితర గ్రామాల్లో పర్యటించి గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా 75 గ్రామాల్లో పర్యటించినట్టు తెలిపారు. ప్రతీ రైతు ఓ సైనికుడిలా కదిలి రావాలని, ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ విశ్రమించమని స్పష్టం చేశారు. త్వరలోనే వేలాది మంది రైతులతో కలెక్టరేట్ సాక్షిగా నిరవధిక దీక్షలు చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పల్లి రాజగోపాల్, మాలతి కృష్ణమూర్తినాయుడు, వంగల దాలినాయుడు, మండల పకీరు నాయుడు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం: ప్రజలు, విద్యార్థులు ఎదుర్కొంటు న్న సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణీత వ్యవధిలో స్పందించి పరిష్కరించకుంటే త్వరలో అసెంబ్లీని ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి దాసరి నాగభూషణ్ హెచ్చరించారు. ఆదివారం నగరంలోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల దగ్గరి కి యువగళం పాదయాత్ర ద్వారా వచ్చి జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామన్నారని, ఫీజురీయింబర్స్‌మెంట్ అమలు చేస్తామని మోసం చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక యూనివర్సిటీలకు నిధులు తెస్తామంటూ చేసిన ప్రకటన అమలుకు నోచుకోలేదని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తక్షణమే ఉపసంహరించుకోకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆలోచన మార్చుకోకపోతే విద్యార్థి ఉద్యమం గుణపాఠం నేర్పిస్తుందని, భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ప్రజాస్వామిక శక్తులతో కలిసి పోరాటం నిర్మిస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సుమన్, సహాయ కార్యదర్శి గౌరీ శంకర్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం: అండర్ – 12 బాలుర జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు మంగళవారం నిర్వహించనున్నట్టు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పి.సీతారామరాజు (రాంబాబు) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాబా మెట్ట శివారు విజ్జి స్టేడియంలో మంగళవారం ఉదయం 7 గంటలకు ఎంపిక పోటీలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు 2013 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారై ఉండాలని తెలిపారు. క్రీడాకారులు తెలు పు దుస్తులు ధరించి రావాలని సూచించారు. -
కనిపించని కాటు.. తీరని చేటు!
ట్రాంబోక్యులిడ్ అనే కంటికి కనిపించని సూక్ష్మ కీటకం కుట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. దీనిని చిగ్గర్ అని కూడా అంటారు. ఓరియెన్షియా సుసుగాముషి అనే బ్యాక్టీరియా దీనికి కారణం. ముఖ్యంగా పొలాల్లో, అటవీ ప్రాంతాల్లో, పొదలు, గడ్డి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తిరిగే రైతులు, కూలీలకు ఇది సోకే ప్రమాదం ఎక్కువ. అన్ని వయసుల వారికీ ఇది సోకే అవకాశముంది. కానీ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, చిన్నారులు త్వరగా ప్రభావితం అవుతారు. పార్వతీపురం రూరల్: జిల్లాల్లో మారుతున్న వాతావరణం, పచ్చని పొలాల మాటున కంటికి కనిపించని ప్రమాదం పొంచి ఉంది. అదే స్క్రబ్ టైఫస్ వైరస్. ఉమ్మడి విజయనగరం జిల్లా వాసులను గత కొద్ది నెలలుగా ఈ వ్యాధి కలవరపెడుతోంది. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదు కానీ అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంది. సాదాసీదా జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది ఊపిరితిత్తులపై పంజా విసురుతుంది. అందుకే దీనిపై సంపూర్ణ అవగాహన, తక్షణ వైద్యమే మనకు శ్రీరామరక్ష. గణాంకాలు ఏం చెబుతున్నాయి? ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబరు 17 వరకు నమోదైన కేసులను పరిశీలిస్తే విజయనగరం జిల్లాలో 487 నమూనాలను పరీక్షించగా 59 మందికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా తేలింది. ఇక మన్యం జిల్లా (పార్వతీపురం) పరిధిలో 27 నమూనాల్లో 6 కేసులు బయటపడ్డాయి. ఇటీవల మెట్టపల్లికి చెందిన ఓ మహిళ ఈ లక్షణాలతో మృతి చెందడం విచారకరం. అయితే, ప్రస్తుతం పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేకపోవడం ఊరటనిచ్చే అంశం. స్క్రబ్ టైఫస్ సోకినప్పుడు మొదట సాధారణ వైరల్ జ్వరంలాగే అనిపిస్తుంది. వైద్యుల దగ్గరకు వెళ్తే మందులు ఇస్తారు. జ్వరం తగ్గినట్టే తగ్గి, లోలోపల ఈ బ్యాక్టీరియా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. ప్రధాన లక్షణం కీటకం కుట్టిన చోట చర్మంపై సిగరెట్ కాలిన గాయం లాంటి మచ్చ ఏర్పడుతుంది. తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, చలి జ్వరం, దగ్గు ఉంటాయి. సకాలంలో గుర్తించకపోతే కిడ్నీలు, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జాగ్రత్తలే మన ఆయుధాలు పొలాలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లేవారు కాళ్లు, చేతులు పూర్తిగా కప్పుకునేలా దుస్తులు ధరించాలి. ఇంటి పరిసరాల్లో గడ్డి, పొదలు లేకుండా చూసుకోవాలి. ఎలుకల ద్వారా కూడా ఈ కీటకాలు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి, ఎలుకల నివారణ ముఖ్యం. పొలాల నుంచి రాగానే వేడి నీటితో స్నానం చేయడం, బట్టలు ఉతకడం మంచిది. తీవ్రమైన జ్వరం వచ్చి, చర్మంపై నల్లని మచ్చ కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించాలి. సొంత వైద్యం అసలు చేయకూడదు. ప్రస్తుతం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో స్క్రబ్ టైఫస్ యాక్టివ్ కేసులు ఏమీ లేవు. ఇది ఒకరి నుంచి ఒకరికి సోకే అంటువ్యాధి కాదు. గాలి ద్వారా వ్యాపించదు. కేవలం పొదలు, తుప్పల్లో ఉండే మైట్ అనే సూక్ష్మ కీటకం కుట్టడం ద్వారానే వస్తుంది. కాబట్టి ప్రజలు అనవసర భయాలకు లోనుకావద్దు. వ్యాధి సోకిన ప్రాథమిక దశలోనే గుర్తిస్తే యాంటీ బయాటిక్ మందులతో సులభంగా నయం చేయవచ్చు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో దీనికి సంబంధించిన మందులను తగినంతగా అందుబాటులో ఉంచాం. జ్వరం వస్తే కాలయాపన చేయకుండా, సొంత వైద్యం చేసుకోకుండా వైద్యులను సంప్రదించాలి. – డా.ఎస్.భాస్కరరావు, డీఎంహెచ్‌వో, పార్వతీపురం మన్యం పచ్చని పొదల్లో.. ప్రాణ గండం! అశ్రద్ధ చేస్తే.. ఆయువుకే ఎసరు! జ్వరమే కదా అని జారవిడిస్తే.. ప్రాణాలకే ముప్పు! సాధారణ జ్వరం కాదు.. ‘స్క్రబ్’ కాటు కావొచ్చు! చిగ్గర్ కాటుతో చిక్కులు.. పెరుగుతున్న కేసులు 11 నెలల్లో 65 కేసులు.. ‘స్క్రబ్’ విషయంలో నిర్లక్ష్యం వద్దు! వ్యాధి నివారణలో ప్రభుత్వ పాత్ర కీలకం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న పార్వతీపురం మన్యం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు చేసే పరికరాలు అందుబాటులో లేకపోవడం గమనార్హం. అనుమానిత లక్షణాలు ఉన్నవారి నమూనాలను బయట ల్యాబ్‌లను సంప్రదించాల్సి వస్తోంది. చాలామంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ లెక్కలు అధికారిక గణాంకాల్లోకి రావడం లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జిల్లా ఆస్పత్రిలో పరీక్షలు చేసేందుకు కావల్సిన కిట్లును అందుబాటులోకి తేవాలి. మారుమూల గ్రామాల్లో ఈ వ్యాధిపై విస్తృత అవగాహన కల్పించాలి. -
అమాత్యా... ఇదేమి తీరు..!
సాలూరు: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పీఎస్ సంఘటన చాలా బాధాకరమని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర పేర్కొన్నారు. పీఎస్ వ్యవహారంపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీని, సాక్షి దినపత్రికను, తనను విమర్శిస్తూ నిందను మాపై నెట్టి బురదజల్లే విధంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడారని ఇది సరికాదని అన్నారు. కుటుంబ బంధాలకు విలువనిచ్చే తాను ఏనాడు కుటుంబాల జోలికి వచ్చి రాజకీయాలు చేయలేదన్నారు. అధికారంలో ఉన్న వారు తప్పులు, పొరపాట్లు చేసి వాటిని ప్రతిపక్షంలో ఉన్న తమపై నెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. పట్టణంలో తన స్వగృహం వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భర్త లేని బాధిత మహిళ తనకు జరిగిన అన్యాయంపై మంత్రి వద్దకు వెళ్లానని చెబుతున్నారని, అప్పుడే మంత్రి స్పందించి ఉంటే నేడు పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదన్నారు. బాధిత మహిళ, సతీష్ ఇరువురు పరస్పర ఫిర్యాదులు పోలీస్‌స్టేషన్‌లో చేసుకున్న నేపథ్యంలో నిష్పక్షపాతంగా విచారణ జరిగితే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. ఇప్పటికే బాధిత మహిళ హైకోర్టుకు వెళ్లారని అవసరమైతే న్యాయస్థానాన్ని మళ్లీ ఆశ్రయించే అవకాశం ఉంటుందన్నారు. తాను కుటుంబ బాంధవ్యాలకు విలువ ఇచ్చే వాడినని, కుటుంబాల విషయాల్లో రాజకీయాలు ఏనాడు చేయలేదని పునరుద్ఘాటించారు. తాను ఏనాడూ కక్షపూరిత రాజకీయాలు చేయలేదని మానవత్వంతోనే రాజకీయాలు చేశానని చెప్పారు. తనను ఇబ్బంది పెడుతున్నారని మంత్రి సంధ్యారాణి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడే ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని, అటువంటిది ప్రతిపక్షంలో ఉన్న తాము అధికారంలో ఉన్న వారిని ఎలా ఇబ్బంది పెట్టగలమని ప్రశ్నించారు. బాధిత మహిళ తనకు అన్యాయం జరిగిందని సాక్షి టీవీకి తెలిపిన తరువాత ఆ మహిళ అదే విషయాన్ని ఎస్పీ కార్యాలయానికి వెళ్లి అన్ని మీడియా చానళ్లకు కూడా విషయం చెప్పారన్నారు. మంత్రి పీఏ, బాధిత మహిళ విషయంలో తమకు, వైఎస్సార్సీపీకి, సాక్షి దినపత్రికకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. మాజీ ఉప ముఖ్యమంత్రినైన తనపై టీడీపీ శ్రేణులు, నేతలు సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు, పోస్టింగ్‌లు పెడుతున్నారని, వాటిని భద్రపరుస్తున్నానని పోలీస్‌స్టేషన్‌లో, సైబర్ క్రైమ్‌కు సమయం చూసి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఇందులో ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోండి.. సాలూరు నియోజకవర్గ వాస్తవ పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి లోకేష్ తెలుసుకోవాలని సూచించారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ ఏ ఒక్కరిపై వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. రెండు శాఖలకు మంత్రిగా ఉన్న సంధ్యారాణి తమ నాయకుడు జగన్మోహన్రెడ్డిని, తమను ఎంత దారుణంగా విమర్శిస్తుంటారో ప్రజలకు తెలుసునని, ప్రజలు ఆమె వ్యవహార శైలిని గమనిస్తున్నారన్నారు. మంత్రి పీఎస్ వ్యవహారంలో తాను ఇప్పటి వరకు స్పందించలేదని, కానీ మంత్రి సంధ్యారాణి తనను, వైఎస్సార్సీపీని ఉద్దేశిస్తూ మాట్లాడడం వల్లే స్పందించానని చెప్పారు. ఆయన వెంట పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు. మంత్రి పీఎస్ వ్యవహారంపై మాపై బురద చల్లడం సరికాదు సమస్య వచ్చినప్పుడే పరిష్కరించి ఉంటే ఇలా జరిగేది కాదు.. మంత్రి సంధ్యారాణి వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారు.. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర -
సమాజ చైతన్యస్ఫూర్తి గురజాడ
విజయనగరం టౌన్: సాంఘిక దురాచారాలను రూపుమాపడంలో తనదైన శైలిలో రచనలు చేసిన సమాజాన్ని చైతన్య పరిచిన మహనీయుడు గురజాడ అప్పారావు అని, అటువంటి మహనీయుని 110వ వర్ధంతిలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని గురజాడ విశిష్ట పురస్కార గ్రహీత పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ పేర్కొన్నారు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య సాహితీ చైతనోత్సవంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక క్షత్రియ కల్యాణ మండపం ఆవరణలో గురజాడ విశిష్ట పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముందుగా గురజాడ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. వర లక్ష్మి త్యాగరాజ సంగీత కళాశాల, సూర్యతేజ డాన్స్ అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యరూపకా లు ఆద్యంతం ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం అతిథులను, గురజాడ వారసులను దుశ్శాలువ, జ్ఞాపికలతో సత్కరించారు. శ్రీ సాయి ఫౌండేషన్ తరఫున ప్రముఖ న్యాయవాది కోలగట్ల తమ్మన్నశెట్టి పద్మశ్రీ కొలకలూరి ఇనాక్‌కు గురజా డ విశిష్ట పురస్కారం, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, నగ దుతో ఘనంగా సత్కరించారు. సమాఖ్య కోశాధికా రి డాక్టర్ ఎ.గోపాలరావు ప్రశంసాపత్రాన్ని చదివి వినిపించారు. అనంతరం గురజాడ విశిష్ట పురస్కా ర గ్రహీత పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ గురజాడ వంటి మానవతా మూర్తి పుట్టడం వలన సమానత్వాన్ని పొందుతున్నామన్నారు. మహిళలను, చిన్నారులను, సామాన్యుల ను ఆయన ఆదరించారని, దేశమును ప్రేమించుమన్నా.. అంటూ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ఉన్న వారికి హితబోధ చేశారన్నారు. భాష గొప్ప తనాన్ని వివరించిన మహనీయుడన్నారు. ముత్యాల సరాలను తయారు చేశారని, మనుషులంతా మనుషులుగా బతకాలని, దేశమంటే మట్టికాదు.. మనుషులని, దేశాన్ని ప్రేమిస్తే సమాజం బాగుంటుందని చాటి చెప్పారన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టి స్ సిహెచ్.మానవేంద్రనాథ్‌రాయ్ మాట్లాడుతూ మహాకవి రాసిన గేయాలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నారు. సొంతలాభం కొంతమానుకుని పొ రుగు వారికి సాయం చేయమన్నటువంటి వాఖ్యా లు ఎంతో విలువైనవన్నారు. సాంఘిక దురాచారాలను ఎలా రూపు మాపాలి, వాటిని ఏ విధంగా సంస్కరించాలని ఆలోచన చేసి కన్యాశుల్కం రూపొందించారన్నారు. ప్రజల మధ్యలోకి నాటకం రూపంలో తీసుకువెళ్లి ఆలోచన రేకెత్తించారన్నారు. అటువంటి మహనీయునికి మనమంతా రుణపడి ఉన్నామన్నారు. ఎస్పీ ఎఆర్.దామోదర్ మాట్లాడుతూ 130 ఏళ్లకి పూర్వమే సమాజంలోని సాంఘిక దురాచారాలను రూపుమాపేందుకు మహాకవి చేపట్టిన కృషి ఎనలేనిదన్నారు. తెలుగు సాహిత్యానికి విశేష కృషి చేసి న ఇనాక్ని సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కవితా పోటీలలో విజేతల వివరాల ను డాక్టర్ జక్కు రామకృష్ణ వెల్లడించారు. పొత్తూరి సీతారామరాజు (కాకినాడ), సునీత గంగవరపు, చిలకలూరిపేట (పల్నాడు), మహమ్మద్ అప్సర వలీషా, కోనసీమ (ద్వారపూడి), ఇనపకుర్తి చిన సత్యన్నారాయణ (విజయనగరం), చెళ్లపిళ్ల శ్యామ ల (విజయనగరం) తదితరులకు గురజాడ ఉత్తమ కవితా పురస్కారాలను, అదే విధంగా గురజాడ రచనలపై నిర్వహించిన వక్తృత్వం, వ్యాసరచన పోటీల విజేతలకు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమానికి ముందు మహాకవి గుర జాడ స్వగృహంలో గురజాడ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహాకవి ఇంటి నుంచి గురజాడ దేశభక్తి గీతాలాపన చేస్తూ ర్యాలీగా బయలుదేరి కాంస్య విగ్రహం వద్ద పూలమాలలను సమర్పించారు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శు లు డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు, కాపుగంటి ప్రకాష్ ల నేత్రత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత, కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, నవసాహితీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్వి.సూర్యప్రకాష్‌రావు (చైన్నె), సభ్యులు ఎం.అనిల్ కుమార్, మేకా అనంతలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
గరుగుబిల్లి: పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి సినీఫక్కీలో పల్టీకొట్టింది. ఆదివారం ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం కురుపాం వెళ్లి తిరు గు ప్రయాణంలో పార్వతీపురం వస్తుండగా మార్గమధ్యంలో తోటపల్లి శ్రీ కోదండరామాలయం సమీపంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఆయన సరక్షితంగా బయటపడ్డారు.కుక్కల దాడిలో పది గొర్రెపిల్లల మృతివంగర: మండలకేంద్రంలో కుక్కలు ఆదివారం దాడిచేయడంతో పది గొర్రెపిల్లలు మృతిచెందాయి. గ్రామానికి చెందిన పడాల గంగులు ఇంటి సమీపంలోని గొర్రెల షెడ్డులోకి కుక్కలు చొరబడి దాడిచేశాయి. ఈ దాడిలో పది గొర్రెపిల్లలు మృతిచెందడంతో బాధితుడు లబోదిబో మంటున్నాడు. ఇదిలా ఉండగా అదే గ్రామంలో వారం రోజుల క్రితం 20 గొర్రె పిల్లలను కుక్కలు దాడిచేసి హతమార్చాయి. అధికారులు స్పందించి కుక్కల నివారణకు చర్యలు చేపట్టడంతోపాటు తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలురామభద్రపురం: మండలంలోని తారాపురం వద్ద ఆదివారం బైక్ ఢీ కొని ఓ వ్యక్తి తీవ్రగాయాల పాలయ్యాడు. ఈ ప్రమాదంపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తారాపురం గ్రామానికి చెందిన పిల్లా రమణ తన పాడిపశువులను మేతకు తోలుకుని వెళ్లి మేత తర్వాత తిరిగి ఇంటికి తొలుకోస్తుండగా వెనుకనుంచి మితిమీరిన వేగంతో వస్తున్న ద్విచక్రవాహనదారు ఢీ కొట్టి ఆపకుండా పరారయ్యాడు. దీంతో రమణ తలకు తీవ్రగాయమైంది. కుటుంబసభ్యులు ప్రథమ చికిత్స నిమిత్తం సాలూరు సీహెచ్‌సీకి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడి భార్య సాయి ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెరకు తూనిక కేంద్రాలు సిద్ధం
● డిసెంబర్ 5న క్రషింగ్ ● తగ్గిన ఉత్పత్తిపండించిన చెరకు అంతా క్రషింగ్ జిల్లాలో 2025–26 క్రషింగ్ సీజన్‌కు ఈఐడీ ప్యారీస్ లిమిటెడ్, భీమసింగి, ఎన్సీఎస్,గోవాడ సుగర్ ప్యాక్టరీల పరిధిలో చెరకు ఉత్పత్తి చేసిన 2.5 లక్షల టన్నుల చెరకు క్రషింగ్ చేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఓవర్ హాలింగ్ చేసినట్లు యాజమాన్యం కార్యాలయానికి సమాచారం ఇచ్చింది. ఇప్పటికే ఉన్న చక్కెర కర్మాగారాల పరిధిలో రైతులు ఉత్పత్తి చేసిన చెరకు క్రషింగ్‌కు పూర్తిస్థాయిలో ఈఐడీ ప్యారీస్ యాజమాన్యం సిద్ధం చేసింది. – ఎం.సత్యనారాయణ, సుగర్కేన్ డిప్యూటీ కమిషనర్, బొబ్బిలిసీతానగరం: సంకిలి ఈఐడీ ప్యారీస్ లిమిటెడ్ చక్కెర కర్మాగారంలో 2025–26 క్రషింగ్ ప్రారంభించడానికి యాజమాన్యం సిద్ధం చేయడంతో రైతులు ఉత్పత్తి చేసిన చెరకు తరలించడానికి రహదారులు సక్రమంగాలేక మల్లగుల్లాలు పడుతున్నారు. సంకిలి ఈఐడీ ప్యారీస్ ప్రైవేట్ చక్కెర కర్మాగారం ఓవర్‌హాలింగ్ చేసి డిసెంబర్ 5న క్రషింగ్ చేయడానికి యాజమాన్యం సిద్ధం చేసింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎనన్్ సీఎస్, భీమసింగి,సంకిలిలో ఈఐడీ ప్యారీస్ చెరకు కర్మాగారాలు ఉన్నాయి. పేరుకే మూడు చక్కెర కర్మాగారాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న లచ్చయ్యపేట ఎన్సీస్ కర్మాగారాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే విజయనగరం ఎన్సీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు విక్రయించారు. అప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఇక్కడి రైతులు వాణిజ్య పరంగా చెరకుపంటసాగుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఎన్సీఎస్ కర్మాగారం పరిధిలోఉన్న 16 మండలాల్లో వేలాదిమంది రైతులు 5లక్షల నుంచి 6 లక్షల టన్నుల చెరకు ఉత్పతి చేసేవారు. కర్మాగారం మూతపడడంతో చెరకు విస్తీర్ణం తగ్గడం, ఉన్న చెరకును సంకిలి ఈఐడీ ప్యారీస్‌కు తరలించడం ఆనవాయితీగా వస్తోంది. కర్మాగారం పరిధిలో ఉన్న గ్రామాల్లో 2025–26 క్రషింగ్ సీజన్‌కు సుమారు 2.9లక్షల టన్నులచెరకు ఉత్పత్తి చేసినట్లు గణాంకాల ద్వారా తెలియవచ్చింది. అలాగే భీమసింగి కోఆపరేటివ్ చక్కెర కర్మాగారం పరిధిలో 20 వేలు, గోవాడ కో ఆపరేటివ్ చక్కెర కర్మాగారం పరిధిలో 40 వేల టన్నుల చెరకు ఉత్పత్తి చేసినట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలియవచ్చింది.ఈ క్రమంలో ఈఐడీప్యారీస్ లిమిటెడ్ చక్కెర కర్మాగారం యాజమాన్యం 2 లక్షల 50 వేల టన్నులు క్రషింగ్ చేయడానికి వీలుగా ఓవర్ హాలింగ్ చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో చెరకు ఉత్పత్తి 3.5 లక్షల టన్నుల వరకూ ఉంది. అ మేరకు తెర్లాం, బాడంగి, సీతానగరం, కొమరాడ,బలిజిపేట, వంగర మండలాల్లో బెల్లం క్రషర్లు బెల్లం తయారు చేయడానికి గానుగలను చిన్నరైతులు ఏర్పాటు చేసుకుంటున్నారు. టన్ను చెరకు రూ. 3,200గా సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్ధారించగా బెల్లం క్రషర్ యాజమాన్యాలు చెరకు టన్నుకు రూ.2800కు మించి కొనుగోలు చేయలేమని చెప్పడంతో చెరకు పండించే రైతులంతా పండించిన చెరకును ఏం చేసు కోవాలో అర్ధంకాక ఆందోళన చెందుతున్నారు. లచ్చయ్యపేట ఎన్సీఎస్ కర్మాగారాన్ని తెరిపిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి చెరకు రైతులు ఉత్పత్తి చేసిన చెరకును కొనుగోలు చేయాలని, మూత పడిన కార్మాగారాలను తెరిపించడానికి సత్వర చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సీతానగరం మండలంలో చెరకు తూనిక కేంద్రాలు.. సీతానగరం మండలంలోని బూర్జ, కృష్ణారాయపురం, వెంకటాపురం, లక్ష్మీపురం, నిడగల్లు, సీతానగరం, పణుకుపేట, బగ్గందొరవలస గ్రామాల్లో చెరకు తూనిక కేంద్రలున్నాయి. అలాగే మక్కువ, బాడంగి, తెర్లాం,బొబ్బిలి ప్రాంత గ్రామాల్లో చెరకు తూనిక యంత్రాలను ఏర్పాటు చేశారు. -
‘కొండ’పై అక్రమార్కుల ‘ఫిరంగి’
● మొద్దునిద్రలో రెవెన్యూ సిబ్బంది ● కొత్తవలసలో లే అవుట్లకు కంకర తరలింపు ● సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులుకొత్తవలస: మండలంలో రోజురోజుకు ఆక్రమణలు, ప్రభుత్వ భూముల కబ్జా, గ్రావెల్ అక్రమ తవ్వకాలు పెరుగుపోతున్నాయి. ఈ తవ్వకాలు చంద్రబాబు ప్రభుత్వ పాలన ప్రారంభం నాటి నుంచి జోరుగా సాగుతున్నాయి. అధికార పార్టీ అండతో అక్రమార్కులు రెచ్ఛిపోతున్నారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ అదికారులు మొద్దు నిద్ర వహిస్తున్నారు.దీంతో అక్రమార్కులు రెచ్చిపోయి బరితెగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇందులో కొంతమొత్తం రెవెన్యూ అధికారులకు చేరుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సెలవు రోజులు వచ్చాయంటే చాలు అక్రమార్కులు తెరలేపుతున్నారు. అధికారులు ఎక్కువ శాతం మంది స్థానికేతరంగా ఉండడంతో అక్రమార్కుల పని సులువవుతోంది. మండలంలోని కొత్తవలస రెవెన్యూ పరిధి ఫిరంగి కొండ ప్రాంతంలో రాత్రి, పగలు తేడా లేకుండా జోరుగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.సర్వే నంబర్ 168లో సుమారు 15 సెంట్లు, సర్వే నంబర్ 168–1లో 415–37 ఎకరాల కొండ ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రాంంతంలో ఇప్పటికే ఎక్కువశాతం ఆక్రమణలకు గురైంది. కాగా ప్రస్తుతం ఈ కొండప్రాంతంలో గ్రావెల్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కొత్తవలస మండలంలో ఎక్కడ లేఅవుట్ వేసినా అవసరమైన గ్రావెల్ ఇక్కడి నుంచి వెళ్లాల్సిందే.దీంతో అక్రమార్కులు రెండు చేతులా డబ్బులు సంపాదించుకుంటున్నారు. అధికారులు మాత్రం తూతూ మంత్రంగా హెచ్చరించి వదిలేస్తున్నారు.ముందుగా కొండ ప్రాంతంలో గ్రావెల్‌ను తవ్వేసి అమ్ముకున్న తరువాత చదునైన భూమిని ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకుంటున్నారు. అలాగే రెల్లి రెవెన్యూ పరిధిలో గ్రేహౌండ్స్‌కు కేటాయించిన కొండ ప్రాంతంలో సైతం జోరుగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి.ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమార్కులను అదుపు చేయాలని పలువురు కోరుతున్నారు. తవ్వకాలు నిరోధిస్తాం ఈ తవ్వకాలపై తహసీల్దార్ సునీతను వివరణ కోరగా సంబంధిత రెవెన్యూ కార్యదర్శిని అప్రమత్తం చేసి తవ్వకాలను నిరోధిస్తామన్నారు. పట్టుబడిన వ్యక్తులపై కేసుల నమోదుకు సిఫారసు చేస్తామని చెప్పారు. -
హెచ్ఐవీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
● జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ రాణివిజయనగరం ఫోర్ట్: హెచ్ఐవీ/ఎయిడ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ కె.రాణి పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా ఆదివారం రంగోలి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవగాహన ద్వారానే హెచ్ఐవీని నియంత్రించవచ్చన్నారు. హెచ్ఐవీ రోగుల పట్ల ప్రేమ, అప్యాయత చూపించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం ఉమామహేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆధునిక మహిళ చరిత్ర తిరగరాసేలా గురజాడ రచనలు
● సాహితీగోష్ఠిలో ప్రముఖుల సందేశాలువిజయనగరం టౌన్: ఆధునిక మహిళ చరిత్రను గురజాడ రచనలు తిరగరాస్తాయని ప్రముఖ సామాజికవేత్త పీఏ దేవి పేర్కొన్నారు. మహాకవి గురజాడ వర్ధంతిని పురస్కరించుకుని సాహితీస్రవంతి, జనవిజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జిల్లాపరిషత్ కార్యాలయంలోని సెమినార్ హాల్లో ఆదివారం సాహితీ గోష్ఠి నిర్వహించారు. గురజాడ సీ్త్ర పాత్రల ఔన్యత్యంపై సామాజికవేత్త దేవి ప్రసంగిస్తూ గురజాడ రచించిన కన్యాశుల్కం నాటకంలో పాత్రలేవీ కల్పితాలు కావన్నారు. పాత్ర నేపథ్యాలున్నవేనని తెలిపారు. కన్యాశుల్కంలో కన్యక, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ, పూటకూళ్లమ్మ, బుచ్చమ్మ , మధురవాణి వంటి సీ్త్రపాత్రలన్నీ సంఘసంస్కరణకు చేయాల్సిన పనులన్నీ ఆ నాటకంలో చేసి చూపించారన్నారు. గురజాడ సాహిత్య విషయాలు ఇంకా అనేకం బయటకు రావాల్సి ఉందన్నారు. కవి, రచయిత, జర్నలిస్ట్ రెహానా మాట్లాడుతూ మధురవాణి పాత్ర ఒక వర్గానికే కాదని, సీ్త్ర ధైర్యాన్ని, ఔన్యత్యాన్ని చూపిందన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు ఉపన్యాసకులు రమాగీతాదేవి మాట్లాడుతూ గురజాడ పాత్రలు దార్శనీకమైనవన్నారు. ప్రముఖ సీ్త్రల వైద్యనిపుణురాలు డాక్టర్ జి.సన్యాసమ్మ మాట్లాడుతూ మహిళాభ్యున్నతికి మహాకవి మహోన్నతమైన విషయాలను ప్రజల కళ్లకు కట్టినట్లు నాటకం ద్వారా చూపించి మార్పు తీసుకువచ్చారన్నారు. జనవిజ్ఞానవేదిక రాష్ట్ర సమత కన్వీనర్ జి.నిర్మల, మహిళాచేతన కార్యదర్శి కత్తిపద్మ, ఎం.సుశీల, డాక్టర్ లెక్కల చిన్నారి తదితరులు ప్రసంగించారు. గురజాడ ప్రవచించిన దేశభక్తిపై సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్ష్యులు తెలకపల్లి రవి ప్రసంగించారు. ప్రముఖ రచయితలు అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు, మక్కెన శ్రీనివాస్, సాహితీస్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్‌లు గురజాడ విశిష్టతను వివరించారు. ప్రముఖుల స్మారక భవనాలు, చిహ్నాలు పరిరక్షణ – ఆవశ్యకత అనే అంశంపై ఇన్టాక్ కన్వీనర్, చరిత్ర పరిశోధకులు ఈమని రాణీశర్మ ప్రసంగించారు. మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్. శర్మ, తవ్వా సురేష్, గొంటి గిరిధర్, జి.మురళీధర్, ప్రొఫెసర్ కె.ఎస్.చలం, కొత్తూరి శ్రీనివాస్‌లు మాట్లాడుతూ మహనీయుల స్మారక భవనాలను పరిరక్షించుకునేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. అనంతరం కన్యాశుల్కం–సామాజిక ప్రయోజనం అనే అంశంపై జనచైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రకరకాల పేర్లతో వేలకోట్లు ఖర్చుపెడుతోందని సమాజం కోసం దేశం కోసం కష్టపడిన వారిని గుర్తించడం లేదన్నారు. తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మేడిపల్లి రవికుమార్, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్.లక్ష్మణరావు, జేవీవీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎంవీఎన్.వెంకటరావు, తవ్వాసురేష్లు ప్రసంగించారు. కార్యక్రమానికి ముందు గురజాడ విగ్రహం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు గురజాడ గౌరవ యాత్రను నిర్వహించారు. యుగస్వరం గురజాడ పుస్తకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో సాహితీ అభిమానులు పాల్గొన్నారు. -
మెనూ అమలు చేయకుంటే ఎలా?
గుమ్మలక్ష్మీపురం: విద్యార్థుల కోసం కేటాయించిన మెనూ అమలు చేయకుంటే వారి ఆరోగ్యాలెలా బాగుంటాయని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ నాయకులు టి.అఖిల్, హెచ్.సింహాచలం ప్రశ్నించారు. ఈమేరకు ఆదివారం వారు మండలంలోని టిక్కబాయి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. మెనూ ప్రకారం ఉదయం పూరి పెట్టాల్సి ఉన్నప్పటికీ కిచిడీ అంటూ అన్నం పెట్టారని, మధ్యాహ్నం చికెన్ బిర్యానీ పెట్టాల్సి ఉన్నప్పటికీ వాటి స్థానంలో గుడ్డు కూరతో ముద్దగా ఉన్న అన్నం పెట్టారని..ఇలా మెనూ పాటించకపోవడం వల్ల విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారన్నారు. కావున సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఆశ్రమ పాఠశాలలో మెనూ అమలుపై దృష్టిసారించాలని, విద్యార్థులకు సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ..విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు. -
గాయపడిన వ్యక్తి మృతి
భామిని: మండల కేంద్రానికి చెందిన బొమ్మాళి సుదర్శన్(40) ఇటీవల శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనకు విశాఖ కేజీహెచ్‌లో వైద్యసేవలు అందిస్తుండగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. దీంతో మృతుని కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆయనకు భార్య, ఓ కుమార్తె ఉన్నారు. చికిత్స పొందుతూ వృద్ధురాలు.. బాడంగి: స్థానిక పెద్దవీధికి చెందిన మరడాన పాపమ్మ(76) కాలిన గాయాలతో విజయనగరం ఆస్ఫత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందినట్లు ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు. వృద్ధురాలు తనఇంటిలో శనివారం సాయంత్రం వంటచేస్తుండగా ప్రమాదవశాత్తు చీరకొంగుకు నిప్పంటుకుని శరీరం కాలిపోగా మెరుగైనచికిత్సకోసం విజయనగరం సర్వజన ఆస్ఫత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆమెకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలున్నారని ఎస్సై చెప్పారు. కుమారుడు అప్పల నాయుడి ఫిర్యాదుమేరకు కేసునమోదుచేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించి కేసుదర్యాఫ్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
బహుపరాక్..!
ప్రాణాంతక వ్యాధితో..విజయనగరం ఫోర్ట్: హెచ్ఐవీ ఎయిడ్స్వ్యాఽధి పట్ల ఒకప్పుడు సమాజంలో వివక్ష ఉండేది. అరోగులు ఉన్న ఛాయలకు కూడా వెళ్లడానికి ఇష్టపడేవారుకాదు. అంతేకాకుండా హెచ్ఐవీ పరీక్ష చేయించుకోవడానికి కూడా రోగులు ముందుకు వచ్చేవారు కాదు. హెచ్ఐవీ రోగులను కలవడానికి కానీ, వారితో మాట్లాడడానికి కాని ఇష్టపడేవారు కాదు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగుల పట్ల గతంలో కంటే అవగాహన వచ్చింది. హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవడానికి కూడా రోగులు ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పటికీ ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. హెచ్ఐవీ/ఎయిడ్స్ పట్ల ఇంకా అవగాహన రావాల్సి ఉంది. సన్మార్గమే ఉత్తమం హెచ్ఐవీ వచ్చిన తర్వాత బాధపడేకంటే హెచ్ఐవీ బారిన పడకుండా ఉండడం మంచిది. చెడుఅలవాట్లకు దూరంగా ఉంటూ సన్మార్గంలో నడవడం ద్వారా హెచ్ఐవీ బారిన పడకుండా ఉండవచ్చు. హెచ్ఐవీ సోకిందంటే జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. ఐసీటీసీ సెంటర్లో హెచ్ఐవీ పరీక్షలు చేసిన తర్వాత నిర్ధారణ అయినవారికి ఏఆర్టీ సెంటర్లో రిజిస్ట్రేషన్ చేసి మందులు అందిస్తారు. ఒకసారి మందుల వాడకం ప్రారంభించిన తర్వాత మధ్యలో మానివేయకూడదు. మందులు మధ్యలో మానివేస్తే వారి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తుంది. ఏఆర్టీ కేంద్రంలో 6582 మందికి చికిత్స జిల్లాలోని ఏఆర్టీ కేంద్రంలో 6582 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో పురుషులు 2836 మంది, మహిళలు 3707 మంది, పిల్లలు 39 మంది ఉన్నారు. 2008 నుంచి ఆక్టోబర్ నెలాఖరు నాటికి 13,897మంది హెచ్ఐవీ రోగులు నమోదయ్యారు. జిల్లాలో చికిత్స అందించే కేంద్రాల వివరాలు జిల్లాలో సమగ్ర, పరీక్ష కేంద్రా(ఐసీటీసీ)లు 11 ఉన్నాయి. అదేవిధంగా పీహెచ్‌సీల్లో 65 ఐసీటీసీలు ఉన్నాయి. అలాగే రక్తనిధి కేంద్రాలు జిల్లాలో 9 ఉన్నాయి. రక్త నిల్వ కేంద్రాలు 8 ఉన్నాయి. రక్తసేకరణ వాహనం ఒకటి ఉంది. జిల్లాలో ఏఆర్టీ కేంద్రాలు రెండు ఉన్నాయి. లింక్ ఏఆర్టీ కేంద్రాలు 7 ఉన్నాయి. సుఖవ్యాధి చికిత్స కేంద్రాలు రెండు ఉన్నాయి. హెచ్ఐవీ/ఎయిడ్స్ నిర్మూలనపై పనిచేసే స్వచ్ఛంద సంస్థలు 6 ఉన్నాయి.అవగాహన కల్పిస్తున్నాం హెచ్ఐవీ/ఎయిడ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నాం. హెచ్ఐవీ ఏవిధంగా వ్యాప్తి చెందుతుంది, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. హెచ్ఐవీ సోకిన వారికి ఎక్కడ చికిత్స అందిస్తారనే దానిపై అవగాహన కల్పిస్తున్నాం.ీ పీహెచ్సీ, సీహెచ్‌సీ, జిల్లా ఆస్పత్రుల్లో హెచ్ఐవీ పరీక్షలతో పాటు హెచ్ఐవీపై కౌన్సెలింగ్ ఇస్తారు. ప్రతి ఒక్కరూ హెచ్ఐవీపై అవగాహన కల్పించుకోవాలి. – డాక్టర్ కె.రాణి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి ఎయిడ్స్ పట్ల అవగాహన అవసరం జిల్లాలోని ఏఆర్టీ కేంద్రంలో రోగులు 6582 మంది హెచ్ఐవీ పరీక్ష చేసే ఐసీటీసీ కేంద్రాలు 77 నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం -
సాహితీ చైతన్య రజతోత్సవం..
విజయనగరం టౌన్: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహనీయుడును స్మరిస్తూ గురజాడ సాంస్కృతిక సమాఖ్య పేరుతో జిల్లాలోని సాహితీవేత్తలు, అభిమానులు 2000 సంవత్సరంలో ఓ సంస్థ ఏర్పాటు చేశారు. కేవలం సభ్యుల సహకారంతోనే ప్రతి ఏటా ఉత్సవాలను నిర్వహిస్తూ గురజాడ సాహిత్యంపై కృషి చేస్తున్న వారిని గుర్తించి గురజాడ విశిష్ట పురస్కారాలను అందజేస్తోంది. నేటికి 25 ఏళ్లు పూర్తి కావడంతో ఈ ఏడాది సాహితీ చైతన్యోత్సవం పేరుతో రజతోత్సవ వేడుకలకు రంగం సిద్ధం చేసింది. భావితరాలకు అవగాహన మహాకవి చేసిన రచనలపై నేటితరానికి అవగాహన కల్పించే దిశగా సమాఖ్య కృషి చేస్తోంది. జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి వందలాది మంది విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తున్నారు. జాతీయస్థాయిలో కవితల పోటీలు నిర్వహించి ఉత్తమ కవులకు గురజాడ ఉత్తమ కవితా పురస్కారంతో సత్కరిస్తున్నారు. ఇప్పటివరకు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 190 మందికి పైగా కవులు పాల్గొన్నారు. మరణాంతరం కూడా జీవిస్తారు.. మహా పురుషులందరూ మరణాంతరం కూడా జీవిస్తారు. ప్రతి ఒక్కరూ మహానుభావుల జయంతి రోజున కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. కానీ గురజాడ సాంస్కృతిక సమాఖ్య మాత్రం గురజాడ వర్ధంతి రోజున కార్యక్రమాలు నిర్వహిస్తూ..ఆయనకు మరణం లేదని చెబుతూ వస్తున్నాం. మహాకవి సాహితీవనంలో వేసిన బాటలో నడయాడడమే మనందరి బాధ్యత. – కాపుగంటి ప్రకాష్, ప్రధాన కార్యదర్శి, గురజాడ సాంస్కృతిక సమాఖ్య, విజయనగరం -
గురజాడ భావజాలం దేశానికి అవసరం
● సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తెలకపల్లి రవివిజయనగరం టౌన్: జాతీయ పునర్వికాసానికి ప్రతిబింబంగా, ప్రతీకగా నిలిచిన వ్యక్తి గురజాడ అప్పారావు భావజాలం దేశానికి ఎంతైనా అవసరం.. అటువంటి మహనీయుడి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించుకోవడం మన కనీస బాధ్యతని సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తెలకపల్లి రవి అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గురజాడ పేరుతో సాంస్కృతిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఆయన నివాసాన్ని ఆధునీకరించాలని సూచించారు. ఉత్తరాంధ్రలో శ్రీశ్రీ, ఆరుద్ర, ఘంటసాల, సుశీల , ఆదిభట్ల, ద్వారం వంటి మహానుభావులెందరో ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. కార్యక్రమంలో సాహితీస్రవంతి ప్రతినిధి చీకటి దివాకర్, జనవిజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ ఎంవీఎన్ వెంకటరావు, డాక్టర్ జక్కు రామకృష్ణ, గురజాడ వెంకటేశ్వరరావు, ఇందిర, తదితరులు పాల్గొన్నారు. -
బుడతనాపల్లిలో అగ్ని ప్రమాదం
గంట్యాడ: మండలంలోని బుడతనాపల్లిలో శనివారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన బొమ్మిడి సూరమ్మకు చెందిన పూరిల్లు కాలిపోయింది. ఒక్కసారిగా ఇంటి నుంచి మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు స్పందించి మంటలను ఆర్పారు. అయితే అప్పటికే ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ప్రమాద సమయంలో బాధిత మహిళ ఇంటిలో లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ‘మళ్లీ విచారణకు రావాలి’ సాలూరు: గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పీఎస్ సతీష్‌పై ఫిర్యాదు చేసిన బాధిత మహిళను పోలీసులు విచారించారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం విచారణ చేపట్టి సాయంత్రం వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. శనివారం ఉదయం ఆమెను విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించి, మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించారు. సాయంత్రం ఆమెను ఇంటికి పంపించి వేసి మళ్లీ విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం వంగర: మండల పరిధి నీలయ్యవలస గ్రామానికి చెందిన సీహెచ్ విజయమ్మ (60) గడ్డి మందు తాగి శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు.. కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగు మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి 108 వాహనంలో రాజాం ఆస్పత్రికి తరలించారు. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి గుర్ల: మండలంలోని చుక్కపేట, సొలిపిసోమరాజుపేట వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో కలవచర్లకు చెందిన నడుపూరు అప్పలనర్సమ్మ (65), చీపురుపల్లికి చెందిన ఇప్పిలి భూషణరావు (48) మృతి చెందారు. నడుపూరు అప్పలనర్సమ్మ తన కుటుంబ సభ్యులతో ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. చుక్కపేట వద్దకు వచ్చే సరికి ప్రమాదవశాత్తూ జారి పడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అప్పలనరసమ్మను విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. మరో ప్రమాదంలో చీపురుపల్లికి చెందిన ఇప్పిలి భూషణరావు విజయనగరం నుంచి తన స్వగృహానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. సొలిపిసోమరాజు పేట వద్ద వాహనం బోల్తా పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదాలపై గుర్ల పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?
● ఎమ్మెల్యే లోకం నాగమాధవికి వైఎస్సార్ సీపీ నాయకుల సవాల్ పూసపాటిరేగ: వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధికి, ఇప్పుడు అధికారంలోని చంద్రబాబు ప్రభుత్వం 18 నెలల కాలంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు పతివాడ అప్పలనాయుడు, మండల వైస్ ఎంపీపీ అల్లాడ రమేష్‌లు సవాల్ విసిరారు. ఇదే విషయమై మండల కేంద్రంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి, మాట్లాడారు. ఎరుకొండ, అల్లాడపాలెం గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించినప్పుడు ఆయా గ్రామాల్లో వైఎస్సార్ సీపీ హయాంలో చేసిన అభివృద్ధి ఎమ్మెల్యేకు కనిపించకపోవడం దురదృష్టకరమన్నారు. ఏ గ్రామం వెళ్లినా వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే కనిపిస్తోందన్నారు. అల్లాడపాలెంలో రూ.కోటి నిధులతో సీసీ రోడ్లు, కాలువలు, బోర్లు వేశారని, అవేవీ కానరాలేదా అని మండిపడ్డారు. అదే గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు కేంద్రం ప్రారంభోత్సవంలో కనీసం ప్రోటోకాల్ పాటించకుండా జనసేన జెండాలతో నింపేసి అదొక పార్టీ కార్యక్రమంలా చేసేశారని ఎద్దేవా చేశారు. యువతకు ఉద్యోగాలెప్పుడిస్తారు? ఎమ్మెల్యే నాగమాధవి గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు అక్కడి సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులను లేనిపోని మాటలతో దూషిస్తుండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అధికారం ఉంది కదా అని లేనిపోని మాటలు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రెల్లివలసలో కార్పొరేట్ స్థాయిలో శ్మశానవాటికను అభివృద్ధి చేస్తే దానిపై ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం అర్థరహితమన్నారు. తాను గెలిచి అధికారం కూడా వస్తే వంద రోజుల్లో వంద కంపెనీలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామన్న మాట ఎప్పుడు నెరవేరుస్తారని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. అధికారులు కూడా వృత్తి ధర్మం పాటించకుండా రాజకీయ నాయకులకు తొత్తులుగా మారడం సిగ్గుచేటన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతున్న అధికారులపై ఫిర్యాదులు చేస్తామన్నారు. మండలంలోని 28 పంచాయతీల్లో ఏ పంచాయతీ అభివృద్ధిపైనా అయినా ఎమ్మెల్యేతో చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. సమావేశంలో వైస్ ఎంపీపీ ఎన్.సత్యనారాయణరాజు, ఎంపీపీ ప్రతినిధి మహంతి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ ప్రతినిధి మహంతి జనార్థనరావు తదితరులు పాల్గొన్నారు. -
గురజాడ.. భావితరాలకు దిక్సూచి..
● ఆచార్య కొలకలూరి ఇనాక్‌కు గురజాడ విశిష్ట పురస్కారం విజయనగరం టౌన్: విజ్ఞానదాయకమైన విద్య విజయానికి దోహదపడుతుందని ముందుచూపుతో పటిష్టమైన ప్రణాళిక రచించి భావితరాలకు గురజాడ వేంకట అప్పారావు వెలుగుజాడగా నిలిచారు. సంఘ సంస్కరణ, సాంఘిక చైతన్యమవసరమని ఆశించారు. ఆయన ఆశయాలు, వారి రచనలు అజరామరం. విజయనగరం సంస్థానంలో ఆనందగజపతికి అభిమానపాత్రునిగా.. రీవారాణి అప్పలకొండమాంబ అంతరంగిక కార్యదర్శిగా పనిచేశారు. నాలుగో విజయరామ గజపతి దత్తత విషయంలో ప్రముఖ పాత్ర వహించిన నిస్వార్థపరులు మహాకవి గురజాడ. అటువంటి మహానుబావుడికి సొంత ఇల్లు కూడా లేదు. సంస్థానం వారు ఉండమన్న అద్దె ఇంటిని రెండువేల రూపాయలకు కొనుక్కున్నారు. ఆ ఇల్లును బాగు చేసిన కొన్ని నెలలకే అనగా 1915 నవంబర్ 30న పరమపదించారు. ఇప్పుడా గృహం అధ్యయన కేంద్రంగా విరాజిల్లుతోంది. సాహితీ సౌరభాలు.. విజయనగర ఖ్యాతిని దశ దిశలా చాటిన మహోనుభావులు ఎందరో ఉన్నారు. వందల ఏళ్లు దాటినా ఆ సాహితీవేత్తలు అజరామరులే. అటువంటిి సాహితీవేత్తలు నడయాడిన నేలపై మనం జన్మించడం మనందరి అదృష్టం. అంతటి మహనీయుల్లో వెలుగుజాడ గురజాడ ఒకరు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో 24 ఏళ్లుగా సాహితీ చైతనోత్సవం పేరిట గురజాడ విశిష్ట పురస్కారంతో విశిష్ట వ్యక్తిని సత్కరించుకుంటున్నారు. కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు గురజాడ పురస్కారం వాయిదా పడింది. మరలా 2022 నుంచి ఈ పురస్కారాన్ని సమాఖ్య ప్రతినిధులు అందజేస్తున్నారు. ఈ ఏడాది సమాఖ్య 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. 2025 సంవత్సరానికి గాను పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్‌కు ఆదివారం ఉదయం 10.30 గంటలకు డాక్టర్ పీవీజీ.రాజు క్షత్రియ కల్యాణ మంటపం ఆవరణలో గురజాడ విశిష్ట పురస్కారాన్ని అందజేయనున్నారు. గురజాడ విశిష్ట పురస్కారం అందుకోనున్న ఆచార్య కొలకలూరి ఇనాక్ -
వైద్యాధికారిపై విచారణ
చీపురుపల్లి రూరల్ (గరివిడి): గరివిడి మండలంలోని కోనూరు పీహెచ్సీ వైద్యాధికారి వెంకటరమణమ్మపై జిల్లా వైద్యశాఖాధికారులు శనివారం విచారణ చేపట్టారు. వెంకటరమణమ్మ విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని, సకాలంలో అందుబాటులో ఉండడం లేదంటూ కోనూరు, గొలగాం గ్రామాలకు చెందిన నాయకులు మాజీ సర్పంచ్ వెంపడాపు రమణమూర్తి, ఎం.అప్పలనాయుడు, వై.రమణ, ఎం. రాము, తదితరులు ఇటీవల కలెక్టర్, డీఎంహెచ్ఓలకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఎంహెచ్ఓ జీవనరాణి ఆదేశాల మేరకు జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రొగ్రాం అధికారి సుబ్రహ్మణ్యం స్థానిక పీహెచ్సీలో ఫిర్యాదుదారుల సమక్షంలో విచారణ చేశారు. ఆరోగ్య కేంద్రానికి సకాలంలో విధులకు హాజరు కావటం లేదని, ప్రతీరోజు 11, 12 గంటలకు పీహెచ్‌సీకి వచ్చి వెంటనే వెళ్లిపోతున్నారని.. ఆస్పత్రిలో ప్రసవాలు జరిపించడం లేదంటూ ఫిర్యాదుదారులు అధికారులకు తెలియజేశారు. ఇదే పీహెచ్సీ పరిధిలో గల గుర్ల మండలం తాటిపూడి సచివాలయంలో పనిచేస్తున్న ఎంఎల్‌హెచ్‌పీ కస్తూరి సక్రమంగా విధలకు హాజరుకావడం లేదని గొలగాం గ్రామానికి చెందిన సర్పంచ్ కలిశెట్టి అప్పలరాజు విచారణాధికారులకు తెలియజేశారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని అధికారులు తెలిపారు. -
టీడీపీ నాయకులు చెబితేనే కొంటాం..
గుర్ల: రైతులు ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా చంద్రబాబు ప్రభుత్వంలో ఇబ్బంది పడాల్సి వస్తోంది. పండించిన పంటను మిల్లులకు తరలించాలన్న టీడీపీ నాయకుల అనుమతి ఉండాలని అధికారులు చెబుతుండడంపై అన్నదాతలు నివ్వెరబోతున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని చింతలపేటకు చెందిన సంచాన గౌరినాయుడు, యడ్ల ఉమామహేశ్వరి, పతివాడ శ్రీనువాసరావు, పతివాడ రమణ, పతివాడ పద్మ, తదితరులు కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని కళ్లాల్లో ఉంచారు. రైతుసేవా కేంద్రానికి వెళ్లి ధాన్యం మిల్లుకు తరలించాలని వీఏఏను కోరారు. దీంతో ఆమె గురువారం షెడ్యూల్ ఇచ్చి గూడెం సొసైటీ సిబ్బంది నియమించిన టీఏ, డీఈఈల వద్దకు పంపించింది. రైతులు టీఏ, డీఈఈలను సంప్రదించి ధాన్యం తరలింపునుకు సంబంధించి ఽట్రక్షీట్ జనరేట్ చేయాలని కోరారు. అయితే ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేయాలంటే తప్పనిసరిగా గ్రామ టీడీపీ నాయకుడు, గూడెం సొసైటీ చైర్మన్‌ను కలవాలని.. అతను చెబితే కొనుగోలు ప్రారంభిస్తామని సొసైటీ నియమించిన సిబ్బంది తెలిపారు. రెండు రోజులుగా నిలిచిన లారీలు చింతలపేటలో ఐదుగురు రైతులకు చెందిన 1100 బస్తాల ధాన్యం రెండు లారీలకు లోడ్ చేశారు. ధాన్యం లోడ్ చేసి రెండు రోజులవుతున్న సొసైటీ సిబ్బంది మాత్రం ట్రక్‌షీట్ జనరేట్ చేయలేదు. దీంతో రైతులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారులు ట్రక్‌షీట్ జనరేట్ చేయాలని చెప్పినా శనివారం సాయంత్రం వరకు జనరేట్ చేయలేదు. దీంతో అధికారులు గ్రామానికి వచ్చి ట్రక్‌షీట్ జనరేట్ చేయించారు. మండిపడుతున్న అన్నదాతలు.. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రారంభంలోనే టీడీపీ నాయకుల తీరు ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఇంకెంత దారుణంగా వ్యవహరిస్తారోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ నాయకుల చుట్టూ తిరిగితే ధాన్యం కొంటారా అంటూ మండిపడుతున్నారు. ధాన్యం లోడ్ చేసి రెండు రోజులవుతున్నా ట్రక్‌షీట్ జనరేట్ చేయని వైనం గూడెం సొసైటీ సిబ్బంది నిర్వాకం అధికారుల ఆగ్రహించడంతో మిల్లుకు తరలింపు -
మాదకద్రవ్యాల రవాణాను అరికట్టాలి
పార్వతీపురం: జిల్లాలో మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల రవాణాను పూర్తిగా అరికట్టాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీ జిల్లా స్థాయి సమావేశం, జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశం కలెక్టర్, ఎస్పీ మాధవరెడ్డి అధ్యక్షతన శనివారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో డ్రగ్స్, గంజాయి నివారణపై విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. ఇందుకోసం ప్రతి పది ఇళ్లకు ఒక వలంటీర్‌ను ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. ఫొటోల కోసం కాకుండా నివారణే అంతిమ లక్ష్యంగా భావించి అధికారులు పని చేయాలన్నారు. రవాణా, అటవీ, ఆర్టీసీ, ఎకై ్సజ్, తదితర శాఖల ద్వారా నిర్వహిస్తున్న ర్యాలీలు, చైతన్య కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.. రహదారి ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, డీఎస్పీ ఎం.రాంబాబు, ఎస్టీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, పశుసంవర్థక శాఖాధికారి ఎస్.మన్మధరావు, డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు, సీపీఓ ఎస్ఎస్ఆర్ పట్నాయక్, డీటీఓ దుర్గాప్రసాద్, డీపీటీఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రభాకరరెడ్డి -
అవి తిట్లు సంసారం కాదు..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఒక జాకీర్ హుస్సేన్ తబలా కొట్టినట్టు.. ఒక టెండూల్కర్ వరుస సిక్సులు కొట్టినట్టు.. శివమణి డ్రమ్స్ కొట్టినట్టు.. శంకర్ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం వాయించినట్టు.. సీఎంవో నుంచి మంత్రి సంధ్యారాణికి చీవాట్ల పరంపర కొనసాగినట్టు తెలిసింది. తన అనధికార పీఏ సతీష్ చేసిన అనైతిక కార్యకలాపాలు గిరిజన, మహిళా సంక్షేమ శాఖా మంత్రికి తలవంపులు తెచ్చాయి. దీంతో ఆమె ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయారు. దీంతో టీడీపీ అధిష్టానం, ముఖ్యంగా విద్యా శాఖ మంత్రి లోకేష్ పేషి నుంచి మంత్రికి గట్టిగా తిట్లు.. చీవాట్లు పెట్టినట్టు తెలిసింది. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో ఇతరత్రా అంశాల కన్నా మంత్రి సంధ్యారాణి అనధికారిక పీఏ సతీష్ వ్యవహారం.. అయన దూకుడు.. దందాల అంశం ఎక్కువ చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఇన్నేళ్ల పోరాటం.. ఒక్క పీఏతో సరి పదిహేనేళ్లుగా టీడీపీలో కొనసాగుతూ తొలిసారిగా ఎన్నికల్లో గెలిచి రెండు శాఖలకు మంత్రిగా ప్రాధాన్యపరమైన పోస్టింగులు దక్కించుకున్న సంధ్యారాణి ఒక్క పీఏ కారణంగా మొత్తం పరువు కోల్పోయారు. ఇప్పటికే ఆమెకు మహిళా శిశుసంక్షేమ శాఖతో పాటు గిరిజన సంక్షేమ శాఖను ఇచ్చి చంద్రబాబు అధిక ప్రాధాన్యం కల్పించారన్న అసూయ టీడీపీ నేతల్లో ఉండగా.. ఇప్పుడు ఏకంగా ఆమె ఇలా జనంలో పలుచన అయిపోయి పరువు పోగొట్టుకున్నారు. అంతేకాకుండా ఏకంగా ఆమె కుమారుడు కూడా ఈ వ్యవహారంలో పాత్ర ఉందని తేలడంతో ఆమె కాళ్లు చేతులు అందని పరిస్థితి నెలకొన్నది. వాట్సాప్ చాటింగులు.. బాధిత మహిళ పోలీసు ఫిర్యాదుతో సంధ్యారాణి పరిస్థితి సాలూరు ప్రజలకు మొహం చూపలేని విధంగా మారింది. అటు పార్టీ పెద్దల నుంచి వస్తున్న ప్రశ్నల పరంపరకు ఒకే సార్.. సార్.. సార్... నేను చూస్తాను సార్.. అంతా సరిదిద్దుకుంటాను... సెట్ చేస్తాను.. అనే మాట తప్ప ఇంకేం సమాధానం లేకపోయిందని ఆమె అనుచరులే చెబుతున్నారు. దీంతో ఇక అనివార్యంగా తన పీఏను తొలగించక తప్పని పరిస్థితి నెలకొన్నది. ఏమీ తప్పు జరగనప్పుడు ఆయన్ను ఎందుకు ఉద్యోగంలోంచి తీసేశారమ్మా అనే ప్రశ్నలకు ఆమె వద్ద సమాధానం కరువైంది. సౌండ్ లేని ఇన్చార్జ్ మంత్రులు తన పొలిటికల్ కొలీగ్ సంధ్యారాణి కుమారుడు, ఆమె పీఏ ఇలా ఒక లైంగిక వేధింపుల వ్యవహారంలో చిక్కుకోగా విజయనగరం ఇన్చార్జ్ మంత్రి, హోమ్ మంత్రి వంగలపూడి అనిత మాత్రం ఏమాత్రం స్పందించలేదు. ఆమె ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న విజయనగరంలోనే సాలూరు కూడా మొన్నటి వరకూ భాగం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అంశం మీద ఆమె ఈప్పటికే ఒక ప్రకటన చేయాల్సి ఉండాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు సాలూరు నియోజకవర్గం ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు కూడా ఈ అంశం మీద ఏమీ పెదవి విప్పడం లేదు. తమ మంత్రి కొడుకు, పీఏ ఈ వ్యవహారంలో నిందితులుగా ఉన్న తరుణంలో ఆయన సైతం సైలెంట్‌గా ఉండడం ప్రజల్లో విమర్శలకు అవకాశం కలుగుతోంది. మొత్తం మీద.. కొడుకు, పీఏ చేసిన నిర్వాకాలతో పైనుంచి వస్తున్న చీవాట్లు.. సంజాయిషీ ప్రశ్నలతో సంధ్యారాణి తీవ్రంగా కలత చెందుతున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. సీఎంవో నుంచి మంత్రి సంధ్యారాణికి చీవాట్లు కేబినెట్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ తప్పించుకునే మార్గం కరువు అనివార్యంగా పీఏ సతీష్ తొలగింపు -
గిరిమిత్రలో టెండర్ ప్రక్రియ
పార్వతీపురం: పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ పాఠశాలలకు జీసీసీ సరుకుల టెండర్లు ప్రక్రియను జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో సి.యశ్వంత్ కుమార్‌రెడ్డి పర్యవేక్షణలో శనివారం నిర్వహించారు. గిరిజన సంక్షేమ వసతిగృహలకు, పాఠశాలలకు అత్యవసరమైన, నాణ్యమైన సరుకులను సరఫరా చేసేందుకు ఈ టెండర్ ప్రక్రియ నిర్వహించినట్టు పీఓ తెలిపారు. టెండర్ దక్కించుకున్న వారు వసతిగృహలకు, పాఠశాలలకు విధిగా సరుకులను ఏడాది పాటు సరఫరా చేయాల్సి వుంటుందన్నారు. కార్యక్రమంలో ఏపీవో పి.మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. -
దేశ సేవలో భాగస్వాములు కావాలి
విజయనగరం రూరల్: సైనిక పాఠశాల విద్యార్థులు దేశ సేవలో భాగస్వాములు కావాలని తూర్పు నావికాదళ కమాండ్, చీఫ్ ఆఫ్ స్టాఫ్, రియర్ అడ్మిరల్ మురళీమోహన్‌రాజు అన్నారు. కోరుకొండ సైనిక పాఠశాల వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలన్నారు. సైనిక పాఠశాల యూనిఫాం పాఠశాల నైతికతను, తల్లిదండ్రుల త్యాగాలను, అంచలమైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. విద్యార్థుల క్రమశిక్షణలో తొలి గురువులు తల్లిదండ్రులేనని, నాయకత్వ ప్రయాణంలో నిజమైన భాగస్వాములని పేర్కొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ ఎస్ఎస్ శాస్త్రి మాట్లాడుతూ సైనిక పాఠశాల క్రమశిక్షణతో కూడిన విద్య, క్రీడాంశాల్లో ఉత్తమ ప్రదర్శనలో ముందు వరుసలో ఉంటుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాహస కృత్యాలు, జానపద, ఇతర సాంస్కతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులకూ పలు పోటీలను నిర్వహించారు. అనంతరం ప్రతిభ గల విద్యార్థులు, వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతులు, మెడల్స్, షీల్డ్‌లు అందజేశారు. పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తూర్పు నావికాదళ కమాండ్, చీఫ్ ఆఫ్ స్టాఫ్, రియర్ అడ్మిరల్ మురళీమోహన్‌రాజు ఘనంగా కోరుకొండ సైనిక పాఠశాల వార్షికోత్సవం -
ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్ శ్రీ 2025
పార్వతీపురం రూరల్: పెళ్లి పందిరిలో సందడి... వేద పండితుల మంత్రోచ్ఛారణలు... మంగళవాయిద్యాల హోరు... బంధుమిత్రుల కోలాహలం... ఇవన్నీ ఇక కొన్నాళ్ల పాటు నిలిచిపోనున్నాయి. ముహూర్తం బాగుంటేనే ముచ్చటగా నూరేళ్లు బతుకుతారు.. అన్నది మన సంప్రదాయం. అందుకే ఘడియలు, విఘడియలు లెక్కగట్టి మరీ లగ్నాలు పెడతారు. కానీ, ఆ శుభ ఘడియలకు బ్రేక్ పడింది. శుక్రవారం నుంచి మొదలైన శుక్రమౌఢ్యమి (మూఢం) కారణంగా సుదీర్ఘ విరామం ఏర్పడింది. రేపటి (నవంబర్ 30) నుంచి మొదలై వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 వరకూ, అంటే దాదాపు 80 రోజుల పాటు ముహూర్తాలకు బ్రేక్ పడనుంది. దీంతో పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా శుభకార్యాల సందడి సద్దుమణిగింది. సాధారణంగా కార్తీక మాసం ముగిసిందంటే మాఘ మాసం కోసం పెళ్లివారి చూపులు ఉంటాయి. మాఘ మాసంలో మట్టిని ముట్టుకున్నా మాణిక్యమే అన్న నానుడి ఉంది. అంతటి పవిత్రమైన మాసంలో ఈసారి ఒక్కటంటే ఒక్క ముహూర్తం కూడా లేకపోవడం గమనార్హం. ఈసారి మాఘమంతా మూఢంలోనే కలిసిపోవడంతో శుభకార్యాల ఆశలు ఆవిరయ్యాయి. గృహ ప్రవేశాలకు అత్యంత ప్రీతిపాత్రమైన రథసప్తమి, చదువుల తల్లిని కొలిచే వసంత పంచమి, మాఘ పౌర్ణమి వంటి విశేష పర్వదినాలు సైతం ఈ మూఢం నీడన మసకబారాయి. ఇప్పటికే సంబంధాలు కుదుర్చుకున్న వారు సైతం ఫిబ్రవరి మూడో వారం వరకు వేచి చూడక తప్పని పరిస్థితి. శుభ కార్యాలంటే కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు. అది అనేక రంగాల ఉపాధికి ఆలంబన. ఈ 80 రోజుల విరామం వ్యాపార వర్గాలకు నిజంగా గడ్డుకాలమే. జిల్లాలోని కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు రాబోయే మూడు నెలలు ఖాళీగా దర్శనమివ్వనున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌పైనే ఆధారపడే పట్టుచీరల వ్యాపారులు, స్వర్ణకారుల గిరాకీ గణనీయంగా పడిపోనుంది. స్థానిక వస్త్ర దుకాణాలు కళ తప్పనున్నాయి. పెళ్లిళ్లలో సందడి చేసే సన్నాయి మేళాలు, డెకరేషన్ పనివారు, టెంట్ హౌస్ నిర్వాహకులు, క్యాటరింగ్ సిబ్బంది, ఫొటోగ్రాఫర్లు, పూల వ్యాపారులు, లైటింగ్, డీజే ఆపరేటర్లు ఇలా ఒకరేమిటి, శుభకార్యాలే జీవనాధారంగా బతికే వేలాది కుటుంబాల ఉపాధికి గండి పడనుంది. నిత్యం పెళ్లి పీటలపై వేదమంత్రాలు చదివే పురోహితులు, అర్చకులకు కూడా ఈ సమయం ఆర్థికంగా సవాళ్లతో కూడుకున్నదే. జ్యోతిష్య శాస్త్ర రీత్యా వివాహ వ్యవస్థకు, దాంపత్య సౌఖ్యానికి శుక్రుడే ప్రధాన కారకుడు (కళత్ర కారకుడు). సూర్యునికి అత్యంత సమీపంలోకి శుక్రుడు వచ్చినప్పుడు, సూర్యరశ్మి తీవ్రతకు శుక్ర గ్రహ ప్రభావం కనుమరుగవుతుంది. దీనినే అస్తంగత్వం లేదా మౌఢ్యమి అంటాం. వరుడికి బలం ఇచ్చే రవి, వధువుకు బలం ఇచ్చే గురుడు, భోగభాగ్యాలనిచ్చే శుక్రుడు వీరిలో ఏ ఒక్కరు బలహీనపడినా ఆ సమయంలో చేసే వివాహాలు ఆశించిన ఫలితాలను ఇవ్వవు. ముఖ్యంగా శుక్ర మౌఢ్యమిలో వివాహం చేసు కుంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం, సంతానలేమి లేదా అనారోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉందని ముహూర్త చింతామణి, కాలవిధానం వంటి ప్రామాణిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది మూఢనమ్మకం కాదు, ఖగోళ శాస్త్ర రీత్యా గ్రహాల నుంచి వెలువడే కిరణాల ప్రభావం. అందుకే ఈ 80 రోజులు శుభకార్యాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. – మురపాక కాళిదాసు శర్మ యాజీ, ప్రముఖ నాడీ జ్యోతిష్యులు జ్యోతిష్య శాస్త్ర రీత్యా దాంపత్య సౌఖ్యానికి, భోగభాగ్యాలకు కారకుడు శుక్రుడు. ఆ శుక్రగ్రహం సూర్యుని కిరణాల ప్రతాపానికి కనుమరుగవడాన్నే మౌఢ్యమి అంటారు. శుక్రుడు అస్తంగతుడైన వేళ చేసే వివాహాలు దంపతుల మధ్య కలతలకు, ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తాయని పండితులు చెబుతున్నారు. అందుకే ఈ 80 రోజులు ఎలాంటి శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, వివాహాలు నిషిద్ధమని స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి కల్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అంటారు గానీ, ఈ మూఢం దెబ్బకు మాత్రం ఆగక తప్పదు. మళ్లీ ఫిబ్రవరి 17న మాఘ బహుళ అమావాస్య తర్వాతే జిల్లాలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అప్పటి వరకు శుభస్య శీఘ్రం కాస్తా... శుభస్య ఆలస్యంగా మారనుంది. బాజా మోగదు.. బంతీ సాగదు..! మాఘ మాసపు పెళ్లి సందడి మౌఢ్యంతో నిశ్శబ్దం ఫిబ్రవరి 17 వరకు ముహూర్తాలకు సెలవు కల్యాణ మండపాలు, కేటరింగ్, పూల వ్యాపారాలు డీలా కల్యాణ ఘడియలకు ‘శుక్ర’ గ్రహణం ఓ పక్క మూఢం కారణంగా సంప్రదాయ వివాహాలు ఆగిపోతుంటే, మరోపక్క ఇదే అదనుగా ఆదర్శ వివాహాల వైపు అడుగులు వేయాలన్న వాదనలూ వినిపిస్తున్నాయి. మూఢమి, ముహూర్తాల పేరుతో నెలల తరబడి వేచి చూడకుండా, రిజిస్టర్ మ్యారేజ్ (చట్టబద్ధ వివాహం) చేసుకోవడానికి ఈ సమయం అనుకూలమని సామాజిక వేత్తలు సూచిస్తున్నారు. వేల రూపాయలు వెచ్చించి ఆర్భాటాలకు పోకుండా, కేవలం దండలు మార్చుకుని, చట్ట ప్రకారం ఒక్కటవ్వాలనుకునే వారికి గ్రహాల గమనం అడ్డురాదు. మూఢమి భయంతో వాయిదా పడే పెళ్లిళ్లను, నిరాడంబరంగా ‘రిజిస్టర్’ ఆఫీసులో జరిపించడానికి యువత చొరవ చూపితే ఖర్చుతో పాటు, సమయం కూడా ఆదా అవుతుందని, మూఢ నమ్మకాలకు చెక్ పెట్టినట్లవుతుందని విజ్ఞుల మాట. -
‘తోటపల్లి’పై చిత్తశుద్ధి లేని చంద్రబాబు సర్కార్
● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ వీరఘట్టం: తోటపల్లి పాత ఆయకట్టులో వరుణదేవుని దయవల్ల ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ గెట్టెక్కిందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. వీరఘట్టం శనివారం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తోటపల్లి పాత ఆయకట్టు కాల్వల ఆధునికీకరణపై చంద్రబాబు సర్కార్‌కు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ మొదట్లో నీరు లేక వరినాట్లు ముదిరిపోయే పరిస్థితి వచ్చిందని, ఇంతలో వరుణ దేవుడు కరుణించడంతో వర్షాలు కురవడంతో పాలకొండ శివారు ప్రాంత రైతులు ఉభాలు పూర్తి చేశారన్నారు. ఇలా తరచూ వర్షాలు కురవడంతో సాగునీటి కోసం రైతులు ఇబ్బంది పడకుండా ఖరీఫ్ సీజన్ గట్టెక్కారన్నారు. గత ఎన్నికల్లో తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులపై తప్పుడు ప్రచారం చేసి ఓట్లు దండుకున్న చంద్రబాబునాయుడు తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే తోటపల్లి రైతులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆరోపించారు. 25 శాతంలోపు ఈ పనులు జరిగాయనే సాకు చూపించి ఏకంగా పాత ఆయకట్టు ఆధునికీకరణ పనులు రద్దు చేశారన్నారు. తోటపల్లి ఆధునికీకరణ పనులు చేపట్టాలని శుక్రవారం శ్రీకాకుళంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావుకు వినతిపత్రం కూడా ఇచ్చామన్నారు. ఆయకట్టు దారులు తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనుల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని, 2026 ఖరీఫ్‌లో పాలకొండ శివారుకు పూర్తి స్థాయిలో నీరందేలా చర్యలు తీసుకోవాలని అంచనాల కమిటీ చైర్మన్‌కు తోటపల్లి రైతుల గోడు వినిపించామని ఎమ్మెల్సీ అన్నారు. తోటపల్లి కాలువల పనులపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రైతులతో కలసి వైఎస్సార్సీపీ పోరాడుతుందని హెచ్చరించారు. ఆయనతో పాటు ఎంపీపీ దమలపాటి వెంకటరమణనాయుడు, జెట్పీటీసీ జంపు కన్నతల్లి, తూడి సర్పంచ్ కుద్దిగాన వెంకటరమణ, తలవరం సర్పంచ్ శిష్టు మధుసూదనరావు, భుక్త తదితరులున్నారు. -
సమగ్ర సమాచారం ఉండాలి
● కలెక్టర్ ప్రభాకరరెడ్డి పథకాలకు సంబంధించిపార్వతీపురం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతీ అధికారి వద్ద పూర్తి సమాచారం ఉండాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పలు పథకాల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో తన సమావేశ మందిరంలో కలెక్టర్ శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్ వున్న పనుల వివరాలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లి నిధులు విడుదలయ్యేలా చూసుకోవాలని అధికారులు తెలిపారు. పథకాలను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిధులు ఇతర సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధించాలి జిల్లాలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి విద్యాశాఖాధికారులను ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతిలో గత మూడేళ్లుగా రాష్ట్ర స్థాయిలో జిల్లాను ప్రధమ స్థానంలో నిలిపారని, అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా ప్రధమ స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. విద్యా ప్రమాణాలను పెంచేందుకు, సమగ్ర ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు నూతన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. ముస్తాబు కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలన్నారు. చదువుతో పాటు ఆరోగ్యం, మానసిక ఉల్లాసం కోసం ఆనందలహరి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. జేసీ యశ్వంత్‌కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, డీఈవోబి.రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆకాంక్షిత జిల్లాలలో పార్వతీపురానికి 5వ ర్యాంకు ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమంలో జాతీయ స్థాయిలో పార్వతీపురం మన్యం జిల్లా 5వ ర్యాంకులో నిలిచిందని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. అద్భుతమైన పనితీరును కనబరిచి మార్చి 2025లో వున్న 93వ డెల్టా ర్యాంక్ నుంచి జాన్ 2025 నాటికి 4వ డెల్టా ర్యాంకుకు చేరిందన్నారు. జిల్లా యొక్క కాంపోజిట్ స్కోర్ 50.2 నుంచి 70.3కు పెరిగిందని, ఇది ఏడీపీలోని ఐదు ప్రధాన అంశాలలోనూ గణనీయమైన పెరుగుదలను ప్రదర్శించిందన్నారు. జిల్లాలో ప్రాధమిక మౌలిక సదుపాయాలు కల్పనలో మొదటి ర్యాంకును సాధించిందన్నారు. విద్య, ఆర్థిక చేరిక, నైపుణ్యం, ఆరోగ్యం, పోషకాహరం, వ్యవసాయం, నీటివనరులు, అభివృద్ధి రంగాలల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి సహకార, పోటీ సమాఖ్య వాదానికి జిల్లా కొత్త బెంచ్‌మార్క్ నెలకొల్పాయని వివరించారు. -
ఆకతాయిలపై డేగకన్ను
పార్వతీపురం రూరల్: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ఆధునిక అస్త్రాన్ని ప్రయోగించారు. ఎస్పీ ఎస్వీ మాధవ్‌రెడ్డి ఆదేశాల మేరకు, ఏఎస్పీ మనీషా రెడ్డి పర్యవేక్షణలో శక్తి టీమ్స్ శుక్రవారం డ్రోన్ల సాయంతో విస్తృత నిఘా చేపట్టాయి. బస్టాండ్లు, మార్కెట్లు, కళాశాల ప్రాంగణాల వంటి రద్దీ ప్రదేశాలతో పాటు, జనశక్తి కాలనీ అవుట్స్కట్స్, కొత్తవలస రైల్వేస్టేషన్, అమరావతి లేఅవుట్లలో డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టారు. దీనివల్ల గంజాయి సేవించే హాట్స్పాట్లు, పేకాట స్థావరాలను తక్షణమే గుర్తించి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశారు. పాఠశాలలు, కళాశాలల వద్ద ఈవ్ టీజింగ్‌ను నిలువరించి, ఆకతాయిలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అదే విధంగా, ప్రజలకు, విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, పోక్సో చట్టాలు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల దుష్ఫలితాలపై అవగాహన కల్పించారు. ఆపదలో డయల్ 112, 1930, 1972 సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. -
డిజిటల్ అసిస్టెంట్‌పై దాడి
వంగర: మండల పరిధి శ్రీహరిపురం గ్రామానికి చెందిన డిజిటల్ అసిస్టెంట్ బోనెల మహేష్‌బాబుపై అదే గ్రామానికి చెందిన శెట్టి అప్పలనాయుడు దాడికి పాల్పడినట్టు ఎస్సై షేక్ శంకర్ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో విధుల్లో ఉన్న సమయంలో ఓబీసీ సర్టిఫికెట్ కోసం అప్పలనాయుడు సచివాలయానికి వెళ్లాడు. కొంత సమయం పడుతుందని డిజిటల్ అసిస్టెంట్ సమాధానం ఇవ్వడంతో ఒకింత అసహనానికి గురైన అప్పలనాయుడు డిజిటల్ అసిస్టెంట్‌ను చేతితో కొట్టి దుర్భాషలాడాడని, విధులకు ఆటంకం కలిగించినట్టు ఎస్సై తెలిపారు. ఈ విషయంపై మహేష్‌బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. -
ఖాకీ కుటుంబానికి.. భరోసా..!
● రైలు ప్రమాద మృతుడు మల్లేశ్వరరావు కుటుంబానికి రూ.75 లక్షల బీమా ● పిల్లల చదువులకు పెద్దపీట వేయాలి : ఎస్పీపార్వతీపురం రూరల్: విధి నిర్వహణలో విగతజీవిగా మారిన కానిస్టేబుల్ కుటుంబానికి పోలీస్ శాఖ కొండంత అండగా నిలిచింది. విధి వక్రంచినా.. శాఖ విస్మరించదని నిరూపిస్తూ, మరణించిన కానిస్టేబుల్ మల్లేశ్వరరావు కుటుంబానికి ఎస్బీఐ పోలీస్ సాలరీ ప్యాకేజీ(పీఎస్పీ) ద్వారా మంజూరైన రూ.75 లక్షల బీమా చెక్కును ఎస్పీ ఎస్వీ మాధవ్‌రెడ్డి శుక్రవారం అందజేశారు. గత అక్టోబర్‌లో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో రైలు ప్రమాదానికి గురై కానిస్టేబుల్ మల్లేశ్వరరావు మరణించిన విషయం విదితమే. ఇంటి పెద్దను కోల్పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి, ఎస్బీఐ అధికారులతో మాట్లాడి బీమా సొమ్ము త్వరితగతిన అందేలా ఎస్పీ చొరవ చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోయిన ప్రాణాన్ని తిరిగి తేలేకపోయినా, ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం మా బాధ్యత అని ఉద్ఘాటించారు. వచ్చిన సొమ్మును వృథా చేయకుండా, పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయాలని మల్లేశ్వరరావు సతీమణి శ్రావణికి సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ థామస్ రెడ్డి, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ బి.భూషణ్ సాహు తదితరులు పాల్గొన్నారు. -
ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 23 వినతులు
సీతంపేట: సీతంపేట ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు 23 వినతులు వచ్చాయి. ఏపీవో జి.చిన్నబాబు అర్జీలు స్వీకరించారు. బీఎస్సీ నర్సింగ్ కోర్సు చేయడానికి ఆర్థిక సాయం అందించాలని పరుసరాంపురానికి చెందిన హేమలత తెలిపారు. బుడార్సింగికి చెంది న లక్ష్మీకాంతం హౌసింగ్ బిల్లులు చెల్లించాల న్నారు. ఆటో, మేకల లోన్ ఇప్పించాలని పీవీఈతమానుగూడ గ్రామస్తుడు దాసు కోరా రు. పెదరాజపురానికి చెందిన చిన్నసొంబురు కోళ్ల ఫారం పెట్టుకోవడానికి రుణం మంజూరు చేయాలని విజ్ఙప్తి చేశారు. కురసింగికి చెందిన బి.కావ్య పాలకొండ ఏరియా ఆస్పత్రిలో నర్స్ పోస్టు కావాలని దరఖాస్తు చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు పెంపు విజయనగరం అర్బన్: రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితి మరో రెండు నెలలు పాటు డిసెంబర్ 1 నుంచి జనవరి 31, 2026 వరకు లేదా కొత్త కార్డులు జారీ ప్రక్రియ చేయడం గానీ ఏది ముందు జరిగితే అప్పటి వరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కేఎస్ విశ్వనాథన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం నవంబర్ 30 నాటికి అక్రిడిటేషన్ కార్డులు కలిగిన పని చేయుచున్న పాత్రికేయులకు మాత్రమే మరో రెండు నెలలు పాటు డిసెంబర్ 1, 2025 నుంచి జనవరి 31, 2026 వరకు ఈ పొడిగింపు సౌకర్యం వర్తిస్తుందని సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు తెలిపారు. పార్వతీపురం: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో రెండు నెలలు గడువును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అక్రిడిటేషన్ల గడువు ఈ నెల 30తో ముగియనున్న తరుణంలో డిసెంబర్ 01, 2025 నుంచి జనవరి 31, 2026 వరకు లేదా కొత్తకార్డులు జారీ ప్రక్రియ చేయడంగానీ ఏది ముందు జరిగితే అప్పటి వరకు పొడిగింపు ఉత్తర్వులు అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం అక్రిడిటేషన్లు వున్న వారికి మాత్రమే పొడిగింపు నిబంధన వర్తిస్తుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. యువకుల మధ్య కొట్లాట పాలకొండ: పట్టణంలోని గాయత్రి దేవి ఆలయ సమీపంలో శుక్రవారం సాయంత్రం యువకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. రెండు గ్రూపులకు చెందిన యువకులు మధ్య ఉన్న విభేదాలు కొట్లాటకు దారి తీశాయి. ఇందులో కోటిపల్లి గ్రామానికి చెందిన ప్రదీప్‌కు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి ట్రైనీ ఎస్సై హేమలత తెలిపిన వివరాలు.. రెండు గ్రూపులకు చెందిన యువకుల మధ్య వివాదం గొడవకు దారి తీసిందని తెలిపారు. ఈ గోడవలో మండలంలోని కోటిపల్లి గ్రామానికి చెందిన ప్రదీప్‌కు గాయాలు కాగా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని వివరించారు. తనను రాంబాబు అనే యువకుడు గాయపరిచినట్టు తెలిపారని దీనిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ గొడవ వద్దని సర్ది చెప్పిన పట్టణానికి చెందిన గణపతికి చేతిపై కూడా గాయం అయిందని తెలిపారు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసును పరిశీలిస్తున్నామని వివరించారు. పాము కాటుతో ముగ్గురికి అస్వస్థతసీతంపేట: మండలంలోని పలు గ్రామాలకు చెందిన ముగ్గురు శుక్రవారం పాముకాట్లకు గురై స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేరారు. పొంజాడకు గ్రామస్తురాలు సవర సుభాషిణి, బుడగరాయికి చెందిన సవర లక్ష్మి, ముత్యాలుకు చెందిన సవర గంగమ్మకు పాము కాట్లు వేయడంతో స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్టు సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు తెలిపారు. -
రాత్రి వేళల్లోనే నిత్యం కలప రవాణా!
● అక్రమంగా తరలిస్తున్నది అటవీ కలపేనా? బొబ్బిలి: పార్వతీపురం మన్యం జిల్లాలోని మక్కువ, సీతానగరంతో పాటు బొబ్బిలి అటవీ ప్రాంతం నుంచి కలపను శుక్రవారం రాత్రి గుట్టుగా తరలించారు. అధికారులు ఉండని సమయం కావడంతో అక్రమార్కులు నిశ్చింతగా బొబ్బిలి పట్టణ నడిబొడ్డులో రవాణా చేస్తున్నారు. పాత బొబ్బిలి భైరి సాగరం చెరువు గట్టు మీదుగా కలపతో నిండి ఉన్న వాహనాలు తరలిపోయాయి. నిత్యం రాత్రి వేళల్లో ఇలా తరలిస్తున్నారు. ట్రాక్టర్లు, నాటు బళ్లతో వీటిని తరలిస్తున్నారు. సమీపంలోని సా మిల్లులు, రాజాం ప్రాంతంలోని మిల్లులకు వీటిని తరలిస్తున్నారు. వీటికి అనుమతులు లేకపోవడం వలన పగలైతే అధికారులు ప్రశ్నించి సీజ్ చేస్తారనే భయంతోనే వీటిని రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారు. అక్రమార్కులు ముందుగా కానీ లేదా కలప తరలిస్తున్న వాహనాల వెనుకగాని వెళ్తూ చేరాల్సిన ప్రాంతానికి బహిరంగంగానే తరలిస్తున్నారు. రాత్రి వేళ అయితే దర్జాగా వెళ్లొచ్చనే ఉద్దేశంతో అక్రమార్కులు తెగిస్తున్నారు. ఇప్పటికే బొబ్బిలి మండలంలోని చింపుకొండ చుట్టుపక్కల ఉన్న అటవీ విస్తీర్ణం నుంచి వీటిని తరలించుకుపోతున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా మైదానంలా తయారైంది. ఇప్పుడు ఉన్న కొద్దిపాటి చెట్లను కూడా తరలిస్తున్నారు. టేకు, మద్ది, నేరేడు, పనస వంటి కలపతో అక్రమార్కులు సులువుగా డబ్బు అర్జిస్తున్నారు. అటవీ అధికారులు స్పందించడం లేదని కొందరు, లేదు వారికి తెలియకుండా ఈ అక్రమ రవాణా జరగదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక ఫారెస్ట్ గార్డును సంప్రదించబోగా ఫోన్ స్విచ్ ఆఫ్‌గా వస్తోంది. -
మాయిశ్చరైజర్.. మిషన్ల కొనుగోలులో మతలబు
పాలకొండలో ఓ రైస్ మిల్లుకు అధికారులు అందజేసిన మాయిశ్చరైజర్ మిషన్ మిల్లరుకు ఇచ్చిన మాయిశ్చరైజర్ మిషన్ బిల్లువీరఘట్టం/పాలకొండ: మాయిశ్చరైజర్ మిషన్లలో ధాన్యంలో తేమ శాతం లెక్కిస్తారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు రైతు సేవా కేంద్రాల సిబ్బంది ఈ మిషన్లతో ధాన్యంలో తేమ శాతం ఎంత ఉందో గుర్తిస్తారు. తేమ శాతం 17 కంటే ఎక్కువ ఉంటే ఆ ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాత ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. ఆర్ఎస్కేలు తేమ శాతం పరిశీలించిన తర్వాత వారు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మర పట్టించేందుకు సమీపంలో ఉన్న మిల్లుకు ట్యాగ్ చేసి పంపిస్తారు. మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని మర పట్టించిన తర్వాత సీఎంఆర్ రైస్ పేరిట మరలా ప్రభుత్వానికి మిల్లరు బియ్యాన్ని అందజేస్తారు. అయితే ఆర్ఎస్కే సిబ్బంది పరిశీలించి కొనుగోలు చేసిన ధాన్యం మిల్లుకు పంపించేటప్పుడు అక్కడ మిల్లరు ఎక్కడా ధాన్యం తేమ శాతం చూడాల్సిన పని లేదు. కానీ ప్రతీ మిల్లు వద్ద కచ్చితంగా మాయిశ్చరైజర్ మిషన్లు ఉండి తీరాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రతీ మిల్లరుకు ప్రభుత్వం సూచించిన కంపెనీ నుంచి మాయిశ్చరైజర్ మిషన్లు కొనుగోలు చేసి ఇస్తామని హుకుం జారీ చేశారు. ప్రతీ మిల్లరు వద్ద రూ.30 వేలు వసూలు చేసి మాయిశ్చరైజర్ మిషన్లు అందజేశారు. అయితే ఈ మిషన్లు అంత ఖరీదు ఉండవని మిల్లర్లు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఏం జరిగింది... ప్రస్తుతం ధాన్యం కొనుగోలు సీజన్ కావడంతో ఽ ప్రభుత్వం నుంచి ధాన్యం వస్తే మర పట్టించేందుకు ముందు ప్రతీ మిల్లరు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలి. బీజీలు ఇచ్చిన మిల్లులకు ప్రభుత్వం ఽరైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇస్తుంది. అందుచే ప్రతీ మిల్లు వద్ద మాయిశ్చరైజర్ మిషన్ ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే మిల్లరు తనకు నచ్చిన మాయిశ్చరైజర్ మిషన్ కొనుగోలు చేసుకోవడానికి వీలు లేదు. పౌర సరఫరాల శాఖ అధికారులు ఇచ్చిన మిషన్ మాత్రమే తీసుకోవాలని హుకుం జారీ చేశారు. అందుకుగాను రూ.25,100 మిషన్ ఖరీదు, 18 శాతం జీఎస్టీ కింద రూ.4512లు, సర్వీసు చార్జ్ కింద రూ.388లు కలుపుకుని మొత్తం రూ.30 వేలను మిల్లర్లు అందరి నుంచి పౌర సరఫరాల శాఖ అధికారులు వసూలు చేశారు. ఇలా జిల్లా మిల్లర్లు నుంచి తమ అనుయాయులకు మాయిశ్చరైజర్ మిషన్లు ద్వారా సుమారు రూ.26 లక్షలను కట్టబెట్టారని పౌర సరఫరాల శాఖ అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి కొందరి వద్ద పాత మాయిశ్చరైజర్ మిషన్లు ఉన్నప్పటికీ, కొత్తవి తీసుకోవాలని అధికారులు ఆదేశించడంతో మిల్లర్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మిషన్లు కొనుగోలు చేశామంటున్నారు.ప్రభుత్వ నిర్ణయమిది ప్రతీ మిల్లు వద్ద ఒకే కంపెనీకి చెందిన ఒకే రకమైన మాయిశ్చరైజరు మిషన్లు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మాకు వచ్చిన మిషన్లు మిల్లర్లకు అందజేశాం. ఇందులో ఎటువంటి లోపాయికారి ఒప్పందాలు లేవు. మిషన్లు అన్నీ పారదర్శకంగా కొనుగోలు చేశాం. ఇందులో మిల్లర్లు అపోహలు చెందవద్దు. – కె.శ్రీనివాసరావు, జిల్లా పౌర సరఫరాల శాఖ డిపో మేనేజర్, పార్వతీపురం మన్యం నోరు మెదపలేకపోతున్న మిల్లరు... తమ వద్ద రూ.30 వేలు తీసుకుని ఇచ్చిన మాయిశ్చరైజర్ మిషన్లు అంత ఖరీదు ఉండవని మిల్లర్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అయితే ధాన్యం సీజన్ కావడంతో పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్పినట్టు వినకపోతే ఇబ్బందులు వస్తాయనే భయంతో వారు అడిగినంతా ఇచ్చేసి వారు ఇచ్చిన మాయిశ్చరైజరు మిషన్లు తీసుకున్నామని మిల్లర్లు పేర్కొంటున్నారు. -
ప్రమాద కేసులను త్వరితగతిన పరిష్కరించాలి : కలెక్టర్
విజయనగరం అర్బన్: జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాద కేసులను త్వరగా పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి ఆదేశించారు. ప్రమాదాలు చోటు చేసుకుంటున్న బ్లాక్ స్పాట్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రమాదానికి కారణాలు గుర్తించి నివారణా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి ఈ మేరకు పలు సూచనలు ఇచ్చారు. జిల్లాలో 25 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని వాటిని పరిశీలించి తగుచర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలను నమోదు చేసి ఐరాడ్ యాప్ గురించి సుదీర్ఘంగా చర్చించారు. యాప్‌లో పలు మార్పులు చేయాల్సి ఉందని దీని కోసం ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. అలాగే యాప్‌లో ఉన్న పెండింగ్ కేసులపై దృష్టి సారించి వాటిని క్లియర్ చేసేందుకు ఆయా శాఖలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కమిటీ చర్యలు మజ్జి అప్పారావు మాట్లాడుతూ ఎత్తు బ్రిడ్జి డౌన్ నుంచి తోటపాలెం వేళ్లే రహదారిలో నాలుగు కళాశాలలు ఉన్నాయని, విద్యార్ధులు రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ స్వీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని, అలాగే రైతు బజారు దగ్గర కూడా స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని కోరాతూ వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ నల్లనయ్యను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ సౌమ్యలత, ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమణి, డీటీసీ మణికుమార్, డీఎంహెచ్‌వో డాక్టర్ జీవనరాణి, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మశ్రీరాణి, పీఆర్ ఎస్ఈ శ్రీనివాసరావు, ఐరాడ్ మేనేజర్ శ్రీధర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
చంద్రబాబు మాటలేమయ్యాయి..?
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి బాధిత మహిళకు అండగా ఉండాల్సింది పోయి, బాధించిన వా డికి అండగా నిలవడం దారుణమని వైఎ స్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. మంత్రి కుమారుడు పృథ్వీ, పీఏ మీద ఎస్పీకి మూడు పేజీల ఫిర్యా దు ఇచ్చినా కనీస చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. ఆడబిడ్డ మీద ఎవరైనా చెయ్యివేస్తే అదే చివరి రోజు అవుతుందని చెప్పిన సీఎం చంద్రబా బు మాటలేమయ్యాయని ప్రశ్నించారు. ఎక్కడైనా మహిళలకు అన్యాయం జరిగితే తాట తీస్తాం.. తోలుతీస్తామన్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ గొంతు మూగబోయిందా అని ప్రశ్నించారు. సహచర మంత్రి పీఏ ఇలా చేస్తే హోం మంత్రి మహిళగా ఏం చేస్తోందని నిలదీశారు. సత్యసాయి జిల్లాలో అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగానికి రిజైన్ చేయాలని టీడీపీ నేతలు ఒత్తిడి చేశారని, ఆమైపె దాడిచేసి కొట్టిన విషయాన్ని ఆమె సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేసిన సంగతి బయటకు వచ్చినా పట్టించుకోలేదని తెలిపారు. శ్రీకాకుళంలో ఆమె శుక్రవారం సాక్షితో మాట్లాడారు. బాధించే వారంతా టీడీపీ నేతలేనని, టీడీపీ తెలుగు దండుపాల్యం పార్టీలా మారిందని మండిపడ్డారు. హోం మంత్రి పక్క రాష్ట్రానికి వెళ్లి డైలాగులు చెప్పడం కాదని, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రించే చర్యలు చేపట్టాలని కోరారు. ఎస్పీకి రాసిన ఫిర్యాదులో బాధిత మహిళ స్పష్టంగా ఆరోపణలు చేశారని, మంత్రి కొడుకు పృథ్వీ, ఇతర పెద్ద నాయకుల వద్దకు కామవాంఛ తీర్చడానికి పంపించమన్న దురాలోచన నుంచి రక్షణ కల్పించాలని కోరిందని అన్నారు. ఇంత జరుగుతున్నా ఆ పీఏను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఆమెను మంత్రి పదవి నుంచి భర్త్‌రఫ్ చేయాలని, మంత్రి పీఏని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 18 నెలల్లో మహిళలపై జరిగిన క్రైమ్‌రేట్ 4శాతం పెరిగిందని, మహిళలపై జరిగిన రేప్‌లు 9శాతం పెరిగాయన్నారు. మద్యం, గంజాయి, డ్రగ్స్ వాడకం కూడా 21శాతం పెరిగిందని తెలిపారు. -
మత్స్యకారులూ ఖబడ్దార్..!
సాలూరు రూరల్: టీడీపీకి చెందిన ఓ చోటా నాయకుడు మంత్రి, పార్వతీపురం సబ్ కలెక్టర్ సాక్షిగా మత్స్యకారులకు హెచ్చరికలు జారీచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రజాధనంతో కొనుగోలుచేసి రాయితీపై మత్స్యకారులకు అందజేసే చేపపిల్లల వ్యవహారాన్ని రాద్ధాంతం చేశారు. అధికారిక సభను రాజకీయ హెచ్చరిక సభగా మార్చేశారు. మౌతు పట్టుకుని మత్స్యకారులపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఏ నాడు టీడీపీకి ఓటేయరని తెలుసని... అయినా చేప పిల్లలు అందజేస్తున్నామని... ఈ సారి మంత్రి వచ్చేసమయంలో స్వాగతం పలుకకుంటే ఆదాయంలో కోతవేస్తామని, ప్రాజెక్టుల అభివృద్ధికి నిధులు మళ్లిస్తామంటూ అన్నంరాజువలసలో ఈ నెల 19న జరిగిన సభలో హెచ్చరికలు చేశారు. ఇప్పుడు ఇది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మత్స్యకారుల సంక్షేమానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో కృషిచేసిందని, ఏ నాడూ చెప్పకోలేదని, ఇలాంటి హెచ్చరికలు చేయలేదంటూ మత్స్యకారులు చెబుతున్నారు. అధికారం ఉందన్న అహంకారంతో మత్స్యకారులపై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబడుతున్నారు. వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు పరిధిలోని 426 గిరిజన మత్సకార కుటుంబాలు చేపల వేటే ఆధారంగా జీవిస్తున్నాయి. వీరిని ఆదుకునే అంశాలను, ప్రభుత్వం ఇచ్చే రాయితీలను ప్రస్తావించాల్సిన సభలో... హెచ్చరికలు చేయడం... వాటిని మంత్రి ఖండించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడే ఉన్న సబ్ కలెక్టర్... టీడీపీ నాయకుడి వ్యాఖ్యలకు నిశ్చేష్టురాలయ్యారు. మౌ నంగా ఉండిపోయారు. తిరిగి ఐఏఎస్ అధికారిణికి కూడా మాటవినని మత్స్యకారులపై వేధింపు లు కొనసాగించాలంటూ సలహా ఇవ్వడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సారి మంత్రి వస్తున్నారని సమాచారం ఇస్తామని, 426 మత్సకారులు వారి కుటుంబాలతో సహా హాజరుకావాలంటూ హుకుం జారీ చేశారు. లేదంటే ఇంతవరకు లేని రూ ల్ మత్సకారులు చేపలువేట సాగించగా వచ్చిన ఆదాయంలో కొంత సొమ్మును ఇవ్యాలని రూల్ పెడతాం అని బెదిరింపులకు గురిచేసిన విషయం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. -
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలి
● విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ● బాలిక, బాలుర ఆశ్రమ పాఠశాలల సందర్శన పాలకొండ/సీతంపేట/భామిని: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ వి.విజయరామరాజు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పాలకొండ నియోజకవర్గంలోని సీతంపేట గిరిజన సంక్షేమ బాలురు, బాలికల ఆశ్రమ పాఠశాల, భామిని మో డల్ స్కూల్/కాలేజీ, పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శుక్రవారం సందర్శించారు. విద్యార్థుల తో మాట్లాడారు. అభ్యసనా సామర్థ్యాలను పరీక్షించారు. సిలబస్ పూర్తి, సదుపాయాలపై ఆరా తీశా రు. పదో తరగతిలో ఏ ఒక్కరూ ఫెయిల్ కాకూడద ని సూచించారు. మెరుగైన విద్యాబోధన అందించా లని ఉపాధ్యాయులను ఆదేశించారు. వచ్చేనెల 5వ తేదీ నుంచి చేపట్టనున్న మెగా టీచర్స్–పేరెంట్స్‌డే ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యాశాఖమంత్రి నారా లోకేశ్ పాల్గొననున్న కార్యక్రమంపై చర్చించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకరరెడ్డి, పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవార్‌స్వప్నిల్ జగన్నాథ్, ఏపీఓ చిన్నబాబు, డీఈఓ రాజ్‌కుమార్, డిప్యూటీ ఈఓ కృష్ణమూర్తి, ప్రిన్సిపాళ్లు, ఎంఈఓలు, హెచ్ఎంలు పాల్గొన్నారు. -
జీతాల్లేవు.. పోస్టింగులూ లేవు!
న్యాయం చేయండంటూ గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ టీచర్లు ముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రి, గిరిజన సంక్షేమ శాఖమంత్రి, ఎమ్మెల్యేలను పలుమార్లు కలిసి ఏడాది కాలంగా తమ గోడు వినిపిస్తూ వచ్చారు. ఏ ఒక్కరూ వారి సమస్యను పట్టించుకోలేదని, పరిష్కారానికి కనీస చర్యలు తీసుకోలేదని ఆవేదన చెందుతున్నారు. ఏళ్ల తరబడి గిరిజన సొసైటీలో టీచర్లుగా పనిచేస్తున్నాం.. రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్నాం.. న్యాయం చేయండంటూ అభ్యర్థించినా ఫలితం లేకపోయింది. జాతీయ ఎస్టీ కమిషన్‌ను సైతం ఆశ్రయించారు. 45 రోజుల పాటు ఐటీడీఏ ఎదుట రిలేనిరాహార దీక్షలు, ధర్నాలు చేశారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. సీతంపేట: గిరిజన గురుకుల పాఠశాలల్లో పనిచేస్టున్న అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మెగా డీఎస్సీలో పోస్టులను భర్తీ చేయడంతో 1143 మంది టీచర్ల పరిస్థితి దయనీయంగా మారింది. మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగించలేదు.. మీ ఉద్యోగాలు మీరు చేసుకోండంటూ గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి చెప్పుకొస్తున్నా బెంగ వీడడంలేదు. రెండు నెలల నుంచి జీతాలు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అర్థాకలితో అలమటిస్తున్నారు. ఇప్పటికీ ఉద్యోగాలు ఉన్నాయో, ఊడిపోయాయో తెలియక మదనపడుతున్నారు. ఇదీ పరిస్థితి.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులుగా వివిధ కేడర్లలో అవుట్సోర్సింగ్ విధానంలో 1633 మంది పనిచేస్తున్నారు. మెగా డీఎస్సీలో వీరి పోస్టులు కలిపివేయడంతో 1143 మంది రెగ్యులర్ టీచర్లు వారి స్థానంలో విధుల్లో చేరారు. చివరకు అవుట్సోర్సింగ్ టీచర్లంతా గిరిజన మంత్రిని కలిస్తే మీకు ఉద్యోగంలో నుంచి ఎవరినీ తీయలేదని, స్కూళ్లకు వెళ్లి పనిచేసుకోవాలని చెప్పారు. మన్యం జిల్లాలో సుమారు 200ల మంది అవుట్సోర్సింగ్ టీచర్ల ఉద్యోగాలపై సందిగ్దత నెలకొంది. కొందరికి అర్హతను బట్టి స్కూల్స్ నుంచి కళాశాలలకు వర్క్ ఎడ్జ్స్ట్మెంట్ పేరుతో ఇటీవల నియమించారు. ఎవరికీ ఇంతవరకు ఎటువంటి జీతాలు చెల్లించకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు వీరికి అందాల్సిన ప్రభుత్వ పథకాలు కూడా ఆరుదశల విచారణ పేరుతో కోత విధించడం గమనార్హం. -
మట్టిపరీక్షల నివేదికలు రైతులకు అందాలి
పాలకొండ రూరల్: మట్టి నమూనా పరీక్షల నివేదికలు రైతులకు క్షేత్రస్థాయి అందేలా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్ అదనపు డైరెక్టర్ వి.వి.విజయలక్ష్మి శుక్రవారం అధికారులను ఆదేశించారు. పాలకొండ మండ లం పద్మాపురంలో రైతులతో శుక్రవారం మాట్లాడారు. రైతులకోసం ఐదు కార్యాచరణ విధానాలను వివరించారు. ఫార్మర్ యాప్, వ్యవసాయ యాంత్రీకరణ సర్వేయాప్, మట్టి నమూనాల పత్రాల వివరాలను రైతులకు తెలియజేశారు. డైరెక్టర్ వెంట శ్రీకాకుళం జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ సీహెచ్ వెంకటరావు, ఎంఏఓ ఎస్.ఎస్.ఆర్.వి.ప్రసాదరావు ఉన్నారు. పార్వతీపురం: ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల గ్రీవెన్స్‌ను శుక్రవారం నిర్వహించారు. వివిధ శాఖల నుంచి 36 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను సకాలంలో పరిష్కరించేలా అధికారులను ఆదేశించామన్నారు. ప్రత్యేక గ్రీవెన్స్‌తో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో కె.హేమలత, జిల్లా ఖజనా అధికారి ఆర్ఎఎస్ కుమార్, కలెక్టర్ కార్యాలయ హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. వంగర: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు కాంబోతుల రమణ పనితీరుపై చీపురుపల్లి డిప్యూటీ ఈఓ కె.వి.రమణమూర్తి శుక్రవారం విచారణ జరిపారు. ఓ ప్రైవేటు పాఠశాలలో చేరాలంటూ ఉపాధ్యాయుడు సామాజిక మాధ్యమాల్లో చేసిన ప్రచారంపై రేగిడి మండలం చినశిర్లాం గ్రామానికి చెందిన మజ్జి శ్రీనివాసరావు జిల్లా విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిప్యూటీ ఈఓ శుక్రవారం పాఠశాలకు వచ్చి ఫిర్యాదుదారు నుంచి వివరాలు సేకరించారు. సమగ్ర నివేదిక ఉన్నతాధికారులకు అందజేస్తానని తెలిపారు. ఆయన వెంట ఎంఈటో–2 మీసాల కూర్మినాయుడు ఉన్నారు. -
మెగా పీటీఎం స్ఫూర్తిదాయకంగా నిర్వహించాలి : కలెక్టర్
విజయనగరం అర్బన్: రాబోయే డిసెంబర్ 5న జరగనున్న మెగా తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీ య సమావేశాన్ని (మెగా టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో స్ఫూర్తిదాయకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సారి కేవలం ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మాత్రమే ఈ కార్యక్రమం జరగనుందని తెలిపారు. ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులందరూ పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.40 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. పాఠశాలలు పరిశుభ్రంగా ఉండేలా అతిథులు కూర్చోవడానికి ఏర్పాట్లు చేయాలని తల్లిదండ్రులను ఆహ్వానించే విధానం, పిల్లల అకడమిక్ ప్రగతిపై చర్చించే తీరు గురించి వివరంగా సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో స్వాగతోపన్యాసం తర్వాత మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని ఆ తర్వాత విద్యార్థులతో శతక పద్యం లేదా కథ చెప్పించాలని కలెక్టర్ సూచించారు. ఏ విధమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఈవో యూ.మాణిక్యంనాయుడు, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతిశ్రీ, సోషల్ వెల్ఫేర్ డీడీ ఎం.అన్నపూర్ణమ్మ, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్, డిప్యూటీఈవోలు, ఎంఈవోలు తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం దళారుల పాలు
ధాన్యం కొనుగోళ్లలో దళారులు, మిల్లర్లు కీలక పా త్ర పోషిస్తున్నారన్న విమర్శలున్నాయి. రంగు మారిందని.. తేమశాతం ఎక్కువనీ దళారులు రూ. 1,400 నుంచి రూ.1,600 మధ్య రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసుకుంటున్నారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు తెరవక, గత ఏడాది చాలావరకు రైతులు దళారుల బారినపడ్డారు. ప్రస్తుతం కూ డా కోతలు పూర్తయినా ఇంకా కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో తెరుచుకోని పరిస్థితి. జిల్లాలో 2.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. నవంబర్ చివరి వారం వచ్చినా ఇంకా మందకొడిగానే ప్రక్రియ సాగుతోంది. మొక్కజొన్న, పత్తి పంటలదీ ఇదే పరిస్థితి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఆదుకోక, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. -
● ట్రైకార్ ఎం.డి. మణికుమార్ ● డీడీ, ఐటీడీఏ ఏపీఓలపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ
పార్వతీపురం: కలెక్టర్ కార్యాలయంలోని పీజీ ఆర్ఎస్ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రభుత్వ, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులు తమ సర్వీస్‌కు సంబంధించిన ఫిర్యాదులు, పింఛన్, టెర్మినల్ బెనిఫిట్స్, పెండింగ్ విషయాలను విన్నవించేందుకు గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు గ్రీవెన్స్‌సెల్‌కు హాజరుకావాలని సూచించారు. కురుపాం: గిరిజనులను డోలీ కష్టాలు వీడడం లేదు. కురుపాం మండలం ఒబ్బంగి పంచాయతీలోని తోలుంగూడ గ్రామానికి చెందిన మండంగి కంబప్పు అనే వృద్ధుడు తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆయనను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి డోలీలో తోలుంగూడ గ్రామం నుంచి సుమారు మూడు కిలోమీటర్ల మేర మోసుకుని నీలకంఠాపురం పీహెచ్‌సీకి తరలించారు. తోలుంగూడ రోడ్డు అధ్వా నంగా ఉందని, రాకపోకలకు అవస్థలు పడుతున్నామని నాయకులు, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. సీతంపేట: ఆరోపణలు చేసిన వారు తప్పనిసరిగా తగిన ఆధారాలు చూపించాలని ట్రైకార్ ఎం.డి. మణికుమార్ స్పష్టం చేశారు. ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, ఏపీఓ చిన్నబాబు, సూపరింటెండెంట్ దేశ్‌పై వచ్చిన ఫిర్యాదుపై గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం స్థానిక ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ప్రాథమిక విచారణ జరిపారు. వివిధ ఫైళ్లు పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ దళిత సంఘాల సంయక్త మండలి నాయకులు గణేష్, ప్రభాకర్, రాంబాబు, గోవింద్‌లు డీడీపై 7, ఏపీఓపై 12 ఫిర్యాదులు చేశారన్నారు. ఇరువర్గాల నుంచి ఆధారాలు సేకరించి ఫైల్స్ పరిశీలిస్తామన్నారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమపాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, డిప్యుటేషన్లలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు, పాఠశాలల్లో కిటికీలకు మెస్‌లు వేసే క్రమంలో అవకతవకలకు పాల్పడ్డారని, మరికొన్ని ఫిర్యాదులు చేశారన్నారు. డిప్యుటేషన్, బదిలీల ఫైళ్లు పరిశీలించానని, వీటిలో ప్రతిచోట పీఓ సంతకాలు, సూచనలు ఉన్నాయన్నారు. ఫిర్యాదు దారులు విచారణకు హాజరయ్యేందుకు మరోసారి అవకాశం ఇస్తామన్నారు. -
హెల్పింగ్ హ్యాండ్స్ పోస్టర్ ఆవిష్కరణ
పార్వతీపురం: ప్రభుత్వాస్పత్రుల్లో నిరాటంకంగా వైద్య సహాయం అందించేందుకు రూపొందించిన ‘హెల్పింగ్ హ్యాండ్స్’ ప్రత్యేక సేవా కార్యక్రమం పోస్టర్‌ను కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే అమాయకులైన గిరిజనులకు వైద్యసేవలందేలా యువత, విద్యార్థులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులను స్వచ్ఛంద సేవలకు పిలుపునిస్తూ హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమం రూపొందించామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. హెల్పింగ్ హ్యాండ్స్‌లో సహాయకులుగా చేరాలనుకునే వారు తమ పేర్లను ఆస్పత్రివద్ద నమోదు చేసుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్ కోసం ఆర్.శ్యామలరావు (నోడల్ అధికారి) 83330 20050, కె.శ్యామలరావు,(ఆర్ఎంఓ) 99856 11002, డా.నాగశివజ్యోతి( సూపరింటెండెంట్) 96400 53245, జి.నాగభూషణరావు (డీసీహెచ్ఎస్) 98482 77311 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
ఆర్థిక లావాదేవీలపై పోలీసుల ఆరా
● పుట్టగొడుగుల కేంద్రం నిర్వాహకుడిని పిలిపించిన పోలీసులు ● పూర్తిస్థాయిలో దర్యాప్తు పాలకొండ: పాలకొండ నగర పంచాయతీ కేంద్రంగా నిర్వహిస్తున్న పుట్టగొడుగుల కేంద్రంలో జరుగుతున్న ఆర్థిక వ్యవహారాలపై ‘నిరుద్యోగులూ జాగ్ర త్త’ అనే శీర్షికన గురువారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై పోలీసు వర్గాలు స్పందించాయి. పుట్టగొడుగుల కేంద్రం నిర్వాహకుడుని పాలకొండ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. పుట్టగొడుగుల కేంద్రంలో పనిలో చేరిన వారి నుంచి డిపాజిట్ల వసూళ్లపై నిర్వాహకుడిని ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరా తీశారు. ఈ వ్యవహారంపై డిపాజిట్ దారుల తో మాట్లాడి మరో ఆర్థిక నేరం జరగకుండా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని ఎస్ఐ ప్రయోగమూర్తి తెలిపారు. -
రైతు కోసం.. ఏం చేశారనీ!
శుక్రవారం శ్రీ 28 శ్రీ నవంబర్ శ్రీ 2025రైతులపై ప్రీమియం భారం లేకుండా 2019 ఖరీఫ్ నుంచి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉచిత పంటల బీమాను తీసుకువచ్చింది. ప్రతి ఎకరాకు బీమా వర్తించడంతో పంట నష్టం వాటిల్లినప్పుడు రైతులతో పాటు కౌలు రైతులకు పూర్తి పరిహారం అందేది. చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకాన్ని ఎత్తివేసి ప్రీమియం భారాన్ని రైతులపై మోపింది. జిల్లాలో 2.20 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరిగింది. ప్రకృతి విపత్తుల సమయంలో అటు ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వక.. ఇటు బీమా లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇటీవల సంభవించిన మోంథా తుపాను, అకాల వర్షాలు ఖరీఫ్ రైతుకు గట్టి దెబ్బ కొట్టాయి. వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి, అరటి, బొప్పాయి వంటి ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. 33 శాతానికిపైగా నష్టం ఉంటేనే పరిహారం అందిస్తామన్న ప్రభుత్వ నిబంధన అన్నదాతకు శరాఘాతంగా మారింది. -
ఎవడ్రా మనల్ని ఆపేది!
మరోవైపు వరహాలగెడ్డ ఆక్రమణలు, అక్ర మ రిజిస్ట్రేషన్ల విషయంలో సబ్ కలెక్టర్ వైశాలి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న సర్వే నంబర్లు.. తర్వా త ఎవరి ఆధీనంలోకి వెళ్లాయి.. ఎవరె వరి చేతులు మారాయి అన్న వివరాలను సేకరిస్తున్నారు. ఆక్రమణదారులందరికీ నోటీ సులు పంపించి, వివరణ కోరారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన సబ్‌రిజిస్ట్రార్ నుంచి కూడా వివరణ కోరినట్లు తెలుస్తోంది. సాక్షి, పార్వతీపురం మన్యం: వరహాలగెడ్డ ఆక్రమణదారుల్లో దూకుడు తగ్గడం లేదు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారుల నుంచి రక్షించాలని వామపక్ష, ప్రజాసంఘాలు ఎంతగా పోరాడుతు న్నా.. అధికారుల్లో చలనం లేకపోవడంతో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. జిల్లా కేంద్రంలోని సర్వే నంబర్ 410 వరహాలగెడ్డ స్థలం ఆక్రమణ, అక్రమ రిజిస్ట్రేషన్‌పై కొన్నాళ్లుగా వివాదం నడుస్తున్న విషయం విదితమే. అధికారులు ఆ భూమిని చదును చేసి, హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినా ఫలితం లేకపోతోంది. రెండు రోజుల కిందట లోపలికి ఎవరూ వెళ్లడానికి వీలులేనివిధంగా అక్కడ అన ధికార కంచె ఏర్పాటైంది. ఇది గమనించిన వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు బుధవా రం ఆ స్థలంలోకి వెళ్లి, దౌర్జన్యంగా కంచెను తొ లగించారు. పోలీసులు సైతం వచ్చి దీనిని వీడి యో చిత్రీకరించారు. ఆ సాయంత్రానికే మరలా యథాస్థానంలో కంచె వెలిసింది. వివాదంలో ఉన్న స్థలం వద్ద మళ్లీ కంచె వేసి, ఇటు అధికారులకు.. అటు ప్రజాసంఘాల నాయకు లకూ సవాల్ విసిరినట్లయ్యింది. సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న వరహాలగెడ్డ స్థలంలో కంచె నిర్మాణం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు కొల్లి గంగునాయుడు, ఈశ్వరరావు, జీవా, పి.రంజిత్‌కుమార్, గొర్లె వెంకటరమణ, బీవీ రమణ తదితరులు డిమాండ్ చేశారు. కంచె నిర్మాణంలో పట్టణానికి చెందిన వైద్యుడు డాక్ట ర్ రామ్మోహన్రావు పేరు వినిపిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు గురువారం సబ్‌కలెక్టర్ ఆర్.వైశాలిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే గెడ్డ స్థలాన్ని ఆక్రమించి, ఆస్పత్రి నిర్మాణాలు చేపట్టినట్లు ప్రజలు ఆరోపిస్తున్నార ని తెలిపారు. స్వాధీనం చేసుకున్న భూమిలో మొక్కలు నాటే ప్రయత్నం చేసి ఆక్రమణలకు సిద్ధపడుతున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. -
ఘంటసాల జయంతి వేడుకలకు సర్వం సిద్ధం
● ఆహ్వానపత్రికలను ఆవిష్కరించిన కళాపీఠం వ్యవస్థాపకుడు భీష్మారావు విజయనగరం టౌన్: అమరగాయకుడు ఘంటసాల జయంతి ఉత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు ఘంటసాల స్మారక కళాపీఠం వ్యవస్థాపకుడు ఎమ్.భీష్మారావు తెలిపారు. స్థానిక కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. డిసెంబర్ 4, 5 తేదీల్లో రెండురోజుల పాటు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. డిసెంబర్ 4న గుమ్చీ జంక్షన్ వద్దనున్న ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం, పుష్పార్చన, అనంతరం సంగీత కళాశాలలో ఉన్న ఘంటసాల విగ్రహానికి పూలమాలాలంకరణ ఉంటుందన్నారు. డిసెంబర్ 5న ఆనందగజపతి కళాక్షేత్రంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఘంటసాల నిర్విరామ సినీ సంగీత స్వరార్చన ఉంటుందన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించే సభా కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత పెర్కషన్ మాస్ట్రో పద్మశ్రీ డాక్టర్ శివమణికి ఘంటసాల పురస్కారాన్ని ప్రదానం చేస్తామని తెలిపారు. జిల్లాలో తొలిసారిగా అడుగుపెడుతున్న శివమణికి పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఆయన సుమారు గంట సమయం సంగీతంతో విజయనగరవాసులను అలరిస్తారన్నారు. జయంతి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. -
నిరుద్యోగులూ జాగ్రత్త..!
వీరఘట్టం/పాలకొండ/ పాలకొండ రూరల్: నిరు ద్యోగులు, యువతే వారి టార్గెట్. శిక్షణ, ఉద్యోగాల కల్పన పేరుతో వల విసురుతున్నారు. లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. చెక్కులు ఇస్తూ మోసానికి నమ్మకం కలిగిస్తున్నారు. పాలకొండ, వీరఘట్టంలలో వెలసిన కొన్ని పుట్టగొడుగుల కేంద్రాలు అక్రమ డిపాజిట్ల వసూళ్లకు అడ్డాగా మారాయి. దాని యజమానులు.. యువతకు శిక్షణ ముసుగులో ఒక్కొక్కరి నుంచి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.కోటి వరకు డిపాజిట్ల రూపంలో వసూలు చేసినట్టు సమాచారం. వాస్తవంగా ఆర్బీఐ గుర్తింపు పొందిన బ్యాంకులు మినహా ప్రైవేటు వ్యక్తులు ఎలాంటి వసూళ్లకు పాల్పడరాదు. అయితే, ఇక్కడ గొలుసుకట్టు వ్యాపారాల పేరుతో నిరుద్యోగుల నుంచి వసూలు చేస్తున్నారు. పుట్టగొడుగుల కేంద్రాలు నష్టాల్లో ఉన్నా... శిక్షణ కోసం చేరిన వారికి రూ.12వేల చొప్పున నెలకు వేతనం ఇస్తామంటూ ఆశ చూపుతున్నారు. శిక్షణకు చేరాక మరింత మందిని చేర్పించాలని సూచిస్తున్నారు. ఇలా.. అందరి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. దానికి ష్యూరిటీగా పదినెలల తర్వాత చెల్లుబాటయ్యేలా చెక్కులు ఇస్తున్నారు. అవి బౌన్స్ అయితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేదు. శిక్షణకు చేరిన వారి నుంచి వసూలు చేసిన డబ్బులతో శిక్షణ కేంద్రాలు పెంచుతూ రూ.కోట్లు కొల్లగొట్టేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు సమాచారం. మార్కెట్ కూడా అంతంత మాత్రమే.... పాలకొండ, వీరఘట్టం పరిసర ప్రాంతాల్లో పుట్టగొడుగుల మార్కెట్ అంతంత మాత్రంగానే ఉంది. రోజుకు వంద కిలోల దిగుబడి వస్తే కిలో రూ.200 చొప్పున రోజుకు రూ.20 వేలు ఆదాయం వస్తుంది. ఈ లెక్కన నెలకు రూ.6 లక్షలు ఆదాయం వస్తుంది. అయితే ఇక్కడి కేంద్రాల్లో సుమారు 75 మంది పని చేస్తున్నారు. వీరికి నెలకు రూ.12 వేలు చొప్పున జీతం ఇవ్వాలంటే ప్రతీ నెలా రూ.9 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే వచ్చే ఆదాయం కంటే ఖర్చే రూ.3 లక్షలు అధనం. ఏడాది పొడువునా వ్యాపారం జరిగితే సంవత్సరానికి రూ.36 లక్షలు నష్టమే వస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆ పుట్టగొడుగుల కేంద్రాల్లో రోజుకు 20 కిలోలు పుట్టగొడుగు కూడా దిగుబడి రావడం లేదు. ఈ లెక్కన ఈ వ్యాపారం వల్ల నష్టం తప్ప లాభం లేదు. డబ్బులు బలవంతంగా వసూలు చేయడంలేదని, ఇచ్చిన వారి నుంచి తీసుకుంటున్నామన్నది నిర్వాహకుల మాట.డిపాజిట్ల సేకరణ ఒక ఆర్ధిక నేరం.. జాతీయ, రిజర్వ్ బ్యాంకు అనుమతులు ఉన్న సంస్థలే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలే తప్ప అనధికార వ్యక్తులు లేదా ప్రైవేటు సంస్థలు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడం ఆర్థిక నేరం. ఎవరైనా ఇటువంటి డిపాజిట్లు సేకరిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పనిలో, శిక్షణకోసం చేరిన వారి నుంచి డిపాజిట్లు సేకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్న పట్టగొడుగుల కేంద్రాల నిర్వహణపై విచారణ చేపడతాం. – ఎం.రాంబాబు, డీఎస్పీ, రాంబాబు పాలకొండ పుట్టగొడుగుల కేంద్రంలో అనధికార వసూళ్లు పనిలో చేరిన వారిలో ఒక్కొక్కరి వద్ద రూ.50 వేలు నుంచి రూ.1 లక్ష వరకు వసూలు! అదే తరహాలో వీరఘట్టంలో మరో పుట్టగొడుగుల కేంద్రం ఏర్పాటు గొలుసుకట్టు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు నిరుద్యోగులను ఉచ్చులోకి లాగుతున్న దళారులు ఇప్పటికే రూ.కోటి వరకు వసూలు చేసినట్టు సమాచారం -
ప్రపంచంలోనే అతిగొప్పది భారత రాజ్యాంగం
● జేసీ సేతుమాధవన్ ● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం అర్బన్: భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిగొప్పదని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని తెలుసుకోవాలని సూచించారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలను నిర్వహించారు. విజేతలైన 13 మందికి కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం జేసీ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, మెడల్స్‌ను ప్రదానం చేశారు. రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీకి ఎంపికై న మరో 8 మంది జిల్లా విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ యు.మాణిక్యంనాయుడు, పరీక్షల విభాగం ఏసీ టి.సన్యాసిరాజు, అధికారులు, హెచ్ఎంలు పాల్గొన్నారు. భారత సార్వభౌమాధికారానికి ప్రతీక మన రాజ్యాంగం విజయనగరం రూరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం దేశ సార్వభౌమాధికారానికి ప్రతీక అని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెడ్పీ కార్యాలయం ఆవరణలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి జెడ్పీ చైర్మన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 80 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేశాక దేశ ప్రజల కోసం చక్కని రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. ప్రపంచంతో పోటీ పడేందుకు, ప్రగతిపథంలో పరుగులు తీసేందుకు అవసరమైన పవిత్ర గ్రంథాన్ని రచించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని కొనియాడారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బీవీ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే జయమణి, వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు జైహింద్‌కుమార్, ఈశ్వరరావు, రామారావు, కిశోర్, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, జెడ్పీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఎవరి అండ?
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం పట్టణంలోని వరహాలు గెడ్డ ఆక్రమణల వెనుక ఎవరున్నారు?.. రిజిస్ట్రేషన్ అక్రమమని తెలిసినా.. దానిని రద్దు చేసే సాహసం ఎందుకు చేయడం లేదు?.. హెచ్చరిక బోర్డులు పెట్టినా.. దర్జాగా కంచెలు ఎలా వెలుస్తున్నాయి? తమ ఆక్రమణలను కప్పి పుచ్చుకునేందుకు ఎవరినైనా.. ‘కొనేందుకు’ ఆక్రమణదారులు ఏ ధైర్యంతో సిద్ధపడుతున్నారు?.. పట్టణంలోని ప్రతి ఒక్కరిలోనూ మెదలుతున్న ప్రశ్నలు ఇవి. ఇంత జరుగుతున్నా.. అధికారులు ఇంకా వేడుక చూస్తూనే ఉన్నారు. జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న సుమారు రూ.19 కోట్ల విలువైన వరహాల గెడ్డ ప్రభుత్వ భూమి ఆక్రమణకు మున్సిపల్, రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ అధికారులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాల్సిన వీరే.. అక్రమార్కులకు కొమ్ముకాయడం గమనార్హం. మున్సిపల్, రెవెన్యూ అధికారుల డబుల్‌గేమ్ గెడ్డ స్థలాన్ని కలిపేసుకుని విక్రయించిన తర్వాత విషయం బయటకు వచ్చింది. వామపక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వరహాల గెడ్డ భూమి చుట్టూ ట్రెంచ్ ఏర్పాటు చేశారు. ఆ స్థలంలో అది ప్రభుత్వ భూమి అని, ఆక్రమణదారులు శిక్షార్హులని బోర్డు పెట్టి చేతులు దులుపేసుకున్నారు. ఓ వైపు ఈ తంతు జరుగుతుండగానే.. మరోవైపు ఆక్రమణదారులు విషయాన్ని చల్లార్చేందుకు కొంతమందితో ‘డీల్’ కుదుర్చుకోవడం గమనార్హం. ఏ ధైర్యంతో వీరు ఆ ప్రయత్నాలు చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అక్రమంగా చేసిన రిజిస్ట్రేషన్‌ను సైతం అధికారులు రద్దు చేయడం లేదు. దీంతో ప్రభుత్వ భూమికి ఇప్పటికీ రక్షణ లేదన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. వరహాల గెడ్డ సర్వే నంబర్ 410కి సంబంధించిన గెడ్డ పోరంబోకు ప్రాంతాన్ని పూర్తిగా సర్వే జరపాలని, గెడ్డ ఎంత విస్తీర్ణంలో ఉండేదో హద్దులు నిర్ణయించాలని, ఆక్రమిత స్థలంలో నిర్మించిన శాశ్వత కట్టడాలను తొలగించాలని ప్రజాసంఘాలు చేస్తున్న డిమాండ్‌కు ఏ ఒక్కరి నుంచీ స్పందన ఉండడం లేదు.ఎవరైనా ఓ కన్నేయాల్సిందే... వరహాలగెడ్డ ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 410లో ఉంది. గతం నుంచీ ఇక్కడ ఆక్రమణలు జోరుగా సాగుతున్నాయి. మొక్కలు వంటివి సైతం దర్జాగా వేసుకున్నారు. పట్టణానికి చెందిన వ్యాపారికి ఇక్కడ కొంత స్థలం ఉంది. అది అడ్డదిడ్డంగా ఉంది. దీంతో పక్కనే ఉన్న వరహాల గెడ్డ ప్రభుత్వ భూమిపై ఆ వ్యాపారి కన్నేశారు. ఆ స్థలాన్ని కలపకపోతే.. తన స్థలానికి విలువ ఉండదు. మార్గం కూడా మూసుకుపోతుంది. దీంతో ఆక్రమణకు పథకం వేశారు. ఇందుకోసం అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుడి సహకారం తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తం పక్కా ప్రణాళికతో విశాఖపట్నానికి చెందిన లక్కీ షాపింగ్ మాల్ యజమానికి విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారు. తన జిరాయితీ సర్వే నంబర్ 411–9తో ప్రభుత్వ భూమిని కలిపి రిజిస్ట్రేషన్ చేయించారు. మొత్తం 1200 గజాల స్థలాన్ని లక్కీ షాపింగ్ మాల్ యజమానికి రిజిస్ట్రేషన్ చేశారు. ఆక్రమణల క్రమంలో రికార్డుల ట్యాంపరింగ్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. 411 జిరాయితీ సబ్ డివిజన్ 8లోనే దాదాపు 600 గజాల స్థలం ఉంది. ఇది రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుపడదు. ఇదే సర్వే నంబర్ సబ్ డివిజన్‌తో 9తో రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది. -
గిరిజనుల జీవనోపాధి మెరుగుపడాలి
● పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మసీతంపేట: గిరిజనుల జీవనోపాధి మెరుగుకు చర్యలు తీసుకోవాలని పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ, కేంద్ర ప్రభారీ ఆఫీసర్ డాక్టర్ సుజాత శర్మ అధికారులను ఆదేశించారు. సీతంపేట ఏజెన్సీలో ఆమె గురువారం పర్యటించారు. ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రభాకరరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో నిరుద్యోగ యువతకు స్కిల్‌డెవలెప్‌మెంట్ కోర్సులపై అవగాహన కల్పించాలన్నారు. గిరిజనులు పండిస్తున్న అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం ఉండేలా చూడాలన్నారు. ఎఫ్‌పీఓ గ్రూపులకు దీనిపై శిక్షణ ఇవ్వాలన్నారు. ఉపాధిహామీ, ఉద్యానవన, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. వ్యవసాయశాఖ భూసార పరీక్షల ఫలితాల నివేదికలను రైతులకు అందజేయాలన్నారు. ఆదివాసీల ఆరోగ్యం పట్ల ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని కోరారు. సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణులు ఆస్పత్రుల్లో ప్రసవమయ్యేలా చూడాలన్నారు. అన్ని ఆస్పత్రులు 24 గంటల పనిచేసేలా చూడాలన్నారు. ప్రతి పాఠశాలలోనూ మరుగుదొడ్లు ఉండాల్సిందేనన్నారు. వీడీవీకేల ద్వారా జీడి ప్రాసెసింగ్ యూనిట్లు బాగా పనిచేసేలా పర్యవేక్షించాలన్నారు. అనంతరం మెట్టుగూడ జలపాతాన్ని సందర్శించారు. అంతకుముందు భారత రా జ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐటీడీఏలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, జిల్లా వైద్యాశాఖాధికారి భాస్కరరావు, ఏపీఓ చిన్నబాబు, ఈఈ రమాదేవి, జిల్లా హార్టీకల్చర్ ఆఫీసర్ సత్యనారాయణరెడ్డి, డీడీ అన్నదొర, పీహెచ్ఓ ఎస్.వి.గణేష్, తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ కబడ్డీ జట్టు కెప్టెన్‌గా సుమంత్
విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న కబడ్డీ పోటీలకు విజయనగరం జిల్లాకు చెందిన సుమంత్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈనెల 27 నుంచి హర్యానాలో జరగనున్న సబ్ జూనియర్స్ బాలుర అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీల్లో పాల్గొనబోయే ఆంధ్రప్రదేశ్ జట్టుకు నాయకత్వ బాధ్యతలు వహించనున్నాడు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సుమంత్ ఈ అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ కబడ్డీ జట్టు కెప్టెన్‌గా ఎంపికై న సుమంత్‌ను ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు కె. ప్రభావతి, కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా అధ్యక్షుడు రంగారావుదొర, ఆర్గనైజింగ్ కార్యదర్శి నడిపేన లక్ష్మణరావు అభినందించారు. జాతీయ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. జాతీయస్థాయి పోటీలకు రెల్లివలస విద్యార్థిపూసపాటిరేగ: మండలంలోని రెల్లివలస జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల విద్యార్థి జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై ంది. పాఠశాలకు చెందిన ఎనిమిదివ తరగతి విద్యార్థి ఇజ్జరోతు హర్షిణి విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్–14 కబడ్డీ విభాగంలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. పాఠశాల విద్యార్థిని జాతీయస్థాయి పోటీలకు ఎంపికవడంతో హెచ్ఎం బి.శంకర్రావు, ఉపాధ్యాయులు అభినందించారు. డిసెంబర్ 7న స్కాలర్షిప్ పరీక్ష● 28లోగా సీఎస్, డీఓల జాబితా ఇవ్వండి ● డీఈఓ బి.రాజ్‌కుమార్ పార్వతీపురం రూరల్: జిల్లాలో డిసెంబరు 7న నిర్వహించనున్న జాతీయ ఉపకార వేతనాల (ఎన్ఎమ్ఎమ్ఎస్) పరీక్షకు విద్యాశాఖ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. పరీక్ష నిర్వహణలో కీలకమైన చీఫ్ సూపరింటెండెంట్లు(సీఎస్), డీఓల నియామక ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని డీఈఓ బి.రాజ్‌కుమార్ ఆదేశించారు. దీనిపై పార్వతీపురం, పాలకొండ డిప్యూటీ ఈఓలు తక్షణమే స్పందించి, ఈ నెల 28వ తేదీ లోపు ప్రతిపాదనలు పంపాలని గడువు విధించారు. గడువులోగా జాబితాలు పంపకపోతే చర్యలు తప్పవని పరోక్షంగా హెచ్చరించారు. కొమరాడ: మండలంలోని ఉలిపిరి పంచాయతీ అల్లువాడ గ్రామానికి చెందిన బిడ్డిక సతీష్(26)చెట్టుపై నుంచి జారి పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామ సమీపంలో ఉన్నా జీలుగు చెట్టు వద్దకు మంగళవారం సాయత్రం కల్లు తీయడానికి వెళ్లాడని కల్లు తీస్తున్న క్రమంలో చెట్టుపైనుంచి జారి పడిపోవడంతో తలకు త్రీవగాయాలయ్యయి. దీంతో వెంటనే కూనేరు రామభద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారడు ఉన్నారు. ఈ ఘటనపై ఎస్సై కె.నీలకంఠం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్యగజపతినగరం: మండలంలోని భూదేవి పేట గ్రామానికి చెందిన జగ్గినేని గౌరి(42) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గౌరి కాలికి దెబ్బతగలడంతో బాధపడుతూ ఉంది. దీనికి తోడు కొద్ది రోజులుగా కడుపునొప్పితో బాధపడుతూ తాళలేక మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి పురుగు మందు తాగేసింది. దీంతో బంధువులు విజయనగరంలోని సర్వజన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. గౌరి కుమార్తె పూజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
జగనన్న కాలనీలపై వివక్ష తగదు
● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్రేగిడి: పల్లెల్లో పేదల ఇళ్ల నిర్మాణాలకు మూడుసెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఒక్క లబ్ధిదారుకు కూడా సెంటు భూమి ఇవ్వలేదని, మరోవైపు జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై వివక్ష చూపుతోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైఎస్సార్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్ విమర్శించారు. నాయిరాలవలస గ్రామంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి నిర్మాణానికి నిధులు మంజూరు చేశారన్నారు. నేడు చంద్రబాబు ప్రభుత్వం జగనన్న కాలనీలను పూర్తిగా విస్మరించిందన్నారు. జగనన్న కాలనీలను తాము నిర్మించినట్టు చంద్రబాబు డబ్బాకొట్టుకోవడం హాస్యాస్పదమన్నారు. జగనన్న కాలనీలను ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంగా మార్పుచేసి ఇళ్ల నిర్మాణాలకు ఆదేశాలు ఇవ్వడం దారుణమన్నారు. ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను మోసంచేస్తున్న తీరును గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన బుద్ధిచెబుతారన్నారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు టంకాల అచ్చెన్నాయుడు, వంగర ఎంపీపీ సురేష్‌ముఖర్జీ, రేగిడి, వంగర మండల పార్టీల కన్వీనర్లు వావిలపల్లి జగన్మోహనరావు, కరణం సుదర్శనరావు, వన్నలి సర్పంచ్ గార రమణ, పాలవలస ధవలేశ్వరరావు పాల్గొన్నారు. -
పాడి పశువుల్లో సరోగసీ
బొబ్బిలి: పాడిపశువుల్లో సరోగసీ విధానంలో దూడల సంతానోత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె.మురళీకృష్ణ తెలిపారు. స్థానిక డీడీ కార్యాలయంలో విలేకర్లతో బుధవారం మాట్లాడారు. పిండ మార్పిడితో పశువులు చూడికట్టిస్తున్నామని చెప్పారు. రామభద్రపురం, ఆరికతోటల్లోని పశువైద్య కేంద్రాల డాక్టర్లు సరోగసీ విధానంపై శిక్షణ పొందారన్నారు. గిర్, జెర్సీ, ఒంగోలు వంటి జాతులను ఈ ప్రక్రియ ద్వారా అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ఎకరాకు 150 నుంచి 200 టన్నుల దిగుబడి వచ్చే పశుగ్రాస విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. 50 సెంట్ల విస్తీర్ణంలో పశుగ్రాసం పెంచేందుకు రూ.32,998ల వ్యయాన్ని ఉపాధిహామీ నిధుల నుంచి పాడి రైతులకు అందజేస్తామని చెప్పారు. దాణాను 50 శాతం రాయితీపై అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్తగా 1260 గోకులాలను మంజూరు చేస్తామన్నారు. ఆయన వెంట ఏడీ డాక్టర్ ఎల్.విష్ణు ఉన్నారు. ఆర్టీసీ జోనల్ వర్క్‌షాప్‌ను సందర్శించిన జోనల్ చైర్మన్ విజయనగరం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ విజయనగరం జోనల్ వర్క్‌షాప్‌ను బుధవారం ఆ సంస్థ జోనల్ చైర్మన్ సయ్యారీ దొన్నుదొర సందర్శించారు. ఇంజిన్, బాడీ, యూనిట్ విభాగాలను పరిశీలించి సిబ్బంది పని తీరును పరిశీలించారు. అక్కడ ఫ్యూరిఫైడ్ వాటర్ సదుపాయాన్ని ప్రారంభించారు. అనంతరం సిబ్బందినుద్దేశించి మాట్లాడుతూ ఆర్టీసీ విజయనగరం జోన్ అన్ని విభాగాల్లో రాష్ట్రంలోనే ముందంజలో ఉండేలా ఉద్యోగులు కృషి చేయాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో ముందుంటామన్నారు. జీతాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి, విశాఖ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ సుధాబిందు, వర్క్స్ మేనేజర్, స్టోర్స్ అధికారులు, సూపర్వైజర్లు, వర్క్‌షాప్ సిబ్బంది పాల్గొన్నారు. -
మృతుల కుటుంబాలకు అండగా పోలీసుశాఖ
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పని చేస్తూ, రైలుప్రమాదంలో మృతి చెందిన బొబ్బిలి రామకోటి కుటుంబానికి స్టేట్ బ్యాంకు పోలీసు సేలరీ ప్యాకేజ్ ప్రయోజనంగా మంజూరు చేసిన రూ.కోటి చెక్కును ఆయన భార్య సీహెచ్.రమకు ఎస్పీ దామోదర్ బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న పోలీసు ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, అందరికీ స్టేట్ బ్యాంకు పోలీసు సేలరీ ప్యాకేజీని ఇప్పటికే ప్రారంభించామన్నారు. ఈ ప్యాకేజీ ప్రయోజనంలో భాగంగా ఎవరైనా పోలీసు ఉద్యోగి విధి నిర్వహణలో భాగంగా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రూ.1కోటి ఆర్థిక సహాయం ఎస్బీఐ అందించనుందన్నారు. ఇందులో భాగంగా కొత్తవలస పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా బొబ్బిలి రామకోటి పని చేస్తూ, రైలు ప్రమాదంలోఈ ఏడాది ఫిబ్రవరి 2న మరణించాడన్నారు. ఇదే విషయమై స్టేట్ బ్యాంకు అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపగా మరణించిన బొబ్బిలి రామకోటి భార్య రమకు కోటి రూపాయలు మంజూరు చేశారన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎబ్బీఐ రీజనల్ మేనేజరు ఎం.సురేష్ బాబు, ఎస్బీఐ కంటోన్మెంట్ చీఫ్ మేనేజరు పి.రఘురామ్, ఎస్బీఐ ఆర్బీఓ చీఫ్ మేనేజరు విజయకుమార్, ఎస్బీఐ డిపాజిట్స్ మేనేజరు ఒమ్మి వెంకటరావు, డీపీఓ ఏఓ పి.శ్రీనివాసరావు, ఆఫీస్ సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి, ఉషారాణి, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. శ్రీనివాసరావు, పోలీసుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
రూ.4,000 ఇస్తే.. పాస్ గ్యారెంటీ!
చికెన్మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్య పరీక్ష కేంద్రాల్లో దర్జాగా చూసిరాతల పర్వం కొనసాగుతోంది. ఒప్పందం ప్రకారం ముందుగా విద్యార్థుల నుంచి డబ్బు వసూలు చేసి.. వారికి ప్రశ్న పత్రాలను అందిస్తున్నారు. దీంతో కేంద్రాల దగ్గర్లోని జిరాక్స్ కేంద్రాల నుంచి జవాబులను మైక్రో జిరాక్స్‌లు తీయించుకుని అభ్యర్థులు దర్జాగా పరీక్షలు రాస్తున్నారు. విజయనగరం జిల్లా కొత్తవలసలోని ప్రగతి డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో యథేచ్ఛగా సాగుతున్న మాస్ కాపీయింగ్ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏయూ దూరవిద్య కేంద్రం పరిధిలో రెండు రోజుల కిందట పరీక్షలు ప్రారంభమయ్యాయి. కొత్తవలసలోని ప్రగతి డిగ్రీ కళాశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి భారీగా నగదు వసూలు చేసి.. పరీక్షలకు ముందుగానే ప్రశ్నలు అందిస్తోందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.4,000 వసూలు చేసి, వారికి పరీక్షకు ముందే ప్రశ్నపత్రాలు అందిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రశ్నలకు సమాధానాలను మైక్రో జిరాక్స్‌ల రూపంలో సిద్ధం చేసుకుని అభ్యర్థులు పరీక్ష హాలులోకి దర్జాగా వెళుతున్నారు. డబ్బులు చెల్లించిన వారందరినీ ప్రత్యేక గదిలో కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తున్నారు. రాసిన స్లిప్‌లను ఎప్పటికప్పుడు తొలగించేలా పక్కాగా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ అక్రమాల బాగోతం సోషల్ మీడియా సాక్షిగా బయటపడింది. ప్రగతి కాలేజీ ఎదుట ఉన్న ఓ జిరాక్స్ సెంటర్ వద్ద కొందరు విద్యార్థులు డబ్బుల వసూలు, కాపీయింగ్ కోసం చేసిన ఏర్పాట్ల గురించి బహిరంగంగా మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. పరీక్షకు ఒక్కొక్క అభ్యర్థి రూ.4 వేలు చెల్లించినట్టు ఓ అభ్యర్థి చెప్పడం దుమారం రేపింది. ఇందులో స్పష్టంగా డబ్బులు ఇచ్చిన విషయం ప్రస్తావనకు రావడంతో ఏయూ ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. పరీక్ష కేంద్రం తనిఖీ ఈ వ్యవహారంపై ఫిర్యాదులు రావడంతో ఏయూ దూర విద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య అప్పలనాయుడు.. విశ్వవిద్యాలయం నుంచి ప్రత్యేక తనిఖీ బృందాన్ని బుధవారం కొత్తవలసకు పంపించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో ప్రగతి కళాశాల కేంద్రంలో మాస్ కాపీయింగ్ చేస్తున్న ఏడుగురు విద్యార్థులను, ఒకరి బదులు మరొకరు పరీక్ష రాస్తున్న ఒక వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేసి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డైరెక్టర్ తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో నిరంతర పర్యవేక్షణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఏటా ఇదే తంతు.. దూరవిద్యా కేంద్రంలో పరీక్షల తీరు ప్రతి ఏడాది ‘షరా మామూలే’ అన్నట్టుగా సాగుతోందని ఈ వీడియో చూస్తే స్పష్టమవుతోంది. దూర విద్యా పరీక్షలు ప్రైవేట్ కళాశాలల పాలిట కనకవర్షం కురిపిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఏటా మాస్ కాపీయింగ్ జరుగుతున్నా కళాశాలల యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. యథారాజా తథాప్రజా చందంగా పరీక్షల నిర్వహణ కొనసాగిస్తూ కాసులు దండుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుని దూర విద్య ప్రతిష్టను కాపాడాలని విద్యావేత్తలు కోరుతున్నారు. కొత్తవలసలో బయటపడిన మాస్ కాపీయింగ్ దందా ఏయూ దూరవిద్య పరీక్షల్లో వెలుగుచూసిన బాగోతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆకస్మిక తనిఖీలో చూసిరాస్తూ పట్టుబడిన విద్యార్థులు -
భూ సర్వే సక్రమంగా చేయాలి
● డీడీ త్రివిక్రమరావు పాలకొండ రూరల్: భూ సర్వే సమగ్రంగా చేపట్టాలని ఏపీ ల్యాండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) టి.త్రివిక్రమరావు అన్నారు. పాలకొండ మండలం గొట్ట మంగళాపురంలో జరుగుతున్న భూ సర్వే ప్రక్రియను ఆయన బుధవారం పరిశీలించారు. భూ యజమానుల, సంబంధిత రైతుల సమక్షంలో అధికారులు సర్వే చేపట్టాలని సూచించారు. సర్వే వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతన్న ఈ ప్రక్రియ ప్రస్తుతం 48 శాతం జరిగిందని, 2027 డిసెంబర్ నాటికి పూర్తిచేసేలా నిర్దేశించామన్నారు. ఆయన వెంట జిల్లా సర్వేయర్ పి.లక్ష్మణరావు, మండల సర్వేయర్ శ్రీనివాసరావు, సిబ్బంది ఉన్నారు. మహిళలకు రూ.1100 కోట్ల రుణం లక్ష్యం ● డీఆర్డీఏ పీడీ శ్రీనివాస పాణి నెల్లిమర్ల: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు రూ.1100 కోట్లు రుణాలు అందజేయాలన్నది లక్ష్యమని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస పాణి తెలిపారు. నెల్లిమర్ల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం వెలుగు వార్షిక కార్యాచరణ ప్రణాళికపై జిల్లా స్థాయి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా లో మొదటి విడత 10 మండల సమాఖ్యలను, రెండు, 3, 4 విడతల కింద మూడు మండల సమాఖ్యలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఏపీఎం సురేష్ ఆధ్వర్యంలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో వెలుగు–డీఆర్డీఏ అదనపు పథక సంచాలకులు కె.సావిత్రి , జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎ.చిరంజీవి, ఏపీఎం విశ్వేశ్వరరావు, సురేష్, పద్మ, 9 మండలాల ఏపీఎంఎంస్ సీసీలు, అకౌంటెంట్లు పాల్గొన్నారు. సంకిలి చక్కెర కర్మాగారం పరిశీలన రేగిడి: మండలంలోని సంకిలి వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారాన్ని చీపురుపల్లి ఆర్డీఓ సత్యవేణి బుధవారం పరిశీలించారు. కర్మాగారంలో సల్ఫర్ స్టోరేజ్ లైసెన్స్ రెన్యువల్‌కు యాజమాన్యం దరఖాస్తు చేసుకోవడంతో పరిశీలించినట్టు ఆర్డీఓ తెలిపారు. ఆమె వెంట తహసీల్దార్ ఐ.కృష్ణలత, సిబ్బంది ఉన్నారు. -
అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదే
● జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్విజయనగరం లీగల్: మన దేశ రాజ్యాంగం సార్వభౌమ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం అని ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదేనని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఎ.కృష్ణప్రసాద్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం, వరకట్న వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ఫూల్‌బాగ్‌లో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం న్యాయ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చారిత్రక రోజును పురస్కరించుకుని రాజ్యాంగ విలువలు పౌరహక్కులు, బాధ్యతలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం 1946 సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజును రాజ్యాంగ దినోత్సవంగా పాటిస్తున్నామని రాజ్యాంగం చరిత్ర గురించి తెలిపారు. పౌరహక్కులు, బాధ్యతలపై విద్యార్థులకు వివరించారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో యువత పాత్రపై సూచనలు చేశారు. వరకట్న వ్యతిరేక చట్టం 1961వ సంవత్సరం నుంచి అమలులోకి వచ్చిందని, కట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండు నేరాలేనని విద్యార్థులు, సిబ్బందికి తెలిపారు. అనంతరం న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించిన వ్యాసరచన పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ సీవీఆర్ రామ్మూర్తి, టూ టౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, నేచర్ స్వచ్ఛంద సంస్థ మేనేజర్ జి.దుర్గ పాల్గొన్నారు. -
విద్యార్థులకు నవోదయం
వీరఘట్టం: గ్రామీణ ప్రాంతంలో ప్రతిభ ఉన్న విద్యార్థులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందిస్తున్నాయి ఉమ్మడి విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల్లోని కిల్తపాలెం, వెన్నెలవలస జవహర్ నవోదయ విద్యాలయాలు. సామాన్య, మధ్యతరగతి వర్గాల వారికి ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్య దూరమవుతున్న పరిస్ధితుల్లో కార్పొరేట్‌కు దీటుగా ప్రాథమిక స్ధాయి నుంచే విద్యనందిస్తూ విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నాయి. నవోదయలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకుంటుండంతో ఇందులో సీటు కోసం ఏటా పోటీ పెరుగుతోంది. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అర్థవంతమైన బోధన చేస్తూ మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు. నవోదయ విద్యాలయంలో సీటు వచ్చిందంటే చాలు తమ బిడ్డ భవిత బంగారమేనని తల్లిదండ్రులు భావిస్తున్నారు.ఉమ్మడి జిల్లాల్లో విద్యార్థులకు ఒక్కో జవహర్ నవోదయ విద్యాలయంలో 80సీట్లు అందుబాటులో ఉండగా బాలికలకు 30 శాతం సీట్లు, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లు కేటాయిస్తున్నారు.అలాగే మొత్తం 80 సీట్లలో 75 శాతం అంటే 60 సీట్లను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. అయితే 2026–27 విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి ఉమ్మడి విజయనగరం జిల్లాలో 7200 మంది, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 7936 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష విధానం నవోదయ ప్రవేశ పరీక్ష 100 మార్కులకు 80 ప్రశ్నలు ఉంటాయి.రెండు గంటల పాటు పరీక్ష నిర్వహిస్తారు.దివ్యాంగులకు అదనంగా మరో 40 నిమిషాల సమయం ఇస్తారు. అత్యుత్తమ విద్యా ప్రమాణాలు.. నవోదయ విద్యాలయంలో సీబీఎస్ఈ సిలబస్‌తో అత్యుత్తమ విద్యాబోధన అందిస్తారు. సువిశాలమైన ప్రాంగణం, ఆహ్లాదకర వాతావరణం, ఒత్తిడి లేని విద్య, విద్యార్థి కేంద్రీకత అత్యుత్తమ విద్యాబోధన, ఆధునాతన కంప్యూటర్ ల్యాబ్, పోషక విలువలతో కూడిన ఆహారం, మానసికోల్లాసానికి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా, ఎన్సీసీ, తదితర అంశాలను బోధిస్తున్నారు. నిపుణులైన అధ్యాపకులు ఉండడంతో సీబీఎస్ఈ పరీక్ష ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు డిజిటల్ క్లాస్‌రూమ్స్‌లో నిపుణులైన అధ్యాపకులతో విద్యాబోధన అందిస్తున్నారు. అంతా ఉచితమే.. నవోదయ విద్యాలయంలో ప్రవేశం పొందిన విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉచితమే. 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు అత్యుత్తమ విద్యను అందిస్తారు. విద్యార్థుల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆరోగ్య పర్యవేక్షణ కోసం స్టాఫ్‌నర్సులు అందుబాటులో ఉంటారు. ఎంఈఓ కార్యాలయాల్లో హాల్ టికెట్లు.. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వచ్చే నెల డిసెంబర్ 13న ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నవోదయ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 42,ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 32 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హాల్ టికెట్లను విద్యార్థులకు అందుబాటులో ఉంచేందుకుగాను అన్ని మండల కేంద్రాల్లో ఉన్న ఎంఈఓ కార్యాలయాలకు పీడీఎఫ్‌లో పంపించారు.లేదా జవహర్ నవోదయ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. పరీక్షకు ముమ్మర ఏర్పాట్లు విజయనగరం,పార్వతీపురం మన్యం జిల్లాల్లో డిసెంబర్ 13న జవహర్ నవోదయ ప్రవేశ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశా. ఆయా జిల్లాల విద్యాశాఖాధికారుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తాం. ఇందుకు సంబంధించి ఇప్పటికే రెండు జిల్లాల విద్యాశాఖాధికారులతో మాట్లాడాం. హాల్ టికెట్లు ఎంఈఓల వాట్సాప్‌కు పంపించాం.అక్కడి నుంచి ప్రధానోపాధ్యాయులు ద్వారా హాల్‌టికెట్లు పొందవచ్చు. ఆరవ తరగతిలో సీటు సాధిస్తే ఇంటర్ వరకు ఉచిత విద్యాబోధన డిసెంబర్ 13న ప్రవేశపరీక్ష ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు -
సకాలంలో అందని రేషన్
● బస్తాల వేయింగ్‌లో తేడాలు ● తహసీల్దార్ దృష్టిలో పెట్టిన రేషన్ డీలర్లు ● డిసెంబర్ నెలకై నా సకాలంలో అందేనా అని లబ్ధిదారుల ఆందోళనరామభద్రపురం: మండలంలో సకాలంలో రేషన్ సరుకులు డిపోలకు చేరడం లేదని, లబ్ధిదారులకు తాము సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉందని మండల పరిధిలోని రేషన్ డీలర్లు తహసీల్దార్ అజు రఫీజాన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డిపోల డీలర్లతో తహసీల్దార్ బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిసెంబర్ నెలకు సంబంధించి ఈ నెల 26 నాటికి రేషన్ బియ్యం డిపోలకు చేరాల్సి ఉందని ఇప్పటికీ రాలేదని తహసీల్దార్‌తో చెప్పారు. అలాగే వృద్ధులు, మంచం పట్టిన వారికి రేషన్ సరుకులు ఇవ్వాల్సి ఉందని తమవద్ద ఓబీ సరుకులు లేకపోవడంతో లబ్ధిదారులకు ఇవ్వలేకపోతున్నామని పలువురు డీలర్లు చెప్పారు. సకాలంలో రేషన్ ఇవ్వకపోవడం వల్ల లబ్ధిదారులు దుర్భాషలాడుతున్న పరిస్థితి ఉందని వాపోయారు. గోదాం నుంచి వచ్చిన రేషన్ బియ్యం బస్తాల వేయింగ్‌లో తేడాలు ఉంటున్నాయి. ఆ నష్టాన్ని తామే భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. కమీషన్ కూడా సకాలంలో రావడం లేదని తహసీల్దార్ దృష్టిలో పెట్టారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ డీఎంతో మాట్లాడి రేషన్ సకాలంలో ఎందుకు ఇవ్వడం లేదో తెలుసుకుంటానని, డిపోలకు సకాలంలో చేరేవిధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే ఇక నుంచి బియ్యం బస్తాల వేయింగ్‌లో వ్యత్యాసాలు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఏది ఏమైనా లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత మాతో పాటు డీలర్లు, సివిల్స్ సప్లైస్ అధికారులపై ఉందని స్పష్టం చేశారు. లబ్ధిదారుల్లో ఆందోళన నవంబరు నెలలో పేద లబ్ధిదారులకు సకాలంలో సరుకులు పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారు. నవంబరు నెలలో లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం బొబ్బిలి గోదాం నుంచి గత నెల 26వ తేదీ లోపు డిపోలకు సరఫరా అవాల్సి ఉంది. అలాగే అదే నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ లోపు 65 ఏళ్లు పైబడిన వృద్ధులు కదలలేక మంచం పట్టిన వారికి డీలర్లు పంపిణీ చేయాల్సి ఉన్నా అలా జరగలేదు. తుఫాన్ ప్రభావంతో పారాది వేగావతి నదిపై నిర్మించిన కాజ్వే కొట్టుకుపోవడం వల్ల లోడులతో లారీలు రాకపోకలు సాగక తెర్లాం మీదుగా రామభద్రపురం మండల రేషన్ డిపోలకు బియ్యం సరఫరా చేసేందుకు సంబంధిత అధికారులకు ఇబ్బంది కలిగింది. దీంతో ఈ నెల 10వ తేదీ వరకు పూర్తిస్థాయిలో బియ్యం రేషన్ డిపోలకు చేరక లబ్ధిదారులకు డీలర్లు పంపిణీ చేయలేకపోయారు. దీంతో లబ్ధిదారులు కూడా ఇబ్బంది పడి బయట కొనుగోలు చేసి వండుకు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిసెంబర్ నెలకై నా సంబంధిత అధికారులు సకాలంలో రేషన్ బియ్యం సరఫరా చేస్తారో లేదనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో 33 రేషన్ డిపోల పరిధిలో 15083 కార్డు దారులు ఉన్నారు. వారికి 236 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు సకాలంలో బియ్యం డిపోలకు చేరకపోవడం వల్ల వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.వచ్చే నైలెనా సకాలంలో సరఫరా అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. డిసెంబర్ నెలకు సంబంధించి రేషన్ బియ్యం సకాలంలో లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎస్‌డీటీ సాయికృష్ణ తెలిపారు. -
అర్ధరాత్రి తనిఖీలు
నాగావళి తీరంలో పాలకొండ రూరల్: ఉచితం మాటున సాగుతున్న ఇసుక అక్రమ దందాపై అధికారులు కొరడా ఝుళిపించారు. నాగా వళి తీరంలో పాలకొండ, పార్వతీపురం సబ్ కలెక్టర్లు పవర్ స్వప్నిల్ జగన్నాథ్, ఆర్.వైశాలి సోమవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు జరిపారు. మంగళాపురం సమీపంలో నదీ గర్భంలో ఇసుక తవ్వకాల కోసం ఉంచిన జేసీబీని సీజ్ చేశారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారిక పార్టీ నాయకుల అండదండలతో మండలంలోని చిన మంగళాపురం– యరకారాయపురంతో పాటు తీరం వెంబడి పలు గ్రామాల వద్ద నదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై ‘సాక్షి’లో వరుసగా కథనా లు ప్రచురితమయ్యాయి. ఇదే అంశమై బాధిత గ్రామాల ప్రజలు కూడా ఇటీవల అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదుచేశారు. దీనిపై స్పందించిన సబ్ కలెక్టర్ పవర్ స్వప్నల్ జగన్నాథ్ ఆకస్మిక తనిఖీలు చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సెల్లైట్ వెలుగులో దారి చూపిస్తూ.. విధి నిర్వహణలో నిత్యం తలమునకలై ఉండే పవర్ స్వప్నిల్ జగన్నాథ్ (ఐఏఎస్) అక్రమా ర్కుల బరతం పట్టే క్రమంలో విపరీతమైన చలిని కూడా లెక్క చేయకుండా అర్ధరాత్రి చేపట్టిన తనిఖీలను తీర గ్రామాల ప్రజలు స్వాగతించారు. చిమ్మ చీకటిలో కేవలం సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో సబ్ కలెక్టర్‌కు భార్య అయిన మరో సబ్‌కలెక్టర్ వైశాలి దారిచూపిస్తూ విధుల్లో అండగా నిలవడాన్ని చూసి స్థానికులు నివ్వెరపోయారు. ప్రజలకు మంచి చేయడంలో వారు చూపిస్తున్న చిత్తశుద్ధిని ప్రశంసించారు. తనిఖీల్లో ఎస్ఐ కె.ప్రయోగమూర్తి, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు ఎన్ని బాబ్జినాయుడు, పొగిరి కృష్ణమూర్తి, డొంక దాసు, బి.జ్ఞానరావు, పి.నర్సుంహులు నాయుడు, పి.రాజేష్ పాల్గొన్నారు. ఇసుక అక్రమ తరలింపుపై కొరడా ఝళిపించిన సబ్‌కలెక్టర్ రాత్రి 12 గంటల సమయంలో జేసీబీ సీజ్ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలకు ఆదేశాలు -
గంజాయి తరలింపుపై డ్రోన్లతో నిఘా
పార్వతీపురం రూరల్: గంజాయి తరలింపుపై డ్రోన్లతో నిఘా పెట్టాలని, నేరస్తుల ఆస్తులు జప్తు చేయాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి కొత్త చట్టాల ప్రకారం నిర్ణీత గడువులోగా చార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. కొత్త చట్టాల ప్రకారం 60 లేదా 90 రోజుల్లోగా కోర్టుల్లో అభియోగపత్రాలు సమర్పించాలన్నారు. ఏడేళ్లు పైబడి శిక్ష పడే కేసుల్లో క్లూస్ టీమ్ ఆర్ఎఫ్ఎస్ఎల్ నిపుణుల ద్వారా ఆధారాలు సేకరించాలని, ఎన్డీపీఎస్ కేసుల్లో నిందితుల ఆస్తులను జప్తు చేయాలన్నారు. అనంతరం విధుల్లో ప్రతిభ చూపిన సిబ్బందికి ఎస్పీ రివార్డులు అందజేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, పాలకొండ డీఎస్పీ రాంబాబు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి పక్కన నిర్మించిన బాలాలయంలో అమ్మవారు పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్‌లు పూజాదికాలు నిర్వహించారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ కె.శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆటోను ఢీకొట్టిన స్కూటీ● వ్యక్తికి తీవ్రగాయాలు కొత్తవలస: అరకు–విశాఖపట్నం జాతీయ రహదారిపై కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం గ్రామం సమీపంలో గల తాడిపూడి పంప్‌హౌస్ వద్ద మంగళవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదానికి సంబంధించి స్థానికులు, ఏఎస్సై సూర్యప్రకాష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రయాణికులతో ఆటో ఎస్.కోట వైపు వెళ్తుండగా ఎస్.కోట నుంచి స్కూటీపై వస్తున్న వేపాడ మండలం బొద్దాం గ్రామానికి చెందిన ఐ.రాము ఆటోను బలంగా ఢీకొట్టి పక్కకు తుళ్లిపడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగింది. ఆటో ప్రయాణికులు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి 108 వాహనానికి సమాచారం అందజేయగా క్షతగాత్రుడు రామును ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సూర్యప్రకాష్ తెలిపారు. డీడీ కేసుల్లో 25 మందికి జరిమానా ● ఇద్దరికి జైలుశిక్ష విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మద్యం తాగి బైక్‌లు నడుపుతున్న 25 మంది నిందితులకు రూ.10వేలు చొప్పున జరిమానా, ఇద్దరికి జైలుశిక్ష విధిస్తూ విజయనగరం అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.ఎస్.హెచ్ ఆర్ తేజచక్రవర్తి, శ్రీవిద్యలు తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టగా 18 మంది పట్టుబడటంతో కేసులు నమోదు చేసి ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ తేజ చక్రవర్తి వద్ద హాజరు పరచగా అందులో 17 మందికి ఒక్కొక్కరికి రూ. 10వేలు చొప్పున ,మరో నిందితుడికి 5 రోజుల జైలుశిక్ష విధించారు. అలాగే రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు చేయగా 9 మంది పట్టుబడటంతో వారిపై కేసులు నమో దు చేసి ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ విద్య వద్ద హాజ రుపరచగా 8 మందికి రూ.10వేలు చొప్పున జరిమానా, మరో వ్యక్తికి 5 రోజుల జైలుశిక్ష విఽధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్పీ వివరించారు. వృద్ధుడి హత్య కేసులో ముద్దాయికి యావజ్జీవంపార్వతీపురం రూరల్: పాత కక్షల నేపథ్యంలో ఓ వృద్ధుడిని హత్య చేసిన కేసులో ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఎస్పీ ఎస్వీ మాధవ్‌రెడ్డి మంగళవారం మాట్లాడుతూ ముద్దాయికి న్యాయస్థానం శిక్ష ఖరారు చేసినట్లు తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురంలోని గాంధీ సత్రానికి చెందిన లంకకృష్ణ(33) 2019లో స్థానికుడైన సంబాన ఆదినారాయణ (58)ను హతమార్చాడు. పోలీసుల దర్యాప్తులో నేరం రుజువు కావడంతో జిల్లా రెండో అదనపు జడ్జి ఎస్.దామోదరరావు ముద్దాయికి యావజ్జీవ జైలు శిక్షతో పాటు రూ.1,400 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని ఎస్పీ తెలియజేశారు. పకడ్బందీగా ఆధారాలు సమర్పించి ముద్దాయికి శిక్ష పడేలా కృషి చేసిన పీపీలు, పోలీసు అధికారులను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. -
ఆటో, స్కూటీ ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు
నెల్లిమర్ల రూరల్: మండలంలోని ఎంబేరేయగుళ్లు సమీపంలోని రైస్‌మిల్లు వద్ద ఎదురెదురుగా వస్తున్న ఆటో, స్కూటీ ఢీకొన్నాయి. మంగళవారం జరిగిన ఈ దుర్ఘటనలో స్కూటీపై నుంచి వస్తున్న మీసాల అక్షయ, రుంకాన లోకేష్‌లకు తీవ్రగాయాలయ్యాయి. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..గుర్ల మండలానికి చెందిన అక్షయ, లోకేష్‌లు నెల్లిమర్ల మండలంలోని తంగుడుబిల్లిలో జరుగుతున్న అమ్మవారి పండగకు వెళ్లారు. అక్కడి నుంచి స్కూటీపై స్నేహితులను కలిసేందుకు సతివాడలోని ఆదర్శ పాఠశాలకు వెళ్లారు. తిరిగి తంగుడుబిల్లి వెళ్తుండగా ఎంబేరేయగుళ్లు దగ్గరలోని మిల్లు వద్ద ఎదురుగా వస్తున్న ఆటో, వీరి స్కూటీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. రోడ్డుపై గుంతలు తప్పించే క్రమంలోనే ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అక్షయ కాలు విరిగిపోగా లోకేష్ ఎడమ చేయి విరిగిపోయింది. స్థానికుల సహకారంతో 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుడి ఆకస్మిక మృతి
విజయనగరం క్రైమ్: నగరంలోని కణపాకకు చెందిన యువకుడు కల్యాణ రామచంద్రరావు(29) నిద్రలోనే గుండెపోటుతో మంగళవారం మృతిచెందాడు. ఇందుకు సంబంధించి విజయనగరం వన్‌టౌన్ హెచ్‌సీ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కల్యాణ రామచంద్రరావు తండ్రి మృతిచెందడంతో తల్లి స్వీపర్‌గా పీటీసీలో పనిచేస్తూ కొడుకును పోషిస్తోంది. రామచంద్రరావుకు అక్కా,చెల్లెళ్లు ఉండగా వారికి పెళ్లిళ్లు కావడంతో జులాయిగా తిరిగి వ్యసనాల బారిన పడ్డాడు. తల్లి తెచ్చే డబ్బులతో విచ్చలవిడిగా మందు కొడుతూ బాధ్యతారాహిత్యంగా తిరిగేవాడు. ఈ క్రమంలోనే ముందురోజు మద్యం తాగి కణపాకలోని తన ఇంట్లోనే మేడమీదకు వెళ్లి పడుకున్నాడు. తెల్లవారే సరికి తల్లి ఎంతసేపు పిలిచినా పలకకపోవడంతో స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు నిర్ధారించారు. ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముట్టుకుంటే సాక్ష్యం మాయం
● దోషులకు అదే సాయం ● జిల్లాకు 2 కొత్త క్రైమ్ స్పాట్ వాహనాలు ● చక్రాలపై నడిచే ‘ల్యాబ్’లుపార్వతీపురం రూరల్: దొంగతనం జరిగిందని తెలియగానే కంగారులో బీరువాలన్నీ తెరిచి చూడడం..అనుమానాస్పదంగా ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని కదిలించడం..ఆత్రుతతో ఘటనా స్థలమంతా కలియదిరగడం..చాలామంది చేసే పనులివే. కానీ, మనకు తెలియకుండానే మనం చేసే ఈ చిన్న పొరపాట్లు నేరస్తులను రక్షిస్తున్నాయి. బాధితులకు న్యాయం జరగడంలో జాప్యానికి కారణమవుతున్నాయి. నేర పరిశోధనలో ఇప్పుడు శాసీ్త్రయత పెరిగింది. ఇటీవల జిల్లాలో అందుబాటులోకి వచ్చిన ‘క్రైమ్ స్పాట్ వాహనాలు’, ‘క్లూస్ టీం’ పనితీరుపై ప్రజలకు కనీస అవగాహన ఉంటేనే నేరాలను ఛేదించడం సులభమవుతుంది. అసలు ఈ వ్యవస్థ ఏం చేస్తుంది? ప్రజలు ఏం చేయాలి? అనేదానిపై ప్రత్యేక కథనం. మూగ సాక్ష్యాలతోనే నేరస్తులకు సంకెళ్లు ఏ నేరస్తుడైనా సరే నేరం చేసేటప్పుడు ఏదో ఒక చిన్న ఆధారాన్ని కచ్చితంగా వదిలి వెళ్తాడు. దాన్ని పసిగట్టడమే క్లూస్ టీం పని. బీరువా హ్యాండిల్స్, తలుపులు, లాకర్లపై దొంగల వేలిముద్రలను ఈ బృందం రసాయనాలను వాడి వెలికితీస్తుంది. ఘటనాస్థలంలో పడిన రక్తపు చుక్కలు, నిందితుడు వాడిన ఆయుధాలు, పెనుగులాటలో రాలిన వెంట్రుకలు కీలక సాక్ష్యాలుగా మారుతాయి. ఉరివేసుకున్న కేసుల్లో అది ఆత్మహత్యా? లేక హత్య చేసి ఉరివేశారా? అనేది తాడు ముడివేసిన విధానం, మృతదేహం స్థితిని బట్టి క్లూస్ టీం అంచనా వేస్తుంది. జాగ్రత్తే.. న్యాయానికి తొలిమెట్టు పోలీసుల వద్ద ఎంత అత్యాధునిక వాహనాలు, సాంకేతికత ఉన్నా.. నేరం జరిగిన మొదటి గంటలో ప్రజలు ప్రదర్శించే స్పందన మీదే కేసు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ‘క్రైమ్ సీన్’ను ఎంత పవిత్రంగా(పాడు చేయకుండా) ఉంచితే.. నేరస్తుడు అంత త్వరగా పట్టుబడతాడు. చివరిగా మీ ప్రాంతంలో ఏదైనా నేరం జరిగితే..ఆత్రుతను ఆపుకుని క్లూస్ టీం వాహనం వచ్చే వరకు ఆ ప్రదేశాన్ని రక్షించాలి. అదే బాధితులకు చేసే అతిపెద్ద సహాయం.ఈ తప్పులు చేయకండి! దొంగతనం జరిగిన ఇంట్లో వస్తువులను, తలుపు గొళ్లాలను, గ్లాసులను అస్సలు తాకకూడదు. వాటిని తాకిన వారి వేలిముద్రలు పడి, దొంగ వేలిముద్రలు చెరిగిపోయే ప్రమాదం ఉంది. హత్య జరిగిన ప్రదేశంలో గానీ, ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో గానీ మృతదేహాన్ని, పక్కన ఉన్న వస్తువులను కదల్చకూడదు. వస్తువులు పడి ఉన్న తీరును బట్టి నేరం ఎలా జరిగిందో రీ–కనన్స్ట్రక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఘటన జరిగిందని తెలియగానే వందలమంది గుమిగూడి ఆ ప్రదేశమంతా తొక్కేస్తుంటారు. దీనివల్ల నిందితుడి పాదముద్రలు నాశనమవుతాయి. అలాగే డాగ్ స్క్వాడ్ (పోలీస్ కుక్కలు) వాసన పసిగట్టడం కష్టమవుతుంది. ఒకవేళ ఆరుబయట మృతదేహం లేదా ఆధారాలు ఉంటే..వర్షం వస్తే అవి తడవకుండా ప్లాస్టిక్ కవర్లతో కప్పాలి. కానీ వాటిని తాకకుండా జాగ్రత్త పడాలి. -
ఈవీఎంల గోదాం తనిఖీ
పార్వతీపురం రూరల్: పార్వతీపురం పట్టణ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఉన్న ఈవీఎం గోదాంను కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీలో భాగంగా గోదాంను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయన వెంట డీఆర్వో కె.హేమలత, తహసీల్దార్ ఎం.సురేష్ ఉన్నారు. డిసెంబర్ 5న మెగా పేరెంట్–టీచర్ డే● హాజరుకానున్న విద్యాశాఖ మంత్రి లోకేశ్ వీరఘట్టం: రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేనెల 5న మెగా పేరెంట్–టీచర్ డేను ప్రతిపాఠశాలలో నిర్వహించాలని ప్రభుత్వం ఇటీవల విద్యాశాఖ అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఈ కార్యక్రమాన్ని ఓ పండగలా చేపట్టాలని సూచించింది. విద్యార్థి అభ్యసనా సామర్థ్యాలను తల్లిదండ్రులకు తెలియజేయాలని పేర్కొంది. పాలకొండ నియోజకవర్గంలో నిర్వహించే పేరెంట్–టీచర్ డేకు విద్యాశాఖ మంతి నారా లోకేశ్ హాజరుకానున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా ఆర్జేడీ విజయకుమార్, డీఈఓ రాజ్‌కుమార్, పాలకొండ ఉప విద్యాశాఖాధికారి పర్రి కృష్ణమూర్తి వీరఘట్టం జిల్లా పరిషత్ హైస్కూల్, పాలకొండ మండలంలోని ఎం.సింగుపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌తో పాటు భామిని మండలంలోని ఏంపీ మోడల్ స్కూల్‌ను పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణ అనుకూలతలను ప్రభుత్వానికి నివేదించినట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే, లోకేశ్ హాజరయ్యే కార్యక్రమానికి సీఎస్పీ రోడ్డు పక్కనే సుమారు 5 ఎకరాల మైదానం కలిగిన వీరఘట్టం జిల్లా పరిషత్ హైస్కూల్ అనుకూలంగా ఉంటుందని నివేదిక ఇచ్చినట్టు సమాచారం. నేడు ఐటీడీఏలో విచారణ సీతంపేట: స్థానిక ఐటీడీఏలో గతంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ బుధవారం జరగనుందని దళిత ప్రజాసంఘాల జేఏసీ కన్వీనర్ దుర్గాసి గణేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమ బదిలీలు, నిధుల దుర్వినియోగంపై ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ విచాణరకు ఆదేశించారన్నారు. ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు. హెల్త్ సర్వే అడ్డుకున్న కొఠియా పోలీసులుసాలూరు రూరల్: ఏఓబీ వివాదస్పద కొఠియా గ్రామాలైన ఎగువ శెంబిలో ఆంధ్రా హెల్త్ సిబ్బంది సర్వే నిర్వహిస్తుండగా కొఠియా అధికారులు మంగళవారం అడ్డుకున్నారు. అక్కడి గిరిజనులు ఆంధ్రాలో కలిసి ఉంటా మని చెబుతున్నా ఒడిశా అధికారులు మాత్రం ఆంధ్రా అధికారులను అడ్డుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఒడిశా అధికారులు మరింత దౌర్జన్యానికి దిగుతున్నారని ఆంధ్రా సిబ్బంది ఏ పని చేసినా అడ్డుకుంటున్నారని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. -
అండర్–17 ఖోఖో ఆంధ్రా బాలికల జట్టు ఇదే
● విజయనగరం వేదికగా ముగిసిన రాష్ట్ర స్థాయి బాలికల ఖోఖో పోటీలువిజయనగరం: విజయనగరం వేదికగా గత మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ అండర్–17 బాలికల ఖోఖో పోటీలు మంగళవారంతో ముగిశాయి. విజయనగరం విజ్జీ స్టేడియంలో మూడు రోజుల పాటు ఉత్కంఠ భరిత వాతావరణంలో సాగిన పోటీల్లో తూర్పుగోదావరి, చిత్తూరు, విజయనగరం, శ్రీకాకుళం జట్లు మొదటి నాలుగు స్థానాలు దక్కించుకున్నాయి. పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, డీఈఓ యు.మాణిక్యంనాయుడు బహుమతులు ప్రదానం చేశారు. త్వరలో జాతీయస్థాయిలో జరగనున్న పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించే 12 మంది ప్రధాన జట్టుతో పాటు స్టాండ్ బై క్రీడాకారుల జాబితాను నిర్వాహకులు ప్రకటించారు. రాష్ట్ర జట్టులోకి స్థానం దక్కించుకున్న వారిలో డి.నందిని, డి.సత్య, ఎం.కృష్ణవేణి (తూర్పుగోదావరి), జి.దివ్య, సత్యవతి (చిత్తూరు), ఎం.ధనలక్ష్మి, ఎం.అనిత (విజయనగరం), నవ్య (విశాఖపట్నం), ఎం.హారిక (శ్రీకాకుళం), డి.రంగమహాలక్ష్మి (గుంటూరు), ఎన్.నిహారిక (కృష్ణ), హేమలత (కర్నూల్) ఉన్నారు. స్టాండ్‌బై క్రీడాకారులుగా జి.నిత్యశ్రీ (గుంటూరు), సి.అమృత (చిత్తూరు), ఎస్.తేజశ్రీ (శ్రీకాకుళం), పి.శాండి (తూర్పుగోదావరి), జ్యోత్స్న (విశాఖపట్నం) క్రీడాకారులు ఉన్నారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ బాలికల ఖోఖో పోటీలు
● విజేతగా నిలిచిన తూర్పుగోదావరి ● ద్వితీయ స్థానంలో చిత్తూరు జట్టు ● తృతీయ స్థానంలో అతిథ్య విజయనగరం జట్టు ● నాల్గవ స్థానంలో శ్రీకాకుళం జట్టు ● విజేతలకు బహుమతుల ప్రదానం విజయ నగరం: విజయనగరం వేదికగా మూడురోజులుగా ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన 69 వ అండర్–17 స్కూల్‌గేమ్స్ రాష్ట్ర స్థాయి బాలికల ఖోఖో పోటీలు మంగళవారం ముగిశాయి. ఈ పోటీల్లో తూర్పుగోదావరి జట్టు విజేతగా నిలిచింది. ద్వితీయస్థానాన్ని చిత్తూరు జిల్లా జట్టు దక్కించుకుంది. చివరిరోజు మంగళవారం నగర శివారులో గల విజ్జి స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రెండు జట్ల మధ్య ఉత్కంఠంగా, హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో తూర్పుగోదావరి 7 పాయింట్లు, చిత్తూరు 6 పాయింట్లు కై వసం చేసుకున్నాయి. తూర్పుగోదావరి జట్టు క్రీడాకారిణి నందిని అద్భుతమైన ఆటతీరుతో జట్టు విజయంలో కీలక భూమిక పోషించింది. అనంతరం తృతీయ, నాల్గవ స్థానాలకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల జట్ల మధ్య జరిగిన పోటీలో ఇరుజట్లు రెండేసి పాయింట్లు సాధించి టైగా నిలవడంతో టాస్ ద్వారా విజేతను ప్రకటించారు. టాస్ గెలిచిన విజయనగరం జట్టు తృతీయ స్థానాన్ని, నాల్గవ స్థానంలో శ్రీకాకుళం జట్టును ప్రకటించారు. విజేతలకు అభినందనలు పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యంనాయుడు, సీనియర్ ఖోఖో క్రీడాకారులు ఏవీఎన్, ఏపీ పోస్టల్ కబడ్డీ జట్టు కోచ్ పతివాడ.శ్రీనివాసరావు, జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి రాంబాబులు బహుమతులు అందజేశారు. విజేతలను అతిథులు అభినందించారు. జట్టును విజయతీరానికి చేర్చడంలో ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబరిచిన తూర్పుగోదావరి జట్టు క్రీడాకారిణి నందినికి పోస్టల్ కబడ్డీ కోచ్ పి.శ్రీనివాసరావు వెయ్యి రూపాయలు నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ ఖో ఖో,కబడ్డీ క్రీడలకు ప్రసిద్ధి అయిన విజయనగరంలో ఖోఖో బాలికలు పోటీలు ఇక్కడ నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. బాలికల ఆట తీరు మరువలేదని వాఖ్యానించారు. ఇదే స్ఫూర్తిని జాతీయ పోటీల్లో కొనసాగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యా శాఖ మంత్రి యు.మాణిక్యం నాయుడు మాట్లాడుతూ మూడురోజులు పాట శ్రమించి రాష్ట్ర పోటీలను విజయవంతం చేసిన స్కూల్ గేమ్స్ కార్యదర్శులు, వ్యాయామ ఉపాద్యాయులు, సహకరించిన వివిధ క్రీడా సంఘాల నాయకులు అభినందించారు. కార్యక్రమంలో జిల్లా వ్యాయమ ఉపాధ్యాయుల సంఘం నాయకులు ఎల్వీ రమణ, ఎన్.వెంకటనాయుడు, స్కూల్‌గేమ్స్ కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మి, వ్యాయామ ఉపాద్యాయులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో జిల్లాకు పతకాలు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో విజయనగరం జిల్లా క్రీడాకారులు పతకాలు దక్కించుకున్నారు. ఈనెల 22,23 తేదీల్లో విశాఖలో జరిగిన సబ్‌జూనియర్స్, జూనియర్స్ పోటీల్లో గౌడ సాకేత్ 50 మీటర్స్ బ్రీస్ట్ స్ట్రోక్, 100 మీటర్స్ బట్టర్ ఫ్లై, 50 మీటర్స్ ఫ్రీ స్టైల్,100 మీటర్స్ ఫ్రీ స్టైల్లో నాలుగు గోల్డ్ మెడల్స్‌తో పాటు 100 మీటర్స్ బ్రీస్ట్ స్ట్రోక్ లో సిల్వర్ మెడల్ కై వసం చేసుకున్నాడు. అంతేకాకుండా మరో స్విమ్మర్ లెంక గుణవంత్ 50 మీటర్స్ ఫ్రీ స్టైల్, 100 మీటర్స్ ఫ్రీ స్టైల్‌లలో రెండు గోల్డ్ మెడల్స్, 200 మీటర్స్ ఫ్రీ స్టైల్లో ఒక సిల్వర్ మెడల్, 50 మీటర్స్ బట్టర్ ఫ్లై , 50 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్‌లో బ్రాంజ్ మెడల్స్ చేజిక్కించుకున్నాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభతో పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గురాన అయ్యలు, సీహెచ్ వేణుగోపాలరావు, స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి జి.ఆదిలింగం, కోచ్ శ్రీను అభినందించారు. ఈ ఇద్దరు క్రీడాకారులు డిసెంబర్లో హైదరాబాద్‌లో జరగబోయే సౌత్ జోన్ జాతీయ పోటీలకు హాజరుకానున్నారని తెలియజేశారు. -
ఘనంగా సౌతిండియా బాప్టిస్ట్ చర్చి వార్షికోత్సవం
● సెమీ క్రిస్మస్లో పాల్గొన్న రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల పాస్టర్లువిజయనగరం టౌన్: సౌతిండియా బాప్టిస్ట్ చర్చెస్ పదో వార్షికోత్సవాన్ని స్థానిక సిమ్స్ బాప్టిస్ట్ చర్చి ఆవరణలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి పాస్టర్లు అధిక సంఖ్యలో పాల్గొని దైవసందేశాన్ని అందజేశారు. సంఘమిత్ర ఆర్ఎస్.జాన్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్త రాయబారులతో సమావేశం నిర్వహించారు. రెవరెండ్ డాక్టర్ డీజే.నిరంజన్‌బాబు (హనుమకొండ), డాక్టర్ బొంత శామ్యూల్సన్ (హైదరాబాద్) తదితరులు దైవసందేశం ఇచ్చారు. సాయంత్రం విలియం కేరీ డయాస్ వద్ద సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. రెవరెండ్ డాక్టర్ ఎం.రామయ్య (బెంగళూర్) కేక్ కటింగ్ చేశారు. రెవరెండ్ డాక్టర్ ఎస్.ప్రకాష్‌రాజ్ కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో క్రీస్తు సోదరులు పాల్గొన్నారు. -
ఆత్మగౌరవానికి ప్రతీక రాజ్యాంగం
విజయనగరం: భారతీయుల ఆత్మగౌరవానికి భారత రాజ్యాంగం ప్రతీక అని, అత్యంత పవిత్రమైనదని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఎ.కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లాశాఖ అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో గురజాడ పాఠశాలలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సదస్సులో కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మన రాజ్యాంగం సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగమని, ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మనదేనన్నారు. గురుప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ స్వరూప స్వభావాన్ని తెలిపే లిఖిత పత్రం రాజ్యాంగమని పేర్కొన్నారు. రాజ్యాంగమంటే స్వేచ్ఛ, సమానత్వం సోదరభావాలు, మూలస్తంభాలుగా దేశ ప్రజల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షించే సమున్నత ఆశయమని అన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ గోటేటి హిమబిందు, జనవిజ్ఞాన వేదిక జాతీయ నాయకుడు డాక్టర్ కృష్ణాజీ, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ పైలా రమేష్ రాజులు మాట్లాడుతూ అన్ని తరగతుల ప్రయోజనాలు రక్షించే ధృక్పథం మన భారత రాజ్యాంగం కలిగి ఉందన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.సుభద్రాదేవి, న్యాయవాది పీబీఎస్ పవిత్ర, పాఠశాల కరస్పాండెంట్ ఎం.స్వరూప, ప్రిన్సిపాల్ పూడి శేఖర్, రచయిత కాగుపాటి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి -
స్కూళ్లకు ఫోర్టిఫైడ్ రైస్ సరఫరా బంద్?
● రేషన్‌డిపోలకు వెళ్లి తీసుకోవాల్సిందే ● కష్టమంటున్న ఎండీఎం కార్మికులు ● గతంలో నేరుగా పాఠశాలలకే సరఫరాసీతంపేట: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా నేరుగా పాఠశాలలకు ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేసేవారు. ఎటువంటి సమస్యలు లేకుండా సకాలంలో మధ్యాహ్న భోజనం వంటకం దారులు విద్యార్థులకు వండి వడ్డించేవారు. గత నెల నుంచి కూటమి ప్రభుత్వం పాఠశాలలకు సప్లై చేయకుండా రేషన్‌డిపోలకు మాత్రమే పరిమితం చేసి చేతులెత్తేసింది. కుయ్యోమొర్రో అంటూ ఎండీఎం కార్మికులు రేషన్‌డిపోలకు ప్రతి నెలా వెళ్లి పాఠశాలలకు బియ్యం తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. సీతంపేట ఏజెన్సీలో స్కూల్ పాయింట్‌కు వచ్చి ఫోర్టిఫైడ్ రైస్ సప్లై చేయకుండా పాఠశాలకు సమీపంలో ఉన్న రేషన్‌డిపోలో బియ్యం వేస్తున్నారు. దీంతో మధ్యాహ్న బోజనం వంటకం దారులతో పాటు ఆయా పాఠశాలల హెచ్ఎంలకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. పాఠశాలకు దగ్గర్లో ఉన్న రేషన్డిపోకు బియ్యాన్ని పంపించి అక్కడ తీసుకోవాలంటూ సంబంధిత అధికారులు చెప్పడంతో మళ్లీ కథ మొదటకొచ్చిందని వారంతా వాపోతున్నారు. మండలంలో 152 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వాటి పరిధిలో సుమారు 7 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారందరికీ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రతి నెలా 18 నుంచి 22 క్వింటాళ్ల బియ్యం ఆ నెల విద్యార్థుల సంఖ్యను బట్టి వండి వడ్డించడానికి అవసరమవుతాయి. నిబంధనల ప్రకారం ఈ బియ్యాన్ని పాఠశాలలకు సరఫరా చేసి అక్కడ జియోట్యాగింగ్ చేయాల్సి ఉంది. ఈనెల నుంచి అలా కాకుండా రేషన్‌డిపోలో ఈ బియ్యాన్ని ఇచ్చేసి అక్కడి నుంచి తీసుకోవాలని అధికారులు ఆదేశించడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో పాఠశాల యాజమాన్యాలు ఉన్నాయి. బియ్యం రేషన్ డిపోల నుంచి తీసుకోవాలంటే ఆటోలో, ఇతర వాహనాల్లో తేవాల్సి ఉంది. దాదాపు రూ.300 నుంచి రూ.500 వరకు దూరాన్ని బట్టి చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రవాణా చార్జీలు ఎవరిస్తారనేది ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. నెలల తరబడి సక్రమంగా వేతనాలు లేక అవస్థలు పడుతున్న తామెలా తీసుకువస్తామని ఎండీఎం కార్మికులు వాపోతున్నారు. క్వింటాకు రూ.24 మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుందని, పైగా మారుమూల గ్రామాలకు లారీలు, వ్యాన్లు వెళ్లాలంటే కష్టసాధ్యమైన పని అని అందుకే రేషన్‌డిపోల్లో బియ్యాన్ని ఇచేస్తున్నామని అక్కడి నుంచి తీసుకోవాలని సంబంధిత పౌరసరఫరాల శాఖ సిబ్బంది చెప్పుకొస్తున్నారు. కొన్నేళ్లుగా పాఠశాలలకు పంపిణీ చేసి ఇప్పుడు నిలిపివేయడం తగదని పాఠశాల యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. మైదాన ప్రాంతాల్లో పాఠశాలలకు నేరుగా పాఠశాలలకు పంపిణీ చేస్తున్నారు. సీతంపేట ఏజెన్సీలో మాత్రం గత నెల నుంచి నిలిపివేయడం పట్ల ఎండీఎం కార్మికులు, విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తి చెందుతున్నారు. కొద్ది రోజుల కిందట జేసీ,సబ్‌కలెక్టర్‌కు సైతం పిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు. దగ్గర్లో ఉన్న డిపోల్లో అందజేస్తాం లారీలు మారుమూల ప్రాంతాలకు వెళ్లలేకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. సంబంధిత కాంట్రాక్టర్లు గతంలో పనిచేసిన జేసీ దృష్టిలో పెట్టారు. మెయిన్‌రోడ్డు పక్కన ఉన్న హైస్కూల్‌కు మాత్రం నేరుగా బియ్యం సరఫరా చేస్తున్నారు. సీతంపేట, కురుపాం మండలంలోని పలు మారుమూల పాఠశాలలకు ఫోర్టిఫైడ్ రైస్ సప్లై చేయలేని పరిస్థితి ఉన్నమాట వాస్తవమే. రేషన్‌డిపోలకు మాత్రం పంపిణీ చేస్తున్నాం. అక్కడి నుంచి పాఠశాలల యాజమాన్యం తీసుకువెళ్లాల్సి ఉంటుంది. శ్రీవిద్య, సీఎస్‌డీటీ, సీతంపేట -
జెండర్ సమానత్వంపై విస్తృత ప్రచారం తప్పనిసరి
పార్వతీపురం: సమాజంలో సీ్త్ర, పురుషులిద్దరూ సమానమేనని, ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేపట్టాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. జెండర్ సమానత్వం కోసం జాతీయ ప్రచారంలో భాగంగా, మెప్మా, డీఆర్డీఏ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద జరిగిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, సీ్త్ర, పురుషుల సమానత్వంపై పాఠశాల, కళాశాల స్థాయిలోనే విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి గ్రామంలో వీధిలోను ప్రజలకు పూర్తిస్థాయిలో అర్థమయ్యేలా ప్రచారం చేయాలని సూచించారు. ఎక్కడైనా వివక్ష కనిపించినా, ప్రజలు సామాజిక బాధ్యతగా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. అధికారులు కూడా వివక్ష ఉన్నచోట చైతన్యం తీసుకురావాలని ఆదేశించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళలను కలెక్టర్ అభినందిస్తూ, సమాజానికి ఈ సమానత్వ సందేశాన్ని అందించాలని అభిలషించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఎం. సుధారాణి, మెప్మా పీడీ డి.కృష్ణారావు, డా.టి.జగన్మోహన్రావు, మహిళలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి -
డిప్యూటీ తహసీల్దార్ జగన్నాథ రావు మృతి
నెల్లిమర్ల: స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఎన్నికల విభాగం డిప్యూటీ తహసల్దార్గా పనిచేస్తున్న వీవీఆర్ జగన్నాథ రావు (53) విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. నాలుగు రోజుల క్రితం కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తూ తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ కూర్చున్న కుర్చీలోనే ఆయన కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. వెంటనే తొలుత మిమ్స్ ఆసుపత్రికి, తరువాత విశాఖలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు కుటుంబసభ్యులు తరలించి చికిత్స అందజేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. సోమవారం ఆయన మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గంట్యాడ మండలం వసాది గ్రామానికి చెందిన జగన్నాథ రావు ప్రస్తుతం విజయనగరంలోని అయ్యన్నపేట రోడ్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు, 30 సంవత్సరాల క్రితం వీఆర్వో గా రెవెన్యూ శాఖలో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచలంచెలుగా ఎదిగి డిప్యూటీ తహసీల్దార్ స్థాయికి చేరుకున్నారు. జగన్నాథ రావు మరణం పట్ల తహసీల్దార్ కె.శ్రీకాంత్, డిప్యూటీ తహసీల్దార్లు శంకరరావు, సత్యనారాయణ, వీఆర్వోలు, ఎన్నికల విభాగం సిబ్బంది భాస్కర రావు, మహేష్, కార్యాలయ సిబ్బంది తీవ్ర సంతాపం ప్రకటించారు. -
జాతీయస్థాయి కథలపోటీ బహుమతుల ప్రదానోత్సవం
విజయనగరం టౌన్: కీర్తిశేషులు శ్రీ బెహరా వెంకట సుబ్బారావు స్మారక జాతీయస్థాయి కథల పోటీ 2025 బహుమతుల ప్రదానోత్సవం సోమవారం గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆవరణలో నిర్వహించారు. పోటీలకు జడ్జిలుగా సాహితీవేత్తలు మంజరి, పట్నాల ఈశ్వరరావు, వి.వెంకటరావులు వ్యవహరించారు. కథల పోటీల్లో విజేతలకు ముఖ్య అతిథి జయంతి ప్రకాశ శర్మ, గౌరవ అతిథి నాలుగెస్సుల రాజు తదితరులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా బెహరా వెంకట సుబ్బారావు ఔన్యత్యాన్ని, ఆయన రచనలలో గల ఉత్తరాంధ్ర యాస, మానవతావిలువలు, సామాజిక సమస్యల పట్ల వారి రచనల్లో ఇచ్చిన ప్రాముఖ్యతను వక్తలు కొనియాడారు. ఇటీవల విడుదలైన వారి పుస్తకం మధ్యతరగతి మందహాసంలోని 73 కథలు రెండు సీరియల్స్ గొప్పతనం అందరూ తమ సంభాషణలలో చెప్పారు. రచయిత కుమారుడు బెహరా సత్యనారాయణమూర్తి, కలిగొట్ల సన్యాసిరాజుల సౌజన్యంతో జిల్లా రచయితల సంఘం, విశాఖ సంస్కృతి పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా రచయితల సంఘం కార్యదర్శి జీవీ.శ్రీనివాస్, అధ్యక్ష్యుడు కేకే.రఘునందన, సంయుక్త కార్యదర్శి గురుప్రసాద్, పప్పు భోగారావు , దాసరి పద్మ తదితరులు పాల్గొన్నారు. -
బూటకపు ఎన్కౌంటర్లపై వామపక్షాల ధ్వజం
● రౌండ్‌టేబుల్ సమావేశంపార్వతీపురం రూరల్: అడవిలో ‘ఆపరేషన్ కగార్ మోత.. కార్పొరేట్ల దోపిడీకి తెరచాటు రాత..మావోయిస్టుల ఏరివేత సాకుతో ఖనిజ సంపదను కొల్లగొట్టే కుట్ర సాగుతోందని వామపక్ష, ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం పట్టణంలోని సుందరయ్య భవనంలో పోల ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిప్పులు చెరిగారు. సీపీఎం, సీపీఐ, రెడ్‌స్టార్ పార్టీల జిల్లా కార్యదర్శులు గంగునాయుడు, మన్మథరావు, జీవా తదితరులు మాట్లాడుతూ ప్రశించే గొంతులను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ రైతాంగ పోరాటం నుంచి మన్యం వరకు నిర్బంధ కాండనే నమ్ముకున్నారని విమర్శించారు. నేరం రుజువైతే చట్టం శిక్షించాలి తప్ప..తుపాకీ గొట్టమే తీర్పు చెప్పకూడదని హితవు పలికారు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తే రేపటి ప్రజా ప్రళయాన్ని ప్రభుత్వాలు తట్టుకోలేవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీఐటీయూ, ఐద్వా, గిరిజన, ప్రజా సంఘాల నేతలు వై.మన్మథరావు, బీవీ రమణ, లక్ష్మి, పాలక రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలు వెంటనే పరిష్కరించాలి
● కలెక్టర్ ప్రభాకరరెడ్డిపార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో అందిన అర్జీలు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు వివిధ ప్రాంతాల నుంచి 92 వినతులు అందాయి. అర్జీలను స్వీకరించినవారిలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, డీఆర్ఓ కె.హేమలత, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి తదితరులున్నారు. ప్రభుత్వ కార్యాలయాల ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా, మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండేలా చేసేందుకు ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. సోమవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగా కార్యాలయాల ప్రాంగణాలు, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, అందుబాటులో ఉన్న పనికిరాని వస్తువులను, పాతఫైళ్లను వెంటనే డిస్పోజ్ చేయాలని సూచించారు. ప్రతి కార్యాలయంలో ఉద్యోగులు, ప్రజలు వినియోగిం చుకునేందుకు మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండాల న్నారు. ఉన్నతాధికారులు తమ పరిధిలోని కార్యాలయాలను స్వయంగా పరిశీలించి, పనితీరును పరిశీలించి, అవసరమైన సూచనలు అందించాలని కోరారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 4 ఫిర్యాదులు పార్వతీపురం రూరల్: జిల్లా పోలీసుశాఖ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు వచ్చిన ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా విని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఏఎస్పీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఆయన నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లాలో ఉన్న పలు స్టేషన్ల పరిధిలలో నుంచి వచ్చిన నలుగురు ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో ఏఎస్పీ ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. వచ్చిన ఫిర్యాదులు వాస్తవాలు అయినట్లైతే చట్టపరిధిలో చర్యలు చేపట్టి తీసుకున్న చర్యల నివేదికను జిల్లా పోలీసుశాఖ కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ ఎస్సై రమేష్‌నాయుడు, తదితర సిబ్బంది ఉన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 97 వినతులు సీతంపేట: స్థానిక ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 97 వినతులు వచ్చాయి. ఏపీఓ ఎస్వి గణేష్, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఈఈ రమాదేవి అర్జీలు స్వీకరించారు. వన్‌బి అడంగల్ ఇప్పించాలని జగ్గడుగూడకు చెందిన కరువయ్య కోరారు. కోళ్లఫారం పెట్టుకోవడానికి రుణం ఇప్పించాలని మానాపురం గ్రామస్తుడు ఆరిక వినీత్ అర్జీ అందజేశాడు. దుక్కిపశువుల లోన్ ఇప్పించాలని ఎర్రన్నగూడ గ్రామస్తుడు సవర కృష్ణారావు, గ్రామంలో మినీఅంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేయాలని చినవంగర ప్రజానీకం కోరారు. జయపురం గ్రామానికి చెందిన అనిల్‌కుమార్ ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు. కార్యక్రమంలో డిప్యూటీఈఓ రామ్మోహన్రావు, జీసీసీ మేనేజర్ దాసరికృష్ణ, డీఈ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాడతాం
● 18 నెలల్లో ఏ ఒక్కరికై నా కొత్త పింఛన్, ఇల్లు ఇచ్చారా? ● రైతులకు అన్నదాత సుఖీభవలో కోత ● టీడీపీ ప్రభుత్వ తీరును ప్రశ్నించిన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సాలూరు రూరల్: ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి పోరాడుతామని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివారసరావు స్పష్టంచేశారు. మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభు త్వం ఏర్పడిన 18 నెలల్లో ఏ ఒక్క పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. కొత్తగా ఒకరికి కూడా ఇల్లు, పింఛన్ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. అన్నదాత సుఖీవ పథకానికి చంద్రబాబు ప్రభు త్వం కోత పెట్టిందన్నారు. కౌలు రైతులను పూర్తిగా విస్మరించిందని తెలిపారు. గతంలో 18 నెలల కాలంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చి 1.60 లక్షల ఉద్యోగాలు కల్పించారన్నారు. 10 సెంట్లు ఉన్నవారి కి కూడా గతంలో రైతుభరోసా నిధులు జమయ్యేవ ని గుర్తుచేశారు. మన్యంలో విద్యార్థులు మరణిస్తు న్నా ఆదుకునే చర్యలు లేవన్నారు. పేద కుటుంబా ల పిల్లలకు వైద్యవిద్య, ప్రజలకు వైద్యం అందకుండా ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించేందు కు పూనుకున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర సాలూరుకు 100 పడకల ఆస్పత్రి తీసుకొచ్చి పను లు పూర్తిచేస్తే.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం కనీసం ప్రారంభించలేకపోతుందన్నారు. ఇక్కడి మంత్రి చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటీకరణ చేసేయండి ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రైవేటీకరించేందుకు పూనుకున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వం... సీఎం, మంత్రులు, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేల పదవులను కూడా ప్రైవేటీకరణ చేస్తారా అంటూ మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ఎద్దేవా చేశారు. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేని దౌర్భాగ్యం చంద్రబాబునాయుడి ప్రభుత్వానిదేనన్నారు. పత్తి, మొక్కజొన్న పంటను కొనుగోలుచేసేవారు లేక పంటను దళారులకు విక్రయిస్తున్నారన్నారు. చంద్రంపేట రైతులు పత్తిని క్వింటా కేవలం రూ.5వేలకు విక్రయించి రూ.3వేల నుంచి రూ.4వేల వరకు నష్టపోతున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 53.58 లక్షల మంది రైతులకు ఉచిత బీమా ప్రీమియం చెల్లించి విపత్తుల సమయంలో ఆదుకున్న ఘనత జగన్మోహనరెడ్డికే చెందుతుందన్నారు. -
వెచ్చ..వెచ్చగా..!
పార్వతీపురం: చలికాలం వచ్చేసింది. రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఈ నేపఽథ్యంలో మార్కెట్లోకి అందమైన స్వెటర్లు వచ్చేశాయి. రకరకాల రంగులు, ఆకర్షించే డిజైన్లలో ఉత్తరాది వ్యాపారులు తీసుకువచ్చిన ఉన్ని దుస్తుల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. శీతాకాలం కావడంతో సాయంత్రం 6 గంటలకే చలిగాలులు వీస్తున్నాయి. శీతాకాలం వస్తూ వస్తూ జిల్లా వాసులకు వెచ్చని నేస్తాలను తీసుకువచ్చింది. చలిని పారదోలేందుకు ఉన్ని దుస్తులతో టిబెటన్లు ఇక్కడికి వచ్చి వాలిపోయారు. దాదావు వంద రోజుల పాటు ఇక్కడే ఉండి, ఇక్కడి ప్రజలతో మమేకమై తమ వ్యాపారాన్ని సజావుగా చేసుకుని వెళ్లిపోతారు. దేశం కాని దేశం..భాష తెలియదు, అయినప్పటికీ ఇక్కడి ప్రజలు అందిస్తున్న సహకారంతో చాలా ఏళ్లుగా శీతాకాలంలో ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటున్నారు. మన్యంలో చలి అధికం పార్వతీపురం మన్యం జిల్లా అంటేనే చలి ప్రదేశం. ఎక్కడా లేని విధంగా ఇక్కడ చలి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. శీతాకాలం ప్రారంభంలోనే చలి ప్రభావం నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ఉన్ని వస్త్రాలను ఆశ్రయిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన దుకాణాల్లో స్వెట్లర్లు కొనుగోలు -
29న దివ్యాంగుల క్రీడాపోటీలు
● జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావువిజయనగరం: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 29న దివ్యాంగులకు క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు సోమవారం తెలిపా రు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు జిల్లా దివ్యాంగుల శాఖ నేతృత్వంలో నగరంలోని రాజీవ్ క్రీడామైదానంలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈపోటీల్లో 2025 డిసెంబర్ 31 నాటికి 21 సంవత్సరాలలోపు వయస్సు గల చెవిటి, మూగ క్రీడాకారులు పాల్గొనవచ్చని వెల్లడించారు. హాజరైన క్రీడాకారులకు బ్యాడ్మింటన్ క్రీడాంశంలో పోటీలు నిర్వహించనున్నామన్నారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు పోటీల్లో పాల్గొనవచ్చని, మరిన్ని వివరాలకు ఫోన్ 9133773485 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. వివాహిత ఆత్మహత్యరాజాం సిటీ: మాయాప్రపంచానికి ఆకర్షితురాలైన ఓ వివాహిత భర్తను కాదనుకుని ప్రియుడు మాయలో పడి అతని వేధింపులు తాళలేక చివరికి ఆత్మహత్యకు పాల్పడింది. ఫిర్యాదు మేరకు వివరాలను టౌన్ సీఐ కె.అశోక్‌కుమార్ వెల్లడించారు. రాజాం మండలంలోని బాలేరు గ్రామానికి చెందిన సావిత్రికి కొత్తూరు మండలం పారాపురం గ్రామానికి చెందిన ఉర్లాపు గణపతిరావుతో 2009లో వివాహమైంది. వారికి 16 ఏళ్ల కుమారుడు, 14 ఏళ్ల కుమార్తె ఉన్నారు. గ్రామాల్లోకి ఫైనాన్స్ ఇచ్చేందుకు వచ్చిన పాలకొండ స్పందన ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న మన్మథకుమార్ అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం సావిత్రికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో పెద్దల సమక్షంలో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 2023వ సంవత్సరంలో సావిత్రికి మాయమాటలు చెప్పి ఆమెను తీసుకుని వెళ్లి రాజాంలోని సారథి రోడ్డులో మన్మథకుమార్ కాపురం పెట్టాడు. అప్పటి నుంచి ఆమెను శారీరకంగా, మానసికంగా వేధిస్తుండేవాడు. జీవనోపాధి నిమిత్తం సావిత్రి ఓ షాపింగ్ మాల్లో జాయిన్ అయి కుమార్తెను పోషించుకుంటోంది. మన్మథకుమార్ ప్రతి రోజు మద్యం తాగి వచ్చి అనుమానించి హింసిస్తుండడంతో ఈ నెల 23న రాత్రి తన నివాసం ఉంటున్న గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి ధర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
లైంగికదాడి కేసులో ముద్దాయికి 12 ఏళ్ల జైలు
విజయనగరం క్రైమ్: జిల్లాలోని గరివిడి పోలీస్ స్టేషన్లో 2019 లో నమోదైన లైంగికదాడి కేసులో ముద్దాయికి విజయనగరం 5వ ఏడీజే కం మహిళా కోర్టు న్యాయమూర్తి ఎన్.పద్మావతి 12 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.2,000 జరిమానా విదిస్తూ తీర్పు వెల్లడించారని ఎస్పీ ఏఆర్ దామోదర్ సోమవారం తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. గరివిడి మండలంలోని బొండపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ 2019 సెప్టెంబర్ 19 వతేదీన తన పశువుల శాలలో పశువులకు మేత వేస్తుండగా అదే గ్రామానికి చెందిన సవిరిగాన సూర్యనారాయణ, (45) ఆ మహిళపై లైంగికదాడికి పాల్పడ్డా డు. ఈ విషయమై బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై అప్పటి గరివిడి ఎస్సై కె.కృష్ణ ప్రసా ద్ కేసు నమోదు చేయగా అప్పటి చీపురుపల్లి సీఐ సీహెచ్.రాజులు నాయుడు కేసు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు వెల్లడించారని ఎస్పీ తెలిపారు. కొట్లాటలో 14మందికి గాయాలు బాడంగి: మండలంలోని కోటిపల్లి గ్రామంలో ఇరుకుటుబాల మధ్య జరిగిన కొట్లాటలో 14మందికి గాయలయ్యాయని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన గులిపిల్లి సత్యం పత్తిగుడ్డిలో గొర్రెల మేతవియంలో నీలబోను, పడాల కుటుంబాల మధ్య తగాదా ఆదివారం జరిగింది. ఈ తగాదాలో ఇరు కుటుంబాల వారు కర్రలతో కొట్టుకోగా 14మందికి గాయాలయ్యాయి. నీలబోను కుటుంబానికి చెందిన ఆనంద్, పడాల కుటుంబానికి చెందిన గంగులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ ప్రసాద్ తెలిపారు.ప్రస్తుతం వారంతా స్థానిక సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారన్నారు. -
మార్షల్ ఆర్ట్స్‌లో పతకాలు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో విజయనగరం క్రీడాకారులు సత్తా చాటారు. ఈనెల 23న శ్రీకాకుళం జిల్లాలో జరిగిన పోటీల్లో ముగ్గురు క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు దక్కించుకున్నారు. పోటీల్లో ఎన్.ప్రసాద్ 60కేజీల విభాగంలో బంగారు పతకం దక్కించుకోగా..కె.కృష్ణ భగవాన్ 70 కేజీల విభాగంలో వెండి పతకం, ఆజయ్ జీవన్ 50 కేజీల విభాగంలో వెండి పతకం సాధించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన క్రీడాకారులను కోచ్ రాజేష్, సబ్ ఇన్స్పెక్టర్ ఎం.కూర్మారావు, ఎస్.అనిల్‌లు అభినందించారు. -
867 గంజాయి కేసుల్లో 2,467 మంది అరెస్టు
గుమ్మలక్ష్మీపురం: విశాఖపట్నం రేంజ్ పరిధిలో గడిచిన 14 నెలల్లో నమోదైన 867 గంజాయి కేసుల్లో 2,467 మందిని అరెస్టు చేసినట్టు విశాఖరేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి అన్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఎల్విన్‌పేట పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని సోమవారం తనిఖీ చేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, నమోదు, పరిష్కరిస్తున్న తీరు, శాంతిభద్రతలపై పరిరక్షణపై ఆరా తీశారు. అనంతరం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. సైబర్ నేరగాళ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సీబీఐ, ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్ అధికారులంటూ ఫోన్, ఆన్లైన్లో డబ్బులు డిమాండ్ చేసినా, బెదిరించినా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఉద్యోగాల పేరుతో మోసాలు జరుగుతున్నాయని.. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో ఉద్యోగాలకు ముందస్తు నోటిఫికేషన్ వెలువడకుండా భర్తీ చేయడం కుదరదన్న సంగతిని నిరుద్యోగులు గ్రహించాలన్నారు. గంజాయి నిర్మూలనలో భాగంగా 11వేల ఎకరాల్లో రైతులతో ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయించామన్నారు. గంజాయి నిందితుల నుంచి రూ.14 కోట్ల విలువ చేసే ఆస్తులను సీజ్ చేశామన్నారు. ఈనెల 12న అభ్యుదయ సైకిల్ యాత్రను ప్రారంభించామని, పాయకరావుపేట నుంచి ఇచ్ఛాపురం వరకు సాగే ఈ యాత్రలో అధికారులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ ప్రజలకు, విద్యార్థులకు, యువతకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఆయన వెంట ఎస్పీ ఎస్.వి మాధవ్‌రెడ్డి, పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, ఎల్విన్‌పేట, చినమేరంగి సీఐలు బి.హరి, తిరుపతిరావు, ఎస్ ఐలు బి.శివప్రసాద్, నీలకంఠారావు ఉన్నారు. సాక్షిప్రతినిధి, విజయనగరం: పార్వతీపురం మన్యం జిల్లా భౌగోళికంగా వినూత్నమైనది. ఇక్కడి ప్రకృతి సోయగాలు, వాగులు వంకలు, నదులు, కొండలు,గుట్టలు, ప్రాజెక్టులు, జలపాతాలు పర్యావరణ ప్రేమికులను, పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఈ ప్రాంతంలోని గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు జిల్లాకు తలమానికం. వీటిని అవకాశంగా మలుచుకుని ఆదాయ వనరుగా మార్చాలి. ప్రజల జీవన స్థితిగతులను మార్చాలి.. ఇదే ప్రథమ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. జిల్లాలో పర్యాటక అభివృద్ధిని ‘సాక్షి’కి తెలియజేశారు. సాక్షి : జిల్లా ప్రజల జీవన స్థితిగతులను పెంచేందుకు అమలుచేస్తున్న ప్రణాళిక ? కలెక్టర్: జిల్లాలోని ప్రకృతిని, దాని అందచందాలను ఆదాయవనరుగా మారుస్తున్నాం. జలపాతాలను, ఇతర ప్రకృతి రమణీయతను ఆకర్షించేలా విస్తృత ప్రచారం చేస్తున్నాం. ఇది మంచి ఫలితాలను ఇస్తోంది. ఎక్కడెక్కడి నుంచో పర్యాటకు లు వస్తున్నారు. ఇది స్థానికంగా యువతకు కొంత ఆర్థిక ఆసరాను ఇస్తుంది. సాక్షి : స్థానికంగా ఉండేందుకు వసతి సౌక ర్యం లేదు.. దీనిని ఎలా అధిగమిస్తారు? కలెక్టర్: నిజమే.. ఈ ప్రాంతంలో పర్యాటకులు ఉండేందుకు వసతి సమస్య ఉంది. దానిని అధిగమించేందుకు హోమ్ స్టే విధానాన్ని పరిచయం చేస్తున్నాం. ఔత్సాహిక పర్యాటకులు గిరిజనుల ఇళ్లవద్ద ఉండేలా ప్రచారం చేస్తున్నాం. దీనివల్ల నగర జీవనానికి అలవాటు పడిన పర్యాటకులకు సరికొత్త అనుభూతి కలుగుతుంది. ఇటు గిరిజనులకు కాస్త ఆదాయం లభిస్తుంది. సాక్షి : పర్యాటకంతో పాటు ఇతర ఆదాయమార్గాలేమైనా ఉన్నాయా? కలెక్టర్: పర్యాటకం అనేది సీజనల్.. ఈ మూడు నెలలు ఉంటుంది. ఆ తరువాత కూడా గిరిజను ల ఆదాయాన్ని సుస్థిరం చేసేందుకు పలు ప్రతి పాదనలు ఉన్నాయి. డెయిరీ, ఫిషరీస్ వంటి రంగాల్లో వారిని ప్రోత్సహిస్తున్నాం. మామిడి, అనాస వంటి పండ్ల నుంచి గుజ్జును తీసే కుటీర పరిశ్రమలను సైతం ప్రోత్సహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. దీనికి బ్యాంకులనుంచి రుణాలు అందించేందుకు కృషి చేస్తాం.. దాదాపు 5000 కుటుంబాలను ఇందులో భాగస్వాములను చేయాలన్నది లక్ష్యం. సాక్షి : పరిశ్రమల ఏర్పాటు వంటిది ఏమైనా ఉందా ? కలెక్టర్: పార్వతీపురంలో జీడిపిక్కల పరిశ్రమకు పూర్తి అనుమతులు తీసుకొచ్చి అది సాఫీగా నడిచేలా ప్రోత్సహిస్తున్నాం. వీటికితోడు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. సాక్షి : హాస్టల్ విద్యార్థుల మరణాలు.. అనారోగ్య పరిస్థితులను ఎలా అదుపు చేస్తున్నారు.? కలెక్టర్: మొదట్లో విద్యార్థులు జ్వరాలు.. ఇతర అనారోగ్య సమస్యలకు గురైంది వాస్తవమే. దీనికి వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం ప్రధాన కారణం. అందుకే ఇప్పుడు ‘ముస్తాబు’ అనే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా జిల్లాలో అమలుచేస్తున్నాం. పిల్లలు శుభ్రంగా చేతులు కడుక్కున్నాకే భోజనం పెట్టాలని హాస్టల్ వార్డెన్లకు సూచనలిచ్చాం. రోజూ పరిశుభ్రంగా స్నానం చేసి ఉతికిన దుస్తులు వేసుకునేలా చూడాలన్నది కూడా ఇందులో భాగం చేశాం. ఈ రెండు కచ్చితంగా అమలు చేయడం ద్వారా నేడు హాస్టల్ పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తగ్గాయి. సాక్షి : కొత్త ప్రాంతాలు ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా ? కలెక్టర్: సీతంపేటలోని అడ్వెంచర్ పార్కును అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షిస్తున్నాం. అడలి వ్యూ పాయింట్ కూడా మరో పర్యాటక స్థలంగా మారింది. ఇవన్నీ మన జిల్లాకు కొత్త రూపును తీసుకొస్తున్నాయి. -
కాలువలో జారిపడి విద్యార్థి మృతి
గరుగుబిల్లి: ప్రమాదవశాత్తు కాలుజారి తోటపల్లి ప్రాజెక్టు ఎడమ కాలువలో పడిపోయిన విద్యార్థి మృతిచెందాడు. హెచ్‌సీ ఎన్.ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. గరుగుబిల్లి మండలం తోటపల్లి పంచాయతీ నందివానివలస గ్రామానికి చెందిన రెడ్డి మణికంఠ (17) సోమవారం ఉదయం తనస్నేహితులతో కలిసి రన్నింగ్‌కు వెళ్లాడు. అనంతరం స్నానానికి ఎడమ కాలువలో దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడిపోయాడు. స్నేహితుల సమచారంతో స్థానికులు వెంటనే మణికంఠను బయటకు తీసి ప్రథమ చికిత్సచేశారు. ఇంటికి తరలిస్తుండగా చనిపోయాడు. మృతుడు కురుపాం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. మృతుడికి తండ్రి సింహాచలం, తల్లి చిన్నమ్మలు, అక్క జయశ్రీ ఉన్నారు. పోలీసులు కేసు నమోదుచేశారు. ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదం అలముకుంది. -
కాలవ్యవధిలో అర్జీల పరిష్కారం తప్పనిసరి
● జేసీ ఎస్.సేతు మాధవన్విజయనగరం అర్బన్: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే వినతులను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ఆయన సమీక్షించారు. ఆయా శాఖలవారీగా పెండింగ్‌లో ఉన్న వినతులపై ఆరా తీశారు. పెండింగ్‌కు కారణాలను తెలుసుకున్నారు. ఈ వారం పీజీఆర్ఎస్ కార్యక్రమానికి మొత్తం 206 వినతులు అందాయి. ఎప్పటిలాగే అత్యధికంగా రెవెన్యూకు సంబంధించి 94 వినతులు అందగా, డీఆర్డీఏకి సంబంధించి 24, సచివాలయ సేవలకు సంబంధించి 14, పంచాయతీలకు సంబంధించి 12, ఇతర శాఖలకు సంబంధించి మిగిలిన వినతులు అందాయి. వినతులను స్వీకరించిన వారిలో డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 39 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ దామోదార్ తన చాంబర్లో సోమవారం నిర్వహించి 39 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదు దారుల సమస్యలను ఎస్పీ శ్రద్ధగా ఆలకించారు. సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ కె. కుమార స్వామి, ఎస్సైలు ప్రభావతి, రాజేష్ సిబ్బంది పాల్గొన్నారు. -
చలి..చలి...
చలికాలంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యంపై ప్రతీ ఒక్కరూ శ్రద్ధ చూపాలి. మంచులో ఎక్కువగా తిరగకూడదు. వీలైనంత మేరకు కాచి వడపోసిన నీటిని తాగాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వేడి, వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలి. నిల్వ ఆహారం తీసుకోకూడదు. జాగ్రత్త వహించకపోతే ఇబ్బందులు తప్పవు. చర్మం పాడవకుండా కోల్డ్ క్రీమ్ వాడుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు మంకి క్యాప్‌లు వంటివి వాడాలి. – కె.విజయపార్వతి, డిప్యూటీ డీఎంహెచ్‌వో, ఐటీడీఏ, సీతంపేట పొగమంచు వల్ల జలుబు, జ్వరంతో పాటు న్యుమోనియా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఊపిరితిత్తులు, చర్మవ్యాధులు రావచ్చు. 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే రోగాలు వ్యాపిస్తాయి. ప్రతి ఒక్కరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆహార నియమాలు పాటించాలి. – డా.ఎన్ఎంకె.తిరుమలప్రసాద్, వైద్యులు, పీహెచ్సీ, గరుగుబిల్లి సీతంపేట/గరుగుబిల్లి: చలి కాలం ఈ ఏడాది కాస్త ఆలస్యంగా ప్రారంభమైనా బాగానే ప్రభావం చూపిస్తోంది. ఏజెన్సీలో అయితే చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఈ చలి కాలం వైరస్, బ్యార్టీరియా, ఫంగస్ వంటివి వ్యాప్తి చెందడానికి అనువైన సమయం. నూటికి 90 శాతం ఈ కాలంలోనే వ్యాధులు విజృంభిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవారు ఈ కాలంలోనే మరింత ఇబ్బందులకు గురవుతుంటారు. పగటి పూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా.. రాత్రి వేళల్లో చలి తీవ్రత ఆధికంగా ఉంటోంది. వేకువజామునే మంచుతో పాటు చలిగాలులు వీస్తున్నాయి. మిగిలిన కాలాలతో పోల్చకుంటే చలికాలంలో వాతావరణం ఆహ్లదంగా ఉండటమే కాకుండే వివిథ వ్యాధులు వ్యాప్తికి కారణమవుతుంది. కాగా జిల్లాలో ఉష్టోగ్రతలు రోజు రోజుకూ పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరి. ప్రస్తుత శీతల వాతావరణంలో గాలి తుంపర్ల ద్వారా పోకే ప్రమాదకర అంటువ్యాధి స్వైన్‌ఫ్లూ. ఇది హెచ్వన్, ఎన్‌వన్ వైరస్ ద్వారా వస్తుంది. మనిషి నుంచి మనిషికి గాలి ద్వారా వ్యాపిస్తుంది. తరుచూ చేతులు కడుక్కొంటూ ఉండాలి. వేడి నీరు వాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో పెంపుడు జంతువులు ఉంచకూడదు... వివిధ రకాల వైరస్ల జంతువులకు వ్యాపించే కాలం శీతాకాలం. అందుకు పెంపుడు జంతువులు ఉన్నవారు అతి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇంట్లోని వంటగదుల్లోకి, బెడ్రూంల్లోకి వాటిని రానివ్వక పోవడం ఎంతో శ్రేయస్కరం. పెంపుడు జంతువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. చిన్నారులకు వాటిని దూరంగా ఉంచడం మంచిది, ఆస్తమా రోగులకు ఆపద కాలం చలే కదా అని తేలిగ్గా తీసుకుంటే అది ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. చలితో ప్రధా నంగా వచ్చే వ్యాధి ఆస్తమా. ఆస్తమాతో బాధపడుతున్న రోగుల్లో చలి తీవ్రతతో బాధ మరింత పెరుగుతుంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించే వారికి ఆస్తమా కొత్తగా వచ్చే అవకాశముంది. మధుమేహం, గుండె జబ్బులతో బాధపడే రోగులు మరింత అప్రమత్తంగా ఉండాలి. చలికి శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గిపోవడంతో రక్తనాళాల పరిమాణం తగ్గి గుండెపోటు వచ్చే ప్రమాదాలు కూడా ఉంటాయి. రక్తనాళాలు చిన్నవిగా మారడంతో పక్షపాతం రావడంతో పాటు మెదడులో నాళాల్లో రక్తం గడ్డకట్టి రోగులు ఉన్న ఫలంగా మరణించవచ్చు. పొగ తాగితే ఇబ్బందులే... చలి కాలంలో పొగ తాగడం ద్వారా శరీరాన్ని వేడిగా ఉంచుకోవచ్చని చాలా మంది అనుకుంటుంటారు. అయితే ఈ కాలంలో పొగ తాగడం ఎంతో ప్రమాదమని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో పొగతాగే వారి నోట్లోకి 10 శాతం నికోటిన్ మాత్రమే వెళ్తుంది. మిగిలింది ఆక్సిజన్‌లో కలుస్తుంది. అయితే శీతాకాలంలో 90 శాతం నికోటిన్ నోట్లోకి వెళ్లి ఉపిరితిత్తులు వ్యాధికి గురి చేస్తుంది. ఆహార జాగ్రత్తలు అవసరమే... ● శీతాకాలంలో సాధారణ రోజులకు భిన్నంగా ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా తీపి పదార్థాలు తినడం తగ్గించాలి. పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ● రోగ నిరోధక శక్తి క్షీణింపజేసేందుకు ఆహారం దోహదపడుతుంది. అందుకే ఈ కాలంలో జంక్ ఫుడ్స్ తగ్గించాలి. ఆహార పదార్థాలపై ఈగలు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటితో న్యూమోనియా, అస్తమా, హైపటైటీస్–బి వచ్చే అవకాశముంది. ఏజెన్సీలో వణికిస్తున్న చలి పులి పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆహార జాగ్రత్తలు అవసరమే.. తెల్లవారుజామున తీవ్రంగా పొగ మంచు ప్రమాదాలకు అవకాశలెక్కువ.. బీ అలెర్ట్...ప్రస్తుతం చలితో పాటు మంచు ఎక్కువగా కురుస్తోంది. ఈ సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించవు. తెల్లవారు జామున వాహనాలు నడిపేవారు నిద్ర మత్తులో ఉంటారు. వారికి ఎదురుగా ఉన్నది కనిపించకుంటే ప్రమాదాలకు దారి తీసే అవకాశముంది. పట్టణాలు, నగరాల్లో రోడ్లు వ్యాయామ కాలాలుగా మారిపోయాయి. ఈ పరిస్థితుల్లో రోడ్ల వెంట నడక, పరుగులు తీసేవారు ప్రమాదాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. చలి కాలంలో ఇంట్లో తేమ లేకుండా చూడాలి. చెత్త, చెదారం పనికిరాని వస్తువులు, అవసరం లేని సామగ్రి ఇంట్లో లేకుండా జాగ్రత్త పడాలి. వాటితో దోమలు, కీటకాలు ఇంట్లోకి చేరే వీలుంది. రోజు విడిచి రోజు స్నానపు గదులు, మరుగు దోడ్లు శుభ్రం చేసుకోవాలి. బ్లీచింగ్ పౌడరుతో నీటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి ఆవరణలో పూల కుండీల్లోని మొక్కలకు పురుగులు ఆశించే అవకాశాలెక్కువ. సాధ్యమైనంత వరకు మొక్కలు కత్తిరించాలి. అప్పుడే ఇబ్బందులు తప్పి అందంగానూ, ఆకర్షణీయంగా ఉంటాయి. ఆహార నియమాలు తప్పనిసరి -
బాలికలకు స్వీయ రక్షణ అవసరం : కలెక్టర్
సీతానగరం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల బాలికలకు స్వీయ రక్షణ అవసరమని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. జోగింపేట కేజీబీవీ విద్యాలయంలో సమగ్రశిక్ష, రుద్రమదేవి సెల్ఫ్ డిఫె న్స్ అకాడమి, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రాణి లక్ష్మీభాయ్ స్వీయ రక్షణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ రాణి లక్ష్మీభాయ్ స్వయం రక్షక్ కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. 2025–26 విద్యా సంవత్సరానికిగాను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల బాలికలకు ఆత్మరక్షణకు శిక్షణ దోహద పడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ ఆత్మరక్షణతో పాటు నైపుణ్యాలు ఎంత ముఖ్యమో వివరించారు. ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎంత విద్య నేర్పినా తమ ప్రాణాలను కాపాడుకునే విజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సి ఉందన్నారు. బాలికలంద రూ శిక్షణను వినియోగించు కోవాలని కోరారు. అనంతరం పాఠశాలలో జరుగుతున్న ఉస్తాబు కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్వాహకులకు ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, కేజీబీవీ ప్రిన్సిపాల్ జె.సఽంధ్య, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.తేజేశ్వరరావు, కో ఆర్డినేటర్ ఎస్.ప్రభాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సాక్షి ‘స్పెల్ బీ, మ్యాథ్స్ బీ’లకు విశేష స్పందన
విజయనగరం అర్బన్: సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి డక్స్ వాఫీ సంస్థ, రాజమండ్రి ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అసోసియేట్ స్పాన్సర్‌గా ఆదివారం స్థానిక పెదతాడివాడలోని నేషనల్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన ‘సాక్షి స్పెల్‌బీ’ రెండో రౌండ్ (క్వార్టర్ ఫైనల్), ‘సాక్షి మ్యాథ్స్‌బీ’ సెమీఫైనల్ రౌండ్ పోటీలకు విశేష స్పందన లభించింది. పోటీలలో భాగంగా నాలుగు విభాగాల్లో స్పెల్‌బీ, మ్యాథ్స్బీలలో విడివిడిగా విద్యార్థులు పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ పోటీల విజేతలు త్వరలో విశాఖలో జరిగే డివిజన్ స్థాయి స్పెల్‌బీ (సెమీఫైనల్స్), మ్యాథ్స్‌బీ ఫైనల్స్ పోటీలలో పాల్గొంటారు. అక్కడి విజేతలకు నాల్గో రౌండ్‌గా నిర్వహించే ఫైనల్స్ మౌఖిక పరీక్ష జరుగుతాయి. జిల్లా స్థాయిలో జరిగిన ఈ పోటీలు విద్యార్థుల్లో పోటీస్ఫూర్తిని నింపాయి. సాక్షి శ్రీకాకుళం యూనిట్ మేనేజర్ బీజేజీవీఆర్ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను పాఠశాల ప్రిన్సిపాల్ బి.రాజారావు ప్రారంభించారు. వివిధ కేటగిరిలలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి మూడు గంటల పాటు స్పెల్ బీ, మ్యాథ్స్ బీ పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కేటగిరి విద్యార్థులు మాట్లాడుతూ సాక్షి అందించిన ప్రిపరేషన్ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ప్రిన్సిపాల్ రాజారావు మాట్లాడుతూ ఈ పోటీలు విద్యార్థుల్లో ఇంగ్లీష్ స్పెల్లింగ్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులపై పట్టు పెంచడమే కాక, ఆత్వవిశ్వాసాన్ని కలిగించడంలో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పరీక్ష నిర్వహణలో పాఠశాల ఇన్చార్జ్ రమాదేవి, ఎగ్జామినేషన్ ఇన్చార్జ్ బెనర్జీ, పాఠశాల పుపాధ్యాయులు పాల్గొన్నారు. -
డిసెంబర్ 6 నుంచి ఉత్తరాంధ్ర వాలీబాల్ పోటీలు
బొబ్బిలి: భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 69వ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 6 నుంచి రెండు రోజుల పాటు బొబ్బిలి సంస్థానం ఉన్నత పాఠశాల మైదానంలో వాలీబాల్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నట్టు అంబేడ్కర్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సోరు సాంబయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండ గోపాలరావు తెలిపారు. శనివారం పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన విలేకర్ల సమావేశంలో భాగంగా టోర్నమెంట్ విధి విధానాలుండే కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టోర్నమెంట్ ముగింపు సందర్భంగా డిసెంబర్ 7న తాండ్ర పాపారాయ విగ్రహం వద్ద బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. టోర్నమెంట్లో పాల్గొనే టీములు 9989232309, 9949613986 నంబర్లను సంప్రదించాలన్నారు. -
రసవత్తరంగా ఎస్జీఎఫ్ బాస్కెట్‌బాల్ పోటీలు
నూజివీడు: నూజివీడులో నిర్వహిస్తున్న ఎస్జీఎఫ్ బాలుర, బాలికల అండర్–17 రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి 13 బాలుర జట్లు, 13 బాలికల జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. శనివారం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ గోపీమూర్తి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో జరుగుతున్న ఈ పోటీలు లీగ దశను ముగించుకొని నాకౌట్ దశకు చేరుకున్నాయి. ఈ పోటీలు పలు జట్ల మధ్య హోరాహోరీగా సాగగా, మరొకొన్ని పోటీలు ఏకపక్షంగా సాగాయి. బాలికల విభాగంలో గుంటూరు జట్టు చిత్తూరుపై 19–8, పశ్చిమగోదావరి జట్టు విజయనగరంపై 38–0, తూర్పు గోదావరి జట్టు కర్నూల్‌పై 29–10, వైజాగ్ జట్టు అనంతపురంపై 21–13, వైఎస్సార్ కడప జట్టు నెల్లూరుపై 20–0, చిత్తూరు జట్టు విజయనగరంపై 26–2, గుంటూరు జట్టు పశ్చిమగోదావరిపై 36–24, కర్నూల్ జట్టు శ్రీకాకుళంపై 29–2, వైజాగ్ జట్టు ప్రకాశంపై 13–0, కృష్ణాజిల్లా జట్టు నెల్లూరుపై 19–0 తేడాతో గెలుపొందాయి. బాలుర విభాగంలో తూర్పు గోదావరి జట్టు వైజాగ్‌పై 50–32, చిత్తూరు జట్టు శ్రీకాకుళంపై 27–17. గుంటూరు జట్టు వైఎస్సార్ కడపపై 28–3, అనంతపురం జట్టు పశ్చిమగోదావరిపై 32–8, కృష్ణాజట్టు కర్నూలుపై 31–12, చిత్తూరు జట్టు తూర్పుగోదావరి జట్టుపై 30–21, వైజాగ్ జట్టు శ్రీకాకుళంపై 23–16, గుంటూరు జట్టు నెల్లూరుపై 29–12, అనంతపురం జట్టు విజయనగరంపై 29–0, కర్నూల్ జట్టు ప్రకాశంపై 17–02తేడాతో గెలుపొందాయి. దీంతో బాలికల విభాగంలో క్వార్టర్స్ ఫైనల్‌కు కృష్ణ, కర్నూలు, అనంతపురం, గుంటూరు, తూర్పుగోదావరి, కడప, చిత్తూరు, వైజాగ్ జట్లు చేరాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో కృష్ణా జట్టు కర్నూలుపై 26–12, తూర్పుగోదావరి జట్టు వైఎస్సార్ కడపపై 18–6తేడాతో, గుంటూరు జట్టు అనంతపురంపై 35–17, వైజాగ్ జట్టు చిత్తూరుపై 24–20 స్కోర్‌తో గెలుపొందాయి. దీంతో కృష్ణా, తూర్పుగోదావరి, గుంటూరు, వైజాగ్ జట్లు సెమీస్‌కు చేరాయి. కార్యనిర్వాహక కార్యదర్శి వాకా నాగరాజు పోటీల నిర్వహణను పర్యవేక్షించారు. -
క్రీడాకారులు
13 జిల్లాలు..156 మందివిజయనగరం: పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడా పోటీలకు విద్యలకు నిలయమైన విజయనగరం అతిధ్యమివ్వనుంది. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేసన్ ఆధ్వర్యంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో విజయనగరం నగర శివారుల్లో గల సర్ విజ్జీ స్టేడియంలో 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఖోఖో పోటీలు జరగనున్నాయి. అండర్–17 విభాగంలో బాలికలకు నిర్వహించే పోటీల్లో రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే పోటీల్లో 156 మంది క్రీడాకారులు, 26 మంది కోచ్ అండ్ మేనేజర్లు, 25 మంది రిఫరీలు, మరో 30 మంది వ్యాయామ ఉపాధ్యాయులు కలిపి మొత్తంగా 250 మంది పాల్గొననున్నారు. పోటీల నిర్వహణకు సంబంధించి జిల్లా విద్యా శాఖ అధికారి మాణిక్యంనాయుడు ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో పోటీలు నిర్వహణ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే అండర్–17 బాలికల ఖోఖో పోటీలకు సంబంధించి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. విజ్జీ స్టేడియంలో ప్రతి రోజు ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా పోటీలు ప్రారంభించనున్నారు. ప్రతి రోజు సాయంత్రం వేళల్లో ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో పోటీలు నిర్వహించనున్నారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహించే పోటీల్లో బాల, బాలికల విభాగాల్లో లీగ్ దశలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జట్లను నాకౌట్ దశకు ఎంపిక చేయనున్నారు. ఇదిలా ఉండగా మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు 25వ తేదీ ముగింపు రోజున బహుమతీ ప్రధానోత్సవం చేస్తారు. అంతేకాకుండా రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసి అదే రోజున బాల, బాలికల జట్ల వివరాలను ప్రకటించనున్నారు. ఉచితంగా భోజన, వసతి సదుపాయాలు అండర్–17 స్కూల్ గేమ్స్ బాలికల ఖోఖో పోటీల్లో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి విజయనగరం వచ్చే క్రీడాకారులకు ఉచితంగా భోజన, వసతి సదుపాయాలను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రతినిధులు కల్పించారు. భోజన సదుపాయాన్ని పోటీలు నిర్వహించే విజ్జీ స్టేడియంలో ఏర్పాటు చేయగా... క్రీడాకారిణుల వసతి కోసం నగరంలోని కస్పా కార్పొరేషన్ ఉన్నత పాఠశాలను కేటాయించారు. అక్కడి నుంచి విజ్జీ స్టేడియంకు క్రీడాకారులు రాకపోకలు సాగించేందుకు ప్రత్యేకంగా వాహన సదుపాయాన్ని ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు పూర్తి.. విజయనగరం వేదికగా మూడు రోజుల పాటు అండర్–17 బాలికల స్కూల్ గేమ్స్ ఖోఖో పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పూర్తి ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు జరుగుతాయి. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటలకు మ్యాచ్‌లు జరుగుతాయి. క్రీడాకారులకు, కోచ్‌లకు, రిఫరీలకు భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తున్నాం. – కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మి, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు, విజయనగరం జిల్లా వేదికగా అండర్–17 బాలికల స్కూల్ గేమ్స్ ఖోఖో పోటీలు నేటి నుంచి మూడు రోజులు పాటు జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలు సర్ విజ్జీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో పోటీలు నిర్వహణకు ఏర్పాట్లు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు -
24న చలో కలెక్టరేట్
విజయనగరం గంటస్తంభం: పట్టణంలో ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదలకు ఉన్నచోటే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ఇల్లు లేని వారికి రెండు సెంట్లు భూమి కేటాయించాలని సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఈ నెల 24న చలో కలెక్టరేట్ చేపట్టనున్నట్టు తెలిపారు. స్థానిక పూల్‌బాగ్‌లో చలో కలెక్టరేట్ కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి జీవో 30 విడుదలై ఏడాదైనా విజయనగరంలో ఒక్కరికీ కూడా పట్టా ఇవ్వలేదని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు వి.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 1న గీత కులాల రాష్ట్ర మహాసభలు విజయనగరం గంటస్తంభం: గీత కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 1న సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగనున్నాయని రాష్ట్ర యాత సంఘం అధ్యక్షుడు అంగటి రాము తెలిపారు. అనంతరం జిల్లాలో ఆహ్వాన పత్రిక విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ, గీత కులాల అభివృద్ధికి ఈ మహాసభలు కీలకం కానున్నాయని పేర్కొన్నారు. నాయకులు, సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గీత వృత్తి కుటుంబాల సంక్షేమానికి కొత్త ప్రణాళికలు ప్రకటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో అంగటి మూర్తి, వెంకటేష్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. సీజ్ చేసిన మద్యం ధ్వంసం పాలకొండ: స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో గత తొమ్మిది నెలలుగా పలు కేసుల్లో పట్టుబడిన మద్యం, సారాను అధికారులు శనివారం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎకై ్సజ్ సీఐ సూర్యకుమారి మాట్లాడుతూ గత తొమ్మిది నెలల్లో నమోదు చేసిన 25 కేసులకు సంబంధించి 636 లీటర్ల సారా, 30 బెల్ట్ కేసుల్లో 232 మద్యం బాటిల్స్‌ను ధ్వంసం చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సైలు ఎల్.తిరుపతిరావు, జి.ఫణేంద్రబాబు, సిబ్బంది పాల్గొన్నారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత బొబ్బిలిరూరల్: మండలంలోని అలజంగి వద్ద వేగావతి నదిలో అక్రమంగా ఇసుక తవ్వి తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ అర్ఐ రామకుమార్ శనివారం పట్టుకున్నారు. ట్రాక్టర్ల యజమానులను తన కార్యాలయానికి రప్పించి మందలించిన తహసీల్దార్ ఎం.శ్రీను ఒక్కో ట్రాక్టర్‌కు రూ.10 వేలు చొప్పున రూ.20వేల జరిమానా విధించారు. ఇది మొదటి సారి కావడంతో జరిమానాతో విడిచిపెడుతున్నామని మరోసారి అక్రమ ఇసుకతో దొరికితే సీజ్ చేస్తామని ట్రాక్టర్ యజమానులకు హెచ్చరించారు. కరెంటు షాక్‌తో వ్యక్తి మృతి విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం కరెంటు షాక్‌తో ఒక వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని పద్మావతి నగర్ ఆరవ లైన్లో ఉంటున్న ఉప్పలూరి సాల్మన్‌రాజు(25) పెయింట్ పని చేస్తుంటాడు. శివాలయం వీధిలో ఒక ఇంటికి పెయింటింగ్ పని చేస్తుండగా కరెంటు సర్వీస్ లైన్ తగిలి అక్కడికక్కడే కింద పడిపోయాడు. స్థానికుల సహాయంతో ఆసుపత్రికి చికిత్సకై చేర్పించడంతో అప్పటికే మృతి చెందాడు. భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు ఎస్ఐ అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా సాల్మన్‌రాజుకు ఆరు నెలల కిందటే పైళ్లెంది. -
సంస్థాగత నిర్మాణంతోనే ఎస్‌హెచ్‌జీలు బలోపేతం
● వెలుగు, డీఆర్డీఏ పి.డి. శ్రీనివాస పాణి ● ముగిసిన స్వయం సహాయక సంఘాల శిక్షణవిజయనగరం టౌన్: స్వయం సహాయక సంఘాలు రూపాన్ని కోల్పోకుండా, నిర్వీర్యం కాకుండా బలంగా ఉన్నాయంటే సంస్ధాగత నిర్మాణం బాగుండటం వలనే సాధ్యపడిందని వెలుగు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి పేర్కొన్నారు. ఈ నెల 20 నుంచి 22 వరకూ టీటీడీసీలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు సంబంధించిన సిబ్బందికి మూడు రోజుల పాటూ నిర్వహించిన వార్షిక కార్యాచరణ ప్రణాళిక శిక్షణ ముగింపు కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌హెచ్‌జీలకు కావాల్సిన రుణాలు ఎంసీపీ పద్ధతిలో సభ్యులకు కావాల్సిన సమయంలో అవసరం మేరకు మాత్రమే రుణాలందిస్తున్నామన్నారు. గతంలో అవసరమున్నా లేకపోయినా రుణాలిచ్చే పద్ధతి ఉండేదని, అలాకాకుండా కొత్త పద్ధతిలో రుణాలిచ్చే విధానం ఈ ఏడాది నుంచి అమలు చేశామన్నారు. మూడు రోజుల పాటూ నిర్వహించిన శిక్షణ ఆర్థికంగా కాకుండా సభ్యుల జీవన విధానంలో మార్పునకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. చిల్లపేట గ్రామ సంఘానికి మార్పు అంశాలకు సంబంధించి కోటీ రూ.5 లక్షల 32 వేలు అవసరమున్నట్టు బడ్జెట్ తయారు చేశారన్నారు. దీనిలో లక్షా రూ.50వేలు గ్రామ సంఘం నుంచి, 10 లక్షల రూ.8వేలు మండల సమాఖ్య నుంచి నిధులు సమకూర్చుకోవాలని, 93 లక్షల రూ.74వేలు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి మంజూరు చేసేటట్టు ప్రణాళిక తయారు చేశామన్నారు. శిక్షణలో సెర్ప్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్స్ పి.శోభారాణి, సిహెచ్.వరప్రసాద్, డీపీఎంలు చిరంజీవి, రామమోహన్, వైదేహి, మోహనరావు, ఏపీఎంలు విశ్వేశ్వరరావు, అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. -
జేఎన్టీయూ–జీవీ, డీఎస్ఎన్ఎల్యూ మధ్య ఎంవోయూ
విజయనగరం రూరల్: పీజీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ – కృత్రిమ మేధస్సు, టెక్నాలజీ చట్టం (పీజీసీపీఏఐటీఎల్) అందించేందుకు జేఎన్టీయూ – జీవీ, విశాఖపట్నం దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ (డీఎస్ఎన్ఎల్యూ) మధ్య పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) శనివారం కుదుర్చుకున్నాయని జేఎన్టీయూ – జీవీ ఉపకులపతి వి.వి.సుబ్బారావు తెలిపారు. ఇరు యూనివర్సిటీల ఉప కులపతులు సంతకాలు చేయడంతో అమల్లోకి వచ్చిన ఒప్పందంతో ఏఐ, డిజిటల్ టెక్నాలజీలు, న్యాయ వ్యవస్థల సమగ్రతలో నైపుణ్యం కలిగిన నిష్ణాతుల అవసరాన్ని తీర్చేందుకు ఈ విద్యా భాగస్వామ్యం ఉపయోగపడుతుందని ఇరు యూనివర్సిటీల ఉప కులపతులు తెలిపారు. ఈ ఒప్పందంలో కోర్సు రూప కల్పన, హైబ్రీడ్ బోధన విధానం, అంచనాలు (అసెస్మెంట్లు), ప్రయోగశాల శిక్షణ, సర్టిఫియేషన్ వంటి అంశాలు ఉన్నాయన్నారు. లీగల్ ఇన్ఫర్మాటిక్స్, సైబర్ లా, డిజిటల్ గవర్నెన్స్, లీగల్ – టెక్ టూల్స్, ఎన్ఎల్పీ ఆధారిత న్యాయ విశ్లేషణ, సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్స్, ఏఐ ఆధారిత న్యాయ ప్రక్రియలు వంటి అంశాలు చేర్చబడ్డాయని తెలిపారు. రాష్ట్రంలో ఏఐ, న్యాయ కోర్సును ఒకే కోర్సుగా చేయడం ఇదే మొదటిసారన్నారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి కోర్సులు చాలా తక్కువ ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం 5 సంవత్సరాలు చెల్లుబాటు అవుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలి బ్యాచ్ 2026 జనవరిలో ప్రారంభమవుతుందన్నారు. ప్రవేశాల నోటిఫికేషన్ వచ్చే నెలలో ఇరు విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా విడుదల చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఇరు విశ్వవిద్యాలయాల అధికారులు పాల్గొన్నారు. -
కుల దూషణ కేసుపై డీఎస్పీ విచారణ
భోగాపురం: ఇటీవల మండలంలోని ముంజేరు పంచాయితీ సిద్ధార్థ్‌నగర్ కాలనీ సమీపంలో నిర్మిస్తున్న కాలువ నిర్మాణంలో భాగంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సిద్ధార్థ్‌నగర్ కాలనీకి చెందిన కొందరి మహిళలపై ముంజేరు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేయడంతో పాటు కులం పేరుతో దూషించినట్టు కాలనీకి చెందిన బొనెల గాయత్రితో పాటు కొందరు మహిళలు ఈ నెల 20వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ కె.దుర్గాప్రసాద్ ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ కేసు నమోదు చేశారు. అదే రోజు సిద్ధార్థ్‌నగర్ కాలనీకి చెందిన 11 మంది తమపై దౌర్జన్యం చేశారని ముంజేరు గ్రామానికి చెందిన ఎం.వాణితో పాటు మరికొందరు ఫిర్యాదు ఇవ్వడం కూడా జరిగింది. దీనిపై డీఎస్పీ మారోతు వీరకుమార్ శనివారం ముంజేరు గ్రామంలోని సిద్ధార్థనగర్ కాలనీకి చేరుకుని విచారణ చేపట్టారు. -
లేబర్ కోడ్లపై కార్మిక సంఘాల కన్నెర్ర
● ఉత్తర్వుల ప్రతుల దహనంపార్వతీపురం రూరల్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ కోడ్స్ పెట్టుబడిదారులకు అనుకూలంగా, కార్మికులకు నష్టదాయకంగా ఉన్నాయని ఆరోపిస్తూ శనివారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద సీఐటీయూ, ఏఐటీయూసీ, ఇఫ్టూ, సీపీఐఎంఎల్ లిబరేషన్, టీయూసీఐ, రైతు కూలి సంఘం తదితర సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిరసనానంతరం, కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు మాట్లాడుతూ అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు ఊడిగం చేసేందుకే మోదీ ప్రభుత్వం ఈ కోడ్స్‌ను తెచ్చిందని మండిపడ్డారు. ఈ చట్టాలు వలస పాలనను మించిన బానిసత్వాన్ని కార్మిక వర్గంపై రుద్దుతాయన్నారు. 29 కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయకుండా, నాలుగు నష్టదాయక కోడ్స్ అమలులోకి తీసుకురావడం పచ్చి అబద్ధం అని ధ్వజమెత్తారు. లేబర్ కోడ్స్‌లోని అత్యంత ప్రమాదకరమైన అంశాన్ని వివరిస్తూ ‘ఇప్పటివరకు 100 మందికి పైగా కార్మికులున్న సంస్థలు లే–ఆఫ్ చేయాలన్నా, లాకౌట్ చేయాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరని, కానీ, కొత్త కోడ్స్ ఆ పరిమితిని 300కు పెంచాయన్నారు. అంటే, 300లోపు కార్మికులున్న కంపెనీలను యాజమాన్యాలు తమ ఇష్టానుసారం మూసివేసి తొలగించవచ్చు. ఇది కార్మికుల హక్కులపై నిర్ధాక్షిణ్యంగా వేటు వేయడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ కోడ్స్‌ను రద్దు చేయించే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ సంఘాలకు చెందిన నాయకులు కుమార్, గొర్లి వెంకటరమణ, ఎం.భాష , ఇ.భాస్కరరావు, నర్సింగరావు, ఈ జీవన్, సూరయ్య (టీయూసీఐ), పి.రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పరీక్ష పేరుతో అక్రమ వసూళ్లు
వీరఘట్టం: పరీక్షల ఫీజుల పేరిట పదో తరగతి విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తుండడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వచ్చేఏడాది మార్చి 16 నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫీజులు చెల్లించాలని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అదునుగా చేసుకుని కొన్ని పాఠశాలల సిబ్బంది విద్యార్థుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నట్టు తల్లిదండ్రులు చెబుతున్నారు. వీరఘట్టం జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రతివిద్యార్థి నుంచి రూ.300లు వసూలు చేస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై కొందరు తల్లిదండ్రులు ప్రశ్నిస్తే పాస్‌ఫొటోలు, ఆన్లైన్లో ఫీజు నమోదు చార్జీల కోసం అని ఉపాధ్యాయులు చెబుతున్నారు. వాస్తవంగా ఈ నెల 17 నుంచి 30వ తేదీలోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా అన్ని సెబ్జెక్టులకు కలిపి రూ.125లు ఫీజు చెల్లిస్తే చాలు. డిసెంబర్ 1 నుంచి 5వ తేదీలోపు రూ.50ల అపరాద రుసుముతో రూ.175, డిసెంబర్ 6 నుంచి 10వ తేదీలోపు రూ.200 అపరాధ రుసుముతో రూ.325, డిసెంబర్ 11 నుంచి 15 లోపు రూ.500 అపరాధ రుసుముతో రూ.625లు చెల్లించాలి. గడువులోపల ఫీజు చెల్లించేవారి నుంచి రూ.125కు బదులు రూ.300 వసూలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. అంత లేదండీ... ఈ విషమంపై పాఠశాల ప్రధానోపాద్యాయుడు బి.సొంబర వద్ద ప్రస్తావించగా అంత డబ్బులు వసూళ్లు చేయడం లేదండీ.. కేవలం రూ.300లు తీసుకుంటున్నామని సమాధానం ఇచ్చారు. విద్యార్థుల ఫొటోలు, ఆన్లైన్ చలనా ఖర్చులు ఉంటాయి కదా అని సమాధానం చెప్పారు. చర్యలు తప్పవు పదో తరగతి విద్యార్థుల నుంచి ఫీజుల కోసం ఒక్కరూపాయి అదనంగా వసూలు చేసినా చర్యలు తప్పవు. పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్లో ఆన్లైన్లో ఫీజులు చెల్లించి విద్యార్థుల వివరాలు నమోదుచేయాలి. – పర్రి కృష్ణమూర్తి, ఉప విద్యాశాఖాధికారి, పాలకొండ రూ.300లు ఫీజు చెల్లించాను మా అబ్బాయి వీరఘట్టం హైస్కూల్లో ఈ ఏడాది పదో తరగతి చదువుతున్నాడు. మూడు రోజుల కిందట పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లించాలని చెప్పాడు. ఎంత అని అడిగితే రూ.300లు అని చెప్పాడు. నాకు ఫీజు ఎంతో తెలియదు. అడిగినంత ఫీజు స్కూల్‌కు వెళ్లి చెల్లించాను. – గడగమ్మ వెంకటరావు, విద్యార్థి తండ్రి, వీరఘట్టం పదోతరగతి పరీక్ష ఫీజు పేరిట రూ.300 వసూలు ఒక్కో విద్యార్థి నుంచి అదనంగా రూ.175 వసూలు అధిక ఫీజుల వసూళ్లపై మండిపడుతున్న తల్లిదండ్రులు -
అడవి బిడ్డలకు సాయం చేద్దాం రండి
పార్వతీపురం రూరల్: పార్వతీపురం పెద్దాస్పత్రికి వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స కోసం వచ్చే గిరిజనులు తికమక పడుతున్నారు. వైద్యం కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియదు.. చుట్టూ వైద్యసిబ్బంది కనిపిస్తున్నా ఎవరిని ఆశ్రయించాలో అర్థంకాదు. భాష రాక పోవడం, నిరక్షరాస్యతతో ఎక్కడ ఓపీ రాయించాలో తెలియని అమాయకత్వం. వీరికి సాయం అందించేందుకు.. ఓ ఆప్తుడిలా అక్కున చేర్చుకుని అండగా నిలిచేందుకు జిల్లా యంత్రాంగం ‘హెల్పింగ్ హ్యాండ్స్’ పేరుతో ఒక బృహతర్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ సేవా యజ్ఞంలో భాగస్వాములు కావాలంటూ కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి యువతకు, సేవాభిలాషులకు పిలుపునిచ్చారు. ఏం చేయాలి..? హెల్పింగ్ హ్యాండ్.. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు. మానవత్వపు వారధి. జిల్లాలోని దళిత, గిరిజన, పేద రోగులు జిల్లా కేంద్రాస్పత్రికి వచ్చినప్పుడు భాష రాక, పద్ధతులు తెలియక ఇబ్బందులు పడకూడదన్నదే దీని ప్రధాన ఉద్దేశం. ఆస్పత్రి గేటు వద్ద రోగిని కలిసి, ఓపీ రాయించడం దగ్గర్నుంచి, వైద్యుడిని సంప్రదించడం, పరీక్షలు చేయించడం, మందులు ఇప్పించి సురక్షితంగా ఇంటికి సాగనంపే వరకు ఒక వలంటీర్ ఆ రోగికి పూర్తి తోడుగా ఉంటారు. రోగి మనసులో ఆస్పత్రి భయాన్ని పోగొట్టి, వారికి ప్రభుత్వ వైద్య సేవలను, అభాకార్డుల ప్రయోజనాలను పూర్తిస్థాయిలో అందేలా చూడాలి. పేర్లు నమోదు చేసుకోండి.. సేవ చేయాలనే ఆసక్తి ఉన్నవారు వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. మీరు అందించే చిన్న సహాయం.. ఒక నిరుపేద ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. రండి.. చేతులు కలుపుదాం.. ఆరోగ్యాన్ని పంచుదాం అని ఆహ్వానించారు. యువతరం కదలిరావాలి.. సేవలో తరించాలి మీ చేయూతే అమాయక గిరిజనులకు కొండంత ధైర్యం ఆస్పత్రుల్లో తికమకపడే అభాగ్యులకు అండగా నిలుద్దాం రండి అడవి బిడ్డల సేవకు కలెక్టర్ ప్రభాకరరెడ్డి పిలుపు ‘హెల్పింగ్ హ్యాండ్స్’కు రూపకల్పన వలంటీర్లకు రెడ్‌క్రాస్ ద్వారా ప్రత్యేక శిక్షణ సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే తపన ఉన్నవారికి ఇదొక సువర్ణావకాశం. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగ విరమణ చేసిన వారు, లేదా సెలవు రోజుల్లో ఖాళీగా ఉండే ఉద్యోగులు ఎవరైనా ఈ కార్యక్రమంలో వలంటీర్లుగా చేరవచ్చు. వలంటీర్లకు రెడ్‌క్రాస్ సొసైటీ, వైద్య నిపుణులు సీపీఆర్, ప్రథమ చికిత్సపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. -
ఇసుక అక్రమంగా తరలిస్తే చర్యలు
● తహసీల్దార్ రాధాకృష్ణమూర్తి పాలకొండ రూరల్: నాగావళి నదీతీరం వెంబడి గ్రామాల్లో ఇసుక అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ సీహెచ్ రాధాకృష్ణమూర్తి హెచ్చరించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై ‘మనల్ని ఆపేదెవరు’ శీర్షికన ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. అంపిలి, గోపాలపురం, చినమంగళాపురం తదితర గ్రామాల వద్ద నది నుంచి ఇసుక తరలించకుండా కందకాలను శనివారం తవ్వించారు. ఇసుక అక్రమంగా తరలిస్తే సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు. ఆయన వెంట సీఐ ఆమిటి ప్రసాద్, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది ఉన్నారు. -
మళ్లీ అదే పాట!
తోటపల్లి ప్రాజెక్టు కింద కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణపై ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ సమావేశంలో ప్రస్తావించారు. 25 శాతంలోబడి ఉన్న పనులను రద్దు చేయాలని ప్రభుత్వం జీవో ఇవ్వడం వల్ల వేలాది మంది రైతులు నష్టపోతున్నారని తెలిపారు. జియ్యమ్మవలస, వీరఘట్టం, పాలకొండ తదితర ప్రాంతాల్లోని సాగుభూములకు జీవనాడిలాంటి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం తగదని చెప్పారు. ఈ విషయాన్ని పునఃపరిశీలించి, కాలువ ఆధునికీకరణ పనులను చేపట్టాలని కోరారు. పాలకొండలో డంపింగ్‌యార్డు సమస్య తీవ్రంగా ఉందని గుర్తు చేశారు. అప్పట్లో శ్రీకాకుళం కలెక్టర్ డంపింగ్‌యార్డు కోసం ఐదెకరాల స్థలం కూడా కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. దానిని నేటికీ వినియోగించకపోవడం వల్ల సమస్య అలానే ఉండిపోయిందని.. తక్షణమే సద్వినియోగం చేసుకునేలా చూడాలని కోరారు. -
ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 35 వినతులు
సీతంపేట: స్థానిక ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ గ్రామాలకు చెందిన వ్యక్తిగత, సామాజిక, ఆర్థికపరమైన సమస్యలు 35 వినతులు వచ్చాయి. ఏపీవో ఎస్వీ గణేష్ వినతులు స్వీకరించారు. భామిని మండలం చింతలగూడకు చెందిన వి.బుచ్చిబాబు పవర్ టిల్లర్ ఇప్పించాలని కోరారు. వెంకటిగూడ గ్రామస్తుడు పల్గుణరావు పౌల్ట్రీఫారం పెట్టుకోవడానికి రుణం ఇప్పించాలన్నారు. తమ గ్రామానికి సీసీ రోడ్డు మంజూరు చేయాలని మొగదారగూడ గిరిజనులు కోరారు. బూతలగూడకు చెందిన సవర సునీల్ భూ విస్తీర్ణం సరి చేయాలని వినతి ఇచ్చారు. డీడీ అన్నదొర, డిప్యూటీ ఈవో రామ్మోహన్రావు, ఏపీడీ శ్రీహరిరావు, డీపీఎం రమణ, డీఈ నాగభూషనరావు తదితరులు పాల్గొన్నారు. -
తగ్గిన ఉసిరి..!
సీతంపేట: ఈ ఏడాది ఉసిరి రైతుకు కాలం కలిసి రాలేదు. దిగుబడులు అంతంతమాత్రమే. గిట్టుబాటు ధర కూడా దక్కక దిగులు చెందుతున్నారు. ఏటా నవంబర్ నెలలో ప్రారంభమైన సీజన్ డిసెంబర్ మా సాంతం వరకు ఉంటుంది. ఈ ఏడాది ఆ స్థాయిలో దిగుబడులు లేవని రైతులు చెబుతున్నారు. మైదాన వ్యాపారులు చెప్పిన ధరలకే పంటను విక్రయిస్తు న్నారు. కావిడ ఉసిరికాయల ధర వారపు సంతల్లో రూ.500ల నుంచి రూ.650 పలుకుతోంది. గతేడాది ఇదే సీజన్లో ఒక్కో కావిడ రూ.700 నుంచి 800 మధ్యలో అమ్మేవారమని గిరిజన రైతులు చెబుతున్నారు. మైదాన ప్రాంత వ్యాపారులదే హవా.. కారుచౌకగా ఉసిరి కాయలను కొనుగోలు చేసిన వ్యాపారులు పట్టణాల్లో అధికంగా విక్రయించి లాభాలు ఆర్జిస్తారు. ఖమ్మం, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడకు వచ్చి కొనుగోలు చేస్తారు. వారు పచ్చళ్లు, ఆయిల్ కంపెనీలకు సరఫరా చేస్తారు. సీతంపేటలో సోమవారం, మర్రిపాడులో బుధవారం, దోనుబాయిలో గురువారం, కుశిమి, పొల్ల గ్రామాల్లో శనివారం వారపు సంతలు జరుగుతాయి. ఈ సంతలకు వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు. గిరిజన రైతులు చెప్పిన ధరలు కాకుండా వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర నిర్ణయిస్తారు. దీంతో వారు చెప్పిన ధరకు ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని గ్రామాల్లో గిరిజనులు ముందుగా దళారీ వ్యాపారుల నుంచి అడ్వాన్స్‌లు తీసుకుంటారు. పంట పక్వానికి వచ్చే సమయంలో ఆ పంటను వ్యాపారులుకు ఇస్తారు. ఇలా కూడా గిరిజనులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. జీసీసీ ఉన్నా.. గిరిజన సహకార సంస్థ ఉసిరిని కొనుగోలు చేయడం లేదు. కేవలం ఎండు ఉసిరిని మాత్రమే కొనుగోలు చేస్తోంది. పచ్చి ఉసరిని మైదాన వ్యాపారులు కొనుగోలు చేయడంతో వారికే విక్రయిస్తున్నామని గిరిజనులు చెబుతున్నారు. ఉసిరిని ఎండబెట్టి విక్రయించాలంటే చాలా సమయం తీసుకుంటుందని గిరిజనులు చెబుతున్నారు. ఏటా గిరిజన రైతులకు నష్టాలు తప్పడం లేదు. కొండకోనల్లో ఉసిరి పంట ను సేకరించడం కష్టతరమైన పని. కుటుంబమంతా శ్రమించి సేకరించిన పంటకు గిట్టుబా టు ధర రావడం లేదు. – ఎస్.సొంబురు, ఈతమానుగూడ ఉసిరి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. పైనాపిల్, సీతాఫలం తర్వాత అతిముఖ్యమైన పంట ఇది. కొండ పోడు వ్యవసాయంలో పండిస్తాం. గిట్టుబాటు ధరలు లేవు. వారపు సంత కు తెచ్చిన ఉసిరిని ఏదో ఒక ధరకు వ్యాపారుల కు విక్రయించక తప్పడం లేదు. – ఎస్.బెన్నయ్య, ఈతమానుగూడ -
బైక్ దొంగ అరెస్టు
బొండపల్లి: వరుసగా బైక్‌ల దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విజయనగరం పట్టణానికి చెందిన పడాల జనార్దన్‌తో పాటు ఏడుగురు ముఠా సభ్యులు గ్రూపుగా ఏర్పడి తాళం వేసిన ఇళ్లల్లో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను గుర్తించి చోరీకి పాల్పడుతున్నట్టు తెలిపారు. వీరు ఇప్పటి వరకు నాలుగు బైక్‌లను దొంగలించినట్టు గుర్తించామని చెప్పారు. ప్రధాన నిందితుడు జనార్దన్‌ను సాంకేతిక సహాయంతో బొండపల్లి సమీపంలో ఉన్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈయనకు సహకరించిన ముగ్గురు మైనర్లను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. సమావేశంలో సీఐ జీఏవీ రమణ, ఎస్ఐ యు.మహేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
చంద్రబాబు సర్కారు
మొక్కజొన్న రైతును పట్టించుకోని చీపురుపల్లిరూరల్(గరివిడి): రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, పంటకు మద్ధతుధర లేక ఆర్థికంగా కుదేలవుతున్నా చంద్రబాబు ప్రభు త్వం పట్టించుకోవడంలేదంటూ శాసనమండలి విపక్ష నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. గరివిడి వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం చీపురుపల్లి నియోజకవర్గ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. గ్రామా ల్లో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో వరి తరువాత మొక్కజొన్న పంటనే ప్రధాన పంటగా రైతులు సాగు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయక పోవడం విచారకరమన్నారు. నెలరోజుల కిందట మొక్కజొన్న గింజలుఽ క్వింటాధర మార్కెట్లో రూ.2,400 ఉండగా ప్రస్తుతం రూ.1700 లకు పడిపోయిందన్నారు. క్వింటా దగ్గర రైతులు 7 వందల వరకు నష్టపోయారన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి, పాలకులకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేసినట్టు గుర్తుచేశారు. మార్క్ ఫెడ్‌తో పంట కొనుగోలు చేయించేవారమన్నారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో మాటలు తప్ప పనులు సాగడంలేదని, జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులకు సైతం రైతు సమస్యలను పట్టించుకునే తీరిక, బాధ్యత లేదన్నట్లుగా ఉన్నారని విమర్శించారు. రైతులకు కష్టాలు తప్పడంలేదు చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడంలేదని, ప్రస్తుతం మొక్కజొన్న సాగుచేసేవారు యూరియా, డీఏపీ కోసం దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోందని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రా ల్లో విరివిగా ఎరువులు లభించిన విషయాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో ధీరా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బొత్స సందీప్, బొత్స అనూష, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు కె.వి.సూర్యనారాయణరాజు, పార్టీ గరివిడి మండలాధ్యక్షుడు మీసాల విశ్వేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు వాకాడ శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ కొణిశ కృష్ణంనాయడు, పార్టీ చీపురుపల్లి మండలాధ్యక్షుడు ఇప్పిలి అనంతం, జిల్లా ప్రచారకార్యదర్శి వి.శ్రీనివాసులనాయుడు పాల్గొన్నారు. పంటకు లభించని మద్దతు ధర కొనుగోలు కేంద్రాలు లేక అవస్థలు జిల్లాలో వరి తరువాత మొక్కజొన్నే ప్రధాన పంట నష్టపోయిన రైతులను అలాగే వదిలేస్తారా? ప్రభుత్వానికి, పాలకులకు బాధ్యత లేదా? వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో అంధకారంలోకి విద్యార్థుల భవిష్యత్
నెల్లిమర్ల రూరల్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభిస్తోంది. ఊరూరా జరుగుతున్న ఈ కార్యక్రమం ఓ ఉద్యమంలా కొనసాగుతోంది. మండలంలోని మొయిద నారాయణపట్నం, ఆత్మారాముని అగ్రహారం ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు దవళ లక్ష్మణరావు, ఆదినారాయణ, తాతినాయుడు, శివ, శ్రీను, సూరినాయుడు, చిరంజీవి, సంతోష్ తదితరులు పాల్గొని, చంద్రబాబు ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు తీసుకుంటున్న దుర్మార్గపు నిర్ణయాలను వివరించారు. పీపీపీ(పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్షిప్) విధానంలో కళాశాలలు నడిపితే నిరుపేద విద్యార్థులకు వైద్యవిద్య దూరమై, విద్యార్థుల భవిష్యత్ అంధకారంలోకి వెళ్తుందన్నారు. ప్రతిఒక్కరూ సంతకాలు చేసి విద్యార్థుల భవితను కాపాడాలని కోరారు. -
కనిపించని హరి..
● హరి ఏనుగు ఏమైనట్టు? ● ఉన్నట్లా..? లేక ఎవరైనా మట్టుపెట్టినట్టా..? కురుపాం: హరి ఏనుగు జాడ కొన్నాళ్లుగా కానరావ డం లేదు. అసలు ఉన్నాట్టా..? లేక ఎవరైనా మట్టు పెట్టారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నా యి. అన్ని ఏనుగుల్లో హరి ఏనుగు చాలా తెలివైనది. కొన్ని సంవత్సరాలుగా తాగునీరు, ఆహార పంటలు సమృద్ధిగా లభించే కురుపాం నియోజకవర్గంలో సంచరించేది. పదేళ్లుగా నియోజకవర్గంలో కలియతిరుగుతున్న ఏనుగుల గుంపులోని ఒక గున్న ఏనుగును హరి అని అటవీశాఖ సిబ్బందిలో కేర్ టేకర్స్ ఒకరు పేరుపెట్టి వాటిని మచ్చిక చేసుకున్నారు. హరి ఏనుగు మనుషులు, స్థానిక ప్రజలు, అటవీశాఖ సిబ్బంది, కేర్ టేకర్స్తో కలియతిరుగుతుండేది. కొన్ని నెలలుగా హరిజాడ కానరావడం లేదు. అటవీశాఖ అధికారులు స్పందించి హరి ఏనుగు జాడ వెంటనే తెలియజేయాలని కోరుతున్నారు. -
జేఎన్టీయూ విద్యార్థులకు ఉద్యోగాలు
విజయనగరం రూరల్: స్థానిక జెఎన్టీయూ–జివి ఇంజినీరింగ్ కళాశాల (అటానమస్) విద్యార్థులు 10 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఆ కళాశాల ఉప కులపతి సుబ్బారావు శుక్రవారం తెలిపారు. నవంబర్ 14న జయరాజ్ స్టీల్ సంస్థ నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్‌లో మెటలర్జికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ విభాగానికి చెందిన 10 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తూ, విరి విజయం, జేఎన్టీయూ–జివి విద్యార్థుల ప్రతిభ, కృషి, పరిశ్రమ సిద్ధతకు నిదర్శనం అని పేర్కొన్నారు. ట్రైనింగ్ – ప్లేస్మెంట్ ఆఫీసర్ వీఎస్ వకుళ ఎంపికై న విద్యార్థులను అభినందిస్తూ, ఈ విజయం కళాశాలలోని ఉన్నత స్థాయి విద్యా వాతావరణం, మరియు విద్యార్థులకు ఆత్మవిశ్వాసం కలిగించే శిక్షణా కార్యక్రమాల ఫలితమని తెలిపారు. -
ఇసుక ట్రాక్టర్ ఢీకొని వెలుగు వీవోఏ మృతి
చికెన్రాజాం సిటీ: మండల పరిధి పెనుబాక గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముద్దాడజోగివలస గ్రామానికి చెందిన వెలుగు వీవోఏ కొయ్యాన జగదాంబ (44) మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. మృతురాలు వెలుగు వీవోఏగా విధులు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా తన సంఘంలోని సభ్యులకు రుణాల నిమిత్తం రాజాం కెనరా బ్యాంకుకు వెళ్లింది. అక్కడ విధులు ముగించుకుని అదే గ్రామానికి చెందిన సీఎస్పీ (కష్టమర్ సర్వీస్ ప్రొవైడర్) రామారావు బైక్‌పై బయలుదేరింది. పెనుబాక గ్రామ సమీపానికి వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొంది. ఈ ఘటనలో జగదాంబ ఘటనా స్థలంలోనే మృతి చెందగా రామారావు తీవ్ర గాయాల పాలయ్యాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ రాఘవులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుని వద్ద వివరాలు ఆరా తీశారు. అనంతరం గాయాలపాలైన బాదితుడిని రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి భర్త లక్ష్మీనారాయణతో పాటు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. విచ్చలవిడిగా ఇసుక తరలింపు విచ్చలవిడిగా మితిమీరిన వేగంతో ఇసుకను తరలిస్తు ట్రాక్టర్లు ప్రమాదాలకు కారణమౌతున్నాయని స్థానికులు వాపోతున్నారు. సంతకవిటి, రేగిడి మండలాల్లోని నాగావళి నది నుంచి ఇసుక తరలింపు జరుగుతుంది. గమ్యం చేరాలనే తొందరలో మితిమీరిన వేగంతో వెళ్తు ప్రమాదాలకు కారణమౌతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. గూడ్స్ రైలు ఢీకొని ఒకరు.. లక్కవరపుకోట : కొత్తవలస–కిరండోల్ (కేకే) రైల్వే లైన్లో మండలంలోని రంగరాయపురం సమీపంలో గూడ్స్ రైలు ఢీకొని మార్లాపల్లి గ్రామానికి చెందిన బత్తిన అప్పారావు(56) అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకొంది. మృతుడు అప్పారావు ఒంట్లో నలతగా వుందని కుమార్తె ఇంటికి వెళ్లి అక్కడ నుంచి ఆసుపత్రికి వెళ్తానని చెప్పి శుక్రవారం ఇంటి నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా కొత్తవలస నుంచి అరుకు వైపు వెళ్లున్న గూడ్స్ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకొని రోదించారు. ఈ మేరకు జీఆర్పీ ఎస్ఐ బాలాజీరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని శవ పంచనామ నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం తరలించారు. మృతుడికి భార్య రమణమ్మతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
27, 28 తేదీల్లో ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలు
విజయనగరం గంటస్తంభం: నగరంలో ఈ నెల 27, 28 తేదీల్లో ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్టు ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.రాము, సీహెచ్ వెంకటేష్ తెలిపారు. స్థానిక ఎల్బీజీ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సభలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 27న ఉదయం పది గంటలకు విద్యార్థులతో భారీ ర్యాలీ, అనంతరం గురజాడ కళాభారతి వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రెండో రోజు జిల్లాలో పేరుకుపోయిన విద్యా రంగ సమస్యలపై చర్చించనున్నట్టు పేర్కొన్నారు. భవిష్యత్ ప్రణాళికను రూపొందించి ఆ దిశగా విద్యా రంగ సమస్యల పరిష్కారానికి ఆందోళన కార్యక్రమాలు సిద్ధం చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా గర్ల్స్ కన్వీనర్ ఆర్.శిరీష, జిల్లా సహాయ కార్యదర్శి ఎ.చిన్నబాబు, జిల్లా ఉపాధ్యక్షులు జె.రవికుమార్, కె.జగదీష్, ఎస్.సోమేష్, జిల్లా కమిటీ సభ్యులు రమణ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్‌హెచ్‌జీలు స్వయం సమృద్ధి సాధించాలి
విజయనగరం టౌన్: స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం సమృద్ధి సాధించాలని వెలుగు, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి పేర్కొన్నారు. స్థానిక టీటీడీసీలో ఆదర్శ మండల సమాఖ్యలకు సంబంధించి శుక్రవారం వార్షిక యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేశారు. ఈ మేరకు నిర్వహిస్తున్న శిక్షణలో భాగంగా దుప్పాడ గ్రామం చిల్లపేటలో నిర్వహించిన శిక్షణలో ఆయన పాల్గొన్నారు. మోడల్ మండలాలుగా ఎంపిక చేసిన పది మండలాల్లో సమాఖ్య కార్యవర్గ సభ్యులతో పాటూ విశాఖ, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం సిబ్బందికి రాబోయే ఐదేళ్లలో ప్రాధాన్యత మార్పు అంశాలకు సంబంధించి వార్షిక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసే విధానంపై శిక్షణ ఇస్తామన్నారు. ఈ శిక్షణలో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సామాజిక భద్రత, ఆస్తులు, సృష్టి, ప్రవర్తనలో మార్పు, సుస్ధిర జీవనోపాధులు, సామర్ధ్యం పెంపు తదితర విషయాలపై వివరిస్తామన్నారు. కార్యక్రమంలో సెర్ప్ ఐబీ యూనిట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్స్ శోభ, వరప్రసాద్, వెలుగు, డీఆర్డీఏ డీపీఎంలు చిరంజీవి, రామమోహన్, వైదేహి, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు. వెలుగు, డీఆర్డీఏ పి.డి శ్రీనివాస్ పాణి -
శరవేగంగా పైడితల్లి ఆలయ అభివృద్ధి పనులు
విజయనగరం టౌన్: స్థానిక శ్రీపైడితల్లి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పనుల దృష్ట్యా భక్తుల దైవదర్శనానికి ఇబ్బంది కలగకుండా చదురుగుడి పక్కనే బాలాలయం నిర్మించి, అందులో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇదిలా ఉండగా ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా శుక్రవారం ఆలయానికి ఇరువైపులా ఉన్న గోడలను తొలగించారు. అంతరాలయంతో పాటు వెనుక ఉన్న ప్రహరీని కూడా తొలగించారు. 1.80 కోట్ల వ్యయంతో వచ్చే ఏడాది అమ్మవారి పండగలోపు ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
చంద్రబాబు పాలనలో.. తీరని గజ వేదన
పార్వతీపురం రూరల్: అధికారంలోకి వస్తే ఏనుగుల సమస్యను చిటికెలో పరిష్కరిస్తామన్న చంద్రబాబు హామీ.. నీటి మూటగానే మిగిలిపోయింది. కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా... మన్యం రైతులకు గజ గండం నుంచి విముక్తి లభించలేదు. ఓ పక్క ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోతుంటే.. మరోపక్క ఏనుగుల గుంపు పంట పొలాలపై పడి బీభత్సం సృష్టిస్తోంది. గత రెండు దశాబ్దాలుగా మన్యం జిల్లాను వణికిస్తున్న కరిరాజులు గురువారం మళ్లీ పార్వతీపురం మండలంలోకి ప్రవేశించాయి. శుక్రవారం బండిదొరవలస సమీపంలో సంచరిస్తుండటంతో రైతులు భయంతో వణికిపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కోతలు పూర్తయి కళ్లాల్లో రాశులుగా ఉన్న సమయంలో ఏనుగులు సంచరిస్తున్న నేపథ్యంలో భయాందోళనలో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గత నాలుగు నెలల్లో వందల ఎకరాల్లో పంట నాశనమైంది. ప్రభుత్వం అనేక నిబంధనలతో విదిల్చిన పరిహారం ఏ మూలకూ సరిపోదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ. 2 కోట్లు వ్యయంతో.. ఏనుగుల శాశ్వత నివారణకు ఎలిఫెంట్ జోన్ ఏర్పాటు చేస్తామని, సీతానగరం మండలం గుచ్చిమి వద్ద ప్రత్యేక విభాగం పెడతామని పాలకులు ప్రగల్భాలు పలికారు. ఇందుకోసం ఏకంగా రూ.2కోట్లు ఖర్చు చేశారు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మక్కువలో పునరావాస కేంద్రం ఏర్పాటుకు స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పిస్తామన్న మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప గడప దాటడం లేదు. 13 మంది మృతి ఏనుగుల దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అయినా ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు. ఎన్నికల వేళ హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు.. తప్ప ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని ప్రజలు, రైతులు, ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. చర్యలు చేపడుతున్నాం.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి 26వ తేదీలోగా కుంకీ ఏనుగుల సాయంతో జిల్లాలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును తరిలించే ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. వీటిని ముందుగా సీతానగరం మండలం గుచ్చిమిలో ఏర్పాటు చేసిన ఎలిఫెంట్ జోన్‌కు తరలించి, అక్కడి నుంచి అటవీ ప్రాంతాలకు పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న కుంకీ ఏనుగులకు అవసరమైన ఆహారం, వసతి ఏర్పాటు సిద్ధం చేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండేలా ప్రణాళికలు కూడా చేస్తున్నాం. – ప్రసూన, జిల్లా అటవీ శాఖాధికారి, పార్వతీపురం మన్యం -
మాతృ, శిశు మరణాల పట్ల కలెక్టర్ ఆగ్రహం
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభవించడం పట్ల వైద్య ఆరోగ్య శాఖపై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరణాలు చోటు చేసుకుంటుంటే క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నించారు. పేద ప్రజల ప్రాణాల రక్షణ కోసమే ఈ యంత్రాంగం ఉందని, సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే సహించేది లేదన్నారు. మాతృ, శిశు మరణాలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు. నాలుగు మాతృ మరణాలు, మూడు శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. చికిత్స అందించిన వైద్యులను ప్రశ్నించి కారణాలను తెలుసుకున్నారు. కొన్ని మరణాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తుందని తెలిపారు. ఆయా అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కొన్ని మరణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఆశ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గర్భిణులు, బాలికలు, మహిళల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలని తెలిపారు. ముఖ్యంగా బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, కౌమర దశలో వచ్చే శారీరక మార్పులు, నైతిక విలువలు, కట్టుబాట్లు, ఆకర్షణకు ప్రలోభాలకు లొంగిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్త, మహిళా పోలీసులతో కమిటీలు వేయాలన్నారు. మాతృ, శిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ జీవనరాణి, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మశ్రీ రాణి, డీఐవో డాక్టర్ అచ్చుతకుమారి, ఘోషాస్పత్రి గైనికాలజీ హెచ్‌వోడీ డాక్టర్ అరుణ శుభశ్రీ, డీఎల్వో డాక్టర్ కె.రాణి, ఐసీడీఎస్ పి.డి విమలారాణి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ఖోఖో అసోసియేషన్ నూతన కార్యవర్గం
విజయనగరం: జిల్లా ఖోఖో అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. నగరంలోని కో ప్రైవేటు హోటల్లో జరిగిన ఎన్నికల్లో అసోసియేషన్ చైర్మన్‌గా పెనుమజ్జి విజయలక్ష్మి, అధ్యక్షులుగా ఎఎంఎన్.కమలనాభరావు, ప్రధాన కార్యదర్శిగా కె.గోపాలరావు, కోశాధికారిగా ఎస్‌హెచ్.ప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బి.మల్లికార్జునరావు, గౌరవ అధ్యక్షులుగా పి.చిన్నంనాయుడు ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా ఆంధ్రా ఖోఖో అసోసియేషన్ ప్రతినిధి సిహెచ్.నాగభూషణం, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్.వేణుగోపాలరావు, న్యాయవాది ఎ.మోహనరావు పాల్గొన్నారు. రాష్ట్ర స్విమ్మింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న స్విమ్మింగ్ పోటీలకు జిల్లా జట్లు ఎంపిక పూర్తయింది. జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని కంటోన్మెంట్ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన ఎంపికల్లో సబ్ జూనియర్స్, జూనియర్స్ విభాగాల్లో ఎంపికలు నిర్వహించారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 22 నుంచి 23వ తేదీ వరకు విశాఖలో జరగనున్న అంతర్ జిల్లాల పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్టు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్.వేణుగోపాలరావు తెలిపారు. ఎంపిక పోటీలను అసోసియేషన్ కార్యదర్శి జి.ఆదిలింగం, కోచ్‌లు ఎల్.శ్రీను, కె.శ్రీనివాస్ పర్యవేక్షించారు. నేడు కలెక్టరేట్లో ప్రత్యేక వైద్య శిబిరం పార్వతీపురం రూరల్: ఉద్యోగ బాధ్యతల్లో నిమగ్నమయ్యే ప్రభుత్వ సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో శనివారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించన్నుట్టు జిల్లా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కలెక్టరేట్, ఐటీడీఏ, సబ్ కలెక్టర్ కార్యాలయాల సిబ్బంది కోసం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. జనరల్ మెడిసిన్, సర్జికల్, ఆర్థో, ఈఎన్టీ, గైనకాలజీ, కంటి, దంత, చర్మ వ్యాధుల నిపుణులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఈసీజీ, ల్యాబ్ పరీక్షలతో పాటు ఆభా ఐడీలను అక్కడికక్కడే నమోదు చేస్తారని, స్కానింగ్(ఎక్స్‌రే, స్కానింగ్) అవసరమైన వారికి జిల్లా ఆస్పత్రిలో సేవలు అందిస్తారన్నారు. విజయనగరం క్రైమ్: విజయనగరం టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి రింగురోడ్డు వద్ద శుక్రవారం పదో తరగతి విద్యార్థి రాకేష్ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. చదువు ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. అయితే అటు తల్లిదండ్రులుగాని, స్కూల్ యాజమాన్యంగాని పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఆత్మహత్యకు గల కారణాలను పూర్తిగా తెలియాల్సి ఉంది. రాకేష్ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదే విషయమై టూటౌన్ సీఐ శ్రీనివాస్‌ను వివరణ కోరగా ఇంతవరకు ఫిర్యాదు అందలేదన్నారు. పురుగుల మందు తాగి వృద్ధురాలి మృతి రామభద్ర పురం: మండలంలోని పాతరేగ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు గురువారం పురుగుల మందు తాగి విజయనగరం ఆస్రత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పాతరేగ గ్రామానికి చెందిన ఇల్లా అప్పయ్యమ్మ (70)కు ఇద్దరు కొడుకులు,ఇ ద్దరు కుమార్తెలు. అందరికీ వివాహాలు చేసింది. అయితే కొద్ది రోజులు చిన్న కొడుకు వద్ద ఉండేది. ఇప్పుడు అక్కడ కూడా ఉండకుండా ఒంటరిగా ఉంటుంది. అయితే ఒంటరిగా ఉంటున్నానన్న మనస్తాపం చెంది ఈ నెల 20వ తేదీన పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కోడలు భారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ ఆర్.అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


