కుష్ఠుపై దృష్టి అవసరం | - | Sakshi
Sakshi News home page

కుష్ఠుపై దృష్టి అవసరం

Jan 30 2026 7:02 AM | Updated on Jan 30 2026 7:02 AM

కుష్ఠ

కుష్ఠుపై దృష్టి అవసరం

కుష్ఠుపై దృష్టి అవసరం

● వ్యాధిని త్వరగా గుర్తిస్తే దరిచేరని అంగవైకల్యం

జిల్లాలో 248 కేసులు

నేడు కుష్ఠు నివారణ దినోత్సవం

కుష్ఠు వ్యాధిపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని జిల్లా రెవెన్యూ అధికారి ఈ. మురళి అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా ఈనెల 30 నుంచి పిబ్రవరి 13 వరకు అవగాహన కార్యక్రమాలు జిల్లా అంతటా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది వివక్షను అంతం చేయడం, గౌరవాన్ని కాపాడడం అనే నినాదంతో లెప్రసీ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కుష్ఠు వ్యాధిని ముందుగా గుర్తించడం ద్వారా అంగవైకల్యం రాకుండా చూడవచ్చన్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే సమీప పీహెచ్‌సీలో వైద్యుడి వద్ద చూపించుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా మందులు, చికిత్స అందించనున్నట్లు తెలిపారు. చర్మంపై స్పర్శ లేని మచ్చలు, మందమైన మెరిసే జిడ్డుగల చర్మం, చెవులు, వీపుపై మెడపై బొడిపెలు, కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం, వంటి లక్షణాలు ఉన్నా చల్లని, వేడి వస్తువులను గుర్తించకపోవడం, కాళ్లకు చెప్పులు జారిపోవడం తెలియకుండానే కాళ్లు బొబ్బలు రావడం, చేతి, కాలివేళ్లు వంకర్లు తిరిగి అంగ వైకల్యం పొందడం వంటి లక్షణాలు కలిగిన వారు వెంటనే పరీక్ష చేయించుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జీవనరాణి, డీఎల్‌ఓ డాక్టర్‌ రాణి, జిల్లా పరిషత్‌ సీఈఓ సత్యనారాయణ పాల్గొన్నారు.

విజయనగరం ఫోర్ట్‌: కుష్ఠు వ్యాధిగ్రస్తులను గతంలో వివక్షతో చూసేవారు. వారివైపు కూడా వెళ్లడానికి ఇష్టపడేవారుకాదు. సొంత కుటుంబసభ్యులు కూడా వారికి సపర్యలు చేయడానికి ఇష్టపడేవారు కాదు. వారికి ప్రత్యేకంచి తినడానికి ప్లేట్లు, గ్లాసులు పెట్టేవారు. అయితే ప్రస్తుతం సమాజంలో మార్పు వచ్చింది. కుష్ఠు వ్యాధి సోకినప్పటికీ వైద్యుల సలహా ప్రకారం చికిత్స తీసుకుంటే వ్యాధి నయం అవడంతో వ్యాధి సోకిన వారు చికిత్స తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. కుటుంబసభ్యులు కూడా వారికి చికిత్స చేయిస్తున్నారు. కుష్ఠు వ్యాధి తగ్గిందని అందరూ భావించారు. అయితే వ్యాధి మాత్రం ఇంకా సమాజాన్ని పీడిస్తూనే ఉంది. జిల్లాలో కేసులు నమోదవుతునే ఉన్నాయి. చాప కింద నీరులా వ్యాధి వ్యాపిస్తోంది. కుష్ఠు వ్యాధి మచ్చలు ఉన్నప్పటికీ అవి సాధారణ మచ్చలు అనుకుని చాలా మంది పట్టించుకోవడం లేదు. దీని వల్ల కేసులు నమోదవుతున్నాయి.

వ్యాధి పట్ల అప్రమత్తం

కుష్ఠు వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్పర్శ, నొప్పి లేని మచ్చలు కుష్ఠు వ్యాధి లక్షణాలుగా గుర్తించి వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. వ్యాధిని సకాలంలో గుర్తించగలిగితే అంగవైకల్యం బారిన పడకుండా కాపాడవచ్చు. వ్యాధి పట్ల నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

కుష్ఠులో రెండు రకాలు

కుష్ఠు వ్యాధిలో రెండు రకాలు ఉన్నాయి. పాసిబాసిలరీ(పీబీ), మల్టీ బాసిలరీ(ఎంబీ) ఉన్నాయి. ఐదు మచ్చల కంటే తక్కువగా ఉంటే పీబీ కుష్ఠు వ్యాధి అంటారు. దీనికి 6 నెలల పాటు మల్టీ డ్రగ్‌ థెరపీ(ఎండీపీ) మందులు వాడాల్సి ఉంటుంది. ఐదు కంటే ఎక్కువ మచ్చలు ఉంటే ఎంబీ కుష్ఠు వ్యాధిగా పరిగణిస్తారు. దీనికి 12 నెలల పాటు మందులు వాడాల్సి ఉంటుంది. మందులు పూర్తి స్థాయిలో వాడితే వ్యాధి నయం అవుతుంది.

248 కేసుల నమోదు

జిల్లాలో 2025–26 సంవత్సరంలో 248 కుష్ఠు వ్యాధి కేసులు నమోదయ్యాయి. వాటిలో ఎంబీ కేసులు 122 కాగా పీబీ కేసులు 126 ఉన్నాయి. బాధితుల్లో మగవారు131 మంది కాగా, 112 మంది మహిళలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు.

వ్యాధిపై అవగాహన కల్పిస్తాం

జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13వతేదీ వరకు కుష్ఠు వ్యాధిపై అవగాహన కల్పించనున్నాం. కుష్ఠు వ్యాధిని ఎండీటీ చికిత్స ద్వారా పూర్తి స్థాయిలో నివారించవచ్చు. మందులు పూర్తి స్థాయిలో రోగులు వాడాలి. మధ్యలో మానివేయకూడదు. వ్యాధి లక్షణాలు ఉన్న వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి.

డాక్టర్‌ కె.రాణి, జిల్లా కుష్ఠు నివారణ అధికారి

కుష్ఠుపై దృష్టి అవసరం1
1/1

కుష్ఠుపై దృష్టి అవసరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement