న్యూఢిల్లీ: భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన వస్త్రధారణతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. అటు సంప్రదాయం, ఇటు ఆధునిక శైలి కలబోతగా ఆయన ధరించిన దుస్తులు నిలిచాయి. ముఖ్యంగా ఆయన ధరించిన రాజస్థానీ శైలి తలపాగా ఈ వేడుకలో అందరినీ ఆకర్షించింది.
పశ్చిమ భారతదేశంలో శుభప్రదమైన రంగులుగా భావించే ఎరుపు, పసుపు, లేత ఆకుపచ్చ రంగుల మిశ్రమంతో, ‘లహరియా’ డిజైన్‌తో ప్రధాని మోదీ ధరించిన తలపాగాను రూపొందించారు. ఏటా ఒక రాష్ట్రానికి చెందిన ప్రత్యేక తలపాగాను ధరించాలన్న తన ఆనవాయితీని ప్రధాని మోదీ కొనసాగించారు. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యానికి అద్దం పట్టేలా ప్రధాని ఈ తరహా ఎంపిక చేసుకున్నారు.
77th #RepublicDay🇮🇳 | Prime Minister Narendra Modi arrives at the saluting dais at Kartavya Path in Delhi to witness the parade
(Source: DD) pic.twitter.com/Xb9dNsnJQD— ANI (@ANI) January 26, 2026
తలపాగాకు జతగా ప్రధాని లేత నీలం రంగు స్లీవ్‌లెస్ జాకెట్‌ను ధరించారు. ఇది సంప్రదాయ నెహ్రూ జాకెట్‌కు ఆధునిక రూపం. దీనిని ప్రస్తుతం ‘మోదీ జాకెట్’ అని పిలుస్తున్నారు. నాణ్యమైన ఖాదీ, చేనేత పట్టుతో తయారైన ఈ జాకెట్.. దేశీయ వస్త్ర పరిశ్రమపై ఆయనకున్న అభిమానాన్ని ప్రతిబింబిస్తోంది. తలపాగా రంగులను పోలిన పాకెట్ స్క్వేర్ ఆయన వస్త్రధారణకు మరింత హుందాతనాన్ని ఇచ్చింది.
ప్రధాని ధరించిన తలపాగా రాజస్థాన్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన ‘బందేజ్’శైలిని పోలి ఉంది. కాగా ప్రధాని మోదీ ‘ఎక్స్’వేదికగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘గణతంత్ర దినోత్సవం మన దేశ గౌరవానికి, కీర్తికి ప్రతీక అని, ఇది పౌరుల జీవితాల్లో కొత్త శక్తిని నింపాలని’ ఆయన ఆకాంక్షించారు. వికసిత భారత్ సంకల్పం మరింత బలపడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: నాటి రోజుల్లో.. రెండో పెద్ద పండుగ!


