న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగిన పరేడ్‌లో.. భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించింది. ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణలు ఇలా..

77వ గణతంత్ర దినోత్సవం: 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని.. భారత్ 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది.

ముఖ్య అతిథులు: ఈ ఏడాది యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
యుద్ధ స్మారకం వద్ద నివాళి: ప్రధాని నరేంద్ర మోదీ నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించి, దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు.
రాష్ట్రపతి రాక: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ముఖ్య అతిథులతో కలిసి సంప్రదాయ 'రాష్ట్రపతి బగ్గీ'లో కర్తవ్య పథ్‌కు చేరుకున్నారు.
జాతీయ జెండా ఆవిష్కరణ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం, 21 గన్ సెల్యూట్‌తో గౌరవ వందనం సమర్పించారు.
బ్రహ్మోస్ క్షిపణి ప్రదర్శన: పరేడ్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అపాచీ హెలికాప్టర్ల గర్జన: గగనతలంలో అపాచీ హెలికాప్టర్లు తమ విన్యాసాలతో వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
ధనుష్ గన్ సిస్టమ్: భారత సైన్యానికి వెన్నెముకగా నిలిచే ధనుష్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ పరేడ్‌లో భాగస్వామ్యం వహించింది.

అశోక చక్ర ప్రదానం: అంతరిక్ష యాత్రికుడు గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాకు దేశ అత్యున్నత పురస్కారం ‘అశోక చక్ర’ను రాష్ట్రపతి ప్రదానం చేశారు.
యూరోపియన్ యూనియన్ బృందం: తొలిసారిగా ఈ పరేడ్‌లో యూరోపియన్ యూనియన్ (EU) మిలిటరీ బృందం పాల్గొని గౌరవ వందనం సమర్పించింది.
ఆపరేషన్ సింధూర్ : ఇటీవల వార్తల్లో నిలిచిన ‘ఆపరేషన్ సింధూర్’ ఇతివృత్తంతో రూపొందించిన శకటం ప్రత్యేక గుర్తింపు పొందింది.
61వ కావల్రీ: ప్రపంచంలోనే ఏకైక క్రియాశీల గుర్రపు దళం అయిన '61వ కావల్రీ' పరేడ్‌లో తన రాజసాన్ని ప్రదర్శించింది.
వందేమాతరం థీమ్: ఈ ఏడాది పరేడ్ ‘వందేమాతరం - 150 ఏళ్లు’ అనే ప్రత్యేక థీమ్‌తో సాగింది.
రాష్ట్రాల శకటాలు: దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, మరో 13 వివిధ మంత్రిత్వ శాఖల శకటాలు ప్రదర్శనలో నిలిచాయి.
వికసిత్ భారత్ 2047: 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్యంతో వేడుకలు జరిగాయి.
కర్నల్ సోఫియా ఖురేషీకి గౌరవం: ఆపరేషన్ సింధూర్‌లో కీలక పాత్ర పోషించిన కర్నల్ సోఫియా ఖురేషీకి ‘విశిష్ట సేవా మెడల్’ ప్రకటించారు.
పద్మ అవార్డుల ప్రకటన: గణతంత్ర వేడుకల సందర్భంగా 131 మందికి పద్మ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది.
ట్రాఫిక్ ఆంక్షలు: పరేడ్ నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
లైవ్ స్ట్రీమింగ్: దేశ ప్రజలందరూ వీక్షించేలా దూరదర్శన్, యూట్యూబ్ ఛానళ్లలో వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ఇది కూడా చదవండి: మావోయిస్టు కోటలో మొదటిసారి మువ్వన్నెల రెపరెపలు


