breaking news
Republic Day 2026
-
భారతీయ అవుట్‌ఫిట్‌లో ఈయూ చీఫ్ ఉర్సులా ..!
భాతర 77వ గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఉర్సులా వాన్ డెర్ లేయన్ హాజరయ్యిన సంగతి తెలిసిందే. ఆమె ఈ వేడుకలో తన వేషధారణతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా పలు అంతర్జాతీయ కార్యక్రమాల్లో సిగ్నేచర్ టైలర్డ్ ప్యాంట్సూట్లకు పేరుగాంచిన ఈయూ చీఫ్ ఉర్సులా మెరూన్-అండ్-గోల్డ్ బ్రోకేడ్ బంద్‌గాలా విత్ ఆఫ్-వైట్ ప్యాంట్లో కనిపించారు. భారతీయ శైలిలో వచ్చి..ఈ వేడుకను మరింత అందంగా మార్చారామె. భారతీయ సంస్కృతిపట్ల గౌరవాన్ని, అలాగే ఈ వేడుక ప్రాముఖ్యతన ఉర్సులా తన ఆహార్యంతో చెప్పకనే చెప్పారామె. సాంప్రదాయపు గుర్రపు బగ్గీలో అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియోలస్ శాంటోస్ డా కోస్టాతో కలిసి కర్తవ్య పథ్‌కు చేరుకోవడానికి కొన్ని క్షణాల ముందు, చీఫ్ ఉర్సులా సోషల్ మీడియా వేదికగా ఇలా రాసుకొచ్చారు. "ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా ఉండటం అనేది తన జీవితకాల గౌరవం. విజయవంతమైన భారతదేశం ప్రపంచాన్ని మరింత స్థిరంగా, సంపన్నంగా, సురక్షితంగా చేస్తుంది. తద్వారా మనందరం ప్రయోజనం పొందుతాం." అని పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, 2019లో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ. ఆమె జూలై 2024లో రెండవసారి ఆ పదవికి తిరిగి ఎన్నికయ్యారు. 2029లో జరిగే యూరోపియన్ ఎన్నికల వరకు కమిషన్‌కు నాయకత్వం వహిస్తారు. పైగా యూరోపియన్ కమిషన్‌లో తన పదవీకాలానికి ముందు, వాన్ డెర్ లేయెన్ 2005 నుంచి 2019 వరకు జర్మనీ సమాఖ్య ప్రభుత్వంలో పనిచేశారు. ఈ సమయంలో ఆమె కుటుంబం, యువజన, కార్మిక, రక్షణ వంటి కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించి, పాలన, ప్రజా సేవలో విస్తృతమైన అనుభవాన్ని పొందారు.77th #RepublicDay🇮🇳 | President Droupadi Murmu, along with President of the European Council, António Luís Santos da Costa and President of the European Commission, Ursula Von Der Leyen, arrives at the saluting dais at Kartavya Path in Delhi to witness the paradePrime Minister… pic.twitter.com/5Snpohoa5m— ANI (@ANI) January 26, 2026 (చదవండి: వెయ్యి కోట్ల కంపెనీని నిర్మించిన మాజీ పైలట్: ఆ ప్రమాదం ఆకాశం నుంచి..) -
ఖైరతాబాద్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు (ఫొటోలు)
-
ఖర్గే, రాహుల్‌కు మూడో వరుసా?
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకలు ప్రొటోకాల్ రగడకు వేదికయ్యాయి. విపక్ష నేతలకు వెనక వరుసల్లో సీట్లు కేటాయించడం వివాదానికి దారితీసింది. సోమవారం కర్తవ్యపథ్‌లో జరిగిన వేడుకల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీకి మూడో వరుసలో స్థానం కల్పించారు. లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్ష నేతలైన వారిద్దరినీ మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అవమానించిందని కాంగ్రెస్ ఆరోపించింది. వారు మూడో వరుసలో కూర్చున్న ఫొటోలను ఆ పారీ్టకి చెందిన పలువురు నేతలు ఎక్స్‌లో పంచుకున్నారు.తమ నేతలకు సీట్ల కేటాయింపులో వివక్ష ఎందుకని నిలదీశారు. ఇవి చిల్లర చేష్టలంటూ మండిపడ్డారు. మోదీ సర్కారు ఆత్మన్యూనతకు ఈ ఉదంతం నిదర్శనమని రణ్‌దీప్ సుర్జేవాలా తదితరులు విమర్శించారు. యూపీఏ హయాంలో బీజేపీకి చెందిన విపక్ష నేత ఎల్కే అడ్వాణీకి తొలి వరుసలోనే స్థానం దక్కేదని వారు గుర్తు చేశారు. అయితే వేడుకలు ప్రారంభమైన కాసేపటికి ఖర్గే మొదటి వరుసలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పక్క సీటుకు మారారు. కాంగ్రెస్ విమర్శల్లో అహంకారమే తప్ప మరేమీ లేదంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనేవాలా ఎదురుదాడికి దిగారు.क्या देश के विपक्ष के नेता के साथ ऐसा व्यवहार किसी मर्यादा, परंपरा और प्रोटोकॉल के मापदंड पर खरा उतरता है ?ये केवल हीन भावना से ग्रस्त सरकार की कुंठा दिखाता है ।प्रजातंत्र में मतभेद रहेंगे मगर श्री @RahulGandhi के साथ किया जाने वाला ये व्यवहार अस्वीकार्य है। pic.twitter.com/b4mdU9BU7G— Randeep Singh Surjewala (@rssurjewala) January 26, 2026 -
మువ్వన్నెల గౌరవం!
జెండా పడిపోవచ్చు.. కానీ భారతీయుడి దేశభక్తి ఎప్పుడూ తలవంచుకోదు!.. అని ఓ ఆటో డ్రైవర్ నిరూపించాడు. గణతంత్ర దినోత్సవాల వేళ సోషల్ మీడియాను ఫిదా చేస్తున్న అద్భుత దృశ్యమిది. ఆకాశమంత దేశభక్తికి ఆస్కారం అక్కర్లేదు.. చిన్నపాటి గౌరవం చాలని చాటి చెప్పిన క్షణమది.చిన్నారి కళ్లలో వెలుగుఅనన్య సింగ్ అనే యువతి తన రాపిడో ఆటోలో వెళ్తుండగా.. పక్కనే ఒక కారు కిటికీలోంచి ఓ చిన్నారి ఉత్సాహంగా జాతీయ జెండాను ఊపుతోంది. వేగంగా వెళ్తున్న ఆ కారు గాలికి అకస్మాత్తుగా ఆ పాప చేతిలో ఉన్న త్రివర్ణ పతాకం జారి రోడ్డుపై పడిపోయింది. క్షణం కూడా ఆలోచించకుండా ఆ రాపిడో డ్రైవర్ తన ఆటోను ఆపాడు. కిందపడిన జెండాను అత్యంత భక్తితో చేతుల్లోకి తీసుకున్నాడు. దానిపై ఉన్న ధూళిని దులిపి, ఎంతో ప్రేమగా తిరిగి ఆ చిన్నారికి అందజేశాడు. తన జెండా దక్కగానే ఆ చిన్నారి ముఖంలో విరిసిన ఆనందం, దాన్ని అందిస్తున్నప్పుడు ఆ డ్రైవర్ కళ్లలో కనిపించిన సంతృప్తి.. ‘వందేమాతరం’ ఆత్మను ప్రతిబింబించాయి.అది అద్భుతం‘నా రాపిడో డ్రైవర్ ఆ జెండాను తీసి, తుడిచి, అంత ప్రేమతో తిరిగి ఇచ్చిన తీరు అద్భుతం’.. అంటూ అనన్య సింగ్ వీడియోను ఎక్స్‌లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. ఈ ఏడాది ‘వందేమాతరం – 150 ఏళ్లు’ థీమ్‌తో భారత్ గణతంత్ర వేడుకలను జరుపుకొంటోంది. కర్తవ్య పథ్‌లో సైనిక కవాతులు ఒకవైపు దేశ బలాన్ని చాటుతుంటే, రోడ్డు మీద సామాన్య ఆటో డ్రైవర్ చూపిన ఈ ‘జన భాగీదారీ’ (ప్రజల భాగస్వామ్యం) దేశపు సంస్కారాన్ని చాటిచెప్పింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రతిపక్ష నేతకిచ్చే గౌరవం ఇదేనా?: కాంగ్రెస్
భారత 77వ గణతంత్ర వేడుకలు ఈ రోజు ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఘనంగా జరిగింది. అయితే ఈ సందర్భంగా ఓ వివాదం చెలరేగింది. లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి మూడో వరుసలో సీటు కేటాయించడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. లోక్‌సభ ప్రతిపక్ష నేతను గౌరవించే విధానం ఇదేనా అంటూ బీజేపీని ప్రశ్నించింది.కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సుర్జీవాలా ఈ అంశంపై బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు" లోక్‌సభ ప్రతిపక్ష నేతను గౌరవించే విధానం ఇదేనా? ఇది సంప్రదాయాలు, మర్యాద, ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఉందా? ఇది ప్రభుత్వం యెుక్క ఆత్మన్యూనత భావానికి నిదర్శనమనం అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ స్పందిస్తూ బీజేపీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అవమానించాలనే ఉద్దేశంతోనే ఈ విధమైన చర్యలకు పాల్పడిందన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా అద్వానీ బీజేపీ నేత అయినప్పటికీ ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చేదన్నారు. 2014లో అద్వానీ లోక్‌సభ ప్రతిపక్ష నేత కాదని అయినప్పటికీ కాంగ్రెస్ ఎంతో గౌరవంతో ఆయనకు ముందు వరసలో కూర్చొబెట్టి గౌరవం ఇచ్చిందన్నారు. ప్రస్తుతం మోదీ, అమిత్‌షాలు ఉద్దేశపూర్వకంగానే రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను అవమానిస్తున్నారని మాణిక్యం ఠాగూర్ అన్నారు.అయితే దీనిపై కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటరిచ్చింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మాట్లాడుతూ రాహుల్‌గాంధీ మూడో వరుసలో కూర్చోవడంపై ఆందోళన చెందడం లేదు. గణతంత్ర వేడుకల సందర్భంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన బ్రహ్మోస్ క్షిపణుల ప్రదర్శన జరగుతున్నప్పుడు ఆయన తన మెుబైల్ చూస్తూ బిజీగా ఉన్నాడు. అని ఆయన అన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు. -
భారత్‌కు డొనాల్డ్ ట్రంప్ సందేశం
న్యూఢిల్లీ: భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సందేశాన్ని పంపారు. భారతదేశంలోని ప్రభుత్వానికి, ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో భారత్-అమెరికాలది హిస్టారిక్ బాండ్ అంటూ కోడ్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఉన్న ‘బ్లాక్ అండ్ వైట్’ ఫోటోను షేర్ చేశారు ట్రంప్. తమది ఎన్నో దశాబ్దాల సంబంధం అని అర్ధం వచ్చేలా ఉంది ట్రంప్ షేర్ చేసిన ఫోటో. భారత ప్రభుత్వానికి, భారత ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలను అమెరికా ప్రజల తరఫున తెలియజేస్తున్నాను అని ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించి యూఎస్ ఎంబసీ తన అధికారిక అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈరోజు అంతకముందే భారత్‌కు అమెరికా శుభాకాంక్షలు తెలియజేసింది. భారత్‌తో తమది చారిత్రాత్మక బంధం అంటూ అమెరికా శుభాకాంక్షలు తెలియజేసింది. ఆపై అధ్యక్షుడు ట్రంప్ కూడా అదే సందేశాన్ని ఇచ్చారు. “On behalf of the people of the United States, I extend my heartfelt congratulations to the government and people of India as you celebrate your 77th Republic Day. The United States and India share a historic bond as the world’s oldest and largest democracies.” - President… pic.twitter.com/oC9x3Qs9y3— U.S. Embassy India (@USAndIndia) January 26, 2026 ఇదీ చదవండి: మనది చారిత్రాత్మక బంధం: అమెరికా శుభాకాంక్షలు -
R-DAY 2026: ఈసారీ ‘మోదీ మార్క్’ వైరల్
న్యూఢిల్లీ: భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన వస్త్రధారణతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. అటు సంప్రదాయం, ఇటు ఆధునిక శైలి కలబోతగా ఆయన ధరించిన దుస్తులు నిలిచాయి. ముఖ్యంగా ఆయన ధరించిన రాజస్థానీ శైలి తలపాగా ఈ వేడుకలో అందరినీ ఆకర్షించింది.పశ్చిమ భారతదేశంలో శుభప్రదమైన రంగులుగా భావించే ఎరుపు, పసుపు, లేత ఆకుపచ్చ రంగుల మిశ్రమంతో, ‘లహరియా’ డిజైన్‌తో ప్రధాని మోదీ ధరించిన తలపాగాను రూపొందించారు. ఏటా ఒక రాష్ట్రానికి చెందిన ప్రత్యేక తలపాగాను ధరించాలన్న తన ఆనవాయితీని ప్రధాని మోదీ కొనసాగించారు. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యానికి అద్దం పట్టేలా ప్రధాని ఈ తరహా ఎంపిక చేసుకున్నారు. 77th #RepublicDay🇮🇳 | Prime Minister Narendra Modi arrives at the saluting dais at Kartavya Path in Delhi to witness the parade(Source: DD) pic.twitter.com/Xb9dNsnJQD— ANI (@ANI) January 26, 2026తలపాగాకు జతగా ప్రధాని లేత నీలం రంగు స్లీవ్‌లెస్ జాకెట్‌ను ధరించారు. ఇది సంప్రదాయ నెహ్రూ జాకెట్‌కు ఆధునిక రూపం. దీనిని ప్రస్తుతం ‘మోదీ జాకెట్’ అని పిలుస్తున్నారు. నాణ్యమైన ఖాదీ, చేనేత పట్టుతో తయారైన ఈ జాకెట్.. దేశీయ వస్త్ర పరిశ్రమపై ఆయనకున్న అభిమానాన్ని ప్రతిబింబిస్తోంది. తలపాగా రంగులను పోలిన పాకెట్ స్క్వేర్ ఆయన వస్త్రధారణకు మరింత హుందాతనాన్ని ఇచ్చింది.ప్రధాని ధరించిన తలపాగా రాజస్థాన్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన ‘బందేజ్’శైలిని పోలి ఉంది. కాగా ప్రధాని మోదీ ‘ఎక్స్’వేదికగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘గణతంత్ర దినోత్సవం మన దేశ గౌరవానికి, కీర్తికి ప్రతీక అని, ఇది పౌరుల జీవితాల్లో కొత్త శక్తిని నింపాలని’ ఆయన ఆకాంక్షించారు. వికసిత భారత్ సంకల్పం మరింత బలపడాలని ఆయన పిలుపునిచ్చారు.ఇది కూడా చదవండి: నాటి రోజుల్లో.. రెండో పెద్ద పండుగ! -
నాటి రోజుల్లో.. రెండో పెద్ద పండుగ!
ప్రతీయేటా పెద్ద పండుగ(సంక్రాంతి) తరువాత రిపబ్లిక్ డే వస్తుంటుంది. నాటి రోజుల్లో ఈ గణతంత్ర వేడుకలు రెండో పెద్ద పండుగలా జరిగేవి... అంటే ఇప్పుడు అలా లేదని కాదు.. నాడు ఇళల్లో నెలకొన్న ఉత్సాహం కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది. దూరదర్శన్ ప్రధాన వినోద మాధ్యమంగా ఉన్న 90ల నాటి ఆ తీపి జ్ఞాపకాల తుట్టెను ఒకసారి కదిలిస్తే..నాటి రోజుల్లో రిపబ్లిక్ డే ఉదయం అంటే చాలు.. అదొక తెలియని ఉత్సాహం.. బయట చలి గాలులు వీస్తున్నా.. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిలో అందరూ తెల్లవారుజామునే నిద్రలేచేవారు. నాడు స్మార్ట్ఫోన్ల స్క్రోలింగ్ అనేదే లేదు.. ఆపకుండా వచ్చే నోటిఫికేషన్ల గోల అంతకన్నా లేదు.. వందల కొద్దీ టీవీ ఛానెళ్ల గందరగోళం అసలే లేదు. కుటుంబ సభ్యులంతా చలిని తట్టుకునేందుకు దుప్పట్లు కప్పుకుని, చేతిలో వేడి వేడి టీ కప్పులతో టీవీ ముందుకు చేరేవారు. దూరదర్శన్‌లో వచ్చే రిపబ్లిక్ డే ప్రసారాలను చూసేందుకు ఎంతో ఉత్పాహం చూపించేవారు.దూరదర్శన్ రిపబ్లిక్ డే ప్రసారాలకు ఒక ప్రత్యేకమైన నేపథ్య సంగీతం ఉండేది. వ్యాఖ్యాతల గంభీరమైన గొంతు, రాజ్‌పథ్ దృశ్యాలు మనసులో దేశభక్తిని నింపేవి. సైనికుల కవాతును పిల్లలు ఆశ్చర్యంగా చూస్తుంటే, శకటాల గురించి తల్లిదండ్రులు చర్చించుకునేవారు. తాతయ్యలు, నాయనమ్మలు గత స్మృతులను నెమరువేసుకునేవారు. కెమెరా చూపించే ప్రతి కోణం, ప్రతి క్షణం ఎంతో ముఖ్యమైనదిగా భావించేవారు. రాష్ట్రపతి సెల్యూట్ నుంచి చివరిలో యుద్ధ విమానాల విన్యాసాల వరకు, కుటుంబం మొత్తం ఆ కార్యక్రమాలనన్నింటినీ కన్నార్పకుండా చూసేది.నాటి పాఠశాల విద్యార్థులకు రిపబ్లిక్ డే అంటే రెట్టింపు ఉత్సాహం వచ్చేది. బడికి వెళ్లే హడావిడి లేదు, హోంవర్క్ టెన్షన్ లేదు. కొంతమంది పిల్లలు ముందు రోజే స్కూల్ ఉత్సవాల్లో పాల్గొని ఉంటే, మరికొందరు నాటి సెలవును ఆస్వాదించేవారు. టీవీలో వచ్చే పరేడ్ తప్పనిసరిగా చూసేవారు. ఈ ప్రసారం ముగిశాక కొందరు జెండా వందనం కోసం బయటకు వెళ్తే, మరికొందరు ఇంట్లోనే ఉండి పిండివంటలు ఆరగించేవారు. ఆనాటి గణతంత్ర సంబరం ఆత్మీయత, అనుబంధాల మధ్య జరిగేది.ప్రతి ఒక్కరి చేతిలో తలొక ఫోను లేని ఆ రోజుల్లో, కుటుంబం మొత్తం ఒకే టీవీ సెట్ ముందు కూర్చునేది. వ్యక్తిగత స్క్రీన్లు లేవు, చెవులకు హెడ్ ఫోన్లు పెట్టుకుని ఎవరి లోకంలో వారు ఉండటాలు లేవు. నేడు రిపబ్లిక్ డేని మనం ఎంతో గొప్పగా జరుపుకుంటున్నా, ఆనాటి దూరదర్శన్ జ్ఞాపకాలు అందరి మదిలో చెరగని ముద్ర వేశాయి. ఒకే ఒక్క దూరదర్శన్ ప్రసారం కోట్లాది మందిని ఏకం చేసిన తరుణం అది. రిపబ్లిక్ డే అంటే కేవలం దేశభక్తి మాత్రమే కాదు, కుటుంబంతో గడిపే సంతోషకరమైన రోజు అని మనకు గుర్తుచేస్తుంది. ఇది కూడా చదవండి: గణతంత్ర వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్స్ ఇవే.. -
ఏపీలో యథేచ్ఛగా రెడ్‌బుక్ రాజ్యాంగం: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: గణతంత్ర దినోత్సవ ఫలితాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. రాజ్యాంగాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏపీలో రాజ్యాంగానికి విలువ,గౌరవం లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బీసెంట్ రోడ్డులో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాది విషు.. జాతీయ జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు సామాజిక సమతుల్యత పాటించాల్సిన ప్రభుత్వం.. ఏకపక్షంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా పనిచేయడం లేదని మండిపడ్డారు. గత ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో ప్రజలకు స్వాతంత్ర ఫలాలను ప్రజలకు చేరువ చేశాం.. కానీ 20 నెలల కూటమి పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు’’ అని మల్లాది విష్ణు అన్నారు.ఏపీలో అన్యాయం రాజ్యమేలుతోంది: కేకే రాజువిశాఖ: విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు.. జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్యాయం రాజ్యమేలుతుందన్నారు. రాజ్యాంగాన్ని అనుసరించిన పాలన ఇక్కడ జరగడం లేదని మండిపడ్డారు. 2019 నుంచి 2024 వరకు రాజ్యాంగానికి లోబడి వైఎస్ జగన్ పాలన చేశారని కేకే రాజు అన్నారు.‘‘విద్య ఒక్కటే సమాజంలో సమానత్వం తీసుకొస్తుందని నమ్మి వైఎస్ జగన్ విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు. వెనుకబడిన వర్గాల వారికి వైఎస్ జగన్ ఊతం ఇచ్చారు. అణగారిన సామాజిక వర్గాలకు చట్ట సభల్లో వైఎస్.జగన్ ప్రాతినిధ్యం కల్పించారు. వెనుకబడిన కులాల కోసం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు దేశ చరిత్రలో ఎవ్వరూ తీసుకోలేదు. రాష్ట్రంలో సాగుతున్న రాచరిక పాలనపై మనమంతా ఐక్యంగా పోరాడాలి’’ అని కేకే రాజు పిలుపునిచ్చారు. -
గణతంత్ర వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్స్ ఇవే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగిన పరేడ్‌లో.. భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించింది. ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణలు ఇలా..77వ గణతంత్ర దినోత్సవం: 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని.. భారత్ 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది.ముఖ్య అతిథులు: ఈ ఏడాది యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.యుద్ధ స్మారకం వద్ద నివాళి: ప్రధాని నరేంద్ర మోదీ నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించి, దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు.రాష్ట్రపతి రాక: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ముఖ్య అతిథులతో కలిసి సంప్రదాయ 'రాష్ట్రపతి బగ్గీ'లో కర్తవ్య పథ్‌కు చేరుకున్నారు.జాతీయ జెండా ఆవిష్కరణ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం, 21 గన్ సెల్యూట్‌తో గౌరవ వందనం సమర్పించారు.బ్రహ్మోస్ క్షిపణి ప్రదర్శన: పరేడ్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.అపాచీ హెలికాప్టర్ల గర్జన: గగనతలంలో అపాచీ హెలికాప్టర్లు తమ విన్యాసాలతో వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.ధనుష్ గన్ సిస్టమ్: భారత సైన్యానికి వెన్నెముకగా నిలిచే ధనుష్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ పరేడ్‌లో భాగస్వామ్యం వహించింది.అశోక చక్ర ప్రదానం: అంతరిక్ష యాత్రికుడు గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాకు దేశ అత్యున్నత పురస్కారం ‘అశోక చక్ర’ను రాష్ట్రపతి ప్రదానం చేశారు.యూరోపియన్ యూనియన్ బృందం: తొలిసారిగా ఈ పరేడ్‌లో యూరోపియన్ యూనియన్ (EU) మిలిటరీ బృందం పాల్గొని గౌరవ వందనం సమర్పించింది.ఆపరేషన్ సింధూర్ : ఇటీవల వార్తల్లో నిలిచిన ‘ఆపరేషన్ సింధూర్’ ఇతివృత్తంతో రూపొందించిన శకటం ప్రత్యేక గుర్తింపు పొందింది.61వ కావల్రీ: ప్రపంచంలోనే ఏకైక క్రియాశీల గుర్రపు దళం అయిన '61వ కావల్రీ' పరేడ్‌లో తన రాజసాన్ని ప్రదర్శించింది.వందేమాతరం థీమ్: ఈ ఏడాది పరేడ్ ‘వందేమాతరం - 150 ఏళ్లు’ అనే ప్రత్యేక థీమ్‌తో సాగింది.రాష్ట్రాల శకటాలు: దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, మరో 13 వివిధ మంత్రిత్వ శాఖల శకటాలు ప్రదర్శనలో నిలిచాయి.వికసిత్ భారత్ 2047: 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్యంతో వేడుకలు జరిగాయి.కర్నల్ సోఫియా ఖురేషీకి గౌరవం: ఆపరేషన్ సింధూర్‌లో కీలక పాత్ర పోషించిన కర్నల్ సోఫియా ఖురేషీకి ‘విశిష్ట సేవా మెడల్’ ప్రకటించారు.పద్మ అవార్డుల ప్రకటన: గణతంత్ర వేడుకల సందర్భంగా 131 మందికి పద్మ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది.ట్రాఫిక్ ఆంక్షలు: పరేడ్ నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.లైవ్ స్ట్రీమింగ్: దేశ ప్రజలందరూ వీక్షించేలా దూరదర్శన్, యూట్యూబ్ ఛానళ్లలో వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేశారు.ఇది కూడా చదవండి: మావోయిస్టు కోటలో మొదటిసారి మువ్వన్నెల రెపరెపలు -
నేటి నుంచి ‘భారత్ పర్వ్’.. 31 వరకూ సందడి!
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘భారత్ పర్వ్’ ఉత్సవాలకు ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబైంది. జనవరి 26 నుండి 31 వరకు ఆరు రోజుల పాటు జరగనున్న ఈ జాతీయ సాంస్కృతిక, పర్యాటక మహోత్సవాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సంయుక్తంగా ప్రారంభించనున్నారు.దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, రుచులను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ ఉత్సవ ప్రధాన ఉద్దేశ్యం. భారతదేశపు భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పేలా ఈ ఉత్సవం రూపుదిద్దుకుంది. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణగా 41 శకటాల ప్రదర్శన నిలవనుంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన కళాకారులు తమ సంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో సందర్శకులను అలరించనున్నారు.ఈ ఉత్సవంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన విభిన్న రుచులను అందించే 60 స్టాల్స్‌తో కూడిన భారీ ఫుడ్ కోర్ట్, లైవ్ కుకింగ్ డెమోలు ఆహార ప్రియులను ఆకట్టుకోనున్నాయి. ఈ ఆరు రోజుల పండుగలో అందరూ పాల్గొనేందుకు ఉచిత ప్రవేశాన్ని కల్పించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, 25కి పైగా కేంద్ర మంత్రిత్వ శాఖలు, ప్రముఖ సంస్థలు ఈ వేడుకలో భాగస్వామ్యం కానున్నాయి. ఈ వేడుకకు ప్రజలు భారీగా తరలివస్తారని అధికారులు ఆశిస్తున్నారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, మురుగుడు హనుమంతరావు తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. దేశానికి స్వతంత్రం కోసం ఎంతోమంది మహానుభావులు ప్రాణత్యాగం చేశారన్నారు. అంబేద్కర్ తలపెట్టిన ఆశయాలకు అనుగుణంగా అందరూ పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ‘‘అంబేద్కర్ స్ఫూర్తికి ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయి. స్వార్థం, అవినీతితో ప్రభుత్వాలు పాలన చేస్తున్నాయి. రాష్ట్రం ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా పని చేస్తోంది’’ అని బొత్స పేర్కొన్నారు.వైఎస్సార్ ఆశయ సాధనకు జగన్ కృషి చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ప్రతిపక్షంగా ప్రజల కోసం వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. పేద ప్రజల శ్రేయస్సు కోసం పని చేయాలన్నది పార్టీ అధినేత జగన్ నిర్ణయం. ఆ మేరకు కేడర్ పని చేయాలి’’ అని బొత్స పిలుపునిచ్చారు. -
ప్రజలకు వైఎస్ జగన్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా తెలుగు ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశ సార్వభౌమత్వాన్ని ఘనంగా జరుపుకుందాం. ఐక్యత, అభివృద్ధికి ప్రేరణనిస్తూ జాతీయ జెండా ఎప్పుడూ ఎగురుతూ ఉండాలి. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. జై హింద్’ అని పేర్కొన్నారు. Celebrating our Sovereignty, let us salute the vibrant spirit of our great Nation on this 77th Republic Day. May the tricolor always fly high, inspiring unity and progress! Happy Republic Day. Jai Hind!#RepublicDay— YS Jagan Mohan Reddy (@ysjagan) January 26, 2026 -
తెలంగాణలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్స వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. జాతీయజెండాను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. ముందుగా అమర వీరుల స్తూపం వద్ద గవర్నర్ నివాళులర్పించారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్, డీజీపీ, మంత్రులు పాల్గొన్నారు.గవర్నర్ ప్రసంగిస్తూ.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం 1950 జనవరి 26 నుంచి మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని.. అప్పటి నుంచి భారత్ ఒక గణతంత్ర దేశంగా అవతరించిందన్నారు. ఆ చారిత్రాత్మక క్షణం నుంచే రాజ్యాంగం దేశానికి మార్గ నిర్దేశం చేస్తోందన్న గవర్నర్.. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మూల సూత్రాలతో దేశాన్ని నడిపిస్తోందన్నారు.‘‘గణతంత్ర దినోత్సవం కేవలం పండుగ మాత్రమే కాదు... మన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం, రాజ్యాంగ విలువలను కాపాడటం, సుసంపన్నమైన మన వైవిధ్యంలో ఐక్యతను సాధించాలనే మన గురుతర బాధ్యతను గుర్తు చేసే పవిత్ర దినం. ఇది భారత ఆత్మను ప్రతిబింబించే జాతీయ పండుగ...మన రాజ్యాంగ నిర్మాణానికి ప్రజాస్వామ్యమే పునాది. ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల ద్వారా పాలనను అందించడానికి ఇది మార్గ నిర్దేశం చేస్తుంది. ఈ పవిత్ర దినాన... న్యాయం, సమానత్వం, సోదరభావం వంటి విలువలను మరింత పరిరక్షించడానికి పునరంకితమవుతూ ముందుకు సాగాలి. ఇవే ఒక బలమైన దేశానికి మూల స్థంభాలు...సీఎం రేవంత్ నాయకత్వంలో రెండేళ్ల క్రితం ఏర్పడిన ప్రజా ప్రభుత్వం.. గణనీయమైన విజయాలను సాధించి ప్రజల విశ్వాసాన్ని, ప్రశంసలను సంపాదించింది. రెండు సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ విజన్–2047’ అనే దార్శనిక పత్రాన్ని ఆవిష్కరించింది. దీని ద్వారా ప్రభుత్వం సమగ్ర, సమానమైన, సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించింది...వికసిత్ భారత్’ ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అదే క్రమంలో తెలంగాణ రాష్ట్రం కూడా 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. ఈ లక్ష్య సాధనకే తెలంగాణ రైజింగ్ - 2047 దార్శనిక పత్రాన్ని రూపొందించింది. గత డిసెంబరులో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రపంచ ప్రతినిధుల మధ్య ప్రభుత్వం ఈ దార్శనిక పత్రాన్ని ఆవిష్కరించింది’’ అని గవర్నర్ వివరించారు.శాసనమండలిలో..తెలంగాణ శాసనమండలిలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిపారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. జాతీయ జెండాను ఎగుర వేశారు. డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, వాణి దేవి, తక్కెళపెళ్ళి రవిందర్ రావు, అంజిరెడ్డి, మల్కాకొమురయ్య , శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.అసెంబ్లీలో..అసెంబ్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. -
‘మనది చరిత్రాత్మక బంధం’.. అమెరికా శుభాకాంక్షలు
వాషింగ్టన్: భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ.. అమెరికా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలిపింది. ఈ సందర్భంగా అమెరికా నేత మార్కో రూబియో మాట్లాడుతూ న్యూఢిల్లీ- వాషింగ్టన్ మధ్య ఉన్న సంబంధాన్ని చారిత్రాత్మక బంధంగా అభివర్ణించారు. రాబోయే ఏడాదిలో ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు ఇరు దేశాలు కలిసి పని చేస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.అమెరికా ప్రజల తరఫున భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రూబియో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్-అమెరికా మైత్రి ప్రాముఖ్యతను ప్రత్యేకంగా తెలిపారు. రక్షణ, ఇంధనం, క్రిటికల్ మినరల్స్, అత్యాధునిక సాంకేతికత వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం అద్భుతమని రూబియో పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలే కాకుండా, క్వాడ్ (Quad) కూటమి ద్వారా జరుగుతున్న బహుముఖ చర్చలు ఇండో-పసిఫిక్ ప్రాంత అభివృద్ధికి, భద్రతకు దోహదపడుతున్నాయన్నారు. ఇరు దేశాల బంధం కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో ఇరు దేశాల ప్రగతికి దోహదపడుతుందన్నారు.ఇదిలావుండగా గణతంత్ర వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. గురుగ్రామ్, చిల్లా, టిక్రి, సింఘు, బదర్పూర్ తదితర సరిహద్దుల వద్ద పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మరోవైపు, ఈ చారిత్రక దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతుండగా, ప్రజలు దేశభక్తి తో కూడిన వేడుకల్లో పాల్గొంటున్నారు.ఇది కూడా చదవండి: కనిపించని ఆ నాలుగో సింహమే.. -
గణతంత్ర దినోత్సవ వేడుకలు.. సరిహద్దుల్లో అలర్ట్
ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా సరిహద్దుల్లో అప్రమత్తమైంది. భారత్-పాక్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు గస్తీ ముమ్మరం చేశాయి. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు భారీగా మోహరించాయి. డ్రోన్లతో ఎల్ఓసీ వెంట బలగాలు నిఘా పెట్టాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతం అంతటా భద్రతా తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. వేడుకల కోసం చేసిన కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య గురుగ్రామ్, చిల్లా, టిక్రీ, సింఘు, కాపషేరా, బదర్పూర్ మరియు ధౌలా కువాన్ సరిహద్దుల వద్ద పోలీసులు క్షుణ్ణంగా వాహన తనిఖీలు చేపట్టారు. గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని.. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (JeM) భారత్‌లో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ దేశానికి చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI) ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో జనవరి 26న భీకర దాడులకు పాల్పడేందుకు ‘26-26’ అనే కోడ్ నేమ్‌ను పెట్టుకున్నట్లు తెలిపాయి.గణతంత్ర వేడుకలకు ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో దాడులకు దిగవచ్చని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు సరిహద్దులు సహా జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, పంజాబ్ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పలువురు అనుమానితుల ఫొటోలతో దిల్లీ పోలీసులు వాంటెడ్ నోటీసులు జారీ చేశారు. -
జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా 77వ గణతంత్ర వేడుకలు కొనసాగుతున్నాయి. అతిథులతో కలిసి బగ్గీలో వచ్చిన రాష్ట్రపతి ముర్ము.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ అభివృద్ధి, సైనిక శక్తి, సాంస్కృతిక వైవిధాన్ని ప్రతిబింబించేలా పేరేడ్ సాగుతోంది. పరేడ్‌లో ఆరువేల మంది సైనికులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ హాజరయ్యారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్రమంత్రులు పాల్గొన్నారు.అతిథులతో కలిసి బగ్గీలో వచ్చిన రాష్ట్రపతి ముర్ముజాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ముగణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్మొదటిసారిగా ఇండియన్ ఆర్మీ ‘ఫేజ్డ్ బ్యాటిల్ అరే’ ప్రదర్శనదేశ అభివృద్ధి, సైనిక శక్తి సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా పరేడ్పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా పరమవీర చక్ర,భిన్నత్వంలో ఏకత్వం థీమ్‌పై 100 మంది కళాకారులతో సంగీత నృత్య కార్యక్రమంపరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా పరమవీర చక్ర, అశోక చక్ర విజేతలుప్రత్యేక ఆకర్షణగా వందేమాతరం 150 ఏళ్ల ప్రస్థానంపరేడ్లో పాల్గొన్న ఐరోపా సమాఖ్య చెందిన సైనిక బృందం150 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్స్‌తో 21 సార్లు పేల్చి గౌరవ వందనంశుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానంపూల వర్షం కురిపించిన 4 ఎంఐ-17 హెలికాఫ్టర్లుప్రత్యేక ఆకర్షణగా భారతీయ న్యాయ సంహిత శకటంవేడుకల్లో తొలిసారి జంతు దళం కవాతు జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ముమొదటిసారిగా ఇండియన్ ఆర్మీ ‘ఫేజ్డ్ బ్యాటిల్ అరే’ ప్రదర్శనదేశ అభివృద్ధి, సైనిక శక్తి సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా పరేడ్వేడుకల్లో భాగంగా వార్ మెమోరియాల్ వద్ద అమరజవాన్లకు ప్రధాని మోదీ నివాళులు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు బయల్దేరిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మురాష్ట్రపతి భవన్ నుంచి కర్తవ్యపథ్‌కు ద్రౌపదీ ముర్ము ద్రౌపదీ ముర్ముతో పాటు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ సైనికులతో పరేడ్ 6,050 మంది సైనికులతో పరేడ్ 17 రాష్ట్రాలు, 13 కేంద్ర ప్రభుత్వ శకటాలను ప్రదర్శన 30 వేల మంది పోలీసులు, కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాట్లు కర్తవ్య పథ్ దగ్గర 6 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు దేశ రక్షణ సామర్థ్యాన్ని చాటిచెప్పే విధంగా జరిగే కవాతు ఆయుధ ప్రదర్శన వైమానిక విన్యాసాలు గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలీసులు ఏఐ స్మార్ట్ కళ్లజోళ్లతో నిఘా ఏర్పాట్లు #WATCH | Preparation visuals from Kartavya Path ahead of the 77th Republic Day Parade. pic.twitter.com/j3LY0Xdzfj— ANI (@ANI) January 26, 2026 -
10వేల కిలోల పేలుడు పదార్థాలు.. డిటోనేటర్లు లభ్యం
జైపూర్: గణతంత్ర దినోత్సవం ముందు రోజు దేశంలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రాజస్థాన్‌లో 10వేల కిలోల పేలుడు పదార్థాలు, డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తరహా పేలుడు పదార్థాలను ఇటీవల ఢిల్లీ ఎర్రకోట కారు పేలుళ్లకు ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారించారు. హార్సౌర్ గ్రామంలో శనివారం రాత్రి పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 9,550 కిలోల అమోనియం నైట్రేట్‌ను 187 సంచుల్లో నింపి ఒక పొలంలో దాచినట్లు గుర్తించారు. నాగౌర్ జిల్లా జిల్లా ఎస్పీ మృదుల్ కచ్చావా ఈ వివరాలను వెల్లడించారు.అమోనియం నైట్రేట్ గతంలో అనేక పేలుళ్లలో ఉపయోగించినట్లు తెలిపారు. ముఖ్యంగా, 2025 నవంబర్‌లో ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసులో ఈ రసాయనం కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తుచేశారు. హార్సౌర్ గ్రామానికి చెందిన సులేమాన్ ఖాన్‌ను పోలీసులు సంఘటనా స్థలంలోనే అరెస్ట్ చేశారు. అతనిపై ఇప్పటికే మూడు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు.అమోనియం నైట్రేట్‌తో పాటు పోలీసులు భారీగా పేలుడు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.తొమ్మిది కార్టన్ల డిటోనేటర్లు,12 కార్టన్లు, 15 బండిల్స్ బ్లూ ఫ్యూస్ వైర్లు, 12 కార్టన్లు, ఐదు బండిల్స్ రెడ్ ఫ్యూస్ వైర్లు ఉన్నట్లు తేలింది. ప్రాథమిక విచారణలో సులేమాన్ ఖాన్ అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎక్స్‌ప్లోజీవ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.గణతంత్ర దినోత్సవానికి ముందు ఇంత భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడటం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన ఉగ్రకుట్రలపై భద్రతా సంస్థలు మరింత అప్రమత్తంగా ఉన్నాయని సూచిస్తోంది. -
వికసించిన పద్మాలు
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. 2026 సంవత్సరానికి గాను ఆదివారం విడుదల చేసిన ఈ జాబితాలో వివిధ రంగాలకు చెందిన 131 మంది ప్రముఖులకు స్థానం దక్కింది. ఇందులో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ఈసారి అవార్డు గ్రహీతల్లో 19 మంది మహిళలు ఉండగా, 16 మందికి మరణానంతరం పురస్కారాలు ప్రకటించారు. అలాగే విదేశీయులు, ఎన్నారైల విభాగంలో ఆరుగురు ఎంపికయ్యారు. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, వైద్యం, సాహిత్యం, క్రీడలు తదితర రంగాల్లో నిష్ణాతులైన వారికి పద్మ పురస్కారాలు ప్రకటించారు. దేశానికి అసాధారణ సేవలందించినందుకు ఇచ్చే పద్మవిభూషణ్ పురస్కారం ఈసారి బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్రసింగ్ దేవల్ (మహారాష్ట్ర), కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్.అచ్యుతానందన్‌లను మరణానంతరం వరించింది. వీరితో పాటు ప్రజా వ్యవహారాల విభాగంలో కె.టి.థామస్(కేరళ), కళల విభాగంలో ఎన్.రాజమ్(ఉత్తరప్రదేశ్), సాహిత్యం, విద్య విభాగంలో పి.నారాయణన్ (కేరళ) ఈ అత్యున్నత గౌరవానికి ఎంపికయ్యారు. ఇక విశిష్ట సేవలకుగాను ఇచ్చే పద్మభూషణ్ జాబితాలో ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్, మలయాళీ నటుడు మమ్ముట్టి, మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, పారిశ్రామికవేత్త ఉదయ్ కోటక్, టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్, ప్రచార రంగ దిగ్గజం పియూష్ పాండే వంటి వారున్నారు. తెలుగు రాష్ట్రాలకు పద్మ పంటతెలుగు రాష్ట్రాలకు ఈసారి పద్మ పురస్కారాల్లో పెద్దపీట దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ను కళల విభాగంలో పద్మశ్రీ వరించింది. అలాగే గద్దె బాబూ రాజేంద్ర ప్రసాద్(కళలు), మరణానంతరం గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్(కళలు), వెంపటి కుటుంబ శాస్త్రి(సాహిత్యం) ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి దీపికారెడ్డి(కళలు), వైద్య రంగంలో గూడూరు వెంకట రావు, పాల్కొండ విజయ్‌ఆనంద్‌రెడ్డి పద్మశ్రీ అందుకోనున్నారు. సైన్స్ రంగంలో చంద్రమౌళి గడ్డముణుగు, కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్, కుమారస్వామి తంగరాజ్, పశుసంవర్థక విభాగంలో రామారెడ్డి మామిడి (మరణానంతరం) తెలంగాణ కీర్తిని ఇనుమడింపజేశారు. అలాగే.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మాజీ చైర్మన్, తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన మామిడాల జగదీశ్ కుమార్ సాహిత్యం, విద్యా రంగంలో పద్మశ్రీ వరించింది. క్రీడా, సినీ రంగాలకు చెందిన పలువురు ఇతర ప్రముఖులకు కూడా పద్మశ్రీ దక్కింది. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ భుల్లర్, హాకీ క్రీడాకారిణి సవితా పునియాలను పద్మశ్రీ వరించింది. సినీ రంగం నుంచి బెంగాలీ నటుడు ప్రోసెన్జిత్ ఛటర్జీ, మరణానంతరం నటుడు సతీష్ షా, అనిల్ కుమార్ రస్తోగి ఈ జాబితాలో ఉన్నారు. మార్చి లేదా ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా వీరు పురస్కారాలు అందుకోనున్నారు.ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీకి ఎంపికైన వారు ⇒ మాగంటి మురళీమోహన్(కళల విభాగం) ⇒ గద్దె బాబూ రాజేంద్ర ప్రసాద్(కళల విభాగం) ⇒ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ (మరణానంతరం) కళల విభాగం ⇒ వెంపటి కుటుంబ శా్రస్తి(సాహిత్యం మరియు విద్య) తెలంగాణ నుంచి పద్మశ్రీకి ఎంపికైన వారు ⇒ దీపికా రెడ్డి (కళల విభాగం) ⇒ గూడూరు వెంకట రావు (వైద్య విభాగం) ⇒ పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి (వైద్య విభాగం) ⇒ చంద్రమౌళి గడ్డముణుగు (సైన్స్–ఇంజనీరింగ్) ⇒ కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ (సైన్స్, ఇంజనీరింగ్) ⇒ కుమారస్వామి తంగరాజ్ (సైన్స్, ఇంజనీరింగ్) ⇒ రామారెడ్డి మామిడి (మరణానంతరం)–పశుసంవర్థక విభాగంపద్మవిభూషణ్ (5) దేశానికి అసాధారణ సేవలందించినందుకు ఇచ్చే రెండో అత్యున్నత పురస్కారం ఐదుగురిని వరించింది. ⇒ ధర్మేంద్రసింగ్ దేవల్ (మరణానంతరం): కళలు (మహారాష్ట్ర) ⇒ కె.టి.థామస్: ప్రజా వ్యవహారాలు (కేరళ) ⇒ ఎన్.రాజమ్: కళలు (ఉత్తర ప్రదేశ్) ⇒ పి.నారాయణన్: సాహిత్యం మరియు విద్య (కేరళ) ⇒వి.ఎస్.అచ్యుతానందన్ (మరణానంతరం): ప్రజా వ్యవహారాలు (కేరళ) పద్మభూషణ్ (13) విశిష్ట సేవలకు గాను 13 మందిని పద్మభూషణ్ వరించింది. ⇒ అల్కా యాగ్నిక్: కళలు (మహారాష్ట్ర) ⇒ మమ్ముట్టి: కళలు (కేరళ) ⇒ ఉదయ్ కోటక్: వాణిజ్యం, పరిశ్రమలు (మహారాష్ట్ర) ⇒ భగత్ సింగ్ కోష్యారీ: ప్రజా వ్యవహారాలు (ఉత్తరాఖండ్) ⇒ విజయ్ అమత్‌రాజ్: క్రీడలు (అమెరికా) ⇒ పియూష్ పాండే (మరణానంతరం): కళలు (మహారాష్ట్ర)‘ఆకాశ్’ మార్గదర్శకుడుమధిర: ఖమ్మం జిల్లా మధిరకు చెందిన ఆకాశ్ క్షిపణి మాజీ డైరెక్టర్ డా.గడ్డముణుగు చంద్రమౌళి ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. 1958 నవంబర్ 9న మధిరలో గడ్డమణుగు సత్యనారాయణరావు, సరస్వతిదేవి దంపతులకు జన్మించిన చంద్రమౌళి.. ప్రాథమిక విద్య నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదివారు. వరంగల్ ఎన్ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్, ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో డాక్టరేట్ పట్టా పొందారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)లో 34 ఏళ్ల పాటు ఉద్యోగం చేశారు.మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం టీమ్‌లో సమర్థవంతంగా పనిచేశారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రఖ్యాతిగాంచిన ఆకాశ్ క్షిపణి ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేసి భారత ప్రభుత్వం మన్ననలు పొందారు. ఆకాశ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా భారత వైమానిక దళం, సైన్యం కోసం క్షిపణి ఉత్పత్తి బాధ్యతలను నిర్వర్తించారు. ఆయన మార్గదర్శకత్వంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఆకాశ్ క్షిపణి వ్యవస్థ విజయవంతంగా అభివృద్ధి చెందింది. 60 కంటే ఎక్కువ ఆకాశ్ క్షిపణుల విజయవంతమైన ప్రయోగాలను పర్యవేక్షించి, వ్యవస్థ పనితీరుపై రక్షణ దళంలో విశ్వాసాన్ని పెంచారు. ఆకాశ్ ప్రాజెక్ట్ ద్వారా దేశీయ రక్షణ పరిశ్రమకు రూ.22 వేల కోట్లకుపైగా ఆర్డర్లు లభించాయి.వైద్యరంగంలో విశిష్ట సేవలకు..సాక్షి, హైదరాబాద్: ఏఐజీ ఆసుపత్రి డైరెక్టర్ డా.గూడూరు వెంకట రావును పద్మశ్రీ వరించింది. ఏఐజీ హైదరాబాద్ ఆసుపత్రి ఆర్కిటెక్చర్‌గా, సహ వ్యవస్థాపకుడిగా, అంతర్జాతీయంగా వైద్యరంగంలో అందించిన విశిష్ట సేవలకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. గ్యాస్ట్రోఎంట్రాలజీలో వెంకటరావుకు మూడు దశాబ్దాలకుపైగా క్లినికల్ అనుభవం ఉంది. సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ల్యాప్రోస్కోపిక్ సర్జన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. డాక్టర్ జీవీ రావుగా పిలిచే ఆయన ఇప్పటివరకు 12,000కు పైగా సర్జరీలు విజయవంతంగా నిర్వహించారు. ‘ట్రాన్స్ ఓరల్ ఎండోస్కోపిక్ అపెండెక్టమీ’లాంటి సంక్లిష్ట శస్త్రచికిత్సలు నిర్వహించినవారిలో ఆద్యుడు. డయాబెటిస్ చికిత్స కోసం ‘మ్యాక్రో ఎన్క్యాప్సులేషన్ డివైజ్’ను రూపొందించిన వైద్యనిపుణుడిగా ఖ్యాతిగడించారు. ప్రత్యేక అనుభూతినిచ్చింది: గూడూరు వెంకట రావు వ్యక్తిగతంగా సాధించిన విజయాలన్నింటిలోనూ పద్మశ్రీ ప్రత్యేక అనుభూతినిచ్చింది. రోగి సంరక్షణకు అంకితభావంతో పనిచేసే నా సహోద్యోగుల బృందానికి, ఏఐజీ కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటాను. నా కెరీర్‌కు మద్దతుగా నిలిచిన డా. నాగేశ్వర్‌రెడ్డిని తప్పనిసరిగా ఇక్కడ గుర్తుచేసుకోవాలి. ఆపరేషన్ గదికి మించి సంస్థ నిర్మాణం, విద్యా శిక్షణ–పరిశోధన, సమాజానికి సేవ చేసే రంగంలో గుర్తించినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక కృతజ్ఞతలు. తరువాతి తరం సర్జన్లకు శిక్షణ ఇవ్వడం, ఆరోగ్య సంరక్షణ, సంస్థల బలోపేతం, నాణ్యమైన వైద్యం అందేలా చూడటం నా ప్రయాణంలో ప్రధానమైన అంశాలు. పేదరికం నుంచి ప్రపంచ స్థాయికి.. డా.నోరి దత్తాత్రేయుడు (పద్మభూషణ్) సాక్షి, అమరావతి: కేన్సర్ మరణ శాసనం కాదు.. సరైన సమయంలో గుర్తిస్తే ఆ మహమ్మారిని జయించవచ్చని నిరూపించి అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన తెలుగుతేజం, ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ‘పద్మ’ పురస్కారం వరించింది. దత్తాత్రేయుడు కృష్ణాజిల్లా మంటాడ గ్రామంలో 1947 అక్టోబరు 21న జన్మించారు. కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాల నుంచి 1971లో ఎంబీబీఎస్ పట్టా తీసుకున్న ఆయన, ఉస్మానియా మెడికల్ కళాశాలలో పీజీ పూర్తిచేశారు. గాం«దీ, ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేశారు. అనంతరం అమెరికా వెళ్లారు. తల్లిదండ్రులకు 12 మంది సంతానంలో ఆఖరివాడైన నోరి నాలుగో ఏటలోనే తండ్రిని కృష్ణా వరదల్లో కోల్పోయారు. అనంతరం.. అత్యంత పేదరికం అనుభవిస్తూ తన తల్లి కష్టాన్ని గుర్తెరిగిన ఆయన ప్రపంచంలోనే టాప్ అంకాలజిస్టుల్లో ఒకరిగా ఎదిగారు. కేన్సర్ వ్యాధిపై 4 పుస్తకాలు రాశారు.విద్యారంగంలో కృషి.. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలకు చెందిన జగదీశ్‌కుమార్‌కు పద్మశ్రీ అవార్డు లభించింది. లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విబాగానికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. జగదీశ్‌కుమార్ యూజీసీ చైర్మన్‌గా, జేఎన్‌యూ వైస్ చాన్స్‌లర్‌గా పని చేశారు. ఆయన తండ్రి రంగారావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి జయప్రద పెద్దగా చదువుకోలేదు. ఇంట్లో పెద్దవాడైన జగదీశ్ 1 నుంచి 7 వరకు సొంతూరు మామిడాల ప్రాథమిక పాఠశాలలో చదివారు. ఇంటర్ వరకు మిర్యాలగూడలో, డిగ్రీ, ఎంఎస్సీ (ఎల్రక్టానిక్స్) హైదరాబాద్‌లో చదివారు. మద్రాస్ ఐఐటీలో ఎంఎస్ చదివి అక్కడే పీహెచ్డీ పూర్తి చేశారు.కెనడాలో పోస్ట్ డాక్టరేట్ ఫెలోషిప్ చేశారు. తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీలో ప్రొఫెసర్‌గా పని చేశారు. తర్వాత ఢిల్లీ ఐఐటీలో, జేఎన్‌యూ ఢిల్లీలో విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత మూడేళ్లు గేట్ చైర్మన్‌గా పనిచేశారు. 2016లో ఢిల్లీ జేఎన్‌యూ వైస్ చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత కేంద్రం ఆయనను యూజీసీ చైర్మన్‌గా నియమించింది. నానో ఎల్రక్టానిక్ డివైసెస్, నానో స్కేల్ డివైస్ మోడలింగ్, సిమ్యులేషన్, ఇన్నోవేటివ్ డివైస్ డిజైన్, పవర్ సెమీ కండక్టర్ డివైజ్ విభాగంలో జగదీశ్ నిష్ణాతులు. ఆయన పరిశోధనల ఆధారంగా పలు పేటెంట్లు లభించాయి. బాధ్యతను మరింత పెంచింది: జగదీశ్పద్మశ్రీ అవార్డు నా బాధ్యతను మరింతగా పెంచింది. ఉన్నత విద్యను మరింతగా ముందుకు తీసుకెళ్లడంతోపాటు సరళంగా అందుబాటులోకి తెచ్చేందుకు చేయాల్సిన కృషిని ఈ అవార్డు నాపై ఉంచింది. రానున్న కాలంలో మన వర్సిటీలు, కళాశాలలను బలోపేతం చేయాలి. ఉపాధ్యాయులకు మరింత శిక్షణ ఇవ్వాలి. ఆవిష్కరణలను ప్రోత్సహించాలి.గ్రామాల్లో ఆర్థిక సాధికారతకు బాటలుశంషాబాద్: సహకార సంఘాల బలోపేతం.. పాడిపరిశ్రమ అభివృద్ధితో ప్రజలు సాధించే ఆర్థిక సాధికారతే సామాజిక శ్రేయస్సుగా నాలుగు దశాబ్దాలు కృషి చేసిన మామిడి రామారెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. మామిడి భోజిరెడ్డి, లీలావతి దంపతులకు 1942 ఫిబ్రవరి 24న జన్మించారు. ఆయన తండ్రి భోజిరెడ్డి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా నగరంలోని ఇందిరాసేవాదన్లో సంగం లక్ష్మీబాయి విద్యాసంస్థలను నెలకొల్పారు. రామారెడ్డి చాదర్‌ఘాట్ పాఠశాలలో చదివి ఆ తర్వాత నిజాం కళాశాలలో బీఎస్సీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం చేశారు. అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో రాజకీయాంశాలపై పీజీ చేశారు.రాజేంద్రనగర్ బ్లాక్‌లోని పంచాయతీ సమితి అధ్యక్షుడిగా, శంషాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌గా పనిచేసిన రామారెడ్డి ఆ తర్వాత తండ్రి స్థాపించిన విద్యాసంస్థల ద్వారా మహిళలకు విద్యనందిస్తూనే సహకార వ్యవస్థ బలోపేతానికి శ్రీకారం చుట్టారు. గడచిన నాలుగు దశాబ్దాలుగా ఆయన సహకార వికాస సంస్థ పేరిట వరంగల్, కరీంనగర్, హనుమకొండ తదితర జిల్లాలో మొత్తం 755 సహకార సంఘాలను ఏర్పాటు చేయించారు. ఈ సంఘాలు ప్రస్తుతం 550 కోట్ల టర్నోవర్‌తో స్వయం సమృద్ధిని సాధించాయి. ఆయనకు పద్మశ్రీ రావడంపై అతని శంషాబాద్వాసులు హర్షం వ్యక్తం చేశారు. రామారెడ్డి గత అక్టోబరు 26న మరణించారు. గుర్తింపు వచ్చినందుకు సంతోషం స్వయం సమృద్ధి, పరస్పర సహకారమనే అంశాలతోనే ఆయన సహకార సంఘాలతో ఆర్థిక చైతన్యంతోపాటు సాధికారతకు బాటలు వేశాడని రామారెడ్డి భార్య శ్యామల ‘సాక్షి’తో చెప్పారు. ఆయన సేవలను ప్రభుత్వం గుర్తించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఆయన లక్ష్యాన్ని ప్రభుత్వాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.ఐదున్నర దశాబ్దాలుగా నృత్యంలో...తెలంగాణకు చెందిన నృత్య కళాకారిణి దీపికారెడ్డి. ఆమె 1965, సెప్టెంబర్ 15న హైదరాబాద్‌లో జన్మించారు. తండ్రి వీఆర్ రెడ్డి సొలిసిటర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. తల్లి రాధికారెడ్డి కూచిపూడి నృత్యకారిణి. తాత నూకల రామచంద్రా రెడ్డి మాజీ మంత్రి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ’దీపాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి’ ద్వారా వేలాది మంది నృత్య దీపికలను తయారుచేశారు. ఐదున్నర దశాబ్దాలుగా నృత్య కళారంగానికి సేవ చేస్తున్నారు. ప్రతి నెలా కొత్త కాన్సెప్ట్ : దీపికారెడ్డిమాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. కూచిపూడి నృత్యం అనేది ఒక కళ కాదు. అది భగవంతుని ఆరాధనగా భావిస్తాం. ఐదున్నర దశాబ్దాల కృషికి గుర్తింపు లభించింది. పౌరాణిక గాథలను వేదికల మీద, దేవాలయాల దగ్గర నృత్య ప్రదర్శనలు ఇచ్చినప్పుడు ఆ భగవంతుడికి దగ్గరయ్యామన్న అనుభూతిని పొందుతాం. అలాంటి అనుభూతిని ఈ రోజు పొందాను. ప్రతి నెలా ఒక కొత్త కాన్సెప్ట్ ను కూచిపూడి నృత్యం ద్వారా ప్రజల ముందుకు తెస్తున్నాం. దీంట్లో భాగంగా పర్యావరణం, మహిళలు, సామాజిక అవగాహన అంశాలూ ఉంటున్నాయి.వెంపటి చిన సత్యం గారు గురువుగా లభించడం నాకు ఓ వరం. మా అమ్మ, నేను, నా కూతురు.. మూడు తరాలుగా నృత్య సాధన చేస్తున్నాం. ఈ కూచిపూడి నృత్య ప్రయాణంలో మా అమ్మన్నాన్నలు వీఆర్ రెడ్డి, రాధికా రెడ్డి, నా భర్త శ్యామ్‌గోపాల్, నా పిల్లలు అభినవ్, శ్లోకా.. నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. గీతాంజలి నృత్య అకాడమీ ద్వారా ఎంతోమంది దేశ విదేశాల్లో ఉన్న మా విద్యార్థులు మన భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇన్నేళ్లుగా నన్ను ఆదరించి, ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఎంతోమంది కళాకారులు కనే అత్యుత్తమ కళ ఇది. ఎంతో సంతృప్తినిచ్చింది.జన్యుశాస్త్ర రంగంలో సేవలకు..లాలాపేట: హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్–సీసీఎంబీ సైంటిస్టు డా.కుమారస్వామి తంగరాజ్‌ను పద్మశ్రీ పరస్కారం వరించింది. ‘సీఎస్ఐఆర్ భట్నాగర్ ఫెలో’గా జన్యు శాస్త్ర రంగంలో చేసిన అత్యుత్తమ కృషికిగాను ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఆయన తమిళనాడు రాష్ట్ర చంగల్పట్ జిల్లా చేయుర్లో 1963 జూన్ 2న జన్మించారు. విద్యాభ్యాసం అంతా తమిళనాడులోనే చేశారు. భారతీయ జనాభా మూలం, అనుబంధాలు, వ్యాధి దృక్పథాలను అర్థం చేసుకోవడంలో తంగరాజ్ చేసిన పరిశోధనలు దోహదపడతాయి.రేడియేషన్ ఆంకాలజీలో విస్తృత సేవలుదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ స్వీకరించిన డాక్టర్ విజయానంద్ రెడ్డి 1982లో హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత పొందారు. తర్వాత రేడియేషన్ ఆంకాలజీలో ఎండీ, డీఎన్బీలతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని అపోలో కేన్సర్ సెంటర్లో ప్రొఫెసర్‌గా, హెచ్ఓడీగా... అలాగే ఆ సంస్థకు డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. గతంలో ఆయన అసోసియేషన్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్స్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా, ఇండియన్ కాలేజ్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. నాలుగు దశాబ్దాలకు పైగా వైద్యరంగానికి అందించిన సేవలకుగాను ఆయనకు పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ఆయన రాసిన అనేక వ్యాసాలకు బంగారు పతకాలూ అందాయి. నా సేవలు నా దేశానికే: డాక్టర్ విజయానంద్ రెడ్డి నా మాతృభూమికే నా సేవలు అంకితం కావాలనుకున్నాను.. అందుకే ఇక్కడే ఉండిపోయా. అప్పట్లో కేన్సర్‌ను ప్రాణాంతకమైన వ్యాధిగా చూసేకాలం నుంచి... క్రమంగా అది కూడా ఓ సాధారణమైన జబ్బు ‘అదీ మామూలుగానే తగ్గిపోతుందిలే’అని పేషెంట్స్‌లో భరోసా నింపేలా కేన్సర్ రోగులకు సేవలందించా. నాలుగు దశాబ్దాలకు పైగా అందించిన సేవలను దేశం గుర్తించినట్లుగా ఓ మంచి అనుభూతికి లోనవుతున్నా. నాకు వచ్చిన ‘పద్మశ్రీ’నాది మాత్రమే కాదు... రోగులకు వాళ్ల వెతలను దూరం చేయడంలో నాతోపాటు సహకరించిన నా సహాయకులు, మా ఆస్పత్రి సిబ్బందితోపాటు నా మీద నమ్మకముంచి ఆరోగ్యవంతులైన నా పేషెంట్లు అందరిదీ అని భావిస్తున్నా. ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది. -
రాజ్యాంగం ఓ ‘సోషల్ డాక్యుమెంట్’
రాజ్యాంగ పరిషత్‌లో 1949 నవంబర్ 26న ఆమోదించుకొని శాసనంగా రూపొందించుకొన్న భారత రాజ్యాంగం, 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. ప్రపంచ దేశాల్లోని రాజ్యాంగాలను అధ్యయనం చేసి రెండేళ్ల 11 నెలల 11 రోజుల సుదీర్ఘ కసరత్తు చేశాక బి.ఆర్. అంబేడ్కర్ నేతృత్వంలోని కమిటీ దేశానికి ఓ ఆదర్శ ప్రాయమైన రాజ్యాంగాన్ని అందించింది. భారత రాజ్యాంగంలో పేర్కొన్న స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వ భావనలను ఫ్రెంచ్ రాజ్యాంగం స్ఫూర్తిగా తీసుకొన్నారు. పంచవర్ష ప్రణాళికలను రష్యా నుంచి, మార్గదర్శక సూత్రాలను ఐర్లాండ్ నుంచి, సుప్రీం కోర్టు విధివిధా నాలను జపాన్ నుంచి స్వీకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగించే పరిపాలనకు రాజ్యాంగమే మార్గదర్శి. చట్టాల రూపకల్పనకు దిక్సూచి. దేశ ప్రజలకు రాజ్యాంగం అనేక హక్కుల్ని కల్పించింది. బాధ్యతలను అందించింది. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛతోపాటు, ప్రభుత్వాలు చేసిన హామీలను, చేసిన చట్టాల అమలులో లోపాల్ని సవాలు చేసే హక్కును రాజ్యాంగం కల్పించింది. ప్రపంచంలోని అనేక దేశాలు రాజకీయ, సామాజిక అస్థిరతలతో కుప్పకూలాయి. కానీ, ఎంతో విశాలమైనదీ, అతి పెద్ద జనాభాతో కూడి అనేక భిన్న సంస్కృతులు, భాషలు, వర్గాలు,సంప్రదాయాలు కలిగి ఉన్నప్పటికీ ‘భిన్నత్వంలో ఏకత్వం’లా సుదృఢంగా భారతదేశం 8 దశాబ్దాలుగా నిలబడగలిగిందంటే నిస్సందేహంగా మనకున్న అతి గొప్పదైన రాజ్యాంగమే కారణం. రాజ్యాంగం కేవలం ఒక నియమాల సంకలనం కాదు. సమసమాజ నిర్మాణం లక్ష్యంగా ముందుకు దారిచూపే ఓ ‘దీపం’. దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలోకి నడిపించాలో నిరంతరం గుర్తు చేసే ఓ దార్శనిక పత్రం.ప్రవేశిక ప్రాధాన్యంరాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాతంత్ర, గణతంత్ర రాజ్యంగా ఉండాలని నిర్దేశించింది. ప్రవేశికలో ‘భారత ప్రజలమైన మేము’ అనే వాక్యంతో మొదలుపెట్టి ‘ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకొంటున్నాము’ అని ఉంటుంది. భారత రాజ్యాంగం దేశంలో ఏ ఒక్క వర్గానిదో, మతానిదో కాదు. కులం, మతం, వర్గం, భాష, లింగ వివక్ష, విద్య... ఇంకా ఇతర ప్రమాణాలతో నిమిత్తం లేకుండా దేశంలోని ప్రతి ఒక్కరి సమానత్వం కోసం ఏర్పరిచింది. సార్వభౌ మత్వం అంటే అర్థం ప్రజలు మాత్రమే సర్వాధికారులు. ప్రభుత్వా లన్నది ప్రజలకు సేవ చేయడానికి ఉనికిలో ఉంటాయి. ప్రభుత్వాల అధికారాలన్నీ ప్రజల చేత, ప్రజల తరఫున, ప్రజల కోసం పాలించ డానికి ఇవ్వబడేవే! రాజ్యాగం గొప్పదైనంత మాత్రాన ఆశించిన ఫలితాలు అంద వని ముసాయిదా ప్రతిని సమర్పించి 1949 నవంబర్ 26న చేసిన చరిత్రాత్మక ప్రసంగంలోనే అంబేడ్కర్ పేర్కొన్నారు. ‘‘రాజ్యాంగం ఎలా పని చేస్తుందన్నది దాని స్వభావంపై ఆధారపడిలేదు. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ అనే అంగాలను మాత్రమే రాజ్యాంగం ప్రసాదించింది. ప్రజలు, రాజకీయ పార్టీలు ఎలాంటి ఆకాంక్షలను, రాజకీయాలను కోరుకొంటున్నారన్న దానిపైనే వాటి పనితీరు ఆధారపడి ఉంటుంది’’ అంటూ స్పష్టం చేశారు.మంచీ... చెడూ...రాజ్యాంగబద్ధమైన పాలనలో దేశం కొన్ని మైలురాళ్లు చేరుకున్న మాట వాస్తవం. 1947లో దేశ ప్రజల సగటు ఆయుష్షు 32 సంవత్సరాలు మాత్రమే. ఇప్పడు అది 72 సంవత్సరాలకు పెరిగింది. అక్షరాస్యత 16% నుండి 80 శాతానికి చేరింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 35.773 కోట్ల టన్నులకు పెరిగింది. 1947లో కేవలం 1,500 గ్రామాలకు మాత్రమే విద్యుదీకరణ జరగగా ఇప్పుడు దాదాపుగా ప్రతి గ్రామానికీ విద్యుత్ సౌకర్యాలు ఏర్పర్చు కోగలిగాము. రహదారుల నిర్మాణం కూడా 4 లక్షల కిలోమీటర్ల నుంచి నేడు 60 లక్షల కిలోమీటర్లకు చేరుకోగలిగాము. అంటరాని తనం చట్టపరంగా తొలగించబడింది. దళితులు, గిరిజనులపై జరిగే అకృత్యాల నుండి పరిరక్షించే చట్టాలు రూపొందించబడ్డాయి. వివక్షకు గురైన వర్గాల ప్రజలకు విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆహారం, సమాచారం హక్కుగా కల్పించబడ్డాయి. నిరాదరణకు గురైన సామా జిక వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులు రాష్ట్రపతులుగా, ముఖ్యమంత్రు లుగా, న్యాయమూర్తులుగా నియమించబడటం చెప్పుకోదగిన మార్పు. అల్ప సంఖ్యాక వర్గాలకు చెందినవారి సంస్కృతి, మతపర విశ్వాసాలకు చట్టపరంగా రక్షణలు కల్పించడం జరిగింది. అయితే, రాజ్యాంగం కల్పించిన మహత్తర అవకాశాలను పూర్తి స్థాయిలో ఈ 8 దశాబ్దాల రాజకీయ నాయకత్వం సద్వినియోగం చేసుకోలేకపోయిందనడం ఓ చేదు వాస్తవం. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల స్ఫూర్తి అమలు కాలేదు. ఫలితంగానే, దేశ సంపద కొద్దిమంది వ్యక్తుల గుప్పిట్లోకి పోయింది. 90 శాతం సంపద 10 శాతం మంది వద్ద పోగుపడింది. ధనికులు మరింత ధనికులు కాగా, పేదలు మరింత పేదలు అవుతున్నారు. విధానపరమైన వైఫల్యాలే దేశాభివృద్ధికి అవరోధంగా మారుతున్నాయి. రాజ్యాంగం ద్వారా రూపొందించే సంస్థలలో ప్రజా భాగస్వామ్యం, పాత్ర తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది.అవగాహన పెరగాలి!రాజ్యాంగంలో ఏర్పర్చుకొన్న సంక్షేమ రాజ్యస్థాపన లక్ష్యాలకు దూరంగా ప్రభుత్వాలు జరగడంతోనే ఈ సమస్యలు ఉత్పన్న మవుతున్నాయి. ఏటా ప్రవేశపెడుతున్న లక్షల కోట్ల బడ్జెట్లలో సంక్షేమానికి కేటాయింపులు నామమాత్రంగా ఉంటున్నాయి. ఇవి ప్రాధాన్య రంగాల స్థాయి నుంచి మొక్కుబడి స్థాయికి దిగజారి పోయాయి. ప్రభుత్వాలకు ఆదాయం ప్రజల పన్నుల ద్వారా సమకూరుతున్నదే. పన్నుల్లో ఎంతమేరకు తిరిగి ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నారో లెక్కలు తీస్తే సామాన్య ప్రజలకు జరుగుతున్న అన్యాయం అర్థం అవుతుంది. సామాజిక న్యాయం జరగకపోతే రాజ్యాంగం ఆశించిన తీరులో అభివృద్ధి జరగదు. రాజ్యాంగ సూత్రాల స్ఫూర్తితో పని చేస్తేనే పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి సాధ్యపడతాయి. అధికార వికేంద్రీకరణ జరగాలి. అన్ని వర్గాల ప్రజలను సాధికారుల్ని చేయగలిగితేనే... భారత రాజ్యాంగం ఆశించిన మేరకు ఫలితాలు అందుతాయి. భారత రాజ్యాంగాన్ని ఓ సోషల్ డాక్యుమెంట్‌గా అమలు చేసినప్పుడే ప్రజల మధ్య ఉన్న ఆర్థిక, సామాజిక అంత రాలు తగ్గుతాయి. రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన ఏర్పర్చుకోవాలి. రాజ్యాంగం అందించిన హక్కులను ఉపయోగించుకొని ప్రభుత్వాలను నిలదీయాలి.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లువ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన పరిషత్ సభ్యులు (నేడు గణతంత్ర దినోత్సవం) -
సహనమే శరణ్యం
సహనం, ఓరిమి, క్షమ – ఉత్తములైన మనుషుల సహజ లక్షణాలని వేద పురాణేతి హాసాలు, వివిధ మత గ్రంథాలు, నీతిశాస్త్రాలు చెబుతున్నాయి. ‘క్షమా భూమిః క్షమా సర్వం/ క్షమయా ధార్యతే జగత్’ అని అధర్వణ వేదం చెబుతోంది. ‘క్షమా దానం క్షమా సత్యం క్షమా యజ్ఞః చ పుత్రికాః/ క్షమా యశః క్షమా ధర్మః క్షమాయాం విష్ఠితం జగత్’ అని వాల్మీకి రామాయణం చెబుతోంది. ‘క్షమా ధర్మః క్షమా యజ్ఞః/ క్షమా వేదః క్షమా శ్రుతిః/ క్షమయా ధార్యతే లోకః క్షమయా కిం న సాధ్యతే’ అని వ్యాస మహాభారతం చెబుతోంది. క్షమను మించిన సుగుణం లేదు, క్షమతో సాధ్యం కానిది లేదు అని ఈ శ్లోకాల సారాంశం. ‘ఖంతీ పరమం తపో తితిక్ఖా’ అని బుద్ధుని ధమ్మపదం చెబుతోంది. అంటే, సహనమే అత్యున్నత తపస్సు అని అర్థం. ‘సహన శీలః సజ్జనః/ కోపహీన సదా భవేత్/ కోపోహి శత్రురత్యంతం/ తస్మాత్ క్షమైవ శ్రేయసీ’ అని భర్తృహరి నీతి శతకం చెబుతోంది. ఇదే నీతిని ‘తన కోపమె తన శత్రువు/ తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ/ తన సంతోషమె స్వర్గము/ తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ’ అని సుమతీ శతకం చెబుతోంది.‘గర్విష్ఠుల కంటే సహనము గలవాడు మేలు’ అని బైబిల్ చెబుతోంది. ‘నిశ్చయంగా అల్లాహ్ సహనశీలురతో ఉంటాడు’ అని ఖురాన్ చెబుతోంది.పురాణేతిహాసాలు, వివిధ మతాల పవిత్ర గ్రంథాలు, నీతిశాస్త్రాలు చెప్పిన ఈ మాటలను ప్రవచనాల్లోను, ఉపన్యాసాల్లోను తరచు ఉట్టంకిస్తుంటారు. అయితే, వీటిని ఆచరించడాన్నే మనుషులు మరచిపోతుంటారు. ఎదుటి మనిషి తమకు నచ్చని అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తే చాలు, ఒక్కసారిగా సహనం నశించి, కోపం కట్టలు తెంచుకుంటుంది. అప్పటి వరకు వల్లించిన నీతులన్నీ ఒక్కసారిగా మరపు మరుగున పడిపోయి, బూతుల ప్రవాహం వరదలా పోటెత్తుతుంది. తగవు మొదలై బాహాబాహీ సిగపట్ల వరకు వ్యవహారం ముదురుతుంది. మనుషుల్లో సహనం నశించినప్పుడే సమాజంలో నేరాలు, ఘోరాలు జరుగుతుంటాయి. పౌరుల్లో సహనం నశించి, తప్పటడుగులు వేస్తే, చక్కదిద్దే పనిని పాలనా వ్యవస్థలు చేపడతాయి.దురదృష్టవశాత్తూ పాలనా వ్యవస్థలు కూడా సహనం కోల్పోయి, కక్ష సాధింపులకు తెగబడుతున్న రోజులు దాపురించాయి. సత్యం పట్ల అసహనం, ప్రశ్న పట్ల అసహనం, ధిక్కారం పట్ల అసహనం, భిన్నాభిప్రాయం పట్ల అసహనం పెచ్చుమీరిన పాలకులు సత్యాన్ని ప్రకటించే పాత్రికేయుల పట్ల, ప్రశ్నించే పౌరుల పట్ల, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే విపక్ష నేతల పట్ల కక్ష సాధింపు చర్యలకు తెగబడే ధోరణి పెరుగుతోంది. ధిక్కార స్వరాలను వినిపించే వారిని కటకటాల్లోకి నెట్టే వైఖరి ప్రబలుతోంది. పట్టించుకోవలసిన అనేక సమస్యలను పట్టించుకోకుండా, భిన్నస్వరాలపై కక్ష సాధింపు చర్యలకే ప్రాధాన్య మిస్తున్న ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఇవన్నీ ఇటీవలి కాలంలో మన దేశంలో కనిపిస్తున్న పరిస్థితులు.ప్రపంచ పరిస్థితులు కూడా ఏమంత భిన్నంగా లేవు. ఆర్థికబలం, ఆయుధ బలగం దండిగా కలిగిన అగ్రరాజ్యాలు బలహీన దేశాలపై అసహనంతో యుద్ధాలకు తెగబడు తున్నాయి. బలహీన దేశాల అధినేతలను చెరబడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు దేశాలు ప్రత్యక్షంగా యుద్ధాలను ఎదుర్కొంటున్నాయి. సుమారు మరో ఇరవై దేశాలు అంతర్యుద్ధాలతో అట్టుడుకుతున్నాయి. ఇంకో పదిహేను దేశాలు ప్రచ్ఛన్న యుద్ధాలతోను, చొరబాట్లు, సైనిక హింస తదితర సమస్యలతో సతమతం అవుతున్నాయి. ఈ దారుణ దుర్భర పరిస్థితులకు మూలకారణం అసహనం. ప్రపంచంలో యుద్ధాలు సద్దుమణగాలన్నా; దేశాల్లో పౌరుల స్వేచ్ఛకు భద్రత దొరకాలన్నా; విభిన్న మతాలు, జాతుల మధ్య సామరస్యం పెరగాలన్నా సహనమే కీలకం. ‘క్షమా బలమశక్తానాం/ శక్తానాం భూషణం క్షమా’ అని మహాభారతం చెబుతోంది. బలహీనులకు క్షమే బలం; బలవంతులకు అది అలంకారం. మనుషుల్లో క్షమ, ఓరిమి, సహనం వంటి సహజ సుగుణాలు పెరిగినప్పుడే ప్రపంచంలో శాంతి పరిఢవిల్లుతుంది. మన గణతంత్రం ‘ఘన’తంత్రమవుతుంది. -
Republic Day 2026: ఆమె ఒక స్ఫూర్తి పాఠం
పోలీసు కొలువు.. నిత్యం సవాళ్లతో సహవాసం.. పోలీస్ శాఖలో మహిళలు ధైర్యంగా ముందడుగు వేస్తూ.. సత్తా చాటుతున్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అభిలాష బిస్త్ ఆ శాఖలో దూసుకుపోతున్నారు. కొత్తగా ఈ రంగంలోకి వస్తున్న మహిళలకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అభిలాష బిస్త్.. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణిగా సర్వీసులో చేరారు. రాష్ట్ర పోలీస్ శాఖకు ఎంపికవుతున్న కానిస్టేబుల్ నుంచి డీఎస్పీల వరకు శిక్షణ ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. 1986లో ఏర్పాటైన పోలీసు అకాడమీకి తొలి మహిళా డైరెక్టర్ కావడం విశేషం.గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాక్షి డిజిటల్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. పోలీస్ శాఖలో ఆమె జర్నీతో పాటు తెలంగాణ పోలీసింగ్ గురించి వివరించారు. పోలీసుశాఖ పనితీరులో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానం సాధించగా.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో పోలీస్ శాఖ చేపట్టిన చర్యలు, వివిధ అంశాలపై మాట్లాడారు. పలు ఆసక్తికరమైన విషయాలు సాక్షితో పంచుకున్నారు.పూర్తి ఇంటర్వ్యూ కోసం వీడియో క్లిక్ చేయండి: -
భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శం : ముర్ము
దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ప్రస్తుతం స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తున్నారని ముర్ము అన్నారు. మన రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శమని ప్రజాస్వామ్యం ఎన్నో సవాళ్లను అధిగమించిందని తెలిపారు. అభివృద్ధి ఫలాలు దేశ ప్రజలకు అందుతున్నాయని విద్య, వైద్య రంగాల్లో దేశం ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ముర్ము పేర్కొన్నారు.మన రైతులు దేశానికి అవసరమైన పోషకాహారాన్ని సమృద్దిగా అందిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌కు ఘన విజయం అందించిన త్రివిధ దళాలను ముర్ము ప్రశంసించారు. రాజ్యాంగ నిర్మాతలు నిబంధనలు ద్వారా జాతీయవాద స్ఫూర్తికి దేశ ఐక్యతకు బలమైన పునాదిని అందించారని, ప్రస్తుతం భారత ప్రజలమైన మనము గణతంత్ర దినోత్సవాన్ని దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. భారత గణతంత్ర ఉత్సవాలు దేశ భూత, వర్తమాన, భవిష్యత్తు పరిస్థితులకు అద్దం పడుతాయన్నారు.1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడం దేశ పరిస్థితిని పూర్తి స్థాయిలో మార్చి వేసిందని ఈ ముర్ము పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమిళ భాషలో వందేమాతరం యోన్బోమ్ అనే గీతాన్ని స్వరపరిచిన జాతీయవాద కవి సుబ్రమణ్య భారతిని ద్రౌపది ముర్ము ప్రశంసించారు.


