ఢిల్లీ: దేశ వ్యాప్తంగా 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో వందేమాతరం థిమ్‌తో వేడుకలు నిర్వహిస్తున్నారు. కాసేపట్లో జాతీయజెండాను రాష్ట్రపతి ముర్ము ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకలకు ఈసారి ముఖ్య అతిథులుగా యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ హాజరుకానున్నారు.
6,050 మంది సైనికులతో పరేడ్ నిర్వహించనున్నారు. 17 రాష్ట్రాలు, 13 కేంద్ర ప్రభుత్వ శకటాలను ప్రదర్శించనున్నారు. 30 వేల మంది పోలీసులు, కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాట్లు చేశారు. కర్తవ్య పథ్ దగ్గర 6 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశార. దేశ రక్షణ సామర్థ్యాన్ని చాటిచెప్పే విధంగా జరిగే కవాతు, ఆయుధ ప్రదర్శన వైమానిక విన్యాసాలు ఆకట్టుకోనున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలీసులు ఏఐ స్మార్ట్ కళ్లజోళ్లతో నిఘా ఏర్పాట్లు చేశారు.
#WATCH | Preparation visuals from Kartavya Path ahead of the 77th Republic Day Parade. pic.twitter.com/j3LY0Xdzfj
— ANI (@ANI) January 26, 2026


